
సాక్షి, హైదరాబాద్: పీఎస్సార్ నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ టీడీపీ నేత వైవీ రామిరెడ్డి శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని పలువురు జిల్లా నేతలతో పాటు వెళ్లి ఆయన కలిశారు.రామిరెడ్డికి పార్టీ కండువా కప్పి జగన్ ఆహ్వానించారు. రాష్ట్ర గౌడ సంఘం నేత ఉదయగిరి నరసింహులు గౌడ్, కాపునాడు రాష్ట్ర కోశాధికారి నరసింహారావు, టీడీపీ ఎస్టీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నవీన్, నెల్లూరు మాజీ కార్పొరేటర్లు శ్రీధర్‌రెడ్డి (7వ వార్డు), నారాయణరెడ్డి (31వ వార్డు) పట్టణ టీడీపీ నేత సూరం రాజశేఖరరెడ్డి తదితర నేతలకు కూడా జగన్ కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్నారు.
సుమారు 3 దశాబ్దాల రాజకీయానుభవం కలిగిన వైవీ రామిరెడ్డి తొలి నుంచీ టీడీపీలో కీలకమైన నేతగా ఉన్నారు. అధికార పార్టీ విధానాలు నచ్చక ఆయన కొంత కాలం కిందటే టీడీపీని వీడారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలోనే రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుందనే విశ్వాసంతో వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు.