డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెబరు 5న మన దేశంలో టీచర్స్‌డే జరుపుకోవడం ఆనవాయితీ. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆసాధారణ ప్రజ్ఞాశాలి. రాజ నీతి కోవిదుడు, విద్యావేత్త. భారత తొలి ఉపరాష్ట్రపతిగా, రెండో రాష్ట్రపతిగా విశేషసేవంలందించి, భారత అత్యున్నత పురస్కారం ‘భారతరత్నం’ అందుకున్న గొప్ప వ్యక్తి.ఉధ్యాయ దినోత్సవం అనగానే విద్యార్థులకు ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది.ఒక విధంగా చెప్పాలంటే ఇదొక అరుదైన సందర్భం అని చెప్పవచ్చు. టీచర్లు, విద్యార్థుల కలిసి సరదాగా ఆడుతూ పాడుతూ గడిపే చక్కటి అవకాశం. తమ అభిమాన టీచర్ల వేషధారణలో సందడి చేస్తారు. వారిని అనుకరిస్తారు. భవిష్యత్తులోతామూ ఇలాగే కావాలని కలలు కంటారు. జీవితాంతా తమ అభిమాన టీచర్లను, వారి జ్ఞాపకాలను తమ గుండెల్లో పదిలంగా దాచుకుంటారు. అలాంటి వారిలో కొంతమంది సెలబ్రిటీల గురించి తెలుసుకుందాం.
‘‘రాయిని వజ్రంలా మార్చగలిగే శక్తే ఉపాధ్యాయుడు’’
గురువు అంటే మనల్ని అజ్ఞానంనుంచి జ్ఞానంవైపు నడిపించే అద్భత శక్తి. విద్యతో పాటు విచక్షణ కూడా నేర్పించేవాడే గురువు. గురువు లేనిదే ఏ మనిషికీ పురోగతి లేదు. గురువు అనేక రూపాలలో ఉంటాడు. గైడ్ అనే ఆంగ్ల పదం సంస్కృత పదం గురు నుండి ఉద్భవించింది. నిస్వార్థంగా తన విజ్ఞానమంతా శిష్యుడికి ధారపోస్తాడు గురువు. ఆ జ్ఞానంతో తన శిష్యుడు లోకానికి మేలు చేయాలని భావిస్తాడు.
‘‘విద్యార్థులను తీర్చిదిద్దే క్రమంలో వెలకట్టలేని త్యాగాలు చేసిన ఉపాధ్యాయులందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు.’’
అమితాబ్ బచ్చన్: బాలీవుడ్ స్టార్ యాక్టర్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్. గంభీరమైన ఆయన వాయిస్‌కు ఫిదా కాని వారు ఉండరు. ఆయన స్వరమే ఆయనకు కొండంత ఆస్తి. ఆయన స్వరంగా ఇంత గొప్ప ఖ్యాతి గడించినడానికి, పాపులర్ కావడానికి కారణం ఇంగ్లీష్ టీచర్ మార్టిన్. తప డిక్షన్‌ను అభివృద్ధి చేయడంలో మార్టిన్ ఎంతో సాయం చేశారని, తనను ఎంతో ప్రోత్సహించేవారని మార్టిన్ గురించి ఎపుడూ చెబుతూంటారు.
ఏ.పీ. జే అబ్దుల్ కలాం: భారతదేశ మాజీ రాష్ట్రపతి, ప్రఖ్యాత శాస్త్రవేత్త అబ్దుల్ కలాం చాలా మందికి స్ఫూర్తి. మరి ఆయనకు ప్రేరణ ఇచ్చిన టీచర్ ఎవరో తెలుసా? కలాం పాఠశాల ఉపాధ్యాయుడు ఇయాదురై సోలమన్. పెద్ద కలలు కనడం, ఆ కలల సాకారం కోసం కష్టపడి పనిచేసే లక్షణాలను ఆయన సోలమన్ నుంచే నేర్చుకున్నారట.
ప్రియాంక చోప్రా: గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాకు ఒక మహిళా ఉపాధ్యాయురాలు ప్రేరణ. తన హైస్కూల్ టీచర్, ఓ'బ్రియన్ గురించి ప్రియాంక తరచూ ప్రస్తావిస్తూ ఉంటుంది. నిర్మాణం విషయంలో తనను ఎంతో ప్రోత్సహించేవారని చెప్పేవారు.
వైఎస్ రాజశేఖర రెడ్డి : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి. వైఎస్ఆర్ గా ప్రసిద్ధి చెందిన వై.ఎస్.రాజశేఖర రెడ్డి కూడా ఉపాధ్యాయులనుచి బాగా ప్రభావితమయ్యారు. తనపై తన టీచర్లు ప్రభావం గణనీయంగా ఉంటుందని స్వయంగా ఆయన చెప్పేవారు. ముఖ్యంగా కేవీ సుబ్బారెడ్డి తన శక్తి సామర్థ్యాలను ఆదిలోనే గుర్తించి, ఉన్నత విద్యను అభ్యసించి, ప్రజా సేవలో కొనసాగాలని సూచించారట. ఆయన మార్గదర్శకత్వం, ప్రోత్సహంతోనే నిబద్ధతతో కూడిన ప్రజాపాలనలో, క్రమశిక్షణతో, ఉన్నతమైన ఆశయాలతో తాను రాణించినట్టు వైఎస్‌ఆర్ చెప్పేవారు.
సచిన్ టెండుల్కర్: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ సాధించిన విజయాలను, క్రమశిక్షణ గురించి ప్రత్యేక పరిచయం అవసం లేదు. తన కోచ్ రమకాంత్ అచ్రేకర్ శిక్షణే తనను లెజెండరీ క్రికెటర్, "మాస్టర్ బ్లాస్టర్", "ది గాడ్ ఆఫ్ క్రికెట్" గా క్రికెట్ చరిత్రలో నిలబెట్టింది. అతని క్రికెట్ ప్రయాణంలో కోచ్ రమాకాంత్ అచ్రేకర్ ముఖ్యమైన పాత్ర పోషించాడు. ముంబైలోని దాదర్‌లోని శివాజీ పార్క్‌లో సచిన్‌కు శిక్షణ ఇచ్చాడు. వినోద్ కాంబ్లీ కూడా ఇతని శిష్యుడే. అచ్రేకర్ చెప్పిన స్ఫూర్తివంతమైన మాటలే తన జీవితాన్ని సమూలంగా మార్చేశాయని సచిన్ గుర్తు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment