న్యూయార్క్: అమెరికా ఉపాధ్యక్షురాలు, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిని కమలా హారిస్ గెలిస్తే.. సొంత మార్గాన్ని ఎంచుకుంటారని అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కంటే ప్రత్యేకంగా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ ఏమీ చేయలేదన్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో ప్రెసిడెంట్ జో బైడెన్ స్పందించారు.
‘‘అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ గెలిస్తే.. ఆమె సొంత మార్గాన్ని ఎంచుకుంటారు. ప్రతి ప్రెసిడెంట్ కూడా సొంత మార్గాన్ని మాత్రమే ఎంచుకుంటారు. నేనే కూడా అదే చేశాను. నేను మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు విధేయుడిగా ఉన్నా. ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన అడుగుజాడల్లో నడిచాను. కానీ నేను అధ్యక్షుడిగా నా స్వంత మార్గాన్ని ఎప్పుడూ తప్పలేదు.
.. నాలాగే కమల కూడా చేస్తారు. ఆమె ఇంతవరకు నాకు విధేయంగా ఉన్నారు. అయితే.. ఆమె అధ్యక్షురాలి గెలిస్తే తన సొంత మార్గాన్ని ఎంచుకుంటారు. అమెరికా ప్రజల సమస్యలపై కమల అలోచన విధానం చాలా కొత్తగా ఉంటుంది. డొనాల్డ్ ట్రంప్ ఆలోచన విధానం పాతది, విఫలమైంది. ఆయన ఆలోచనల్లో ఎటువంటి నిజాయితీ ఉండదు’’ అని అన్నారు.
ఇక.. 2009 నుంచి 2017 వరకు ఒబామా ప్రెసిడెంట్‌గా ఉన్న సమయంలో జో బైడెన్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న విషయం తెలిసిందే.
చదవండి: కొరియా దేశాల మధ్య హైఅలర్ట్.. కిమ్ ఆర్మీలోకి భారీ చేరికలు
Comments
Please login to add a commentAdd a comment