ప్రజాస్వామ్యానికి ట్రంప్‌ ప్రమాదకరం: జో బైడెన్‌ | US President Joe Biden Says That America Needs to Imprison Trump. | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్యానికి ట్రంప్‌ ప్రమాదకరం: జో బైడెన్‌

Published Wed, Oct 23 2024 7:51 AM | Last Updated on Wed, Oct 23 2024 11:01 AM

US President Joe Biden Says That America Needs to Imprison Trump.

న్యూయార్క్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్‌ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను లాక్‌(జైలులో వేయాలి) చేయాలని అధ్యక్షుడు జో బైడెన్‌ అన్నారు. అధ్యక్ష ఎన్నికలకు రెండు వారాల ముందు న్యూ హాంప్‌షైర్‌లోని కాంకార్డ్‌లో ఉన్న డెమోక్రటిక్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రెసిడెంట్‌ జో బైడెన్ మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. 

డొనాల్డ్‌ ట్రంప్ ఎదుర్కొంటున్న పలు నేరారోపణల ఎత్తి చూపుతూ బైడెన్‌ జైలులో వేయాలని విమర్శలు గుప్పించారు. ట్రంప్ 2020 అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తారుమారు చేసే ప్రయత్నాలు చేశారు. అప్పటి నుంచి పలు నేరారోపణలను ఎదుర్కొంటున్నారని అన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో  డొనాల్డ్‌ ట్రంప్ గెలిస్తే.. అమెరికా ప్రజాస్వామ్యానికి తీవ్రమైన ముప్పు కలుగుతుందని బైడెన్ హెచ్చరించారు.

‘‘అమెరికా ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. ఈ రాజకీయ ఉద్రిక్తత 2016 ఎన్నికలను గుర్తు చేస్తుంది. 2016 ఎన్నికల సమయంలో ట్రంప్.. హిల్లరీ క్లింటన్‌ను ఉద్దేశిస్తూ ‘లాక్‌ హర్‌ అప్‌’ అని ప్రచారం చేయాలని తన మద్దతుదారులను ప్రోత్సహించారు.  దీనిని అప్పుడు ట్రంప్‌ తన ప్రచారానికి అ‍స్త్రంగా ఉపయోగించుకున్నారు. కానీ, ప్రస్తుతం వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్అ టువంటి వ్యాఖ్యలు, నినాదాలకు చాలా దూరంగా ఉన్నారు. నేరారోపణలను కోర్టులు చూసుకుంటాయి. మనం నవంబర్‌లో ఫలితాలను చూద్దామని కమల వ్యాఖ్యానించారు. నేను హాజరయ్యే ప్రతి అంతర్జాతీయ సమావేశంలో ఇతర దేశాధినేతలు ట్రంప్‌ అధ్యక్ష ఎన్నికల్లో గెలవలేడని చెప్పారు’’ అని అన్నారు.  

అయితే.. 2016 ఎన్నికల ప్రచారంలో తన మద్దతుదారులు ‘లాక్‌ హర్‌ అప్‌’ అంటూ హిల్లరీ క్లింటన్‌ను ఉద్దేశిస్తూ భారీగా నినాదాలు చేశారు. ఆ సమయంలో ట్రంప్‌ తన మద్దతుదారులను నిలువరించలేదు. ప్రస్తుతం అదే ఫార్ములాను ట్రంప్‌నకు కమలా హారిస్‌ మద్దతుదారులు అన్వయిస్తూ నినాదాలు చేయటం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement