
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో ఈ ఏడాది నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో విజయం ఎవరిదన్న దానిపై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ ఏర్పడింది. మాజీ ప్రత్యర్థులు డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ మళ్లీ పోటీ పడుతున్నారు. గెలుపుపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల అభిప్రాయం ఏమిటన్నదానిపై వాల్‌స్ట్రీట్ జర్నల్ పత్రిక ఓపీనియన్ పోల్ నిర్వహించింది. ఏడు కీలక రాష్ట్రాల్లో సర్వే చేయగా, ఏకంగా ఆరు రాష్ట్రాల్లో ట్రంప్ వైపు మొగ్గు కనిపించింది. తదుపరి అధ్యక్షుడిగా ట్రంప్‌ను ఎన్నుకోవడానికి ప్రజలు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ విధానాల పట్ల జనం అసంతృప్తిగా ఉన్నట్లు సర్వేలో వెల్లడయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment