presidential elections
-
US Election Results : మిస్టర్ ప్రెసిడెంట్.. డొనాల్డ్ ట్రంప్
US Election Results 2024 LIVE Updates : వాషింగ్టన్ డీసీ: దేశ ప్రజలకు సువర్ణయుగం రాబోతుందంటూ అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను ఉద్దేశిస్తూ రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రసంగంగించారు. స్వింగ్ స్టేట్స్లో విజయంపై ఆనందం వ్యక్తం చేశారు. 05: 30 PMఅమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో ట్రంప్ 280 ఎలక్టోరల్ ఓట్లు గెలుపుకమలా హారిస్ 224 ఓట్లు విజయం ఫలితాల కౌంటింగ్ కొనసాగుతోందిట్రాంప్ మ్యాజిక్ ఫిగర్ ( 270) ఎలక్టోరల్ ఓట్లు దాటారు05: 10 PMట్రంప్ ఖతాలో రెండు రికార్డులురెండు దశాబ్దాల తర్వాత పాపులర్ ఓటింగ్‌తో రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ విజయం సాధించడం గమనార్హం. 2004 ఎన్నికల్లో జార్జ్ బుష్ 62,040,610 ఓట్లతో 286 ఎలక్టోరల్ దక్కించుకోగా.. డెమోక్రటిక్ అభ్యర్థి జాన్ కెర్రీకి 59,028,444 ఓట్లతో 251 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. ఇప్పుడు ట్రంప్ మళ్లీ ఆ ఘనత సాధించారు.ఇక.. 132 ఏళ్ల తర్వాత ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి అరుదైన ఫీట్ సాధించారు. 1885 అమెరికా ఎన్నికల్లో గ్రోవర్ క్లీవ్‌లాండ్ అధ్యక్షుడిగా నెగ్గారు. అయితే మళ్లీ ఒక టర్మ్ ముగిశాక.. అంటే 1893 ఎన్నికల్లోనూ గ్రోవర్ ప్రెసిడెంట్‌గా విజయం సాధించారు. అమెరికాకు 45వ అధ్యక్షుడిగా పని చేసిన ట్రంప్.. ఒక టర్మ్ గ్యాప్ తర్వాత ఇప్పుడు మళ్లీ మేజిక్ ఫిగర్ దాటేసి వైట్‌హౌజ్ వైపు అడుగులేశారు. 04: 19 PMట్రంప్ బిగ్ విక్టరీఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయంవిస్కాన్సిన్లో విజయంతో మేజిక్ ఫిగర్ దాటిన ట్రంప్రెండు దశాబ్దాల తర్వాత పాపులర్ ఓటింగ్‌లో నెగ్గిన రిపబ్లికన్ కేండిడేట్‌గా ట్రంప్ రికార్డు277కి చేరిన ట్రంప్ బలం.. ఇంకా కొనసాగుతున్న కౌంటింగ్.. మరో 30 స్థానాలు ట్రంప్ ఖాతాలోకే! 04: 10 PMడొనాల్డ్ ట్రంప్ విజయంపై స్పందించిన చైనాట్రంప్ పేరు నేరుగా ప్రస్తావించకుండా.. ఎన్నికల ఫలితాలపై స్పందించిన చైనాఅధ్యక్ష ఎన్నికల్లో అమెరికా ప్రజల నిర్ణయాన్ని గౌరవిస్తాం: చైనాఅమెరికాతో శాంతియుత సంబంధాలు కొనసాగిస్తాంపరస్పర గౌరవం, సహకారంతో ముందుకెళ్తామని చైనా ప్రకటన04: 05 PMట్రంప్ గెలుపు ఇక లాంఛనమేదాదాపు ఖరారైన డొనాల్ట్ ట్రంప్ విజయంమేజిక్ ఫిగర్‌కు అతిచేరువలో ట్రంప్ఇప్పటికే 267 సీట్లు.. మరో మూడు ఎలక్టోరల్ సాధిస్తే విజయంఇంకా ఐదు రాష్ట్రాల్లో ఆధిక్యంలో ట్రంప్మరో 44 ఎలక్టోరల్లు దక్కే అవకాశంమరో నాలుగు స్వింగ్ స్టేట్స్‌లోనూ ట్రంప్ ఆధిక్యంస్వింగ్ రాష్ట్రాలు జార్జియా, నార్త్ కరోలీనా, పెన్సిల్వేనియాలో రిపబ్లిక్ పార్టీ గెలుపుఓటమి దిశగా కమలా హారిస్డెమోక్రటిక్ శ్రేణుల్లో తీవ్ర నిరాశ03: 30 PMరన్నింగ్‌మేట్ జేడీ వాన్స్ జంటపై డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలుఅద్భుతమైన, అందమైన జేడీ వాన్స్, ఆయన భార్య ఉషా వాన్స్ జంటకు అభినందనలుఇక నుంచి మిమ్మల్ని( జేడీ వాన్స్) ఉపాధ్యక్షుడు అని గర్వంగా పిలవచ్చు: ట్రంప్ 2: 34 PMఅమెరికా ప్రెసిడెంట్‌గా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికనూతన అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికయ్యారని పేర్కొన్న అమెరికా హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్అధ్యక్ష పీఠాన్ని అధిరోహించనున్న డొనాల్డ్ ట్రంప్డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌కు నిరాశWe have saved America. 🇺🇸The American people have spoken, and President Trump and Senator JD Vance are going to the White House. We are ready to get to work for the American people.— Speaker Mike Johnson (@SpeakerJohnson) November 6, 2024 2:17pmడొనాల్ట్ ట్రంప్‌కు శుభాకాంక్షలు తెలియజేసిన భారత ప్రధాని నరేంద్ర మోదీ చరిత్రాత్మక ఎన్నికల విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్‌నకు హృదయపూర్వక శుభాకాంక్షలు భారత్, అమెరికా ప్రజల కోసం కలిసి పనిచేద్దాం ప్రపంచ శాంతి, సుస్థిరత్వం, శ్రేయస్సు కోసం పాటుపడదామని పిలుపునిచ్చిన భారత ప్రధాని Heartiest congratulations my friend @realDonaldTrump on your historic election victory. As you build on the successes of your previous term, I look forward to renewing our collaboration to further strengthen the India-US Comprehensive Global and Strategic Partnership. Together,… pic.twitter.com/u5hKPeJ3SY— Narendra Modi (@narendramodi) November 6, 2024 02:02pmట్రంప్‌నకు శుభాకాంక్షలు తెలిపిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూప్రియమైన డొనాల్డ్ ట్రంప్, మెలానియాకు శుభాకాంక్షలు మీరు వైట్‌హౌస్‌లోకి తిరిగిరావడం అమెరికాలో ఓ కొత్త అధ్యాయానికి నాంది అమెరికా, ఇజ్రాయెల్‌ల బంధం మరింత బలోపేతమవుతుంది Dear Donald and Melania Trump,Congratulations on history’s greatest comeback!Your historic return to the White House offers a new beginning for America and a powerful recommitment to the great alliance between Israel and America.This is a huge victory!In true friendship,… pic.twitter.com/B54NSo2BMA— Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) November 6, 20241:20pm రిపబ్లికన్లకు 315 సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది - ట్రంప్సరిహద్దు మూసివేతల్ని పరిశీలించాలిఎవరైనా చట్టబద్ధంగా దేశంలోకి రావాల్సిందేసరిహద్దులు నిర్ణయిస్తాంఅమెరికన్లు పవర్ఫుల్ తీర్పు ఇచ్చారు1:00pmఅమెరికా ప్రజలు గొప్ప విజయాన్ని అందించారు. వారి కోసం పని చేస్తాను.అమెరికన్లకు సువర్ణయుగం రాబోతుందినా గెలుపు అమెరికాకు ఉపయోగంఈ ఫలితాలను ఎవరూ ఊహించలేదుఅమెరికా ఇలాంటి విజయం ఎన్నడూ చూడలేదు 11:50amఆ రాష్ట్రంలో 19 ఎలక్టోరల్ ఓట్లు267కి పెరిగిన రిపబ్లికన్ల బలంమూడు సీట్ల దూరంలో అధ్యక్ష పీఠం11:43amడొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడేందుకు పామ్ బీచ్‌కు వెళుతున్నట్లు రాయిటర్స్ నివేదించింది. కాగా, అమెరికా అధ్యక్షుడిని ఖరారు చేసే ఏడు స్వింగ్ స్టేట్స్‌లలో ఆరు రాష్ట్రాల్లో ట్రంప్ ముందంజలో ఉండగా.. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో గెలుపొందారు.11:35am అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో ఎన్నికల ఫలితాలు విడుదల అనంతరం.. మద్దతు దారుల గురించి చేసే ప్రసంగానికి హారిస్ గైర్హాజరు కానున్నారు. 11:20amఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపు ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో విజేతను నిర్ణయించే ఎలక్టోరల్ కాలేజీ సంఖ్యల విషయానికొస్తే ట్రంప్ 230 ఓట్లతో, హారిస్ 209 ఓట్లతో ముందంజలో ఉన్నారు. ట్రంప్ 23 రాష్ట్రాల్లో కమలా హారిస్ 11 రాష్ట్రాల్లో గెలుపొందినట్లు అంచనా. 270 ఎలక్టోరల్ సీట్లు వచ్చిన అభ్యర్థే అమెరికా అధ్యక్షుడిగా బాద్యతలు చేపడతారు 11:10amఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం దిశగా ట్రంప్230 ఎలక్టోరల్ సీట్లు సాధించిన ట్రంప్210 ఎలక్టోరల్ సీట్లతో వెనుక బడ్డ కమలా హారిస్ మార్ ఆ లాగో రిసార్ట్‌కు బయలు దేరిన ట్రంప్.ముఖ్య నేతలు,ట్రంప్‌తో కలిసి ఎన్నికల ఫలితాలను వీక్షించనున్న ట్రంప్ తన మద్దతు దారుల గురించి ప్రసంగం 3 స్వింగ్స్ స్టేట్స్లో విజయం సాధిస్తే ట్రంపే అధ్యక్షుడు 10:50amనాలుగు గంటలుగా కొనసాగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ ఫలితాల్లో డెమొక్రాట్ అభ్యర్థి కమలా హారిస్ కంటే రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ముందంజలో ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు ఎవరనేది తేల్చే స్వింగ్ స్టేట్స్లో సైతం ట్రంప్ హవా కొనసాగుతుంది. ఏడు స్వింగ్ స్టేట్లలో ట్రంప్ ఆరుచోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పెన్సిల్వేనియా, జార్జియా, విస్కాన్సిన్, మిషిగన్, నార్త్ కరోలినా(విజయం), ఆరిజోనా రిపబ్లికన్ పార్టీ ఖాతాలో పడే అవకాశం ఉంది. 10:10amఎన్నికల ఫలితాల విడుదల నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. పెన్సిల్వేనియాలో గెలిస్తే తన విజయం ఖాయమైనట్లేనని అన్నారు. కానీ కౌంటింగ్‌లో తన విజయాన్ని అడ్డుకునేలా కుట్ర జరుగుతుందని సంచలన ఆరోపణలు చేశారు.9:55amకొనసాగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల ఉత్కంఠ పోరులో తొలుత ట్రంప్ ఆధిక్యంలో ఉన్నప్పటికీ హారిస్ క్రమంగా పుంజుకుంటున్నారు. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. డొనాల్డ్ ట్రంప్‌కు 230 ఎలక్టోరల్ సీట్లు సొంతం చేసుకున్నారు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ 179 ఎలక్టోరల్ సీట్లను కైవసం చేసుకున్నారు.9:40am2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో స్వింగ్ స్టేట్ పెన్సిల్వేనియాలో నిరాశజనకమైన ఫలితాలు రాబట్టిన ట్రంప్.. ఈ సారి మాత్రం ఊహించని ఫలితాల్ని సాధిస్తున్నారు. ముఖ్యంగా గత అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో ట్రంప్ ఓటమిపాలయ్యారు. ఫలితాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైట్ హౌస్‌పై దాడి చేసి అప్రతిష్టను మూటగట్టుకున్నారు. దీంతో ఈ సారి ఎన్నికల్లో ట్రంప్ పెన్సిల్వేనియా ఓటర్ల తిరస్కరణకు గురి కావాల్సి వస్తుందని రాజకీయ విశ్లేషకుల అంచనా వేశారు. ఆ అంచనాలను తలకిందులు చేస్తూ ట్రంప్ లీడింగ్‌లో కొనసాగుతున్నారు.9:20amబ్యాలెట్ పేపర్లోని అభ్యర్థుల్లో తమకు నచ్చిన వారికి ఎదురుగా టిక్ చేస్తారు. ఎన్నికల అధికారులు వాటిని చేతితో కాకుండా డైరెక్ట్ రికార్డింగ్ ఎలక్ట్రానిక్ (డీఆర్ఈ) సిస్టమ్‌తో కౌంట్ చేస్తారు. పెన్సిల్వేనియాలో ఈ డీఆర్ఈ డివైజ్‌లలో సాఫ్ట్‌వేర్‌లో లోపాలు తలెత్తాయి. దీంతో డీఆర్ఈ డివైజ్‌లు మొరాయించడంతో అధికారులు ఓట్లను చేతితో కౌంట్ చేస్తున్నారు9:10amఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఊహించని ఫలితాలు వెలువడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడిని గెలుపును ఖాయం చేసే పెన్సిల్వేనియాలో సైతం డొనాల్డ్ ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారు. స్వింగ్ స్టేట్స్ పెన్సిల్వేనియాలో 55 శాతం ఓట్లు లెక్కించగా, కమలా హారిస్ కంటే డోనాల్డ్ ట్రంప్ 3 శాతం ఓట్లు ఎక్కువ సాధించారు. ఇప్పటి వరకు లెక్కించిన ఓట్లలో ట్రంప్‌కు 51.1 శాతం ఓట్లు రాగా, హారిస్‌కు 48 శాతం ఓట్లు వచ్చాయి.9:05amఅమెరికాలోని అధ్యక్ష ఎన్నికల్లో గెలవాలంటే పెన్సిల్వేనియాలో గెలవాల్సిన పరిస్థితి తప్పనిసరి. స్వింగ్ స్టేట్స్లో ఒకటైన ఈ పెన్సిల్వేనియాలో మొత్తం 20 ఎలక్టోరల్ ఓట్లు ఉంటాయి. ఈ ఓట్లే అమెరికా అధ్యక్షుడు ఎవరనేది తేల్చేస్తాయిని అంచనా. అంతటి ముఖ్యమైన పెన్సిల్వేనియాలో భారీ మోసం జరిగిందని డొనాల్డ్ ట్రంప్ ఆరోపణలు గుప్పించారు. దీనిని ఎన్నికల అధికారులు ఖండించారు. ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ సజావుగా జరుగుతున్నట్లు చెప్పారు. 8:27am9 రాష్ట్రాల్లో కమలా హారిస్.. 17 రాష్ట్రాల్లో ట్రంప్ విజయం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఉత్కంఠ కొనసాగుతుంది. టెక్సాస్‌లో ట్రంప్ విజయం సాధించారు. రిపబ్లిక్ పార్టీ ఖాతాలో 41 ఎలక్టోరల్ ఓట్లు సాధించింది. ఇప్పటి వరకు 17 రాష్ట్రాల్లో ట్రంప్ విజయం సాధించగా.. కమలా హారిస్ 9 రాష్ట్రాల్లో గెలిచారు. 8:15amఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోలింగ్ చివరి అంకానికి చేరినట్లు తెలుస్తోంది. అయితే పోలింగ్ పూర్తయిన కౌంటింగ్ ప్రారంభమైన అన్నీ ప్రాంతాల్లో ట్రంప్ ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. ముఖ్యంగా ట్రంప్ అనుకూల ప్రాంతాల్లో క్లీన్ స్వీప్ సాధించారు. అధ్యక్ష పదవిలో ఉన్న అభ్యర్థి గెలవాలంటే 270 ఎలక్టోర్లో ఓట్లను గెలుచుకోవాల్సి ఉంది. ఈ ఎలక్టోరల్ ఓట్లలో సైతం ట్రంప్ ముందంజలో ఉన్నారు. ట్రంప్ 154 ఎలక్టోరల్ ఓట్లు సాధించగా.. హారిస్ 81 ఎలక్టోరల్ ఓట్లను సాధించారు.7:41amబాంబు బెదిరింపు తర్వాత పెన్సిల్వేనియా కౌంటీలో ఓటింగ్ సమయాన్ని మరింత పొడిగిస్తూ అధికారులు ప్రకటించారు 7:36amటెక్సాస్, వ్యోమింగ్‌లో ట్రంప్ విజయం సాధిస్తారని అంచనా ట్రంప్ దక్షిణ, ఉత్తర డకోటాలలో విజయం సాధించారు7:33amట్రంప్, కమల ఒక్కొక్కరు 2 రాష్ట్రాల్లో ఆధిక్యంలో ఉన్నారు7:24 amట్రంప్ 10 రాష్ట్రాల్లో ఆధిక్యంలో ఉన్నారు7:20amచెస్టర్ కౌంటీ ప్రభుత్వ సేవల కేంద్రానికి బాంబు బెదిరింపులు.. రంగంలోకి దిగిన అధికారులు 7:13amబాంబు బెదిరింపుల కలకలంఅమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల విడుదలలో ఓ వైపు ఉత్కంఠత కొనసాగుతుండగా.. మరోవైపు బాంబుల బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. పెన్సిల్వేనియాలోని ఓటింగ్ సర్వీస్ బిల్డింగ్‌కు బాంబు బెదిరింపులొచ్చాయి. బాంబు బెదిరింపులపై సమాచారం అందుకున్న ఫెడరల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ అధికారులు డాగ్ స్క్వాడ్‌తో రంగంలోకి దిగారు. తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. 7:10amస్వింగ్ స్టేట్స్లో హారిస్ వెనుకంజఅమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను శాసించే ఏడు స్వింగ్ స్టేట్స్లో ట్రంప్, కమలా హారిస్‌లలో ఎవరిది పైచేయి అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. స్వింగ్ స్టేట్స్లో ఆధిక్యం సాధించే అభ్యర్థికి అమెరికా అధ్యక్ష పీఠం దక్కనుండటమే అందుకు కారణం. అయితే పెన్సిల్వేనియా, అరిజోనా, జార్జియా, మిచిగాన్, నెవాడా, నార్త్ కరోలినా, విస్కాన్సిన్ ఈ ఏడు స్వింగ్ స్టేట్స్లో సైతం హారిస్ వెనుకంజలో ఉన్నారు. స్వింగ్స్ స్టేట్స్లో ట్రంప్‌కు 58.2 శాతం ఓట్లు పోలవగా, హారిస్‌కు 41.3 శాతం ఓట్లు పోలయ్యాయి. 6:50amఅమెరికా అధ్యక్ష ఎంపికలో ప్రముఖ పాత్ర పోషించే ఎలక్టోరల్ ఓట్ల ఫలితాల్లో ట్రంప్ దూసుకెళ్తున్నారు. ట్రంప్ 101 ఎలక్టోరల్‌లో ఓట్లు సాధించగా.. హారిస్ 49 మాత్రమే సాధించారు. అమెరికా ప్రతినిధుల సభ ఎన్నికల బరిలో 9మంది భారతీయులు అమెరికా ప్రతినిధుల సభ ఎన్నికల బరిలో 9 మంది భారతీయ అమెరికన్లు ఉన్నారు. సుహాస్ సుబ్రమణియన్ (వర్జీనియా), అమీ బెరా (కాలిఫోర్నియా), ప్రమీలా జయపాల్ (వాషింగ్టన్), రాజా కృష్ణమూర్తి (ఇల్లినోయీ), రో ఖన్నా (కాలిఫోర్నియా), శ్రీ థనేదార్ (మిషిగన్), అమీశ్ షా (ఆరిజోనా), ప్రశాంత్ రెడ్డి (కాన్సాస్), రాకేశ్ మోహన్ (న్యూజెర్సీ) పోటీ చేశారు. వీరితోపాటు మొత్తం 36 మంది భారతీయ అమెరికన్లు రాష్ట్ర సెనెట్లు, స్థానిక సంస్థల బరిలో ఉన్నారు.6:40amఅమెరికాలో ఆరు రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. ఇండియా, కెంటికీ,వెస్ట్ వర్జీనియా రాష్ట్రాల్లో ట్రంప్ విజయం సాధించగా.. డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్కమలా హారిస్ వెర్మాట్లో మాత్రమే గెలుపొందారు. 👉: అమెరికాలో పోలింగ్ కేంద్రాలకు పోటెత్తిన ఓటర్లు (ఫొటోలు) -
US election 2024: ఫలితం తేలేదెప్పుడు?
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఈసారి ఆలస్యంగా వెల్లడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్పష్టమైన చిత్రం ఆవిష్కృతమవ్వడానికి రెండు, మూడు రోజులు పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మనదేశంలో లాగా అమెరికాలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఉండదు. ఓట్ల లెక్కింపు బాధ్యత రాష్ట్రాలు, స్థానిక ప్రభుత్వాలదే. 50 రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ఒకేలా ఉండదు. ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక నిబంధనలు ఉంటాయి. డెమొక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మధ్య హోరాహోరీ పోరు సాగిన నేపథ్యంలో ఫలితాల వెల్లడికి సమయం పట్టే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. పోలింగ్ ముగిసిన కొద్ది గంటల్లో అమెరికా మీడియా సంస్థలు ఎవరు ఆధిక్యంలో ఉన్నారనే విషయాన్ని వెల్లడిస్తాయి.అమెరికన్లతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఫలితాల కోసం వీటిపైనే ఆధారపడతారు. అమెరికాలో ఆరు కాలమానాలున్నాయి. భారత కాలమానం ప్రకారం బుధవారం 11:30 గంటలకు అమెరికావ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. అంటే బుధవారం రాత్రికల్లా ఫలితాల ట్రెండ్స్ ఎలా ఉన్నాయనేది తెలిసే అవకాశం ఉంటుంది. చాలా రాష్ట్రాల్లో అవి ఎటువైపు మొగ్గుతాయనేది ముందు నుంచే తెలిసి ఉంటుంది. సులభంగా అంచనా వేయవచ్చు. ఈ రాష్ట్రాల్లో ఫలితాలు తొందరగానే వెల్లడయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేది ఏడు స్వింగ్ రాష్ట్రాలు.వీటిలో ఫలితాలు వెల్లడైతే గాని ఉత్కంఠకు తెరపడదు. హోరాహోరీ పోరు దృష్ట్యా స్వింగ్ రాష్ట్రాలు.. ముఖ్యంగా పెన్సిల్వేనియా తదుపరి అధ్యక్షుడు ఎవరనేది నిర్ణయించనున్నాయి. ఏడు స్వింగ్ రాష్ట్రాల్లో కలిపి 93 ఎలక్టోరల్ కాలేజీలు ఉన్నాయి. ఈ స్వింగ్ రాష్ట్రాలు స్వల్ప ఆధిక్యంతో ఏదైనా పార్టీ ఖాతాలో పడొచ్చు. అప్పుడు రీకౌంటింగ్ అవసరమవుతుంది. అప్పుడు ఫలితాల వెల్లడి మరింత ఆలస్యమవుతుంది. ఒక రాష్ట్రంలో ఏ పార్టీకి ఆధిక్యం లభిస్తే.. అక్కడున్న ఎలక్టోరల్ ఓట్లన్నీ సదరు పార్టీ ఖాతాలో పడతాయి. ప్రతి రాష్ట్రానికి జనాభాను బట్టి నిర్దిష్ట సంఖ్యలో ఎలక్టోరల్ కాలేజి ఓట్లుంటాయి. మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లుంటాయి. అధ్యక్ష పదవిని చేపట్టడానికి 270 ఎలక్టోరల్ ఓట్లు సాధించాలి. దేశవ్యాప్తంగా మెజారిటీ ఓట్లు సాధించినా అధ్యక్షపదవి వరిస్తుందనే గ్యారంటీ ఏమీ లేదు. ఎలక్టోరల్ ఓట్లే అధ్యక్షుడెవరనేది నిర్ణయిస్తాయి. 2020లో నవంబరు 3న ఎన్నికలు జరగగ్గా... ఫలితం తేలడానికి నాలుగు రోజులు పట్టింది. పెన్సిల్వేనియాలో ఫలితం స్పష్టమయ్యాక.. జో బైడెన్ నెగ్గారని మీడియా ప్రకటించింది. ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యాక ట్రంప్ తొలుత 11 శాతం ఓట్ల ఆధిక్యం కనబర్చారు. తర్వాత రెండురోజుల్లో పోస్టల్ బ్యాలెట్లను లెక్కింపు ప్రారంభమయ్యాక.. బైడెన్ ఆధిక్యంలోకి వచ్చారు. వార్త సంస్థ ‘అసోసియేటెడ్ ప్రెస్’ తొలుత విజేతను ప్రకటిస్తూ వస్తోంది. 1848 నుంచి కచ్చితంగా విజేత ఎవరో తొలుత చెబుతోంది. 2016 ఎన్నికలు జరిగిన రోజు రాత్రే డొనాల్డ్ ట్రంప్‌ను అసోసియేటెడ్ ప్రెస్ విజేతగా ప్రకటించింది. అధికారిక ప్రక్రియ మాత్రం కొనసాగుతూ ఉంటుంది. డిసెంబరు 11 కల్లా రాష్ట్రాలు ఫలితాలను ప్రకటించాలి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
US Elections 2024: అంతులేని ఉత్కంఠ
వాషింగ్టన్: అమెరికా చరిత్రలోనే అత్యంత హోరాహోరీగా సాగిన ప్రచార ఘట్టానికి తెర పడింది. అధ్యక్ష ఎన్నికల్లో అతి కీలకమైన పోలింగ్ ప్రక్రియ చురుగ్గా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఓటర్లు తమ తీర్పును బ్యాలెట్ బాక్సులు, ఈవీఎంల్లో నిక్షిప్తం చేస్తున్నారు. మంగళవారం ఉదయం (భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30) నుంచే పోలింగ్ బూత్‌ల ముందు జనం భారీగా బారులు తీరారు. అమెరికాలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో సమయానికి పోలింగ్ మొదలవుతుంది.కనెక్టికట్, వ్యోమింగ్, ఇండియానా, కెంటకీ, మైన్ వంటి రాష్ట్రాల్లో ఉదయం ఆరింటికి; అరిజోనా, అయోవా, లూసియానా, విస్కాన్సిన్ తదితర రాష్ట్రాల్లో 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. డెమొక్రాట్ల అభ్యర్థి కమలా హారిస్, ఆమె రిపబ్లికన్ ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతున్నట్టు ఓటింగ్ సరళిని బట్టి తెలుస్తోంది. దాంతో ఎవరు గెలుస్తార్నది రాజకీయ పండితుల అంచనాలకు కూడా అందడం లేదు. ఈసారి స్వింగ్ స్టేట్స్తో పాటు పలు ఇతర రాష్ట్రాల్లో కూడా గెలుపోటముల మధ్య తేడా అతి స్వల్పంగానే ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అభ్యర్థులిద్దరిలో ఎవరు గెలిచినా రికార్డే కానుండటం విశేషం. హారిస్ నెగ్గితే అమెరికాలో అత్యున్నత పీఠాన్ని అధిష్టించిన తొలి మహిళగా నూతన చరిత్ర సృష్టిస్తారు. నల్లజాతి, ఆసియా, భారత మూలాలున్న తొలి అధ్యక్షురాలు కూడా అవుతారు. అదే ట్రంప్ గెలిస్తే గత 132 ఏళ్లలో ఒకసారి అధ్యక్షునిగా చేశాక కొన్నేళ్ల విరామం తర్వాత మళ్లీ ఆ పదవి చేపట్టిన తొలి వ్యక్తిగా రికార్డులకెక్కుతారు. ప్రచారం పొడవునా వారి మధ్య తీవ్ర విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, వాదనలు సాగడం తెలిసిందే. 16 కోట్ల పై చిలుకు ఓటర్లలో సగానికి సగం, అంటే దాదాపు 8 కోట్ల మంది ఈసారి ముందస్తు, పోస్టల్ తదితర పద్ధతుల్లో ఇప్పటికే ఓటు హక్కు వినియోగించుకోవడం విశేషం. మంగళవారం సాయంత్రం ఆరింటికి (భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 11.30కు) పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది.ఆ వెంటనే రాష్ట్రాలవారీగా ఎక్కడికక్కడ ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టినా తుది ఫలితం తేలడానికి కొద్ది రోజులు పట్టవచ్చు. అయితే విజేత ఎవరన్న దానిపై ఓటింగ్ ముగిసిన కొద్ది గంటల్లోనే స్పష్టత వచ్చే అవకాశం లేకపోలేదు. దాంతో ఇక అందరి కళ్లూ ఫలితాలను తేల్చడంలో కీలకమైన స్వింగ్ రాష్ట్రాలపైనే ఉన్నాయి. మహిళల ఓటు కూడా ఈసారి కీలకంగా మారుతుందని భావిస్తున్నారు.అమెరికా చరిత్రలోనే కీలకమైన రోజు: ట్రంప్ మంగళవారాన్ని అమెరికా చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన రోజుగా ట్రంప్ అభివరి్ణంచారు. ‘‘పోలింగ్ రోజు వచ్చేసింది! భారీ సంఖ్యలో వచ్చి ఓటేయండి’’ అంటూ లక్షలాది మంది అభిమానులు, మద్దతుదారులకు మంగళవారం ఆయన ఈ మెయిళ్లు పంపారు. అమెరికాను మరోసారి గొప్ప దేశంగా మలచుకుందాం. మీరు ఓటేయకుండానే వెనుదిరగాలని రాడికల్ కమ్యూనిస్టు డెమొక్రాట్లు ఆశిస్తున్నారు. మనమంతా కలిసి వారి ఆశలను వమ్ము చేద్దాం’’ అంటూ పిలుపునిచ్చారు. జీవనవ్యయం తగ్గిస్తా: హారిస్ ప్రెసిడెంట్‌గా తన విజయం ఇప్పటికే ఖాయమైపోయిందని హారిస్ పేర్కొన్నారు. ప్రజల జీవన వ్యయాన్ని తగ్గించడం, వెన్ను విరిగిన వలసల విధానాన్ని సరిచేయడం తన తొలి ప్రాథమ్యాలని ప్రకటించారు. మంగళవారం ఆమె పిట్స్‌బర్గ్‌లో న్యూస్రేడియో మారి్నంగ్ షోలో పాల్గొన్నారు. ధరాభారానికి ముకుతాడు వేసేందుకు తనవద్ద ఇప్పటికే ప్రణాళిక సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.ఫ్లోరిడాలో ఓటేసిన ట్రంప్ ట్రంప్ ఫ్లోరిడాలో ఓటేశారు. మంగళవారం ఉదయం భార్య మెలానియాతో కలిసి తన నివాసం సమీపంలోని పామ్‌బీచ్‌లోని పోలింగ్ బూత్‌లో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. హారిస్ ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేయడం తెలిసిందే. అధ్యక్షుడు జో బైడెన్ కూడా తన స్వస్థలం డెలావెర్‌లో కొద్ది రోజుల ముందే ఓటేశారు. డిక్స్విల్ నాచ్‌లో తొలి ఫలితంఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓ బుల్లి కౌంటీలో ‘తొలి ఫలితం’ వచ్చేసింది. పోలింగ్ మొదలైన కొద్ది గంటల్లోనే అక్కడ కౌంటింగ్ కూడా పూర్తవమే ఇందుకు కారణం. న్యూహాంప్‌షైర్ రాష్ట్రంలోని డిక్స్విల్ నాచ్‌లో కేవలం ఆరుగురు ఓటర్లే ఉన్నారు. అక్కడ 60 ఏళ్లుగా అర్ధరాత్రి ఓటు హక్కు వినియోగించుకునే సంప్రదాయముంది. దాని ప్రకారం మంగళవారం మొదలవుతూనే (సోమవారం అర్ధరాత్రి దాటగానే) పోలింగ్ మొదలైంది. ఆరుగురు ఓటర్లే ఉండటంతో కాసేపటికే పోలింగ్, ఆ వెంటనే కౌంటింగ్ కూడా ముగిశాయి. హోరాహోరీ పోరుకు అద్దం పట్టేలా హారిస్, ట్రంప్‌కు చెరో మూడు ఓట్లు పడటం విశేషం. కెనడా సరిహద్దు సమీపంలో ఉండే డిక్స్విల్కు అమెరికా ఎన్నికల్లో తొలి ఫలితం వచ్చే ప్రదేశంగా పేరుంది. అమెరికాలో కొన్ని రాష్ట్రాల్లో ఉదయం ఆరింటికి, మరికొన్నింట్లో 7, 8, 9 గంటలకు పోలింగ్ మొదలవుతుంది. -
USA Presidential Elections 2024: తేల్చేది అబార్షనే!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అబార్షన్ హక్కులు కీలకంగా మారాయి. అధ్యక్షుడు ఎవరనేది అవే నిర్ణయించినా ఆశ్చర్యం లేదని పరిశీలకులూ అభిప్రాయపడుతున్నారు. అబార్షన్ హక్కులను 2022లో అమెరికా సుప్రీంకోర్టు కొట్టేయడం తెలిసిందే. వాటిపై దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి. ఆ తర్వాత జరుగుతున్న తొలి అధ్యక్ష ఎన్నికలివి. ఈ నేపథ్యంలో 10 కీలక రాష్ట్రాల్లోని ఓటర్లు అధ్యక్ష ఎన్నికల్లో ఓటింగ్‌తో పాటు అబార్షన్ హక్కులపైనా తమ అభిప్రాయాన్ని తెలపనున్నారు. అధ్యక్ష అభ్యర్థులతో పాటు అబార్షన్ హక్కుల సవరణ (4) అంశాన్ని కూడా ఆ రాష్ట్రాలు బ్యాలెట్లో పొందుపరిచాయి.గర్భస్రావాన్ని నిషేధిస్తూ అమెరికాలో కనెక్టికట్ రాష్ట్రం 1821లో తొలిసారిగా చట్టం చేసింది. దాంతో అప్పటిదాకా సాధారణ చికిత్సగా ఉన్న గర్భస్రావం నేరంగా మారిపోయింది. 1880వ దశకం చివర్లలో పలు ఇతర రాష్ట్రాలు కూడా ఇలాంటి చట్టాలే చేశాయి. జేన్ రో అనే మహిళ దీన్ని వ్యతిరేస్తూ 1971లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గర్భస్రావం అందుబాటులో ఉండేలా చూడాలని, పునరుత్పత్తి సంబంధిత విషయాల్లో నిర్ణయాధికారం మహిళలకే ఉండాలని వాదించారు. దాంతో గర్భస్రావాన్ని చట్టబద్ధం చేస్తూ రెండేళ్ల తర్వాత కోర్టు తీర్పునిచ్చింది. ‘రోవర్సెస్ వేడ్’ కేసుగా ఇది చరిత్రకెక్కింది. తర్వాత చాలా రాష్ట్రాలు మహిళలకు అబార్షన్ సదుపాయాన్ని కల్పించినా కొన్ని మాత్రం నిషేధం కొనసాగించాయి. పోప్ వ్యాఖ్యలతో.. అబార్షన్ హక్కులను 1951లో పోప్ గట్టిగా విమర్శించారు. ‘‘గర్భంలోని బిడ్డకు కూడా జీవించే హక్కుంది. ఆ బిడ్డనిచ్చింది దేవుడు. అంతే తప్ప తల్లిదండ్రులు, ఈ సమాజమో లేదా మనిషో సృష్టించిన ప్రభుత్వాలు కాదు’’ అంటూ సందేశమిచ్చారు. ఆ తర్వాత గర్భస్రావంపై ఆంక్షలను సుప్రీంకోర్టే తొలగించడం మత సమూహాలకు సమస్యగా మారింది. దాన్ని అడ్డుకోడానికి రిపబ్లికన్ పార్టీని మాధ్యమంగా అవి ఎంచుకున్నాయి. ఫలితంగా 1970వ దశకంలో అంతంతమాత్రంగా ఉన్న పార్టీ ఈ మత సమూహాలతో కలిసి ప్రభావశీలంగా మారింది. 1968–88 మధ్య ఆరు అధ్యక్ష ఎన్నికల్లో ఏకంగా ఐదింటిలో విజయం సాధించింది. జడ్జీల ద్వారా ఎత్తులు 1983లో పార్లమెంటులో గర్భస్రావ చట్ట సవరణకు ప్రతిపాదనలు ప్రవేశపెట్టినా ఆమోదం పొందలేదు. గర్భస్రావాన్ని నిషేధించడం పార్లమెంటు ద్వారా సాధ్యం కాదని, కోర్టు ద్వారానే ముందుకెళ్లాలని భావించారు. కానీ దానికోసం సంప్రదాయవాద జడ్జిలు అవసరమయ్యారు. అమెరికాలో జడ్జీలను అధ్యక్షుడే నియమిస్తారు. సుప్రీంకోర్టు జడ్జీల నియామకంపై పార్టీలు దశాబ్దాలుగా రెండుగా చీలుతున్నాయి. అధికారం రిపబ్లికన్ల చేతుల్లో ఉంటే గర్భస్రావాన్ని వ్యతిరేకించే జడ్జీలు, డెమొక్రాట్ల చేతిలో ఉంటే సమర్థించే వాళ్లు వచ్చేవారు. ట్రంప్ హయాంలో గర్భస్రావ వ్యతిరేక ధోరణి ఉన్న జడ్జీల నియామకం ఎక్కువగా జరిగింది. దాంతో అబార్షన్‌ను చట్టబద్ధం చేసిన 50 ఏళ్ల నాటి తీర్పును సుప్రీంకోర్టు 2022లో కొట్టివేసింది. అమెరికాలో అబార్షన్ హక్కులను ఈ తీర్పు పూర్తిగా మార్చేసింది. రాష్ట్రాలు తమ పరిధిలో అబార్షన్ అనుమతులను మార్చుకోవచ్చని పేర్కొంది. దీని ఆధారంగానే టెక్సాస్ రిపబ్లికన్ గవర్నర్ గ్రెగ్ అబాట్ ఒక కొత్త గర్భస్రావం చట్టాన్ని అమలు చేశారు. ఈ బాటలో మరిన్ని రాష్ట్రాలు నడిచాయి.మెజారిటీ అమెరికన్ల వ్యతిరేకత 2022 నాటి సుప్రీంకోర్టు తీర్పుతో మెజారిటీ అమెరికన్లు విభేదించారు. ఇది ఆ ఏడాది జరిగిన మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్ల విజయానికి కారణమైంది. ఇప్పుడు మాత్రం పునరుత్పత్తి హక్కుల కంటే ఆర్థిక వ్యవస్థ గురించి ఓటర్లలో ఎక్కువ ఆందోళన ఉందని సర్వే లు చెబుతున్నాయి. కానీ డెమొక్రాట్ల అభ్యర్థి, కమలా హారిస్ మాత్రం తన ప్రచా రంలో అబార్షన్ హక్కులనే ప్రస్తావిస్తున్నారు. అబార్షన్ల అనుకూల తీర్పును రద్దు చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకంలో తన పాత్రను ట్రంప్ ప్రచారం మొదట్లో పదేపదే పేర్కొంటున్నారు. ఇటీవల మాత్రం అబార్షన్ హక్కులపై నిర్ణయాధికారం రాష్ట్రాలదేనంటున్నారు.డెమొక్రాట్లకే సానుకూలం ఫ్లోరిడా, అరిజోనా, నెవడా, కొలరాడో, మోంటానా, సౌత్ డకోటా, మిస్సోరి, న్యూయార్క్, మేరీలాండ్, నెబ్రాస్కాల్లో అధ్యక్ష ఎన్నికలతో పాటు అబార్షన్ హక్కులపై కూడా ఒకేసారి ఓటింగ్ జరుగుతోంది. అబార్షన్ హక్కులుండాలా, పూర్తిగా రద్దు చేయాలా అనే విషయమై ఓటర్లు నిర్ణయం వెలువరించనున్నారు. ఈ విషయాలను అధ్యక్ష బ్యాలెట్‌తో పాటుగా జోడించడం అరిజోనా, నెవడా వంటి రాష్ట్రాల్లో డెమొక్రాట్లకు కలిసి రానుందని చెబుతున్నారు. గత ఎన్నికల్లో రిపబ్లికన్లకు ఓటేసిన ఫ్లోరిడా కూడా ఈసారి డెమొక్రాట్లకు మద్దతుగా నిలుస్తుందని అంచనా. ఫ్లోరిడా ఓటర్లలో 46 శాతం మంది చట్ట సవరణకు అనుకూలంగా, 38 శాతం వ్యతిరేకంగా, 16 మంది తటస్థంగా ఉన్నారని అక్టోబర్‌లో న్యూయార్క్ టైమ్స్/సియానా కాలేజ్ నిర్వహించిన సర్వే వెల్లడించింది. కాకపోతే వచ్చే మంగళవారం జరగనున్న అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌లో అబార్షన్ అంశం ఏ మేరకు ప్రభావం చూపిస్తుందనే దానిపై ఇప్పటికైతే స్పష్టత లేదు. ఎందుకంటే ఎకానమీనే ఈ ఎన్నికల్లో అతి పెద్ద సమస్యగా ఏకంగా 28 శాతం మంది ఓటర్లు చూస్తున్నట్టు సియానా కాలేజ్ పోల్ సర్వే పేర్కొంది. అబార్షన్ హక్కులను పెద్ద సమస్యగా భావిస్తున్నది 14 శాతమే. ఇక ట్రంప్ అత్యంత ప్రాధాన్యమిస్తున్న అక్రమ వలసల అంశానికి 12 శాతం మంది మాత్రమే ప్రాధాన్యమిస్తున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ప్రజాస్వామ్యానికి ట్రంప్ ప్రమాదకరం: జో బైడెన్
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను లాక్(జైలులో వేయాలి) చేయాలని అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. అధ్యక్ష ఎన్నికలకు రెండు వారాల ముందు న్యూ హాంప్‌షైర్‌లోని కాంకార్డ్‌లో ఉన్న డెమోక్రటిక్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రెసిడెంట్ జో బైడెన్ మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. డొనాల్డ్ ట్రంప్ ఎదుర్కొంటున్న పలు నేరారోపణల ఎత్తి చూపుతూ బైడెన్ జైలులో వేయాలని విమర్శలు గుప్పించారు. ట్రంప్ 2020 అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తారుమారు చేసే ప్రయత్నాలు చేశారు. అప్పటి నుంచి పలు నేరారోపణలను ఎదుర్కొంటున్నారని అన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిస్తే.. అమెరికా ప్రజాస్వామ్యానికి తీవ్రమైన ముప్పు కలుగుతుందని బైడెన్ హెచ్చరించారు.NOW - Biden says America needs to imprison Trump 14 days before election day: "We gotta lock him up."@disclosetv pic.twitter.com/FB6Xb8Wv3T— THE VOICE 🌹 🗣🎙🇺🇸🦅🌎⚓💜♠️CHRIST CONSCIOUSNESS (@WETHEKINGDQMQ98) October 22, 2024‘‘అమెరికా ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. ఈ రాజకీయ ఉద్రిక్తత 2016 ఎన్నికలను గుర్తు చేస్తుంది. 2016 ఎన్నికల సమయంలో ట్రంప్.. హిల్లరీ క్లింటన్‌ను ఉద్దేశిస్తూ ‘లాక్ హర్ అప్’ అని ప్రచారం చేయాలని తన మద్దతుదారులను ప్రోత్సహించారు. దీనిని అప్పుడు ట్రంప్ తన ప్రచారానికి అస్త్రంగా ఉపయోగించుకున్నారు. కానీ, ప్రస్తుతం వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్అ టువంటి వ్యాఖ్యలు, నినాదాలకు చాలా దూరంగా ఉన్నారు. నేరారోపణలను కోర్టులు చూసుకుంటాయి. మనం నవంబర్‌లో ఫలితాలను చూద్దామని కమల వ్యాఖ్యానించారు. నేను హాజరయ్యే ప్రతి అంతర్జాతీయ సమావేశంలో ఇతర దేశాధినేతలు ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో గెలవలేడని చెప్పారు’’ అని అన్నారు. అయితే.. 2016 ఎన్నికల ప్రచారంలో తన మద్దతుదారులు ‘లాక్ హర్ అప్’ అంటూ హిల్లరీ క్లింటన్‌ను ఉద్దేశిస్తూ భారీగా నినాదాలు చేశారు. ఆ సమయంలో ట్రంప్ తన మద్దతుదారులను నిలువరించలేదు. ప్రస్తుతం అదే ఫార్ములాను ట్రంప్‌నకు కమలా హారిస్ మద్దతుదారులు అన్వయిస్తూ నినాదాలు చేయటం గమనార్హం. -
మరో నాలుగేళ్లు భరించలేం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్‌పై మాజీ అధ్యక్షుడు, డెమొక్రటిక్ నాయకుడు బరాక్ ఒబామా విరుచుకుపడ్డారు. అహంకారి, అసమర్థుడు, బడాయికోరు, ప్రజల మధ్య చిచ్చు పెట్టే నాయకుడు మనకు అవసరం లేదని తేల్చిచెప్పారు. అలాంటి వ్యక్తిని మరో నాలుగేళ్లపాటు మనం భరించలేమని అన్నారు. పేజీ తిప్పేయడానికి అమెరికా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఒకరిపై ఒకరు తిరగబడే పరిస్థితి రాకుండా కలిసి పనిచేసేలా ఉత్తమమైన పేజీ మన కోసం సిద్ధమవుతోందని తెలిపారు. అధ్యక్షురాలు కమలా హారిస్ కోసం మనం ఎదురు చూస్తున్నామని వ్యాఖ్యానించారు. పెన్సిల్వేనియా రాష్ట్రంలోని పిట్స్‌బర్గ్‌లో గురువారం డెమొక్రటిక్ పార్టీ ప్రచార కార్యక్రమంలో బరాక్ ఒబామా మాట్లాడారు. ట్రంప్ ప్రతిపాదిస్తున్న పన్ను విధానం, విదేశాంగ విధానాన్ని తప్పుపట్టారు. ట్రంప్ పచ్చి అబద్ధాలకోరు అని మండిపడ్డారు. జో బైడెన్ ప్రభుత్వం రిపబ్లికన్లకు తుపాను సాయం అందించలేదంటూ ట్రంప్ చేసిన ఆరోపణలను కొట్టిపారేశారు. బాధితులకు సాయం అందించడంలో ఎలాంటి వివక్ష ఉండదన్నారు. అమెరికా విలువలను ఉల్లంఘించవద్దని ట్రంప్‌నకు సూచించారు. ఈసారి అధ్యక్ష ఎన్నికలు హోరాహోరీగా జరగబోతున్నాయని, రిపబ్లికన్ అభ్యర్థి కమలా హారిస్ విజయం ఖాయమని ఒబామా స్పష్టంచేశారు. ఈ ఎన్నికల్లో కమలా హారిస్‌కు మద్దతుగా ఆయన ప్రచారంలో పాల్గొనడం ఇదే మొదటిసారి. అధ్యక్ష పదవిని చేపట్టేందుకు హారిస్ సర్వసన్నద్ధంగా ఉన్నారని ఒబామా తేల్చిచెప్పారు. ఆమె విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని చెప్పారు. కమలా హారిస్‌ను గెలిపిస్తే ఆమె తన సొంత సమస్యలపై కాకుండా ప్రజల సమస్యలపై దృష్టి పెట్టి పరిష్కరిస్తారని వివరించారు. ప్రజల కష్టాలు ఏమిటో ఆమెకు క్షుణ్నంగా తెలుసని చెప్పారు. ఒకవేళ డొనాల్డ్ ట్రంప్‌ను ఎన్నుకుంటే ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్లేనని ప్రజలను అప్రమత్తం చేశారు. ట్రంప్ వస్తే సంపన్నులు, కార్పొరేట్లపై పన్నులు తగ్గిస్తారని, సామాన్య ప్రజలపై పన్నులు పెంచుతారని అన్నారు. మెరుగైన జీవితం, పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలనుకుంటే ఎన్నికల్లో కమలా హారిస్‌ను గెలిపించుకోవాలని అమెరికా ప్రజలకు ఒబామా పిలుపునిచ్చారు. -
USA Presidential Elections 2024: అమెరికా కార్పొరేట్ల పార్టీల బాట
అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అమెరికాలో రాజకీయ చీలికలు పెరుగుతున్నాయి. ప్రజాస్వామ్యంలో వ్యక్తులు రాజకీయ పార్టీలకు, నాయకులకు మద్దతు తెలపడం సాధారణం. అయితే అమెరికాలో కార్పొరేట్లు సైతం రెండు వర్గాలుగా విడిపోయాయి. చిన్న, ప్రాంతీయ సంస్థలు మొదలు టెక్, బ్యాంకింగ్ దిగ్గజాల వంటి పెద్ద సంస్థల దాకా మెజారిటీ సంస్థలన్నీ డెమొక్రటిక్, రిపబ్లికన్ అభ్యర్థుల మధ్య విడిపోయాయి. కొన్ని సంస్థలు కమలా హారిస్‌వైపు, మరికొన్ని సంస్థలు డొనాల్డ్ ట్రంప్ వైపు నిలిచారు. ఈ చీలికతో ఉదారవాద, వామపక్ష భావాలు కలిగిన కమలా హారిస్‌కు మితవాద ట్రంప్‌కు మధ్య పోటీగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు మారిపోయాయి. టెక్ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్, గూగుల్ (ఆల్ఫాబెట్), అమెజాన్, సన్ మైక్రోసిస్టమ్స్ ఉద్యోగులు కమలా హారిస్ ప్రచారానికి మిలియన్ల డాలర్లను విరాళంగా ఇచి్చనట్లు రాజకీయరంగ విషయాలను బహిర్గం చేసే ‘ఓపెన్ సీక్రెట్స్’సంస్థ వెల్లడించింది. ట్రంప్ ప్రచారానికి వచి్చన విరాళాల కంటే కమలా హారిస్ ప్రచారానికి వచి్చన సహకారం గణనీయంగా ఉంది. ఎలాన్ మస్‌్క, మార్క్ జుకర్‌బర్గ్ వంటి టెక్ దిగ్గజాలు మాత్రం ట్రంప్‌కు మద్దతుగా ప్రకటించడం తెల్సిందే. హారిస్‌కు గూగుల్ సహా పలు సంస్థల బాసట భారత సంతతికి చెందిన అమెరికన్ బిలియనీర్, సన్ మైక్రోసిస్టమ్స్ సహ వ్యవస్థాపకుడు వినోద్ ఖోస్లా, వెంచర్ క్యాపిటలిస్ట్ రీడ్ హాఫ్మన్ తదతరులు హారిస్‌కు మద్దతుగా నిలిచారు. సుందర్ పిచాయ్ నేతృత్వంలోని గూగుల్ (ఆల్ఫాబెట్), దాని అనుబంధ సంస్థలు హారిస్‌కు దాదాపు రూ.18 కోట్లు విరాళంగా ఇచి్చనట్లు అమెరికా ఎన్నికల నిధుల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కొన్ని కార్పొరేట్ సంస్థ అటు కమలకు విరాళాలు అందిస్తూ ట్రంప్‌కు సైతం విరాళాలు పంపుతున్నాయి. అయితే కమలతో పోలిస్తే ట్రంప్‌కు వస్తున్న కార్పొరేట్ విరాళాలు తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. హారిస్ ప్రచారానికి సత్య నాదెళ్ల నేతృత్వంలోని మైక్రోసాఫ్ట్ దాదాపు రూ.9.2 కోట్లు విరాళం ఇచి్చంది. అమెరికా కుబేరుడు జెఫ్ బెజోస్ నేతృత్వంలోని అమెజాన్ సంస్థ దాదాపు రూ.8.36 కోట్లు విరాళంగా ఇచ్చింది. సిలికాన్‌వ్యాలీలో వందకు పైగా పెద్ద పెట్టుబడిదారులు, పెద్ద టెక్ సంస్థలు హారిస్‌కు మద్దతుగా నిలిచాయి. ట్రంప్‌కు బ్యాంకింగ్,ఆయిల్ దిగ్గజాల మద్దతు కార్పొరేట్లపై పన్ను మరింత తగ్గిస్తామని, విదేశాల నుంచి వచ్చే దిగుమతులపై అధిక సుంకాలు విధిస్తామని, చమురు, సహజవాయువు, బొగ్గు గనుల రంగాల్లో పెట్టుబడులు పెంచుతామని ట్రంప్ ఎన్నికల వేళ హామీలు గుప్పించారు. అమెరికాలో చమురు వెలికితీతను మొదట్నుంచీ సమర్థించే ట్రంప్‌కు చమురురంగ సంస్థలు మద్దతు పలుకుతున్నాయి. ట్రంప్‌పై హత్యాయత్నం జరిగినప్పుడు అమెరికా స్టాక్ మార్కెట్ కదలికలు సైతం ట్రంప్‌కు అనుకూలంగా ఉండటం గమనార్హం. చమురు వినియోగం అధికంగా ఉన్నంత మాత్రాన వాతావరణంలో ఎలాంటి మార్పులు రావని, వాతావరణ మార్పులు అనేది పచ్చి అబద్ధమని ట్రంప్ గతంలో వ్యాఖ్యానించారు. అధ్యక్షుడిగా ఉన్నకాలంలో పారిస్ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగేలా చేశారు. అమెరికా అభివృద్దిలో చమురు, బొగ్గుది కీలక పాత్ర అని ప్రకటించారు. దీంతో ఈ రెండు రంగాలు ట్రంప్‌కు మద్దతుగా నిలుస్తున్నాయి. బైడెన్ పాలనలో అమలు చేసిన కఠిన నిబంధనలను ట్రంప్ వెనక్కి తీసుకుంటారని బ్యాంకర్లు భావిస్తున్నారు. బైడెన్ సూచించిన కొత్త కఠిన బ్యాంకింగ్ నిబంధనలపై ఆ రంగం చూపుతున్న విముఖత ట్రంప్‌కు అనుకూలిస్తోంది. జుకర్‌బర్గ్, మస్క్ బహిరంగంగానే.. మెటా చీఫ్ ఎగ్జిక్యూటివ్ జుకర్‌బర్గ్ మితవాద ట్రంప్‌కు మద్దతు ఇస్తూ బహిరంగ ప్రకటనలు చేశారు. అయితే తర్వాత జుకర్‌బర్గ్ తాను తటస్థంగా, నిష్పక్షపాతంగా కనిపించాలనుకుంటున్నానని వ్యాఖ్యానించారు. ట్రంప్ ప్రచారానికి జుకర్‌బర్గ్ ఎంత విరాళంగా ఇచ్చారనే అంశాలు ఇంకా బహిర్గతంకాలేదు. ఫేస్బుక్లో వచ్చే కంటెంట్‌ను సెన్సార్ చేయాలని బైడెన్ ప్రభుత్వం మెటాపై ఒత్తిడి తేవడం తెల్సిందే. ఎలాన్ మస్క్ ట్రంప్‌కు బహిరంగంగా మద్దతు ఇచ్చారు. ట్రంప్ ప్రచారాన్ని చూసుకునే అమెరికా పీఏసీ సంస్థకు తాను వ్యక్తిగతంగా ప్రతి నెలా దాదాపు రూ.376 కోట్లు విరాళంగా పంపుతున్నానని మస్క్ జూలైలో బహిరంగంగా ప్రకటించారు. భారీ వెంచర్ క్యాపిటలిస్ట్ పీటర్ థెయిల్ సైతం ట్రంప్‌కు జై కొడుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
శ్రీలంక అధ్యక్షుడు దిస్సనాయకే
కొలంబో: శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికల్లో మార్క్సిస్ట్ నేత అనూర కుమార దిస్సనాయకే (56) విజయం సాధించారు. దేశ ఎన్నికల చరిత్రలోనే తొలిసారిగా రెండో రౌండ్ ఓట్ల లెక్కింపులో ఫలితం తేలడం విశేషం. జనతా విముక్తి పెరమున అధినేత అయిన దిస్సనాయకే తన సమీప ప్రత్యరి్థ, ఎస్‌జేబీ నేత సజిత్ ప్రేమదాసపై విజయం సాధించారు. అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే (75) తొలి రౌండ్లోనే వైదొలి గారు. తొలి రౌండ్ ఓట్ల లెక్కింపులో దిస్సనాయకే 42.31% ఓట్లతో తొలి స్థానంలో, ప్రేమదాస 32.8 శాతంతో రెండో స్థానంలో నిలవగా విక్రమసింఘే 17.27 శాతంతో మూడో స్థానానికి పరిమితమయ్యారు. అయితే ఏ ఒక్కరికీ విజయానికి కావాల్సిన 50 శాతం రాకపోవడంతో ద్వితీయ ప్రాధమ్య ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతను తేల్చారు. శ్రీలంక 9వ అధ్యక్షుడిగా దిస్సనాయకే సోమవారం ప్రమాణం చేస్తారని నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్పీపీ) ప్రకటించింది. దిస్సనాయకేకు భారత ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు.ఏకేడీ.. ఎట్టకేలకు! ఏకేడీగా పిలుచుకునే అనూర దిస్సనాయకే నార్త్ సెంట్రల్ ప్రావిన్స్ లోని థంబుట్టెగామలో జన్మించారు. కొలంబో సమీపంలోని కెలనియా యూనివర్సిటీలో డిగ్రీ చదువుకున్నారు. 1987లో జేవీపీలో చేరారు. 1971, 1987, 1990ల్లో ప్రభుత్వాలను కూలదోసేందుకు జేవీపీ హింసా మార్గం తొక్కింది. ఇది భారత వ్యతిరేకి కూడా. అప్పట్లో రాజీవ్ గాం«దీ–జయవర్థనే ప్రభుత్వాల ఒప్పందం శ్రీలంక సార్వ¿ౌమత్వానికి భంగకరమని భావించేది. గత ఫిబ్రవరిలో దిస్సనాయకే భారత్‌లో పర్యటించాక పార్టీ వైఖరిలో మార్పువచి్చంది. 90ల్లో జేవీపీ ప్రజాస్వామ్య విధానాల పట్ల మొగ్గాక పారీ్టలో దిస్సనాయకేకు ప్రాధాన్యం పెరిగింది. 2000 ఎన్నికల్లో మొదటిసారి ఎంపీ అయ్యారు. 2014లో పార్టీ అధ్యక్షుడయ్యారు. 2019 ఎన్నికల్లో జేవీపీకి దక్కిన ఓట్లు కేవలం మూడు శాతమే. -
Kamala Harris: రెండో డిబేట్‌కు నేను రెడీ
వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌తో రెండో అధ్యక్ష చర్చకు డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ సమ్మతించారు. అక్టోబర్ 23న జరిగే డిబేట్లో పాల్గొనాలని సీఎన్ఎన్ ఛానల్ పంపిన ఆహ్వానాన్ని శనివారం హారిస్ అంగీకరించారు. ట్రంప్‌తో వేదిక పంచుకోవడానికి ఉపాధ్యక్షురాలు సిద్ధంగా ఉన్నారని హారిస్ ప్రచార బృందం సారథి ఒమాలి డిల్లాన్ ఒక ప్రకటనలో తెలిపారు.రెండో డిబేట్‌కు తాను సంతోషంగా సమ్మతిస్తానని హారిస్ శనివారం ట్వీట్ చేశారు. అక్టోబరు 23న ట్రంప్ తనతో చర్చకు వస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబరు 10న జరిగిన తొలి డిబేట్లో ట్రంప్‌పై హారిస్ పైచేయి సాధించడం తెలిసిందే. మరో డిబేట్ ఆహ్వానంపై ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి. అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబరు 5న జరగనున్న విషయం తెలిసిందే. -
హారిస్ ప్రచారంలో విన్ఫ్రే
మిషిగన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌కు టీవీ లెజెండ్ ఓప్రా విన్ఫ్రే జత కలిశారు. ఇద్దరూ కలిసి గురువారం మిషిగన్‌లో జరిగిన ‘యునైటెడ్ ఫర్ అమెరికా’పేరిట టాక్‌షో తరహా కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రత్యక్ష ప్రసారంలో జెన్నిఫర్ లోపెజ్, క్రిస్ రాక్, జూలియా రాబర్ట్స్, మెరిల్ స్ట్రీప్‌తో సహా అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు. సంప్రదాయ మీడియాకు దూరంగా ఉండే ఓటర్లను చేరుకోవడానికి హారిస్ ఈ ప్రయత్నం చేశారు. దీన్ని ఐక్యత కోసం సాగుతున్న ఉద్యమంగా ఆమె అభివర్ణించారు. ఆర్థిక వ్యవస్థ, స్త్రీల పునరుత్పత్తి హక్కులు, వలసలు తదితర కీలకాంశాలపై ఈ సందర్భంగా హారిస్ చర్చించారు. స్టార్టప్‌లు, చిన్న వ్యాపారాలు ప్రారంభించడానికి 50,000 డాలర్ల వరకు పన్ను మినహాయింపు ఇవ్వాలన్నది తన ప్రణాళికలో భాగమన్నారు. ‘‘ప్రస్తుతం ఇది 5,000 డాలర్లుంది. అంత తక్కువతో ఎవరూ చిన్న వ్యాపారాన్ని ప్రారంభించలేరు’’అన్నారు. అమెరికాలో తుపాకీ సంస్కృతిపై తన వైఖరిని మరోసారి స్పష్టం చేశారు. ‘‘నేను తుపాకీ యజమానిని. నా రన్నింగ్‌మేట్ టిమ్ వాల్జ్‌కు కూడా తుపాకీ ఉంది. ఎవరైనా నా ఇంట్లోకి చొరబడితే కాల్చి చంపుతా’’అని నవ్వుతూ చెప్పారు. ట్రంప్‌తో హోరాహోరీయే గానీ... హారిస్, రిపబ్లికన్ల అభ్యర్థి ట్రంప్ మధ్య గట్టి పోటీ నెలకొందని ఒపీనియన్ పోల్స్ చెబుతున్నాయి. ‘‘వారిద్దరూ చొరో 47 శాతంతో సమానంగా కని్పస్తున్నారు. అయితే స్వింగ్ రాష్ట్రాల్లో అత్యంత కీలకమైన పెన్సిల్వేనియాలో మాత్రం హారిస్ 4 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నారు’’అని గురువారం విడుదలైన న్యూయార్క్ టైమ్స్ పోల్ తెలిపింది. కాకపోతే కమల డెమొక్రటిక్ అభ్యరి్థగా ఎన్నికైనప్పటి నుంచి సంప్రదాయ మీడియాకు దూరంగా ఉంటున్నారని, ఇది ఆమె అవకాశాలను క్లిష్టతరం చేస్తోందని విమర్శకులు అంటున్నారు. ‘‘ఆధునిక అమెరికా చరిత్రలోనే అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో అతి తక్కువ ఇంటర్వ్యూలు ఇచ్చిన అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్థులుగా హారిస్, వాల్జ్ నిలిచారు. వాళ్లు కేవలం ఏడు ఇంటర్వ్యూలు, ప్రెస్ కాన్ఫరెన్సుల్లో మాత్రమే పాల్గొన్నారు’’అని ఆక్సియోస్ సంస్థ గురువారం నివేదించింది. ట్రంప్, ఆయన రన్నింగ్‌మేట్ జేడీ వాన్స్ మాత్రం ఏకంగా 70కి పైగా కార్యక్రమాల్లో పాల్గొన్నారని వివరించింది. -
#SriLankaElections: లంకలో ముక్కోణపు పోరు!
కల్లోల శ్రీలంకలో కీలకమైన అధ్యక్ష ఎన్నికల పోరుకు సర్వం సిద్ధమైంది. శనివారం దేశవ్యాప్తంగా పోలింగ్ జరగనుంది. పెను రాజకీయ రగడకు దారితీసి దేశాన్ని కుప్పకూలి్చన 2022 ఆర్థిక సంక్షోభం అనంతరం జరుగుతున్న తొలి ఎన్నికలివి. మాజీ ఆర్మీ చీఫ్ శరత్పోన్సెకాతో పాటు 38 మంది బరిలో ఉన్నా ప్రధాన పోరు మాత్రం ముగ్గురి మధ్యే కేంద్రీకృతమైంది. అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘె, విపక్ష నేత సజిత్ ప్రేమదాస, జనాదరణతో దూసుకుపోతున్న అనూర కుమార దిస్సనాయకె అమీతుమీ తేల్చుకోనున్నారు. 1982 తర్వాత శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొనడం ఇదే తొలిసారి. ముగ్గుర్లో అనూరకే స్పష్టమైన మొగ్గు కనిపిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. ఎవరు నెగ్గినా కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్ది దేశాన్ని గాడిన పెట్టడం పెను సవాలుగానే కనిపిస్తోంది. మోయలేని భారంగా మారిన 300 కోట్ల డాలర్ల ఐఎంఎఫ్ అప్పు భయపెడుతున్న నేపథ్యంలో ఎకానమీయే ప్రధాన అభ్యర్థులందరికీ ప్రధాన ఎన్నికల అంశంగా మారింది... ప్రచారమంతా ఐఎంఎఫ్ రుణం చుట్టే... 2022 సంక్షోభం అనంతరం లంకను ఆదుకోవడానికి ఏ దేశమూ పెద్దగా ముందుకు రాలేదు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి 290 కోట్ల డాలర్ల రుణం సాధించడం రణిల్ సాధించిన ఘనవిజయమని ఆయన మద్దతుదారులు చెప్పుకుంటున్నారు. కానీ అందుకోసం ప్రజల బతుకులనే పణంగా పెట్టారని, సంక్షేమ పథకాలన్నింటికీ కోత పెట్టి వారిని రోడ్డు పాలు చేశారని ప్రత్యర్థులు దుయ్యబడుతున్నారు. ఈ రెండేళ్లలో ద్రవ్యోల్బణం 74 శాతం పెరగడం రణిల్ అసమర్థ పాలన ఫలితమేనని మండిపడుతున్నారు. నిజానికి 2022 నాటి ఆర్థిక సంక్షోభానికి బీజాలు అంతకు పన్నెండేళ్ల ముందే పడ్డాయి. 2009లో అంతర్యుద్ధం ముగిశాక పునరి్నర్మాణం, అభివృద్ధి పథకాలకు లంక విపరీతంగా అప్పులు చేసింది. 2020 నాటికే వాటిని తీర్చలేని పరిస్థితికి చేరుకుంది. పులిమీద పుట్రలా కరోనా వచి్చపడటంతో ప్రధాన ఆదాయ వనరైన పర్యాటకం పూర్తిగా నిలిచిపోయి గుడ్లు తేలేసింది. 2022 నాటికి చమురు ధరలు ఆకాశాన్నంటడం, అమెరికా వడ్డీ రేట్లు అమాంతంగా పెంచేయడంతో పూర్తిగా చేతులెత్తేసింది. అంతర్జాతీయ రుణ భారం 5,100 కోట్లు దాటేసింది. చమురుతో పాటు తిండి గింజలు, ఔషధాల వంటి అత్యవసరాలను కూడా దిగుమతి చేసుకోలేని దుస్థితికి దిగజారింది. ద్రవ్యోల్బణం దెబ్బకు ఒక్క గుడ్డు ధర ఏకంగా 300 రూపాయలు దాటేసింది. కడుపు కాలిన ప్రజలు రాజపక్స సర్కారుపై తిరగబడ్డారు. జనాగ్రహానికి జడిసి ఆయన దేశం వీడి పలాయనం చిత్తగించాక అన్ని పక్షాల అంగీకారంతో రణిల్ గద్దెనెక్కారు. ఐఎంఎఫ్ రుణానికి బదులుగా సంక్షేమ పథకాల్లో భారీ కోతకు ఆయన అంగీకరించడంతో కరెంటు తదితరాలపై సబ్సిడీలు అటకెక్కాయి. వ్యాట్ మోత రెండింతలైంది. పేదరికం రెట్టింపైంది. కాకపోతే ఆర్థిక సంక్షోభం నుంచి దేశం కాస్తో కూస్తో తేరుకుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘టారిఫ్’పై ట్రంప్‌కే ఓటు
వాషింగ్టన్: అగ్రరాజ్యాన్నీ అప్పుల భారం వెన్నాడుతోంది. దాంతో దేశ అప్పుల భారాన్ని తగ్గించే నేతకు అమెరికా ఓటర్లు జై కొడుతున్నారు. డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌తో పోలిస్తే విదేశీ వస్తువులపై అధిక పన్నులు వేసి అమెరికా రుణ భారాన్ని తగ్గిస్తానన్న రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు ఎక్కువ మంది ఓటర్లు మద్దతు పలుకుతున్నట్లు తాజాగా రాయిటర్స్/ఇప్సోస్ పోల్ సర్వేలో వెల్లడైంది. ఇప్పటికే దేశ అప్పు ఏకంగా 35 లక్షల కోట్ల డాలర్లు దాటిపోయింది. పన్నులు పెంచుకుంటే ప్రభుత్వానికి ఆదాయం పెరిగి పాత అప్పులను తీర్చుతుందనే భావనతో ఓటర్లు ట్రంప్ వైపు మొగ్గుచూపుతన్నారని సర్వే పేర్కొంది. ‘‘ఎగుమతులపై 10 శాతం పన్నులు విధిస్తానని, చైనా ఉత్పత్తులపై 60 శాతం దిగుమతి పన్ను విధిస్తానని హామీ ఇచి్చన ట్రంప్‌కు 56 శాతం మంది ఓటర్లు మద్దతు పలికారు. ఈ విషయంలో హారిస్ వైపు నిల్చున్న ఓటర్లు కేవలం 41 శాతం’’ అని సర్వే పేర్కొంది. పలు సర్వేల్లో హారిస్ ఆధిక్యతలో ఉన్నా ఏడు స్వింగ్ రాష్ట్రాలే విజేతను నిర్ణయిస్తాయని సర్వే అభిప్రాయపడింది. -
కమల గెలిస్తే శ్వేతసౌధంలో కర్రీ వాసనలే
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యరి్థగా పోటీ పడుతున్న భారత సంతతి మహిళ కమలా హారిస్ పట్ల జాతి వివక్ష వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ సన్నిహితురాలు లారా లూమర్ తాజాగా కమల హారిస్‌పై నోరుపారేసుకున్నారు. కమల అమెరికా అధ్యక్షురాలైతే శ్వేతసౌధం కర్రీ (కూర) వాసనలతో నిండిపోతుందని వ్యంగ్యా్రస్తాలు విసిరారు. కమల తల్లి శ్యామల గోపాలన్ భారతీయురాలన్న సంగతి తెలిసిందే. కమల భారతీయ మూలాలను, అలవాట్లు, సంస్కృతిని లారా లూమర్ పరోక్షంగా ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఇటీవల ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘‘నవంబర్ 5న జరిగే ఎన్నికల్లో కమలా హారిస్ గెలిస్తే వైట్‌హౌస్‌లో కూర వాసనలే ఉంటాయి. వైట్‌హౌస్‌లో ప్రసంగాలు కాల్ సెంటర్ ద్వారా వినిపిస్తాయి. అమెరికా ప్రజలు ప్రభుత్వానికి తమ సలహాలు, సూచనలు కేవలం కస్టమర్ శాటిస్ఫాక్షన్ సర్వే ద్వారా పంపించాల్సి ఉంటుంది’’ అని లూమర్ పేర్కొన్నారు. నేషనల్ గ్రాండ్‌పేరెంట్స్ డే సందర్భంగా కమలా హారిస్ సోషల్ మీడియా పోస్టు చేసిన చేసిన ఫోటోపై ఆమె పై విధంగా స్పందించారు. కమలా హారిస్‌పై లూమర్ చేసిన వ్యాఖ్యల పట్ల వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ కెరీన్ జీన్–పియర్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ట్రంప్, హారిస్ హోరాహోరీ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ మధ్య పోరు హోరాహోరీగా కొనసాగుతోందని ఆదివారం విడుదలైన న్యూయార్క్ టైమ్స్, సియానా సర్వేలో వెల్లడైంది. ఆస్తులను ఎక్కువ చేసి చూపి రుణాలు పొందడం, పార్లమెంట్‌పైకి తన మద్దతుదారులను ఉసిగొల్పిన ఘటనల్లో నిందితుడిగా ఉన్నాసరే సగం ఓటర్లు ట్రంప్‌కు మద్దతు పలుకుతున్నట్లు సర్వే పేర్కొంది. దేశవ్యాప్తంగా చూస్తే దాదాపు 48 శాతం మంది ట్రంప్‌కు మద్దతు పలికారు. కమలా హారిస్ విస్కాన్సిన్, మిషిగన్, పెన్సిల్వేనియా రాష్ట్రాల్లో ఆధిక్యత చూపారు. నెవడా, జార్జియా, నార్త్ కరోలినా, అరిజోనాలో ఇద్దరికీ గట్టి పోటీ ఉంది. మిషిగన్, విస్కాన్సిన్లో హారిస్ ఒక శాతం ఆధిక్యం కనబరిచారని, పెన్సిల్వేనియాలో గట్టి పోటీ నెలకొందని సీబీఎస్ న్యూస్, యూగౌ సర్వేలో తేలింది. బిగ్ డిబేట్‌కు వేళాయే!వాషింగ్టన్: డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మధ్య అధ్యక్ష చర్చ మంగళవారం జరగనుంది. పలు అంశాలపై తమ వైఖరిని తెలుపుతూ అమెరికన్లను మెప్పించడానికి అధ్యక్ష అభ్యర్థులు సిద్ధమయ్యారు. ఏబీసీ న్యూస్ ఛానెల్లో ఈ బిగ్ డిబేట్ మంగళవారం రాత్రి 9 గంటలకు (భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 6:30 గంటలకు) జరగనుంది. ఫిలడెలి్ఫయాలోని నేషనల్ కాస్టిట్యూషన్ సెంటర్లో ఏబీసీ న్యూస్ యాంకర్లు డేవిడ్ ముయిర్, లిన్సే డేవిస్ దీన్ని నిర్వహిస్తారు. 90 నిమిషాల పాటు ఈ చర్చ ఉంటుంది. అధ్యక్ష చర్చ నిర్వహించే యాంకర్లు మాత్రమే ప్రశ్నలు అడుగుతారు. -
హేట్ టు లవ్.. నాలుక మడతేసిన ట్రంప్
-
USA Presidential Elections 2024: స్వింగ్ స్టేట్స్లో కమల దూకుడు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు రసవత్తరంగా మారుతోంది. డెమొక్రాట్ల అభ్యర్థి కమలా హారిస్ విజేతగా నిలిచే అవకాశాలు నానాటికీ మెరుగవుతున్నట్టు సీఎన్ఎన్ వార్తా సంస్థ తాజా సర్వేలో తేలింది. ఎన్నికల ఫలితాలను నిర్ణాయక రీతిలో ప్రభావితం చేసే అతి కీలకమైన ఆరు స్వింగ్ స్టేట్స్లో ఆమె హవా సాగుతోందని వెల్లడించింది. ఆ రాష్ట్రాల్లో విస్కాన్సిన్, మిషిగన్ల్లో ఉపాధ్యక్షురాలు స్పష్టంగా ముందంజలో ఉన్నారు. అరిజోనాలో మాత్రం ఆమె ప్రత్యరి్థ, రిపబ్లికన్ల అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ది పైచేయిగా ఉంది. ఇక జార్జియా, నెవెడా, పెన్సిల్వేనియాల్లో ఇద్దరి మధ్యా హోరాహోరీ నెలకొంది. దాంతో ఈ మూడూ ఎవరివైపు మొగ్గితే వారే అధ్యక్ష పీఠమెక్కడం దాదాపుగా ఖాయమంటున్నారు. ఎందుకంటే ఆరు స్వింగ్ స్టేట్స్ మినహా అమెరికాలో మిగతా రాష్ట్రాలన్నీ సాంప్రదాయికంగా రిపబ్లికన్, డెమొక్రటిక్ పారీ్టల్లో ఏదో ఒకవైపు ఉండేవే. జార్జియా, నెవెడా, పెన్సిల్వేనియాల్లో ఏకంగా 15 శాతం ఓటర్లు తామెవరికి ఓటేయాలో ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పడం విశేషం. కనుక హారిస్, ట్రంప్ భాగ్యరేఖలను వీరే నిర్దేశించవచ్చని విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు. దాంతో రానున్న రోజుల్లో జార్జియా, నెవెడా, పెన్సిల్వేనియాల్లో అభ్యర్థులిద్దరి ప్రచార హోరు మిన్నంటడం ఖాయంగా కని్పస్తోంది.‘స్వింగ్’ మహిళంతా హారిస్ వైపే... కొంతకాలంగా దాదాపుగా అన్ని సర్వేల్లోనూ హారిసే ముందంజలో కొనసాగుతుండటం తెలిసిందే. సీఎన్ఎన్ తాజా సర్వే కూడా అదే ధోరణిని ప్రతిబింబించింది. విస్కాన్సిన్లో 50 శాతం మంది హారిస్‌కు ఓటేస్తామని చెప్పగా ట్రంప్‌కు 44 శాతం మద్దతు దక్కింది. మిషిగన్‌లో 48 శాతం హారిస్‌కు, 43 శాతం ట్రంప్‌కు జైకొట్టారు. జార్జియా, నెవెడాల్లోనూ హారిసే స్వల్ప పై చేయి సాధించారు. ఆ రెండు రాష్ట్రాల్లో ఆమెకు 48 శాతం, ట్రంప్‌కు 47 శాతం ఓటర్లు మద్దతిచ్చారు. అరిజోనాలో మాత్రం ట్రంప్ 49 శాతం మద్దతు దక్కగా హారిస్ 44 శాతానికి పరిమితమయ్యారు. పెన్సిల్వేనియాలో ఇద్దరికీ చెరో 47 శాతం ఓట్లు దక్కాయి. ఆరు స్వింగ్ స్టేట్స్‌లోనూ ట్రంప్‌తో పోలిస్తే మహిళల్లో హారిస్ 27 శాతం అధిక ఓట్లు సాధించారు! ట్రంప్ విధానాలు అమెరికా భద్రతకే ముప్పు కలిగించేంత ప్రమాదకరమైనవని ఆరు రాష్ట్రాల ఓటర్లూ అభిప్రాయపడ్డారు.ఎకానమీ, వలసల్లో ట్రంప్ పైచేయి ఆర్థికాంశాలను డీల్ చేసే సామర్థ్యం విషయంలో ఎప్పట్లాగే తాజా సర్వేలోనూ ట్రంపే పైచేయి సాధించారు. ఈ విషయంలో ఆయనకు 8 శాతం ఎక్కువ ఓట్లొచ్చాయి. అక్రమ వలసలను అడ్డుకోవడంలో ట్రంప్‌కు, అబార్షన్ తదితరాలపై హారిస్‌కు ఓట్లరు జైకొట్టారు. దేశం ముందున్న అతి ముఖ్యమైన అంశం ఏదన్న ప్రశ్నకు 39 శాతం మంది ఎకానమీకే ఓటేశారు. -
ఇండో-అమెరికన్లను ప్రసన్నం చేసుకునేందుకు..
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి, మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షురాలు.. డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ ప్రచార వేగాన్ని పెంచారు. ఈ క్రమంలో నవంబర్ 5న జరిగే అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌లో భారతీయ అమెరికన్ల ఓటర్ల అధిక సంఖ్యలో పాల్గొనేలా కొన్ని స్వచ్ఛంద సంస్థలు అవగాహన కార్యక్రమాలు చేపట్టాయి.అందులో భాగంగానే ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పోరా స్టడీస్ (FIIDS) సంస్థ ‘ఇండో అమెరికన్ వోట్స్ మేటర్’ అనే ప్రచారాన్ని మంగళవారం ప్రారంభించింది. అమెరికా భవిష్యత్తును రూపొందించడంలో ఇండియన్ అమెరికన్లు కీలక పోషిస్తారని ఓ ప్రకటనలో తెలిపింది.‘‘ఇండో అమెరికన్లు అమెరికాలో శక్తివంతమైన, పెరుగుతున్న మైనారిటీ కమ్యూనిటీగా అధ్యక్ష ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనుంది. అమెరికాగా అంతటా సుమారుగా 4.5 మిలియన్ల మంది ఇండో అమెరికన్లు ఉన్నారు. 2024 ఎన్నికలలో ఇండో అమెరికన్ ఓటర్లు గణనీయమైన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. ఫ్లోరిడా, జార్జియా, అరిజోనా, వర్జీనియా, న్యూజెర్సీ , పెన్సిల్వేనియా వంటి కీలకమైన రాష్ట్రాలలో ఇండో అమెకన్లు అధిక సంఖ్యలో ఉన్నారు. కీలకమైన అధ్యక్ష ఎన్నికల్లో ఫలితాలను నిర్ణయించడంలో ఇండో అమెరికన్లు నిర్ణయాత్మకంగా మారనున్నారు’’ అని ఎఫ్ఐఐడీఎస్ పేర్కొంది. ఎన్నికల నేపథ్యంలో దేశీయంగా అమెరికా, ప్రపంచం విధానాలపై ఇండో అమెరికన్ల అభిప్రాయలు తెలుసుకోవడానికి సమగ్ర సర్వే చెపడుతున్నామని తెలిపారు. ‘అధ్యక్ష ఎన్నికలకు కీలకమైన రాష్ట్రాల్లో ఇండో అమెరికన్ జనాభా గణనీయంగా ఉంది. ఈ అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ అమెరికన్లు ప్రభావం చూపే అవకాశం కలిగి ఉన్నారు’ అని ఎఫ్ఐఐడీఎస్ పాలసీ అండ్ స్ట్రాటజీ చీఫ్ ఖండేరావ్ కాండ్ తెలిపారు.ఇక.. భారతీయు అమెరికన్లు ఈసారి ఏ పార్టీ అభ్యర్థివైపు మొగ్గు చూపుతారో వేచి చూడాలి. మరోవైపు.. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ఇండో అమెరికన్ కమలా హారిస్ బరిలో ఉండటంతో భారతీయ అమెరికన్ల ఓటర్లపై ప్రాధాన్యత పెరుగుతోంది. -
USA Presidential Elections 2024: భిన్న ధ్రువాలు.. విభిన్న వైఖరులు
అగ్రరాజ్యం. అమెరికా ప్రపంచ పెద్దన్నగా కొనసాగాలంటే అధ్యక్షపీఠంపై ఆసీనులై పరిపాలించే నేత తీసుకునే నిర్ణయాలు తిరుగులేనివై ఉండాలి. దేశ అంతర్గత భద్రత, ప్రజా సంక్షేమం, అభివృద్ధి, ధరలుసహా యుద్ధాలు, వాతావరణ మార్పు వంటి అంతర్జాతీయ అంశాలపై పట్టుండాలి. అంతర్యుద్ధాలు, సంక్షోభాలు, అంతర్జాతీయ సమస్యలపై మిత్ర దేశాలతోపాటు శత్రుదేశాలనూ ఒప్పించగల నేర్పు తప్పనిసరి. నవంబర్‌లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడుతున్న డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌లు తాము గెలిస్తే ఎలాంటి పాలన అందిస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత నాలుగేళ్లుగా జో బైడెన్ అమలుచేసిన అభివృద్ధి పథకాలను కొనసాగిస్తానని హారిస్ చెబుతుండగా అక్రమ వలసలను నిలువరించి బహిష్కరణ పర్వానికి తెరలేపుతానని, విప్లవాత్మక విధానాలను అమలుచేస్తానని ట్రంప్ భీష్మ ప్రతిజ్ఞచేశారు. ‘‘అధ్యక్షురాలిగా గెలవగానే శ్రామిక కుటుంబాల కోసం పాటుపడతా. కనీస వేతనాన్ని పెంచుతా. సేవలు, ఆతిథ్యరంగంలోని సిబ్బందికి అందే టిప్పులపై వసూలుచేస్తున్న పన్నులను రద్దుచేస్తా’ అని హారిస్ అన్నారు. జూన్‌లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ సైతం ఇదే హామీ ఇవ్వడం విశేషం. ఈ నేపథ్యంలో పలు కీలక అంశాలపై ఇప్పటికే ట్రంప్, హారిస్ వెల్లడించిన అభిప్రాయాలు వారి పాలనాపంథాపై స్పష్టత తీసుకొస్తున్నాయి. వాటిని ఒకసారి తరచి చూస్తే..అబార్షన్హారిస్: సురక్షితమైన, చట్టబద్ధమైన అబార్షన్‌కు కమలా హారిస్ మద్దతు పలుకుతున్నారు. రిపబ్లిక్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అబార్షన్లపై నిషేధం విధించడాన్ని ఆమె ఇప్పటికే పలుమార్లు తప్పుబట్టారు. తాము అధికారంలోకి వస్తే చట్టబద్ధ అబార్షన్‌కు అనుమతిస్తూ పార్లమెంట్లో చట్టం తెచ్చేందుకు కృషిచేస్తానని చెప్పారు. ట్రంప్: కొన్ని రాష్ట్రాల్లో అబార్షన్‌పై నిషేధం అమలవుతుండగా కొన్ని రాష్ట్రాల్లో షరతుల మేరకు అనుమతిస్తున్నారు. దీంతో అబార్షన్‌పై ఎప్పుడు ప్రశ్నించినా ట్రంప్ సమాధానం దాటవేశారు. అబార్షన్‌పై జాతీయస్థాయి విధానాన్ని ప్రకటించలేదు. రాష్ట్రాలకే ఆ నిర్ణయం వదిలేస్తే మంచిది అన్నట్లు గతంలో వ్యాఖ్యానించారు.చట్టాల అమలు/ ప్రజాస్వామ్యంహారిస్: హారిస్ గెలిస్తే ట్రంప్‌పై కేసులపై దృష్టిపెట్టే అవకాశముంది. గత అధ్యక్ష ఫలితాలను తప్పుబడుతూ, పార్లమెంట్ భవంతి మీదకు రిపబ్లికన్ పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులను ట్రంప్ ఉసిగొల్పడం, నీలితారకు అనైతిక నగదు చెల్లింపులు, ఆస్తిగా ఎక్కువగా చూపు రుణాల పొందటం వంటి కేసుల్లో తీర్పులు త్వరగా వచ్చేలా హారిస్ ఒత్తిడి తేవచ్చు. ప్రజాస్వామ్యయుత పాలనకు కట్టుబడతానని హారిస్ గతంలో అన్నారు. ట్రంప్: బైడెన్ చేతిలో ఓడినపుడు అధ్యక్ష ఫలితాలను ట్రంప్ అంగీకరించలేదు. ఈసారి కూడా ఓడిపోతే ఓటమిని ట్రంప్ ఒప్పుకోకపోవచ్చు. నాటి పార్లమెంట్‌పై దాడి, అక్కడి పోలీసులను గాయపరిచిన నిందితులకు క్షమాభిక్ష పెడతానని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఎఫ్బీఐను ప్రక్షాళిస్తానని చెప్పారు. బైడెన్ పాలనలో అవినీతిపై ప్రత్యేక ప్రాసిక్యూటర్‌తో విచారణ జరిపిస్తానని హామీ ఇచ్చారు.వాతావరణ మార్పులు/ఇంథనంహారిస్: అమెరికాలో కర్భన ఉద్గారాల విడుదల తగ్గిస్తానని ఉపాధ్యక్షురాలి హోదాలో హారిస్ గతంలో చెప్పారు. హరిత ఇంథనానికి జై కొట్టారు. సముద్రగర్భంలో చమురు వెలికితీతను వ్యతిరేకించారు. విద్యుత్ వినియోగం ఆదాతోపాటు పర్యావరణ అనుకూల పథకాలను ప్రోత్సహించారు. ట్రంప్: వాతావరణ మార్పుల అంశాన్ని గాలి కొదిలేశారు. పారిస్ ఒప్పందం నుంచి వైదొలిగారు. ప్రభుత్వ భూముల్లో విచ్చలవిడిగా చమురు తవ్వకాలకు పచ్చజెండా ఊపారు. బైడెన్ ప్రభుత్వం వచ్చాక పారిస్ ఒప్పందంలో అమెరికా చేరింది. అయితే ఈసారి తాను గెలిస్తే పారిస్ ఒప్పందానికి మళ్లీ కటీఫ్ చేప్తానని ట్రంప్ అన్నారు.ఇజ్రాయెల్/ ఉక్రెయిన్యుద్ధాలుహారిస్: గాజా స్ట్రిప్‌లో హమాస్‌పై ఇజ్రాయెల్ దాడులను సమర్థిస్తూనే పాలస్తీనియన్ల ప్రాణాలూ ముఖ్యమేనని హారిస్ చెప్పారు. త్వరగా యుద్ధాన్ని ముగించాలని ఇటీవల ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూను కోరారు. కాల్పుల విరమణ ఒప్పందానికి, సంధికి మొగ్గుచూపారు. ఈజిప్ట్, ఖతార్‌లతో కలసి మధ్యవర్తిత్వానికి ఓటేశారు. ఈమె గెలిస్తే గాజా యుద్ధం త్వరగా ముగిసే వీలుంది. ఉక్రెయిన్ యుద్ధంపై ఆమె ఇంకా ఎలాంటి స్పష్టమైన విధానాలు ప్రకటించలేదు.ట్రంప్: హమాస్ అంతమయ్యేదాకా ఇజ్రాయెల్‌కు మద్దతు పలుకుతానని ట్రంప్ గతంలో అన్నారు. అయితే మరింత మారణహోమం జరక్కుండా త్వరగా యుద్ధం ముగించి గాజాలో శాంతి నెలకొల్పాలని ఆయన కోరుతున్నారు. జనావాసాలపై ఇజ్రాయెల్ దాడులనూ ట్రంప్ సైతం ఖండించారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని త్వరగా ముగించే సత్తా తనకుందని ట్రంప్ గతంలో అన్నారు.ప్రభుత్వపాలనహారిస్: ప్రభుత్వ ఉద్యోగులను హఠాత్తుగా తొలగించే వివాదాస్పద ‘ప్రాజెక్ట్ 2025’ సిద్ధాంతాన్ని హారిస్ పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులను సులభంగా తీసేసేందుకు వీలు కల్పించేలా 2020లో ట్రంప్ ఇచ్చిన షెడ్యూల్–ఎఫ్ ఉత్తర్వును హారిస్ వ్యతిరేస్తున్నారు. సిబ్బంది ఉద్యోగ భద్రతకు పాటుపడతానని ఆమె మాటిచ్చారు. అక్రమ వలసలను తగ్గిస్తానని చెప్పారు. ఆహార ఉత్పత్తుల ధరను తగ్గిస్తానని హామీ ఇచ్చారు. కార్మికుల టిప్‌లపై పన్నును తొలగిస్తానన్నారు. కార్మికుల కనీస వేతనం పెంచుతానని, పౌరులు కొనే అధునాతన ఆయుధాలపై నిషేధం విధిస్తానని చెప్పారు.ట్రంప్: తన హయాంలో అమలు చేయాలని ప్రయత్నించిన ‘ప్రాజెక్ట్ 2025’ సిద్ధాంతం గురించి ట్రంప్ ఎక్కడా మాట్లాడట్లేదు. అయితే అధ్యక్ష కేంద్రంగా కేంద్రీకృత ప్రభుత్వానికి బాటలువేసే ఈ సిద్ధాంతాన్ని తాను గెలిస్తే అమలుచేయాలని ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తనపై పలు కేసులకు కారకులైన న్యాయశాఖ సిబ్బందిపై వేటు వేయడానికి ట్రంప్ సిద్దంగా ఉన్నాడని వార్తలొచ్చాయి. విద్యాశాఖను రద్దుచేస్తానని, ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ వంటి సంస్థలను ప్రక్షాళిస్తానని చెప్పారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
USA Presidential Elections 2024: టిప్‌లపై పన్ను ఎత్తేస్తా: హారిస్
లాస్ వెగాస్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే దేశంలోని రెస్టారెంట్ల సిబ్బంది టిప్పులపై పన్నులను రద్దు చేస్తానని డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ హామీ ఇచ్చారు. హోటళ్లు, రెస్టారెంట్లు, వినోద పరిశ్రమల పన్నులపైనే అధికంగా ఆధారపడే నెవెడా రాష్ట్రంలో ర్యాలీలో ఆమె ఈ మేరకు ప్రకటించారు. మాట్లాడారు. శ్రామికుల కనీస వేతనం పెంచుతానన్నారు. రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ కూడా ఇదే హామీ ఇవ్వడం విశేషం. దాన్నే హారిస్ కాపీ కొట్టారంటూ ఆయన ఎద్దేవా చేశారు. తన ఐడియాలను దొంగిలించడం మినహా హారిస్‌కు ఇంకేమీ చేతకాదన్నారు. -
Latha Mangipudi: హ్యారిస్ గెలిచి మహిళాశక్తిని గెలిపిస్తుంది
‘అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలాహ్యారిస్ గెలుస్తుంది. ఆమె గెలుపు మహిళాశక్తిని నిరూపిస్తుంది’ అంటున్నారు లత మంగిపూడి. అమెరికాలోని న్యూహ్యాంప్‌షైర్‌కు డెమోక్రటిక్ పార్టీ లెజిస్లేటర్‌గా ఉన్న లత ప్రస్తుతం కమలా హ్యారిస్ గెలుపు కోసం అహర్నిశలూ కృషి చేస్తున్నారు. అమెరికా మహిళల గురించి స్త్రీలకు ఉండాల్సిన దృక్పథం గురించి ఆమె తన అభిప్రాయాలను సాక్షితో పంచుకున్నారు.‘ఒక విధంగా చె΄్పాలంటే అమెరికాలో ప్రజాస్వామ్యానికి, నియంతృత్వానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి. అమెరికన్స్ మరోసారి ట్రంప్ నియంతృత్వ పాలనను అంగీకరించేందుకు ఏ మాత్రం సిద్ధంగా లేరు. కమలా హ్యారిస్ గెలిస్తేనే ప్రజాస్వామ్యానికి మనుగడ. అందుకే ‘సేవ్ అవర్ డెమోక్రసీ’ అనే నినాదం తో మేం ప్రజల్లోకి వెళ్తున్నాం. కమలా హ్యారిస్ అమెరికా మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపడతారని బలంగా నమ్ముతున్నాను’ అన్నారు లత మంగిపూడి. మైసూరుకు చెందిన లత రాజమండ్రికి చెందిన కృష్ణ మంగిపూడిని వివాహం చేసుకోవడంతో ఆంధ్రప్రదేశ్ వాసి అయ్యారు. 1985లో యూఎస్‌కు వెళ్లి స్థిరపడ్డారు. అనంతరం యూఎస్ ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ న్యూహ్యాంప్‌షైర్ చాప్టర్‌కు 2006 నుంచి 2013 వరకు చైర్పర్సన్ గా కొనసాగారు. అలా ఆమె రాజకీయ జీవితం మొదలైంది. అప్పటి అధ్యక్షుడు ఒబామా, హిల్లరి క్లింటన్ వంటి ప్రముఖులతో సత్సంబంధాలు ఏర్పడ్డాయి. ఆ తరువాత 2013 నుంచి ఇప్పటివరకు నాషువా నుంచి లెజిస్లేటర్‌గా గెలు΄÷ందుతూనే ఉన్నారు. కమలాహ్యారిస్ గెలుపు కోసం హోరాహోరీగా ప్రచారం కొనసాగిస్తూ పర్యటనలు చేస్తున్నారు.స్త్రీల హక్కులకు విఘాతం‘ప్రపంచంలో ఏ మహిళకైనా తన శరీరంపై తనకు పూర్తి హక్కు ఉండాలి. ఆమె తన ఆరోగ్యాన్ని కాపాడుకొనే అవకాశం ఉండాలి కదా. కానీ అమెరికాలో చోటుచేసుకున్న కొన్ని పరిణామాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ముఖ్యం గా పిల్లల్ని కనాలా, వద్దా అనే అత్యంత కీలకమైన అంశంపైన మహిళలు తమ హక్కును కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గర్భం దాల్చిన తరువాత తప్పనిసరిగా బిడ్డను కనాల్సిందే. కానీ బిడ్డను కనేందుకు ఆమె మానసికంగా, శారీరకంగా, ఆరోగ్యరీత్యా సంసిద్ధంగా ఉండాలి. ఇది బిడ్డను కనాల్సిన తల్లి, డాక్టర్ నిర్ణయించవలసిన విషయం. ఇందులో ప్రభుత్వ జోక్యం అవసరం లేదు. కానీ బలవంతంగానైనా పిల్లలను కనాల్సిందేననడం సరి కాదు. అత్యాచారానికి గురైన వారు, లైంగిక దాడుల వల్ల గర్భవతులైన వాళ్లు కూడా బిడ్డల్ని కనాలంటే ఎలా? అమెరికా మహిళలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న ఈ అంశంపై డెమోక్రటిక్ పార్టీ స్పష్టమైన వైఖరిని కలిగి ఉంది. మా పార్టీ గెలిస్తేనే మహిళల హక్కులకు రక్షణ లభిస్తుంది’ అన్నారామె.ఇంకా వివక్షేనా....‘విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో మహిళలకు పురుషులతో సమాన అవకాశాలు లభించడం లేదు. స్త్రీలు తీవ్ర నిర్లక్ష్యానికి, వివక్షకు గురవుతున్నారు. చివరకు కొన్నిచోట్ల ఓటుహక్కును కూడా వినియోగించుకోలేని పరిస్థితి. ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటుహక్కును వినియోగించుకొనే వాతావరణానికి రిపబ్లికన్ పార్టీ విఘాతం కలిగిస్తోంది. ముఖ్యంగా కొత్తగా ఓటుహక్కును ΄÷ందిన వాళ్లు, ఇమ్మిగ్రెంట్స్, కొన్నిచోట్ల మహిళలు తమ ఓటుహక్కును వినియోగించుకొనే అవకాశం లేదు. ఆ పార్టీ మరోసారి గెలిస్తే ఓటుహక్కు మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అందుకే ఈసారి మహిళా గెలుపు ప్రజాస్వామిక గెలుపు’ అని ముగించారామె.– పగిడిపాల ఆంజనేయులుసాక్షి, హైదరాబాద్ -
USA Presidential Elections 2024: అమెరికా ఎన్నికల్లోనూ డీప్‌ఫేక్
అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ను ఉపాధ్యక్షురాలు, సొంత పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ విమర్శిస్తున్న వీడియో.. విమర్శకులను ఏకిపారేస్తూ, ఎల్జీబీటీక్యూలను తిట్టి పోస్తూ బైడెన్ ఫోన్ కాల్స్ రికార్డులు.. మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్ ఫొటో..... అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డీప్ ఫేక్ హల్చల్కు ఇవన్నీ కొన్ని ఉదాహరణలు మాత్రమే. కృత్రిమ మేధ అందుబాటులోకి వచ్చాక అమెరికాలో జరుగుతున్న తొలి అధ్యక్ష ఎన్నికలివి. దానికి తోడు ఏకపక్షంగా సాగేలా కని్పంచిన పోటీ కాస్తా బైడెన్ స్థానంలో హారిస్ రంగప్రవేశంతో హోరాహోరీగా మారింది. ఈ నేపథ్యంలో ఓటర్లను గందరగోళపరచడానికి, ఉద్రిక్తతలను రేకెత్తించడానికి ఏఐ మరింతగా దురి్వనియోగం కావచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 2024 జనవరిలో డెమొక్రటిక్ పార్టీ ప్రైమరీ సందర్భంగా అధ్యక్షుడు జో బైడెన్ గొంతును అనుకరిస్తూ న్యూహ్యాంప్‌షైర్ ప్రజలకు ఫేక్ ఫోన్ కాల్స్ వెళ్లాయి. ప్రైమరీల్లో పాల్గొంటే సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొనే అర్హత కోల్పోతారంటూ ఓటర్లను ఆయన హెచ్చరిస్తున్నట్టుగా ఉన్న ఆ ఫేక్ కాల్స్ సంచలనమే సృష్టించాయి. ఈ నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏఐ– ఆధారిత వాయిస్ రోబోకాల్స్‌పై నిషేధం విధించింది. అలాంటి వీడియోలను సృష్టించినా, ప్రసారం చేసినా సదరు కంపెనీలకు భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించింది. అయినా డీప్ ఫేక్‌ల పరంపర కొనసాగుతూనే ఉంది. బైడెన్‌ను మూర్ఖుడన్న కమల కుబేరుడు మస్క్ ఎక్స్‌లో షేర్ చేసిన కమల డీప్‌ఫేక్ వీడియో వైరల్ అయింది. బైడెన్ మూర్ఖుడని, దేశాన్ని నడపడం ఆయనకు తెలీదని కమల అన్నట్టు ఆ వీడియోలో ఉంది. ఒక్క స్మైలీ ఎమోజీని మినహాయిస్తే అది పేరడీ అనడానికి ఆ వీడియోలో ఎటువంటి సంకేతాలూ లేవు. ఇలాంటివాటి ప్రభావం తటస్థ ఓటర్లపై చాలా ఉంటుందని ఆందోళన వ్యక్తమవుతోంది. విమర్శకులను తిట్టినట్టుగా... బైడెన్ అధ్యక్ష బరి నుంచి తప్పుకుని తనకు బదులుగా హారిస్‌ను అభ్యరి్థత్వాన్ని సమరి్థంచే క్రమంలో తన విమర్శకులను విపరీతంగా తిట్టిపోయడమే గాక ఎల్జీబీటీక్యూలకు వ్యతిరేకంగా మాట్లాడినట్టు, ఓ మానిప్యులేటెడ్ వీడియో పీబీఎస్ మీడియా సంస్థ లోగోతో సహా తెరపైకి వచి్చంది. దాంతో పీబీఎస్ టెలివిజన్ సంస్థ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసింది. అసలు వీడియోను తమ చానల్లో లైవ్ ప్రసారం చేసింది. అది నిజానికి జూలై 13న ట్రంప్‌పై హత్యాయత్నం తర్వాత రాజకీయ హింసను ఖండిస్తూ బైడెన్ మాట్లాడిన వీడియో. వీక్షకులను మోసగించేందుకు తమ లోగోను వాడుతూ డీప్ ఫేక్ వీడియో చేసినట్టు పీబీఎస్ తేలి్చంది. ట్రంప్ అరెస్టు! పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు డబ్బు చెల్లింపుల రికార్డులను తారుమారు చేసిన కేసులో ట్రంప్‌ను కోర్టు దోషిగా తేల్చాక పోలీసులు ఆయనను బలవంతంగా అరెస్టు చేసినట్లు కొన్ని వారాల క్రితం ఒక ఫొటో వైరలైంది. అది కూడా డీప్ ఫేక్ బాపతేనని డిజిటల్ ఫోరెన్సిక్స్ నిపుణులు తేల్చారు. తప్పుడు ట్వీట్లతో.. వీటికి తోడు తప్పుడు ట్వీట్లను సృష్టించి ఓటింగ్‌నే తారుమారు చేసే ఏఐ చాట్‌బాట్ సామర్థ్యాన్ని సివ్ఏఐ సంస్థ సహ వ్యవస్థాపకుడు లుకాస్ హాన్సెన్ ప్రదర్శించారు. అందులో అలెన్, టెక్సాస్ ‘పోలింగ్ కేంద్రాలు పార్కింగ్ కోసం ఛార్జ్ చేస్తున్నాయి’ అంటూ ఏఐ టూల్‌కు సందేశమిచ్చారు. అంతే...! అలెన్ అధికారులు చాలా పోలింగ్ కేంద్రాల్లో గప్‌చుప్‌గా 25 డాలర్ల పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నారంటూ సెకన్ల వ్యవధిలోనే లక్షల మందికి ట్వీట్లు చేరిపోయాయి. సమస్యేనంటున్న అమెరికన్లుఇలాంటి మోసపూరిత చర్యలు ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు ఆగ్రహం రగిల్చే ప్రమాదముందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. 2024 అధ్యక్ష ఎన్నికల ప్రక్రియను ఏఐ ఆధారిత అసత్యాలు ప్రభావితం చేస్తాయని 50 శాతానికి పైగా అమెరికన్లు భావిస్తున్నట్టు మీడియా గ్రూప్ ఆక్సియోస్, బిజినెస్ ఇంటెలిజెన్స్ సంస్థ మారి్నంగ్ కన్సల్ట్ గతేడాది చేసిన పోల్‌లో వెల్లడైంది. దీనిపై 200కి పైగా న్యాయవాద బృందాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఏఐ అసత్యాలకు అడ్డుకట్ట వేసేందుకు తక్షణం రంగంలోకి దిగాలంటూ టెక్ సీఈఓలకు ఏప్రిల్‌లో లేఖ రాశాయి. రాజకీయ ప్రకటనల్లో డీప్ ఫేక్స్ వాడకాన్ని నిషేధించాలని, వాస్తవిక ఎన్నికల కంటెంట్‌ను ప్రోత్సహించేలా అల్గారిథంను ఉపయోగించాలని కోరాయి. ఈ నేపథ్యంలో, ఏఐ కంటెంట్‌ను పక్కాగా లేబులింగ్ చేసే దిశగా కృషి చేస్తున్నట్టు టెక్ దిగ్గజాలు చెబుతున్నాయి. ఆటో టెక్నాలజీ లేదు ఏఐ ద్వారా సృష్టించే ఫేక్ వీడియో కంటెంట్, ఒరిజినల్ కంటెంట్ మధ్య తేడాను ఆటోమేటిక్‌గా గుర్తించే టెక్నాలజీ ఏదీ ప్రస్తుతానికి అందుబాటులో లేదు. దాంతో ఏదైనా కంటెంట్‌పై ఫ్యాక్ట్ చెక్ చేసే లోపే అది వైరల్ అవుతోంది. అది ఫేక్ అని చివరికి తేలినా, అప్పటికే జరగాల్సిన నష్టమంతా జరిగిపోతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
USA Presidential Elections 2024: సర్వేలో ముందంజలో కమలా హారిస్
వాషింగ్టన్: బైడెన్ అభ్యర్థిత్వం వేళ దాదాపు ఏకపక్షంగా కనిపించిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార సరళిలో అనూహ్య మార్పులు కనిపిస్తున్నాయి. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌తో ధీటుగా మాట్లాడలేక తడబడి, చివరకు తప్పుకున్న బైడెన్ అభ్యర్థిగా ఉన్నంతకాలం ట్రంప్ ముందంజలో ఉండటం తెల్సిందే. తాజా డెమొక్రటిక్ పార్టీ తరఫున కమలా హారిస్ రంగంలోకి దిగాక పోరు హోరాహోరీగా సాగుతోందని విశ్లేషణలు వెలువడ్డాయి. వీటికి బలం చేకూరుస్తూ తాజా సర్వేలో ట్రంప్ కంటే కమల హారిస్‌కే ఆదరణ ఒక శాతం ఎక్కువగా ఉందని తేలింది. తాజాగా ఆదివారం సీబీఎస్ న్యూస్/యూగవ్ సంస్థ చేపట్టిన సర్వేలో కమల ఆధిక్యం కనబరిచారు. ట్రంప్ అధ్యక్ష పదవిలో మానసికంగా స్థిమితంగా ఆలోచించగలరని 51 శాతం మంది, కమల మెరుగ్గా పరిపాలించగలరని 64 శాతం చెప్పారు. -
Donald Trump: ‘ఫాక్స్’లో అయితేనే డిబేట్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థులైన డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ మధ్య అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రెసిడెన్షియల్ డిబేట్ జరిగే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. సెపె్టంబర్ 10న ఏబీసీ చానల్లో హారిస్‌తో జరగాల్సిన డిబేట్ నుంచి తప్పుకుంటున్నట్టు ట్రంప్ ప్రకటించారు. ‘‘నిజానికది జో బైడెన్‌తో జరగాల్సిన డిబేట్. ఆయన ఎన్నికల బరి నుంచి తప్పుకున్నందున ఆ డిబేట్ కూడా రద్దయినట్టే’’ అని వాదించారు. ఈ మేరకు సొంత సోషల్ మీడియా హాండిల్ ‘ట్రూత్’లో తాజాగా ట్రంప్ పలు పోస్టులు పెట్టారు. ఫాక్స్ న్యూస్ చానల్లో అయితేనే డిబేట్‌కు వస్తానంటూ మెలిక పెట్టారు. ‘‘సెప్టెంబర్ 4న పెన్సిల్వేనియాలో ఫాక్స్ స్టూడియోలో హారిస్ చర్చకు రావాలి. ఖాళీ స్టూడియోలో కాకుండా కిక్కిరిసిన ప్రేక్షకుల నడుమ డిబేట్ చేద్దాం’’ అని సవాలు విసిరారు. దీనిపై హారిస్ వర్గం మండిపడింది. పిరికితనంతో డిబేట్ నుంచి ట్రంప్ పారిపోతున్నారంటూ ఎద్దేవా చేసింది. ఈ నేపథ్యంలో ట్రంప్ రాకపోయినా కేవలం హారిస్‌తో ఏబీసీ డిబేట్ కొనసాగుతుందా అన్నది చూడాల్సి ఉంది. డెమొక్రాట్ల తరఫున అధ్యక్షుడు బైడెన్‌కు బదులు హారిస్ అధ్యక్ష రేసులో అడుగు పెట్టినప్పటి నుంచీ ఆమెతో డిబేట్‌కు ట్రంప్ వెనకా ముందాడుతూ వస్తున్నారు. తామిద్దరి గురించీ అమెరికన్లకు ఇప్పటికే అంతా తెలుసంటూ వ్యాఖ్యలు చేశారు. కానీ తనతో డిబేట్‌కు రావాల్సిందేనని హారిస్ పట్టుబడుతున్నారు. గూగుల్‌పై ట్రంప్ మండిపాటుతన వార్తలను, ఫొటోలను గూగుల్ సెన్సార్ చేస్తోందని, ప్రజలకు వాస్తవాలు చేరనివ్వడం లేదని ట్రంప్ మండిపడ్డారు. తనకు సంబంధించిన వార్తలను, సమాచారాన్ని ఫేసుబుక్‌లో సెన్సార్ చేసినందుకు సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ తనకు క్షమాపణ చెప్పారన్నారు. -
కమలా హారిస్ అభ్యర్థిత్వం ఖరారు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ తరఫున కమలా హారిస్ అభ్యర్థిత్వం ఖరారైంది. శుక్రవారం పార్టీ డెలిగేట్ల ఆన్లైన్ పోలింగ్ మొదలైన నేపథ్యంలో ఆమె మెజారిటీ ఓట్లను గెల్చుకున్నారు. దాంతో అభ్యర్థిత్వం ఖరారైంది. ‘‘పార్టీ నామినీగా ఎన్నికవడం గౌరవంగా భావిస్తున్నా. వచ్చే వారం నా అభ్యర్థిత్వాన్ని అధికారికంగా స్వీకరిస్తా. దేశంమీద ప్రేమతో ఏకమైన ప్రజల కోసం ఇకపై ప్రచారం చేస్తా’’ అన్నారు. అమెరికా చరిత్రలో అధ్యక్ష అభ్యర్థిత్వం సాధించిన తొలి శ్వేతజాతీయేతర మహిళగా, తొలి భారతీయ అమెరికన్‌గా కమల చరిత్ర సృష్టించారు. ఆగస్ట్ 22న షికాగో జరిగే డెమొక్రటిక్ నేషనల్ కన్వెన్షన్‌లో కమల తన అభ్యర్థిత్వాన్ని అధికారికంగా అంగీకరిస్తారు. అభ్యర్థిత్వం స్వీకరించాక కొద్దిరోజులకు ఆమె తన రన్నింగ్‌మేట్ పేరును ప్రకటిస్తారు. -
Venezuela presidential election: సామ్యవాద కోటలో నారీ భేరి
వెనిజులా. ప్రపంచంలోనే అత్యధిక చమురు నిక్షేపాలున్న లాటిన్ అమెరికా దేశం. అయినా అత్యంత నిరుపేద దేశాల జాబితాలో అగ్రస్థానంలో ఉంది. పాతికేళ్లుగా సాగుతున్న స్వయం ప్రకటిత సామ్యవాద కూటమి నియంతృత్వ పాలనే అందుకు ప్రధాన కారణం. నిరసనలపై ఉక్కుపాదం, హక్కుల అణచివేత, విపక్ష నేతలకు సంకెళ్లు తదితరాలతో వెనిజులా యువత విసిగిపోయింది. దీనికి తోడు అంతర్జాతీయ సమాజం ఆంక్షలతో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి ఉపాధి అవకాశాలూ లేకపోవడంతో కట్టకట్టుకుని దేశం వీడుతోంది. నిండా 3 కోట్ల జనాభా కూడా లేని దేశంలో గత పదేళ్లలో ఏకంగా 80 లక్షల మంది విదేశీ బాట పట్టారు! సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం వంటి కీలక వ్యవస్థలన్నింటినీ ప్రభుత్వమే గుప్పెట్లో పెట్టుకోవడంతో పాతికేళ్లుగా వెనిజులాలో అధ్యక్ష ఎన్నికలు కూడా ఏకపక్షమే. 2018 ఎన్నికల్లోనైతే విపక్షాలన్నీ కట్టకట్టుకుని ఎన్నికలనే బహిష్కరించేంతగా ప్రభుత్వ అధికార దురి్వనియోగం శ్రుతి మించిపోయింది. దాంతో ప్రహసనప్రాయంగా సాగిన ఆ ఎన్నికల్లో అధ్యక్షుడు నికొలస్ మదురో తిరుగులేని మెజారిటీ సాధించి అధికారాన్ని నిలబెట్టుకున్నారు. అలాంటి వెనిజులాలో ఆరేళ్ల అనంతరం ఆదివారం మళ్లీ అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. కానీ పరిస్థితులు మాత్రం ఎప్పట్లా లేవు! విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి మదురోపై ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాయి. విపక్షాల ప్రచార సభలకు జనం విరగబడుతున్నారు. ఎన్నికల ప్రక్రియపై ఎప్పుడూ లేనంత ఆసక్తి, ఉత్సుకత వారిలో కనిపిస్తున్నాయి. దాంతో అంతర్జాతీయ సమాజం కూడా ఈసారి ఎన్నికలను అత్యంత ఆసక్తితో వీక్షిస్తోంది. ఇన్ని మార్పులకు కారణం ఒక్క మహిళ. ఒకే ఒక్క మహిళ. మదురోకు ముచ్చెమటలు పోయిస్తున్న ఆమే...విపక్ష నేత మరియా కొరీనా మచాడో. అనర్హత వేటేసినా... వెనిజులా అధ్యక్ష ఎన్నికల బరిలో 10 మంది ఉన్నారు. ప్రధాన పోటీ 61 ఏళ్ల మదురో, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఎడ్మండో గొంజాలెజ్ రూపంలో ఇద్దరి మధ్య కేంద్రీకృతమైంది. కానీ అసలు పోటీలోనే లేని 56 ఏళ్ల మచాడో పేరు మాత్రమే దేశమంతటా మారుమోగిపోతోంది! ఎన్నికల ప్రచారం పొడవునా ఆమే సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. అటు అధికార యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ ఆఫ్ వెనిజులా, ఇటు విపక్ష ‘యూనిటరీ ప్లాట్‌ఫాం’ కూటమి ప్రచారమంతా ఆమెనే కేంద్రంగా చేసుకుని సాగడం విశేషం. ముఖ్యంగా మదురో ప్రసంగాలన్నీ ఆద్యంతం మచాడోను విమర్శిస్తూనే సాగాయి. ఆమె ఎన్నికల పోటీకి దూరమైన వైనమూ ఆసక్తికరమే. విపక్ష అభ్యర్థిని తేల్చేందుకు గతేడాది జరిగిన ప్రైమరీలో దేశవ్యాప్తంగా జనం వెల్లువలా వచ్చి మచాడోకు ఓటేశారు. దాంతో ఆమె రికార్డు స్థాయిలో ఏకంగా 93 శాతం ఓట్లు సాధించారు. ఆ వెంటనే ప్రభుత్వం ఆమెపై అవినీతి ఆరోపణలు మోపి ఎన్నికల్లో పోటీకి అనర్హురాలిగా ప్రకటించింది. విపక్ష ప్రైమరీనే చట్టవిరుద్ధంగా ప్రకటించింది. మచాడో మద్దతుదారులైన నాయకులు, జర్నలిస్టులు, హక్కుల నేతలు తదితరులందరినీ జైలుపాలు చేసింది. ప్రభుత్వ గుప్పెట్లో ఉన్న సుప్రీంకోర్టు కూడా వేటునే సమరి్థంచింది. అయినా మచాడో వెనక్కు తగ్గకుండా పెద్ద జనాకర్షణ శక్తి లేని మాజీ దౌత్యవేత్త గొంజాలెజ్‌ను తనకు బదులుగా రేసులో దించారు. తనపై వేటునే అతి పెద్ద ప్రచారాస్త్రంగా మలచుకుని సుడిగాలి ప్రచారంతో హోరెత్తించారు. మదురో ప్రభుత్వ అవినీతి, అస్తవ్యస్త పాలనపై ఆమె విమర్శలకు ప్రజల నుంచి విపరీతమైన స్పందన లభించింది. దాంతో అందరి దృష్టీ ఆదివారం జరిగే పోలింగ్ మీదే కేంద్రీకృతమైంది. 40 లక్షల మంది ఓటర్లపై ‘వేటు’ వెనిజులా మొత్తం ఓటర్లే 2.1 కోట్లు. వారిలో 40 లక్షల మందికి పైగా విదేశాల్లో ఉన్నారు. మదురో పాలనపై వారిలో తీవ్ర అసంతృప్తి నెలకొన్న నేపథ్యంలో వారెవరూ ఓటేసే వీల్లేకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. లెక్కలేనన్ని కొత్త నిబంధనలు తేవడంతో ప్రవాసుల్లో 69 వేల మంది మాత్రమే ఓటింగ్‌కు అర్హత పొందారు! బస్సు డ్రైవర్ నుంచి అధికార పీఠం దాకా... నికొలస్ మదురో మోరోస్. ఒకప్పుడు సాదాసీదా బస్సు డ్రైవర్. అనంతరం కార్మిక సంఘాల నేతగా మారారు. మెల్లిగా రాజకీయంగా ఒక్కో మెట్టే ఎక్కుతూ అధ్యక్ష పీఠం దాకా ఎదిగారు. 2000లో నేషనల్ అసెంబ్లీకి ఎన్నికవడం మదురో కెరీర్లో కీలక మలుపు. వెనిజులా చరిత్రలో అత్యంత జనాకర్షక నేతగా పేరొందిన హ్యూగో చావెజ్ అభిమానం చూరగొనడంతో ఆయన దశ తిరిగింది. చావెజ్ హయాంలో నేషనల్ అసెంబ్లీ స్పీకర్‌గా, విదేశాంగ మంత్రిగా చేసి 2012లో దేశ ఉపాధ్యక్షుడయ్యారు. ఏడాదికే చావెజ్ క్యాన్సర్ బారిన పడ్డారు. 2013లో మదురోను తన తాత్కాలిక వారసునిగా ప్రకటించి మరణించారు. మదురో గద్దెనెక్కుతూనే అధ్యక్ష పదవికి తూతూ మంత్రంగా ప్రత్యేక ఎన్నికలు జరిపించి తనకు 50 శాతానికి పైగా ఓట్లొచ్చాయని ప్రకటించుకున్నారు. నాటినుంచి నేటిదాకా అధికారంలో కొనసాగుతున్నారు. ఆయన 11 ఏళ్ల పాలనలో దేశం అన్ని రంగాల్లోనూ కుప్పకూలిందంటూ జనం ఆగ్రహంగా ఉన్నారు. కొన్నేళ్లుగా మదురోపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత తీవ్రతరమవుతోంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
కమలా దేవి హారిస్ గెలవాలని తమిళనాడులో పూజలు
చెన్నై: అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తప్పుకోవడంతో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ఎవరనే ఉత్కంఠ నెలకొంది. ఈలోపు బైడెన్ భారతీయ మూలాలున్న ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పేరును ప్రతిపాదించారు. ప్రస్తుతం ఆమె డెమోక్రట్ల మద్దతును కూడగట్టుకునే పనిలో ఉన్నారు. అయితే.. కమలా హారిస్‌కు తమిళనాడుతో సంబంధం ఉంది. పైంగనాడు-తులసేంద్రపురం.. ఆమె తాతల ఊరు. ఈ గ్రామ ప్రజలు ఆమె అగ్రరాజ్యం అధ్యక్ష అభ్యర్థిగా బరిలో ఉండాలని కోరుకుంటున్నారు. సోమవారం ఆమె గెలుపు కోసం గ్రామంలోని ధర్మ శాస్తా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కమలా దేవి గెలిచేంతవరకు తమ పూజలు కొనసాగుతాయని చెబుతున్నారు. ‘‘అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పీవీ గోపాలన్ గారి మనవరాలు (కమలా హారిస్) ప్రెసిడెంట్ అభ్యర్థి బరిలో ఉంటటం చాలా ఆనందంగా ఉంది. ఆమె డొనాల్డ్ ట్రంప్‌పై విజయం సాధించాలని మేము గ్రామంలో ప్రత్యేక పూజలు చేశాం’’ అని ఓ గ్రామస్తుడు అంటున్నాడు. ‘‘ఈ ఆలయ పునరుద్ధరణ కోసం ఒక్కొక్కరు రూ. 5,000 విరాళం ఇచ్చిన వ్యక్తుల జాబితాలో కమలా హ్యారిస్ మామ బాలచంద్రన్ గోపాలన్ ఉన్నారు. ఆలయం మేనేజ్మెంట్ వారికి తరచూ విభూతి, కుంకుమ పంపిస్తుంది. ఆలయంలో జరిగే కార్యక్రమాలకు వారిని ఆహ్వానిస్తాం. వారు ఇక్కడి నుంచి మరో ప్రాంతానికి వెళ్లినప్పటికీ ఈ గ్రామంతో సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఆలయం పునరుద్ధరణకు విరాళం ఇచ్చారు. ఆలయం కార్యక్రమాలకు హాజరవుతారు’’అని గ్రామస్తులు తెలిపారు.చెన్నైకి 350 కిలోమీట్లర్ల దూరంలో ఉన్న ఈ గ్రామ ప్రజలు.. 2020లో కమలా అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైనప్పుడు కూడా సంబరాలు చేసుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, పలు కార్యక్రమాలు నిర్వహించారు. -
అమెరికా అధ్యక్ష రేసు నుంచి బైడెన్ ఔట్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది. అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తాను వైదొలుగుతున్నానని డెమొక్రటిక్ పార్టీ నేత, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం రాత్రి (భారత కాలమాన ప్రకారం) ‘ఎక్స్’ ఖాతాలో ఒక లేఖను పోస్టు చేశారు. దేశ ప్రయోజనాల కోసం, తమ పార్టీ ప్రయోజనాల కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తేల్చిచెప్పారు. గత మూడున్నరేళ్లలో ఒక దేశంగా మనం గొప్ప ముందడుగు వేశామని అమెరికా ప్రజలను ఉద్దేశించి పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచంలో అమెరికా అత్యంత శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థగా మారిందన్నారు. ఎన్నో ఘనతలు సాధించామని తెలిపారు. అమెరికా అధ్యక్షుడిగా ప్రజలకు ఇప్పటిదాకా సేవలందించడం అతి గొప్ప గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. మరోసారి పోటీ చేయాలన్న ఆలోచన లేదని, అధ్యక్షుడిగా మిగిలిన పదవీ కాలంలో పూర్తి చేయాల్సిన బాధ్యతలపై దృష్టి పెడతానని పేర్కొన్నారు. వచ్చే వారం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తానని, తన నిర్ణయాన్ని పూర్తిగా తెలియజేస్తానని వెల్లడించారు. ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌కు బైడెన్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఆమె అసాధారణమైన భాగస్వామి అని ప్రశంసల వర్షం కురిపించారు. అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా భారతీయ అమెరికన్ మహిళ కమలా హ్యారిస్ అభ్యర్థిత్వాన్ని బైడెన్ బలపరిచారు. ఇదిలా ఉండగా ఎన్నికల్లో ట్రంప్‌ను ఓడించటానికి అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. ఎన్నికల్లో పోటీ చేయడం తథ్యమని ఇన్నాళ్లూ చెబుతూ వచ్చిన బైడెన్ అనూహ్యంగా వైదొలగడం చర్చనీయాంశంగా మారింది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌తో గత నెలలో జరిగిన డిబేట్లో బైడెన్ తడబడిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా వయసు కారణంగా మతిమరుపు సమస్యను ఎదుర్కొంటున్నారు. దీంతో ఎన్నికల పోటీ నుంచి తప్పుకోవాలంటూ బైడెన్‌పై సొంత పార్టీ నాయకులు ఒత్తిడి పెంచారు. అందుకే ఆయ న ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముంచిన డిబేట్ సీఎన్ఎన్ ఛానల్ వేదికగా జూన్ 27న డొనాల్డ్ ట్రంప్– జో బైడెన్ల మధ్య తొలి అధ్యక్ష చర్చ జరిగింది. ఈ చర్చలో బైడెన్ పదేపదే తడబడటం, మాటల కోసం తడుముకోవడం, మతిమరుపుతో పేలవ ప్రదర్శన కనబరిచారు. దాంతో 81 ఏళ్ల బైడెన్ మానసిక ఆరోగ్యంపై అమెరికన్లలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. సొంత డెమొక్రాటిక్ పార్టీలోనూ ఆయన సామర్థ్యంపై సందేహాలు తీవ్రమయ్యాయి. ట్రంప్‌ను బైడెన్ ఓడించలేడనే బలమైన అభిప్రాయం పారీ్టలో నెలకొంది. ప్రతినిధుల సభ మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీ... బైడెన్‌తో మాట్లాడుతూ డెమొక్రాటిక్ పార్టీ ప్రయోజనాల దృష్ట్యా అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవడమే మేలని కుండబద్ధలు కొట్టారు. ప్రతినిధుల సభ, సెనేట్లలోనూ డెమొక్రాట్లకు అపజయాలు ఎదురవుతాయని హెచ్చరించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సైతం పలువురు డెమొక్రాటిక్ కీలక నాయకులతో ప్రైవేటు సంభాషణల్లో బైడెన్ వైదొలిగితేనే ట్రంప్‌ను ఓడించే అవకాశాలుంటాయని చెప్పారు. ఐదుగురు చట్టసభ సభ్యులు బైడెన్ వైదొలగాలని బాహటంగానే డిమాండ్ చేశారు. దీర్ఘకాలంగా డెమొక్రాటిక్ పారీ్టకి విరాళాలు ఇస్తున్న దాతలు.. బైడెన్ తప్పుకోవాలని షరతు పెడుతూ విరాళాలను నిలిపివేశారు. దాంతో నాన్సీ పెలోసీ రంగంలోకి దిగి తెరవెనుక పెద్ద ఎత్తున లాబీయింగ్ చేశారు. బైడెన్ శిబిరానికి వాస్తవాన్ని తెలియజెప్పారు. అన్నివైపులా నుంచి ఒత్తిడి పెరిగిపోవడంతో కోవిడ్‌తో డెలావెర్‌లోని స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్న బైడెన్ ఆదివారం అర్ధరాత్రి (భారత కాలమానం ప్రకారం) అధ్యక్ష రేసు నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఇప్పుడేంటి? ఓపెన్ కన్వెన్షన్.. కమలకు ఛాన్స్ బైడెన్ అధ్యక్ష రేసు నుంచి వైదొలగడంతో నవంబరు 5 జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి ఎవరవుతారనే ఆసక్తి నెలకొంది. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు మొగ్గు కనపడుతున్నా.. పార్టీ నిబంధనావళి ప్రకారం ఓపెన్ కన్వెన్షన్ (ఎవరైనా పోటీపడవచ్చు) జరుగుతుంది. డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యరి్థని ఎన్నుకోవడానికి రాష్ట్రాల వారీగా నిర్వహించిన ప్రైమరీల్లో బైడెన్ తిరుగులేని మెజారిటీని కూడగట్టుకున్నారు. 4,000 పైచిలుకు డెలిగేట్లలో 3,900 మంది డెలిగేట్లను బైడెన్ గెల్చుకున్నారు. నిబంధనల ప్రకారం ఆగస్టులో అధ్యక్ష అభ్యరి్థని ఖరారు చేయడానికి జరిగే జాతీయ కన్వెన్షన్‌లో వీరిందరూ బైడెన్‌కు బద్ధులై ఉండాలి. ఇప్పుడాయనే స్వయంగా రేసు నుంచి వైదొలిగారు కాబట్టి.. డెమొక్రాటిక్ టికెట్ కోసం పార్టీ సభ్యులెవరైనా పోటీపడొచ్చు. దీన్నే ఓపెన్ కన్వెన్షన్ అంటారు. కమలా హారిస్‌కు అవకాశాలు మెరుగ్గా ఉన్నా.. డెమొక్రాటిక్ పార్టీలోని ముఖ్యనేతలైన కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్, మిషిగాన్ గవర్నర్ గ్రెట్చెన్ విట్మర్‌లు ఆమెకు ప్రధాన పోటీదారులుగా ఉంటారని భావిస్తున్నారు. నామినేషన్ జాబితాలో పేరు లేనప్పటికీ డెలిగేట్లు తమకు నచి్చన అభ్యరి్థకి ఓటు వేసే వీలు కూడా ఉంది. నాలుగు వేల పైచిలుకు డెలిగేట్లు ఆగస్టులో తమ తదుపరి అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకుంటారు. తొలిరౌండ్లో ఫలితం తేలకపోతే 700 మంది సూపర్ డెలిగేట్లను ఓటు వేయడానికి అనుమతిస్తారు. డెమొక్రాటిక్ నామినీ ఎన్నికయ్యేదాకా ఓటింగ్ కొనసాగుతుంది. ముమ్మర లాబీయింగ్, తెరవెనుక మంత్రాంగాలు జరగడం ఖాయం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కమలా హారిస్ ‘అబద్ధం’పై మస్క్ సెటైర్
అమెరికా ఉపాధ్యక్షురాలు, భారతీయ సంతతికి చెందిన కమలా హారిస్‌పై ప్రపంచ టాప్ బిలీయనీర్ ఎలన్ మస్క్ ఎక్స్ వేదికగా విరుచుకుపడ్డారు. ట్రంప్ గనుక అధికారంలోకి వస్తే.. దేశవ్యాప్తంగా అబార్షన్లపై నిషేధం విధిస్తారంటూ ఆమె ట్వీట్ చేశారు. అయితే అది అబద్ధం కావడం.. ఎక్స్ సైతం కమ్యూనిటీ నోట్ ఇవ్వడంతో మస్క్ సెటైర్ సంధించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో గర్భవిచ్ఛిత్తి(అబార్షన్) కీలకాంశంగా మారింది. బైడెన్ నేతృత్వంలోని డెమోక్రాట్లు నిషేధాన్ని వ్యతిరేకిస్తున్నారు. ట్రంప్ నాయకత్వంలోని రిపబ్లికన్లు మాత్రం కొన్ని పరిమితులు ఉండాలని వాదిస్తున్నారు. అయితే అధ్యక్ష బరిలో రిపబ్లికన్ పార్టీ తరఫు అభ్యర్థి ట్రంప్ గనుక గెలిస్తే.. అమెరికా వ్యాప్తంగా అబార్షన్ రద్దు చేస్తారు అని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా హారిస్ పోస్ట్ చేశారు. Donald Trump would ban abortion nationwide.President @JoeBiden and I will do everything in our power to stop him and restore women's reproductive freedom.— Kamala Harris (@KamalaHarris) June 30, 2024 అయితే ఆమె పోస్టుకి వెంటనే ఎక్స్ ‘కమ్యూనిటీ నోట్’ ఇచ్చింది(ఫ్యాక్ట్ చెక్ టైప్ ఫీచర్). అబార్షన్ చట్టంపై తాను సంతకం చేయబోనని ట్రంప్ పదే పదే చెప్పారు అని ఆ నోట్ పేర్కొంది. దీంతో వెంటనే ఎక్స్ ఓనర్ ఎలాన్ మస్క్ స్పందించారు. రాజకీయ నాయకులైతేనేం.. వాళ్ల సోషల్ మీడియా అకౌంట్లను నడిపేవాళ్లు అయితేనేం.. ఇలాంటి మాధ్యమాల్లో అబద్ధాలు ఇక మీదట పని చేయవని ఎప్పటికి గుర్తిస్తారో అంటూ పోస్ట్ చేశాడు. అంతేకాదు.. కమ్యూనిటీ నోట్ వచ్చిన హారిస్ పోస్టును స్క్రీన్ షాట్ ఉంచారాయన. అక్కడితో ఆగకుండా ఆమె పోస్టుకు సైతం ఆయన కామెంట్ చేశాడు.When will politicians, or at least the intern who runs their account, learn that lying on this platform doesn’t work anymore? pic.twitter.com/wP7H4AJFwG— Elon Musk (@elonmusk) July 1, 2024 ఇదిలా ఉంటే.. అబార్షన్‌ను నిషేధించే ఉద్దేశం తనకు లేదంటూ గత వారం అట్లాంటాలో బైడెన్‌తో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల బిగ్ డిబేట్లోనూ ట్రంప్ స్పష్టం చేశారు. మరోవైపు ఎక్స్ కమ్యూనిటీ ఫీచర్‌ను గత కొంతకాలంగా మస్క్ పొడుగుతూ వస్తుండడం చూస్తున్నాం. కమ్యూనిటీ నోట్ ఫీచర్ అనేది.. పరోక్షంగా ఇది తప్పుదోవ పట్టించే పోస్ట్ కావొచ్చని.. నిజనిర్ధారణ చేసుకోవాలని యూజర్‌కు సూచిస్తుంది. అలాగే.. యూజర్లు ఆ పోస్టులో ఆ నోట్ ద్వారా అభిప్రాయాలు వ్యక్తంచేసి తప్పేంటో చెప్పే అవకాశమూ ఉంటుంది. -
Presidential Debate: ట్రంప్ జోరు బైడెన్ బేజారు
అట్లాంటా: అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో రిపబ్లికన్ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (78) దూకుడు పెంచారు. దేశాధ్యక్షుడు, డెమొక్రాట్ల అభ్యర్థి జో బైడెన్‌తో తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్లో స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించారు. శుక్రవారం (భారత కాలమానం ప్రకారం) సీఎన్ఎన్ చానల్లో దాదాపు 90 నిమిషాల పాటు జరిగిన వాదనలో బైడెన్ సర్వశక్తులూ ఒడ్డారు. తన వయసుపై విమర్శలు, అధ్యక్ష బాధ్యతలను సజావుగా నిర్వర్తించడంపై అమెరికన్లలో నానాటికీ పెరుగుతున్న అనుమానాలను కొట్టిపారేసేందుకు అన్ని ప్రయత్నాలూ చేశారు. ట్రంప్ తనకంటే కేవలం మూడేళ్లే చిన్నవాడని పదేపదే చెప్పుకున్నారు. కానీ డిబేట్ పొడవునా బైడెన్ పదేపదే తడబడ్డారు. ప్రసంగం మధ్యలో ఉన్నట్టుండి మౌనాన్ని ఆశ్రయించారు. మాటల కోసం తడుముకున్నారు. తనలో తానే గొణుక్కుంటూ కన్పించారు. మాట్లాడుతున్న అంశాన్ని అర్ధంతరంగా వదిలేసి మరో విషయం ఎత్తుకుని ఆశ్చర్యపరిచారు. కొన్నిసార్లు బైడెన్ ఏం చెప్తున్నదీ ఎవరికీ అర్థం కూడా కాలేదు. పలు అంశాలపై ట్రంప్ పచ్చి అబద్ధాలు చెప్పినా వాటిని ఎత్తిచూపడంలో, సొమ్ము చేసుకోవడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారు. తనకు అనుకూలమైన గణాంకాలను సమయానుకూలంగా ప్రస్తావించడంలో కూడా చతికిలపడ్డారు. డిబేట్లో ట్రంపే నెగ్గారని సీఎన్ఎన్ పోలింగ్‌లో ఏకంగా 67 శాతం మంది ఓటర్లు పేర్కొన్నారు. బైడెన్‌కు 33 శాతం ఓట్లే లభించాయి. న్యూయార్క్ టైమ్స్ వంటి ప్రఖ్యాత వార్తా పత్రికలు కూడా తొలి డిబేట్ ట్రంప్‌దేనని పేర్కొన్నాయి. ‘‘బైడెన్‌పై వయోభారం కొట్టొచ్చినట్టు కని్పస్తోంది. ఆయన మాటతీరులోనూ అది స్పష్టంగా ప్రతిఫలించింది. ఆయన చెబుతున్న విషయాల్లో పొందికే లేకుండా పోయింది’’ అంటూ విమర్శలు గుప్పించాయి. దూకుడుకు మారుపేరైన ట్రంప్‌కు 81 ఏళ్ల బైడెన్ ఏ మేరకు పోటీ ఇవ్వగలరోనంటూ డెమొక్రాట్లలో ఇప్పటికే గట్టిగా ఉన్న అనుమానాలు కాస్తా తాజా డిబేట్ నేపథ్యంలో ఆందోళనగా మారాయి. వాదనలో బైడెన్ తొలుత కాస్త వెనకబడ్డారని ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కూడా అంగీకరించారు. అయితే క్రమంగా పుంజుకుని సమర్థంగా ముగించారని చెప్పుకొచ్చారు. బైడెన్ భార్య జిల్ మాత్రం తన భర్త భలే బాగా మాట్లాడారంటూ ప్రశంసించారు! ‘‘ప్రతి ప్రశ్నకూ చక్కగా బదులిచ్చావు. అన్ని సమాధానాలూ తెలుసు నీకు!’’ అంటూ ఆయన్ను మెచ్చుకున్నారు. కానీ ఈ డిబేట్ నేపథ్యంలో బైడెన్ అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలంటున్న వారి సంఖ్య డెమొక్రాట్లలో క్రమంగా పెరుగుతోంది. ట్రంప్, బైడెన్‌లను అధ్యక్ష అభ్యర్థులుగా ఇంకా లాంఛనంగా ప్రకటించాల్సి ఉంది. జూలై 15–18 మధ్య జరిగే సదస్సులో రిపబ్లికన్లు, ఆగస్టు 19న సదస్సులో డెమొక్రాట్లు తమ అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటిస్తారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5న జరగనున్నాయి. పరస్పర విమర్శల వర్షం... అమెరికా ఆర్థిక వ్యవస్థ, అబార్షన్ చట్టం, విదేశీ వ్యవహారాలు, వలసల వంటి పలు అంశాలపై ట్రంప్, బైడెన్ మధ్య వాడివేడి వాదనలు సాగాయి. ఆ క్రమంలో నేతలిద్దరూ తిట్ల పర్వానికి దిగారు. ‘‘నువ్వే అబద్ధాలకోరు. అమెరికా చరిత్రలోనే అత్యంత చెత్త ప్రెసిడెంట్ కూడా నువ్వే’’ అంటూ పరస్పరం దుయ్యబట్టుకున్నారు. పలు రకాల విమర్శలు చేసుకున్నారు. హష్ మనీ కేసు దోషి అంటూ ట్రంప్‌కు బైడెన్ చురకలు వేశారు. ‘‘జరిమానాలుగా నువ్వు ఎన్ని బిలియన్ డాలర్లు కట్టాలో గుర్తుందా? భార్య గర్భవతిగా ఉండగా నీలి చిత్రాల తారతో గడిపావు. నైతికత విషయంలో వీధుల్లో విచ్చలవిడిగా తిరిగే పిల్లి కంటే కూడా హీనం’’ అంటూ విమర్శల వర్షం కురిపించారు. బైడెన్‌తో పాటు ఆయన కుమారుడు హంటర్ కూడా క్రిమినలేనంటూ మాజీ అధ్యక్షుడు ట్రంప్ కూడా విరుచుకుపడ్డారు. అస్తవ్యస్తమైన వలసల విధానంతో దేశ భవితవ్యాన్నే బైడెన్ ప్రమాదంలోకి నెట్టారంటూ దుయ్యబట్టారు. డిబేట్ ఆరంభం నుంచే ట్రంప్ పై చేయి కనబరిచారు. ఆయనను ఇరుకున పెట్టేందుకు బైడెన్ చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. -
నేడే బైడెన్, ట్రంప్ బిగ్ డిబేట్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బరిలో నిలిచిన రాజకీయ ప్రత్యర్థులు జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ ప్రత్యక్ష చర్చా కార్యక్రమానికి సిద్ధమవుతున్నారు. ఇరువురు నేతలు గురువారం జరిగే ముఖాముఖి డిబేట్లో పాల్గొంటారు. బైడెన్, ట్రంప్ గత ఎన్నికల్లో పరస్పరం పోటీపడిన సంగతి తెలిసిందే. ఈసారి వారిద్దరూ మళ్లీ పోటీ చేస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల ముందు అభ్యర్థుల మధ్య ఆనవాయితీగా జరిగే డిబేట్ గురువారం జరుగనుంది. -
Iran Presidential Election 2024: ఖమేనీ కనుసన్నల్లో... ఇరాన్లో ఎన్నికలకు వేళాయె
అగ్ర రాజ్యాల ఆంక్షలు. నానాటికీ దిగజారుతున్న ఆర్థిక పరిస్థితి. హక్కుల కోసం రోడ్డెక్కుతున్న మహిళలు. కరడుగట్టిన మతవాద పాలనపై యువతలోనే గాక సర్వత్రా తీవ్రతరమవుతున్న అసంతృప్తి. ఇన్ని గడ్డు సమస్యల నడుమ ఇరాన్లో అధ్యక్ష ఎన్నికలకు వేళైంది. మూడున్నర దశాబ్దాలుగా ఇరాన్‌ను ఏకఛత్రంగా పాలిస్తున్న సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ అభీష్టానుసారం ఎంపికైన ఆరుగురు అభ్యర్థులు రేసులో ఉన్నారు. వారిలో ఖమేనీ వీర విధేయుడే పీఠమెక్కడం లాంఛనమే కానుంది. జనాల్లో ఇప్పటికీ తిరుగులేని ఆదరణ ఉన్న మాజీ అధ్యక్షుడు అహ్మదీనెజాద్ తదితరుల అభ్యరి్థత్వాన్ని తిరస్కరించడం ద్వారా జనాకర్షక నేతలెవరూ పోటీలో ఉండకుండా సలక జాగ్రత్తలూ తీసుకున్నారు. దాంతో ఎప్పట్లాగే ఈసారి కూడా ఇరానీలు అధ్యక్ష ఎన్నికలపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఈ పరిస్థితిని ఊహించే ఆరుగురిలో డాక్టర్ మసూద్ పెజెష్కియాన్ రూపంలో ఒక సంస్కరణలవాదిని ఎంపిక చేశారు. ఆయన్ను చూసి జనాలు ఎంతో కొంత పోలింగ్ బూత్‌లకు వస్తారని ఆశిస్తున్నారు. అంతిమంగా విజేత మాత్రం మిగతా ఐదుగురు కరడుగట్టిన మతవాదుల్లోంచే ఒకరు కానున్నారు. అది ఎవరన్నది జూన్ 28న జరిగే పోలింగ్‌లో తేలనుంది. ప్రభుత్వంపై విమర్శలే ప్రచారా్రస్తాలు అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ గత మే 19న హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలవడంతో ఇరాన్లో ఏడాది ముందుగానే ఎన్నికలు అనివార్యమయ్యాయి. ప్రధాని పదవిని రద్దు చేస్తూ, అధ్యక్ష పదవి స్థాయిని పెంచుతూ 1998లో రాజ్యంగ సంస్కరణలు చేసిన అనంతరం దేశంలో ముందస్తు ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి. ఎన్నడూ లేని విధంగా అభ్యర్థులంతా ఈసారి ప్రభుత్వంపై నేరుగా విమర్శలు ఎక్కుపెడుతుండటం విశేషం. దేశ ఆర్థిక దుస్థితికి ప్రభుత్వ తప్పుడు విధానాలే కారణమని వారంతా బాహాటంగా తప్పుబడుతున్నారు. ఇదంతా ప్రజలను పోలింగ్ బూత్‌కు రప్పించేందుకు ఖమేనీ చేస్తున్న ప్రయత్నాల్లో భాగమేనని చెబుతున్నారు. ఇరాన్లో అధ్యక్ష ఎన్నికలు స్వేచ్ఛ గా, పారదర్శకంగా జరిగిన దాఖలాలు లేవని అంతర్జాతీయ నిపుణులతో పాటు ఇరాన్ మేధావులు కూడా అంటుంటారు. ఎన్నికల ఫలితాలను ఖమేనీ పూర్తిగా నిర్దేశించడమే గాక తనకు అనుకూలంగా మార్చేస్తారన్నది సర్వత్రా ఉన్న అభిప్రాయం. ఎన్నిక ఇలా... ఇరాన్ అధ్యక్షున్ని ప్రత్యక్ష ఓటింగ్ పద్ధతిన ఎన్నుకుంటారు. పదవీకాలం నాలుగేళ్లు. పూర్తి అధికారాలు సుప్రీం లీడర్ ఖమేనీవే అయినా అధ్యక్షునికి కూడా పలు కీలక దేశీయ విధాన నిర్ణయాలతో పాటు కొంతమేరకు విదేశాంగ విధానంపై కూడా చెప్పుకోదగ్గ అధికారాలుంటాయి. 12 మంది మత పెద్దలు తదితరులతో కూడిన గవరి్నంగ్ కౌన్సిల్ ఖమేనీ నిర్దేశాలకు లోబడి అధ్యక్ష అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. ఈసారి 80 దరఖాస్తులను వడపోసి ఆరుగురిని మాత్రం పోటీకి అనుమతించింది. తన ఆధిపత్యానికి సవాలుగా మారతారనుకున్న వారెవరికీ అవకాశం దక్కకుండా ఖమేనీ అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. ఆ క్రమంలోనే బాగా జనాకర్షణ ఉన్న మాజీ అధ్యక్షుడు నెజాద్తో పాటు మూడుసార్లు పార్లమెంట్ స్పీకర్‌గా చేసిన అలీ లారిజానీ అభ్యర్థిత్వం కూడా తిరస్కరణకు గురైంది. తిరస్కృత జాబితాలో ఏడుగురు మహిళలు కూడా ఉన్నారు! జూన్ 28న ఓటింగ్ జరగనుంది. 30కల్లా ఫలితాలు వెలువడే అవకాశముంది. ఎవరికీ 50 శాతానికి మించి ఓట్లు రాని పక్షంలో తొలి రెండు స్థానాల్లో నిలిచే అభ్యర్థుల మధ్య తిరిగి ఎన్నిక జరుగుతుంది. ఆ ఆరుగురుమసూద్ పెజెష్కియాన్ గట్టి సంస్కరణలవాది. దేశ ఆరోగ్య మంత్రిగా చేశారు. విద్యావంతునిగా మంచి పేరే ఉంది. మితిమీరుతున్న మతవాదంపై ప్రజల్లో ప్రబలుతున్న అసంతృప్తిని చల్లార్చేందుకే ఈయనను అభ్యర్థుల జాబితాలో చేర్చినట్టు చెబుతున్నారు. 2008 నుంచీ పార్లమెంటు సభ్యుడు. అందరికీ ఆయోదమోగ్యమైన కొత్త ముఖం మేలని ఖమేనీ భావిస్తే తప్ప మసూద్‌కు అవకాశాలు తక్కువేనని విశ్లేషకులు అంటున్నారు.అలీ రజా జకానీ టెహ్రాన్ మేయర్. గతంలో పలు ఉన్నత పదవులు నిర్వహించారు. పబ్లిక్ పార్కుల్లో మసీదు నిర్మాణాన్ని మద్దతిచ్చి విమర్శలకు గురయ్యారు. 2021లో కూడా అధ్యక్ష పదవికి పోటీ పడ్డా పెద్దగా ఓట్లు సాధించలేదు. ఈసారి కూడా జకానీ పేరు గట్టి పోటీదారుగా పెద్దగా పరిగణనలో లేదు. కాకపోతే ఖమేనీకి వీర విధేయుడు.జనరల్ మహమ్మద్ బఖర్ గలీబాఫ్ పార్లమెంట్ స్పీకర్. రాజధాని టెహ్రాన్ మేయర్‌గా, సైనిక విభాగమైన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ కుమాండర్గా, దేశ పోలీస్ చీఫ్‌గా చేసిన అనుభవముంది. పైగా ఖమేనీకి అత్యంత సన్నిహితుడు కూడా. ఆయనతో బంధుత్వమూ ఉందంటారు. దాంతో గలీబాఫ్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు పరిశీలకులు భావిస్తున్నారు. సైన్యంలోని కీలక అధికారుల మద్దతు అదనపు బలం కానుంది. కాకపోతే ఆయనపై లెక్కలేనన్ని అవినీతి ఆరోపణలున్నాయి. పైగా గతంలో రెండుసార్లు అధ్యక్ష పదవికి పోటీ పడి ఓడారు. సయీద్ జలిలీ మాజీ చీఫ్ న్యూక్లియర్ నెగోíÙయేటర్. ఇరాన్–ఇరాక్ యుద్ధంలో కాళ్లు పోగొట్టుకున్నా రు. యుద్ధవీరునిగా దేశమంతటా కాస్తో కూస్తో పేరున్న నేతే. ఈయనకూ ఖమేనీ ఆశీర్వాదముందని చెబుతారు. దాంతో జలిలీ అవకాశాలకు గండి కొట్టేందుకు గలీబాఫ్ శాయశక్తులా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. దీనికి తోడు జనాదరణ విషయంలో మరో అహ్మదీనెజాద్లా ఎదిగే సత్తా ఉండటం కూడా జలిలీ అవకాశాలకు గండి కొట్టవచ్చని పరిశీలకుల అభిప్రాయం. ముస్తాఫా పోర్ మొహమ్మదీ రేసులో ఉన్న ఆరుగురిలో ఏకైక మతాధికారి కావడం ఈయనకు కలిసొచ్చే అంశం. పైగా 85 ఏళ్ల ఖమేనీ తన వారసుని ఎంపికపై గట్టిగా దృష్టి సారించారు. కుమారుడు కుమారుడు ముజ్తబాకు పగ్గాలు అప్పగించాలని భావిస్తున్నారు. ఈ సమయంలో అధ్యక్ష పదవిలో మత పెద్ద ఉండటం మేలని ఖమేనీ భావించే పక్షంలో మొహమ్మదీకి చాన్సుంటుందని చెబుతున్నారు. కాకపోతే సుప్రీం లీడర్ పదవి కోసం ముజ్తబాతో పోటీ పడే సత్తా ఉండటం మొహమ్మదీకి ప్రతికూలంగా మారవచ్చు. ఆమిర్ హొసేన్ గజీజాదే హషేమీ ప్రస్తుతం 12 మంది దేశ ఉపాధ్యక్షుల్లో ఒకరు. రిటైరైన సైనికులు, యుద్ధాల్లో మరణించిన సైనికుల కుటుంబాల సంక్షేమ బాధ్యతలు చూస్తున్నారు. దాంతో ఆయా వర్గాల్లో మంచి ఆదరణే ఉంది. కాకపోతే ఈయనకు కూడా ఈసారి అవకాశం ఉండకపోవచ్చని చెబుతున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
USA Presidential Elections 2024: బైడెన్, ట్రంప్ రె‘ఢీ’
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఇరు పారీ్టల అభ్యర్థులు వాదనలతో ఎదురెదురుగా బలాబలాలు తేల్చుకునే ‘చర్చల’ అంకానికి డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తెరలేపారు. సీఎన్ఎన్ టీవీ ఛానల్లో జూన్ 27వ తేదీన, ఏబీసీ ఛానల్లో సెప్టెంబర్ పదో తేదీన ఈ డిబేట్లు ఉంటాయి. మూడు దశాబ్దాలుగా డిబేట్లు నిర్వహించే ‘కమిషన్ ఆన్ ప్రెసిడెన్షియల్ డిబేట్’ను కాదని ఈసారి మీడియాసంస్థల ఆధ్వర్యంలో టీవీ ఛానళ్లలో డిబేట్‌కు బైడెన్ ప్రచార బృందం ఓకే చెప్పింది. ‘‘అట్లాంటా స్టూడియోలో ఈ డిబేట్‌ను నిర్వహిస్తాం’ అని సీఎన్ఎన్ తెలిపింది. జనం మధ్యలో డిబేట్ జరిపితే బాగుంటుందని ట్రంప్ అన్నారు. -
USA presidential election 2024: ఒపీనియన్ పోల్‌లో ట్రంప్ ముందంజ
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో ఈ ఏడాది నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో విజయం ఎవరిదన్న దానిపై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ ఏర్పడింది. మాజీ ప్రత్యర్థులు డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ మళ్లీ పోటీ పడుతున్నారు. గెలుపుపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజల అభిప్రాయం ఏమిటన్నదానిపై వాల్‌స్ట్రీట్ జర్నల్ పత్రిక ఓపీనియన్ పోల్ నిర్వహించింది. ఏడు కీలక రాష్ట్రాల్లో సర్వే చేయగా, ఏకంగా ఆరు రాష్ట్రాల్లో ట్రంప్ వైపు మొగ్గు కనిపించింది. తదుపరి అధ్యక్షుడిగా ట్రంప్‌ను ఎన్నుకోవడానికి ప్రజలు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ విధానాల పట్ల జనం అసంతృప్తిగా ఉన్నట్లు సర్వేలో వెల్లడయ్యింది. -
రష్యాతో నాటో ఘర్షణకు దిగితే... మూడో ప్రపంచ యుద్ధమే
మాస్కో: రష్యా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మరుక్షణమే వ్లాదిమిర్ పుతిన్ పశ్చిమ దేశాలకు యుద్ధ హెచ్చరికలు పంపారు. ‘‘అమెరికా సారథ్యంలోని నాటో కూటమి, రష్యా సైన్యం మధ్య ప్రత్యక్ష ఘర్షణలు జరిగితే మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది. ఆధునిక ప్రపంచంలో ఏదైనా సాధ్యమే. కానీ అంతటి దారుణ విపత్తును ఎవరూ కోరుకోరు’’ అన్నారు. ఉక్రెయిన్ సైన్యానికి తోడుగా కదనరంగంలోకి ఫ్రాన్స్ బలగాలను దింపే ఉద్దేశముందన్న ఆ దేశ అధ్యక్షుడు మేక్రాన్ వ్యాఖ్యలపై పుతిన్ ఇలా స్పందించారు. ‘‘ఉక్రెయిన్ యుద్ధంలో వందలాది ఇంగ్లిష్, ఫ్రెంచ్ సైనికులు చనిపోయారు. ఇది సరికాదు’’ అన్నారు. చర్చలకు సదా సిద్ధం ఉక్రెయిన్ సైన్యం దాడులు ఇలాగే కొనసాగితే దాని చుట్టూ ఒక బఫర్ జోన్‌ను సృష్టిస్తామని పుతిన్ అన్నారు. ‘‘దాన్ని దాటి వైరి సైన్యం రష్యా భూభాగంలోకి అడుగుపెట్టడం అసాధ్యం. పూర్తిగా ఓటమి పాలయ్యేలోపు శాంతి బాట పట్టడం ఉత్తమం. చర్చలకు సిద్ధమని మేం మొదట్నుంచీ చెబుతున్నాం’’ అన్నారు. రష్యా అధ్యక్ష ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగలేదన్న అమెరికా, పశ్చిమ దేశాల వాదనను పుతిన్ కొట్టిపారేశారు. అమెరికాలోనే ఎన్నికలు సజావుగా జరగడం లేదని విమర్శించారు. ట్రంప్‌కు వ్యతిరేకంగా అధ్యక్షుడు బైడెన్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. 2030 దాకా అధ్యక్ష పీఠంపై రష్యా రాజకీయ వ్యవస్థపై పుతిన్ పట్టు మరోసారి రుజువైంది. అధ్యక్ష ఎన్నికల్లో ఆయన ఘనవిజయం సాధించారు. పోలైన ఓట్లలో 87.29 శాతం (7.6 కోట్ల) ఓట్లు ఆయనకు పడ్డట్టు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సోమవారం ప్రకటించింది. పుతిన్‌కు ఇన్ని ఓట్లు రావడం ఇదే తొలిసారి. ఆరేళ్లపాటు, అంటే 2030 దాకా పుతిన్ అధ్యక్షునిగా కొనసాగుతారు. ఆయనకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఇరుదేశాల భాగస్వామ్యం మరింత సుధృఢంకావాలని అభిలషించారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ఉత్తరకొరియా పాలకుడు కిమ్, హోండురాస్, నికరాగ్వా, వెనిజులా, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాధినేతలూ పుతిన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. పశ్చిమదేశాలు మాత్రం ఈ ఎన్నికలు పెద్ద మోసమని విమర్శించాయి. నవాల్నీని వదిలేద్దామనుకున్నాం.. దివంగత విపక్ష నేత అలెక్సీ నవాల్నీ ప్రస్తావనను పుతిన్ తొలిసారిగా బహిరంగంగా తెచ్చారు. ‘‘ఖైదీల మార్పిడిలో భాగంగా నవాల్నీని విదేశాలకు అప్పగించి పశ్చిమదేశాల జైళ్ల నుంచి రష్యన్లను వెనక్కు తెద్దామని మా అధికారుల సలహాకు వెంటనే ఒప్పుకున్నా. ఆ లోపే ఆయన జైల్లో చనిపోయారు. కొన్ని అలా జరుగుతాయంతే. ఇదే జీవితం’’ అన్నారు. -
USA presidential election 2024: రేసు నుంచి నిక్కీ హేలీ ఔట్
వాషింగ్టన్: మంగళవారం ఒకేసారి 15 రాష్ట్రాల్లో జరిగిన రిపబ్లికన్ పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన నేపథ్యంలో పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం రేసు నుంచి తప్పుకుంటున్నట్లు భారతీయ మూలాలున్న నాయకురాలు నిక్కీ హేలీ బుధవారం ప్రకటించారు. వెర్మాంట్‌లో గెలుపు కాస్తంత ఊరటనిచి్చనా మిగతా అన్ని చోట్ల ఎదురైనా ప్రతికూల ఫలితాలను బేరేజు వేసుకుని ఆమె ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఫలితాల తర్వాత సౌత్ కరోలీనాలో ఆమె మాట్లాడారు. ‘‘నా ప్రచారానికి అర్ధంతరంగా ముగింపు పలకాల్సిన సమయం వచ్చేసింది. అమెరికన్ల గొంతుక గట్టిగా వినిపించాలని భావించా. నా శక్తిమేరకు నేను కృషి చేశా. అనుకున్న కార్యాన్ని పూర్తిచేయలేకపోయా. ఇందులో చింతించాల్సింది ఏమీ లేదు. రేసులో నేను ఉండకపోవచ్చుకానీ నేను నమ్మిన సిద్ధాంతాలను ఇకమీదటా బలంగా వినిపిస్తా’’ అని నిక్కీ హేలీ అన్నారు. -
USA presidential election 2024: మరో మూడు ప్రైమరీలు
కొలంబియా(యూఎస్): అమెరికా దేశాధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యరి్థత్వం డొనాల్డ్ ట్రంప్‌కు దాదాపుగా ఖాయమైనట్టే. తాజాగా మిస్సోరీ, ఐదహో, మిషిగన్ ప్రైమరీల్లో ఆయన విజయం సాధించారు. ఆయనకు మద్దతు పలికిన డెలిగేట్ల సంఖ్య 244కు పెరిగింది. ప్రత్యర్థి నిక్కీ హేలీ కేవలం 24 డెలిగేట్ల మద్దతుతో చాలా వెనుకంజలో ఉన్నారు. రిపబ్లికన్ అభ్యర్థిత్వం దక్కాలంటే 1,215 డెలిగేట్ల మద్దతు కావాలి. మిషిగన్ రాష్ట్ర ప్రైమరీలో 68 శాతం ఓట్లు ట్రంప్‌కు, 27 శాతం ఓట్లు హేలీకి పడ్డాయి. మంగళవారం జరగబోయే 16 ప్రైమరీల ఫలితాలతో రిపబ్లికన్, డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థులు దాదాపు తేలిపోనున్నారు. మొత్తం డెలిగేట్లలో మూడింట ఒక వంతు మంది ఆ రోజున తమ పార్టీ తరఫున అభ్యర్థిగా ఎవరు ఉండాలనేది ఓటేసి నిర్ణయిస్తారు. ఇప్పటివరకు కొనసాగిన ట్రంప్ అజేయ జైత్రయాత్ర చూస్తుంటే బైడెన్‌కు పోటీగా బరిలో దిగే రిపబ్లికన్ అభ్యర్థి ట్రంపేనని దాదాపు ఖరారైనట్టు కన్పిస్తోంది. -
US presidential election 2024: ప్రైమరీలో ట్రంప్‌కు మరో గెలుపు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం జరుగుతున్న ప్రైమరీల్లో డొనాల్డ్ ట్రంప్ మరో కీలక ముందడుగు వేశారు. ఇప్పటికే అయోవా ప్రైమరీలో గెల్చిన ఆయన బుధవారం న్యూ హ్యాంప్‌షైర్ ప్రైమరీలోనూ నెగ్గారు. అయితే భారతీయ అమెరికన్ నాయకురాలు నిక్కీ హేలీ ఆయనకు గట్టిపోటీ ఇచ్చారు. ట్రంప్‌కు 55 శాతానికి పైగా ఓట్లు రాగా ఆమె 44 శాతం సాధించారు. న్యూ హ్యాంప్‌షైర్ ప్రైమరీని మూడుసార్లు గెలిచిన తొలి రిపబ్లికన్ ప్రైమరీ అభ్యర్థిగా ట్రంప్ చరిత్ర సృష్టించారు. ట్రంప్కిస్తే గెలుపు బైడెన్‌దే: హేలీ తాజా ఫలితాలపై నిక్కీ హేలీ మాట్లాడారు. ‘హ్యాంప్‌షైర్‌లో గెల్చిన ట్రంప్‌కు శుభాకాంక్షలు. అయినా ఇంకా డజన్ల కొద్దీ రాష్ట్రాల ప్రైమరీ ఎన్నికలు జరగాల్సే ఉంది. పార్టీ ఓటర్ల అంతిమ తీర్పు వెలువడటానికి ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. ఈ పోటీలో నేను చిట్టచివరిదాకా పోరా డతా. రేస్‌లో కొనసాగుతా. ఈ పోరు మొదలైనప్పుడు రేసులో మొత్తం 14 మంది ఉండేవాళ్లం. నాకు రెండు శాతం ఓట్లు వచ్చేవి. ఇప్పుడు ట్రంప్‌కు గట్టి పోటీ ఇస్తున్నది నేను మాత్రమే’ అని హేలీ ప్రసంగించారు. ‘‘ట్రంప్‌కు రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థిత్వం దక్కాలని డెమొక్రాట్లు కోరుకుంటున్నారు. ట్రంప్‌ను అయి తే తేలిగ్గా ఓడించవచ్చని వారి ఆశ. నిజంగా ట్రంప్‌కు అభ్యర్థిత్వం దక్కి తే బైడెన్, కమలా హ్యారిస్‌ల విజయం తథ్యం’’ అని హేలీ అన్నారు. మరోవైపు, ‘‘ఈ రోజు హేలీకి కాళరాత్రి. అయినా తానే గెల్చినట్లు ప్రసంగాలు దంచేస్తోంది’’ అని ట్రంప్ ఎద్దేవా చేశారు. సౌత్ కరోలినాలో డెమొక్రటిక్ పార్టీ ప్రైమరీలో అధ్యక్షుడు బైడెన్ నెగ్గారు. -
USA presidential election 2024: తొలి ప్రైమరీలో ట్రంప్‌దే గెలుపు
వాషింగ్టన్: అమెరికా పార్లమెంట్‌పై దాడికి ఉసిగొల్పాడన్న ఆరోపణలు, నీలిచిత్రాల తారతో అనైతిక ఆర్థిక లావాదేవీ, పదుల కొద్దీ కేసుల ఉదంతాలు వెలుగుచూసినా.. రిపబ్లికన్ పార్టీలో మెజారిటీ కార్యకర్తలు ఇంకా డొనాల్డ్ ట్రంప్ వెంటే ఉన్నారని రుజువైంది. రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యరి్థత్వం కోసం అయోవా రాష్ట్రంలో జరిపిన ప్రైమరీ ఎన్నికల్లో తోటి అభ్యర్థులందరినీ వెనక్కి నెట్టి మాజీ దేశాధ్యక్షుడు ట్రంప్ అత్యధిక ఓట్లను కైవసం చేసుకుని ఘన విజయం సాధించారు. దీంతో రాష్ట్రాలవారీగా జరిగే ఈ ఎన్నికల్లో తొలి రాష్ట్రంలోనే ట్రంప్ బోణీ కొట్టడం రాజకీయ విశ్లేషకులనూ ఆశ్చర్యానికి గురిచేసింది. సోమవారం రాత్రి జరిగిన ఈ ఎన్నికల్లో ట్రంప్‌కు 51 శాతం ఓట్లు ఒడిసిపట్టారు. గట్టి పోటీదారుగా అందరూ భావించిన ఫ్లోరిడా గవర్నర్ రాన్ డీశాంటిస్‌కు 21.2 శాతం ఓట్లు పడ్డాయి. ఐక్యరాజ్యసమితి మాజీ రాయబారి, సౌత్ కరోలీనా మాజీ మహిళా గవర్నర్ నిక్కీ హేలీకి 19.1 శాతం ఓట్లు వచ్చాయి. భారతీయ మూలాలున్న అమెరికన్ వ్యాపారవేత్త, సంపన్నుడు వివేక్ రామస్వామి ఈ రేసులో ప్రభావం చూపలేకపోయారు. ఆయనకు కేవలం 7.7 శాతం ఓట్లు పడ్డాయి. సగానికిపైగా ఓట్లు సాధించి నిర్ణయాత్మక రాష్ట్రంలో గెలుపు ద్వారా అధ్యక్ష ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రధాన అభ్యర్థి తానేనని ట్రంప్ మరోసారి ప్రకటించుకున్నారు. అయోవా రాష్ట్ర చరిత్రలో ఒక అభ్యర్థి ఇంతటి భారీ మెజారిటీతో గెలవడం ఇదే తొలిసారి. ఓట్ల పరంగా చూస్తే మరో అభ్యర్థి అసా హుచిన్సన్కు కేవలం 191 ఓట్లు, ఇంకో అభ్యర్థి క్రిస్ క్రిస్టీకి 35 ఓట్లు పడ్డాయి. అత్యల్ప ఓట్లు సాధించడంతో తాను ఈ పోటీ నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు అర్కన్సాస్ మాజీ గవర్నర్ అసా హుచిన్సన్ ప్రకటించారు. ఈసారి మొత్తంగా 1,10,000 మంది ఓట్లు వేశారు. ఈ రాష్ట్రంలో ఇంత తక్కువగా ఓటింగ్ జరగడం గత 20 ఏళ్లలో ఇదే తొలిసారి. ఇక ట్రంప్‌కే నా మద్దతు: వివేక్ రామస్వామి అయోవా ప్రైమరీ ఎన్నికల్లో తక్కువ ఓట్లలో నాలుగో స్థానానికి పరిమితమైన భారతీయవ్యాపారి వివేక్ రామస్వామి ఇక ఈ రేసు నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ‘‘ ఈ రాష్ట్ర ప్రైమరీలో ఆశ్చర్యకర ఫలితాలను ఆశించి భంగపడ్డా. ఇక ప్రచారానికి స్వస్తి పలుకుతున్నా. అధ్యక్షుడినయ్యే మార్గమే లేదు. ఇక నా మద్దతు ట్రంప్‌కే’’ అని తన మద్దతుదారుల సమక్షంలో వివేక్ మాట్లాడారు. -
Taiwan 2024 Presidential Elections: తైవాన్‌లో త్రిముఖం!
అగ్రరాజ్యం అమెరికా, డ్రాగన్ దేశం చైనా మధ్య ఆధిపత్య పోరాటానికి కేంద్ర బిందువుగా మారిన తైవాన్‌లో అధ్యక్ష ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 13వ తేదీన ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు సిద్ధమయ్యారు. ద్వీప దేశమైన తైవాన్‌లో జరుగుతున్న ఈ ఎన్నికలు ప్రపంచమంతటా ఆసక్తి కలిగిస్తున్నాయి. తైవాన్‌కు ప్రధాన ప్రత్యరి్థగా మారిన చైనాతో తదుపరి సంబంధాలు ఎలా ఉండబోతున్నాయన్నది ఈ ఎన్నికలు నిర్దేశించబోతున్నాయి. తైవాన్‌లో ఉద్యోగులు, కారి్మకుల వేతనాలు తగ్గిపోవడం, ఇళ్ల ధరలు భారీగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈసారి అధ్యక్ష ఎన్నికల్లో త్రిముఖ పోరు కనిపిస్తోంది. చైనా దూకుడును కట్టడి చేయగల సత్తా ఉన్న నాయకుడికే ఈ ఎన్నికల్లో ప్రజలు పట్టం కట్టే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. అధికార డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టి(డీపీపీ) ప్రస్తుత ఉపాధ్యక్షుడు విలియం లాయ్ చింగ్–టి, మాజీ ప్రతిపక్ష కౌమిన్‌టాంగ్(కేఎంటీ) పార్టీ నుంచి మాజీ పోలీసు చీఫ్, న్యూ తైపీ నగర మాజీ మేయర్ హొ యు–హీ, తైవాన్ పీపుల్స్ పార్టీ(టీపీపీ) నుంచి కొ వెన్–జి ఈ ఎన్నికల బరిలో నిలిచారు. వారి బలాబలాలు, విజయావకాశాలు ఎలా ఉన్నాయో చూద్దాం.. చైనా పెత్తనాన్ని ప్రశి్నస్తున్న విలియం లాయ్ చింగ్–టి 64 ఏళ్ల విలియం లాయ్ చింగ్–టి మృదు స్వభావిగా పేరుగాంచారు. తైవాన్‌కు స్వయం పాలన హోదాను నిలబెట్టడానికి చాలా ఏళ్లుగా పోరాటం సాగిస్తున్నారు. చైనా పెత్తనాన్ని గట్టిగా వ్యతిరేకిస్తూ ప్రజల్లో మంచి గుర్తింపు సంపాదించారు. తైవాన్ స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న యోధుడిగా తనను తాను అభివరి్ణంచుకుంటున్నారు. విలియం లాయ్ చింగ్–టి అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో వైద్య విద్య అభ్యసించారు. స్వదేశంలో కొన్నాళ్లు డాక్టర్‌గా పనిచేశారు. 1990వ దశకంలో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తొలుత తైనాన్ సిటీ నుంచి చట్టసభకు ఎన్నికయ్యారు. 2010లో తైనాన్ మేయర్‌గా విజయం సాధించారు. ప్రస్తుతం ఉపాధ్యక్షుడిగా సేవలందిస్తున్నారు. డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ నుంచి అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగారు. చైనాతో సత్సంబంధాలను తాను కోరుకుంటున్నానని ఎన్నికల ప్రచారంలో చెబుతున్నారు. శత్రువులుగా కాదు, మిత్రులుగా ఉందామని చైనాకు సూచిస్తున్నారు. తైవాన్ తరహాలో చైనాలోనూ ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ వంటివి వరి్థల్లాలని తాను ఆశిస్తున్నట్లు వెల్లడించారు. అయితే, చైనా మాత్రం విలియం లాయ్ చింగ్–టి పట్ల విముఖత వ్యక్తం చేస్తోంది. ఆయన ఒక పేచీకోరు అని నిందలు వేస్తోంది. తరచుగా లేని పోని సమస్యలు సృష్టిస్తుంటాడని విమర్శిస్తోంది. డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ నుంచి ఉపాధ్యక్ష పదవికి హెసియావో బి–కిమ్ పోటీపడుతున్నారు. ఆమె జపాన్‌లో జన్మించారు. అమెఅమెరికాలో పెరిగారు. కరడుగట్టిన స్వాతంత్య్ర ఉద్యమకారిణిగా ఆమెకు పేరుంది. చైనాకు అనుకూలం! హొ యు–హీ కౌమిన్‌టాంగ్(కేఎంటీ) పార్టీ నేత, 66 ఏళ్ల హొ యు–హీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. చిన్నప్పుడు తన కుటుంబ వృత్తి అయిన పందుల పెంపకం చేపట్టారు. పంది మాంసం విక్రయించారు. విద్యాభ్యాసం అనంతరం పోలీసు అధికారిగా పనిచేశారు. పందులను పట్టుకోవడానికి చిన్నప్పుడు నేర్చుకున్న నైపుణ్యం పోలీసు అధికారిగా ఉన్నప్పుడు చాలాసార్లు పనికొచి్చందని ఆయన ఒక సందర్భంలో చెప్పారు. చాలా హై–ప్రొఫైల్ కేసులను సమర్థవంతంగా ఛేదించారు. హంతకులను అరెస్టు చేశారు. పదవీ విరమణ తర్వాత 2010లో రాజకీయాల్లో చేరారు. 2018లో ‘న్యూ తైపీ’ నగర మేయర్‌గా ఎన్నికయ్యారు. 2022లో మరోసారి మేయర్‌గా విజయం సాధించారు. పోలీసు అధికారిగా, మేయర్‌గా ఆయన పనితీరు ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంది. అందుకే అధ్యక్ష ఎన్నికల్లో తమ అభ్యరి్థగా హొ యు–హీని కౌమిన్‌టాంగ్ పార్టీ ఎంపిక చేసింది. ఎనిమిదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న ఆ పార్టీ ఈసారి గెలుపు కోసం శ్రమిస్తోంది. ఎన్నికల ప్రచారంలో హొ యు–హీ చైనా గురించి పెద్దగా ప్రస్తావించడం లేదు. చైనా అనుకూలవాది అంటూ ఆయనపై కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ‘స్వతంత్ర తైవాన్’కు హొ యు–హీ వ్యతిరేకి అని ఆరోపిస్తున్నారు. తైవాన్, చైనా మధ్య సంబంధాలు రిపబ్లిక్ ఆఫ్ చైనా రాజ్యాంగంపై ఆధారపడి ఉంటాయని, ఇందులో గందరగోళం ఏమీ లేదని ఆయన తేలి్చచెబుతున్నారు. కౌమిన్‌టాంగ్ పార్టీ నుంచి ఉపాధ్యక్ష పదవికి జా షా–కాంగ్ పోటీ పడుతున్నారు. చైనా, తైవాన్ పునరేకీకరణ జరగాలని జా షా–కాంగ్ వాదిస్తుంటారు. యువత ఆదరణ చూరగొంటున్న కొ వెన్–జి తైవాన్ పీపుల్స్ పార్టి(టీపీపీ) నుంచి 64 సంవత్సరాల కొ వెన్–జి రేసులో నిలిచారు. ఆయన వైద్యుడిగా పనిచేస్తూ పదేళ్ల క్రితం రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో జరిగిన ‘సన్‌ఫ్లవర్ ఉద్యమం’లో పాల్గొన్నారు. అప్పట్లో చైనాకు వ్యతిరేకంగా విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. ఆ తర్వాత కొ వెన్–జి 2015లో తైపీ మేయర్‌గా ఎన్నికయ్యారు. ఎనిమిదేళ్లపాటు అదే పదవిలో సేవలందించారు. మేయర్‌గా చైనాతో సంబంధాలు పెంచుకోవడానికి ప్రాధాన్యం ఇచ్చారు. 2019లో తైవాన్ పీపుల్స్ పార్టీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం చైనాతో సంబంధాల విషయంలో ఎలాంటి వైఖరిని వ్యక్తం చేయకుండా గుంభనంగా వ్యవహరిస్తున్నారు. చైనాకు అనుకూలమో, వ్యతిరేకమో చెప్పకుండా దాట వేస్తున్నారు. ప్రధానంగా యువతలో ఆయన పట్ల ఆదరణ కనిపిస్తోంది. డీపీపీ, కేఎంటీ పార్టీలకు తామే ప్రత్యామ్నాయం అని కొ వెన్–జి పేర్కొంటున్నారు. 2020 ఎన్నికల్లో 113 స్థానాలకు గాను టీపీపీ కేవలం ఐదు సీట్లు గెలుచుకుంది. తైవాన్ పార్లమెంట్లో మూడో అతిపెద్ద పార్టిగా మారింది. ఇక టీపీపీ నుంచి ఉపాధ్యక్ష రేసులో సిట్టింగ్ ఎంపీ, సంపన్న వ్యాపారవేత్త సింథియా వు నిలిచారు. తైవాన్‌లో ప్రఖ్యాతిగాంచిన వ్యాపార సంస్థ ‘షిన్ కాంగ్ గ్రూప్’ ఆమె కుటుంబానికి చెందినదే. – సాక్షి, నేషనల్ డెస్క్ -
డొనాల్డ్ ట్రంప్‌నకు మరో షాక్
పోర్ట్‌ల్యాండ్: అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్‌నకు మరో షాక్ తగిలింది. వచ్చే ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న ఆయనకు దారులు క్రమంగా మూసుకుపోతున్నాయి. కొలరాడో రాష్ట్రంలో అధ్యక్ష అభ్యరి్థత్వానికి(ప్రైమరీ ఎన్నికలో) పోటీ చేసేందుకు ట్రంప్ అనర్హుడని 2021 జనవరి 6న జరిగిన క్యాపిటల్ హిల్‌పై దాడి కేసులో కొలరాడో సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. కొలరాడో రాష్ట్ర ప్రైమరీ ఎన్నికలో పోటీ చేయకుండా ఆయనపై అనర్హత వేటు వేసింది. తాజాగా మెనె రాష్ట్రంలోనూ ట్రంప్‌నకు పరాభవం ఎదురైంది. రాష్ట్రంలో ప్రైమరీ ఎన్నికలో పోటీ చేయకుండా బ్యాలెట్ నుంచి ట్రంప్ పేరును తొలగిస్తున్నట్లు మెనె రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి షెన్నా బెల్లోస్ గురువారం ప్రకటించారు. ఈ మేరకు ఉత్తర్వు జారీ చేశారు. ఈ ఉత్తర్వుపై న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశాన్ని ట్రంప్‌నకు కలి్పంచారు. కొలరాడో సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మెనె రాష్ట్రంలో ప్రైమరీ ఎన్నికలో ట్రంప్ అభ్యరి్థత్వాన్ని వ్యతిరేకిస్తూ కొందరు అప్పీళ్లు దాఖలు చేశారు. ఆయనకు ఇక్కడి నుంచి ప్రైమరీలో పోటీ చేసే అవకాశం ఇవ్వొద్దని కోరారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న షెన్నా బెల్లోస్ ప్రైమరీ బ్యాలెట్ నుంచి ట్రంప్ పేరును తొలగించారు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న అభ్యర్థి పేరును ఒక రాష్ట్రంలో ఇలా బ్యాలెట్ నుంచి తొలగించడం అమెరికా చరిత్రలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. -
మరో షాక్.. ట్రంప్‌కు మూసుకుపోతున్న దారులు
అగస్టా: అగ్రరాజ్య అధ్యక్షుడిగా వైట్‌హౌజ్‌కు రెండోసారి చేరుకునే క్రమంలో డొనాల్డ్ ట్రంప్‌కు దారులు ఒక్కొక్కటిగా మూసుకుపోతున్నాయి. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ చేసేందుకు ఆయన అనర్హుడంటూ కొలరాడో న్యాయస్థానం ప్రకటించిన పట్టుమని పదిరోజుల గడవక ముందే.. మరో రాష్ట్రం షాక్ ఇచ్చింది. ట్రంప్ పోటీకి అనర్హుడంటూ మైనే(Maine) స్టేట్ గురువారం ప్రకటించింది. అమెరికా చట్టసభ క్యాపిటల్(US Capitol Hill)పై 2021, జనవరి 6వ తేదీన ట్రంప్ మద్దతుదారులు దాడి చేశారు. అయితే ఆ దాడికి అప్పటి దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే ప్రధాన కారణమని ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతీ తెలిసిందే. దీంతో.. వచ్చే ఏడాది జరగబోయే అధ్యక్ష ఎన్నిక మైనే స్టేట్ తరఫున పోటీ చేసేందుకు ట్రంప్ అనర్హుడంటూ అక్కడి ఎన్నికల విభాగం నిర్ణయించింది. దీంతో.. మైనే రాష్ట్ర కార్యదర్శి షెన్నా బెల్లోస్ గురువారం ప్రకటన చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2024 అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి.. రిపబ్లికన్ పార్టీ తరఫున నామినేషన్లో ముందంజలో ఉన్నారు. కానీ 2020 ఎన్నికలకు సంబంధించి తప్పుడు ప్రచారంతో ఆయన తిరుగుబాటును ప్రేరేపించారు. క్యాపిటల్‌పైకి కవాతు చేయాలని ట్రంప్ తన మద్దతుదారులను కోరారు అని షెన్నా బెల్లోస్ పేర్కొన్నారు. ఇక.. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ చేసేందుకు ఆయన అనర్హుడంటూ కొలరాడో కోర్టు ప్రకటించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర రిపబ్లికన్ ప్రైమరీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయనపై అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. క్యాపిటల్ భవనంపై దాడికి సంబంధించిన కేసులోనే కోర్టు ఈ మేరకు సంచలన తీర్పు వెలువరించింది. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న నేతపై ఇలా అనర్హత పడటం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్రంప్ హింసను ప్రేరేపించారనడానికి బలమైన సాక్ష్యాలున్నాయని కోర్టు తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించింది. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ సెక్షన్ 3 నిబంధన ప్రకారం.. ఆయన ప్రైమరీ ఎన్నికల్లో పోటీకి అనర్హుడని తేల్చింది. అయితే దీనిపై యూఎస్ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు ట్రంప్‌నకు అవకాశం కల్పించింది. అందుకోసం వచ్చే ఏడాది జనవరి 4వ తేదీ వరకు ఈ ఉత్తర్వుల అమలును నిలిపివేస్తున్నట్లు తెలిపింది. దీంతో ట్రంప్ భవితవ్యాన్ని అమెరికా సుప్రీంకోర్టు తేల్చనుంది. తాజా పరిణామాలతో (సర్వోన్నత న్యాయస్థానంలో ఊరట లభిస్తే తప్ప).. రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వానికి కొలరాడో, మైనే స్టేట్ జరిగే ఎన్నికల్లో అభ్యర్థుల జాబితా నుంచి ట్రంప్ పేరును తొలగించాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది మార్చి 5న అక్కడ జరిగే రిపబ్లికన్ పార్టీ ప్రైమరీ ఎన్నికలు.. నవంబరు 5న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. -
US Presidential Elections 2024: ఫాసిస్ట్, అవినీతి అనకొండ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ పడడానికి భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి తీవ్రంగా శ్రమిస్తున్నారు. పారీ్టలో తన ప్రత్యర్థి అయిన భారతీయ–అమెరికన్ నిక్కీ హేలీపై పైచేయి సాధించాలని చూస్తున్నారు. రిపబ్లికన్ పార్టీ తరపున అభ్యరి్థత్వం కోసం వివేక్ రామస్వామి, నిక్కీ హేలీతోపాటు ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటీస్, న్యూజెర్సీ మాజీ గవర్నర్ క్రిస్ క్రిస్టీ పోటీ పడుతున్నారు. నలుగురు ఆశావహుల మధ్య నాలుగో విడత చర్చా కార్యక్రమం యూనివర్సిటీ ఆఫ్ అలబామాలో హాట్‌హాట్‌గా జరిగింది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరు కాలేదు. చర్చలో పాల్గొన్న నలుగురు నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. వివేక్ రామస్వామి దాదాపు అరగంటపాటు మాట్లాడారు. ప్రధానంగా నిక్కీ హేలీపై విరుచుకుపడ్డారు. ఆమె ఫాస్టిప్, అవినీతి అనకొండ అని ధ్వజమెత్తారు. ఆరోపణలపై మీడియాకు సమాధానం చెప్పకుండా తప్పించుకుంటున్నారని మండిపడ్డారు. కార్పొరేట్ సంస్థల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. రీడ్ హాఫ్మాన్ అనే ధనవంతుడి నుంచి నిక్కీ, ఆమె కుటుంబ సభ్యులు 2.5 లక్షల డాలర్లు దండుకున్నారని ఆరోపించారు. అయితే, వివేక్ రామస్వామి చేసిన ఆరోపణలపై నిక్కీ హేలీ పెద్దగా స్పందించలేదు. చర్చా కార్యక్రమంలో మౌనంగా ఉండిపోయారు. ఆమెకు క్రిస్ క్రిస్టీ మద్దతుగా నిలిచారు. వివేక్ రామస్వామి వ్యాఖ్యలను ఆయన ఖండించారు. రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ నేత, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌పై ఎవరు పోటీకి దిగుతారన్నది ఆసక్తికరంగా మారింది. -
US Presidential Elections: మూడొంతుల మందిని సాగనంపుతా!
వాషింగ్టన్: తాను అధ్యక్షుడినైతే అమెరికా ప్రభుత్వంలోని ముప్పావు వంతు ఉద్యోగులను ఇంటికి పంపిస్తానని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యరి్థత్వం కోసం పోటీపడుతున్న వివేక్ రామస్వామి సంచలన ప్రకటన చేశారు. భారతీయ మూలాలున్న వివేక్.. అమెరికన్ వార్తా వెబ్సైట్ యాక్సియస్కు ఇచి్చన ప్రత్యేక ముఖాముఖిలో పలు విషయాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ‘ రిపబ్లికన్ పార్టీ అభ్యరి్ధత్వం సాధించి అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చుంటే వెంటనే నా పని మొదలుపెడతా. దేశవ్యాప్తంగా విధుల్లో ఉన్న ప్రభుత్వ సిబ్బందిలో 75 శాతం మందిని ఉద్యోగాల నుంచి తీసేస్తా. ఇన్ని లక్షల మంది సిబ్బంది అమెరికా సర్కార్‌కు పెనుభారం. ఇక ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ) వంటి ప్రధాన దర్యాప్తు సంస్థలను మూసేస్తా. విద్య, ఆల్కాహాల్, పొగాకు, ఆయుధాలు, పేలుడు పదార్ధాలు, అణు నియంత్రణ కమిషన్, అంతర్గత ఆదాయ సేవలు, వాణిజ్య శాఖల ప్రక్షాళనకు కృషిచేస్తా. అధ్యక్షుడిగా తొలి ఏడాది పూర్తయ్యేలోపు సగం మంది ప్రభుత్వ ఉద్యోగులను ఇంటికి సాగనంపుతా. మిగతా సగం మందిలో 30 శాతం మందితో వచ్చే ఐదేళ్లలో పదవీ విరమణ చేయిస్తా. ఇందులో అనుమానమేమీ లేదు. పిచి్చపని అస్సలుకాదు’ అని 38 ఏళ్ల వివేక్ అన్నారు. ప్రస్తుతం అమెరికాలో 22.5 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 75 శాతం మందిని అంటే దాదాపు 16 లక్షల మందిని వచ్చే నాలుగేళ్లలో ఉద్యోగాల నుంచి తీసేస్తానని వివేక్ లెక్కచెప్పారు. ఇన్ని లక్షల మందిని తీసేస్తే ప్రభుత్వంపై వేతన భారం భారీగా తగ్గుతుందని ఆయన అభిప్రాయం. -
వివేక్ రామస్వామిలో ఈ టాలెంట్ కూడా!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ తరపున ఆశావహుడు, భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి Vivek Ramaswamy తనలోని టాలెంట్‌ను ప్రదర్శించారు. ఓ ఈవెంట్‌కు హాజరైన ఆయన.. ర్యాప్ కట్టి అల్లాడించారు. అయితే ఈ క్రమంలోనే ఆయన అడ్డు కూడా తగిలింది. భారత మూలాలున్న వివేక్ రామస్వామి Vivek Ramaswamy అమెరికా అధ్యక్ష ఎన్నిక అభ్యర్థుల(రిపబ్లికన్ పార్టీ) ప్రచారంలో దూసుకుపోతున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో రామస్వామి ‘డా వెక్ ది ర్యాపర్’గా గుర్తింపు పొందాడట కూడా. అందుకే ఆ టాలెంట్‌ను ప్రదర్శించారు. లోవా స్టేట్ ఫెయిర్‌కు హాజరై.. ప్రముఖ ర్యాప్ స్టార్ ఎమినెమ్ ‘లాస్ యువర్సెల్ఫ్’ ర్యాప్‌ను తన గొంతుతో కట్టి అక్కడున్నవాళ్లను అలరించారాయన. అయితే.. ఈ పరిణామం జనాలను అలరించినా.. ఎమినెమ్(50)కు నచ్చలేదు. తన మ్యూజిక్‌ను ఎక్కడా వాడొద్దంటూ సున్నితంగానే రామస్వామికి తెలియజేశారు. ఈ మేరకు మ్యూజిక్సంస్థ తరపున ఓ లేఖను రామస్వామికి పంపించినట్లు తెలుస్తోంది. ఇక మీదట ఎన్నికల ప్రచారంలో తన మ్యూజిక్‌ను వాడొద్దని లేఖలో ఎమినెమ్, రామస్వామికి తెలియజేశాడు. ఇదిలా ఉంటే.. అమెరికాలో ఎన్నికల ప్రచారంలో ఇలా తమ మ్యూజిక్ వాడొద్దంటూ కోరడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. గత రెండు దఫా ఎన్నికల్లో.. రిహానా, అడెలె మ్యూజిక్‌లను ట్రంప్ తన ర్యాలీలలో అనుమతులు లేకుండానే ఉపయోగించారు. 38 ఏళ్ల వివేక్ రంగస్వామి తనను తాను ‘ట్రంప్ 2.0’గా భావిస్తున్నారు. అయితే.. 2024 అధ్యక్ష ఎన్నికల రేసులో రిపబ్లికన్ పార్టీ తరపున నిలబడేందుకు ట్రంప్‌తోనే పోటీ పడుతున్నారు వివేక్. అంతేకాదు.. తానే గనుక అధ్యక్షుడ్ని అయితే ఎలన్ మస్క్‌ని వ్యక్తిగత సలహాదారుగా నియమించుకుంటానంటూ ఆసక్తికర వ్యాఖ్యలే చేశారు. Rapping Republican: Vivek Ramaswamy's Surprising Eminem Moment Vivek Ramaswamy, a Republican presidential candidate and successful biotech entrepreneur, recently showcased a surprising side at the Iowa State Fair. Amidst his political pursuits, Ramaswamy took the stage to rap… pic.twitter.com/4tkvM0aMk5 — GOP News (@gopnews2024) August 19, 2023 -
‘నేను గెలిస్తే ఆ పదవి మస్క్‌కే’.. రిపబ్లికన్ అభ్యర్థి వివేక్ రామస్వామి
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిచి యూఎస్ అధ్యక్షుడిగా ఎన్నికైతే తనకు సలహాదారుగా ఎలాన్ మస్క్ (Elon Musk)ను కోరుకుంటానని రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెంట్ అభ్యర్థి భారతీయ-అమెరికన్ వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) పేర్కొన్నారు. లోవాలోని టౌన్ హాల్లో రామస్వామి మాట్లాడుతూ తన సంభావ్య అధ్యక్ష పదవికి సలహాదారులుగా ఎవరు కావాలనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు బదులుగా ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఎన్బీసీ న్యూస్ నివేదించింది. ట్విటర్ (ప్రస్తుతం ‘ఎక్స్’)ని స్వాధీనం చేసుకున్న తర్వాత గత సంవత్సరం ఆ సంస్థ నుంచి భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. అయితే ఈ తొలగింపు చర్యను వివేక్ రామస్వామి మెచ్చుకోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ‘ఎలాన్ మస్క్ ఇటీవల చాలా మెరుగవడం సంతోషంగా ఉంది. నాకు అతన్ని కీలక సలహాదారుగా కోరుకుంటున్నా. ఎందుకంటే అతను ట్విటర్లో 75 శాతం మందిని తొలగించాడు’ అని రామస్వామి పేర్కొన్నట్లుగా ఎన్బీసీ న్యూస్ కథనం వివరించింది. గతంలో ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్‌కు మద్దతు తెలిపిన ఎలాన్ మస్క్ ఇటీవల వికేక్ రామస్వామిని ఆశాజనక అభ్యర్థిగా భివిస్తున్నట్లు చెప్పాడు. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా అత్యంత పిన్న వయస్కుడైన రామస్వామి.. దక్షిణ కరోలినా మాజీ గవర్నర్ నిక్కీ హేలీ తర్వాత రిపబ్లికన్ పార్టీ నామినేషన్ కోసం పోటీ పడుతున్న మరో ఇండియన్-అమెరికన్. ప్రభుత్వంలో విద్యా శాఖ, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, బ్యూరో ఆఫ్ ఆల్కహాల్, టొబాకో, ఫైర్ ఆర్మ్స్, ఎక్స్ప్లోసివ్స్ను మూసివేయాలని తాను కోరుకుంటున్నట్లు రామస్వామి పేర్కొన్నట్లుగా ఎన్బీసీ నివేదిక వివరించింది. 38 ఏళ్ల వివేక్ రామస్వామి 40 ఏళ్లలోపు అత్యంత సంపన్న అమెరికన్లలో ఒకరు. యేల్ నుంచి న్యాయ పట్టా పొందే ముందు హార్వర్డ్‌లో జీవశాస్త్రాన్ని అభ్యసించారు. ఫోర్బ్స్ ప్రకారం, కొంతకాలం బిలియనీర్‌గా ఉన్న ఆయన సంపద స్టాక్ మార్కెట్ తిరోగమనంతో 950 మిలియన్ డాలర్లకు పడిపోయింది. -
భారత్‌తో బంధాలు బలపడితే చైనాపై ఆధారపడనక్కర్లేదు
లోవా: భారత్‌తో అమెరికా బంధాలు మరింత బలపడితే చైనాపై ఆధారపడే అవసరం ఉండదని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిత్వం కోసం పోటీ పడుతున్న భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి అభిప్రాయపడ్డారు. అండమాన్ సముద్రంలో మిలటరీ బంధాల్ని భారత్‌తో పటిష్టం చేసుకుంటే చైనా నుంచి దూరం కావచ్చునని వ్యాఖ్యానించారు. 38 ఏళ్ల వయసున్న వివేక్ రామస్వామి రిపబ్లికన్ అధ్యక్ష అభ్యరి్థత్వ రేసులో నిలిచిన వారిలో పిన్న వయసు్కడు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తర్వాత ఈ బరిలో ముందున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో అత్యంత కీలకమైన లోవా రాష్ట్రంలో పర్యటిస్తున్న వివేక్ రామస్వామి పీటీఐకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘చైనాపై అమెరికా ఆర్థికంగా ఆధారపడి ఉంది. భారత్‌తో సంబంధాలు బలపడితే చైనాతో బంధాల నుంచి బయటపడవచ్చు’ అని రామస్వామి వివరించారు. ‘అండమాన్ సముద్రంలో మిలటరీ బంధాలు సహా భారత్‌తో అమెరికాకు వ్యూహాత్మక సంబంధాలు బలోపేతం కావాలి. పశి్చమాసియా దేశాల నుంచి చైనాకు చమురు సరఫరా అవుతున్న మలక్కా జలసంధిని భారత్ అడ్డుకోగలదన్న విషయం మనకు తెలిసుండాలి. ఇరు దేశాల బంధాల బలోపేతానికి ఇవే కీలకం. అదే జరిగితే అమెరికాకు మంచే జరుగుతుంది. ఆ దిశగా నేను ముందుకు వెళతాను’ అని రామస్వామి చెప్పారు. మొదటిసారిగా భారతీయ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చిన వివేక్ భారత ప్రధాని మోదీ మంచి నాయకుడని ప్రశంసించారు. మోదీతో కలిసి ఇరు దేశాల సంబంధాల బలోపేతానికి కృషి చేసే రోజు కోసం తాను ఎదురు చూస్తున్నట్టుగా చెప్పారు. -
US Presidential ElectionIns 2024: ట్రంప్‌తో కలిసి పోటీ పడడానికి సిద్ధమే
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష అభ్యర్థి రేసులో అనూహ్యంగా పుంజుకొని అందరి దృష్టిని ఆకర్షిస్తున్న భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి తన రూటు మార్చారు. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి రేసులో ఉన్న ఆయన ఇన్నాళ్లూ ఉపాధ్యక్ష పదవికైతే పోటీ పడనని చెబుతూ వస్తున్నారు. అధ్యక్ష పదవి తప్ప తనకు దేనిపైనా ఆసక్తి లేదని గతంలో చెప్పిన ఆయన ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష అభ్యర్థి నామినేషన్‌ను గెలుచుకుంటే ఆయనతో కలిసి పోటీ చేయడానికి సిద్ధమేనని స్పష్టం చేశారు. బ్రిటన్‌కు చెందిన జిబి న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామస్వామిని ట్రంప్‌కు ఉపాధ్యక్షుడిగా పోటీ చేయడం మీకు సంతోషమేనా అని ప్రశ్నించగా ఇప్పుడు తన వయసుకు అది మంచి పదవేనని చెప్పారు. ‘‘అమెరికాని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి పునరేకీకరణ చేయాల్సిన అవసరం ఉంది. వైట్‌హౌస్‌లో ఒక నాయకుడిగా ఉంటేనే ఆ పని నేను చెయ్యగలను’’అని చెప్పారు. 38 ఏళ్ల రామస్వామి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థుల చర్చలో తన సత్తా చూపించి రేసులో ట్రంప్ తర్వాత స్థానంలో దూసుకుపోతున్నారు. రామస్వామిని ట్రంప్ శిబిరం కూడా ప్రశంసించింది. అప్పట్నుంచి ట్రంప్, రామస్వామిలు అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్థులుగా అంతిమంగా బరిలో నిలుస్తారన్న చర్చ పార్టీలో జరుగుతోంది. -
US presidential election 2024: రిపబ్లికన్ రేస్ షురూ
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా ఏడాదికి పైగా సమయముంది. 2024 నవంబర్ 5న పోలింగ్ జరగనుంది. కానీ రెండు ప్రధాన పక్షాల్లో ఒకటైన విపక్ష రిపబ్లికన్ పార్టీ ఇప్పటికే బరిలో దిగింది. పార్టీ అభ్యర్థిని నిర్ణయించే సుదీర్ఘమైన ఎంపిక ప్రక్రియకు బుధవారమే శ్రీకారం చుడుతోంది. ఇప్పటికైతే వివాదాస్పద మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రేసులో అందరి కంటే ముందున్నారు. ఇంకా చెప్పాలంటే ఆయన వైపే స్పష్టమైన మొగ్గుంది. అయినా సరే, ట్రంప్‌నకు ఎంతో కొంత పోటీ ఇస్తారని భావిస్తున్న ఫ్లోరిడా గవర్నర్ డి శాంటిస్తోపాటు మరో ఏడుగురు ఆశావహులు బరిలో దిగి అదృష్టం పరీక్షించుకుంటున్నారు. తొలి రౌండ్ డిబేట్ ఎప్పుడు? ► బుధవారం రాత్రి 9 గంటలకు (అమెరికా కాలమానం ప్రకారం) వేదిక: రాజకీయంగా అతి కీలకమైన విస్కాన్సిన్ రాష్ట్రంలోని మిల్వాకీలో ► రెండో రౌండ్ డిబేట్ సెపె్టంబర్ 27న కాలిఫోరి్నయాలో జరుగుతుంది. అర్హత... అంత సులభం కాదు రిపబ్లికన్ అభ్యరి్థత్వ బరిలో నిలవడం అంత సులువేమీ కాదు. అందుకు పార్టీ నేషనల్ కమిటీ పెట్టే ఎన్నో నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. మరెన్నో పార్టీపరమైన పరీక్షల్లో నెగ్గాల్సి ఉంటుంది. ► లేదంటే కనీసం రెండు నేషనల్ పోల్స్‌తో పాటు అయోవా వంటి ఒక అర్లీ ప్రెసిడెన్షియల్ ప్రైమరీలో కనీసం 1 శాతం ఓట్లు సాధించాలి. ► ప్రచారం కోసం కనీసం 40 వేల మంది నుంచి విడివిడిగా విరాళాలు సేకరించాలి. ► మూడు విడివిడి నేషనల్ పోల్స్‌లో కనీసం 1 శాతం ఓట్లు సాధించాలి. ► అంతిమంగా నెగ్గి రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష బరిలో దిగే అభ్యరి్థకి పూర్తి మద్దతిస్తామని ప్రమాణ పత్రం మీద సంతకం చేయాలి. అయితే రేసులో ముందున్న ట్రంప్ మాత్రం ఇలా సంతకం చేయకపోగా, తిరస్కరించడం విశేషం! డిబేట్లో వీరే... 1. టిమ్ స్కౌట్ (దక్షిణకరోలినా సెనేటర్) 2. డి శాంటిస్ (ఫ్లోరిడా గవర్నర్) 3. నిక్కీ హేలీ (ఐరాసలో అమెరికా మాజీ రాయబారి) 4. వివేక్ రామస్వామి (భారత సంతతి వ్యాపారవేత్త) 5. క్రిస్ క్రిస్టీ (న్యూజెర్సీ మాజీ గవర్నర్) 6. మైక్ పెన్స్ (మాజీ ఉపాధ్యక్షుడు) 7. డౌగ్ బర్గం (నార్త్ డకోటా గవర్నర్) 8. అసా అచిన్ సన్ (అర్కన్సాస్ మాజీ గవర్నర్) ఏం ఒరిగేను? రిపబ్లికన్ అభ్యర్థిగా ట్రంప్‌నకు మద్దతు వెల్లువెత్తుతోందనే చెప్పాలి. తమ అభ్యర్థి ఆయనేనని సీబీఎస్, యూగవ్ గత వారం చేసిన పోల్‌లో ఏకంగా 62 శాతం రిపబ్లికన్ ఓటర్లు కుండబద్దలు కొట్టారు. అలాంటప్పుడు ఈ డిబేట్లతో పార్టీ సాధించేది ఏముంటుందని ప్రశ్నిస్తున్న వాళ్లూ ఉన్నారు. కానీ ఆశావహులు డిబేట్లలో ట్రంప్‌ను గుడ్డిగా వ్యతిరేకించడం కాకుండా తమకు ఎందుకు ఛాన్స్ ఇవ్వాలో సమర్థంగా చెప్పగలగాలని అదే సర్వేలో ఏకంగా 91 శాతం స్పష్టం చేశారు. కనుక ఏమైనా జరగొచ్చని, చివరికి అనూహ్యంగా ఎవరైనా అధ్యక్ష అభ్యర్థి కావచ్చని అంటున్న వారికీ కొదవ లేదు. కొసమెరుపు రేసులో అందరి కంటే ముందున్న డొనాల్డ్ ట్రంప్ మాత్రం తొలి రౌండ్ డిబేట్లో పాల్గొనడం లేదు. ‘నాకున్న పాపులారిటీకి ఇలాంటి పిల్ల పందాల్లో పాల్గొనడమా? నాన్సెన్స్! నేనెవరో, అధ్యక్షునిగా ఎంత సాధించానో పార్టీ ఓటర్లందరికీ బాగా తెలుసు’’ అంటున్నారాయన! అయితే, సరిగ్గా డిబేట్ల సమయానికే ప్రి రికార్డెడ్ ఇంటర్వ్యూ ప్రసారమయ్యేలా ట్రంప్ ప్లాన్ చేస్తున్నట్టు చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఈక్వెడార్ ఎన్నికల నేపధ్యంలో వరుస హత్యలు
క్విటో: త్వరలో జరగనున్న ఈక్వెడార్ రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో రాజకీయ నాయకుల వరుస హత్యలు అక్కడ సంచలనం సృష్టిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితమే సిటిజన్ రివొల్యూషన్ పార్టీ రాష్ట్రపతి అభ్యర్థి ఫెర్నాండో విల్లావిసెన్షియా ప్రచార కార్యక్రమం నిర్వహిస్తుండగా కాల్చి చంపబడ్డారు. ఆ సంఘటన మరువక ముందే అదే పార్టీకి చెందిన మరో నాయకుడు పెడ్రో బ్రయోన్స్ ను ఆయన ఇంటి ముందే కాల్చి చంపారు దుండగులు. పెడ్రో బ్రయోన్స్ ఎస్మెరాల్డాస్ ప్రావిన్సులోని కొలంబియా సరిహద్దు ఉద్యమంలో కీలక నాయకుడు. ఈ హత్య అనంతరం సిటిజన్ రివొల్యూషన్ పార్టీ మరో రాష్ట్రపతి అభ్యర్థి లూయిసా గొంజాలెజ్ బ్రయోన్స్ కు నివాళులు అర్పిస్తూ.. పెడ్రో బ్రయోన్స్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రస్తుతం ఈక్వెడార్‌లో రక్తం ఏరులై పారుతోందని చెబుతూ హత్యా రాజకీయాలకు పాల్పడుతున్న ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇప్పుడున్న ప్రభుత్వం నేర సామ్రాజ్యాన్ని విస్తరించిందని చెబుతూనే ఇదొక పనికిమాలిన ప్రభుత్వంగా ఆమె వర్ణించారు. ఆగస్టు 9న సిటిజన్ రివొల్యూషన్ పార్టీ అధ్యక్షుడి రేసులో ఉన్న ఫెర్నాండో విల్లావిసెన్షియాను అత్యంత కిరాతకంగా చంపబడ్డారు. క్విటో నగరంలో ఒకచోట ప్రచార కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని తన వాహనంలోకి వెళ్తుండగా దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు. చుట్టూ సెక్యూరిటీ వలయం ఉండగానే హత్య జరగడం విశేషం. అవినీతికి వ్యతిరేకంగా విల్లావిసెన్షియా తన స్వరాన్ని చట్టసభల్లో చాలా బలంగా వినిపించేవారు. ఇదే క్రమంలో ఈసారి జరగబోయే ఎన్నికల్లో విల్లావిసెన్షియా అధ్యక్షుడి రేసులో ముందువరసలో ఉన్నారు. కానీ ఎన్నికలు జరిగే లోపే ప్రత్యర్థి తుపాకీ గుళ్లకు బలయ్యారు. ఎన్నికల తంతు ముగిసేలోపు ఇంకెన్ని హత్యలు చూడాల్సి వస్తుందోనని ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటూ రోజులు వెళ్లదీస్తూ ఉన్నారు. ఇది కూడా చదవండి: Viral Video: కూతురి గదిలోకి దూరిన బాయ్‌ఫ్రెండ్.. ఏం చేశారంటే? -
2024 US Presidential Election: ఎందుకు పోటీ చేస్తున్నానంటే...
2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు అప్పుడే కోలాహలం మొదలైంది. ముఖ్యంగా ఈసారి భారత సంతతీయుల సందడి ఎక్కువగా ఉండేట్టుంది. ఇప్పటికే ఆంట్రప్రెన్యూర్, రచయిత వివేక్ రామస్వామి తాను అధ్యక్ష స్థానానికి పోటీ చేస్తానని ప్రకటించారు. దీనికిగానూ ముందు తన సొంత పార్టీ అయిన రిపబ్లికన్ పార్టీ మద్దతు కూడగట్టవలసి ఉంటుంది. ఏమైనా నిండా నలభై ఏళ్లు లేని, కేరళ మూలాలున్న వివేక్ రామస్వామి ఇంత పెద్ద పదవికి పోటీ పడాలని అనుకోవడమే విశేషం. ‘ఒక నూతన అమెరికన్ స్వప్నాన్ని రూపొందించడానికి నేను రాజకీయ ప్రచారం మొదలుపెట్టడం మాత్రమే కాకుండా, ఒక సాంస్కృతిక ఉద్యమాన్ని కూడా ప్రారంభిస్తున్నాను’ అని ఆయన చెబుతున్నారు. అమెరికా ప్రస్తుతం జాతీయ అస్తిత్వ సంక్షోభంలో ఉంది. విశ్వాసం, దేశభక్తి, కఠిన శ్రమ వంటివి కుప్పగూలుతున్న క్షణంలో మనం ఒక పరమార్థం కోసం తపిస్తున్నాం. అవగాహనకు సంబంధించిన మన అవసరాలను సంతృప్తిపర్చుకునేందుకు వాతావరణతత్వం, కోవిడ్ తత్వం, జెండర్ భావజాలం వంటి లౌకిక మతాలను కౌగిలించుకుంటున్నాం. కానీ అమెరికన్ అంటే అర్థం ఏమిటనే ప్రశ్నకు మన వద్ద సమాధానం లేదు. ఈ మేలుకొలుపు వాదాన్ని (వోక్ ఎజెండా) పలుచన చేసి దాని ప్రాసంగికతను నిర్వీర్యం చేయడం, ఆ శూన్యాన్ని ఉత్తేజకర జాతీయ అస్తిత్వంతో భర్తీ చేయడం రిపబ్లికన్ పార్టీ ప్రథమ ప్రాధాన్యం కావాలి. కానీ దీనికి బదులుగా చాలామంది అగ్రశ్రేణి రిపబ్లికన్లు 1980లలో కంఠస్థం చేసిన నినాదాలను వల్లెవేస్తున్నారు. ప్రత్యామ్నాయాన్ని ప్రతి పాదించకుండానే వామపక్ష సంస్కృతిని విమర్శిస్తున్నారు. అమెరికాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు, అమెరికా అంటే ఏమిటి అని మనం కొత్తగా ఆవిష్కరించాల్సిన అవసరం ఉంది. అందుకే నేను అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నాను. ఒక నూతన అమెరికన్ స్వప్నాన్ని రూపొందించడానికి రాజకీయ ప్రచారాన్ని మాత్రమే కాకుండా, ఒక సాంస్కృతిక ఉద్యమాన్ని కూడా ప్రారంభిస్తున్నాను. 37 సంవత్సరాల ఒక రాజకీయ ఔట్‌సైడర్ భూమ్మీద అత్యున్న తమైన అధికారాన్ని సాధించాలనుకోవడం అహంకారంగానే కనిపించవచ్చు. కానీ, నేను మన జాతి కోసం, అమెరికన్ జీవితంలోని ప్రతి రంగంలోనూ ప్రతిభను పునరుద్ధరించగలిగే జాతి కోసం దార్శని కతలో భాగంగా పోటీ చేస్తున్నాను. మనం ప్రతిభను పునరుద్ధరించాలి. నా తల్లిదండ్రులు ఈ దేశానికి చట్టబద్ధంగా వచ్చారు, కష్టపడి పనిచేశారు, వేలాది అమెరికన్ల జీవితా లను మెరుగుపర్చిన వ్యాపార సంస్థలను రూపొందించిన ఇద్దరు పిల్లలను పెంచి పెద్దచేశారు. చట్టాన్ని అతిక్రమించి ప్రవేశిస్తున్న వారికి బదులుగా మా తల్లిదండ్రుల వంటి వలస ప్రజలు అవసరం. ఎలాంటి మొహమాటాలకూ తావులేకుండా అమెరికా సరిహద్దులకు భద్రత కల్పించడం, ప్రతిభా ప్రవేశాలకు అనుకూలంగా లాటరీ ప్రాతి పదికతో కూడిన వలస విధానాన్ని నిర్మూలించడం అవసరం. అమెరికాకు వచ్చి విజయాలు పొందినవారి ప్రతిభను మనం తప్పక ప్రోత్సహించాలి. అమెరికా శ్రామిక శక్తిలో దాదాపు 20 శాతం మందిని నియమిస్తున్న ఫెడరల్ కాంట్రాక్టర్లు జాతి ప్రాతిపదికన నియామకాలను చేపట్టడాన్ని తప్పనిసరి చేస్తూ అమెరికా పూర్వ అధ్య క్షుడు లిండన్ బి. జాన్సన్ కార్యనిర్వాహక ఆదేశం 11246 జారీ చేశారు. దీనివల్ల నల్లజాతి, హిస్పానిక్(స్పానిష్ దేశాలు) ఉద్యోగుల పట్ల అగ్రశ్రేణి కంపెనీలు ఎక్కువ అక్కర చూపుతూ– శ్వేత జాతి లేదా ఆసియన్ అమెరికన్లుగా ఉంటున్న అర్హత కలిగిన అభ్యర్థుల పట్ల అనిష్టం ప్రదర్శిస్తున్నాయి. ఇలాంటి కార్యనిర్వాహక ఆదేశాన్ని రద్దు చేయటమే కాకుండా, అక్రమమైన జాతి ప్రాతిపదిక ప్రాధాన్యాలపై విచారణ జరిపించాలని న్యాయ శాఖను ఆదేశిస్తాను. ప్రభుత్వాన్ని నిర్వహించడానికి ఎంపికైనవాళ్లు వాస్తవంగా ప్రభు త్వాన్ని నిర్వహించాలి. కాన్నీ ఎన్నికలలో పాల్గొనని ఆంథోనీ ఫాచీ (అమెరికా ముఖ్య వైద్య సలహాదారు), మెర్రిక్ గార్లండ్ (అమెరికా అటార్నీ జనరల్) వంటి బ్యూరోక్రాట్లు తమ పరిధిని మీరి ప్రవర్తించారు. ఇంకోసారి ఇలాంటి బ్యూరోక్రాట్లు తమ పరిధిని మీరినప్పుడు ఒక అధ్యక్షుడికి రాజ్యాంగం కల్పించిన సాధికారతను నేను తప్పకుండా అమలు చేయడానికి నిబద్ధత వహిస్తాను; వారిని తొలగిస్తాను. ఫెడరల్ ఉద్యోగులకు కల్పించిన సివిల్ సర్వీస్ సంరక్షణలను అవస రమైతే కార్యనిర్వాహక ఆదేశం ద్వారా రద్దు చేస్తాను. వీటికి బదులుగా నిర్దిష్టకాలం మాత్రమే రక్షణ కల్పించే మేనేజీరియల్ నిబంధనలను తీసుకొస్తాను. దేశాధ్యక్షుడు ఎనిమిదేళ్లకు మించి అధికారంలో ఉండ నప్పుడు,›బ్యూరోక్రాట్లకు కూడా దాన్నే వర్తింప జేయాలి. డబ్బును వృథా చేస్తున్న లేదా కాలం చెల్లిన సంస్థలకు నిధులను నిలిపివేసేలా– 1974 నాటి ‘ఇంపౌండ్‌మెంట్ కంట్రోల్’ చట్టాన్ని రద్దు చేయాలని లేక సవరించాలని అమెరికన్ కాంగ్రెస్‌ను కోరతాను. సంస్కరించడానికి సాధ్యం కాని సంస్థలను మూసివేస్తాను. వాటి స్థానంలో పునాదుల నుంచి కొత్త సంస్థలను నిర్మిస్తాను. ఏ భావాలనూ సెన్సార్ చేయనప్పుడే ఉత్తమ ఆలోచనలు పుట్టుకొస్తాయి. తమకు అనుకూలంగా లేని రాజకీయ ప్రసంగాలను సెన్సార్ చేయడంపై మన ప్రభుత్వం టెక్నాలజీ కంపెనీలపై ఒత్తిడి తీసుకొస్తోంది. అవి అలా చేసేట్టుగా ప్రత్యేక భద్రతను కల్పిస్తోంది. రాజ్య శక్తులతో కలిసి పనిచేసేలా ఇంటర్నెట్ కంపెనీలు అమెరికన్ రాజ్యాంగ తొలి సవరణకు కట్టుబడి ఉండాలి. ఎలాన్ మస్క్ ట్విట్టర్ విషయంలో చేసినట్టుగా, ఫెడరల్ గవర్నమెంట్ నుంచి ‘స్టేట్ యాక్షన్ ఫైల్స్’ను బహిర్గత పరుస్తాను. రాజ్యాంగం నిషేధించిన కార్య కలాపాలను చేపట్టేలా కంపెనీలను బ్యూరోక్రాట్లు తప్పుడు పద్ధతుల్లో ఒత్తిడిపెట్టినట్టు తెలిపే ప్రతి ఉదంతం దీని ద్వారా బయటికొస్తుంది. ఇంటర్నెట్‌ని దాటి మన ఆర్థిక వ్యవస్థ మొత్తంగా అభిప్రాయాల సెన్సార్షిప్ విస్తరించింది. నల్లజాతి, గే లేదా ముస్లింగా ఉంటున్నందుకు మీరు ఎవరినైనా ఉద్యోగం లోంచి తొలగించలేనట్లయితే, రాజ కీయ ప్రసంగం కోసం కూడా మీరు ఎవరినీ ఉద్యోగం లోంచి తొలగించకూడదు. అమెరికన్ పౌరహక్కుల కార్యకర్తగా రాజకీయ వ్యక్తీకర ణను ప్రతిష్ఠించడానికి నేను అమెరికన్ కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తాను. విభేదించే అభిప్రాయాలను కలిగివుండే కార్మికులను వివక్ష నుంచి కాపాడటానికి ప్రస్తుతం ఉనికిలో ఉన్న పౌర హక్కులను అమలు చేస్తాను. మత పరమైన వివక్షపై ఉన్న ఫెడరల్ ప్రభుత్వ నిషేధం ఉద్యోగులను ఏ మతానికీ లోబడనీయకుండా యజమానులను కట్టడి చేస్తోంది. కార్పొరేట్ అమెరికాలో వ్యాపించివున్న మేలుకొలుపు వాదానికి ఇది సరిగ్గా సరిపోయేట్టుగా ఉంది. పరస్పరం పంచుకునే సూత్రాల చుట్టూ మన జాతీయ అస్తి త్వాన్ని పునరుద్ధరించుకున్న తర్వాత, అమెరికాకు అతి పెద్ద విదేశీ ప్రమాదంగా ఉన్న కమ్యూనిస్టు చైనా వికాసాన్ని ఓడించడానికి అవసరమైన దృఢత్వాన్ని సమకూర్చుకోగలం. 1980లలో సోవియట్ యూనియన్ లాగా కాకుండా, చైనా నేడు ఆధునిక అమెరికన్ జీవన శైలికి కావాల్సిన శక్తిని ప్రసాదిస్తోంది. అందుకే మనం ఆర్థిక స్వాతంత్య్రాన్ని ప్రకటించుకోవాలి. చైనాను కనీసం తాకకుండా, అమెరికాను వణికిస్తున్న సరికొత్త వాతావరణ మతం చేస్తున్న డిమాండ్లను వ్యతిరేకించడం ద్వారా మనం ప్రపంచ ఇంధన నాయకత్వాన్ని తిరిగి పొందాలి. తైవాన్ను ఏ విధంగానైనా సరే కాపాడుతూనే సెమీ కండ క్టర్ల తయారీలో స్వయం సమృద్ధిని సాధించాలి. 16 సంవత్సరాల లోపు పిల్లలు టిక్ టాక్ ఉపయోగించకుండా నిషేధం విధించాలి. కోవిడ్–19ను వ్యాప్తి చెందించడంపై చైనాను జవాబుదారీని చేయ డానికి మనం ఆర్థిక తులాదండాన్ని తప్పకుండా ఉపయోగించాలి. చౌర్యం, వ్యాపారమయ ఎత్తుగడలను చైనా ప్రభుత్వం నిలిపి వేసేంతవరకు అవసరమైతే చైనాలోకి అమెరికన్ కంపెనీలు విస్తరించడాన్ని నిషేధించడానికి కూడా మనం సిద్ధపడాలి. మనం నిజంగా ఎవరం అని తిరిగి ఆవిష్కరించుకున్నట్లయితే మళ్లీ కాలానికి తగినట్టుగా మనం ఎదగగలం. అమెరికా బలం మన భిన్నత్వం కాదు, ఆ భిన్నత్వానికి అతీతంగా మనల్ని ఐక్యం చేస్తున్న ఆదర్శాలే మన బలం. ఈ ఆదర్శాలే అమెరికన్ విప్లవాన్ని గెలిపించాయి, అంతర్యుద్ధం తర్వాత దేశాన్ని ఐక్యపరిచాయి, రెండు ప్రపంచ యుద్ధాలను, ప్రచ్ఛన్న యుద్ధాన్ని గెలిపించాయి. ఈ ఆదర్శాలు ఇప్ప టికీ స్వేచ్ఛాయుత ప్రపంచం పట్ల ఆశను కలిగిస్తున్నాయి. వీటిని మనం పునరుద్ధరించినట్లయితే మనల్ని ఏ శక్తీ ఓడించలేదు. వివేక్ రామస్వామి వ్యాసకర్త అమెరికా అధ్యక్ష స్థానం కోసం పోటీ పడనున్నారు (‘వాల్ స్ట్రీట్ జర్నల్’ సౌజన్యంతో) -
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తా: నిక్కీ హేలీ
వాషింగ్టన్: 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలుస్తానని ప్రముఖ భారతీయ అమెరికన్, రిపబ్లికన్ పార్టీ నేత నిక్కీ హేలీ(51) ప్రకటించారు. ఈ నెల 15వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తానన్నారు. ఈ వారంలోనే ఇందుకు సంబంధించిన ఒక వీడియోను ఆమె విడుదల చేసే అవకాశం ఉందని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక్కరే ఇప్పటి వరకు రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష బరిలో ఉన్నట్లు ప్రకటించారు. ఎన్నికల ప్రచారాన్ని రెండు నెలల క్రితమే ప్రారంభించారు. తాజా పరిణామంతో తన మాజీ బాస్ ట్రంప్‌కు ఆమె ఏకైక ప్రత్యర్థిగా నిలువనున్నారు. నిక్కీ హేలీ సౌత్ కరోలినాకు రెండు పర్యాయాలు గవర్నర్ గాను, ఐరాసలో అమెరికాలో రాయబారిగాను పనిచేశారు. ట్రంప్ మళ్లీ అధ్యక్ష పదవికి పోటీ చేసిన పక్షంలో బరిలో ఉండబోనంటూ గతంలో ప్రకటించిన హేలీ మనసు మార్చుకున్నారు. నిక్కీ హేలీ అసలు పేరు నిమ్రత నిక్కీ రన్‌ధావా హేలీ. ఈమె తల్లిదండ్రులు అజిత్ సింగ్ రన్‌ధావా, రాజ్ కౌర్ రన్‌ధావా. పంజాబ్ అగ్రికల్చర్ వర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసే అజిత్ సింగ్ కుటుంబంతో కలిసి 1960ల్లో కెనడాకు, అక్కడి నుంచి అమెరికాకు చేరారు. -
Gujarat Assembly Election 2022: గిరిజనులంటే కాంగ్రెస్‌కు అలుసు
దాహోడ్/మెహసానా: ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి గిరిజనులపై నిజంగా ప్రేమ ఉంటే రాష్ట్రపతి ఎన్నికల్లో గిరిజన మహిళా అభ్యర్థిగా ఎందుకు మద్దతివ్వలేదని ప్రధాని మోదీ నిలదీశారు. ఆయన బుధవారం గుజరాత్‌లోని దాహోడ్ పట్టణంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. గిరిజనుల హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. రాష్ట్రపతి ఎన్నికల్లో గిరిజన మహిళా అభ్యర్థికి మద్దతు ఇవ్వకపోగా, ఆమెను ఓడించేందుకు ప్రతిపక్షం అభ్యర్థిని నిలబెట్టిందని ఆక్షేపించారు. కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ గిరిజనుల ఆశీస్సులతో ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ఎన్నికయ్యారని తెలిపారు. దాహోడ్ ప్రాంత అభివృద్ధికి కాంగ్రెస్ చేసిందేమీ లేదని విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే ఇక్కడి అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని నరేంద్ర మోదీ వెల్లడించారు. కాంగ్రెస్ మోడల్ అంటే ఇదే.. అవినీతి, కులతత్వం, బంధుప్రీతి, వారసత్వ రాజకీయాలు, మత విద్వేషం, సమాజంలో విభజన, ఓటు బ్యాంకు రాజకీయాలే కాంగ్రెస్ మోడల్ అని ప్రధాని మోదీ మండిపడ్డారు. కాంగ్రెస్ మోడల్ కేవలం గుజరాత్‌నే కాదు, మొత్తం దేశాన్ని నాశనం చేసిందని దుయ్యబట్టారు. ఆయన బుధవారం మెహసానాలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మాట్లాడారు. ప్రజలు ఎప్పటికీ పేదలుగా ఉండిపోవాలన్నదే ఆ పార్టీ ఉద్దేశమన్నారు. దురభిమానం, వివక్షను బీజేపీ ఏనాడూ నమ్ముకోలేదని, అందుకే యువత తమ పట్ల విశ్వాసం చూపుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో అస్తవ్యస్తంగా మారిన దేశాన్ని అభివృద్ధి చేసేందుకు తాము ఎంతగానో శ్రమిస్తున్నామని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. వడోదరలోనూ ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
Donald Trump: సంచలన ప్రకటనకు సిద్ధమైన ట్రంప్
అమెరికా వ్యాపార దిగ్గజం, ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటనకు సిద్ధమయ్యారు. ఈ మేరకు వచ్చే వారం భారీ ప్రకటనే చేయబోతున్నట్లు ఆయన ప్రకటించారు. అమెరికా మధ్యంతర ఎన్నికల వేళ.. సోమవారం ఒహియోలో అభిమానుల కోలాహలం నడుమ ఆయన ప్రసంగించారు. ‘‘రేపు అనేది చాలా ముఖ్యమైంది. అందులో కీలకమైంది ఎన్నికలు. దాని నుంచి తప్పుకోకుండా.. అంటూ అసంపూర్తిగా ముగించి.. ఆపై నవంబర్ 15, మంగళవారం, ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లోని మార్-ఎ-లాగోలో చాలా పెద్ద ప్రకటన చేయబోతున్నా’’ అంటూ పేర్కొన్నారు. దీంతో ట్రంప్ ఏం ప్రకటన చేయబోతున్నాడో అనే చర్చ జోరందుకుంది. మరోవైపు 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అంశంపైనే ఆయన ప్రకటన చేయబోతున్నారంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. 2020 అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైన ట్రంప్.. తన ఓటమిని ఏనాడూ అంగీకరించలేదు. అదీగాక.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి తీరతానంటూ గత కొన్నినెలలుగా ధీమా వ్యక్తం చేస్తున్నారు కూడా. ఇదీ చదవండి: చరిత్రలోనే అత్యంత వేడి.. 15వేల మంది మృతి -
ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో 94% పోలింగ్
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో 94 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 238 మంది ప్రతినిధులకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉండగా, సోమవారం జరిగిన ఎన్నికలకు సంబంధించి గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో 223 మంది ఓటేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వచ్చిన కేరళ ఎంపీ రాజ్‌మోహన్ ఉన్నితన్తోపాటు ఏఐసీసీ కార్యదర్శులు నదీమ్ జావెద్, రోహిత్ చౌదరి కూడా ఇక్కడే ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో 241 మంది ఓటర్లకుగాను మొత్తం 226 మంది ఓటర్లు ఓటేశారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, సీతక్క, నేతలు మధుయాష్కీగౌడ్, షబ్బీర్‌అలీ, జానారెడ్డి, వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, బెల్లయ్య నాయక్, మునుగోడు అభ్యర్థి పాల్వాయి స్రవంతి తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నవారిలో ఉన్నారు. కర్ణాటక ఇన్చార్జిగా ఉన్న ఏఐసీసీ కార్యదర్శి, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు బళ్లారిలో ఓటేయగా, మరో ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి ఏఐసీసీ కార్యాలయంలో ఓటేశారు. ఢిల్లీ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వెళ్లిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అక్కడే ఓటేశారు. లక్షదీప్ రిటర్నింగ్ అధికారిగా వెళ్లిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ అక్కడే ఓటేశారు. ఓట్లలో తేడాలొచ్చాయ్...: ఓటు హక్కు కల్పించినవారి జాబితాలో తేడాలొచ్చాయని పలువురు నేతలు ఆరోపించారు. టీపీసీసీ ప్రతినిధులుగా ఒకరిని ఎంపిక చేసి మరొకరికి ఓటు హక్కు కల్పించారంటూ పార్టీ సీనియర్ నేతలు దామోదర రాజనర్సింహ, పొన్నాల లక్ష్మయ్య గాంధీభవన్ మెట్లపై బైఠాయించారు. జనగామ నియోజకవర్గం నుంచి శ్రీనివాస్‌రెడ్డి, నారాయణ్‌ఖేడ్ నుంచి మాజీ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి కుమారుడు సంజీవరెడ్డిల పేర్లు ఓటరు లిస్టులో లేవని రిటర్నింగ్ అధికారి వెనక్కి పంపడం తమకు అవమానకరమని వ్యాఖ్యానించారు. ఏఐసీసీ కార్యదర్శి రోహిత్‌చౌదరి వచ్చి సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు. కాగా, ఓటర్ల జాబితాలో తప్పులు వచ్చాయని, ఓటేసే వారిని చూస్తుంటే తనకే ఆశ్చర్యం కలుగుతోందని, ఈ ఓటరు జాబితాపై కేంద్ర ఎన్నికల అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీకి ఫిర్యాదు చేస్తానని నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. రానివారు వీరే.... : టీపీసీసీ ప్రతినిధులు పొదెం వీరయ్య, అజారుద్దీన్, ఫిరోజ్‌ఖాన్, చల్లా వెంకట్రామిరెడ్డి, పల్లె కల్యాణి (ఇటీవలే టీఆర్ఎస్లో చేరారు), కొలన్ హన్మంతరెడ్డి, రాంచంద్రారెడ్డి, కె.లక్ష్మారెడ్డి, బోథ్ నియోజకవర్గానికి చెందిన మరో నేత ఓటింగ్‌కు హాజరు కాలేదు. మైనార్టీ సెల్ అధ్యక్షుడు అబ్దుల్ సోహైల్ స్థానంలో అజీముద్దీన్ అనే నాయకుడి పేరు ఓటరు జాబితాలో చేర్చగా, ఇద్దరూ ఓటింగ్‌కు రాలేదని, వివిధ కారణాలతో మరికొందరు గైర్హాజరయ్యారని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. -
ముగిసిన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోలింగ్.. 96% ఓటింగ్ నమోదు
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ముగిసింది. దేశ వ్యాప్తంగా 96 శాతం ఓటింగ్ నమోదైంది. ఢిల్లీ ఏఐసీసీ ఆఫీస్‌లోని పోలింగ్ బూత్‌లో 100 శాతం ఓటింగ్ నమోదు కాగా.. చండీగఢ్‌లోనూ 100 శాతం ఓటింగ్ నమోదైంది. ఈ నెల 19న ఢిల్లీలోని ఏఐఐసి కార్యాలయంలో ఓట్ల లెక్కింపు జరగనుంది. అదే రోజు ఫలితాలను వెల్లడించనున్నారు. సాక్షి, హైదరాబాద్: గాంధీభవన్‌లో ఎఐసీసీ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ముగిసింది. 238 ఓట్లకు గాను 228 మంది పీసీసీ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అజారుద్దీన్, ఫిరోజ్ ఖాన్, చల్లా వెంకట్రామిరెడ్డి ఓటు వేయలేదు. ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ రెడ్డి, వంశీ చంద్ రెడ్డి ఢిల్లీలో ఓటు వేశారు. హర్కర వేణుగోపాల్ ల్లక్షద్వీప్లో ఓటేయగా.. ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు బెంగళూరులో ఓటేశారు. 137 ఏళ్ల కాంగ్రెస్ చరిత్రలో.. స్వాతంత్ర అనంతరం ఆరవసారి అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. పైగా ఈ 22 ఏళ్ల తర్వాత అధ్యక్ష ఎన్నికలు జరుగుతుండడం ప్రత్యేకతను సంతరించుకుంది. గాంధీయేతర కుటుంబం నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు కాబోతున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది పార్టీ శ్రేణుల్లో. అధ్యక్ష ఎన్నికల బరిలో సీనియర్లు మల్లికార్జున ఖర్గే, శశిథరూర్‌లు నిలిచిన సంగతి తెలిసిందే. ► కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు కొనసాగుతున్నాయి. దాదాపు 9 వేల మంది పీసీసీ డెలిగేట్స్ ఓటింగ్ ప్రక్రియలో పాల్గొంటున్నారు. మరో గంటలో ఓటింగ్ ముగియనుంది. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే కర్ణాటకలో ఓటేశారు. ► బహిరంగంగా, ప్రజాస్వామయుతంగా, పారదర్శకంగా ఎన్నికలను నిర్వహించడం ద్వారా కాంగ్రెస్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచినా పార్టీ సభ్యులందరి నుంచి పూర్తి మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ► శశిథరూర్‌తో తనకు ఎలాంటి శత్రుత్వం లేదని మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. అధ్యక్ష ఎన్నిక పోలింగ్ సమయంలో తన ప్రత్యర్ధి శశి థరూర్ గురించి మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. ‘ మేం మిత్రులం. శత్రువులు కాదు. రాజ్యాంగం ప్రకారం ఐక్య సభలో పోరాడుతున్నాం.. మాకు ఎలాంటి శత్రుత్వం లేదు. నేను థరూర్‌తో ఫోన్లో మాట్లాడను’ అని తెలిపారు. ► కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి కోల్‌కతాలోని పార్టీ కార్యాలయంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ► మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోల్ మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయం తిలక్ భవన్లో ఓటేశారు. Maharashtra Congress chief Nana Patole casts his vote to elect the next party president at the Maharashtra Pradesh Congress Committee office in Tilak Bhavan, Mumbai pic.twitter.com/LdzkGEUGOV — ANI (@ANI) October 17, 2022 ► ఓటేసిన రాహుల్ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. ఆ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కర్ణాటకలో భారత్ జోడో యాత్రలో ఉన్న ఆయన.. బళ్లారిలో క్యాంప్సైట్లోనే ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో ఓటు వేశారు. #WATCH | Congress MP Rahul Gandhi casts his vote to elect the next party president at Bharat Jodo Yatra campsite in Ballari, Karnataka (Source: AICC) pic.twitter.com/9Jit8vIpVo — ANI (@ANI) October 17, 2022 ► ఛత్తీస్‌గఢ్ రాయ్‌పూర్ ఏఐసీసీ కార్యాలయంలో ఓటు హక్కు వినియోగించుకున్న ముఖ్యమంత్రి భూపేష్ బాగెల్. Chhattisgarh CM Bhupesh Baghel cast his vote to elect the new party president, at the AICC office in Raipur pic.twitter.com/hWosfBAwmf — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) October 17, 2022 ► ఓటేసిన మాజీ ప్రధాని మన్మోహన్ దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.. తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. Delhi | Former Prime Minister Dr Manmohan Singh casts his vote to choose the new Congress president pic.twitter.com/ETSvSdHKbk — ANI (@ANI) October 17, 2022 ► ఈ క్షణాల కోసమే ఎదురు చూస్తున్నా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికపై తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ స్పందించారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్లిన ఆమె.. ‘నేను కూడా ఈ క్షణం కోసమే చాలాకాలంగా ఎదురు చూస్తున్నా’’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. అంతకు ముందు ఆమె తన తనయ ప్రియాంక గాంధీ వాద్రాతో ఓటు హక్కు వినియోగించుకున్నారు. #WATCH | "I have been waiting for a long time for this thing," says Congress interim president Sonia Gandhi on the party's presidential election pic.twitter.com/9giL5DeOEX — ANI (@ANI) October 17, 2022 #WATCH | Congress interim president Sonia Gandhi & party leader Priyanka Gandhi Vadra cast their vote to elect the new party president, at the AICC office in Delhi pic.twitter.com/aErRUpRVv0 — ANI (@ANI) October 17, 2022 ► తెలుగు రాష్ట్రాలు సహా పలు రాష్ట్రాల్లో పీసీసీ ప్రతినిధులు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌లో ఓటు వేస్తున్నారు. కాంగ్రెస్ అధినేత్రి(తాత్కాలిక) సోనియాగాంధీ ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఓటు హక్కు వినియోగించుకుంటారని సీనియర్ నేత జైరాం రమేశ్ వెల్లడించారు. ► ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ ఎంపీలు చిదంబరం, జైరామ్ రమేశ్, ఇతర నేతలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. Congress presidential elections | Congress MPs P Chidambaram, Jairam Ramesh and other party leaders cast their votes at the AICC office in Delhi. pic.twitter.com/IUMhCjKdst — ANI (@ANI) October 17, 2022 ► ఇద్దరు అభ్యర్థులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. ఫోన్లో ఒకరికొకరు ఆల్ ది బెస్ట్ చెప్పుకున్నట్లు ప్రకటించారు. I believe the revival of Congress has begun: Congress presidential candidate Shashi Tharoor Today I spoke to Mr Kharge and said whatever has happened, we remain colleagues and friends, Tharoor adds. pic.twitter.com/4gv1zR5W99 — ANI (@ANI) October 17, 2022 ► తన విజయంపై ధీమా వ్యక్తం చేశారు ఎంపీ శశిథరూర్. ► భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్న వాళ్లు.. ఓటింగ్‌లో పాల్గొనడం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సంగనకల్లు దగ్గర మీటింగ్ రూంలనే పోలింగ్ బూత్‌లుగా మార్చేశారు. రాహుల్ గాంధీ సహా జోడో యాత్రలో పాల్గొంటున్న వాళ్లు ఇక్కడే ఓటు హక్కు వినియోగించుకుంటారు. ► ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు ఏర్పాట్లను సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసుదన్ మిస్ట్రీ దగ్గరుండి పర్యవేక్షించారు. బుధవారం(19 అక్టోబర్) కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది. బ్యాలెట్ పేపర్లు అన్నీ కలిసిపోయి ఉంటాయి. కౌంటింగ్‌లో చెల్లని ఓట్లను పక్కన పెడతారు. ఎవరికైతే 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు వస్తే వారు కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికవుతారు. కౌంటింగ్ అనంతరం కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల సంఘం చైర్మన్ మధుసుదన్ అధికారికంగా విజేతను ప్రకటిస్తారు. ► కాంగ్రెస్‌లో సోనియా గాంధీ కుటుంబ జోక్యంపై గత కొంతకాలంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఈ తరుణంలో.. అధ్యక్ష ఎన్నికల్లో పార్టీ అధిష్టానం తటస్థంగా ఉండాలని భావించింది. అందుకే ఇద్దరిలో ఎవరికీ బహిరంగంగా తమ మద్దతును ప్రకటించలేదు. అయితే.. ► మల్లికార్జున ఖర్గేకు కొందరు పీసీసీ చీఫ్‌లు మద్దతు ప్రకటించడం, పార్టీ బేరర్ పదవుల్లో ఉన్న కొందరు ఓటేయాలని పిలుపు ఇవ్వడం పట్ల శశిథరూర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల అధికార సంఘానికి కొందరి తీరుపై ఫిర్యాదు కూడా చేశారు. ► సుదీర్ఘ రాజకీయ అనుభవం, సీనియర్ల అండ, దళిత మార్క్, పైగా అన్ని రాజకీయ పార్టీలతోనూ మంచి సంబంధాలు కలిగి ఉండడం.. మల్లికార్జున ఖర్గేకు కలిసొచ్చే అంశం. ► కాంగ్రెస్ యువజన వర్గాల మద్దతుతో బరిలోకి దిగారు శశిథరూర్. ► సోమవారం ఉదయం పది గంటల ప్రాంతంలో మొదలైన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోలింగ్.. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా 65 పోలింగ్ బూత్‌లలో.. 9వేల మందికిపైగా పీసీసీ ప్రతినిధులు.. ఎక్కడికక్కడే తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. -
రాహుల్ గాంధీ అందుకు నో చెప్పారు: శశిథరూర్
తిరువనంతపురం: కాంగ్రెస్ అధ్యక్ష పదవి పోటీ నుంచి తనను తప్పుకోవాలని రాహుల్ గాంధీ సూచించినట్లు వస్తున్న కథనాలను తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ ఖండించారు. అయితే.. కొందరు కాంగ్రెస్ సీనియర్లు మాత్రం ఈ విషయమై రాహుల్ గాంధీని సంప్రదించినట్లు తెలిసిందని, ఆ విషయాన్ని స్వయంగా రాహుల్ గాంధీనే తనతో చెప్పారని థరూర్ వివరించారు. ‘‘థరూర్ ఆ పోస్టుకు సరితూగడు. ఆయన్ని కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల నుంచి నామినేషన్‌ను ఉపసంహరించుకునేలా విజ్ఞప్తి చేయండి’’ అని రాహుల్ గాంధీని కొందరు సీనియర్లు కోరినట్లు తెలుస్తోంది. ఈ పరిణామంపై కేరళలో ప్రస్తుతం పోల్ క్యాంపెయిన్‌లో ఉన్న థరూర్.. మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీతో సంభాషణ సందర్భంగా నాకు ఈ విషయం తెలిసింది. నన్ను నామినేషన్ ఉపసంహరించుకోవాలని ఆయన్ని(రాహుల్) కొందరు సీనియర్లు కోరారట. కానీ, ఆయన మాత్రం అందుకు అంగీకరించలేదు. నేను పోటీ చేయడం వల్ల పార్టీకి మేలు జరుగుతుందని రాహుల్ భావిస్తున్నట్లు చెప్పారట. పైగా పార్టీ అధినేత పదవికి పోటీ చేయాలని పదేళ్లుగా చెబుతున్నానంటూ ఆయన నాకు గుర్తు చేశారు. ఎన్నికల నుండి తప్పుకోవడం ద్వారా తన ఈ ప్రయత్నంలో ఇప్పటివరకు తనకు మద్దతు ఇచ్చిన వారికి ద్రోహం చేయబోనని కూడా థరూర్ చెప్పారు. ‘‘తన మద్దతుదారులలో ఎక్కువ మంది యువ నేతలు, పార్టీ కార్యకర్తలు ఉన్నారన్న థరూర్.. ఈక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ సుధాకరన్.. మల్లికార్జున ఖర్గేతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. తద్వారా తన మద్దతును చెప్పకనే చెప్పారాయన. ఈ పరిణామంపై థరూర్ స్పందించారు. ‘‘సీనియర్లు నాకు మద్దతు ఇస్తారని ఏనాడూ అనుకోలేదు. ఇప్పుడు జరుగుతుందని కూడా అనుకోను. కానీ, అదే సమయంలో ప్రతీ ఒక్కరి మద్దతును తాను కోరుకుంటున్నట్లు థరూర్ తెలిపారు. అయితే యువతతో పాటు అన్ని వయస్కుల నుంచి తనకు మద్దతు అవసరమని, అందుకే ఎవరినీ తగ్గించి మాట్లాడబోనని కూడా థరూర్ అన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ అక్టోబర్ 17న జరగనుండగా.. ఓట్ల లెక్కింపు అక్టోబర్ 19న చేపట్టి అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు. సుమారు 9,000 మందికి పైగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) ప్రతినిధులు ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటారు. మార్పు నినాదంతో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల కోసం శశిథరూర్ ప్రచారం నిర్వహిస్తుండగా.. పార్టీ కోసం అహర్నిశలు పని చేసే సీనియర్ నేతగా, ‘దళిత’ మార్క్‌తో బరిలో దిగనున్నారు మల్లికార్జున ఖర్గే. -
2024 ఎన్నికల్లో పోటీ చేస్తా
న్యూజెర్సీ: అగ్రరాజ్యం అమెరికాలో 2024లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీచేస్తానన్న సంకేతాలను మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చారు. తాను పోటీలో ఉండాలని ప్రజలంతా కోరుకుంటున్నారని, ఎన్నికల్లో కచ్చితంగా ముందంజలో నిలుస్తానని అన్నారు. ఆయన తాజాగా ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్భుతంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. తన పాలనలో భారత్‌తో దృఢమైన సంబంధాలు ఏర్పాటు చేసుకున్నామని వివరించారు. భారత్‌కు తనకంటే అమెరికా అధ్యక్షుడిగా గొప్ప మిత్రుడు గతంలో ఎన్నడూ దొరకలేదని వ్యాఖ్యానించారు. ఈ విషయం ప్రధాని మోదీని అడిగితే బాగా తెలుస్తుందని అన్నారు. ఇండియాతో, నరేంద్ర మోదీతో తనకు చక్కటి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయని చెప్పారు. మోదీతో తనకు చాలాకాలంగా పరిచయం ఉందని.. మోదీ, తాను మంచి స్నేహితులమని పేర్కొన్నారు. ఆయన గొప్ప వ్యక్తి, ప్రధానిగా అద్భుతమైన సేవలు అందిస్తున్నారని కొనియాడారు. నిజానికి ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించడం అంత సులభం కాదని పేర్కొన్నారు. అమెరికాలోని భారతీయ సమాజం తనకు అండగా నిలుస్తోందని డొనాల్డ్ ట్రంప్ ఆనందం వ్యక్తం చేశారు. -
శ్రీలంక అధ్యక్ష ఎన్నికల వేళ.. భారత్ సాయం కోరిన ప్రేమదాస
కొలంబో: తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో నేడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో శ్రీలంక ప్రతిపక్ష పార్టీ సమగి జన బలవేగయ నాయకుడు సాజిత్ ప్రేమదాస సోషల్ మీడియా వేదికగా భారత్‌కి ఒక విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో... "ప్రధాని నరేంద్ర మోదీకి, భారత్‌లోని అన్ని రాజకీయ పార్టీలకు నా హృదయ పూర్వక అభ్యర్థన. అధ్యక్షుడిగా ఎవరూ ఎన్నికైనా భారత్ లంక తల్లికి మద్దతిచ్చి సహాయం చేస్తు ఉండాలని కోరారు." నెలల తరబడి సాగిన నిరసనకారులు ఆందోళనల నడుమ శ్రీలంక మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్స గతవారమే రాజీనామా చేశారు. రాజపక్స కుటుంబికులే ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్నారని వారివల్లే ఆర్థిక సంక్షోభానికి దారితీసిందంటూ వెల్లువెత్తిన విమర్శల నేపథ్యంలో గోటబయ లంక విడిచిపెట్టి పోవాల్సి రావడమే కాకుండా పదవికి రాజీనామ చేయాల్సిన దుస్థితి ఎదురైంది. ఆయన వెళ్లిపోతూ.. లంక అధ్యక్ష బాధ్యతలు విక్రమ సింఘే రణిల్కి అప్పగించారు. దీంతో విక్రమసింఘే లంక తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. కానీ విక్రమసింఘేను రాజపక్స మిత్రపక్షంగా చూసే నిరసనకారులు ఆయన పట్ల విముఖత చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే లంకలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. ఐతే ఈ అధ్యక్ష ఎన్నికల్లో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ప్రధాని రణీల్ విక్రమ సింఘే, విద్యాశాఖ మాజీ మంత్రి డల్లాస్ అలహప్పెరుమా, వామపక్ష జనతా విముక్తి పెరమున పార్టీ నేత అనురా దిస్సనాయకేలు పోటీ పడుతున్నట్లు పార్లమెంట్ ప్రకటించింది. ఐతే ఈ త్రిముఖ పోటీలో రణిల్ విక్రమసింఘేకే గెలిచే అవకాశాలు ఎక్కువని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదీగాక అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానన్న పెరమున నుండి విడిపోయిన గ్రూప్‌కు చెందిన కీలక నేత డల్లాస్ అలహప్పెరును అధ్యక్ష ఎన్నికకు పోటీ చేస్తుండటంతో సాజిత్ ప్రేమదాస ఈ ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. 225 మంది సభ్యులున్న శ్రీలంక పార్లమెంట్లో బుధవారం అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచిన అధ్యక్షుడు 2024 నవంబరు వరకు పదవిలో కొనసాగనున్నారు. (చదవండి: Sri Lanka Presidential Election: శ్రీలంక అధ్యక్ష బరిలో ముగ్గురు.. విక్రమ సింఘేకే అవకాశం!) -
ద్రౌపది ముర్ముకు ఏపీ ప్రభుత్వ ఆత్మీయ ఆతిథ్యం (ఫొటోలు)
-
ముర్ముకు వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతు: సీఎం జగన్
5:03 PM తెలుగులో ప్రసంగం ప్రారంభించిన రాష్ట్రపతి అభ్యర్థి ముర్ము అనేక వారసత్వ కట్టడాలకు ఏపీ నిలయం: ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్‌కు ఘనమైన చరిత్ర ఉంది: ద్రౌపది ముర్ము ఎందరో మహనీయులు తెలుగు గడ్డపై జన్మించారు: ద్రౌపది ముర్ము 4:57 PM ముర్ముకే సంపూర్ణ మద్దతు: సీఎం జగన్ ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ముర్ముకు వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు సీఎం జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. రాష్ట్రపతి అభ్యర్థి ముర్మును గెలుపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు సీఎం జగన్. ఈ మేరకు మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం జగన్ మాట్లాడారు. ‘రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన మహిళకు తొలిసారి అవకాశం లభించింది. వైఎస్సార్సీపీ మొదటి నుంచి సామాజిక న్యాయం వైపే ఉంది. సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపించిన ప్రభుత్వం మనది. మనమంతా ముర్ముకే ఓటేసి గెలిపించుకోవాలి. ఏ ఒక్క ఓటు వృథా కాకుండా చూసుకోవాలి’ అని సీఎం జగన్ అన్నారు. 4:33 PM మంగళగిరి సీకే కన్వెన్షన్‌కు చేరుకున్న ముర్ము, సీఎం జగన్ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో ద్రౌపది ముర్ము సమావేశం 4:00 PM సీఎం వైఎస్ జగన్ నివాసానికి చేరుకున్న ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం వైఎస్ జగన్‌తో మర్యాద పూర్వక భేటీ సీఎం నివాసం నుంచి సీకే కన్వెన్షన్‌కి వెళ్లనున్న సీఎం వైఎస్ జగన్, ద్రౌపది ముర్ము, కిషన్ రెడ్డి 3:10 PM ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము.. మంగళవారం ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్న ప్రాంతంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ద్రౌపది ముర్ముకు విమానాశ్రయంలో వైఎస్సార్సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, మార్గాని భరత్, గోరంట్ల మాధవ్ స్వాగతం పలికారు. ఆమెకు గిరిజన సంప్రదాయంలో ఎంపీలు ఘన స్వాగతం అందించారు. అనంతరం ఎయిర్‌పోర్టు నుండి ద్రౌపది ముర్ము రోడ్డు మార్గంలో విజయవాడుకు బయలుదేరారు. ఇక, ఆమె వెంట కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా ఉన్నారు. ఏపీ పర్యటనకు వచ్చిన ద్రౌపది ముర్ము.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డితో భేటీ కానున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఇది కూడా చదవండి: రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము తెలంగాణ పర్యటన రద్దు -
ట్రంప్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
వాష్టింగ్టన్: వచ్చే అధ్యక్ష(2024) ఎన్నికల కోసం ముందు నుంచే ప్రచారం ప్రారంభించాలని భావిస్తున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు పరిస్థితులు ఎదురు కాబోతున్నాయి. క్యాపిటల్ హిల్ దాడి వ్యవహారంలో ట్రంప్ చుట్టు ఉచ్చు గట్టిగానే బిగుస్తోంది. ఆగ్రహంతో ఉన్న గుంపుతో తాను కూడా చేరాలని ట్రంప్ భావించారని, ఈ మేరకు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని తాజాగా ఆ దాడిపై విచారణ చేపట్టిన కమిటీ నిర్ధారించింది. ఈ మేరకు మరింత అప్డేట్ కోసం ఎదురు చూడండంటూ విచారణ కమిటీ సభ్యుడు ఆడమ్ కింజింగర్ తెలిపారు. 2021, జనవరి 6వ తేదీన క్యాపిటల్ భవనంపై దాడికి యత్నం జరగ్గా.. దాడికి కారణమైన ఆగ్రహ జ్వాలలను మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎగదోశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై విచారణ చేపట్టిన కమిటీకి ఉపాధ్యక్షురాలిగా ఉన్న రిపబ్లికన్ పార్టీ సభ్యురాలు లిజ్ ఛెనీ ఈ మేరకు ఆ ఆరోపణలను ధృవీకరించారు కూడా. అంతేకాదు వాళ్లను నిలువరించే పరిస్థితి ఉన్నా.. ట్రంప్ ఆ పని చేయలేదన్నది ఆమె ఆరోపణ. ఇప్పటికే ఆయన హయాంలో పని చేసిన అధికారులతో సహా ఎంతో మంది ఆయనకు వ్యతిరేక సాక్ష్యం చెప్పారు. ఈ నెలలో ఈ వ్యవహారంపై మరో రెండు వాదనలు జరగనున్నాయి. తద్వారా ఇప్పటిదాకా సేకరించిన ఆధారాలతో ట్రంప్ పాత్రను బలంగా చూపించి.. ఆయనకు పక్కాగా దోషిగా నిలబెట్టే ప్రయత్నాలు చేయబోతోంది కమిటీ. అంతేకాదు అధ్యక్షుడిగా వైట్‌హౌజ్‌లో ఆయన, ఆయన కుటుంబ సభ్యులు గడిపిన చివరి రోజులను సైతం పరిశీలించనుంది. కీలకమైన డాక్యుమెంట్లను ఆయన నాశనం చేశారన్న ఆరోపణల మేరకే ఈ పని చేయబోతోంది. ఇదిలా ఉంటే.. ఈ విచారణ మొత్తం రాజకీయ బూటకమని ట్రంప్ కొట్టిపారేస్తున్నారు. మరోవైపు 2024లో అధ్యక్ష ఎన్నికలు జరుగుతుండగా.. 2020 ఓటమితో సంబంధం లేకుండా బరిలోకి దిగుతానని ట్రంప్ చెప్తున్నారు. ఒకవేళ క్యాపిటల్ భవనం దాడి విషయంలో ఏదైనా ప్రతికూల తీర్పు వస్తే మాత్రం.. పోటీకి ఆయన అర్హత కోల్పోవడం మాత్రమే కాదు.. రాజద్రోహం కింద శిక్ష పడినా పడే అవకాశాలు ఉన్నాయని న్యాయ నిపుణులు చెప్తున్నారు. -
President election 2022: రాష్ట్రపతి బరిలో ముర్ము, సిన్హా
న్యూఢిల్లీ: ఈ నెల 18వ తేదీన జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల బరిలో అధికార ఎన్డీఏ, ప్రతిపక్షాల తరఫున నామినేషన్లు వేసిన ద్రౌపది ముర్ము, యశ్వంత్ సిన్హాలు బరిలో మిగిలారు. నామినేషన్ల పరిశీలన అనంతరం గురువారం రిటర్నింగ్ అధికారి, రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీ ఈ విషయం ప్రకటించారు. ఆఖరి రోజైన బుధవారం వరకు 94 మంది 115 నామినేషన్లు వేశారన్నారు. నిర్ణీత ప్రమాణాల మేరకు లేని కారణంగా వీటిలో 107 నామినేషన్లను తిరస్కరించామన్నారు. ముర్ము, సిన్హాలు దాఖలు చేసిన నాలుగేసి సెట్ల చొప్పున నామినేషన్ పత్రాలు నిర్దేశిత అన్ని వివరాలతో ఉన్నందున వీటిని ఆమోదించినట్లు వివరించారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఈ నెల 2వ తేదీతో ముగుస్తుందని చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను అదే రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత గెజిట్‌లో ప్రచురిస్తామన్నారు. ముర్ము, సిన్హాతోపాటుగా రాష్ట్రపతి ఎన్నికలకు నామినేషన్ వేసిన వారిలో పలువురు సామాన్యులు కూడా ఉన్నారు. ముంబై మురికి వాడ వాసి, తమిళనాడుకు చెందిన సామాజిక కార్యకర్త, ఢిల్లీకి చెందిన ప్రొఫెసర్‌తోపాటు ఆర్జేడీ వ్యవస్థాపకుడు లాలూ ప్రసాద్ యాదవ్ తరఫున ఈసారి నామినేషన్లు పడ్డాయి. -
ప్రతిపక్షాల అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన యశ్వంత్ సిన్హా
Opposition's Presidential polls candidate Yashwant Sinha.. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా.. సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. విపక్ష పార్టీల నేతలతో కలిసి యశ్వంత్ సిన్హా.. పార్లమెంట్ కార్యదర్శికి నామినేషన్ పత్రాలు అందించారు. నామినేషన్ దాఖలుకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, ఎన్సీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, తదితరులు ఆయన వెంట ఉన్నారు. Opposition's Presidential polls candidate Yashwant Sinha files his nomination at the Parliament in Delhi pic.twitter.com/2BGztPZwmB — ANI (@ANI) June 27, 2022 ఇది కూడా చదవండి: పార్టీల రిజిస్ట్రేషన్ రద్దు చేసే పవర్ ఇవ్వండి.. న్యాయ శాఖకు ఈసీ వినతి -
రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడు..??
-
Sakshi Cartoon: రాష్ట్రపతి ఎన్నికలకు ఇవన్నీ అవసరం లేదయ్యా!
రాష్ట్రపతి ఎన్నికలకు ఇవన్నీ అవసరం లేదయ్యా! వెళ్లండీ!! -
రాష్ట్రపతి ఉద్యోగానికి అభ్యర్థి కావలెను
-
Presidential election: బీజేపీ ‘ఏకాభిప్రాయ’ మంత్రం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికపై ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నించాలని బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం మిత్రులతో పాటు వితిపక్ష యూపీఏ భాగస్వాములతోనూ, ప్రాంతీయ పార్టీలతోనూ సంప్రదింపులు జరపాలని నిర్ణయించింది. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్నా«థ్సింగ్లకు ఈ బాధ్యత అప్పగించింది. అన్ని పార్టీ ల నేతలతో వారు చర్చలు జరుపుతారని ఆదివారం ప్రకటించింది. వారిద్దరూ త్వరలో రంగంలోకి దిగనున్నారు. రాజ్‌నాథ్‌కు పార్టీలకు అతీతంగా అందరు నేతలతోనూ సత్సంబంధాలున్నాయి. 2107 రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా రామ్‌నాథ్ కోవింద్‌ను అభ్యర్థిగా ఖరారు చేశాక చివరి క్షణాల్లో తమను సంప్రదించాయని విపక్షాలు ఆరోపించడం తెలిసిందే. ఈసారి వాటికా అవకాశం ఇవ్వరాదన్నదే బీజేపీ తాజా నిర్ణయం వెనక ఉద్దేశమని చెబుతున్నారు. విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిని బరిలో దించడంపై 15న చర్చించుకుందామంటూ బీజేపీయేతర పాలిత రాష్ట్రాల సీఎంలతో పాటు పలు పార్టీలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ లేఖ రాయడం తెలిసిందే. ఆ మర్నాడే బీజేపీ ఏకాభిప్రాయ సాధనకు తెర తీయడం ఆసక్తిగా మారింది. 2017లోనూ రాష్ట్రపతి ఎన్నికపై చర్చలు, సంప్రదింపులు జరిపిన బీజేపీ కమిటీలో అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడుతో పాటు ఆయన కూడా ఉన్నారు. ఆ ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థిగా లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ బరిలో దిగడం తెలిసిందే. -
రాష్ట్రపతి ఎన్నికల బరిలో లాలూ ప్రసాద్ యాదవ్!
లాలూ ప్రసాద్ యాదవ్ రాష్ట్రపతి ఎన్నికల బరిలో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఈ మేరకు ఆయన కీలక ప్రకటన కూడా చేశారు. జూన్ 15వ తేదీన నామినేషన్ పేపర్లు దాఖలు చేసేందుకు హస్తినకు ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేసుకున్నట్లు తాజాగా లాలూ ప్రసాద్ యాదవ్ ప్రకటించారు. అయితే.. ఈయన ఆర్జేడీ చీఫ్, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్(74) కాదు. బీహార్ రాజకీయాల్లో, ఎన్నికల్లొచ్చిన ప్రతీసారి తీవ్ర గందరగోళానికి కారణమయ్యే వ్యక్తి ఇతను. పేరు కూడా లాలూ ప్రసాద్ యాదవ్. సరన్ జిల్లా మరహౌరా అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని రహీంపుర్ గ్రామవాసి. ఈ లాలూ ప్రసాద్ యాదవ్‌ను అంతా ముద్దుగా ‘కర్మభూమి’ అని పిలుస్తుంటారు. గతంలోనూ ఈయన రాష్ట్రపతి ఎన్నికల బరిలో దిగే ప్రయత్నం చేశారు. 2017లో నామినేషన్ పేపర్లు దాఖలు చేశారు. ఆ టైంలో బీహార్ గవర్నర్‌గా ఉన్న రామ్‌నాథ్ కోవింద్, మాజీ లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్ మధ్య ప్రధాన పోటీ నడిచింది. అయితే ఆ టైంలో లాలూ పేరుని ప్రతిపాదించేంత మంది లేకపోవడంతో అది తిరస్కరణకు గురైంది. అందుకే ఈసారి పక్కగా సిద్ధమై ఢిల్లీ ఫ్లైట్ ఎక్కుతున్నాడట. ఇక ఇంతకు ముందు ఎన్నో ఎన్నికల్లో లాలూ ప్రసాద్ యాదవ్ పోటీ చేశాడు. ఆ టైంలో ఓటర్లు గందరగోళానికి గురయ్యారు. అయితే అతనికి గెలుపు మాత్రం దక్కలేదు. ఇక 2014 లోక్‌సభ ఎన్నికలలో తన భార్య రబ్రీదేవి ఓటమికి ఈ లాలూ కూడా ఓ కారణమంటూ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోపించారు. ఆ విషయాన్నే సంబురంగా గుర్తు చేసుకుంటున్నాడు సరన్ జిల్లా వాసి లాలూ. ఇదిలా ఉంటే.. ఈ లాలూ ప్రసాద్ యాదవ్ పంచాయితీ నుంచి ప్రెసిడెంట్ ఎన్నికల దాకా దేన్ని వదలకుండా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటాడట. కనీసం రికార్డులతో అయినా తన పేరు పదిలపర్చుకోవాలని ఆరాట పడుతున్నాడు ఈ 42 ఏళ్ల రైతు. -
పీకే తో సీఎం కేసీఆర్ కీలక చర్చలు
-
ఏం చేద్దాం: పీకేతో సీఎం కేసీఆర్ చర్చలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ రాజకీయాలు, రాష్ట్రపతి ఎన్నికల్లో ఏం చేయాలనే అంశాలపై ప్రధానంగా.. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చర్చలు జరుపుతున్నారు. ఈ రెండు అంశాలపై ఇప్పుడు సీఎం కేసీఆర్ ప్రధానంగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం గత రెండు రోజలుగా ఎన్నికల వ్యూహకర్త పీకేతో వరుసగా చర్చిస్తున్నారు. అంతేకాదు రాష్ట్రపతి ఎన్నికల ఎజెండాగా మమతా బెనర్జీ పిలుపు ఇచ్చిన భేటీకి వెళ్లే విషయంపైనా పీకే నుంచి అభిప్రాయాన్ని తీసుకుంటున్నారు సీఎం కేసీఆర్. ఎన్డీఏ అభ్యర్థిని ఓడించడమే టార్గెట్.. మమతా బెనర్జీ విపక్షాల తరపున అభ్యర్థి ఎంపికకు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకోసం 22 విపక్షాలకు 15న ఢిల్లీలో మమత ఆహ్వానం పంపారు. అదే సమయంలో జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ పాత్ర కీలకం అని పీకే వెల్లడించారట. రాష్ట్రపతి ఎన్నికల కోసం విపక్షాల అభ్యర్థి ఎంపికలో కేసీఆర్ పాత్ర పై చర్చ వీరిరువురి నడుమ చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. గత రెండు రోజులుగా హైదరాబాద్‌లో ఉన్న పీకే.. ఈ మేరకు సీఎం కేసీఆర్‌తో వరుస భేటీలు జరుపుతున్నారు. -
కేసీఆర్ మాటన్నీ హాస్యాస్పదమే: కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి
-
సోనియా గాంధీతో రేపు శరద్ పవార్ భేటీ.. అందుకేనా ??
-
President Election Schedule 2022: రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్.... ఎప్పుడంటే..!
-
రాష్ట్రపతి ఎన్నికలకు మోగనున్న నగారా
-
రాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం!
సాక్షి, ఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్‌కు రంగం సిద్ధమైంది. ఒకట్రెండు రోజుల్లో నోటిఫికేషన్‌ను విడుదల చేయబోతున్నట్లు సమాచారం. జులై 25వ తేదీలో రాష్గ్రపతి(ప్రస్తుత) రామ్‌నాథ్ కోవింద్ పదవీ కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికల హడావిడి షురూ కానుంది. రాష్ట్రపతి ఎన్నికల కోసం ఈసారి 776 మంది ఎంపీలు, 4120 ఎమ్మెల్యేలు ఓటు వేయనున్నారు. మొత్తం ఓట్ల విలువ 10,98,903గా ఉండబోతుండగా.. అందులో ఎంపీ ఓటు విలువ 708గా ఉంది. అత్యధికంగా యూపీ ఎమ్మెల్యే ఓటు విలువ 208గా ఉండనుంది. ఈసారి గిరిజనులకు లేదంటే మహిళలకు రాష్ట్రపతి పదవి దక్కే అవకాశముందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రచారంలోకి మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ము, ఛత్తీస్‌ఘడ్ గవర్నర్ అనసూయ, కేంద్రమంత్రులు అర్జున్ ముండా, జుయల్ ఓరం పేర్లు వినిపిస్తున్నాయి. తొలిసారిగా రాష్ట్రపతి పీఠంపై గిరిజనులకూ అవకాశం కల్పించే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మహిళా కోటాలో తెలంగాణ గవర్నర్ తమిసై పేరు ప్రచారంలోకి రావడం విశేషం. ఒకవేళ అగ్రవర్ణాలకు ఇవ్వదలచుకుంటే మాజీ లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, రాజ్‌నాథ్ సింగ్ పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మైనార్టీ కోటాలో ముక్తార్ అబ్బాస్ నక్వీ, కేరళ గవర్నర్ అరిఫ్ మహ్మద్ ఖాన్ పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఇప్పటిదాకా ఆరుగురు ఉపరాష్ట్రపతులకు.. రాష్ట్రపతులుగా అవకాశం దక్కగా.. అదే తరహాలో వెంకయ్యనాయుడుకు అవకాశం దక్కవచ్చన్న ప్రచారమూ నడుస్తోంది. దక్షిణాది నుంచి ఇప్పటివరకు రాష్ట్రపతులుగా సర్వేపల్లి రాధాకృష్ణ, వివి.గిరి, నీలం సంజీవరెడ్డి, ఆర్.వెంకట్రామన్ పని చేసిన సంగతి తెలిసిందే!. -
రాష్ట్రపతి ఎన్నికలపై పెరిగిన బీజేపీ పట్టు
న్యూఢిల్లీ: అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఈ ఏడాది జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలపై బీజేపీ పట్టుని పెంచాయి. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ విజయఢంకా మోగించడంతో రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల్లోకి వెళ్లిపోయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీ కాలం ఈ ఏడాది జూలై 24తో ముగిసిపోతుంది.రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో పాటు అన్ని రాష్ట్రాల శాసనసభ, శాసనమండలి సభ్యులు ఉంటారు. ఒకవేళ యూపీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ విజయం సాధించి ఉంటే బీజేపీకి ఒడిశాలోని బీజేడీ, తెలుగు రాష్ట్రాల్లోని వైఎస్సార్సీపీ, టీఆర్ఎస్ మద్దతు అవసరమయ్యేది. కానీ యూపీతో పాటు ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌లో బీజేపీ విజయం రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయేకి అడ్వాంటేజ్‌గా మారిందని లోక్‌సభ సెక్రటరీ జనరల్ పి. శ్రీధరన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో లోక్‌సభ ఎంపీలు 543 మంది, రాజ్యసభ ఎంపీలు 233 మందితో పాటుగా రాష్ట్రాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 4,120 మంది మొత్తంగా 4,896 మంది సభ్యులుగా ఉంటారు. ఎంపీల ఓటు విలువ 708గా ఉంటే, ఎమ్మెల్యేల ఓటు విలువ రాష్ట్రాలను బట్టి మారిపోతుంది. 1971 జనాభా లెక్కల ఆధారంగా ఎమ్మెల్యేల ఓటు విలువని నిర్ణయించారు. ఎమ్మెల్యే ఓటు విలువ అత్యధికంగా 208గా ఉంది. గురువారం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన ఉత్తరప్రదేశ్‌లో ఎమ్మెల్యేల మొత్తం ఓట్ల విలువ 83,824, పంజాబ్‌లో 13,527, ఉత్తరాఖండ్‌లో 4,480, గోవాలో 800, మణిపూర్‌లో 1080గా ఉంది. ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేరు ఇప్పటికే చక్కర్లు కొడుతోంది. బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయేలో చీలికలు తేవడానికి బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పేరుని కూడా ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిగా ప్రతిపాదించాలని కొందరు డిమాండ్ చేశారు. ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులందరి ఓట్ల మొత్తం విలువ 10,98,903లో 50శాతానికి పైగా ఓట్లు వస్తేనే ఎన్నికల్లో విజయం సాధించగలరు. జరగబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రధాని మోదీ ప్రతిపాదించిన అభ్యర్థి సునాయాసంగా విజయం సాధిస్తారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. -
దక్షిణ కొరియా అధ్యక్ష ఎన్నికల్లో హోరాహోరీ
సియోల్: దక్షిణ కొరియా దేశాధ్యక్ష ఎన్నికలు బుధవారం జరిగాయి. ఈ దఫా ప్రధాన అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు నెలకొందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రీ ఎలక్షన్ సర్వేలో అధికార డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి లీ జే మైంగ్,ప్రతిపక్ష పీపుల్స్ పవర్ పార్టీ అభ్యర్థి జనరల్ యూన్ సుక్ యేల్లు ఇతర అభ్యర్థుల కన్నా ముందంజలో ఉన్నారని తేలింది. ఎన్నికల అనతరం విడుదలైన ఎగ్జిట్ పోల్స్‌లో జనరల్ యూన్‌కు 48.4 శాతం, లీ కి 47.8 శాతం ఓట్లు వచ్చాయి. బుధవారం ఎన్నికలో సుమారు 77 శాతం ఓటింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో గెలుపొందినవారు మేలో అధ్యక్ష పదవి చేపడతారు. -
చిలీ అధ్యక్షుడిగా బోరిక్
శాంటియాగో: చిలీ అధ్యక్ష ఎన్నికల్లో వామపక్ష విద్యార్థి సంఘం మాజీ నేత గాబ్రియెల్ బోరిక్(35) ఘన విజయం సాధించారు. సోమవారం ప్రకటించిన ఫలితాల్లో బోరిక్ సునాయాసంగా రికార్డు స్థాయిలో 56% ఓట్లు గెలుచుకున్నారు. ప్రధాన ప్రత్యర్థి జోస్ ఆంటోనియో కాస్ట్ కంటే 10 పాయింట్లు ఎక్కువగా సాధించారు. దేశ పాలనపగ్గాలు చేపట్టిన ఆధునిక ప్రపంచ యువ నేతల్లో ఒకరిగా, అత్యంత పిన్న వయస్కుడైన చిలీ అధ్యక్షుడిగా బోరిక్ నిలిచారు. రాజధాని శాంటియాగోలో విజయోత్సవాల్లో భారీగా హాజరైన ప్రజలు, ముఖ్యంగా యువతనుద్దేశించి బోరిక్ స్థానిక మపుచె భాషలో ప్రసంగించారు. దేశాన్ని పునర్నిర్మిస్తానని ప్రకటించారు. ప్రజలందరికీ సమానంగా న్యాయం అందిస్తానని వాగ్దానం చేశారు. చిలీ అధ్యక్షుడు సెబాస్టియన్, బోరిక్‌తో ఫోన్లో సంభాషించారు. మార్చిలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న ఆయనకు సహకారం అందిస్తానని చెప్పారు. -
అమెరికాలో ప్రారంభమైన ఎలక్టోరల్ ఓటింగ్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలకు సంబంధించి మరో ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 538 మంది ఎలక్టర్లు సోమవారం తమ తమ రాష్ట్రాల రాజధానుల్లో సమావేశమై అధ్యక్ష అభ్యర్థులకు ఓట్లు వేస్తున్నారు. మీడియా కథనాల ప్రకారం తుది సమాచారం అందేవరకు డెమొక్రట్ అభ్యర్థి బైడెన్‌కు 156, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (రిపబ్లికన్ పార్టీ)కు 106 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. మొత్తం బ్యాలెట్లు డిసెంబర్ 23వ తేదీ నాటికి వాషింగ్టన్ చేరుకుంటాయి. జనవరి 6వ తేదీన అమెరికా పార్లమెంటు ఉభయసభలు సంయుక్తంగా సమావేశమై ఆ బ్యాలెట్లను లెక్కిస్తాయి. కొత్త అధ్యక్షుడిగా బైడెన్ ఎన్నిక లాంఛనమే. అమెరికాలో రాష్ట్రాల వారీగా ఎలక్టోరల్ ఓట్లు ఉంటాయన్న విషయం తెలి సిందే. -
రాత్రికి రాత్రే నా ఓట్లు మాయం..
వాషింగ్టన్: ఎన్నికలు జరిగిన రాత్రికి రాత్రే తన ఓట్లు అనూహ్యంగా అదృశ్యమయ్యాయని, అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇలా అదృశ్యమైన అనేక ఓట్లను గుర్తించినట్లు మీడియాకి తెలిపారు. రాత్రి పదిగంటలకు తన విజయం తథ్యమని, తాను అత్యంత సులభంగా గెలుస్తానని అంతా చెప్పారు. అయితే హఠాత్తుగా తన ఓట్లు మాయమవడం ప్రారంభమైందన్నారు. డెమొక్రటిక్ పార్టీకి చెందిన జో బైడెన్ ట్రంప్‌పై గెలిచినప్పటికీ ట్రంప్ తన ఓటమిని అంగీకరించకుండా సాకులు వెతుకుతున్న విషయం తెలిసిందే.