1/10
అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ తన నాలుక మడతేశారు. ఒకప్పుడు దేనైనేతే అగ్రరాజ్య భద్రతకు ముప్పుగా ఆయన గగ్గోలు పెట్టారో.. ఇప్పుడు దాన్నే ఆయన అమితంగా ఇష్టపడుతున్నారు. అందుకే దాని పరిరక్షణకైనా తనకు అధికారం కట్టబెట్టాలని అమెరికన్లను కోరుతున్నారు.
2/10
అదొక చైనా యాప్. ఎంత మాత్రం సురక్షితం కాదు. అమెరికన్ల వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించే అవకాశం ఉంది. ఈ హెచ్చరికను అమెరికా ఫెడరల్ ఏజెన్సీలు ధృవీకరించాయి. అందుకే టిక్‌టాక్‌ను అమెరికాలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ద్వారా బ్యాన్ చేస్తున్నాం :::2020లో అమెరికా అధ్యక్షుడి హోదాలో డొనాల్ట్ ట్రంప్
3/10
అమెరికాలో ఓవైపు టిక్‌టాక్ కథను ముగించాలని చూస్తున్నారు. కానీ, ఆ ప్లాట్‌ఫామ్‌లో ఇప్పుడు నేనొక బిగ్ స్టార్‌ను. అమెరికాలో టిక్‌టాక్‌ను రక్షించాలనుకునేవాళ్లంతా ట్రంప్‌కు ఓటేయాలి :::అమెరికా అధ్యక్ష రేసులో అభ్యర్థిగా ట్రంప్ తాజా మాట
4/10
గతంలో అధ్యక్షుడిగా దేనిమీద అయితే విద్వేషం ప్రదర్శించి నిషేధం విధించాడో.. ఇప్పుడు అదే ప్లాట్‌ఫామ్ కోసం పోరాటం చేస్తానంటున్నాడు రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్.
5/10
మొన్న ఏప్రిల్‌లో బైడెన్ ప్రభుత్వం ఒక బిల్లు తీసుకొచ్చింది. టిక్‌టాక్ మాతృక సంస్థ బైట్‌డాన్స్‌కు ఆ బిల్లు ద్వారా ఒక అల్టిమేటం జారీ చేసింది. టిక్‌టాక్‌ను అమెరికాకు చెందిన కంపెనీకి అమ్మేయాలని లేదంటే అమెరికాలో నిషేధం ఎదుర్కోవాలని అందులో స్పష్టం చేసింది.
6/10
పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని టిక్‌టాక్ యాప్ చైనా ప్రభుత్వానికి చేరవేసే అవకాశం ఉందన్న అనుమానాల నడుమ.. 2020లో అప్పటి అధ్యక్షుడు ట్రంప్ ఆ యాప్‌పై నిషేధం విధిస్తున్నట్లు స్వయంగా ప్రకటించారు.
7/10
అయితే.. అమెరికా న్యాయస్థానంలో బైట్‌డాన్స్‌కు ఊరట లభించింది. అయినప్పటికీ అమెరికా సైన్యంలో, ఇతర ప్రభుత్వ సంబంధిత విభాగాలకు చెందిన డివైస్‌లలో మాత్రం ఆ యాప్ వాడకంపై నిషేధం ఇప్పటికీ అమలులోనే ఉంది.
8/10
అమెరికాలో.. ముఖ్యంగా యువతలో టిక్‌టాకకు విపరీతమైన ఆదరణ ఉంది. కిందటి ఏడాది నిర్వహించిన ఓ ఎగ్జిట్‌పోల్స్‌లో కేవలం 30 శాతం మంది మాత్రమే దాని బ్యాన్‌కు అనుకూలంగా ఓటేశారు.
9/10
అమెరికాలో టిక్‌టాక్‌కు ఉన్న ఆదరణను పసిగట్టిన ట్రంప్ ఈ ఏడాది జూన్‌లో టిక్‌టాక్‌లో అడుగుపెట్టాడు. ఈ ప్లాట్‌ఫామ్‌లోనే ట్రంప్‌కు 10 మిలియన్లకు(కోటిమందికి) పైగా ఫాలోవర్స్ ఉన్నారు.
10/10
ఒకప్పుడు టిక్‌టాక్ పాలిట యమకింకరుడిగా మారిన ట్రంప్.. ఇప్పుడు అదే యాప్ కోసం సేవియర్ అవతారం ఎత్తాడు.