Teachers Day 2024
-
అడ్మిషన్ తిరస్కరించిన కాలేజీకే ముఖ్య అతిథిగా..
దేశంలోనే అత్యంత ధనవంతుడు గౌతమ్ అదానీ విద్యార్థిదశలో తన అడ్మిషన్ దరఖాస్తును తిరస్కరించిన కాలేజీలోనే ఇటీవల ఉపన్యాసం ఇచ్చారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ముంబయిలోని జై హింద్ కాలేజీ గౌతమ్ అదానీను ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. ఈ సందర్భంగా అదానీని పరిచయం చేసే క్రమంలో కాలేజీ పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు విక్రమ్ నాంకనీ ఆసక్తికర విషయాలు తెలిపారు.‘1977-78 సంవత్సరంలో గౌతమ్ అదానీ తన పదహారో ఏటా జై హింద్ కాలేజీలో చదివేందుకు అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అప్పటికే తన సోదరుడు ఈ కాలేజీలో చదవగా తాను ఇక్కడే చేరాలని నిర్ణయించుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల కాలేజీ తన అడ్మిషన్‌ను తిరస్కరించింది. దాంతో అదే సంవత్సరం ముంబయిలో డైమండ్ సార్టర్‌గా జీవితాన్ని ప్రారంభించారు. తర్వాత అంచెలంచెలుగా తన వ్యాపారాన్ని విస్తరించారు. దేశంలోనే అత్యంత ధనవంతుడిగా ఎదిగారు. అడ్మిషన్ తిరస్కరించిన కాలేజీలోనే ఉపన్యాసం ఇచ్చేందుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు’ అని విక్రమ్ నాంకనీ వెల్లడించారు.కాలేజీ నుంచి వెళ్లిన అదానీ వ్యాపారంలో ఎదిగి ప్రస్తుతం 220 బిలియన్ డాలర్ల (సుమారు రూ.18.26 లక్షల కోట్లు) సామ్రాజ్యానికి అధిపతి అయ్యారు. ఇటీవల హురున్ ఇండియా ప్రకటించిన దేశంలోని అత్యంత ధనవంతుల జాబితాలో ముఖేశ్ అంబానీను వెనక్కినెట్టి మొదటి స్థానంలోకి చేరుకున్నారు.అదానీ వ్యాపార సామ్రాజ్యంఎనర్జీ అండ్ యూటిలిటీస్ రంగంలో..అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్అదానీ పవర్ లిమిటెడ్అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్రవాణా అండ్ లాజిస్టిక్స్ రంగంలో..అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ లిమిటెడ్అదానీ ఎయిర్పోర్ట్స్సహజ వనరుల విభాగంలో..అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ఇదీ చదవండి: పెట్రోల్, డీజిల్ ధరలపై త్వరలో కేంద్రం తీపి కబురుఇతర రంగాలుఅదానీ విల్మార్ లిమిటెడ్అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్అదానీ వాటర్అదానీ రోడ్, మెట్రో అండ్ రైల్అదానీ డేటా సెంటర్స్ -
Health: స్ట్రెస్.. హెల్త్ మిస్! టీచర్లపై ఒత్తిడి బెత్తం..
టీచర్స్ డే రోజు పూజించుకుంటున్నాం సరే. వారి మానసిక ఆరోగ్యం గురించి ప్రభుత్వానికి, ఇంటికి శ్రద్ధ ఉందా? చెప్పాల్సిన క్లాసుల సంఖ్య, సిలబస్‌ల వత్తిడి, విద్యార్థులు నిత్యం తెచ్చే సమస్యలు, స్కూల్లో అరాకొరా వసతులు, స్కూలుకు రానూ పోనూ ప్రయాణ సౌలభ్యం లేని ఆందోళన... ఇవన్నీ టీచర్ల మానసిక ఆరోగ్యం దెబ్బ తీస్తున్నాయి. ఆ అసహనం విద్యార్థుల మీదకు మళ్లితే వారు గాయపడటమే కాక పాఠాలు నడవవు. శాంతంగా, నవ్వుతూ ఉండే టీచర్లు ఎందరు?2023లో బిహార్‌లో టీచర్ల మానసిక ఆరోగ్యం మీద ప్రభుత్వం సర్వే చేసింది. మొత్తం 75 వేల ప్రభుత్వ పాఠశాలల్లోని 4 లక్షల మంది టీచర్లకు 12 రకాల ప్రశ్నలున్న ప్రశ్నాపత్రాన్ని పంపి వాటికి సమాధానాలు రాయించారు. ఈ సర్వే చేయడానికి ముఖ్య కారణం విద్యార్థుల నుంచి వచ్చిన ఫిర్యాదులు...– టీచర్లు తరచూ తిడుతూ ఉండటం, కొడుతూ ఉండటం– స్కూలుకు సరిగ్గా రాకపోవడం– సిలబస్ సమయానికి పూర్తి చేయలేకపోవడం ప్రభుత్వం జీతాలు ఇచ్చి పాఠాలు చెప్పమంటే పిల్లలతో వారు వ్యవహరిస్తున్న తీరులో ఎందుకు తేడా వస్తున్నదో తెలియడానికి ఈ సర్వే చేశారు. కాని సర్వే ఫలితాలను మాత్రం బయట పెట్టలేదు. సర్వేలో అడిగిన కొన్ని ప్రశ్నలు ఇలా ఉన్నాయి.– మీ ఇంట్లోని ఒత్తిడి స్కూల్లో మీ ఉద్యోగం మీద పడుతున్నదా?– పిల్లల్ని ఎంత తరచుగా తిడుతున్నారు?– సిలబస్ టైమ్‌కి పూర్తి చేయగలుగుతున్నారా?– మీరు ఇంట్లో ఎక్కువ ఒత్తిడి ఫీలవుతారా స్కూల్లోనా?– ఇప్పటి విద్యా వ్యవస్థ మీద సంతృప్తిగా ఉన్నారా?ఈ సర్వేతో సంబంధం లేకుండా ఎక్కువ మంది ఏం చెప్పారంటే మాకు పాఠాలు చెప్పే పని కంటే వేరే పనులు ఎక్కువ చెబుతున్నారు అని. వాటిలో ఎలక్షన్ డ్యూటీలు, సర్వేలు, మిడ్ డే మీల్స్ ఉన్నాయి. సర్వేల పనిలో టీచర్లను పెడితే ఆ సమయంలో టీచర్ల అటెండెన్స్ దారుణంగా పడిపోతోంది. కొందరైతే ‘మిడ్ డే మీల్స్‌ను బయటి ఏజెన్సీకి అప్పగించాలి. చీటికి మాటికి దాని గురించి ఇన్స్పెక్షన్లకు వస్తుంటే ఒత్తిడిగా ఉంది’ అన్నారు.వ్యక్తిగత శ్రద్ధకు సమయం లేదు..స్కూల్లో పాఠాలు, హోమ్‌వర్క్‌లు, పరీక్షలు పెట్టి పేపర్లు దిద్దటాలు, స్కూల్ మేనేజ్మెంట్తో మీటింగ్‌లు, పేరెంట్స్‌తో మీటింగ్‌లు, సిలబస్‌ను పూర్తి చేయడం, వృత్తిపరమైన పోటీ (మంచి పేరు రావడం), స్టూడెంట్ల వ్యవహారశైలితో సమస్యలు... ఇవన్నీ ఒత్తిడి కలిగించేవే. ఇక కుటుంబ పరమైన ఒత్తిడులు కూడా ఉంటాయి. ఇంటి వొత్తిడి స్కూల్లో స్కూలు ఒత్తిడి ఇంట్లో తెచ్చి పెట్టుకుంటే రెండు చోట్లా టీచర్లకు స్థిమితం ఉండదు. స్థిమితంగా లేని స్వభావంతో పాఠం చెప్పడం కష్టం. ఈ మొత్తం వ్యవహారంలో టీచర్లు తమ మానసిక స్థితి గురించి శ్రద్ధ పెట్టే ఆలోచన చేయలేకపోతున్నారు.పిల్లలకు ఒత్తిడి..క్లాసురూమ్‌లో కూచోగానే పిల్లలు తలెత్తి చూసేది టీచర్నే. టీచర్ ముఖం ప్రసన్నంగా ఉంటే వారు ప్రసన్నంగా పాఠం వింటారు. చిర్రుబుర్రులాడే టీచర్ ఉండే క్లాసులోని పిల్లల్ని పరీక్షిస్తే వారిలో ‘కార్టిసల్’ అనే స్ట్రెస్ హార్మోన్ ఎక్కువగా విడుదలవుతున్నదని తేలింది. పిల్లల మానసిక ఆరోగ్యం పై స్కూల్ వాతావరణం నెగెటివ్ ప్రభావం ఏర్పరిస్తే వారిలో సమస్యలు వస్తాయి. వీళ్లు మళ్లీ టీచర్‌కు స్ట్రెస్ ఇస్తారు. అంటే ఇదొక సైకిల్‌గా మారుతుంది.వ్యక్తిగత ఒత్తిడి..టీచర్ ఉద్యోగంలో ఉన్నవారికి కుటుంబం నుంచి చాలా సపోర్ట్ ఉండాలి. ఇంటి పని తగ్గించగలగాలి. ఆర్థిక, భావోద్వేగ సమస్యలు తెలుసుకొని మిత్రులు, బంధువులు సపోర్ట్‌గా నిలవాలి. సక్సెస్ఫుల్ విద్యార్థులను తయారు చేయించడంలో ఆమె సక్సెస్ అయ్యేలా తోడు నిలవాలి.చర్యలు తీసుకోవాలి..టీచర్లు, పిల్లలు మంచి మానసిక స్థితిలో ఉంటూ స్కూల్ జీవనం కొనసాగించాలంటే టీచర్ల గురించి ఆలోచించాలి. టీచర్ల కోసం ప్రభుత్వంగాని, ప్రయివేటు యాజమాన్యాలుగాని కింది చర్యలు తీసుకోవాలి.– తరచూ నిపుణులచే కౌన్సిలింగ్ చేయించడం– మెంటల్ హెల్త్ వర్క్‌షాప్‌లు నిర్వహించడం– సాటి టీచర్ల నుంచి మద్దతు లభించే పని వాతావరణం.– వసతులు, బోధనా సామాగ్రి ఏర్పాటు– ఇంటి పని, ఉద్యోగ బాధ్యత సమతుల్యత గురించిన అవగాహన – యాజమాన్యం, తల్లిదండ్రులు, పిల్లలకు టీచర్లు అనుసంధానకర్తలుగా ఉండేలా చేసి ఆ టీచర్లు చెప్పే సూచనలను పాజిటివ్‌గా చూడటం. -
మంచి గురువును ఎంచుకోవడం ఎలా?
-
Teacher's Day 2024: జీవితాలను దిద్దేవాడు..
బాల్యం, కౌమారం యవ్వనం, ఆ తరువాత, ముదిమి వయసు మానవ జీవితంలో సహజ పరిణామాలు! బాల్య యవ్వనాల్లో గురువు పాత్ర అత్యంత కీలకమైనది. తరువాతి దశల్లో మనిషి ఉత్తమ ప్రపంచ పౌరునిగా, సామా జిక జీవిగా పరిణామం చెందడానికి ఉపాధ్యాయుని పాత్ర ఎనలేనిది. ప్రతి పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు 8, 9, 10వ తరగతుల విద్యార్థులకు ఏడాదికి ఒక్కసారైనా వైద్యులను పిలి పించి అవగాహనా కార్యక్రమం నిర్వహించాలి.వయసు పెరిగే కొలదీ మానవునిలో వచ్చే శారీరక మార్పులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించేలా చర్యలు తీసుకోవాలి. అలాగే పిల్లల తల్లిదండ్రులకు కూడా ఒక సీనియర్ ఉపాధ్యాయుని సహాయంతో, వీలైతే లేడీ టీచర్‌తో అవగాహన కల్పించాలి. ఫలితంగా టీనేజ్‌లో హార్మోన్ల ప్రభావం వల్ల పిల్లలలో కలిగే మార్పుల పట్ల అవగాహన కలుగుతుంది. క్షణికోద్రేకాలకు లోనై అకృత్యాలకు పాల్పడ కుండా ఈ అవగాహన పిల్లలను కాపాడుతుంది. తల్లిదండ్రులు కూడా వారు ఎటువంటి జాగరూకత వహించాలో తెలుసుకోగలుగుతారు.భారతీయ సమాజంలో గురువును దేవునిగా పూజించే సంప్రదాయం ఉంది. ‘గురు దేవోభవ!’ అన్న మాటలు అందుకే ఉనికిలోకి వచ్చాయి. గురువు పాత్ర కేవలం పాఠాలు చెప్పడంతోనే అయిపోదు. పిల్లలకు కర్తవ్యాన్ని, ధర్మాచరణ నూ నూరిపోయడం; దానం, సహనం, సహానుభూతి, సత్వగుణం, నిర హంకారం, నైపుణ్యాలను పెంపొందించడం లక్ష్యంగా పనిచేయాలి. విద్యార్థుల్లో దాగి ఉన్న శక్తి సామర్థ్యా లను వెలికి తీయాలి. వ్యాయామం, యోగ, ధ్యానం వంటివి గురు సముఖంలోనే రాణింపు కొస్తాయి.నిరాడంబరులై వినుతికెక్కిన సర్వేపల్లి రాధాకృష్ణ, గాంధీజీ, వివేకానందుడు, అబ్దుల్ కలాం వంటి ప్రముఖుల గురించి మన పాఠశాలలు, విశ్వవిద్యా లయాల్లో ఉపాధ్యాయులు చెప్పాలి. యువతను వజ్ర సంకల్పంతో దేశానికి ఉత్కృష్ట వనరులుగా మార్చగ లిగినవారు ఉపాధ్యాయులు! వారికి గురుపూజోత్సవ శుభాకాంక్షలు!గురువులు సమాజ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టు కుని, బోధనా విధానంలో నూతన దారులు తొక్కాలి. నిష్ఠ, అంకితభావం, విద్యా ర్థుల పట్ల వాత్సల్యం, ఆద రణ కలిగి ఉండటం మంచి గురువు లక్షణాలు. వారిలో ప్రశ్నలడిగే జిజ్ఞాస, ఉత్సు కతలను నలిపివేయకుండా ఉండాలి. విద్యార్థుల్లో శీల నిర్మాణానికి కృషి చేయడం ముఖ్యమైన విధి. ఆత్మ విమర్శ, ఆత్మ విశ్లేషణ, ఆత్మ గౌరవం, ఆత్మ నిగ్రహాలను ప్రోది చేసుకుని ఎవరి జీవితాన్ని వారు తీర్చిదిద్దుకునేలా పిల్లలను తీర్చిదిద్దే వాడు గురువు. మన భారతీయ గురు పరంపరకు ప్రణామాలు! – పరిమి శ్యామలా రాధాకృష్ణ, వ్యాసకర్త బీఈడీ కాలేజీ విశ్రాంత ప్రిన్సిపాల్, మదనపల్లె, అన్నమయ్య జిల్లాగురుతర బాధ్యత..నేడు భారతదేశంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో దాదాపు 15 లక్షల పాఠశాలలు, 58 వేల కళాశాలలు, 1,500 విశ్వవిద్యా లయాలు ఉండగా వీటిలో దాదాపు 27 కోట్ల మంది విద్యార్థినీ విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. దాదాపు 1 కోటి 14 లక్షల మంది ఉపాధ్యా యులుగా పనిచేస్తున్నారు. అనాదిగా ప్రపంచంలోని అనేక దేశాలతో పోలిస్తే భారతదేశంలో విద్యకు, ఉపాధ్యాయులకు ఒక ప్రత్యేక గుర్తింపు,గౌరవాలు ఉన్నాయి. దీనికి నిదర్శనం తక్షశిల, నలందా వంటి విశ్వ విద్యాలయాలలో ప్రపంచంలోని అనేక దేశాల నుండి విద్యా ర్థినీ విద్యార్థులు వచ్చి విద్యను అభ్యసించి తిరిగి వెళ్లి తమ విద్యా ర్థినీ విద్యార్థులకు విద్యను బోధించిన విషయం చారిత్రక సత్యం. మనం ఆరాధ్య పురు షులుగా భావిస్తున్నటువంటి రాముడు, కృష్ణుడు, ప్రహ్లాదుని నుంచి గౌతమ బుద్ధుడి వరకు గురు కులాలలో గురువులకు సేవ చేస్తూ విద్యాబుద్ధులను అభ్యసించిన వారే. విదేశీయుల పాలన కింద శతా బ్దాలు తరబడి ఉన్న మన భారతదేశం అనాది నుంచి ఉన్న శ్రేష్ఠమైన విద్యా వ్యవస్థను కోల్పోయింది.స్వాతంత్య్రానంతరం మన విద్యా వ్యవస్థను గాడిన పెట్టే ప్రయత్నాలు అనేకం జరిగినప్పటికీ విద్యార్థుల్ని సౌశీల్యం, క్రమశిక్షణ కలిగిన ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దే సరైనటువంటి విధానాలు విద్యా వ్యవస్థలో కొరవడినాయి. నేడు యువతలో ముఖ్యంగా విద్యార్థినీ, విద్యార్థులలో పెద్దల ఎడల గౌరవం, కుటుంబ విలు వలు, నైతిక విలువలు, కఠోర శ్రమ, పరస్పర గౌరవం, దయ, సౌశీల్యం, ఐకమత్యం వంటి మానవీయ విలు వలు క్రమంగా తగ్గుతున్నాయి.ఫలితంగా వారు వ్యక్తి గత జీవితాలను కోల్పోతు న్నారు. అదే సమయంలో భారతదేశానికి అనాదిగా ఉన్న కీర్తి ప్రతిష్ఠలు కూడా పోతున్నాయి. అనేక విద్యాలయాలలో విద్యార్థులు మాదకద్రవ్యాలు, మద్యం, ధూమపానం వంటి వ్యస నాలకు బానిసలు కావడమే కాకుండా తమ అమూల్య మైన సమయాన్ని సోషల్ మీడియాకు బలి చేస్తున్నారు. అలాగే ఈమధ్య స్త్రీలపై అత్యాచారాలు పెరిగిపోవడమూ గమనార్హం. కావున కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థినీ విద్యా ర్థులకు విద్యతో పాటు బుద్ధిని కూడా నేర్పించవలసిన గురుతర బాధ్యత నేటి అధ్యాపకులపై ఉంది.గతంలో ప్రతి అధ్యాపకుడు సబ్జెక్టుతో సంబంధం లేకుండా పెద్ద బాలశిక్ష, చిన్న బాలశిక్ష వంటి వాటి నుండే కాకుండా సుమతి, వేమన, భాస్కర శతకాల నుండి విద్యార్థినీ విద్యార్థులకు సందర్భానుసారంగా నీతి వాక్యాలను, జ్ఞానాన్ని, శీలాన్ని, ఐకమత్యాన్ని బోధించేవారు. నేటి ఆధునిక అధ్యాపకులు కూడా విద్యార్థులను పరి పూర్ణమైన పౌరులుగా తీర్చిదిద్దడా నికి అన్ని విధాలా కృషి చెయ్యాలి. – వై.వి. రామిరెడ్డి, వ్యాసకర్త తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆచార్యులు -
వేలకోట్ల సామ్రాజ్యం స్థాపించిన టీచర్
విశాల విశ్వంలో అనేక మార్పులు సంభవిస్తుంటాయి. ఇదే తరహాలో ఒక వ్యక్తి జీవితంలో కూడా తప్పకుండా మార్పులు జరుగుతాయి, పరిస్థితులు తారుమారవుతాయి. పేదవాడు కుబేరుడిగా మారవచ్చు, కుబేరుడు దీన స్థితికి రావచ్చు. యూనివర్సిటీ ఎంట్రన్స్ పరీక్షల్లో రెండు సార్లు ఫెయిల్ అయిన ఒక వ్యక్తి.. ఉపాధ్యాయుడుగా పనిచేశారు. చైనాలో అత్యంత ధనవంతుడిగా కూడా నిలిచారు. ఇంతకీ అయన ఎవరు? ఆ స్థాయికి ఎలా ఎదిగాడు? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ప్రపంచ కుబేరుల జాబితాలో ఒకరుగా ఉన్న 'జాక్ మా' (Jack Ma) గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే చైనాకు చెందిన గొప్ప పారిశ్రామిక వేత్తగా మాత్రమే కాకుండా.. ఆలీబాబా.కామ్ ఈ-కామర్స్ పోర్టల్ అధినేత కూడా. 1964 సెప్టెంబర్ 15న జన్మించిన జాక్ మధ్య తరగతికి కుటుంబానికి చెందిన వ్యక్తి. చిన్నప్పటి నుంచే ఇంగ్లీష్ నేర్చుకోవాలనే ఆసక్తితో విదేశీ పర్యాటకులతో సంభాషించడానికి ప్రతిరోజూ ఉదయం సమీపంలో ఉన్న హోటల్‌కు సైకిల్ మీద వెళ్లేవాడు.ఇంగ్లీష్ మీద పట్టు సాధించాలనే ఉద్దేశ్యంతో గైడ్‌గా కూడా పనిచేశాడు. తన నైపుణ్యాన్ని మెరుగు పరుచుకోవడాని ఇదొక అద్భుత అవకాశంగా భావించారు. అలా సుమారు తొమ్మిది సంవత్సరాలు గైడ్‌గా పనిచేసి ఎంతో నేర్చుకున్నాడు. గురువుల దగ్గర, పుస్తకాల్లోనూ నేర్చుకున్న వాటికంటే.. భిన్నమైన అంశాలను విదేశీ పర్యటకుల నుంచి గ్రహించగలిగాడు.విద్య & ఉద్యోగంఇంగ్లీష్ లెక్షరర్ కావాలనే కోరికతో జాక్ 'హాంగ్జౌ డియాంజీ యూనివర్సిటీ' (Hangzhou Dianzi University) ప్రవేశ పరీక్ష రాసారు. ఈ ఎంట్రన్స్ టెస్ట్‌లో రెండు సార్లు ఫెయిల్ అయ్యారు. అయినా పట్టు వదలకుండా మూడోసారి పరీక్ష రాసి విజయం సాధించారు. అదే సమయంలో యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా ఎన్నికయ్యాడు.చదువు పూర్తయ్యాక అదే విశ్వవిద్యాలయంలో నెలకు సుమారు రూ.1000 జీతానికి పాఠాలు చెప్పేవాడు. యూనివర్సిటీలో జీతం సరిపోకపోవడంతో ఏదైనా కంపెనీలో జాబ్ చేయాలనీ లక్ష్యంగా ముందడు వేసాడు. ఇందులో భాగంగానే అనేక ఉద్యోగాలకు అప్లై చేసుకున్నాడు. ఎన్ని ఉద్యోగాలకు అప్లై చేసినా ఒక్క ఉద్యోగానికి కూడా ఎంపిక కాలేదు.ఏ ఉద్యోగానికి ఎంపిక కాకపోవడంతో 1994లో ఆంగ్ల అనువాదం, వివరణను అందించడానికి 'హైబో ట్రాన్స్లేషన్ ఏజెన్సీ' స్థాపించారు. ఆ తరువాత మొదటిసారిగా యునైటెడ్ స్టేట్స్కు వెళ్లే అవకాశాన్ని వచ్చింది. అక్కడే అతని జీవితం మలుపు తిరిగింది. ఇక్కడే మొదటి సారి ఇంటర్నెట్ గురించి తెలుసుకున్నాడు.అంతర్జాలం (ఇంటర్నెట్) అతనికి ఒక పెద్ద మాయగా అనిపించింది. ఆ సమయంలోనే రూ.1.2 లక్షల పెట్టుబడితో 'చైనా పేజెస్' పేరుతో వెబ్సైట్ ప్రారంభించాడు. అప్పటి వరకు జాక్ కీ బోర్డు తాకనేలేదు. జాక్ జీవితం ఆ తరువాత ఇంటర్నెట్తో ముడిపడిపోయింది. కీబోర్డ్ కూడా తాకని వ్యక్తి ఏకంగా 'చైనా టెలికామ్' సంస్థకి గట్టి పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగిపోయారు.దీంతో ఆ కంపెనీ అప్పట్లోనే రూ. కోటి పెట్టుబడితో సంస్థ పెట్టి కలిసి పనిచేద్దామనీ చైనా టెలికామ్ జీఎమ్.. జాక్‌కు చెప్పారు. అదే అదనుగా చూస్తున్న జాక్ ఆ అవకాశాన్ని వదులుకోలేదు. అయితే కొన్ని రోజుల తరువాత ఆ భాగస్వామ్యం నచ్చకుండా బయటకు వచ్చేసిన ఈ-కామర్స్ వెబ్‌సైట్‌ను ప్రారంభించాలనుకున్నారు.ఇదీ చదవండి: నేను మీలా అవ్వాలంటే?: ఇన్ఫీ నారాయణ మూర్తి సమాధానంఆఫ్ అలీబాబా ఈ-కామర్స్ కంపెనీ1999లో 18 మంది వ్యక్తులతో కలిసి ఆన్లైన్ బిజినెస్ ప్రారంభించారు. దానికి అందరికి బాగా పరిచయమున్న పేరును పెట్టాలనే ఉద్దేశ్యంతో 'అలీబాబా' (Alibaba) పేరుని ఖరారు చేసాడు. ఈ సంస్థ కేవలం మూడు సంవత్సరాల కాలంలోనే గొప్ప వృద్ధిని సాధించింది.ఎంట్రన్స్ పరీక్షల్లోనే కస్టపడి సక్సెస్ సాధించిన జాక్ మా.. ఈ రోజు ప్రపంచం మెచ్చిన పారిశ్రామికవేత్తగా టాప్ 100 ధనవంతుల జాబితాలో ఒక వ్యక్తిగా నిలిచాడు. మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ఇతడు ఇప్పుడు వందల కోట్లు సంపాదిస్తూ చైనాలో అత్యంత ధనవంతుడుగా నిలిచాడు. జాక్ తన స్నేహితురాలైన 'జాంగ్ యింగ్' (Zhang Ying)ను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. 'కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు' అనేదానికి జాక్ నిలువెత్తు నిదర్శనం, ఈయన జీవితం నేటీకి ఎంతోమందికి ఆదర్శప్రాయం. -
జీవిత పాఠాలు నేర్పిన గురువులు
మీలో ఆశలు రేకిత్తించి వాటిని సాధించేందుకు ఓదారి చూపే ప్రతి వ్యక్తి గురువే. అలా అందరి జీవితాల్లో వయసుతో సంబంధం లేకుండా చాలామంది గురువులు తారసపడుతారు. అలాంటి వారి సలహాలు, సూచనలు సామాజికంగా, ఆర్థికంగా ఎదిగేందుకు ఉపయోగపడుతాయి. అలా గురువుల సాయంతో కొందరు వ్యాపారాల్లో స్థిరపడి మరెందరికో ఉపాధి కల్పిస్తున్నారు. అలాంటి వ్యాపార దిగ్గజాలు తమ గురువుల గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు. అవేంటో తెలుసుకుందాం.వారెన్బఫెట్జీవితంలో కష్టనష్టాలు వారెన్బఫెట్కి అనేక పాఠాలు నేర్పాయి. తన తండ్రి హోవార్డ్ బఫెట్, కోచ్ బెంజమిన్ గ్రాహం, భార్య సుసాన్ బఫెట్ నుంచి ఎన్నో ఆర్థికపాఠాలు నేర్చుకున్నట్లు ఆయన చెప్పారు. సొంతంగా డబ్బు సంపాదించడం ఎలాగో తన తండ్రి నుంచి నేర్చుకున్నట్లు తెలిపారు. పెట్టుబడి నిర్వహణకు సంబంధించిన ఎన్నో విషయాలు ఆయన నేర్పించారని పేర్కొన్నారు.బిల్గేట్స్మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్‌గేట్స్ తనకు వారెన్‌బఫెట్ ఎన్నో విషయాల్లో మార్గనిర్దేశం చేశారని చెప్పారు. హార్వర్డ్ యూనివర్సిటీలో మధ్యలో చదువు మానేసిన తర్వాత క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నానని తెలిపారు. ఆ సమయంలో వారెన్‌బఫెట్ దీర్ఘకాల లక్ష్యాలతో డబ్బు ఎలా సంపాదించాలో నేర్పించినట్లు చెప్పారు.జెఫ్బెజోస్అమెజాన్ వ్యవస్థాపకులు జెఫ్‌బెజోస్ వారెన్‌బఫెట్, జేపీ మోర్గాన్ ఛైర్మన్ జామీ డిమోన్, డిస్నీ సీఈఓ బాబ్ ఇగర్లను తన గురువులుగా భావిస్తున్నట్లు చెప్పారు. వారెన్‌బఫెట్ తన పుస్తకాల్లో ఎన్నో విషయాలు పంచుకుంటారని, దాదాపు అన్నింటిని చదవడానికి ఇష్టపడతానని బెజోస్ అన్నారు. సంక్షిష్టమైన కంపెనీ ద్వారా పెట్టుబడి పెడుతూ డబ్బు ఎలా సంపాదించాలో డిమోన్ను చూసి నేర్చుకోవాలన్నారు. దీర్ఘకాలిక లక్ష్యాలను ఎలా నెరవేర్చుకోవాలో ఇగర్ ద్వారా తెలుసుకున్నానని చెప్పారు.ఇలాన్మస్క్ఎక్స్(ట్విటర్), టెస్లా, స్పేస్ఎక్స్ వంటి కంపెనీల అధినేత ఇలాన్‌మస్క్ స్పేస్ఎక్స్ బిజినెస్ డెవలప్మెంట్ హెడ్ జిమ్ కాంట్రెల్‌ను గురువుగా భావిస్తారు. మస్క్ కంపెనీలో పనిచేస్తున్న ఉన్నతాధికారులకు కాంట్రెల్ మెంటార్‌గా వ్యవహరిస్తున్నారు. యాపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్‌జాబ్స్ పుస్తకాలు ఇప్పటికీ చదువుతున్నట్లు మస్క్ చెప్పారు. అవి తనకు మార్గదర్శకాలుగా పనిచేస్తాయని వివరించారు. బెంజమిన్ ఫ్రాంక్లిన్, నికోలా టెస్లా, థామస్ ఎడిసన్, ఐసాక్ న్యూటన్, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ పుస్తకాలు ఎంతో ప్రేరణ ఇస్తాయన్నారు.ఇదీ చదవండి: 2.75 లక్షల ఫోన్ నంబర్లకు చెక్‌మార్క్ జుకర్బర్గ్మెటా వ్యవస్థాపకులు మార్క్ జుకర్‌బర్గ్ యాపిల్ వ్యవస్థాపకులు స్టీవ్ జాబ్స్‌ను ఎంతో ఆరాధించేవారు. మేనేజ్మెంట్ నిర్వహణతోపాటు కంపెనీకి ప్రత్యేకంగా బ్రాండింగ్ ఎలా తీసుకురావాలో స్టీవ్ దగ్గరి నుంచి నేర్చుకున్నట్లు మార్క్ తెలిపారు. -
Teachers' Day 2024: నా బెస్ట్ స్టూడెంట్స్..
ఉపాధ్యాయురాలిగా నేను 1992లో చాక్‌పీస్ పట్టుకున్నాను. తల్లిదండ్రులకు దూరంగా ఉన్న చిన్నారులు, అందులోనూ పేదింటి పిల్లలకు చదువు చెప్పేటప్పుడు చాలా బాధ్యతగా ఉండాలి. నా కన్నపిల్లలు ఇద్దరైతే 32 ఏళ్ల సర్వీస్‌లో దేవుడిచ్చిన పిల్లలు ఇరవై వేలకు పైనే.జ్వరంతో పరీక్ష రాసింది..లక్ష్మి... చక్కగా చదివే అమ్మాయి. నేను వాళ్లకు మాథ్స్ టీచర్ని, హౌజ్ పేరెంట్‌ని కూడా. మాథ్స్ పరీక్షకు ముందు లక్ష్మికి అమ్మవారు ΄ోసింది. ఒళ్లంతా కాలి΄ోతూ ఉంది. హాస్పిటల్‌కి తీసుకెళ్లి సెలైన్ పెట్టించి, బెడ్ పక్కనే ఉండి ధైర్యం చెపుతూ ఉన్నాను. ఉదయానికి జ్వరం కొంచెం తగ్గింది.‘పరీక్ష రాయగలవా?‘ అని అడిగాను. ‘మీరు పక్కన ఉంటే రాస్తాను‘ అంది ధైర్యంగా. మెల్లిగా సెంటర్‌కి తీసుకొని వెళ్ళాను. మా అబ్బాయికి కూడా ఆ రోజు పదో తరగతి పరీక్ష. కానీ ఈ పిల్లలే నా తొలి ్రపాధాన్యం. మొదటి అంతస్తు లో లక్ష్మి పరీక్ష గది.‘ఎక్కగలవా లక్ష్మీ?‘ అడిగాను. నీరసంగా బదులిచ్చింది. కొబ్బరి నీళ్లు తాగించి ఎగ్జామ్ హాల్లో పక్క పిల్లలకి లక్ష్మి గురించి చెప్పి కిందకు వచ్చాను. రిజల్ట్ వచ్చింది. చక్కటి మార్క్స్. పదో తరగతి మార్కులతోనే ΄ోస్ట్ ఆఫీస్ ఉద్యోగంలో చేరిందని తెలిసి ఎంత సంతోషం వేసిందో! ఓల్డ్ స్టూడెంట్స్ నా దగ్గరకు వచ్చినప్పుడు ‘పక్క వాళ్లకు మంచి చేస్తున్నారా? చెడు అలవాట్లు చేసుకున్నారా?‘ అని రెండు ప్రశ్నలు వేస్తాను. వాళ్లు ‘మేము మీ స్టూడెంట్స్ మేడం’ అంటారు. నా పిల్లలు ఇంజినీర్లు, టీచర్స్, నర్స్‌లు, ఎస్.ఐ, ్రపాజెక్ట్ మేనేజర్ లు, ఫిజియో థెరపిస్టులు... ఇందరికి అమ్మగా ఉండగల వరం ఇదిగో ఈ ఉపాధ్యా వృత్తిలోనే సాధ్యం. అబ్దుల్ కలాం గారి అడుగుజాడల్లో నడిచే నాకు ఇంతకంటే కావలసింది ఏముంది! చివరి క్షణం వరకూ అధ్యాపకురాలిగానే ఉంటాను.చదువు కోసం పెళ్లిని వాయిదా వేసింది..‘ఉమ‘. పదో తరగతి మంచి మార్క్స్‌తో పాస్ అయింది. మా గురుకుల పాఠశాలలోనే ఇంటర్ చదివింది. రోజూ నా క్లాస్‌కి వచ్చి కొద్దిసేపు ఉండేది. ఎందుకలా అని అడిగినప్పుడు ‘మా అమ్మను చూసినట్లు ఉంటుంది. ఇప్పుడు మీరు క్లాసుకు రావడం లేదు కదా! అందుకే రోజూ వచ్చి చూసి వెళ్తున్నాను’ అని ఉమ చెప్తుంటే నాకు కన్నీళ్లాగలేదు. ఇంటర్ తరువాత మా ఇంటికి వచ్చి ‘బీటెక్‌లో చేరడానికి కాలేజ్‌లు ఆప్ష¯Œ ్స పెట్టండి... పదో తరగతి తరువాత పెళ్లి చేసుకోవద్దు... ఇంట్లో ఒప్పించి చదవండి అని మీరు చెప్పేవారు కదా. నేను మా నాన్నను అలాగే ఒప్పించి చదువుకోబోతున్నాను. చదువు తరువాతే పెళ్లి అని చెప్పేశాను’ అంటున్న ఉమని చూస్తే తృప్తి. ఉమ బీటెక్ పూర్తి చేసి ఉద్యోగంలో చేరింది. మరో ఇంజినీర్ నే పెళ్లి చేసుకున్నది... అని తెలిసినప్పుడు సంతృప్తి. – తన్నీరు శశి, గణిత అధ్యాపకురాలు, పుదూరు సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల, తిరుపతి జిల్లా -
ఆయనే రుషి..అక్షర కార్మికుడు..మార్గదర్శి..!
ఆదియుగం నుంచి ఆధునికయుగం వరకు ఆయనే రుషి.. శిష్యుల భవిష్యత్‌కు నిచ్చెన వేసే అక్షర కార్మికుడు.. సమాజ దేవాలయానికి నిజమైన రక్షకుడు.. ఆయనెవరో కాదు మనందరికీ విద్యా బుద్ధులు నేర్పే గురువు. అందుకే తల్లిదండ్రుల తర్వాత ఆచార్య దేవో భవ అంటూ గురువుకి స్థానం ఇచ్చాం. గురువు బ్రహ్మ.. గురువు విష్ణువు.. గురువు శివుడు అంటూ కీరిస్తాం.. దేశాన్ని ఏలే రాజైనా సరే ఒక గురువుకి శిష్యుడే.. ప్రపంచాన్ని శాసించే పరమాత్ముడైనా ఒక గురువుకి శిష్యుడిగా మారి విద్యను అభ్యసించాల్సిందే.. గురుభక్తి ఉన్న శిష్యుడు ఉన్నత స్థితికి చేరుకుంటాడు. గురువు ఆశీస్సులతో మనం ఏదైనా సాధించగలం. ఈ రోజు (సెప్టెంబర్ 5న) డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా మనందరికీ స్ఫూర్తినిచ్చే ఉత్తమ గురు-శిష్య జంటల గురించి తెలుసుకుందాం.మహాభారత కాలం నుంచి శ్రీకృష్ణ పరమాత్మ, అర్జునుడిని సిసలైన గురుశిష్య సంబంధానికి ప్రతీకలుగా కొలుస్తున్నాం. సర్వేపల్లి తనకు కృష్ణుడితో సమానమని జాతిపిత మహాత్మా గాంధీ కీర్తించారు. ‘మీరు నా కృష్ణుడు, నేను అర్జునుడిని’ అన్నారు గాంధీజీ. ‘మీరు నా ఉపాధ్యాయుడు’ అని కీర్తించారు పండిట్ నెహ్రూ. బహుశా ఈ వ్యాఖ్యల నేపథ్యం నుంచే ఆయన పుట్టిన రోజును టీచర్స్ డేగా నిర్వహించాలనే ఆలోచన పుట్టిందేమో..!గురువులకే గురువు..యుగపురుషుల గురించి ఉపన్యాసం ఇవ్వండని పిలిస్తే.. యుగపురుషుడే వచ్చి ఉపన్యసించారు అని కొనియాడారు హోవెల్. నాలో మామూలు మనిషిని దర్శించిన మహర్షి అని కీర్తించారు సోవియట్ అధినేత స్టాలిన్. అలాంటి గీతాచార్యుడు, ప్రబోధకుడు, యుగపురుషుడు, జ్ఞాన మహర్షి.. మన సర్వేపల్లి రాధాకృష్ణన్. గురువులకే గురువు ఆయన. అందుకే ఆయన పుట్టిన రోజు ‘ఉపాధ్యాయ దినోత్సవం’ అయ్యింది.తరతరాలుగా, యుగయుగాలుగా సనాతన భారతీయ విచారధారలోని పరమార్థ విషయాల్ని ప్రపంచానికి సూటిగా, సులభంగా, స్పష్టంగా తెలియజెప్పిన ధీమంతుడు, ధీశాలి సర్వేపల్లి. హృదయాన్ని, మేధను సమపాళ్లలో పండించిన ప్రజ్ఞాశాలి ఆయన. తత్వశాస్త్రానికి సాహిత్య మాధుర్యం చేకూర్చిన మహా రచయిత రాధాకృష్ణన్. ఆధునిక సమాజానికి ఎలాంటి గురువు అవసరమో, గురువు ఎలా ఉండాలో ఆయన స్వీయచరిత్రలో స్పష్టంగా వివరించారు. బోధ గురువులు, బాధ గురువుల లక్షణాలను ప్రస్తావించారు.గురువు గొప్పదనం..మహాభారతం అరణ్య పర్వంలోని యక్షప్రశ్నల ఇతివృత్తంలోని అంశం.. యక్షుడు ‘మనిషి మనీషి ఎలా అవుతాడు?’ అని ధర్మరాజును ప్రశ్నిస్తాడు. అప్పుడు ధర్మరాజు ‘అధ్యయనం వల్ల, గురువు ద్వారా’ అని బదులిస్తాడు. గురువుకు ఉన్న శక్తి అంతటి గొప్పది. అధర్వణ వేద సంప్రదాయం ప్రకారం చదువు ప్రారంభించే ముందు శిష్యుడు మొదటగా ఇష్టదేవతా ప్రార్థన చేస్తాడు. ఆ తర్వాత ‘స్వస్తినో బృహస్పతిర్దదాతు’ అని గురువును స్మరిస్తాడు.చాణక్యుడు చేతిలో రూపుదిద్దుకున్న శిల్పం చంద్రగుప్తమౌర్యుడు. సమర్థ రామదాసు తయారుచేసిన వీరఖడ్గం శివాజీ. రామకృష్ణ పరమహంస అందించిన ఆధ్యాత్మిక శిఖరం వివేకానందుడు. భారతీయ గురుశిష్య శక్తికి వీళ్లు ఉదాహరణలు మాత్రమే. ఆదిదేవుడితో మొదలైన గురుపరంపర వేదవ్యాసుడితో సుసంపన్నమైంది. భారతీయ సంస్కృతిలో నేటికీ అది కొనసాగుతూనే ఉంది.మన సనాతన ధర్మాన్ని సంరక్షిస్తున్న ఆ గురుదేవులందర్నీ స్మరించుకుంటూ.. ఈ ఉత్తమ గురు-శిష్య ద్వయం నుంచి నేటి తరం అపారమైన జీవిత పాఠాన్ని నేర్చుకుని స్ఫూర్తి పొందొచ్చు.(చదవండి: గురువును మించిన శిష్యులు: ఈ సెలబ్రిటీల గురించి తెలుసా?) -
Teacher's Day 2024: థ్యాంక్యూ టీచర్..!
అంతవరకూ నీవొక రాయివి. గురువు చేయి పడగానే చెకుముకి అవుతావు. అంతవరకూ నీవొక ప్రవాహం. గురువు కాళ్లను తడపగానే దిశ గల్గి సారవంతమైన నేలకు మళ్లి విత్తుకు ప్రాణం పోస్తావు. అంతవరకూ కేవలం తోలు ముక్క. గురువు?... దానికి నాదం ఇస్తాడు. తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసినా ఎవరో ఒకరు ప్రేమగా ఆలనా పాలనా చేయగలరు. ప్రేమ పంచగలరు. కాని జ్ఞానం మాత్రం సరైన గురువే ప్రసాదిస్తాడు. గద్దించి బుద్ధి చె΄్తాడు. కనుచూపుతోనే శాసించి కడుపులో కరుణ దాచుకుని ఎదిగే వరకూ చేయి పట్టి నడిపిస్తాడు. తల్లిదండ్రులు జన్మనిస్తే దానిని సార్థకం ఎలా చేసుకోవాలో గురువే తెలియచేస్తాడు. ఒక్క గురువు వేల జీవితాలకు దిక్సూచి. గొప్ప గొప్ప టీచర్లు ఎందరో. తెలియని మహానుభావులు ఎందరో. విద్యార్థులు ఎదిగేందుకు నిచ్చెనలుగా మారి వారు మాత్రం నేల మీదే ఉండిపోతారు. అలాంటి మహనీయులందరికీ ‘టీచర్స్ డే’ సందర్భంగా నమస్కారాలు. థ్యాంక్యూ టీచర్.నేచరే టీచర్..‘ప్రకృతి అనే బడిలో ఎంతో మంది గురువులు ఉన్నారు’ అంటుంది రచయిత్రి, ఇలస్ట్రేటర్ బుల్బుల్ శర్మ. తానే ఒక గురువుగా మారి ప్రకృతిని గురువుగా చేసుకుని ఎలాంటి పాఠాలు నేర్చుకోవచ్చో పిల్లలకు చెబుతోంది. వారి కోసం స్టోరీ, ఆర్ట్ వర్క్‌షాప్‌లు నిర్వహిస్తోంది. క్లాస్‌రూమ్‌లో కూచుంటే టీచర్ మాత్రమే గురువు. అదే ప్రకృతి అనే క్లాస్‌రూమ్‌లోకి వెళితే ప్రతి తీవ, చెట్టు, పక్షి, ఊడ అన్నీ ఎన్నో నేర్పిస్తాయి పిల్లలకు. విషాదం ఏమంటే పిల్లలు ఈ అతి పెద్ద క్లాస్‌రూమ్‌ను మిస్ అవుతున్నారు అంటుంది శర్మ.పిల్లలకు అడవి తెలియదు..‘ఎలాంటి కాలంలో ఉన్నాం మనం? చెట్టు కనిపించడమే అపూర్వం, చెట్టు మీద పిట్ట కనిపించడం అద్భుతం అనుకునే కాలంలో ఉన్నాం. అక్కడెక్కడో చంద్రుడి మీద ఆవాసాల గురించి ఆలోచించే మనం చుట్టు ఉన్న ప్రకృతికి మాత్రం దూరం అవుతున్నాం. పిల్లలను ప్రకృతిలోకి తీసుకురావడానికి, అక్కడ పక్షులు అనే గురువులను వారికి పరిచయం చేయడానికి ఎన్నో కథలు రాశాను. బొమ్మలు వేశాను. వాటిని చూసిన, చదివిన పిల్లలు మనం కూడా పచ్చటి అడవిలోకి వెళదాం అనుకుంటారు’ అంటుంది శర్మ.ఫోన్ నుంచి ఫారెస్ట్‌కి..ఒక రోజు శర్మ ఫోన్ మోగింది. తనని తాను పరిచయం చేసుకున్న తరువాత ‘మా అబ్బాయి మీ పుస్తకం చదివిన తరువాత ఫారెస్ట్‌కు తీసుకువెళ్లు, పక్షులు చూపించు అని ఒకటే అడగడం...’ అని ఒక తల్లి శర్మతో ఫోన్లో చెబుతూ పోయింది. ఆ తల్లి గొంతులో పిల్లాడి మీద అసహనం లేదు. ఆమె మనసు సంతోషంతో నిండిపోయింది. బుల్బుల్ శర్మ పుస్తకాలు పిల్లలపై చూపిన సానుకూల ప్రభావం గురించి చెప్పడానికి ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ‘మీరు ఏం నేర్చుకున్నారు పక్షుల నుంచి’ అని అడిగితే ‘క్రమశిక్షణ, ఐక్యత. కష్టపడడం, ఆత్మవిశ్వాసం, ఎప్పుడూ సంతోషంగా ఉండడం, గుడ్ పేరింటింగ్ ఇలా ఎన్నో మంచి విషయాలు పక్షుల నుంచి నేర్చుకోవచ్చు’ అంటారు పిల్లలు. ఆమె ఏ స్కూల్లోనూ టీచర్‌గా పని చేయలేదు. కాని వందలాది విద్యార్థులకు ప్రియమైన గురువు. ఆమె పుస్తకాలే వారికి గురుబోధ. వారితో ఆమె చేయించే హోమ్‌వర్క్ పేరే అడవి. పిల్లల కోసమే జీవితందిల్లీలో పుట్టిన బుల్బుల్ శర్మ భిలాయ్‌లో పెరిగింది. దిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీలో రష్యన్ లాంగ్వేజ్‌లో గ్రాడ్యుయేషన్ చేసి పై చదువుల కోసం మాస్కో స్టేట్ యూనివర్శిటీకి వెళ్లింది. స్వదేశానికి తిరిగివచ్చిన తరువాత పెయింటర్‌గా ప్రస్థానంప్రారంభించింది. పిల్లల కోసం ఆమె రాసిన కథలు భారతీయ భాషలతో పాటు ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్.. మొదలైన విదేశి భాషల్లోకి కూడా అనువాదం అయ్యాయి. తన పరిశీలన, ప్రయాణాల ఆధారంగా పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా రచనలు చేయడం బుల్బుల్ శర్మ శైలి. ‘ఏమైనా నేర్చుకోవచ్చు. ఏ వయసులో అయినా నేర్చుకోవచ్చు. ఎవరి నుంచి అయినా నేర్చుకోవచ్చు’ అనేది శర్మ నోటి నుంచి వినిపించే మాట.ఇవి చదవండి: Teacher's Day Special: నా బెస్ట్ టీచర్.. -
Teachers' Day 2024 : ప్రపంచంలో తొలి పాఠశాల ఎలా ప్రారంభమయ్యింది?
మనిషి జీవితంలో గురువు పాత్ర అమోఘమైనది. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5ను ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు. ఆయన భారతదేశానికి మొదటి ఉపరాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతి కూడా. అయితే ప్రపంచంలోని మొట్టమొదటగా పాఠశాల ఎలా ప్రారంభమయ్యిందో ఇప్పుడు తెలుసుకుందాం.ప్రపంచంలోని మొట్టమొదటి ప్రొఫెషనల్ టీచర్‌గా కన్ఫ్యూషియస్ గుర్తింపు పొందారు. 551 బీసీలో చైనాలో జన్మించిన తత్వవేత్త కన్ఫ్యూషియస్ ఒక ప్రైవేట్ ట్యూటర్‌గా జీవితం ప్రారంభించారు. కొంతమంది గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్‌ను మొదటి గురువుగా పరిగణించినప్పటికీ, కన్ఫ్యూషియస్‌ను కూడా అదేవిధంగా భావిస్తారు. కన్ఫ్యూషియన్ చైనాలోని ఒక పేద కుటుంబంలో జన్మించాడని చెబుతారు. ఆయన స్వతహాగా సంగీతం, చరిత్ర, గణితం నేర్చుకున్నాడు. ఆ కాలంలో రాజకుటుంబంలోని పిల్లలకు మాత్రమే విద్యనభ్యసించే అవకాశం ఉండేది. అయితే కన్ఫ్యూషియస్ విద్య అనేది అందరికీ చేరాలని కోరుకున్నాడు. అందుకే అతను ట్యూటర్‌గా మారి, అందరికీ విద్యను బోధించడం ప్రారంభించారు.3,000 బీసీ నాటికే ఈజిప్టులో పాఠశాల విద్య ప్రారంభమైంది. ఎన్సైక్లోపీడియా బ్రిటానికా తెలిపిన వివరాల ప్రకారం ఈజిప్టులో రెండు రకాల అధికారిక పాఠశాలలు నెలకొల్పారు. ఒకటి క్లరికల్ పనులు నేర్చించేందుకు, మరొకటి పండిత శిక్షణ కోసం కేటాయించారు. ఐదేళ్ల వయసు గల పిల్లలను ఈ పాఠశాలల్లో చేర్పించేవారు. వారికి 16-17 ఏళ్లు వచ్చేవరకూ విద్యను బోధించేవారు. -
Teacher's Day Special: నా బెస్ట్ టీచర్..
ఈ ఏడాది జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకుంటున్నారు డాక్టర్ ఎన్. మృదుల. హైదరాబాద్, బేగంపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో తెలుగు అసోసియేట్ ప్రొఫెసర్. ఉపాధ్యాయురాలిగా 34 ఏళ్లలో ఆమె దగ్గర పదివేల మంది విద్యార్థులు తెలుగు నేర్చుకున్నారు. తనను బోధనరంగం వైపు నడిపించింది సికింద్రాబాద్, ప్యాట్నీలోని తాను చదువుకున్న స్కూలు, ఆ స్కూల్ తెలుగు టీచర్ భువనేశ్వరి గారేనన్నారు డాక్టర్ మృదుల. అంటే ఈ బెస్ట్ టీచర్ మెచ్చుకున్న తన బెస్ట్ టీచర్ భువనేశ్వరి.అంతా ఆ టీచర్ ప్రభావమే..‘భువనేశ్వరి టీచర్ పద్యంలోని ప్రతి పదానికి అర్థం చెప్పడంతో పాటు, దానికి వ్యుత్పత్తి, ఆ పదాన్ని ప్రయోగించడం వెనుక కవి ఉద్దేశం చెప్పేవారు. కవితలు, కథలు రాయించేవారు. సభా నిర్వహణ చేయించేవారు. ఆమె ప్రభావంతోనే తెలుగు భాష మీద మక్కువ పెరిగింది. ఆ ప్రోత్సాహమే ఇప్పటికీ మయూఖ, తరుణి మ్యాగజైన్లలో కాలమిస్టుగా వ్యాసాలు రాయిస్తోంది. పాఠం చెప్పడంలో కూడా ఆమె బాటనే అనుసరిస్తున్నాను’ అంటారు మృదుల.నిత్యం విద్యార్థినే!‘నా విద్యార్థులకు నేను అసైన్మెంట్లు ఇచ్చినప్పుడు వాళ్లు కచ్చితంగా గడువులోపే పూర్తి చేయాలని కోరుకుంటాను. అలాగే అధికారుల నుంచి మాకు వచ్చే అసైన్మెంట్లను కూడా గడువులోపు పూర్తి చేసేదాన్ని. పనిని శ్రద్ధగా అంకితభావంతో చేయాలనుకుంటాను. మా కుటుంబంలో టీచర్లు లేరు. నేను టీచింగ్‌లోకి వచ్చినందుకు అమ్మానాన్న చాలా సంతోషించారు. కోవిడ్‌లో ఆన్లైన్ క్లాసులు చెప్పడానికి సాంకేతికపరంగా అవసరమైన సహాయం మా పిల్లలు చేసేవాళ్లు. కోవిడ్ తర్వాత కూడా అవసరాన్ని బట్టి ఆన్లైన్ క్లాసులను కొనసాగించాను. క్లాసులో పూర్తి కాని పాఠాలను ఇంటికి వచ్చిన తర్వాత ఆన్లైన్లో చెప్తున్నాను. టీచర్‌గా ‘బెస్ట్ ఆన్‌లైన టీచర్, బెస్ట్ హెచ్ఓడీ, బెస్ట్ ఫ్యాకల్టీ’ గౌరవాలందాయి. ఉపాధ్యాయురాలిగా ప్రభుత్వం నుంచి పురస్కారం అందుకోవడం ఇదే మొదటిసారి’’ అని తన ఉపాధ్యాయ ప్రస్థానాన్ని వివరించారు డాక్టర్ మృదుల. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఢిల్లీలోని విజ్ఞానభవన్‌లో రాష్ట్రపతి చేతుల మీదుగా ఆమె ‘ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు’నందుకోనున్నారు.సీతమ్మబడి..మా స్కూల్ పేరు ‘పరోపకారి బాలికోన్నత పాఠశాల’. సీతమ్మ అనే మహిళ కట్టించిన స్కూల్ కావడంతో సీతమ్మబడి అంటారు. కవితలు రాయడంతోపాటు స్కూల్లో జరిగే సభలు, సమావేశాల్లో చురుగ్గా ఉండేదాన్ని. చక్కటి తెలుగుతో వక్తలను వేదిక మీదక ఆహ్వానించేదాన్ని. పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో ఉన్నప్పుడు ఆకాశవాణిలోని యువవాణి కార్యక్రమంలో ప్రయోక్తగా ప్రముఖులను ఇంటర్వ్యూ చేశాను. అనౌన్స్మెంట్లు, వ్యాసాలు కధానికలు చదవడం... ఇలా కలం, గళం కలిసి కొనసాగాయి. ఇక బోధనరంగంలోకి వచ్చిన తర్వాత ప్రతిరోజూ ఇష్టమైన రోజుగానే గడిచింది. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
గురువును మించిన శిష్యులు: ఈ సెలబ్రిటీల గురించి తెలుసా?
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెబరు 5న మన దేశంలో టీచర్స్‌డే జరుపుకోవడం ఆనవాయితీ. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆసాధారణ ప్రజ్ఞాశాలి. రాజ నీతి కోవిదుడు, విద్యావేత్త. భారత తొలి ఉపరాష్ట్రపతిగా, రెండో రాష్ట్రపతిగా విశేషసేవంలందించి, భారత అత్యున్నత పురస్కారం ‘భారతరత్నం’ అందుకున్న గొప్ప వ్యక్తి.ఉధ్యాయ దినోత్సవం అనగానే విద్యార్థులకు ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది.ఒక విధంగా చెప్పాలంటే ఇదొక అరుదైన సందర్భం అని చెప్పవచ్చు. టీచర్లు, విద్యార్థుల కలిసి సరదాగా ఆడుతూ పాడుతూ గడిపే చక్కటి అవకాశం. తమ అభిమాన టీచర్ల వేషధారణలో సందడి చేస్తారు. వారిని అనుకరిస్తారు. భవిష్యత్తులోతామూ ఇలాగే కావాలని కలలు కంటారు. జీవితాంతా తమ అభిమాన టీచర్లను, వారి జ్ఞాపకాలను తమ గుండెల్లో పదిలంగా దాచుకుంటారు. అలాంటి వారిలో కొంతమంది సెలబ్రిటీల గురించి తెలుసుకుందాం. ‘‘రాయిని వజ్రంలా మార్చగలిగే శక్తే ఉపాధ్యాయుడు’’గురువు అంటే మనల్ని అజ్ఞానంనుంచి జ్ఞానంవైపు నడిపించే అద్భత శక్తి. విద్యతో పాటు విచక్షణ కూడా నేర్పించేవాడే గురువు. గురువు లేనిదే ఏ మనిషికీ పురోగతి లేదు. గురువు అనేక రూపాలలో ఉంటాడు. గైడ్ అనే ఆంగ్ల పదం సంస్కృత పదం గురు నుండి ఉద్భవించింది. నిస్వార్థంగా తన విజ్ఞానమంతా శిష్యుడికి ధారపోస్తాడు గురువు. ఆ జ్ఞానంతో తన శిష్యుడు లోకానికి మేలు చేయాలని భావిస్తాడు.‘‘విద్యార్థులను తీర్చిదిద్దే క్రమంలో వెలకట్టలేని త్యాగాలు చేసిన ఉపాధ్యాయులందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు.’’అమితాబ్ బచ్చన్: బాలీవుడ్ స్టార్ యాక్టర్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్. గంభీరమైన ఆయన వాయిస్‌కు ఫిదా కాని వారు ఉండరు. ఆయన స్వరమే ఆయనకు కొండంత ఆస్తి. ఆయన స్వరంగా ఇంత గొప్ప ఖ్యాతి గడించినడానికి, పాపులర్ కావడానికి కారణం ఇంగ్లీష్ టీచర్ మార్టిన్. తప డిక్షన్‌ను అభివృద్ధి చేయడంలో మార్టిన్ ఎంతో సాయం చేశారని, తనను ఎంతో ప్రోత్సహించేవారని మార్టిన్ గురించి ఎపుడూ చెబుతూంటారు.ఏ.పీ. జే అబ్దుల్ కలాం: భారతదేశ మాజీ రాష్ట్రపతి, ప్రఖ్యాత శాస్త్రవేత్త అబ్దుల్ కలాం చాలా మందికి స్ఫూర్తి. మరి ఆయనకు ప్రేరణ ఇచ్చిన టీచర్ ఎవరో తెలుసా? కలాం పాఠశాల ఉపాధ్యాయుడు ఇయాదురై సోలమన్. పెద్ద కలలు కనడం, ఆ కలల సాకారం కోసం కష్టపడి పనిచేసే లక్షణాలను ఆయన సోలమన్ నుంచే నేర్చుకున్నారట.ప్రియాంక చోప్రా: గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాకు ఒక మహిళా ఉపాధ్యాయురాలు ప్రేరణ. తన హైస్కూల్ టీచర్, ఓ'బ్రియన్ గురించి ప్రియాంక తరచూ ప్రస్తావిస్తూ ఉంటుంది. నిర్మాణం విషయంలో తనను ఎంతో ప్రోత్సహించేవారని చెప్పేవారు. వైఎస్ రాజశేఖర రెడ్డి : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి. వైఎస్ఆర్ గా ప్రసిద్ధి చెందిన వై.ఎస్.రాజశేఖర రెడ్డి కూడా ఉపాధ్యాయులనుచి బాగా ప్రభావితమయ్యారు. తనపై తన టీచర్లు ప్రభావం గణనీయంగా ఉంటుందని స్వయంగా ఆయన చెప్పేవారు. ముఖ్యంగా కేవీ సుబ్బారెడ్డి తన శక్తి సామర్థ్యాలను ఆదిలోనే గుర్తించి, ఉన్నత విద్యను అభ్యసించి, ప్రజా సేవలో కొనసాగాలని సూచించారట. ఆయన మార్గదర్శకత్వం, ప్రోత్సహంతోనే నిబద్ధతతో కూడిన ప్రజాపాలనలో, క్రమశిక్షణతో, ఉన్నతమైన ఆశయాలతో తాను రాణించినట్టు వైఎస్ఆర్ చెప్పేవారు. సచిన్ టెండుల్కర్: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ సాధించిన విజయాలను, క్రమశిక్షణ గురించి ప్రత్యేక పరిచయం అవసం లేదు. తన కోచ్ రమకాంత్ అచ్రేకర్ శిక్షణే తనను లెజెండరీ క్రికెటర్, "మాస్టర్ బ్లాస్టర్", "ది గాడ్ ఆఫ్ క్రికెట్" గా క్రికెట్ చరిత్రలో నిలబెట్టింది. అతని క్రికెట్ ప్రయాణంలో కోచ్ రమాకాంత్ అచ్రేకర్ ముఖ్యమైన పాత్ర పోషించాడు. ముంబైలోని దాదర్‌లోని శివాజీ పార్క్‌లో సచిన్‌కు శిక్షణ ఇచ్చాడు. వినోద్ కాంబ్లీ కూడా ఇతని శిష్యుడే. అచ్రేకర్ చెప్పిన స్ఫూర్తివంతమైన మాటలే తన జీవితాన్ని సమూలంగా మార్చేశాయని సచిన్ గుర్తు చేసుకున్నారు. -
డయానా, గ్రాహం బెల్, సిల్వెస్టర్ స్టాలోన్, వీళ్లంతా ఒకపుడు..!
మన జీవితాల్లో తొలి గురువు అమ్మ. మలిగురువు మన స్కూలు ఉపాధ్యాయుడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. పాఠశాల ఉపాధ్యాయులుగా వారి ప్రేరణ, స్ఫూర్తి జీవితాంతం గుర్తుండిపోయే వ్యక్తుల్లో ప్రముఖంగా నిలుస్తారు. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో కీలక బాధ్యత పాఠశాల ఉపాధ్యాయులదే. వారి అంకితభావం, విజ్ఞానంతో మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంటారు. అంతేకాదు చిన్నపుడు దాదాపు అందరూ ఆడే తొలి ఆట టీచర్ ఆట. అంతగా మన జీవితాల్లో గురువు పాత్ర లీనమై ఉంటుంది. కానీ టీచర్లుగా పిల్లల్ని అదుపు చేయడం, విద్యాబుద్ధులు నేర్పించడం అంత ఆషామాషీకాదు. కత్తి మీద సామే. అయినా అంతులేని నిబద్ధతతో, క్రమశిక్షణతో మెలిగి, తన విద్యార్థులకు ఆదర్శంగా నిలిచే గురువులెందరో...మన దేశంలో సెప్టెంబరు 5న జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పాటిస్తాం. భారతరత్న స్వతంత్ర భారత తొలి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గురువులకే గురువుగా ఆయన చేసిన అపారమైన కృషిని, విజయాలను గుర్తించి, ఆయన జయంతిని (1888, సెప్టెంబరు 5) పురస్కరించుకుని, ప్రతీ సంవత్సరం సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సంగా జరుపుకుంటాం. ఈ సందర్భంగా తొలి నాళ్లలో ఉపాధ్యాయులుగా పనిచేసిన కొంతమంది అంతర్జాతీయ ప్రముఖ వ్యక్తుల గురించి తెలుసుకుందాం.జాన్ ఆడమ్స్: అమెరికా రెండో ప్రెసిడెంట్ కావడానికి ముందు, జాన్ ఆడమ్స్ సెంట్రల్ స్కూల్ ఆఫ్ వోర్సెస్టర్లో ఉపాధ్యాయుడు. కానీ ఆయన ఈ ఉద్యోగం విసుగ్గా ఉండేదిట. అందుకే ఒక్క ఏడాదికే 1756లో న్యాయవాదిగా కొనసాగించడానికి ఈ పదవిని విడిచిపెట్టారట.లిండన్ బి. జాన్సన్: అమెరికా మాజీ అధ్యక్షుడు లిండన్ బి. జాన్సన్ 1928లో మెక్సికో ,యునైటెడ్ స్టేట్స్ సరిహద్దులో ఉన్న టెక్సాస్‌లోని కోటుల్లాలోని వెల్హౌసెన్ పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేశాడు. భాషా సమస్య ఉన్నప్పటికీ (అతని విద్యార్థులు స్పానిష్ మాత్రమే మాట్లాడేవారు ,లిండన్కు ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడేవారు), జాన్సన్ తన విద్యార్థుల ఆంగ్ల భాషను మెరుగుపరిచేందుకు విశేష కృషి చేశాడు. అలా 1965లో ఎలిమెంటరీ మరియు సెకండరీ ఎడ్యుకేషన్ యాక్ట్‌ను ఆమోదించడానికి దారి తీసింది.జిమ్మీ కార్టర్: అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ జార్జియాలోని ప్లెయిన్స్‌లోని మరనాథ బాప్టిస్ట్ చర్చిలో సండే స్కూల్లో బోధించేవాడు. ఈ సందర్బంగా ఆయన బోధనలు చాలా ప్రజాదరణ పొందాయి. ఈ ఉపన్యాసాలు వినడానికి ప్రజలు కూడా వేల మైళ్లు ప్రయాణించి వచ్చేవారట.హిల్లరీ క్లింటన్: హిల్లరీ క్లింటన్ కూడా కొంతకాలం ఉపాధ్యాయురాలిగా ఉన్నారు. 1960వ దశకంలో, క్లింటన్ 1974లో అర్కాన్సాస్‌కు వెళ్లడానికి ముందు వెల్లెస్లీ కాలేజీలో చదువు కున్నారు. అపుడు అర్కాన్సాస్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్ర బోధకులుగా ఉద్యోగం చేశారు. అలాగే హిల్లరీ, బిల్ క్లింటన్ ఇద్దరూ రాజకీయ నాయకులు కాకముందు ఒకే విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయులుగా పనిచేయడం విశేషం. హిల్లరీ తన ఉద్యోగాన్ని ఇష్టపడేవారట. ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకోమని విద్యార్థులను ఎల్లప్పుడూ ప్రోత్సహించేవారు. 2023లో, క్లింటన్ కొలంబియా యూనివర్సిటీ ఫ్యాకల్టీలో ప్రొఫెసర్‌గా , గ్లోబల్ అఫైర్స్‌లో ప్రెసిడెన్షియల్ ఫెలోగా చేరారు.బరాక్ ఒబామా: అమెరికా మాజీ అధ్యక్షుడిగా బరాక్ ఒబామా చికాగో యూనివర్సిటీ లా స్కూల్లో బోధించేవాడు. కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పొలిటికల్ సైన్స్‌లో బీఏ, 1991లో హార్వర్డ్ లా స్కూల్ నుండి పీజీ పట్టా పుచ్చుకున్న తరువాత బోధన ప్రారంభించి, సీనియర్ లెక్చరర్ అయ్యారు దాదాపు పదేళ్లకుపైగా ఒబామా రాజ్యాంగ చట్టం మరియు జాతి సిద్ధాంతాన్ని బోధించారు.ప్రిన్సెస్ డయానా: వేల్స్ యువరాణి కాకముందు డయానా లండన్ నర్సరీ పాఠశాలలో టీచింగ్ అసిస్టెంట్‌గా పనిచేశారు.అలెగ్జాండర్ గ్రాహం బెల్: టెలిఫోన్‌ను కనిపెట్టిన అలెగ్జాండర్ గ్రాహం బెల్ కూడా టీచర్‌గా పనిచేశారు. బోస్టన్ , కనెక్టికట్‌లోని హార్ట్‌ఫోర్డ్‌లో చెవిటివారి కోస ఉపాధ్యాయుడిగా పని చేశారు. ఆ సమయంలోనే టెలిఫోన్‌ను రూపొందించడానికి ప్రేరణ లభించిందట. 1876లో అధికారికంగా టెలిఫోన్‌ను కని పెట్టారు. ప్రముఖ నటుడు సిల్వెస్టర్ స్టాలోన్ జిమ్‌లో ట్రైనర్‌గా పని చేశాడు. 1960లలో అమెరికన్ కాలేజ్ ఆఫ్ స్విట్జర్లాండ్‌లో చదువు తున్నప్పుడు, అదనపు ఆదాయంకోసం జిమ్ టీచర్‌గా పనిచేశాడట.