పెట్రోల్, డీజిల్ ధరల దూకుడు మరింత కొనసాగుతోంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు మండుతుండటంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు మునుపెన్నడూ లేని స్థాయిలకు చేరాయి. శుక్రవారం నాటి పెరుగుదలతో పెట్రోల్ ధర 55నెలల గరిష్టాన్ని నమోదు చేసింది. డీజిల్ కూడా ఇదే బాటలో రికార్డ్ స్థాయికి ఎగబాకి మరింత మండుతోంది. పెట్రోల్ ధర ఈ నెల ఆరంభంనుంచి మొత్తం 50 పైసలుపైగా పెరగగా, డీజిల్ ధర 90పైసలకు పైగా ఎగిసింది. 2013 సెప్టెంబర్ తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు అత్యధికంగా ఉన్నట్లు ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్ పేర్కొంది.