1/12
మంచి గురువును ఎంచుకోవడం ఎలా?
2/12
ప్రపంచంలోని అత్యుత్తమ గురువుల జాబితాలో కనిపించే పేరు.. చాణక్యుడు
3/12
ఆచార్య చాణక్యుడు తన జీవితాన్ని ఆర్థిక, రాజకీయ, సామాజిక విధానాలకు అంకితం చేశాడు. ఎన్నో గొప్ప గొప్ప విషయాలను చెప్పాడు. అలాగే.. చాణక్య నీతి శాస్త్రంలో మంచి గురువుకు ఉండే లక్షణాలు వివరించాడు.
4/12
ఎల్లప్పుడూ సరైన మార్గనిర్దేశం చేసేవాడే గురువు. ఆ గురువు మంచిగా ఉంటే.. శిష్యుడి జీవితం మారిపోతుంది. గురువును ఎంచుకునే ముందు అతని చర్యలు, మాటల లక్షణాలను అర్థం చేసుకోవాలి.
5/12
ఒక వ్యక్తి తన సొంత జీవితం క్రమశిక్షణతో ఉంటేనే ఇతరుల జీవితంలో క్రమశిక్షణను తీసుకురాగలడు. చాణక్యుడి ప్రకారం, గురువు క్రమశిక్షణను ఇష్టపడాలి. జీవితంలో విజయానికి క్రమశిక్షణ కీలకం.
6/12
సద్గుణాలతో నిండి ఉండేవాడే నిజమైన గురువు. అతనికి దురాశ, అసూయ, అహంకారం, వ్యామోహం వంటి దుర్గుణాలు ఉండవు. ఎప్పుడైతే గురువు దురాచారాలకు దూరంగా ఉంటాడో, అప్పుడు శిష్యులను దుర్గుణాల నుండి దూరంగా ఉంచగలడు.
7/12
గురువు అంటే ధర్మాన్ని అనుసరించేవాడు. నైతికత అనుసరించే వ్యక్తి మాత్రమే సద్గురువు కాగలడు. ఒక గురువు తన శిష్యులకు ధర్మంతో పాటు పూర్తి భక్తిని కూడా చూపాలి. తద్వారా శిష్యులు నేర్చుకుని ఆదర్శ పౌరులుగా మారాలి.
8/12
గురువుకు అసూయ ఉండకూడదు. శిష్యుడు ఎదుగుతుంటే.. భుజాలపై ఎక్కించుకుని ప్రపంచాన్ని చూపించాలి. శిష్యుడి ఎదుగుదల తన ఎదుగుదలగా భావించాలి. అప్పుడే శిష్యుడు గెలుస్తాడు.., తద్వార గురువు కూడా గెలిచినట్టవుతుంది.
9/12
గురువు తన శిష్యుడికి ప్రపంచం అంటే ఏంటో తెలపాలి. బయటకు వెళ్తే ఎలా ఉందో వివరించాలి. నిజమైన గురువు.. తన జ్ఞానంతో శిష్యుల అభివృద్ధికి బాటలు వేయాలి.
10/12
నిజమైన గురువు తన జ్ఞానాన్ని ఎప్పుడూ పంచుతాడు. తనకు తెలిసిన విషయాలను శిష్యులకు వివరించేవాడు అసలైన గురువు. తనకు తెలిసిన మంచి విషయాలను చెప్పకుండా.. లోలోపల దాచుకునేవారు.. మంచి గురువులు కాలేరు.
11/12
గురువు.. మంచి చెడులను వివరిస్తూ.. జీవితానికి కావాల్సిన విషయాలను శిష్యులకు వివరించాలి. సమాజంలో ఎలా ఉంటే.. పైకి వస్తామనే విషయాన్ని శిష్యులకు గురువు తెలపాలి.
12/12
పైన చెప్పిన విషయాలను పాటించే.. వ్యక్తిని గురువుగా ఎంచుకోవాలి: ఆచార చాణక్య Photo Credits: deviantart.com and Others