
ఫార్చూన్ ఇండియా.. 2023-24 ఆర్థిక సంవత్సరానికిగానూ అత్యధిక ట్యాక్స్ కట్టిన స్టార్స్ లిస్ట్‌ను విడుదల చేసింది.

ఈ జాబితా ప్రకారం.. స్టార్ హీరో షారూఖ్ ఖాన్ అందరు సెలబ్రిటీలకంటే ఎక్కువ ట్యాక్స్ (రూ.92 కోట్ల పన్ను) కట్టాడు.

రూ.80 కోట్లు పన్ను రూపంలో చెల్లించిన దళపతి విజయ్ రెండో స్థానంలో ఉన్నాడు.

రూ.75 కోట్లతో సల్మాన్ ఖాన్ మూడో స్థానంలో ఉన్నాడు.

రూ.71 కోట్లతో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ నాలుగో స్థానంలో నిలిచాడు.

రూ.66 కోట్ల పన్ను చెల్లింపుతో క్రికెటర్ విరాట్ కోహ్లి ఐదో స్థానంలో ఉన్నాడు.

రూ.42 కోట్లతో అజయ్ దేవ్‌గణ్ ఆరో స్థానంలో ఉన్నాడు.

రూ.38 కోట్లతో క్రికెటర్ ఎమ్‌ఎస్ ధోని ఏడో స్థానంలో నిలబడ్డాడు.

రూ.36 కోట్లతో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ ఎనిమిదో స్థానంలో ఉన్నాడు.

రూ.28 కోట్లతో హీరో హృతిక్ రోషన్, క్రికెటర్ సచిన్ టెండుల్కర్ తొమ్మిదో స్థానాన్ని పంచుకున్నారు.

కమెడియన్ కపిల్ శర్మ రూ.26 కోట్ల పన్ను చెల్లింపుతో పదో స్థానంలో ఉన్నాడు.

టాప్ 10లో తెలుగు హీరోలు లేకపోయినప్పటికీ అల్లు అర్జున్ టాప్ 20లో చోటు దక్కించుకున్నాడు. బన్నీ రూ.14 కోట్ల ట్యాక్స్ కట్టి పదహారో స్థానంలో నిలబడ్డాడు.