
ముంబై: టీవీఎస్ మోటార్ కంపెనీ విక్రయాలు అక్టోబర్‌లో రికార్డు గరిష్టానికి చేరాయి. గత నెలలో మొత్తం అమ్మకాలు 4.89 లక్షలుగా నమోదయ్యాయి. కంపెనీ నెలవారీ విక్రయాల్లో ఇదే ఇప్పటి వరకు అత్యధికం.
కిందటేడాది ఇదే నెలలో డీలర్లకు పంపిణీ చేసిన 4.34 లక్షల వాహనాలతో పోలిస్తే ఇవి 13% అధికం. మొత్తం ద్విచక్ర వాహన రిజిస్ట్రేషన్లు 14% వృద్ధితో 4,20,610 నుంచి 4,78,159 నుంచి చేరాయి. ఇందులో మోటార్‌సైకిల్ విక్రయాలు 14% 2,30,822 యూనిట్లకు చేరగా, స్కూటర్ల అమ్మకాలు 17% పుంజుకొని 1,93,439 యూనిట్లకు చేరాయి.
ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు 45% పుంజుకొని 20,153 యూనిట్ల నుంచి 29,308 యూనిట్లకు చేరాయి. అయితే త్రిచక్ర వాహన అమ్మకాలు 23% తగ్గి 10,856 యూనిట్లకు దిగివచ్చాయి. గతేడాది ఇదే అక్టోబర్‌లో 14,104 వాహనాలు అమ్ముడయ్యాయి. ఎగుమతులు 9% వృద్ధితో 87,952 నుంచి 95,708 యూనిట్లకు చేరాయి.
Comments
Please login to add a commentAdd a comment