న్యూయార్క్: ప్రస్తుతం అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ‘చెత్త’ చూట్టూ రాజకీయం నడుస్తోంది!. తాజాగా.. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అధ్యక్షుడు బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు కౌంటర్ ఇస్తూ బుధవారం ఓ చెత్త ట్రక్‌ను నడిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
‘నా చెత్త ట్రక్ మీకు నచ్చిందా?. కమలా, జో బిడెన్‌ల గౌరవార్థంతో ట్రక్ నడుపుతున్నా’ అని ట్రంప్ మీడియాతో అన్నారు. ‘‘హాస్యనటుడు టోనీ హించ్‌క్లిఫ్ ప్యూర్టోరీకోపై చేసిన వ్యాఖ్యలపై ప్రస్తావించాల్సిన అవసరం లేదు. నాకు ఆ హాస్యనటుడి గురించి ఏమీ తెలియదు. నేను ఆయన్ను ఎప్పుడూ చూడలేదు. ఆయన ఒక హాస్యనటుడు.. ఆయన గురించి చెప్పడానికి ఏం ఉంటుంది’ అని మీడియా ప్రశ్నలను ట్రంప్ దాటవేశారు.
TRUMP ARRIVES FOR CAMPAIGN RALLY IN A GARBAGE TRUCK!
“How do you like my garbage truck? This truck is in honor of Kamala and Joe Biden.”
“For Joe Biden to make that statement — it’s really a disgrace” pic.twitter.com/jA9nEQKvCg— J Stewart (@triffic_stuff_) October 30, 2024
ఇటీవల రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ భారీ బహిరంగ సభలో పాల్గొన్న స్టాండప్ కమేడియన్ టోనీ హించ్‌క్లిఫ్ మాట్లాడుతూ ప్యూర్టోరీకోను నీటిపై తేలుతున్న చెత్తకుప్పగా అభివర్ణించారు. దానిపై అమెరికావ్యాప్తంగా ఇప్పటికీ నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. అయితే.. ప్యూర్టోరీకోపై టోనీ వ్యాఖ్యలను తిప్పికొట్టే క్రమంలో అధ్యక్షుడు జోబైడెన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
హిస్పానిక్ గ్రూప్ వోటో లాటినో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బైడెన్ మాట్లాడుతూ.. ‘నాకు తెలిసిన అసలైన చెత్త ఆయన (ట్రంప్) మద్దతుదారులు మాత్రమే. వారి రూపంలోనే అసలైన చెత్తాచెదారం కనిపిస్తోంది’’ అని అన్నారు. తాను చెత్త అన్నది ప్యూర్టోరీకోపై అసహ్యకర వ్యాఖ్యలు చేసిన ట్రంప్ మద్దతుదారును ఉద్దేశించి మాత్రమేనంటూ వివరణ ఇచ్చుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. కానీ బైడెన్ వ్యాఖ్యలపై దుమారం చల్లారడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment