బాల్యం, కౌమారం యవ్వనం, ఆ తరువాత, ముదిమి వయసు మానవ జీవితంలో సహజ పరిణామాలు! బాల్య యవ్వనాల్లో గురువు పాత్ర అత్యంత కీలకమైనది. తరువాతి దశల్లో మనిషి ఉత్తమ ప్రపంచ పౌరునిగా, సామా జిక జీవిగా పరిణామం చెందడానికి ఉపాధ్యాయుని పాత్ర ఎనలేనిది. ప్రతి పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు 8, 9, 10వ తరగతుల విద్యార్థులకు ఏడాదికి ఒక్కసారైనా వైద్యులను పిలి పించి అవగాహనా కార్యక్రమం నిర్వహించాలి.
వయసు పెరిగే కొలదీ మానవునిలో వచ్చే శారీరక మార్పులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించేలా చర్యలు తీసుకోవాలి. అలాగే పిల్లల తల్లిదండ్రులకు కూడా ఒక సీనియర్ ఉపాధ్యాయుని సహాయంతో, వీలైతే లేడీ టీచర్‌తో అవగాహన కల్పించాలి. ఫలితంగా టీనేజ్‌లో హార్మోన్ల ప్రభావం వల్ల పిల్లలలో కలిగే మార్పుల పట్ల అవగాహన కలుగుతుంది. క్షణికోద్రేకాలకు లోనై అకృత్యాలకు పాల్పడ కుండా ఈ అవగాహన పిల్లలను కాపాడుతుంది. తల్లిదండ్రులు కూడా వారు ఎటువంటి జాగరూకత వహించాలో తెలుసుకోగలుగుతారు.
భారతీయ సమాజంలో గురువును దేవునిగా పూజించే సంప్రదాయం ఉంది. ‘గురు దేవోభవ!’ అన్న మాటలు అందుకే ఉనికిలోకి వచ్చాయి. గురువు పాత్ర కేవలం పాఠాలు చెప్పడంతోనే అయిపోదు. పిల్లలకు కర్తవ్యాన్ని, ధర్మాచరణ నూ నూరిపోయడం; దానం, సహనం, సహానుభూతి, సత్వగుణం, నిర హంకారం, నైపుణ్యాలను పెంపొందించడం లక్ష్యంగా పనిచేయాలి. విద్యార్థుల్లో దాగి ఉన్న శక్తి సామర్థ్యా లను వెలికి తీయాలి. వ్యాయామం, యోగ, ధ్యానం వంటివి గురు సముఖంలోనే రాణింపు కొస్తాయి.
నిరాడంబరులై వినుతికెక్కిన సర్వేపల్లి రాధాకృష్ణ, గాంధీజీ, వివేకానందుడు, అబ్దుల్ కలాం వంటి ప్రముఖుల గురించి మన పాఠశాలలు, విశ్వవిద్యా లయాల్లో ఉపాధ్యాయులు చెప్పాలి. యువతను వజ్ర సంకల్పంతో దేశానికి ఉత్కృష్ట వనరులుగా మార్చగ లిగినవారు ఉపాధ్యాయులు! వారికి గురుపూజోత్సవ శుభాకాంక్షలు!
గురువులు సమాజ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టు కుని, బోధనా విధానంలో నూతన దారులు తొక్కాలి. నిష్ఠ, అంకితభావం, విద్యా ర్థుల పట్ల వాత్సల్యం, ఆద రణ కలిగి ఉండటం మంచి గురువు లక్షణాలు. వారిలో ప్రశ్నలడిగే జిజ్ఞాస, ఉత్సు కతలను నలిపివేయకుండా ఉండాలి. విద్యార్థుల్లో శీల నిర్మాణానికి కృషి చేయడం ముఖ్యమైన విధి. ఆత్మ విమర్శ, ఆత్మ విశ్లేషణ, ఆత్మ గౌరవం, ఆత్మ నిగ్రహాలను ప్రోది చేసుకుని ఎవరి జీవితాన్ని వారు తీర్చిదిద్దుకునేలా పిల్లలను తీర్చిదిద్దే వాడు గురువు. మన భారతీయ గురు పరంపరకు ప్రణామాలు! – పరిమి శ్యామలా రాధాకృష్ణ, వ్యాసకర్త బీఈడీ కాలేజీ విశ్రాంత ప్రిన్సిపాల్, మదనపల్లె, అన్నమయ్య జిల్లా
గురుతర బాధ్యత..
నేడు భారతదేశంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో దాదాపు 15 లక్షల పాఠశాలలు, 58 వేల కళాశాలలు, 1,500 విశ్వవిద్యా లయాలు ఉండగా వీటిలో దాదాపు 27 కోట్ల మంది విద్యార్థినీ విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. దాదాపు 1 కోటి 14 లక్షల మంది ఉపాధ్యా యులుగా పనిచేస్తున్నారు. అనాదిగా ప్రపంచంలోని అనేక దేశాలతో పోలిస్తే భారతదేశంలో విద్యకు, ఉపాధ్యాయులకు ఒక ప్రత్యేక గుర్తింపు,
గౌరవాలు ఉన్నాయి. దీనికి నిదర్శనం తక్షశిల, నలందా వంటి విశ్వ విద్యాలయాలలో ప్రపంచంలోని అనేక దేశాల నుండి విద్యా ర్థినీ విద్యార్థులు వచ్చి విద్యను అభ్యసించి తిరిగి వెళ్లి తమ విద్యా ర్థినీ విద్యార్థులకు విద్యను బోధించిన విషయం చారిత్రక సత్యం. మనం ఆరాధ్య పురు షులుగా భావిస్తున్నటువంటి రాముడు, కృష్ణుడు, ప్రహ్లాదుని నుంచి గౌతమ బుద్ధుడి వరకు గురు కులాలలో గురువులకు సేవ చేస్తూ విద్యాబుద్ధులను అభ్యసించిన వారే. విదేశీయుల పాలన కింద శతా బ్దాలు తరబడి ఉన్న మన భారతదేశం అనాది నుంచి ఉన్న శ్రేష్ఠమైన విద్యా వ్యవస్థను కోల్పోయింది.
స్వాతంత్య్రానంతరం మన విద్యా వ్యవస్థను గాడిన పెట్టే ప్రయత్నాలు అనేకం జరిగినప్పటికీ విద్యార్థుల్ని సౌశీల్యం, క్రమశిక్షణ కలిగిన ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దే సరైనటువంటి విధానాలు విద్యా వ్యవస్థలో కొరవడినాయి. నేడు యువతలో ముఖ్యంగా విద్యార్థినీ, విద్యార్థులలో పెద్దల ఎడల గౌరవం, కుటుంబ విలు వలు, నైతిక విలువలు, కఠోర శ్రమ, పరస్పర గౌరవం, దయ, సౌశీల్యం, ఐకమత్యం వంటి మానవీయ విలు వలు క్రమంగా తగ్గుతున్నాయి.
ఫలితంగా వారు వ్యక్తి గత జీవితాలను కోల్పోతు న్నారు. అదే సమయంలో భారతదేశానికి అనాదిగా ఉన్న కీర్తి ప్రతిష్ఠలు కూడా పోతున్నాయి. అనేక విద్యాలయాలలో విద్యార్థులు మాదకద్రవ్యాలు, మద్యం, ధూమపానం వంటి వ్యస నాలకు బానిసలు కావడమే కాకుండా తమ అమూల్య మైన సమయాన్ని సోషల్ మీడియాకు బలి చేస్తున్నారు. అలాగే ఈమధ్య స్త్రీలపై అత్యాచారాలు పెరిగిపోవడమూ గమనార్హం. కావున కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థినీ విద్యా ర్థులకు విద్యతో పాటు బుద్ధిని కూడా నేర్పించవలసిన గురుతర బాధ్యత నేటి అధ్యాపకులపై ఉంది.
గతంలో ప్రతి అధ్యాపకుడు సబ్జెక్టుతో సంబంధం లేకుండా పెద్ద బాలశిక్ష, చిన్న బాలశిక్ష వంటి వాటి నుండే కాకుండా సుమతి, వేమన, భాస్కర శతకాల నుండి విద్యార్థినీ విద్యార్థులకు సందర్భానుసారంగా నీతి వాక్యాలను, జ్ఞానాన్ని, శీలాన్ని, ఐకమత్యాన్ని బోధించేవారు. నేటి ఆధునిక అధ్యాపకులు కూడా విద్యార్థులను పరి పూర్ణమైన పౌరులుగా తీర్చిదిద్దడా నికి అన్ని విధాలా కృషి చెయ్యాలి. – వై.వి. రామిరెడ్డి, వ్యాసకర్త తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆచార్యులు
Comments
Please login to add a commentAdd a comment