Celebreties
-
పెళ్లి మూడ్‌లో బిగ్‌బాస్ బ్యూటీ సోనియా ఆకుల.. ప్రముఖులకు ఆహ్వానాలు! (ఫొటోలు)
-
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం.. సెలబ్రిటీల సందడి (ఫోటోలు)
-
సెలూన్ ఓపెనింగ్‌లో బిగ్ బాస్ సెలబ్రిటీల సందడి (ఫొటోలు)
-
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం జోరుగా : కన్నెత్తి చూడని బాలీవుడ్ సెలబ్రిటీలు
సాక్షి ముంబై: ఎన్నికల ప్రచారంలో సినీతారలకు ప్రజల్లో ఉన్న క్రేజే వేరు. పంచ్ డైలాగులు, హావభావాలతో రోడ్ షోలు, ఎన్నికల సభలను రక్తికట్టించడంలో వారికి వారే సాటి. అందుకే ఓటర్లను ఆకర్షించేందుకు ఓ మాదిరి ఆర్టిస్టుల దగ్గర్నుంచి బడా నటీనటుల వరకూ రాజకీయ పార్టీలు తమ తరపున ప్రచారం చేయమంటూ ఆహ్వానించడం పరిపాటి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న తరుణంలో ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నప్పటికీ పలువురు సినీ, బాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రం ఈవైపు కన్నెత్తి చూడడం లేదు. క్యాంపెయినింగ్‌కు దూరంగా బాలీవుడ్.. గతంలో ప్రముఖ రాజకీయ పార్టీల తరపున విస్తృతంగా ప్రచారం చేసిన అనేక మంది బాలీవుడ్ తారలు ఇప్పుడు ఊరుకోవడమే ఉత్తమమని భావిస్తున్నారు. కొందరు మినహా అనేక మంది సినీ ప్రముఖులు ప్రచార సభలు, రోడ్‌షోలకు దూరంగా ఉంటున్నారు. సల్మాన్ ఖాన్ ఇంటిపై ఇటీవల కాల్పులు జరగటం, మాజీ మంత్రి బాబా సిద్ధిఖీని బిష్ణోయి గ్యాంగ్ హత్య చేయడం, సల్మాన్‌ఖాన్, షారుఖ్ ఖాన్లకు కూడా ఈ గ్యాంగ్ ద్వారా బెదిరింపు ఫోన్లు రావడం వల్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో ప్రముఖ బాలీవుడ్ తారలతోపాటు చిన్న చిన్న పాత్రలు పోషించే ఆర్టిస్టులు కూడా మనకెందుకొచ్చిన గొడవలే అన్నట్లుగా మిన్నకుంటున్నారు. ఒకవేళ ఎవరైన బడా నేతలు ప్రచారానికి రావాలని అడిగినా షూటింగుల్లో బిజీగా ఉన్నామని, విదేశాల్లో ఉన్నామని చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకే... లోక్‌సభ, అసెంబ్లీ, కార్పొరేషన్ ఇలా ఎలాంటి ఎన్నికలు వచి్చనా ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పారీ్టలు అనేక విధాలుగా ప్రయత్నిస్తాయి. అందులో ముఖ్యంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు బాలీవుడ్ తారలను ప్రచారంలోకి దింపడం ఒక ఫ్యాషన్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇలాంటి సభలకు పెద్ద సంఖ్యలో జనాలు వస్తారని, వీరి మాటల ప్రభావంతో ఓటర్లు తమ పార్టీ అభ్యరి్ధకి ఓటు వేస్తారని నేతల ప్రగాఢ నమ్మకం. మాజీ మంత్రి, ఇటీవలే హత్యకు గురైన బాబా సిద్దీఖీ తరపున గతంలో అనేక మంది ప్రముఖ బాలీవుడ్ నటులు ప్రచారంలో పాల్గొన్నారు. అప్పట్లో సిద్దిఖీ నిర్వహించే సభలు, ర్యాలీలు, రోడ్ షోలలో సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ లాంటి అనేక మంది దిగ్గజ సెలిబ్రిటీలు కనిపించేవారు. ఆయన విజయంలో ఇది కూడా పరిగణించదగ్గ అంశమని రాజకీయ వర్గాల అభిప్రాయం. కానీ ఇటీవల ఆయన హత్యకు గురికావడంతో బాలీవుడ్ తారల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ఈ హత్య తామే చేసినట్లు బిష్నోయి గ్యాంగ్ అంగీకరించడంతో పాటు పలువురు సెలబ్రిటీలకు ఈ గ్యాంగ్ నుంచి బెదిరింపులు రావడంతో ప్రచార సభలకు సా««ధ్యమైనంత దూరంగా ఉండాలని వారంతా భావిస్తున్నారు. ప్రాంతీయ నటులతో ప్రచారం... గతంలో మాదిరిగా ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల కోసం అనేక మంది సినీ తారలను స్టార్ క్యాంపెయినర్లుగా నియమించినప్పటికీ ఈసారి వారంతా ముఖం చాటేశారు. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యక్షంగా ప్రచార సభలకు హాజరయ్యేందుకు వారు నిరాకరిస్తుండటంతో రాజకీయ పారీ్టలు గత్యంతరం లేక ప్రాంతీయ సినిమా, స్టేజీ ఆరి్టస్టులను ప్రచారం నిర్వహించాల్సిందిగా కోరుతున్నాయి. దీంతో మరాఠీ సినీ, నాటక రంగానికి చెందిన తారలకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. కొన్ని గంటల ప్రచారానికి కొంతమంది రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు ఇక రోజంతా ప్రచారంలో పాల్గొనాలంటే రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు కూడా వసూలు చేస్తున్నారు. ఇక ఏ గ్రేడ్ తారలైతే రూ.20–35 లక్షల వరకూ డిమాండ్ చేస్తున్నారని సమాచారం. దీంతో మరోదారి లేక వారడిగినంత చెల్లించి ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి రాజకీయ పార్టీలు. కాగా కొందరు మరాఠీ నటుల మాత్రం రాజకీయ పార్టీలతో ఉన్న అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకుని ఉచితంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం... దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన, జరగనున్న ఎన్నికల్లో ప్రచారం విషయంలో ఈసారి సోషల్ మీడియాదే అగ్రస్థానం. తాము చెప్పదలచుకున్న విషయాలను, వివరించదలచిన అంశాలను సూటిగా, స్పష్టంగా, నిమిషాల వ్యవధిలో ఓటర్లకు చేర్చడంలో ఇది అత్యంత ప్రభావవంతమైన మాధ్యమం కావడంతో రాజకీయ పార్టీలు బహిరంగ సభలు, రోడ్‌షోలు, ఇంటింటి ప్రచారంతోపాటు సోషల్ మీడియాను కూడా విస్తృతంగా వినియోగించుకుంటున్నాయి. బాలీవుడ్ తారలు ప్రత్యక్ష ప్రచారంలో పాల్గొనక పోయినప్పటికీ వారి వాయిస్ రికార్డింగులు, వీడియోలను ఫేస్ బుక్, ఇన్‌స్ట్రాగామ్, ట్విట్టర్ తదితర సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేస్తున్నారు. ఈ వీడియోలు వైరల్‌గా మారి తమకు భారీగా ఓట్లు దక్కే అవకాశముందని అభ్యర్ధులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.తెలుగు ఓటర్ల కోసం ప్రత్యేకంగా...ముంబై సహా మహారాష్ట్ర సరిహద్దులైన విదర్భ. మరఠ్వాడాలోని చంద్రాపూర్, నాందేడ్, బల్లార్పూర్తోపాటు నాసిక్, ముంబై. పుణే, సోలాపూర్ తదితర ప్రాంతాల్లో తెలుగు ప్రజలు అధికంగా నివసిస్తున్నారు. దీంతో ఈ ప్రాంతాల పరిధిలోని నియోజక వర్గాలలో పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి నటీనటులతోపాటు తెలుగు నేతలను ప్రచార రంగంలోకి దింపే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగు ప్రజలు అధికంగా ఉండే ప్రాంతాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు మంత్రులు ఉత్తమకుమార్ రెడ్డి, సీతక్క, ఇతర కాంగ్రెస్ నేతలు మహావికాస్ ఆఘాడి, కాంగ్రెస్‌లకు మద్దతుగా ర్యాలీలు, రోడ్ షోల ద్వారా విస్తత ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బీజేపీకి మద్దతుగా ప్రచారం చేయడానికి అంగీకరించినట్లు సమాచారం. బీజేపీ, టీడీపల మధ్య పొత్తు కుదిర్చేందుకు పవన్ ఎంతో కృషి చేశారు. ఈ నేపథ్యంలో తెలుగు ప్రజలుండే నియోజక వర్గాలలో బీజేపీ అభ్యర్ధులకు మద్దతుగా ప్రచారం చేయడానికి ఆయన స్వయంగా రంగంలోకి దిగనున్నారని తెలుస్తోంది నో స్టార్స్... ఓన్లీ క్యాంపెయినింగ్ క్యాంపెయిన్‌లో పాల్గొననున్న మరాఠీ తారలు వీరే ...నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) (అజిత్ పవార్ వర్గం)–శాయాజీ శిందే, భావు కదం. శివసేన (ఏక్నాథ్ శిందే)–గోవిందా, శరద్ పోంక్షే. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్)–ప్రజక్తా మాళీ, తేజస్వినీ పండిట్. ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం)–అమోల్ కోల్హే. బీజేపీ–ప్రియా బేర్డే, నిశా పరుళేకర్. -
లవ్ అండ్ లైట్ : ఫెస్టివ్ వైబ్స్‌తో కళకళలాడిపోతున్న సెలబ్రిటీలు (ఫోటోలు)
-
అత్యంత అందమైన శాకాహార సెలబ్రిటీలు వీరే!
బాలీవుడ్ తారలు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, రితీష్ దేశ్‌ముఖ్‌లను పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ (పెటా) ఇండియా 2024కి గాను భారతదేశపు ’అత్యంత అందమైన శాకాహార సెలబ్రిటీలు’ గా ఎంపిక చేసింది. జంతు సంక్షేమం పట్ల గల అంకితభావానికి, కారుణ్య జీవనశైలి నిబద్ధతకు గుర్తింపుగా వారికి ఈ గౌరవం లభించింది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ‘పనితో సంబంధం లేకుండా కూడా వెలుగులోకి రావడం ఆనందంగా ఉంది’ని ఈ సందర్భంగా తెలియజేసింది. గతంలో హాటెస్ట్ వెజిటేరియన్ సెలబ్రిటీ అవార్డు టైటిల్ విజేతలలో జీనత్ అమన్, జాకీ ష్రాఫ్, ఫాతిమా సనా షేక్, రాజ్‌కుమార్ రావు, అలియా భట్, అక్షయ్ కుమార్, భూమి పెడ్నేకర్, శ్రద్ధా కపూర్, సోనూసూద్, మానుషి చిల్లర్ .. వంటి సెలబ్రిటీల పేర్లు ఉన్నాయి. మానుషి చిల్లర్, సునీల్ ఛెత్రి, అనుష్క శర్మ, కార్తీక్ ఆర్యన్, విద్యుత్ జమ్వాల్, షాహిద్ కపూర్, రేఖ, అమితాబ్ బచ్చన్ లు కూడా అత్యంత అందమైన శాకా హారులుగా గుర్తింపు పొందారు. ఈ యేడాది జాక్వెలిన్ తన స్టార్ పవర్‌ను అన్ని జంతువుల రక్షణ కోసం ఉపయోగించడంలో పేరొందింది. 50 ఏళ్లకు పైగా సంకెళ్లలో ఉంచిన ఏనుగును రక్షించిన #Freegajraj ప్రచారంతో సహా అనేక మార్గాల్లో పెటా ఇండియా పనికి మద్దతుగా తన అభిమానులను సమీకరించింది.రితేష్ శాకాహారి. శాకాహారాన్ని ప్రోత్సహిస్తున్నాడు. భార్య జెనీలియాతో కలిసి శాకాహార మాంసం కంపెనీని కూడా స్థాపించాడు. ‘నటన నుంచి జంతు సంరక్షణ వరకు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, రితీష్ దేశ్‌ముఖ్ నిజమైన సూపర్ స్టార్లుగా నిరూపితమయ్యారు’ అని పెటా ఇండియా సెలబ్రిటీ, పబ్లిక్ రిలేషన్స్ వైస్ ప్రెసిడెంట్ సచిన్ బంగేరా తెలిపారు. ‘ఈ విధంగా దయను ప్రపంచానికి చూపినందుకు పెటా ఇండియా వారిని గౌరవించడం ఆనందంగా ఉంది. అన్నింటికన్నా వీరిది నాణ్యమైన అందం’ అని ప్రశంసించారు. -
శోకసంద్రంలో మలైకా అరోరా, తరలి వచ్చిన బీటౌన్ పెద్దలు (ఫొటోలు)
-
సెలబ్రిటీలు.. వారి గ్రాండ్ పేరెంట్స్ మరిచిపోలేని బంధం (ఫోటోలు)
-
సినీ తారల ఇళ్లలో చవితి వేడుకలు.. ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కోలా (ఫోటోలు)
-
ఎక్కువ ట్యాక్స్ కడుతున్న సెలబ్రిటీలు ఎవరో తెలుసా? (ఫోటోలు)
-
గురువును మించిన శిష్యులు: ఈ సెలబ్రిటీల గురించి తెలుసా?
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెబరు 5న మన దేశంలో టీచర్స్‌డే జరుపుకోవడం ఆనవాయితీ. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆసాధారణ ప్రజ్ఞాశాలి. రాజ నీతి కోవిదుడు, విద్యావేత్త. భారత తొలి ఉపరాష్ట్రపతిగా, రెండో రాష్ట్రపతిగా విశేషసేవంలందించి, భారత అత్యున్నత పురస్కారం ‘భారతరత్నం’ అందుకున్న గొప్ప వ్యక్తి.ఉధ్యాయ దినోత్సవం అనగానే విద్యార్థులకు ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది.ఒక విధంగా చెప్పాలంటే ఇదొక అరుదైన సందర్భం అని చెప్పవచ్చు. టీచర్లు, విద్యార్థుల కలిసి సరదాగా ఆడుతూ పాడుతూ గడిపే చక్కటి అవకాశం. తమ అభిమాన టీచర్ల వేషధారణలో సందడి చేస్తారు. వారిని అనుకరిస్తారు. భవిష్యత్తులోతామూ ఇలాగే కావాలని కలలు కంటారు. జీవితాంతా తమ అభిమాన టీచర్లను, వారి జ్ఞాపకాలను తమ గుండెల్లో పదిలంగా దాచుకుంటారు. అలాంటి వారిలో కొంతమంది సెలబ్రిటీల గురించి తెలుసుకుందాం. ‘‘రాయిని వజ్రంలా మార్చగలిగే శక్తే ఉపాధ్యాయుడు’’గురువు అంటే మనల్ని అజ్ఞానంనుంచి జ్ఞానంవైపు నడిపించే అద్భత శక్తి. విద్యతో పాటు విచక్షణ కూడా నేర్పించేవాడే గురువు. గురువు లేనిదే ఏ మనిషికీ పురోగతి లేదు. గురువు అనేక రూపాలలో ఉంటాడు. గైడ్ అనే ఆంగ్ల పదం సంస్కృత పదం గురు నుండి ఉద్భవించింది. నిస్వార్థంగా తన విజ్ఞానమంతా శిష్యుడికి ధారపోస్తాడు గురువు. ఆ జ్ఞానంతో తన శిష్యుడు లోకానికి మేలు చేయాలని భావిస్తాడు.‘‘విద్యార్థులను తీర్చిదిద్దే క్రమంలో వెలకట్టలేని త్యాగాలు చేసిన ఉపాధ్యాయులందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు.’’అమితాబ్ బచ్చన్: బాలీవుడ్ స్టార్ యాక్టర్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్. గంభీరమైన ఆయన వాయిస్‌కు ఫిదా కాని వారు ఉండరు. ఆయన స్వరమే ఆయనకు కొండంత ఆస్తి. ఆయన స్వరంగా ఇంత గొప్ప ఖ్యాతి గడించినడానికి, పాపులర్ కావడానికి కారణం ఇంగ్లీష్ టీచర్ మార్టిన్. తప డిక్షన్‌ను అభివృద్ధి చేయడంలో మార్టిన్ ఎంతో సాయం చేశారని, తనను ఎంతో ప్రోత్సహించేవారని మార్టిన్ గురించి ఎపుడూ చెబుతూంటారు.ఏ.పీ. జే అబ్దుల్ కలాం: భారతదేశ మాజీ రాష్ట్రపతి, ప్రఖ్యాత శాస్త్రవేత్త అబ్దుల్ కలాం చాలా మందికి స్ఫూర్తి. మరి ఆయనకు ప్రేరణ ఇచ్చిన టీచర్ ఎవరో తెలుసా? కలాం పాఠశాల ఉపాధ్యాయుడు ఇయాదురై సోలమన్. పెద్ద కలలు కనడం, ఆ కలల సాకారం కోసం కష్టపడి పనిచేసే లక్షణాలను ఆయన సోలమన్ నుంచే నేర్చుకున్నారట.ప్రియాంక చోప్రా: గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాకు ఒక మహిళా ఉపాధ్యాయురాలు ప్రేరణ. తన హైస్కూల్ టీచర్, ఓ'బ్రియన్ గురించి ప్రియాంక తరచూ ప్రస్తావిస్తూ ఉంటుంది. నిర్మాణం విషయంలో తనను ఎంతో ప్రోత్సహించేవారని చెప్పేవారు. వైఎస్ రాజశేఖర రెడ్డి : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి. వైఎస్ఆర్ గా ప్రసిద్ధి చెందిన వై.ఎస్.రాజశేఖర రెడ్డి కూడా ఉపాధ్యాయులనుచి బాగా ప్రభావితమయ్యారు. తనపై తన టీచర్లు ప్రభావం గణనీయంగా ఉంటుందని స్వయంగా ఆయన చెప్పేవారు. ముఖ్యంగా కేవీ సుబ్బారెడ్డి తన శక్తి సామర్థ్యాలను ఆదిలోనే గుర్తించి, ఉన్నత విద్యను అభ్యసించి, ప్రజా సేవలో కొనసాగాలని సూచించారట. ఆయన మార్గదర్శకత్వం, ప్రోత్సహంతోనే నిబద్ధతతో కూడిన ప్రజాపాలనలో, క్రమశిక్షణతో, ఉన్నతమైన ఆశయాలతో తాను రాణించినట్టు వైఎస్ఆర్ చెప్పేవారు. సచిన్ టెండుల్కర్: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ సాధించిన విజయాలను, క్రమశిక్షణ గురించి ప్రత్యేక పరిచయం అవసం లేదు. తన కోచ్ రమకాంత్ అచ్రేకర్ శిక్షణే తనను లెజెండరీ క్రికెటర్, "మాస్టర్ బ్లాస్టర్", "ది గాడ్ ఆఫ్ క్రికెట్" గా క్రికెట్ చరిత్రలో నిలబెట్టింది. అతని క్రికెట్ ప్రయాణంలో కోచ్ రమాకాంత్ అచ్రేకర్ ముఖ్యమైన పాత్ర పోషించాడు. ముంబైలోని దాదర్‌లోని శివాజీ పార్క్‌లో సచిన్‌కు శిక్షణ ఇచ్చాడు. వినోద్ కాంబ్లీ కూడా ఇతని శిష్యుడే. అచ్రేకర్ చెప్పిన స్ఫూర్తివంతమైన మాటలే తన జీవితాన్ని సమూలంగా మార్చేశాయని సచిన్ గుర్తు చేసుకున్నారు. -
డయానా, గ్రాహం బెల్, సిల్వెస్టర్ స్టాలోన్, వీళ్లంతా ఒకపుడు..!
మన జీవితాల్లో తొలి గురువు అమ్మ. మలిగురువు మన స్కూలు ఉపాధ్యాయుడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. పాఠశాల ఉపాధ్యాయులుగా వారి ప్రేరణ, స్ఫూర్తి జీవితాంతం గుర్తుండిపోయే వ్యక్తుల్లో ప్రముఖంగా నిలుస్తారు. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో కీలక బాధ్యత పాఠశాల ఉపాధ్యాయులదే. వారి అంకితభావం, విజ్ఞానంతో మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంటారు. అంతేకాదు చిన్నపుడు దాదాపు అందరూ ఆడే తొలి ఆట టీచర్ ఆట. అంతగా మన జీవితాల్లో గురువు పాత్ర లీనమై ఉంటుంది. కానీ టీచర్లుగా పిల్లల్ని అదుపు చేయడం, విద్యాబుద్ధులు నేర్పించడం అంత ఆషామాషీకాదు. కత్తి మీద సామే. అయినా అంతులేని నిబద్ధతతో, క్రమశిక్షణతో మెలిగి, తన విద్యార్థులకు ఆదర్శంగా నిలిచే గురువులెందరో...మన దేశంలో సెప్టెంబరు 5న జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పాటిస్తాం. భారతరత్న స్వతంత్ర భారత తొలి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గురువులకే గురువుగా ఆయన చేసిన అపారమైన కృషిని, విజయాలను గుర్తించి, ఆయన జయంతిని (1888, సెప్టెంబరు 5) పురస్కరించుకుని, ప్రతీ సంవత్సరం సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సంగా జరుపుకుంటాం. ఈ సందర్భంగా తొలి నాళ్లలో ఉపాధ్యాయులుగా పనిచేసిన కొంతమంది అంతర్జాతీయ ప్రముఖ వ్యక్తుల గురించి తెలుసుకుందాం.జాన్ ఆడమ్స్: అమెరికా రెండో ప్రెసిడెంట్ కావడానికి ముందు, జాన్ ఆడమ్స్ సెంట్రల్ స్కూల్ ఆఫ్ వోర్సెస్టర్లో ఉపాధ్యాయుడు. కానీ ఆయన ఈ ఉద్యోగం విసుగ్గా ఉండేదిట. అందుకే ఒక్క ఏడాదికే 1756లో న్యాయవాదిగా కొనసాగించడానికి ఈ పదవిని విడిచిపెట్టారట.లిండన్ బి. జాన్సన్: అమెరికా మాజీ అధ్యక్షుడు లిండన్ బి. జాన్సన్ 1928లో మెక్సికో ,యునైటెడ్ స్టేట్స్ సరిహద్దులో ఉన్న టెక్సాస్‌లోని కోటుల్లాలోని వెల్హౌసెన్ పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేశాడు. భాషా సమస్య ఉన్నప్పటికీ (అతని విద్యార్థులు స్పానిష్ మాత్రమే మాట్లాడేవారు ,లిండన్కు ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడేవారు), జాన్సన్ తన విద్యార్థుల ఆంగ్ల భాషను మెరుగుపరిచేందుకు విశేష కృషి చేశాడు. అలా 1965లో ఎలిమెంటరీ మరియు సెకండరీ ఎడ్యుకేషన్ యాక్ట్‌ను ఆమోదించడానికి దారి తీసింది.జిమ్మీ కార్టర్: అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ జార్జియాలోని ప్లెయిన్స్‌లోని మరనాథ బాప్టిస్ట్ చర్చిలో సండే స్కూల్లో బోధించేవాడు. ఈ సందర్బంగా ఆయన బోధనలు చాలా ప్రజాదరణ పొందాయి. ఈ ఉపన్యాసాలు వినడానికి ప్రజలు కూడా వేల మైళ్లు ప్రయాణించి వచ్చేవారట.హిల్లరీ క్లింటన్: హిల్లరీ క్లింటన్ కూడా కొంతకాలం ఉపాధ్యాయురాలిగా ఉన్నారు. 1960వ దశకంలో, క్లింటన్ 1974లో అర్కాన్సాస్‌కు వెళ్లడానికి ముందు వెల్లెస్లీ కాలేజీలో చదువు కున్నారు. అపుడు అర్కాన్సాస్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్ర బోధకులుగా ఉద్యోగం చేశారు. అలాగే హిల్లరీ, బిల్ క్లింటన్ ఇద్దరూ రాజకీయ నాయకులు కాకముందు ఒకే విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయులుగా పనిచేయడం విశేషం. హిల్లరీ తన ఉద్యోగాన్ని ఇష్టపడేవారట. ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకోమని విద్యార్థులను ఎల్లప్పుడూ ప్రోత్సహించేవారు. 2023లో, క్లింటన్ కొలంబియా యూనివర్సిటీ ఫ్యాకల్టీలో ప్రొఫెసర్‌గా , గ్లోబల్ అఫైర్స్‌లో ప్రెసిడెన్షియల్ ఫెలోగా చేరారు.బరాక్ ఒబామా: అమెరికా మాజీ అధ్యక్షుడిగా బరాక్ ఒబామా చికాగో యూనివర్సిటీ లా స్కూల్లో బోధించేవాడు. కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పొలిటికల్ సైన్స్‌లో బీఏ, 1991లో హార్వర్డ్ లా స్కూల్ నుండి పీజీ పట్టా పుచ్చుకున్న తరువాత బోధన ప్రారంభించి, సీనియర్ లెక్చరర్ అయ్యారు దాదాపు పదేళ్లకుపైగా ఒబామా రాజ్యాంగ చట్టం మరియు జాతి సిద్ధాంతాన్ని బోధించారు.ప్రిన్సెస్ డయానా: వేల్స్ యువరాణి కాకముందు డయానా లండన్ నర్సరీ పాఠశాలలో టీచింగ్ అసిస్టెంట్‌గా పనిచేశారు.అలెగ్జాండర్ గ్రాహం బెల్: టెలిఫోన్‌ను కనిపెట్టిన అలెగ్జాండర్ గ్రాహం బెల్ కూడా టీచర్‌గా పనిచేశారు. బోస్టన్ , కనెక్టికట్‌లోని హార్ట్‌ఫోర్డ్‌లో చెవిటివారి కోస ఉపాధ్యాయుడిగా పని చేశారు. ఆ సమయంలోనే టెలిఫోన్‌ను రూపొందించడానికి ప్రేరణ లభించిందట. 1876లో అధికారికంగా టెలిఫోన్‌ను కని పెట్టారు. ప్రముఖ నటుడు సిల్వెస్టర్ స్టాలోన్ జిమ్‌లో ట్రైనర్‌గా పని చేశాడు. 1960లలో అమెరికన్ కాలేజ్ ఆఫ్ స్విట్జర్లాండ్‌లో చదువు తున్నప్పుడు, అదనపు ఆదాయంకోసం జిమ్ టీచర్‌గా పనిచేశాడట. -
సినీ ప్రముఖులతో మహేశ్ బాబు కుమార్తె సితార పోజులు.. ఫోటోలు చూశారా?
-
టిబిసి లగ్జరీ సెలూన్స్ లాంచ్ లో సినీ తారల సందడి (ఫోటోలు)
-
అనంత్-రాధిక పెళ్లిలో.. సందడి చేసిన ప్రముఖులు (ఫోటోలు)
-
'అనంత్, రాధిక' సంగీత్ ఫంక్షన్.. సందడి చేసిన ప్రముఖులు (ఫోటోలు)
-
తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)
-
నా పెళ్లికి రండి.. సెలబ్రిటీలకు వరలక్ష్మి శరత్‌కుమార్ ఆహ్వానం (ఫోటోలు)
-
Rave Party: రేవ్ పార్టీ అంటే ఏంటి? మత్తు, మందు..ఇంకా?
టాలీవుడ్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. ఆదివారం రాత్రి బెంగళూరులో జరిగిన రేవ్‌పార్టీలలో తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేకమంది ప్రముఖులతో పాటు నటీనటులు పట్టుబడ్డారన్న వార్తలు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. సెలబ్రిటీలు సినిమా స్టార్స్స్పై పదే పదే ఎందుకు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అసలు రేవ్‌పార్టీ అంటే ఏమిటి? కేవలం చిందు మందుతోపాటు, నిషేధిత మత్తుమందులు కూడా ఉంటాయా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ కథనాన్ని చదవాల్సిందే.రేవ్ పార్టీలు రోజురోజుకు జనాదరణ పెరుగుతోంది. ప్రధానంగా బడాబాబుల బిడ్డలు, సెలబ్రిటీల పిల్లలు రేవ్ పార్టీలకు బానిసలుగా మారిపోతున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు పలువురితోపాటు, ఇటీవల ప్రముఖ ఎల్విష్ యాదవ్‌పై ఆరోపణలు నమోదైనాయి. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. రేవ్ పార్టీ అంటే ఏంటి? సెలబ్రిటీలకు ఎందుకంత క్రేజ్ విదేశాలతో పాటు, ముంబై, పుణె, బెంగళూరు, కోల్‌కతా, ఢిల్లీ-ఎన్‌సిఆర్ వంటి కాస్మోపాలిటన్ నగరాల్లో రేవ్ పార్టీలు పరిపాటి. ఈమధ్య కాలంలో ఈసంస్కృతికి హైదరాబాద్ నగరంలో కూడా విస్తరించింది. ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్ (EDM) ఈవెంట్స్ అని కూడా పిలిచే రేవ్ పార్టీలు విభిన్న రకాలుగా ఉంటాయి. సాధారణంగా రేవ్ పార్టీలు చాలా ఖరీదైన వ్యవహారం. ఇక్కడ గోప్యతకు కూడా ప్రాధాన్యత ఇస్తారు. అందుకే డబ్బున్నోళ్లు, సెలబ్రిటీలు, సినీతారలు ఎంజాయ్మెంట్ కోసం ఇక్కడికి క్యూ కడతారు. డ్యాన్స్, ఫన్, ఫుడ్, మద్యంతోపాటు, డ్రగ్స్‌కూడా ఇక్కడ యధేచ్ఛగా లభ్యమవుతాయి. రేవ్ పార్టీలు కాస్తా డ్రగ్స్ పార్టీలుగా మారిపోతున్నాయి. ఫుడ్, కూల్‌డ్రింక్స్, ఆల్కహాల్, సిగరెట్లు కాకుండా, కొకైన్, హషిష్, చరాస్, ఎల్ఎస్డి, మెఫెడ్రోన్ తదితర డ్రగ్స్ కూడా దొరుకుతాయని సమాచారం.. కొన్ని రేవ్ పార్టీలలో లైంగిక కార్యకలాపాల కోసం ‘రూమ్స్’ కూడా ఉంటాయట. మాదకద్రవ్యాలు తీసుకునేవారికి, విక్రయించేవారికి ఇది సురక్షితమైన ప్రదేశంగా భావిస్తారు.రేవ్ పార్టీల ధోరణి గోవా నుంచి ప్రారంభమైంది. హిప్పీలు దీనిని గోవాలో ప్రారంభించారు. తరువాత ఇటువంటి పార్టీల ధోరణి అనేక నగరాల్లో పెరుగుతూ వచ్చింది. గత కొన్ని సంవత్సరాలుగా హిమాచల్ లోని కులు లోయ, బెంగుళూరు, పూణే, ముంబై వంటి అనేక నగరాలు వీటికి హాట్స్పాట్లుగా నిలిచాయి.60వ దశకంలో యూరోపియన్ దేశాలలో పార్టీలంటే కేవలం మద్యానికి మాత్రమే. కానీ 80వ దశకంలో రేవ్ పార్టీ రూపమే పూర్తిగా మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో రేవ్ పార్టీల ధోరణి ప్రారంభమైంది. లండన్‌లో ఇటువంటి ఉద్వేగభరితమైన పార్టీలను ‘రేవ్ పార్టీలు’ అని పిలుస్తారు. యుఎస్ లా డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన డాక్యుమెంట్ ప్రకారం.. రేవ్ పార్టీ 80ల నాటి డ్యాన్స్ పార్టీల నుంచి ఉద్భవించింది. డ్యాన్స్ పార్టీ కాస్తా రేవ్ పార్టీగా మారి పోయింది. మన దేశంలో మాదక ద్రవ్యాల నిరోధక(ఎన్డీపీఎస్) చట్టం ప్రకారం గంజాయికి కొకైన్, MDMA, LSD మొదలైన మత్తుపదార్థాలు , మాదకద్రవ్యాల వాడకం నిషేధం. -
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ఒక సినిమా నిర్మాణంలో మామూలుగా అయితే కొన్ని నగలు తెప్పిస్తారు. కాని ‘హీరామండీ’ వెబ్ సిరీస్ కోసం 300 కిలోల నగలు అవసరమయ్యాయి. అవి కూడా బ్రిటిష్ కాలం నాటివి. మొగల్ సంస్కృతీ వారసత్వానివి. ఢిల్లీలో శ్రీ పరమణి జువెలర్స్‌కు చెందిన అన్షు గుప్తా భర్త వినయ్‌తో కలిసి మూడేళ్ల పాటు శ్రమించి ఈ నగలు తయారు చేశారు. నత్, ఝూమర్, హాత్ ఫూల్, పస్సా, టీకా... ఎన్నో నగలు. అన్షు గుప్తా పరిచయం.స్త్రీలు, అలంకరణ అవిభాజ్యం. స్త్రీలు, ఆభరణం కూడా అవిభాజ్యమే. ఆభరణంతో నిండిన అలంకరణ భారతీయ స్త్రీలలో వేల సంవత్సరాలుగా ఉంది. బంగారం, వెండి, వజ్రాలు, రత్నాలు, కెంపులు, మరకతాలు, ముత్యాలు... వీటితో తయారైన ఆభరణాలు రాచరిక స్త్రీలకు ప్రీతికరమైనవి. ఐశ్వర్యవంతులకు స్థాయిని కలిగించేవి. అయితే వీరే కాకుండా కళకారులకు కూడా ఆభరణాలు కీలకమైనవి. మొగలుల కాలంలో విరాజిల్లిన తవాయిఫ్‌లు (రాజనర్తకీమణులు) తమ ప్రదర్శనల్లో ఆకర్షణ కోసం భారీ ఆభరణాలను ఉపయోగించేవారు. మరి వారి గురించిన గాథను తెరకెక్కించేటప్పుడు ఆ ఆభరణాలు ఎక్కడి నుంచి వస్తాయి? వాటిని అందించడానికి ముందుకు వచ్చిన జువెలర్స్ అన్షు గుప్తా, ఆమె భర్త వినయ్ గుప్తా.హీరా మండి..మొగలుల కాలంలో లాహోర్‌లోని ఒక ఏరియా పేరే హీరా మండి. దాని అంతకు ముందు పేరు షాహీ మొహల్లా. అంటే రాచవాడ. పక్కనే ఉన్న కోట నుంచి నవాబులు నడిచి వచ్చేంత దూరంలో ఉండే కొన్ని భవంతుల సముదాయమే షాహీ మొహల్లా. ఇక్కడ తవాయిఫ్‌లు ఉండేవారు. వీరు ఆట, పాటల్లో నిష్ణాతులు. సాయంత్రమైతే వీరి భవంతుల్లో ప్రదర్శనలు జరిగేవి. నవాబులు, శ్రీమంతులు, రసికులు వీటికి హాజరయ్యి తిలకించేవారు. ఈ తవాయిఫ్‌లకు విశేష పలుకుబడి ఉండేది. వీరి దగ్గర ఐశ్వర్యం ఉండేది. రాచరిక రహస్యాలు మొదట వీరికే తెలిసేవి. వీరు మంత్రాంగం నడిపేవారు. 1857 సైనిక తిరుగుబాటులో కూడా వీరు పాల్గొన్నారు. కాని బ్రిటిష్ కాలం వచ్చేసరికి ఇదంతా గతించిపోయింది. షాహీ మొహల్లా కాస్తా సరుకులు అమ్మే మండీగా హీరా మండీగా మారింది. ఆనాడు వెలిగిన వారంతా అంతరించిపోయారు. వేశ్యలుగా మారారు. వారి గాథనే దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ‘హీరామండీ’ పేరుతో భారీ వెబ్‌సిరీస్‌గా తీశాడు. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది.భారీ నగలుపర్‌ఫెక్షనిస్ట్ అయిన దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ ‘హీరామండీ’లో తవాయిఫ్‌ల కోసం నాటి మొగల్ తరహా నగలు కావాలని భావించాడు. గతంలో తన ‘బాజీరావు మస్తానీ’ కోసం పని చేసిన ఆభరణాల శిల్పులైన అన్షు గుప్తా, ఆమె భర్త వినయ్ గుప్తాలను సంప్రదించాడు. వీరు ఢిల్లీవాసులు. వీరికి శ్రీ పరమణి జువెలర్స్ అనే నగల కార్ఖానా, షోరూమ్ ఉన్నాయి. 200 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కార్ఖానాలో ఖరీదైన ఆభరణాలు దొరుకుతాయి. ‘కథ విన్న వెంటనే టైటిల్ దగ్గరి నుంచి ప్రతి పాత్రా ఆభరణాలతో ముడిపడి ఉన్నందుకు ఉత్సాహం వచ్చింది. చరిత్రలోకి వెళ్లి పరిశోధించి నాటి ఆభరణాలు తయారు చేయాలి. మొగలులు కళాప్రియులు. వారి కాలంలో ఆభరణాలలో కెంపులు. ముత్యాలు, వజ్రాలు విరివిగా వాడేవారు. ఆపాదమస్తకం అలంకరించుకోవడానికి వందల రకాల ఆభరణాలు ఉండేవి. అవన్నీ మేము తయారు చేయడానికి ముందుకు వచ్చాం. నేను, నా భర్త వినయ్ మూడేళ్లు కష్టపడి ఈ నగలు తయారు చేయించాం’ అని తెలిపింది అన్షు గుప్తా.అసలు సిసలు బంగారంతో‘‘హీరామండీ కోసం కొన్ని ముఖ్యమైన నగలు అసలు బంగారంతోనూ, మిగిలినవి బంగారు పూత కలిగిన వెండితోనూ తయారు చేయించాలని నిర్ణయించాం. వజ్రాలు, ముత్యాలు అన్నీ ఒరిజినల్‌వే వాడాం. మా కార్మికులు మూడేళ్ల పాటు శ్రమపడి మూడు గదుల్లో పది వేల చిన్న, పెద్ద ఆభరణాలు తయారు చేశారు. వీటిని తూస్తే 300 కిలోలు ఉంటాయి. నథ్ (ముక్కు పుడక) దగ్గరి నుంచి నెమలి నెక్లెస్ వరకూ వీటిలో ఉన్నాయి. షూటింగ్లో ప్రత్యేక గార్డులు వీటికి కాపలా ఉన్నారు. ‘మేం చేసిన ఆభరణాలు పాత్ర కోసం ధరించి వీటితో పారిపోతే ఒక సినిమా తీసేన్ని డబ్బులొస్తాయి’ అనేది నటి రిచా చద్దా సరదాగా. హీరామండీని చూస్తే ఒక పాత్ర ధరించిన పాపిడి బిళ్లతో మరో పాత్ర ధరించిన పాపిటబిళ్లకు పోలిక ఉండదు. గాజులు, ఉంగారాలు, చెవి కమ్మలు... తెర మీద అద్భుతంగా ఆవిష్కృతమైన తీరుతో మా కష్టం వృథా పోలేదనిపించింది’’ అని సంతోషాన్ని వ్యక్తం చేసింది అన్షు గుప్తా. -
Celebrities With Their Mom's: మామ్స్తో సెలబ్రిటీలు, రెండు కళ్లూ చాలవు (ఫోటోలు)
-
మాదాపూర్ లో ఎఫ్ కేఫ్ అండ్ బార్ లాంచ్ పార్టీ సెలబ్రిటీల సందడి (ఫోటోలు)
-
Eid 2024 : ఈద్ ముబారక్ అంటున్న ఈ సెలబ్రిటీలను గుర్తు పట్టారా (ఫోటోలు)
-
Ugadi 2024: సెలబ్రిటీల సంబరాలు
-
ISPL 2024: ఐఎస్పీఎల్ ఓపెనింగ్ సెర్మనీలో సందడి చేసిన సినీ తారలు (ఫొటోలు)