yv ramireddy
-
Teacher's Day 2024: జీవితాలను దిద్దేవాడు..
బాల్యం, కౌమారం యవ్వనం, ఆ తరువాత, ముదిమి వయసు మానవ జీవితంలో సహజ పరిణామాలు! బాల్య యవ్వనాల్లో గురువు పాత్ర అత్యంత కీలకమైనది. తరువాతి దశల్లో మనిషి ఉత్తమ ప్రపంచ పౌరునిగా, సామా జిక జీవిగా పరిణామం చెందడానికి ఉపాధ్యాయుని పాత్ర ఎనలేనిది. ప్రతి పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు 8, 9, 10వ తరగతుల విద్యార్థులకు ఏడాదికి ఒక్కసారైనా వైద్యులను పిలి పించి అవగాహనా కార్యక్రమం నిర్వహించాలి.వయసు పెరిగే కొలదీ మానవునిలో వచ్చే శారీరక మార్పులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించేలా చర్యలు తీసుకోవాలి. అలాగే పిల్లల తల్లిదండ్రులకు కూడా ఒక సీనియర్ ఉపాధ్యాయుని సహాయంతో, వీలైతే లేడీ టీచర్‌తో అవగాహన కల్పించాలి. ఫలితంగా టీనేజ్‌లో హార్మోన్ల ప్రభావం వల్ల పిల్లలలో కలిగే మార్పుల పట్ల అవగాహన కలుగుతుంది. క్షణికోద్రేకాలకు లోనై అకృత్యాలకు పాల్పడ కుండా ఈ అవగాహన పిల్లలను కాపాడుతుంది. తల్లిదండ్రులు కూడా వారు ఎటువంటి జాగరూకత వహించాలో తెలుసుకోగలుగుతారు.భారతీయ సమాజంలో గురువును దేవునిగా పూజించే సంప్రదాయం ఉంది. ‘గురు దేవోభవ!’ అన్న మాటలు అందుకే ఉనికిలోకి వచ్చాయి. గురువు పాత్ర కేవలం పాఠాలు చెప్పడంతోనే అయిపోదు. పిల్లలకు కర్తవ్యాన్ని, ధర్మాచరణ నూ నూరిపోయడం; దానం, సహనం, సహానుభూతి, సత్వగుణం, నిర హంకారం, నైపుణ్యాలను పెంపొందించడం లక్ష్యంగా పనిచేయాలి. విద్యార్థుల్లో దాగి ఉన్న శక్తి సామర్థ్యా లను వెలికి తీయాలి. వ్యాయామం, యోగ, ధ్యానం వంటివి గురు సముఖంలోనే రాణింపు కొస్తాయి.నిరాడంబరులై వినుతికెక్కిన సర్వేపల్లి రాధాకృష్ణ, గాంధీజీ, వివేకానందుడు, అబ్దుల్ కలాం వంటి ప్రముఖుల గురించి మన పాఠశాలలు, విశ్వవిద్యా లయాల్లో ఉపాధ్యాయులు చెప్పాలి. యువతను వజ్ర సంకల్పంతో దేశానికి ఉత్కృష్ట వనరులుగా మార్చగ లిగినవారు ఉపాధ్యాయులు! వారికి గురుపూజోత్సవ శుభాకాంక్షలు!గురువులు సమాజ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టు కుని, బోధనా విధానంలో నూతన దారులు తొక్కాలి. నిష్ఠ, అంకితభావం, విద్యా ర్థుల పట్ల వాత్సల్యం, ఆద రణ కలిగి ఉండటం మంచి గురువు లక్షణాలు. వారిలో ప్రశ్నలడిగే జిజ్ఞాస, ఉత్సు కతలను నలిపివేయకుండా ఉండాలి. విద్యార్థుల్లో శీల నిర్మాణానికి కృషి చేయడం ముఖ్యమైన విధి. ఆత్మ విమర్శ, ఆత్మ విశ్లేషణ, ఆత్మ గౌరవం, ఆత్మ నిగ్రహాలను ప్రోది చేసుకుని ఎవరి జీవితాన్ని వారు తీర్చిదిద్దుకునేలా పిల్లలను తీర్చిదిద్దే వాడు గురువు. మన భారతీయ గురు పరంపరకు ప్రణామాలు! – పరిమి శ్యామలా రాధాకృష్ణ, వ్యాసకర్త బీఈడీ కాలేజీ విశ్రాంత ప్రిన్సిపాల్, మదనపల్లె, అన్నమయ్య జిల్లాగురుతర బాధ్యత..నేడు భారతదేశంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో దాదాపు 15 లక్షల పాఠశాలలు, 58 వేల కళాశాలలు, 1,500 విశ్వవిద్యా లయాలు ఉండగా వీటిలో దాదాపు 27 కోట్ల మంది విద్యార్థినీ విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. దాదాపు 1 కోటి 14 లక్షల మంది ఉపాధ్యా యులుగా పనిచేస్తున్నారు. అనాదిగా ప్రపంచంలోని అనేక దేశాలతో పోలిస్తే భారతదేశంలో విద్యకు, ఉపాధ్యాయులకు ఒక ప్రత్యేక గుర్తింపు,గౌరవాలు ఉన్నాయి. దీనికి నిదర్శనం తక్షశిల, నలందా వంటి విశ్వ విద్యాలయాలలో ప్రపంచంలోని అనేక దేశాల నుండి విద్యా ర్థినీ విద్యార్థులు వచ్చి విద్యను అభ్యసించి తిరిగి వెళ్లి తమ విద్యా ర్థినీ విద్యార్థులకు విద్యను బోధించిన విషయం చారిత్రక సత్యం. మనం ఆరాధ్య పురు షులుగా భావిస్తున్నటువంటి రాముడు, కృష్ణుడు, ప్రహ్లాదుని నుంచి గౌతమ బుద్ధుడి వరకు గురు కులాలలో గురువులకు సేవ చేస్తూ విద్యాబుద్ధులను అభ్యసించిన వారే. విదేశీయుల పాలన కింద శతా బ్దాలు తరబడి ఉన్న మన భారతదేశం అనాది నుంచి ఉన్న శ్రేష్ఠమైన విద్యా వ్యవస్థను కోల్పోయింది.స్వాతంత్య్రానంతరం మన విద్యా వ్యవస్థను గాడిన పెట్టే ప్రయత్నాలు అనేకం జరిగినప్పటికీ విద్యార్థుల్ని సౌశీల్యం, క్రమశిక్షణ కలిగిన ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దే సరైనటువంటి విధానాలు విద్యా వ్యవస్థలో కొరవడినాయి. నేడు యువతలో ముఖ్యంగా విద్యార్థినీ, విద్యార్థులలో పెద్దల ఎడల గౌరవం, కుటుంబ విలు వలు, నైతిక విలువలు, కఠోర శ్రమ, పరస్పర గౌరవం, దయ, సౌశీల్యం, ఐకమత్యం వంటి మానవీయ విలు వలు క్రమంగా తగ్గుతున్నాయి.ఫలితంగా వారు వ్యక్తి గత జీవితాలను కోల్పోతు న్నారు. అదే సమయంలో భారతదేశానికి అనాదిగా ఉన్న కీర్తి ప్రతిష్ఠలు కూడా పోతున్నాయి. అనేక విద్యాలయాలలో విద్యార్థులు మాదకద్రవ్యాలు, మద్యం, ధూమపానం వంటి వ్యస నాలకు బానిసలు కావడమే కాకుండా తమ అమూల్య మైన సమయాన్ని సోషల్ మీడియాకు బలి చేస్తున్నారు. అలాగే ఈమధ్య స్త్రీలపై అత్యాచారాలు పెరిగిపోవడమూ గమనార్హం. కావున కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థినీ విద్యా ర్థులకు విద్యతో పాటు బుద్ధిని కూడా నేర్పించవలసిన గురుతర బాధ్యత నేటి అధ్యాపకులపై ఉంది.గతంలో ప్రతి అధ్యాపకుడు సబ్జెక్టుతో సంబంధం లేకుండా పెద్ద బాలశిక్ష, చిన్న బాలశిక్ష వంటి వాటి నుండే కాకుండా సుమతి, వేమన, భాస్కర శతకాల నుండి విద్యార్థినీ విద్యార్థులకు సందర్భానుసారంగా నీతి వాక్యాలను, జ్ఞానాన్ని, శీలాన్ని, ఐకమత్యాన్ని బోధించేవారు. నేటి ఆధునిక అధ్యాపకులు కూడా విద్యార్థులను పరి పూర్ణమైన పౌరులుగా తీర్చిదిద్దడా నికి అన్ని విధాలా కృషి చెయ్యాలి. – వై.వి. రామిరెడ్డి, వ్యాసకర్త తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆచార్యులు -
వైఎస్సార్సీపీలోకి టీడీపీ నేత వైవీ రామిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: పీఎస్సార్ నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ టీడీపీ నేత వైవీ రామిరెడ్డి శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని పలువురు జిల్లా నేతలతో పాటు వెళ్లి ఆయన కలిశారు.రామిరెడ్డికి పార్టీ కండువా కప్పి జగన్ ఆహ్వానించారు. రాష్ట్ర గౌడ సంఘం నేత ఉదయగిరి నరసింహులు గౌడ్, కాపునాడు రాష్ట్ర కోశాధికారి నరసింహారావు, టీడీపీ ఎస్టీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నవీన్, నెల్లూరు మాజీ కార్పొరేటర్లు శ్రీధర్‌రెడ్డి (7వ వార్డు), నారాయణరెడ్డి (31వ వార్డు) పట్టణ టీడీపీ నేత సూరం రాజశేఖరరెడ్డి తదితర నేతలకు కూడా జగన్ కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్నారు. సుమారు 3 దశాబ్దాల రాజకీయానుభవం కలిగిన వైవీ రామిరెడ్డి తొలి నుంచీ టీడీపీలో కీలకమైన నేతగా ఉన్నారు. అధికార పార్టీ విధానాలు నచ్చక ఆయన కొంత కాలం కిందటే టీడీపీని వీడారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలోనే రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుందనే విశ్వాసంతో వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. -
దోపిడీ ప్రభుత్వాన్ని తరిమికొడదాం
గుంతకల్లు/ గుంతకల్లు టౌన్ : టీడీపీ మూడేళ్ల పాలన సర్వం అవినీతిమయమేనని, అభివృద్ధి కార్యక్రమాల పేరుతో ప్రజాధనం దోపిడీ చేశారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అనంతపురం మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. దోపిడీ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో తరిమికొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. గుంతకల్లులో శనివారం వైఎస్సార్సీపీ నియోజకవర్గస్థాయి ప్లీనరీ జరిగింది. సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి అధ్యక్షతన జరిగిన ప్లీనరీలో అనంత మాట్లాడారు. కరువుకు కేరాఫ్‌గా మారిన అనంతపురం జిల్లాలో రైతు, చేనేతల ఆత్మహత్యలు, ఉపాధి పనుల్లేక లక్షలాది మంది కూలీలు వలసవెళ్లినా వారికి ఆపన్నహస్తం అందివ్వడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ చెల్లించకుండా రైతులకు అన్యాయం చేస్తున్న ఈ ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ న్యాయపోరాటం చేస్తుందని ప్రకటించారు. జిల్లాకు వచ్చిన ఒకట్రెండు పరిశ్రమలు కూడా అధికారపార్టీ నేతల భూముల సమీపాన నెలకొల్పడమేంటని ఆయన ప్రశ్నించారు. గుంతకల్లు, జిల్లా సరిహద్దులోని బళ్లారి వద్ద ఈ పరిశ్రమలు ఎందుకు ఏర్పాటు చేయకూడదా అని నిలదీశారు. రాయలసీమలో అన్ని ప్రాంతాలూ సమానంగా అభివృద్ధి జరగాలన్నా, అన్నివర్గాల ప్రజలు ఆనందంగా ఉండాలన్నా వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎం చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పార్టీ శ్రేణులకు సూచించారు. బాబును భయం వెంటాడుతోంది ముఖ్యమంత్రి చంద్రబాబును ఏదో భయం నీడలా వెంటాడుతోందని ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్.జగన్మోహన్రెడ్డిని చూస్తే బాబు వణికిపోతున్నారన్నారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ ఇస్తారా? లేదా అని ఆయన ప్రశ్నించారు. మూడేళ్ల కాలంలో పేదలకు పక్కాగృహాలు కట్టివ్వలేదు కానీ సీఎం మాత్రం మూడు ఇళ్లు కొనుకున్నారన్నారని ప్లీనరీ పరిశీలకుడు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో నారా కుటుంబం అభివృద్ది చెందుతోందే తప్ప ప్రజలెవ్వరూ బాగుపడటం లేదన్నారు. సర్కారు వల్ల నష్టపోయిన కుటుంబాల్ని కలిసి వారికి భరోసా ఇవ్వాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రాజెక్టులు, అభివృద్ధి పనుల పేరిట అంచనా వ్యయాలన్నీ పెంచేసి ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని వైఎస్సార్సీపీ కేంద్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు వై.శివరామిరెడ్డి ధ్వజమెత్తారు. ఆ దోచుకున్న డబ్బుతోనే రానున్న ఎన్నికల్లో ఒక్కో ఓటుకు రూ.5 వేలు చొప్పున ఇచ్చేందుకు కూడా సిద్ధమయ్యారని, ప్రజలు ఆ నోట్ల కోసం ఆశపడి టీడీపీకి ఓట్లేస్తే మళ్లీ అధోగతి పాలవుతారని హెచ్చరించారు. నవ్యాంధ్ర రాజధాని, ప్రాజెక్టుల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతోందని రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి విమర్శించారు. సంక్షేమ పథకాలు, ఇతర అభివృద్ది పనుల్లో కమీషన్లను దండుకోవడానికే నారా లోకేష్‌ను మంత్రివర్గంలోకి తీసుకొచ్చారన్నారు. వాల్మీకులు, కురబలు, వడ్డెర్లను ఎస్టీ జాబితాలో చేరుస్తానని, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పిన హామీలు ఏమయ్యాయని చంద్రబాబును నిలదీశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా నేతలు రాగే పరుశురామ్, మీసాల రంగన్న, పామిడి వీరాంజనేయులు, కళ్యాణదుర్గం మాజీ సమన్వయకర్త బోయ తిప్పేస్వామి, పార్టీ ఎస్సీ, బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జింకల రామాంజినేయులు, ఎన్.రామలింగప్ప, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గాదిలింగేశ్వరబాబు, మంత్రాలయం మాజీ ఎంపీపీ వై.సీతారామిరెడ్డి, యువజన విభాగం జిల్లా నాయకులు వై.భీమిరెడ్డి, రిటైర్డ్ డీఎస్పీ వన్నూర్‌సాబ్, జెడ్పీటీసీ సభ్యుడు ప్రవీణ్‌యాదవ్, నియోజకవర్గంలోని మూడు పట్టణాలు, మండలాల కన్వీనర్లు సుంకప్ప, మోహన్‌రావు, హుసేన్‌పీరా,గోవర్దన్‌రెడ్డి, బి.వెంకటరామిరెడ్డి, నారాయణరెడ్డి, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, వందలాది సంఖ్యలో మహిళలు, వేలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. రాజన్న రాజ్యం..జగనన్నతోనే సాధ్యం టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజాధనాన్ని పందికొక్కుల్లా దోచుకుంటున్నారే తప్ప ప్రజలకు చేసింది శూన్యమే. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు తెలంగాణ సర్కారుకు భయపడి విజయవాడకు తన మకాం మార్చాడు. సీఎం చంద్రబాబు, తనయుడు నారాలోకేష్లు ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, క్రాప్ ఇన్సూరెన్స్, బ్యాంకుల్లో రుణాలు రీషెడ్యూల్ చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం. జనరంజక పాలన సాగించిన రాజన్న (వైఎస్ రాజశేఖరరెడ్డి) రాజ్యం మళ్లీ రావాలంటే జగనన్నతోనే సాధ్యమవుతుంది. జగన్‌ను సీఎం చేయడమే లక్ష్యంగా మనమంతా కలసి పనిచేద్దాం. - వై.వెంకటరామిరెడ్డి, వైఎస్సార్సీపీ సమన్వయకర్త, గుంతకల్లు నియోజకవర్గం -
వైఎస్సార్సీపీ నేతలకు రక్షణ కల్పించండి
- రివాల్వర్ లైసెన్సును ఎందుకు రెన్యూవల్ చేయరు? – పోలీసులు ఏకపక్ష ధోరణి వీడాలి – గుంతకల్లు సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి గుంతకల్లు టౌన్ : ప్రానహాని ఉన్న ప్రతిపక్ష వైఎస్సార్సీపీ సమన్వయకర్తలు, ముఖ్యనేతలకు రక్షణ కల్పించాలని గుంతకల్లు సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి జిల్లా పోలీసు అధికారులను కోరారు. మంగళవారం ఆయన గుంతకల్లులోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. తన రివాల్వర్ లైసెన్సు (120/1–జి) గడువు 2016 డిసెంబర్ 31కు ముగిసిందన్నారు. లైసెన్స్ రెన్యూవల్ కోసం గడువుకు 25 రోజుల ముందే దరఖాస్తు చేసుకున్నానన్నారు. నేటివరకూ రెన్యూవల్ చేయకపోగా.. లైసెన్స్ గడువు ముగిసినందున రివాల్వర్‌ను దగ్గర ఉంచుకోవడం చట్టరీత్యా నేరమని, పోలీస్ స్టేసన్‌లో డిపాజిట్ చేయాలని నాలుగు రోజుల క్రితం వజ్రకరూర్ ఎస్ఐ తనకు నోటీసులు పంపడమేంటని ఆయన ప్రశ్నించారు. రెన్యూవల్ పీరియడ్‌లో రివాల్వర్‌ను స్వాధీనపరచాలని ఇప్పటివరకు ఎటువంటి ఆదేశాలు కానీ, మార్గదర్శకాలు కానీ జారీ చేయని అధికారులు ఉన్నపళంగా రివాల్వర్‌ను స్వాధీనపరచమని నోటీసులు పంపడంపై అనుమానాలు నెలకొన్నాయన్నారు. వైఎస్సార్సీపీ నేతల రివ్వాలర్ లైసెన్సులు మాత్రమే రెన్యూవల్ చేయకుండా పెండింగ్‌లో పెట్టడం ఎంతవరకు సబబని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రాణహాని ఉన్న ప్రతి ఒక్క టీడీపీ నేతకూ, వారి కుటుంబ సభ్యులకూ రక్షణ కల్పించారని గుర్తు చేశారు. పత్తికొండ వైఎస్సార్సీపీ సమన్వయకర్త చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య నేపథ్యంలో రివాల్వర్‌ను తీసుకెళ్లమని చెప్పినా ఆయనే తీసుకుపోలేదని వ్యాఖ్యానించిన పోలీసు ఉన్నతాధికారులు.. తాము దరఖాస్తు చేసుకున్నా రెన్యూవల్ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ఏకపక్ష ధోరణి వీడి రివాల్వర్ లైసెన్సులు రెన్యూవల్ చేయడంతో పాటు ప్రతిపక్ష పార్టీ ముఖ్యనేతలందరికీ రక్షణ కల్పించాలని పోలీసు ఉన్నతాధికారులను కోరారు. లేనిపక్షంలో తాము న్యాయపోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు బి.సుంకప్ప, కౌన్సిలర్ అహ్మద్‌బాషా, యువజన విభాగం నేత శరణబసిరెడ్డి పాల్గొన్నారు. -
కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తారా?
- వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వైవీఆర్ - దుకాణాల తొలగింపును నిరసిస్తూ భారీ ర్యాలీ - మున్సిపల్ కార్యాలయం ముట్టడి గుత్తి : గుంతకల్లు రహదారికి ఇరువైపులా ఉన్న దుకాణాలను ఎలా తొలగిస్తారని వైఎస్సార్సీపీ గుంతకల్లు నియోజకవర్గ సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి మున్సిపల్ అధికారులను ప్రశ్నించారు. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తారా అని మండిపడ్డారు. గుంతకల్లు రహదారికి ఇరువైపులా ఉన్న దుకాణాలు తొలగించాలని మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేయడంతో బాధితులతో కలిసి వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ఇబ్రహీం సాబ్తో వైవీఆర్ తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగారు. అనంతరం కమిషనర్ చాంబర్లోకి దూసుకెళ్లి కమిషనర్‌తో చర్చించారు. ఈ సందర్భంగా వైవీఆర్ మాట్లాడుతూ గుంతకల్లు రోడ్డులో ఒక్క దుకాణం కూడా తొలగించడానికి తాము అంగీకరించబోమన్నారు. గుంతకల్లు రహదారికి ఇరుపక్కలా ఉన్న స్థలం ఆర్అండ్బీ, ఎన్‌హెచ్ శాఖలకు సంబంధించిందని అలాంటపుడు వాటిని తొలగించడానికి మున్సిపాలిటీ వారు ఎలా నోటీసులు జారీ చేశారని కమిషనర్‌ను వైవీఆర్ నిలదీశారు. దీంతో కమిషనర్ నీళ్లు నమిలారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి దుకాణాలు తొలగించడానికి పూనుకుంటే తాము ఊరుకునేది లేదన్నారు. ముఖ్యంగా గుంతకల్లు రహదారి వాసులు హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారని, కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తారా అన్నారు. ఇందుకు స్పందించిన కమిషనర్ నోటీసులు జారీ చేసిన మాట వాస్తవమేనని, అయితే ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో తొలగింపు ప్రతిపాదనను విరమించుకున్నామన్నారు. కమిషనర్ హామీతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ గోవర్దన్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి, జెడ్పీటీసీ ప్రవీణ్‌కుమార్ యాదవ్, రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షులు మల్లయ్య యాదవ్, బాలరాజు రాయల్, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి మల్లికార్జున, మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి మర్తాడు అన్సార్, జిల్లా కార్యదర్శులు సుభాష్‌రెడ్డి, శివయ్య, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ షఫీ, మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శులు ఫారూక్, ఫయాజ్, అఫ్సర్, మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు హాజీ మలన్ బాబా, ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి చంద్ర, ఎస్సీ సెల్ టౌన్ అధ్యక్షులు వెంకటేష్, మూముడూరు మాజీ సర్పంచు రామచంద్రారెడ్డి, పామిడి మండల యూత్ అధ్యక్షులు నాగేశ్వర రెడ్డి, కౌన్సిలర్లు నజీర్, కృపా సుజాత, కళ్యాణి, మహిళా నాయకురాలు నిర్మల, తురకపల్లి గోపాల్‌రెడ్డి, మండల, జిల్లా సీనియర్ నాయకులు రామసుబ్బారెడ్డి, వెంకటేష్, శంకర్‌రెడ్డి, నారాయణస్వామి, శేషారెడ్డి, రంగ ప్రసాద్ రాయల్, ప్రసాద్ గౌడ్,లాలు శేఖర్, తొండపాడు వాటర్ షెడ్ చైర్మన్ శంకర్, ఎస్టీ సెల్ జిల్లా నాయకులు ఎస్ఎస్ నాయక్, నారాయణ, ఇబ్రహీం, తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబును అరెస్టు చేయాలి
గుంతకల్లు టౌన్ : ఓటుకు కోట్లు కేసులో ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించిన సీఎం చంద్రబాబునాయుడును వెంటనే అరెస్ట్ చేయాలని వైఎస్సార్సీపీ గుంతకల్లు నియోజకవర్గం సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఓటుకు నోటు కేసు భయంతో ముఖ్యమంత్రి అటు కేంద్రం, ఇటు తెలంగాణ సీఎం కేసీఆర్‌తో లాలూచీపడి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టారని ఆయన ఆరోపించారు. తాను జైలుకు పోకతప్పదని భావించిన బాబు తన తనయుడు లోకేష్‌ను మంత్రివర్గంలో తీసుకునే ఆలోచనలో ఉన్నారన్నారు. స్విస్ చాలెంజ్ విధానంలో పారదర్శకత లేదని స్వయానా దేశ అత్యున్నత న్యాయస్థానం అక్షింతలు వేసినా బాబు మాత్రం తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అమరావతి రాజధాని నిర్మాణ బాధ్యత సింగపూర్ కంపెనీలకు అప్పగించి రైతులిచ్చిన భూములతో రియల్ ఎస్టేట్ జాయింట్ వెంచర్ వ్యాపారానికి తెరలేపారన్నారు. ఈ అంతర్జాతీయ కుంభకోణంపై సీబీఐ చేత విచారణ జరిపించాలని కేంద్రాన్ని ఆయన డిమాండ్ చేశారు. వేరుశనగ పంటలన్నీ 60 శాతం దెబ్బతిన్నాక రెయిన్గన్లు ఇస్తే ఏం ప్రయోజనమని ఆయన నిలదీశారు. వేరుశనగ పంట నష్టపోయిన రైతన్నలకు ఎకరాకు రూ.25 వేల పంటనష్ట పరిహారాన్ని చెల్లించాలని వెంకటరామిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు గోపి, అహ్మద్ , మాజీ కౌన్సిలర్ సుంకప్ప, భాస్కర్ పాల్గొన్నారు.