TVS Motor
-
ఈ స్కూటర్‌ను 18 లక్షల మంది కొనేశారు
టీవీఎస్ ఎన్‌టార్క్ 125 (TVS Ntorq 125) అమ్మకాల్లో అరుదైన మైలురాయిని చేరుకుంది. 2024 డిసెంబర్ చివరి నాటికి కంపెనీ 18,88,715 యూనిట్లను విక్రయించింది. దీంతో హోండా యాక్టివా, టీవీఎస్ జుపిటర్, సుజుకి యాక్సెస్ తరువాత.. ఎన్‌టార్క్ 125 అత్యధికంగా అమ్ముడైన నాల్గవ స్కూటర్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది.టీవీఎస్ మోటార్ 2018 ప్రారంభంలో ఎన్టార్క్ను ప్రవేశపెట్టింది. ఆ సమయంలో భారతదేశంలో 125సీసీ స్కూటర్లకు మంచి డిమాండ్ ఉండేది. అప్పటి నుంచి కంపెనీ దీనిని అప్డేట్ చేస్తూ.. కొత్త వేరియంట్లను ప్రవేశపెడుతూనే ఉంది. కంపెనీ అమ్మకాలు పెరగడానికి కూడా ఈ స్కూటర్ దోహదపడింది.ఎన్‌టార్క్ స్కూటర్ బేస్ (డ్రమ్/డిస్క్), రేస్ ఎడిషన్, సూపర్ స్క్వాడ్ ఎడిషన్, రేస్ XP, రేస్ XT అనే ఆరు వేరియంట్లలో లభిస్తుంది. దీని ధరలు రూ. 84,600 నుంచి రూ. 1,04,600 (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. రేస్ XP ఎడిషన్ 10.2 హార్స్ పవర్, 10.8 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తే.. మిగిలిన వేరియంట్స్ 9.4 హార్స్ పవర్, 10.5 ఎన్ఎమ్ టార్క్ అందిస్తాయి.ఇదీ చదవండి: సరికొత్త ఫీచర్లతో.. వచ్చేస్తోంది యాక్టివా 7జీఇండియన్ మార్కెట్లో మాత్రమే కాకుండా.. విదేశాల్లో కూడా 'ఎన్‌టార్క్'కు మంచి డిమాండ్ ఉంది. ఈ కారణంగానే కంపెనీ 2024 ఏప్రిల్ - డిసెంబర్ మధ్య 50640 ఎన్‌టార్క్ స్కూటర్లను ఎగుమతి చేసింది. ఇవి అంతకు ముందు ఏడాది కంటే 16 శాతం ఎక్కువ. దీన్ని బట్టి చూస్తే దీనికి గ్లోబల్ మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. -
ఎలక్ట్రిక్ కార్గో విభాగంలోకి టీవీఎస్!
కోల్‌కతా: వాహన తయారీ దిగ్గజం 'టీవీఎస్ మోటార్' (TVS Motor) కంపెనీ ఎలక్ట్రిక్ కార్గో విభాగంలోకి ప్రవేశించాలని నిర్ణయించింది. కంపెనీ తాజాగా ఎలక్ట్రిక్ త్రీవీలర్‌ను కోల్‌కతా, యూపీ, బీహార్, జమ్ము, కాశ్మీర్‌తోపాటు ఢిల్లీలో విడుదల చేసింది.డిసెంబర్ నాటికి ఎలక్ట్రిక్ కార్గో రోడ్డెక్కనుందని టీవీఎస్ మోటార్ కమర్షియల్ మొబిలిటీ బిజినెస్ హెడ్ 'రజత్ గుప్తా' వెల్లడించారు. ప్రస్తుతం ప్రత్యామ్నాయ ఇంధన (సీఎన్జీ, ఎల్పీజీ, ఎలక్ట్రిక్) విభాగంలో కంపెనీ వాటా 10 శాతం ఉందని అన్నారు. తమిళనాడులోని హోసూర్ ప్లాంట్‌కు నెలకు 5,000 యూనిట్ల త్రిచక్ర వాహనాలను తయారు చేసే సామర్థ్యం ఉందని తెలిపారు. ఈ కేంద్రాన్ని మరింత విస్తరించవచ్చని వివరించారు. కొరియా నుంచి బ్యాటరీ సెల్స్‌ను దిగుమతి చేసుకుంటున్నామని చెప్పారు. వీటిని భారతీయ భాగస్వామి తయారు చేస్తోందని తెలిపారు. -
ప్రపంచంలోనే మొదటి సీఎన్జీ స్కూటర్ (ఫొటోలు)
-
ఈ–త్రీవీలర్స్‌లోకి టీవీఎస్..
టీవీఎస్ మోటార్ కంపెనీ ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాల రంగంలోకి ప్రవేశించింది. ఎక్స్‌పోలో భాగంగా కింగ్ ఈవీ మ్యాక్స్‌ను పరిచయం చేసింది. ఇది భారత్‌లో బ్లూటూత్‌తో అనుసంధానించిన తొలి ఎలక్ట్రిక్ త్రీ–వీలర్. స్థిర సాంకేతికతతో పట్టణ మొబిలిటీని పెంచే లక్ష్యంతో దీనిని రూపొందించినట్టు కంపెనీ తెలిపింది. టీవీఎస్ స్మార్ట్‌కనెక్ట్‌తో తయారైంది. ఇది స్మార్ట్‌ఫోన్ ఇంటిగ్రేషన్ ద్వారా రియల్ టైమ్ నావిగేషన్, అలర్ట్స్, వాహన స్థితిగతులను తెలియజేస్తుంది. ఒకసారి చార్జింగ్‌తో 179 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని టీవీఎస్ తెలిపింది. 3 గంటల 30 నిమిషాల్లో 100 శాతం చార్జింగ్ పూర్తి అవుతుంది. 51.2 వోల్ట్ ఎల్ఎఫ్పీ బ్యాటరీ పొందుపరిచారు. గంటకు గరిష్ట వేగం 60 కిలోమీటర్లు. ఎక్స్ షోరూం ధర రూ.2.95 లక్షలు.ఇదీ చదవండి: టిక్‌టాక్ పునరుద్ధరణ.. ట్రంప్ పుణ్యమే..! మళ్లీ స్కోడా డీజిల్ కార్లువాహన తయారీలో ఉన్న ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ కంపెనీ స్కోడా అయిదేళ్ల తర్వాత భారత్‌లో డీజిల్ ఇంజన్స్‌ను మళ్లీ ప్రవేశపెడుతోంది. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో వేదికగా సూపర్బ్ డీజిల్ కారును ప్రదర్శించింది. కొడియాక్ డీజిల్ సైతం త్వరలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. భారతీయ కస్టమర్లు ఇప్పటికీ డీజిల్ కార్లను డిమాండ్ చేస్తున్నారని స్కోడా ఇండియా హెడ్ పీటర్ యానిబా తెలిపారు. ‘స్కోడా కార్ల విక్రయాల్లో గతంలో 80 శాతం యూనిట్లు డీజిల్ విభాగం కైవసం చేసుకుంది. హ్యుందాయ్, కియా, టాటా, మహీంద్రా అమ్మకాల్లో గణనీయ భాగం డీజిల్ వాహనాలు సమకూరుస్తున్నాయి. లగ్జరీ కార్ల తయారీ సంస్థలైన మెర్సిడెస్, బీఎండబ్ల్యూలకు కూడా అంతే. కాబట్టి లగ్జరీ, ఎగ్జిక్యూటివ్ సెగ్మెంట్ల మధ్యలో ఉన్న స్కోడా ఈ మార్పు నుండి గణనీయంగా ప్రయోజనం పొందుతుంది. మేము కచి్చతంగా డిమాండ్‌ను నెరవేర్చడానికి చూస్తున్నాం’ అని వివరించారు. -
ప్రపంచంలోనే.. మొట్ట మొదటి సీఎన్జీ స్కూటర్ ఇదే
బజాజ్ ఆటో ప్రపంచంలోనే మొట్ట మొదటి సీఎన్జీ బైక్ (ఫ్రీడమ్ 125) లాంచ్ చేస్తే.. టీవీఎస్ మోటార్ (TVS Motor) కంపెనీ మొదటి సీఎన్జీ స్కూటర్(జూపిటర్)ను భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో ఆవిష్కరించింది. ఇది ఫ్రీడమ్ 125 మాదిరిగానే పెట్రోల్, సీఎన్‌జీలతో నడుస్తుంది.టీవీఎస్ జూపిటర్ సీఎన్జీ (TVS Jupiter CNG) స్కూటర్ చూడటానికి జుపీటర్ 125 మాదిరిగా ఉన్నప్పటికీ.. ముందుభాగంలో కనిపించే CNG స్టిక్కర్ దానిని సీఎన్జీ స్కూటర్‌గా గుర్తించడానికి సహాయపడుతుంది. 1.4 కేజీ కెపాసిటీ కలిగిన సీఎన్జీ ట్యాంక్.. స్కూటర్ సీటు కింద ఉంటుంది. కాగా ఇందులోని 124.8 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ 6000 rpm వద్ద 7.2 హార్స్ పవర్, 5500 rpm వద్ద 9.4 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది.టీవీఎస్ జూపిటర్ సీఎన్జీ స్కూటర్ 226 కిమీ మైలేజ్ (సీఎన్జీ + పెట్రోల్) ఇస్తుందని సమాచారం. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 80.5 కిమీ కావడం గమనార్హం. స్టాండర్డ్ జూపిటర్ మాదిరిగానే.. సీఎన్జీ స్కూటర్ కూడా డిజిటల్ అనలాగ్ డిస్ప్లే, యూఎస్బీ ఛార్జర్, స్టార్ట్ / స్టాప్ టెక్ వంటివన్నీ పొందుతుంది. కంపెనీ తన సీఎన్జీ స్కూటర్ ధరలను ఇంకా ప్రకటించలేదు. అయితే ఇది సాధారణ జూపిటర్ ధర కంటే కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. -
ఈ-టూవీలర్స్లోనూ పెద్ద కంపెనీలే..
హీరో మోటోకార్ప్, హోండా, టీవీఎస్, బజాజ్, సుజుకీ, యమహా.. భారత ద్విచక్ర వాహన మార్కెట్లో ఈ కంపెనీలదే రాజ్యం. మారుమూల పల్లెల్లోనూ ఈ బ్రాండ్ల వాహనాలే దర్శనమిస్తాయి. సువిశాల భారతావని అంతటా ఇవి తమ నెట్‌వర్క్‌ను దశాబ్దాలుగా పెంచుకున్నాయి. విక్రయ శాలలే కాదు సర్వీసింగ్‌ను కూడా కస్టమర్లకు చేరువ చేశాయి. మాస్ మార్కెట్‌ను పూర్తిగా ఇవి చేతుల్లోకి తీసుకున్నాయంటే ఆశ్చర్యంవేయక మానదు.- హైదరాబాద్, బిజినెస్ బ్యూరోఇంత బలమున్న ఈ దిగ్గజాలు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలోనూ పాగా వేస్తాయనడంలో సందేహం లేదు. ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ బజాజ్, టీవీఎస్ తమ సత్తా చాటుతున్నాయి. హీరో మోటోకార్ప్ క్రమక్రమంగా వేగం పెంచి నవంబర్‌లో టాప్–5 స్థానానికి ఎగబాకింది. పెద్ద కంపెనీలే ఈ–టూవీలర్స్లోనూ అడ్డా వేస్తాయని గణాంకాలు చెబుతున్నాయి. భారత ఈ–టూవీలర్స్ పరిశ్రమ ఈ ఏడాది నవంబర్ 11 నాటికే 10,00,000 యూనిట్ల మైలురాయిని దాటింది. మళ్లీ హమారా బజాజ్.. 2024 డిసెంబర్ తొలి వారంలో అమ్ముడైన ఎలక్ట్రిక్ టూ వీలర్స్‌లో టాప్–4 కంపెనీల వాటా ఏకంగా 82 శాతం ఉందంటే భవిష్యత్ ఎలా ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు. మిగిలిన 18 శాతం వాటా కోసం దేశవ్యాప్తంగా 200లకుపైగా బ్రాండ్లు పోటీపడుతున్నాయి. భారత స్కూటర్స్ మార్కెట్లో ఒకప్పుడు రారాజులా వెలుగొందిన బజాజ్.. ఇప్పుడు ఎలక్ట్రిక్ చేతక్ రూపంలో స్కూటర్స్ విభాగంలోకి రీఎంట్రీ ఇచ్చి హమారా బజాజ్ అనిపించుకుంటోంది.డిసెంబర్ తొలివారంలో బజాజ్ 4,988 యూనిట్లతో తొలి స్థానంలో నిలిచింది. టీవీఎస్ మోటార్ కంపెనీ 3,964 యూనిట్లతో రెండవ స్థానంలో ఉంది. ప్రస్తుతం ఈ రెండు కంపెనీల మధ్యే పోటీ తీవ్రంగా ఉంది. ఓలా 3,351, ఏథర్ ఎనర్జీ 2,523 యూనిట్లతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఓలా అమ్మకాలు అక్టోబర్‌లో 41,775 యూనిట్ల నుంచి నవంబర్‌లో 29,191 యూనిట్లకు పడిపోయింది. దేశవ్యాప్తంగా ఈ కంపెనీ వాహనాల నాణ్యతపై ఫిర్యాదులు వెల్లువెత్తుతుండడం గమనార్హం. పెద్ద కంపెనీల మధ్యే పోటీ.. తదుపరితరం చేతక్‌ను డిసెంబర్ 20న ప్రవేశపెట్టేందుకు బజాజ్ రెడీ అయింది. 2019–20లో కేవలం 212 యూనిట్లు విక్రయించిన బజాజ్.. 2020–21లో 1,395 యూనిట్లు, ఆ తర్వాతి ఏడాది 8,187, 2022–23లో 36,260 యూనిట్ల అమ్మకాలు నమోదు చేసింది. ఆ తర్వాతి ఆర్థిక సంవత్సరంలో 1,15,702 యూనిట్లను సాధించింది. 2024–25 ఏప్రిల్–నవంబర్‌లో 1,34,167 యూనిట్లు రోడ్డెక్కాయి. టీవీఎస్ మోటార్ కంపెనీ 2023 జనవరిలో 10,465 యూనిట్ల సేల్స్ నమోదు చేసింది. ఏడాదిలోనే ఈ సంఖ్య 47 శాతం పెరిగింది.2024 నవంబర్‌లో ఈ కంపెనీ 26,971 యూనిట్ల అమ్మకాలను దక్కించుకుంది. ఈ నెలలోనే విదా వీ2 మోడల్‌ను ఆవిష్కరించిన హీరో మోటోకార్ప్ క్రమక్రమంగా ఈ–టూవీలర్స్‌లో పట్టు సాధిస్తోంది. ఈ కంపెనీ 2023 జనవరిలో 157 యూనిట్లు విక్రయించింది. 2024 జనవరిలో ఈ సంఖ్య 1,495కు చేరుకుంది. నవంబర్‌లో ఏకంగా 7,309 యూనిట్ల అమ్మకాలను సాధించి టాప్–5 స్థానాన్ని అందుకుంది. క్యూలో మరిన్ని దిగ్గజాలు.. 2025 తొలి త్రైమాసికం నుంచి నేను సైతం అంటూ హోండా మోటార్‌సైకిల్, స్కూటర్ ఇండియా రెడీ అవుతోంది. యాక్టివా–ఈ, క్యూసీ1 మోడళ్లను కంపెనీ భారత మార్కెట్లో ఇటీవలే ఆవిష్కరించింది. 2025 జనవరి 1 నుంచి బుకింగ్స్ స్వీకరిస్తారు. ఫిబ్రవరి నుంచి డెలివరీలు ప్రారంభం అవుతాయని కంపెనీ ప్రకటించింది. సంస్థకు దేశవ్యాప్తంగా 6,000 పైచిలుకు సేల్స్, సర్వీస్ టచ్‌పాయింట్స్ ఉన్నాయి.2025లో 1,00,000 యూనిట్ల ఈ–స్కూటర్స్ తయారు చేయాలని లక్ష్యంగా చేసుకుందంటే కంపెనీకి ఉన్న ధీమా అర్థం చేసుకోవచ్చు. మరోవైపు సుజుకీ, యమహా ఎంట్రీ ఇస్తే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన పరిశ్రమ సరికొత్త రికార్డుల దశగా దూసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. యమహా ఇప్పటికే హైబ్రిడ్ టూ వీలర్స్ తయారు చేస్తోంది. సుజుకీ నియో ఎలక్ట్రిక్ టూ వీలర్ కొద్ది రోజుల్లో రంగ ప్రవేశం చేయనుంది. -
ఓ మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా? ఇవి చూడండి
భారతదేశంలో ఎలక్ట్రిక్ టూ వీలర్ల వినియోగం విపరీతంగా పెరుగుతోంది. అయితే మార్కెట్లోని ఉత్తమ ఈవీ స్కూటర్లు ఏవి? వాటి ధర, రేంజ్ వంటి వివరాలు ఎలా ఉన్నాయనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.బజాజ్ చేతక్ (Bajaj Chetak)ప్రముఖ వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో.. ఎలక్ట్రిక్ టూ వీలర్ విభాగంలో చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ విక్రయిస్తోంది. దీని అమ్మకాలు ప్రస్తుతం ఆశాజనకంగానే ఉన్నాయి. కాగా ఈనెల 20న మరో అప్డేటెడ్ మోడల్ లాంచ్ చేయడానికి కంపెనీ సిద్ధమైంది. కాగా ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న బేస్ మోడల్ 2.88 కిలోవాట్ బ్యాటరీతో 123 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ స్కూటర్ ధర రూ. లక్ష కంటే ఎక్కువ.టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube)మార్కెట్లో ఎక్కువ అమ్మకాలు పొందుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్ల జాబితాలో ఒకటి టీవీఎస్ ఐక్యూబ్. రూ. 89999 ప్రారంభ ధర వద్ద లభించే ఈ స్కూటర్ 2.2 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ ద్వారా 75 కిమీ రేంజ్ అందిస్తుంది. దీని టాప్ స్పీడ్ 75 కిమీ/గం. ఇది 12.7 సెంమీ TFT డిస్ప్లే కలిగి, ఎల్ఈడీ హెడ్‌లైట్, 4.4 కిలోవాట్ BLDC మోటార్ వంటివి పొందుతుంది.ఇదీ చదవండి: భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన కారు: 1.86 లక్షల మంది కొనేశారుహీరో విడా (Hero Vida)రూ. 96000 (ఎక్స్ షోరూమ్) ధర వద్ద అందుబాటులో ఉన్న హీరో విడా మంచి అమ్మకాలు పొందుతున్న ఒక బెస్ట్ మోడల్. ఇందులో 2.2 కిలోవాట్ రిమూవబుల్ బ్యాటరీ ఉంటుంది. ఇది ఒక సింగిల్ ఛార్జీతో 94 కిమీ రేంజ్ అందిస్తుంది. దీని టాప్ స్పీడ్ 69 కిమీ/గం. ఈ స్కూటర్ 7 ఇంచెస్ డిజిటల్ TFT టచ్‌స్క్రీన్ పొందుతుంది.ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric)ప్రారంభం నుంచి గొప్ప ఆదరణ పొందిన ఓలా ఎలక్ట్రిక్ ఇటీవల నాలుగు ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేసింది. అవి ఓలా గిగ్, ఓలా గిగ్ ప్లస్, ఓలా ఎస్1 జెడ్, ఓలా ఎస్1 జెడ్ ప్లస్. కంపెనీ వీటి కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. కాబట్టి కేవలం 499 రూపాయలతో బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు 2025లో ప్రారంభమవుతాయి. -
తళుక్కుమన్న టీవీఎస్ సరికొత్త రోనిన్
వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ 2025 ఎడిషన్ రోనిన్ మోటార్‌సైకిల్ ఆవిష్కరించింది. గోవాలో జరుగుతున్న టీవీఎస్ మోటోసోల్ 4.0 కార్యక్రమంలో ఈ సరికొత్త మోడల్ తళుక్కుమంది. 225 సీసీ ఇంజన్‌తో ఇది తయారైంది. 20 బీహెచ్పీ, 19 ఎన్ఎం టార్క్ అందిస్తుంది.5 స్పీడ్ గేర్‌బాక్స్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ, ఎల్ఈడీ లైటింగ్, సైడ్ స్టాండ్ కట్–ఆఫ్ సెన్సార్, సైలెంట్ స్టార్టర్ వంటి హంగులు ఉన్నాయి. టీవీఎస్ రోనిన్ మిడ్–వేరియంట్ రైడర్ల భద్రత, స్థిరత్వాన్ని పెంపొందించడానికి డ్యూయల్–ఛానల్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌తో రూపొందింది. బేస్ వేరియంట్‌కు సింగిల్ చానెల్ ఏబీఎస్ ఏర్పాటు చేశారు.‘ఈ అప్‌గ్రేడ్ టీవీఎస్ రోనిన్ యొక్క మూడు వేరియంట్లలో మరింత స్థిరమైన భేదాన్ని సృష్టిస్తుంది. ఇది రంగు, గ్రాఫిక్స్‌లో మాత్రమే కాకుండా కార్యాచరణలో కూడా స్పష్టమైన వ్యత్యాసాలను అందిస్తుంది’ అని కంపెనీ తెలిపింది. గ్లేసియర్ సిల్వర్, చార్కోల్ ఎంబర్ అనే రెండు కొత్త రంగులను కంపెనీ పరిచయం చేసింది. ఈ కొత్త రంగులు రోనిన్ మోడల్‌లలో ఇప్పటికే ఉన్న డెల్టా బ్లూ, స్టార్‌గేజ్ బ్లాక్‌లను భర్తీ చేస్తాయి.గివీతో టీవీఎస్ జోడీ..ఈ సందర్భంగా మోటార్‌సైకిల్ లగేజ్ సిస్టమ్‌లో ప్రపంచ అగ్రగామిగా ఉన్న గివీతో టీవీఎస్ మోటార్ కంపెనీ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం వివిధ రైడింగ్ స్టైల్స్, స్టోరేజ్ అవసరాలకు అనుగుణంగా సమగ్రమైన ప్రీమియం లగేజ్ సొల్యూషన్లను అందజేస్తుందని టీవీఎస్ వివరించింది.ప్రత్యేకంగా టీవీఎస్ ద్విచక్ర వాహనాల కోసం కస్టమ్–డిజైన్ చేయబడిన ఫ్రేమ్‌లు, మౌంట్లను గివీ అభివృద్ధి చేస్తుంది. ఈ భాగస్వామ్యం ద్విచక్ర వాహనాల యాక్సెసరీల విభాగంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుందని, ఆధునిక మోటార్‌సైక్లిస్ట్‌లకు అత్యాధునిక డిజైన్, సౌకర్యాన్ని అందిస్తుందని టీవీఎస్ వివరించింది. -
బడ్జెట్ ఫ్రెండ్లీ.. రూ. 50వేలుంటే చాలు!
ఒక టూ వీలర్ కొనాలంటే కనీసం లక్ష రూపాయలైన వెచ్చించాల్సిందే వెచ్చించాల్సిందే అనుకుంటారు. అయితే ఇక్కడ మేము చెప్పబోయే ద్విచక్రవాహనాలు మాత్రం రూ. 50వేలు కంటే తక్కువ ధరలోనే అందుబాటులో ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం..యో ఎడ్జ్: ఇదొక ఎలక్ట్రిక్ స్కూటర్. దీని ప్రారంభ ధర రూ. 49,086 మాత్రమే (ఎక్స్ షోరూమ్). 1.2 కిలోవాట్ బ్యాటరీ కలిగిన ఈ స్కూటర్.. ఒక ఫుల్ ఛార్జీతో 60 కిమీ రేంజ్ అందిస్తుంది3. దీని టాప్ స్పీడ్ 25 కిమీ/గం. కేవలం 95 కేజీల బరువున్న ఈ స్కూటర్ రోజువారీ వినియోగానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.టీవీఎస్ ఎక్స్ఎల్ 100: ఎక్కువగా గ్రామాల్లో కనిపించే ఈ టూ వీలర్.. మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన ద్విచక్ర వాహనం. రూ. 46671 (ఎక్స్ షోరూమ్) విలువైన ఈ వెహికల్ బరువులు మోయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. మన ఊరి బందీగా ప్రసిద్ధి చెందిన ఈ ఎక్స్ఎల్ 100 ఇప్పటికి 10 లక్షల కంటే ఎక్కువ అమ్మకాలు పొందినట్లు సమాచారం.టీవీఎస్ ఎక్స్ఎల్ 100 హెవీ డ్యూటీ: రూ. 44,999 (ఎక్స్ షోరూమ్) ధర వద్ద లభించే ఈ స్కూటర్ ఫ్రెండ్లీ బడ్జెట్ టూ వీలర్. మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభించే ఈ ఎక్స్ఎల్ 100 హెవీ డ్యూటీ 99.7 సీసీ ఇంజిన్ పొందుతుంది. ఇది కేవలం 88 కేజీల బరువున్నప్పటికీ.. 59.5 కిమీ మైలేజ్ ఇస్తుందని సమాచారం.పైన చెప్పిన టూ వీలర్ ధరలు.. ఎక్స్ షోరూమ్ ప్రైస్. ధరలు అనేవి మీరు ఎంచుకునే వేరియంట్, కలర్ ఆప్షన్స్ మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి ధరల్లో మార్పు ఉంటుంది. ఖచ్చితమైన ధరలు తెలుసుకోవడానికి సమీపంలోని కంపెనీ డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవచ్చు. -
టీవీఎస్ రికార్డ్.. 4.89 లక్షల వాహనాలు అమ్మేసింది!
ముంబై: టీవీఎస్ మోటార్ కంపెనీ విక్రయాలు అక్టోబర్‌లో రికార్డు గరిష్టానికి చేరాయి. గత నెలలో మొత్తం అమ్మకాలు 4.89 లక్షలుగా నమోదయ్యాయి. కంపెనీ నెలవారీ విక్రయాల్లో ఇదే ఇప్పటి వరకు అత్యధికం.కిందటేడాది ఇదే నెలలో డీలర్లకు పంపిణీ చేసిన 4.34 లక్షల వాహనాలతో పోలిస్తే ఇవి 13% అధికం. మొత్తం ద్విచక్ర వాహన రిజిస్ట్రేషన్లు 14% వృద్ధితో 4,20,610 నుంచి 4,78,159 నుంచి చేరాయి. ఇందులో మోటార్‌సైకిల్ విక్రయాలు 14% 2,30,822 యూనిట్లకు చేరగా, స్కూటర్ల అమ్మకాలు 17% పుంజుకొని 1,93,439 యూనిట్లకు చేరాయి.ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు 45% పుంజుకొని 20,153 యూనిట్ల నుంచి 29,308 యూనిట్లకు చేరాయి. అయితే త్రిచక్ర వాహన అమ్మకాలు 23% తగ్గి 10,856 యూనిట్లకు దిగివచ్చాయి. గతేడాది ఇదే అక్టోబర్‌లో 14,104 వాహనాలు అమ్ముడయ్యాయి. ఎగుమతులు 9% వృద్ధితో 87,952 నుంచి 95,708 యూనిట్లకు చేరాయి. -
కొత్త సెగ్మెంట్లోకి టీవీఎస్ ఎలక్ట్రిక్ రైడ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న టీవీఎస్ మోటార్ కంపెనీ ఎలక్ట్రిక్ విభాగంలో సుస్థిర స్థానం దిశగా అడుగులేస్తోంది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ త్రీ–వీలర్స్ సెగ్మెంట్లోకి ఈ ఏడాదే ఎంట్రీ ఇస్తోంది. కంపెనీ ఇప్పటికే పెట్రోల్, ఎల్పీజీ, సీఎన్జీతో నడిచే మూడు రకాల ప్యాసింజర్, ఒక కార్గో రకం త్రిచక్ర వాహనాలను కింగ్ పేరుతో పలు వేరియంట్లలో విక్రయిస్తోంది.భారత త్రిచక్ర వాహన విపణిలో సెప్టెంబర్‌లో అన్ని కంపెనీలవి కలిపి 1,06,524 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2,009 యూనిట్ల విక్రయాలతో టీవీఎస్ వాటా 1.89 శాతం నమోదైంది. 2023 సెప్టెంబర్‌లో ఇది 1.34 శాతంగా ఉంది. మూడవ ఈ–టూ వీలర్.. సంస్థ నుంచి మూడవ ఈ–టూ వీలర్ మోడల్‌ను మార్చికల్లా ప్రవేశపెట్టనున్నట్టు టీవీఎస్ ప్రకటించింది. 2024 ఆగస్ట్ వరకు ఈ–టూ వీలర్స్ అమ్మకాల్లో భారత్‌లో రెండవ స్థానంలో కొనసాగిన టీవీఎస్ మోటార్.. సెప్టెంబర్‌లో మూడవ స్థానానికి పడిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అర్ధ భాగంలో కంపెనీ నుంచి దేశవ్యాప్తంగా 1.27 లక్షల యూనిట్ల ఈ–స్కూటర్స్ రోడ్డెక్కాయి. 2023 ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య ఈ సంఖ్య 96,191 యూనిట్లు నమోదైంది. దీర్ఘకాలంలో ఆదాయాన్ని పెంచుకోవడానికి కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల వ్యాపారం, సాంకేతికతలలో పెట్టుబడులు, రిటైల్ విస్తరణపై దృష్టిసారించింది.భవిష్యత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకే అత్యంత ప్రాధాన్యత ఉంటుందని టీవీఎస్ యాజమాన్యం ఇప్పటికే పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,200–1,400 కోట్ల మూలధన వ్యయం చేయాలని టీవీఎస్ నిర్ణయించింది. ఇందులో 70 శాతం ఈవీ, ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ (ఐసీఈ) విభాగాలలో నూతన ద్విచక్ర, త్రిచక్ర వాహనాల అభివృద్ధికి, అలాగే డిజిటల్ సామర్థ్యాలను నిర్మించడానికి ఖర్చు చేస్తారు. ఇవీ ప్రస్తుత ఈ–టూ వీలర్ మోడళ్లు.. ప్రస్తుతం కంపెనీ ఖాతాలో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఉన్నాయి. టీవీఎస్ ఎక్స్ మోడల్ ఈ–స్కూటర్‌ను రూ.2,49,990 ఎక్స్‌షోరూం ధరలో విక్రయిస్తోంది. ఒకసారి చార్జింగ్‌తో ఇది 140 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. గరిష్ట వేగం గంటకు 105 కిలోమీటర్లు. గంటకు 40 కిలోమీటర్ల వేగాన్ని 2.6 సెకన్లలో అందుకుంటుంది. అలాగే టీవీఎస్ ఐక్యూబ్ ఈ–స్కూటర్‌ను రూ.89,999 నుంచి రూ.1,85,373 వరకు ధరల శ్రేణిలో విక్రయిస్తోంది. వేరియంట్‌నుబట్టి ఒకసారి చార్జింగ్‌తో 75–150 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. -
మూడేళ్ళలో 10 లక్షల మంది కొన్న బైక్ ఇదే..
భారతీయ మార్కెట్లో లాంచ్ అయిన 'టీవీఎస్ రైడర్ 125' బైక్.. అమ్మకాల్లో సరికొత్త మైలురాయిని చేరుకుంది. సెప్టెంబర్ 2021లో లాంచ్ అయిన తరువాత మొత్తం 10,07,514 యూనిట్ల అమ్మకాలను పొందగలిగింది. మూడేళ్ళ కాలంలో ఈ బైక్ అరుదైన రికార్డ్ కైవసం చేసుకుంది.గత ఆర్ధిక సంవత్సరం నాటికి టీవీఎస్ రైడర్ మొత్తం 7,87,059 యూనిట్ల అమ్మకాలను సాధించింది. ఆ తరువాత ఈ ఆర్ధిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో 2,12,941 యూనిట్ల సేల్స్ సాధించింది. మొత్తం మీద ఈ బైక్ సేల్స్ 10 లక్షల యూనిట్లు దాటేసింది.దేశీయ విఫణిలో లాంచ్ అయిన కొత్త టీవీఎస్ రైడర్ 125 బైక్ గత ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా అమ్ముడైన మోటార్‌సైకిల్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. కాగా ఇటీవల ఈ బైక్ ఐజీఓ ఎడిషన్ రూపంలో రూ. 98,389 (ఎక్స్ షోరూమ్) ధర వద్ద లాంచ్ అయింది. ఇది 124.8 సీసీ ఇంజిన్ కలిగి 11.22 Bhp పవర్, 11.75 Nm టార్క్ అందిస్తుంది. చూడటానికి స్టాండర్డ్ మోడల్ మాదిరిగా అనిపించినప్పటికీ.. కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ చూడవచ్చు. -
టీవీఎస్ మోటార్ కొత్త రికార్డ్
న్యూఢిల్లీ: ద్విచక్ర, త్రిచక్ర వాహన రంగ దిగ్గజం టీవీఎస్ మోటార్ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 41 శాతం జంప్‌చేసి రూ. 588 కోట్లను అధిగమించింది. రికార్డ్ అమ్మకాలు ఇందుకు సహకరించాయి.గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 416 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 9,933 కోట్ల నుంచి రూ. 11,302 కోట్లకు ఎగసింది. మొత్తం వ్యయాలు రూ. 9,297 కోట్ల నుంచి రూ. 10,428 కోట్లకు పెరిగాయి. ఈ కాలంలో ఎగుమతులతోపాటు ద్విచక్ర, త్రిచక్ర వాహన అమ్మకాలు కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 12.28 లక్షల యూనిట్లను తాకాయి. గత క్యూ2లో నమోదైన 10.74 లక్షల యూనిట్లతో పోలిస్తే ఇది 14 శాతం వృద్ధి. వీటిలో మోటార్ సైకిళ్ల విక్రయాలు 14 శాతం పుంజుకుని 5.6 లక్షల యూనిట్లకు చేరగా.. స్కూటర్ అమ్మకాలు 17 శాతం ఎగసి 4.9 లక్షల యూనిట్లను తాకాయి.ద్విచక్ర వాహన ఎగుమతులు 16 శాతం బలపడి 2.78 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి. ఇక త్రిచక్ర వాహన అమ్మకాలు 5,000 యూనిట్లు తగ్గి 38,000కు పరిమితమయ్యాయి. ఎలక్ట్రిక్ వాహనాలు 31 శాతం అధికంగా 75,000 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఫలితాల నేపథ్యంలో టీవీఎస్ మోటార్ షేరు బీఎస్ఈలో 3.6 శాతం పతనమై రూ. 2,565 వద్ద ముగిసింది. -
ఈ బైక్ కొనుగోలుపై మంచి డిస్కౌంట్..
పండుగ సీజన్ మొదలవుతోంది. దిగ్గజ వాహన తయారీ సంస్థలు ఇప్పటికే ఆఫర్స్ లేదా డిస్కౌంట్స్ అందించడం ప్రారంభించేసాయి. ఈ తరుణంలో ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్ తన రైడర్ 125 మీద తగ్గింపులను ప్రకటించింది. కాబట్టి ఇప్పుడు టీవీఎస్ రైడర్ 125 ఎంట్రీ లెవల్ వేరియంట్ రూ. 84,869కే లభిస్తుంది.టీవీఎస్ రైడర్ 125 ఎంట్రీ లెవల్ వేరియంట్ 130 మిమీ డ్రమ్ బ్రేక్ పొందుతుంది. మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఈ బైక్ అదే 124.8 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 11.2 న్యూటన్ మీటర్ టార్క్, 11.4 హార్స్ పవర్ అందిస్తుంది. టీవీఎస్ రైడర్ 125 టాప్ స్పెక్ వేరియంట్ ధర రూ. 1.04 లక్షలు (ఎక్స్ షోరూమ్).ఆఫర్స్ అందిస్తున్న కంపెనీల జాబితాలో టీవీఎస్ మాత్రమే కాకుండా.. చాలా కార్ల కంపెనీలు ఉన్నాయి. ఇవన్నీ రాబోయే దసరా, దీపావళి పండుగలను దృష్టిలో ఉంచుకుని అమ్మకాలను పెంచడానికి, కస్టమర్లను ఆకర్శించడానికి ఈ ఆఫర్స్ ప్రకటించడం జరిగింది. కాబట్టి ప్రజలు వీటి గురించి పూర్తిగా కనుక్కున్న తరువాత కొనుగోలు చేయడం ఉత్తమం. -
టీవీఎస్ అపాచీ లేటెస్ట్ ఎడిషన్.. మరింత పవర్ఫుల్!
టీవీఎస్ మోటర్ కంపెనీ అపాచీ ఆర్ఆర్ 310 (TVS Apache RR 310) 2024 ఎడిషన్‌ను భారత్‌లో తాజాగా విడుదల చేసింది. దీని ధర రూ. 2.75 లక్షల నుండి మొదలవుతుంది. మెకానికల్, కాస్మెటిక్ అప్గ్రేడ్లను పొందిన ఈ కొత్త ఎడిషన్ బైక్.. ఆర్టీఆర్ 310 లాగే ఉంటుంది.కొత్త టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 బిల్ట్ టు ఆర్డర్ (BTO) వెర్షన్‌తో సహా మొత్తం నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. గ్రాఫిక్స్ కొత్త ఆర్ఆర్ 310 డిజైన్ చాలా వరకు మునిపటిలాగే ఉంటుంది. వింగ్లెట్లు అదనంగా వస్తాయి. క్లచ్ కేస్ ఇప్పుడు పారదర్శకంగా ఉంటుంది. ఇది బైక్‌కు స్పోర్టీ టచ్ ఇస్తుంది.ఇక ఇంజిన్ విషయానికి వస్తే మరింత శక్తిమంతంగా ఇచ్చారు. ఇంజన్ అదే 312.2సీసీ, లిక్విడ్-కూల్డ్, సింగిల్-సిలిండర్ యూనిట్‌తో వచ్చినప్పటికీ ఇప్పుడు 38బీహెచ్పీ, 29ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కొంచెం పెద్ద థొరెటల్ బాడీ, తేలికైన పిస్టన్, పెద్ద ఎయిర్బాక్స్ను పొందుతుంది. ఇంజన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో బైడైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్‌తో వస్తుంది.యూఎస్డీ ఫోర్కులు, 17-అంగుళాల అల్లాయ్ వీల్స్, ట్రెల్లిస్ ఫ్రేమ్, రియర్ మోనోషాక్, డ్యూయల్-ఛానల్ ఏబీఎస్‌తో రెండు చివరల డిస్క్ బ్రేక్‌లు, రైడ్ మోడ్లు వంటి ఇతర భాగాలు ఉంటాయి. టీవీఎస్ సెగ్మెంట్-ఫస్ట్ రేస్ ట్యూన్డ్ డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్‌ను కూడా వీటిలో చేర్చింది. అవుట్గోయింగ్ మోడల్ కంటే కొత్త ఎడిషన్ అర సెకను వేగవంతమైనదని టీవీఎస్ మోటర్ కంపెనీ పేర్కొంది.ధరలుకొత్త టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 రెడ్ (క్విక్‌షిఫ్టర్ లేకుండా) వేరియంట్ ఎక్స్‌షోరూం ధర రూ.2,75,000లుగా కంపెనీ నిర్ణయించింది. ఇదే వేరియంట్ క్విక్‌షిఫ్టర్‌తో ఉంటే రూ.2,92,000 ధర ఉంటుంది. ఇక బాంబర్ గ్రే మోడల్ ధర రూ.2,97,000. డైనమిక్ కిట్ ధర అదనంగా రూ.18,000. కొత్త డైనమిక్ ప్రో కిట్‌లో రేస్ ట్యూన్డ్ డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఉంది. దీని ధర రూ.16,000. బై-డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్ ఆప్షన్ కోసం రూ. 17,000 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. -
ఏడు సంవత్సరాలు.. 67 లక్షల సేల్స్: దూసుకెళ్లిన జుపీటర్
స్కూటర్ విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందుతున్న టీవీఎస్ జుపీటర్.. 2013 సెప్టెంబర్ నుంచి జులై 2024 వరకు 67,39,254 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇందులో 110 సీసీ మోడల్, 125 సీసీ మోడల్ రెండూ ఉన్నాయి.2024 ఆర్థిక సంవత్సరంలో టీవీఎస్ జుపీటర్ సేల్స్ 8,44,863 యూనిట్లు. హోండా యాక్టివాకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటూనే మార్కెట్లో ఎంతోమంది వాహన ప్రేమికులను ఆకర్షిస్తోంది. జుపీటర్ ప్రారంభమైన మొదటి రెండు సంవత్సరాల్లో 5 లక్షల స్కూటర్లు మాత్రమే సేల్ అయ్యాయి.2021 ఆర్థిక సంవత్సరంలో 40 లక్షల జుపీటర్ స్కూటర్లు అమ్ముడయ్యాయి. 2022 నాటికి 50 లక్షల యూనిట్ల విక్రయాలు జరిగాయి. మొత్తం మీద జుపీటర్ అత్యుత్తమ అమ్మకాలను పొందగలిగింది. ఈ స్కూటర్ మంచి డిజైన్, ఫీచర్స్ కలిగి ఉండటమే కాకుండా.. రోజువారీ వినియోగానికి కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది. -
టీవీఎస్ జుపీటర్ 110 లాంచ్: ధర ఎంతంటే?
టీవీఎస్ మోటార్ కంపెనీ భారతీయ మార్కెట్లో 'జుపీటర్ 110' స్కూటర్ లాంచ్ చేసింది. ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ. 73,700 (ఎక్స్-షోరూమ్). ఇది నాలుగు వేరియంట్లలో.. ఆరు కొత్త కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.కొత్త జుపీటర్ 110 స్కూటర్ కొత్త కలర్ స్కీమ్ మాత్రమే కాకుండా.. డ్యూయల్ టోన్ సీట్, ఫ్రంట్ ఫోర్క్లపై రిఫ్లెక్టర్లు, ఎల్ఈడీ డీఆర్ఎల్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కూడిన కొత్త ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్స్ అండ్ ఎస్ఎమ్ఎస్ అలర్ట్ వంటివన్నీ పొందుతుంది.33 లీటర్లు అండర్ సీట్ స్టోరేజ్ పొందిన జుపీటర్ 113 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 8 బిహెచ్పి పవర్, 9.8 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. పర్ఫామెన్స్ అనేది దాదాపు దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. -
కార్గిల్ యుద్ధవీరుల గుర్తుగా 'రోనిన్ పరాక్రమ్ ఎడిషన్'
టీవీఎస్ మోటార్ కంపెనీ కార్గిల్ విజయ్ దివస్ జ్ఞాపకార్థం 'రోనిన్ పరాక్రమ్ ఎడిషన్' ఆవిష్కరించింది. ఈ బైక్ ఎక్కువ కాస్మొటిక్ అప్డేట్స్ పొందినప్పటికీ.. యాంత్రికంగా ఎటువంటి మార్పులు లేదు. అంటే ఈ బైకులో స్టాండర్డ్ మోడల్లోని అదే ఇంజిన్ పొందుతుంది.టీవీఎస్ రోనిన్ పరాక్రమ్ ఎడిషన్ చూడటానికి చాలా కొత్తగా కనిపిస్తుంది. సిల్వర్ యాక్సెంట్స్ కలిగి ఆలివ్ గ్రీన్ కలర్ స్కీమ్ కూడా పొందుతుంది. ఈ ఫ్యూయెల్ ట్యాంక్ మీద జాతీయ జెండా రంగులను చూడవచ్చు. బైక్ మీద కార్గిల్ యుద్దాన్ని తెలిపే సైనికుల పెయింటింగ్ ఉంది. వెనుక స్టెయిన్లెస్ స్టీల్ లగేజ్ క్యారియర్ ఉంటుంది.రోనిన్ పరాక్రమ్ ఎడిషన్ 20.4 హార్స్ పవర్, 19.93 ఎన్ఎమ్ టార్క్ అందించే 225.9 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్ పొందుతుంది. ఈ బైక్ USD ఫోర్క్, ప్రీలోడ్ అడ్జస్టబుల్ మోనోషాక్ కలిగి ఉంటుంది. ఇది డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ మాత్రమే కాకుండా రెండు చివర్లలో డిస్క్ బ్రేక్‌లను పొందుతుంది. కాబట్టి అదే పర్ఫామెన్స్ అందిస్తుంది. -
సీఎన్జీ విభాగంలోకి మరో వెహికల్!.. లాంచ్ ఎప్పుడంటే?
ఇటీవల బజాజ్ ఆటో ప్రపంచంలోనే మొట్ట మొదటి సీఎన్జీ బైక్ ఫ్రీడమ్ 125 లాంచ్ చేసింది. ఈ తరుణంలో టీవీఎస్ కంపెనీ కూడా ఈ విభాగంలో స్కూటర్ లాంచ్ చేయడానికి సన్నద్ధమైంది. సంస్థ 2025 నాటికి మార్కెట్లో జుపిటర్ సీఎన్జీ స్కూటర్ లాంచ్ చేయనున్నట్లు సమాచారం.టీవీఎస్ కంపెనీ తన జుపిటర్ స్కూటర్‌ను సీఎన్జీ రూపంలో లాంచ్ చేయడానికి యూ740 పేరుతో ఓ ప్రాజెక్ట్ ప్రారంభించింది. రాబోయే ఈ స్కూటర్ 125 సీసీ ఇంజిన్ పొందనున్నట్లు సమాచారం. అనుకున్నవన్నీ సవ్యంగా జరిగితే.. టీవీఎస్ జుపిటర్ సీఎన్జీ ఈ ఏడాది చివరినాటికి లాంచ్ అయ్యే అవకాశం ఉంది.టీవీఎస్ సీఎన్జీ స్కూటర్ మార్కెట్లో లాంచ్ అయిన తరువాత నెలకు సుమారు 1000 యూనిట్లను విక్రయించనున్నట్లు సమాచారం. వాతావరణంలో కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి కంపెనీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా కంపెనీ లాంచ్ చేయనున్న ఈ సీఎన్జీ స్కూటర్ గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఇటలీలో అడుగెట్టిన టీవీఎస్.. విక్రయాలకు ఈ బైకులు
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన టూ వీలర్ తయారీ సంస్థ 'టీవీఎస్ మోటార్' గ్లోబల్ మార్కెట్లో తన ఉనికిని నిరంతరం విస్తరిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే కంపెనీ తన కార్యకలాపాలను ఇటలీలో కూడా ప్రారంభించింది. ఇప్పటికే 80 దేశాల్లో విస్తరించిన టీవీఎస్ కంపెనీ మరిన్ని దేశాలకు విస్తరించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.టీవీఎస్ మోటార్ ఇటాలియా ద్వారా ఇటలీలో తన కార్యకలాపాలను విస్తరిస్తుంది. దీనికి జియోవన్నీ నోటార్బార్టోలో డి ఫర్నారీ నేతృత్వం వహిస్తారు. దీని ద్వారా టీవీఎస్ అపాచీ RTR, అపాచీ RTR 310, టీవీఎస్ రైడర్, టీవీఎస్ NTorq, జుపీటర్ 125 వంటి మోడల్స్ విక్రయించాలని కంపెనీ యోచిస్తోంది.టీవీఎస్ కంపెనీ ఇటలీ మార్కెట్లో ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా విక్రయించే అవకాశం ఉంది. టీవీఎస్ మోటార్ కంపెనీ హెడ్ గ్రూప్ స్ట్రాటజీ ప్రెసిడెంట్, శరద్ మోహన్ మిశ్రా, కంపెనీ ఇటాలియన్ లాంచ్‌పై మాట్లాడుతూ.. మా వాహనాలకు ఇటాలియన్ వినియోగదారులను పరిచయం చేయడానికి చాలా ఆసక్తిగా ఉన్నాము. ఇక్కడ కూడా కంపెనీ ఉత్తమ ఆదరణ పొందుతుందని భావిస్తున్నామని అన్నారు. -
పాత బైకుకి రెట్టింపు ధర ఆఫర్ చేసిన డీలర్షిప్ - వీడియో వైరల్
భారతీయ మార్కెట్లో ఒకప్పుడు యమహా ఆర్ఎక్స్100, బజాజ్ చేతక్, టీవీఎస్ సుజుకి సమురాయ్ వంటివి అత్యంత ప్రజాదరణ పొందిన టూ వీలర్స్‌గా ప్రసిద్ధి చెందాయి. అయితే కాలక్రమంలో కొత్త బైకులు పూత్తుకు రావడంతో.. పాత బైకులకు ఆదరణ తగ్గిపోయింది. ఇప్పటికి కూడా చాలామంది ఈ బైకులను వినియోగిస్తున్నారు. కాగా ఇటీవల టీవీఎస్ డీలర్షిప్ రెట్టింపు ధరతో ఒక పాత బైకుని కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, కేరళలోని టీవీఎస్ డీలర్షిప్ ప్రతినిధి మిస్టర్ మోటార్ వాల్ట్ వారి యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ.. కస్టమర్ 27 సంవత్సరాల క్రితం టీవీఎస్ సుజుకి సమురాయ్ బైక్ కొనుగోలు చేసాడు, దానిని ఇప్పటి వరకు కూడా వినియోగిస్తున్నారు. ఈ 27 సంవత్సరాల్లో ఇతర బ్రాండ్ బైకుని కొనుగోలు చేయలేదు. కస్టమర్ బ్రాండ్ మీద పెట్టుకున్న నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుతూ దాని అసలు ధరకంటే రెట్టింపు ధరకు సొంతం చేసుకున్నాడు. ఈ బైకుని అతడు కొనుగోలు చేసిన సమయంలో ధర రూ. 21,000. కానీ డీలర్షిప్ వారు దీన్ని రూ. 41,000లకు కొన్నారు. అంటే ఆ కస్టమర్ కొన్న కొత్త బైకు ధరలో రూ. 41 వేలు తగ్గింపు కల్పించారు. ఇదీ చదవండి: ఆనంద్ మహీంద్రాతో పాటు మరో 12మందిపై కేసు నమోదు.. కారణం ఇదే! కస్టమర్ ఏ బైక్ కొనుగోలు చేసిందనే విషయం వెల్లడి కాలేదు. కానీ కొన్న ధరకు రెట్టింపు ధర లభించడంతో కస్టమర్ చాలా ఆనందించాడు. ఈ రోజు కొని నెల రోజుల తరువాత విక్రయిస్తేనే అసలు ధర రాని ఈ రోజుల్లో రెట్టింపు ధర రావడం అనేది గొప్పవిషయమే. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
లక్ష కంటే తక్కువ ధరతో విడుదలైన టీవీఎస్ కొత్త బైక్ - మరిన్ని వివరాలు
ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ దేశీయ మార్కెట్లో ఎట్టకేలకు 'రైడర్ సింగిల్-పీస్ సీట్' బైక్ లాంచ్ చేసింది. ఇది ఇప్పటికే మార్కెట్లో లభిస్తుంది రైడర్ స్ప్లిట్ సీట్, స్మార్ట్-ఎక్స్‌నెక్ట్ (SmartXonnect) వేరియంట్‌కి దిగువన ఉంటుంది. ఇది కంపెనీ ఎంట్రీ లెవెల్ మోడల్ అవుతుంది. ఈ బైక్ ధర, వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. ధర: దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త టీవీఎస్ రైడర్ సింగిల్ పీస్ సీట్ మోడల్ ధర రూ. 94,719 కాగా, స్మార్ట్-ఎక్స్‌నెక్ట్ వేరియంట్ ధర లక్ష వరకు ఉంటుంది. అయితే కంపెనీ ఈ కొత్త వేరియంట్ లాంచ్ చేయడంతో, రైడర్ డ్రమ్ బ్రేక్ వేరియంట్ నిలిపివేసింది. డిజైన్ & ఫీచర్స్: టీవీఎస్ కొత్త రైడర్ బైక్ ఎల్ఈడీ లైట్స్ వంటి వాటితో మంచి డిజైన్ పొందుతుంది. కాగా ఇందులోని LCD డిస్ప్లే స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, ఫ్యూయెల్ లెవెల్ ఇండికేటర్, టాకోమీటర్, గేర్ పొజిషన్ ఇండికేటర్ వంటి వాటిని ప్రదర్శిస్తుంది. అంతే కాకుండా ఈ బైకులో USB ఛార్జింగ్ పోర్ట్, సీటు కింద చిన్న స్టోరేజ్ యూనిట్ కూడా ఉన్నాయి. (ఇదీ చదవండి: పోయిందనుకున్న స్కూటర్ పట్టించింది - ఓలా ఫీచర్.. అదిరిపోలా!) ఇంజిన్ & పర్ఫామెన్స్: టీవీఎస్ రైడర్ ఇంజిన్ ముందుపతి మాదిరిగానే ఉంటుంది. కావున ఇందులో 124.8 సిసి సింగిల్-సిలిండర్ ఇంజన్ కలిగి 11.4 హెచ్‌పి పవర్, 11.2 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడుతుంది. ఈ బైక్ కేవలం 5.9 సెకన్లలో గంటకు 0 నుంచి 60 కిమీ వరకు వేగవంతం అవుతుంది. టీవీఎస్ రైడర్ సింగిల్-సీట్ వెర్షన్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, మోనోషాక్ కలిగి ఉంటుంది. అదే సమయంలో బ్రేకింగ్ విషయానికి వస్తే ఈ బైక్ ఒకే ఫ్రంట్ డిస్క్ వెనుక డ్రమ్ సెటప్ పొందుతుంది. ఇందులో 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి, ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 10 లీటర్ల వరకు ఉంటుంది. -
టీవీఎస్ ఐక్యూబ్ నయా రికార్డ్.. ఏంటో తెలుసా?
భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ టూ వీలర్లకు ఆదరణ భారీగా పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని చాలా వాహన తయారీ సంస్థలు దేశీయ విఫణిలో ఆధునిక ఎలక్ట్రిక్ వాహనాలను విరివిగా విడుదల చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్.. ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. కంపెనీ టీవీఎస్ ఐక్యూబ్ లాంచ్ చేసినప్పటి నుంచి మంచి అమ్మకాలను పొందుతూ ఎట్టకేలకు ఉత్పత్తిలో లక్ష యూనిట్ల మైలురాయిని దాటేసింది. 2022 జనవరిలో కేవలం 1,529 యూనిట్ల అమ్మకాలతో మొదలైన ఐక్యూబ్ 2023 మార్చి నెలలో ఏకంగా 15,364 యూనిట్ల అమ్మకాలను చేపట్టింది. దీన్ని బట్టి చూస్తే మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు ఏవిధంగా సాగాయనేది స్పష్టంగా అర్థమవుతోంది. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో టీవీఎస్ ఐక్యూబ్ స్టాండర్డ్, ఎస్, ఎస్టి అనే మూడు వేరియంట్లలో లభిస్తోంది. ఐక్యూబ్ స్టాండర్డ్ ధర రూ. 98,564 కాగా, ఎస్ వేరియంట్ ధర రూ. 1,08,690 (ఆన్-రోడ్ ఢిల్లీ). అయితే కంపెనీ టాప్ వేరియంట్ ధరలను వెల్లడించలేదు, అయితే ఇది ఒక ఛార్జ్‌తో 140 కిమీ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది. (ఇదీ చదవండి: క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్‌కి ట్రాన్సాక్షన్ - సులభంగా ఇలా!) టీవీఎస్ ఐక్యూబ్ ఎల్ఈడీ లైట్స్, TFT ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 12 ఇంచెస్ వీల్స్ వంటివి పొందుతుంది. ఆధునిక ఫీచర్స్ కలిగి ఉన్న ఈ స్కూటర్ నగర ప్రయాణాలను చాల అనుకూలంగా ఉంటుంది. కంపెనీ ప్రస్తుతం రిటైల్ నెట్వర్క్ కూడా విస్తరిస్తోంది. ఇప్పటికే వంద నగరాల్లో 200 టచ్పాయింట్లను ప్రారభించింది. ఇటీవల ఈ స్కూటర్ 2023 గ్రీన్ టూ-వీలర్ ఆఫ్ ది ఇయర్ టైటిల్ కూడా సొంతం చేసుకుంది. -
ఎంఎస్ ధోని మనసు దోచిన టీవీఎస్ బైక్ ఇదే!.. ధర ఎంతో తెలుసా!
భారతీయ క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న MS ధోని ఇటీవల 'టీవీఎస్ రోనిన్' బైక్ కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పటికే అనేక వాహనాలు కలిగిన ధోని గ్యారేజిలో ఇప్పుడు మరో అతిధి చేరింది. దేశీయ మార్కెట్లో టీవీఎస్ కంపెనీ గతేడాది రోనిన్ బైక్ విడుదల చేసింది. ఈ బైక్ యొక్క బేస్ మోడల్ ధర రూ. 1,49,000 కాగా, టాప్ వేరియంట్ రూ. 1,68,750 వద్ద అందుబాటులో ఉంది. కంపెనీ అన్ని వేరియంట్స్‌ని డ్యూయెల్ టోన్ కలర్స్‌లో అందిస్తోంది. ఇందులో ధోని రోనిన్ టాప్ వేరియంట్ కొనుగోలు చేశారు. ధోని డెలివరీ చేసుకున్న బైక్ విషయానికి వస్తే, ఇది 225 సీసీ ఇంజిన్ కలిగి 20 బిహెచ్పి పవర్ 20 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో గరిష్టంగా గంటకు 120 కిమీ వేగవంతం అవుతుంది. ఈ బైక్ సైలెంట్ స్టార్ట్‌లను అనుమతించే ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ సిస్టమ్‌ను కలిగి ఉంది. టీవీఎస్ రోనిన్ రౌండ్ హెడ్‌ల్యాంప్, రియర్ వ్యూ మిర్రర్స్, టియర్ డ్రాప్ ఫ్యూయల్ ట్యాంక్ పొందుతుంది. ఫీచర్స్ విషయానికి వస్తే, ఇది SmartXonnect కనెక్టివిటీ కలిగి ఉండటం వల్ల టర్న్-బై-టర్న్ నావిగేషన్, రేస్ టెలిమెట్రీ, లో ఫ్యూయెల్ వార్ణింగ్, క్రాష్ అలర్ట్, కాల్ అండ్ ఎస్ఎమ్ఎస్ అలర్ట్ వంటి ఫీచర్స్ యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది. కొత్త రోనిన్ బైక్ డబుల్ క్రెడిల్ స్ప్లిట్ చాసిస్‌తో 41 మి.మీ అప్‌సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్, వెనుకవైపు గ్యాస్ ఛార్జ్డ్ మోనోషాక్ పొందుతుంది. బ్రేకింగ్ విషయానికి వస్తే ఈ బైక్ ముందు, వెనుక భాగంలో స్పోర్ట్స్ డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. ఇప్పటికే కవాసకి నింజా హెచ్2, ఎక్స్132 హెల్‌క్యాట్, యమహా RD350, రాజ్‌దూత్, సుజుకి షోగన్, యమహా RX100, టీవీఎస్ అపాచీ 310, హార్లే డేవిడ్సన్, డుకాటీ వంటి 100 కంటే ఎక్కువ బైకులు కలిగి ఉన్నారు. తాజాగా ఇప్పుడు టీవీఎస్ రోనిన్ తన గ్యారేజిని అలంకరించింది. -
టీవీఎస్ అపాచీ స్పెషల్ ఎడిషన్: న్యూ లుక్ చూస్తే ఫిదానే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ 2023 స్పెషల్ ఎడిషన్ టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వీ ప్రవేశపెట్టింది. కొత్త కలర్, కొత్త అప్డేట్స్తో స్పెషల్‌గా దీన్ని ఆవిష్కరించింది. కొత్త పెరల్ వైట్ కలర్లో వస్తున్న స్పెషల్ ఎడిషన్ 2023 వెర్షన్ ఢిల్లీ ఎక్స్‌షోరూంలో ధర రూ.1.30 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఇంజీన్, ఫీచర్లు 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో 159.7 సీసీ ఆయిల్ కూల్డ్, ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజన్ పొందుపరిచారు. ఇది 250 ఆర్పీఎం వద్ద 17.39 బీహెచ్పీ పవర్, 7250 ఆర్పీఎం వద్ద 14.73 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. అల్లాయ్ వీల్స్‌లో బ్లాక్ రెడ్ కలర్ కాంబినేషన్‌తో కొత్త పెర్ల్ వైట్ కలర్ కొత్త సీటు నమూనాతో డ్యూయల్-టోన్ సీటు ఎడ్జస్టబుల్ క్లచ్ అండ్, బ్రేక్ లివర్లు అర్బన్, స్పోర్ట్ , రెయిన్ మూడు రైడ్మోడ్స్లో లభ్యం. TVS SmartXonnect కనెక్టివిటీ రేర్ రేడియల్ టైర్ గేర్ షిఫ్ట్ సూచిక సిగ్నేచర్ ఆల్-LED హెడ్‌ల్యాంప్ డేటైమ్ రన్నింగ్ లైట్ TVS Apache RTR సిరీస్ బైక్స్ అత్యాధునిక సాంకేతికత, కస్టమర్ సెంట్రిసిటీలో ఎల్లప్పుడూ ముందంజలో ఉన్నాయనీ, కస్టమర్ అంచనాలను అందుకుంటూ ఆకట్టుకుంటున్నాయని టీవీఎస్ మోటార్ కంపెనీ ప్రీమియం హెడ్ బిజినెస్ విమల్ సుంబ్లీ పేర్కొన్నారు. నాలుగు దశాబ్దాల రేసింగ్ వారసత్వం, అనుభవంతో స్పెషల్ ఎడిషన్‌ని పరిచయం చేయడం సంతోషంగా ఉందన్నారు. -
టీవీఎస్ అపాచీ కొత్త మోడల్.. ఆహా అనేలా ఫీచర్లు, లుక్ కూడా అదిరిందయ్యా!
యువతను తన వైపుకు తిప్పుకొని రోడ్లపై రయ్ రయ్ మంటూ చక్కర్లు కొట్టిన టీవీఎస్ అపాచీ (Tvs Apache) మోడల్ బైకులకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. తాజాగా ఆ సంస్థ కొత్తగా రెండు అపాచీ మోడళ్లను లాంచ్ చేసింది. ఒకటి టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160( 2022 TVS Apache RTR 160), రెండోది టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 180 (TVS Apache RTR 180) మోడల్. RTR 160 ధర రూ 1.18 లక్షలు కాగా RTR 180 ధర 1.31 లక్షలు నుంచి ప్రారంభం అవుతుంది. కొత్తగా రాబోతున్న ఈ రెండు మోటార్‌సైకిళ్లలో రిఫ్రెష్డ్ డిజైన్, స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ (SmartXonnect) చేయబడిన టెక్నాలజీతో పాటు మరిన్ని ఫీచర్లు ఉన్నాయి. అంతేకాక రెయిన్, అర్బన్, స్పోర్ట్ పేరుతో మూడు విభిన్న డైవింగ్ మోడ్లు ప్రత్యేక ఫీచర్‌గా చెప్పాలి. ఫీచర్లు ఇవే: 2022 TVS Apache RTR 160.. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో 159.7 cc ఎయిర్-కూల్డ్ ఇంజన్, 16.04 PS పవర్, 13.85 Nm టార్క్ డెలివర్ చేస్తుంది. 2022 TVS Apache RTR 180.. 5-స్పీడ్ గేర్‌బాక్స్, 17PS పవర్, 15 Nm టార్క్‌తో 177.4cc ఆయిల్-కూల్డ్ ఇంజన్‌తో వస్తుంది. వీటిలో..ఫ్యూయల్ ఇంజెక్షన్, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, స్లిప్పర్ క్లచ్‌లతో పాటు రీడిజైన్ చేయబడిన ఎల్ఈడీ (LED) హెడ్‌ల్యాంప్ కూడా ఉంది. అధునాతన బ్లూటూత్‌తో పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో వస్తున్నాయి. గేర్ పొజిషన్ ఇండికేటర్, టీవీఎస్ కనెక్ట్ యాప్ వంటి ఇతర ఫీచర్లు కూడా ఉన్నాయి. టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 180 సిరీస్ గ్లోస్ బ్లాక్, పెరల్ వైట్ కలర్ ఆప్షన్లలో లభ్యం కానుండగా, టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 సిరీస్‌లో గ్లోస్ బ్లాక్, పెరల్ వైట్, రేసింగ్ రెడ్, మ్యాట్ బ్లూ, టీ-గ్రే వంటి ఐదు వేరియంట్ కలర్స్‌లో లభ్యమవుతుంది. చదవండి: రూ.17వేల కోట్ల నష్టం.. ఇలా అయితే గాల్లోకి ఎగరడం కష్టమే! -
హైదరాబాద్‌లో టీవీఎస్ ఐక్యూబ్ ఈ–స్కూటర్.. ధర ఎంతంటే?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ సరికొత్త ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మూడు వేరియంట్లలో ఆవిష్కరించింది. ఆన్‌రోడ్ ధర ఢిల్లీలో రూ.98 వేల నుంచి ప్రారంభం. ఒకసారి చార్జింగ్ చేస్తే వేరియంట్‌నుబట్టి 100–140 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ ప్రకటించింది. టీవీఎస్ ఐక్యూబ్ ఈ–స్కూటర్లో మూడు చార్జింగ్ ఆప్షన్స్, 7 అంగుళాల టీఎఫ్టీ టచ్ స్క్రీన్, క్లీన్యూఐ, వాయిస్ అసిస్ట్, అలెక్సా స్కిల్‌సెట్, ఇన్ట్యూటివ్ మ్యూజిక్ ప్లేయర్ కంట్రోల్, ఓటీఏ అప్డేట్స్, ఫాస్ట్ చార్జింగ్, మల్టిపుల్ బ్లూటూత్, క్లౌడ్ కనెక్టివిటీ, 32 లీటర్ల స్టోరేజ్ సామర్థ్యం వంటి హంగులు ఉన్నాయి. రూ.999 చెల్లించి బుకింగ్ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా 33 నగరాల్లో ఐక్యూబ్ లభిస్తుంది. త్వరలో మరో 52 నగరాలను జోడించనున్నట్టు కంపెనీ వెల్లడించింది. చదవండి: ‘ఈవీ’ విషయంలో జట్టు కట్టిన మహీంద్రా, ఫోక్స్‌వ్యాగన్‌లు -
పేరు గంటా రాముడు.. ఎక్స్ఎల్ బైక్ కనపడితే ఖతం
కర్నూలు (బొమ్మలసత్రం) : కేవలం టీవీఎస్ కంపెనీకి చెందిన ఎక్స్ఎల్ బైక్‌లను మాత్రమే కాజేసే ఓ దొంగను వన్‌టౌన్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. మరే ఇతర బైకు కనిపించినా ఈ దొంగ వాటి వైపు కన్నెత్తి చూడడు. ఎందుకంటే ఆ దొంగకు కేవలం టీవీఎస్ ఎక్స్ఎల్ వాహనాన్ని మాత్రమే నడుపుతాడు. సరే దొంగిలించిన వాహనాన్ని ఎవరికైనా తక్కువ ధర విక్రయిస్తాడా అంటే అదీ లేదు. తాను దొంగిలించిన 14 బైకులను ఒక ఇంట్లో ఉంచి వాటిని చూస్తూ ఆనందించేవాడు. వివరాల్లోకి వెళితే.. నందికొట్కూరు మండలం కొణిదెల గ్రామానికి చెందిన 54 ఏళ్ల గంటా రాముడు చిన్నతనం నుంచి జులాయిగా తిరిగేవాడు. రాముడు టీవీఎస్ ఎక్స్ఎల్ బైక్ మాత్రమే నడిపేవాడు. ఎక్కడ టీవీఎస్ ఎక్స్ఎల్ బైకు కనిపించినా తన దృష్టి బైక్‌మీదే ఉంచేవాడు. తన ఇంటి నిండా టీవీఎస్ బైకులతో నింపాలన్న చిలిపి కోరిక రాముడు దొంగతనాలకు బానిసయ్యేలా చేసింది. ఈ క్రమంలో నంద్యాల, ఆత్మకూరు, కర్నూలు, నందికొట్కూరు ప్రాంతాల్లో బైకు దొంగతనాలకు పాల్పడ్డాడు. రద్దీగా ఉన్న ప్రాంతాలను ఎంచుకుని తనకు నచ్చిన బైకు వద్ద వెళ్లి, ఎవరూ లేని సమయంలో దాన్ని దొంగిలించి వాహనంపై పరారయ్యేవాడు. ఇదే క్రమంలో నంద్యాల గాంధీచౌక్ సెంటర్లో ఒక దుకాణం ముందు నిలిపిన బైకును రాముడు గత నెలలో చోరీ చేశాడు. బాధితుని ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి సీసీ ఫుటేజీలను పరిశీలించారు. అందులో రాముడు బైక్ ఎత్తుకెళ్లిన దృశ్యాల ఆధారంగా విచారణ చేపట్టారు. రాముడు సొంత గ్రామమైన కొణిదెల గ్రామానికి వెళ్లి విచారించారు. తాను ఏకంగా 14 బైకులు దొంగిలించినట్లు ఒప్పుకుని వాటిని ఓ పాడుబడిన మిద్దెలో దాచినట్లు చెప్పాడు. పోలీసులు బైక్‌లను స్వాధీనం చేసుకుని నిందితునిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. చాకచక్యంగా దర్యాప్తు చేసి దొంగను పట్టుకున్న ఏఎస్సై క్రిష్ణారెడ్డి, హుస్సేన్ సిబ్బంది మద్దిలేటి, మస్తాన్, సుధాకర్‌లను డీఎస్పీ రామాంజినాయక్, సీఐ ఓబులేసులు అభినందించారు. -
టీవీఎస్‌తో జట్టు కట్టిన జియో
దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచే కార్యక్రమంలో భాగంగా జియోబీపీ సంస్థ ప్రముఖ టూవీలర్ మేకర్ టీవీఎస్‌తో జట్టు కట్టింది. ఈ ఒప్పందం ప్రకారం దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న త్వరలో రాబోతున జియో బీపీ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లలో టీవీఎస్ వాహనాలకు యాక్సెస్ లభిస్తుంది. దీని ద్వారా టీవీఎస్ ఈవీలలో ప్రయాణం చేయడం మరింత సౌకర్యవంతం కానుంది. రిలయన్స్ సబ్సిడరీ సంస్థ అయిన జియో బీపీ దేశవ్యాప్తంగా భారీ ఎత్తున జియోబీపీ ప్లస్ పేరుతో ఛార్జింగ్ స్టేషన్లు, బ్యాటరీ స్వాపింగ్ సెంటర్లు అందుబాటులోకి తెస్తోంది. మరోవైపు ఐక్యూబ్ పేరుతో ఇప్పటికే ఈవీ సెగ్మెంట్లో అడుగు పెట్టిన టీవీఎస్ సంస్థ.. రాబోయే రోజుల్లో రూ.1000 కోట్లను ఈవీ రంగంపై ఖర్చు చేయనుంది. దీంతో భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా జియోబీపీ, టీవీఎస్‌లు జట్టు కట్టాయి. -
ఆటోమొబైల్ కంపెనీలకు భారీగా ‘పీఎల్ఐ’ ప్రోత్సాహకాలు
న్యూఢిల్లీ: దేశీయంగా తయారీని ప్రోత్సహించే దిశగా.. ఆటోమొబైల్, ఆటో విడిభాగాల రంగం కోసం ప్రకటించిన ఉత్పాదకత ఆధార ప్రోత్సాహకా(పీఎల్ఐ) పథకం కింద 75 సంస్థలకు ప్రయోజనాలు లభించనున్నాయి. మారుతీ సుజుకీ, హీరో మోటోకార్ప్, లూకాస్-టీవీఎస్, టాటా కమిన్స్, టయోటా కిర్లోస్కర్ తదితర సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. దేశీ కంపెనీలతో పాటు జపాన్, జర్మనీ, అమెరికా, బ్రిటన్ తదితర దేశాల సంస్థలు కూడా వీటిలో ఉన్నట్లు వివరించింది. పీఎల్ఐ స్కీములో అంతర్భాగమైన రెండు పథకాల ద్వారా అయిదేళ్లలో రూ. 74,850 కోట్ల మేర పెట్టుబడులు రానున్నట్లు పేర్కొంది. కాంపోనెంట్ చాంపియన్ ఇన్వెస్టివ్ స్కీము కింద దాదాపు రూ. 29,834 కోట్లు, చాంపియన్ ఓఈఎం ఇన్సెంటివ్ స్కీము కింద రూ. 45,016 కోట్ల మేర పెట్టుబడులు రానున్నాయి. ప్రభుత్వం నిర్దేశించుకున్న రూ.42,500 కోట్ల లక్ష్యం కన్నా ఇది అధికమని కేంద్రం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. ఓఈఎం స్కీము కింద ఇప్పటికే 20 సంస్థలు ఎంపికయ్యాయి. ‘ప్రపంచ స్థాయి తయారీ కేంద్రంగా భారత్ సాధిస్తున్న పురోగతిపై పరిశ్రమ గట్టి నమ్మకంతో ఉందని ఈ పథకాలకు లభించిన స్పందన తెలియజేస్తోంది. (చదవండి: ఐఫోన్ 13పై అమెజాన్ అదిరిపోయే ఆఫర్..!) -
టీవీఎస్ నుండి మరో కొత్త వెహికల్, ధర ఎంతంటే?
వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ జూపిటర్ 125 స్కూటర్‌ను ఆవిష్కరించింది. ఢిల్లీ ఎక్స్‌షోరూంలో ధర రూ.73,400. సింగిల్ సిలిండర్, 4 స్ట్రోక్, ఎయిర్ కూల్డ్ 124.8 సీసీ ఇంజన్‌తో తయారైంది. అధిక మైలేజీ కోసం ఎకోథ్రస్ట్ ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీ వాడారు. డ్రమ్, డ్రమ్ అలాయ్, డిస్క్ వేరియంట్లలో నాలుగు రంగుల్లో లభిస్తుంది. టీవీఎస్ ఇంటెల్లిగో, సీట్ కింద 33 లీటర్ల స్టోరేజ్, మెటల్ మ్యాక్స్ బాడీ, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, మోనోట్యూబ్ షాక్స్, ఆల్ ఇన్ వన్ లాక్ వంటి హంగులు ఉన్నాయి. ఇప్పటికే టీవీఎస్ మోటార్ జూపిటర్ 110 వర్షన్‌ను విక్రయిస్తోంది. -
ద్విచక్ర ఎలక్ట్రిక్ వాహన ప్రియులకు టీవీఎస్, టాటా పవర్ శుభవార్త!
న్యూఢిల్లీ: దేశంలో ద్విచక్ర వాహన ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లను నిర్మించడం కోసం టీవీఎస్ మోటార్ కంపెనీ, టాటా పవర్ వ్యూహాత్మక భాగస్వామ్యం ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఎమ్ఒయులో భాగంగా భారతదేశం అంతటా టీవీఎస్ మోటార్ ప్రదేశాలలో ఎలక్ట్రిక్ వేహికల్ ఛార్జింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్(ఈవీసీఐ) నిర్మించడం కోసం రెండు కంపెనీలు అంగీకరించాయి. భారతదేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీని వేగవంతం చేయడం కోసం పెద్ద డెడికేటెడ్ ఎలక్ట్రిక్ టూ వీలర్ ఛార్జింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సృష్టించడం ఈ భాగస్వామ్యం లక్ష్యం. టీవిఎస్ మోటార్ కస్టమర్ కనెక్ట్ యాప్, టాటా పవర్ ఈజెడ్ ఛార్జ్ యాప్ ద్వారా దేశంలో విస్తృతంగా ఏర్పాటు చేయనున్న ఛార్జింగ్ నెట్ వర్క్ స్టేషన్లు దగ్గరలో ఎక్కడ ఉన్నాయి అనేది ద్విచక్ర ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులు తెలుసుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ టూ వీలర్ల కోసం రెగ్యులర్ ఎసీ ఛార్జింగ్ నెట్ వర్క్, డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ నెట్ వర్క్ ఏర్పాటు చేయడం ఈ భాగస్వామ్యం లక్ష్యం. ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలుచేయాలని చూసేవారికి ఈ భాగస్వామ్యం మరింత సహాయపడుతుంది. రోజు రోజుకి పెరుగుతున్న కాలుష్య నేపథ్యంలో సౌర శక్తి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ ఉద్దేశ్యంతోనే రెండు కంపెనీలు తమ ప్రయాణంలో ఎంపిక చేసిన ఛార్జింగ్ స్టేషన్ల వద్ద సౌర శక్తి ద్వారా పవర్ ఉత్పత్తి చేసే అవకాశాలను కూడా అన్వేషిస్తున్నాయి. (చదవండి: ఫేస్బుక్ యూజర్లకు మరో భారీ షాక్..!) -
మార్కెట్లోకి మరో కొత్త టీవీఎస్ బైక్
టీవీఎస్ మోటార్ కంపెనీ 2021 అపాచీ ఆర్ఆర్ 310ని భారతదేశంలో రూ.2.60 లక్షల ప్రారంభ ధరతో లాంఛ్ చేసింది. ఆర్ఆర్ 310లో కొత్త ఫీచర్స్, కొత్త డ్యూయల్ టోన్ పెయింట్ స్కీమ్ వంటివి ఉన్నాయి. టీవీఎస్ మోటార్ ఇప్పటికే కొత్త అపాచీ ఆర్ఆర్ 310 బుకింగ్స్ ప్రారంభించింది. ఆర్ఆర్ 310లో ముందు, వెనుక సస్పెన్షన్లను ట్వీక్ చేసింది. ఈ కొత్త బైక్ మునుపటి బైక్ కంటే అదనపు ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ బైక్‌లో ఆర్టీ-స్లిప్పర్ క్లచ్, బై-ఎల్ఈడీ ట్విన్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, ఆర్టీ-ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ ఉన్నాయి. అపాచీ ఆర్ఆర్ 310నిలోని డిజిటల్ క్లస్టర్ యూనిట్ లో ముఖ్యమైన డాక్యుమెంట్లు, డే ట్రిప్ మీటర్, డైనమిక్ రెవ్ లిమిట్ ఇండికేటర్, ఓవర్ స్పీడ్ ఇండికేటర్ లను చూపిస్తుంది. బీఎమ్‌డబ్ల్యూ జీ 310 ఆర్ ఇంజిన్ ఆధారంగా 310 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ తో కొత్త అపాచీ ఆర్ఆర్ 310 వస్తుంది. 34 బిహెచ్పి శక్తి, 27.3 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ ఆరు-స్పీడ్ మాన్యువల్ గేర్ ఆప్షన్ కలిగి ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ లో 2021 అపాచీ ఆర్ఆర్ 310 ప్రారంభించాలని టీవీఎస్ కంపెనీ ఇంతకు ముందు యోచించింది. అయితే, కోవిడ్-19 మహమ్మారి సెకండ్ వేవ్ కారణంగా లాంచ్ ఆలస్యమైంది. 2021 అపాచీ ఆర్ఆర్ 310 కెటిఎమ్ ఆర్ సీ 390, కావాసాకీ నింజా 300, బెనెల్లీ 302ఆర్ వంటి ప్రత్యర్థులతో తలపడనుంది.(చదవండి: సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఇవే!) -
ప్రపంచ అమ్మకాల్లో రికార్డ్ సృష్టించిన టీవీఎస్ స్కూటర్
టీవీఎస్ మోటార్స్ ఎన్టీఓఆర్క్యూ(NTORQ) 125 స్కూటర్ సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈ స్కూటర్ అంతర్జాతీయ మార్కెట్లలో తక్కువ కాలంలో లక్ష యూనిట్ల అమ్మకాల మైలురాయిని దాటినట్లు టీవీఎస్ మోటార్ కంపెనీ ప్రకటించింది. ఎన్టీఓఆర్క్యూ దక్షిణ ఆసియా, పశ్చిమ ఆసియా, ఆసియాన్, లాటిన్ అమెరికాలోని 19 దేశాలలో తమకు కొనుగోలుదారులు ఉన్నట్లు పేర్కొంది. టీవీఎస్ మోటార్ కంపెనీ డైరెక్టర్, సీఈఓ కెఎన్ రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. మా స్మార్ట్ స్కూటర్ టీవీఎస్ ఎన్టీఓఆర్క్యూ 125 అంతర్జాతీయ మార్కెట్లలో 1 లక్షల అమ్మకాల మైలురాయిని దాటింది. ఈ స్కూటర్ ప్రారంభించినప్పటి నుంచి స్కూటర్ ప్రపంచవ్యాప్తంగా జెన్ జెడ్ కస్టమర్లను భాగ ఆకర్షిస్తుంది. దీనికి ప్రధాన కారణం స్కూటర్ అద్భుతమైన ప్రదర్శన, అందులో ఉన్న సాంకేతికత, ఉన్నతమైన పనితీరు వంటి అంశాలు అందరికి చేరుకోవడానికి దోహదపడ్డాయి అని చెప్పారు. ఆవిష్కరణలో బెంచ్‌మార్క్‌లను అందుకోవడం, కస్టమర్ల ఆకాంక్షను నెరవర్చడం ద్వారా టీవీఎస్ ఎన్టీఓఆర్క్యూ బ్రాండ్‌ను పెంచుకోవాలనే మా నిబద్ధతకు ఇది ఒక ఉదాహరణ అని కూడా అన్నారు. దీనిలో మంచి పనితీరు కోసం టీవీఎస్ రేసింగ్ పెడిగ్రీ సపోర్ట్, రేస్-ట్యూన్డ్ ఇంధన ఇంజెక్షన్ (RT-Fi) కలిగి ఉంది. టీవీఎస్ ఎన్టీఓఆర్క్యూలో ఫుల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఉంది. ఈ కారణం వల్ల స్కూటర్‌ను స్మార్ట్‌ఫోన్‌కి బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చెయ్యవచ్చు. అలాగే, నావిగేషన్ అసిస్ట్, టాప్ స్పీడ్ రికార్డర్, ఇంటర్నల్ ల్యాప్-టైమర్, ఎక్స్టర్నల్ ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్, లొకేషన్ అసిస్ట్, సర్వీస్ రిమైండర్, ట్రిప్ మీటర్, రెడ్ కలర్ హాజార్డ్ స్విచ్, ఇంజిన్ కిల్ స్విచ్, లెడ్ లైటింగ్, స్ట్రీట్ - స్పోర్ట్ వంటి మల్టీ-రైడ్ స్టాటిస్టిక్స్ మోడ్లు వంటి ఫీచర్స్ ఉన్నాయి. బీఎస్-VI స్కూటర్ డిస్క్, డ్రమ్ రేస్ ఎడిషన్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఇది మాట్టే రెడ్, మెటాలిక్ గ్రే, మెటాలిక్ రెడ్, మెటాలిక్ బ్లూ కలర్ వేరియంట్లలో వస్తుంది. రేస్ ఎడిషన్ రెడ్-బ్లాక్, ఎల్లో-బ్లాక్‌లలో లభిస్తుంది. చదవండి: మరో కీలక ప్రాజెక్టుకు రిలయన్స్ జియో శ్రీకారం -
సరికొత్తగా టీవీఎస్ అపాచీ బైక్ : ధర?
సాక్షి, ముంబై: టీవీఎస్ మోటార్ కొత్త అపాచీ బైక్‌ను మార్కెట్లో విడుదల చేసింది. 2021 టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వీ మోటార్‌సైకిల్‌ను బుధవారం విడుదల చేసినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ తెలిపింది. ఈ కొత్త బైక్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. డిస్క్ వేరియంట్ ధర రూ.1,10,320,డ్రమ్ వేరియంట్ ధర రూ.1,07,270 (ఎక్స్‌షోరూం, న్యూఢిల్లీ ధరలు) గా కంపెనీ నిర్ణయించింది. రేసింగ్ రెడ్, నైట్ బ్లాక్, మెటాలిక్ బ్లూ మొత్తం మూడు రంగుల్లో అందుబాటులో ఉండనున్నట్లు కంపెనీ వెల్లడించింది. టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వీ కొత్త బూక్‌లో 159.7 సీసీ సింగిల్ సిలిండర్, 4 వాల్వ్, ఆయిల్ కూల్డ్ అధునాతన ఇంజీన్ అమర్చినట్టు తెలిపింది. ఇది 9,250 ఆర్పీఎం వద్ద 17.38 హెచ్‌పీ శక్తిని, 7,250 ఆర్పీఎం వద్ద 14.73 ఎన్ఎం టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. కిల్ కార్బన్ ఫైబర్ నమూనాతో సరికొత్త డ్యూయల్ టోన్ సీటు,ఎ ల్ఈడీ హెడ్‌ల్యాంప్, క్లా స్టైల్డ్ పొజిషన్ ల్యాంప్‌లు ఇతర కీలక ఫీచర్లతో ప్రీమియం లుక్‌తో ఆకట్టుకోనుంది. ఫైవ్ స్పీడ్ సూపర్-స్లిక్ గేర్‌బాక్స్ కలిగిన ఈ బైక్ ఈ సెగ్మెంట్లో అత్యంత శక్తిమంతమైన రైడింగ్ అనుభూతినిస్తుందని టీవీఎస్ మోటార్ కంపెనీ హెడ్ (మార్కెటింగ్) ప్రీమియం మోటార్ సైకిల్స్ మేఘశ్యామ్ దిఘోలే వెల్లడించారు. అలాగే పాత అపాచీల వెర్షన్లతో పోలిస్తే ఈ కొత్త బైక్ రెండు కిలోల బరువు తక్కువ ఉంటుంది. డిస్క్ వేరియంట్ 147 కిలోల బరువు, డ్రమ్ వేరియంట్ 145 కిలోల బరువు ఉంటుంది. -
స్మార్ట్ టెక్నాలజీ, న్యూలుక్ : టీవీఎస్ కొత్త అపాచీ
సాక్షి, ముంబై: పముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటర్స్ బీఎస్-6 ప్రమాణాలకు తోడుగా, కొత్త ఫీచర్లు, అధునిక టెక్నాలజీతో రూపొందించిన టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 200 4వీ బైక్‌ను లాంచ్ చేసింది. ప్రత్యేక ఎడిషన్ బైక్‌లో తొలిసారి రైడ్ మోడ్‌ను పరిచయం చేసింది. స్పోర్ట్, అర్బన్, రెయిన్ అనే మూడు రైడ్ మోడ్లతో దీన్ని భారతీయ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. అయితే ధరను మాత్రం పాత దానితో పోలిస్తే.. కాస్త ఎక్కువగానే ఉంది. ధర రూ .1.31 లక్షలుగా నిర్ణయించింది. టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 200 4వీ బుకింగ్, డెలివరీ ఈ రోజు నుండే ప్రారంభం. ఈ పండుగ సీజన్లో కస్టమర్లను ఆకట్టుకునేలా ఈ కొత్త బైక్‌ను కొత్త అవతారంలో తీసుకొచ్చింది. ఎల్ఈడీ టెక్ హెడ్‌ల్యాంప్స్, డ్యూయల్ ఛానల్ సింగిల్ ఛానల్ ఏబీఎస్, హై పెర్ఫార్మెన్స్ రియర్ రేడియల్ టైర్లు, రేస్ ట్యూన్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్, రేస్ ట్యూన్డ్ స్లీపర్ క్లచ్, స్లైడ్ త్రూ టెక్నాలజీ ఉన్నాయి. దీనితో పాటు, ఎడ్జస్టబుల ఫ్రంట్ సస్పెన్షన్ లివర్‌నుజోడించింది. అంతేకాదు బ్లూటూత్‌తో కూడిన స్మార్ట్ఎక్స్ కనెక్ట్ టెక్నాలజీని అపాచీ ఆర్టీఆర్ 200 4వీలో జోడించింది. దీని ద్వారా యాప్‌ను మొబైల్‌కు కనెక్ట్ చేయవచ్చు.తద్వారా బైక్‌కు సంబంధించిన చాలా సమాచారం తీసుకోవచ్చు. రైడర్‌ను ఎల్లప్పుడూ బైక్‌తో ఎటాచ్ అవ్వవచ్చు. ఇంకా ఈ బైక్‌లో ప్రామాణిక బ్లూటూత్ కనెక్టివిటీతో ఎల్సీడీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అందిచింది. 197.75 సీసీ సింగిల్ సిలిండర్, 4 వాల్వ్, ఆయిల్-కూల్డ్ ఇంజిన్ కలిగి ఉంది. ఈ ఇంజన్ 20.2 బీహెచ్పీ పవర్‌ను, 16.8 న్యూటన్ మీటర్ టార్క్‌ను అందిస్తుంది. -
సెప్టెంబర్‌లో ఆటోరంగం అమ్మకాల స్పీడ్
కోవిడ్-19 కట్టడికి విధించిన లాక్‌డవున్‌ల ఎత్తివేత నేపథ్యంలో వాహన పరిశ్రమ నెమ్మదిగా పుంజుకుంటోంది. ఈ బాటలో ఇప్పటికే ట్రాక్టర్ల విక్రయాలు ఊపందుకోగా.. గత నెల(సెప్టెంబర్)లో ద్విచక్ర వాహన అమ్మకాలు జోరందుకున్నాయి. అంతేకాకుండా కార్ల విక్రయాలు సైతం వేగమందుకున్నాయి. ఇకపై ఆటో రంగం మరింత బలపడనున్న అంచనాలు వాహన తయారీ కంపెనీలకు డిమాండ్‌ను పెంచుతున్నట్లు మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. ఇతర వివరాలు చూద్దాం.. బజాజ్ ఆటో జూమ్ గత నెలలో బజాజ్ ఆటో వాహన విక్రయాలు అంచనాలను మించడంతో ఇన్వెస్టర్లు ఈ కౌంటర్లో కొనుగోళ్లకు ఎగబడుతున్నారు. దీంతో ఎన్ఎస్ఈలో బజాజ్ ఆటో షేరు 5.3 శాతం జంప్‌చేసి రూ. 3,033 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 8 శాతం దూసుకెళ్లింది. రూ. 3,114 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఈ బాటలో ద్విచక్ర వాహన దిగ్గజం టీవీఎస్ మోటార్ సైతం మెరుగైన అమ్మకాలను సాధించగలదన్న అంచనాలు ఈ కౌంటర్‌కు సైతం డిమాండ్‌ను పెంచాయి. వెరసి ఎన్ఎస్ఈలో తొలుత టీవీఎస్ మోటార్ షేరు 5 శాతం జంప్‌చేసి రూ. 490ను తాకింది. ప్రస్తుతం 3.6 శాతం లాభంతో రూ. 485 వద్ద ట్రేడవుతోంది. అమ్మకాలు భళా సెప్టెంబర్‌లో బజాజ్ ఆటో మొత్తం 4.41 లక్షల వాహనాలను విక్రయించింది. ఇది 10 శాతం వృద్ధికాగా.. ద్విచక్ర వాహన అమ్మకాలు 20 శాతం పెరిగి దాదాపు 4.09 లక్షలకు చేరాయి. వీటిలో ద్విచక్ర వాహన ఎగుమతులు 16 శాతం ఎగసి 1.85 లక్షల యూనిట్లను దాటాయి. కాగా.. కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ మొత్తం అమ్మకాలు గత నెలలో 31 శాతం జంప్‌చేసి 1.6 లక్షల యూనిట్లను అధిగమించగా.. ఎస్కార్ట్స్ లిమిటెడ్ ట్రాక్టర్ల విక్రయాలు 9 శాతం బలపడి 11,851 యూనిట్లను తాకాయి. ఇదే ఇధంగా ఎంఅండ్ఎం సైతం 17 శాతం అధికంగా 43,386 ట్రాక్టర్ల అమ్మకాలను సాధించింది. -
టీవీఎస్ మరోసారి మధ్యంతర డివిడెండ్
సాక్షి, ముంబై: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారు టీసీఎస్ మోటార్ తన వాటాదారులకు మరోసారి బంపర్ ఆఫర్ ప్రకటించింది. టీవీఎస్ బోర్డు రెండవ తాత్కాలిక డివిడెండ్ రూపంలో షేరుకు 1.40 చొప్పున చెల్లించడానికి ఆమోదించినట్లు తెలిపింది. మార్చి 18 న పని గంటలు ముగిసే సమయానికి ఈ షేర్లను వాటాలను కలిగి ఉన్న వాటాదారులకు మార్చి 20 న లేదా ఆ తరువాత ప్రకటించిన తాత్కాలిక డివిడెండ్ చెల్లించబడుతుందని చెన్నైకి చెందిన ద్విచక్ర వాహన తయారీ సంస్థ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ఈ రోజు (మంగళవారం) జరిగిన సంస్థ డైరెక్టర్ల సమావేశంలో బోర్డు మార్చి 31, 2020 తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి రెండవ మధ్యంతర డివిడెండ్‌ను షేరుకు రూ. 1.40 (140 శాతం) చొప్పున ప్రకటించింది. గత నెలలో ఇది ఒక్కో షేరుకు రూ. 2.1 డివిడెండ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
మోడ్రన్ ఫీచర్స్‌తో టీవీఎస్ స్కూటీ పెప్ ప్లస్
సాక్షి, న్యూఢిల్లీ: టీవీఎస్ మోటార్ తన పాపులర్ మోడల్ స్కూటీపెప్ లో కొత్త ఎడిషన్‌ను లాంచ్ చేసింది. తన స్కూటీ బ్రాండ్‌కు 25 సంవత్సరాల పూర్తైన సందర్భంగా కొత్త అపడేట్స్‌తో సరికొత్తగా టీవీఎస్ స్కూటీ పెప్ ప్లస్‌ను ఆవిష్కరించింది. దీని ధర రూ. 44,764 (ఎక్స్-షోరూమ్ న్యూఢిల్లీ) గా నిర్ణయించింది. మాటే ఎడిషన్‌ను రెండు రంగుల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. 3డీ ఎంబ్లం, ప్రెష్ గ్రాఫిక్స్, సీట్ల మార్పు తదితర రిఫ్రెష్ లుక్‌లో స్వల్ప మార్పులు తప్ప టీవీఎస్ స్కూటీ పెప్ ప్లస్‌లో యాంత్రికంగా పెద్ద మార్పులేవీ లేవు. 87.8 సీసీ ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఎకో థ్రస్ట్ ఇంజిన్, 4.8 బిహెచ్పి, 5.8 ఎన్ఎమ్ పీక్ టార్క్ కీలక ఫీచర్లుగా ఉన్నాయి. ఎగుడుదిగుడు రోడ్లపై కూడా సునాయాసంగా ప్రయాణించేందుకు టెలిస్కోపిక్ సస్పెన్షన్‌తోపాటు వెనుక భాగంలో సింగిల్ షాక్‌తో వస్తుంది. సీబీఎస్, డ్రమ్ బ్రేక్‌లను ఇరువైపులా అమర్చింది. టీవీఎస్ స్కూటీ పెప్ ప్లస్‌లో మొబైల్ ఛార్జర్ సాకెట్, సైడ్ స్టాండ్ అలారం, అండర్-సీట్ స్టోరేజ్ హుక్స్, ఓపెన్ గ్లోవ్ బాక్స్, బ్రాండ్ పేటెంట్ పొందిన 'ఈజీ' స్టాండ్ టెక్నాలజీ లాంటి అధునాతన ఫీచర్లు జోడించింది. అలాగే 30 శాతం స్కూటీ బరువు కూడా తగ్గించింది. కాగా పాతికేళ్ల క్రితం మహిళా రైడర్ల కోసం టీవీఎస్ స్కూటీ ఎంట్రీ లెవల్ స్కూటర్ విభాగంలోకి ఎంట్రీ ఇచ్చి ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది. భారతదేశంలో ఎక్కువ జనాదరణ పొందిన స్కూటర్లలో ఒకటిగా స్కూటీ పెప్ కొనసాగుతోంది. -
టీవీఎస్ మోటార్ లాభం 6 శాతం డౌన్
న్యూఢిల్లీ: టీవీఎస్ మోటార్ కంపెనీ నికర లాభం (కన్సాలిడేటెడ్) ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–.జూన్ క్వార్టర్(2019–20, క్యూ1)లో 6 శాతం తగ్గింది. గత క్యూ1లో రూ.160 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ. 151కోట్లకు చేరిందని టీవీఎస్ మోటార్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.4,626 కోట్ల నుంచి రూ.5,026 కోట్లకు పెరిగిందని పేర్కొంది. మొత్తం వ్యయాలు రూ.4,386 కోట్ల నుంచి రూ.4,793 కోట్లకు చేరాయని తెలిపింది. గత క్యూ1లో 8.93 లక్షలుగా ఉన్న మొత్తం టూ, త్రీ వీలర్ల అమ్మకాలు (ఎగుమతులతో కలుపుకొని) ఈ క్యూ1లో 8.84 లక్షలకు తగ్గాయని తెలిపింది. బైక్‌ల అమ్మకాలు 8 శాతం పెరిగి 4.17 లక్షలకు, స్కూటర్ల అమ్మకాలు 2 శాతం వృద్ధితో 2.95 లక్షలకు, త్రీ వీలర్ల అమ్మకాలు 11 శాతం వృద్ధితో 40,000కు పెరిగాయని పేర్కొంది. ఎగుమతులు మాత్రం భారీగా తగ్గాయని, అందుకనే మొత్తం అమ్మకాలు క్షీణించాయని వివరించింది. నికర లాభం 6 శాతం తగ్గడంతో బీఎస్ఈలో టీవీఎస్ మోటార్ షేర్ 4% నష్టంతో రూ.380 వద్ద ముగిసింది. -
మార్కెట్లోకి ‘ఇథనాల్’ టీవీఎస్ అపాచీ
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘టీవీఎస్ మోటార్’.. తాజాగా తన పాపులర్ మోడల్ అపాచీలో ‘ఇథనాల్’ వెర్షన్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ‘అపాచీ ఆర్టీఆర్ 200 ఫై ఈ100’ పేరిట శుక్రవారం విడుదలైన ఈ అధునాతన బైక్... ఇథనాల్ ఇంధనం ఆధారంగా నడుస్తుంది. ప్రారంభ ధర రూ.1.2 లక్షలు. దేశవ్యాప్తంగా ఇథనాల్ అందుబాటులో లేనందున ప్రస్తుతానికి చెరుకు పంటకు ప్రధాన రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, కర్ణాటకల్లో ఈ బైక్‌ను విడుదల చేసినట్లు కంపెనీ తెలియజేసింది. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ వేణు శ్రీనివాసన్ మాట్లాడుతూ.. ‘ద్విచక్ర వాహన పరిశ్రమ పెట్రోల్, డీజిల్ బైక్‌ల నుంచి నెమ్మదిగా పర్యావరణ అనుకూల ఇంధనాలవైపునకు అడుగులు వేస్తోంది. కంపెనీలు విద్యుత్, హైబ్రిడ్‌తో పాటు ఇతర ప్రత్యామ్నాయ ఇంధనాల దిశగా దృష్టి సారిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఇథనాల్ కీలక పాత్ర పోషించనుందని భావిస్తున్నాం. ఈ కారణంగానే.. ఈ బైక్‌ను ప్రవేశపెట్టాం’ అని అన్నారు. త్వరలోనే ఇథనాల్ పంప్స్.. పెట్రోల్ బంకుల మాదిరిగా త్వరలోనే దేశవ్యాప్తంగా ఇథనాల్ పంప్స్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఇథనాల్ బైక్ విడుదల కార్యక్రమానికి హజరైన ఆయన.. పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖను ఇథనాల్ పంప్స్ ఏర్పాటు చేయాలని కోరనున్నట్లు తెలిపారు. -
టీవీఎస్ మోటార్ లాభం 19 శాతం డౌన్
న్యూఢిల్లీ: టీవీఎస్ మోటార్ కంపెనీ నికర లాభం (స్టాండ్అలోన్) గత ఆర్థిక సంవత్సరం (2018–19) జనవరి–మార్చి క్వార్టర్లో 19 శాతం తగ్గింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017–18) క్యూ4లో రూ.166 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.134 కోట్లకు తగ్గిందని టీవీఎస్ మోటార్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.4,007 కోట్ల నుంచి 9 శాతం వృద్ధితో రూ.4,384 కోట్లకు పెరిగింది. మొత్తం టూ వీలర్, త్రీ వీలర్ అమ్మకాలు 8.89 లక్షల నుంచి 9.07 లక్షలకు పెరిగాయి. ఎబిటా రూ.295 కోట్ల నుంచి 4.4 శాతం వృద్ధితో రూ.308 కోట్లకు పెరిగింది. ఎబిటా మార్జిన్ 7 శాతంగా నమోదైంది. ఏడాది అమ్మకాలు 37.57 లక్షలు ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017–18లో రూ.663 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 1 శాతం పెరిగి రూ.670 కోట్లకు పెరిగిందని కంపెనీ తెలిపింది.ఆదాయం రూ.15,519 కోట్ల నుంచి రూ.18,210 కోట్లకు ఎగసిందని వివరించింది. మొత్తం టూ వీలర్ అమ్మకాలు 33.67 లక్షల నుంచి 37.57 లక్షలకు చేరాయని పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో టీవీఎస్ మోటార్ కంపెనీ 4 శాతం నష్టంతో రూ.486 వద్ద ముగిసింది. -
టీవీఎస్ మోటార్ మెరుగైన ఫలితాలు
2018-19 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ద్విచక్ర వాహన దిగ్గజం టీవీఎస్ మోటార్ మెరుగైన ఫలితాలను ప్రకటించింది. విశ్లేషకులు అంచనాలను బీట్ చేస్తూ నికర లాభాలను నమోదు చేసింది. ఈ ఏడాది క్యూ3(అక్టోబర్-డిసెంబర్)లో టీవీఎస్ మోటార్ నికర లాభం 15 శాతం ఎగసి రూ. 178 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం సైతం 26 శాతం పుంజుకుని రూ. 4664 కోట్లకు చేరింది. ఇబిటా 25 శాతం జంప్‌చేసి రూ. 376 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో టీవీఎస్ మోటార్ షేరు 3 శాతం పెరిగి రూ. 555 వద్ద ముగిసింది. తమ లేటెస్ట్ వాహనాలను మంచి ఆదరణ లభించిందని కంపెనీ ఫలితాల సందర్భంగా ప్రకటించింది. ఫలితంగా క్యూ3 పోలిస్తే క్యూ4లో మంచి లాభాలనార్జించినట్టు పేర్కొంది. -
మార్కెట్లోకి టీవీఎస్ సరికొత్త ‘వీగో’
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన సంస్థ టీవీఎస్ మోటార్స్ అధునాతన ‘వీగో’ స్కూటర్‌ను గురువారం మార్కెట్లోకి విడుదల చేసింది. నూతన వెర్షన్లో 20 లీటర్ల యుటిలిటీ బాక్స్, స్పోర్టి వీల్–రిమ్ స్టిక్కర్స్, పాస్–బై స్విచ్, నిర్వహణ అవసరంలేని బ్యాటరీ వంటి నూతన ఫీచర్లు ఉన్నట్లు సంస్థ వైస్ ప్రెసిడెంట్ అనిరుధ్ హల్దార్ వివరించారు. 110 సీసీ, పూర్తి మెటల్ బాడీ, అధునాతన డిజిటల్ స్పీడోమీటర్ కలిగిన ఈ స్కూటర్ ధర రూ.53,027 వద్ద నిర్ణయించినట్లు తెలిపారు. ప్రత్యేకించి మారుతున్న యువత అభిరుచులకు తగినట్లుగా స్కూటర్ డిజైన్ అయిందని వ్యాఖ్యానించారు. -
ఫలితాలు, అంతర్జాతీయ సంకేతాలే కీలకం..!
ముంబై: కొనసాగుతున్న కార్పొరేట్ కంపెనీల తొలిత్రైమాసిక ఫలితాలు, వెంటాడుతున్న వాణిజ్య యుద్ధ భయాలు, విదేశీ నిధుల ప్రవాహ దిశలే ఈ వారంలో మార్కెట్ గమనాన్ని నిర్దేశించనున్నాయని దలాల్ స్ట్రీట్ పండితులు చెబుతున్నారు. ఇదే సమయంలో ముడిచమురు ధరలు, పార్లమెంట్ వర్షాకాల సమావేశ పరిణామాలు సైతం మార్కెట్‌పై ప్రభావం చూపనున్నాయని అంటున్నారు. వాణిజ్య యుద్ధ ఆందోళనలు పెరగడం వంటి ప్రతికూల అంశాల నేపథ్యంలో మార్కెట్ స్వల్పకాలం నుంచి మధ్యకాలం వరకు ఒడిదుడుకుల మధ్యనే కొనసాగుతుందని ఎస్ఎమ్సీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ అడ్వైజర్స్ చైర్మన్ డీ కే అగర్వాల్ అంచనావేశారు. రూపాయి మారకం విలువ, ముడిచమురు ధరలు, వర్షాకాల సమావేశం నుంచి అందే సంకేతాలు మార్కెట్‌ను నడిపించనున్నాయని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ వారంలో ఎస్బీఐ, అదానీ పోర్ట్స్, బ్రిటానియా ఇండస్ట్రీస్, మహీంద్రా అండ్ మహీంద్రా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, టీవీఎస్ మోటార్, సిప్లా, లుపిన్, భారత్ ఫోర్జ్, కమిన్స్, జెట్ ఎయిర్వేస్ ఫలితాలను వెల్లడించనుండగా.. ఇవి మార్కెట్ దిశకు కీలకమని అన్నారు. ‘ వాల్యూయేషన్స్ అధికంగా ఉన్నప్పటికీ.. ఆశాజనక రుతుపవనాల సూచనలు, ఫలితాలు గ్రామీణ ప్రాంత వినిమయ రంగ షేర్ల ర్యాలీకి ఆస్కారం ఇవ్వనున్నాయి.’ అని డెల్టా గ్లోబల్ పాట్నర్స్ ప్రిన్సిపల్ పాట్నర్ దేవేంద్ర నెవ్గి విశ్లేషించారు. ‘నాణ్యమైన మిడ్‌క్యాప్ షేర్లలోనికి నిధుల ప్రవాహం కొనసాగుతుంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి చూస్తే.. లార్జ్‌క్యాప్ షేర్ల వాల్యూయేషన్స్ ప్రీమియం కంటే ఈ రంగ షేర్ల ప్రీమియం తగ్గుతున్న క్రమంలో పెట్టుబడులు కొనసాగుతాయి.’ అని భావిస్తున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధన విభాగం హెడ్ వినోద్ నాయర్ అన్నారు. ఆర్బీఐ చర్యలు ఆహ్వానించదగినవే.. అధిక సప్లై కారణంగా ముడిచమురు ధరలు తగ్గనున్నాయని, ఆశాజనక క్యూ1 ఫలితాలు మార్కెట్ ర్యాలీకి సహకరిస్తాయని భావిస్తున్నట్లు కొటక్ సెక్యూరిటీస్ కరెన్సీ విభాగం డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ అనినిద్య బెనర్జీ వెల్లడించారు. ద్రవ్యోల్బణ, వృద్ధిరేటు మధ్య సమతుల్యం సాధించడం కోసం ఆర్బీఐ నెమ్మదిగా వడ్డీరేట్లను పెంచడం మార్కెట్‌కు సానుకూలంగా ఉండనుందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. సురక్షిత లార్జ్‌క్యాప్, వినిమయ రంగాలకు చెందిన షేర్లు మంచి పనితీరును ప్రదర్శించనున్నాయని అన్నారు. డాలరుతో రూపాయి మారకం విలువ 68.25 నుంచి 69 మధ్యలో ఉండే అవకాశం ఉందని వెల్లడించారు. గత శుక్రవారం రూపాయి విలువ 68.66 వద్ద ముగిసింది. ఎఫ్ఐఐల నికర విక్రయాలు... ఆగస్టు 3తో ముగిసిన వారానికి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) 140 మిలియన్ డాలర్లు (రూ.962) కోట్ల విలువైన పెట్టుబడిని స్టాక్ మార్కెట్ నుంచి ఉపసంహరించుకున్నారు. అయితే జూలై నెల మొత్తంమీద నికర కొనుగోలుదారులుగా నిలిచారు. రూ.2,312 కోట్ల పెట్టుబడులను పెట్టినట్లు డిపాజిటరీ డేటా ద్వారా వెల్లడయింది. ఈక్విటీ మార్కెట్లో రూ.2,264 కోట్లు.. డెట్ మార్కెట్లో రూ.48 కోట్లు పెట్టుబడి చేశారు. ఏప్రిల్–జూన్ కాలంలో ఈక్విటీ, డెట్‌లో కలిపి రూ.61,000 కోట్లను వీరు ఇన్వెస్ట్ చేశారు. మార్చిలో రూ.2,662 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. 11,407 పాయింట్ల వద్ద తక్షణ నిరోధం..! ‘నిఫ్టీ తక్షణ నిరోధ స్థాయి 11,407 పాయింట్ల వద్ద ఉండగా.. మద్దతు స్థాయి 11,235 పాయింట్ల వద్ద ఉంది.’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసని విశ్లేషించారు. నేడే హెచ్డీఎఫ్సీ ఏఎమ్‌సీ లిస్టింగ్ రూ.2,800 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఈ నెల 25న ప్రైమరీ మార్కెట్‌కు వచ్చి 27 నాటి ముగింపు సమయానికి 83 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబైన హెచ్డీఎఫ్సీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ (ఏఎమ్‌సీ) ఐపీఓ ఇవాళ (సోమవారం) స్టాక్ మార్కెట్లో లిస్టింగ్‌కు రానుంది. -
టీవీఎస్ మోటార్ లాభం 31 శాతం అప్
న్యూఢిల్లీ: టీవీఎస్ మోటార్ కంపెనీ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చి క్వార్టర్లో 31 శాతం పెరిగింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2016–17)క్యూ4లో రూ.127 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.166 కోట్లకు పెరిగిందని టీవీఎస్ కంపెనీ పేర్కొంది. ఆదాయం రూ.3,076 కోట్ల నుంచి రూ.3,993 కోట్లకు ఎగసిందని కంపెనీ సీఈఓ, ప్రెసిడెంట్ కె.ఎన్. రాధాకృష్ణన్ చెప్పారు. అమ్మకాలు 32 శాతం అప్... మొత్తం అమ్మకాలు 6.74 లక్షల నుంచి 32% వృద్ధితో 8.89 లక్షలకు చేరాయని రాధాకృష్ణన్ చెప్పారు. బైక్‌ల అమ్మకాలు 2.15 లక్షల నుంచి 61% వృద్ధితో 3.46 లక్షలకు, స్కూటర్ల అమ్మకాలు 2.23 లక్షల నుంచి 26 శాతం వృద్ధితో 2.80 లక్షలకు పెరిగాయని తెలిపారు. మొత్తం ఎగుమతులు 1.11 లక్షల నుంచి 45% పెరిగి 1.61 లక్షలకు ఎగిశాయని వివరించారు. గత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రెండు మధ్యంతర డివిడెండ్లు(మొత్తం డివిడెండ్ ఒక్కో షేర్‌కు రూ.3.30) ఇచ్చామని, తాజాగా ఎలాంటి డివిడెండ్‌ను ఇవ్వడం లేదని తెలిపారు. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2016–17లో రూ.558 కోట్లుగా ఉన్న స్టాండెలోన్ లాభం గత ఆర్థిక సంవత్సరంలో 19% వృద్ధితో రూ.663 కోట్లకు ఎగసిందని పేర్కొన్నారు. ఆదాయం రూ.13,190 కోట్ల నుంచి రూ.15,473 కోట్లకు పెరిగిందని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.700 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నామని, గత ఆర్థిక సంవత్సరం పెట్టుబడులతో పోల్చితే ఇది 55 శాతం అధికమని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. కొత్త ఉత్పత్తులు, ఉత్పత్తి సామర్థ్య విస్తరణ, కొత్త టెక్నాలజీ, భారత్ స్టేజ్ ఫోర్ అప్‌గ్రెడేషన్ నిమిత్తం ఈ పెట్టుబడులు వినియోగిస్తామని వివరించారు. కాగా ముడి పదార్థాల ధరలు బాగా పెరిగాయని, వాహనాల ధరలను పెంచే అవకాశాలున్నాయని కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కె. గోపాల దేశికన్ చెప్పారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో టీవీఎస్ మోటార్ కంపెనీ షేర్ 1.6 శాతం నష్టంతో రూ. 611 వద్ద ముగిసింది. -
టీవీఎస్ కొత్త స్కూటర్... ప్రత్యేకతలివే
సాక్షి, ముంబై: ద్విచక్ర వాహన తయారీదారు టీవీఎస్ మోటారు కొత్త స్కూటర్‌ను లాంచ్ చేసింది. టీవీఎస్ ఎన్ టాక్ పేరుతో తీసుకొచ్చిన ఫ్లాగ్షిప్ కొత్త స్పోర్టీ స్కూటర్ ధరను రూ. 58,750 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించింది. ఇండియన్ స్కూటర్ మార్కెట్లో ఇదివరకెన్నడూలేని కొత్త ఫీచర్లను జోడించి మరీ దీన్ని అందుబాటులోకి తెచ్చింది. కొత్త ఇంజిన్, స్మార్ట్‌ఫీచర్లు, అత్యాధునిక సౌకర్యాలు, స్టయిలిష్ లుక్ దీని సొంతం. ముఖ్యంగా బ్లూటూత్ కనెక్టివిటీతో వస్తున్న మొట్టమొదటి స్కూటర్ ఇదే. స్కూటర్ సెగ్మెంట్లో తొలిసారిగా ప్రవేశపెట్టిన టీవీఎస్ అధునాతన 'స్మార్ట్జోనెక్ట్' టెక్నాలజీ ప్లాట్‌ఫాంతో దీన్ని రూపొందించినట్టు కంపెనీ ప్రకటించింది. 125 సీసీ ఇంజిన్ 9.4 పీఎస్ పవర్, 10.5ఎన్ ఎం టార్క్, బ్లూ టూత్ కనెక్టివిటీ ప్రధాన పీచర్లుగా ఉన్నాయి. అంతేకాదు కాలర్ఐడీ, పార్కింగ్ లోకేషన్ అసిస్టెంట్, ఫుల్లీ-డిజిటల్ ఎల్సీడీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ద్వారా నావిగేషన్ సహాయాన్ని అందిస్తుంది. షార్ప్ హెడ్ లాంప్, డే టైం రన్నింగ్ లైట్ లాంప్, ఎల్ఈడీ టెయిల్ ట్యాంప్, 12 అంగుళాల అల్లాయ్ వీల్స్ లాంటి ఫీచర్లు, డ్యుయల్ టోన్ పెయింట్ పథకాలతో మొత్తం డిజైన్ చాలా అద్భుతంగా కనిపిస్తోంది. ఇక పోటీపరంగా చూస్తే 2018 ఆటో షోలో లాంచ్ చేయనున్న హోండా యాక్టివా, సుజుకి యాక్సెస్‌కి గట్టి పోటీ కానుంది. -
టీవీఎస్ విక్టర్ ప్రీమియం బైక్..బడ్జెట్ ధర
సాక్షి, ముంబై: ప్రముఖ టూవీలర్ మేకర్ టివిఎస్ మోటార్ కొత్త విక్టర్ ప్రీమియం ఎడిషన్ బైక్‌ను లాంచ్ చేసింది . మేటీ సిరీస్‌లో కొత్త విక్టర్ ప్రీమియం ఎడిషన్‌ను మంగళవారం విడుదల చేసింది. రెండు కొత్త రంగుల్లో , అదనపు ఫీచర్లతో బడ్జెట్ ధరకే అందిస్తోంది. మాటీ బ్లూ విత్ వైట్గ్రాఫిక్స్, మాటీ సిల్వర్ విత్ రెడ్ గ్రాఫిక్స్‌తో రూ. 55,890 (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) కి ధరకే లభిస్తుంది. 110సీసీ బైక్ సెగ్మెంట్లో విభాగంలో సెప్టెంబరు 2017 లో లాంచ్ చేసిన టివిఎస్ విక్టర్ కొత్త ప్రీమియం ఎడిషన్‌లో న్యూస్టయిల్తో కొత్త ఆకర్షణగా నిలవనుంది. ముఖ్యంగా మెకానికల్ పెద్దగా మార్పులేమీ చేయకపోయినప్పటికీ బైక్స్ విభాగంలో బేసిక్ ఫీచర్ఆప్షనల్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌తో పాటు కొత్త గ్రాఫిక్స్ జోడించి అవుట్‌లుక్‌ను అప్ డేట్ చేసింది. కొత్త ప్రీమియమ్ ఎడిషన్‌లో 3 వాల్వ్ ఎయిర్ కూల్డ్ ఇంజీన్, ఫోర్-స్పీడ్ గేర్ బాక్స్ 9.5పీఎస్ పవర్, 9.4ఎన్ఎం టార్క్‌ను తదితర ఫీచర్లను అందిస్తుంది. లీటర్‌కు 72 కి.మీ మైలేజీ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. -
మార్కెట్లోకి ‘అపాచీ ఆర్ఆర్ 310’
చెన్నై: ప్రముఖ వాహన కంపెనీ ‘టీవీఎస్ మోటార్’ తాజాగా సూపర్ ప్రీమియం బైక్స్ విభాగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ‘అపాచీ ఆర్ఆర్ 310’ పేరుతో సరికొత్త స్పోర్ట్స్ బైక్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ.2.05 లక్షలు (ఎక్స్‌షోరూమ్). అపాచీ ఆర్ఆర్ 310లో 4 స్ట్రోక్, 4 వాల్వ్, సింగిల్ సిలిండర్, రివర్స్ ఇన్క్లైన్డ్, 312 సీసీ ఇంజిన్‌ను అమర్చినట్లు కంపెనీ తెలిపింది. ఇందులో ట్విన్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, డ్యూయెల్ చానల్ ఏబీఎస్, డిస్క్ బ్రేక్స్, ఫుల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్, ఎల్ఈడీ టెయిల్ లైట్, ఎల్ఈడీ టర్న్ సిగ్నల్స్, హై క్వాలిటీ స్విచ్‌గేర్, అప్‌సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్, ఎలక్ట్రానిక్ ఫ్యూయెల్ ఇంజెకŠష్న్, 6–స్పీడ్ గేర్‌బాక్స్ వంటి పలు ప్రత్యేకతలున్నాయని వివరించింది. ఎరుపు, నలుపు రంగుల్లో లభ్యంకానున్న ఈ బైక్ గరిష్ట వేగం గంటకు 163 కిలోమీటర్లని పేర్కొంది. కాగా ఈ నెల చివరకు ఈ బైక్స్ రోడ్లపై పరిగెత్తనున్నాయి. టీవీఎస్ మోటార్ కంపెనీ 500 సీసీలోపు విభాగంలో బైక్స్ తయారీ కోసం 2013 ఏప్రిల్‌లో బీఎండబ్ల్యూ మోటొరాడ్తో భాగస్వామ్యం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఒప్పందంలో భాగంగా రూపొందిన తొలి బైక్ ఇదే. త్వరలో అపాచీ 160 సీసీలో కొత్త వెర్షన్: అపాచీ 160 సీసీలో త్వరలో అప్డేటెడ్ వేరియంట్‌ను మార్కెట్లోకి తెస్తామని జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుదర్శన్ వేణు తెలిపారు. -
టీవీఎస్ విక్రయ జోరు..
చెన్నై : టూ, త్రీ వీలర్ దిగ్గజం టీవీఎస్ మోటార్ ఏప్రిల్ నెలలో తన అమ్మకాలను 8.46 శాతం పెంచేసుకుంది. నగరానికి చెందిన ఈ కంపెనీ మొత్తంగా ఎగుమతులతో కలిపి 2,46,310 వెహికల్స్ ను విక్రయించింది. గతేడాది ఇదే కాలంలో ఈ విక్రయాలు 2,27,096 యూనిట్లగా మాత్రమే ఉన్నాయి. దేశీయ మార్కెట్ లో కంపెనీ టూవీలర్స్ విక్రయాలు 3.96 శాతం పెరిగి 2,05,522 యూనిట్లుగా ఉన్నాయి. 2016 ఏప్రిల్ లో ఇవి 1,97,692 యూనిట్లు మాత్రమే. స్కూటర్ అమ్మకాలు కూడా 28.57 శాతం పెరిగినట్టు కంపెనీ వెల్లడించింది. మోటార్ సైకిల్ విక్రయాల వృద్ధిలో 10.38 శాతం పెరిగి, 99,890 యూనిట్లుగా రికార్డు అయినట్టు తెలిపింది. ఇక ఎగుమతులు విషయానికి వస్తే గతేడాది 28,354 యూనిట్లుగా ఉన్న కంపెనీ విక్రయాలు ఈ ఏడాది ఏప్రిల్ నెలలో 41.8 శాతం పెరిగి 40,221 యూనిట్లగా రికార్డైనట్టు కంపెనీ వెల్లడించింది. టూవీలర్ ఎగుమతులు కూడా 43.9 శాతం ఎగిశాయని చెప్పింది. దీంతో గతేడాది 24,658 యూనిట్లుగా ఉన్న టూవీలర్ ఎగుమతులు ఈ ఏడాది 35,485 యూనిట్లుగా నమోదైనట్టు కంపెనీ ప్రకటించింది. త్రీ-వీలర్ వాహన విక్రయాలు కూడా 11.7 శాతం జంప్ చేసి 5,303 యూనిట్లుగా ఉన్నాయి. అయితే నేటి ట్రేడింగ్ లో కంపెనీ ఫ్లాట్ గా ట్రేడైంది. -
నల్లకోటు వదిలి... మోటారు పరిశ్రమకు...
మన దిగ్గజాలు నల్లకోటుతోనే జీవితాంతం కాలం కొనసాగించి ఉంటే, ఆయన న్యాయవాదిగా మాత్రమే మిగిలిపోయేవారు. న్యాయవాద వృత్తి నుంచి బయటపడ్డాక మొదలుపెట్టిన ‘ఉద్యోగ’పర్వంలోనే కొనసాగి ఉంటే మహా అయితే ఒక అధికారిగా రిటైరయ్యేవారు. ఉన్నత లక్ష్యాలేవీ సాధించకుండా అలాగే మిగిలిపోవాలని కోరుకోలేదు టీవీఎస్ అయ్యంగార్. అందుకే ఆయన మోటారు పరిశ్రమకు పునాదులు వేశారు. ఆయన చేతుల మీదుగా ప్రారంభమైన టీవీఎస్ మోటార్స్ ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీగా వెలుగుతోంది. తల్ల వేండం సార్... అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలోని తిరునల్వేలి జిల్లా తిరుక్కురుంగుడిలో 1877 మార్చి 22న సంప్రదాయ తమిళ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు టీవీఎస్ అయ్యంగార్. తండ్రి కోరిక మేరకు లా చదువుకున్నారు. న్యాయవాదిగా కొన్నాళ్లు ప్రాక్టీస్ కూడా చేశారు. అది నచ్చకపోవడంతో ఉద్యోగపర్వంలో పడ్డారు. కొన్నాళ్లు రైల్వేలో, తర్వాత ఒక బ్యాంకులో ఉద్యోగాలు చేశారు. వాటితో సంతృప్తి చెందలేదాయన. సొంతగానే ఏదైనా చేయాలనుకున్నారు. మధురై కేంద్రంగా 1911లో సదరన్ రోడ్‌వేస్ లిమిటెడ్ పేరిట రోడ్డు రవాణా సంస్థ ప్రారంభించారు. దాని ఆధ్వర్యంలో బస్సులు, లారీలు నడిపేవారు. అప్పట్లో మద్రాసు నగరంతో పాటు మధురై, తిరుచ్చి వంటి పట్టణాల్లోనూ ఎడ్లబళ్లు, జట్కాబళ్లు విరివిగా నడిచేవి. వాటిని లాగే గుర్రాలు, ఎద్దుల నాడాలు, వాటికి గుచ్చిన మేకులు తరచుగా ఊడిపోయి రోడ్లపై పడేవి. వాటి వల్ల బస్సులు, లారీల చక్రాలకు పంక్చర్లు పడి అంతరాయం కలిగేది. పంక్చర్లు పడి ఆగిపోయిన బస్సులను ప్రయాణికులే నెట్టాల్సి వచ్చేది. ఈ సమస్యను అధిగమించడానికి టీవీఎస్ అయ్యంగార్ తమ కంపెనీ బస్సులు నడిచే మార్గంలో మాగ్నెటిక్ రోడ్డురోలర్‌ను నడిపేవారు. రోడ్డు రోలర్‌కు అమర్చిన మాగ్నెట్లకు దారిలో పడ్డ మేకులు, నాడాలు అతుక్కునేవి. ప్రయాణికులు నెట్టాల్సిన పని లేకుండానే బస్సులు నిరాటంకంగా నడిచేవి. దాంతో అప్పటి ప్రయాణికులు టీవీఎస్ అయ్యంగార్ను ఆప్యాయంగా ‘తల్ల వేండం సార్’ (నెట్టక్కర్లేదు సార్) అని ఆప్యాయంగా పిలిచేవారు. ఆటోమొబైల్ రంగంలోకి... సదరన్ రోడ్‌వేస్ విజయవంతంగా నడుస్తున్న దశలోనే ఆయన టీవీ సుందరం అయ్యంగార్ అండ్ సన్స్ లిమిటెడ్ పేరిట ఆటోమొబైల్ రంగంలోకి అడుగుపెట్టారు. ఆటోమొబైల్ రంగానికి అవసరమైన సేవలు, ఉత్పత్తులు అందించేందుకు మద్రాస్ ఆటో సర్వీసెస్ లిమిటెడ్, సుందరం మోటార్స్ సంస్థను ప్రారంభించారు. సుందరం మోటార్స్ అప్పట్లో జనరల్ మోటార్స్ ఉత్పత్తి చేసే వాహనాలకు అతిపెద్ద పంపిణీదారుగా ఉండేది. రెండోప్రపంచ యుద్ధం కొనసాగినప్పుడు పెట్రోల్‌కు తీవ్ర సంక్షోభం ఏర్పడింది. ఆ సమయంలో ఇంధన సమస్యను అధిగమించేందుకు అయ్యంగార్ టీవీఎస్ గ్యాస్ ప్లాంట్‌ను నెలకొల్పారు. టీవీఎస్ అయ్యంగార్‌కు ఐదుగురు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు. కొడుకుల్లో ఒకరైన దొరైస్వామి చిన్న వయసులోనే మరణించగా, మిగిలిన నలుగురు కొడుకులూ ఆయన వ్యాపార వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు. టీవీఎస్ గ్రూప్ పలు రంగాలకు విస్తరించి, ఇప్పుడు దేశంలోనే అగ్రగామి వ్యాపార సంస్థల్లో ఒకటిగా ఘనతను చాటుకుంటోంది. గాంధీ చొరవతో కూతురికి పునర్వివాహం టీవీఎస్ అయ్యంగార్ స్వతహాగా సంప్రదాయవాది. ఒకవైపు స్వాతంత్య్రోద్యమం సాగుతున్నా, ఆయన తటస్థంగానే ఉంటూ తన వ్యాపారాలను కొనసాగించేవారు. అయితే, వైద్యుడైన ఆయన అల్లుడు సౌందరరాజన్ ప్లేగు రోగులకు చికిత్స చేసే క్రమంలో అదే వ్యాధికి గురై అకాల మరణం చెందడంతో కూతురు సౌందరం చిన్న వయసులోనే వితంతువుగా మిగిలింది. భర్త మరణం తర్వాత ఆమె మధురై నుంచి ఢిల్లీ వెళ్లి, అక్కడి లేడీ హార్డింజ్ మెడికల్ కాలేజీలో చేరి, మెడిసిన్‌లో డిగ్రీ పూర్తి చేశారు. అక్కడ చదువుకుంటున్న సమయంలోనే గాంధీ సిద్ధాంతాలపై ఆకర్షితురాలయ్యారు. చదువు పూర్తయ్యాక గాంధీ ఆశ్రమానికి వెళ్లి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సౌందరం పరిస్థితి తెలుసుకున్న గాంధీజీ ఆమెకు మళ్లీ వివాహం చేయాలని అయ్యంగార్‌కు సలహా ఇచ్చారు. గాంధీజీ సలహాతో మెత్తబడ్డ అయ్యంగార్ కూతురికి రామచంద్రన్ అనే యువకుడితో పునర్వివాహం జరిపించారు. వయసు మళ్లిన దశలో నలుగురు కొడుకులకు వ్యాపారాలను అప్పగించి, రిటైర్మెంట్ ప్రకటించిన టీవీఎస్ అయ్యంగార్, 1955 ఏప్రిల్ 28న కోడెకైనాల్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. -
సాహస మహిళకు గుర్తుగా స్పెషల్..
ఓ మహిళా సాహస యాత్రకు ప్రతీకగా దేశీయ ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారు టీవీఎస్ మోటార్ స్కూటీ జెస్ట్ నుంచి ఓ స్పెషల్ ఎడిషన్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ప్రత్యేక ఎడిషన్ కు, హిమాలయన్ హైస్ స్పెషల్ ఎడిషన్ గా పేరుపెట్టింది. హిమాలయాల్లోని అత్యంత ఎత్తైన పర్వతం కర్దంగ్ లాను అనామ్ హాసిమ్ జయించడంతో ఈ ప్రత్యేక ఎడిషన్ ను టీవీఎస్ మోటార్స్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ధర ఎక్స్ షోరూం ఢిల్లీలో రూ.46,113గా ఉంటుందని టీవీఎస్ మోటార్స్ తెలిపింది. టీవీఎస్ తీసుకొచ్చిన స్కూటీ జెస్ట్ 110 హిమాలయన్ హైస్, ప్రత్యేకంగా హిమాలయన్ హై బ్రౌన్ కలర్, న్యూ టేప్ సెట్, బాడీ కలర్ మిర్రర్స్, స్విచ్ఛ్ ప్యానెల్ ను కవర్ చేస్తూ బాడీ కలర్ దీనిలో ప్రత్యేకతలు. మొదటిసారిగా ఒక స్కూటర్ లో అనామ్ హాసిమ్ అనే మహిళా రైడర్ హిమాలయాల్లో ఉన్న ఎత్రైన ప్రదేశానికి రైడింగ్ ద్వారా వెళ్లింది. సముద్ర మట్టానికి 18,380 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రదేశానికి అనామ్ హాసిమ్ టీవీఎస్ స్కూటీ జెస్ట్ స్కూటర్ లో చేరుకుంది. జమ్మూ, శ్రీనగర్, కార్గిల్, లెహ్, కార్డంగ్ లాను దాటి చాంగ్ లా నుంచి పెన్ గంగా వరకు ఆమె ఈ స్కూటీపైనే ప్రయాణించింది. అంతా దూరం టీవీఎస్ స్కూటీపై ప్రయాణించిన ఆమె రైడింగ్ లో రికార్డు బద్దలు కొట్టింది. ఈ సాహసానికి గౌరవార్థంగా టీవీఎస్ మోటార్స్ స్కూటీ జెస్ట్ స్కూటార్ ను లిమిటెడ్ ఎడిషన్ గా స్కూటీ జెస్ట్ హిమాలయన్ హైస్ పేరుతో విడుదల చేసింది. 'బండి నడపడం నా ప్యాషన్. కొత్త లక్ష్యాలను చేధించడంలో నేను ఆనందం పొందుతాను. కర్దంగ్ లా వరకు టీవీఎస్ స్కూటీ జెస్ట్ పై ప్రయాణించడం ఓ మరువలేని అనుభూతి. ఇంజిన్ లో ఎక్కడ కూడా నాకు సమస్యలు తలెత్తలేదు. 10వేల అడుగుల ఎత్తులో కూడా ఎలాంటి సమస్య రాలేదు. అయితే కొన్ని ప్రమాదకరమైన మలుపుల్లో, భయంకరమైన వాతావరణంలో, ఈ రికార్డును బ్రేక్ చేయడం నిజంగా చరిత్రాత్మక విజయం' అని ఆమె తెలిపింది. 110సీసీ స్కూటర్ ల్లో అత్యంత ఎత్తైన రహదారిని జయించిన మొదటి స్కూటీ ఇదేనని టీవీఎస్ మోటార్ పేర్కొంది. హిమాలయన్ హైస్ స్పెషల్ ఎడిషన్ ను ప్రారంభించడం చాలా ఆనందాయకంగా ఉందని తెలిపింది. -
టీవీఎస్ మోటార్ నుంచి కొత్త ‘విక్టర్’
ప్రారంభ ధర రూ.49,490 న్యూఢిల్లీ: ప్రముఖ టూవీలర్ కంపెనీ టీవీఎస్ మోటార్ తాజాగా కొత్త అప్డేటెడ్ ‘విక్టర్’ బైక్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర శ్రేణి రూ.49,490- రూ.51,490గా (ఎక్స్ షోరూమ్ ఢిల్లీ) ఉంది. ఈ బైక్‌లో అడ్వాన్స్డ్ త్రీ వాల్వ్ ఎకోథ్రస్ట్ ఇంజిన్, ఎలక్ట్రిక్ స్టార్ట్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయని కంపెనీ తెలిపింది. ఇది లీటరుకు 76 కిలోమీటర్ల మైలేజ్‌ని ఇస్తుందని పేర్కొంది. 2002లో మొదటిసారిగా మార్కెట్లోకి తీసుకువచ్చిన విక్టర్ బైక్‌లో మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ వస్తున్నామని కంపెనీ తెలిపింది. కస్టమర్లకు స్టైలిష్‌గా, అధునాతన టెక్నాలజీతో కూడిన బైక్‌ను అందించడంలో ముందుంటామని పేర్కొంది. -
స్నాప్‌డీల్ లో టీవీఎస్ బైక్స్
చెన్నై: ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ టీవీఎస్ మోటార్ తాజాగా ఈ-కామర్స్ సంస్థ స్నాప్‌డీల్‌తో జతకట్టింది. దీంతో టీవీఎస్ మోటార్‌కు చెందిన తొమ్మిది టూవీలర్ ఉత్పత్తులు ఇకమీదట స్నాప్‌డీల్.కామ్‌లో వినియోగదారులకు అందుబాటులో ఉండనున్నాయి. కస్టమర్లు స్నాప్‌డీల్ మోటార్స్ ప్లాట్ఫామ్లోకి వెళ్లి వారికి న చ్చిన మోడల్‌ను, డీలర్‌షిప్‌ను ఎంపిక చేసుకోవచ్చు. కాగా ఇప్పుడు మిచెలిన్ టైర్స్‌కు చెందిన ప్యాసెంజర్ కారు టైర్లు కూడా స్నాప్‌డీల్‌లో అందుబాటులో ఉన్నాయి. -
ఆటోమొబైల్ జోరు..
డిసెంబర్లో పెరిగిన వాహన విక్రయాలు సంస్కరణలు కావాలంటున్న కంపెనీలు న్యూఢిల్లీ: వాహన విక్రయాలు గత ఏడాది డిసెంబర్లో దుమ్ము దులిపాయి. ఎక్సైజ్ సుంకం రాయితీలు ముగియనుండడం, ఏడాది చివరలో నిల్వలు తగ్గించుకోవడానికి కంపెనీలు/డీలర్లు డిస్కౌంట్లు ఆఫర్ చేయడం, మెరుగుపడుతున్న ఆర్థిక పరిస్థితుల తదితర అంశాల కారణంగా పలు కంపెనీల వాహన విక్రయాలు పెరిగాయి. దేశీయ అమ్మకాలతో పాటు మొత్తం అమ్మకాలు(దేశీయ అమ్మకాలు, ఎగుమతులు కలిపి) కూడా పెరిగాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టయోటా, టీవీఎస్ మోటార్, హీరో మోటోకార్ప్ కంపెనీల విక్రయాలు పెరగ్గా, జనరల్ మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా విక్రయాలు తగ్గాయి. బడ్జెట్‌పై ఆశలు అధికంగా ఉన్న వడ్డీరేట్లు, బలహీనంగా ఉన్న ఆర్థిక పరిస్థితుల వల్ల వాహనాలకు డిమాండ్ తక్కువగానే ఉందని జనరల్ మోటార్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ పి. బాలేంద్రన్ వ్యాఖ్యానించారు. ఎక్సైజ్ సుంకం రాయితీలను ఉపసంహరించడం వాహన పరిశ్రమపై తీవ్రమైన ప్రభావాన్నే చూపుతుందని ఆయన అబిప్రాయపడ్డారు. రానున్న బడ్జెట్లో ప్రభుత్వం భారీ స్థాయి నజరానాలు ప్రకటించకపోతే, వాహన పరిశ్రమ స్వల్పకాలంలో కోలుకునే సూచనలేమీ లేవని పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇండియాలో వాహన రంగం కీలకమైనదని, అందుకని ఈ రంగానికి సంబంధించి సంస్కరణలు రానున్న బడ్జెట్లో ఉండగలవన్న ఆశాభావాన్ని టయోటా కిర్లోస్కర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) ఎన్. రాజ వ్యక్తం చేశారు. హ్యుందాయ్ రికార్డ్ అమ్మకాలు గత ఏడాది వాహన పరిశ్రమకు గడ్డుకాలమని హ్యుందాయ్ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్(సేల్స్ అండ్ మార్కెటింగ్) రాకేశ్ శ్రీవాత్సవ చెప్పారు. అయినప్పటికీ, గత ఏడాది 4.11 లక్షల ప్రయాణికుల కార్లను విక్రయించామని, ఇది తమ కంపెనీ చరిత్రలో రికార్డని పేర్కొన్నారు. ప్రయాణికుల కార్ల విభాగంలో 22% మార్కెట్ వాటా సాధించామని వివరించారు. దేశీయ అమ్మకాలు 15%, ఎగుమతులు 30% చొప్పున పెరిగాయని పేర్కొన్నారు. గత ఏడాది డిసెంబర్ అమ్మకాలకు సంబంధించి వివిధ కంపెనీల విశేషాలు.. ⇒మారుతీ సుజుకీ దేశీయ విక్రయాలు 13%, ఎగుమతులు 3 రెట్లు చొప్పున పెరిగాయి. ⇒మహీంద్రా దేశీయ అమ్మకాలు 7 శాతం తగ్గాయి. అయితే స్కార్పియో, ఎక్స్‌యూవీ 500, జైలో, బొలెరో, వెరిటో మోడళ్లతో కూడిన ప్రయాణికుల వాహన విభాగం విక్రయాలు 5 శాతం వృద్ధిని సాధించాయి. ఫోర్ వీల్ వాణిజ్య వాహనాల విక్రయాలు 15 శాతం, ఎగుమతులు 32% చొప్పున తగ్గాయి. ఈ ఏడాది కొత్త మోడళ్లను రంగంలోకి తెస్తామని, అమ్మకాలు పుంజుకుంటాయని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది. ⇒ టయోటా దేశీయ విక్రయాలు 10% పెరిగాయి. ⇒మహీంద్రా ట్రాక్టర్స్ దేశీయ అమ్మకాలు 31% పడిపోయాయి. ఎగుమతులు 52% పెరిగాయి. ⇒రాయల్ ఎన్ఫీల్డ్ దేశీయ విక్రయాలు 48 శాతం, ఎగుమతులు 86 శాతం చొప్పున పెరిగాయి ⇒టీవీఎస్ మోటార్ మొత్తం టూవీలర్ల దేశీయ విక్రయాలు 19% పెరిగాయి. స్కూటర్ల అమ్మకాలు 25 శాతం, బైక్‌ల అమ్మకాలు 22%, మొత్తం టూవీలర్ల అమ్మకాలు 19% చొప్పున పెరిగాయి. ⇒2013లో 61,83,849గా ఉన్న హీరో వాహన విక్రయాలు 2014లో 66,45,787కు పెరిగాయి. -
మార్కెట్లోకి టీవీఎస్ స్కూటీ జెస్ట్
చెన్నై: టీవీఎస్ మోటార్ కంపెనీ స్కూటీ మోడల్లో అప్‌గ్రేడెడ్ వేరియంట్, స్కూటీ జెస్ట్‌ను బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ 110 సీసీ స్కూటర్ ధర రూ.42,300(ఎక్స్ షోరూమ్, న్యూఢిల్లీ) అని టీవీఎస్ మోటార్ కంపెనీ వైస్ చైర్మన్, ఎండీ వేణు శ్రీనివాసన్ చెప్పారు. ఈ స్కూటర్ 62 కి.మీ. మైలేజీనిస్తుందని పేర్కొన్నారు. గత 15 ఏళ్లుగా స్కూటీ బ్రాండ్ అందరికీ సుపరిచితమేనని, ఇప్పుడందిస్తున్న స్కూటీ జెస్ట్ స్కూటీ స్థాయిని ఒక మెట్టు పైకి తీసుకెళుతుందని వివరించారు. మరింత పవర్, మరింత సౌకర్యం కావాలనుకునే వారి కోసం ఈ స్కూటీ జెస్ట్‌ను అందిస్తున్నామని పేర్కొన్నారు. గతంలో విడుదల చేసిన స్కూటీ పెప్ ప్లస్, స్కూటీ స్ట్రీక్ విక్రయాలను కొనసాగిస్తామని వివరించారు. తమ ఇతర స్కూటర్లు-జూపిటర్, వెగోలకు ఈ స్కూటీ జెస్ట్ పోటీ కాదని శ్రీనివాసన్ స్పష్టం చేశారు. వెగో స్కూటర్‌ను ఒక్క బిడ్డ ఉన్న వివాహితుల కోసం రూపొందించామని, అలాగే స్కూటీ జెస్ట్‌ను 18 నుంచి 25 ఏళ్ల యువతులను లక్ష్యంగా పెట్టుకొని అందిస్తున్నామని వివరించారు. ఈ మూడు స్కూటర్లు ఒకే ప్లాట్‌ఫామ్‌పై తయారు చేసినప్పటికీ, దేనికదే ప్రత్యేకమైనవేనని పేర్కొన్నారు. మరో ఆరు నెలల్లో విక్టర్ మోటార్‌సైకిల్‌లో కొత్త వేరియంట్‌ను అందిస్తామని వివరించారు. రూ.70 కోట్ల పెట్టుబడులు భారత వినియోగదారుల అభిరుచులకనుగుణంగా టూ, త్రీ వీలర్లను అందిస్తున్నామని శ్రీనివాసన్ పేర్కొన్నారు. ప్రతీ మూడు నెలలకు ఒక కొత్త మోడల్‌ను మార్కెట్లోకి తేవాలనే కంపెనీ వ్యూహంలో భాగంగా ఈ 110 సీసీ స్కూటీ జెస్ట్‌ను కంపెనీ అందిస్తోంది. ఈ గత క్వార్టర్లో ఈ కంపెనీ స్టార్ సిటీ ప్లస్ మోటార్‌సైకిల్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ప్రస్తుతం తమ మార్కెట్ వాటా 15 శాతమని, దీనిని 18 శాతానికి పెంచుకోవాలనుకుంటున్నామని టీవీఎస్ మోటార్ కంపెనీ సీఈవో కె.ఎన్. రాధాకృష్ణన్ చెప్పారు. -
టీవీఎస్ నికరలాభం రూ. 52 కోట్లు
న్యూఢిల్లీ: టీవీఎస్ మోటర్స్ రూ. 52 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. అంతకుముందు ఏడాది ఇదే కాలానికి కంపెనీ రూ. 33 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. సమీక్షా కాలంలో ఆదాయం రూ.1,752 కోట్ల నుంచి రూ. 2,121 కోట్లకు పెరిగింది. ఏడాది మొత్తం మీద నికరలాభం అంతకుముందే ఏడాదితో పోలిస్తే 197 కోట్ల నుంచి రూ. 186 కోట్లకు తగ్గింది. మంగళవారం బీఎస్ఈలో టీవీఎస్ షేరు 6 శాతం పెరిగి రూ.92 వద్ద ముగిసింది. -
97 శాతం పెరిగిన టీవీఎస్ మోటార్ లాభం
న్యూఢిల్లీ: టీవీఎస్ మోటార్ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్‌లో రూ.88.84 కోట్ల నికర లాభం(స్టాండ్ ఎలోన్) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆర్జించిన నికర లాభం(రూ.45.19 కోట్లు)తో పోల్చితే 97 శాతం వృద్ధి సాధించామని కంపెనీ పేర్కొంది. మెటార్ సైకిళ్ల అమ్మకాల్లో మంచి వృద్ధికి తోడు గ్రూప్ కంపెనీలో మోజారిటీ వాటా విక్రయం కారణంగా ఈ స్థాయి నికర లాభం ఆర్జించామని వివరించింది. ఇక నికర అమ్మకాలు రూ.1,683.41 కోట్ల నుంచి రూ.1,962.03 కోట్లకు పెరిగాయని పేర్కొంది. ఒక్కో షేర్‌కు 65 పైసల మధ్యంతర డివిడెండ్‌ను (65 శాతం) కంపెనీ ప్రకటించింది. టీవీఎస్ ఎనర్జీలో కంపెనీ తన వాటాను విక్రయించింది. ఈ విక్రయంపై రూ.30.28 కోట్ల ఆదాయం వచ్చింది. జూలై-సెప్టెంబర్ కాలానికి మోటార్ సైకిళ్ల అమ్మకాలు 18 శాతం, స్కూటర్ల అమ్మకాలు స్వల్పంగా పెరిగాయని, మొత్తం మీద టూవీలర్ల విక్రయాలు 2 శాతం, ఎగుమతులు 27 శాతం, త్రీ వీలర్ల ఎగుమతులు 85 శాతం చొప్పున వృద్ధి సాధించాయని కంపెనీ తెలిపింది. -
రెండేళ్లయితే.. బైక్ మార్చెయ్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: యువకులు ఆలోచన ల్లోనే కాదు, బైక్‌ల కొనుగోళ్ల విషయంలోనూ వేగంగా దూసుకెళ్తున్నారట. అందుకే 150 సీసీ, ఆపై సామర్థ్యం ఉన్న ప్రీమియం బైక్‌లను రెండు, రెండున్నరేళ్లకోసారి మార్చి కొత్త మోడళ్లను దక్కించుకుంటున్నారు. మార్కెట్లోకి కొత్త బైక్ ఎప్పుడొస్తుందా.. ఎప్పుడు రోడ్లపైకి దూసుకెళ్దామా అని అలోచించేవారు 15-20 శాతం మంది ఉంటారని టీవీఎస్ మోటార్ అంటోంది. ఇక 100 సీసీ బైక్‌ల విషయంలో అయితే నాలుగైదేళ్లు వాడిన తర్వాతే విక్రయిస్తున్నారని ఈ కంపెనీ చెబుతోంది. ద్విచక్ర వాహనాలను కొంటున్నవారిలో 35-40 శాతం మంది నిన్న మొన్నటివరకు వేరే మోడల్‌ను నడిపించి ఇప్పుడు కొత్త బైక్‌కు మారినవారే. ఇక 150 సీసీ, ఆపై సామర్థ్యంగల బైక్‌ల వాటా ప్రస్తుతం 15 శాతం ఆక్రమించింది. స్కూటర్ల అమ్మకాలు జూమ్.. దేశవ్యాప్తంగా స్కూటర్ల అమ్మకాలు పెరుగుతూ వస్తున్నాయి. మొత్తం ద్విచక్ర వాహనాల్లో స్కూటర్ల వాటా 2010-11లో 18 శాతముంటే, ఇప్పుడు 14 శాతం వృద్ధి రేటుతో 23 శాతానికి చేరింది. భారత్‌లో నెలకు అన్ని కంపెనీలవి కలిపి సగటున 2.62 లక్షల స్కూటర్లు అమ్ముడవుతున్నాయి. ఇక పురుషులు మాత్రమే వాడుతున్న స్కూటర్ల వాటా 36 శాతం, స్త్రీలు మాత్రమే నడుపుతున్న మోడళ్లు 13 శాతం, ఇరువురు వాడగలిగే స్కూటర్లు 35 శాతం ఉన్నాయి. మహిళా వాహనదార్ల సంఖ్య 7-8 శాతం పెరుగుతుండగా, పురుషుల విషయంలో ఇది 12-14 శాతం వృద్ధి ఉంటోంది. పట్టణాల్లోని బైక్ వినియోగదారుల్లో స్కూటర్లవైపు మొగ్గు చూపుతున్నవారు 15 శాతం మంది దాకా ఉంటున్నారట. పట్టణీకరణ, సౌలభ్యం కారణంగానే స్కూటర్లకు డిమాండ్ పెరుగుతోందని కంపెనీలు అంటున్నాయి. రాష్ట్రంలోకి టీవీఎస్ జూపిటర్ టీవీఎస్ మోటార్ కంపెనీ రాష్ట్ర మార్కెట్లోకి జూపిటర్ స్కూటర్‌ను బుధవారం విడుదల చేసింది. ఈ మోడల్‌ను ప్రవేశపెట్టడం ద్వారా పురుషుల స్కూటర్ల విభాగంలోకి కంపెనీ అడుగిడింది. ప్రస్తుతం నెలకు 30-32 వేల స్కూటర్లను టీవీఎస్ దేశవ్యాప్తంగా విక్రయిస్తోంది. కొత్త మోడల్ చేరికతో వచ్చే మార్చినాటికి అమ్మకాలు నెలకు 50 వేలకు ఎగబాకుతాయని కంపెనీ ప్రాంతీయ మేనేజర్ (సౌత్-2) ఎస్.అరుణ్ కుమార్ ఈ విడుదల సందర్భంగా మీడియాకు తెలిపారు. కస్టమర్లు ఇప్పుడు అధిక మైలేజీ ఇచ్చే స్కూటర్లు కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో జూపిటర్ మోడల్లో అత్యాధునిక టెక్నాలజీని వినియోగించామని తెలిపారు. హైదరాబాద్ ఎక్స్‌షోరూంలో జూపిటర్ స్కూటర్ ధర రూ.48,400. మైలేజీ లీటరుకు 62 కిలో మీటర్లు వస్తుందని ఆయన చెప్పారు. -
టీవీఎస్ కొత్త స్కూటర్... జూపిటర్
చెన్నై: టీవీఎస్ మోటార్స్ స్కూటర్ సెగ్మెంట్లో కొత్త మోడల్, జూపిటర్ను సోమవారం విడుదల చేసింది. స్కూటర్లు నడిపే పురుషులను లక్ష్యంగా చేసుకుని 110 సీసీ కేటగిరీ ఇంజిన్ సామర్థ్యం ఉన్న ఈ జూపిటర్ స్కూటర్ ధరను రూ.44,200(ఎక్స్ షోరూమ్, న్యూఢిల్లీ)గా నిర్ణయించామని కంపెనీ సీఎండీ వేణు శ్రీనివాసన్ చెప్పారు. 62 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని పేర్కొన్నారు. ఈ స్కూటర్‌ను ప్రస్తుతం ఉత్తర భారతదేశంలోనే విక్రయిస్తామని, దీపావళికల్లా దక్షిణాది మార్కెట్లో అమ్మకాలు ప్రారంభిస్తామని వివరించారు. ఇప్పటి నుంచి ప్రతీ మూడు నెలలకొకసారి కొత్త మోడల్‌ను అందిస్తామని పేర్కొన్నారు. వచ్చే జనవరిలో స్కూటీ జెస్ట్‌ను మార్కెట్లోకి తెస్తామని తెలిపారు. నాలుగో మోడల్: స్కూటర్ సెగ్మెంట్లో మరింత వాటా లక్ష్యంగా టీవీఎస్ కంపెనీ నాలుగో స్కూటర్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ఇప్పటికే ఈ కంపెనీ స్కూటీ పెప్, స్కూటీ స్ట్రీక్, వెగో మోడళ్లను విక్రయిస్తోంది. ఈ జూపిటర్ స్కూటర్ హోండా యాక్టివా, హీరో మోటోకార్ప్ మ్యాస్ట్రో, యమహా రే జడ్ స్కూటర్లకు గట్టిపోటీనిస్తుందని పరిశ్రమ వర్గాలంటున్నాయి. ప్రత్యేకతలు: 17 లీటర్ల స్టోరేజ్ కెపాసిటీ(హెల్మెట్ పెట్టొచ్చు) ఉన్న ఈ స్కూటర్లో బాడీ బ్యాలెన్స్ ప్రత్యేక ఆకర్షణ. పెద్ద అలాయ్ వీల్స్‌తో 4 రంగుల్లో(బ్లాక్, వైట్, గ్రే, రెడ్) లభిస్తుంది. ఎలక్ట్రిక్ స్టార్ట్, ట్విన్ సిటీ ల్యాంప్స్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, మొబైల్ చార్జింగ్ పాయింట్, ముందువైపు టెలిస్కోపిక్ షాక్ అబ్జార్బర్స్, గ్యాస్ చార్జ్డ్ రియర్ సస్పెన్షన్, పాసింగ్ లైట్ స్విచ్(ఈ సెగ్మెంట్లో ఇలాంటి ఫీచర్ ఉన్న తొలి స్కూటర్ ఇదే) వంటి ప్రత్యేకతలున్నాయి. వెనక వైపు ఉన్న ఎల్ఈడీ లైట్ల పైన పెట్రోల్ టాంక్ మూత ఉంది(పెట్రోల్ పోయించుకోవడానికి సీట్‌ను పైకి ఎత్తాల్సిన అవసరం లేదు).