
2025 ఆర్థిక సంవత్సరం మొదటి 11 నెలల్లో టీవీఎస్ అపాచీ శ్రేణి బైకుల అమ్మకాలు నాలుగు లక్షల యూనిట్లు దాటాయి. 2019 ఆర్ధిక సంవత్సరంలో అధిక అమ్మకాలను పొందిన అపాచీ.. ఇప్పుడు మరోమారు సరికొత్త సేల్స్ రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో ఈ బైక్ బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా నిలిచింది.
టీవీఎస్ మోటార్‌సైకిల్ కంపెనీ 2025 ఆర్ధిక సంవత్సరంలో అమ్మకాల్లో బలమైన వృద్ధిని సాధించింది. ఇందులో స్కూటర్లు, మోటార్ సైకిళ్ళు, మోపెడ్‌లు ఉన్నాయి. 11 నెలల్లో కంపెనీ హోల్‌సేల్ అమ్మకాలు 32 లక్షల కంటే ఎక్కువ. ఈ సేల్స్ అంతకుముందు ఏడాది కంటే అధికం.
టీవీఎస్ అపాచీ
150 సీసీ - 200 సీసీ విభాగంలో మంచి ఆదరణ పొందిన టీవీఎస్ అపాచీ సేల్స్.. 4 లక్షల యూనిట్లు దాటడం ఇది రెండోసారి. 2018లో కంపెనీ 399035 యూనిట్ల అపాచీ బైకులను విక్రయించింది. కోవిడ్ సమయంలో అమ్మకాలు కొంత తగ్గినప్పటికీ.. ఆ తరువాత క్రమంగా పుంజుకున్నాయి.
ఇదీ చదవండి: రెండువారాల్లో 50000 బుకింగ్స్.. ఈ స్కూటర్ కోసం ఎగబడుతున్న జనం
టీవీఎస్ అపాచీ బైకులు మొత్తం నాలుగు మోడల్స్ రూపంలో అందుబాటులో ఉన్నాయి. వీటి ధరలు లక్ష రూపాయల కంటే ఎక్కువే. ఎంచుకునే వేరియంట్‌ను బట్టి ధరలు, ఇంజిన్ ఆప్షన్స్ ఉంటాయి. కాబట్టి పనితీరు కూడా ఎంచుకునే ఇంజిన్ మీద ఆధారపడి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment