highest
-
Year Ender 2024: ఈ దేశాల్లో పర్యాటకుల తాకిడి.. హనీమూన్ స్పాట్లో జంటల సందడి
కొద్దిరోజుల్లో 2024కు వీడ్కోలు చెప్పబోతున్నాం. ఈ నేపధ్యంలో ముగుస్తున్న ఏడాదిలో వివిధ రంగాల్లో చోటుచేసుకున్న పరిణామాలను నెమరువేసుకుంటుంటాం. ఈ కోవలోకి టూరిజం రంగం కూడా వస్తుంది. 2024లో ఏ దేశంలో టూరిస్టుల తాకిడి అధికంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక సర్వేలోని వివరాల ఆధారంగా ఈ సమాచారాన్ని అందిస్తున్నాం.ఫ్రాన్స్2024లో 89.4 మిలియన్ల అంతర్జాతీయ పర్యాటకులతో ఫ్రాన్స్ కళకళలాడింది. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌ను సందర్శించడానికి టూరిస్టులు ఎంతో ఉత్సాహం చూపారు. దీంతో పారిస్ ఈ ఏడాది పర్యాటకులతో నిండిపోయింది. పలు జంటలు 2024లో హనీమూన్ కోసం పారిస్‌కు వచ్చారు. పారిస్‌లోని ఈఫిల్ టవర్‌ను చూడాలని ప్రతీఒక్కరూ కోరుకుంటారు. ఈ ప్రాంతం ఎప్పుడూ టూరిస్టులతో రద్దీగా ఉంటుంది.స్పెయిన్నైరుతి ఐరోపాలోని ఐబీరియన్ ద్వీపకల్పంలో స్పెయిన్ దేశం ఉంది. పర్యాటక పరంగా స్పెయిన్ దేశం టూరిస్టులకు ఇష్టమైన గమ్యస్థానాలలో ఒకటిగా పేరొందింది. క్యాథలిక్ మతానికి చెందిన వారు అధికంగా ఇక్కడ నివసిస్తున్నారు. గణాంకాల ప్రకారం ప్రతి ఏడాది 85 మిలియన్లకు పైగా పర్యాటకులు స్పెయిన్‌కు తరలివస్తుంటారు. ఫ్రాన్స్ తర్వాత అత్యధిక సంఖ్యలో పర్యాటకులు ఇష్టపడదే దేశం స్పెయిన్. 2024లో ఇప్పటివరకూ 83.7 మిలియన్ల మంది పర్యాటకులు స్పెయిన్‌ను సందర్శించారు.అమెరికా2024 చివరినాటికి అమెరికాకు 79.3 మిలియన్ల మంది పర్యాటకులు వస్తారనే అంచనాలున్నాయి. పర్యాటకులు సందర్శిస్తున్న ప్రదేశాల జాబితాలో అమెరికా ముందంజలో ఉంది. అమెరికాలోని న్యూయార్క్ పర్యాటకులకు అత్యంత ఇష్టమైన ప్రాంతం. న్యూయార్క్‌లోని ఎత్తయిన భవనాలు, లాస్ ఏంజిల్స్‌లోని పర్యాటక ప్రాంతాలు పర్యాటకులను ఇట్టే కట్టిపడేస్తాయి.చైనాఅన్ని రంగాలలో ముందంజలో ఉన్న చైనా టూరిజంలోనూ దూసుకుపోతోంది. ఈ రంగంలో చైనా తనదైన ముద్ర వేసింది. 2024 చివరినాటికల్లా 65.7 మిలియన్ల పర్యాటకులు చైనాను సందర్శిస్తారనే అంచనాలున్నాయి. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఈ దేశంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. చైనాలోని టెర్రకోటా ఆర్మీ, లింటాంగ్ డిస్ట్రిక్ట్, జియాన్, షాంగ్సీ, బీజింగ్ పురాతన అబ్జర్వేటరీ, డాంగ్చెంగ్, టెంపుల్ ఆఫ్ హెవెన్, డాంగ్చెంగ్ వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు నిత్యం సందర్శకులతో కళకళలాడుతుంటాయి.ఇటలీయూరప్లోని ఇటలీ అత్యంత విలాసంతమైన ప్రదేశంగా గుర్తింపు పొందింది. ఇక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. ఇటలీ 2024లో 64.5 మిలియన్ల మంది పర్యాటకులను స్వాగతించనుందనే అంచనాలున్నాయి. ఇటలీలోని రోమ్, ఫ్లోరెన్స్, వెనిస్ వంటి నగరాలు పర్యాటకులను ఇట్టే ఆకర్షిస్తుంటాయి. ఈ దేశంలోని అమాల్ఫీ తీరాన్ని పర్యాటకులు సందర్శిస్తుంటారు.ఇది కూడా చదవండి: ఆప్ ఎన్నికల వ్యూహం: ఎమ్మెల్యేలకు మొండిచెయ్యి.. కౌన్సిలర్లకు పట్టం -
Year Ender 2024: నిరుద్యోగంతో అలమటిస్తున్నరాష్ట్రాలివే..
ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉన్నప్పటికీ భారత్ నిరుద్యోగం విషయంలో పెను సవాళ్లను ఎదుర్కొంటోంది. దేశంలోని వివిధ రంగాలు వృద్ధిని చవిచూస్తున్నప్పటికీ, నిరుద్యోగితా స్థాయిలో ఆశించినంత మార్పు రాకపోవడం విశేషం. ఇటీవలే విడుదలైన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే(పీఎల్ఎఫ్ఎస్) అందించిన నివేదిక ప్రకారం, 2022-23 ఆర్థిక సంవత్సరం నాటికి జాతీయ నిరుద్యోగిత రేటులో తగ్గుదల కనిపించింది. 15 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు గల వ్యక్తులలో నిరుద్యోగితా రేలు 3.2 శాతానికి తగ్గింది. ఇది 2020-21లో 4.2 శాతంగా, 2021-22లో 4.1శాతంగా ఉంది. అగ్రస్థానంలో లక్షద్వీప్11.1 శాతం నిరుద్యోగితా రేటుతో కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్ అగ్రస్థానంలో ఉంది. పర్యాటకంపై ఆధారపడిన లక్షద్వీప్ ఆర్థిక వ్యవస్థ నిరుద్యోగాన్ని గణనీయంగా తగ్గించలేకపోయింది. గోవా, అండమాన్, నికోబార్ దీవులు రెండూ 9.7శాతం నిరుద్యోగితా రేటును నమోదు చేశాయి. కాలానుగుణ ఉపాధి, ప్రభుత్వ రంగ ఉద్యోగాలపై ఆధారపడటం మొదలైనవి నిరుద్యోగానికి సవాలుగా నిలిచాయి. ప్రభుత్వ రంగంలో పరిమిత ఉద్యోగ అవకాశాల కారణంగా అధిక నిరుద్యోగ స్థాయి కొనసాగుతోంది. వైరుధ్యాన్ని ఎదుర్కొంటున్న కేరళ యువతనాగాలాండ్, కేరళ వరుసగా 9.1శాతం, 7.0శాతం రేట్లతో రెండవ స్థానంలో ఉన్నాయి. కేరళలోని యువత అధిక అక్షరాస్యత, తక్కువ ఉపాధి అవకాశాలనే వైరుధ్యాన్ని ఎదుర్కొంటోంది. ఉత్తర భారతదేశంలో, హర్యానా పారిశ్రామిక కేంద్రంగా ఉన్నప్పటికీ 6.1% నిరుద్యోగిత రేటును నమోదు చేసింది. పారిశ్రామిక వృద్ధి ఒక్కటే ఉపాధికి హామీ ఇవ్వదని ఈ వైరుధ్యం సూచిస్తుంది.చండీగఢ్, మేఘాలయాలకు పలు సవాళ్లుఅదేవిధంగా 6.0శాతం నిరుద్యోగితా రేటుతో చండీగఢ్, మేఘాలయాలు పలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. చండీగఢ్ ప్రభుత్వం, అక్కడి సేవా రంగాలు రాష్ట్రంలోని యువతకు పూర్తి స్థాయిలో ఉద్యోగాలను కల్పించలేకపోతున్నాయి. మేఘాలయలో పారిశ్రామిక అభివృద్ధి చెందకపోవడం ఉపాధికి ఆటంకంగా మారింది.తెలంగాణలో..జమ్ముకశ్మీర్, తెలంగాణలో నిరుద్యోగ రేటు 4.4శాతంగా ఉంది. జమ్ముకశ్మీర్‌లోని రాజకీయ, ఆర్థిక సవాళ్లు నిరుద్యోగానికి కారణాలుగా నిలుస్తున్నాయి. తెలంగాణలోని హైదరాబాద్‌లో ఐటీ రంగం ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఇది కూడా చదవండి: చైనా చేతికి ‘పవర్ఫుల్ బీమ్’.. గురి తప్పేదే లే.. -
జైలర్ కన్నా ఖైదీల ఆదాయమే ఎక్కువ!
బ్రిటన్ జైళ్లలో అధికారుల కంటే ఖైదీలే ఎక్కువ సంపాదిస్తున్నారు. రక్షణ కల్పించే అధికారులు, సెకండరీ టీచర్లు, బయో కెమిస్టులు, సైకోథెరపిస్టులు తదితరుల కంటే కూడా వారి ఆదాయం చాలా ఎక్కువట! అక్కడి కొన్ని బహిరంగ జైళ్లలో ఖైదీలను బయటికి వెళ్లి పని చేయడానికి కూడా అనుమతిస్తారు. అలా పనికి వెళ్లిన ఓ ఖైదీ గతేడాది ఏకంగా 46 వేల డాలర్ల (రూ.39 లక్షల) వార్షిక ఆదాయం ఆర్జించి రికార్డు సృష్టించాడు. మరో 9 మంది ఖైదీలు కూడా ఏటా 28,694 డాలర్ల (రూ.24 లక్షల) కంటే ఎక్కువ సంపాదిస్తున్నారని హోం శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఖైదీలకు పునరావాసంతో పాటు విడదలయ్యాక సమాజంలో గౌరవప్రదంగా జీవించేందుకు వీలు కలి్పంచడంలో భాగంగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోంది. అక్కడి జైళ్లలో ఖైదీలు పలు ఉద్యోగాలు చేస్తారు. లారీ డ్రైవర్లుగా చేసేవారి సంపాదన ఎక్కువ. కొందరు శిక్షాకాలం ముగియకముందే తాత్కాలిక లైసెన్సు సంపాదించేస్తారు. ఈ ఖైదీల్లో పలువురు ఆదాయపన్ను కూడా చెల్లిస్తుండటం విశేషం. కొందరు సేవా కార్యక్రమాలకు విరాళాలూ ఇస్తారు! బ్రిటన్‌లో జైలు గార్డుల సగటు వేతనం 35,000 డాలర్లు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
టీవీఎస్ రికార్డ్.. 4.89 లక్షల వాహనాలు అమ్మేసింది!
ముంబై: టీవీఎస్ మోటార్ కంపెనీ విక్రయాలు అక్టోబర్‌లో రికార్డు గరిష్టానికి చేరాయి. గత నెలలో మొత్తం అమ్మకాలు 4.89 లక్షలుగా నమోదయ్యాయి. కంపెనీ నెలవారీ విక్రయాల్లో ఇదే ఇప్పటి వరకు అత్యధికం.కిందటేడాది ఇదే నెలలో డీలర్లకు పంపిణీ చేసిన 4.34 లక్షల వాహనాలతో పోలిస్తే ఇవి 13% అధికం. మొత్తం ద్విచక్ర వాహన రిజిస్ట్రేషన్లు 14% వృద్ధితో 4,20,610 నుంచి 4,78,159 నుంచి చేరాయి. ఇందులో మోటార్‌సైకిల్ విక్రయాలు 14% 2,30,822 యూనిట్లకు చేరగా, స్కూటర్ల అమ్మకాలు 17% పుంజుకొని 1,93,439 యూనిట్లకు చేరాయి.ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు 45% పుంజుకొని 20,153 యూనిట్ల నుంచి 29,308 యూనిట్లకు చేరాయి. అయితే త్రిచక్ర వాహన అమ్మకాలు 23% తగ్గి 10,856 యూనిట్లకు దిగివచ్చాయి. గతేడాది ఇదే అక్టోబర్‌లో 14,104 వాహనాలు అమ్ముడయ్యాయి. ఎగుమతులు 9% వృద్ధితో 87,952 నుంచి 95,708 యూనిట్లకు చేరాయి. -
18 ఏళ్లకే 14 పర్వతాల అధిరోహణ
కఠ్మాండు: ప్రపంచంలోని తొలి 14 అత్యంత ఎత్తయిన పర్వతాలను అత్యంత పిన్నవయసులోఅధిరోహించిన వ్యక్తిగా నేపాల్‌కు చెందిన 18 ఏళ్ల టీనేజర్ నిమా రింజీ షెర్పా రికార్డు సృష్టించాడు. బుధవారం ఉదయం 6.05 గంటలకు టిబెట్‌లోని మౌంట్ శిషాపాంగ్మాను అధిరోహించడం ద్వారా ఈ రికార్డు నెలకొల్పాడు. కేవలం 740 రోజుల్లోనే మొత్తం 14 పర్వతాలను అధిరోహించడం గమనార్హం. ఇవన్నీ 8,000 మీటర్లకుపైగా ఎత్తయిన పర్వతాలే. వీటిని ‘ఎయిట్ థౌజెండర్స్’ అని పిలుస్తారు. ఇంటర్నేషనల్ మౌంటైనీరింగ్, క్లైంబింగ్ ఫెడరేషన్(యూఐఏఏ) ఈ ర్వతాలను గుర్తించింది. పర్వతారోహకుల కుటుంబంలో జని్మంచిన నిమా రింజీ షెర్పా పదో తరగతి పరీక్షలు పూర్తయిన వెంటనే 2022 సెపె్టంబర్ 30న పర్వతారోహణకు శ్రీకారం చుట్టాడు. ప్రపంచంలో అత్యంత ఎత్తయిన ఎనిమిదో పర్వతం, నేపాల్‌లోని ‘మనాస్లూ’ శిఖరాన్ని చేరుకున్నాడు. అప్పటినుంచి వీలు దొరికినప్పుడల్లా ఒక నూతన పర్వతాన్ని అధిరోహించాడు. ఎవరెస్టు పర్వతాన్ని, దాని సమీపంలోని లోట్సే పర్వతాన్ని నిమారింజీ షెర్పా 10 గంటల కంటే తక్కువ వ్యవధిలోనే అధిరోహించాడు. బుధవారం నాటికి మొత్తం 14 ఎత్తయిన పర్వతాలను అధిరోహించడం పూర్తిచేశాడు. కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటిదాకా ఈ రికార్డు నేపాల్‌కు చెందిన మింగ్మా గ్యాబు డేవిడ్ షెర్పా పేరిట ఉంది. అతడు 2019లో 30 ఏళ్ల వయసులో 14 పర్వత శిఖరాలు అధిరోహించాడు. నిమా రింజీ షెర్పా మాత్రం కేవలం 18 ఏళ్లలోనే ఈ రికార్డును తిరగరాయడం గమనార్హం. షెర్పాలు అంటే సాధారణంగా హిమాలయాల్లో పర్వతారోహకులకు సహకరించే పనివాళ్లుగా పేరుంది. కానీ, షెర్పాలు అందుకు మాత్రమే పరిమితం కాదని, ప్రపంచ రికార్డులు సృష్టించగలరని నిరూపించడమే తన లక్ష్యమని నిమా రింజీ షెర్పా చెప్పాడు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ప్రపంచంలోని తొలి 14 ఎత్తయిన పర్వతాలు ఆసియా ఖండంలోని హిమాలయాలు, కారాకోరం ప్రాంతంలోనే ఉన్నాయి. -
మొదటిరోజు అత్యధిక కలెక్షన్స్ సాధించిన టాప్-10 ఇండియన్ సినిమాలు (ఫొటోలు)
-
దేశంలో అత్యధిక వేతనం.. ఈయనదే..
దేశంలో అత్యధిక వేతనం పొందే ప్రొఫెషనల్ చీఫ్‌గా టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ నిలిచారు. 2024 ఆర్థిక సంవత్సరంలో చంద్రశేఖరన్ రూ. 135 కోట్ల వేతన పరిహారాన్ని అందుకున్నారు. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఆయన వేతనం ఈ ఏడాది 20 శాతం పెరిగింది.చంద్రశేఖరన్ ఈ ఏడాది అందుకున్న రూ. 135 కోట్ల ప్యాకేజీలో కంపెనీ లాభాల నుండి ఆర్జించిన కమీషన్లు రూ. 122 కోట్లు ఉండగా, మిగిలిన రూ. 13 కోట్ల జీతం, పెర్క్విజిట్‌లు ఉన్నాయి. ఇక టాటా సన్స్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సౌరభ్ అగర్వాల్ రూ. 30 కోట్లు అందుకుని టాటా సమ్మేళనంలో అత్యధిక వేతనం పొందుతున్న రెండో ఎగ్జిక్యూటివ్‌గా నిలిచారు.చంద్రశేఖరన్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఆరు లిస్టెడ్ టాటా కంపెనీల నుండి సిట్టింగ్ ఫీజులో అదనంగా రూ.17 లక్షలు అందుకున్నారు. ఈ సంస్థల్లో ఆయన వాటా విలువ రూ.168 కోట్లు. ఇదిలా ఉండగా విప్రో మాజీ సీఈవో థియరీ డెలాపోర్టే 2024 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా రూ. 167 కోట్లు అందుకున్నారు. -
ఎక్కువ ట్యాక్స్ కడుతున్న సెలబ్రిటీలు ఎవరో తెలుసా? (ఫోటోలు)
-
అసాధ్యం కాస్త సుసాధ్యం.. ముచు ఛిష్‌ను జయించారు
ఢిల్లీ: ఈ భూమ్మీద మనిషి ఇప్పటికీ అధిరోహించని పర్వతాలు కొన్ని ఉన్నాయి. వాటిలో ఒకటిగా మన పొరుగున పాకిస్తాన్‌లోని ముచు ఛిష్ ఉండేది. అయితే అది గతం. ఇప్పుడు దానిని కూడా జయించేశారు.తల్చుకుంటే మనిషి సాధించలేనిది ఏది లేదని మరోసారి రుజువైంది. కారకోరం రేంజ్‌లోని 7,453 మీటర్ల(24,452 అడుగులు) ఎత్తైన ముచు ఛిష్ పర్వతాన్ని ఎట్టకేలకు అధిరోహించారు. చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన ముగ్గురు సభ్యులతో కూడిన బృందం.. ఆరు రోజుల పాటు శ్రమించి ఈ ఘనత సాధించింది. డెనెక్ హక్, రాడోస్లావ్ గ్రోహ్, జరోస్లావ్ బాన్స్కీ ఈ బృందంలో ఉన్నారు.గతంలో ఎందరో పర్వతాహరోహకులు దీనిని అధిరోహించే ప్రయత్నంలో భంగపడ్డారు. కిందటి ఏడాది ఓ బృందం.. 7,200 మీటర్ల దాకా వెళ్లి ప్రతికూల వాతావరణంతో వెనక్కి తిరిగి వచ్చేసింది. చెక్ రిపబ్లిక్కు చెందిన పర్వతారోహకులు.. గత నాలుగేళ్లలో మూడుసార్లు ఈ పర్వతాన్ని అధిరోహించాలని ప్రయత్నించారు. అయితే ఈసారి అదే దేశానికే చెందిన బృందం ఒకటి ఎట్టకేలకు ఆ ఘనత సాధించింది. -
దేశంలో ఎత్తైన జలపాతాలు:రెండు కళ్లూ చాలవంతే! (ఫొటోలు)
-
జపాన్‌కు పోటెత్తిన పర్యాటకులు.. ఒక్క నెలలో రికార్డ్!
తూర్పు ఆసియాలోని జపాన్‌కు విదేశీ పర్యాటకులు పోటెత్తారు. గత మార్చి నెలలో 30 లక్షల మందికిపైగా విదేశీయులు జపాన్ను సందర్శించారు. ఒక నెలలో ఇంత మంది పర్యాటకులు రావడం రికార్డు అని ఆ దేశ ప్రభుత్వ డేటా ద్వారా వెల్లడైంది. జపాన్ను గత మార్చి నెలలో మొత్తం 30.8 లక్షల మంది సందర్శించారు. ఏడాది క్రితం ఇదే నెలలో నమోదైన పర్యాటకుల సంఖ్యతో పోలిస్తే 69.5 శాతం పెరుగుదల నమోదైంది. కరోనా మహమ్మారి ప్రపంచ పర్యాటకాన్ని దెబ్బతీసే ముందు 2019 మార్చితో పోల్చినప్పటికీ ఈ ఏడాది మార్చి నెలలో 11.6 శాతం పర్యాటకులు పెరిగారని జపాన్ నేషనల్ టూరిజం ఆర్గనైజేషన్ తెలిపింది. సాధారణంగా పెరుగుతున్న పర్యాటక డిమాండ్‌తోపాటు స్ప్రింగ్ చెర్రీ బ్లూజమ్ సీజన్, ఈస్టర్ విరామం కూడా సందర్శకుల సంఖ్యను పెంచడంలో దోహదపడింది. జపాన్ను సందర్శించిన విదేశీ పర్యాటకులలో ఎక్కువ మంది భారత్, జర్మనీ, తైవాన్, యునైటెడ్ స్టేట్స్ దేశాలకు చెందినవారు కావడం గమనార్హం. కోవిడ్ పరిమితులు ఎత్తేసినప్పటి నుంచి జపాన్ పర్యాటకం అభివృద్ధి చెందుతోంది. సందర్శకుల సంఖ్యను పెంచడానికి ఆ దేశ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. -
15,256 అడుగుల ఎత్తులో 52 మంది ఓటర్లు!
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ బూత్ అయిన తాషిగ్యాంగ్ పోలింగ్ కేంద్రం హిమాచల్ ప్రదేశ్‌లో ఉంది. ఇది సముద్ర మట్టానికి 15,256 అడుగుల ఎత్తులో ఉంది. ఈ పోలింగ్ బూత్‌లో మూడోసారి ఓటింగ్ జరగనుంది. తాషిగ్యాంగ్‌లో పోలింగ్ స్టేషన్‌ను నిర్మించిన తర్వాత 2019లో తొలిసారిగా లోక్‌సభ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. 2021లో తాషిగ్యాంగ్ పోలింగ్ బూత్‌లో లోక్‌సభ ఉప ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు మూడోసారి. 2024లో ఈ పోలింగ్ స్టేషన్లో లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయని అధికారులు తెలిపారు. భారత ఎన్నికల సంఘం ఈ సంవత్సరం దీన్ని మోడల్ పోలింగ్ స్టేషన్‌గా మార్చింది. ఇక్కడ 52 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 52 మంది ఓటర్లలో 30 మంది పురుషులు, 22 మంది మహిళలు ఉన్నారు. ఈ పోలింగ్ స్టేషన్ కాజా సబ్ డివిజన్ నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. రహదారి నుండి కేవలం 200 మీటర్ల దూరంలో ఉంది. అయితే, ప్రస్తుతం ఇక్కడ అడుగు మందం మేర మంచు కురుస్తోంది. దీంతో ఎన్నికల సంఘం జూన్ 1న ఇక్కడ ఓటింగ్‌ను ఏర్పాటు చేసింది. తాషిగ్యాంగ్ పోలింగ్ స్టేషన్ ఏర్పాటుకు ముందు గ్రామస్థులు ఓటు వేయడానికి 14,567 అడుగుల ఎత్తులో ఉన్న హిక్కిమ్ గ్రామానికి వెళ్లాల్సి ఉండేది. తాషిగ్యాంగ్ కంటే ముందు, ఇదే భారతదేశంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ బూత్. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ 45 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 27 మంది పురుషులు, 18 మంది మహిళలు ఉన్నారు. 2021లో మండి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరిగినప్పుడు 49 మంది ఓటర్లు ఉండగా వీరిలో 29 మంది పురుషులు, 20 మంది మహిళలు. ఈ రెండు ఎన్నికల్లోనూ ఇక్కడ 100 శాతం ఓటింగ్ నమోదైంది. -
కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌కు ఫ్రాన్స్ పురస్కారం
కాంగ్రెస్ ఎంపీ, ఐక్యరాజ్యసమితి మాజీ దౌత్యవేత్త శశి థరూర్‌కు ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం ‘షువలియె డి లా లిజియన్ ద హానర్’ లభించింది. ఒక కార్యక్రమంలో ఫ్రెంచ్ సెనేట్ అధ్యక్షుడు గెరార్డ్ లార్చర్.. శశి థరూర్‌ను సత్కరించారు. ఆగస్టు 2022లో థరూర్‌కు ఈ అవార్డును అందజేస్తామని ఫ్రెంచ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ గౌరవం అందించినందుకు ఫ్రాన్స్‌కు థరూర్ కృతజ్ఞతలు తెలిపారు. భారత్-ఫ్రాన్స్ మధ్య సంబంధాలను మరింత పటిష్టం చేసినందుకు, అంతర్జాతీయ శాంతి, సహకారంలో చేసిన కృషికి గుర్తింపుగా థరూర్‌కు ఈ గౌరవం లభించిందని భారత్‌లోని ఫ్రెంచ్ రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రకటనలో అధికారులు.. శశి థరూర్ ప్రతిభ, వ్యక్తిత్వాన్ని కొనియాడారు. ఐక్యరాజ్యసమితిలో దౌత్యవేత్తగా, భారతదేశంలో రాజకీయ నేతగా, రచయితగా థరూర్ విశేష సేవలు అందించారని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో థరూర్ విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా, మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో సహా కీలకమైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలలో కూడా థరూర్ పనిచేశారు. థరూర్ పలు పుస్తకాలు రాశారు. వాటిలో కొన్ని ఫ్రెంచ్ భాషలోకి అనువదించారు. థరూర్ ఐక్యరాజ్యసమితిలోనూ పనిచేశారు. కమ్యూనికేషన్స్, స్పెషల్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్, సెక్రటరీ-జనరల్ కోఫీ అన్నన్‌కు ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌గా కూడా పనిచేశారు. -
భారత రత్న.. కేంద్రం సరికొత్త రికార్డు
న్యూఢిల్లీ: దేశ చరిత్రలో తొలిసారి ఈ ఏడాదిలోనే ఐదుగురికి భారతరత్న ప్రకటించి కేంద్ర ప్రభుత్వం సరికొత్త రికార్డు సృష్టించింది. దీంతో ఒకే సంవత్సరంలో ఎక్కువమందికి దేశ అత్యున్నత పురస్కారం ప్రకటించినట్లయింది. గతంలో 1999లో నలుగురికి భారతరత్న ప్రకటించడమే ఇప్పటివరకు రికార్డు. ఈ ఏడాది భారతరత్న దక్కించుకున్నవారితో కలిపి భారతరత్నాల జాబితాలో ఇప్పటివరకు చోటు దక్కించుకున్న వారి సంఖ్య మొత్తం 53కు చేరింది.కేంద్ర ప్రభుత్వం 1954లో అత్యున్నత పౌర పురస్కారాలైన భారతరత్న, పద్మవిభూషణ్‌లను ఏర్పాటుచేసింది. ఏదైనా రంగంలో అసాధారణ సేవలు అందించి అత్యున్నత స్థాయి పనితీరు కనబరిచిన వారికి భారతరత్న ఇస్తారు. ఈ పురస్కారానికి సంబంధించిన సిఫార్సులను ప్రధాని రాష్ట్రపతికి అందజేస్తారు. ప్రధాని చేసే సిఫారసు తప్ప ఎలాంటి కేంద్ర ప్రభుత్వం ఇతర అధికారిక సిఫారసులేవి రాష్ట్రపతికి వెళ్లవు. అవార్డు కింద రాష్ట్రపతి సంతకం చేసిన ధ్రువపత్రం, భారతరత్న పతకం అందిస్తారు. ఎలాంటి నగదు ఇవ్వరు. ఇదీ చదవండి.. 8 మంది ఎంపీలతో ప్రధాని లంచ్.. స్వయంగా బిల్లు చెల్లింపు -
ప్రపంచంలో ఏకైక 10 స్టార్ హోటల్ ఎక్కడుంది?
బుర్జ్ అల్ అరబ్ ప్రపంచంలోనే ఏకైక టెన్ స్టార్ హోటల్. ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్‌లో ఉంది. ఇది ఒక కృత్రిమ ద్వీపంలో ఉంది. బుర్జ్ అల్ అరబ్ ప్రపంచంలోని అత్యంత ఎత్తయిన హోటళ్లలో ఒకటి. అయితే దాని ఎత్తులో 39 శాతం నివాసయోగ్యం కాదు. బుర్జ్ అల్ అరబ్ 1999 సంవత్సరంలో నిర్మితమయ్యింది. దీని నిర్మాణానికి ఒక బిలియన్ డాలర్లు (రూ. 8330 కోట్లు)కు మించి ఖర్చయింది. ఈ కృత్రిమ ద్వీపం జుమేరా బీచ్‌కు 280 మీటర్లు (920 అడుగులు) దూరంలో ఉంది. బుర్జ్ అల్ అరబ్ ఒక ప్రైవేట్ వంతెన ద్వారా ప్రధాన భూభాగానికి అనుసంధానమై ఉంది. దీనిని ఓడకు గల తెరచాపను పోలివుండేలా నిర్మించారు. దీని పైకప్పుపై హెలిప్యాడ్ కూడా ఉంది. ఇది భూమి నుండి 210 మీటర్లు (689 అడుగులు) ఎత్తులో ఉంది.బుర్జ్ అల్ అరబ్ జుమేరాలో రోజువారీ గది ధర రూ. రూ. 2,58,679 నుండి రూ. 1,055,372 వరకు ఉంది. సందర్శకులు ప్రత్యేక హెలికాప్టర్ సర్వీస్ లేదా రోల్స్ రాయిస్ ద్వారా హోటల్‌కు చేరుకోవచ్చు. దీనిలోని అన్ని సూట్లలో అరేబియా గల్ఫ్ అందాలు కనిపించేలా కిటికీలు ఉంటాయి. ఈ సూట్లలో ఉచిత వైఫై, వైడ్ స్క్రీన్ ఇంటరాక్టివ్ హెచ్డీ టీవీ, రియాక్టర్ స్పీకర్, ఇతర ఆధునిక సౌకర్యాలు ఉంటాయి. బుర్జ్ అల్ అరబ్ జుమేరాలో ఎనిమిది రెస్టారెంట్లు, ఒక స్పా, పలు సీ వ్యూ గదులు ఉన్నాయి. అలాగే రూఫ్‌టాప్ బార్, రెండు స్విమ్మింగ్ పూల్స్, 32 గ్రాండ్ కాబానాస్, ఒక రెస్టారెంట్ ఉన్నాయి. -
ప్రపంచంలో భారీ భూకంపం ఏది? తీవ్రత ఎంత?
జపాన్‌లో సంభవించిన భూకంపం అందరినీ వణికిస్తోంది. ఈ విపత్తు పరిణామాలు ఒక్కొక్కటిగా వెలికివస్తున్నాయి. నిజానికి జపాన్ను భూకంపాలకు కేంద్రంగా పరిగణిస్తుంటారు. ఇటీవల జపాన్‌లో 7.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. అయితే ఇప్పుటివరకూ ప్రపంచంలో సంభవించిన అత్యంత తీవ్రత కలిగిన భూకంపం చిలీలోని వాల్డివియాలో చోటుచేసుకుంది. 1960లో వాల్డివియాలో సంభవించిన భూకంపం దాదాపు 10 నిమిషాల పాటు కొనసాగింది. ఇది చాలా తీవ్రమైనది. ఈ సమయంలో అక్కడ సునామీ కూడా సంభవించింది. ఈ భారీ భూకంపానికి సముద్ర ప్రాంతాలు ప్రభావితమయ్యాయి. 9.5 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం చరిత్రలో భారీ భూకంపంగా నిలిచింది. చిలీ తీర ప్రాంతం వాల్డివియాలో 1960, మే 22న ఈ భూకంపం సంభవించింది. సాధారణంగా కొన్ని సెకన్ల పాటు సంభవించే భూకంపాలు భారీ విధ్వంసాన్ని సృష్టిస్తాయి. వాల్డివియాలో చోటుచేసుకున్న భూకంపం నగరంలో 10 నిమిషాలపాటు భయోత్పాతాన్ని సృష్టించింది. ఆ తర్వాత చాలా శక్తివంతమైన సునామీ వచ్చింది. ఇది పలు దేశాలకు సైతం వ్యాపించింది. ఈ భూకంపం కారణంగా వాల్డివియా నగరం మొత్తం ధ్వంసమైంది. ఈ నగరంలో జనాభా అంతగా లేనందున, ఈ భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య ఆరు మాత్రమేనని చెబుతుంటారు. ఇంతటి తీవ్రతతో భూకంపం వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. ఇదే ఇప్పటివరకు సంభవించిన అత్యంత తీవ్రమైన భూకంపంగా పరిగణిస్తుంటారు. ఇది కూడా చదవండి: జపాన్‌లో భారీ భూకంపం.. 155సార్లు కంపించిన భూమి -
నీటినిల్వలో అగ్రగామి ‘కృష్ణా’
సాక్షి, అమరావతి: దేశంలో అత్యధిక నీటినిల్వ సామర్థ్యం గల జలాశయాలున్న నదుల్లో కృష్ణానది అగ్రగామిగా నిలిచింది. అతి పెద్ద నది అయిన గంగ, రెండో అతి పెద్ద నది అయిన గోదావరి కన్నా నీటినిల్వ సామర్థ్యం ఉన్న జలాశయాల్లో అగ్రగామిగా కృష్ణానది కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) రికార్డుల్లోకి ఎక్కింది. దేశంలో హిమాలయ, ద్వీపకల్ప నదులతోపాటు అన్ని నదీపరివాహక ప్రాంతాల్లో (బేసిన్లలో) నిర్మాణం పూర్తయిన జలాశయాల నీటినిల్వ సామర్థ్యం 9,105.92 టీఎంసీలు. ఇందులో 1,788.99 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లతో కృష్ణానది ప్రథమ స్థానంలో నిలిచింది. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రిజర్వాయర్ల నీటినిల్వ సామర్థ్యం 589.67 టీఎంసీలు కావడం గమనార్హం. అంటే.. దేశంలో అన్ని బేసిన్లలోని రిజర్వాయర్ల నీటినిల్వ సామర్థ్యంలో కృష్ణా బేసిన్ రిజర్వాయర్ల సామర్థ్యం 19.65 శాతం కావడం గమనార్హం. గంగా, గోదావరి కన్నా మిన్న.. హిమాలయ పర్వతాల్లో హిమానీనదాల్లో జన్మించి దేశంలో ప్రవహించే గంగానది అతి పెద్దది. గంగా బేసిన్లో ఉన్న జలాశయాల నీటినిల్వ సామర్థ్యం 1,718.91 టీఎంసీలు. పశ్చిమ కనుమల్లో నాసిక్ వద్ద జన్మించి ద్వీపకల్పంలో ప్రవహించే గోదావరి రెండో అతి పెద్ద నది. ఈ బేసిన్లో రిజర్వాయర్ల నీటినిల్వ సామర్థ్యం 1,237.61 టీఎంసీలు. వీటిని పరిశీలిస్తే.. నీటినిల్వ సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లలో గంగ, గోదావరి కంటే కృష్ణానదే మిన్న అని స్పష్టమవుతోంది. రిజర్వాయర్ల నీటినిల్వ సామర్థ్యంలో గంగ, గోదావరి రెండు, మూడుస్థానాల్లో నిలవగా.. దేశంలో పశ్చిమం వైపు ప్రవహించే నర్మదానది నాలుగోస్థానంలో నిలిచింది. ఇక దేశంలో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే వర్షఛాయ ప్రాంతంలో పుట్టి, ప్రవహించే పెన్నానది బేసిన్లో 239.59 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లున్నాయి. రిజర్వాయర్ల నీటినిల్వ సామర్థ్యంలో పెన్నా బేసిన్ దేశంలో తొమ్మిదోస్థానంలో నిలవడం గమనార్హం. హిమాలయ నది అయిన బ్రహ్మపుత్ర బేసిన్లో రిజర్వాయర్ల నీటినిల్వ సామర్థ్యం 88.65 టీఎంసీలు మాత్రమే. -
టాటా మోటార్స్ సరికొత్త రికార్డు.. ఎప్పుడూ లేనంతగా..
న్యూఢిల్లీ: వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ 2023 నవంబర్‌లో గరిష్ట విక్రయాలను నమోదు చేసింది. పండుగల సీజన్ నేపథ్యంలో స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలకు బలమైన డిమాండ్ ఇందుకు కారణమని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ ఎండీ శైలేష్ చంద్ర తెలిపారు. ‘గత నెలలో దేశవ్యాప్తంగా కంపెనీ 53,000 యూనిట్లను విక్రయించింది. ఈ సంఖ్య అంత క్రితం నెలతో పోలిస్తే 8 శాతం, 2022 నవంబర్‌తో పోలిస్తే 30 శాతం అధికం. 2023 నవంబర్ నెలలో నమోదైన విక్రయాలు ఇప్పటి వరకు కంపెనీ చరిత్రలోనే అత్యధికం. ఇక 47 రోజుల పండుగల సీజన్లో 79,374 యూనిట్లు రోడ్డెక్కాయి. 2022 పండుగల సీజన్‌తో పోలిస్తే ఇది 18 శాతం అధికం. కొత్తగా విడుదలైన నూతన నెక్సన్, హ్యారియర్, సఫారీ మోడళ్లతోపాటు ఐ–సీఎన్జీ శ్రేణి ఈ జోరుకు కారణం’ అని చెప్పారు. డీజిల్ స్థానంలో సీఎన్జీ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్ వెహికిల్స్ పరిశ్రమతోపాటు టాటా మోటార్స్ సైతం ఉత్తమ ప్రతిభ కనబర్చనుందని శైలేష్ చంద్ర అన్నారు. ‘2023–24లో అన్ని కంపెనీలవి కలిపి 40 లక్షల యూనిట్ల మార్కును దాటవచ్చు. నవంబర్ రిటైల్ విక్రయాల్లో టాటా మోటార్స్ వాటా 15 శాతం దాటింది. ఎస్‌యూవీల్లో నెక్సన్, పంచ్ గత నెలలో టాప్–2లో ఉన్నాయి. ఎస్యూవీ మార్కెట్లో టాటా రెండవ స్థానంలో నిలిచింది. ప్యాసింజర్ వెహికిల్స్ రంగం నెలకు 3.3–3.5 లక్షల యూనిట్లను నమోదు చేస్తుంది. చిన్న హ్యాచ్బ్యాక్స్, సెడాన్స్‌లో డీజిల్ మోడళ్లు కనుమరుగయ్యాయి. డీజిల్ స్థానంలో సీఎన్జీ వచ్చి చేరింది. ఈ విభాగాల్లో సీఎన్జీ ప్రధాన ప్రత్యామ్నాయంగా నిలిచింది. కాంపాక్ట్ ఎస్‌యూవీకి పైన డీజిల్ మోడళ్లకు బలమైన డిమాండ్ ఉంది. కాబట్టి మార్కెట్‌కు అనుగుణంగా నడుచుకుంటాం’ అని వివరించారు. -
‘మామిడి’లో మనమే ఘనం
సాక్షి, అమరావతి : దేశంలో అత్యధికంగా మామిడి ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. అలాగే జాతీయ స్థాయి సగటు హెక్టార్‌కు మామిడి ఉత్పాదకతను మించి రాష్ట్రంలో సగటు హెక్టార్‌కు మామిడి ఉత్పాదకత అత్యధికంగా ఉంది. దేశంలో ఏపీ తర్వాత మామిడి ఉత్పత్తిలో ఒడిశా రాష్ట్రం ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఒడిశాలో మామిడి తదితర పండ్ల ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు ద్వారా రైతులకు మేలుతో పాటు ఉద్యోగావకాశాలు పెరుగుతాయని అంతర్జాతీయ కార్మిక సంస్థ అధ్యయన నివేదిక వెల్లడించింది. కొరియా ఇంటర్నేషనల్ కో–ఆపరేషన్ ఏజెన్సీ సహకారంతో ఈ అధ్యయనం నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో ఆహార ప్రాసెసింగ్ రంగంలో సూక్ష్మ, మధ్య, చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటు అవకాశాలపై అధ్యయనం చేసి నివేదిక రూపంలో విడుదల చేశారు. నివేదికలో ఉన్న ముఖ్యాంశాలు జాతీయ స్థాయిలో హెక్టార్‌కు సగటున 9.6 టన్నుల మామిడి ఉత్పత్తి అవుతుండగా, ఏపీలో హెక్టార్‌కు సగటున 12 టన్నులు ఉత్పత్తి అవుతోంది. ఒడిశాలో హెక్టార్‌కు సగటున 4 నుంచి 6.3 టన్నుల మామిడి ఉత్పత్తి అవుతోంది. ఏపీలో ఉత్పత్తయ్యే మామిడి పండ్లలో 16% ఫ్రూట్ ప్రాసెస్ చేపడుతున్నారు. ఇలా ప్రాసెస్ చేసిన ఉత్పత్తుల డిమాండ్‌ను పెంచాల్సి ఉంది. ఏపీలో బంగినపల్లి, సువర్ణ రేఖ, నీలం, తోతాపురి రకాలు ఎక్కువగా పండుతుండగా, ఎగుమతికి అనువైన ఇమామ్ పసంద్, బంగినపల్లి, సువర్ణరేఖ వంటి గుజ్జు రకాలూ ఎక్కువగానే పండుతున్నాయి. ఏపీలో ఉత్పత్తి అయ్యే గుజ్జు రకాల పండ్లలో దాదాపు 54 శాతం ఎగుమతి అవుతున్నాయి. ప్రాసెస్ చేసిన పండ్ల ఉత్పత్తులకు అంతర్జాతీయంగా డిమాండ్ ఉంది. గుజ్జు రకాల మామిడి పండ్ల ఉత్పత్తి ఏపీ, ఒడిశాలో అత్యధికంగా ఉంది. పండ్ల ప్రాసెసింగ్ యూనిట్లను ప్రోత్సహించడం ద్వారా అధిక ఉద్యోగాలు కల్పించవచ్చు. పండ్ల ప్రాసెసింగ్ పరిశ్రమలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉంది. ఫుడ్ ప్రాసెసింగ్‌లో కీలకమైన పరిమితులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు నాణ్యమైన ముడి పదార్థాలను అందుబాటులో ఉంచాలి. ప్రభుత్వ పథకాలను అందుబాటులో ఉంచడంతో పాటు త్వరగా అనుమతులివ్వాలి. పండ్ల ప్రాసెసింగ్‌లో 75 శాతం మహిళలకు, 25 శాతం పురుషులకు ఉపాధి లభిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో 3.39 మిలియన్ ఎంఎస్ఎంఈలను ఉండగా, ఒడిశాలో 1.98 మిలియన్ ఎంఎస్‌ఎంఈలున్నాయి. ఈ రెండు రాష్ట్రాల ఎంఎస్‌ఎంఈల్లోనే 111 మిలియన్ల మంది ఉపాధి పొందుతున్నారు. నమోదైన ప్రాసెసింగ్ యూనిట్ల కన్నా ఏపీ, ఒడిశాల్లో నమోదుకాని యూనిట్లు 26 నుంచి 80 రెట్లు ఉంటాయి. ఏపీ ప్రభుత్వం 2020–25 లక్ష్యంగా ఫుడ్ ప్రాసెసింగ్ విధానాన్ని తెచ్చింది.. కొత్త సాంకేతిక బదిలీలను ప్రోత్సహించడం, సాంకేతికతను అప్‌గ్రేడేషన్ చేయడం, ముడి సరుకు సక్రమంగా సరఫరా అయ్యేలా సరైన పంటల ప్రణాళికలకు మద్దతు ఇవ్వడం, వ్యవసాయ ప్రాసెసింగ్ క్లస్టర్లు ఏర్పాటు చేయడం.యువతకు వ్యవస్థాపక నైపుణ్యాభివృద్ధి శిక్షణను అందించడం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఇంక్యుబేషన్ కేంద్రాల ఏర్పాటు, రైతు భరోసా కేంద్రాలు తదితరాలతో బ్యాక్వర్డ్ లింక్‌లను ఏర్పరచుకోవడం వంటివి లక్ష్యంగా విధానాన్ని రూపొందించుకుంది. -
ఏ రాష్ట్రంలో బిచ్చగాళ్లు అధికం? మిగిలిన రాష్ట్రాల పరిస్థితి ఏమిటి?
ప్రపంచంలోని దాదాపు ప్రతి దేశంలో ఉపాధి మార్గాలు లేక వేలాది మంది అల్లాడిపోతున్నారు. ఈ నేపధ్యంలోనే చాలామంది వీధుల్లో, ఇతర రద్దీ ప్రదేశాలలో భిక్షాటనకు దిగుతున్నారు. తద్వారా వారు రెండు పూటలా కడుపు నింపుకుంటున్నారు. భారతదేశంలో కూడా బిచ్చగాళ్ల సంఖ్య అత్యధికం. పలు నగరాల్లో సిగ్నల్స్ దగ్గర, మాల్స్ వెలుపల కూడా బిచ్చగాళ్లు కనిపిస్తారు అయితే దేశంలో ఎక్కువ మంది బిచ్చగాళ్లు ఏ రాష్ట్రంలో ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలో సుమారు 4 లక్షల మంది భిక్షాటన చేస్తూ తమ కుటుంబాలను పోషిస్తున్నారు. ఇవి ప్రభుత్వం చెబుతున్న గణాంకాలు. వాస్తవంగా దీనిని మించిన సంఖ్యలో బిచ్చగాళ్లు ఉండవచ్చు. ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం అత్యధికంగా యాచకులు కలిగిన రాష్ట్రం పశ్చిమ బెంగాల్. ఈ రాష్ట్రంలో బిచ్చగాళ్ల సంఖ్య 81 వేలకు పైగానే ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ లెక్కల ప్రకారం దేశంలో మొత్తం 4 లక్షల 13 వేల మంది యాచకులు ఉండగా, వీరిలో రెండు లక్షల మందికి పైగా పురుషులు, దాదాపు రెండు లక్షల మంది మహిళలున్నారు. దీంతోపాటు చిన్నారులు కూడా యాచక వృత్తిలో కొనసాగుతున్నారు. పశ్చిమ బెంగాల్ తర్వాత ఉత్తరప్రదేశ్‌లో 65 వేలకు పైగా యాచకులు ఉన్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లు ఉన్నాయి. చండీగఢ్‌లో 121 మంది యాచకులు మాత్రమే ఉన్నారు. దేశంలో అత్యల్పంగా బిచ్చగాళ్లు ఉన్న ప్రాంతం విషయానికొస్తే లక్షద్వీప్‌లో కేవలం ఇద్దరు బిచ్చగాళ్లు మాత్రమే ఉన్నారు. ఇది కాకుండా దాదర్ నగర్ హవేలీలో 19 మంది, డామన్-డయ్యూలో 22 మంది యాచకులు ఉన్నారు. అయితే ఈ సంఖ్య ఖచ్చితమైమనది కాదు. ఎందుకంటే ప్రభుత్వం 2011లో నిర్వహించిన జనాభా లెక్కల ఆధారంగా ఈ గణాంకాలను ఉన్నాయి. ఇది కూడా చదవండి: ఆంటీ ల్యాప్‌టాప్ ఇవ్వకపోతేనేం.. చిట్టితల్లి ఏం చేసిందో చూడండి! -
మహాత్మా గాంధీ వీలునామా ఏ భాషలో రాశారు? ఎంతకు విక్రయమయ్యింది?
దేశవ్యాప్తంగా నేడు (అక్టోబర్ 2) గాంధీ జయంతి వేడుకలు జరుగుతున్నాయి. పలు పాఠశాలల్లో గాంధీజీని గుర్తుచేస్తూ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మనం గాంధీజీ వినియోగించిన వస్తువులకు సంబంధించిన వేలం వివరాలను తెలుసుకుందాం. నాటి రోజుల్లో గాంధీ వినియోగించిన పలు వస్తువులు అత్యధిక ధరలకు వేలంలో అమ్ముడయ్యాయి. గతంలో నిర్వహించిన ఈ వేలంలో గాంధీజీ రాసిన వీలునామా అత్యధిక ధరకు అమ్ముడయ్యింది. ఈ వేలంలో గాంధీజీ వినియోగించిన బ్రౌన్ స్లిప్పర్, లెదర్ బ్యాగ్ కూడా అమ్ముడయ్యాయి. ఈ రెండింటికీ కొనుగోలుదారులు అధిక ధరలను చెల్లించారు. మహాత్మా గాంధీ గుజరాతీ భాషలో రాసిన రెండు పేజీల వీలునామా పత్రం అత్యంత ఖరీదైనదిగా నిలిచింది. ఈ వీలునామా పత్రం వేలంలో 55 వేల పౌండ్లకు విక్రయమయ్యింది. ఇది ఇప్పటి మన కరెన్సీలో రూ. 55 లక్షల కంటే అధికం. దీని వేలం కోసం ప్రారంభమైన బిడ్డింగ్ 30 నుండి 40 వేల పౌండ్లతో ప్రారంభం కావడం విశేషం. అయితే ఈ వీలునామాను ఎవరు కొనుగోలు చేశారనేది ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. అదే వేలంలో గాంధీజీ వినియోగించిన బ్రౌన్ లెదర్ స్లిప్పర్ కూడా అమ్ముడుపోయింది. దీని కోసం కొనుగోలుదారులు 19000 పౌండ్లు చెల్లించారు. దీన్ని భారత రూపాయిల్లోకి మార్చినట్లయితే దాదాపు రూ.19 లక్షలు అవుతుంది. బీబీసీలో ప్రచురితమైన నివేదిక ప్రకారం గాంధీ ముంబైలోని జుహు బీచ్ సమీపంలోని ఒక ఇంట్లో 1917 నుండి 1934 వరకు నివసించారు. అక్కడే గాంధీ వినియోగించిన చెప్పులు లభ్యమయ్యాయి. ఇది కూడా చదవండి: స్వాతంత్ర్యం వచ్చాక మహాత్మాగాంధీ ఏం చేశారు? -
ఈపీఎఫ్‌వోలో 18.75 లక్షల మంది కొత్త సభ్యులు
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థలో జూలై నెలలో అత్యధికంగా 18.75 లక్షల మంది సభ్యులుగా చేరారు. 2018 ఏప్రిల్ నుంచి ఈపీఎఫ్‌వో నెలవారీ పేరోల్ గణాంకాలను విడుదల చేస్తుండగా, ఒక నెలలో ఈ స్థాయిలో సభ్యుల చేరిక ఇదే మొదటిసారి. ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్ర కారి్మక శాఖ బుధవారం విడుదల చేసింది. కొత్త సభ్యుల్లో 10.27 లక్షల మంది మొదటిసారి ఈపీఎఫ్‌వో పరిధిలోకి వచి్చనవారు కాగా, మిగిలిన వారు ఒక చోట ఉద్యోగం మానివేసి.. మరో సంస్థ తరఫున తాజాగా నమోదు చేసుకున్నారు. కొత్త సభ్యుల్లో 18–25 ఏళ్ల వయసువారే 58 శాతానికి పైగా ఉన్నారు. వీరంతా మొదటిసారి సంఘటిత రంగంలో ఉపాధి పొందినట్టు తెలుస్తోంది. ఇక జూలైలో ఈపీఎఫ్ పరిధిలోకి వచ్చిన వారిలో 3.86 లక్షల మంది మహిళలు ఉన్నారు. వీరిలో నికరంగా 2.75 లక్షల మంది మొదటిసారి పేర్లు నమోదు చేసుకున్నారు. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, హర్యానా రాష్ట్రాల నుంచి నికర సభ్యుల చేరిక అధికంగా నమోదైంది. ఈ రాష్ట్రాలే 58.78 శాతం వాటా ఆక్రమిస్తున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల నుంచి జూలైలో 11.02 లక్షల మంది ఈపీఎఫ్‌వోలో చేరారు. ఈఎస్ఐ కిందకు 19.88 లక్షల మంది ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) నిర్వహించే సామాజిక భద్రతా పథకం ఈఎస్ఐ కిందకు జూలై నెలలో 19.88 లక్షల మంది సభ్యులు వచ్చి చేరారు. కొత్తగా 28,870 సంస్థలు ఈఎస్ఐసీ కింద నమోదు చేసుకున్నాయి. కొత్త సభ్యుల్లో 25 ఏళ్లలోపు వారు 9.54 లక్షలుగా ఉన్నారు. మహిళా సభ్యులు 3.82 లక్షలుగా ఉన్నట్టు పేరోల్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అలాగే, 52 మంది ట్రాన్స్జెండర్లు కూడా ఈఎస్ఐ కింద నమోదు చేసుకున్నారు. -
భారీ లాభాల్లోకి ఇండిగో: ఆదాయంలోనూ కొత్త రికార్డ్
న్యూఢిల్లీ: విమానయాన రంగ దిగ్గజం ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023-24) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. ఇండిగో బ్రాండు విమాన సర్వీసుల కంపెనీ ఏప్రిల్-జూన్(క్యూ1)లో టర్న్అరౌండ్ అయ్యింది. కొత్త రికార్డ్ సృష్టిస్తూ రూ. 3,091 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2022-23) ఇదే కాలంలో రూ. 1,064 కోట్ల నికర నష్టం ప్రకటించింది. ఈ బాటలో కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 17,161 కోట్ల టర్నోవర్ అందుకుంది. (నితిన్ దేశాయ్ అకాల మరణం: అదే కొంప ముంచింది!) గత క్యూ1లో రూ. 13,019 కోట్ల ఆదాయం నమోదైంది. కాగా.. ఒక త్రైమాసికంలో రికార్డ్ సంఖ్యలో ప్రయాణికులను చేరవేయడం ద్వారా ఇండిగో చరిత్రలోనే అత్యధిక ఆదాయం, నికర లాభాలు సాధించినట్లు కంపెనీ సీఈవో పీటర్ ఎల్బర్స్ పేర్కొన్నారు.జూన్ చివరికల్లా మొత్తం నగదు నిల్వలు రూ. 27,400 కోట్లను తాకినట్లు కంపెనీ వెల్లడించింది. వెంచర్ క్యాపిటల్(వీసీ) పెట్టుబడుల సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ తాజాగా పేర్కొంది. ఇందుకు బోర్డు అనుమతించినట్లు వెల్లడించింది. -
దేశంలో అందరి కంటే ఎక్కువ ట్యాక్స్ కట్టేదెవరో తెలుసా?
India’s highest taxpayer: దేశంలో ప్రస్తుతం ఇన్కమ్ ట్యాక్స్ (Income tax) రిటర్న్ ఫైలింగ్ హడావుడి నడుస్తోంది. ట్యాక్స్ పేయర్లందరూ ఐటీఆర్ ఫైల్ (ITR filing) చేయడంలో బిజీలో ఉన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరం ఐటీఆర్ ఫైలింగ్ గడువు జులై 31తో ముగియనుండగా జులై 30 వరకు వరకు 6 కోట్ల ఐటీఆర్‌లు దాఖలైనట్లు ఐటీ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో దేశంలో అత్యధికంగా ఆదాయపు పన్ను ఎవరు కడుతున్నారు అనే ప్రశ్న చాలా మందిలో తలెత్తి ఉండవచ్చు. అంబానీ, అదానీనో లేదా టాటా, బిర్లానో కడుతుంటారులే అని చాలా మంది భావిస్తుంటారు. కానీ దేశంలో అత్యధిక ట్యాక్స్ కట్టేది వీళ్లెవరూ కాదు.. అసలు బిజినెస్మెన్లే కాదు.. మరి ఎవరు? ఆ వ్యక్తి ఎవరో కాదు బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ (Akshay Kumar). ఆదాయపు పన్ను శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం, అక్షయ్ కుమార్ గత సంవత్సరం అంటే 2021-22 ఆర్థిక సంవత్సరంలో దేశంలో హయ్యస్ట్ ట్యాక్స్ పేయర్. అక్షయ్ కుమార్ 2022లో రూ. 29.5 కోట్ల ఆదాయపు పన్నును చెల్లించారు. ఆ సంవత్సరం ఆయన తన వార్షిక ఆదాయాన్ని రూ. 486 కోట్లుగా ప్రకటించారు. అంతకుముందు కూడా ఆయనే.. బాలీవుడ్లో అత్యధిక పారితోషికం తీసుకునే స్టార్లలో అక్షయ్ కుమార్ ఒకరు. ఏడాదికి 4 నుంచి 5 సినిమాలు చేస్తూ భారీగా సంపాదిస్తున్నారు. అంతే కాకుండా సొంత ప్రొడక్షన్ హౌస్, స్పోర్ట్స్ టీమ్‌ని నడుపుతున్నారు. ఇక వివిధ బ్రాండ్ల ఎండార్స్మెంట్ల నుంచి కూడా చాలానే ఆర్జిస్తున్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో కూడా అక్షయ్ కుమారే హయ్యస్ట్ ట్యాక్స్ పేయర్ కావడం విశేషం. ఆ సంవత్సరంలో ఆయన రూ. 25.5 కోట్ల ఆదాయపు పన్ను చెల్లించారు. దేశంలో అత్యంత సంపన్నులు ఎవరు అంటే ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, రతన్ టాటా వంటి బిజినెస్మెన్ల పేర్లు చెబుతారు. కానీ వారెందుకు టాప్ ట్యాక్స్ పేయర్ల జాబితాలో లేరు అను సందేహం చాలా మందికి కలుగుతుంది. దీనికి సమాధానం.. ఆ వ్యాపారవేత్తలకు వ్యక్తిగత ఆస్తులు లేవు. అన్నీ వారి కంపెనీల పేరుతోనే ఉంటాయి. కాబట్టి ఆదాయాలు కూడా వారి కంపెనీల వాటాకు వెళ్తాయి. ఆయా కంపెనీలు వ్యక్తిగత ట్యాక్స్‌కు బదులు కార్పొరేట్ ఆదాయపు పన్ను చెల్లిస్తాయి. ఇదీ చదవండి ➤ Beware of I-T notice: ఐటీ నోటీసులు రాకూడదంటే.. ఈ తప్పులు అస్సలు చేయొద్దు -
ఏపీలో ప్రకృతి సాగు భేష్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి వ్యవసాయ విధానం ఆదర్శనీయమని ప్రపంచ ప్రసిద్ధి చెందిన గ్లోబల్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ టూల్‌కిట్ (జిస్ట్) ఇంపాక్ట్ సంస్థ ప్రకటించింది. వైఎస్ జగన్ ప్రభుత్వ ప్రోత్సాహంతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున అమలవుతున్న ప్రకృతి వ్యవసాయం ప్రపంచంలోనే వ్యవసాయ పర్యావరణానికి (అగ్రో ఎకాలజీకి) అతి పెద్ద పరివర్తన (మార్పు) అని తెలిపింది. ప్రకృతి వ్యవసాయం ప్రస్తుత వ్యవసాయ విధానాలకు సరియైన లాభసాటి ప్రత్యామ్నాయ విధానమని వెల్లడించింది. అధిక దిగుబడి, అత్యున్నత జీవనోపాధి, సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రకృతి వ్యవసాయం ఎంతగానో దోహదపడుతుందని తెలిపింది. ప్రపంచ స్థాయి సంస్థల కూటమి (గ్లోబల్ అలయన్స్ ఫర్ ది ఫ్యూచర్ ఆఫ్ ఫుడ్ ) మద్దతుతో జిస్ట్ ఇంపాక్ట్ సంస్థ ఆంధ్రఫ్రదేశ్‌లో నిర్వహించిన అధ్యయన ఫలితాలను బుధవారం వెల్లడించింది. భావితరాలను దృష్టిలో ఉంచుకొని ప్రపంచ స్థాయిలో ఆహార వ్యవస్థల్లో పరివర్తన తేవడానికి ఈ సంస్థలు కలిసి పనిచేస్తున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలోని మూడు విభిన్న ప్రాంతాల్లో ప్రకృతి వ్యవసాయ ఫలితాలను నిశితంగా పరిశీలించారు. కోస్తా, రాయలసీమ, డెల్టా ప్రాంతాల్లో అధ్యయనం చేశారు. 2020 – 2022 మధ్య ఎంపిక చేసిన 12 గ్రామాల్లో ఇంటింటా సమగ్ర ప్రాథమిక సర్వే చేశారు. విస్తృత ప్రయోజనాలతో నిర్వహించిన ఈ అధ్యయనంలో పలు అంశాలు వెలుగు చూశాయి. వ్యవసాయ పర్యావరణ మార్పునకు దోహదం ఇతర విధానాలతో పోల్చితే సంప్రదాయ జీవ ఎరువులతో చేస్తున్న ప్రకృతి వ్యవసాయంలో అధిక దిగుబడి వస్తోంది. ఈ విధానంలో పంట వైవిధ్యత చూపితే 11% అధిక దిగుబడి వ స్తుంది. ఇది పెరుగుతున్న జనా భాకు సరిపడే ఆహారాన్ని ఉత్పత్తి చేస్తుంది. తద్వారా 49% అధిక లాభం చేకూరడంతో ప్రకృతి వ్యవసాయ కుటుంబాల్లో ఆనందం వెల్లి విరుస్తోంది. ఆ రైతుల కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయి. రైతు వ్యవస్థ బలంగా తయారవుతోందని వెల్లడించింది. ప్రకృతి సాగులో మహిళా శ్రామిక శక్తి అధికం మహిళా సంఘాల సభ్యులు భాగస్వామ్యం పెరుగు తుండడంతో ప్రకృతి సాగులో మహిళా శ్రామిక శక్తి అధికంగా కనిపిస్తోందని జిస్ట్ ఇంపాక్ట్ పేర్కొంది. మహిళలు క్రియాశీలక పాత్ర పోషిస్తుండడంతో కు టుంబాల మధ్య ఐక్యత, అన్యోన్యత పెరుగు తు న్నాయి. తద్వారా సామాజిక పెట్టుబడిలో పెరుగు దల స్పష్టంగా కన్పిస్తోంది. ఇతర పద్ధతుల్లో వ్యవ సాయం చేసే రైతులతో పోలిస్తే ప్రకృతి సాగు చేసే రైతుల్లో 33%తక్కువ పని దినాలతోనే అనుకున్న లక్ష్యాలను సాధిస్తున్నారు. సంప్రదాయ పద్ధతుల్లో వ్యవసాయం చేసే రైతులు మితిమీరి వినియోగి స్తున్న రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకం వల్ల ఉత్పాదకత నష్టాలతోపాటు అనారో గ్యానికి గురవుతున్నారు. ప్రకృతి సాగులో ఆ పరిస్థితి కన్పించడంలేదు. గ్రామీణ జీవనోపాధి, పౌష్టికాహా రం, జీవ వైవిధ్య నష్టం, వాతావరణ మార్పు, నీటి కొరత, కాలుష్యం వంటి బహుళ అభివృద్ధి సవాళ్లను ప్రకృతి సాగు చేస్తున్న రైతులు అధిగమిస్తున్నారని అధ్యయనంలో గుర్తించినట్టు ఆ సంస్థ తెలిపింది. భవిష్యత్ ప్రణాళికకు ఇదొక బ్లూ ప్రింట్ మా పరిశోధన వాతావరణ పర్యావరణ అనుకూల వ్యవసాయ అభివృద్ధికి ఒక నమూనా (బ్లూప్రింట్)గా ఉపయోగపడుతుంది. ఏపీని స్ఫూర్తిగా తీసు కొని ప్రకృతి వ్యవసాయంలో ముందుకె ళ్లాలని భాగస్వామ్య దేశాలకు సిఫార్సు చేస్తాం. – పవన్ సుఖ్‌దేవ్, జిస్ట్ ఇంపాక్ట్, సీఈవో ప్రభుత్వ కృషి ప్రశంసనీయం ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతుల జీవితాలు, సమాజంలో మార్పుకు కృషి జరుగు తున్నట్టు గుర్తించాం. సంప్రదాయ వ్యవ సాయం నుంచి రైతులను ప్రకృతి వ్యవ సాయం దిశగా తీసుకు వె ళ్లేందుకు ప్రభుత్వం చే స్తున్న కృషి ప్రశంసనీయం. – లారెన్ బేకర్, డిప్యూటీ డైరెక్టర్, గ్లోబల్ అలయన్స్ ఫర్ ది ఫ్యూచర్ అంతర్జాతీయంగా గుర్తింపు భవిష్యత్‌లో ఎదురయ్యే ఆహార సంక్షోభ పరి స్థితులకు ప్రకృతి వ్యవసాయం ఒక్కటే చక్క టి పరిష్కారమని జిస్ట్ ఇంపాక్ట్ సర్వే స్పష్టం చేస్తోంది. రెండేళ్లపాటు శాస్త్రీయ పద్ధతిలో చేసిన ఈ అధ్యయనం ఫ లితాలు రాష్ట్రంలో ప్రకృతి సాగుకు అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చేందుకు దోహదపడతాయి. – టి.విజయ్ కుమార్, ఎగ్జిక్యూటివ్ వైస్‌చైర్మన్, రైతు సాధికార సంస్థ