Hillary Clinton
-
ట్రంప్ మాటకు హిల్లరీ నవ్విన వేళ..
అమెరికాలో స్వర్ణయుగం తెస్తానని ట్రంప్ ప్రమాణస్వీకార ప్రసంగంలో పలు ప్రతిజ్ఞలు చేస్తున్నవేళ విపక్ష నాయకురాలు, అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ కిసుక్కున నవ్వారు. ఓవైపు ట్రంప్ సీరియస్‌గా మాట్లాడుతుంటే హిల్లరీ ఎందుకలా నవ్వారన్న అంశం ఇప్పుడు అమెరికాలో చర్చనీయాంశమైంది. హిల్లరీ నవ్విన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అయితే ఇందుకు కారణం లేకపోలేదు. దశాబ్దాలుగా స్థిరపడిపోయిన ఒక భౌగోళిక స్వరూపం పేరును ఊరకే ఒక దేశాధ్యక్షుడు ఇష్టమొచ్చినట్లు మార్చితే ఇబ్బందులు రావా? అనేది ఇక్కడ అసలు ప్రశ్న. ‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో’ అనే పేరు శతాబ్దాల క్రితమే స్ధిరపడిపోయింది. ఇప్పుడు హఠాత్తుగా అమెరికాలాంటి ఏదో ఒక్క దేశం తాము ఈ ప్రాంతాన్ని మరోలా పిల్చుకుంటామంటే కుదరదు. కొత్త పేరును తగిలించడానికి అంతర్జాతీయంగా మ్యాప్‌లలో పేర్లు మార్చాలి. ఈ మార్గంలో వెళ్లే భారీనౌకల సాఫ్ట్వేర్లలో, సముద్ర సంబంధ ఉపగ్రహాల్లోల డేటాల్లో, చమురు, వాణిజ్య సంస్థల ఒప్పందాల్లో.. ఇలా ఎన్నింటిలోనూ ఈ ప్రాంతం పాత పేరును చెరిపేసి కొత్తపేరును రాయాల్సి ఉంటుంది. ఇదంతా ఎంతో శ్రమతో కూడిన వ్యవహారం. అన్ని దేశాల ∙ఏకాభిప్రాయంతో జరగాల్సిన సుదీర్ఘ ప్రక్రియ ఇది. When Donald Trump starts talking the Gulf of America, the entire sane world is Hillary Clinton. pic.twitter.com/Yp3gp61Wka— Brad Bo 🇺🇸 (@BradBeauregardJ) January 21, 2025 -
మహిళలకు మళ్లీ మొండిచెయ్యే
అమెరికా అధ్యక్ష పదవిని అధిష్టించిన తొలి మహిళగా కమలా హారిస్ చరిత్ర సృష్టిస్తారన్న అంచనాలు తారుమారయ్యాయి. 2016 తర్వాత మరోసారి ఓ మహిళకు అత్యున్నత పీఠం త్రుటిలో చేజారింది. హారిస్ మాదిరిగానే 2016 అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ కూడా హోరీహోరీ తలపడ్డారు. అమెరికా చరిత్రలో ఒక ప్రధాన పార్టీ తరఫున అధ్యక్ష బరిలో దిగిన తొలి మహిళగా నిలిచారు. హిల్లరీ కూడా డెమొక్రటిక్ పార్టీ తరఫునే పోటీ చేయడం విశేషం. అప్పుడు కూడా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంపే. ఆయనతో డిబేట్లలో హిల్లరీ తడబడ్డా ఆద్యంతం గట్టి పోటీ ఇచ్చి చెమటలు పట్టించారు. అంతేగాక ఆ ఎన్నికల్లో పాపులర్ ఓట్ కూడా సాధించారు. అంటే దేశవ్యాప్తంగా పోలైన ఓట్లలో ఆమెకే ఎక్కువ పడ్డాయి. ట్రంప్ కంటే హిల్లరీ ఏకంగా 28 లక్షల పై చిలుకు అధిక ఓట్లు సాధించారు. కానీ ఎలక్టోరల్ కాలేజీ విధానం వల్ల ట్రంప్ చేతిలో 76 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అప్పట్లో డెమొక్రాట్ల రాష్ట్రాలుగా పేరుబడ్డ విస్కాన్సిన్, మిషిగన్, పెన్సిల్వేనియాల్లో ఓటమి కూడా హిల్లరీ కొంప ముంచింది. హిల్లరీ 2008లో కూడా డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యరి్థత్వం కోసం విఫలయత్నం చేశారు. భర్త బిల్ క్లింటన్ అమెరికా అధ్యక్షునిగా ఉన్న 1993–2001 మధ్య కాలంలో ఆమె ఫస్ట్ లేడీగా వ్యవహరించారు. ఆమెకు ముందు 1968లోనే చార్లెన్ మిషెల్ అనే మహిళ కమ్యూనిస్టు పార్టీ తరఫున అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. పెద్దగా పోటీ ఇవ్వలేకపోయినా ఈ ఘనత సాధించిన తొలి నల్లజాతి మహిళగా నిలిచిపోయారు. మిషెల్ పేరు కేవలం నాలుగు రాష్ట్రాల్లో మాత్రమే బ్యాలెట్ పత్రాలపై చోటుచేసుకుంది. 150 ఏళ్ల క్రితమే తొలి పోటీ అమెరికా చరిత్రలో అధికారికంగా ఒక మహిళ అధ్యక్ష ఎన్నికల బరిలో దిగిన ఉదంతం 150 ఏళ్ల క్రితమే చోటుచేసుకుంది. ఆమె పేరు విక్టోరియా వుడ్హల్. 1872లో ఈక్వల్ రైట్స్ పార్టీ తరఫున ఆమె అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. మహిళలకు పురుషులతో సమాన హక్కుల కోసం ఉద్యమించిన నేతగా వుడ్హల్కు పేరుంది. అమెరికాలో మహిళలకు ఓటు హక్కే ఉండని రోజుల్లో ఆమె ఏకంగా అధ్యక్ష పదవికే పోటీపడటం సంచలనంగా నిలిచింది. అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయాలంటే కనీసం 35 ఏళ్లు నిండి ఉండాలి. కానీ పోటీ చేసేనాటికి వుడ్హల్కు 33 ఏళ్లు మాత్రమే. ఎన్నికల్లో ఆమె ఒక్క ఎలక్టోరల్ ఓటు కూడా సాధించలేకపోయారు. తర్వాత 1884, 1888ల్లో బెల్వా ఆన్ లాక్వుడ్ అనే మహిళను ఈక్వల్ రైట్స్ పార్టీ అధ్యక్ష ఎన్నికల బరిలో దింపింది. తర్వాత చాలాకాలానికి 1964లో మార్గరెట్ చేజ్ స్మిత్ రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యరి్థత్వం కోసం పోటీ పడ్డారు. తద్వారా ఒక ప్రధాన పార్టీ అభ్యరి్థత్వ రేసులో దిగిన తొలి మహిళగా నిలిచారు. 1972లో షిర్లీ చిషోమ్ డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యరి్థత్వం కోసం ప్రయత్నించారు. ఆ పార్టీ అధ్యక్ష అభ్యర్థి రేసులో నిలిచిన తొలి మహిళగా, తొలి నల్లజాతీయురాలిగా గుర్తింపు పొందారు. ఇక ఒక ప్రధాన పార్టీ తరఫున ఉపాధ్యక్ష పదవికి పోటీపడ్డ తొలి మహిళగా గెరాల్డిన్ ఫెరారో. ఆమె 1984లో డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి మాల్టర్ మాండలేకు రన్నింగ్మేట్గా వ్యవహరించారు. 2004లో సారా పాలిన్ రిపబ్లికన్ పార్టీ తరఫున ఆ ఘనత సాధించిన తొలి మహిళగా నిలిచారు. ఆమె జాన్ మెక్కెయిన్కు రన్నింగ్మేట్గా వ్యవహరించారు. గత 30 ఏళ్లుగా పలు చిన్న పార్టీల తరఫున కూడా ఎందరో మహిళలు అధ్యక్ష రేసులో నిలిచారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ప్రజాస్వామ్యానికి ట్రంప్ ప్రమాదకరం: జో బైడెన్
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను లాక్(జైలులో వేయాలి) చేయాలని అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. అధ్యక్ష ఎన్నికలకు రెండు వారాల ముందు న్యూ హాంప్‌షైర్‌లోని కాంకార్డ్‌లో ఉన్న డెమోక్రటిక్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రెసిడెంట్ జో బైడెన్ మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. డొనాల్డ్ ట్రంప్ ఎదుర్కొంటున్న పలు నేరారోపణల ఎత్తి చూపుతూ బైడెన్ జైలులో వేయాలని విమర్శలు గుప్పించారు. ట్రంప్ 2020 అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తారుమారు చేసే ప్రయత్నాలు చేశారు. అప్పటి నుంచి పలు నేరారోపణలను ఎదుర్కొంటున్నారని అన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిస్తే.. అమెరికా ప్రజాస్వామ్యానికి తీవ్రమైన ముప్పు కలుగుతుందని బైడెన్ హెచ్చరించారు.NOW - Biden says America needs to imprison Trump 14 days before election day: "We gotta lock him up."@disclosetv pic.twitter.com/FB6Xb8Wv3T— THE VOICE 🌹 🗣🎙🇺🇸🦅🌎⚓💜♠️CHRIST CONSCIOUSNESS (@WETHEKINGDQMQ98) October 22, 2024‘‘అమెరికా ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. ఈ రాజకీయ ఉద్రిక్తత 2016 ఎన్నికలను గుర్తు చేస్తుంది. 2016 ఎన్నికల సమయంలో ట్రంప్.. హిల్లరీ క్లింటన్‌ను ఉద్దేశిస్తూ ‘లాక్ హర్ అప్’ అని ప్రచారం చేయాలని తన మద్దతుదారులను ప్రోత్సహించారు. దీనిని అప్పుడు ట్రంప్ తన ప్రచారానికి అస్త్రంగా ఉపయోగించుకున్నారు. కానీ, ప్రస్తుతం వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్అ టువంటి వ్యాఖ్యలు, నినాదాలకు చాలా దూరంగా ఉన్నారు. నేరారోపణలను కోర్టులు చూసుకుంటాయి. మనం నవంబర్‌లో ఫలితాలను చూద్దామని కమల వ్యాఖ్యానించారు. నేను హాజరయ్యే ప్రతి అంతర్జాతీయ సమావేశంలో ఇతర దేశాధినేతలు ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో గెలవలేడని చెప్పారు’’ అని అన్నారు. అయితే.. 2016 ఎన్నికల ప్రచారంలో తన మద్దతుదారులు ‘లాక్ హర్ అప్’ అంటూ హిల్లరీ క్లింటన్‌ను ఉద్దేశిస్తూ భారీగా నినాదాలు చేశారు. ఆ సమయంలో ట్రంప్ తన మద్దతుదారులను నిలువరించలేదు. ప్రస్తుతం అదే ఫార్ములాను ట్రంప్‌నకు కమలా హారిస్ మద్దతుదారులు అన్వయిస్తూ నినాదాలు చేయటం గమనార్హం. -
Us: బైడెన్ వయసు.. హిల్లరీ క్లింటన్ కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ వయసు,జ్ఞాపకశక్తిపై దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. తాజాగా బైడెన్ వయసుపై మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ కీలక వ్యాఖ్యలు చేశారు. బైడెన్ వయసు సమస్య న్యాయమైనదేనని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. వయసు కారణంగా బైడెన్ జ్ఞాపకశక్తిలో అనేక లోపాలను గుర్తించినట్లు ఇటీవల ఓ నివేదిక వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ సమస్య వైట్ హౌస్ దృష్టిలోనూ ఉందని హిల్లరీ క్లింటన్ చెప్పారు. మరో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విషయంలోనూ వయసు సమస్య ఉందన్నారు. యువ ఓటర్లను ఆకర్షించడంలో ఇద్దరికీ ఇబ్బందులు తప్పకపోవచ్చన్నారు. వయసు ఒక సమస్యేనని, అయితే ఓటర్లు ఉత్తమ అభ్యర్థిని ఎన్నుకోవడం ముఖ్యమన్నారు. అధ్యక్షుడిగా బైడెన్ మరోసారి ఎన్నిక కావాలని హిల్లరీ ఆకాంక్షించారు. ఆయన ఎన్నో మంచి పనులు చేశారని కితాబిచ్చారు. నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ల తరపున జో బైడెన్, రిపబ్లికన్ల తరపున ట్రంప్ మళ్లీ తలపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాగా, బైడెన్ జ్ఞాపకశక్తి తగ్గిందనే విషయాన్ని ఇటీవలే ఒక నివేదిక తగిన సాక్ష్యాధారాలతో బహిర్గతం చేయడంతో ప్రస్తుతం ఈ అంశం అమెరికాలో చర్చనీయాంశమైంది. ఇప్పటికే బైడెన్ వృద్ధాప్యాన్ని ఎన్నికల ప్రచారాస్త్రంగా మలుచుకున్న రిపబ్లికన్లకు తాజా నివేదిక మరో శక్తివంతమైన ప్రచారాస్త్రమైంది. అయితే ఈ నివేదికలోని అంశాలన్నీ తప్పు అని 81 ఏళ్ల బైడెన్ ఖండించారు. ఇదీ చదవండి.. అమెరికాలో చిన్నారిని ఓవెన్‌కు బలి చేసుకుంది -
‘హలో.. హిల్లరీ క్లింటన్‌ను ఉరి తీశారా?’
వాషింగ్టన్: అమెరికా మాజీ విదేశాంగ మంత్రి, బిల్ క్లింటన్ భార్య హిల్లరీ క్లింటన్ ప్రాణాలతో లేరా? ఆమెను ఉరి తీశారా?? ఈ మేరకు రెండు రోజుల క్రితం టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఒక వీడియో పోస్ట్ వైరల్ కావడం కలకలం రేపింది. ఇది నిజమో.. కాదో తెలుసుకునేందుకు నిన్నామొన్నా వైట్‌హౌజ్ హెల్ప్ లైన్‌కి వందల కొద్దీ కాల్స్ వచ్చాయి. హత్యా, పిల్లల అక్రమ రవాణా ఆరోపణలపై ఆమెను అమెరికా మిలిటరీ అరెస్ట్ చేసిందని, గువాంటనమో తీరంలోని జైల్లో రహస్యంగా ఆమెకు ఉరిశిక్షను అమలు చేశారని ఆ పోస్ట్ వెనుక సారాంశం. అదే నిజమైతే.. ఆ వార్త సెన్సేషన్ కావాలి కదా!. మరి ఎందుకు కాలేదు?.. ఫ్యాక్ట్‌చెక్.. 73 ఏళ్ల హిల్లరీ నిక్షేపంగా ఉన్నారు. ఆమెపై ఎలాంటి కేసు నమోదు కాలేదు.. ఎవరూ అరెస్ట్ చేయలేదు. చివరిసారిగా మార్చి 8న ఆమె లైవ్ ఛాట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. జూన్ 11న ‘ఇన్ ది హైట్స్’ సినిమా స్క్రీనింగ్‌కు ఆమె హాజరైనప్పుడు.. నటుడు లిన్ మాన్యుయెల్‌తో దిగిన ఒక ఫొటో వైరల్ అయ్యింది కూడా. ఇక జూన్ 24 ది న్యూయార్క్ టైమ్స్ నిర్వహించబోయే ఈవెంట్లో ఆమె ప్రసంగించబోతున్నారని అక్కడి లోకల్ ఛానెల్స్ కథనాల్ని టెలికాస్ట్ చేశాయి. మరి ఉత్త పుకార్లతో వేలలో వ్యూస్ దక్కించుకున్న ఆ వీడియో ఎక్కడి నుంచి పుట్టింది?. ఆ ఫేక్ గ్రూప్ వల్లే.. ఫేక్ వార్తలను, నిరాధారణమైన ఆరోపణలు చేసే క్యూఏనన్(అతివాద గ్రూప్) కుట్రపూర్వితంగా కొన్ని కథనాల్ని పుట్టించి.. సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ వస్తోంది. దీంతో చాలాకాలం క్రితమే ఆ గ్రూప్‌ను బ్యాన్ చేసింది అమెరికా. అయినా కూడా ఆ థియరీలు ఏదో ఒక రూపంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. 2017లో అప్పటి ప్రెసిడెంట్ ట్రంప్ ఆదేశాల ప్రకారం హిల్లరీని అమెరికా మిలిటరీ అరెస్ట్ చేసిందని ఓ ఫేక్ కథనాన్ని క్రియేట్ చేసింది క్యూఏనన్. ఆ కథనాన్ని బేస్ చేసుకుని రియల్ రా న్యూస్ ఇంతకు ముందు ఒక కథనాన్ని పబ్లిష్ చేసింది కూడా. ఇప్పుడు ఏకంగా హిల్లరీని ఉరి తీశారంటూ కథనం ప్రచురించడంతో విమర్శలు మొదలయ్యాయి. నిజనిర్ధారణలతో పని లేకుండా ఫేక్ కథనాన్ని ప్రచురించిన రియల్ రా న్యూస్‌పై చర్యలు తీసుకోవాలని.. అక్కడి ప్రెస్ అసోషియేషన్ డిమాండ్ చేస్తోంది. చదవండి: వందేళ్ల నాటి శవం నవ్వుతోందా? -
దేశ మహిళలపై హిల్లరీ వ్యాఖ్యల ప్రభావం
వాషింగ్టన్: కమలా హ్యారిస్... ఇప్పుడు ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. భారత సంతతికి చెందిన ఆమె అమెరికా మొట్టమొదటి మహిళ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికై అగ్రరాజ్యం చరిత్రను తిరగ రాశారు. వచ్చే ఏడాది జనవరి 20న అధ్యక్షుడు జో బైడెన్ క్యాబినెట్ ప్రమాణ స్వీకారం చేయనుంది. జో బైడెన్ అనుచురాలు కమలా హ్యారిస్ ఉపాధ్యక్ష పదవికి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో హ్యారిస్ అమెరికా రాజకీయాలను మార్చే దిశగా మహిళ శక్తిని నడిపిస్తానంటూ శుక్రవారం ట్వీట్ చేశారు. తాము ఎక్కువగా చిన్నారులకే ప్రాధ్యాన్యత ఇస్తామంటూ 2016 ఎలక్షన్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ వ్యాఖ్యలను గుర్తు చేశారు. నాలుగేళ్ల క్రితం హిల్లరి తన వ్యాఖ్యలతో మహిళలను అమెరికా రాజకీయాలవైపు నడిపించారన్నారు. 2016లో డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా డెమొక్రటిక్ పార్టీ నుంచి హిల్లరి క్లింటన్ పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ట్రంప్ గెలుపు సాధించి అమెరికా అధ్యక్షడు అయ్యారు. (చదవండి: భారత మహిళలకు కమల ఆదర్శం) కాగా హిల్లరి క్లింటన్ తన ఓటమి అనంతరం ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ.. ‘నాకు తెలుసు మేము ఇక వైట్ హౌజ్‌ను చేరలేమని, కానీ ఏదో ఒకనాడు అనుకోని విధంగా త్వరలోనే మహిళలు వైట్ హౌజ్న ఏలుతారని ఆశిస్తున్నాను’ అని అన్నారు. హిల్లరీ క్లింటన్ వ్యాఖ్యలు అమెరికా మహిళలపై ప్రభావం చూపిందని, అప్పటి నుంచి వారు అమెరికా రాజకీయ చరిత్రను మార్చే దిశ ప్రయాణించారని, దీనికి నేటి ఎన్నికల ఫలితాలే నిదర్శనం అని కమలా తన ట్వీట్లో పేర్కొన్నారు. అంతేగాక నేటి బాలలే రేపటి పౌరులుగా హిల్లరి వ్యాఖ్యానించారన్నారు. దేశంలోని చిన్నారులను ఉద్దేశిస్తూ ‘మీరు విలువైన వారు, శక్తవంతమైనవారు. మీ స్వంత కలలను కొనసాగించడానికి, సాధించడానికి ప్రపంచంలోని ప్రతి అవకాశానికి అర్హులేనన్న విషయాన్ని సందేహించకండి’ అని ఆమె పిల్లలకు సందేశం ఇచ్చారని హ్యారిస్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కమలా హ్యారిస్ అమెరికా ఉపాధ్యాక్షురాలుగా ఎన్నికై దేశంలో వివక్షకు గురవుతున్న దక్షిణాసియా సంతతికి చెందిన మొట్టమొదటి వ్యక్తి అయ్యారు. (చదవండి: కమలా హారిస్ భర్త భావోద్వేగ పోస్టు!) -
సమానత్వం కోసం వేచి ఉండే పనే లేదు
‘‘నువ్వు ఎక్కడ పుట్టావనేది కాదు, ప్రపంచంలో ఎక్కడైనా పుట్టు, ఆడపిల్లగా పుట్టావంటే చాలు, జీవితాన్ని నెట్టుకురావడానికి చాలా దుర్భరమైన, దయనీయమైన పరిస్థితులను ఎదుర్కోక తప్పదు’’. ఈ మాట అన్నది మామూలు మహిళ కాదు. మిలిందా గేట్స్. బిల్ గేట్స్ సతీమణి. ‘బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్’ సహ వ్యవస్థాపకురాలు. ప్రపంచ దేశాల్లో పర్యటించి ఆడవాళ్లు, పిల్లల జీవన స్థితిగతులను పరిశీలించిన మహిళ. తాను చూసిన ఘటనలతో ‘ద మోమెంట్ ఆఫ్ లిఫ్ట్’ అనే ప్రసిద్ధ పుస్తకం రాసిన మహిళ. గేట్స్ ఫౌండేషన్ స్థాపించి ఇరవై ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా గేట్స్ దంపతులు సోమవారం సంయుక్తంగా ఒక వార్షిక లేఖను విడుదల చేశారు. ప్రపంచ ఆరోగ్యం, విద్య, స్త్రీ పురుష సమానత్వాలకు మున్ముందు మరింత ప్రాముఖ్యం ఇవ్వబోతునట్లు‡ఆ లేఖలో పేర్కొన్నారు. అందులో స్త్రీ–పురుష సమానత్వం గురించి మిలిందా పంచుకున్న విషయాలు ఆలోచన రేకెత్తించేవిలా ఉన్నాయి. అదే సమయంలో స్త్రీ పురుష సమానత్వం సాధ్యమే అనే ఆశనూ చిగురింపజేస్తున్నాయి. గేట్స్ ఫౌండేషన్ ఇరవయ్యవ వార్షికోత్సవంతోపాటు, చరిత్రాత్మకమైన బీజింగ్ వరల్డ్ కాన్ఫరెన్స్‌కూ ఈ ఏడాది పాతికేళ్లు నిండబోతున్నాయి. ఆనాటి బీజింగ్ సదస్సు మహిళల స్థితిగతుల మీద చర్చించడానికి ప్రత్యేక దృష్టి పెట్టిన విషయాన్ని మిలిందా తన లేఖలో గుర్తు చేశారు. 1995లో బీజింగ్‌లో జరిగిన ఉమెన్ వరల్డ్ కాన్ఫరెన్స్‌లో హిల్లరీ క్లింటన్ ప్రసంగిస్తూ ‘మానవ హక్కులే మహిళల హక్కులు.. మహిళల హక్కులే మానవ హక్కులు’ అన్నారు. ఆ మాట తనను ఎంత ఇన్స్పైర్ చేసిందీ చెప్పారు. ‘ఆ తర్వాత నేను ప్రపంచంలోని అత్యంత పేద దేశాల్లో పర్యటించాను. అక్కడి మహిళలను చూసిన తర్వాత స్త్రీ– పురుష సమానత్వ సాధన కోసం స్త్రీలకు అవసరమైన శక్తినివ్వడానికి సిద్ధపడ్డాను. ఇప్పుడు నేను చెప్పదలచినది ఏమంటే.. మన శక్తిని కార్యరూపంలోకి తీసుకురావడానికి మహిళలమందరం ముందుకు రావాలి. అప్పుడు సమానత్వం కోసం వేచి చూడాల్సిన పనే ఉండదు’ అని లేఖలో రాశారు మిలిందా గేట్స్. బిల్–మిలిందా గేట్స్ ఫౌండేషన్ నిర్వహణతోపాటు మిలిందా గేట్స్ సొంతంగా ప్రపంచవ్యాప్తంగా భారీ విరాళాలతో సమాజహిత కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మహిళాభివృద్ధి ద్వారా కుటుంబాల అభివృద్ధి జరుగుతుందని, తద్వారా సమాజాభివృద్ధి సిద్ధిస్తుందని చెబుతారామె.మిలిందా గేట్స్ యూఎస్‌లోని డ్యూక్స్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్, ఎంబీఏ చేశారు. ఒక దశాబ్దం పాటు తన కెరీర్ మీద మాత్రమే దృష్టి పెట్టారామె. ఇప్పుడు తన పూర్తి సమయాన్ని కుటుంబం, సమాజ సేవ కోసం కేటాయించారు. -
ఒబామా నివాసానికి పేలుడు పదార్థాలు
వాషింగ్టన్/న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, 2016 ఎన్నికల్లో ట్రంప్ ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ నివాసాలకు గుర్తుతెలియని దుండగులు పేలుడు పదార్థాలు పంపేందుకు ప్రయత్నించడం కలకలం రేపింది. అయితే బుధవారం వాటిని యూఎస్ సీక్రెట్ సర్వీస్ మధ్యలోనే అడ్డగించి పేల్చివేసింది. రోజువారీ బట్వాడా చేయడానికి ముందు పార్సిల్స్‌ను తనిఖీచేస్తుండగా ఒబామా, హిల్లరీ పేరిట వచ్చిన ప్యాకేజీల్లో పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించామని సీక్రెట్ సర్వీస్ తెలిపింది. అవి వారికి చేరడానికి మందే పేల్చివేశామని, ఒబామా, హిల్లరీకి ఎలాంటి ముప్పులేదని స్పష్టంచేసింది. ఒబామా పేరిట వచ్చిన ప్యాకేజీని వాషింగ్టన్లో, హిల్లరీ చిరునామాతో వచ్చిన ప్యాకేజీని న్యూయార్క్‌లో గుర్తించారు. ఈ ఘటనపై సీక్రెట్ సర్వీస్ పూర్తిస్థాయి విచారణ ప్రారంభించింది. ఇదిలా ఉండగా, అనుమానాస్పద ప్యాకేజీ కనిపించడంతో న్యూయార్క్‌లోని బ్యూరో భవనాన్ని ఖాళీచేసినట్లు ప్రముఖ మీడియా సంస్థ సీఎన్ఎన్ వెల్లడించింది. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు బాంబు నిర్వీర్య బృందాలు, అధికారులను పంపినట్లు న్యూయార్క్ పోలీసులు ప్రకటించారు. ముందుజాగ్రత్త చర్యగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ కార్యాలయాలన్నింటిలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సీఎన్ఎన్ అధ్యక్షుడు జెఫ్ జుకర్ చెప్పారు. అనుమానాస్పద పేలుడు పదార్థాలు బయటపడటంపై అధ్యక్షుడు ట్రంప్‌కు వివరించినట్లు శ్వేతసౌధం సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఒబామా, హిల్లరీపై దాడులకు జరిగిన ప్రయత్నాలను శ్వేతసౌధం ఖండించింది. ఇలాంటి వాటికి బాధ్యులైన వారిని చట్ట పరిధిలో శిక్షిస్తామని తెలిపింది. -
అమెరికాను భయపెడుతున్న ‘ప్యాకెట్లు’
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌కి, మాజీ అధ్యక్షుల నివాసాలకు, బిలియనీర్ జార్జ్ సోరస్ ఇంటికి, సీఎన్ఎన్ మీడియా సంస్థకు అనుమానాస్పద ప్యాకెట్లు వస్తున్నాయి. పార్శిల్ని విప్పి చూడగా వాటిలో పేలుడు పరికారాలు బయటపడుతున్నాయి. వీటిని చూసిన సీఎన్ఎన్ ముందు జాగ్రత్త చర్యగా ఫైర్ అలారమ్ మోగించి తన సిబ్బందిని బయటకు పంపించింది. తొలుత ఈ ప్యాకెట్లు మంగళవారం బిల్ క్లింటన్ నివాసానికి, బుధవారం ఒబామా నివాసానికి వచ్చాయని ఎఫ్‌బీఐ ప్రకటించింది. అయితే ఈ ప్యాకెట్లు వచ్చిన సమయంలో హిల్లరి దంపతులు ఇంట్లో ఉన్నారా లేదా అనే విషయం గురించి ఎటువంటి సమాచారం తెలియలేదు. వీటి గురించి దర్యాప్తు కొనసాగుతుందని ఎఫ్‌బీఐ అధికారులు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. We are aware of a suspicious package found in the vicinity of the Clinton residence in Chappaqua, NY, and our JTTF has engaged with our federal, state and local partners to investigate. As this is an on-going investigation, we will have no further comment at this time — FBI New York (@NewYorkFBI) October 24, 2018 అయితే మాజీ అధ్యక్షులు, ప్రముఖుల ఇళ్లకు వస్తోన్న ఈ అనుమానాస్పద ప్యాకెట్ల అంశాన్ని వైట్ హౌస్ ఖండించింది. ఇలాంటి భయపెట్టే చర్యలు చట్ట వ్యతిరేకమైనవని, అసహ్యమైనవని పేర్కొంది. వీటికి పాల్పడే వారు ఎవరైనా సరే.. తగిన మూల్యం చెల్లిస్తారని హెచ్చరించింది. అంతేకాక ఈ ప్యాకెట్ వచ్చిన వారందరికి భద్రత కల్పిస్తామని వెల్లడించింది. -
చక్రబంధంలో ట్రంప్!
అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించాక డోనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రకటనలు, తీసుకుంటున్న నిర్ణయాలు ఆ దేశ పౌరులను మాత్రమే కాదు... ప్రపంచ ప్రజానీకాన్నే విస్మయపరుస్తున్నాయి. ఈ పరంపరలో ఆయన వెలువరించిన తాజా ట్వీట్ వాటన్నిటినీ తలదన్నింది. అధ్యక్షుడిగా తనను తాను క్షమించుకునే అధికారం తనకున్నదన్నదే ఆ ట్వీట్ సారాంశం. అలా అంటూనే తాను ఆ పని చేయా ల్సిన అవసరం రాదని ముక్తాయించారు. ఎందుకంటే ఆయన ఏ తప్పూ చేయలేదట! ఇప్పటికిప్పుడు ట్రంప్ ఇలా చెప్పడానికి కారణం ఉంది. అధ్యక్ష ఎన్నికల ప్రక్రియపై అమెరికా పౌరుల్లో ఉన్న విశ్వసనీయతనూ, ట్రంప్ ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ అవకాశాలనూ దెబ్బతీయడానికి ప్రయత్నించిన రష్యాతో ఆయన కుమ్మక్కయ్యారన్న అభియోగాలపై సాగుతున్న విచారణ కీలక దశకు చేరింది. ఏడాదినుంచి ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్ రాబర్ట్ ఎస్. మ్యూలర్ నేతృత్వంలో కొనసాగుతున్న ఈ విచా రణపై ట్రంప్‌కు మొదటినుంచీ అసహనం ఉంది. దానిపై వీలు చిక్కినప్పుడల్లా ఆయన విరుచుకు పడుతూనే ఉన్నారు. ఈమధ్యకాలంలో ట్రంప్ న్యాయవాద బృందం మ్యూలర్ విచారణ చెల్లుబాటు కాదని వాదించడం మొదలుపెట్టారు. అంతేకాదు... పదవిలో ఉన్నంతకాలం ఎలాంటి ప్రాసిక్యూషన్ నుంచి అయినా ట్రంప్‌కు రక్షణ ఉంటుందని కూడా బల్లగుద్ది చెబుతున్నారు. ఆఖరికి ట్రంప్ ఎవరి నైనా కాల్చిచంపినా సరే ఆ విషయంలో ఆయనపై చర్య తీసుకోవడానికి వీలుండదని కూడా సెల విస్తున్నారు. దానికి కొనసాగింపుగానే ట్రంప్ తాజా ట్వీట్ చేసినట్టు కనబడుతోంది. వాటర్‌గేట్ కుంభకోణంలో చిక్కుకుని 1974లో పదవీభ్రష్టుడైన రిచర్డ్ నిక్సన్ కూడా ట్రంప్ మాదిరే మాట్లా డేవారు. వాటర్‌గేట్ విచారణ సాగుతున్న సమయంలో ‘అధ్యక్షుడు ఏదైనా చేస్తే అది చట్టవిరుద్ధం కాదనే అర్థం’ అని వ్యాఖ్యానించి సంచలనం సృష్టించారు. మరో మాటలో చెప్పాలంటే అధ్యక్షుడు అన్ని చట్టాలకూ అతీతుడని నిక్సన్ వాదనలోని సారాంశం. ఇంతకూ ట్రంప్ ‘స్వీయ క్షమాభిక్ష’ నిర్ణయం తీసుకుంటారా లేక ఆ అవసరం రానివిధంగా ఏకంగా మ్యూలర్ విచారణనే రద్దు చేస్తారా అన్నది ఇంకా చూడాల్సి ఉంది. ఏం చేసినా అది అమె రికాలో పెను సంక్షోభాన్ని కలిగించడం ఖాయం. అమెరికా రాజ్యాంగం అధ్యక్షుడికుండే క్షమాభిక్ష అధికారాల గురించి, ఏ విచారణనైనా ప్రారంభించమని లేదా నిలిపేయమని కోరే అధికారం గురించి వివరంగానే మాట్లాడినా...అధ్యక్షుడిగా ఉండే వ్యక్తి తన విషయంలో తాను ఇలా చేయవచ్చునా అనే సంగతిని మాత్రం చెప్పలేదు. అధ్యక్షుడిగా ట్రంప్ వంటివారు వస్తారని రాజ్యాంగాన్ని రచించినవారి ఊహకు తట్టి ఉండకపోవచ్చు. కానీ ఆ లొసుగును ట్రంప్ ఉపయోగించుకునే అవకాశం లేకపోలేదని ఆయన నుంచీ, ఆయనవైపునుంచీ వెలువడుతున్న ప్రకటనలు గమనిస్తే అర్ధమవుతుంది. విచారణలో భాగంగా ట్రంప్‌ను పిలిపించినా, దానికి ఆయన కట్టుబడాల్సిన అవసరం లేదని ఇప్పటికే మ్యూల ర్కు అందించిన లేఖలో ట్రంప్ న్యాయవాదులు స్పష్టం చేశారు. విచారణకు ట్రంప్ హాజరైతే అది అధ్యక్ష బాధ్యతల్ని నిర్వర్తించడంలో అవరోధంగా మారుతుందని, ఆయన స్థాయిని తగ్గిస్తుందని కూడా వారు వాదించారు. అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్ టీంలో సభ్యులుగా ఉండి ఆ తర్వాత ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన పలువురు వివిధ కారణాలరీత్యా తప్పుకోవాల్సి వచ్చింది. స్వల్పకాలం జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేసిన మైకేల్ ఫ్లిన్ అందులో ఒకరు. ఆయన ట్రంప్ ఎన్నికల ప్రచార బృందంలో సభ్యుడిగా ఉన్నప్పుడు రష్యా రాయబారితో మాట్లాడిన మాటలు నిరుడు వెల్లడయ్యాయి. రష్యాపై అప్పటికి అమలులో ఉన్న ఆంక్షల్ని ట్రంప్ అధ్యక్షు డయ్యాక తొలగిస్తారన్నది ఆ మాటల సారాంశం. ఆ సంభాషణలు వెల్లడయ్యాక ఫ్లిన్ రాజీనామా చేయాల్సివచ్చింది. దానిపై అప్పటి ఎఫ్‌బీఐ డైరెక్టర్ జేమ్స్ కోమీ దర్యాప్తునకు ఆదేశించగా దాన్ని నిలిపేయమని ట్రంప్ ఆయన్ను కోరారు. విననందుకు ఆగ్రహించి కోమీని తప్పించారు. కోమీ కూడా ట్రంప్‌కు ఒకప్పుడు సన్నిహితుడే. ట్రంప్ ఏరికోరి తెచ్చుకున్న 26మంది ఉన్నతాధికారులు ఇలా వివిధ సందర్భాల్లో తమంత తాము వైదొలగవలసి వచ్చింది. లేదా కొందరిపై ఆగ్రహించి ట్రంప్ తొలగించారు. ముఖ్యంగా మ్యూలర్ చేసిన అభియోగాలకు సరిగా జవాబు చెప్పలేక నలుగురు రాజీనామా చేశారు. ఇలా పదే పదే జరగడం వల్ల కావొచ్చు... విచారణ కీలక దశకు చేరుకుని తనపై అభియోగాలు మోపే అవకాశాలు స్పష్టంగా కనబడటం వల్ల కావొచ్చు ట్రంప్ తాజా ట్వీట్ చేశారని అనుకోవాలి. అమెరికా రాజ్యాంగం ‘స్వీయ క్షమాభిక్ష’ గురించి చెప్పకపోయినా ‘ఎవరూ తమ గురించి తాము తీర్పు ఇచ్చుకోరాద’న్న సంప్రదాయమైతే ఉంది. అయితే ట్రంప్ విశిష్టత ఏమంటే ఆయన ఏ సంప్రదాయాలనూ గౌరవించే రకం కాదు. నిక్సన్ చెప్పినట్టు అధ్యక్షుడు ఏం చేసినా చట్టవిరుద్ధం కాదని ఆయన బలంగా నమ్ముతారు. ట్రంప్ స్వీయ క్షమాభిక్షకు పూనుకున్నా, రష్యా ప్రమేయంపై సాగే దర్యాప్తులో నిందితులుగా నిర్ధారణ అయిన తన బృందంలోని వారికి క్షమాభిక్ష పెట్టేందుకు ప్రయత్నించినా, మ్యూలర్ దర్యాప్తును మూలపడేసినా అది ట్రంప్‌పై ఉన్న అభియోగాల తీవ్రతను మరింత పెంచుతుంది. ఆ అభియోగాల్లో నూరు శాతం నిజం ఉండొచ్చునని ప్రతి ఒక్కరూ భావించే ప్రమాదం ఏర్పడు తుంది. తనను అన్యాయంగా వేధిస్తున్నారని, బాధ్యతలపై దృష్టి కేంద్రీకరించకుండా అవరోధం కలిగిస్తు న్నారని ట్రంప్ వాపోతున్నా ఆయన తప్పించుకోవడం సాధ్యం కాదు. అధ్యక్షుడిగా ఆయన తీసుకునే నిర్ణయాల్లోని అసంబద్ధతలపైనా, అందులో ఉండే పరస్పర వైరుధ్యాలపైనా ఇప్పటికే అందరిలోనూ అసంతృప్తి ఉంది. మ్యూలర్ దర్యాప్తును ఏమాత్రం ఆటంకపరిచినా ఇది మరిన్ని రెట్లు పెరుగుతుంది. అమెరికన్ కాంగ్రెస్ ఆయనపై మహాభియోగ తీర్మానం చేసేందుకు కూడా సిద్ధపడొచ్చు. ట్రంప్ వివేకంతో వ్యవహరిస్తారో, తెగేదాకా లాగేందుకు ప్రయత్నిస్తారో వేచి చూడాల్సి ఉంది. -
ఫేస్బుక్ సీఈవో అవ్వాలనుంది
వాషింగ్టన్ : రాజకీయాల నుంచి పూర్తిస్థాయిలో తప్పుకోవాలని హిల్లరీ క్లింటన్ భావిస్తున్నట్లు ఉన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్‌మీడియా నెట్వర్కింగ్ కంపెనీ ఫేస్‌బుక్‌కు సీఈవో అవ్వాలనుకుంటున్నట్లు రిపోర్టులు వస్తున్నాయి. శుక్రవారం హార్వాడ్ విశ్వవిద్యాలయానికి రాడ్‌క్లిఫ్ మెడల్‌ను అందుకునేందుకు విచ్చేసిన ఆమె ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. మసాచుసెట్స్‌కు చెందిన ఓ డెమొక్రాట్ మీరు ఏ కంపెనీకి సీఈవో కావాలని అనుకుంటున్నారు? అని ప్రశ్నించగా.. ఫేస్బుక్ లేదా సీనెట్లకు అని ఆమె తడుముకోకుండా చెప్పినట్లు తెలుస్తోంది. ఫేస్బుక్ నుంచి ప్రపంచంలో చాలామంది వార్తలు తెలుసుకుంటారని, అవి నిజమైనవా? లేక నకిలీవా? అన్న విషయాన్ని సైతం పట్టించుకోరని హిల్లరీ పేర్కొన్నారు. కాగా, నకిలీ వార్తలు, కేంబ్రిడ్జి అనలిటికా కుంభకోణాలతో ఫేస్బుక్ సతమతమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఆ కంపెనీ వీటి నుంచి బయటపడుతోంది. -
హిల్లరీ చేతికి గాయం
జోధ్‌పూర్: భారత పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ శాఖ మాజీ మంత్రి హిల్లరీ క్లింటన్ చేతికి మంగళవారం స్వల్ప గాయమైంది. ప్రస్తుతం హిల్లరీ రాజస్తాన్‌లోని జోధ్‌పూర్‌లో పర్యటిస్తుండగా ఆమె చేయి బెణికింది. మధ్యప్రదేశ్ నుంచి రెండు రోజుల యాత్ర కోసం ఆమె మంగళవారం ఉదయమే జోధ్‌పూర్‌కు చేరుకున్నారు. సాయంత్రం మెహ్రంగఢ్ కోటను సందర్శించాల్సి ఉండగా చేయి బెణకడంతో అది రద్దయింది. జోధ్‌పూర్‌లోని ఉమైద్ భవన్ ప్యాలెస్‌లో ఆమె ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమైతే సలవాస్ గ్రామంలోని తివాచీలు తయారుచేసే కేంద్రాలను హిల్లరీ బుధవారం సందర్శించి అక్కడి నేత కార్మికులతో ఆమె మాట్లాడాల్సి ఉంది. అయితే చేతికి గాయం కారణంగా ఆమె అక్కడికి వెళ్లడం కూడా అనుమానమేనని అధికారులు తెలిపారు. -
మధ్యప్రదేశ్‌లో హిల్లరీ
ఇండోర్: అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ ఇండియాలో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం ఆమె మధ్యప్రదేశ్‌లోని మాండవ్ జిల్లా, ధార్‌లోని జహాజ్ మహాల్‌ను ఆమె సందర్శించారు. ప్రైవేటు విమానంలో ఇండోర్‌కు చేరుకున్న హిల్లరీ.. ఖర్గోన్ జిల్లాలో ఉన్న మహేశ్వర్‌లో బస చేశారు. పర్యటనలో భాగంగా నర్మదా నదిలో హిల్లరీ బోటింగ్‌కు వెళ్లనున్నారు. అదేవిధంగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మహేశ్వరీ చీరల మ్యూజియంను ఆమె సందర్శించనున్నారు. #MadhyaPradesh: Hillary Clinton visited Jahaz Mahal in Dhar's Mandu. She is on a visit to the state from 11-13 March. pic.twitter.com/oXQoC0hesy — ANI (@ANI) March 12, 2018 -
పాక్‌పై హిల్లరీ క్లింటన్ ఫైర్
-
ట్రంప్ సరైనోడు కాదు!
ముంబై: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆ స్థానానికి అర్హుడు కాదని, గత ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా పోటీచేసిన హిల్లరీ క్లింటన్ విమర్శించారు. ట్రంప్ గెలుస్తారని ఎవరూ అనుకోలేదన్నారు. పారిస్ ఒప్పందంపై సంతకాల విషయంలో అన్ని దేశాలను ఒప్పించటంలో భారత్ పెద్దన్నపాత్ర పోషించిందని ప్రశంసించారు. ముంబైలో ఇండియాటుడే సదస్సు – 2018లో పాల్గొన్న క్లింటన్.. ట్రంప్ పాలన తీరు, అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం, అంతర్జాతీయంగా పెరుగుతున్న భారత ప్రాభవం వంటి పలు అంశాలపై ఆసక్తికర అంశాలు వెల్లడించారు. రష్యా తీరును అంతర్జాతీయ సమాజం ముందు తీవ్రంగా వ్యతిరేకించినందునే.. పుతిన్‌కు తానంటే వ్యక్తిగతంగా నచ్చదని హిల్లరీ పేర్కొన్నారు. దీని కారణంగానే.. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల ద్వారా దుష్ప్రచారం చేశారన్నారు. తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయటంలో సామాజిక మాధ్యమం ఓ ఆయుధంలా మారిందని.. ఇది సమాజంలో సామరస్యాన్ని దెబ్బతీస్తుందని హిల్లరీ అభిప్రాయపడ్డారు. భారత సమాజంలోనూ విభేదాలు సృష్టించేందుకు ఈ మాధ్యమం ద్వారా ఎవరైనా ప్రయత్నించే అవకాశం ఉందన్నారు. అమెరికాలో ప్రజాస్వామ్యం లేదు అమెరికా అధ్యక్ష స్థానానికి ట్రంప్ సరైన వ్యక్తి కాదన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో తన ప్రచారం సంప్రదాయపద్ధతిలో జరిగిందని.. ముఖ్యమైన అంశాలను స్పృశించానన్నారు. అయితే.. ట్రంప్ ప్రచారం ఓ టీవీ రియాల్టీ షోలా ప్రహసనంగా సాగిందన్నారు. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తనదే విజయమని భావించానని హిల్లరీ తెలిపారు. అమెరికాలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరముందన్నారు. అమెరికాలో ప్రశ్నించే గొంతుకలకు స్థానం లేకుండా చేస్తున్నారన్నారు. ప్రజలు ఒకరిపై ఒకరు విషం చిమ్ముకునేందుకు సామాజిక మీడియానే కారణమవుతోందన్నారు. భారత్ నాయకత్వాన్ని కోరుతున్నారు.. అంతర్జాతీయంగా భారత ప్రాభవం పెరుగుతోందని.. ప్రపంచవ్యాప్తంగా శాంతి వెల్లివిరియటంలో భారత్ పాత్ర కీలకం కానుందని హిల్లరీ తెలిపారు. పారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి ట్రంప్ బయటకు రావటాన్ని విమర్శించిన హిల్లరీ.. అమెరికాకు ఇది అత్యంత అవమానకరమన్నారు. అమెరికా తప్పుకున్నప్పటికీ.. ఈ ఒప్పందంపై అందరినీ ఒప్పించటంలో భారత్ పోషించిన పాత్ర అభినందనీయమన్నారు. ప్రతి ఒక్క దేశంతో మాట్లాడి.. వివరాలను అర్థం చేయించారని భారత్ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. ‘పర్యావరణాన్ని దోచుకోవటం సరికాదు. దీన్ని కాపాడుతూనే ప్రపంచం లబ్ధి పొందాలి’ అని పారిస్ ఒప్పందం సమయంలో మోదీ వ్యాఖ్యలను క్లింటన్ గుర్తుచేశారు. ప్రపంచంలో పర్యావరణ మార్పుపై భారత నాయకత్వాన్ని ప్రపంచం కోరుకుంటోందన్నారు. -
ఇవాంకతో స్నేహం లేదు : చెల్సియా
కొంత కాలంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కుమార్తె చెల్సియా క్లింటన్ మధ్య స్నేహంపై రకరకాల వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా చెల్సియా వాటికి తెరదించారు. స్టెఫెన్ కొల్బర్ట్ లెట్ షో లో మాట్లాడిన ఆమె తమ మధ్య స్నేహం ఎక్కువ కాలం కొనసాగలేదని స్పష్టం చేశారు. చెల్సియా తల్లి హిల్లరీ క్లింటన్ అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన పలు సందర్భాల్లో వీరి స్నేహం గురించి పలు రకాల కథనాలు వెలువడ్డాయి. చెల్సియా స్పందిస్తూ అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలు చాలా ప్రభావితం చేస్తాయని, వాటికి వైట్ హౌస్ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. గత నెలలో తన తండ్రి ట్రంప్‌పై వస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణల గురించి ఇవాంకని ప్రశ్నించినప్పుడు, ఆమె స్పందిస్తూ.. ఇది తనను అడగాల్సిన ప్రశ్న కాదని సూచించారు. ఒక కూతురిని తన తండ్రి గురించి ఇలాంటి ప్రశ్నలు అడగటం సరికాదన్నారు. ఇందులో ఎలాంటి వాస్తవం లేదన్నారు. మీరు ఇదే ప్రశ్ననే ఇతరుల కుమార్తెలను అడుగుతారని అనుకోవడం లేదన్నారు. ఇవాంకను ట్రంప్ సలహాదారుగా నియమించటం, ఇతర దేశాధినేతలతో సమావేశమైనప్పుడు అధిక ప్రధాన్యత ఇవ్వడాన్ని మీడియా విమర్శించింది. ఇప్పుడు చెల్సియా క్లింటన్ స్పందించిన తీరు చూస్తుంటే ఈ పరిణామాల మీదే ఆమె స్పందించినట్లు అర్థమవుతుంది. ఇవాంక మీడియాతో వ్యవహరించిన తీరుపైన చెల్సియా క్లింటన్ ఈ విధమైన వ్యాఖ్యాలు చేసినట్లు తెలుస్తోంది. -
అమెరికా మాజీ అధ్యక్షుడి ఇంట్లో ప్రమాదం
న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఇంట్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. న్యూయార్క్‌లోని చాపక్వాలో ఉన్న క్లింటన్ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగినట్టు మంగళవారం మధ్యాహ్నం సమాచారం అందినట్టు న్యూకాజిల్ పోలీసులు తెలిపారు. దాంతో హుటాహుటిన అక్కడ చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై క్లింటన్ కమ్యూనికేషన్ డైరెక్టర్ నిక్ మెరిల్ స్పందించారు. స్పల్ప అగ్నిప్రమాదమే జరిగిందని, ఎవరికీ ప్రమాదం జరగలేదని ఆయన వెల్లడించారు. ప్రమాద సమయంలో క్లింటన్ దంపతులు ఇంట్లో లేరన్నారు. కాగా క్లింటన్, హిల్లరీలు 1999 లో ఆ ఇంటిని కొన్నారు. -
మా అధ్యక్షుడే ఒక రేపిస్టు..
న్యూయార్క్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై డెమొక్రటిక్ పార్టీ నేత హిల్లరీ క్లింటన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇటీవల ప్రముఖ హాలీవుడ్ నిర్మాత హార్వే వెయిన్‌స్టైన్ తమను లైంగికంగా వేధించినట్లు ఏంజిలినాజోలీతోపాటు ఎందరో నటీమణులు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై హిల్లరీ ఓఇంటర్వ్యూలో మాట్లాడుతూ హార్వేను ట్రంప్‌తో పోల్చారు. అత్యాచారానికి పాల్పడినట్లు ఒప్పుకున్న వ్యక్తినే తమ దేశానికి అధ్యక్షుడిగా ఎన్నుకున్నారని, ప్రపంచవ్యాప్తంగా ఈ లైంగిక వేధింపుల సమస్య ఉందని చెప్పారు. అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్‌పైనా వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తాయని తెలిపారు. ఆయనకు సంబంధించి అనేక అభ్యంతరకర టేపులు విడుదలయ్యాయని, కానీ, వాటిలో ఏ ఒక్కటీ ట్రంప్ గెలుపును అడ్డుకోలేకపోయాయన్నారు. హార్వే ఎప్పటి నుంచో డెమొక్రటిక్ పార్టీకి బూరీ విరాళ దాత. పైగా ఒబామా కూతురు కూడా ఆయన వద్దే అప్రెంటిస్ చేస్తోంది. ఈ నేపథ్యంలో టీవీ షోలో హార్వేకు సంబంధించిన విషయాన్ని హిల్లరీని ప్రశ్నించారు. -
ఈ వారం యూట్యూబ్ హిట్స్
కస్సున దిగబడుతుంది టూంబ్ రైడర్: ట్రైలర్ నిడివి : 2 ని. 9 సె. హిట్స్ : 90,66,303 లారా క్రాఫ్ట్.. బాణం లాంటి అమ్మాయి. వయలెంట్ అండ్ ఫ్రైటెనింగ్! చెవిని కట్ చెయ్యకుండా చెవి పక్కనుంచి దూసుకుపోతుంది. శత్రువును హద్దుల్లో ఉంచడానికి మొదట అంతవరకే చేస్తుంది. ఎవడైనా హద్దుమీరాడా.. చెవి కాదు, కస్సున గుండెల్లో దిగబడుతుంది. వాళ్ల నాన్న నుంచి వచ్చిన సాహస గుణం అది! అతడొక సాహస అన్వేషకుడు. ఓ దీవిలో అదృశ్యం అయిపోతాడు. ఇక ఈ అమ్మాయి బయల్దేరుతుంది. ప్రాణాలకు తెగించి విలన్లతో పోరాడుతుంది. అగాధాలలో, భూగర్భ జలాలలో లారా సాహసాలు ఊపిరి తీసుకోనివ్వని విధంగా ఉన్నాయి ఈ ట్రైలర్లో. కూలిపోయే వంతెన పైనుంచి ప్రవాహంలో పడిపోకుండా చివరి నిముషంలో లారా తప్పించుకోవడంతో ట్రైలర్ ముగుస్తుంది. ‘టూంబ్ రైడర్’ అనే పేరుతో 2013లో విడుదలైన వీడియో గేమ్ ఆధారంగా ఎం.జి.ఎం., వార్నర్ బ్రదర్స్, ఇంకో రెండు నిర్మాణ సంస్థలు కలిసి ఈ సినిమాను అదే పేరుతో తీసున్నాయి. లారా క్రాఫ్ట్ పాత్రను 22 ఏళ్ల స్వీడన్ నటి అలీషియా వికందర్ పోషిస్తున్నారు. టూంబ్ రైడర్ అంటే సమాధుల్ని పెకిలించి విలువైన వస్తువుల్ని దొంగిలించే వ్యక్తి. ఇంకో అర్థంలో.. గుప్తంగా ఉండిపోయిన నిజాలను వెలికి తియ్యడం కూడా టూంబ్ రైడింగే. తండ్రి కోసం లారా ఏం తవ్వబోయి, ఎందులో పడిపోయారో 2018 మార్చి 16న తెలుస్తుంది. టూంబ్ రైడర్ రిలీజ్ అవుతున్న రోజు అది. తిమింగిలం మింగేస్తే? వాట్ ఇఫ్ ది వేల్ స్వాలోడ్ యు ఎలైవ్ నిడివి : 1 ని. 41 సె. హిట్స్ : 33,75,517 బ్లూవేల్ గేమ్ కొంతకాలంగా టీనేజర్లను పొట్టన పెట్టుకుంటోంది. పిల్లల్నేనా, పెద్దల్ని కూడానా? గేమ్ వరకు అయితే పిల్లల్నే. నీటిలోని వేల్స్ (తిమింగలాలు) మాత్రం పిల్లల్నీ, పెద్దల్నీ అందర్నీ పొట్టన పెట్టుకోగలవు. అయితే అన్ని రకాల తిమింగలాల కడుపులోకీ మనం సర్రుమని వెళ్లిపోమట! కారణం? వాటికి మింగడం ప్రాబ్లం. తిమింగలం నోరు తెరిస్తే పెద్ద పెద్ద పడవలే పట్టేస్తాయని అనుకుంటాం కానీ, వాటి ప్రయాణం నోటి వరకే. అక్కడి నుంచి గొంతు దిగవు. ఒక్క వీర్యతిమింగలం (స్పెర్మ్ వేల్) మినహా, మిగతా అన్ని జాతుల తిమింగలాలకూ అన్నవాహిక సన్నగా ఉంటుంది. ఉదాహరణకు నీలి తిమింగలం (బ్లూ వేల్) అన్నవాహిక పది సెంటీ మీటర్ల వ్యాసం ఉంటుంది. అందులో శిశువు తల కూడా పట్టదు. మరి దంతాల మాటేమిటి? చాలా తిమింగలాలకు దంతాల స్థానంలో మెత్తటి కుచ్చుల లాంటివి ఉంటాయి. వాటితో అవి సముద్రపు ఆహారాన్ని ఫిల్టర్ చేసుకుని కడుపులోకి సులభంగా జారిపోయే జీవుల్ని మాత్రమే లోపలికి తీసుకుంటాయి. తిమింగలం ఒక్క గుక్కతో బక్కెట్ల కొద్దీ నీటిని నోటì లోకి తీసుకుంటుంది. ఆ సమయంలో నీటితో పాటు నోట్లోకి పెద్ద పరిమాణంలోని జీవులు కూడా వచ్చేస్తాయి. వాటిని తన ఫిల్టర్ వంటి దంతాలతో తిరిగి బయటికి తోసేస్తాయి తిమింగలాలు. స్పెర్మ్ వేల్కు మాత్రం మనిషిని మింగేయగల దేహనిర్మాణం ఉంటుంది. అందుకే అవి పెద్ద పెద్ద సీల్ జంతువుల్ని అవలీలగా మింగేస్తుంటాయి. అప్పుడేం జరుగుతుంది? స్పెర్మ్ వేల్ దంతాలు సీల్‌ను నజ్జునజ్జు చేసేస్తాయి. తర్వాత కడుపులోకి జారవిడుచుకుంటాయి. ఆ తర్వాత సీల్ జీర్ణమైపోతుంది. సరిగ్గా మనిషికి కూడా ఇదే జరుగుతుంది. ‘వాట్ ఇఫ్ ది వేల్ స్వాలోడ్ యు ఎలైవ్’ అనే వీడియోలో స్పెర్మ్ వేల్ మనిషిని మింగేస్తే ఏమౌతుందో యానిమేషన్లో చూపించారు. రోడ్డుప్రమాద దృశ్యం రుఖ్ : ట్రైలర్ నిడివి: 2 ని. 29 సె. హిట్స్: 18,25,946 ‘రుఖ్’ ట్రైలర్లో ఒక కుటుంబం కల్లోలంలో పడిపోవడం కనిపిస్తుంది. చిన్న కుటుంబమే. కానీ పెద్ద తుఫాను. తండ్రి కారు యాక్సిడెంట్లో చనిపోతాడు. బోర్డింగ్ స్కూల్లో చదువుకుంటున్న అతడి కొడుకు జీవితం తలకిందులు అయిపోతుంది. తండ్రి గురించి ఏవో వింటాడు. యాక్సిడెంట్ కాదు, అది హత్య అని నమ్ముతాడు. నిజం చెప్పమని తల్లిని అడుగుతాడు. ఆమె చెప్పదు. ఏదో దాస్తున్నట్లు ఆ 18 ఏళ్ల కుర్రాడికి అర్థమౌతుంది. ఇక తనే తేల్చుకోడానికి బయల్దేరతాడు. తండ్రి ఔన్నత్యాన్ని వెల్లడించే కోణాలు ఒకటొకటిగా బయటపడతాయి! వాటిని తండ్రి ఉన్నప్పటి జ్ఞాపకాలతో పోల్చి చూసుకుంటాడు. ఆఖరికి తల్లి మనసు కూడా తెలుసుకుంటాడు. ఇది ఒక టీనేజర్ కథ. ఈ పాత్రలో ఆదర్శ గౌరవ్, అతడి తండ్రిగా మనోజ్ వాజ్‌పేయీ నటిస్తున్నారు. ‘దృశ్యం ఫిల్మ్’ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 27న విడుదల అవుతోంది. జీవితం రెండుగా విడదీసినా, విషాదం ఒకటిగా కలుపుతుందన్నది ఎండ్ పాయింట్. ఈ చిత్రం అక్టోబర్ 27న విడుదల అవుతోంది. వాట్ హ్యాపెండ్? హిల్లరీ క్లింటన్: నోబడీ ఈజ్ టాకింగ్ నిడివి : 4 ని. 31 సె. హిట్స్ : 8,63,662 హిల్లరీ క్లింటన్ కొత్తగా ‘వాట్ హ్యాపెండ్’ అనే పుస్తకం రాశారు. అందులో ఆమె.. రష్యన్లు 2016 అమెరికా ఎన్నికలను ప్రభావితం చేశారని రాశారు. ప్రభావితం చేసి? ట్రంప్‌ని గెలిపించారు. ‘స్టీఫెన్ కాల్బెర్ట్ లేట్ నైట్ షో’కి హిల్లరీ అతిథిగా వచ్చినప్పుడు స్టీఫెన్ ‘వాట్ హ్యాపెండ్ టు అమెరికన్ ఎలక్షన్ మెకానిజం’ అని ఆమె అడిగారు. రష్యా ఇన్ఫ్లుయెన్స్ చేసినంత మాత్రాన అమెరికా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుందా అని స్టీఫెన్ ఆశ్చర్యం. ఆ మాటలకు హిల్లరీ నవ్వారు. ‘‘ఆ ఒక్క వ్యక్తి తప్ప మిగతా అమెరికన్లంతా అమెరికాలో ఎలక్షన్ మెకానిజం లేకుండా పోయిందని నమ్ముతున్నారు’’ అన్నారు. ‘‘కానీ అక్రమాలను బయటపెట్టే యంత్రాంగం ఉంది. అందుకే నిజాలు బయటికి వచ్చాయి’’అని కూడా ఆమె అన్నారు. గెస్టు, హోస్టు కొద్దిసేపు ‘వాట్ హ్యాపెండ్’ అనే టాపిక్‌ని పట్టుకుని ట్రంప్‌పై సెటైర్లు వేశారు. షోకు వచ్చినవాళ్ల నవ్వులు, చప్పట్లు హిల్లరీకి మంచి ఎనర్జీ. ‘‘ఈ పుస్తకం రాసేటప్పుడు మీరు షార్డనీ (వైట్ వైన్) మీద ఎక్కువగా ఆధారపడినట్లు అనిపిస్తోంది అని స్టీఫెన్ అన్నప్పుడు హిల్లరీ చాలా హాయిగా నవ్వారు. ఆ తర్వాతి ట్విస్ట్ ఏమిటన్నది మీరు వీడియోలో చూడాల్సిందే. చెబితే కిక్కు పోతుంది. అంతకన్నా చివరికి.. స్టీఫెన్ ఓ ఆకాంక్షతో షోను ముగించారు. ఏమిటా ఆకాంక్ష? అది కూడా వీడియోలోనే చూడండి. -
‘ట్రంప’రితనం..!
► ట్వీటర్లో ట్రంప్ మరో తుంటరి చర్య ► హిల్లరీని గోల్ఫ్బాల్తో కొడుతున్నట్లుగా ఫొటో షేర్ వాషింగ్టన్: ట్వీటర్లో ఎప్పుడూ పలు విమర్శలు, వ్యాఖ్యానాలు చేసే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీటర్ వేదికగా మరో వివాదానికి తెరతీశారు. అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరఫున తనకు పోటీగా నిలిచిన హిల్లరీ క్లింటన్‌ను అవమానించేలా ఉన్న ఓ జీఐఎఫ్ (గ్రాఫిక్ ఇమేజరీ ఫార్మాట్) చిత్రాన్ని ఆయన రీట్వీట్ చేశారు. 2011లో హిల్లరీ విదేశాంగ మంత్రిగా ఉండగా విమానం ఎక్కుతున్న సమయంలో ట్రంప్ ఆమెను గోల్ఫ్బాల్తో కొడుతున్నట్లుగా, బాల్ తగిలి ఆమె కింద పడుతున్నట్లుగా ఈ చిత్రంలో ఉంది. ట్రంప్ చర్యపై పలువురు మండిపడుతున్నారు. ఆయన అధ్యక్ష పదవికి తగని వాడంటూ కొందరు ట్వీటర్లో వ్యాఖ్యానించారు. ఐరాసలో ప్రసంగిం చనున్న ట్రంప్ ట్రంప్ తొలిసారిగా ఐక్యరాజ్యసమితి (ఐరాస) సర్వసభ్య సమావేశంలో మంగళవారం ప్రసంగిం చనున్నారు. ఉత్తర కొరియా అణ్వస్త్ర పరీక్షలు, సిరియాలో ఐసిస్ ప్రాబల్యం తదిత రాలపై ఆయన మాట్లాడతారు. ప్రసంగానికి ముందే వివిధ దేశాల ప్రతినిధులతో ట్రంప్ సమావేశమై ఐరాసలో సంస్కరణలు తీసుకురావడానికి మద్దతు కోరనున్నారు. భారత్ సహా అనేక ప్రధాన దేశాలు ఐరాసలో సంస్కరణలు తేవాలనీ, భద్రతా మండలిని విస్తరించాలని కోరుతుండటం తెలిసిందే. ప్రస్తుత ఐరాస సర్వసభ్య సమావేశం 72వది కాగా ఈసారి మొత్తం 172 అంశాలపై చర్చించనున్నారు. కాగా, తమ బాధలను ఐరాస దృష్టికి తీసుకొచ్చేందుకు కొందరు శరణార్థులు ట్రంప్ చిన్ననాటి ఇంటిని ఉపయోగించుకున్నారు. -
క్లింటన్లగారింటి అమ్మాయి
బిల్ క్లింటన్ అమెరికా అధ్యక్షుడిగా పని చేశారు. అదే ఇంట్లోని హిల్లరీ క్లింటన్.. అమెరికా అధ్యక్షురాలిగా పోటీ చేశారు. ఇక ఆ ఇంట్లో ఉన్నది ఒక్కరే... చెల్సీ క్లింటన్! ఒక్కగానొక్క కూతురు. ఈ క్లింటన్లగారింటి అమ్మాయి కూడా రాజకీయాల్లోకి వచ్చేస్తుందా? తల్లి హిల్లరీ కలను తను నెరవేరుస్తుందా? చూడాలి. 2020లో... క్లింటన్ 3 వెర్షన్ వస్తుందేమో చూడాలి. రెండు ముక్కల్లో పూర్తి పేరు ⇒ చెల్సీ విక్టోరియా క్లింటన్ జననం ⇒ 1980 ఫిబ్రవరి 27 తల్లిదండ్రులు ⇒ బిల్ క్లింటన్, హిల్లరీ క్లింటన్ చదువు ⇒ బి.ఎ., ఎం.ఫిల్. డి.ఫిల్., ఎంపిహెచ్ వివాహం ⇒ 2010 జూలై 31 భర్త ⇒ మార్క్ మెజ్విన్స్కీ, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ పిల్లలు ⇒ కూతురు షార్లెట్ (3), కొడుకు ఐడన్ (1) కొలువు ⇒ ఎన్.బి.సి. స్పెషల్ కరస్పాండెంట్(2011 నుంచి 2014 వరకు) వ్యాపకం ⇒ క్లింటన్ ఫౌండేషన్ రోడ్రిగొ డ్యుటార్టె నోట్లో నోరు పెట్టడానికి పెద్దపెద్దవాళ్లే ‘ఎందుకులేబ్బా’ అనుకుంటారు. డ్యుటార్టె ఫిలిఫ్పీన్స్ అధ్యక్షుడు. చూడ్డానికి ఎన్కౌంటర్ స్పెషలిస్టులా ఉంటాడు. అమెరికాను, ఐక్యరాజ్యసమితినీ ఎవర్నీ లెక్క చెయ్యడు. అలాంటి వాడితో పడింది చెల్సీకి! చెల్సీ.. బిల్ క్లింటన్ కూతురు. రోడ్రిగో ఇటీవలే తన దేశంలోని దక్షిణ ప్రాంతంలో మార్షల్ లా విధించాడు. చిన్న స్పీచ్ కూడా ఇచ్చాడు. ‘‘మీరేమైనా చెయ్యండి. మీ బదులుగా నేను జైలుకు వెళతా. ఒకవేళ ఎవర్నైనా రేప్ చేయవలసి వస్తే ఆ పనీ చెయ్యండి. ఆ నేరాన్ని నా మీద వేసుకుంటా’’ అని సైనికులకు భరోసా ఇచ్చాడు. దీనిపై ప్రపంచంలో ఎవరూ మాట్లాడలేదు! చెల్సీ ఒక్కరే స్పందించారు. ‘డ్యుటార్టె మానవ హక్కులను విస్మరించిన భయంకరమైన వ్యక్తి’ అని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. డ్యుటార్టె ఊరుకుంటాడా? వైట్‌హౌస్ ఇంటెర్నీ మోనికా లెవెన్స్కీతో, మిగతా అమ్మాయిలతో మీ నాన్నగారు వివాహేతర సంబంధాలు నడిపిన విషయంపై నువ్వెప్పుడైనా నోరెత్తావా?’’ అని చెల్సీని విమర్శించాడు. అయితే చెల్సీ ఇప్పుడు వార్తల్లో ఉన్నది ఇందుకు కాదు. తిరిగి ఆమె డ్యుటార్టెకు ఎలాంటి రిటార్ట్ ఇవ్వబోతోందన్నదీ విషయం కాదు. కొన్నాళ్లుగా చెల్సీ తన ట్విట్టర్ ఫ్రొఫైల్‌కు పదును పెడుతున్నారు. ట్విట్టర్లో చెల్సీకి 10 లక్షల 70 వేల మంది ఫాలోయర్లు ఉన్నారు. ఆన్ లైన్లోనే కాదు, ఆఫ్ లైన్లోనూ తరచూ ఆమె తన అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. మరీ ముఖ్యంగా తన తల్లి హిల్లరీ క్లింటన్ గత అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచీ చెల్సీ వాయిస్ నిరంతరం ఎక్కడో ఒక చోట రెయిజ్ అవుతూనే ఉంది. ‘వరల్డ్ మెన్స్ట్రువల్ హైజీన్ డే’, చైల్డ్ మ్యారేజెస్ వంటి సామాజిక, లైంగిక ఆరోగ్య అంశాలపై ఆమె పరిశీలనలు, ట్రంప్ యంత్రాంగపు తీర్మానాలపై ఆమె ఆగ్రహ ప్రకటనలు ఆమెరికన్లను ఆకర్షిస్తున్నాయి. చెల్సీలోని ఈ క్రియాశీలత్వం ఇప్పుడు ఆ దేశపు మీడియాకు ఒక కొత్త సందేహాన్ని రేకెత్తిస్తోంది. చెల్సీ రాజకీయాలలోకి వస్తారా అన్నదే ఆ సందేహం. దీనికి కారణం ‘షి పెర్సిస్టెడ్’! ‘షి పెర్సిస్టెడ్’ అనేది.. గత మంగళవారం విడుదలైన చెల్సీ కొత్త పుస్తకం. ఆ పుస్తకం లోపల ఉన్న విశేష రచనల కన్నా, పుస్తకం పైన ఉన్న టైటిల్ ఇప్పుడు చెల్సీ రాజకీయ ప్రవేశానికి ఒక సంకేతంలా అమెరికన్ ప్రజలకు కనిపిస్తోంది! ‘షి పెర్సిస్టెడ్’ అంటే.. ‘ఆమె తగ్గలేదు’ అని అర్థం.ఈ పుస్తకం రాయడానికి చెల్సీకి ఇన్స్పిరేషన్ ఎలిజబెత్ వారెన్. 67 ఏళ్ల వారెన్ విద్యావేత్త, డెమొక్రాటిక్ పార్టీ సభ్యురాలు, మసాచుసెట్స్ సెనెటర్. గత ఫిబ్రవరిలో సెనెట్ ఫ్లోర్లో ఈమెకు, సెనెట్ మెజారిటీ లీడర్ మిచ్ మికానెల్ (75) కు పడింది. మికానెల్ది రిపబ్లికన్ పార్టీ. కెంటకీ సెనెటర్. ట్రంప్ తరఫున అటార్నీ జనరల్ పదవికి జెఫ్ సెషన్స్ (70) నామినేషన్‌పై ఫ్లోర్లో డిబేట్ జరుగుతున్నప్పుడు.. 1986లో ఇదే జెఫ్ సెషన్స్‌ను ఫెడరల్ జడ్జి పదవికి అడ్డుకుంటూ అమెరికన్ పౌరహక్కుల నాయకుడు స్వర్గీయ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ భార్య కొరెట్టా స్కాట్ కింగ్ రాసిన ఉత్తరం కాపీని ఎలిజబెత్ వారెన్ నిండు సెనెట్‌లో చదవడం మొదలు పెట్టగానే ఆమెపై మిచ్ మికానెల్ విరుచుకుపడ్డారు. చదవడం ఆపేయమని ఒక గద్దింపులా ఆదేశించారు. అయితే ఆయన గద్దింపును ఎలిజబెత్ ఖాతరు చేయలేదు. మికానెల్ వెంటనే పోడియంలోకి వెళ్లి... జ్ఛి ఠ్చీటఠ్చీటn్ఛఛీ. జ్ఛి ఠ్చీటజజీఠ్ఛిn ్చn ్ఛ్ఠp ్చn్చ్టజీౌn. N్ఛఠ్ఛిట్టజ్ఛి ్ఛటట, టజ్ఛి p్ఛటటజీట్ట్ఛఛీ అన్నాడు. ‘ఆమెను హెచ్చరించాను. ఆమెకు వివరణ ఇచ్చాను. కానీ వినలేదు. ఆమె తగ్గలేదు’ అని అర్థం. మికానెల్ మాటల్లోని ‘షి పెర్సిస్టెడ్’ అన్న మాటనే చెల్సీ టైటిల్‌గా పెట్టుకున్నారు. ‘ఆమె తగ్గలేదు’ అనే మాటను యావత్ మహిళా ప్రపంచానికే సగర్వమైన మాటగా చెల్సీ భావించారు. ‘‘మీరు రాజకీయాల్లోకి రాబోతున్నారా?’’ అని పుస్తకం విడుదల తర్వాత చెల్సీని ఇప్పుడు అంతా అడుగుతున్నట్లే.. ఆమె మూడేళ్ల వయసులో తండ్రి ఎన్నికల ప్రచారంలో ఆయనతో పాటు ఉన్నప్పుడు ఎవరో అడిగారు. దానికి చెల్సి చెప్పిన సమాధానం.. ‘నాకింకా మూడేళ్లే కదా’ అని. ఈ 37 ఏళ్ల వయసులో ‘ఆ రోజు అలా అన్నాను’ అని మాత్రమే నవ్వుతూ ప్రశ్నను దాటవేస్తున్నారు. అయితే చెల్సీ ఎంత దాటవేసినా.. 2020లో ఆమె ఏదో సాధించబోతున్నారని అమెరికన్ మీడియా విశ్వసిస్తోంది. ట్రంప్ తర్వాత ఆమె కుమార్తె ఇవాంక అధ్యక్ష పదవికి పోటీ పడితే కనుక, ఇవాంకను తట్టుకోగల శక్తి చెల్సీకి మాత్రమే ఉందన్నది ఇప్పటికే ఆ దేశంలో ఒక చర్చలా సాగడం మొదలైంది! ఈ సందర్భంగా చెల్సీ బ్రీఫ్ బయోగ్రఫీ. మూడు పుస్తకాలు ‘షి పెర్సిస్టెడ్’కు ముందు చెల్సీ రెండు పుస్తకాల రాశారు. ‘ఇటీజ్ యువర్ వరల్డ్: గెట్ ఇన్ఫార్మ్డ్, గెట్ ఇన్స్పైర్డ్ అండ్ గెట్ గోయింగ్’ అనే పుస్తకంలో మిడిల్–స్కూల్ పిల్లలకు సోషల్ ఎంపవర్మెంట్ గురించి చెప్పారు. ఇంకోటి గత జనవరిలో విడుదలైంది. ప్రపంచ ఆరోగ్యంపై చెల్సీ రాసిన ఆ పుస్తకం పేరు ‘గవర్నింగ్ గ్లోబల్ హెల్త్: హు రన్స్ ద వరల్డ్ అండ్ వై’. పుట్టకముందే పేరు! చెల్సీ అన్నది ఉత్తర లండన్‌లోని ఒక సంపన్న ప్రాంతం. చెల్సీ పుట్టడానికి ముందు 1978లో క్లింటన్ దంపతులు యుఎస్ నుంచి క్రిస్మస్ సెలవులకు చెల్సీకి వెళ్లినప్పుడు అక్కడ జోనీ మిచెల్ కచేరీలో ‘చెల్సీ మార్నింగ్’ అనే పాటను విన్నారు. ఆ పాట బిల్ క్లింటన్ మనసుకు హత్తుకుపోయింది. వెంటనే ఆయన ‘మనకు కూతురు పుడితే కనుక చెల్సీ అని పేరుపెట్టుకుందాం’ అని హిల్లరీతో అన్నారు. అన్నట్లే కూతురు పుట్టింది. చెల్సీ అని పేరూ పెట్టుకున్నారు. డాడీని నొప్పించింది చెల్సీకి డాన్స్ అంటే ఇష్టం. నాలుగేళ్ల వయసులోనే డాన్స్ మాయలో పడిపోయింది! వాషింగ్టస్ స్కూల్ ఆఫ్ బ్యాలేలో చాలా ఏళ్లు పాటు ప్రాక్టీస్ చేసింది. డాన్స్ కోసం సాఫ్ట్బాల్ని, సాకర్నీ వదిలేసింది. క్లింటన్‌కి కూతురి చాయిస్ నచ్చలేదు. చెప్పి చూశాడు. చెల్సీ వినలేదు. ఇక ఆమె దారిలోకే ఈయన వెళ్లాడు. కూతురు ఎక్కడ ప్రోగ్రాములు ఇస్తున్నా అక్కడికి వెళ్లడం మొదలుపెట్టాడు. ‘నట్‌క్రాకర్’ ప్లేలో స్టేజీ మీద ‘ఫేవరేట్ ఆంట్’ పాత్రను అభినయిస్తున్న కూతుర్ని చూసి తెగ మురిసిపోయాడని హిల్లరీ ‘ఇట్ టేక్స్ ఎ విలేజ్’ అనే తన పుస్తకంలో రాసుకున్నారు. తల్లి మతమే తన మతం బిల్ క్లింటన్ సదరన్ బాప్టిస్టు. హిల్లరీ మెథడిస్టు విశ్వాసి. రెండూ ప్రొటెస్టెంట్ల విభాగాలే అయినా ఫిలాసఫీలో స్వల్పంగా మాత్రమే వ్యత్యాసం ఉండేది. అయితే చెల్సీ తన తల్లి మార్గానే అనుసరించేది. తన ఏజ్ గ్రూప్ (టీన్స్) వాళ్లతో కలిసి మెథడిస్ట్ చర్చికి వెళ్లి వచ్చేది. అయితే అందర్లోనూ ‘టెరిఫిక్ కిడ్’ లా ఉండేది. చర్చి లేనప్పుడు తన చర్చి మేట్స్‌ని బ్రేక్‌ఫాస్ట్‌లకు, లంచ్‌కి పిలుచుకొచ్చేది. కొన్నిసార్లు క్లింటన్ దంపతులు కూడా వాళ్లతో కూర్చునేవారు. కొందరైతే రాత్రి ఉండడానికి (స్లీప్–ఓవర్) చెల్సీతో పాటు వైట్ హౌస్‌కి వచ్చేసేవారు! అమ్మ కోసం ప్రచారం హిల్లరీ క్లింటన్ 2008లో అధ్యక్ష పదవి ఎన్నికల ప్రచారంలో తల్లి అభ్యర్థిత్వానికి మద్దతుగా వందకు పైగా కాలేజీల్లో ప్రసంగించారు చెల్సీ. అప్పుడు ఎవరో ‘లెవిన్స్కీతో మీ నాన్న స్కాండల్, మీ అమ్మకు వ్యతిరేకంగా పనిచేస్తుందనుకుంటున్నారా?’ అని అడిగార్ట. ‘మీరు ఓటు వేయడానికి ఇదే ముఖ్యం అని భావిస్తే మీ భావనననుసరించి ఓటెయ్యండి. నేను అనుకోవడం ఏంటంటే.. హెల్త్ కేర్, ఎకనమిక్స్ అంశాల ఆధారంగా ఓటు వేసే వారూ ఉంటారని’ అన్నారు చెల్సీ. మొన్నటి అధ్యక్ష ఎన్నికల్లోనూ తల్లికి సపోర్టుగా ఉన్నారు. తల్లి ఓటమి చెల్సీని కదలించింది కానీ, తల్లి కదలిపోకుండా చూసేందుకే తన దృష్టినంతా కేంద్రీకరించారు. చెల్సీ కోడ్ నేమ్ ‘ఎన ర్జీ’ బిల్ క్లింటన్ తొలిసారి అమెరికా అధ్యక్షుడు అయినప్పుడు 1993 జనవరి 20న తల్లిదండ్రులతో పాటు చెల్సీ వైట్ హౌస్‌లోకి అడుగుపెట్టింది. అక్కడ ఆమెకు అమెరికా సీక్రెట్ సర్వీస్ ‘ఎనర్జీ’ అనే కోడ్‌నేమ్ ఇచ్చింది. అప్పుడు ఆమె వయసు 13 ఏళ్లు. క్లింటన్ దంపతులు తమ ఏకైక సంతానం అయిన చెల్సీని మీడియా కంటపడకుండా పెంచారు. ఈ విషయంలో హిల్లరీ.. కెనడీ భార్య జాక్వెలీన్ సలహాలను పాటించారు. ప్రభుత్వం తరఫున జరిగే సభలకు, సమావేశాలకు కూడా కూతుర్ని దూరంగా ఉంచారు. మీడియా అభివర్ణనలలోంచి తన వ్యక్తిత్వాన్ని చూసుకుని చెల్సీ వాటికి ప్రభావితం కాకుండా ఉండేందుకు క్లింటన్ దంపతులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయినప్పటికీ క్లింటన్ అధ్యక్షుడిగా చేసిన ఎనిమిదేళ్లలోనూ చెల్సీపై ‘ది న్యూయర్క్ టైమ్స్’లో 32 కథనాలు, టీవీలలో 87 నెట్వర్క్ న్యూస్ స్టోరీలు వచ్చాయి. అమెరికా చరిత్రలోనే అధ్యక్షుల పిల్లలందరిలోకీ ఎక్కువ మీడియా కవరేజీ వచ్చింది చెల్సీకే! ఐదవ ఏట రీగన్కి లెటర్ తండ్రి ఆర్కాన్సాస్ గవర్నర్‌గా పోటీ చేస్తున్నప్పుడు రెండేళ్ల వయసులోనే తల్లిదండ్రులతో పాటు ఎన్నికల ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొంది చెల్సీ! మూడేళ్లకే న్యూస్ పేపర్ చదవడం, ఉత్తరాలు రాయడం నేర్చుకుంది. ఐదో ఏట ఏకంగా అప్పటి అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్కే ఉత్తరం రాసింది. ఆ ఉత్తరం కాపీని క్లింటన్ ఇప్పటికీ భద్రంగా దాచి ఉంచారు. పశ్చిమ జర్మనీలోని నాజీ సైనికుల సమాధులను సందర్శించడానికి వెళ్లొద్దని చెల్సీ ఆ ఉత్తరంలో రాసింది! అమ్మానాన్నలతో చెల్సీ కొడుకుతో చెల్సీ దంపతులు -
హిల్లరీ సంచలన ఆరోపణలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి అనంతరం తొలిసారి హిల్లరీ క్లింటన్ పరాజయ కారణాలపై సవివరంగా స్పందించారు. తన ఓటమికి రష్యా జోక్యం, సొంత పార్టీ, ఎఫ్‌బీఐ, మీడియాతో పాటు ఇతర అంశాలు కారణమయ్యాయని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఎన్నికల ప్రచారంలో తీసుకున్న ప్రతి నిర్ణయానికి తానే బాధ్యురాలినని, వాటివల్ల మాత్రం ఓడిపోలేదన్నారు. ట్రంప్ అనుయాయుల సహకారంతో తప్పుడు ప్రచారంలో ఆరితేరిన రష్యా వల్లే పరాజయం పాలైనట్లు ఆమె చెప్పారు. పోలింగ్ వివరాలు, ఇతర సమాచారం రష్యాకు చేరవేడయంలో ట్రంప్ అనుచరులు సాయపడ్డారని ఆరోపించారు. ట్రంప్ ప్రచార బృందం, సహచరులకు ఎన్నికల ముందు, అనంతరం రష్యాతో ఉన్న సంబంధాలు వెలుగులోకి వస్తున్నాయని.. అన్నీ బహిర్గతమైతే సహకరించిన వారి వివరాలు బయటకొస్తాయన్నారు. ఈ–మెయిల్ వివాదాన్ని పెద్ద తప్పుగా పేర్కొంటూ మీడియా అనవసర రాద్దాంతం చేసిందని హిల్లరీ విమర్శించారు. అయితే హిల్లరీ ఆరోపణలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తోసిపుచ్చారు. మోసకారి అయిన హిల్లరీ తన ఓటమికి ప్రతిఒక్కరిని నిందిస్తున్నారని, తాను భయంకరమైన అభ్యర్థినని మాత్రం చెప్పడం లేదని ట్రంప్ ట్వీట్ చేశారు. ఫేస్బుక్, మీడియాను కూడా ఆడిపోసుకుంటున్నారని పేర్కొన్నారు. తన ప్రచార బృందానికి రష్యాతో సంబంధాలు ఉన్నాయని కల్పించి డొమొక్రాటిక్ పార్టీ ఓటమికి సాకులు చెబుతోందని మండిపడ్డారు. డొమొక్రాటిక్ పార్టీ చెప్పిన సాకు చూసి రష్యా కచ్చితంగా నవ్వుకుని ఉండొచ్చని అన్నారు. -
హిల్లరీ చెప్పిన కాసేపటికే దాడి!
సిరియాలోని వైమానిక స్థావరం మీద అమెరికా తన యుద్ధ విమానాల నుంచి తోమహాక్ క్షిపణులతో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడి జరగడానికి కొన్ని గంటల ముందు హిల్లరీ క్లింటన్ ఎన్బీసీ న్యూస్ చానల్‌తో మాట్లాడుతూ అసద్ అల్ బషర్ వైమానిక స్థావరాల మీద అమెరికా దాడి చేయాలని చెప్పారు. ఆ దేశంలో చాలావరకు పౌరుల మరణాలకు సిరియా వైమానిక దళమే కారణమని, అందువల్ల సిరియా అధ్యక్షుడి నియంత్రణలో ఉన్న మొత్తం అన్ని వైమానిక స్థావరాలను మనం స్వాధీనం చేసుకోవాలని ఆమె సూచించారు. ఆ తర్వాత కాసేపటికే సిరియా వైమానిక స్థావరంపై తోమహాక్ క్షిపణులు విరుచుకుపడ్డాయి. కాంగ్రెస్ అనుమతి లేకుండానే... వాస్తవానికి అమెరికా తరఫున ఎలాంటి సైనిక చర్య తీసుకోవాలన్నా అందుకు కాంగ్రెస్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. కానీ, సిరియా మీద దాడి విషయంలో డోనాల్డ్ ట్రంప్ మాత్రం కాంగ్రెస్ అనుమతి తీసుకోకుండానే దాడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇంతకుముందు బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా దాడులు చేసినా, అప్పట్లో మాత్రం కాంగ్రెస్‌లో విస్తృతంగా చర్చించిన తర్వాత మాత్రమే రంగంలోకి దిగారు. ఆరుగురు సైనికుల మృతి అమెరికా క్షిపణి దాడుల్లో ఒక అధికారి సహా ఆరుగురు సైనికులు మరణించారని సిరియా చెబుతోంది. షైరత్ వైమానిక స్థావరంపై దాదాపు 60 తోమహాక్ క్షిపణులను అమెరికా మధ్యధరా సముద్రంలోని తన యుద్ధ నౌకల నుంచి ప్రయోగించిన విషయం తెలిసిందే. ఈ దాడిలో తమ దేశానికి చెందిన నలుగురు సైనికులు మరణించినట్లు సిరియా అంటోంది. వాస్తవానికి తాము ఈ వైమానిక స్థావరాన్ని ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాదులపై దాడి కోసం ఉపయోగిస్తున్నామని, ఇలాంటి స్థావరాన్ని అమెరికా ధ్వంసం చేసిందని సిరియా వాదిస్తోంది. ఈ విషయాన్ని స్థానిక పాత్రికేయులు కూడా సమర్థిస్తున్నారు. సిరియాలో చాలా వైమానిక స్థావరాలు ఉండగా, అమెరికా మాత్రం కేవలం సిరియా వైమానిక దళం ఐసిస్ మీద దాడులకు ఉపయోగించే ఏకైక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుందని సిరియాకు చెందిన అల్ మస్దర్ న్యూస్ సీఈవో లీత్ అబూ ఫదెల్ ట్విట్టర్లో తెలిపారు. ఇప్పుడు సిరియాను అల్ కాయిదాకు వెండి పళ్లెంలో పెట్టి మరీ అప్పగిస్తున్నారని రక్షణ రంగ నిపుణుడు హైదర్ సుమేరి వ్యాఖ్యానించారు. -
ట్రంప్, రష్యా కుమ్మక్కై.. హిల్లరీని ఓడించారు!
అమెరికా ఎన్నికల్లో గెలిచేందుకు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రష్యా అధికారులతో కుమ్మక్కయ్యారనడానికి కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ మేరకు ఓ అంతర్జాతీయ వార్త సంస్ధ ఓ కథనాన్ని ప్రచురించింది. ఎన్నికల్లో రష్యా కలుగజేసుకుందా? అనే విషయంపై దర్యాప్తు చేపట్టిన అధికారుల్లో కొందరు ఈ విషయాన్ని ధ్రువీకరించినట్లు చెప్పింది. ప్రచారంలో హిల్లరీని వెనక్కునెట్టేందుకు రష్యా ఆపరేటివ్స్ ట్రంప్‌కు సహకరించినట్లు పేర్కొంది. ప్రస్తుతం ఎఫ్‌బీఐ ఈ విషయాన్ని సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టేందుకు అన్ని రకాలుగా సిద్ధమౌతున్నట్లు తెలిపింది. ట్రంప్‌కు రష్యాతో ఉన్న వ్యాపార సంబంధాలు, ఫోన్ రికార్డులను ఎఫ్‌బీఐ నిశితంగా పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. కాగా, ఈ వార్తలను ట్రంప్ అడ్మినిస్ట్రేటివ్ అధికారులు కొట్టిపారేశారు. -
విమానంలో హిల్లరీ ఫొటో వైరల్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన డెమొక్రటిక్ పార్టీ నేత హిల్లరీ క్లింటన్‌కు చెందిన ఓ ఫొటో ఇప్పుడు ఆన్లైన్లో వైరల్‌గా మారింది. ఓ వార్తా పత్రికలో అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌కు సంబంధించి వచ్చిన వార్తను ఆమె ఆసక్తిగా చదువుతుండగా తీసిన ఫొటో ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఓ విమానంలో తన ఫోన్‌తో బిజీగా ఉన్న హిల్లరీ తన ముందు ఉన్న యూఎస్ఏ టుడే అనే పత్రిక వైపు చూసి అలాగే చూస్తుండిపోయారు. ఇంతకీ ఆమె అంత ఆసక్తి చూస్తున్న మైక్‌పెన్స్‌కు సంబంధించిన వార్త ఏమిటంటే ఈమెయిల్ వ్యవహారం. అవును.. తన అధికారిక కార్యకలాపాలకు హిల్లరీ వ్యక్తిగత మెయిల్‌ను ఉపయోగించారని ఆరోపణలు వచ్చినట్లుగానే ఇప్పుడు మైక్ పెన్స్ కూడా ప్రభుత్వానికి సంబంధించిన కార్యకలాపాలకు మైక్ పెన్స్ కూడా తన వ్యక్తిగత ఈమెయిల్‌ను ఉపయగిస్తున్నారట. ఆ వార్తనే యూఎస్ఏ టుడే ప్రధాన వార్తగా తొలిపేజీలో వేసింది. గతంలో ఆయన ఉపయోగించిన ఇదే మెయిల్ హ్యాకింగ్‌కు గురైందని, ప్రధానమైన సమాచారం తస్కరణ చేశారని, ఇప్పుడు అదే ఉపయోగిస్తే దేశ భద్రతకు ప్రమాదం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తూ వార్తా కథనం వెలువరించింది. ఈ వార్తను చూసిన హిల్లరీ తదేకంగా చూస్తు ఉండిపోగా పక్క సీట్లో ఉన్న వ్యక్తి క్లిక్‌మనిపించి ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. -
ట్రంప్ నోరు విప్పాలి
శ్రీనివాస్ కూచిభొట్ల హత్యపై హిల్లరీ డిమాండ్ ♦ ట్రంప్ మౌనం విద్వేషపూరిత నేరాలకు ఆజ్యం: న్యూయార్క్ టైమ్స్ ♦ కోర్టు విచారణకు హాజరైన హంతకుడు ప్యూరింటన్ ♦ నేరం రుజువైతే 50 ఏళ్ల జైలు శిక్ష వాషింగ్టన్ : జాత్యాహంకార దాడిలో హత్యకు గురైన శ్రీనివాస్ ఉదంతంపై అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ స్పందించారు. అమెరికాలో కొనసాగుతున్న విద్వేషపూరిత నేరాలపై అధ్యక్షుడు ట్రంప్ నోరు విప్పాలని డిమాండ్ చేశారు. ‘బెదిరింపులు, విద్వేషపూరిత నేరాలు పెరిగాయి. ఈ విషయం ట్రంప్‌కు మనం చెప్పాల్సిన అవసరం లేదు. ట్రంప్ నోరు విప్పాలి’ అని ఆమె ట్వీట్ చేశారు. శ్రీనివాస్ హత్యపై ట్రంప్ ఇంతవరకూ స్పందించలేదు. అయితే శ్రీనివాస్ హత్యపై వైట్‌హౌస్ స్పందించింది. వలసలపై నిషేధాజ్ఞలకు కాన్సస్ కాల్పులకు సంబంధంలేదని వాదించిన సర్కారు... కాల్పుల ఘటన ఆందోళన కలిగించిందని తెలిపింది. ఆ మేరకు వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి సీన్ స్పైసర్ మీడియాతో మాట్లాడుతూ... కాన్సస్ నుంచి అందుతున్న ప్రాథమిక వివరాలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. విద్వేషాల్ని అణచకుండా ఆజ్యం పోస్తున్నారు: న్యూయార్క్ టైమ్స్ భారతీయ ఇంజనీరు హత్యపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మౌనం వహించి... అమెరికాలో విద్వేషపూరిత నేరాలకు ఆజ్యం పోశారని ప్రముఖ వార్తాపత్రిక న్యూయార్క్ టైమ్స్ అభిప్రాయపడింది. ‘అధ్యక్షుడు ట్రంప్, అతని యంత్రాంగం చాలా మంది వలసదారులు, విదేశీ పర్యాటకుల్ని దేశం నుంచి పంపేందుకు ప్రయత్నించడం ఒక్కటే కాదు... వారిని నేరస్తులుగా, ఉగ్రవాదులుగా, అక్రమంగా నివసిస్తున్నవారిగా ముద్ర వేస్తోంది. విద్వేషాన్ని అణచివేయకుండా... అధ్యక్షుడు ఆజ్యం పోస్తున్నారు. కాన్సస్ కాల్పులకు సంబంధించి కనీసం ఏమీ మాట్లాడలేదు. విద్వేషపూరిత నేరం జరిగితే నేరస్తుడి మానసిక స్థితి సరిగాలేదని సులువుగా చెప్పేస్తున్నారు. ఒకవేళ ఇలాంటి నేరాలు ముస్లింలు గానీ, సరైన పత్రాలు లేకుండా నివసిస్తున్నవారు చేస్తే... తాను చెప్పినట్లే జరుగుతుందని ట్రంప్ తప్పకుండా అంటారు’ అని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. ట్రంప్ ఎలాంటి చర్యలు తీసుకోకపోతే... విద్వేష పూరిత నేరాలు చేసేందుకు నేరస్తులకు అధికారమిచ్చినట్లు అవుతుందని తన వ్యాసంలో తప్పుపట్టింది. ‘ట్రంప్ అమెరికా’లో విద్వేష పూరిత నేరాలు, పక్షపాతంతో కూడిన సంఘటనలు ఎక్కువవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. మీతో ఉండనివ్వండి: బార్టెండర్తో ప్యూరింటన్ శ్రీనివాస్ హత్య తర్వాత రెస్టారెంట్లో తలదాచుకున్న ప్యూరింటన్ ... బార్టెండర్ సామ్‌తో ఏం మాట్లాడింది వెలుగులోకి వచ్చింది. ‘నేను మీతో ఉండవచ్చా అని ప్యూరింటన్ నన్ను అడిగాడు. ఏంచేశాడో చెప్పలేదు. నేను అతన్ని అడుగుతూనే ఉన్నాను. మాతో ఉండనిస్తేనే ఏం జరిగిందో∙చెపుతానన్నాడు. చివరికి ఒలేతేలో ఇద్దరు ఇరానియన్లను చంపానన్నాడు’ అని సామ్ పోలీసులకు ఫోన్ లో వెల్లడించింది. సాక్ష్యాధారాల సేకరణ కోసం రంగంలోకి ఎఫ్‌బీఐ అమెరికాలోని కాన్సస్‌లో శ్రీనివాస్ కూచిభొట్లను హత్య చేసి, మరో ఇద్దరిని గాయపరిచిన కేసులో నిందితుడు ఆడమ్ ప్యూరింటన్ ర్చారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిందితుడ్ని జాన్సన్ కౌంటీ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి సోమవారం విచారించారు. ప్యూరింటన్ పై ఒక ఫస్ట్–డిగ్రీ మర్డర్(హత్య), రెండు ఫస్ట్ డిగ్రీ మర్డర్ అటెంప్ట్(హత్యాయత్నం) కేసులు నమోదైన సంగతి తెలిసిందే. జాన్సన్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ వెల్లడించిన వివరాల ప్రకారం... నేరం రుజువైతే ప్యూరింటన్ కు గరిష్టంగా 50 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశముంది. మరోవైపు, సాక్ష్యాధారాల సేకరణలో స్థానిక పోలీసులకు ఎఫ్‌బీఐ సాయమందిస్తోంది. ఈ హత్యను జాత్యహంకార నేరంగా ఎఫ్‌బీఐ రుజువు చేస్తే ఫెడరల్ అభియోగాల మేరకు ప్యూరింటన్ కు మరణశిక్ష విధించే అవకాశముంది. ప్రస్తుతం అతను జాన్సన్ కౌంటీ జైలులో రిమాండ్‌లో ఉన్నాడు. తెలుగులో మాట్లాడొద్దు: ‘టాటా’ హైదరాబాద్: అమెరికాలో నివసించే తెలుగు ప్రజలు బహిరంగ స్థలాల్లో తెలుగులో మాట్లాడ వద్దని తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టాటా) సూచించింది. ‘మాతృభాషలో మాట్లాడడాన్ని మనం ఎంతో ఇష్టపడ తాం. కొన్నిసార్లు తప్పుగా అర్థం చేసుకు నే అవకాశముంది. బహి రంగ ప్రదేశాల్లో ఇంగ్లిషులో మాట్లాడండి’ అని ఫేస్బుక్ పేజీలో కోరింది. బహిరంగ ప్రదేశాల్లో ఇతరులతో వాగ్వాదం పెట్టుకోవద్దని సూచించింది. జనసంచారం లేని ప్రాంతాల్నిలక్ష్యంగా చేసుకుంటున్నారని, తప్పనిసరైతే అలాంటి ప్రదేశాలకు ఒంటరిగా వెళ్లవద్దని సూచించింది. -
శ్రీనివాస్ హత్యపై ఘాటుగా స్పందించిన హిల్లరీ
-
శ్రీనివాస్ హత్యపై ఘాటుగా స్పందించిన హిల్లరీ
ఎన్నారై సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూచిభొట్ల శ్రీనివాస్ హత్యపై అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన హిల్లరీ క్లింటన్ ఘాటుగా స్పందించారు. దేశంలో పెరిగిపోతున్న 'జాతివిద్వేష నేరాల'పై ట్రంప్ మాట్లాడాల్సిందేనని, శ్రీనివాస్ హత్యకు ఏం సమాధానం చెబుతారని అన్నారు. ''దేశంలో బెదిరింపులు, జాతి విద్వేష నేరాలు పెరిగిపోతున్నాయి. అమెరికా అధ్యక్షుడు తన పని తాను చేయాలని మనం చెప్పాల్సిన అవసరం లేదు'' అని ఆమె ట్వీట్ చేశారు. తన ట్వీట్‌తో పాటు దివంగత శ్రీనివాస్ భార్య సునయన ప్రెస్‌మీట్ పెట్టి ట్రంప్ ఏం సమాధానం చెబుతారని అడిగిన వార్తా కథనం క్లిప్పింగ్ కూడా జతచేశారు. అమెరికాలో భారతీయుల భద్రతను ఆమె సూటిగా ప్రశ్నించిన విషయం తెలిసిందే. శ్రీనివాస్ కూచిభొట్లపై కాల్పుల తర్వాత ఒక్కసారిగా అమెరికాలో జరుగుతున్న జాతివిద్వేష దాడులు, ఇతర నేరాలపై చర్చ పెరిగింది. కాన్సాస్ కాల్పుల్లో కూచిభొట్ల శ్రీనివాస్ మరణించిన కొద్ది రోజులకే ట్రంప్ ప్రభుత్వం కొత్త ఇమ్మిగ్రేషన్ చట్టాన్ని అమలుచేస్తోంది. దీని ప్రకారం ఏడు ముస్లిం దేశాలకు చెందిన వాళ్లు అమెరికా రావడానికి వీలుండదు. ఇంతకుముందు ట్రంప్ తీసుకొచ్చిన ఉత్తర్వులకు కోర్టులు అడ్డుకట్ట వేశాయి. దాంతో దాన్ని సవరించి మరో కొత్త చట్టాన్ని తెస్తామని ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, కూచిభొట్ల శ్రీనివాస్ మృతదేహం హైదరాబాద్‌కు చేరుకుంది. ఎయిరిండియా విమానంలో సునయనతోపాటు శ్రీనివాస్ సోదరుడు ఈ మృతదేహాన్ని తీసుకొచ్చారు. శ్రీనివాస్‌తో పాటు ఉన్న అతడి స్నేహితుడు మాడసాని అలోక్ రెడ్డి మీద కూడా 51 ఏళ్ల ఆడమ్ పురిన్టన్ కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో అలోక్ రెడ్డితోపాటు, పురిన్టన్ను ఆపేందుకు ప్రయత్నించిన మరో అమెరికన్ ఇయాన్ గ్రిల్లాట్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. With threats & hate crimes on rise, we shouldn't have to tell @POTUS to do his part. He must step up & speak out.https://t.co/QKKyXyuqNM — Hillary Clinton (@HillaryClinton) 27 February 2017 అమెరికాలో జాతివిద్వేషంపై మరిన్ని కథనాలు చూడండి... హైదరాబాద్‌కు చేరుకున్న శ్రీనివాస్ మృతదేహం ‘కాలుస్తుంటే ఏదో ఒకటి చేయాలనిపించింది’ అమెరికాలో ప్రమాదం ఇలా తప్పించుకోండి అమెరికాలో భారతీయులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అమెరికాలో జాతి విద్వేష కాల్పులు విద్వేషపు తూటా! మనం అమెరికాకు చెందిన వాళ్లమేనా? భారతీయుల రక్షణకు కట్టుబడి ఉండాలి కాల్పులపై శ్వేతసౌదం ఏం చెబుతుందో? నా భర్త మరణానికి సమాధానం చెప్పాలి ‘తరిమేయండి.. లేదా తలలో బుల్లెట్లు దించండి’ -
హిల్లరీని మరోసారి టార్గెట్ చేసిన ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ హిల్లరీగా భారీగానే టార్గెట్ చేశారు. ఎన్నికల్లో తనకు ప్రధానపోటీ ఇచ్చిన డెమోక్రాట్ అభ్యర్థి హిల్లరీని ఇరకాటంలో పెట్టేందుకు సిద్ధపడుతున్నారు. తాను అధికారంలోకి వస్తే హిల్లరీ క్లింటన్ ను జైలుకు పంపిస్తానని పదే పదే హెచ్చరించిన ట్రంప్ ఆ వైపుగా పావులు కదుపుతున్నారు. క్లింటన్ పై దాడిని ఎక్కుపెడుతూ శుక్రవారం చేసిన ట్వీట్ ఈ విషయాన్నే స్పష్టం చేస్తోంది. ఈ-మెయిల్స్ అస్త్రాన్ని మరోసారి వాడుకున్న ట్రంప్. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆమెకు అసలు పోటీచేసే అవకాశమే లేదన్నారు. కానీ ఆమె పట్ల చాలా ఉదాహరంగా వ్యవహరించారన్నారు. ఆమె తప్పుడు ప్రచారం చేశారు కనుకనే ఎన్నికల్లో ఓడిపోయారని.. ఇందులోఆశ్చర్యం ఏమీ లేదంటూ హిల్లరీ అనుచరులపై మండిపడ్డారు. అలాగే యూఎస్ న్యాయాధికారి ఇనస్పెక్టర్ జనరల్ ఆండ్రూ నపోలిటానో గురువారం వ్యాఖ్యానించారు. హిల్లరీ ఈ-మెయిల్స్ వ్యవహారంపై ఎఫ్ బీఐ రెండుసార్లు క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ, మరోసారి విచారణ చేసే అవకాశం ఉందని ఆండ్రూ వెల్లడించారు. ఈ కేసు విచారణను పునః ప్రారంభించాలంటూ పిటిషన్ దాఖలు అయిందని వెల్లడించారు. మరోవైపు దర్యాప్తునకు పూర్తి సహాకారాన్ని అందిస్తామని హిల్లరీ ప్రతినిధి బ్రియాన్ ఫల్లోన్, గురువారం చెప్పారు. అలాగే జనవరి 20 న ప్రమాణ స్వీకారం చేసే ట్రంప్ కు విచారణ రద్దుచేసే అధికారం ఉండదంటున్నారు.. ఫెడరల్ చట్టం ప్రకారం అధ్యక్షుడు కాంగ్రెస్‌కు 30 రోజులు ముందుగానే రాతపూర్వక సమాధానం ఇవ్వాలని వాదిస్తున్నారు. కాగా విదేశాంగ శాఖ కార్యదర్శిగా హిల్లరీ కొనసాగిన సమయంలో, తన అధికారిక కార్యకలాపాలకు వ్యక్తిగత ఈ-మెయిల్స్ ను వాడారంటూ, ఆరోపణలు వచ్చాయి. దీంతో తన ప్రచారం సందర్భంగా ట్రంప్ హిల్లరీ శిక్ష నుంచి తప్పించుకోలేరని, ఆమెను పారిపోనివ్వమని హెచ్చరించిన సంగతి తెలిసిందే. What are Hillary Clinton's people complaining about with respect to the F.B.I. Based on the information they had she should never..... — Donald J. Trump (@realDonaldTrump) January 13, 2017 have been allowed to run - guilty as hell. They were VERY nice to her. She lost because she campaigned in the wrong states - no enthusiasm! — Donald J. Trump (@realDonaldTrump) 13 January 2017 -
ట్రంప్ గెలుపునకు పుతిన్ కృషి
అమెరికా నిఘా సంస్థ నివేదిక వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపునకు, హిల్లరీ ఓటమికి పుతిన్ ‘ప్రభావిత ప్రచారం’నిర్వహించారని అమెరికా జాతీయ నిఘా సంస్థ పేర్కొంది. అమెరికా ఎన్నికల లక్ష్యంగా పుతిన్ ప్రభావిత ప్రచారానికి ఆదేశాలిచ్చారని తాము ఓ అంచనాకు వచ్చామని ఆ సంస్థ డైరెక్టర్ తన నివేదికలో పేర్కొన్నారు. అమెరికా ప్రజాస్వామ్య విధానంపై ప్రజల్లో నమ్మకం పోయేలా చేయడం, హిల్లరీ క్లింటన్‌ను ఓడించడమే రష్యా లక్ష్యం అని 31 పేజీల ఆ నివేదికలో పేర్కొన్నారు. ఆ నివేదికను గురువారం అధ్యక్షుడు బరాక్ ఒబామాకు సమర్పించారు. అయితే దీనిని ట్రంప్ ఖండించారు. -
శత్రువులకు కూడా న్యూఇయర్ గ్రీటింగ్స్!
వాషింగ్టన్: అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త సంవత్సరం సందర్భంగా తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపారు. తన రాజకీయ ప్రత్యర్థులపై వ్యంగ్యంగా విసుర్లు సంధిస్తూ గ్రీటింగ్స్ చెప్పారు. 'నా చాలామంది శత్రువులు, నాతో ఎన్నికల్లో పోరాడి దారుణంగా ఓడిపోయి.. ఇప్పుడేం చేయాలో పాలుపోక ఉన్నవారు.. ఇలా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు' అని ట్రంప్ ట్వీట్ చేశారు. రిపబ్లికన్ అభ్యర్థి నామినేషన్ కోసం హోరాహోరీగా పోరాడి.. ఆ తర్వాత డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌తో చివరివరకు తలపడి.. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ నెల 20న అమెరికా 45వ అధ్యక్షుడిగా ఆయన ప్రమాణం చేయబోతున్నారు. నిజానికి న్యూయార్క్ బిలియనీర్ అయిన ట్రంప్‌కు మొదటినుంచి సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థులపై వ్యంగ్యాస్త్రాలు సంధించే అలవాటు ఉంది. రాజకీయాల్లోకి రాకముందు కూడా ఆయన ఇదే పంథాను అనుసరించారు. -
హిల్లరీ ఓటమికి కారణం వారే!
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ ఓటమికి 'యాంగ్రీ వైట్‌మెన్' కారణమని అమెరికా మాజీ అధ్యక్షుడు, హిల్లరీ భర్త బిల్ క్లింటన్ పేర్కొన్నారు. సోమవారం న్యూయార్క్‌లోని వీక్లీ న్యూస్ పేపర్ 'రికార్డ్ రివ్యూ'తో మాట్లాడుతూ బిల్ క్లింటన్ ఈ వ్యాఖ్యలు చేశారు. డొనాల్డ్ ట్రంప్‌కు పెద్దగా ఏమీ తెలియకున్నా.. యాంగ్రీ వైట్‌మెన్ ఓట్లు ఎలా గెలవాలో తెలుసు అని హిల్లరీ ఓటమి గురించి మాట్లాడుతూ బిల్ క్లింటన్ వ్యాఖ్యానించారు. అలాగే.. రష్యా హ్యాకింగ్, ఎఫ్‌బీఐ డైరెక్టర్ జేమ్స్ కోమి సైతం హిల్లరీ ఓటమికి కారణమని విశ్లేషించారు. ఎన్నికలకు రెండు వారాల ముందు హిల్లరీ ఈ మేయిల్స్ వ్యవహారంపై ఎఫ్‌బీఐ పునర్విచారణ అనడం ఖచ్చితంగా ఫలితాలపై ప్రభావం చూపిందని బిల్ క్లింటన్ స్పష్టం చేశారు. -
జై కొడతారా..? నై అంటారా?
అమెరికా అధ్యక్ష ‘అసలు’ ఎన్నిక 19న - కీలకంగా మారిన ఎలక్టోరల్ కాలేజీ భేటీ - ట్రంప్‌ను వ్యతిరేకిస్తున్న కొందరు సొంత పార్టీ సభ్యులు - ఓటింగ్‌లో ఎటు మొగ్గుతారన్న దానిపై ఉత్కంఠ - హిల్లరీ, ట్రంప్ కాకుండా మరో అభ్యర్థికి మద్దతిస్తున్న ‘హామిల్టన్’ బృందం అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ నవంబర్ 8న జరిగింది. ఫలితం 24 గంటల్లోపే వచ్చింది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గెలిచారు. కానీ రాజ్యాంగం ప్రకారం ఎన్నికల ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. 48 రాష్ట్రాలు (మెయిన్, నెబ్రాస్కా పద్ధతి వేరు), రాజధాని వాషింగ్టన్ డీసీ నుంచి ఎన్నికైన 538 మంది ఎలక్టోరల్ కాలేజీ ఎలక్టర్లు (ఓటర్లు లేదా ప్రతినిధులు) 19వ తేదీన తమ రాష్ట్ర రాజధానుల్లో సమావేశమై అధ్యక్షుడిని లాంఛనంగా ఎన్నుకుంటారు. మొత్తం 538 ఎలక్టోరల్ కాలేజీ ఎలక్టర్లలో 306 మంది రిపబ్లికన్లు (మెజారిటీకి అవసరమైన కనీస ఓట్లు 270). 232 మంది డెమోక్రాట్లు. రెండు పక్షాల ఎలక్టర్లు ఎవరి అభ్యర్థికి వారు ఓట్లేసుకుంటారు. కొత్త అధ్యక్షుడు ప్రమాణం చేసే జనవరి 20కి రెండు వారాల ముందు అంటే.. జనవరి 6న ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను లెక్కించి గెలిచిన అభ్యర్థిని ప్రకటించడం కేవలం లాంఛనం. రెండు వారాల ముందు సంచలనం ముందుగా ప్రమాణం చేసినట్టు తమ అభ్యర్థి ట్రంప్‌కు ఓటు వేయబోనని టెక్సాస్ రిపబ్లికన్ ఎలక్టర్ క్రిస్టఫర్ సప్రూన్ ప్రకటించడంతో సంచలనం మొదలైంది. తమ అభ్యర్థులకు ఓటేయబోమని, ట్రంప్‌కు బదులు ఏకాభిప్రాయంతో ఓ రిపబ్లికన్ను ఎంపిక చేసుకుని ఆయనకే ఓటేస్తామని పలువురు ఎలక్టర్లు (రెండు పార్టీలవారు) ఈ నెల ఐదు నాటికే ప్రకటించారు. దీంతో 19న జరిగే ఓటింగ్‌పై ఆసక్తి పెరిగింది. ట్రంప్‌కు ఓటేయడానికి ఇష్టపడని మరో టెక్సాస్ ఎలక్టర్ ఆర్ట్ సిస్నరాస్(రి) తన సభ్యత్వానికే రాజీనామా ఇచ్చారు. అలాగే ట్రంప్‌కు ఓటేయనని బహిరంగంగానే చెప్పిన జార్జియా ఎలక్టర్ బావ్కీ వూతో బలవంతంగా సభ్యత్వానికి రాజీనామా చేయించారు. ఇలా తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేయని ఎలక్టర్లను ‘ఫెయిత్లెస్’ ఓటర్లని (నమ్మకద్రోహులు) పిలవడం అమెరికా సంప్రదాయం. పైన చెప్పినట్లు ఇలాంటి విశ్వాసఘాతుకానికి పాల్పడే అవకాశమున్న ఎలక్టర్లు రెండు పార్టీల్లో కలిపి ఎంతమంది ఉన్నారో కచ్చితంగా తెలియదు. మాట తప్పితే సభ్యత్వం రద్దు సొంత పార్టీ అభ్యర్థులకే ఓటేయాలనే చట్టాలున్న రాష్ట్రాల్లో మాట తప్పి ఓటేసే ఎలక్టర్లపై వేయి డాలర్ల జరిమానా విధిస్తారు. అవసరమనుకుంటే వారి స్థానంలో వేరే సభ్యులను నియమించే వీలును చట్టాలు కల్పిస్తున్నాయి. అయితే ఇంత వరకూ ఇలా ఓటేసిన ఎవరిపైనా పెనాల్టీ వేయలేదు. ఏ సభ్యుడినీ ప్రాసిక్యూట్ చేయలేదు. 2004 ఎలక్టర్ల పోలింగ్‌లో ఓ డెమొక్రాట్ ప్రతినిధి పొరపాటున అధ్యక్ష ఓటును అభ్యర్థి జాన్ కెరీకి కాకుండా.. ఉపాధ్యక్ష నామినీ జాన్ ఎడ్వర్డ్స్‌కు వేశారు. పాపులర్ ఓట్లే కీలకం అధ్యక్ష ఎన్నికల్లో మొదట్నించీ విజేతను ఎల క్టోరల్ కాలేజీ ఓటర్లే నిర్ణయిస్తున్నారు. 2016 ఎ న్నికలు సహా ఐదుసార్లు మాత్రమే గెలిచిన అధ్యక్ష అభ్యర్థి కన్నా ఓడిన పార్టీ నేత ఎక్కువ ప్రజా ఓట్లు సంపాదించారు. 2000 ఎన్నికల్లో అల్ గోర్(డెమోక్రాట్)కు జార్జి డబ్ల్యూ బుష్ కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. అంతకు మూడుసార్లు(1824, 1876, 1888) అత్యధిక ప్రజల ఓట్లు పొందిన అభ్యర్థులు ఓడిపోయా రు. మొన్నటి నవంబర్ ఎన్నికల్లో ట్రంప్ కన్నా దాదాపు 28 లక్షల ఓట్లు ఎక్కువ పొందిన హిల్లరీ పై నలుగురి జాబితాలో చేరారు. అత్యంత విధేయులే ఎలక్టర్లు! పార్టీ తరఫున రాష్ట్రాల నుంచి ఎన్నికయ్యే ఎలక్టర్లుగా అత్యంత విధేయులైన సభ్యులనే ఎంపిక చేస్తారు. వారికి విభిన్న నేపథ్యాలుంటాయి. వయసులో తేడాలూ ఉంటాయి. ఈసారి న్యూయార్క్ డెమొక్రాట్ ఎలక్టర్‌గా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ (70) ఎన్నికవగా, వాషింగ్టన్ స్టేట్ నుంచి 19 ఏళ్ల లేవీ గుయేరా ఎంపికయ్యారు. ‘హామిల్టన్ ఎలక్టర్స్’ ఎవరు? అమెరికా అధ్యక్ష ఎన్నికలు తుది అంకానికి చేరు కున్నాయి. అంచనాలను తలకిందులు చేస్తూ డొనాల్డ్ ట్రంప్ అనూహ్యంగా గెలిచిన సంగతి ముందే తెలిసినప్పటికీ.. ఎల క్టోరల్ కాలేజీ సమావేశమై అధ్యక్షుడిని ఎన్నుకునే లాంఛన ప్రక్రియ ఈ నెల 19న జరగనుంది. అయితే.. పాపులర్ ఓటులో హిల్లరీ క్లింటన్‌కు భారీ మెజారిటీ రావడం.. ట్రంప్‌ను అధ్యక్షుడిగా అంగీకరించబోమంటూ పలు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిరస నలు చెలరేగడం.. మూడు రాష్ట్రాల్లో రీకౌంటింగ్ నిర్వహించడం.. ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓటు వేయాలంటూ రిపబ్లికన్ పార్టీ ఎలక్టోరల్ సభ్యులకు విజ్ఞప్తులు వెల్లువెత్తడం వంటి పరిణామాల నే పథ్యంలో.. సోమవారం జరగబోయే ఎలక్టోరల్ కాలేజీ ఎన్నిక ఏదైనా అనూహ్య మలుపు తిరుగు తుందా అన్న ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ట్రంప్, హిల్లరీకి కాకుండా ఏకాభిప్రాయంతో నిర్ణయించిన రిపబ్లికన్ అభ్యర్థికి ఓటేయాలని తీర్మానించుకున్న ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు కొందరు తమను ‘హామిల్టన్ ఎలక్టర్స్’ అని పిలు చుకుంటున్నారు. అమెరికా వ్యవస్థాపకుల్లో ఒకరు, దేశ రెండో అధ్యక్షుడు అలెగ్జాండర్ హామిల్టన్ పేరుతో ఈ ‘తిరుగుబాటు’ ఎలక్టర్లు రంగంలోకి దిగారు. దీనికి కారణం లేకపోలేదు. ఎలక్టోరల్ కాలేజీ ప్రధాన లక్ష్యాన్ని హామిల్టన్ వివరించారు. అర్హత లేని అభ్యర్థి లేదా విదేశీ శక్తుల ప్రభావం ఉన్న అభ్యర్థి అధ్యక్షుడిగా ఎన్నికగాకుండా నివారించే రక్షణ వ్యవస్థగా ఈ కాలేజీ పనిచేస్తుందని ఆయన ప్రకటించారు. ఓహాయో రాష్ట్ర గవర్నర్ జాన్ కేసిక్(రి)కు ఓటేయాలని హామిల్టన్ ఎలక్టర్లు నిర్ణయించుకున్నారు. ఎలక్టర్ల ఓట్లు ఎలా? అధ్యక్ష ఎన్నికల కోసం ప్రధాన పార్టీలు పోలింగ్‌కు ముందే ఈ ఎలక్టోరల్ కాలేజీ ఎలక్టర్లను ఎంపిక చేస్తాయి. ఎలక్టోరల్ కాలేజీ ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థికే ఓటేస్తామని ఈ ఎలక్టర్లు మొదట ప్రమాణం చేస్తారు. 227 ఏళ్ల అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో ఇంతవరకూ ఈ ఎలక్టర్లు 99 శాతానికి పైగా తమ పార్టీ అభ్యర్థులకే ఓట్లేశారు. అలాగే ఓటు వేయాలని 29 రాష్టాల చట్టాలు చెబుతున్నాయి. 14 రాష్ట్రాల్లో మాత్రం ప్రమాణం చేసిన అభ్యర్థికి ఓటేయకపోయినా ఇబ్బంది ఉండదు. ప్రధాన అధ్యక్ష అభ్యర్థుల పేర్లు కాకుండా ఇతరు పేర్లు కూడా రాసి ఓటేయవచ్చు. ప్రతి ఎలక్టరూ రెండు కాగితాలపై అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్థుల పేర్లు రాయాల్సి ఉంటుంది. ఇదీ రివాజు. ఓటేసిన తర్వాత ఈ 538 మంది సభ్యత్వం దానంతటదే రద్దవుతుంది. ఫలితం మారుతుందా? అధ్యక్షుడిగా అర్హత లేదని కొందరు, అత్యధిక ప్రజల ఓట్లు తెచ్చుకోలే దని మరికొందరు ట్రంప్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నా.. రిపబ్లికన్ ఎలక్ట ర్లలో 38 మంది ఆయనకు ఓటేయకపోతే తప్ప ఆయనే విజేత అవుతారనడంలో సందేహం లేదు. అధ్యక్ష ఎన్నికలను పరోక్ష పద్ధతి నుంచి ప్రత్యక్ష విధానానికి (పాపుల ర్ ఓటు ద్వారా) మార్చాలనే వాదనకు కూడా ఈ వివాదం వల్ల ప్రచారం లభిస్తోంది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
మహిళలు వాళ్లకే అండగా ఉంటారు కానీ..
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ఓటమి పాప్ స్టార్ మడోన్నాను ఆవేదనకు గురిచేసింది. ఎన్నికల్లో హిల్లరీ తరఫున ప్రచారం చేసిన మడోన్నా.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ గెలవడాన్ని జీర్ణించుకోలేకపోతోంది. హిల్లరీ ఓటమికి మహిళలే కారణమని నిందించింది. మహిళలు మహిళలను ద్వేషిస్తారని మడోన్నా వ్యాఖ్యానించింది. అమెరికా అధ్యక్షురాలిగా ఓ మహిళను అంగీకరించలేకపోయారని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. మహిళలను పలు సందర్భాల్లో కించపరిచేలా మాట్లాడిన, అసభ్యంగా ప్రవర్తించిన ట్రంప్‌కు ఎక్కువ మంది మహిళలు మద్దతు పలికారని మడోన్నా ఆవేదన వ్యక్తం చేసింది. సాటి మహిళలకు మద్దతుగా ఉండకపోవడం మహిళల స్వభావమని, ఇది చాలా బాధకరమని అంది. మగవాళ్లు అందరినీ సంరక్షిస్తారని, మహిళలు మాత్రం వారి భాగస్వామి, పిల్లలకు అండగా ఉంటారని చెప్పింది. -
రీకౌంటింగ్‌పై ట్రంప్ సీరియస్..!
మళ్లీ లెక్కింపునకు సై అంటున్న హిల్లరీ వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రీకౌంటింగ్ దుమారం కొనసాగుతూనే ఉంది. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ స్వల్ప తేడాతో గట్టెక్కిన విస్కాన్సిన్ రాష్ట్రంలో రీకౌంటింగ్‌కు ఎన్నికల సంఘం అంగీకరించడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒకవైపు రీకౌంటింగ్‌కు అంగీకరించడాన్ని ట్రంప్ తీవ్రస్థాయిలో తప్పుబడుతుండగా.. మరోవైపు ఓడిపోయిన హిల్లరీ క్లింటన్ వర్గం దీనిపై ఆశల్లో తేలియాడుతోంది. విస్కాన్సిన్ రాష్ట్రంలో చేపట్టే రీకౌంటింగ్ ప్రక్రియలో తాము కూడా పాల్గొంటామని హిల్లరీ ప్రచార అధికారి ఒకరు శనివారం స్పష్టం చేశారు. రీకౌంటింగ్ ఒక స్కాం అని, గ్రీన్ పార్టీ తమ ఖజానాను నింపుకోవడానికే రీకౌంటింగ్‌ను తెరపైకి తెచ్చిందని డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్లో మండిపడ్డారు. ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయి.. నైతికంగా దివాళా తీసిన డెమొక్రాట్లు దీనికి మద్దతు తెలుపుతున్నారని మండిపడ్డారు. రీకౌంటింగ్ వల్ల గెలుపు వరిస్తుందేమోనన్న తప్పుడు ఆలోచనతో డెమొక్రాట్లు ఉన్నారని సీరియస్ అయ్యారు. అమెరికాలో ఇలా ఎప్పుడు జరగలేదని పేర్కొన్నారు. డొనాల్డ్ ట్రంప్ స్వల్పతేడాతో గట్టెక్కిన మూడు రాష్ట్రాలైన విస్కాన్సిన్, మిచిగన్, పెన్సిల్వేనియాలలో రీకౌంటింగ్ జరుపాలన్న డిమాండ్ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. గ్రీన్ పార్టీ అభ్యర్థి జిల్ స్టీన్ చేసిన ఈ డిమాండ్ మేరకు విస్కాన్సిన్లో నమోదైన ఓట్లను మళ్లీ లెక్కించడానికి ఎన్నికల సంఘం ఓకే చెప్పింది. దీనిని హిల్లరీ వర్గం పరోక్షంగా స్వాగతిస్తుండగా.. రిపబ్లికన్ పార్టీకి చెందిన ట్రంప్ మాత్రం తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఓటింగ్‌లో పెద్ద ఎత్తున హ్యాకింగ్ జరిగిందని ఆరోపిస్తూ గ్రీన్ పార్టీ అభ్యర్థి జిల్ స్టీన్ రీకౌంటింగ్ ప్రక్రియను తెరపైకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఆమె రీకౌంటింగ్‌కు డిమాండ్ చేసిన పెన్సిల్వేనియాలో 70,010 ఓట్ల తేడాతో, మిచిగన్‌లో 10,704 ఓట్లతో, విస్కాన్సిన్లో 27,257 ఓట్లతో ట్రంప్ హిల్లరీపై విజయం సాధించారు. అయితే, ఈ మూడు రాష్ట్రాల రీకౌంటింగ్‌లో ట్రంప్ కన్నా హిల్లరీ ఆధిక్యం సాధించే అవకాశం చాలా తక్కువని నిపుణులు చెప్తున్నారు. ఒకవేళ మూడు రాష్ట్రాల్లో హిల్లరీ ట్రంప్‌పై విజయం సాధిస్తే.. మొత్తంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు తారుమారు అయ్యే అవకాశముంది. -
అమెరికాలో రీకౌంటింగ్‌కు ఓకే!
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి కీలక పరిణామం. డొనాల్డ్ ట్రంప్ స్వల్పతేడాతో గట్టెక్కిన మూడు రాష్ట్రాల్లోనూ రీకౌంటింగ్ జరుపాలన్న డిమాండ్ వెల్లువెత్తడంతో విస్కాన్సిన్ రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్రవ్యాప్త రీకౌంటింగ్‌కు అంగీకరించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా విస్కాన్సిన్లో నమోదైన ఓట్లను మళ్లీ లెక్కించాలని గ్రీన్ పార్టీ అభ్యర్థి జిల్ స్టీన్ విజ్ఞప్తి చేయగా.. ఇందుకు ఎన్నికల సంఘం ఓకే చెప్పింది. విస్కాన్సిన్ రాష్ట్రంలో రీకౌంటింగ్‌లో భాగంగా 30లక్షల బ్యాలెట్ ఓట్లను కూడా మళ్లీ లెక్కించనున్నారు. వచ్చేవారం ఈ రీకౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతోంది. ఇందుకు అయ్యే ఖర్చును గ్రీన్ పార్టీ కాంపెయినే భరిస్తుంది. ఫెడరల్ డెడ్‌లైన్ ప్రకారం డిసెంబర్ 13లోపు రీకౌంటింగ్ పూర్తిచేయాలి. ఈ గడువులోగా విస్కాన్సిన్లోని 72 కౌంటీల్లో రీకౌంటింగ్ పూర్తిచేయడానికి అధికారులు సాయంత్రాలు, వారాంతలు కూడా పనిచేయాల్సి ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. రీకౌంటింగ్ ఫీజు 1.1 మిలియన్ డాలర్ల (రూ. 7.5 కోట్ల)వరకు అయ్యే అవకాశముందని భావిస్తున్నారు. (చదవండి: అమెరికా ఎన్నికల్లో హ్యాకింగ్? రీ కౌంటింగ్ కు పట్టు!) అనేక వ్యయప్రయాసలకు ఓర్చి గ్రీన్ పార్టీ అభ్యర్థి చేపడుతున్న ఈ రీకౌంటింగ్ ప్రక్రియ వల్ల ఓడిపోయిన హిల్లరీ వర్గీయుల్లో కొంత ఆశాభావం వ్యక్తమవుతోంది. అయితే, ప్రస్తుతం చేపడుతున్న రీకౌటింగ్ వల్ల ఈ నెల 8న జరిగిన అధ్యక్ష ఎన్నికల ఫలితాలు తారుమారు అయి.. ట్రంప్ స్థానంలో హిల్లరీ అధ్యక్షురాలిగా పగ్గాలు చేపడుతుందా? అంటే ఆ అవకాశాలు చాలా స్వల్పమని, రీకౌంటింగ్‌కు డిమాండ్ చేసిన మూడు రాష్ట్రాల్లోనూ ఈ ప్రక్రియ చేపట్టినా.. ఫలితాలు తారుమారు అయ్యే అవకాశం చాలా తక్కువ అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఓటింగ్‌లో పెద్ద ఎత్తున హ్యాకింగ్ జరిగిందని ఆరోపిస్తూ గ్రీన్ పార్టీ అభ్యర్థి జిల్ స్టీన్ రీకౌంటింగ్ ప్రక్రియను తెరపైకి తెచ్చారు. ఆమె రీకౌంటింగ్‌కు డిమాండ్ చేసిన మూడు రాష్ట్రాలు విస్కాన్సిన్, మిచిగన్, పెన్సిల్వేనియాలలో హిల్లరీపై స్వల్ప ఆధిక్యంతో ట్రంప్ విజయం సాధించారు. పెన్సిల్వేనియాలో 70,010 ఓట్ల తేడాతో, మిచిగన్‌లో 10,704 ఓట్లతో, విస్కాన్సిన్లో 27,257 ఓట్లతో ట్రంప్ విజయం సాధించారు. అయితే, ఈ మూడు రాష్ట్రాల రీకౌంటింగ్‌లో ట్రంప్ కన్నా హిల్లరీ ఆధిక్యం సాధించే అవకాశం చాలా తక్కువని నిపుణులు చెప్తున్నారు. ఒకవేళ మూడు రాష్ట్రాల్లో హిల్లరీ ట్రంప్‌పై విజయం సాధిస్తే.. మొత్తంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు తారుమారు అయ్యే అవకాశముంది. -
హిల్లరీ సేఫ్.. ట్రంప్ యూటర్న్
న్యూయార్క్: తన ముందున్న సమస్యను తక్షణం అధిగమించడం కోసం మోసం చేసైనా, అబద్ధం చెప్పయినా ముందుకెళ్లాలి అనేది చాణక్య నీతి. ఇది రాజకీయ నాయకులకు బాగా పనికొస్తుందని కూడా చాణక్యుడు చెప్పాడు. ఆ నీతి ప్రభావం భారతీయ నాయకులపైనేమోగానీ.. అగ్రరాజ్యం కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై మాత్రం గట్టిగానే పడినట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారానికి ముందు ముక్కుసూటి మాటలతో అమెరికా ప్రజల్ని మంత్రముగ్దుల్ని చేసిన డోనాల్డ్ ట్రంప్ ఇప్పుడొక్కక మాటను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గ్లోబల్ వార్మింగ్, హిల్లరీ క్లింటన్ ఈమెయిళ్ల వ్యవహారం, బరాక్ ఒబామాపై ఘాటు విమర్శలు చేసిన ఆయన వాటిపై తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు మంగళవారం విడుదల చేసిన ప్రకటన ద్వారా స్పష్టమైంది. ఆయన మాటలు ఎలా మారాయో ఒక్కసారి పరిశీలిస్తే.. ఎన్నికల ప్రచారంలో.. గ్లోబల్ వార్మింగ్‌పై.. నాడు: గ్లోబల్ వార్మింగ్ అనేది ఓ బూటకం. అసలు అది లేనే లేదు. అమెరికాను చైనాకు పోటీగా లేకుండా చేసేందుకు చేసిన కుట్ర మాత్రమే. అది చైనా కోసం చేసిన చర్య. అది ఒక ఖరీదైన మోసం. నేడు: 'గ్లోబల్ వార్మింగ్‌కు మానవ చర్యలకు గ్లోబల్ వార్మింగ్‌కు ఏదో సంబంధం ఉంది. ఈ విషయాన్ని నేను చాలా దగ్గరిగా పరిశీలిస్తున్నాను. ఈ విషయంలో నేను చాలా ఓపెన్ గా ఉన్నాను. హిల్లరీ ఈమెయిల్స్ పై:.. నాడు: నేను ఎన్నికల్లో విజయం సాధిస్తే ఒక ప్రత్యేక న్యాయవాది ద్వారా హిల్లరీ ఈమెయిల్స్ అవినతి వ్యవహారాన్ని చూడాలని నా అటార్నీ జనరల్ ను ఆదేశిస్తాను. నేడు: 'క్లింటన్‌పై క్రిమినల్ చర్యలు తీసుకుంటే దేశంలో చాలా చీలికలు వస్తాయని నాకు అనిపిస్తుంది' అధ్యక్షుడు ఒరాక్ ఒబామాపై.. నాడు: అమెరికా చరిత్రలోనే ఓ చెత్త అధ్యక్షుడిగా బరాక్ ఒబామా దిగిపోతారు. నేడు: నాకు అధ్యక్షుడు ఒబామా అంటే చాలా ఇష్టం. ఆయన మంచి నాయకుడు. అంటూ గతంలో తన మాటల నుంచి పక్కకు జరిగారు. -
'ఆమెను జైలుకు పంపను'
హిల్లరీ క్లింటన్ ను జైలుకు పంపే ఉద్దేశం తనకు లేదని అమెరికా అధ్యక్ష పదవికి ఎంపికైన డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ట్రంప్ క్యాంపెన్ మేనేజర్ కెల్యాన్నే కాన్వే స్వయంగా ఈ విషయాన్ని ఓ అమెరికన్ చానెల్ కు వెల్లడించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఈ-మెయిళ్ల కేసులో హిల్లరీని జైలుకు పంపాలంటూ డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు కలిగించాయి. ఓటమి బాధతో కుంగిపోతున్న హిల్లరీ త్వరగా కోలుకునేందుకు ట్రంప్ సాయం చేస్తారని చెప్పారు. అధ్యక్షపదవిని అందుకోబోయే ముందు అన్ని విధాల ట్రంప్ సిద్ధం అవుతున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో ట్రంప్ లేవనెత్తిన సమస్యలు ఇప్పుడు ఆయన అజెండా లేవని చెప్పారు. -
కాలం కలిసొస్తే 2020లో అమెరికా అధ్యక్షురాలు
‘‘మనల్ని అధ్యక్ష భవనం లోపలికి వెళ్లనివ్వకుండా అడ్డుగా ఓ మందపాటి అద్దం ఉంది. అది దుర్భేద్యమైనది. దాన్ని బద్దలు కొట్టుకుని వెళ్లాలి. వెళ్తారు. మన అమ్మాయిలు కచ్చితంగా వెళ్లి తీరుతారు. ఏదో ఒకరోజు, ఎవరో ఒక అమ్మాయి.. వెళ్లే రోజుకంటే కాస్త ముందుగానే అమెరికా అధ్యక్ష భవనంలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడిదంతా చూస్తున్న అమ్మాయిలు నిరాశ చెందనవసరం లేదు. ప్రతి అవకాశాన్నీ చేజిక్కించుకుని, మీ కలల్ని నిజం చేసుకునే శక్తి మీకుంది’’. (ఓడిపోయాక హిల్లరీ క్లింటన్ ఇచ్చిన కన్సెషన్ స్పీచ్‌లోని ముఖ్యాంశం) కమలాదేవి హ్యారిస్ (52) ప్రస్తుతం : కాలిఫోర్నియా అటార్నీ జనరల్ త్వరలో : యు.ఎస్. కాలిఫోర్నియా సెనెటర్ కాలం కలిసొస్తే : 2020లో అమెరికా అధ్యక్షురాలు క... కమల కా... కాలిఫోర్నియా! అమెరికా ఓ బ్రహ్మపదార్థం. లోపల ఏం ఉడుకుతోందో తెలియదు. బయటికి ఏం ఉబుకుతుందో తెలియదు. కానీ ఇప్పుడంతా క్లియర్. కొత్త చెఫ్ డొనాల్డ్ ట్రంప్ తనేం వండబోతున్నదీ ఎన్నికలకు ముందే చెప్పేశారు. తలపై ‘టోక్’ (పొడవాటి వైట్ హ్యాట్) పెట్టుకుని, చేత్తో గరిటె పట్టుకుని అమెరికాను కలియదిప్పడానికి రెడీగా ఉన్నారు. జనవరి 20న వంట మొదలవబోతోంది. ఒకప్పటిలా అమెరికా ఇప్పుడు ఎవరికీ పరాయి దేశం కాదు. ఎవరి దేశంలో వారికి కొత్తగా వచ్చి చేరిన రాష్టం! అంతగా ట్రంప్ ప్రపంచ దేశాలను ఇన్ ఫ్లుయెన్స్ చేశారు. మనకైతే తెలంగాణ తర్వాత ఆవిర్భవించిన 30వ రాష్ట్రంలా అనిపిస్తోంది అమెరికా! ట్రంప్ కొన్నిసార్లు ‘ఏందిరా బై’ అని కేసీఆర్‌లా, కొన్నిసార్లు ‘ఏం తమాషాగా ఉందా?’ అని చంద్రబాబులా ప్రసంగించారు కాబట్టి అమెరికా అంటే మనకూ కొత్త పోయింది. అమెరికా ఏం చేయబోతోందో ముందే చెప్పేశారు ట్రంప్. ట్రంప్‌ను ఏం చెయ్యనివ్వబోవడం లేదో ప్రత్యర్థులు కూడా ముందే చేప్పేశారు. కాబట్టి కొత్తగా తెలుసుకోవలసిందేమీ లేదు. మంటెక్కువైతే వంటేదైనా మాడిపోతుంది. అమెరికన్ ప్రజల్లో సగం మంది ట్రంప్ మీద మంటతో ఉన్నారు. ట్రంప్ కిచెన్‌లోంచి వచ్చేవి ఘుమఘుమలైనా, మాడు వాసనలైనా అవి ఆ మంట తీవ్రతని బట్టే ఉంటాయి. ఇక ఇప్పుడు మనం తెలుసుకోవలసింది ‘వేరు కుంపటి’ గురించి. ఆ కుంపటి ని రాజేయడానికి కావలసినన్ని అగ్గిపుల్లలున్న చెఫ్ గురించి. ఆ కుంపటి కాలిఫోర్నియా. ఆ చెఫ్ కమలా హ్యారిస్. ట్రంప్ గెలిచీ గెలవగానే అమెరికా నుంచి విడిపోతానని కాలిఫోర్నియా మళ్లీ మొదటికొచ్చింది. ఆ రాష్ట్రానికి ట్రంప్ ముఖం నచ్చడం లేదు. రాబడిలో పెద్ద రాష్ట్రం కాలిఫోర్నియా. విడిపోతే ఒక స్వతంత్ర దేశానికి ఉండవలసినంత పవర్ ఉన్న రాష్ట్రం కాలిఫోర్నియా. పెద్ద పెద్ద పరిశ్రమలున్న రాష్ట్రం కాలిఫోర్నియా. ఇన్ని ఉన్నా, అరవై శాతం మంది ప్రజలు ఓటేసినా.. హిల్లరీని గెలిపించుకోలేకపోయింది. ఆ కసి ఉంది కాలిఫోర్నియాలో. ట్రంప్‌ని ఓడించడం సాధ్యం కాలేదు. ఇప్పటికిప్పుడు ట్రంప్‌ను తప్పించుకుని పోవడమూ సాధ్యం కాదు. యు.ఎస్.కాంగ్రెస్‌లో (ఉభయ సభల్లో) ట్రంప్ నిర్ణయాలకు అడుగడుగునా సెగ తగిలించడం ఒక్కటే మార్గం. ట్రంప్ మొదట తీసుకోబోయే చర్య.. డాక్యుమెంట్స్ లేని లక్షలాది మంది విదేశీయుల్ని బలవంతంగా వెనక్కు పంపించడమే కనుకైతే.. దానికి బ్రేక్ వేసేందుకు సెనెట్‌లోని డెమోక్రాట్లు కమలా హ్యారిస్ నాయకత్వంలో ఇప్పటి నుంచే ‘వాద’ రచన చేస్తున్నారు! అదొక్కటే కాదు, ట్రంప్ ఇచ్చిన ‘ఇన్‌హ్యూమన్’ హామీల మీద కూడా కమల సారథ్యంలో దేశంలోని డెమోక్రాట్లు మొత్తం ఏకం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కమల క్రిమినల్ లాయర్. నేరాన్ని కాకుండా, నేరానికి దారితీసిన పరిస్థితుల్ని చూసి తీర్పులిచ్చే హ్యూమన్ రైట్స్ లాయర్. ఏ శక్తిమంతమైన రాష్ట్రానికి అటార్నీ జనరల్‌గా ఉండి, ఏ శక్తిమంతమైన రాష్ట్రం నుంచి సెనెటర్‌గా కమలా హ్యారిస్ ఎన్నికయ్యారో.. అదే శక్తిమంతమైన రాష్ట్రం నుంచి దేశానికి తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికైతే.. హిల్లరీ ‘కన్సెషన్ స్పీచ్’కి ఒక యాక్సెప్టెన్స్ వచ్చినట్లువుతుంది. కమల, కాలిఫోర్నియా.. అమెరికాలో ఇప్పుడు ‘కీ’ వర్డ్స్. కొత్త అమెరికాకు పాస్ వర్డ్స్. ఎన్నికలకు ముందు ఎన్ని స్పీచ్‌లు, ఎన్ని డిబేట్లు ఉన్నా... ఎన్నికల ఫలితాల తర్వాత అమెరికాలో ప్రధానంగా రెండు స్పీచ్‌లు ఉంటాయి. ఒకటి యాక్సెప్టెన్స్ స్పీచ్. ఇంకొకటి కన్సెషన్ స్పీచ్. గెలిచినవారు యాక్సెప్టెన్స్ స్పీచ్‌ని, ఓడిపోయిన వారు కన్సెషన్ స్పీచ్‌ని ఇస్తారు. ముందు కన్సెషన్ స్పీచ్ ఉంటుంది. తర్వాతే యాక్సెప్టెన్స్ స్పీచ్. ట్రంప్ యాక్సెప్టెన్స్ స్పీచ్ ఇస్తున్నారు. గెలిపించినందుకు థ్యాంక్స్ చెప్పారు. అన్నాళ్ల పాటు గెలుపు వార్తకోసం అమెరికన్ ప్రజలను నిరీక్షణలో ఉంచినందుకు సారీ చెప్పారు. ఆ తర్వాత ‘అందరం కలసి పనిచేద్దాం’ అన్నారు. ఫినిష్. సంప్రదాయం ప్రకారం, ట్రంప్ కన్నా ముందు హిల్లరీ క్లింటన్ కన్సెషన్ స్పీచ్ ఇచ్చారు. స్పీచ్ పూర్తయింది. కానీ ఫినిష్ కాలేదు! అవును.. ఫినిష్ కాలేదు... మొదలైంది! అమెరికన్ మహిళల్లో, యువతుల్లో, బాలికల్లో స్ఫూర్తిని రగిల్చిన ఆ కన్సెషన్ స్పీచ్... ఆ అగ్రరాజ్యానికి ఓ మహిళ అధ్యక్షురాలయ్యే వరకూ.. అందుకు ఎన్నేళ్లు పట్టినా... ప్రేరణ ఇస్తూనే ఉంటుంది. సెనెట్ ఒరలో ఓ డెమెక్రాట్ కత్తి! కమలా హ్యారిస్ ఆ స్పీచ్‌ని వింటున్నారు. హిల్లరీ ఉద్వేగాన్ని అమె కళ్లారా చూస్తున్నారు. అది ఓడిపోయిన బాధ కాదు. గెలవలేకపోయానన్న ఆవేదనా కాదు. త్వరలోనే, అతి త్వరలోనే.. ‘వియ్ కెన్’ అని దేశమహిళలకు చెప్పడం. హిల్లరీ ఓడిపోయిన రోజే కమల కాలిఫోర్నియా రాష్ట్రం నుంచి అమెరికా సెనెట్‌కు ఎంపికయ్యారు. హిల్లరీలాగే కమల డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి. ట్రంప్‌తో తలపడి హిల్లరీ ఓడిపోతే, సెనెటర్‌గా గెలిచి ట్రంప్‌తో సెనెట్‌లో తలపడబోతున్నారు కమల. అంటే... రిపబ్లికన్ల మెజారిటీ ఉండే సెనెట్ ఒరలో కమల ఓ డెమోక్రాట్ కత్తి! హిల్లరీ కలకు కమల వారసత్వం? యు.ఎస్.సెనెట్‌కు ఎన్నికైన తొలి భారతీయ అమెరికన్ మహిళ కమలా హ్యారిస్. అంతేకాదు, అమెరికన్ ఆన్లైన్ పత్రిక ‘హఫింగ్టన్ పోస్ట్’ అంచనా ప్రకారం... కమలా హ్యారిస్‌కు అమెరికా తొలి మహిళా అధ్యక్షురాలు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి! అది కూడా 2020 ఎన్నికల్లోనేనట! అదే నిజమైతే హిల్లరీ అన్నట్లు కాస్త ముందుగానే అమెరికా అధ్యక్ష పీఠం మహిళల వశం అవుతుంది. రెండు వేల ఇరవై ఎన్నికల్లో ట్రంప్‌ను ఓడించగల 11 మంది డెమోక్రాట్లలో కమల ఒకరు అని ‘మదర్ జోన్స్’ పత్రిక తన తాజా సంచికలో రాసింది. గుడ్ లుకింగ్.. వెల్ టాలెంటెడ్ కమల కళ్లు ఆకట్టుకునేలా ఉంటాయి. మాట మంత్రంలా ఉంటుంది. ‘ది బెస్ట్ లుకింగ్ అటార్నీ జనరల్ ఆఫ్ ది కంట్రీ’ అని ఓ సందర్భంలో అమెరికా అధ్యక్షుడు ఒబామా ఆమెకు కాంప్లిమెంట్ ఇచ్చి, ఆ వెంటనే నాలుక కరుచుకుని క్షమాపణ కూడా చెప్పారు. చూడ్డానికి కమల బాగుండే మాట వాస్తవమే కానీ, ఆమెలో చూడవలసిన ప్రతిభా సామర్థ్యాలు చాలా ఉన్నాయి. ఒక అత్యున్నతస్థాయి న్యాయ అధికారిగా అమెరికన్ సమాజంలోని స్థితిగతులన్నింటిపైనా ఆమెకు స్పష్టమైన అవగాహన ఉంది. శాన్ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్ అటార్నీగా ఏడేళ్లు, కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా గత ఐదేళ్ల అనుభవం ఆమెను ఉన్నత శ్రేణి న్యాయమూర్తిగా మలిచింది. వెంటాడుతున్న ‘డొనాల్డ్’ నీడ! డొనాల్డ్ ట్రంప్ విధానాలతో కమల ఈ నాలుగేళ్లూ సెనేట్‌లో ఫైట్ చేయవలసి ఉంటుంది. వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో కనుక ఆమె డెమోక్రాట్ అభ్యర్థిగా ఎన్నికైతే.. అప్పుడూ ట్రంప్తోనో, ట్రంప్ నిలబెట్టిన అభ్యర్థితోనో పోరాడి నెగ్గవలసి ఉంటుంది. ఇవి మాత్రమే కాదు... అటార్నీగా, సెనెటర్‌గా పాలిటిక్స్‌లోకి రాక ముందు కూడా ఆమె ‘డొనాల్డ్’తో తలపడవలసి వచ్చింది. ఆ డోనాల్డ్ ఆమె తండ్రి! డోనాల్డ్ హారిస్. కమల చిన్నప్పుడే భార్యకు విడాకులిచ్చేసి వెళ్లిపోయాడు డోనాల్డ్. ఫలితంగా తలెత్తిన పరిస్థితులను తట్టుకుని నిలబడాల్సి వచ్చింది ఆ కుటుంబం. డోనాల్డ్ జెమైకా సంతతి అమెరికన్. కమల తల్లి శ్యామలా గోపాలన్ హ్యారిస్ ఇండియన్ అమెరికన్. బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్సలో స్పెషలిస్ట్. 1960లో డాక్టర్ శ్యామల చెన్నై నుంచి వచ్చి కాలిఫోర్నియాలో స్థిరపడ్డారు. అక్కడే ఆమెకు స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీ ఎకనమిక్స్ ప్రొఫెసర్ డొనాల్డ్ హ్యారిస్ పరిచయం అయ్యారు. అక్కడే వాళ్లు పెళ్లి చేసుకున్నారు. అక్కడే ఓక్లాండ్లో కమల, ఆమె చెల్లెలు మాయ పుట్టారు. వ్యక్తిగతం కమల ముప్పై ఏళ్ల వయసులో తన కన్నా ముప్పై ఏళ్లు పెద్దవాడైన కాలిఫోర్నియా స్టేట్ అసెంబ్లీ స్పీకర్ విల్లీ బ్రౌన్‌ని ప్రేమించారు. కొద్దికాలం డేటింగ్లో ఉన్నారు. ఆయన శాన్ఫ్రాన్సిస్కో మేయర్ అయ్యాక వీళ్ల రిలేషన్ బ్రేక్ అయింది. రెండేళ్ల క్రితమే 2014 ఆగస్టు 22న కాలిఫోర్నియా అటార్నీ డగ్లాస్ ఎంహాఫ్‌ను పెళ్లి చేసుకున్నారు కమల. ‘న్యాయశాఖలో మనసున్న వ్యక్తి’ కమల తల్లి శ్యామల 2009తో చనిపోయారు. అప్పటికే కమల కాలిఫోర్నియా డిస్రిక్ట్ అటార్నీగా అమెరికాలో పేరున్న న్యాయాధికారి. మాదకద్రవ్యాల నేరస్థులను వారి శిక్షాకాలం పూర్తయ్యేలోగా పట్టభద్రులను, డిప్లొమా హోల్డర్లను చేసి, వారికి బయటి ప్రపంచంలో ఉపాధి కల్పించడం కోసం 2005లో ‘బ్యాక్ ఆన్ ట్రాక్’ ప్రోగ్రామ్‌తో కమల చూపిన చొరవ, తీసుకున్న చర్యలు ఆమెకు ‘అమెరికన్ న్యాయశాఖలో ప్రత్యేకమైన వ్యక్తి’గా గుర్తింపు తెచ్చిపెట్టాయి. కమల లా డిగ్రీ 1989లో పూర్తయింది. తర్వాత తొమ్మిదేళ్లు డిప్యూటీ డిస్రిక్ట్ అటార్నీగా చేశారు. క్రమంగా అటార్నీ జనరల్ స్థాయికి చేరుకున్నారు. ‘లా’లోకి వచ్చే ముందే కమల ఒక నిర్ణయానికి వచ్చేశారు! ‘అమెరికన్ ప్రభుత్వంలో విధాన నిర్ణయాలు తీసుకునే బల్ల చుట్టూ కూర్చొనేవారిలో నేనూ ఒకర్ని అవ్వాలి’ అని బలంగా అనుకున్నారు. చివరికి సాధించారు. త్వరలోనే సెనెట్లోకి అడుగుపెట్టబోతున్నారు. మరికొన్ని విశేషాలు కాలిఫోర్నియాలోని తొలి 100 మంది ప్రతిభావంతులైన న్యాయవాదులలో ఒకరిగా ‘లాస్ ఏంజిల్ డైలీ జర్నల్’ కమలా హ్యారిస్‌ను కీర్తించింది. బాలలపై జరిగే లైంగిక అకృత్యాల కేసులకు కమల ప్రాధాన్యం ఇస్తారు. బాధితులకు న్యాయం జరిగేవరకు తన వాదన వినిపిస్తారు. 1980లలో అమెరికా అధ్యక్ష పదవి నామినేషన్‌కు పోటీ పడిన డెమోక్రాట్ అభ్యర్థి జెస్సీ జాక్సన్‌కు కమలా హ్యారిస్ మద్దతు ఇచ్చారు. తన కారు మీద ‘జెస్సీ జాక్సన్ ఫర్ ప్రెసిడెంట్’ అనే బంపర్ స్టిక్కర్‌ను అంటించుకుని మరీ ఆమె ప్రచారం చేశారు. ఇది ఆమె అంకితభావానికి చిన్న నిదర్శనం. ఉరిశిక్షలకు వ్యతిరేకం కమలా హ్యారిస్ డిస్ట్రిక్ట్ అటార్నీగా ఉన్నప్పుడే 2004 ఏప్రిల్‌లో ఒక సంఘటన జరిగింది. శాన్ఫ్రాన్సిస్కో పోలీస్ డిపార్ట్మెంట్ అధికారి ఐజక్ ఎస్పినోజా డ్యూటీలో ఉండగా దుండగుడెవరో అతడిని తుపాకీతో కాల్చి చంపాడు. వెంటనే ఆ దుండగుడిని పట్టుకున్నారు. కేసు విచారణ కమల దగ్గరకు వచ్చింది. కమల తీర్పు ఇచ్చారు. అయితే ఆ తీర్పు పోలీసు అధికారుల అసోసియేషన్ ఆశించినట్టుగా ఉరిశిక్ష కాదు. యవజ్జీవ కారాగార వాసం. అంతా కమలపై మండి పడ్డారు. కమల నిర్ణయాన్ని తప్పుబట్టారు. అంత్యక్రియలకు ముందు ఐజక్ ఎస్పినోజా మృతదేహాన్ని సెయింట్ మేరీస్ కెథడ్రాల్కు తెచ్చినప్పుడు కమల అక్కడే ఉన్నారు. అప్పటి యు.ఎస్.సెనెటర్, శాన్ఫ్రాన్సిస్కో మాజీ మహిళా మేయర్ డయాన్ ఫైన్స్టైన్ ఆమెను చూసి, పరుగున పుల్పిట్ (చర్చి వేదిక) మీదకు వెళ్లి, అక్కడి నుంచి కమలను ఉద్దేశిస్తూ, ఎస్పినోజాను చంపిన వాడికి ఉరిశిక్ష విధించాల్సిందే అని పెద్ద అరుపుతో డిమాండ్ చేశారు. అప్పటికే అక్కడికి చేరుకుని ఉన్న దాదాపు రెండు వేల మంది పోలీసు అధికారులు ఆమెతో గొంతు కలిపారు. కమలా హ్యారిస్ మీద తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు. కానీ కమల ఉరిశిక్షను బహిరంగంగానే నిరాకరించారు. దటీస్ కమలా హ్యారిస్. వేటికి అనుకూలం? వేటికి వ్యతిరేకం? ► తుపాకీ నియంత్రణ అనుకూలం ► బ్యాంకు రుణగ్రస్తుల ఇళ్ల స్వాధీనం వ్యతిరేకం ► ఉరిశిక్ష విధింపు, అమలు వ్యతిరేకం ► విద్వేషపూరిత నేరాలు వ్యతిరేకం ►పౌరహక్కుల ఉల్లంఘన వ్యతిరేకం ► లెస్బియన్లపై వివక్ష వ్యతిరేకం ► అబార్షన్లు అనుకూలం ► ప్రాథమిక విద్యా సంస్కరణలు అనుకూలం ► పర్యావరణ విధ్వంసం వ్యతిరేకం ► ఆర్థిక నేరాలు వ్యతిరేకం మాధవ్ శింగరాజు -
ఇంట్లోంచి బయటకు రాకూడదనుకున్నా: హిల్లరీ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయాక అసలు ఇంటి నుంచి బయటకు రావాలనుకోలేదని, మంచి పుస్తకం చదువుతూ గడపాలని భావించానని హిల్లరీ క్లింటన్ చెప్పారు. హోరాహోరీ ఎన్నికల్లో ట్రంప్ చేతిలో ఓటమిపాలవ్వడం చాలా నిరాశకు గురిచేసిందని చెప్పారు. ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి ఆమె ప్రజలతో నేరుగా సంభాషించారు. బుధవారం బాలల కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఓటమిపై తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు.వారం రోజులుగా ఎంతో మథనపడ్డానని, మంచి పుస్తకాలు చదవాలని, కుక్క పిల్లలతో ఆడుకోవాలనుకున్నానని, ఇంటి నుంచి ఇంకెప్పుడూ అడుగు బయటపెట్టకూడదని అనుకున్నానని చెప్పారు. -
ఎఫ్‌బీఐ వల్లే ఓడిపోయా
హిల్లరీ క్లింటన్ ఆరోపణ వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన ఓటమికి ఎఫ్బీఐయే కారణమని డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ఆరోపించారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు తన ఈమెరుుళ్ల వ్యవహారంపై దర్యాప్తును పునఃప్రారంభించాలని ఎఫ్‌బీఐ డెరైక్టర్ జేమ్స్ కామే నిర్ణరుుంచడం ఎన్నికల ఫలితంపై ప్రభావం చూపిందరు. ‘ఇలాంటి ఎన్నికల్లో గెలవలేకపోవడానికి అనేక కారణాలు ఉంటారుు. మా విశ్లేషణ ప్రకారం కామే లేఖ వల్ల అనేక అనుమానాలు ప్రజలకు వచ్చారుు. ఇదే నా గెలుపును అడ్డుకుంది’ అని శనివారం డెమొక్రటిక్ పార్టీ నిధుల సమీకరణవేత్తలు, దాతలతో జరిగిన భేటీతో అన్నారు. ఎఫ్‌బీఐ డెరైక్టర్ ప్రకటన రానంత వరకూ విజయం తనవైపే ఉందని, అరుుతే విచారణను పునఃప్రారంభిస్తున్నట్టు ప్రకటించడంతో తారుమారైందని అన్నారు. సోషల్ మీడియా వల్లే నా గెలుపు: ట్రంప్ ఎన్నికల్లో గెలిచిన రిప్లబికన్ల అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తన విజయానికి సోషల్ మీడియానే కారణమన్నారు. ట్విటర్, ఫేస్బుక్ లాంటి సోషల్‌మీడియా తన చారిత్రక గెలుపులో కీలక పాత్ర పోషించిందని సీబీఎస్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. సోషల్‌మీడియా వల్ల తాను చెప్పింది ప్రజలకు సులువుగా చేరిందని, ప్రధాన మీడియా తనకు వ్యతిరేకంగా పనిచేసినా సోషల్‌మీడియా తనకు అండగా నిలిచిందని చెప్పారు. ప్రత్యర్థులు ఎక్కువ ఖర్చు చేసినా.. తాను తక్కువ ఖర్చు చేసినా.. సోషల్ మీడియాలో క్రియాశీలంగా ఉండటం వల్లే విజయం సాధించగలిగానని చెప్పారు. ట్రంప్‌కు ఫేస్బుక్, ట్వీటర్, ఇన్ట్రాగామ్ల్లో 28 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. హిల్లరీ చాలా స్మార్ట్..ట్రంప్:హిల్లరీ చాలా తెలివైన వారని ట్రంప్ ప్రశంసించారు. ఫలితాల అనంతరం హిల్లరీ తనకు మర్యాద పూర్వకంగా ఫోన్ చేశారని చెప్పారు. హిల్లరీ దయ, మర్యాద గల వ్యక్తి అని ప్రశసంల వర్షం కురిపించారు. ఫోన్ చేయడం ఇబ్బందైనా ఫలితాల తర్వాత ఫోన్ చేసి హిల్లరీ శుభాకాంక్షలు చెప్పగా ధన్యవాదాలు తెలిపానని, గట్టి పోటీ ఇచ్చారని తానన్నాని ట్రంప్ తెలిపారు. తానైతే ఫోన్ చేసేందుకు చాలా ఇబ్బంది పడేవాడినని చెప్పారు. హిల్లరీ భర్త కూడా మాట్లాడారని, ఎన్నికలు పోటాపోటీగా జరిగాయన్నారని వివరించారు. కాగా, ట్రంప్‌కు వ్యతిరేకంగా ఆదివారం నాలుగో రోజూ లాస్ ఏంజిల్స్, న్యూయార్క్, చికాగో, వోర్సెస్టార్, మసాచుసెట్స్, లోవా నగరాల్లో నిరసనలు కొనసాగారుు. ముగ్గురు భారతీయ అమెరికన్ల గెలుపు అమెరికా అధ్యక్ష ఎన్నికలతో పాటు జరిగిన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ముగ్గురు భారతీయ అమెరికన్లు గెలిచారు. కాలిఫోర్నియాలోని 27వ అసెంబ్లీ డిస్ట్రిక్ ఎన్నికల్లో శాన్‌జోస్ కౌన్సిల్మెన్గా డెమొక్రటిక్ అభ్యర్థి ఆష్ కల్రా విజయం సాధించారు. 52.4 శాతం ఓట్లు సాధించిన కల్రా కాలిఫోర్నియా అసెంబ్లీకి ఎన్నికై న తొలి భారతీయ అమెరికన్. రిపబ్లికన్ నీరజ్ అతానీ(25 ఒహయో 42వ అసెంబ్లీ డిస్ట్రిక్ట్‌కు తిరిగి ఎన్నికయ్యారు. ప్రత్యర్థిని 25% పారుుంట్ల తేడా ఓడించారు. నార్త్ కరోలినాలో జై చౌదురి(డెమోక్రటిక్) రాష్ట్ర సెనెట్‌కు ఎన్నికయ్యారు. న్యూజెర్సీలోని ఉడ్బ్రిడ్జ సిటీకౌన్సిల్కు వీరు పటేల్ ఎన్నికయ్యారు. -
‘ఇవి చాలా క్లిష్టమైన రోజులు’
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోరుున తర్వాత తాను చాలా క్లిష్టమైన రోజులను గడుపుతున్నానని డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ అన్నారు. ‘ప్రస్తుతం కష్టంగా ఉన్న నా పరిస్థితి అద్భుతంగా ఉందని నేను చెప్పాలనుకోవడం లేదు. నాకు ఇవి చాలా క్లిష్టమైన రోజులు’ అని కాన్ఫరెన్స కాల్లో తన మద్దతుదారులతో ఆమె అన్నారు. ‘మనం బాగా పనిచేశాం. పాపులర్ ఓటులో మనం గెలిచేలా కనిపిస్తున్నాం. మనం కష్టించాం అన్న దానికి అదే నిదర్శనం’ అని ఆమె పేర్కొన్నారు. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం హిల్లరీకి 47.72 శాతం, ట్రంప్‌కు 47.41 శాతం పాపులర్ ఓట్లు వచ్చారుు. -
ఆ అద్భుత ‘ఫలితం’ వెనుక వాస్తవం..!
డొనాల్డ్ ట్రంప్ విజయాన్ని అంచనా వేయడంలో మీడియా, దాని ఫ్యాన్సీ విశ్లేషకులు మొత్తంగా ఎక్కడ విఫలమ్యయారు అనే అంశంపై గురువారం రాత్రి నుంచి తీవ్ర అసంతృప్తి, విమర్శలు చెలరేగుతున్నాయి. ఎన్నికల ఫలితాలను అంచనా వేయడంలో డేటా ఎలా విఫలమైందనే అంశంపై ప్రముఖ పత్రిక ‘ది టైమ్స్’ వరుసగా మూడు కథనాలు ప్రచురించింది. ఇక ట్రంప్ మద్దతు దారులైతే ప్రెస్పై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతున్నారు. గురువారం ఫలితాలు ఆశ్చర్యం కలిగించాయి. కానీ ఈ విషయంలో దిగ్భ్రాంతి చెందింది జర్నలిస్టులు మాత్రమే కాదు. ట్రంప్ సీనియర్ సలహాదారు సైతం తమ గెలుపు అంశంలో అద్భుతమే జరిగిందని వెల్లడించారు. పాపులర్ ఓటు ప్రకారం హిల్లరీ క్లింటన్ ఓడిపోలేదన్న విషయం మనం మర్చిపోకూడదు. శుక్రవారం గం. 6.30ల సమ యానికి హిల్లరీ 60,617,062 ఓట్లను సాధించగా, ట్రంప్‌కు 60,118,567 ఓట్లు వచ్చాయి. అంటే హిల్లరీకి 498,495 ఓట్ల మెజారిటీ ఉంది. కాలిఫోర్నియా ఓట్లు మాత్రమే లెక్కించాల్సి ఉండటంతో హిల్లరీ ఆధిక్యత మరింత పెరుగుతుందనే అందరూ భావించారు. భారత్ లాగే అమెరికాలోనూ ప్రత్యక్ష ఎన్నికల వ్యవస్థ ఉన్నట్లయితే వైట్‌హౌస్‌లో ప్రెసిడెంట్ ఒబామాతో హిల్ల రీయే భేటీ అయ్యేవారు. కానీ ట్రంప్ అనూహ్యంగా ఎలెక్టోరల్ కాలేజీని గెల్చుకున్నారు. ట్రంప్ 270 ఎలెక్టోరల్ ఓట్లు సాధిస్తే చాలు.. తానే అధ్యక్షుడ వుతాడని మనందరికీ తెలుసు. కాని ఆ మ్యాజిక్ నంబర్‌ను అతడు సాధిస్తాడని చాలా కొద్దిమంది పరిశీలకులే ఎలా అంచనా వేశారు? మీడియా బుడగ ప్రభావానికి గురవడం చాలా సులభమే కానీ, విషయాలను సరిగా అంచనా వేయడంలో బలమైన వృత్తిగత అంశాలు కూడా జర్నలిస్టులకు తోడుగా ఉంటాయి. ఇవన్నీ ఈ సంవత్సరం ఎన్నికల అంచనాలో ఎందుకు సఫలం కాలేదన్నది ప్రశ్న. మిచిగాన్, విస్కాన్సిన్ లేదా వెస్ట్ వర్జీనియా వంటి ట్రంప్ ఆధిక్యత సాధించిన ప్రాంతాలను జర్నలిస్టులు పరిగణనలోకి తీసు కోనందుకే వారి అంచనాలు తప్పాయని కూడా చెప్పలేం. నిజంగా ఇది జర్నలిస్టుల వైఫల్యమే అయినట్లయితే, అది విశ్లేషణ వైఫ ల్యమే కానీ, పరిశీలన, రిపోర్టింగ్ వైఫల్యం కాదు. శ్వేతజాతి కార్మికవర్గానికి నచ్చచెప్పడం మీదే ట్రంప్ ఎన్నికల వ్యూహం ఆధారపడిందని తొలినుంచి స్పష్టమవుతూనే వచ్చింది. పరాయీకరణకు గురైన కార్మికవర్గ శ్వేతజాతీయులే ట్రంప్ విజ యానికి కారకులయ్యారు. 2012లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి మిట్ రోమ్నీ పరాజయానికి కారణం కోట్లాది శ్వేతజాతి ఓటర్లు పోలిం గుకు దూరమై ఇళ్లకు పరిమితం కావడమేనని నాటి పరిశీలకులు తేల్చి పడేశారు. ఇలా ఎన్నికలకు దూరంగా ఉన్న శ్వేతజాతి ఓట రును ఒడిసిపట్టుకోగల అభ్యర్థి డొనాల్డ్ ట్రంపేనని ఆ పరిశీలకులే అంచనా వేయడం కూడా వాస్తవమే. ట్రంప్ వ్యూహాన్ని తీవ్రంగా అధ్యయనం చేసిన ‘ది టైమ్స్’ నిపుణుడు నేట్ కోన్ కూడా ఇదే విషయాన్ని గతంలోనే చెప్పారు. శ్వేతేతర ఓటర్ల ఓట్లను పొంద కుండానే ట్రంప్ విజయాన్ని సాధించే పరిమిత మార్గం ఇప్పటికీ తనకు అందుబాటులో ఉందనీ, శ్వేత కార్మిక వర్గంలో ట్రంప్‌కున్న బలం అతడి విజయానికి నిజమైన అవకాశంగా పరిణమించనుం దని నేట్ కుండబద్దలు కొట్టారు. దేశవ్యాప్తంగా మైనారిటీ ఓటర్ల సంఖ్య బాగా పెరుగుతున్నప్పటికీ ఒహాయో, మిచిగాన్, విస్కా న్సిన్ వంటి రాష్ట్రాల్లోని తెల్లజాతి కార్మికవర్గ ఓటర్లను ట్రంప్ ఎలా తన వైపుకు తిప్పుకుంటారన్నదే కీలకమని, కానీ ఇది చాలా కష్ట సాధ్యమైన విషయమని గత మార్చి నెలలోనే ప్రముఖ పరిశీల కులు రూయ్ టెక్సెరియా విశ్లేషించారు. కానీ కష్టసాధ్యమైన విష యాన్ని ట్రంప్ సుసాధ్యం చేశారు. శ్వేత జాతి కార్మిక ఓటర్లలో 39 శాతాన్ని ట్రంప్ తనవైపుకు తిప్పుకోగలిగిరారు. 2012లో మిట్ రోమ్నీ వీరిలో 26 శాతాన్ని మాత్రమే ఆకర్షించారని గ్రహించాలి. ఈసారి ఎన్నికల ఫలితాన్ని వివరించడానికి ఈ ఒక్కకారణమే సరి పోతుందని పరిశీలకుల వ్యాఖ్య. పైగా, చివరివరకు నిర్ణయించుకోని ఓటర్లలో ఎక్కువమంది ట్రంప్ వైపు మొగ్గు చూపారని, ట్రంప్ వైఖరికి సిగ్గుపడుతున్న మద్దతుదారులలో చాలామంది పోల్ సర్వేలలో తమ అభిప్రా యాన్ని స్పష్టంగా చెప్పలేదని కూడా కొన్ని అభిప్రాయాలు న్నాయి. మూడోది. ట్రంప్‌కు వ్యతిరేకంగా జతగట్టిన మీడియాకు తమ వైఖరిని చెప్పడానికి ట్రంప్ ఓటర్లు తిరస్కరించారని, కొందరి వ్యాఖ్య. ఇవన్నీ కలిసే మీడియా అంచనాలను తప్పుదోవ పట్టించాయని చెప్పక తప్పదని, శ్వేతజాతి కార్మికులు ట్రంప్‌కు ఇంత గట్టి మద్దతునిస్తారని ఊహించలేకపోవడమే ఈ దఫా ఫలి తాల దిగ్భ్రాంతికి కారణమని పరిశీలకుల వ్యాఖ్య. మీడియా ఎన్నికల సర్వేల నమూనాలలో లోపాలెన్ని ఉన్న ప్పటికీ ఎన్నికలకు పది రోజుల క్రితం ఎఫ్‌బీఐ డైరెక్టర్ జేమ్స్ కోమే చేసిన ప్రకటన హిల్లరీ అవకాశాలను దారుణంగా దెబ్బతీసిందన్న విషయం మర్చిపోకూడదు. హిల్లరీ ప్రైవేట్ సర్వర్ నుంచి అధికా రిక ఈమెయిల్స్‌ను చూసిన అంశంపై మళ్లీ విచారించనున్నట్లు ఎఫ్‌బీఐ అధిపతి చేసిన ప్రకటన ఆమె విజయావకాశాలపై చివరి దెబ్బతీసింది. రిపబ్లికన్లలో ఇది కొత్త జీవం పోయగా, డెమో క్రాట్లను ఇది నీరసపరిచింది. అయితే కోమే ప్రకటన ఎన్నికల గతిని ఏమేరకు మార్చిందన్న విషయం సర్వే సాఫ్ట్వేర్లకు, పరి శీలకుల అంచనాలకు అందకపోవడమే కీలకమైన విషయం. -జాన్ కసిడీ, ప్రముఖ పాత్రికేయుడు -
హిల్లరీపై ట్రంప్ తాజా వ్యాఖ్యలు..
వాషింగ్టన్: కూతురితో డేటింగ్ వ్యాఖ్యలు, సరోగసీ వైఫ్ వార్తల దుమారం, మాజీ అధ్యక్షుడి వివాహేతర సంబంధాలు, అవినీతి, లైంగిక ఆరోపణలు.. ఒక్కటేమిటి, 2016 ఎన్నికలు.. అమెరికా చరిత్రలోనే అథమస్థాయి ప్రచారపర్వంగా నిలిచిపోయాయి. ‘గొప్ప ప్రజాస్వామ్యదేశమని చెప్పుకునే అమెరికాలోనూ నాయకులు ఇలాగే ఉంటారా?’ అని ప్రపంచం ముక్కున వేలేసుకుంది. చివరికి తెంపరి వ్యాఖ్యలు చేసిన ట్రంపే విజయం సాధించారు. ప్రచారపర్వంలో తన ప్రత్యర్థి, డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ను అన్నమాట అనకుండా ఘాటు విమర్శలతో దాడిచేసిన ట్రంప్ ఇప్పుడు స్వరం పూర్తిగా మార్చేశారు. శుక్రవారం ఓ టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాబోయే అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. హిల్లరీ క్లింటన్ పై పొగడ్తల వర్షం కురిపించారు. హిల్లరీ గొప్ప పోరాటయోధురాలని, ఉదార స్వభావి అని ఆకాశానికి ఎత్తేశారు. ‘ఆమె చాలా తెలివైన నాయకురాలు. అదే సమయంలో ధృఢంగానూ వ్యవహరిస్తారు. ఫలితాలు వెలువడిన రోజు ఆమె నుంచి ఫోన్ కాల్ అందుకోవడం మర్చిపోలేని విషయం. నాకు తెలుసు.. ఆ కాల్ ఆమెకు ఓ కఠిన పరీక్ష’అని ట్రంప్ వ్యాఖ్యానించినట్లు న్యూయార్క్ టైమ్స్ వార్తా సంస్థ పేర్కొంది. (హిల్లరీపై ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు) అయితే ఫోన్ చేసిన సమయంలోనూ హిల్లరీ ఏమంత సున్నితంగా వ్యవహరించలేదని, కేవలం అభినందలను చెప్పి, ‘వెల్ డన్ డోనాల్డ్’ అన్నారని ట్రంప్ చెప్పుకొచ్చారు. హిల్లకీ కాల్ కు సమాధానమిస్తూ ధన్యవాదాలతోపాటు ‘మీరు టఫ్ కాంపిటీటర్’అని అన్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. నవంబర్ 9న వెలువడిన ఎన్నికల ఫలితాల్లో విజయఢంకా మోగించిన డోనాల్డ్ ట్రంప్.. జనవరి 20న అమెరికా 45వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. -
ఓటమి తర్వాత హిల్లరీ తొలిసారి..
న్యూయార్క్: ‘కాలం.. విజేతలనే తప్ప పరాజితులను గుర్తుంచుకోదు’ అనే సామెత హిల్లరీ క్లింటన్ విషయంలో తప్పే. రెండున్నర శతాబ్ధాల ప్రజాస్వామిక చరిత్రలో అమెరికా అధ్యక్ష పీఠానికి పోటీపడిన మొదటి మహిళగా ఆమె పేరు చరిత్రలో ఎప్పటికీ నిలిచే ఉంటుంది. మంగళవారంనాటి ఎన్నికల ఫలితాల్లో అనూహ్య ఓటమిని చవిచూసిన ఆమె బుధవారం అభిమానులను ఉద్దేశించి ఉద్వేగంగా ప్రసంగించారు. ఆ తర్వాత మీడియా కంటికి కనపడలేదు. కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన్ ట్రంప్ గురువారం ప్రస్తుత ప్రెసిడెంట్ ఒబామాతో భేటీ అయిన వార్తలు ప్రధానంగా ప్రసారమయ్యాయి. హిల్లరీకి సంబంధించిన సమాచారమేదీ వెలుగులోకి రాలేదు. బహుశా ఆమె తీవ్ర విషణ్నవదనంలో ఉండిపోయారని కొందరు భావించారు. కానీ.. శుక్రవారం అమెరికా సహా ప్రపంచంలోని ప్రధాన వార్త సంస్థలన్నింటికీ హిల్లరీకి సంబంధించిన(ఫలితాల తర్వాత మొదటిసారి వెలుగులోకి వచ్చిన) ఫొటోలను ప్రచురించాయి. ఈ ఫొటోలో కూతుర్ని ఎత్తుకుని ఉన్న మహిళ పేరు మార్కోట్ గెర్స్టర్. హిల్లరీకి డై హార్డ్ ఫ్యాన్. ఉండేది న్యూయార్క్ శివారులోని వెస్ట్ చెస్టర్ కౌంటీలో. అదే కౌంటీలోని చెపాక్ ప్రాంతంలో హిల్లరీ దంపతులు నివసిస్తారు. ఫొటో గురించి మార్కోట్ తన ఫేస్ బుక్ పేజీలో ఇలా రాసింది..‘నా అభిమాన నాయకురాలు(హిల్లరీ) ఓటమి నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఇంట్లో కూర్చుని ఎంతో బాధపడ్డా. ఎన్నాళ్లిలా ఉంటామని నా చిన్నారిని తీసుకుని పార్క్ కు వెళ్లా. అక్కడ కాస్త రిలాక్స్ అయి వెనుదిరుగుతుండగా.. నా ఎదురుగా హిల్లరీ! ఒక్కసారి షాక్ కు గురయ్యా. వెంటనే తేరుకుని తనను ఆలింగనం చేసుకున్నా. బిల్ క్లింటన్ కూడా పక్కనే ఉన్నారు. కుక్కపిల్లను పట్టుకుని ఇద్దరూ వ్యాహ్యాళికి వచ్చినట్టున్నారు. హిల్లరీ మేడం నన్ను ఓదార్చింది. లైఫ్ మస్ట్ గో ఆన్.. తరహా మాటలతో ఊరటనిచ్చింది. ఎక్కువసేపు వాళ్ల సమయం తీసుకోకుండా నమస్కారం చెప్పా..’అని ముగించింది. నిజమేమరి, ఎన్నికల ఫలితాలపై ఒబామా చెప్పినట్లు, సూర్యుడు ఉదయించక మానడు.. న్యూయార్క్ లోని హిల్లరీ ఇల్లు.. -
ట్రంప్.. ఒరాంగ్ ఉటాన్ కాదు
(సాధన శీలం, అమెరికా) నేను భారత్‌లో జూనియర్ కాలేజీలో చదివేటపుడు ఆర్కే నారాయణ్ ది గైడ్ పుస్తకాన్ని చదివాను. ఈ పుస్తకంలోని సారాంశం ఏంటంటే.. కొన్ని పరిస్థితుల కారణంగా ఓ మోసగాడు స్వామిజీగా మారుతాడు. కొన్ని దశాబ్దాల తర్వాత అమెరికాలో ఇదే జరిగింది. అమెరికాలో కోట్లాదిమంది ప్రజలు, అమెరికా ఓటర్లలో దాదాపు సగంమంది రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ను దేశాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. నవంబర్ 8న అమెరికా ప్రజలు ఆయన్ను ఎన్నుకున్నారు. ఎన్నికల ఫలితాలు ట్రంప్‌కు అనుకూలంగా వచ్చాయి. విజయానంతరం ట్రంప్ తన కుటుంబ సభ్యులతో కలసి ప్రసంగించారు. లక్షాదికారులు, కోటీశ్వరులు దేన్నయినా సాధ్యం చేయగలరా? ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన మహిళ అమెరికా అధ్యక్షురాలు కావాలన్న కల నెరవేరలేదు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ మద్దతుదారుగా నాకు బాధకలిగించింది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ట్రంప్ బరిలో నిలిచాక ప్రపంచమంతా ఆయనపై దృష్టిసారించింది. ట్రంప్, ఆయన భార్య మెలానియా తీరును గమనించింది. ట్రంప్ విజయం కోసం ఆయన మద్దతుదారులు తీవ్రంగా పనిచేశారు. ఎన్నికల ర్యాలీలలో ట్రంప్ ముఖ్యంగా కొన్ని విషయాలే చెబుతూ ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. హిల్లరీ మద్దతుదారుగా నేను ఎంతో ఉత్సాహంతో పనిచేశాను. కానీ ఓట్లను ఆకర్షించలేకపోయాం. ట్రంప్‌కు దీటుగా హిల్లరీ ప్రచారం చేశారు. డిబేట్లలో ఆమె పైచేయి సాధించారు. చివరి డిబేట్లో కూడా హిల్లరీ తన తెలివితేటలు, వాగ్ధాటితో ఆకట్టుకున్నారు. ఎన్నికల రోజు వరకు హిల్లరీయే ముందంజలో నిలిచారు. ఓ ఇంటర్వ్యూలో హిల్లరీ స్పందించిన తీరు నన్ను ఆశ్చర్యపరిచింది. ట్రంప్ గురించి అడిగిన ఓ ప్రశ్నకు హిల్లరీ సమాధానమిస్తూ.. ట్రంప్ కుటుంబంలో ఆయన పిల్లలు తనకు ఇష్టమని చెప్పారు. ట్రంప్ హిల్లరీ గురించి మాట్లాడుతూ.. ఆమె పట్టుదలను ప్రశంసించారు. పోలింగ్‌కు ముందు ముందంజలో ఉన్న హిల్లరీ ఎన్నికల్లో ఓడిపోగా, ట్రంప్ అనూహ్యంగా గెలిచారు. నేను చాలా ఏళ్ల క్రితం చదివిన ది గైడ్ పుస్తకంలో మాదిరిగా ట్రంప్ స్థానిక పరిస్థితులను అనుకూలంగా మార్చుకున్నారు. మెలే, ఇండోనేసియన్ పదాల నుంచి ఒరాంగ్ ఉటాన్ వచ్చింది. ఒరాంగ్ అంటే మనిషి, ఉటాన్ అంటే అడవి. కాబట్టి ఒరాంగ్ ఉటాన్ అంటే అడవిలోని మనిషి అని అర్థం. -
చంద్రబాబు మద్దతు వల్లే హిల్లరీ ఓటమి
వైఎస్సార్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే చెవిరెడ్డి తిరుపతి రూరల్: తెలుగు ప్రజలకు ద్రోహం చేసిన చంద్రబాబు ఇచ్చిన మద్దతు వల్లే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ ఓటమి పాలయ్యారని వైఎస్సార్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం సాయంత్రం తిరుపతిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రపంచంలోనే పెద్ద పెద్ద సర్వే సంస్థలు సైతం అమెరికా అధ్యక్షురాలిగా హిల్లరీ గెలుస్తారని చెప్పాయని, ప్రత్యర్ధి ట్రంప్ కూడా గెలవలేమని నిర్ణయానికి వచ్చారని తెలిపారు. హిల్లరీ గెలుపు లాంఛనమే అని భావిస్తున్న వేళ చంద్రబాబు ఆమెకు మద్దతు ప్రకటించారని గుర్తు చేశారు. అంతేకాకుండా అమెరికాలోని టీడీపీ శ్రేణులకు హిల్లరీకి ఓటు వేయమని లేఖలు సైతం రాశారని, అత్యుత్సాహంతో జనవరి 12వ తేది ఆమె ప్రమాణస్వీకారోత్సవానికి హాజరవుతానని ప్రకటించుకున్నట్లు తెలిపారు. ఐర్హత ఉండి పింఛన్లు కొల్పోరుున వృద్ధులు పెట్టిన శాపాలు, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా నిరుద్యోగులకు చేసిన అన్యాయాలతో అధికారం కోసం తెలుగు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా పాపం మూటగట్టుకున్న చంద్రబాబు మద్దతు వల్లే విజయపు అంచుల్లో ఉన్న హిల్లరీ ఓటమి అగాధంలోకి పడిపోయారని ఆరోపించారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన చంద్రబాబుకు రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలోనూ ఓటమి తప్పదని హెచ్చరించారు. -
ట్రంప్ అమలు చేయాల్సిన ఐదు హామీలివి
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అనూహ్య విజయం సాధించడంతో ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రజలకు ఆయనిచ్చిన అయిదు ప్రధాన హామీలను సాధ్యమైనంత త్వరగా అమలు చేయాలని ఆయనకు ఓటేసిన ఓటర్లు కోరుతున్నారు. అమెరికాకు భారీగా పెరుగుతున్న వలసలగా అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటానని ఆది నుంచి చెబుతున్న ట్రంప్ మెక్సికో సరిహద్దులో పటిష్టమైన అడ్డుగోడను నిర్మిస్తానని ప్రచారం చేశారు. మెక్సికో గోడ నిర్మించాలి 2015, జూన్ నెలలో ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టగానే మెక్సికో నుంచి సరిహద్దులు దాటి రేపిస్టులు, నేరస్థులు అమెరికాలోకి ప్రవేశిస్తున్నారని, అలాంటి వారిని అడ్డుకోవడానికి సరిహద్దు వెంట పటిష్టమైన గోడను నిర్మిస్తానని, దానికయ్యే ఖర్చులో సగ భాగాన్ని ఆ దేశం నుంచే రాబడతానని కూడా చెప్పారు. ఇప్పుడు ఆ గోడను నిజంగా నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. గోడను నిర్మించేందుకు ట్రంప్ మద్దతుదారుల్లో 73 శాతం మంది ఓ సర్వేలో ఓటేశారు. హిల్లరీని లాకప్‌లో పెట్టాలి దేశాధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన హిల్లరీ క్లింటన్‌ను ఈమెయిళ్ల కుంభకోణం కేసులో జైల్లో పెట్టాలని ట్రంప్ మద్దతుదారులు కోరుకుంటున్నారు. ఆయనకు మద్దతుగా నిర్వహించిన ప్రతీ ప్రచార ర్యాలీలోనూ ఈ డిమాండ్లు మారుమ్రోగాయి. ఎన్నికల ప్రచార ఘట్టంలో భాగంగా హిల్లరీతో జరిగిన డిబేట్లో ట్రంప్ మాట్లాడుతూ ‘నేను విజయం సాధిస్తే ఈ మెయిళ్ల వ్యవహారంలో హిల్లరీని విచారించేందుకు మంచి ప్రాసిక్యూటర్‌ను తీసుకురావాలని అటార్ని జనరల్‌ను ఆదేశిస్తా!’ అని అన్నారు. అందుకు ట్రంప్ టెంపర్మెంట్ కలిగిన వ్యక్తి చేతుల్లో చట్టం లేదని హిల్లరీ బదులిచ్చారు. అలాంటి వ్యక్తి ఉంటే నిజంగా హిల్లరీ జైలు ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుంది ట్రంప్ ప్రతి కామెంట్ చేశారు. ముస్లింలపై నిషేధం ఏడాది క్రితం కాలిఫోర్నియాలోని శాన్ బెర్నార్డినోలో జరిగిన ఊచకోత సంఘటనపై ట్రంప్ స్పందిస్తూ ‘దేశంలో అసలేం జరుగుతుందో తేలేవరకు దేశంలోకి ముస్లింల ప్రవేశాన్ని నిషేధించాలి’ అని పిలుపునిచ్చారు. మరో సందర్భంలో టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్న దేశాల నుంచి ప్రజలను అమెరికాలో అనుమతించమని చెప్పారు. ఇప్పుడు ఈ మాటను నిలబెట్టుకోవాలని ఆయన మద్దతుదారులు కోరుతున్నారు. ఒబామా కేర్‌ను రద్దు చేయండి ఒబామా కేర్‌గా ముద్రపడిన జాతీయ హెల్త్‌కేర్ పథకాన్ని రద్దు చేయాలని రిపబ్లికన్లు కోరుతున్నారు. ఈ పథకంపై 2010లో ఒబామా సంతకం చేసిన నాటి నుంచి దాన్ని రిపబ్లికన్లు వ్యతిరేకిస్తున్నారు. తాను అధికారంలోకి వస్తే ఈ పథకాన్ని రద్దుచేసి దాని స్థానంలో ఇంతకన్నా మంచి ఆరోగ్య పథకాన్ని తీసుకొస్తానని హామీ ఇచ్చారు. ఆ దిశగా ట్రంప్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. నాఫ్తా, టీపీపీల రద్దు ట్రంప్ తన ఎన్నికల ప్రచారం సందర్భంగా నార్త్ అమెరికా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (నాఫ్తా), ట్రాన్స్ పసిపిక్ అగ్రిమెంట్ (టీపీపీ)ను రద్దు చేయాలని అన్నారు. తాను అధికారంలోకి వస్తే తప్పకుండా వీటిని రద్దు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ హామీల కారణంగానే ఆయన విస్కాన్సిన్, పెన్సిల్వేనియా లాంటి డెమోక్రట్ల ప్రాబల్య రాష్ట్రాల్లో విజయం సాధించారు. చివరకు టీపీపీ రద్దుకు హిల్లరీ అంగీకరించినా, ఆమె వైఖరి మార్పునకు ట్రంపే కారణమని ఓటర్లు భావించారు. తన భర్త బిల్ క్లింటన్ అధికారంలో ఉన్నప్పుడు సంతకం చేసిన నాఫ్తా రద్దుకు ఆమె సాహసించలేకపోయారు. ఇప్పుడు ఈ అయిదు డిమాండ్లను నెరవేర్చాల్సిన బాధ్యత ట్రంప్ మీద ఉందని ఓటర్లు భావిస్తున్నారు. -
ట్రంప్‌కు కలసొచ్చిన కంపు మాటలు
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అనూహ్య విజయానికి కారణాలేమిటో వివరించేందుకు అధ్యయనకారులు వివిధ రకాలుగా విశ్లేషిస్తున్నారు. ఎదుటి వారి అంచనాలను అందని వ్యక్తి అవడమే ఆయన విజయ రహస్యం. అందుకే అమెరికా అధ్యక్షులు ఎవరవుతారనే విషయంలో అందరి అంచనాలు తలకిందులయ్యాయి. మాట, మర్యాద, మన్నన తెల్సిన హిల్లరి క్లింటన్‌ను కాదని, ఆడవాళ్ల పట్ల అసభ్యంగా మాట్లాడుతూ నోటి దురుసుతో దూకుడుగా వ్యవహరించిన ట్రంప్‌ను అమెరికన్లు గెలిపించడం అంటే నేటి సోషల్ మీడియా యుగంలో ఆధునికతకు పట్టం కట్టడమే. వైట్‌హౌజ్‌లో ప్రథమ మహిళగా, సెనేటర్‌గా, విదేశాంగ మంత్రిగా రాజకీయ అనుభవం ఉన్న హిల్లరీని ఓటర్లు రాజకీయ సంప్రదాయ వాదిగా భావించారు. అనాదిగా వస్తున్న పాత భావాలను కాదనుకున్న వారు ట్రంప్ పక్షాన చేరారు. ఎలాంటి రాజకీయ అనుభవం లేకుండా కేవలం సెలబ్రెటీగా సుపరిచితులైన ట్రంప్ కంపు మాటలు ఎన్ని మాట్లాడినా కడుపులో కంపు దాచుకొని ఇంపుగా మాట్లాడడం కన్నా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడమే ఆధునిక ఇంపని ఆయన మద్దతుదారులు భావించారు. వారిలో ప్రస్తుత ప్రభుత్వ వ్యతిరేకులే ఎక్కువగా ఉన్నారు. ఇతరుల ముందు తమ అభిప్రాయాలను బయటపెట్టుకొని విమర్శలు ఎదుర్కోవడం కన్నా మౌనం వహించడమే ముఖ్యమనుకొని వారు మౌనంగానే ట్రంప్‌కు ఓటేశారు. ఈ కారణంగా మీడియాకు వారి నాడి అందలేదు. ఇక తనదైన కంపు వ్యాఖ్యలతో ట్రంప్ మీడియాలో ఉచితంగా విస్తృత ప్రచారం పొందారు. ఆయనకు వచ్చిన ప్రచారం విలువ దాదాపు 300 కోట్ల డాలర్లు ఉంటుందని కొన్ని సంస్థలు అంచనా వేశాయి. దాదాపు 24 ఏళ్ల క్రితం 1992లో హెచ్‌డబ్ల్యూ బుష్‌ను బిల్ క్లింటన్ ఓడించడంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎలా కలసి వచ్చిందో ఇప్పుడు ట్రంప్‌కు కూడా ఒబామా ప్రభుత్వ వ్యతిరేక ఓటు కలసి వచ్చింది. సంప్రదాయ రాజకీయాలను పాటిస్తున్న నేతలకన్నా లేటుగానైనా లేటెస్ట్గా వచ్చిన ట్రంప్ ఏదైన చేయగలరని నమ్మకంతో మరికొందరు ఓటర్లు చివరకు ఆయన వైపు తిరిగారు. వలసలను, స్వేచ్చా వాణిజ్యాన్ని కట్టడి చేస్తానని, దేశీయ ఉత్పాదక రంగాన్ని అభివృద్ధి చేసి స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానంటూ ఆది నుంచి ట్రంప్ చేస్తున్న ప్రచారం స్థానికులైన శ్వేతజాతీయులను ఎక్కువగా ఆకర్శించింది. వారి ఓట్ల కారణంగా డెమోక్రట్లకు బలమైన విస్కాన్సిన్, మిచిగాన్, పెన్సిల్వేనియా రాష్ట్రాల్లో ట్రంప్ ఊహించని విజయాన్ని సాధించారు. గతంలో రిపబ్లికన్ల తరఫున పోటీ చేసిన జాన్ మెకెయిన్ వలసలను సమర్థించడం వల్ల, మిట్ రోమ్నీ స్వేచ్ఛా వాణిజ్యాన్ని సమర్థించడం ఈ రాష్ట్రాల్లో విజయం సాధించలేకపోవడం ఇక్కడ గమనార్హం. -
ఎందుకు ఓడారంటే
వాషింగ్టన్: హిల్లరీదే గెలుపు అంటూ సర్వేలు, పోల్స్ ఘంటాపథంగా చెప్పినా ఆమె ఓటమికి కారణాలేంటి? ట్రంప్‌పై మహిళలు, లాటిన్ అమెరికన్ ఓటర్ల వ్యతిరేకతను హిల్లరీ ఎందుకు ఓట్ల రూపంలో మలుచుకోలేకపోయారు. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లు హిల్లరీ ఓటమికి అనేక అంశాలు పనిచేశాయని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆఫ్రో-అమెరికన్, లాటిన్, ఆసియన్ ఓటర్లతో పాటు యువ ఓటర్లను ఆకట్టుకోవడంలో హిల్లరీ విఫలమయ్యారు. దీంతో ఆ వర్గాలకు చెందిన ఓటర్లు ఓటింగ్‌లో ఎక్కువగా పాల్గొనలేదని సీఎన్ఎన్ చానల్ పేర్కొంది. 2012లో రిపబ్లికన్ అభ్యర్థి మిట్ రోమ్నీకి పడ్డ నల్లజాతీయుల, లాటిన్ ఓట్ల కంటే ట్రంప్‌కు ఈ సారి ఎక్కువ వచ్చాయి. హిల్లరీ ప్రచారం చేసిన ప్రాంతాల్లో ఆమెకు ఓట్లు బాగానే పడ్డా... అధ్యక్షుడు ఒబామా ప్రచారం నిర్వహించిన చోట్ల డెమోక్రాట్లకు ఓట్ల శాతం తగ్గడం విశేషం. ట్రంప్‌పై వ్యతిరేకత ఓట్లుగా మలచుకోవడంలో విఫలం 4 శాతంగా ఉన్న ఆసియన్ ఓటర్ల మద్దతు తగ్గడం కూడా హిల్లరీకి నష్టం కలిగించింది. మెక్సికో సరిహద్దుల్లో గోడ కడతానంటూ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా... ఆ దేశస్తుల ఓట్లు పూర్తిగా హిల్లరీకి పడలేదు. 65 శాతం మంది హిల్లరీకి ఓటు వేయగా... 29 శాతం ట్రంప్‌కు ఓటేయడం అందరినీ ఆశ్చర్యపరచింది. 2012లో ఒబామాకు 71 శాతం మంది మెక్సికన్లు ఓటేశారు. ఇక స్పానిష్ మాట్లాడే ప్రజలు 2012తో పోల్చితే ఒక శాతం తక్కువగా హిల్లరీకి మద్దతిచ్చారు. యువ ఓటర్లును ఆకట్టుకోవడంలో హిల్లరీ విఫలమయ్యారు. 18 నుంచి 29 మధ్య వయసున్న వారిలో 55 శాతం మంది హిల్లరీకి ఓటేయగా... ట్రంప్‌కు 37 శాతం మంది ఓటేశారు. 2012లో ఒబామాకు 60 శాతం యువ ఓటర్లు మద్దతు పలికారు. మహిళల ఓట్లలో హిల్లరీకి 54 శాతం, ట్రంప్‌కు 42 శాతం పడ్డాయా. 2012లో ఒబామాకు 55 శాతం మహిళల ఓట్లు దక్కాయా. ట్రంప్ పట్ల 70 శాతం మహిళలు వ్యతిరేకత వ్యక్తం చేసినా 42 శాతం ఓటేయడం విశేషం. -
అందరినీ కలుపుకుపోతాం
అమెరికా పునర్నిర్మాణంలో ప్రతి పౌరుడూ భాగస్వామే సహజ ధోరణికి విరుద్ధంగా ట్రంప్ ప్రసంగం నేను అమెరికన్లందరికీ అధ్యక్షుడిని న్యూయార్క్: విజయంతో వచ్చిన వినయం ట్రంప్‌లో స్పష్టంగా కనిపించింది. ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థుల విమర్శలకు దీటైన జవాబిచ్చిన ట్రంప్.. విజయోత్సవ వేడుకల్లో మాత్రం చాలా బాధ్యతగా స్పందించారు. తనకు సహకరించిన వారినీ, వ్యతిరేకించిన వారినీ కలుపుకుని ముందుకెళ్తానని స్పష్టం చేశారు. విమర్శలను పక్కనపెట్టి అమెరికా కోసం అందరం ఒక్కటిగా ముందుకెళ్లాలన్నారు. అనూహ్య విజయం తర్వాత తన ప్రచార ప్రధాన కార్యాలయంలో ఏర్పాటుచేసిన విజయోత్సవ వేదికపైనుంచి తొలిసారి మద్దతుదారులను, అమెరికన్లనుద్దేశించి ప్రసంగించారు. ‘డెమొక్రాట్లు, రిపబ్లికన్లు, స్వతంత్రులు అందరూ అమెరికన్లే’ అని అన్నారు. ప్రసంగాన్ని ఉత్సాహంగా ప్రారంభించిన ట్రంప్.. అందరికీ ధన్యవాదాలు చెబుతూనే.. ‘పెన్సిల్వేనియా ఫలితం తేలగానే.. ఇంతకుముందే సెక్రటరీ(విదేశాంగ మంత్రి) హిల్లరీ ఫోన్లో శుభాకాంక్షలు తెలిపారు. హోరాహోరీ ఎన్నికల్లో తీవ్రంగా శ్రమించిన క్లింటన్‌కూ శుభాకాంక్షలు తెలిపాను’ అన్నారు. హిల్లరీపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘దేశానికి ఆమె చేసిన సేవలకు మేం రుణపడి ఉన్నాం’ అని అన్నారు.‘ఈ విజయం నాకు చాలా కీలకం. నేను అమెరికన్లందరికీ అధ్యక్షుడిని. విభేదాలు పక్కనపెట్టి అమెరికన్లందరం ఒక్కటిగా ముందుకెళదాం’ అని అన్నారు. ‘మొదటినుంచి చెబుతున్నట్లుగానే మేం చేసింది ప్రచారం కాదు. ఉద్యమం. అమెరికాలోని అన్ని జాతులు, మతాలు, భిన్నరంగాల వారు, వివిధ విశ్వాసాల వాళ్లు ఇందులో భాగస్వాములు. వీరంతా తదుపరి వచ్చే ప్రభుత్వం ప్రజలకు సేవచేయాలనుకున్నారు. దేశాన్ని ప్రేమించే లక్షల మంది స్త్రీ, పురుషులు వారి కుటుంబం, దేశం ఉన్నతంగా, ఉజ్వలంగా ఉండాలని పరితపించారు. అదే ఈ ఫలితం’ అని అన్నారు. కలసి పనిచేయటమనేది జాతి పునర్నిర్మాణంలో, అమెరికన్ల ఆశలు నెరవేర్చటంలో తమ తొలి అత్యవసర పని అన్న ట్రంప్ అమెరికన్ల శక్తి సామర్థ్యాలు చాలా మెండుగా ఉన్నాయనే విషయం తనకు అవగతమైందన్నారు. మౌలిక వసతుల నిర్మాణంలో ప్రతి అమెరికన్‌ను భాగస్వామిని చేస్తామని తెలిపారు. ‘ఈ 18 నెలల్లో చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాను. దేశాభివృద్ధి ప్రాజెక్టులపై ప్రత్యేకంగా దృష్టి పెడతాం. మా వద్ద గొప్ప ఆర్థిక ప్రణాళికలున్నారుు.వృద్ధిని రెండింతలు చేస్తాం. అన్ని దేశాలను కలుపుకుని ముందుకెళ్తాం’ అన్నారు. తల్లిదండ్రులకు గుర్తుచేసుకుంటూ కృతజ్ఞతల కార్యక్రమాన్ని ప్రారంభించిన ట్రంప్ వారి నుంచి చాలా నేర్చుకున్నానన్నారు. చెల్లెల్లు మర్యానే, ఎలిజబెత్, సోదరులు రోబర్ట్, ఫ్రెడ్ (దివంగత) లకూ ధన్యవాదాలు తెలిపారు. గొప్ప తల్లిదండ్రులు, సోదర, సోదరీమణులు తనకున్నందుకు అదృష్టవంతుడినన్నారు. ‘భార్య మెలానియా, కూతురు ఇవాంకా, ఎరిక్, టిఫానీ, బారన్, లారా, వెనెస్సా.. కష్ట సమయంలో మీరందించిన ప్రోత్సాహం వల్లే ఈ విజయోత్సవం జరుగుతోంది. ఉపాధ్యక్షుడు మైక్ పెన్స గురించి ఎంత చెప్పినా తక్కువే. మీ అందరికీ చాలా రుణపడి ఉన్నాను. మా బృందంలోని కెల్యానే, క్రిస్, రూడీ, స్టీవ్, డేవిడ్ (వీరందరూ ట్రంప్ గురించి గ్రామీణ ప్రాంతాల్లో ప్రచారం చేశారు)అందరికీ ధన్యవాదాలు.. రెండు, మూడేళ్లు, నాలుగేళ్ల తర్వాత.. ఎనిమిదేళ్ల తర్వాతైనా కావొచ్చు. మీరంతా అధ్యక్షుడంటే గర్వపడేలా పనిచేస్తా. ప్రచారం అరుుపోరుుంది. పని ప్రారంభించటమే మిగిలుంది’ అని అన్నారు. 1820 తర్వాత మళ్లీ... న్యూయార్క్: ట్రంప్ గెలుపుతో భార్య మెలానియా అమెరికా ప్రథమ మహిళ కానున్నారు. అరుుతే ఆమె జన్మతః అమెరికన్ కాకపోవడంతో.. 1820 తర్వాత విదేశాల్లో పుట్టి ప్రథమ మహిళగా హోదా దక్కించుకున్న తొలి మహిళగా రికార్డులకెక్కనున్నారు. 1825-29 మధ్య అమెరికా ఆరో అధ్యక్షుడిగా పనిచేసిన జాన్ క్విన్సీ ఆడమ్స్ భార్య లూసియా లండన్‌లో జన్మించారు. దాంతో జన్మతః అమెరికన్ కాకుండా ప్రథమ మహిళ హోదా దక్కించుకున్న తొలి మహిళగా రికార్డులకెక్కారు. మాజీ మోడల్ అయిన 46 ఏళ్ల మెలానియా 1970లో నాటియుగొస్లావియాలో జన్మించారు. 16 ఏళ్ల వయసులోనే మోడలింగ్ వృత్తిలోకి ప్రవేశించిన మెలానియా.. స్లోవేనియా, సెర్బియా, ఇంగ్లిష్, ఫ్రెంచ్, జర్మన్ భాషలు మాట్లాడగలరట. 1998లో ఆమె న్యూయార్క్‌లో ఓ ఫ్యాషన్ పార్టీలో ట్రంప్‌ను కలుసుకున్నారని, 2005లో ఫ్లోరిడాలో పెళ్లి చేసుకున్నారని సమాచారం. 1998లో అప్పటికే ట్రంప్ రెండో భార్యనుంచి విడాకులు తీసుకున్నారని అంటారు. వివాదాల ముద్దుబిడ్డ అమెరికా అధ్యక్షుడిగా అనూహ్యంగా విజయం సాధించిన ట్రంప్‌కు తొలినుంచీ వివాదాలతోనే సహజీవనం. అరుుతే అనుకున్నది సాధించటంలోనూ ట్రంప్ చాలా పట్టుదలగా వ్యవహరిస్తారనే పేరుంది. యువకుడిగా ఉన్నప్పుడే తండ్రి దగ్గర్నుంచి అప్పుతీసుకుని వ్యాపారం మొదలుపెట్టి.. తర్వాత మళ్లీ తండ్రి కంపెనీలోనే ఉద్యోగిగా చేరారు. తర్వాత అమెరికాలోనే, ప్రపంచంలోనే ఉత్తమ నివాససముదాయాల ప్రాజెక్టులను నిర్మించి శభాష్ అనిపించుకున్నారు.సినిమారంగంపై మక్కువ, సెలబ్రిటీలతో పరిచయం, టీవీ కార్యక్రమాల నిర్వహణ ద్వారా వివాదాలతో నూ సావాసం మొదలైంది. 1977లో తొలి వివాహం, తర్వాత గ్లామర్ ప్రపంచంలో పరిచయాలతో రెండు, మూడో పెళ్లిళ్లు చేసుకున్నాడు. ప్రస్తుత భార్య మెలానియా.. స్లోవేకియా మోడల్. ఈమె వర్క్ వీసాపై వచ్చి ఇక్కడ సెటిలైందనే విమర్శలున్నారుు. ట్రంప్ కంపెనీలో పనిచేసే చాలా మంది అమ్మాయిలు ఇలాగే వచ్చామని వెల్లడించారు. మహిళల విషయంలో ట్రంప్‌పై చాలా వివాదాలున్నారుు. తనకు 13 ఏళ్ల వయసులో పలుమార్లు ట్రంప్ అత్యాచారం చేశాడంటూ 20 ఏళ్ల తర్వాత ఇటీవల ఓ మహిళ ఆరోపించింది. అంతే కాదు సొంత కూతురిపైనా పచ్చిబూతులు మాట్లాడిన వీడియో ఒకటి ఎన్నికలకు ముందు విడుదలవటం.. దీనిపై ట్రంప్ పశ్చాత్తాపం వ్యక్తం చేయటం తెలిసిందే. అటు రాజకీయ పరంగానూ ట్రంప్ రూటే సెపరేటు. అమెరికా అధ్యక్షుడు కావాలన్న ప్రగాఢమైన కాంక్షతో డెమొక్రటిక్, రిపబ్లికన్ పార్టీల్లోకి పలుమార్లు మారారు. రియల్ ఎస్టేట్ దిగ్గజంగా పరిచయం ఉన్నా వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం ద్వారానే అమెరికన్లకు బాగా సుపరిచితుడైన ట్రంప్ మహిళలతో అసభ్యంగా వ్యవహరిస్తాడని ప్రత్యర్థి జట్టు బలంగా ప్రచారం చేసింది. ఈయన వివాదాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు తీసి విపరీతంగా ప్రచారం చేసింది. కానీ.. ఇవేవీ ట్రంప్ విజయాన్ని ప్రభావితం చేయలేకపోయాయి. వివాదాలెన్నున్నా.. ఈయన్ను శ్వేతసౌధానికి పంపించారు అమెరికన్లు. -
ట్రంప్ గెలిచాడు...
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ విజయ కేతనం ట్రంప్‌కు 305, హిల్లరీకి 232 ఎలక్టోరల్ ఓట్లు పాపులర్ ఓటులో మాత్రం హిల్లరీకే ఆధిక్యం... హిల్లరీకి 47.7 శాతం ట్రంప్‌కు 47.5 శాతం హిల్లరీ ఓటమిని శాసించిన పెన్సిల్వేనియా, మిషిగన్, విస్కాన్సన్ స్వింగ్ స్టేట్స్ ఒహయో, ఫ్లోరిడా, నార్త్ కరోలినాలో ట్రంప్ గెలుపు హిల్లరీ ఓటమిని శాసించిన పెన్సిల్వేనియా, మిషిగన్, విస్కాన్సన్ స్వింగ్ స్టేట్స్ ఒహయో, ఫ్లోరిడా, నార్త్ కరోలినాలో ట్రంప్ గెలుపు ఎలక్టోరల్ ఓట్లలో ట్రంప్ ఆధిక్యం పాపులర్ ఓట్లలో మాత్రం హిల్లరీదే పై చేయి సర్వేలన్నీ బోల్తా కొట్టాయి.. అంచనాలన్నీ తలకిందులయ్యాయి.. ‘హిల్లరీ.. హిల్లరీ..’ అన్నవారు నోళ్లెళ్లబెట్టారు.. ‘స్వదేశీ’ నినాదం నింగినంటింది.. ‘స్ట్రాంగ్ టుగెదర్.. ’ అంటూ వచ్చిన హిల్లరీకి షాక్.. ‘మేక్ అమెరికా గ్రేట్ అగెయిన్..’ అంటూ దూసుకొచ్చిన ట్రంప్ రాక్స్.. స్త్రీలోలుడని, కయ్యాలమారి అని, వలసల వ్యతిరేకి అని, ట్యాక్స్ ఎగవేతదారు అని.. ఒకటా.. రెండా.. ఎన్నెన్నో..! వాటన్నింటినీ ‘సెంటిమెంట్’తో తుత్తునియలు చేస్తూ.. ఈస్ట్, వెస్ట్‌ను ఓ ఊపు ఊపేస్తూ.. ‘బ్లాక్’ అండ్ ‘వైట్’ గోడల్ని బద్దలు కొట్టేస్తూ.. అమెరికాలో వినూత్న ఒరవడికి తెరదీస్తూ.. దూసుకొచ్చాడు డొనాల్డ్ ట్రంప్..!! 45వ అధ్యక్షుడిగా శ్వేతసౌధంలోకి అడుగుపెట్టబోతున్నాడు ఈ 70 ఏళ్ల బిజినెస్‌మ్యాన్!!! అందరి లెక్కల్ని తారుమారు చేస్తూ రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ సంచలన విజయం సాధించారు. గెలుపు అనంతరం ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికా కోసం కలసికట్టుగా ముందుకు సాగాలని కోరారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో ఎన్నడూ లేనంత ఉత్కంఠ... హిల్లరీదే అధ్యక్ష పీఠమని చివరి వరకూ వేసిన లెక్కల్ని తారుమారు చేస్తూ... రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ సంచలన విజయం సాధించారు. ట్రంప్‌కు వ్యతిరేకంగా ఎంత ప్రచారం జరిగినా... ప్రపంచమంతా ఆందోళన వ్యక్తం చేసినా అమెరికన్లు మాత్రం ఆయనకే పట్టంగట్టారు. ఉద్యోగ భద్రత, ఉగ్రవాద ముప్పు నుంచి దేశానికి విముక్తి, వలసలకు అడ్డుకట్ట హామీలకే జనం ఓటేశారు. తనకు పట్టున్న రాష్ట్రాలతో పాటు డెమోక్రాట్ల కంచుకోటలన్నింటిని ట్రంప్ బద్దలుకొట్టారు. ఫలితాన్ని తారుమారు చేసే ఫ్లోరిడా, ఒహయో, నార్త్ కరోలినా రాష్ట్రాలను కూడా తన ఖాతాలో వేసుకున్నారు. - వాషింగ్టన్/న్యూయార్క్ అమెరికా అధ్యక్ష ఎన్నికల ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు మొత్తం 538. ఇందులో ట్రంప్ 305 ఓట్లు సాధించగా, డెమోక్రాట్ల అభ్యర్థి క్లింటన్‌ను 232తో సరిపెట్టుకున్నారు. 18 నెలల క్రితమే పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ప్రవేశించిన 70 ఏళ్ల రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త ట్రంప్... ఈ గెలుపుతో జనవరి 20న అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష పీఠం అధిరోహించనున్నారు. అయితే పాపులర్ ఓట్లు(అత్యధిక ఓట్లు) హిల్లరీనే సాధించడం విశేషం. హిల్లరీ 47.7 శాతం(5,93,21,645), ట్రంప్47.5 శాతం(5,91,50,974) సాధించారు. మిషిగన్, న్యూహ్యాంప్‌షైర్, మిన్నెసోటా రాష్ట్రాలతో పాటు నెబ్రాస్కాలో ఒక ఫలితం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. గెలుపు అనంతరం ట్రంప్ ప్రసంగిస్తూ... ‘మన మధ్య విభేదాలతో ఏర్పడ్డ గాయాల్ని మర్చిపోదాం. అమెరికన్లందరికీ నేను అధ్యక్షుడిగా ఉంటా. రిపబ్లికన్లు, డెమోక్రాట్లు, ఇండిపెండెంట్స్ అందరూ ఐక్యంగా సాగేందుకు ముందుకు రావాలి’ అని పిలుపునిచ్చారు. ప్రత్యర్థి హిల్లరీని పొగుడుతూ... ‘ఆమె గొప్ప పోరాటం చేశారు. హిల్లరీ సేవలకు దేశం రుణపడి ఉంటుంది’ అని అన్నారు. అమెరికా తొలి మహిళా ప్రెసిడెంట్ కావాలన్న ఆశలు గల్లంతవడంతో హిల్లరీ ఓటమిని వినయంగా అంగీకరించి శ్వేతసౌధ విజేత ట్రంప్‌కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. మూడు రాష్ట్రాలే ముంచాయి పెన్సిల్వేనియా, విస్కాన్సన్, మిషిగన్, ఒహయో, ఫ్లోరిడా, నార్త్ కరోలినా రాష్ట్రాల్లో ట్రంప్ గెలుపుతో సీన్ మొత్తం మారిపోయింది. ఫ్లోరిడా, ఒహయో, నార్త్ కరోలినాల్లో హోరాహోరీ ఉంటుందని మొదటి నుంచి భావించారు. అక్కడ ట్రంప్ హవాతో హిల్లరీ ఓటమి ముందే తెలిసిపోయింది. డెమోక్రాట్లకు పెట్టని కోటలైన పెన్సిల్వేనియా, విస్కాన్సన్, మిషిగన్లు ట్రంప్ ఖాతాలోకి వెళ్లడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. విస్కాన్సన్, పెన్సిల్వేనియా, మిషిగన్లు మొదటి నుంచి డెమోక్రాట్లకు పూర్తి పట్టున్న రాష్ట్రాలు ... ఈ రాష్ట్రాల్లో మొత్తం 46 ఎలక్టోరల్ సీట్లు ఉన్నాయి. ఇవి తప్పకుండా హిల్లరీకే వస్తాయని భావించారు. ఇవి హిల్లరీ ఖాతాలోకి వెళ్తే ఆమెకు దాదాపు 274 సీట్లు దక్కేవి. స్వింగ్ స్టేట్స్లో విజయం సాధించకపోయినా హిల్లరీ విజయం ఖాయమయ్యేది. స్వింగ్ స్టేట్స్ ఓహయో, నార్త్ కరోలినా, ఫ్లోరిడాల్లో కనీసం ఏదో ఒక రాష్ట్రంలో హిల్లరీ గెలుస్తుందని భావించారు. విస్కాన్సన్, పెన్సిల్వేనియా, మిషిగన్ల్లో ఓడినా... ఫ్లోరిడా, ఒహయోలో గెలిస్తే 47 సీట్లు దక్కేవి. ఈ అంచనాలేవీ పని చేయలేదు. ఆ మూడు రాష్ట్రాల్లో ఏం జరిగింది? విస్కాన్సన్, మిషిగన్, పెన్సిల్వేనియాలో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంత, చిన్నాచితకా పనులు చేసే ఓటర్లే.. వారికి ఉద్యోగ భద్రత కల్పించి, వలసదారులను నిరోధిస్తానని ట్రంప్ ఇచ్చిన నినాదం పనిచేసింది. అలాగే చివరి వారం రోజులు ఈ రాష్ట్రాల్లో ట్రంప్ అత్యధిక సభల్లో పాల్గొన్నారు. మరోవైపు విస్కాన్సన్, మిషిగన్ ప్రైమరీల్లో డెమోక్రటిక్ అభ్యర్థిత్వం కోసం పోటీ పడ్డ బెర్నీ శాండర్స్ చేతిలో హిల్లరీ ఓడిపోయారు. ఆ ప్రభావం కూడా పడిఉండొచ్చని విశ్లేషకుల అంచనా... ఫ్లోరిడా, నెవడా రాష్ట్రాల్లో స్పానిష్ మాట్లాడే ఓటర్లు ముందుగానే ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరంతా ఎక్కువగా హిల్లరీకి ఓటేసినా... తెల్లజాతి ఓటర్లు ఎన్నికల రోజు క్యూ కట్టడంతో ట్రంప్ విజయం సులువైంది. హిల్లరీ శిబిరంలో ఆనందం ఆవిరి ఎన్నికలు ప్రక్రియ ముగిసేవరకూ గెలుపు తమదేననుకున్న హిల్లరీ శిబిరం ఆనందంలో మునిగితేలింది. మన్‌హటన్‌లోని కన్వెన్షన్ సెంటర్లో సంబరాలకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంతలో ఫలితాలు వెలువడడం మొదలైంది. కౌంటింగ్ సరళి ఇలా.. ♦ భారత కాలమానం ప్రకారం.. బుధవారం పొద్దున 5.30 గంటలకు 6 రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిశాయి.. ఇండియానా(11), కెంటకీ(8)ల్లో ట్రంప్ గెలుపు. హిల్లరీ వెర్మాంట్(3)లో గెలుపు. ♦ ఉదయం 6.05 గం. వెస్ట్‌వర్జీనియాలో ట్రంప్ గెలుపు ♦ 6.25 గం. నార్త్ కరోలినా, ఒహయోల్లో పోలింగ్ పూర్తి... అందరిలో ఉత్కంఠ. ♦ 6.35 గం. సగం రాష్ట్రాల్లో పోలింగ్ పూర్తి.. ఒహయో, ఫ్లోరిడా, నార్త్ కరోలినా, న్యూ హ్యాంప్‌షైర్, వర్జీనియాల కౌంటింగ్ ప్రారంభం . ♦మరోవైపు దక్షిణ, మధ్యపశ్చిమ రాష్ట్రాల్ల్లో అనుకున్నట్లే ట్రంప్ విజయం... తూర్పు తీర రాష్ట్రాల్లో హిల్లరీ గెలుపు ♦ 7.40 గం. టెక్సాస్, నార్త్ డకోటా, సౌత్ డకోటా, వయోమింగ్, కాసస్లో ట్రంప్.. ఇలినాయ్, న్యూయార్క్‌లో హిల్లరీ గెలుపు. ఆ సమయంలో ట్రంప్ ఆధిక్యం 123... క్లింటన్ ఆధిక్యం 97... ♦ 7.50 గం. రిపబ్లికన్ పార్టీ ఖాతాలో ఆర్కాన్సాస్.. 8.02 గం. లూసియానాలో ట్రంప్, కనెక్టికట్‌లో హిల్లరీ గెలుపు ♦ 8.08 గం. ట్రంప్‌కు ఆధిక్యంతో కుప్పకూలిన ఆసియా మార్కెట్లు ♦ అక్కడి నుంచి ట్రంప్ దూసుకుపోయారు. ఉదయం 9.15 గం. ఒహయోలో గెలుపు. ట్రంప్ ఆధిక్యం 168, హిల్లరీ 109 ♦ 9.33 గం. కీలక రాష్ట్రం ఫ్లోరిడాలో ట్రంప్ మోత... తదుపరి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌కు మార్గం సుగమం ♦ 10.27 గం. జార్జియా, ఉటావా విజయాలతో 244కు ట్రంప్ ఆధిక్యం ♦ 12.59కి విస్కాన్సన్ విజయం ట్రంప్ గెలుపు పరిపూర్ణం... 270 ఎలక్టోరల్ సీట్లు దాటిన ట్రంప్ ఆధిక్యం. ట్రంప్ గెలుపొందిన రాష్ట్రాలు పెన్సిల్వేనియా, ఫ్లోరిడా, అలాస్కా, ఉటావా, అయోవా, అరిజోనా, విస్కాన్సన్, జార్జియా, ఒహయో, నార్త్ కరోలినా, నార్త్ డకోటా, సౌత్ డకోటా, నెబ్రాస్కా, కాసస్, ఒక్లహోమా, టెక్సాస్, వయోమింగ్, ఇండియానా, కెంటకీ, టెన్నెసే, మిస్సిసిపీ, అర్కాన్సాస్, లూసియానా, వెస్ట్ వర్జీనియా, అలాబామా, సౌత్ కరోలినా, మోంటానా, ఐడహ, మిస్సోరీ, న్యూహ్యాంప్‌షైర్, మిషిగన్ రాష్ట్రాలు. క్లింటన్ గెలుపొందిన రాష్ట్రాలు కాలిఫోర్నియా, నెవెడా, హవాయ్, ఇలినాయిస్, న్యూ యార్క్, న్యూజెర్సీ, మేరీల్యాండ్, డిస్ట్రిక్ ఆఫ్ కొలంబియా, వెర్మాంట్, మస్సాచుసెట్స్, కనెక్టికట్, డెలావేర్, కొలొరాడో, న్యూ మెక్సికో, వర్జీనియా, ఒరేగాన్, వాషింగ్టన్, రోడ్ ఐలాండ్, మిన్నెసోటా, మైనేలో మూడు స్థానాలు డెమోక్రాట్ల ఖాతాలో... ఒకటి రిపబ్లికన్‌స ఖాతాలో. ఒబామా పిలుపు ట్రంప్‌కు... ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా ఫోన్ చేసి అభినందించారు. అధికార మార్పిడికి సంబంధించి చర్చించేందుకు వైట్ హౌస్‌కు రావాలం టూ ఆహ్వానించారు. ట్రంప్‌తో కలసి పనిచేసేందుకు సిద్ధం న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని అంగీకరిస్తున్నానని హిల్లరీ చెప్పారు. న్యూయార్క్‌లో బుధవారం రాత్రి మద్దతుదారుల్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ... అమెరికన్లందరికీ ట్రంప్ విజయవంతమైన అధ్యక్షుడిగా పాలన అందిస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు. ‘మనం పడ్డ కష్టానికి, ఆశించినదానికి రావాల్సిన ఫలితం ఇది కాదు. ఎన్నికల్లో గెలవలేకపోరుునందుకు క్షమాపణలు చెబుతున్నా’అని ఉద్వేగంతో అన్నారు. ఒక దశలో ఉబికివస్తోన్న కన్నీళ్లను ఆపుకునేందుకు ప్రయత్నించారు.‘ట్రంప్‌కు ఫోన్లో శుభాకాంక్షలు చెప్పాను. దేశం కోసం కలసి పనిచేసేందుకు సిద్ధమన్నారు. ఎన్నికల ఫలితాల్ని దేశం అంగీకరించాలన్నారు. ‘మీరు ఎంత బాధపడుతున్నారో... ఆ బాధ అనుభవిస్తోన్న నాకు తెలుసు’ అని అన్నారు. సర్వే ఫలితాలు తారుమారు వాషింగ్టన్: ఎన్నికలపై వచ్చిన సర్వే ఫలితాల్లో 90 శాతం తప్పుగా వచ్చాయి. 322 సీట్లను హిల్లరీ అవలీలగా గెలుస్తారని, ట్రంప్ గల్లంతవడం ఖాయమన్న అంచనాలు పటాపంచలయ్యాయి. ఇంటా బయటా విమర్శలను ఎదుర్కొని ఓటమి తప్పదన్న అంచనాలను తోసిరాజని రిపబ్లికన్ పార్టీ నామినీ ట్రంప్ అగ్రరాజ్యం పీఠాన్ని కై వసం చేసుకోవడం భారీ సంచలనాన్నిసృష్టించింది. సీబీఎస్, ఏబీసీ/వాషింగ్టన్ పోస్టు, సీఎన్ఎన్, బీబీసీ, బ్లూమ్‌బెర్గ్, రాస్ముస్సేన్, మాన్మౌత్ యూనివర్సిటీ, ఎన్బీసీ న్యూస్/సర్వే మంకీలు హిల్లరీదే గెలుపని తేల్చిచెప్పాయి. ఎన్నికల రోజు రాత్రి న్యూయార్క్ టైమ్స్ పత్రిక అంచనా ప్రకారం హిల్లరీకి 85 శాతం గెలుపు అవకాశాలున్నాయని వెల్లడించారు. సీఎన్ఎన్ పోల్ ప్రకారం హిల్లరీ 4 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నట్లు ఎన్నికలకు రెండ్రోజుల ముందు ప్రకటించారు. అయితే లాస్ఏంజెలిస్ టైమ్స్, ఐడీబీ/టీఐపీపీ సర్వేలు మాత్రం ట్రంప్ విజయం సాధిస్తాయని వెల్లడించాయి. ఫైవ్థర్టీ ఎయిట్ వెబ్సైట్ ట్రంప్‌కు 66 శాతం గెలుపు అవకాశలున్నాయని చెప్పింది. ఆందోళనలో పలు దేశాలు ట్రంప్ గెలుపుతో పలు దేశాలు ఆందోళనలో మునిగిపోయాయి. ట్రంప్ మెజార్టీ సీట్లు వార్త వెలువడగానే ప్రపంచ మార్కెట్లు సైతం కుప్పకూలాయి.‘ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తా, ముస్లింలనుతాత్కాలికంగా అమెరికాలో ప్రవేశించకుండా అడ్డుకోవడంతో పాటు... వలసల్ని నిరోధిస్తా. అమెరికన్లకే ఉద్యోగాలు దక్కేలా చేస్తా’ అంటూ ట్రంప్ చేసిన ఎన్నికల ప్రచారం ఇప్పుడు అనేక మందికి కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. ట్రంప్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనని ముస్లిం ప్రపంచం ఆందోళనతో గమనిస్తోంది. ఇతర దేశాల ఉద్యోగులు అమెరికన్ల అవకాశాలు కొల్లగొడుతున్నారంటూ ట్రంప్ ప్రచారంతో భారత్, చైనా, వియత్నాం, లాటిన్ అమెరికా దేశాలు కూడా ఆందోళనలో పడ్డాయి. ట్రంప్ అభ్యర్థిత్వంపై తొలి నుంచి రిపబ్లికన్ పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. మహిళలు, వలసవాదులపై చేసిన వ్యాఖ్యల్ని అనేక మంది సీనియర్లు వ్యతిరేకించడంతో పాటు మద్దతిచ్చేందుకు ఒప్పుకోలేదు. -
ఈ ఓటమి ఎంతో బాధిస్తోంది: హిల్లరీ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ఓటమి తర్వాత డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింట్ తొలిసారి మీడియాతో మాట్లాడారు. ముందుగా ఎన్నికలలో తమ పార్టీకి తోడ్పాడు అందించిన అందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని హిల్లరీ అంగీకరించారు. పార్టీ ఓటమి చెందటం చాలా బాధాకరమన్నారు. ఈ ఎన్నికల్లో మనం గెలవలేకపోయాం... అమెరికన్ల కలలు ఎంతో ఉన్నతమైనవి.. మన కలలు నేరవేర్చుకునేందుకు సమిష్టిగా కలిసి పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఎన్నికలలో విజయం సాధించిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ పరిపాలనలో విజయవంతంగా రాణిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఏది ఏమైతేనేం అధ్యక్ష ఎన్నికలకు హోరాహోరీగా ప్రచారం జరిగిందని, చివరికి తమ ప్రత్యర్థిని విజయం వరించిందన్నారు. డోనాల్డ్ ట్రంప్ మ్యాజిక్ ఫిగర్(270 సీట్లు) చేరుకున్న వెంటనే హిల్లరీ తన ప్రత్యర్థికి పోన్ చేసి శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే. ముందస్తు సర్వేలు హిల్లరీదే విజయమని విస్తృత ప్రచారం జరిగినా మిశ్రమ ఫలితాలు వచ్చాయి. -
ట్రంప్‌కు ఫోన్ చేసిన హిల్లరీ
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చేతిలో ఓడిపోవడాన్ని డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ అంగీకరించారు. ఓటమిని అంగీకరించిన హిల్లరీ, ట్రంప్‌కు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. మ్యాజిక్ ఫిగర్(270) దాటిన తరువాత హిల్లరీ తనకు ఫోన్ చేశారని, విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపినట్టు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ప్రచారంలో హిల్లరీ క్లింటన్ తనకు దీటైన పోటీని ఇచ్చినట్టు ట్రంప్ న్యాయార్క్‌లోని హెచ్‌క్యూలో చేపట్టిన విజయోత్సవ ప్రసంగంలో చెప్పారు. విదేశాంగమంత్రిగా హిల్లరీ గణనీయమైన సేవలందించారని కొనియాడారు. ఇక ప్రజలందరి కోసం సమైక్యంగా నడవాల్సిన రోజులు వచ్చాయని ట్రంప్ పేర్కొన్నారు. అగ్రరాజ్య ఆర్థిక వ్యవస్థను రెండింతలు చేస్తానని ట్రంప్ హామీ ఇచ్చారు. కాగ అంచనాలకు భిన్నంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మెజార్టీ రాష్ట్రాల్లో ట్రంప్ హవా సాగించారు. దీంతో హిల్లరీ వెనుకంజలో పడిపోయి, ట్రంప్ అధ్యక్ష పీఠానికి 45వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అగ్రరాజ్యానికి అతిపెద్ద వయస్కుడిగా అధ్యక్ష పదవి చేపడుతున్న వ్యక్తి కూడా ట్రంపే. -
గెలిచిన తర్వాత ట్రంప్ ఏమన్నారంటే...
న్యూయార్క్: అమెరికా ప్రజల బంగారు భవిష్యత్తు కోసం పాటుపడతానని అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ హామీయిచ్చారు. ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు. అమెరికా ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యం ఇస్తానని స్పష్టం చేశారు. గెలుపోటములు సహజనమని, దేశం కోసం అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇది ఒక్కటే చారిత్రక విజయం కాదని, ఇంకా చాలా ఉందని పేర్కొన్నారు. ప్రజలంతా సమైక్యంగా ఉండడానికి అందరూ కలిసిరావాలన్నారు. ఈ విజయం వెనుక చాలా మంది కృషి ఉందన్నారు. తన విజయానికి పాటుపడిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. తనకు హిల్లరీ క్లింటన్ అభినందనలు తెలిపారని చెప్పారు. తాను కూడా హిల్లరీని అభినందించానని వెల్లడించారు. ఎన్నికల ప్రచారం ఇద్దరం హోరాహోరీ తలపడ్డామని గుర్తు చేశారు. అమెరికా ఎప్పుడూ నంబర్ వన్ అని, అంతకన్నా తక్కువ అంగీకరించబోమన్నారు. తమ దగ్గర గొప్ప ప్రణాళిక ఉందని, అమెరికా ఆర్థిక వ్యవస్థను రెట్టింపు చేస్తానని ప్రకటించారు. ట్రంప్ ఇంకా ఏమన్నారంటే... మౌలిక సదుపాయాలను రీడిజైన్ చేస్తా మన సంస్కృతి వారసత్వాలను పునరుద్ధరించుకోవాలి మాజీ సైనికులకు అండగా నిలుస్తాం కష్టపడి పనిచేస్తే ఏ స్వప్నమైనా సాకారమవుతుంది ఇన్నాళ్లు మహిళలు, నల్లజాతీయులను విస్మరించారు ఇక ముందు ఇటువంటి పరిస్థితి ఉండదు మనం చేయాల్సిన పని ఇప్పుడే మొదలైంది దేశాన్ని అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తాను ప్రతి అమెరికన్ గర్వించేలా పనిచేస్తాం అమెరికన్లు అందరికీ నేను అధ్యక్షుడిని -
అదే హిల్లరీ కొంప ముంచిందా?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ ఓటమి దాదాపు ఖరారయింది. డొనాల్డ్ ట్రంప్ శ్వేత సౌధంలో అడుగు పెట్టడానికి చేరువయ్యారు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ సాగించిన ఎన్నికల ప్రచారంపై చర్చ జరుగుతోంది. హిల్లరీ, ట్రంప్ హోరాహోరీగా ప్రచారం సాగించారు. తన ప్రచారంలో హిల్లరీ 85 నినాదాలు వినిపించారు. దీనికి భిన్నంగా ట్రంప్ కేవలం ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ అనే ఒకే ఒక్క స్లోగన్ తో ప్రచారం చేశారు. తనపై ఎన్ని వ్యక్తిగత ఆరోపణలు వచ్చినా ట్రంప్ జాతీయ భావాన్నిమాత్రమే తన ప్రచారంలో వినిపించారు. ఉగ్రవాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనే సత్తా తనకే ఉందని అమెరికన్లను ఒప్పించగలిగారు. హిల్లరీ మాత్రం అనేక అంశాలను స్పృశించారు. ఏ విషయంలోనూ కచ్చితమైన భరోసా ఇవ్వలేకపోయారు. మానవాళికి పెనుముప్పుగా మారిన ఉగ్రవాదంపై గట్టిగా గళం వినిపించలేకపోయారు. మరోవైపు డిగ్రీలు లేని శ్వేత జాతీయులు గంపగుత్తగా ట్రంప్ వైపు మొగ్గుచూపడం ఆయనకు కలిసొచ్చింది. నిరుద్యోగులు, నిరాక్షరాస్యులు కూడా ఆయనకు మద్దతుగా నిలిచినట్టు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలోనే బాగా చదువుకున్నవాళ్లంతా ఓటింగ్ లో పాల్గొనాలని అధ్యక్షుడు బరాక్ ఒబామా పోలింగ్ కు కొద్దిరోజుల ముందు పిలుపునిచ్చారు. ఎక్కువ మంది ఓటింగ్ లో పాల్గొనేలా చూడాలని డెమోక్రాటిక్ పార్టీ మద్దతుదారులకు పిలుపునిచ్చారు. -
హిల్లరీకి షాక్.. ట్రంప్ సంచలన విజయం
వాషింగ్టన్: సర్వేలన్నీ తారుమారు అయ్యాయి. అంచనాలు తప్పాయి. ఎగ్జిట్‌పోల్స్, మీడియా విజయం ఖాయమన్న డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమి చవిచూడగా.. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, ఊహించనివిధంగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ విజయకేతనం ఎగురవేశారు. ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన.. గంట గంటకూ ఆధిక్యం చేతులు మారుతూ, నువ్వా నేనా అన్నట్టు హోరాహోరీగా సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్‌లో ట్రంప్ సంచలన విజయం సాధించారు. అమెరికా 45వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 538 ఓట్లున్న ఎలెక్టోరల్ కాలేజీలో ట్రంప్ స్పష్టమైన మెజార్టీ మార్క్ 270 అధిగమించారు. ట్రంప్ 276 ఓట్లు సాధించారు. హిల్లరీ 218 ఓట్లతో వెనుకబడ్డారు. పూర్తి ఫలితాలు కాసేపట్లో వెలువడుతాయి. ట్రంప్‌కు 5,67,97,101 ఓట్లు, హిల్లరీకి 5,57,41,659 ఓట్లు వచ్చాయి. అమెరికాలోని మొత్తం 51 రాష్ట్రాల్లో ట్రంప్ 27, హిల్లరీ 18 రాష్ట్రాల్లో గెలుపొందారు. మరో 6 రాష్ట్రాల్లో ఫలితాలు వెలువడాల్సి వుంది. ట్రంప్ విజయం ఖాయమని తేలడంతో ఆయన అనుచరులు సంబరాలు చేసుకుంటుండగా, హిల్లరీ అభిమానులు విషాదంలో మునిగిపోయారు. పూర్తి ఫలితాలు వెలువడకుండానే హిల్లరీ నివాసం నుంచి ఆమె మద్దతుదారులు నిరాశతో వెనుదిరిగారు. ట్రంప్ శిబిరం సందడిగా మారింది. హిల్లరీ క్లింటన్ ఓటమిని అంగీకరిస్తూ ట్రంప్‌కు అభినందనలు తెలిపింది. ఆద్యంతం హోరాహోరీ పోరు భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం ఎన్నికల కౌంటింగ్ మొదలైంది ప్రాథమిక ఫలితాల్లో ట్రంప్ ముందంజలో నిలవగా, కాసేపటి తర్వాత హిల్లరీ ఆధిక్యం కనబరిచారు ఆ వెంటనే ట్రంప్ దూసుకెళ్లారు. ఓ దశలో ట్రంప్ హిల్లరీ కంటే దాదాపు 58 ఓట్లు ఎక్కువ సాధించారు. ఎలెక్టోరల్ కాలేజీలో ట్రంప్ 167, హిల్లరీ 109 ఓట్లు కైవసం చేసుకున్నారు ట్రంప్ ఆధిక్యంలో ఉన్నాడని తెలియగానే భారత్ స్టాక్ మార్కెట్లు సహా ఆసియా, అమెరికా మార్కెట్లు భారీగా కుప్పకూలాయి కాగా కాలిఫోర్నియా ఎన్నికల ఫలితాలు వెలువడగానే హిల్లరీ.. ట్రంప్‌ను వెనక్కునెట్టి మళ్లీ ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. హిల్లరీ 190, ట్రంప్ 186 ఓట్లు సాధించారు. కాసేపటి తర్వాత ట్రంప్ మళ్లీ ముందంజలోకి వచ్చారు. ఆ తర్వాత ట్రంప్ అదే జోరు కొనసాగించగా, హిల్లరీ మళ్లీ ముందంజ వేయలేకపోయారు కీలకమైన పెన్సిల్వేనియా రాష్ట్రంలో ట్రంప్ ఘనవిజయం సాధించడంతో దాదాపుగా అధ్యక్ష పీఠం ఖాయమైంది. అమెరికా 45వ అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికయ్యారు. ఈ పదవికి ఎన్నికైన అతిపెద్ద వయస్కుడిగా చరిత్ర సృష్టించారు. -
ట్విట్టర్ రికార్డు బ్రేక్
శాన్ఫ్రాన్సిస్కో: అమెరికా అధ్యక్ష ఎన్నికల వల్ల సోషల్ మీడియా వెబ్సైట్ ట్విట్టర్ పండగ చేసుకుంది. ఎన్నికల రోజు ట్విట్టర్లో 3.5 కోట్ల ట్వీట్లు చేశారు. ఇదే అత్యధిక రికార్డు. బుధవారం ఉదయం 7:30 నిమిషాల వరకు అమెరికా ఎన్నికలకు సంబంధించి ట్విట్టర్లో 3.5 కోట్ల కంటే ఎక్కువ ట్వీట్లు పోస్ట్ చేశారు. 2012లో జరిగిన అమెరికా ఎన్నికల రోజున అత్యధికంగా 3.20 కోట్లకు పైగా ట్వీట్లు చేశారు. తాజాగా ఈ రికార్డు బ్రేక్ అయ్యింది. ట్విట్టర్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌కు కోటి 31 లక్షల మంది, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు కోటి నాలుగు లక్షలమంది ఫాలోవర్లు ఉన్నారు. అమెరికాలో మంగళవారం ఓటింగ్ జరిగింది. తర్వాత కౌంటింగ్‌ను ప్రారంభించారు. ట్రంప్ మెజార్టీ విజయానికి చేరువయ్యారు. -
‘హిల్లరీ గెలవాలని కోరుకుంటున్నాం’
లక్నో: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ విజయం సాధించాలని ఉత్తరప్రదేశ్ లోని ఓ గ్రామం కోరుకుంటోంది. మోహన్ లాల్ గన్ జిల్లాలోని జాబ్రౌలీ గ్రామస్తులు హిల్లరీ గెలవాలని ఆకాంక్షిస్తున్నారు. అమెరికా ఎన్నికల ఫలితాలను వారంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. కౌంటింగ్ సంబంధించిన వార్తలను టీవీల్లో వీక్షిస్తున్నారు. జాబ్రౌలీ గ్రామాన్ని క్లింటన్ హెల్త్ ఫౌండేషన్ దత్తత తీసుకుని పలు సేవా కార్యక్రమాలు చేపట్టింది. అందుకే హిల్లరీ పట్ల ఈ ఊరి ప్రజలు అభిమానం చూపిస్తున్నారు. హిల్లరీ క్లింటన్ గెలుస్తుందని తమకు నమ్మకం ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. ఆమె ఓడిపోతే బాధ పడతామని అన్నారు. గతంలో హిల్లరీ క్లింటన్ భర్త బిల్ క్లింటన్ ఈ గ్రామాన్ని సందర్శించారు. -
తీవ్ర ఉత్కంఠ; హిల్లరీ, ట్రంప్ మధ్య హోరాహోరీ
వాషింగ్టన్: ప్రపంచమంతా తీవ్ర ఆసక్తిని రేకెత్తించిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఉత్కంఠను కలిగిస్తున్నాయి. గంట గంటకూ ఆధిక్యం చేతులు మారుతూ, నువ్వా నేనా అన్నట్టు సాగుతున్న పోరులో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ మెజార్టీ మార్క్‌కు చేరువయ్యారు. 538 ఓట్లున్న ఎలెక్టోరల్ కాలేజీలో ట్రంప్ 244 ఓట్లు సాధించారు. కాగా విజయం ఖాయమని భావించిన డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ 215 ఓట్లతో వెనుకబడ్డారు. మెజార్టీ సాధించాలంటే 270 ఓట్లు అవసరం. భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం మొదలైన ఎన్నికల ఫలితాల్లో మొదట ట్రంప్ ముందంజలో నిలిచారు. కాసేపటి తర్వాత హిల్లరీ ఆధిక్యం కనబరిచారు. ఆ వెంటనే ట్రంప్ దూసుకెళ్లారు. ఓ దశలో ట్రంప్ హిల్లరీ కంటే దాదాపు 57 ఓట్లు ఎక్కువ సాధించారు. ఎలెక్టోరల్ కాలేజీలో ట్రంప్ 167, హిల్లరీ 109 ఓట్లు కైవసం చేసుకున్నారు. ట్రంప్ ఆధిక్యంలో ఉన్నాడని తెలిసేసరికి భారత్ స్టాక్ మార్కెట్లు సహా ఆసియా, అమెరికా మార్కెట్లు భారీగా కుప్పకూలాయి. కాగా కాలిఫోర్నియా ఎన్నికల ఫలితాలు వెలువడగానే హిల్లరీ ట్రంప్‌ను వెనక్కునెట్టి ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. హిల్లరీ 190, ట్రంప్ 186 ఓట్లు సాధించారు. అయితే హిల్లరీ ఇదే జోరు కొనసాగించలేకపోయారు. ట్రంప్ మళ్లీ ముందంజలోకి వచ్చారు. ఆ తర్వాత ట్రంప్ ఆధిక్యం కొనసాగిస్తూ వస్తున్నారు. 23 రాష్ట్రాల్లో ట్రంప్, 17 రాష్ట్రాల్లో హిల్లరీ ముందంజలో నిలిచారు. -
కౌంటింగ్ సమయంలో ట్రంప్ ఎక్కడ..?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ ఫలితాల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం కౌంటింగ్ మొదలైంది. ప్రపంచ దేశాలన్నీ ఉత్కంఠగా ఎన్నికల ఫలితాలను గమనిస్తున్నాయి. ట్రంప్ ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారంటే.. ఆయన తన అపార్ట్మెంట్లో డైట్ కోక్ తాగుతూ టీవీలో ఎన్నికల ఫలితాలను చూస్తున్నారు. ట్రంప్ స్నేహితుడు, న్యూయార్క్ మాజీ మేయర్ రూడీ గులియాని ఈ విషయం చెప్పారు. ట్రంప్ టవర్‌లో ఆయన సన్నిహితులు, కొందరు రిపబ్లికన్ పార్టీ నాయకులు సమావేశమయ్యారు. పలు రాష్ట్రాల నుంచి వెలువడుతున్న ఎన్నికల ప్రాథమిక ఫలితాలను ట్రంప్ టీవీలో చూస్తున్నారని రూడీ చెప్పారు. ట్రంప్ ప్రశాంతంగా ఉన్నారని, తాము ఫలితాలను విశ్లేషిస్తూ ట్రంప్ గెలుస్తారని ఆశిస్తున్నామని తెలిపారు. ట్రంప్ ఇంకా డిన్నర్ చేయలేదని చెప్పారు. -
ట్రంప్‌కు షాకిచ్చిన జార్జిబుష్
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి డబ్ల్యూ బుష్.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌కు ఊహించని షాక్ ఇచ్చారు. జార్జి బుష్ రిపబ్లికన్ పార్టీ తరఫునే రెండుసార్లు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. జార్జిబుష్ తండ్రి సీనియర్ బుష్ కూడా ఇదే పార్టీ తరఫున ఆ దేశ అధ్యక్షుడు అయ్యారు. దీంతో జార్జిబుష్ సాధారణంగా రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి ట్రంప్‌కు ఓటు వేయాలి. అయితే ఆయన ట్రంప్‌కు ఓటు వేయలేదు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు కానీ డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు కానీ ఓటు వేయరాదని జార్జిబుష్ నిర్ణయించుకున్నారు. సొంత పార్టీకి చెందిన మాజీ అధ్యక్షుడు ఓటు వేయకపోవడం ట్రంప్‌కు ఇబ్బందికర పరిణామం. కాగా జార్జిబుష్ నిర్ణయం పార్టీలో, ఎన్నికల్లో తనపై ప్రతికూల ప్రభావం చూపదని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. జార్జిబుష్ నిర్ణయం బాధాకరమని అన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జార్జిబుష్ కుటుంబం ట్రంప్‌కు మద్దతు ఇవ్వలేదు. -
సర్వేలు తారుమారు.. ట్రంప్ ముందంజ!
వాషింగ్టన్: సర్వేలు తారుమారు అవుతున్నాయి. అంచనాలు తప్పుతున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్‌లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ ఆధిక్యం దిశగా దూసుకుపోతున్నారు. ఓటింగ్ ముందు రోజు వరకు అన్ని సర్వేలు విజయం ఖాయమన్న డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ అనూహ్యంగా వెనుకబడ్డారు. భారత కాలమాన ప్రకారం బుధవారం ఉదయం కౌంటింగ్ మొదలైంది. 538 ఓట్లున్న ఎలెక్టోరల్ కాలేజీలో ట్రంప్ 167, హిల్లరీ 109 ఓట్లు కైవసం చేసుకున్నారు. ఇప్పటి వరకు 27 రాష్ట్రాల్లో కౌంటింగ్ పూర్తయ్యింది. అమెరికాలో ట్రంప్ 17 రాష్ట్రాలు, హిల్లరీ 10 రాష్ట్రాల్లో ఆధిక్యం సాధించారు. 14 రాష్ట్రాల్లో ట్రంప్, హిల్లరీ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. అమెరికా అధ్యక్షుడు కావాలంటే ఎలెక్టోరల్ కాలేజీలో 270 ఓట్లు సాధించాలి. కౌంటింగ్ ఫలితాల ట్రెండ్ ఇలా కొనసాగితే ట్రంప్ మెజార్టీ సాధించే అవకాశాలున్నాయి. విద్వేషకర, వివాదాస్పద, సంచలన వ్యాఖ్యలు చేయడంతో పాటు లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న ట్రంప్ ఓటమి ఖాయమని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. హిల్లరీ 90 శాతం గెలిచే అవకాశముందని ఓటింగ్ ముందురోజు తుది సర్వే వెల్లడించింది. హిల్లరీయే గెలుస్తుందని మీడియా కూడా అంచనా వేసింది. అయితే అందరి అంచనాలను తారుమారు చేస్తూ ట్రంప్ దూసుకెళ్తున్నారు. కీలక రాష్ట్రమైన ఫ్లోరిడా సహా వర్జీనియా, ఒహియోలో ట్రంప్ ముందంజలో ఉన్నారు. -
అమెరికా ఎన్నికలపై.. ఉత్కంఠ
ప్రపంచ దేశాలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై తమిళనాడులోనూ ఆసక్తి పెరిగింది. ఎక్కడ చూసినా, గెలుపు ఎవరికి దక్కేనో అన్న చర్చే. తమిళ మీడియా సైతం ఈవార్తలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. దీంతో ఫలితాల ప్రత్యక్ష ప్రసారాలకు సైతం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలోని ఓ స్టార్ హోటల్లో అమెరికా దౌత్య కార్యాలయం నేతృత్వంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక, చాణక్య చేపల జోస్యం ట్రంప్ వైపుగా మల్లడంతో మరింత ఉత్కంఠ పెరిగింది. సాక్షి, చెన్నై : అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో ఉన్న ట్రంప్, హిల్లరీల మధ్య సమరం హోరాహోరీగా మారి ఉన్న విషయం తెలిసిందే. మంగళవారం ఎన్నికలు జరగడం, బుధవారం ఫలితాల వెల్లడి కానునడంతో ప్రపంచ దేశాలు అమెరికా వైపుగా చూస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో తమిళనాట ఆ ఎన్నికలపై ఆసక్తి మరింతగా పెరిగి ఉన్నది. అమెరికాలో ఉన్న తమిళుల మద్దతు హిల్లరీకే అన్నట్టుగా పలు తమిళ మీడియా ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ, ఆ వార్తలకు ప్రాధాన్య ఇచ్చే పనిలో పడా ్డరుు. ఓ మీడియా అయితే, ఏకంగా అమెరికాకు ప్రతినిధుల్ని పంపించి , తమిళుల అభిప్రాయాల్ని లైవ్‌లో ప్రసారం చేస్తుండడంతో జనంలో ఫలితాల ఆసక్తి మరింతగా పెరిగింది. భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం ఏడు గంటల నుం చి ఫలితాల వెల్లడి కానున్నడంతో అందరి దృష్టి గె లుపు ఎవరిదో అన్న అంశం మీద పడింది. ఎక్కడ చూసినా గెలుపు హిల్లరీ కే అంటూ కొందరు, ట్రం ప్కే అంటూ మరి కొందరు చర్చించుకుంటుం డటం గమనించాల్సిన విషయం. ఇక, ఫలితాలు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందించే విధంగా చెన్నైలోని అమెరికా దౌత్య కార్యాలయం నేతృత్వంలో ప్రత్యేక ఏర్పాట్లు జరగడం విశేషం. అడయార్‌లోని ఓ హోటల్లో ఫలితాల ప్రకటన, ప్రతినిధులతో చర్చ, వంటి కార్యక్రమాలు ఉదయం నుంచి సాగనున్నది.దీంతో ఫలితాల కోసం ఆత్రూతగా ఎదు రు చూసే జనం ఎక్కువే. తమిళనాడుతో హిల్లరికి ప్రత్యేక అనుబంధం ఉండటంతో ఆమే పగ్గాలు చేపట్టాలన్న ఆకాంక్షతో ఎదురు చూసే వాళ్లు ఎక్కువగా ఉన్నారు. గతంలో చెన్నైతో పాటుగా రాష్ట్రం లో అనేక ప్రాంతాల్లో ఆమె పర్యటన సాగించి ఉండటం గమనార్హం. ట్రంప్ వైపు చాణక్య చూపు.. ట్రంప్, హిల్లరి మధ్య సమరం హోరాహోరీ అన్న సంకేతాలు వస్తున్న నేపథ్యంలో చాణక్య చూపు ట్రంప్ వైపుగా మళ్లి ఉన్నది. ఇండియన్ కమ్యూనిటీ వెల్పేర్ ఆర్గనైజేషన్(ఐసీడబ్ల్యువో) ఆధ్వర్యంలో అన్నాగనర్‌లోని ప్రధాన కార్యాలయంలో చాణక్య జోస్యం కార్యక్రమం మంగళవారం ఉదయం జరిగింది. అక్వేరియంలో చాణక్య చేపను వదలిపెట్టారు. ట్రంప్, హిల్లరీ ఫొటోలను ఉంచారు. అయితే, చాణక్య చేప ట్రంప్ ఫొటోను తాకడంతో, ఆయన వైపు గెలుపు ఉండొచ్చన్నట్టుగా నిర్వాహకులు జోస్యం చెప్పారు. ఈవిషయంగా ఐసీడబ్ల్యువో వ్యవస్థాపక కార్యదర్శి ఏజే హరిహరన్ మీడియాతో మాట్లాడుతూ, క్రికెట్, ఫుట్‌బాల్ టోర్నీ వంటి సమయల్లో చాణక్య చేప ద్వారా ముందస్తుగా ఫలితాలను తాము జోస్యంగా తెలుసుకుంటూ వస్తున్నామన్నారు. ఈ చేప ఇచ్చే ఫలితాలు 90 శాతం మేరకు అనుకూలంగా ఉన్నట్టు పేర్కొన్నారు. తాజాగా చాణక్య ట్రంప్ వైపుగా తన చూపును మరల్చి ఉన్నదన్నారు. -
ఎవరికి వాళ్లు డిఫరెంట్!
ట్రంపా? హిల్లరీనా? ఇవాళ మధ్యాహ్నానికి (ఇండియా టైమ్ ప్రకారం) ఓ పిక్చర్ వస్తుంది. సాయంత్రానికల్లా ఓ క్లారిటీ వస్తుంది. ఎవరు గెలిచినా, రెండో వారు ఓడినట్లు కాదు! పోరాడి ఓడినట్లు!! ఇదలా ఉంచితే, ‘అమెరికా తొలి మహిళా అధ్యక్షురాలు’గా రికార్డు సృష్టించే అవకాశాలున్న హిల్లరీకి, ‘స్త్రీల పట్ల చిన్న చూపు గల’ అభ్యర్థిగా పేరుమోసిన డొనాల్డ్ ట్రంప్‌కి మధ్య చివరి వరకు హోరాహోరీ జరగడం ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో సంభవించిన ఒక వైరుధ్యం. ఈక్వల్ ఈక్వల్... ఎట్ ది సేమ్ టైమ్... ట్రంప్, హిల్లరీ.. డిఫరెంట్. ఈ సందర్భంగా గత అమెరికా అధ్యక్షుల్లో కొందరి వ్యక్తిత్వాలు, వారి జీవితాలకు సంబంధించిన కొన్ని యు.ఎస్.పి. (యునీక్ సెల్లింగ్ పాయింట్)ల గురించి, అంటే ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం. జార్జి వాషింగ్టన్ అమెరికా తొలి అధ్యక్షులు. మొదట్లో ఆయన జీతం తీసుకోడానికి ససేమిరా అన్నారు! అధ్యక్షుడికి జీతం ఏంటి అని వింతగా చూశారు. జీతం కాదు, గౌరవం అనుకోండి అన్నారు పాలనా కోవిదులు. చివరికి ఆయన దయతలిచారు. జాన్ ఆడమ్స్ చివరి మాటలు ‘థామస్ జెఫర్సన్ సర్వైవ్స్’. (జెఫర్సన్ బతుకుతాడు). ఆయనా, ఈయనా ఫ్రెండ్స్. ప్రత్యర్థులు కూడా. చివరికి ఇద్దరూ ఒకే రోజు మరణించారు. ముందు జెఫర్సన్, తర్వాత ఆడమ్స్. చల్లటి నీళ్లున్న బకెట్లో కొద్దిసేపు కాళ్లు నానబెట్టుకుంటే పక్కవాళ్ల జలుబు మనకు అంటుకోదని థామస్ జెఫర్సన్ నమ్మేవారు. జేమ్స్ మేడిసన్ ఎత్తు 5 అడుగుల 4 అంగుళాలు. అమెరికా అధ్యక్షులందరూ ఆయన కన్నా ఎత్తైవారే. జాన్ క్విన్సీ ఆడమ్స్ రోజూ తెల్లవారుజామునే పొటోమాక్ నదిలో ఒంటిపై బట్టల్లేకుండా ఒక మునకేసి వచ్చేవారు. ఆండ్రూ జాక్సన్ దగ్గర ఒక పెంపుడు చిలుక ఉండేది. అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం టెక్ట్స్ మొత్తం ఆ చిలక్కి కంఠతా వచ్చు. ఆండ్రూ చనిపోయినప్పుడు అంత్యక్రియల్లో ఆ చిలక ఆయన్ని ఏవో శాపనార్థాలు పెట్టిందట! మిలార్డ్ ఫిల్మోర్ సతీమణి అబిగైల్ స్నానం కోసం తొలిసారి వైట్ హౌస్‌లో రన్నింగ్-వాటర్ బాత్‌టబ్ ఏర్పాటైంది. పెళ్లి కాని (చేసుకోని) ఏకైక అమెరికా బ్రహ్మచారి ప్రెసిడెంట్ జేమ్స్ బుచానన్. జీవితాంతం ఆయన ఏకాకిగానే ఉన్నారు. అబ్రహాం లింకన్ బార్ టెండర్‌గా పనిచేశారు. ఆయనకు బార్ టెండర్ లెసైన్స్ కూడా ఉంది. రూథర్‌ఫర్డ్ బి.హేన్స్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వైట్ హౌస్‌లో తొలిసారి టెలిఫోన్ని బిగించారు. ఆ ఫోన్ నెంబర్ ఎంతో తెలుసా? 1. న్యూయార్క్ ఈరీ కౌంటీలో న్యాయ అధికారిగా ఉన్నప్పుడు గ్రోవర్ క్లీవ్‌లాండ్ తలారిగా పనిచేశారు! థియోడర్ రూజ్వెల్ట్ తల్లి, భార్య ఒకేరోజు చనిపోయారు. 1884 వాలెంటైన్స్ డే రోజు అత్తాకోడలు కాస్త అటూ ఇటుగా కన్నుమూశారు. ‘ది లైట్ హ్యాజ్ గాన్ అవుట్ ఆఫ్ మై లైఫ్’ అని రూజ్వెల్ట్ తన పత్రికలో రాసుకున్నారు. విలియమ్ హోవార్డ్ టాఫ్ట్ ఓరోజు బాత్‌టబ్‌లో ఇరుక్కుపోయారు. అందులోంచి బయటపడడానికి ఆయన తన సిబ్బంది సహాయం తీసుకోవలసి వచ్చింది. వారెన్ హార్డింగ్ జూదం ఆడేవారు. ఎంతో ఖరీదైన వైట్‌హౌస్ చైనా సెట్ (ప్లేట్లు, సాసర్ల సెట్)ను ఆయన పోకర్ గేమ్‌లో పోగొట్టుకున్నాడని అంటారు. హార్వర్డ్ యూనివర్సిటీలో చేరడానికి రికమెండేషన్ లెటర్ రాయమని అడిగితే జాన్ ఎఫ్. కెన్నెడీ తండ్రి... ‘వీడు కేర్లెస్, వీడి దగ్గర అప్లికేషన్ కూడా ఉండదు’ అని రాశాడు. అయిన ప్పటికీ కెన్నెడీకి హార్వర్డ్‌లో సీటు వచ్చింది. జార్జి బుష్ సీనియర్ పేరు మీద జపాన్‌లో భాషలో ‘బుషుసురు’ అనే మాట పుట్టుకొచ్చింది. ఈ మాటకు అర్థం... ‘పబ్లిక్‌లో వాంతి చేసుకునేవాడు’ అని. 1992లో జపాన్ ప్రధాని మీద సీనియర్ బుష్ వాంతి చేసుకోవడంతో జపాన్ ప్రజలు ఈ పదాన్ని కనిపెట్టారు. -
అమెరికా అధ్యక్ష ఎన్నికలు: తాజా పరిస్థితి
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి తాజా ముఖచిత్రమిది. ప్రక్రియ మొదలైన నాటి నుంచి వెనుకబడి, చివరి పది రోజుల్లో అనూహ్యంగా పుంజుకుని, పక్కా డెమోక్రటిక్ రాష్ట్రాలను సైతం తన వైపునకు తిప్పుకున్న రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ విజయానికి ఎంత దూరంలో ఉన్నాడు? మొదటి నుంచీ ఆధిక్యంలో కొనసాగుతోన్న డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్.. విజయానికి అవసరమైన 'ఒక్క రాష్ట్రాన్ని' గెలుచుకుంటారా? పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైన తరుణంలో అమెరికా సహా ప్రపంచమంతటా ఉత్కంఠ రేపుతోన్న 'వైట్ హౌస్ పోరు'లో కొన్ని కీలకమైన అంశాలను గమనిస్తే.. ప్రజలు ఓట్లు వేసి గెలిపించే అమెరికా ఎలక్టోరల్ కాలేజీ అధ్యక్షుణ్ని ఎన్నుకుంటుందని, ఎలక్టోరల్ కాలేజీలో మొత్తం 538 ఓట్లు ఉండగా మెజారిటీ (270 ఓట్లు) సాధించిన అభ్యర్థి అధ్యక్ష పీఠాన్ని అధిరోహిస్తారని తెలిసిందే. ప్రఖ్యాత వార్తా సంస్థ సీఎన్ఎన్ తాజాగా(అమెరికా కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి నాటికి) సేకరించిన వివరాల ప్రకారం హిల్లరీ ఖాతాలో 268 ఓట్లున్నాయి. 17 రాష్ట్రాల్లో స్పష్టమైన ఆధిక్యాన్ని, మరో 5 రాష్ట్రాల్లో అనుకూలతను సంపాదించిన ఆమె.. ఊహించని పరిణామాలు తలెత్తితేతప్ప అమెరికా మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా గెలుపొందడం దాదాపు ఖరారయినట్లే. కానీ.. మంగళవారం(నవంబర్ 8)నాటి పోలింగ్ కు ముందు గంటల వ్యవధిలో పరిస్థితి పూర్తిగా మారిపోయినా ఆశ్చర్యపోనవసరంలేదు. ఎందుకంటే అవతల రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ ప్రభంజనంలా దూసుకొస్తున్నాడుమరి! సోమవారం రాత్రి నాటికి ట్రంప్ కు 204 ఎలక్టోరల్ ఓట్లు పడటం ఖాయంగా తేలింది. ఆ మేరకు 20 రాష్ట్రాల్లో గట్టి పట్టును సాధించిన రిపబ్లికన్ పార్టీ మరో 5 రాష్ట్రాల్లో అనుకూలతను సాధించింది. మంగళవారం హోరాహోరీ పోరు జరగనున్న ఆరు రాష్ట్రాల్లో ట్రంప్ అన్నింటిలోనూ నెగ్గుకొస్తేతప్ప అధ్యక్ష పీఠాన్ని అధిరోహించలేడు. హోరాహోరీ పోరు ఎక్కడంటే.. అమెరికాలోని చాలా రాష్ట్రాల ఓటర్లు ఇప్పటికే రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీలో ఏదో ఒకదానికి మొగ్గు చూపగా ఆరు రాష్ట్రాల్లో మాత్రం హోరాహోరీ పోరు సాగనుంది. ఇక ‘బ్యాటిల్ గ్రౌండ్'గా అభివర్ణిస్తోన్న ఆరు రాష్ట్రాలలే (18 ఓట్లున్న ఒహాయో, 11 ఎలక్టోరల్ ఓట్లున్న ఆరిజోనా, 29 ఓట్లున్న ఫ్లోరిడా, 6 ఓట్లున్న నెవెడా, ఒక్క ఎలక్టోరల్ ఓటున్న నెబ్రాస్కా రెండో సభ, 15 ఓట్లున్న నార్త్ కరోలినాలే) అమెరికా అధ్యక్షుణ్ని నిర్ణయించడంలో కీలకం కానున్నాయి. కాగా, కొద్ది గంటల కిందట మారిన సమీకరణాలను బట్టి.. ఒహాయో(18 ఓట్లు), యుటా(6 ఓట్లు) రిపబ్లికన్లకు అనుకూలంగా మారిపోయినట్లు తెలిసింది. నిన్నటిదాకా రిపబ్లికన్లకు అనుకూలంగా ఉన్న న్యూ హాంప్ షైర్(4 ఓట్లు) కొద్ది గంటల కిందటే బ్యాటిల్ గ్రౌండ్ గా మారింది. అయితే సోమవారం అర్ధరాత్రి జరిగిన సంప్రదాయ మిడ్ నైట్ ఓటింగ్ లో న్యూహాంప్ షైర్ లో ట్రంప్ ఆధిక్యాన్ని సాధించడం గమనార్హం. పక్కా రిపబ్లికన్ రాష్ట్రాలు(ఎలక్టోరల్ ఓట్లు): అలబామా(9), అలస్కా(3), ఆర్కన్సా(6), ఐడహా(4), ఇండియానా(11), క్యాసస్(6), కెంటకీ(8), లూసియానా(8), మిసిసిప్పి(6), మిస్సోరి(10), మాంటెనా(3), నెబ్రాస్కా(4), నార్త్ డకోటా(3), ఒక్లహామా(7), సౌత్ కరోలినా(9), సౌత్ డకోటా(3), టెన్నెస్సీ(11), టెక్సాస్(38), వెస్ట్ వర్జీనియా(5), వయోమింగ్(3). మొత్తం 157 ఎలక్టోరల్ ఓట్లు. రిపబ్లికన్ పార్టీ(ట్రంప్)కి అనుకూలంగా ఉన్న రాష్ట్రాలు: జార్జియా(16), అయోవా(6) మెయిన్ రెండో ప్రతినిధి సభ(1) స్థానాల్లో మొదటి నుంచి ట్రంప్ ఆధిక్యత కొనసాగుతోంది. కాగా, కొద్ది గంటల కిందట చోటుచేసుకున్న మార్పుల్లో బ్యాటిల్ గ్రౌండ్ గా ఉన్న ఒహాయో (11), యుటా(6 ఓట్లు) లు కూడా రిపబ్లికన్లకు అనుకూలంగా మారాయి. రిపబ్లికన్లకు అనుకూలంగాఉన్న మొత్తం ఓట్లు 204 డెమోక్రటిక్ పార్టీ(హిల్లరీ)కి జై కొట్టిన రాష్ట్రాలు(ఎలక్టోరల్ ఓట్లు): కాలిఫోర్నియా(55), కనెక్టికట్(7), డెలావెర్(3), వాషింగ్టన్- డీసీ(3), హవాయి(4), ఇల్లినాయిస్(20), మెయిన్(3), మేరీలాండ్(10), మాసచుసెట్స్(11), న్యూజెర్సీ(14), న్యూయార్క్(29), ఆరెగాన్(7), రోడ్ ఐలాండ్(4), వెర్మాంట్ (3), వాషింగ్టన్(12), మిన్నెసొటా(10), న్యూమెక్సికో(5) డెమోక్రటిక్ పార్టీకి మొగ్గుచూపుతోన్న రాష్ట్రాలు: రిపబ్లికన్లకు అనుకూలంగా ఉన్న న్యూహాంప్ షైర్(4 ఓట్లు) స్థానంలో కొద్ది గంటల కిందటినుంచే హిల్లరీ గాలి వీస్తోంది. దీంతో ఈ రాష్ట్రంలో హోరాహోరీ పోరు జరగనుంది. ఇది కాక కొలరాడో(9), మిచిగన్(16), పెన్సిల్వేనియా(20), వర్జినియా(13) విస్ కాన్సిస్ (10) రాష్ట్రాలు హిల్లరీకి అనుకూలంగా ఉన్నాయి. హిల్లరీకి అనుకూల ఓట్లు మొత్తం 268. ప్రస్తుత బలాబలాలు ఓటర్లు ఓటువేసే క్షణానికి తారుమారయ్యే అవకాశాలు లేకపోలేవు. -
ట్రంప్, హిల్లరీలో ఎవరు గెలిచినా ఒకటేనా?
న్యూయార్క్: ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రట్ల అభ్యర్థి హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ల అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌లో ఎవరు విజయం సాధించినా పేదలు, మధ్య తరగతి వర్గాలకు పెద్దగా ఒనగూడేది ఏమీ ఉండదు. ఎందుకంటే ఇద్దరూ తమ ఎన్నికల ప్రచారానికి భారీగా విరాళాలు ఇచ్చిన కార్పొరేట్ సంస్థల కనుసన్నల్లోనే పనిచేయాల్సి ఉంటుంది. బడా కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలను పరిరక్షించే విధాన నిర్ణయాలనే దేశాధ్యక్షులు అమలు చేయాల్సి ఉంటుంది. ఇతర వర్గాల ప్రయోజనాల కోసం పనిచేసే స్వేచ్ఛ అమెరికా అధ్యక్షులకు పరిమితంగానే ఉంటుంది. హిల్లరీ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల ప్రచారం కోసం ఈ రోజు వరకు 250 కోట్ల డాలర్లను ఖర్చు పెట్టారు. అందులో దాదాపు 130 కోట్ల డాలర్లను హిల్లరీ విరాళాల రూపంలో సమీకరించగా, ట్రంప్ దాదాపు వందకోట్ల డాలర్లను విరాళాలుగా సేకరించినవే. విరాళాలిచ్చే ముందు కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు అధ్యక్ష అభ్యర్థులతో తమ ప్రయోజనాల గురించి వివరిస్తారు. ఆ ప్రయోజనాలను పరిరక్షించేవారికి ఎక్కువ విరాళాలు ఇచ్చేందుకు మొగ్గు చూపుతారు. ఈ నిర్ణయాలు, సమావేశాలు పార్టీ అభ్యర్థులు, కార్పొరేట్ ప్రతినిధుల మధ్య రహస్యంగా జరిగిపోతాయి. ఈసారి కూడా ఎన్నికల్లో వివిధ రాష్ట్రాల్లో ఇలాంటి సమావేశాలు ఎన్నో జరిగాయి. కానీ ఇదంతా పారదర్శకంగా కనిపించడం కోసం విరాళాల దాతలతో దేశాధ్యక్ష పదవికి పోటీ చేసే అభ్యర్థులు బహిరంగంగా చర్చా సమావేశాలు నిర్వహిస్తారు. అమెరికాలో అతిపెద్ద పొగాకు కంపెనీ ఆల్ట్రియా 5,40,000 డాలర్లు, రెండవ పెద్ద పొగాకు కంపెనీ రెనాల్డ్స్ అమెరికన్ కంపెనీ ఏకంగా 9,90.000 డాలర్లను రిపబ్లికన్ అభ్యర్థి ట్రంపకు విరాళంగా ఇచ్చాయి. అమెరికన్ రెస్టారెంట్ అసోసియేషన్, అమెరికా పారిశ్రామిక మండలి కూడా ఎన్నికల్లో ట్రంప్‌కు భారీగానే విరాళాలు ఇచ్చాయి. ఇక హిల్లరీకి వైద్య పరికరాల సరఫరా కంపెనీలు, ఎంటర్ టైన్మెంట్ సంస్థలు, విద్యా సంస్థలు, టీచర్ల సంఘాలు, మీడియా గ్రూప్‌లు. హాలివుడ్ సినీ పరిశ్రమ వర్గాలు, ఆర్థిక, సామాజిక సమానత్వం కోరుకునే సంస్థలు, కార్మిక సంఘాలు, సామాజిక కార్యకర్తలు ఎక్కువగా విరాళాలు ఇచ్చారు. కొన్ని కంపెనీలు ఎందుకైనా మంచిదని ఇద్దరు అభ్యర్థులకు విరాళాలు ఇచ్చాయి. అయితే అలాంటి కంపెనీలు చాలా తక్కువగా ఉన్నాయి. తమకు ఎవరు అనుకూలంగా ఉన్నారనుకున్నారో వారికి ఎక్కువ విరాళాలు ఇచ్చి, ప్రత్యర్థికి తక్కువ విరాళాలు ఇచ్చాయి. తమ యజమానులైన కార్పొరేట్ సంస్థలతో పోటీ పడాలంటే కార్మిక సంఘాలు కూడా విరాళాలు ఇచ్చుకోవాల్సిన అవసరం అమెరికాలో ఏర్పడటం విచిత్రం. ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేయాలనుకుంటున్న సామాజిక కార్యకర్తలు కూడా అధ్యక్ష ఎన్నికలకు విరాళాలు ఇవ్వడం మరింత ఆశ్చర్యకరం. అమెరికాలో తుపాకీ సంస్కృతి ఎక్కువగా పెరిగిపోతోందని, తుపాకులను నియంత్రించాలన్న డిమాండ్ ప్రజల నుంచి వచ్చిన నేపథ్యంలో అమెరికా గన్ అసోసియేషన్ (తుపాకీ తయారీ కంపెనీల సంఘం) కూడా అధ్యక్ష ఎన్నికలకు భారీగా విరాళాలు ఇచ్చాయి. కార్పొరేట్ సంస్థలు ఒక్క దేశాధ్య ఎన్నికలకే కాకుండా విధాన నిర్ణయాలు తమకు అనుకూలంగా ఉండేలా వివిధ రాష్ట్రాలకు కూడా విరాళాలు ఎప్పటికప్పుడు ఇస్తుంటాయి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం స్వంత చట్టాలను కలిగిఉండే స్వేచ్ఛ ఉండడంతో అన్ని రాష్ట్రాలను ప్రభావితం చేసేందుకు కార్పొరేట్ సంస్థలు ప్రయత్నిస్తూనే ఉంటాయి. విరాళాలు, లాబీయింగ్ ప్రభావం విధాన నిర్ణయాలపై ఎలాంటి ఉంటుందో రాష్ట్ర చట్టాలను పరిశీలిస్తే అర్థమవుతుంది. అమెరికా రాష్ట్రాలు చట్టాలపై నిర్ణయాలు తీసుకోవడానికి ప్రజల ఓటింగ్‌ను నిర్వహిస్తుంటాయి. ఒహాయోలో ఏడాదిక్రితం కార్మికుల కనీస వేతనాలపై ఓటింగ్ నిర్వహించారు. ఆ చట్టం కఠినంగా ఉండకుండా ఉండేందుకు కార్పొరేట్ సంస్థలు ఆ రాష్ట్ర ‘సెక్రటరీ ఆఫ్ స్టేట్’ (రాష్ట్ర లెఫ్ట్‌నెంట్ గవర్నర్ తర్వాతి పోస్ట్, భారత్‌లోని చీఫ్ సెక్రటరీ లాంటి పోస్ట్)అధికారితో భారీగా లాబీయింగ్ జరిపాయి. సెక్రటరీ ఆఫ్ స్టేట్‌ను కొన్ని రాష్ట్రాల్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నుకుంటే మరికొన్ని రాష్ట్రాల్లో ఆ రాష్ల్ర లెఫ్ట్‌నెంట్ గవర్నర్ నియమిస్తారు. వీరికి పదోన్నతి వస్తే లెఫ్ట్‌నెంట్ గవర్నర్లు అవుతారు. ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి ఫైల్ ఈ అధికారుల ఆధీనంలోనే ఉంటుంది. నేవడా రాష్ట్రంలో తుపాకీ నియంత్రణా చట్టాన్ని మరింత కఠినంతరం చేయాలన్న ప్రతిపాదన ప్రజల నుంచి వచ్చింది. దీనిపై ఓటింగ్ నిర్వహించి చట్టంలో మార్పులు తీసుకరావాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఓటింగ్‌కు బిల్లును రూపొందించాల్సిన బాధ్యతు ‘సెక్రటరీ ఆఫ్ స్టేట్’ కావడంతో ఆ బాధ్యత సదరు వ్యక్తికి అప్పగించారు. చట్టం కఠినమైతే తుపాకులు అమ్ముకోవడం కష్టమవుతుందని భావించినా గన్ అసోసియేషన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్‌తో లాబీయింగ్ జరిపింది. తుపాకీని ఒకరి నుంచి మరొకరికి బదిలీ చేసేటప్పుటు ఆ తుపాకీని తీసుకొనే వ్యక్తి నేర చరిత్రను సమగ్రంగా తనిఖీ చేయాలంటూ ప్రతిపాదన తయారైంది. వాస్తవానికి ఏ వ్యక్తికైనా తుపాకీ అమ్మేటప్పుడు ఆ వ్యక్తి నేరచరిత్రతోపాటు ప్రవర్తన తదితర అంశాలను క్షుణ్నంగా పరిశీలించాలనే ప్రతిపాదన చట్టంలో తీసుకరావాల్సి ఉండింది. కంపెనీల లాబీయింగ్‌తో చట్టం సవరణ ప్రతిపాదన రూపమే మారిపోయింది. వచ్చే నెలలో ఈ ప్రతిపాదనపై ఓటింగ్ జరుగనుంది. ‘ది కీ టు ఎనీ బ్యాలెట్ మెజర్ ఈజ్ రైట్ లాంగ్వేజ్, కంపెనీ గీవ్స్ ది కాన్సెప్ట్, సెక్రటరీ ఆఫ్ స్టేట్ రైట్స్ ది లాంగ్వేజ్’ అని వాల్‌మార్ట్, ఫిలిప్ మోరిస్, ఇంటర్నేషనల్ విన్ రిసార్ట్స్ లాంటి పెద్ద సంస్థలను కస్టమర్లుగా కలిగిన అమెరికాలోని లింకన్ స్టాటజీ గ్రూప్ మేనేజింగ్ పార్టనర్ నాథన్ స్ప్రౌల్ ఓ రహస్య సమావేశంలో చేసిన వ్యాఖ్య రాజకీయ నాయకులకు, కార్పొరేట్ సంస్థలకు ఎలాంటి అనుబంధం ఉంటుందో తెలియజేస్తోంది. దేశాధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిచారా, హిల్లరీ గెలిచారా అన్నది ముఖ్యం కాదు. వారికి విరాళాలు ఎలాంటి సంస్థలు, ఎలాంటి కంపెనీలు విరాళాలు ఇచ్చాయన్నది ముఖ్యం. -
తొలి ఫలితం వెల్లడి, హిల్లరీ విజయం
న్యూయార్క్: ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తొలి ఫలితం వెలువడింది. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ తొలి విజయం సాధించారు. న్యూ హాంప్‌షైర్‌లోని డిక్స్‌విల్లె నాచ్‌లో హిల్లరీ 4-2 తేడాతో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌ను ఓడించారు. భారత కాలమాన ప్రకారం మంగళవారం మధ్యాహ్నం అమెరికా ఎన్నికలు ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం నుంచి కౌంటింగ్ చేపడతారు. రేపు మధ్యాహ్నానికల్లా పూర్తి ఫలితాలు వెలువడవచ్చని భావిస్తున్నారు. కాగా సోమవారం రాత్రి ఓటింగ్ జరిగిన డిక్స్‌విల్లె నాచ్ ఫలితం వెలువడింది. ఇక్కడి నుంచి హిల్లరీ గెలవడంతో డెమొక్రటిక్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు. అమెరికా ఎన్నికల్లో హిల్లరీ గెలుస్తారని అన్ని సర్వేలు చెబుతున్నాయి. ఆమెకు 90 శాతం గెలిచే అవకాశాలున్నాయని తుది, తాజా రాయిటర్స్ సర్వేలో వెల్లడైంది. -
పోలింగ్ ప్రారంభం.. రేపే ఫలితాలు!
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజాము వరకు పోలింగ్ కొనసాగుతుంది. ఆ వెంటనే.. అంటే ఉదయం 7 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నానికల్లా తొలి ఫలితాలు వెల్లడవుతాయి. తుది ఫలితాలు వెల్లడయ్యేసరికి మాత్రం సాయంత్రం అవుతుంది. అధ్యక్ష పదవి చేపట్టాలంటే కావల్సిన 270 ఎలొక్టరల్ ఓట్లు వచ్చిన వెంటనే గెలిచినట్లు నిర్ణయం అవుతుంది. ఆ తర్వాత కూడా కొన్ని రాష్ట్రాల లెక్కింపు జరుగుతుంది. ఈ మెయిళ్ల వ్యవహారంలో చిట్టచివరి నిమిషంలో ఊరట లభించడంతో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థిని హిల్లరీ క్లింటన్‌కు విజయావకాశాలు పెరిగాయి. ఒక సర్వే ప్రకారం, ఆమె విజయం సాధించేందుకు 90 శాతం అవకాశం ఉందని చెప్పారు. మరోవైపు రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ కూడా పోటాపోటీగా ముందుకొచ్చారు. -
ఈ ఒక్కసారి.. నన్ను నమ్మండి: ఒబామా
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం చివరి దశలో అభ్యర్థులు హిల్లరీ క్లింటన్, డోనాల్డ్ ట్రంప్ హామీలు, పరస్పర విమర్శలతో హోరెత్తించారు. ఎన్నికలకు ముందు రోజు హోరాహోరీగా ప్రచారం చేశారు. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీకి మద్దతుగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రచారం నిర్వహించారు. సోమవారం హిల్లరీ, ఒబామా కలసి పలు సభల్లో పాల్గొన్నారు. మిచిగాన్‌లో ఎన్నికల ర్యాలీలో ఒబామా మాట్లాడుతూ.. ఈ ఒక్కసారి తనను నమ్మి హిల్లరీకి ఓటు వేయాలని విన్నవించారు. చరిత్ర సృష్టించే అవకాశం అరుదుగా వస్తుందని, దీన్ని వదులుకోవద్దని ప్రపంచమంతా మనల్ని చూస్తోందని ఒబామా అన్నారు. అందరం ఓటు హక్కు వినియోగించుకుంటే హిల్లరీ గెలుస్తారని, ఓటు వేయకుండా ఇంటికే పరిమితమైనా, ఓటు వేసేందుకు నిరసన తెలిపినా హిల్లరీ ప్రత్యర్థి గెలుస్తారని చెప్పారు. హిల్లరీ ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌పై ఒబామా విమర్శలు చేశారు. అమెరికా అధ్యక్ష పదవికి ట్రంప్ ఏ మాత్రం అర్హుడు కాడని అన్నారు. ప్రచారం చివరి రోజు హిల్లరీకి మద్దతుగా ఆమె కుమార్తె చెల్సియా, ఒబామాతో పాటు ఆయన భార్య మిచెల్లి ఒబామా ప్రచారం చేశారు. రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి ట్రంప్ కూడా హిల్లరీపై విమర్శలు కొనసాగించారు. ఈ మెయిల్స్ వ్యవహారంలో హిల్లరీ తప్పుచేసినట్టు ఎఫ్‌బీఐకి తెలుసునని ఆరోపించారు. హిల్లరీని రక్షించే ప్రయత్నం చేశారని చెప్పారు. మీడియాను కూడా ఆయన విమర్శించారు. -
హిల్లరీదే విజయం.. ట్రంప్‌కు షాక్!
హిల్లరీకి 90 శాతం విజయావకాశం: సర్వే నేడే అమెరికా అధ్యక్ష ఎన్నికలు న్యూయార్క్: అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికలను ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తోంది. మంగళవారం జరిగే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారా? డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటనా లేక రిపబ్లికన్ డోనాల్డ్ ట్రంపా? ఎవరు గెలిస్తే ఎలా ఉంటుందంటూ ప్రపంచ దేశాలు లాభనష్టాలను బేరీజువేసుకుంటున్నాయి. ఈ రోజు జరిగే ఎన్నికల్లో హిల్లరీ గెలుపు ఖాయమంటూ తుది, తాజా సర్వే వెల్లడించింది. హిల్లరీకి 90 శాతం గెలిచే అవకాశాలున్నాయని, ట్రంప్‌నకు షాక్ తప్పదంటూ రాయిటర్స్/ఇప్సాస్ స్టేట్స్ ఆఫ్ ద నేషన్ నిర్వహించిన సర్వేలో తేలింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో మొదట్నుంచి హిల్లరీయే ముందంజలో ఉన్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు, మహిళలపై అనుచితంగా ప్రవర్తించినట్టు ఆరోపణల కారణంగా ట్రంప్ వెనుకబడిపోయారు. ఆ తర్వాత పోటీ హోరాహోరీగా మారిందని, ఓ దశలో ట్రంపే స్వల్ఫ తేడాతో ముందున్నారంటూ సర్వేలు చెప్పాయి. కాగా ఎన్నికల తేదీ సమీపించేసరికి పరిస్థితి హిల్లరీకి పూర్తిగా అనుకూలంగా మారింది. ఈ మెయిల్స్ వ్యవహారంలో ఎఫ్‌బీఐ క్లీన్ చిట్ ఇవ్వడం కూడా ఆమెకు కలసివచ్చింది. హిల్లరీ గెలిచే అవకాశం 64 శాతం ఉందని సర్వేలు తేల్చగా, తాజా, తుది సర్వేలో విజయావకాశాల శాతం 90కి పెరిగింది. ఇక వైట్ హౌస్ రేసులో ట్రంప్ ఆశలు రోజురోజుకు సన్నగిల్లిపోతున్నాయి. అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నిక కావాలంటే ఎలెక్టోరల్ కాలేజీలో 270 ఓట్లు అవసరం కాగా హిల్లరీ 303 ఓట్లతో తిరుగులేని మెజార్టీ సాధిస్తారని సర్వేలో తేలింది. ట్రంప్‌కు 235 ఓట్లు మాత్రమే వస్తాయని వెల్లడించింది. ఇక పాపులర్ ఓట్లు హిల్లరీకి 45 శాతం, ట్రంప్‌కు 42 శాతం వస్తాయని అంచనా వేసింది. భారత కాలమాన ప్రకారం ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి జరిగే అమెరికా ఎన్నికల్లో దాదాపు 15 కోట్లమంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. -
ఎవరిది పైచేయి?
అమెరికా సమాజంతోపాటు ప్రపంచ దేశాల్లో కూడా ఉత్కంఠ రేపిన అమెరికా అధ్యక్ష ఎన్నికల కోలాహలం నేడు జరగబోయే పోలింగ్‌తో ముగియబోతోంది. రెండు ప్రధాన పార్టీలైన డెమొక్రటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ సమయంలోనే ఈ ఉత్కంఠ బయల్దేరింది. డెమొక్రటిక్ పార్టీలో హిల్లరీ క్లింటన్‌పై సోషలిస్టు భావాలుగల బెర్నీ సాండర్స్ పోటీపడటం...రిపబ్లికన్ పార్టీలో అంతవరకూ దాదాపు ‘బయటి వ్యక్తి’గా ముద్రపడిన డోనాల్డ్ ట్రంప్ తెరపైకి రావ డమేకాక ప్రత్యర్థులపై దూకుడుగా విమర్శలు చేయడం ఇందుకు కారణం. అటు సాండర్స్ అయినా, ఇటు ట్రంప్ అయినా లేవనెత్తిన అంశాలు కూడా కీలకమైనవి. ఆ అంశాలు వర్తమాన అమెరికా సమాజం ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్య లను ప్రతిఫలిస్తాయి. అవి ఆ సమాజం అంతరాంతరాల్లో గూడుకట్టుకుని ఉన్న అసంతృప్తిని, అసహనాన్ని, వివక్షను విప్పి చెబుతాయి. అక్కడి అప్రజాస్వామిక పోకడలను ఎత్తిచూపుతాయి. ప్రపంచంపై తానే రుద్దిన ప్రపంచీకరణ విధానాల పర్యవసానాలను అమెరికా కూడా చవిచూడటాన్ని వెల్లడిస్తాయి. ప్రపంచీకరణను అంతక్రితం ఎలా చూసినా...వాణిజ్యం, పెట్టుబడి, వలసలు తదితర అంశాల్లో ఎలాంటి ఆంక్షలూ లేకపోవడమే అసలైన ప్రపంచీకరణ అని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్) 2000 సంవత్సరంలో ప్రకటించాక అది కొత్త పుంతలు తొక్కింది. అది సామాజిక, సాంస్కృతిక, పర్యావరణ రంగాలకు సైతం విస్తరించింది. ప్రపంచీకరణ వల్ల పెట్టుబడులు రావడం, వినియోగ వస్తు వులు వెల్లువలా వచ్చిపడటం, పేరెన్నికగన్న బ్రాండ్లు అందుబాటులోకి రావడం అందరినీ సమ్మోహనపరిచాయి. మెరుగైన వస్తువులు చవగ్గా లభ్యంకావడానికి అది తోవలుపరిచింది. కొత్త కొత్త రంగాల్లో అవకాశాలను పెంచింది. అదే సమయంలో యాంత్రికీకరణ పెరిగింది. ఉపాధి దెబ్బతింది. పటిష్టమైన ఆర్ధిక వ్యవస్థలు లేని చోట పెట్టుబడుల ప్రవాహం కరెన్సీ సంక్షోభాలను సృష్టించింది. సహజ వనరులను బహుళజాతి సంస్థలకు అప్పగించడం, విదేశీ పెట్టుబడుల కోసం పర్యావరణ అంశాల్లో రాజీపడటం ఎక్కువైంది. ఆదాయ వ్యత్యాసాలు అధికమయ్యాయి. వీటిల్లో అనేక అంశాలు అమెరికాను కూడా వేధించడం మొదలెట్టాయి. తయారీ రంగంలో సింహభాగం చైనాకు తరలడంతో ఆ దేశంలో ఉపాధి తీవ్రంగా దెబ్బ తింది. దీనికితోడు వలసొచ్చినవారు తక్కువ వేతనాలకు పనిచేయడానికి ముందు కొస్తుండటం శ్వేతజాతీయులకు శాపమైంది. ఆర్ధిక తారతమ్యాలు హెచ్చాయి. సంపద కేంద్రీకరణ పెరిగింది. సామాజిక సంక్షేమ పథకాలు ఉండవు గనుక ఈ పరి ణామాలన్నీ సాధారణ పౌరులను మరింతగా కుంగదీశాయి. ఇలాంటి అంశాలను బెర్నీ సాండర్స్ ఒక కోణం నుంచి చూస్తే డోనాల్డ్ ట్రంప్ మరో కోణం నుంచి చూశారు. సాండర్స్ కుబేరులపై అధిక పన్నుల గురించి మాట్లాడారు. సంక్షేమ పథకాలను ప్రవేశపెడతానన్నారు. రాజకీయ రంగంపై కార్పొరేట్ల అజ్మాయిషీని పోగొడతానన్నారు. ట్రంప్ మాత్రం శ్వేత జాతి అహం కారాన్ని రెచ్చగొట్టారు. భారత్, చైనా తదితర దేశాలనుంచి వలసొస్తున్నవారు ఉద్యోగాలు కొల్లగొడుతున్నారు గనుక వారి కట్టడికి చర్యలు తీసుకుంటానన్నారు. ముస్లింలను ఉగ్రవాదులుగా చిత్రీకరించడానికి ప్రయత్నించారు. ఇరాన్‌పై యుద్ధం ప్రకటిస్తానన్నారు. మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేశారు. అవమానకరమైన రీతిలో మాట్లాడారు. పేరుకు ప్రజాస్వామ్య దేశమైనా ప్రపంచంలో ఇతరచోట్ల వలే అక్కడ కూడా మహిళలపై వివక్ష అధికం. మహిళలపై ఉండే అన్ని రకాల వివక్షనూ పారదోలాలన్న అంతర్జాతీయ ఒడంబడిక(సెడా)ను ధ్రువీకరించడానికి అదింకా సిద్ధపడలేదు. ప్రపంచంలో ఎక్కడెక్కడ మానవహక్కుల ఉల్లంఘన జరుగుతున్నదో ఏటా నివేదికలు తయారు చేసే అలవాటున్న అమెరికాలో ఈ దుస్థితి ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. 1789 మొదలుకొని అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న అమె రికాలో ఒక మహిళ బరిలో నిలబడటం ఇదే మొట్టమొదటిసారని గుర్తుంచుకుంటే ఆ వివక్ష ఏ స్థాయిలో ఉన్నదో అర్ధమవుతుంది. 1848లో అమెరికాలో జరిగిన తొలి మహిళా హక్కుల సదస్సు స్త్రీ, పురుష సమానత్వం కావాలని, మహిళలకు కూడా ఓటు హక్కు ఇవ్వాలని కోరితే 1919 వరకూ వారికి ఓటు హక్కే లేదు. దీన్నంతటినీ చక్కదిద్దవలసిన తరుణంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వాన్ని చేజిక్కించుకుని రంగం లోకి దిగిన ట్రంప్ ఉన్న పరిస్థితిని మరింత దిగజార్చారు. మహిళలపై గతంలో అత్యంత నీచంగా చేసిన వ్యాఖ్యానాలకు సంబంధించిన వీడియోలు బయటపడినా క్షమాపణ చెప్పడం సంగతలా ఉంచి...అలాంటి అభిప్రాయాలుండటం తప్పేనని విచారం వ్యక్తం చేయడానికి కూడా ఆయనకు నోరు పెగల్లేదు. డెమొక్రటిక్ పార్టీ విధానాలనూ, వివిధ అంశాల్లో హిల్లరీ క్లింటన్ వైఖరినీ విమర్శించి, అందులోని లొసుగులను ఎత్తి చూపాల్సిన ట్రంప్ అందుకు భిన్నంగా ఆమెను మహిళగా మాత్రమే చూసి కించప రచడం ప్రజాస్వామికవాదులందరినీ కలవరపరిచింది. హిల్లరీ వ్యతిరేకులు సైతం ఆమెకే ఓటేద్దామని నిర్ణయించుకునేలా చేసింది. అమెరికా ఇప్పుడు ట్రంప్ అనుకూల, ట్రంప్ వ్యతిరేక శిబిరాలుగా విడి పోయింది. ఒక మహిళ తొలిసారి అధ్యక్ష బరిలో ఉండటంపై ఉత్సాహం ఉరక లెత్తాల్సి ఉండగా అధ్యక్షురాలిగా ఎన్నికైనాక ఆమె తీసుకోనున్న నిర్ణయాలపై ఆందో ళన అలుముకుంది. విదేశాంగమంత్రిగా ఉన్నప్పుడు హిల్లరీ సక్రమంగా వ్యవహ రించలేదన్న ఆరోపణలున్నాయి. వీటన్నిటి పర్యవసానంగానే వివిధ సర్వేల్లో హిల్లరీ కొన్నిసార్లు ట్రంప్ కంటే వెనకబడ్డారు. తాజా సర్వేల్లో సైతం ఇద్దరి మధ్యా వ్యత్యాసం చాలా తక్కువుంది. ఈమెయిల్ వివాదంలో హిల్లరీ నిర్దోషి అని చివరి నిమిషంలో ఎఫ్‌బీఐ ప్రకటించడం ఆమెకు ఊరటనిచ్చే అంశం. అయితే ట్రంప్‌కు బదులు రిపబ్లికన్ అభ్యర్థిగా మరెవరున్నా ఆమెను సునాయాసంగా ఓడించేవారన్న అభిప్రాయం ఉంది. అమెరికా- రష్యాల మధ్యా...అమెరికా- చైనాలమధ్యా విభే దాలు ముదురుతున్న దశలో జరుగుతున్న ఈ ఎన్నికలు ఆ దేశాన్నీ, ప్రపంచాన్నీ ఎలాంటి దిశగా తీసుకెళ్లగలవో చూడాల్సి ఉంది. -
హిల్లరీ ఊపిరి.. ట్రంపు ముంపు!
ఇదీ.. మార్కెట్ల తాత్కాలిక వైఖరి రేపు మార్కెట్ల ఆరంభంకల్లా తొలి ఫలితాలు ఫలితమేదైనా తక్షణ స్పందన దూకుడుగానే! మధ్య, దీర్ఘకాలంలో దేశీ మార్కెట్లు పటిష్ఠమే హిల్లరీ గెలిస్తే డిసెంబర్లో ఫెడ్ రేటు పెంపు చాన్స్ మన మార్కెట్లకు ట్రంప్ కన్నా పెద్ద సమస్య ఫెడ్ రేటే మెల్లగా డాలరు నిధులు తరలిపోయే అవకాశం ట్రంప్ గెలిస్తే తక్షణం బారీ పతనానికి అవకాశం ఫెడ్ రేటు మాత్రం పెరగకపోవచ్చు... సాక్షి, బిజినెస్ విభాగం : హిల్లరియా.. ట్రంపా? మరో 24 గంటల్లో ఈ ప్రశ్నకు సమాధానం రావచ్చు. కానీ ఆ సమాధానం వచ్చాక మన మార్కెట్ల పరిస్థితేంటి? ఎగబాకుతాయా? పడిపోతాయా? మామూలుగా ఉంటాయా? ఇవే ఇపుడు ఇన్వెస్టర్లను తొలిచేస్తున్న ప్రశ్నలు. అంతర్జాతీయ ఆర్థిక దిగ్గజంగా అమెరికా ప్రభావం ప్రపంచమంతటా ఉంటుంది. అధ్యక్ష ఎన్నికా అందుకు అతీతమేమీ కాదు. గెలుపోటములు ఇద్దరి మధ్యా ఎలా దోబూచులాడుతున్నాయో... గత 10 రోజులుగా మార్కెట్లలో హెచ్చుతగ్గులూ అలాగే ఉంటున్నారుు. దాదాపు 7-8 రోజులపాటు మన మార్కెట్ దాదాపు 5 శాతం పతనంకాగా, సోమవారం 1.2 శాతం వరకూ ర్యాలీ జరిపింది. డొనాల్డ్ ట్రంప్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలతో సహా వివిధ అంశాలపై చేస్తున్న ప్రకటనలతో ఈక్విటీ ఇన్వెస్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, హిల్లరీ క్లింటన్ గెలిస్తే ఏదో ఒరిగిపోతుందన్న భావన లేనప్పటికీ, ప్రస్తుత విధానాలు కొనసాగుతాయన్న ఆశాభావంతో ఇన్వెస్టర్లు స్థిమితంగా ఉన్నారు. ట్రంప్ గెలిస్తే ప్రపంచ మార్కెట్లు మరో 3-5% మధ్య క్షీణించవచ్చని సిటీ గ్రూప్ అంచనావేస్తుండగా, హిల్లరీ విజయం సాధిస్తే... మార్కెట్లు ఇప్పటివరకూ చవిచూసిన నష్టశాతాన్ని పూడ్చుకోవొచ్చన్న అంచనాలున్నాయి. 2-4% మధ్య పెరగవచ్చు. హిల్లరీ గెలిస్తేనే ఫెడ్ రేటు పెంపు!! విశ్లేషకుల మాటల్లో చెప్పాలంటే... గెలుపోటములు వెల్లడైన ఒక్కరోజులో ఏమీ జరిగిపోదు. కానీ మార్కెట్ల స్పందన తాత్కాలికమే అ యినా ఆ రోజు దూకుడుగానే ఉంటుంది. మార్కెట్ విశ్లేషకుల అంచనాల ప్రకారం క్లింటన్ గెలిస్తే డిసెంబర్లో ఫెడ్ తన ఫండ్ రేటును పెంచే అవకాశాలుంటాయి. రేట్ల పెంపునకు అనువైన దిశగా అక్కడి జాబ్స్ మార్కెట్ మెరుగుపడటం, ద్రవ్యోల్బణం పెరగడం జరుగుతోంది. దీంతో ఆ నెలలో రేట్ల పెంపునకు 80% వరకూ అవకాశాలున్నట్లు అక్కడి ఫెడ్ ఫండ్స ఫ్యూచర్స్‌లో జరుగుతున్న ట్రేడింగ్ సూచిస్తోంది. అందుకే హిల్లరీ అనుకూల ప్రీపోల్ సర్వే ప్రభావంతో సోమవారం డాలరు ఇండెక్స్ భారీగా పెరిగింది. మరోవైపు బంగారం ధర పడిపోయింది.అమెరికా స్టాక్ మార్కెట్లు, ఇతర ప్రపంచ ప్రధాన మార్కెట్లకంటే పెద్ద ర్యాలీ జరుపుతున్నాయి. అక్కడ వడ్డీ రేట్ల పెంపు భారత్‌లాంటి వర్థమాన మార్కెట్లకు ముప్పుగానీ, అమెరికాకు కాదు. ఇతర దేశాల్లోకి తరలివెళ్లిన డాలరు పెట్టుబడులన్నీ మళ్లీ స్వదేశానికొచ్చే అవకాశాలుండటమే ఇందుకు కారణం. అరుుతే ట్రంప్ గెలిస్తే ఫైనాన్షియల్ మార్కెట్లు తాత్కాలికంగా అతలాకుతలమయ్యే ప్రమాదం ఉంటుంది. రష్యా వంటి ఒకటి రెండు దేశాలు మినహా ప్రపంచవ్యాప్తంగా అన్ని మార్కెట్లూ కరెక్షన్కు గురవుతారుు. పరిస్థితులు దిగజారుతాయి కనక డిసెంబర్లో ఫెడ్ వడ్డీ రేట్లు పెంచే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. దాంతో డాలరు బలహీనపడుతుంది. బంగారం ధర పెరుగుతుంది. కానీ ఇది భారత్ స్టాక్ మార్కెట్‌కు దీర్ఘకాలంలో అంత సమస్యాత్మకమేమీ కాదని విశ్లేషకులు వాదిస్తున్నారు. ఎందుకంటే భారత్, ఇండోనేషియా వంటి మార్కెట్లు సొంత వృద్ధిని దృష్టిలో పెట్టుకుని పెరుగుతున్నాయని, అందుకని వీటికి సమస్యలొచ్చినా అవి తాత్కాలికమేనని వారు చెబుతున్నారు. వడ్డీ రేట్ల పెరుగుదలే పెద్ద రిస్క్.... గతేడాది ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పావుశాతం పెంచాక రెండు నెలలపాటు మన మార్కెట్ 20 శాతం వరకూ పడిపోరుుంది. ఇక్కడి నుంచి విదేశీ ఇన్వెస్టర్లు రూ.40,000 కోట్లకుపైగా నిధుల్ని ఉపసంహరించుకోవటమే ఇందుకు కారణం. ఈ డిసెంబర్లో రేట్లు పెరిగితే మరింత భారీగా నిధులు మన మార్కెట్ నుంచి తరలివెళ్లే అవకాశాలుంటాయి. విదేశీ ఇన్వెస్టర్లు గడిచిన రెండేళ్లుగా ఇండియాలో ఈక్విటీ కంటే డెట్ మార్కెట్లోనే అత్యధికంగా పెట్టుబడి పెట్టారు. అమెరికాలో రేట్లు పెరిగితే... వారికి ఇక్కడ బాండ్ల నుంచి వచ్చే కరెన్సీ రిస్క్‌తో కూడిన 7-8 శాతం రాబడి ఆకర్షణీయంగా కనిపించదు. పైగా అమెరికా బాండ్లు ఆకర్షణీయంగా మారతారుు. దాంతో ఇక్కడి డెట్ మార్కెట్ నుంచి డాలరు నిధుల్ని వారు తరలించుకుపోయే ప్రమాదం ఉటుంది. . కానీ ట్రంప్ గెలిస్తే ఫెడ్ రేట్ల పెంపు భయం ఉండదని, దాంతో తాత్కాలికంగా స్టాక్ మార్కెట్ పడిపోరుునా, మధ్యకాలికంగా తిరిగి పుంజుకుంటుందని, నిధులు తరలివెళ్లే ప్రమాదం ఉండదని విశ్లేషకులు చెబుతున్నారు. ఎవరు గెలిస్తే ఏమవుతుందో.. అమెరికన్ స్టాక్స్ ట్రంప్ గెలిస్తే: పతనం కావచ్చు. హెచ్చుతగ్గులు పెరుగుతాయి. ఫైనాన్షియల్ స్టాక్స్ దెబ్బతింటాయి. దీర్ఘకాల ఇన్ఫ్రా షేర్లు బాగుంటాయి. హిల్లరీ గెలిస్తే: ఈ మధ్య జరిగిన పతనాన్ని పూడుస్తూ ర్యాలీ జరగొచ్చు. బ్యాంకులు, ఫార్మా సంస్థలు నియంత్రణ భయాలతో దెబ్బతినొచ్చు. అమెరికన్ డాలర్ ట్రంప్: రక్షణాత్మక వాదం కారణంగా అభివృద్ధి చెందిన స్విస్ ప్రాంక్, జపాన్ యెన్ వంటి కరెన్సీలతో పోలిస్తే పడిపోవచ్చు. కానీ పన్ను రాయితీలు, వ్యయం పెరిగితే మెల్లగా కోలుకోవచ్చు. హిల్లరీ: అభివృద్ధి చెందిన కరెన్సీలతో పోలిస్తే పెరగొచ్చు. రూపాయి వంటి వర్థమాన దేశాల కరెన్సీలతో పోలిస్తే పెద్దగా మార్పు ఉండదు. కమోడిటీలు ట్రంప్: అందరూ ఇటే చూస్తారు కనక బంగారం, ఇతర విలువైన లోహాలు బాగా పెరుగుతాయి. ఇరాన్ వ్యతిరేక వైఖరితో చమురు ధరలు స్థిరంగా ఉండొచ్చు. బొగ్గుకు అనుకూల వైఖరి గ్యాస్‌కు మంచిదికాదు. హిల్లరీ: చమురు, బొగ్గుకు హిల్లరీ విధానాలు ఏమంత అనుకూలం కావు. సంప్రదాయేతర ఇంధన వనరులకు మంచి రోజులొస్తారుు. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు ట్రంప్: వాణిజ్య ఒప్పందాలపై దాటవేత వైఖరి వల్ల రష్యాకు తప్ప ఇతర దేశాల మార్కెట్లకు ప్రతికూలమే. పటిష్ఠ ఆర్థిక వ్యవస్థల కారణంగా ఇండియా వంటి మార్కెట్లకు పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. హిల్లరీ: రిస్కుతో కూడిన ఇన్వెస్ట్మెంట్లవైపు మరిన్ని అమెరికన్ కంపెనీలు మొగ్గు చూపుతాయి. విదేశీ మార్కెట్లలో సానుకూల పరిస్థితి ఉంటుంది. -
‘అగ్ర’ పీఠం కోసం నువ్వా.. నేనా?
నేడే అమెరికా అధ్యక్ష ఎన్నికలు అమెరికా చరిత్రలోనే అత్యంత విద్వేషపూరిత ఎన్నికల ప్రచారం ఇప్పటికే ఓటు హక్కు వినియోగించుకున్న 4.2 కోట్ల మంది - ఫలితం తారుమారు చేయనున్న స్వింగ్ స్టేట్స్ - ఫ్లోరిడా, ఒహయో, న్యూహ్యాంప్‌షైర్, నెవడా, పెన్సిల్వేనియా, వర్జీనియాలపై ఆసక్తి - తాజా సర్వేలో హిల్లరీకి 292 ఎలక్టోరల్ ఓట్లు; నేనే గెలుస్తా: ట్రంప్ వాషింగ్టన్: పరస్పర ఆరోపణలు... విద్వేష ప్రసంగాల మధ్య అమెరికన్లకే అసహ్యం పుట్టించేలా సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం ముగిసింది. శ్వేతసౌధ అధిపతిని ఎన్నుకునే అధ్యక్ష ఎన్నికలు నేడు జరగనున్నాయి. చివరి నిమిషం వరకూ డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్‌లు ప్రచారంలో కత్తులు దూసుకున్నారు. ట్రంప్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు, జాతి వ్యతిరేక వ్యాఖ్యల్ని హిల్లరీ అస్త్రాలుగా చేసుకోగా, ఈమెరుుల్ వివాదంలో ఆమె దోషి అని ట్రంప్ విరుచుకుపడ్డారు. దేశాధ్యక్ష ఎన్నికల చరిత్రలో ఇంత వివాదాస్పద, విద్వేషపూరిత ప్రచారం ఎన్నడూ జరగలేదన్నది విశ్లేషకుల, సర్వేల అభిప్రాయం. చివరి నిమిషంలో హిల్లరీ వర్గానికి ఎఫ్‌బీఐ ఊరట నిస్తూ.. ఈమెరుుల్ వివాదంలో ఎలాంటి క్రిమినల్ కేసులు పెట్టబోమంది. ఈఎన్నికల్లో హిల్లరీ గెలిస్తే దేశాధ్యక్ష పదవిని చేపట్టిన తొలి మహిళ అవుతారు. ట్రంప్ గెలిస్తే అత్యధిక వయసున్న అధ్యక్షుడిగా రికార్డు సృష్టిస్తారు. ఇప్పటికే 4.2 కోట్ల మంది ముందస్తుగా ఓటేశారు. నార్త్ కరోలినాలో హిల్లరీ, మిచిగన్‌లో ట్రంప్: తన చివరి ప్రచారాన్ని హిల్లరీ సోమవారం అర్ధరాత్రి(భారత కాలమానం మంగళవారం మధ్యాహ్నం) నార్త్ కరోలినాలో ముగిస్తుండగా.. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మిచిగన్‌లోని గ్రాండ్ రాపిడ్స ప్రచారానికి ముగింపు పలుకుతారు. అమెరికా గుర్తింపును నాశనం చేస్తోన్న విదేశీ శక్తుల్ని వెనక్కి పంపేందుకు ఈ ఎన్నికలు చివరి అవకాశమని ట్రంప్ అమెరికన్లకు విజ్ఞప్తి చేశారు. మహిళలు, మైనార్టీల సమానత్వం దిశగా దేశ ప్రయాణం ప్రమాదంలో పడొచ్చని హిల్లరీ హెచ్చరించారు. స్వింగ్‌స్టేట్స్‌లో మాదేగెలుపు: ట్రంప్ ఫలితాన్ని నిర్ణరుుంచే రాష్ట్రాల్లో రిపబ్లికన్ ఆధిక్యంలో ఉందని, శ్వేతసౌధంలో తన ప్రవేశానికి రంగం సిద్ధమైందని సోమవారం ప్రచారంలో ట్రంప్ పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలు మీడియా, పోల్ సంస్థల్ని ఆశ్చర్యపర్చడం ఖాయమన్నారు. ‘మనం గెలవబోతున్నాం. కొలరాడోలో గెలుస్తాం. నెవెడాలో పరిస్థితి ఆశాజనకంగా ఉంది. నార్త్ కరోలినా, వర్జీనియాలో మన పార్టీ పుంజుకుంది. ఫ్లోరిడాను గెలవబోతున్నాం’ అని అని అన్నారు. చివరి రెండు రోజుల్లో ట్రంప్ అయోవా, కొల రాడో, మిన్నియాపొలిస్, మిచిగన్, పెన్సిల్వేనియాలో ర్యాలీలు నిర్వహించారు. హిల్లరీ పెన్సిల్వేనియా, ఒహయో, న్యూ హ్యాంప్‌షైర్ ప్రచారంలో పాల్గొన్నారు. భారతీయ ఉద్యోగులపై ట్రంప్ అక్కసు..అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ పలు వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచారు. ముస్లింలు అమెరికాలో ప్రవేశించకుండా తాత్కాలిక నిషేధం విధించాలని, మెక్సికో సరిహద్దు వెంట గోడ కట్టాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వలసవాదుల్ని రేపిస్టులు, నేరస్తులుగా చిత్రీకరించారు. 2005 నాటి వీడియాలో మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడి తీవ్ర దుమారం సృష్టించారు. ఈ వివాదం వెలుగులోకి వచ్చాక... 12 మంది మహిళలు ట్రంప్‌కు వ్యతిరేకంగా లైంగిక ఆరోపణలు చేస్తూ తెరపైకి వచ్చారు. ఇక సొంత పార్టీలోనే అనేక మంది ట్రంప్‌కు మద్దతివ్వలేదు. అమెరికా ఎన్నికల్లో రిగ్గింగ్ జరుగుతోందని, ఎన్నికల ఫలితం వెలువడ్డాకే... దాన్ని అంగీకరించాలా? లేదా? అన్నది స్పష్టం చేస్తానంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. ఆదివారం కూడా ట్రంప్ భారత ఉద్యోగులపై అక్కసు వెళ్లగక్కారు. మిన్నియాపొలిస్‌లో మాట్లాడుతూ... ఐబీఎం 500 మంది ఉద్యోగుల్ని తొలగించి భారతీయ, ఇతర దేశాల ఉద్యోగుల్ని నియమించుకుందని ఆరోపించారు. తాను అధ్యక్షుడినైతే అలాంటి కంపెనీలపై 35 % పన్ను విధిస్తానని హెచ్చరించారు. ఫ్లోరిడాలో, ఒహయో, న్యూహ్యాంప్‌షైర్ ఫలితాలపై ఆసక్తి అమెరికాలో పోలింగ్ (ఈస్ట్రన్ టైం జోన్ రాష్ట్రాల్లో) భారత కాలమానం ప్రకారం నవంబర్ 9 ఉదయం 6 గంటలకు ముగుస్తుంది. అలాస్కాలో నవంబర్ 9 మధ్యాహ్నం 12.30 గంటలకు ముగుస్తుంది. జార్జియా, సౌత్ కరోలినా, వెర్మాంట్, ఇండియానా, కెంటకీల్లో నవంబర్ 9వ తేదీ ఉదయం 6 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. మొదటి ఫలితం జార్జియా నుంచి వెలువడే అవకాశముంది. ఆ రాష్ట్రంలో రిపబ్లికన్‌స ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అరగంట అనంతరం ... ఒహయో, నార్త్ కరోలినా ఫలితాలు వస్తారుు. ఒహయోలో హిల్లరీ స్వల్ప ఆధిక్యంలో ఉండగా... నార్త్ కరోలినాలో రిపబ్లికన్లు కొద్దిపాటి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అసలు ఆసక్తి అంతా ఫ్లోరిడాపైనే. ఏదైనా తేడా జరిగితే తప్ప ఈ రాష్ట్రం ఎవరి ఖాతాలోకి వెళ్తే వారే అమెరికా అధ్యక్షుడు అవడం ఖాయం. న్యూ హ్యాంప్‌షైర్ ఫలితం కూడా ఆసక్తి కలిగించేదే. మొదటి నుంచి డెమోక్రాట్లకు పట్టున్న ఈ రాష్ట్రంలో హోరాహోరీ పోరు నెలకొంది. అరిజోనా, టెక్సాస్ ఫలితాలు మాత్రం హిల్లరీకి నిరాశ కలిగించడం ఖాయం. డెమోక్రాట్లకు పట్టున్న కొలొరాడో, మిచిగన్, విస్కాన్సన్‌లు ట్రంప్ ఖాతాలోకి వెళ్లే అవకాశాలున్నారుు. హిల్లరీనే విజేత: సర్వే ఎన్నికలకు రెండ్రోజుల ముందు నిర్వహించిన పోల్స్ హిల్లరీనే విజేతగా తేల్చేశారుు. నవంబర్ 7న ఫైవ్థర్జీఎరుుట్ వెబ్సైట్ పోల్ ప్రకారం హిల్లరీకి 65.3 శాతం గెలుపు అవకాశాలున్నారుు. మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లలో హిల్లరీకి 292, ట్రంప్‌కు 245 ఓట్లు వస్తాయి. సీబీఎస్ న్యూస్ సర్వే ప్రకారం హిల్లరీకి 45 శాతం, ట్రంప్‌కు 41 శాతం మద్దతు పలికారు. ఇక రియల్క్లియర్ పాలిటిక్స్ సరాసరి పోల్స్‌లో హిల్లరీ కంటే ట్రంప్ 2 పారుుంట్లు వెనకబడ్డారు. ట్రంప్‌కు 245 ఓట్లు వస్తారుు. హిల్లరీకీ 48.3 శాతం, ట్రంప్‌కు 45.4 శాతం పాపులర్ ఓట్లు వస్తాయని వెబ్సైట్ పేర్కొంది. హిల్లరీకి ఎఫ్‌బీఐ తీపి కబురు అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరొక రోజు సమయం ఉందనగా హిల్లరీ క్లింటన్‌కు ఎఫ్‌బీఐ తీపి కబురు అందించింది. ఈమెరుుల్ వివాదంలో అమెపై క్రిమినల్ నేరారోపణ అవసరం లేదని తేల్చిచెప్పింది. కొత్తగా వెలుగుచూసిన ఈమెరుుల్స్ క్షుణ్నంగా పరిశీలించాక ఈ నిర్ణయం ప్రకటించింది. దీంతో అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీకి గెలుపు మరింత సులభం కానుంది. ఎఫ్‌బీఐ డైరక్టర్ జేమ్స్ బి కోమే వివరాలు వెల్లడిస్తూ...‘మా సమీక్ష ప్రకారం.. జూలైలో మేం వెల్లడించిన అభిప్రాయాన్ని ప్రస్తుతం మార్చుకోలేదు. 24 గంటలూ మా సిబ్బంది పనిచేసి మొత్తం ఈమెరుుల్స్ను పరిశీలించారు. క్రిమినల్ నేరం మోపాల్సిన వివరాలేమీ దొరకలేదు’ అని పేర్కొన్నారు. ఈ పరిణామంతో క్లింటన్ శిబిరం ఆనందంలో మునిగిపోరుుంది. 2 వారాల క్రితం హిల్లరీ తాజా ఈమెరుుల్స్ వివాదంతో ఒక్కసారిగా ఆమె ఆధిక్యం తగ్గిపోరుుంది. ఒక దశలో ట్రంప్ హోరాహోరీ పోరు ఇచ్చారు. ఎఫ్‌బీఐ తాజా ప్రకటనను రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తప్పుపడుతూ హిల్లరీని కాపాడుతున్నారని ఆరోపించారు. ఎఫ్‌బీఐ నిర్ణయాన్ని నమ్మలేకపోతున్నానని, ఇంత తక్కువ సమయంలో 6.5 లక్షల మెరుుల్స్ను ఎలా పరిశీలించారంటూ ప్రశ్నించారు. హిల్లరీ దోషి అని, అది ఆమెకు, ఎఫ్‌బీఐకు తెలుసని చెప్పారు. -
హిల్లరీకి క్లీన్చిట్: భారీలాభాల్లో స్టాక్ మార్కెట్లు
అమెరికా అధ్యక్ష ఎన్నికల డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు క్రిమినల్ నేరారోపణల నుంచి భారీ ఊరట కల్పిస్తూ.. ఎఫ్‌బీఐ క్లీన్ చిట్ ఇవ్వడంతో ఇన్నిరోజులు నష్టాల్లో నడిచిన దేశీయ స్టాక్ సూచీలు సోమవారం ఒక్కసారిగా భారీ లాభాల్లో ఎగిశాయి. 280 పాయింట్లకు ఎగిసిన సెన్సెక్స్, ప్రస్తుతం 239 పాయింట్ల లాభంతో 27,513వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ సైతం 77 పాయింట్ల లాభంతో 8510గా ట్రేడ్ అవుతోంది. హిల్లరీ ప్రైవేట్ ఈ-మెయిల్ వాడకంపై పునఃవిచారణ చేపట్టిన ఎఫ్‌బీఐ, అమెరికా అధ్యక్ష ఎన్నికల చివరి దశలో ఆమెకు భారీ ఊరటనిచ్చింది. నేరారోపణల నుంచి హిల్లరీని బయటపడేసింది. దీంతో ట్రంప్ గెలుస్తాడనే ఊహాగానాలకు చెక్ పడింది. ట్రంప్ గెలుపు అవకాశాలతో ఆటుపోట్లకు గురైన స్టాక్ మార్కెట్లు ఎఫ్‌బీఐ ప్రకటనతో మళ్లీ హిల్లరీ గెలిచే అవకాశం ఉందన్న అంచనాకు వచ్చాయి. దీంతో అటు అమెరికన్ స్టాక్ మార్కెట్లు, ఇటు ఆసియన్ మార్కెట్లు, దేశీయ సూచీలు లాభాల బాట పట్టాయి. ఈ ప్రకటనతో మెక్సికన్ పెసో భారీగా లాభపడింది. రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదిత విధానాలు ఆ దేశానికి ప్రతికూలంగా మారాయి. ఎఫ్‌బీఐ క్లీన్ చీట్‌తో హిల్లరీ గెలుపుకు మళ్లీ అంచనాలు బలపడి, మెక్సికన్ పెసో 1-1/2 వారాల గరిష్టానికి జంప్ అయింది. దేశీయ స్టాక్ మార్కెట్లో లుపిన్ 7 శాతం పెరిగింది, అదేవిధంగా సన్ ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్బీఐ, అదానీ పోర్ట్స్ లాభాల్లో నడుస్తున్నాయి. బలమైన క్యూ2 ఫలితాలతో పీఎన్బీ షేర్ 5 శాతం ఎగిసింది. అయితే దేశీయ కరెన్సీ రూపాయి, డాలర్ మారకం విలువతో పోల్చుకుంటే 4 పైసలు బలహీనపడింది. శుక్రవారం 66.70గా ముగిసిన రూపాయి, నేటి ట్రేడింగ్‌లో 66.74గా ప్రారంభమైంది. అమెరికా ఎకనామిక్ డేటా, డాలర్ ఇండెక్స్ రూపాయి బలపడటానికి సహకరించవచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. -
ఎన్నికల ముందు హిల్లరీకి భారీ ఊరట
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న హిల్లరీ క్లింటన్‌కు చిట్టచివరి నిమిషంలో భారీ ఊరట లభించింది. ఆమె గతంలో విదేశాంగ శాఖ మంత్రిగా ఉండగా ప్రైవేటు ఈ మెయిల్ వాడారన్న విషయమై విచారణ పూర్తయిందని.. హిల్లరీపై తాము ఎలాంటి నేరారోపణలు చేయబోవడం లేదని ఎఫ్‌బీఐ డైరెక్టర్ జేమ్స్ కామీ తెలిపారు. దాంతో పోలింగ్‌కు మరొక్కరోజు ఉందనగా హిల్లరీకి ఇది భారీ ఊరటగా భావించవచ్చు. కాంగ్రెస్‌లోని కీలక సభ్యులకు ఈ మేరకు కామీ వర్తమానం పంపారు. మొత్తం ఈ మెయిళ్లను పరిశీలించేందుకు ఎఫ్‌బీఐ బృందం రోజుకు 24 గంటలూ పనిచేసిందని, చివరకు తాము జూలై నెలలో వ్యక్తపరిచిన అభిప్రాయంలో లెఆంటి మార్పు లేదని ఆయన అన్నారు. ప్రచారంలో చిట్టచివరిగా ముగిసిన 48 గంటల సమయంలో ఎఫ్‌బీఐ విచారణ లేకపోవడంపతో హిల్లరీ క్లింటన్‌కు ఇది మంచి ఆయుధంగా మారింది. ఒకవేళ హిల్లరీ ఈ ఎన్నికల్లో గెలిచి అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపడితే.. ఆ తర్వాత కూడా కొన్నాళ్ల పాటు ఆమెతో కలిసి ఎఫ్‌బీఐ డైరెక్టర్ జేమ్స్ కామీ పనిచేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేరారోపణలు మోపితేప తర్వాత ఇద్దరి మధ్య సయోధ్య ఎలా కుదురుతుందోనన్న అనుమానాలు సైతం వ్యక్తమయ్యాయి. కానీ కామీ తాజా ప్రకటన పుణ్యమాని ఇప్పుడు ఇక ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా పోయింది. ఇప్పుడు తాము సమర్పించింది మధ్యంతర నివేదిక ఏమీ కాదని, దర్యాప్తు మొత్తం పూర్తయిపోయినట్లేనని కూడా కామీ స్పష్టం చేయడంతో ఈ విషయంలో హిల్లరీ ఊపిరి పీల్చుకున్నారు. నిజానికి అక్టోబర్ 28వ తేదీన కామీ చేసిన ఒక ప్రకటనతో ఒక్కసారిగా డోనాల్డ్ ట్రంప్ ఆధిక్యం పెరిగింది. అంతకుముందు వరకు ట్రంప్ మీద స్పష్టమైన ఆధిక్యంలో ఉన్న హిల్లరీ క్లింటన్.. ఒక్కసారిగా కొంత వెనకబడ్డారు. ఒకానొక దశలో ట్రంప్ ఒకటి రెండు పాయింట్ల ఆధిక్యంలోకి కూడా వచ్చారు. ఇప్పుడు తాజాగా ఎఫ్‌బీఐ డైరెక్టర్ క్లీన్ చిట్ ఇవ్వడంతో హిల్లరీ మళ్లీ స్పష్టమైన ఆధిక్యం సాధించే అవకాశం కనిపిస్తోంది. -
అమెరికా పీఠం ఎవరిది?
రేపే అగ్రరాజ్య అధ్యక్ష ఎన్నికలు - హిల్లరీ, ట్రంప్ భవితవ్యం తేల్చనున్న 15 కోట్లకు పైగా ఓటర్లు - గెలవాలంటే 270 ఎలక్టోరల్ ఓట్లు తప్పనిసరి - కాలిఫోర్నియాలో 55, మరో 8 రాష్ట్రాల్లో మూడేసి ఎలక్టోరల్ ఓట్లు - ఒహయోలో గెలిచిన వారిదే అధ్యక్ష పీఠం! - భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటలకు ఓటింగ్ ప్రారంభం - 9వ తేదీ మధ్యాహ్నంకల్లా పూర్తి ఫలితం సాక్షి, నేషనల్ డెస్క్: రేపే అమెరికా అధ్యక్ష ఎన్నికలు... మొత్తం 12 కోట్ల మంది అమెరికన్లు డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ల భవితవ్యం తేల్చనున్నారు. ఇప్పటికే దాదాపు 3.7 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నడూ లేనంతగా ఈసారి పోటీ రసవత్తరంగా ఉండడంతో చివరి నిమిషం వరకూ ఫలితాన్ని నిర్ణయించే రాష్ట్రాల్లో ఇద్దరు అభ్యర్థులు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. వారం క్రితం వరకూ పోరు హోరాహోరీ అంటూ సర్వేలు ప్రకటించగా... తాజాగా హిల్లరీ ఆధిక్యంలోకి వచ్చారు. అక్టోబర్ మధ్య వరకూ హిల్లరీ రెండంకెల పాయింట్ల ఆధిక్యంలో దూసుకుపోయారు. ఎఫ్‌బీఐ ఈమెయిల్ వివాదంతో ఆధిక్యం కాస్తా ఒకటి, రెండు పాయింట్లకు పడిపోయింది. అంతవరకూ ట్రంప్ ఓటమి తప్పనిసరన్న సర్వేలు ఈ ఎన్నికలు సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తాయంటూ ప్రకటించాయి. ఎక్కువ ఓట్లు పడ్డ పార్టీకే మొత్తం సీట్లు అమెరికా అధ్యక్ష పీఠం అధిరోహించాలంటే అభ్యర్థి తప్పకుండా 270 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు సాధించాలి. అమెరికాలో మొత్తం 538 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉన్నాయి. 4 కోట్ల జనాభా ఉన్న కాలిఫోర్నియాకు 55, టెక్సాస్ 38, న్యూయార్క్, ఫ్లోరిడాలకు 29 చొప్పున ఓట్లు ఉండగా... 10 లక్షలు ఆ లోపు జనాభా ఉన్న మోంటానా, అలాస్కా, డెలావేర్, వాషింగ్టన్ డీసీ తదితర రాష్ట్రాలకు 3 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. అమెరికా కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభ సభ్యులు(435 మంది), సెనేట్ ప్రతినిధుల(100) సంఖ్య మొత్తం 535.. వాటి ఆధారంగా ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు నిర్ణయించారు. డిస్ట్రిక్ ఆఫ్ కొలంబియా నుంచి ముగ్గురు ఎలక్టోరల్స్ కలవడంతో మొత్తం ఓట్లు 538 అవుతాయి. ఒక రాష్ట్రంలో ఏ పార్టీ పాపులర్ ఓటు(ఎక్కువ ఓట్లు) సాధిస్తే మొత్తం ఎలక్టోరల్ సీట్లు ఆ పార్టీకి సొంతమవుతాయి. తేడా 3 గంటలు.. అమెరికాలో 9 టైమ్ జోన్లు(కాలమానాలు) ఉన్నాయి. అట్లాంటిక్ సముద్రతీరం ప్రాంత రాష్ట్రాలైన పెన్సిల్వేనియా, న్యూహ్యాంప్‌షైర్, జార్జియా, నార్త్, సౌత్ కరోలినా, మసాచుసెట్స్, మిచిగన్, న్యూజెర్సీ, న్యూయార్క్ తదితర రాష్ట్రాలు ఈస్ట్రన్ టైమ్ జోన్లో ఉంటే... ఇలినాయ్, ఫ్లోరిడా, కెంటకీ, టెక్సాస్ వంటి రాష్ట్రాలు సెంట్రల్ టైమ్ జోన్లో ఉన్నాయి. కీలక రాష్ట్రాలైన కాలిఫోర్నియా, నెవెడాలు పసిఫిక్ టైం జోన్లో, అరిజోనా, కొలరాడో, నెబ్రాస్కా, కాన్సాస్‌లు మౌంటెన్ టైమ్ జోన్లో ఉన్నాయి. అలాస్కా, హవాయ్‌లకు వేర్వేరు టైమ్ జోన్లు ఏర్పాటు చేశారు. ఒక్కో టైమ్ జోన్‌కు మధ్య గంట తేడా ఉంటుంది. న్యూయార్క్‌లో ఉదయం 10 గంటలైతే లాస్‌ఏంజెలిస్‌లో ఉదయం 7 గంటలు. న వంబర్ 8 న ఈస్ట్రన్ టైమ్ జోన్లో ఉదయం 6 గంటలకు(భారత కాలమానం సాయంత్రం 5 గంటలు) ఎన్నికలు ప్రారంభమవుతాయి. సెంట్రల్ టైమ్ జోన్ రాష్ట్రాల్లో(రాత్రి 6 గంటలు), మౌంటెన్ టైమ్ జోన్లో(రాత్రి 7 గంటలకు), పసిఫిక్ టైమ్ జోన్లో(రాత్రి 8 గంటలకు) ఎన్నికలు మొదలవుతాయి. కెంటకీ, ఇండియానాల్లో ఎన్నికలు ముందుగా ముగుస్తాయి. అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయినా మంచు ప్రాంతం అలాస్కాలో పోలింగ్ కొనసాగుతూనే ఉంటుంది. తొలి ఫలితం న్యూ హ్యాంప్‌షైర్‌లోని డిక్స్‌విల్లే నోచ్‌లో నవంబర్ 8 ఉదయం 10.30కే (భారత కాలమానం రాత్రి 9 గంటలు) వెల్లడవుతుంది. అక్కడ 12 మంది ఓటర్లే ఉన్నారు.9న ఉదయం 6 గంటల(భారత కాలమానం) నుంచి ఎగ్జిట్ పోల్స్‌తో పాటు కౌంటింగ్ ప్రాంరభమవుతుంది. 10 గంటలకు ఫలితంపై ఒక అంచనా వస్తుంది. మధ్యాహ్నానికి పూర్తి ఫలితాలు వెల్లడి అవుతాయి. ఫ్లోరిడా, ఒహయో, పెన్సిల్వేనియా, న్యూ హ్యాంప్‌షైర్, మిన్నెసొటా, అయోవా, మిచిగన్, కొలరాడో, నార్త్ కరోలినా, నెవడా, విస్కాన్సన్‌లు ఫలితాన్ని తారుమారు చేసే(స్వింగ్) రాష్ట్రాలుగా భావిస్తున్నారు. ఒహయో రాష్ట్రంలో గెలవకుండా ఇంతవరకూ ఏ రిపబ్లికన్ అభ్యర్థి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలవలేదు. డెమోక్రాట్ల నుంచి జాన్ ఎఫ్ కెనడీ ఒకరే దీనికి మినహాయింపు. అందుకే అభ్యర్థులు దీనిపై ఎక్కువ దృష్టిపెడతారు. ఎలక్టోరల్స్ అంటే... పార్టీలు ముందుగానే ప్రతి రాష్ట్రంలో ఎలక్టోరల్ సంఖ్య ప్రకారం ప్రతినిధుల్ని నియమిస్తాయి. ఓటర్లు డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీలో దేనికి ఓటు వేసినా ఓట్లు ఎలక్టోరల్ సభ్యుల ఎంపికకు వేసినట్టే. తాము సూచించిన అభ్యర్థిని అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని ఎలక్టోరల్స్‌కు ఓటర్లు సూచిస్తున్నట్లు భావించాలి. ఉదాహరణకు కాలిఫోర్నియాలో డెమోక్రటిక్ పార్టీ పాపులర్ ఓటు(అత్యధిక ఓట్లు) సాధిస్తే అక్కడి మొత్తం 55 ఎలక్టోరల్స్ (డెమోక్రటిక్ ప్రతినిధులు) తుది అధ్యక్ష ఎన్నికల్లో తప్పకుండా హిల్లరీకే ఓటేయాలి. డిసెంబర్ రెండో బుధవారం తర్వాత వచ్చే సోమవారం రోజున అధ్యక్ష, ఉపాధ్యక్షుల్ని ఎలక్టోరల్స్ ఎన్నుకుంటారు. విజేతను జనవరి 2, 2017న ప్రకటిస్తారు. జనవరి 20న అధికారికంగా ఎన్నికైన అభ్యర్థి దేశాధ్యక్ష బాధ్యతలు చేపడతారు. అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 8నే పూర్తయినా... జనవరి 6, 2017న ఉపాధ్యక్షుడు జో బిడెన్ ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల ఫలితం అధికారికంగా ప్రకటించాక ఎన్నిక ప్రక్రియ ముగుస్తుంది. ట్రంప్ సభలో కలకలం గన్ అరుపుతో అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు వేదికపై నుంచి ట్రంప్ తరలింపు రెనో: నెవడా రాష్ట్రం రెనోలో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆదివారం నిర్వహించిన ఎన్నికల సభలో కలకలం రేగింది. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఒక్కసారిగా ట్రంప్‌ను వేదిక నుంచి తీసుకుపోవడంతో ఏం జరుగుతుందో తెలియక ప్రజలు కంగారుపడ్డారు. సభలో పాల్గొన్న ఒక వ్యక్తి గన్ అని అరవడంతో సీక్రెట్ సర్వీసు ఏజెంట్లు అప్రమత్తమై ట్రంప్‌ను సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారు. పూర్తిగా తనిఖీలు చేశాక ఎలాంటి గన్ లేదని నిర్ధారించారు. అనంతరం సభ యథావిధిగా కొనసాగింది. పోలీసులు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించి వదిలిపెట్టారు. ఎన్నికలకు మరో రోజే సమయం ఉందనగా అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ పాల్ ర్యాన్.. ట్రంప్‌కు మద్దతు ప్రకటించారు. మరోవైపు భారతీయ అమెరికన్ల ఓట్లు పొందేందుకు ట్రంప్ కుమారుడు ఎరిక్.. ఫ్లోరిడా రాష్ట్రం ఆర్లాండోలోని హిందూ దేవాలయం సందర్శించి హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. హిల్లరీకి 4 శాతం ఆధిక్యం అధ్యక్ష ఎన్నికలకు మరొక్క రోజే సమయముందనగా నిర్వహించిన తాజా సర్వేలో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కంటే డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ నాలుగు శాతం ఆధిక్యంలో ఉన్నారు. వాల్‌స్ట్రీట్‌జర్నల్ / ఎన్బీసీ న్యూస్ పోల్ ప్రకారం 44 శాతం మంది హిల్లరీని సమర్థించగా, 40 మంది ట్రంప్‌కు మద్దతు పలికారు. మరో 6 శాతం లిబర్టేరియన్ అభ్యర్థి గ్యారీ జాన్సన్ వైపు మొగ్గు చూపారు. ఎన్నికల రోజు అమెరికా ఓటర్లను చంపేస్తాం: ఐసిస్ వాషింగ్టన్: ఈ నెల 8న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చే అమెరికన్ ఓటర్లను చంపేస్తామని ఐసిస్ ఉగ్రవాద సంస్థ హెచ్చరించింది. ముస్లింలు ఈ ఎన్నికల్లో పాల్గొనరాదని ఐసిస్ సూచించింది. ఈ మేరకు అమెరికాకు చెందిన ఎస్ఐటీఈ నిఘా బృందం డెరైక్టర్ రీటా కట్జ్ ట్విటర్లో తెలిపారు. ఐసిస్‌కు చెందిన అల్ హయత్ మీడియా సెంటర్ ఒక లేఖలో ఈ హెచ్చరికలు జారీ చేసినట్లు రీటా తెలిపారు. ఈ వ్యాసంలో ఓటర్లను ఉగ్రవాదులు చంపేస్తారని, బ్యాలట్ బాక్సులను ధ్వంసం చేస్తారని ఉన్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా ఐసిస్ ఈ వ్యాసంలో మతానికి సంబంధించి సుదీర్ఘ వివరణలు ఇస్తూ దాడులను సమర్థించుకుంది. ఇస్లాం, ముస్లింల పట్ల వ్యవహరించే తీరులో రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీల మధ్య పెద్ద తేడాలు లేవని తెలిపింది. న్యూయార్క్, వర్జీనియా, టెక్సాస్‌లలో దాడులు జరిగే అవకాశాలున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. -
హిల్లరీ ర్యాలీలకు జనం రావడంలేదు అందుకే..
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన పూర్తి సమయాన్ని హిల్లరీ క్లింటన్ ప్రచారం కోసమే ఉపయోగిస్తున్నారని ట్రంప్ విమర్శించారు. హిల్లరీకి ఏమాత్రం జనాకర్షణ లేదని అందుకే ఆమె ఒబామా సహాయం తీసుకుంటున్నారని ఫ్లోరిడాలోని టంపాలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ట్రంప్ ఎద్దేవా చేశారు. హిల్లరీ తనకోసం తాను ప్రచారం కూడా నిర్వహించుకోలేకపోతున్నారని.. ఆమె సొంతంగా నిర్వహించే ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో కేవలం 400 నుంచి 500 మంది ప్రజలు మాత్రమే పాల్గొంటున్నారని అన్నారు. అందుకే ఆమె ఒబామాపై ఆధారపడుతున్నారని ట్రంప్ విమర్శించారు. చివరి దశ ప్రచారపర్వంలో హిల్లరీకి మద్దతుగా కీలకమైన ఫ్లోరిడా, నార్త్ కరొలినా, పెన్సిల్వేనియా, న్యూ హాంప్‌షైర్ రాష్ట్రాల్లో ఒబామా ఉధృతంగా పర్యటిస్తున్న నేపథ్యంలో ట్రంప్ ఈ విమర్శలు చేశారు. మీడియా వ్యవహరిస్తున్న తీరుపట్ల కూడా ట్రంప్ విమర్శలు గుప్పించారు. తన ప్రచారకార్యక్రమాలకు జనం తక్కువగా కనిపిస్తే మీడియా సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా హెడ్లైన్లలో వార్తలు ప్రచురిస్తాయని.. అదే హిల్లరీ విషయంలో మాత్రం అలా జరగటం లేదని ట్రంప్ అన్నారు. -
ఆ తొమ్మిది రాష్ట్రాలే కీలకం
- రెండు రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు - వరుస ర్యాలీలతో హోరెత్తిస్తున్న హిల్లరీ, ట్రంప్ తాజా సర్వేల్లో హిల్లరీకే ఆధిక్యం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోన్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు రెండ్రోజులే సమయముంది. ఇంతవరకూ జరిగిన ప్రచారం ఒక ఎత్తై ఈ రెండ్రోజుల ప్రచారం మరో ఎత్తు... 3 వారాల క్రితం వరకూ హిల్లరీ గెలుపు ఖాయమన్న సర్వేలు... తాజాగా పోరు హోరాహోరీ అని చెప్పడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. హిల్లరీకే కొద్దిపాటి ఆధిక్యం కట్టబెట్టినా చివరి నిముషం వరకూ ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ. దీంతో గెలుపు కోసం డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చివరి అస్త్రాలు ప్రయోగిస్తున్నారు. తమకు పట్టున్న రాష్ట్రాల్ని పక్కన పెట్టి... విజేతను నిర్ణయించే రాష్ట్రాలపై సర్వశక్తులు ఒడ్డుతున్నారు. - సాక్షి, నేషనల్ డెస్క్ 120 ఎలక్టోరల్ ఓట్లపై ఊగిసలాట ఫ్లోరిడా, ఒహయో, నెవెడా, పెన్సిల్వేనియా, మిచిగన్, కొలరాడో, వర్జీనియా, అయోవా, న్యూహ్యాంప్‌షైర్ రాష్ట్రాల్లో ఎక్కువ ఎవరు గెలిస్తే వారిదే అమెరికా అధ్యక్ష పీఠం. అన్ని రాష్ట్రాల్లో కలిపి 538 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉండగా ఈ 9 రాష్ట్రాల్లో 120 ఓట్లు ఉన్నాయి. దీంతో హిల్లరీ, ట్రంప్‌లు కీలక రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు, ర్యాలీలతో ఊదరగొట్టేస్తున్నారు. పెన్సిల్వేనియా, మిచిగన్, ఒహయోలపై హిల్లరీ ఆశలు పెట్టుకున్నారు. ట్రంప్ వర్గం కూడా న్యూ హ్యాంప్‌షైర్, ఒహయో, పెన్సిల్వేనియా తమదేనంటున్నారు. ఒహయోలో ట్రంప్, పెన్సిల్వేనియాలో హిల్లరీ!: కచ్చితమైన సర్వేలు ఇవ్వడంలో దిట్టైన రియల్ క్లియర్ పాలిటిక్స్ నవంబర్ 4న వెల్లడించిన వివరాల ప్రకారం... ఒహయోలో ట్రంప్ ఆధిక్యంలో ఉండగా... పెన్సిల్వేనియాలో హిల్లరీ మెజారిటీలో కొనసాగుతున్నారు. ఇప్పటికే ఒహయో, పెన్సిల్వేనియాలో ఇద్దరు అభ్యర్థులు వరుస ర్యాలీలు నిర్వహించారు. న్యూహ్యాంప్‌షైర్‌లో ట్రంప్, మిచిగన్‌లో హిల్లరీలు ప్రచారంతో హోరెత్తించారు. చివరి నాలుగు రోజుల్లో ప్రముఖ గాయకులు, సినీతారలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. శనివారం(భారత కాలమానం) ఒహయో, పెన్సిల్వేనియాలో హిల్లరీతో పాటు గాయకురాలు బేయోన్స్ అతని భర్త, గాయకుడు జే జెడ్‌లు పాల్గొన్నారు. యువతను, మైనారిటీల ఓటర్లను ఆకర్షించేందుకు క్లింటన్ శిబిరం పలువురు ప్రముఖులతో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ట్రంప్ మాత్రం వీటికి దూరంగా సొంతగానే ప్రచారం చేస్తున్నారు. ఊగిసలాటలో ఫ్లోరిడా ఓటరు అయితే ఇద్దరి అసలు లక్ష్యం ఫ్లోరిడా... 2000 సంవత్సరంలో అమెరికా అధ్యక్ష ఫలితాన్ని తారుమారు చేసింది కూడా ఈ రాష్ట్రమే... ఫ్లోరిడాలో మొత్తం 29 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. మంగళవారం జరిగే ఎన్నికల ఫలితాల్ని కూడా ఫ్లోరిడా నిర్ణయిస్తుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇంతవరకూ కచ్చితంగా ఈ రాష్ట్ర ఓటర్లు ఎవరివైపు మొగ్గుచూపలేదు. హిల్లరీ గెలవకపోయినా ఫ్లోరిడాలో ట్రంప్ గెలుపు తప్పనిసరి. ట్రంప్ గెలిస్తే అధ్యక్ష పీఠం ఖాయమని చెపుతున్నారు. చివరి రెండు రోజులు ట్రంప్, హిల్లరీలు ఈ రాష్ట్రంలో వరుస ర్యాలీల్లో పాల్గొంటారు. అలాగే నార్త్ కరోలినా, నెవెడాల్లో కూడా ట్రంప్ పర్యటిస్తారు. తాజా ఒపీనియన్ పోల్స్ ప్రకారం ఫ్లోరిడాలో ట్రంప్ బలం పెరిగినా హిల్లరీ కంటే వెనుకంజలోనే ఉన్నారు. రియల్ క్లియర్ పాలిటిక్స్ ప్రకారం... ఫ్లోరిడాలో హిల్లరీ కొద్దిపాటి ఆధిక్యంలో కొనసాగుతుండగా... ఫైవ్థర్టీఎయిట్ వైబ్‌సైట్ విశ్లేషణ మేరకు 52.4 శాతంతో ట్రంప్‌కు గెలుపు అవకాశాలున్నాయి. 2012 ఎన్నికల్లో ఫ్లోరిడాలో బరాక్ ఒబామా కేవలం 0.9 శాతం ఓట్లతో రిపబ్లికన్ మిట్ రోమ్నీపై గెలుపొందారు. ఫ్లోరిడాలో ట్రంప్‌కు వలస ఓటర్ల మద్దతు ఫ్లోరిడాలో ఎక్కువగా ఉండే లాటిన్ వలస ఓటర్ల మద్దతు హిల్లరీకి అత్యంత కీలకం. ఆ ఉద్దేశంతోనే ఫ్లోరిడా తమదేనని డెమోక్రాట్లు అంచనా వేశారు. వలసవాదులకు వ్యతిరేకంగా ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు తమకు కలిసొస్తాయని భావించారు. అయితే ఫ్లోరిడాలో కొద్దిమంది లాటిన్లు ట్రంప్ వైపు మొగ్గు చూపడం విశేషం. దాదాపు 16 శాతం మంది రిపబ్లికన్ పార్టీకి మద్దతిస్తున్నట్లు సమాచారం. మొదటి నుంచి ఫ్లోరిడాలో స్పానిష్ మాట్లాడే ప్రజల్లో ఎక్కువ మంది డెమోక్రాట్లే. క్యూబా వలస ఓటర్లు మాత్రం సంప్రదాయంగా రిపబ్లికన్ పార్టీకి ఓటేస్తున్నారు. ట్రంప్ భార్యపై ఆరోపణలు.. ట్రంప్ భార్య మెలేనియాపై తాజాగా ఆరోపణలు వెల్లవెత్తాయి. రెండు దశాబ్దాల క్రితం మోడలింగ్ చేసేందుకు అమెరికాలో అక్రమంగా కొద్ది కాలం ఉన్నట్లు కొన్ని పత్రాలు వెలుగు చూశాయి. ట్రంప్‌తో తనకున్న సంబంధాల వివరాలు వెల్లడిస్తే ప్లేబాయ్ పత్రిక మాజీ మోడల్‌కు అమెరికా టాబ్లాయిడ్ ద నేషనల్ ఎంక్వైరర్ రూ. కోటికి పైగా ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు మరో వివాదం వెలుగు చూసింది. ఆమెకే పట్టం! హిల్లరీ ఈమెయిల్స్ వివాదంతో ట్రంప్ ఆధిక్యంలోకి దూసుకొచ్చినా తాజా సర్వేలు, ఒపీనియన్ పోల్స్ మాత్రం హిల్లరీకే ఆధిక్యం కట్టబెట్టాయి. తాజాగా(నవంబర్ 5) ఫాక్స్ న్యూస్ నిర్వహించిన సర్వేలో రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ కంటే డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ రెండు పాయింట్ల ఆధిక్యంలో ఉన్నారు. ట్రంప్‌కు 43 శాతం, హిల్లరీకి 45 శాతం మంది మద్దతు పలికారు. వారం క్రితం ఫాక్స్ న్యూస్ సర్వేలో హిల్లరీ మూడు పాయింట్ల ఆధిక్యంలో కొనసాగగా... అక్టోబర్ మధ్యలో ఆ తేడా 6 పాయింట్లకు పైనే... ► సీఎన్ఎన్ తాజా పోల్ ప్రకారం హిల్లరీ 268 ఎలక్టోరల్ ఓట్లు గెలుచుకోవచ్చు. అమెరికా అధ్యక్ష పీఠం ఎక్కాలంటే 270 ఎలక్టోరల్ ఓట్లు అవసరం. ట్రంప్‌కు మాత్రం 204 ఎలక్టోరల్ ఓట్లే వస్తాయని తేల్చింది. మిగతా 66 ఓట్లకు హోరాహోరీ పోరు సాగవచ్చని పేర్కొంది. సీఎన్ఎన్ ప్రకారం అరిజోనా, ఫ్లోరిడా, నెవెడా, న్యూ హ్యాంప్‌షైర్, నార్త్ కరోలినా, ఒహయోలో పోటాపోటీ ఉంటుంది. గత రెండు వారాల్లో ట్రంప్ కొద్ది పాటి ఆధిక్యం సాధించారని సీఎన్ఎన్ వెల్లడించింది. ► ఇక రియల్ క్లియర్ పాలిటిక్స్ ప్రకారం... ట్రంప్ కంటే హిల్లరీ 1.6 శాతం ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ► న్యూయార్క్ టైమ్స్ అంచనా మేరకు క్లింటన్‌కు 67.8 శాతం గెలుపు అవకాశాలున్నట్లు తేలింది. ► బీబీసీ న్యూస్ ఇంతవరకూ నిర్వహించిన సర్వేల సరాసరిలో హిల్లరీనే ఆధిక్యంలో ఉన్నారు. హిల్లరీకి 46 శాతం, ట్రంప్‌కు 44 శాతం ఓట్లు దక్కాయి. ► హఫింగ్టన్ పోస్టు అంచనా ప్రకారం హిల్లరీకి 97.9 శాతం విజయావకాశాలుండగా, ప్రిన్స్టన్ ఎలక్షన్ కన్సార్టియం క్లింటన్‌కు భారీ మెజారిటీ కట్టబెట్టింది. ప్రముఖ సర్వే సంస్థలు ఫైవ్థర్టీఎయిట్, టాకింగ్పాయింట్మెమో(టీపీఎం)లు హిల్లరీకి 1 నుంచి 3 పాయింట్ల వరకూ ఆధిక్యం కట్టబెట్టాయి. -
పడమటి సంధ్యారాగం
సిటీబ్యూరో/బంజారాహిల్స్ : గ్రేటర్‌కు ఇప్పుడు అమెరికా ఎన్నికల ఫీవర్ పట్టుకుంది. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిని హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్‌పార్టీ అభ్యర్థి ట్రంప్‌ల మధ్య ఆసక్తికర పోటీ నెలకొనడంతో ఇక్కడ చర్చలు ఊపందుకున్నారుు. ఈ నెల 8వ తేదీన అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నగరంలో ప్రతినోటా ఇవే మాటలు వినిపిస్తున్నారుు. గ్రేటర్ నగరానికి అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధ మేంటీ అనుకుంటున్నారా..? నగరానికి చెందిన పలువురు సిటీజన్లకు సంబంధించిన బంధు మిత్రులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు వేలాదిగా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో దశాబ్దాల క్రితమే వెళ్లి స్థిరపడ్డారు. వారిలో పలువురు విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లోనే కాదు...పలు ప్రముఖ కంపెనీలకు సారథులుగానూ ప్రాచుర్యం పొందారు. వీరిలో చాలామందికి అక్కడ ఓటు హక్కు ఉంది. ఇక ఉభయ రాష్ట్రాలకు చెందిన మన తెలుగువారు ఇప్పుడు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ, ట్రంప్ గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థారుులోనే ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు నగరంలోని పలువురు ఎన్ఆర్ఐలు కూడా అక్కడికి పయనమయ్యారు. ఇప్పటికే నగరంలో నివసిస్తున్న పలువురు ఎన్ఆర్ఐలు తమ ఆబ్సెంటీ ఓటు(పోస్టల్ బ్యాలెట్ తరహా)ను వినియోగించుకోవడం విశేషం. ఈ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధి హిల్లరి క్లింటన్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ ప్రధానంగా పోటీ పడుతుండగా గత నెల రోజుల నుంచి ఆరోపణలు, ప్రత్యారోపణలతో ప్రచారం వేడెక్కింది. నగరంలోని ఎన్ఆర్ఐలే కాకుండా అమెరికాలో నివసిస్తున్న తెలుగువారు కూడా ఈ ఎన్నికలను అత్యంత ఆసక్తిగా గమనిస్తున్నారు. అమెరికాలో స్థిరపడిన తమ పిల్లలు, బంధు, మిత్రులు, శ్రేయోభిలాషులు ఫోన్లో, ఫేస్‌టైమ్ కాల్ చేసినపుడు..లేదా వాట్సప్ ..ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో చాటింగ్ చేసినపుడు ఇదే అంశంపై చర్చోపచర్చలు..విశ్లేషణలు జోరందుకున్నారుు. కొందరు ఏకంగా బెట్టింగ్‌లకు సైతం దిగుతున్నట్లు తెలుస్తోంది. మరికొందరు అమెరికా నుంచి వస్తున్న సమాచారాన్ని, ఎన్నికల విశ్లేషణలను, సర్వేలను గమనిస్తూ ఇప్పటికే తాము ఎవరికి ఓటు వేయాలో నిర్ణరుుంచుకొని ఆ మేరకు హైదరాబాద్ అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బాక్సులో తమ ఆబ్సెంటీ ఓటును వినియోగించుకోవడం విశేషం. మరికొందరు ఇప్పటికే అమెరికాకు చేరుకొని అక్కడ స్వయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని నిర్ణరుుంచుకొని బయలుదేరి వెళ్లారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటు హక్కు కలిగినవారు మన నగరంలో 3646 మంది ఉండగా ఇందులో 80 శాతం మంది తమ ఓటు హక్కును ఆబ్సెంటీ ఓటు విధానం ద్వారా వినియోగించుకున్నారు. మిగతావారు అమెరికాకు వెళ్లినట్లు సమాచారం. ఇదిలా ఉండగా అమెరికాలో అర్హత గల మొత్తం ఓటర్లు 21 కోట్ల 90 లక్షలుకాగా 2016 ఎన్నికల్లో ఓటు వేయడానికి రిజిష్టర్ చేసుకున్న ఓటర్లు మాత్రం 14 కోట్ల 63 లక్షల మంది ఉన్నారు. ఇందులో పురుషులు 69 శాతం కాగా, మహిళలు 73 శాతం ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఓటర్ల ట్రెండ్‌పై నగరానికి చెందిన పలువురు ఎన్ఆర్ఐల మనోగతం ఇలా ఉంది. హోరాహోరీ పోటీ... అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ, ట్రంప్‌లు హోరాహోరీగా తలపడనున్నారు. ఎవరు గెలిచినా స్వల్ప ఆధిక్యంతోనే అన్నది నా అంచనా. హిల్లరీ గెలిస్తే ప్రస్తుతం ఉన్న ఇమ్మిగ్రేషన్, పౌరసత్వం, ఉద్యోగ వీసాల నిబంధనలు యథావిధిగా కొనసాగే అవకాశం ఉందని భావిస్తున్నాం. ట్రంప్ గెలిస్తే ఈ విధానాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకోవడం తథ్యం. కొత్తగా ఉద్యోగాలు, చదువులకోసం .వచ్చే తెలుగువారికి స్వల్ప ఇబ్బందులు తప్పవు. రాజకీయంగా హిల్లరీకి సుదీర్ఘ అనుభవం ఉంది. ఎవరు గెలిచినా అమెరికాలో ఉద్యోగ ,వ్యాపార రంగాల్లో స్థిరపడిన తెలుగు వారి భవిష్యత్‌కు ఢోకా ఉండదని భావిస్తున్నాం. ఏసిరెడ్డి కరుణాకర్‌రెడ్డి, అమెరికా తెలుగు సంఘం(అటా)అధ్యక్షులు కలుపుకొని పోయేవారికే మద్దతు అమెరికా ఎన్నికల్లో కలుపుకొని పోయేవారికే మా మద్దతు ఉంటుంది. అరుుతే కొంత మంది పొగరుబోతు తనంతో దేశాన్ని విడగొట్టాలని చూస్తున్నారు. వారిని నివారించాలంటే అనుభవం ఉన్నవారికే ఓటు వేయాల్సి ఉంటుంది. ఇంకోవైపు అమెరికాలో ధనవంతులకు, పేదలకు మధ్య వ్యత్యాసం పెరుగుతుంది. దాన్ని తగ్గించే విధానాలను హిల్లరి తీసుకోనుంది. - శనన్, ఎన్ఆర్ఐ దేశాన్ని విడగొట్టేవారికి దూరం దేశాన్ని ఐక్యంగా ఉంచాల్సింది పోరుు విడగొట్టే మనస్తత్వం ఉన్న వారికి ఈ ఎన్నికల్లో జనం బుద్ది చెప్పనున్నారు. అమెరికా చరిత్రలోనే ఒక మహిళ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నది. అమెరికాకు మహిళ అధ్యక్షురాలు కావాలని కలలు కంటున్నవారికి ఇదొక మంచి అవకాశం. ట్రంప్‌కు నైతిక విలువలు ఎంత మాత్రం లేవు. మహిళల పట్ల గౌరవం అసలే లేదు. హిల్లరీకి దేశం ఐక్యంగా ఉండాలన్న లక్ష్యం ఉంది. - శ్యాం సుంకర, ఎన్ఆర్ఐ సమర్ధులకే మా ఓటు ఎన్నికల్లో స్వయంగా పాల్గొని ఓటు వేసేందుకు అమెరికాకు చేరుకున్నాం. అరుుతే ఓటు ఎవరికి వేసేది నిర్ణరుుంచుకోలేదు. దేశాన్ని సమైక్యంగా ఉంచి పేద, ధనికుల మధ్య తారతమ్యాన్ని తగ్గించి విద్య, వైద్యానికి పెద్దపీట వేసేవారికే ఎన్నికల్లో ఓటువేస్తాం. హిల్లరి క్లింటన్ కలిసి ఉంటేనే బలం అనే నినాదంతో ముందుకు వెళ్తుండగా ట్రంప్ మాత్రం అమెరికాకు పూర్వ వైభవం తీసుకొస్తాననే నినాదంతో ముందుకు వెళ్తున్నారు. ఇద్దరినీ గమనిస్తున్నాం. - ప్రీతి అందర్నీ గౌరవించే వారికే... అమెరికా ఎన్నికల్లో ఇప్పటికే మేం ఓటు వేశాం. అరుుతే అందరినీ గౌరవించేవారికే మద్దతు తెలిపాం. ఓ అభ్యర్ధి ఇతరులపట్ల చిన్నచూపు చూస్తున్నాడు. అలాంటివారికి ఈ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పే అవకాశం ఉంది. - పి.అనురాధ, ఎన్ఆర్ఐ ఇంకా నిర్ణరుుంచుకోలేదు ఈ నెల 8వ తేదీన జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేసేందుకు మేం నివసిస్తున్న గ్రీన్సబోరో సిటీకి చేరుకున్నాం. ఇంకా ఓటు ఎవరికి వేయాలన్నదానిపై నిర్ణయం తీసుకోలేదు. ఇద్దరి అభిప్రాయాలను గమనిస్తున్నాం. ఇద్దరిలో దేశానికి మంచి చేసేవారికి మద్దతు ఇవ్వాలని తలపెట్టాం. పోలింగ్‌రోజునే ఎవరికి ఓటు వేయాలో నిర్ణరుుంచుకుంటాం. - సురేందర్గుప్తా, ఎన్ఆర్ఐ అధ్యక్ష పదవికి ట్రంప్ తగని వ్యక్తి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి ట్రంప్ ఆ పదవికి ఎంత మాత్రం తగిన వ్యక్తి కాదు. నేనైతే హిల్లరి క్లింటన్కే మద్దతు తెలిపాను. ఇప్పటికే ఆబ్సెంటీ ఓటు హక్కు వినియోగించుకున్నాను. ఆమె ప్రచార నినాదం కలిసి ఉంటేనే బలం అన్నది నాకు బాగా నచ్చింది. బేదభావాలు లేకుండా ఉండాలన్నదే ఆమె ఆకాంక్ష. - పెనుమల్లి భాస్కర్‌రెడ్డి, ఎన్ఆర్ఐ హిల్లరీకి అనుభవమే ప్లస్.. రాజకీయ అనుభవంలో హిల్లరీ క్లింటన్‌దే ప్రత్యేకత. ఆమె అనుభవాలు అమెరికా అభివృద్ధికి దోహదపడతారుు. న్యూయార్క్ రాష్ట్రంలో సెనేటర్‌గా పని చేసినప్పుడు ఎంతో పేరుప్రఖ్యాతలు సంపాదించారు. విదేశీ వ్యవహారాల శాఖామంత్రిగా సమర్ధవంతంగా బాధ్యతలు నిర్వహించారు. పేదలకు, బడుగు, బలహీన వర్గాలకు మేలు చేసే లక్ష్యాన్ని పెట్టుకున్నారు. - ప్రతాప్, ఎన్ఆర్ఐ -
అమెరికా అధ్యక్ష ఎన్నికలో భారతీయులు ఎటు?
న్యూయార్క్: పాకిస్థాన్ అంటే హిల్లరీ క్లింటన్‌కు సానుభూతి. ఆ దేశానికి వందల కోట్ల డాలర్ల ఆర్థిక సహాయం అందించారు. భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్ ఉపయోగిస్తున్న సైనిక ఆయుధాలు హిల్లరీ ఇచ్చినవే. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వీసాను అడ్డుకునేందుకు కూడా ఆమె ప్రయత్నించారు. రిపబ్లికన్ల అభ్యర్థిగా అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ వర్గం రూపొందించిన టీవీ యాడ్ ప్రచారం ఇది. 38 సెకండ్ల నిడివిగల ఈ టీవీ యాడ్‌ను అమెరికాలోని భారతీయ టీవీ ఛానళ్లలో శుక్రవారం నుంచి విస్తృతంగా ప్రసారం చేస్తున్నారు. క్రుక్డ్ క్లింటన్, వోట్ ఫర్ రిపబ్లికన్, వోట్ ఫర్ యూఎస్-ఇండియా రిలేషన్స్ అనే టైటిల్‌తో ఈ యాడ్‌ను రిపబ్లికన్ హిందూ కొహలిషన్(రిపబ్లికన్ హిందూ మత కూటమి) రూపొందించింది. హిల్లరీ క్లింటన్ ప్రధాన సహాయకురాలు హుమా హబేదిన్కు పాకిస్థాన్ మూలాలు ఉన్నాయని, క్లింటన్ అధికారంలోకి వస్తే ఆమెనే అమెరికా సైనిక దళాల ప్రధానాధికారిని చేస్తారని, హిల్లరీ భర్త బిల్ క్లింటన్ కూడా భారత్‌లోని కాశ్మీర్‌ను పాకిస్థాన్‌కు ఇచ్చి వేయాలని కోరుకుంటున్నారని కూడా టీవీ యాడ్ ఆరోపణలు చేసింది. పాకిస్థాన్ భూభాగంలో భారత్ సర్జికల్ దాడులు జరిపిన నాటి నుంచి అమెరికన్ భారతీయుల్లో పాకిస్థాన్ పట్ల వ్యతిరేకత, మోదీ ప్రభుత్వం పట్ల సానుకూలత పెరిగింది. అమెరికన్ భారతీయ ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఈ అంశాన్ని బాగా ఉపయోగించుకోవాలని ఇటు డొనాల్డ్ ట్రంప్, ఆయనకు మద్దతిస్తున్న హిందూ వర్గం భావిస్తోంది. అందులో భాగంగా టీవీ యాడ్ల ద్వారా ఊదరగొడుతున్నారు. 2012 లెక్కల ప్రకారం అమెరికాలో 30 లక్షల మంది భారతీయ ఓటర్లు ఉండగా, వారిలో సగం మంది హిందువులున్నారు. ట్రంప్‌ను బలపరుస్తున్న వారు రిపబ్లిక్ హిందూ కోహలిషన్గా, హిల్లరీని సమర్ధిస్తున్న వాళ్లు హిందూ డెమోక్రట్ గ్రూపులుగా వేరు పడ్డారు. పలు భారతీయ సంఘాల్లో భిన్నాభిప్రాయాలు గలవాళ్లు ఉన్నారు. హిందూ అమెరికన్ ఫౌండేషన్‌లో భిన్నాభిప్రాయాలు కలిగిన వాళ్లు ఉన్నప్పటికీ వారిలో ఎక్కువ మంది డెమోక్రట్ అభ్యర్థికే మద్దతు ఇస్తున్నారు. హిల్లరీని లక్ష్యంగా చేసుకొని భారతీయ టీవీలో ప్రసారం చేస్తున్న తాజా యాడ్‌ను వారు విమర్శిస్తున్నారు. విధానాలను కాకుండా వ్యక్తులను విమర్శించడం తగదని వారు అంటున్నారు. తాము భిన్నత్వంలో ఏకత్వాన్ని, ఇరుదేశాల మధ్య గౌరవ ప్రదమైన సంబంధాలను కోరుకుంటున్నామని చెప్పారు. ఆది నుంచి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అమెరికాలోని భారతీయులు డెమోక్రట్ అభ్యర్థులకే మద్దతిస్తూ వస్తున్నారు. కానీ ఈసారి రిపబ్లికన్ల తరఫున పోటీ చేస్తున్న ట్రంప్ ముస్లింలకు వ్యతిరేకంగా బహిరంగ విమర్శలు చేస్తుండడం, భారత్‌తో సంబంధాలకు ప్రాధాన్యత ఇస్తామని చెబుతుండడంతో ఓ వర్గం రిపబ్లికన్ల వైపు తిరిగారు. అయినప్పటికీ ఇటీవల నిర్వహించిన పలు సర్వేల్లో 60 శాతం మంది భారతీయులు అమెరికా అధ్యక్షుడిగా తాము ట్రంప్‌ను కోరుకోవడం లేదని వెల్లడైంది. అయితే అప్పటికి ఇప్పటికీ ట్రంప్‌కు భారతీయుల మద్దతు పెరిగినట్లు తెలుస్తోంది. కానీ అది ఎంత శాతమన్నది ఇప్పటికీ స్పష్టం కావడం లేదు. భారతీయులను మరింత ఆకర్షించడం కోసం అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్ అనే నినాదం తీసుకొచ్చారు. 2014లో జరిగిన భారత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అబ్ కీ బార్ మోదీ సర్కార్ నినాదంతో అఖండ విజయం సాధించిన విషయం తెల్సిందే. మరి, ట్రంప్ నినాదం భారతీయులను ఏ మేరకు ప్రభావితం చేస్తుందో చూడాలి. -
హిల్లరీపై సల్మాన్ ఏం ట్వీట్ చేశాడంటే..!
మరో మూడు రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సర్వాత్ర ఇప్పుడు అగ్రరాజ్యం పోలింగ్ గురించే చర్చ జరుగుతోంది. ఈసారి అమెరికా అధ్యక్షుడు ఎవరు అవుతారు? అన్నది ఉత్కంఠ రేపుతోంది. డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ గెలుస్తారా? లేక రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజేతగా నిలుస్తారా? అన్నది ఆసక్తి రేపుతోంది. ఈ నేపథ్యంలో హిల్లరీ క్లింటన్‌కు ఆల్ ద బెస్ట్ చెప్తూ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఓ అనూహ్య ట్వీట్ చేశారు. అమెరికా అధ్యక్షురాలిగా హిల్లరీ గెలువాలని తాను ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని అనుసరిస్తూ మానవీయ విలువలు కాపాడే శక్తిని ఆమెకు దేవుడు ఇవ్వాలని తాను కోరుకుంటున్నట్టు సల్మాన్ పేర్కొన్నాడు. Hope you win. May god give you the strength to follow the constitution and human values. All the best.#HillaryClintonforpresident pic.twitter.com/lelPESTHEK — Salman Khan (@BeingSalmanKhan) 5 November 2016 -
హిల్లరీనా...ట్రంపా? ఎవరు గెలిస్తే ఏంటి?
అమెరికా అధ్యక్ష ఎన్నికలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనే ఆందోళనలతో మార్కెట్లు అతలాకుతలం అవుతున్నాయి. డెమోక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ గెలిస్తే ఎలా స్పందించాలి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ను విజయం వరిస్తే ల పరిస్థితేమిటా? అనే సందిగ్ధత మార్కెట్లలో నెలకొంది. ఇన్ని రోజులు హిల్లరీ గెలుపు అవకాశాలతో మార్కెట్లు ఆశాజనకంగా స్పందించాయి. కానీ చివరి దశలో అంచనాలు తారుమారు అవుతూ డొనాల్డ్ ట్రంప్‌ను అధ్యక్ష పీఠం వరించబోతుందా అనగానే, మార్కెట్లలో కలవరం ప్రారంభమైంది. అటు అమెరికా మార్కెట్లే కాదు, ఆసియన్ మార్కెట్లు, దేశీయ సూచీలు నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఇప్పటివరకు ఏ ఎన్నికల నేపథ్యంలోనైనా మార్కెట్లు పాజిటివ్‌గానే ట్రేడ్ అయ్యేవి. కానీ ఈసారి పరిస్థితి కాస్త భిన్నంగా కనిపిస్తోంది. ఒకవేళ ట్రంప్ గెలిస్తే ఏమిటి? హిల్లరీ విజయం సాధిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఓ సారి చూద్దాం... స్టాక్ మార్కెట్లు : హిల్లరీ గెలిస్తే... డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి గెలుపుపై ఇప్పటికే మార్కెట్లు ఓ అంచనాల్లో ఉన్నాయి. కాబట్టి తాను గెలిస్తే ఎస్ అండ్ పీ 500 ఇండెక్స్ 3 శాతం మేర ఎగిసే అవకాశాలున్నాయి. మూలధన పన్నులపై ఇచ్చే పన్ను ప్రయోజనాలు హిల్లరీ పరిమితం చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రభావం కొన్ని రిస్క్‌తో కూడుకున్న ఈక్విటీలపై పడనుందని తెలుస్తోంది. ఫైనాన్స్ , డ్రగ్ కంపెనీలు ఆమె గెలుపు అతిపెద్ద నష్టం. ఇటు బ్యాంకులకు ఇవి అత్యంత కఠినతరమైన ఎన్నికలుగా విశ్లేషకులు చెబుతున్నారు. కఠినతరమైన నిబంధనలు, పన్నుల మార్పులు కంపెనీలను ఎక్కువగా దెబ్బతీయనున్నాయని విశ్లేషకుల అభిప్రాయం. క్లింటన్ హయాంలో ఫార్మా స్యూటికల్, బయోటెక్ స్టాక్స్ చాలా ఒత్తిడికి లోనయ్యాయి. డ్రగ్స్ ధరలు విపరీతంగా పెంచడాన్ని ఆమె నియంత్రించారు. అమెరికా ఎన్నికల ఆందోళనతో ఇప్పటికే యూరోపియన్ హెల్డ్ కేర్ ఇండస్ట్రి తమ రేటింగ్‌ను తగ్గించుకుంది. ఎప్పుడైతే హిల్లరీ గెలుపు అవకాశాల్లో పడిపోతుందనగానే, ఈ షేర్లు లాభపడటం ప్రారంభమయ్యాయి. మరోవైపు శిలాజ ఇంధనాలపై ఎక్కువగా ఆధారపడటాన్ని తగ్గించి, ఇతర ప్రత్యామ్నాయ ఎనర్జీ ప్రొడ్యూసర్లపై ఆమె ఎక్కువగా దృష్టి సారించనుందని తెలుస్తోంది. ఇది కూడా ఎనర్జీలో కొన్ని స్టాక్స్‌కు ప్రతికూలం చూపించనున్నట్టు మార్కెట్ విశ్లేషకులంటున్నారు. ట్రంప్ గెలిస్తే... యూరోపియన్ యూనియన్ నుంచి యూకే వైదొలుగుతూ తీసుకున్న నిర్ణయం కంటే పరిస్థితి దారుణంగా ఉంటుందని కొంతమంది విశ్లేషకులంటున్నారు. ఎస్ అండ్ పీ ఇండెక్స్ 11 నుంచి 13 శాతం పడిపోయే అవకాశాలున్నాయని పేర్కొంటున్నారు. జపాన్ ఎగుమతి దారులకు గండికొట్టి యెన్ విలువ దిగజారే అవకాశం ఉందట. అయితే ట్రంప్ నేతృత్వంలో డ్రగ్స్ తయారీదారులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, బ్యాంకులు ఎక్కువగా లాభపడనున్నాయని వెల్లడవుతోంది. ఫైనాన్స్ కంపెనీలు ఎక్కువగా ట్రంప్‌పై మొగ్గుచూపుతున్నాయని తెలుస్తోంది. సివిల్ ఇన్‌ఫ్రాక్ట్ర్చర్ ఇండస్ట్రి అతిపెద్ద లాభప్రదాయనిగా నిలువనుందట. క్లింటన్ కంటే ట్రంప్ ఎక్కువగా సివిల్ మౌలికసదుపాయాల రంగంలో ఖర్చు చేయనున్నారని మొదటి నుంచి తెలుస్తోంది. కరెన్సీలపై ఈ ఎన్నికల ప్రభావం.. హిల్లరీ గెలిస్తే.. ఇతర అభివృద్ది మార్కెట్లతో పోలిస్తే అమెరికా డాలర్ ఎక్కువగా లాభపడనుందని తెలుస్తోంది. ఫెడరల్ రిజర్వు వెంటనే డిసెంబర్లో రేట్లపెంపు చేపట్టే అవకాశాలున్నాయని విశ్లేషకులంటున్నారు. రష్యా మినహా ఇతర ఎమర్జింగ్ దేశాల కరెన్సీలు పాజిటివ్‌గానే ట్రేడ్ కానున్నాయంట. క్లింటన్ గెలుపుపై చైనా యువాన్ ఎక్కువగా బలపడనుందని టాక్. ట్రంప్ గెలిస్తే.. ఒకవేళ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి పదవిలోకి వస్తే, ఇతర మేజర్ కరెన్సీలు యెన్, యూరో, పౌండ్లతో పోలిస్తే డాలర్ విలువ బలహీనపడనుందని తెలుస్తోంది. ఫెడ్ ద్రవ్యవిధానపరపతి సమీక్షలో రేట్ల పెంపు మరికొన్ని రోజుల వాయిదా పడనుందని విశ్లేషకులంటున్నారు. అయితే గ్రీన్ బ్యాక్ కరెన్సీ మాత్రం మూడు నుంచి తొమ్మిది నెలల ర్యాలీ జరుపనుందట. కమోడిటీలు ఎలా స్పందించనున్నాయి.. హిల్లరీ గెలిస్తే.. హిల్లరీ మొదటి నుంచి పర్యావరణ విధానాలపై ఎక్కువగా దృష్టిసారిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా వాతావరణ మార్పులపై హిల్లరీ ఎక్కువగా వాగ్దానాలు చేస్తున్నారు. కోల్ వాడకం తగ్గించి సహజవాయువుల ఉపయోగాన్ని పెంచుతానని ఆమె అంటున్నారు. ఈ నేపథ్యంలో కోల్ అండ్ ఆయిల్ షేర్లు ఒత్తిడి పడి, సహజ వాయువుల మార్కెట్ ఎక్కువగా అభివృద్ధి చెందనుందని విశ్లేషకులంటున్నారు. ట్రంప్ గెలిస్తే.. అయితే ట్రంప్ నేతృత్వంలో కోల్ ఎక్కువగా లాభపడి, సహజవాయువులకు దెబ్బకొట్టనుందని విశ్లేషకుల అభిప్రాయం. సెప్టెంబర్‌లో బ్లూమ్‌బర్గ్ నిర్వహించిన సర్వేలో కూడా ఇదే తేలిందట. రిపబ్లికన్ అభ్యర్థి నేతృత్వంలో సహజ వాయువుల డిమాండ్ 11 శాతం క్షీణిస్తుందని, కోల్ వాడకం విపరీతంగా పెరుగుతుందని తెలిసింది. అదేవిధంగా గోల్డ్, ప్లాటినం, సిల్వర్ కూడా అతిపెద్ద లాభదాయకమైన కమొడిటీలుగా ఉండనున్నాయి. ఎఫ్‌బీఐ, హిల్లరీ క్లింటన్ ప్రైవేట్ వాడక ఈ-మెయిల్స్ వ్యవహారాన్ని పునఃవిచారణ చేపడుతుందనగానే, అన్ని విలువైన మెటల్స్ ఒక్కసారిగా పైకి ఎగిశాయి. వెండి 3.4 శాతం, బంగారం 2 శాతం పెరిగాయి. ఈ క్రమంలోనే డాలర్ క్షీణిస్తూ వచ్చింది. -
మళ్లీ ఆధిక్యంలో హిల్లరీ క్లింటన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ కంటే డోనాల్డ్ ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారని రెండు రోజుల క్రితమే ఒక సర్వే వచ్చినా.. మళ్లీ ఈలోపే మరోసారి హిల్లరీ ఆధిక్యంలోకి వచ్చేశారు. ఫాక్స్ న్యూస్ సంస్థ తాజాగా నిర్వహించిన సర్వేలో ట్రంప్ కంటే హిల్లరీ 2 శాతం పాయింట్ల ముందంజలో ఉన్నట్లు తేలింది. ఈ సర్వేలో క్లింటన్‌కు 45 శాతం మద్దతు లభించగా, ట్రంప్‌కు 43 శాతమే వచ్చింది. మరో ఐదు శాతం మంది గేరీ జాన్సన్‌కు, 2 శాతం మంది గ్రీన్ పార్టీకి చెందిన జిల్ స్టీన్‌కు మద్దతు పలికారు. ట్రంప్‌కు మద్దతు పలికినవారిలో పురుషులు (+11 పాయింట్లు), తెల్లవారు (+19), కాలేజి డిగ్రీ లేని తెల్లవారు (+33) ఉన్నారు. ఇక హిల్లరీకి అండగా ఉన్నవారిలో మహిళలు (+13), ఆఫ్రికన్-అమెరికన్లు (+74), 30 ఏళ్లలోపువారు (+17) ఉన్నారు. ఇప్పటికే ఒకసారి ఓటు వేసినవారిలో కూడా 11 పాయింట్ల ఆధిక్యం హిల్లరీకే వచ్చింది. డిగ్రీ ఉన్న తెల్లవారిలో 45 శాతం మంది ట్రంప్‌కు మద్దతు పలకగా, హిల్లీరిక 42 శాతం మందే మద్దతుగా ఉన్నారు. 1211 మందిని లాండ్‌లైన్, సెల్ఫోన్ల ద్వారా ఇంటర్వ్యూ చేసి ఈ సర్వే ఫలితాలు రాబట్టారు. వారిలో 1107 మంది లైక్లీ ఓటర్లున్నారు. -
హిల్లరీ.. అమితాబ్‌ను కలిశారా?
మరో మూడు రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న తరుణంలో సరికొత్త విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. డెమొక్రాటిక్ పార్టీ తరఫున పోటీ పడుతున్న హిల్లరీ క్లింటన్.. కొన్నేళ్ల క్రితం బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌ను కలిసినట్లు తాజాగా లీకైన ఈ మెయిల్ ద్వారా తెలుస్తోంది. ద వాషింగ్టన్ పోస్ట్ పత్రికకు చెందిన పొలిటికల్ రిపోర్టర్ జోస్ ఎ డెల్రియల్ దీనికి సంబంధించి ఒక ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. పాకిస్థాన్ సంతతికి చెందిన తన సహాయకురాలు హుమా అబెదిన్‌ను ఆమె అడిగారు. 2011 జూలైలో రాసిన ఈ మెయిల్ తాజాగా బయటపడింది. ''కొన్నేళ్ల క్రితం మనం కలిసిన భారతీయ వృద్ధ నటుడి పేరేంటి'' అని ఆమె ఒక ఈ మెయిల్లో ప్రశ్నించగా, దానికి అబెదిన్.. ''అమితాబ్ బచ్చన్'' అని సమాధానమిచ్చారు. అయితే ఏ సందర్భంలో అమితాబ్‌ను వాళ్లు కలిశారన్న విషయం గురించిన చర్చ మాత్రం ఆ ఈమెయిల్లో లేదు. సరిగ్గా ఎన్నికలు ముంచుకొచ్చిన తరుణంలోనే ఈమెయిల్స్ బయటపడటం హిల్లరీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఆ ఈమెయిల్స్ విషయంలో దర్యాప్తు చేయనున్నట్లు ఎఫ్‌బీఐ డైరెక్టర్ జేమ్స్ కామీ కాంగ్రెస్‌కు ఒక లేఖ రాశారు. హుబా అబెదిన్ మాజీ భర్తకు చెందిన ఒక ల్యాప్‌టాప్‌ను ఎఫ్‌బీఐ స్వాధీనం చేసుకుని, దాన్నుంచి మొత్తం 6.50 లక్షల ఈమెయిల్స్‌ను రిట్రీవ్ చేసింది. బరాక్ ఒబామా తొలిసారి అధ్యక్షుడు అయినప్పుడు ఆయన మంత్రివర్గంలో విదేశాంగ మంత్రిగా పనిచేసిన హిల్లరీ.. ప్రైవేటు ఈ మెయిల్ సర్వర్‌ను ఉపయోగించడంపై దర్యాప్తు జరగనుంది. -
భయాన్ని కాదు.. ఆశను ఎంచుకోండి
వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి కీలకంగా భావిస్తున్న నార్త్ కరోలినాలో శుక్రవారం పర్యటించిన బరాక్ ఒబామా.. ట్రంప్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీకి సపోర్ట్‌గా ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన.. భయాన్ని కాకుండా ఆశను ఎన్నుకొమ్మని ఓటర్లకు సూచించారు. 'అమెరికా పౌరులు పాటించే విలువలను ట్రంప్ గౌరవించలేదు కాబట్టి అమెరికా అత్యున్నత స్థానానికి అతడు అనర్హుడు' అని ఒబామా విమర్శించారు. ఫయటెవిల్లె స్టేట్ యూనివర్సిటీలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఒబామా 'ఒకవేళ అమెరికన్లు స్ట్రాంగ్ అని మీరు భావించినట్లైతే.. అమెరికన్లను వికలాంగులు అని, వలసదారులను క్రిమినల్స్, రేపిస్టులు అని, అలాగే మైనారిటీలను అవమానించేలా వ్యాఖ్యానించిన వ్యక్తిని అధ్యక్షుడిగా ఎన్నుకోవద్దు' అని అన్నారు. అలాగే.. మహిళలను పందులు, కుక్కలు అంటూ మాట్లాడిన వ్యక్తి అధ్యక్షుడిగా ఎన్నుకోవద్దు అంటూ ఓటర్లను ఒబామా కోరారు. -
ఎన్నికల తీరుపై అమెరికన్ల విరక్తి..
సర్వేలో వెల్లడి న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ గెలుస్తారా? ట్రంప్ గెలుస్తారా? అన్న ఉత్కంఠలో ప్రపంచం ఉండగా... అమెరికన్లు మాత్రం అంత ఆసక్తి చూపడం లేదట.. ఎన్నికల ప్రచార తీరుతో తాము తీవ్రంగా విరక్తి చెందామంటూ న్యూయార్క్ టైమ్స్ పత్రిక/సీబీఎస్ న్యూస్ పోల్‌లో వెల్లడించారు. ఎక్కువ శాతం ఓటర్లు తాజా అమెరికా రాజకీయాల పట్ల అసహ్యం వ్యక్తం చేశారు. డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్‌ల్లో ఎవరూ నిజాయితీపరులు కాదని, దేశాన్ని ఐక్యంగా ఉంచి పాలించే సామర్థ్యం వారికి లేదంటూ తేల్చిచెప్పేశారు. విద్వేష పూరిత ఎన్నికల ప్రచారంతో విసుగెత్తిన అమెరికన్లు దేశాన్ని ముందుకు నడిపించడంలో హిల్లరీ, ట్రంప్‌ల సమర్థతపై సందేహాలు వ్యక్తం చేశారు. ప్రచారంతో ఆసక్తి కంటే విరక్తి చెందామని ప్రతీ పది మంది ఓటర్లలో 8 మందికి పైగా వెల్లడించారు. ఈ పోల్‌లో మాత్రం హిల్లరీ 45 శాతంతో ముందంజలో ఉండగా ట్రంప్ 42 శాతం మద్దతుతో వెనుకంజలో ఉన్నారు. మహిళా ఓటర్లలో ట్రంప్ కంటే హిల్లరీ 14 పాయింట్ల ఆధిక్యంలో కొనసాగుతుండగా... పురుష ఓటర్లలో ట్రంప్ 11 శాతం ఆధిక్యంలో ఉన్నారు. ప్రతి 10 మందిలో ఆరుగురు చివరి నిమిషంలో ట్రంప్, హిల్లరీలపై ఏవైనా సంచలన వివరాలు వెల్లడైనా ఎవరికి ఓటు వేయాలన్న అభిప్రాయాన్ని మాత్రం మార్చుకోబోమన్నారు. క్లింటన్‌పై ఈ మెయిల్ ఆరోపణలతో మనసు మార్చుకున్న వారి కంటే ట్రంప్‌పై ఆరోపణలతో ప్రభావితమైనవారు ఎక్కువని సర్వే తేల్చింది. -
మెగాస్టార్ గురించి హిల్లరీ ఆరా?
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న హిల్లరీ క్లింటన్‌కు సంబంధించి లీకేజీ మెయిల్ వివరాలను వాషింగ్టన్ పోస్ట్ ప్రచురించింది. హిల్లరీ తన సన్నిహితురాలు, పాకిస్థాన్ సంతతికి చెందిన హ్యూమా అబెదిన్కు పంపిన మెయిల్లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌కు సంబంధించిన ప్రస్తావన ఉంది. ‘కొన్నేళ్ల క్రితం మనం ప్రఖ్యాత భారతీయ సీనియర్ నటుడ్ని కలిశాం. ఆయన పేరు ఏమిటి?’ అంటూ హిల్లరీ చేసిన మెయిల్లో అబెదిన్‌ను ప్రశ్నించారు. ఆమె బదులిస్తూ ‘అమితాబ్ బచ్చన్’ అంటూ సమాధానమిచ్చారు. హిల్లరీ అమితాబ్ గురించి ఎందుకు అడిగారు? ఇందుకు గల కారణం ఏంటి అన్న విషయాలు మెయిల్లో ప్రస్తావించలేదు. 2011 జూలైలో హిల్లరీ ఈ మెయిల్ పంపారు. మెయిల్స్ లీకేజీ వ్యవహారం హిల్లరీకి తలనొప్పిగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై ఎఫ్‌బీఐ విచారణ చేస్తోంది. -
అంచనాలు నిజమైతే ట్రంప్‌దే విజయం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్నా కొద్దీ రిపబ్లికన్ల అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ బలం పుంజుకుంటున్నారు. తొలుత డెమోక్రట్ల అభ్యర్థి హిల్లరీ క్లింటన్ కన్నా ఎంతో వెనకబడిన ట్రంపు క్రమంగా తన విజయావకాశాలను మెరగుపర్చుకుంటూ ముందుకు దూసుకెళుతున్నారు. తాజా సర్వేలో హిల్లరీ క్లింటన్‌కన్నా కొద్దిగా ట్రంపు ముందే ఉన్నారని కూడా తేలింది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య పోటీ తీవ్రంగా ఉంటుందని అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా అంగీకరించారు. దేశాధ్యక్ష ఎన్నికల్లో అవసరమైన 270 ఎలక్టోరల్ ఓట్లను సాధించి విజయతీరాలను చేరుకోవాలంటే ట్రంప్‌కు మరీ కష్టమేమీ కాదు. అంచనాల ప్రకారం అనుకూల అంశాలు కలిసొస్తే ఆయన విజయాన్ని దక్కించుకోవచ్చు. కొలరాడో, ఫ్లోరిడా, ఐహోవా, మైనె, మిచిగాన్, న్యూమెక్సికో, నార్త్ కరోలినా ఒహాయో, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్, వర్జీనియా, నేవడ, న్యూహాంప్‌షైర్ రాష్ట్రోల్లో ఎలక్టోరల్ ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఆయన తుదిదశ ప్రచారం కింద రెండున్నర కోట్ల డాలర్ల టీవీ యాడ్స్‌ను ప్రసారం చేస్తున్నారు. రిపబ్లికన్ల కంచుకోటలైన ఆరిజోనా, జార్జియా, ఉటావా, టెక్సాస్ లాంటి రాష్ట్రాలపైనున్న పూర్తి అంచనాలతోనే ఆయన మిగతా రాష్ట్రాల్లోనే ప్రచారం కోసం ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. ఆశించిన ఫలితాలు రావాలంటే ఫ్లోరిడా, ఒహాయో, నార్త్ కరోలినా, ఐహోవా రాష్ట్రాలను తప్పినిసరిగా ట్రంప్ గెలుచుకోవాలి. వీటితో పాటు రెండవ పార్లమెంట్ సీటైన మైనేను గెలుచుకున్నట్లయితే ట్రంప్‌కు 260 ఎలక్టోరల్ ఓట్లు వస్తాయి. పెద్ద రాష్ట్రాలైన పెన్సిల్వేనియా, విస్కాన్సిన్, వర్జీనియా, మిచిగాన్‌లో కచ్చితంగా ఒక రాష్ట్రాన్ని ట్రంప్ గెలుచుకోవాలి. చిన్న రాష్ట్రాలైన నేవడ, న్యూహాంప్‌షైర్, న్యూమెక్సికో రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాలను గెలుచుకోవాలి. 2012 ఎన్నికల్లో మిట్రోమ్నీ గెలుచుకున్న అన్ని రిపబ్లికన్ల ఆధిపత్య రాష్ట్రాలను గెలుచుకోవడమే కాకుండా బరాక్ ఒబామాను బలపర్చిన ఫ్లోరిడా, ఒహాయో, నేవడ, న్యూహాంప్‌షైర్ రాష్ట్రాల ఓట్లను తనవైపు తిప్పుకున్నట్లయితే ట్రంప్‌కు విజయానికి కావాల్సిన 270 ఎలక్టోరల్ ఓట్లు వస్తాయి. అప్పుడు హిల్లరీ క్లింటన్ 268 ఓట్లతో ఓడిపోతారు. హిల్లరీ క్లింటన్ మద్దతున్న విస్కాన్సిన్, మిచిగాన్, పెన్సిల్వేనియా రాష్ట్రాల్లో ట్రంప్ పాగా వేయగలిగితే ఇక ఆయన విజయానికి ఢోకా ఉండదు. అప్పుడు ఆయనకు 290 వరకు ఓట్లు వస్తాయి. ఉత్తర కరోలినా, ఫ్లోరిడా, జార్జియా రాష్ట్రాల్లోని నల్లజాతీయ ఓటర్లు సహజంగా డెమోక్రట్లకు ఇంతకాలం ఓటు వేస్తూ వస్తున్నారు. ఈసారి వారికి డెమోక్రట్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉంది. ఆ కారణంగా వారు ట్రంప్‌కు ఓటేస్తే, వారి బాటలోనే నల్లజాతీయులు ఎక్కువగావున్న మిచిగాన్ రాష్ట్రం కూడా ట్రంప్‌వైపు తిరిగితే ఆయన విజయం మరింత సులువు. -
అమెరికా అధ్యక్షుడ్ని తేల్చేది..‘స్వింగ్’
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరో నాలుగు రోజుల్లో జరుగనున్న నేపథ్యంలో డెమోక్రట్ల అభ్యర్థి హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ల అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌లో ఎవరు విజయం సాధిస్తారన్న అంశంపై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. అమెరికా ఎలక్టోరల్ కాలేజీలోని మొత్తం 538 ఓట్లలో 270 ఓట్లు సాధించిన అభ్యర్థి విజయం సాధిస్తారు. సాధారణంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటు స్వింగయ్యే రాష్ట్రాలే విజేతను నిర్ణయిస్తాయి. అమెరికాలోని మొత్తం 50 రాష్ట్రాలకుగాను ప్రస్తుతం 11 స్వింగ్ రాష్ట్రాలు ఉన్నాయి. వీటిని బ్యాటిల్ గ్రౌండ్ రాష్ట్రాలని కూడా వ్యవహరిస్తారు. ఇటు డెమోక్రట్లకు, అటు రిపెబ్లికన్లకు సమానమైన ఓట్ల శాతం కలిగిన రాష్ట్రాలను స్వింగ్ రాష్ట్రాలని పిలుస్తారు. ఈ రాష్ట్రాల్లో ఏ ఒక్క ఓటు అటు ఇటైనా ఫలితం మారిపోతుంది. స్వింగ్ రాష్ట్రాల సంఖ్య ఎప్పుడూ ఒకటే ఉండదు. మారుతూ ఉంటుంది. కానీ 2008 ఎన్నికల నాటి నుంచి ఈ స్వింగ్ రాష్ట్రాల సంఖ్య 11గానే ఉంది. 2008 ఎన్నికల్లో ఈ మొత్తం 11 స్వింగ్ రాష్ట్రాలు బరాక్ ఒబామాకే ఓటేశాయి. 2014 ఎన్నికల్లో 11కుగాను పది రాష్ట్రాలే ఆయనకు ఓటేశాయి. కొన్ని రాష్ట్రాలో ఆయనకు మెజారిటీ కూడా తగ్గింది. స్వింగ్ రాష్ట్రాలు ఇవే... కొలరాడో, ఫ్లోరిడా, ఐహోవా, మిచిగాన్, నేవడ, న్యూహాంప్‌షైర్, నార్త్ కరోలినా, ఓహాయో, పెన్సిల్వేనియా, వర్జీనియా, విస్కాన్సిన్‌లు స్వింగ్ రాష్ట్రాలు. సాధారణంగా ఎన్నికల్లో విజేతను ఈ రాష్ట్రాలే నిర్ణయిస్తాయి. మెజారిటీ రాష్ట్రాలు ఎవరి ఖాతాలో పడితే వారే విజయం సాధిస్తారు. ఒక అభ్యర్థికి ఐదు, ఒక అభ్యర్థికి ఆరు రాష్ట్రాలు ఓట్లు వస్తే అప్పుడు ఇతర రాష్ట్రాల ఫలితాలు సరళినే విజేతను నిర్ణయిస్తుంది. ఈ స్వింగ్ రాష్ల్రాల్లో మొదటి నుంచి మొన్నటి వరకు హిల్లరీ క్లింటన్ హవానే కొనసాగింది. అయితే ఆమె ఈమెయిళ్ల వ్యవహారంపై రెండోసారి ఎఫ్‌బీఐ దర్యాప్తు ప్రారంభం కావడం ఒక్కసారిగా పరిస్థితి మారిపోయిందని, నాలుగు నుంచి ఎనిమిది రాష్ట్రాల వరకు ట్రంప్ ఖాతాలోకి వెళ్లే అవకాశం ఉందని తాజా సర్వేలు తెలియజేస్తున్నాయి. కచ్చితంగా ఎనిమిది రాష్ట్రాల్లో తామే విజయం సాధిస్తామని ట్రంప్ కూటమి చెప్పుకుంటోంది. ఇతర జాతీయుల ఓట్లు కీలకమే.. ఈ స్వింగ్ రాష్ట్రాల్లో మెజారిటీ ప్రజలు శ్వేతజాతీయులే. వారిలో ఎక్కువ మంది ఈసారి ట్రంప్ వైపు మొగ్గు చూపిస్తున్నారని కూడా సర్వేలు చెబుతున్నాయి. వాస్తవానికి గత కొన్నేళ్లుగా శ్వేత జాతీయుల ఓటర్ల సంఖ్య ఈ రాష్ట్రాల్లో తగ్గుతూ వస్తోంది. నల్ల జాతీయులు ఎప్పుడూ డెమోక్రట్లకే ఓటు వేస్తారు. ఈసారి వారికి అధికార ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉన్నందున ట్రంప్‌కు వేస్తారని ఆయన వర్గీయులు భావిస్తున్నారు. ఈసారి స్వింగ్ రాష్ట్రాల్లో శ్వేత జాతీయులే కాకుండా మిగతా జాతీయులు ఎవరికి వేస్తారన్నది కూడా ముఖ్యమేనని ఎన్నికలు పరిశీలకులు చెబుతున్నారు. కొలరాడాలో 22 శాతం ఇతర జాతీయులు, ఫ్లోరిడాలో 33 శాతం, నేవడలో 36 శాతం, కరోలినాలో 30 శాతం, వర్జీనియాలో 30 శాతం ఇతర జాతీయులు ఉన్నారు. ఎవరి వైపు ‘స్వింగ్’ ఉందో కచ్చితంగా అంచనా వేయలేకపోతున్నందున హిల్లరీ, ట్రంప్ మధ్య పోటీ పోటీగా సమరం సాగుతుందని పరిశీలకులు అంటున్నారు. నవంబర్ 8వ తేదీన అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నప్పటీకీ అమెరికా రాజ్యాంగం కల్పిస్తున్న వెసులుబాటు ప్రకారం రెండు వారాల క్రితం ప్రజలు ఓట్లు వేయడం ప్రారంభమైంది. దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా ఇప్పటికే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పటి వరకు దాదాపు మూడున్నర కోట్ల మంది ప్రజలు ఓటు వేశారు. -
ముందస్తు పోలింగ్‌లోనూ హిల్లరీ-ట్రంప్ పోటాపోటీ
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు జరిగిన ముందస్తు పోలింగ్‌లో దాదాపు 3 కోట్ల మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇందులో నాలుగు రాష్ట్రాల్లో డెమొక్రాట్ అభ్యర్థిని హిల్లరీ క్లింటన్ ఆధిక్యంలో ఉండగా, మూడు రాష్ట్రాల్లో రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ ముందున్నారు. నార్త్ కరొలినా, నెవడా, కొలరాడో, అయోవా రాష్ట్రాల్లో హిల్లరీ ముందున్నారు. అరిజోనా, ఫ్లోరిడా, ఓహియా రాష్ట్రాల్లో ట్రంప్ హవా కనిపించింది. ఈనెల 8వ తేదీన అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అయితే ముందస్తు పోలింగ్ కూడా అక్కడ ఉంటుంది. అరిజోనాలో ఇప్పటివరకు 13 లక్షల మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇక్కడ రిపబ్లికన్లకు 71వేల ఓట్ల ఆధిక్యం.. అంటే, 5.5 శాతం ఆధిక్యం కనిపించింది. ఫ్లోరిడాలో 16.95 లక్షల ఆధిక్యంలో ట్రంప్ ఉన్నారు. అయోవాలో హిల్లరీ 41వేల ఓట్ల లీడ్‌లో ఉండగా పూర్తిగా మెయిల్ ద్వారానే ఎన్నికలు జరిగే కొలరాడోలో డెమొక్రాట్లు 18,500 ఓట్ల ఆధిక్యం లేదా 1.5 శాతం ముందున్నారు. నెవడాలో కూడా 29వేల ఓట్ల ఆధిక్యంలో హిల్లరీ ఉన్నారు. ఆమెకు ఉత్తర కరొలినాలో 2.43 లక్షల ఆధిక్యం లభించింది. ఓహియోలో ఈ వారం మొదట్లో ట్రంప్ ఆధిక్యం కనిపించింనా, తర్వాత డెమొక్రాట్లు 5 శాతం ముందంజలో ఉన్నారు. మొత్తం 38 రాష్ట్రాల్లో ఇప్పటివరకు 3 కోట్లకు పైగా ఓట్లు పోలయ్యాయి. ముందస్తు పోలింగ్‌లో పాల్గొనాల్సిందిగా తమ మద్దతుదారులను హిల్లరీ క్లింటన్, డోనాల్డ్ ట్రంప్ ఇద్దరూ ప్రోత్సహిస్తున్నారు. కానీ, ఇప్పటివరకు రిజిస్టర్డ్ డెమొక్రాట్లలో 74 లక్షల మంది, రిపబ్లికన్లలో 64 లక్షల మంది మాత్రమే ఓట్లు వేశారు. అయితే.. ఇప్పటివరకు వచ్చినవి తుది ఫలితాలు కావు. పూర్తి బ్యాలెట్లను ఎన్నికల రోజు వరకు లెక్కించరు. మరో విషయం ఏమిటంటే.. డెమొక్రాట్లందరూ హిల్లరీ క్లింటన్‌కు, రిపబ్లికన్లందరూ డోనాల్డ్ ట్రంప్‌కు ఓటేస్తారని కూడా నమ్మకం లేదు. అమెరికా ఓటింగ్ చట్టాలను బట్టి 37 రాష్ట్రాలతో పాటు కొలంబియా జిల్లాలో కూడా ఎన్నికలకు ముందే వ్యక్తిగతంగా లేదా ఈ మెయిల్ ద్వారా ఓట్లు వేయొచ్చు. మరో ఆరు రాష్ట్రాల్లో పోలింగ్ రోజు హాజరు కాలేనివాళ్లు తగిన కారణంతో తర్వాత ఓటు వేసే వీలుంది. ఏడు రాష్ట్రాలు మాత్రం అసలు ముందస్తు ఓటింగ్‌ను అనుమతించవు. -
అసాధ్యం కాదా? ట్రంప్ గెలవొచ్చా?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవి రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డోనాల్డ్ ట్రంప్ శ్వేత సౌధ పీఠాన్ని అధిష్టించే అవకాశాలు ఉన్నాయా?. ఎన్నికల తేదీ చేరువవుతున్న సమయంలో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్ధి హిల్లరీ క్లింటన్ కు సంబంధించిన సరికొత్త ఈ-మెయిళ్లపై ఎఫ్ బీఐ విచారణ చేపట్టడంతో ఆమె అమెరికన్ల విశ్వాసాన్ని క్రమంగా కోల్పోతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా ఎన్నికల సమీకరణాలు మారిపోయాయి. కొద్ది రోజుల క్రితం తాను ఎన్నికల్లో గెలవనని భావించిన ట్రంప్ తిరిగి తనదైన శైలిలో ప్రత్యర్ధిపై విరుచుపడుతున్నారు. అంతేకాదు తాజాగా ఏబీసీ న్యూస్, వాషింగ్టన్ పోల్ లు నిర్వహించిన సర్వేలో ట్రంప్, హిల్లరీని సమం చేశారు. ఈ విషయాన్ని బుధవారం ఫ్లోరిడా ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ప్రస్తావించారు. హిల్లరీని సమం చేయడాన్ని తానే నమ్మలేకపోతున్నానని అన్నారు. రెండు వారాల క్రితం ట్రంప్ కంటే 12 పాయింట్లు ఉన్న హిల్లరీ ఆధిక్యం.. ఎఫ్ బీఐ ప్రకటన తర్వాత ఒక్కసారిగా పడిపోయింది. ఇరు అభ్యర్ధులకు సొంత పార్టీల మద్దతు పెరుగుతోందని సర్వేలో వెల్లడైంది. సొంత పార్టీలకు చెందిన వారిలో 85శాతం మంది అధ్యక్ష పదవి అభ్యర్ధులకు మద్దతు ఇస్తున్నట్లు సర్వే పేర్కొంది. స్వతంత్ర అభ్యర్ధుల నుంచి కూడా ఇరువురు అభ్యర్ధులకు 85 శాతం మద్దతు ఉందని చెప్పింది. జార్జియా, టెక్సాస్, అరిజోనా, ఉతాహ్ రాష్ట్రాల్లో హిల్లరీ ప్రతిష్ట మసకబారుతున్నట్లు తెలిపింది. హిల్లరీకి పట్టుకలిగిన మిచిగాన్, విస్కొన్సిన్ లలో ట్రంప్ డబ్బును విపరీతంగా ఖర్చు చేస్తున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో ఏదైనా ఒకదానిలో ట్రంప్ విజయం సాధిస్తే ఒహియో, ఫ్లోరిడా, నార్త్ కరోలినాల్లో పరాజయం ఎదురైనా అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ఆశలు సజీవంగా నిలుపుకోవచ్చు. fivethirtyeight.com ఇచ్చిన వివరాల ప్రకారం అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన ఒక అభ్యర్ధి మూడు నుంచి ఐదు శాతం ఓట్లు సాధిస్తే.. అతని లేదా ఆమె ప్రత్యర్ధి అధ్యక్షపదవికి ఎలక్టోరల్ కాలేజ్ లో అవసరమయ్యే 270 సీట్లను సాధించలేరు. అదే ఇరు అభర్ధుల మధ్య ఓట్ల శాతం మరింత తగ్గితే ప్రత్యర్ధి విజయాన్ని అడ్డుకునే అవకాశం ఉంటుంది. ఇదే జరిగితే ట్రంప్, హిల్లరీని అడ్డుకోవచ్చు. ఇదే సమయంలో హిల్లరీ విజయం సాధించాలంటే కచ్చితంగా ట్రంప్ ను అడ్డుకుని తీరాలి. అంటే మరో మహిళ ట్రంప్ పై ఆరోపణలు చేయాలి. -
హిల్లరీ పాకిస్తాన్‌ను సపోర్టు చేస్తున్నారా..?
టంపా : అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నా కొద్దీ, ప్రచారాలు హోరెత్తుతున్నాయి. ఓ వైపు ప్రవాస భారతీయులందరూ డెమొక్రాటిక్ అభ్యర్థురాలు హిల్లరీ క్లింటన్కే మొగ్గుచూపుతున్నారనే తరుణంలో, రిపబ్లిక్ హిందూ ఆర్గనైజేషన్ మాత్రం హిల్లరీ క్లింటన్‌పై మండిపడింది. ఆమె పాకిస్తాన్‌కు సానుభూతిపరురాలని, హిల్లరీకి దీర్ఘకాలంగా సహచరిణిగా ఉంటున్న హుమా అబేదిన్, పాకిస్తానీకి సంతతికి చెందిన వ్యక్తి అని పేర్కొంది. ఇండియన్-అమెరికన్ టెలివిజన్ చానెల్లో హిల్లరీ క్లింటన్ వ్యతిరేకంగా రిపబ్లిక్ హిందూ ఆర్గనైజేషన్ ఈ ప్రకటన చేసింది. హిల్లరీ క్లింటన్ పాకిస్తాన్‌కు పరోపకారశీలని, భారత్‌కు వ్యతిరేకంగా దాడులు చేయడానికి పాక్‌కు బిలియన్ డాలర్ల సైనిక పరికరాలను సమకూర్చారని ఆరోపించింది. ప్రధాని మోదీకి వీసాను కావాలనే బ్లాక్ చేశారని, రాడికల్ ఇస్లాం మద్దతుకు ఆమె దేశాలు, వ్యక్తుల నుంచి సహాయం తీసుకుంటారని తెలిపింది. హిల్లరీ క్లింటన్‌కు వ్యతిరేకంగా చేసిన ఈ ప్రకటనలో మాజీ అమెరికా అధ్యక్షుడు, ఆమె భర్త బిల్ క్లింటన్‌పై కూడా మండిపడింది. బిల్ క్లింటన్ కశ్మీర్‌ను పాకిస్తాన్‌కు ఇవ్వాలనుకున్నారని పేర్కొంది. ఒకవేళ హిల్లరీ గెలిస్తే, పాకిస్తానీ సంతతికి చెందిన ఆమె సహచరిణి హుమా అబేదిన్, స్టాఫ్‌కు చీఫ్‌గా మారుతుందని ప్రకటన చేసింది. రిపబ్లికన్ అభ్యర్థికి ఓటు వేయాలని, దీంతో అమెరికన్లకు, అమెరికా-భారత సంబంధాలకు మంచి చేకూరుతుందని అభ్యర్థించింది. అయితే నవంబర్ 8 జరుగబోయే ఎన్నికలకు ముందు ఆర్హెచ్ఎస్లో ఈ యాడ్ బ్రాడ్ కాస్ట్ కావడంపై ఆ చానెల్ అధినేత సులాభ్ కుమార్ స్పందించడం లేదు. -
వేడెక్కుతున్న అమెరికా రాజకీయాలు
-
వేడెక్కుతున్న అమెరికా ఎన్నికల రాజకీయాలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఓ వైపు సమయం దగ్గర పడుతుండటంతో తన ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ పై రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మళ్లీ విమర్శలు గుప్పించారు. ఈమెయిల్స్ వ్యవహారంలో ఆమె చేసిన తప్పిదాలకు హిల్లరీ క్రిమినల్ కేసు చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఓ ల్యాప్ టాప్ నుంచి పంపిన 65,000 ఈమెయిల్స్ ను హిల్లరీ భర్త, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, పార్టీ సన్నిహితులు షేర్ చేసుకున్నారని ఎఫ్ బీఐ తన దర్యాప్తులో కనుగొన్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. స్వీయ తప్పిదాలకు హిల్లరీ ఒక్కరే ఇందులో బాధితురాలు కాదని, అమెరికన్ ప్రభుత్వ తీరుతో ప్రజలందరూ ఈమెయిల్స్ కుంభకోణంలో బాధితులుగా మిగిలారని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఓర్లాండోలో ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన ట్రంప్ మాట్లాడుతూ.. విఫలమైన ఓ నాయకురాలికి ఎవరైనా మద్ధతిస్తారా అని ఈ సందర్బంగా ప్రశ్నించారు. ఆమె గత తరం నాయకురాలు అని, భవిష్యత్తు కోరుకునే వాళ్లు తన వెంట ఉండాలని ట్రంప్ పిలుపునిచ్చారు. 'హిల్లరీ అందర్నీ బ్లేమ్ చేయాలనుకుంటున్నారు. ఆమె గత కొన్ని రోజులుగా చేస్తున్న ప్రసంగాలలో ఈ విషయం తేటతెల్లమయింది. ఎఫ్ బీఐ, అమెరికన్ కాంగ్రెస్ కు కూడా ఆమె ఎన్నో పర్యాయాలు అబద్ధాలు చెప్పారు. ఆమె హయాంలో 13 ఫోన్లు మాయం చేశారు. 33,000 వేల ఈమెయిల్స్ ను లేకుండా చేశారు. ఈ విషయాన్ని ఎవరూ నమ్మడం లేదు' అని ట్రంప్ పేర్కొన్నారు. -
హిల్లరీకి డిబేట్ ప్రశ్నలు ముందే తెలుసా?
-
మిషెల్ కోరుకుంటే.. కేబినెట్లో చోటు!: హిల్లరీ
వాషింగ్టన్: ఈనెల 8న జరిగే ఎన్నికల్లో తాను విజయం సాధిస్తే.. అమెరికా ప్రస్తుత ప్రథమ పౌరురాలు మిషెల్ ఒబామాకు మంత్రి వర్గంలో చోటు కల్పించేందుకు తనకు అభ్యంతరమేమీ లేదని డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ స్పష్టం చేశారు. ‘ప్రపంచవ్యాప్తంగా బాలికల విద్య వంటి అంశాలపై దృష్టి సారించాలని అనుకుంటున్నట్లు మిషెల్ గతంలో నాతో చెప్పారు. పాలనలో ఉత్తమ భాగస్వామి కావాలని నేనూ కోరుకుంటున్నాను. ఒకవేళ ప్రభుత్వంలో పాలుపంచుకోవాలని ఆమె అనుకుంటే.. తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి’ అని హిల్లరీ అన్నారు. -
హిల్లరీకి డిబేట్ ప్రశ్నలు ముందే తెలుసా?
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా వారమైనా లేదు. క్లింటన్ ఈ-మెయిల్స్ వ్యవహారం మాత్రం ముదురుతూ వస్తోంది. ప్రైవేట్ ఈ-మెయిల్స్ వాడక వ్యవహారంలో ఇప్పటికే తలమునకలవుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు మరో కొత్త చిక్కు వచ్చి పడింది. అమెరికా ఎన్నికల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఘట్టం ఫెడ్ డిబేట్లో అడగబోయే ప్రశ్నలు క్లింటన్‌కు ముందే తెలిశాయని వికిలీక్స్ పేర్కొంది. డెమొక్రాటిక్ నేషనల్ కమిటీ చైర్పర్సన్, ప్రముఖ రాజకీయ వ్యాఖ్యాత డోనా బ్రజిలే ఫెడ్ డిబేట్ ప్రశ్నలను క్లింటన్‌కు ముందే అందిచారని వికీలీక్స్ తెలిపింది. వికీలీక్స్ పబ్లిష్ చేసిన క్లింటన్ ఈ-మెయిల్స్ బట్టి ఇది స్పష్టమైందని రిపోర్టు చేసింది. దీంతో ఫెడ్ డిబేట్‌ను నిర్వహించిన సీఎన్ఎన్ సంస్థ, డోనా బ్రజిలేతో పూర్తిగా తెగదెంపులకు సిద్దమైంది. న్యూస్ న్యూస్ నెట్‌వర్క్‌లో ఆమె చాలాకాలంగా కంట్రిబ్యూటర్‌గా నిర్వహిస్తూ వస్తున్నారు. అక్టోబర్ 14న బ్రజిలే సమర్పించిన రాజీనామాను సీఎన్ఎన్ అంగీకరించిందని ఆ నెట్వర్క్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. డీఎన్సీ చైర్ డెబ్బీ వాసెర్మాన్ షుల్ట్ పదవికాలం ముగియడంతో, ఆ కమిటీ చైర్‌పర్సన్‌గా బ్రజిలే బాధ్యతలు స్వీకరించారు. జూలైలో సీఎన్ఎన్ కంట్రిబ్యూటర్‌గా ఆమె వైదొలిగారు. మార్చిలో ఫ్లింట్, మిచ్‌లో జరిగిన సీఎన్ఎన్ డెమొక్రాటిక్ డిబేట్ ప్రశ్నలను, ఆ తర్వాత కోలంబస్, ఓహియో సీఎన్ఎన్ టౌన్ హాల్లో జరిగిన డిబేట్ ప్రశ్నలను బ్రజిలే క్లింటన్‌కు ముందే లీక్ చేసినట్టు తాజా ఈ-మెయిల్ వ్యవహారంలో తెలిసింది. అయితే సీఎన్ఎన్ మాత్రం ఈ విషయాన్ని ఖండిస్తోంది. అసలు బ్రజిలేకు ముందస్తుంగా డిబేట్ ప్రశ్నలు తెలుసుకునే అవకాశం ఇవ్వలేదని తెలిపింది. మెటీరియల్ ప్రిపరేషన్ , బ్యాక్‌గ్రౌండ్ ఇన్ఫర్మేషన్, టౌన్‌హాల్ డిబేట్ మీటింగ్స్ ఇలా ఏ విషయాన్ని బ్రజిలేకు ఇవ్వలేదని సీఎన్ఎన్ అధికార ప్రతినిధి తెలిపారు. క్యాంపెయిన్ ఈవెంట్స్‌లో భాగంగా యాహు న్యూస్ లైవ్ కవరేజ్ కోసం మాత్రమే ఆమె ఈ డిబేట్‌కు అతిథిగా వచ్చారని చెప్పారు. అయితే ఈ వ్యవహారంపై బ్రజిలే స్పందించడం లేదు. -
తేడా ఒక శాతమే
ట్రంప్‌పై తగ్గుతున్న హిల్లరీ ఆధిక్యం: తాజా సర్వేలు వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరో ఎనిమిది రోజుల్లో జరగనున్న తరుణంలో డెమోక్రటిక్ అభ్యర్థిని హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ మధ్య పోటీ హోరాహోరీగా మారింది. హిల్లరీ క్లింటన్ ఈ మెయిల్స్ వ్యవహారంపై మళ్లీ విచారణ చేపడుతున్నట్లు ఎఫ్‌బీఐ ప్రకటించడంతో ఆమె ప్రజాదరణ పడిపోతున్నట్లు సర్వేలు వెల్లడి చేస్తున్నాయి. ఇప్పటివరకూ ట్రంప్‌పై పైచేయి సాధించిన హిల్లరీ ఆధిక్యం తగ్గుతూ వస్తోంది. తాజా సర్వేల్లో హిల్లరీకి, ట్రంప్‌కు మధ్య తేడా రెండు రోజుల్లోనే ఒక శాతానికి పడిపోయింది. ఆదివారం ఏబీసీ, వాషింగ్టన్ పోస్టులు నిర్వహించిన సర్వేల్లో క్లింటన్‌కు 46 శాతం, ట్రంప్‌కు 45 శాతం ప్రజా మద్దతు లభించింది. సీఎన్ఎన్ తాజా ఐదు పోల్ సర్వేల్లో సగటున హిల్లరీకి 47 శాతం, ట్రంప్‌కు 42 శాతం ఓట్లు లభించాయి. న్యూయార్క్ టైమ్స్, సినా కాలేజ్ రీసెర్చ్ సెప్టెంబర్‌లో నిర్వహించిన సర్వేలో ఫ్లోరిడా రాష్ట్రంలో వెనుకబడి ఉన్న ట్రంప్.. ప్రస్తుతం నాలుగు పాయింట్ల ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. కాగా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎఫ్‌బీఐ ఈ మెయిళ్లపై దర్యాప్తు చేయాలని నిర్ణయించడాన్ని హిల్లరీ క్లింటన్ తప్పుబట్టారు. దీనిపై డెమోక్రాట్లు, కొంతమంది రిపబ్లికన్లు సైతం విరుచుకు పడుతున్నారు. -
హిల్లరీ సక్సెస్ మేట్‌గా నీరా టాండన్
-
ఒబామా మనసులో ఏముంది?
తన భార్య మిషెల్లీ ఒబామాకు అసలు రాజకీయాలంటేనే ఇష్టం ఉండదని ఇటీవల చెప్పిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తాజాగా మరో విషయాన్ని వెల్లడించారు. ఒబామా శనివారం ఓ రేడియో షోలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ.. అధ్యక్ష పదవి కోసం తన భార్య ఎప్పుడూ పోటీ చేయదని, ఆ పదవిపై ఆమెకు మోజు లేదని తెలిపారు. వచ్చే నెలలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా మిషెల్లీ ఒబామా ప్రజలకు ఎంతగానో దగ్గరయ్యారు. నార్త్ కరోలినాలో దాదాపు 10వేల మంది డెమొక్రటిక్ పార్టీ మద్ధతుదారులు ఉన్న ఓ కార్యక్రమానికి మిషెల్లీ హాజరుకాగా, ఆమెను చూసిన వాళ్లు అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్ పేరుగా బదులుగా మిషెల్లీ పేరుతో నినాదాలు చేశారు. అధ్యక్ష ఎన్నికలలో నెగ్గి వైట్ హౌస్ లో కాలుపెట్టేది హిల్లరీనా.. లేక మిషెల్లీనా అనే తరహాలో అక్కడ సీన్ మారిపోయింది. ఈ విషయాలపై ఒబామా స్పందిస్తూ.. మిషెల్లీకి అధ్యక్షురాలిగా ఉండటానికి కావలసిన ఓపిక, రాజకీయాలపై ఆసక్తి రెండూ లేవని పేర్కొన్నారు. తన భార్య మిషెల్లీ చాలా తెలివైనదని, ఎంతో నేర్పరి అని ఒబామా కొనియాడారు. అయినా ఆమెను చూస్తే తనకు గర్వంగా లేదన్నారు. తమ పార్టీ అధ్యక్ష అభ్యర్థి మిషెల్లీ కాకపోవడంపై ఒబామా తనలో చిన్నపాటి బాధను, తన అభిప్రాయాన్ని వెల్లడించారు. -
ఎన్నికల వేళ ‘ఈమెయిళ్ల’ రచ్చ
-
హిల్లరీ గెలుపుపై డెమోక్రటిక్ పార్టీ ధీమా
-
ఎన్నికల వేళ ‘ఈమెయిళ్ల’ రచ్చ
- హిల్లరీ ఈమెయిళ్లపై మళ్లీ ఎఫ్‌బీఐ దర్యాప్తు - ఎఫ్‌బీఐ నిర్ణయంపై డెమోక్రాట్ల అనుమానాలు వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా మిగిలింది 9 రోజులే. ఇప్పటి వరకూ రేసులో దూసుకుపోతున్న డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు ఇటువంటి కీలక తరుణంలో ఎదురుదెబ్బ తగిలింది. హిల్లరీ ఈమెయిళ్ల వ్యవహారంపై దర్యాప్తును పునరుద్ధరించాలని తాజాగా ఎఫ్‌బీఐ నిర్ణయం తీసుకోవడం సంచలనం సృష్టించింది. హిల్లరీ 2009-2012 మధ్య విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ, వ్యక్తిగత ఈమెయిళ్లను పంపేందుకు ప్రైవేట్ సర్వర్‌ను వినియోగించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన దర్యాప్తును పునరుద్ధరిస్తున్నామంటూ ఎఫ్‌బీఐ డెరైక్టర్ జేమ్స్ కోమే టాప్ కాంగ్రెస్ నేతలకు లేఖ రాశారు. ఆ లేఖ అంశం రిపబ్లికన్ నాయకుడు మీడియాకు విడుదల చేసే వరకూ వైట్‌హౌస్‌కు, హోంశాఖకు తెలియదు. ఎఫ్‌బీఐ నిర్ణయం డెమోక్రటిక్ పార్టీని షాక్‌కు గురిచేసింది. అధ్యక్ష ఎన్నికలకు మరికొన్ని రోజులే సమయం ఉన్న తరుణంలో ఎఫ్‌బీఐ ఈ నిర్ణయం తీసుకోవడంపై వారు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై హిల్లరీ స్పందిస్తూ.. ఈమెయిళ్లకు సంబంధించి ఎఫ్‌బీఐ జూలైలో వచ్చిన నిర్ణయానికి తాజా దర్యాప్తులోనూ పెద్దగా వ్యత్యాసం ఉండకపోవచ్చన్నారు. దేశంలో ఓటింగ్ జరుగుతోందని, ప్రజలకు పూర్తి వాస్తవాలు తెలియాలంటే అన్ని వివరాలను బహిర్గతం చేయాలని ఆమె ఎఫ్‌బీఐని కోరారు.. సర్వేలన్నింటిలోనూ తానే ముందున్నానని, ఈ వ్యవహారం ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతుందని తాను భావించడం లేదనిచెప్పారు. వాటర్‌గేట్ స్కామ్కంటే పెద్దది: ట్రంప్ ఈమెయిళ్ల వ్యవహారంపై రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ.. ఇది వాటర్‌గేట్ కుంభకోణానికంటే పెద్దదని ఆరోపించారు. భారతీయ అమెరికన్ల ఓట్లు హిల్లరీకే: సర్వే న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తలపడుతున్న డెమోక్రాట్ల అభ్యర్థి ిహ ల్లరీ క్లింటన్‌వైపు భారతీయ అమెరికన్లు భారీ సంఖ్యలో మొగ్గుచూపుతున్నట్లు ఓ సర్వేలో తేలింది. ఆమె అధ్యక్షురాలు కావాలని, భారత్-అమెరికా సంబంధాలు ఆమె నాయకత్వంలో మరింత బలపడతాయని వారు భావిస్తున్నట్లు ఇండ్‌యూఎస్ బిజినెస్ జర్నల్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. సర్వే ప్రకారం. ఎన్నికలు ఇప్పుడే జరిగితే భారతీయ అమెరికన్లలో 79.43 శాతం మంది హిల్లరీకి, 14.89 శాతం మంది రిపబ్లికన్ల అభ్యర్థి ట్రంప్‌కు ఓటేస్తారు. హిల్లరీ ఈమెయిల్ హ్యాకింగ్ ఇలా ... అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ప్రచార నిర్వాహకుడు జాన్ పొడెస్టాకు చెందిన 50 వేల ఈ మెయిల్లు ఎలా హ్యాకింగ్ కు గురయ్యాయో తెలిసింది. ఇంతకాలం దీనికి రష్యా ప్రభుత్వం కారణమని భావిస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల ముందు మార్చి 19న పొడెస్టాకు హ్యాకర్లు గూగుల్ నుంచి ఓ మెయిల్ పంపారు. అందులో.. ఉక్రెయిన్‌లో ఎవరో పొడెస్టా జీమెయిల్ పాస్‌వర్డ్‌ను కొట్టేశారని, లాగిన్ కావడానికి విఫలయత్నం చేశారని ఉంది. పాస్‌వర్డ్‌ను మార్చుకొమ్మని ఓ వెబ్‌సైట్‌ను కూడా సూచించారు. పొడెస్టా కింది ఉద్యోగి ఈమెయిల్‌ను క్లింటన్ ప్రచార ఆపరేషన్స్ హెల్ప్ డెస్క్‌కు పంపించారు. దానికి అక్కడి ఉద్యోగి చార్లెస్ డేలావాన్ ‘ఇది సక్రమ మెయిలే. జాన్ తన పాస్‌వర్డ్‌ను తక్షణమే మార్చుకోవాలి’ అని 25 నిమిషాల తరువాత బదులిచ్చారు. పొడెస్టా పాస్‌వర్డ్‌ను మార్చకోవాలన్న లింకు వాస్తవానికి నెదర్లాండ్స్‌లోని కంప్యూటర్ను సూచించింది. దాని వెబ్ అడ్రస్ న్యూజిలాండ్‌లోని టోక్లీయా అనే ప్రాంతం పేరు మీద ఉంది. పొడవైన ఆన్లైన్ చిరునామాలను సూక్ష్మరూపంలో వ్యక్తం చేసే ఓ సర్వీసు ద్వారా హ్యాకర్లు ఈ లింకు నిజస్వరూపాన్ని దాచిపెట్టారు. ‘పొడెస్టా పాస్‌వర్డ్‌ను కొట్టేశారని’ చెప్పిన ఉక్రెయిన్ హ్యాకర్ ఇంటర్నెట్ అడ్రస్‌ను కూడా హ్యాకర్లు ఈమెయిల్లో పొందుపరిచారు. ఆ అడ్రస్ ఉక్రెయిన్‌లోని ఓ మొబైల్ కమ్యూనికేషన్ ప్రొవైడర్దని తెలిసింది. ఆ తరువాత పొడెస్టా ఎలా స్పందించారో తెలియదు కానీ ఐదు నెలల తరువాత హ్యాకర్లు అతని ఖాతాల నుంచి వేల కొలది ఈమెయిళ్లను విజయవంతంగా డౌన్లోడ్ చేశారు. -
11 రోజుల్లో ఎన్నికలు.. హిల్లరీకి ఎదురుదెబ్బ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షపదవి డెమొక్రటిక్ పార్టీ అభ్యర్ధి హిల్లరీ క్లింటన్ తన ఈ-మెయిళ్లపై ఇప్పటివరకూ జరిగిన విచారణలోని వాస్తవాలను బయటపెట్టాలని శుక్రవారం ఎఫ్ బీఐను కోరారు. ప్రస్తుతం దేశంలో ఓటింగ్ జరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరికీ ఈ విషయాలు తెలియాలని ఐయోవాలోని ఓ సమావేశంలో అన్నారు. కొత్త ఈ-మెయిళ్లను కూడా పరిశీలిస్తున్నామని ఎఫ్ బీఐ డైరెక్టర్ జేమ్స్ కామీ చెప్పిన కొద్ది సమయంలో హిల్లరీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కొత్తగా బయటకు వచ్చిన ఈ-మెయిళ్లు ఆంథోని వీనర్-వీనర్ కంపెనీకు చెందినవిగా ఎఫ్ బీఐ గుర్తించింది. ఈ కంపెనీ ఓనర్ గతంలో న్యూయార్క్ డెమొక్రటిక్ పార్టీ నేత. మైనర్ బాలికపై లైంగిక దాడులు చేశారని ఆయనపై ఆరోపణలు వచ్చిన తర్వాత పార్టీ నుంచి పక్కకు తప్పుకున్నారు. దాదాపు ఏడాది కాలం పాటు హిల్లరీ ఈ-మెయిళ్లపై విచారణ చేసిన ఎఫ్ బీఐ ఎలాంటి కేసు నమోదు చేయలేదు. దీంతో న్యాయశాఖ విచారణను నిలిపివేసింది. అయితే తాజాగా బయటపడిన ఈ-మెయిళ్ల కారణంగా మొత్తం కేసును ఎఫ్ బీఐ మళ్లీ తెరచింది. మరో 11 రోజుల్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్ననేపథ్యంలో ఎఫ్ బీఐ హిల్లరీపై కేసును తెరవడంపై డెమొక్రటిక్ ల శిబిరంలో ఆందోళన నెలకొంది. తొలుత కేసును మూసేసిన ఎఫ్ బీఐ మరలా తెరవడంపై డెమొక్రటిక్ లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎఫ్ బీఐ దురుద్దేశంతోనే కేసును తెరుస్తున్నట్లు భావిస్తున్నారు. కాగా, హిల్లరీ ఈ-మెయిళ్ల కేసును రీ ఓపెన్ చేయడాన్ని అధ్యక్ష పదవి రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డోనాల్డ్ స్వాగతించారు. చివరకు న్యాయం జరగబోతోందని వ్యాఖ్యానించారు. న్యూ హంప్ షైర్ లో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో ఆయన మద్దతుదారులు 'ఆమెను జైల్లో వేయండి' అంటూ నినాదాలు చేశారు. తప్పును సరిదిద్దుకునేందుకు ముందుకు వచ్చిన న్యాయశాఖ, ఎఫ్ బీఐలపై తనకు గౌరవముందని ట్రంప్ అన్నారు. -
ఈ ప్రత్యర్థుల్లో పవిత్రులెవరు?
అభిప్రాయం హిల్లరీ గెలుపుతో అమెరికాకు, ప్రపంచానికి జరిగే మేలు పెద్దగా ఉండకపోవచ్చు. కానీ అమెరికన్లు వారి కాలం చెల్లిన భావాలు కాస్తయినా మార్చుకుంటారేమో. ఏదేమైనా రెండు దుష్కృత్యాల్లో తక్కువ దుష్కృత్యాన్ని ఎంచుకునే అవకాశం మాత్రమే ఓటర్లకు ఉండటం దురదృష్టకరం. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రహసనం గమనిస్తుంటే ఏమాత్రం వివేకం ఉన్నవారి కయినా అమెరికా పట్ల భ్రమలు తొలగి పోతాయి. అమెరికాలో ఎవరు అధికారం లోకి వచ్చినా నడిచేది కార్పొరేట్ కంపెనీల రాజ్యమేననేది బహిరంగ రహస్యమే. డెమో క్రాట్లు వస్తే కాస్తయినా ప్రజల పట్ల ఉదా రంగా ఉంటారనీ, రిపబ్లికన్లయితే పూర్తిగా తిరోగమన భావజాలంతో వ్యవహరిస్తారనీ ఉవాచ. అయితే ఆర్థిక, విదేశాంగ విధానాల్లో చిన్న విభేదాలు తప్ప ఒకేరకం పంథానే వీరు అనుసరిస్తుంటారనేది అనుభవ సత్యం. జాత్యహంకారమూ, పురుషాహంకారమూ అనేక దొంతరల ముసుగుల్లో దాగిన ఈ అగ్రరాజ్యంలో ఒక మహిళ అధ్యక్ష పదవికి పోటీదారుగా నిలబడగలగడమే ఈ ఎన్నికల ప్రత్యేకత. రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ పుట్టుకతోనే శతకోటీశ్వరుడు. పరమ ఆధిపత్యపూరిత భావాలకూ, సంపన్నులకూ అతడు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇతర దేశాల నుంచి వచ్చే ప్రజల పట్ల అతని ద్వేషపూరిత వ్యాఖ్యలు కల్లోలాలు రెచ్చగొట్టేవిగా ఉన్నాయి. వెనుకబడిన దేశాలు తమ ఖర్చుతో చదివించిన నిపుణ శ్రామికులు (ఐటీ రంగం) అమెరికా వృద్ధికి ప్రధాన కారణాల్లో ఒక భాగం. క్యాసినోలు..ఆయుధ పరిశ్రమ తప్ప అన్ని ఉత్పత్తి రంగాల్నీ నిర్లక్ష్యం చేయడంతో నిరుద్యోగం పెరిగింది. ట్రంప్ ఓట్ల కోసం ఇప్పుడు ఆ నిరుద్యోగుల్ని వలస ప్రజల పైకి రెచ్చగొడుతున్నాడు. తెల్లజాతి ఆధిపత్యంపై కరుడుగట్టిన క్లుక్లక్స్ క్లాన్, ఆయుధ లాబీలు అతడిని సమర్థిస్తున్నాయి. నిరుద్యోగం పెరిగి సంక్షోభ స్థాయికి చేరినప్పుడు, దాన్ని నివా రించే ఆర్థిక విధానాలు అనుసరించడానికి రాజకీయ నేతలు సిద్ధంగా లేనప్పుడు.. ప్రత్యేకంగా కనిపించే శత్రువుని వారు సృష్టిస్తారు. ట్రంప్ సృష్టించిన శత్రువులు లాటినోలు, ఆసియన్లు, ముస్లింలు, స్త్రీలు.. ఈ బయటివారు తమకు అన్యాయం చేస్తున్నారనే భావాన్ని పెంచి పోషించినందునే కొంతయినా అతనికి మద్దతు లభించింది. నిరుద్యో గానికి, సాపేక్ష దరిద్రానికి కారణం ఆర్థిక విధానాలే అని ట్రంప్ ఎందుకు వాదించడం లేదు? 1. రిపబ్లికన్లు కూడా అవే ఆర్థిక విధా నాలను ప్రోత్సహించడం. 2. సంపన్నులకు లాభం పెంచే నిర్ణయాల వల్ల అత్యధికంగా లాభపడిన వాళ్లలో ట్రంప్ కూడా ఒకడు కావడం. ట్రంప్ గత పదేళ్లుగా ఆదాయపన్ను చెల్లించలేదని హిల్లరీ ప్రక టించారు. అట్లాగే అతని క్యాసినోల్లో, కంపెనీల్లో కార్మికులకు ఆరోగ్య బీమా వంటి కనీస సదుపాయాలు ఇవ్వడానికీ ట్రంప్ నిరాకరిం చడంతో వాటిని మూతబెట్టారు. దీన్నిబట్టే అతడు ఎవరికి అనుకూ లుడో అర్థం అవుతున్నది. ‘సంపన్నులు, తెల్లజాతి ఆధిపత్యంవల్లే అమెరికా బాగుపడుతుంద’ని అతను నిర్లజ్జగా ప్రకటించాడు. అయితే ట్రంప్ ఎన్నికల బరిలో దిగిన క్షణం నుంచే మహిళలను కించపర్చే వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నాడు. స్త్రీలు అనుభవైక్య వస్తువులని, వారి అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా వారిపై లైంగిక చర్యలు చేయవచ్చని, అది మగాడి తనం అనీ తన అభిప్రాయాలు ప్రకటించిన రిపోర్టులు బయటికి వచ్చాయి. అవి చర్చించాల్సినంత ప్రాధాన్యత కల విషయాలు కాదని, తన ఆర్థిక విధానాలపై చర్చ జరగాలనీ ట్రంప్ వాదిస్తున్నాడు. మరోవైపు తన శారీరక సామర్థ్యంతో పోలిస్తే హిల్లరీ బలహీనురాలని అతడు చెబుతున్నాడు. అయితే కండలు తిరిగి ఉన్నంత మాత్రాన అతని మెదడు బలంగా పనిచేస్తుంద నేందుకు దాఖలాలు లేవు. కాని అతను పరోక్షంగా స్త్రీలు శారీరకంగా బలం లేనివారు కనుక పరిపాలనకు పనికిరారని చెబుతున్నాడు. అలా అయితే అమెరికన్లు ఆంబోతులనే అధ్యక్షపదవిలో ఉంచితే మంచిది కదా. లైంగిక దాడి సామర్థ్యం కూడా ఒక పాలనా అర్హతగానే భావిస్తున్నాడు ట్రంప్. మగ ఆధిపత్యం ఒక సహజ ప్రక్రియ అని నమ్మేవారికి అతను బాగా నచ్చుతున్నాడు. మరో వైపున హిల్లరీ తన ఈ–మెయిల్స్ తొలగించడం అనేక అనుమానాలను రేకెత్తించింది. కార్పొరేట్ల ప్రయోజనాల కోసం ఆమె పరిధి దాటి ప్రవర్తించి ఉండవచ్చు. అయితే క్లింటన్ ప్రేమ వ్యవ హారం జరిగినప్పుడు హిల్లరీ ప్రవర్తన విమర్శలకు గురైంది. అనేక సార్లు వివాహేతర సంబంధాలు ఏర్పర్చుకున్నాడని ఆరోపణలకు గురైన క్లింటన్‌తో ఆమె విడివడక పోవడానికి ప్రధాన కారణం ఆమె అధ్యక్ష పదవిని జీవిత లక్ష్యంగా ఎంచుకున్నందువల్లనే కావచ్చు. అమెరికాలో అధ్యక్ష పదవి కోసం 30, 40 ఏళ్ల పాటు సంసిద్ధం అవు తారు. ‘విడాకులు పొందిన స్త్రీ’ ని ఆమోదించగల విశాల హృదయం అమెరికన్లకు లేదు. అది తనకు ప్రతికూలాంశం అవుతుందని ఆమె భావించింది. అయితే ఒక స్త్రీని పాలనా సామర్థ్యం, విధానాలని బట్టి కాక కుటుంబాన్ని బట్టి గుర్తించడం మగాధిక్యతలోని మరో కోణం. హిల్లరీ దుస్తుల గురించి ఆమె అలంకరణ గురించి చర్చ జరిపిన స్థాయిలో ఆమె బలాలు, బలహీనతలపై మీడియా చర్చ జరపలేదు. అయితే ఈ ఇద్దరిలో ఎవరూ నమ్మదగిన వారు కాదని సగటు ఓటరు అభిప్రాయం. అయితే స్త్రీలపై, వలసవచ్చిన వారిపై తన భావాలు చాలా సరైనవని ట్రంప్ బలంగా నమ్ముతున్నాడు. నిజానికి ‘నేను చేసిందే ప్రజాస్వామ్యం’ అనే అమెరికాకు ట్రంప్ నిజమైన ప్రతినిధి. కనుకనే ‘నేను గెలిస్తే ఎన్నికల్లో మోసం జరగనట్లు అని తను ప్రకటిం చడం అతి అహంకారానికి నిదర్శనమో, అజ్ఞానమో తేలడం లేదు. ట్రంప్ అభిప్రాయాలతో దాదాపు ఏకీభావం ఉంది కనుకనే సంఘ్పరివారం ట్రంప్‌కు బాకాలూదే పనిలో ఉన్నారు. ఛాందస వాదులు అంతా ఒక్కటే. స్త్రీల పట్ల, అణగారిన వారిపట్ల, మైనారిటీల పట్ల వారి పొగరుబోతు దుర్మార్గ ప్రవర్తనా ఒక్కటే. అబార్షన్ హక్కులు కలిగిస్తే స్త్రీలకు అనుచిత అధికారం ఇచ్చినట్లే అంటున్న ట్రంప్‌కి, కుటుంబ హింస నిరోధక చట్టం ఎత్తివేయాలంటున్న వారికి ఏం తేడా లేదు. వీరు గతకాలపు మనుషులు. గతకాలపు ఆధిపత్య వ్యవస్థలను ఆధునిక కాలంలో నిలబెట్టాలనుకుంటున్నవారు. హిల్లరీ గెలవడం వలన అమెరికాకు, ప్రపంచానికి ప్రత్యేకించి జరిగే మేలు పెద్దగా ఉండకపోవచ్చు. కానీ ఒక స్త్రీని అధ్యక్షురాలిగా ఎంచుకోవడం వల్ల అమెరికన్లు వారి కాలం చెల్లిన భావాలు కాస్త యినా మార్చుకుంటారేమో. ఏదేమైనా రెండు దుష్కృత్యాల్లో తక్కువ దుష్కృత్యాన్ని ఎంచుకునే అవకాశం మాత్రమే అమెరికన్ ఓటర్లకు ఉండటం దురదృష్టకరం. వ్యాసకర్త : దేవి, సాంస్కృతిక కార్యకర్త ఈ మెయిల్ : pa_devi@rediffmail.com -
హిల్లరీకి ఎన్నారైలు ఎన్ని నిధులిచ్చారో తెలుసా?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ఎన్నికల ప్రచారానికి ప్రవాస భారతీయులు భారీగా నిధులు సమకూర్చారు. 10 మిలియన్ డాలర్లు(సుమారు రూ. 66.9కోట్లు)పైగా నిధులు పోగుచేశారు. మేరీల్యాండ్ కు చెందిన ఫ్రాంక్ ఇస్లామ్, కాలిఫోర్నియాకు చెందిన రజ్దాన్ దుగ్గల్.. మిలియన్ డాలర్ల చొప్పున నిధులు సేకరించారని హిల్లరీ ప్రచార బృందం వర్గాలు వెల్లడించాయి. శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన అజయ్, వినిత భుటోరియా 5 లక్షల డాలర్లు పోగేశారు. 'హిల్ బ్లేజర్స్' పేరుతో బృందంగా ఏర్పడి ప్రవాస భారతీయులు విరాళాలు సేకరించారు. ఈ జాబితాలో లక్ష డాలర్లు ఇచ్చిన వారు, నిధులు సేకరించిన వారి పేర్లు ఉన్నాయి. గతేడాది ఏప్రిల్ 12 నుంచి హిల్లరీ కోసం ఎన్నారైలు నిధులు సేకరించడం మొదలుపెట్టారు. అనుకున్నదానికంటే పెద్ద మొత్తంలో ప్రవాసులు నిధులు పోగేశారని హిల్లరీ ప్రచార బృందం వర్గాలు తెలిపాయి. ఇజ్రాయిల్ అమెరికన్స్ తర్వాత అత్యధిక నిధులు సేకరించిన వారిగా ప్రవాస భారతీయులు గుర్తింపు పొందారు. కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ గెలవాలని అత్యధిక మంది ఇండియన్-అమెరికన్లు కోరుకుంటున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. -
ఎన్నికల వేళ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వెంటనే ఎన్నికలు రద్దు చేసి తనను విజేతగా ప్రకటించాలని అన్నారు. హిల్లరీ అనుసరిస్తున్న విధానాలు చాలా చెత్తగా ఉన్నాయని ఆరోపించారు. అమెరికాలో ఎన్నికలకు మరో రెండు వారాల గడువుమాత్రమే ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో పోటాపోటీగా దూసుకెళుతున్న ట్రంప్, హిల్లరీలు ఒకరిపై ఒకరు మాటల భాణాలు సందిస్తున్నారు. గురువారం ఓహియోలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ట్రంప్ మాట్లాడుతూ 'ఇప్పటికిప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే మనం వెంటనే ఎన్నికలు రద్దు చేయాలి. నన్ను విజేతగా ప్రకటించి నాకు అధికారం ఇవ్వాలి. ఎందుకంటే వారు ఎన్నికల్లో రిగ్గింగ్ చేస్తారు. మీడియా, ఇప్పటికే పాతుకుపోయిన ఉన్న నాయకులంతా నా వెనుక కుట్రలు చేస్తున్నారు' అని ట్రంప్ ఆరోపించారు. -
బర్త్‌డే నాడు హిల్లరీ బిజీ బిజీ
-
హిల్లరీ కోసం కాదు.. ట్రంప్‌కు వ్యతిరేకంగానే..!
క్లేవ్లాండ్/న్యూయార్క్: అధ్యక్ష ఎన్నికల్లో ఎవరికి ఓటేయాలనే అంశంపై క్లేవ్‌లాండ్‌లో నివసిస్తున్న ఇండో అమెరికన్లు డైలమాలో ఉన్నారు. అయితే చాలా మంది మాత్రం హిల్లరీ క్లింటన్కే ఓటేస్తామని, మహిళలు, వలసల అంశంపై డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు గురి చేస్తున్నాయని పేర్కొంటున్నారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం, ఉగ్రవాదం, వలసలు తదితర అంశాలపై ట్రంప్ విజన్ వారి హృదయాలను తాకాయి. హిల్లరీ క్లింటన్‌కు ఓటేసి మరోమారు ఒబామా తరహా పాలన కావాలని వారు భావించలేదు. అయితే ట్రంప్ తాజా వివాదాలు వారిని భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్‌కు వ్యతిరేకంగానే హిల్లరీకి ఓటేయాలని అనుకుంటున్నామని, హిల్లరీ అధ్యక్షురాలు కావాలన్న ఆకాంక్షతో మాత్రం కాదని చాలా మంది చెబుతున్నారు. మరోవైపు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ తీసుకునే చెడు నిర్ణయాలను ఇకపై భరించే స్థితిలో లేరని ప్రముఖ న్యాయవాది, ‘ఇండియన్–అమెరికన్స్ ఫర్ ట్రంప్–2016’ ఉపాధ్యక్షుడు ఆనంద్ అహూజా అన్నారు. ‘వలసదారుల వ్యతిరేకిగా ట్రంప్‌ను చిత్రీకరిస్తున్నారు. ట్రంప్ అక్రమ వలసదారులకు మాత్రమే వ్యతిరేకి. చట్టబద్ధంగా వలస వచ్చే వారికి, వస్తున్న వారికి వ్యతిరేకి కాదు’ అని స్పష్టం చేశారు. -
అగ్ర పీఠం పోరు హోరాహోరీ
- తుది అంకానికి అమెరికా అధ్యక్ష ఎన్నిక - హిల్లరీ-ట్రంప్‌ల మధ్య ఉత్కంఠ సమరం - హిల్లరీకే గెలుపు అవకాశాలు ఎక్కువంటున్న సర్వేలు - నవంబర్ 8న అధ్యక్ష ఎన్నికల్లో తేలనున్న ఫలితం అమెరికా అధ్యక్ష పదవి! ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన అధికార పీఠం! దానిని దక్కించుకోవడానికి హేమాహేమీల మధ్య హోరాహోరీ పోరాటం! రెండేళ్ల కిందట మొదలైన ఈ పోరు తుది అంకానికి చేరింది. ప్రత్యర్థులు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. వ్యక్తిగత దూషణల పర్వం పతాక స్థాయికి చేరింది. పరస్పర ఆరోపణలతో విస్ఫోటనాలు జరుగుతున్నాయి. ఎంతో ఉత్కంఠగా, ఉద్రిక్తంగా సాగుతున్న ఈ సమరం మరో 15 రోజుల్లో ముగియనుంది. నవంబర్ 8న అమెరికన్లు తీర్పు ఇవ్వనున్నారు. ఇద్దరు ప్రధాన అభ్యర్థుల్లో విజేత ఎవరనేది ఆ రోజు జరిగే ఎన్నికలు తేల్చనున్నాయి. అయితే.. అమెరికన్లు ఇప్పటికే చాలా వరకూ నిర్ణయం తీసేసుకున్నారని సర్వేలు చెప్తున్నాయి. కొంత కాలం కిం దటి వరకూ ప్రజాభిప్రాయం ఇరువురు ప్రధాన అభ్యర్థుల మధ్యా పోటాపోటీగా ఉన్నప్పటికీ.. ఎన్నికల సమయం దగ్గరపడే కొద్దీ డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ వైపు మొగ్గు పెరుగుతోందని ప్రముఖ సర్వే సంస్థలు వెల్లడిస్తున్నా యి. ఇందుకు ప్రధాన కారణం.. హిల్లరీ విధానాల కన్నా కూడా.. వివాదాస్పద వ్యాఖ్యలకు పేరుపెట్టిన ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ వైఖరిపై విముఖతేననీ చెప్తున్నాయి. అయినప్పటికీ.. దేశంలో ‘స్వింగ్ స్టేట్స్’గా పరిగణించే కొన్ని కీలక రాష్ట్రాలకు ఫలితాలను తారుమారు చేయగల సత్తా ఉంటుందని వివరిస్తున్నాయి. యూఎస్ఏ టుడే తాజా సర్వే ఫలితాలు.. మొత్తం 538 ఎలొక్టరల్ ఓట్లలో హిల్లరీకి 263 ఓట్లు, ట్రంప్‌కు 180 ఓట్లు వస్తాయని.. మరో 95 ఓట్లు ఎటువైపైనా పడవచ్చని చెప్తున్నాయి. అధ్యక్ష పీఠాన్ని సొంతం చేసుకోవడానికి 270 ఓట్లు అవసరం. ఈ సర్వే ఫలితాన్ని బట్టి.. అమెరికా ఓటర్లు తొలి మహిళా అధ్యక్షురాలిని ఎన్నుకోవడం ద్వారా కొత్త చరిత్ర సృష్టించే దిశగా పయనిస్తున్నారని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అయితే.. వివాదాల ట్రంప్ మాత్రం.. అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్ జరుగుతుందని ముందే ఆరోపణలు గుప్పిస్తున్నారు. తాను గెలిస్తే మాత్రమే ఫలితాలను అంగీకరిస్తానంటూ మరో వివాదానికి తెరతీశారు. ఇటువంటి ఆరోపణల ద్వారా ఎన్నికల సమయంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకునే ప్రమాదం ఉందన్న ఆందోళనలూ వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ప్రస్తుత అమెరికా అధ్యక్ష ఎన్నికల పూర్వాపరాలపై ‘సాక్షి’ ఫోకస్.. హిల్లరీ చరిత్ర సృష్టించే దిశగా... అమెరికా మాజీ అధ్యక్షుడు (1993-2001) బిల్ క్లింటన్ భార్య హిల్లరీ క్లింటన్ (68). ఆమె 2000 సంవత్సరంలో న్యూయార్క్ నుంచి సెనెటర్‌గా ఎన్నికయ్యారు. అమెరికా ప్రథమ మహిళగా ఉంటూ సెనెటర్‌గా ఎన్నికైన తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. అనంతరం 2006 లోనూ రెండోసారి సెనెటర్‌గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2008 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ నామినేషన్ కోసం బరాక్ ఒబామాతో పోటీ పడి ఓడిపోయారు. ఆమె 2008 ఎన్నికల తర్వాత ఒబామా సర్కారులో విదేశాంగ మంత్రిగా పనిచేశారు. 2013 వరకూ ఆ పదవిలో కొనసాగారు. ఇప్పుడు అధ్యక్ష ఎన్నికల్లో పార్టీ నామినేషన్ సంపాదించి ప్రచారంలో దూసుకెళుతున్నారు. ఈ ఎన్నికల్లోనూ గెలిస్తే.. అమెరికా తొలి మహిళా అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టిస్తారు. జాతి, వయసు ప్రభావం.. ఈ అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసే అంశాల్లో అమెరికా పౌరుల జాతి, వయసు, లింగభేదం, మతం, దేశీయత తదితర అంశాలు ప్రభావం చూపనున్నాయని రాజకీయ నిపుణుల అంచనా. ఇటీవల నిర్వహించిన పలు సర్వేల ప్రకారం.. ⇒ అమెరికా నల్లజాతి వారిలో అత్యల్పంగా 3% మంది, హిస్పానిక్(లాటిన్ అమెరికా జాతీయులు) ప్రజల్లో 17% మం ది ట్రంప్‌కు మద్దతిస్తున్నారు. కీలకమైన 4 ‘స్వింగ్ రాష్ట్రా’ల్లోని జనాభాలో హిస్పానిక్ జాతీయులు ఐదో వంతు మంది ఉన్నా రు. శ్వేతజాతీయుల్లో 51% మంది ట్రంప్‌ను బలపరుస్తున్నారు. ⇒ పురుషులు, మహిళల వారీగా చూస్తే.. పురుషుల్లో 49% మంది ట్రంప్‌కు, మహిళల్లో 49% మంది హిల్లరీకి మద్దతిస్తున్నారు. హిల్లరీకి మద్దతిచ్చే పురుషుల సంఖ్య 33%గా ఉంటే.. ట్రంప్‌కు మద్దతిచ్చే మహిళల సంఖ్య 34%గా ఉంది. ⇒ వయసు వారీగా చూస్తే.. 18 నుంచి 39 ఏళ్ల వయసున్న యువతరంలో హిల్లరీ బలం అధికంగా ఉంది. వారిలో 41% మంది ఆమెకు మద్దతు ఇస్తోంటే, ట్రంప్‌కు మద్దతిస్తున్న ఆ వయసు వారి సంఖ్య 29 శాతమే ఉంది. 40 నుంచి 64 మధ్య వయస్కుల్లో ఇద్దరు అభ్యర్థులకూ కొంచెం తేడాతో ఒకే విధమైన మద్దతు లభిస్తోంది. వీరిలో ట్రంప్‌కు మద్దతిస్తున్న వారి సంఖ్య 44 శాతమైతే.. హిల్లరీని సమర్థిస్తున్న వారి సంఖ్య 43 శాతంగా ఉంది. ఇక 65 ఏళ్లు ఆపై వయసుగల పెద్దల్లో మాత్రం ట్రంప్ హవా ఉంది. వారిలో 49 శాతం మంది ఆయనకు మద్దతుగా నిలిస్తే.. కేవలం 39 శాతం మంది మాత్రమే హిల్లరీకి మద్దతునిస్తున్నారు. నిజానికి యువకులు రాజకీయంగా క్రియాశీలకంగా ఉన్నా కూడా ఓట్లు వేయడం తక్కువని, పెద్ద వాళ్లు ఠంచనుగా ఓటు వేస్తారని ఓటింగ్ సరళులు చెప్తున్నాయి. అయితే.. ఇటీవలి కాలంలో యువత బయటకు వచ్చి ఓటింగ్‌లో పాల్గొంటున్న తీరు పెరుగుతోందనీ పరిశీలకులు చెప్తున్నారు. ⇒ ఇక విద్యాభ్యాసం స్థాయిని బట్టి కూడా ఇరువురు నేతలకు మద్దతిస్తున్న వారి సంఖ్యలో తేడాలున్నాయి. తక్కువ విద్యాభ్యాసం గల వారిలో ట్రంప్‌కు మద్దతు ఎక్కువగా ఉంటే.. విద్యాధికుల్లో హిల్లరీకి ఆదరణ అధికంగా ఉంది. ఉన్నత పాఠశాల అంతకన్నా తక్కువ చదువు గల వారిలో 44% మంది ట్రంప్‌కు, 36% మంది హిల్లరీకి మద్దతిస్తున్నారు. కాలేజీ విద్యను అభ్యసించిన వారిలో ట్రంప్‌కు 46%, హిల్లరీకి 40% మద్దతు ఉంది. గ్రాడ్యుయేట్ల దగ్గరికి వచ్చేసరికి ట్రంప్‌ను సమర్థిస్తున్న వారి సంఖ్య 37% అయితే, హిల్లరీకి మద్దతిస్తున్న వారి సంఖ్య 46% గా ఉంది. పోస్ట్ గ్రాడ్యుయేట్లలో 51 శాతం మంది హిల్లరీకి మద్దతు ప్రకటిస్తే.. కేవలం 33 శాతం మంది ట్రంప్‌కు మద్దతిస్తామని చెప్తున్నారు. ట్రంప్ దురుసుగా.. దూకుడుగా.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ (70) రియల్ ఎస్టేట్ వ్యాపారి, టెలివిజన్ ప్రొడ్యూసర్. వ్యాఖ్యాత. 1996 నుంచి 2015 వరకూ మిస్ యూనివర్స్, మిస్ యూఎస్ఏ, మిస్ టీన్ యూఎస్ఏ అందాల పోటీల నిర్వహణ యజమాని కూడా. ఫోర్బ్స్ తాజా జాబితా ప్రకారం ప్రపంచ కుబేరుల్లో 324వ స్థానంలో ఉన్న ట్రంప్.. 2000 సంవత్సరంలోనే రిఫార్మ్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి పోటీ పడటానికి నామినేషన్ కోసం ప్రయత్నించారు. అయితే ఓటింగ్ ప్రక్రియ మొదలుకాక ముందే విరమించుకున్నారు. తాజా ఎన్నికల కోసం తాను రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్లు గత ఏడాదే ప్రకటించారు. దురుసుగా, దూకుడుగా దూసుకెళ్తూ నామినేషన్ సాధించి హిల్లరీతో తలపడుతున్నారు. ఆయన గెలిస్తే.. అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికైన అత్యంత వృద్ధుడిగా రికార్డులకెక్కుతారు. సర్వేల్లో హిల్లరీ ముందంజ ఎన్నికల రేసులో ఆరంభంలో హిల్లరీ, ట్రంప్‌ల మధ్య ప్రజాభిప్రాయం పోటాపోటీగా ఉన్నప్పటికీ.. ఎన్నికల సమయం దగ్గరపడే కొద్దీ హిల్లరీ వైపు మొగ్గు పెరుగుతూ వస్తోంది. తాజాగా నిర్వహించిన సర్వే ప్రకారం ముఖాముఖి పోటీలో హిల్లరీ 48% మంది మద్దతు ఉంటే.. ట్రంప్‌కు 41% మద్దతు ఉందని వెల్లడైనట్లు యూఎస్ఏ టుడే పత్రిక ప్రకటించింది. అంటే ట్రంప్ కన్నా హిల్లరీ ఏడు శాతం ఆధిక్యంలో ఉన్నారని, రెండు నెలల కిందటికన్నా ఆమె ఆధిక్యం ఇప్పుడు ఒక శాతం పెరిగిందని చెప్పింది. ఇంకా నిర్ణయించుకోని ఓటర్ల సంఖ్య అంతకంతకూ తగ్గుతూ వస్తోందని కూడా పేర్కొంది. అయితే.. సర్వేలో నాలుగు పక్షాల పోటీలో.. హిల్లరీకి 42%, ట్రంప్‌కి 35%, లిబర్టేరియన్ అభ్యర్థి గారీ జాన్సన్‌కు 9 శాతం ఓట్లు, గ్రీన్ పార్టీ అభ్యర్థి జిల్ స్టీన్‌కు 4 శాతం ఓట్లు చొప్పున లభించగా.. 10 శాతం మంది ఇంకా నిర్ణయించుకోలేదని జవాబిచ్చినట్లు వెల్లడించింది. ఈ ఎన్నికల్లో తాము మద్దతిస్తున్న అభ్యర్థి గెలుస్తాడన్న ఆశ కన్నా.. ప్రత్యర్థి అభ్యర్థి గెలుస్తారేమోనన్న ఆందోళన అత్యధిక శాతం మంది ఓటర్లలో కనిపిస్తున్నట్లు యూఎస్ఏ టుడే వివరించింది. అంతేకాకుండా.. హిల్లరీకి మద్దతు ఇస్తున్న ప్రతి పది మందిలో ముగ్గురు తాము ట్రంప్‌కు వ్యతిరేకంగా హిల్లరీకి మద్దతు ఇస్తున్నామని, ఆమె కోసం కాదని చెప్పారు. అలాగే.. ట్రంప్‌కు మద్దతు ఇస్తున్న ప్రతి పది మందిలో నలుగురు తాము హిల్లరీకి వ్యతిరేకంగా ఆయనకు మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. విచిత్రమేమిటంటే.. సర్వే చేసిన వారిలో సగం మందికి పైగా ఇద్దరు ప్రధాన నేతలనూ విశ్వసించడం లేదు. హిల్లరీ నిజాయితీపరురాలు, విశ్వసించదగ్గ వ్యక్తి అని తాము నమ్మడం లేదని 59 శాతం మంది పేర్కొన్నారు. అందులో హిల్లరీకి మద్దతిస్తున్న ప్రతి నలుగురిలో ఒకరిది ఇదే మాట. ఇక ట్రంప్‌కు నిజాయితీ లేదని, ఆయనను నమ్మలేమని అనేవారి సంఖ్య 61 శాతంగా ఉంది. ట్రంప్‌కు మద్దతిస్తున్న ప్రతి ఐదుగురిలో ఒకరిది ఇదే అభిప్రాయం. సామాజిక అంశాల చుట్టూ.. అమెరికా అధ్యక్ష పదవిని గత రెండు పర్యాయాలూ డెమొక్రటిక్ పార్టీ(ఒబామా) దక్కించుకుంది. అంతకుముందు రెండు సార్లు రిపబ్లికన్ పార్టీ (బుష్) చేతుల్లో ఆ పదవి ఉంది. తాజా ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్య జరుగుతున్న సమరం అనేక ఉత్కంఠ మలుపులు తిరుగుతోంది. రెండు వందల ఏళ్ల అమెరికా ప్రజాస్వామ్య చరిత్రలోనే అత్యంత వివాదాస్పద ఎన్నికలుగా ఈ అధ్యక్ష ఎన్నికలు చరిత్రకెక్కుతున్నాయి. ముఖ్యంగా గత రెండు అధ్యక్ష ఎన్నికల్లో.. అప్పటికే మందగించిన దేశ ఆర్థిక పరిస్థితులు, వాటిని చక్కదిద్దడం అనేవి ఎన్నికల్లో ప్రధానాంశాలుగా ఉన్నాయి. ఇప్పుడూ దాదాపు అదే పరిస్థితి ఉన్నప్పటికీ.. ఈ ఎన్నికల్లో సామాజిక అంశాలు కీలక స్థానంలోకి వచ్చి చేరాయి. ముఖ్యంగా జాతి వివక్ష, లింగ వివక్ష, లైంగిక దాడి, వలసలు, ముస్లిం భయం, యూదు వ్యతిరేకత, ధనికస్వామ్యం, అధికారస్వామ్యం వంటి అంశాల చుట్టూనే ప్రధాన ప్రత్యర్థుల చర్చ, ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో ప్రధాన అభ్యర్థులు పరస్పరం చేసుకుంటున్న ఆరోపణలు, వెలుగుచూస్తున్న అంశాలు అమెరికన్లను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ప్రజలు తమ తమ అభిప్రాయాల మేరకు చెరోవైపుగా చీలుతున్నారు. ఆరోపణలు, విమర్శలు.. అందులో.. మహిళలపట్ల ట్రంప్ వ్యవహార శైలి, చేస్తున్న దూషణపూర్వక వ్యాఖ్యలు, గతంలో వచ్చిన, ఇప్పుడూ వస్తున్న లైంగిక దాడుల ఆరోపణలు, అమెరికా నుంచి వలసదారులను పంపించివేయాలంటూ చేసిన వ్యాఖ్యలు, ఉగ్రవాదానికి - ముస్లింలకు ముడిపెడుతూ చేసిన విమర్శలు మరింతగా ప్రభావం చూపుతున్నాయి. ఈ ఆరోపణల ముందు హిల్లరీ అవినీతిపరురాలని, డబ్బు తీసుకోనిదే ఏ పనీ చేయరని, 30 ఏళ్లుగా ప్రభుత్వ వ్యవస్థలో ఉన్నా ఏమాత్రం సామర్థ్యం లేదని, విదేశాంగ మంత్రిగా అధికారిక ఈ-మెయిళ్లను ప్రైవేటు సర్వర్ ద్వారా పంపించారని ట్రంప్, ఆయన శిబిరం చేస్తున్న విమర్శలు తేలిపోతున్నాయి. దీంతో పార్టీ ప్రైమరీల సమయంలో తనకు లభించిన మద్దతును ఆయన క్రమంగా కోల్పోతున్నారు. పలువురు మహిళలు తమపై ట్రంప్ గతంలో లైంగిక దాడులకు పాల్పడ్డారంటూ మీడియా ముందుకు వచ్చి ఆరోపణలు చేస్తే.. అవి నిరాధారమని కొట్టివేసిన ట్రంప్.. తాను కూడా హిల్లరీ క్లింటన్ భర్త, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌పై లైంగిక ఆరోపణలను తెరమీదకు తెచ్చే ప్రయత్నం చేశారు. చర్చల్లో హిల్లరీ పైచేయి.. ఇటీవల బయటపడిన పదేళ్ల కిందటి తన వీడియో క్లిప్ వ్యాఖ్యలతో ట్రంప్ మరింత ఇబ్బందుల్లో పడ్డారు. మహిళలను అత్యంత అసభ్యంగా చిత్రిస్తూ మాట్లాడటమే కాక.. ఒక మహిళపై తాను లైంగిక దాడికి పాల్పడ్డ సూచనలు కూడా ఈ వీడియోలోని ట్రంప్ వ్యాఖ్యల్లో వినిపించడం పెను దుమారం రేపింది. సొంత పార్టీ నాయకులు కొందరు ఆయనను బరిలో నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేసే పరిస్థితి వచ్చింది. చివరికి తనే ఎంపిక చేసుకున్న ఉపాధ్యక్ష అభ్యర్థి కూడా ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టిన దుస్థితి. అయినా తాను ‘పోరాటం విరమించన’ంటూ ట్రంప్ భీష్మించారు. ఆ వ్యాఖ్యలకు చింతిస్తున్నానంటూనే, తాను ఇప్పుడు మారానని, అయినా గతంలో బిల్ క్లింటన్ ఇంతకంటే దారుణమైన వ్యాఖ్యలు తనతో చేశారని ఎదురు దాడికి దిగారు. అలాగే.. అధ్యక్ష అభ్యర్థుల మధ్య జరిగిన మూడు ముఖాముఖి చర్చల్లోనూ ట్రంప్‌పై హిల్లరీ స్పష్టమైన ఆధిక్యం కనబరిచారు. ట్రంప్ వ్యక్తిత్వ లోటుపాట్లతో పాటు విధానాల విషయంలోనూ ఆయన అనుభవరాహిత్యాన్ని ఎండగట్టారు. అదే సమయంలో తనపై వచ్చిన విమర్శలకు సమాధానం చెప్తూ ఈ-మెయిల్స్ విషయంలో పొరపాటు చేశానని అంగీకరించారు. హిల్లరీ రష్యా అధ్యక్షుడు పుతిన్ చేతిలో కీలుబొమ్మ అని, రష్యా ద్వారా అమెరికాలో హ్యాకింగ్‌కు పాల్పడుతున్నారని ఆరోపణలు చేశారు. ట్రంప్ తాను చెల్లించిన పన్ను వివరాలను బయటపెట్టాలని హిల్లరీ డిమాండ్ చేస్తే.. హిల్లరీ ప్రైవేటు సర్వర్ నుంచి డిలిట్ చేసిన వేలాది ఈ-మెయిళ్లను బయటపెట్టాలని ట్రంప్ ఎదురుదాడి చేశారు. న్యూయార్క్ టైమ్స్, లాస్ ఏంజెలెస్ టైమ్స్, హూస్టన్ క్రానికల్ వంటి ప్రముఖ మీడియా సంస్థలు, వార్తా పత్రికలు డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు మద్దతు ప్రకటించాయి. 1940 నుంచీ డెమొక్రటిక్ పార్టీకి మద్దతివ్వని డాలస్ మార్నింగ్ న్యూస్ కూడా ఈసారి హిల్లరీకి మద్దతునిచ్చింది. 1857వ సంవత్సరం నుంచీ ప్రచురితమవుతూ.. గతంలో అబ్రహాం లింకన్, లిండన్ జాన్సన్‌లకు మాత్రమే మద్దతిచ్చిన ద అట్లాంటిక్ వార్తాపత్రిక.. ఇంత కాలానికి మళ్లీ హిల్లరీకి మద్దతు ప్రకటించింది. 34 ఏళ్ల కిందట స్థాపితమై, ఇప్పటివరకూ ఏ అభ్యర్థికీ మద్దతివ్వని యూఎస్ఏ టుడే పత్రిక ఇప్పుడు.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ‘అధ్యక్ష పదవికి అనర్హుడు’ అంటూ తన వ్యతిరేకతను ప్రకటించింది. ప్రత్యర్థులను ఓడించి... అమెరికా 58వ అధ్యక్ష పదవి నామినేషన్ కోసం డెమొక్రటిక్ పార్టీ నుంచి ఆరుగురు, రిపబ్లికన్ పార్టీ నుంచి ఏకంగా 17 మంది బరిలోకి దిగారు. ఆయా పార్టీలు తమ పార్టీ అభ్యర్థిని ఎంచుకునేందుకు ఈ ఏడాది ఫిబ్రవరి - జూన్ నెలల మధ్య ప్రైమరీలు, కాకస్‌లు నిర్వహించాయి. రెండు పార్టీల సభ్యులు లేదా మద్దతుదారులు వార్డుల వారీగా సమావేశమై.. తమ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా తాము ఎవరికి, ఎందుకు మద్దతివ్వాలని అనుకుంటున్నామో చర్చించి.. ఓటింగ్ నిర్వహించటాన్ని ప్రైమరీ లేదా కాకస్ అని వ్యవహరిస్తారు. ప్రైమరీలో రహస్య ఓటింగ్ ఉంటుంది. కాకస్‌లో చేతులు ఎత్తడం ద్వారా ఓటింగ్ నిర్వహిస్తారు. మిగతా ప్రక్రియ అంతా ఒకేలా ఉంటుంది. ఆ ఓటింగ్‌లో తమ తరఫున అభ్యర్థులను ఎన్నుకునేందుకు డెలిగేట్లను (ప్రతినిధులను) ఎన్నకుని పార్టీ జాతీయ ప్రైమరీలకు పంపిస్తారు. జాతీయ ప్రైమరీల్లో ఈ డెలిగేట్ల ఓట్లు ఎక్కువ సంపాదించిన అభ్యర్థికి పార్టీ నుంచి అధ్యక్ష పదవికి పోటీ పడేందుకు నామినేషన్ లభిస్తుంది. డెమొక్రటిక్ పార్టీలో హిల్లరీ క్లింటన్.. ప్రధాన ప్రత్యర్థి బెర్నీ శాండర్స్‌తో పాటు మార్టిన్ ఓ మాలీ, లారెన్స్ లెస్సిగ్, లింకన్ చాఫీ, జిమ్ వెబ్లను ఓడించి జూలై 26న జరిగిన పార్టీ జాతీయ ప్రైమరీలో నామినేషన్ సొంతం చేసుకున్నారు. రిపబ్లికన్ పార్టీలో డొనాల్డ్ ట్రంప్.. ప్రైమరీలు, కాకస్‌లలో ప్రత్యర్థులు టెడ్ క్రూజ్, జాన్ కాసిచ్, మార్కో రూబియో, జెబ్ బుష్‌లతో పాటు ఇతర అభ్యర్థులను ఓడించి జూలై 19న జరిగిన పార్టీ జాతీయ ప్రైమరీలో నామినేషన్ దక్కించుకున్నారు. అధ్యక్ష అభ్యర్థులే తమతో కలిసి పోటీ చేసే ఉపాధ్యక్ష అభ్యర్థులను ఎంపిక చేసుకునే సంప్రదాయం ప్రకారం.. హిల్లరీ తన ఉపాధ్యక్ష అభ్యర్థిగా టిమ్ కెయిన్‌ను, ట్రంప్ తన సహచరుడిగా మైక్ పెన్స్‌ను ఎంపిక చేసుకున్నారు. ఆ తర్వాత ఇరు పార్టీల అధ్యక్ష అభ్యర్థుల మధ్య అధ్యక్ష ఎన్నికల సమరం మొదలయింది. మూడో పార్టీ, స్వతంత్ర అభ్యర్థులు లిబర్టేరియన్ పార్టీ నుంచి న్యూ మెక్సికో మాజీ గవర్నర్ గారీ జాన్సన్, గ్రీన్ పార్టీ నుంచి మసాచుసెట్స్‌కు చెందిన వైద్యుడు జిల్ స్టీన్, కాన్స్టిట్యూషన్ పార్టీ నుంచి డారెల్ కాసిల్, స్వతంత్ర అభ్యర్థులుగా ఎవాన్ మెక్ములిన్, వ్యాపారవేత్త రాకీ డి లా ఫూంటే, ఎకానమిక్స్ ప్రొఫెసర్ లారెన్స్ కోట్లికాఫ్ తదితరులు మూడో పార్టీ లేదా స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్నారు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో గల ‘బ్యాలెట్ యాక్సెస్’ చట్టాల ప్రకారం వీరు పోటీకి దిగుతున్నారు. ఎన్నుకునేది ఎలక్టోరల్ కాలేజీ అమెరికా అధ్యక్ష పదవికి, ఉపాధ్యక్ష పదవికి పరోక్ష పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయి. పౌరులు అధ్యక్ష ఎన్నికల్లో ఓట్లు వేస్తారు కానీ వారు ఎన్నుకునేది అధ్యక్షుడిని కాదు. అధ్యక్షుడిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీకి తమ రాష్ట్రం నుంచి ప్రతినిధులను ఆయా రాష్ట్రాల్లోని సామాన్య ఓటర్లు ఎన్నుకుంటారు. ఈ ప్రతినిధులను ఎలక్టర్లు అంటారు. నిజానికి ఈ ఎలక్టర్లు ముందుగానే ఏదో ఒక పార్టీ అధ్యక్ష అభ్యర్థికి మద్దతుగా ఉంటారు. తాము కోరుకునే అధ్యక్ష అభ్యర్థికి మద్దతునిచ్చే ఎలక్టర్ల బృందాన్ని ప్రజలు ఎన్నుకుంటారు. ఇలా అన్ని రాష్ట్రాల నుంచి ఎన్నికైన ఎలక్టర్లందరూ కలిసి ఎలక్టొరల్ కాలేజీ అవుతారు. వారంతా కలిసి అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. కానీ.. వారందరూ కలిసి ఒకే చోట సమావేశమై అధ్యక్షుడికి ఓట్లు వేయరు. ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్ర ఎలక్టర్లు సమావేశమై తాము ముందే కట్టుబడ్డ అభ్యర్థికి ఓట్లు వేస్తారు. ఈ ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ ఓట్లు పొందిన అభ్యర్థులు అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా ఎన్నికవుతారు. మేజిక్ ఫిగర్ 270... అమెరికాలో మొత్తం 50 రాష్ట్రాలు ఉన్నాయి. ఒక్కో రాష్ట్రం నుంచి కాంగ్రెస్ (పార్లమెంటు) ఉభయ సభల్లో.. ఆ రాష్ట్రానికి గల సభ్యుల (సెనెటర్లు, ప్రతినిధులు) సంఖ్యకు సమానంగా ఎలక్టోరల్ కాలేజీ సభ్యులను (ఎలక్టర్లను) ఎన్నుకుంటారు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఈ ఎన్నికలను నిర్వహిస్తుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వ ప్రమేయం ఏ మాత్రం ఉండదు. అదనంగా.. దేశ రాజధాని జిల్లా అయిన వాషింగ్టన్ డి.సి.కి దేశంలోని అతి చిన్న రాష్ట్రానికి గల సభ్యులకు సమానంగా ఎలక్టొరల్ కాలేజీ సభ్యులను కేటాయిస్తారు. అంటే.. ప్రస్తుతం అమెరికా ప్రతినిధుల సభ సభ్యులు 435, సెనేట్ సభ్యులు 100 మంది, వాషింగ్టన్ డీసీకి ముగ్గురు అదనపు సభ్యులు.. మొత్తం కలిపి 538 మంది ఎలక్టర్లు ఈ ఎలక్టోరల్ కాలేజీకి ఎన్నికవుతారు. వీరు ప్రత్యక్ష ఎన్నికల ప్రక్రియ ద్వారా అధ్యక్షుడ్ని ఎన్నుకుంటారు. ఈ ఎన్నికల్లో కనీసం 270 ఓట్లు పొందిన అభ్యర్థి అధ్యక్ష పదవికి ఎన్నికవుతారు. ఒక రాష్ట్రం ఓట్లన్నీ ఒక్కరికే.. ఎలక్టోరల్ కాలేజీకి ఎన్నికయ్యే ఎలక్టర్లను ఆయా పార్టీలు సాధారణ ఎన్నికలకు ముం దుగా ఎంపిక చేయడం లేదా, నామినేట్ చేయడం జరుగుతుంది. ఈ సారి నవంబర్ 8న సాధారణ ఎన్నికలు జరుగుతాయి. ఆ రోజు సాధారణ పౌరులు బ్యాలట్‌లో.. అధ్యక్ష పదవికి తాము కోరుకున్న అభ్యర్థికి ఓటు వేస్తారు. ఆయా రాష్ట్రాల్లో అనుసరించే విధివిధానాలకు అనుగుణంగా.. ఆ బ్యాలట్‌లో పార్టీకి చెందిన ఎలక్టర్ల పేర్లు ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ఇలా రాష్ట్రం మొత్తం పోలైన ఓట్లను కలిపి లెక్కిస్తారు. వీటిలో ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థి పార్టీకి చెందిన ఎలక్టర్లు ఆ రాష్ట్ర ఎలక్టర్లుగా ఉంటారు. అంటే.. ఒక రాష్ట్రంలో సాధారణ ఓటర్లు వేర్వేరు అధ్యక్ష అభ్యర్థులకు ఓట్లు వేసినా.. అందులో మెజారిటీ ఓట్లు సంపాదించిన అభ్యర్థికే ఆ రాష్ట్రానికి చెందిన ఎలక్టర్ల ఓట్లు గంపగుత్తగా చెందుతాయి. అయితే.. మొత్తం 50 రాష్ట్రాలకు గాను 48 రాష్ట్రాల్లో ఇదే విధానం ఉంటుంది. మెయిన్, నెబ్రాస్కాలు మాత్రం పోలైన ఓట్లను బట్టి తమ ఎలక్టర్లను ఆయా అభ్యర్థులకు దామాషాలో పంచుతాయి. అంటే.. ఆ రెండు రాష్ట్రాలకు చెందిన ఎలక్టర్ల ఓట్లు.. ప్రజల ఓట్లను బట్టి వేర్వేరు అభ్యర్థులకు లభించే అవకాశముంటుంది. ఎలక్టోరల్ కాలేజీ లాంఛనమే..! నిజానికి ఏ రాష్ట్రానికి చెందిన ఎలక్టర్ల ఓట్లు ఏ అభ్యర్థికి లభించాయనేదాన్ని బట్టి.. మొత్తంగా ఏ అభ్యర్థికి ఎన్ని ఎలక్టర్ల ఓట్లు వస్తాయి, ఎవరు గెలుస్తారనేది సాధారణ ఎన్నికల్లోనే తేటతెల్లమవుతుంది. అయితే.. సాధారణ ఎన్నికల్లో ఎన్నికైన ఎలక్టర్లంతా కలసి లాంఛనంగా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఈ ఎలక్టోరల్ కాలేజీ ఈ సారి డిసెంబర్ 19న సమావేశమై ఈ లాంఛనాన్ని పూర్తి చేస్తుంది. ఆ రోజున ఏ రాష్ట్రానికి చెందిన ఎలక్టర్లు ఆ రాష్ట్ర రాజధానిలోనే సమావేశమై తమ అధ్యక్ష, ఉపాధ్యక్షులకు ఓట్లు వేస్తారు. ఈ ఓట్లను వచ్చే ఏడాది జనవరి 6న కాంగ్రెస్ (అమెరికా పార్లమెంటు) ఉభయసభల సంయుక్త సమావేశంలో లెక్కిస్తారు. ఎన్నిక ఫలితాలను సెనేట్ అధ్యక్షుడు లాంఛనంగా ప్రకటిస్తారు. ఒకవేళ ఎలక్టోరల్ కాలేజీ ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం ఏ అభ్యర్థికీ సంపూర్ణ మెజారిటీ రాని పక్షంలో.. కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్ - దిగువ సభ) అధ్యక్షుడ్ని ఎన్నుకుంటుంది. అదే.. ఉపాధ్యక్ష పదవి ఎన్నికల్లో ఎవరికీ సంపూర్ణ మెజారిటీ రాని పక్షంలో సెనేట్ (ఎగువ సభ) ఆ ఎన్నిక చేస్తుంది. ఇలా అరుదుగా జరుగుతుంది. చివరిసారిగా 2002 ఎన్నికల్లో ఇలా జరిగింది. ఇలా ఈ సుదీర్ఘ ఎన్నిక ప్రక్రియ పూర్తయిన మూడు, నాలుగు నెలల తర్వాత వచ్చే ఏడాది జనవరి 20న కొత్త అధినేత అధ్యక్ష పదవి చేపడుతూ ప్రమాణ స్వీకారం చేస్తారు. -
ఒక్కొక్కరికి 2 కోట్ల డాలర్ల సర్కారీ నిధులు!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కేవలం ప్రచార పర్వానికే ప్రధాన పార్టీలు, అభ్యర్థులు దాదాపు 200 కోట్ల డాలర్లు వ్యయం చేస్తున్నారు. ఎన్నికల్లో పోటీ పడే అభ్యర్థులు ఖర్చుల కోసం నిధులు సేకరించుకోవడమే కాదు.. అర్హులైన అభ్యర్థులకు ప్రైమరీల్లో ప్రచారానికి, సాధారణ ఎన్నికల్లో ప్రచారానికి ప్రభుత్వం కూడా నిధులు అందిస్తుంది. సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు రెండు కోట్ల డాలర్లకు పైగా ప్రభుత్వ నిధులు పొందడానికి అర్హులు. అమెరికా ఫెడరల్ చట్టం ప్రకారం.. అధ్యక్ష పదవికి పోటీపడే అధికారిక అభ్యర్థులు తమ ప్రచారానికి సేకరించిన నిధుల జమా ఖర్చుల వివరాలను ప్రతి నెలాఖరులో లేదా మూడు నెలలకోసారి సమాఖ్య ఎన్నికల సంఘానికి (ఎఫ్ఈసీకి) సమర్పించాల్సి ఉంటుంది. ఈ వివరాలను పరిశీలించిన తరువాత వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. అభ్యర్థులు ఎన్నికల ప్రచారం కోసం వ్యక్తుల నుంచి విరాళాలు సేకరిస్తారు. ఒక్కో వ్యక్తి నుంచి 5,400 డాలర్ల వరకూ స్వీకరించవచ్చు. స్వతంత్ర వ్యయ కమిటీలుగా (సూపర్ పీఏసీలు) పిలిచే కొత్త తరహా రాజకీయ కార్యాచరణ సంస్థలు కార్పొరేషన్లు, యూనియన్లు, వ్యక్తుల నుంచి చాలా పెద్ద మొత్తంలో విరాళాలు సేకరించి తాము మద్దతిస్తున్న పార్టీ లేదా అభ్యర్థికి నిధులు అందిస్తాయి. దీనిపై గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. ఇక చాలా కాలంగా ఉన్న పీఏసీలుగా పిలిచే రాజకీయ కార్యాచరణ సంస్థలు కూడా నిధుల సేకరణలో కీలక భూమిక పోషిస్తాయి. కొన్ని పీఏసీలను అభ్యర్థులే స్వయంగా నడుపుతారు. కొన్నిటిని పార్టీలు నడుపుతాయి. అలాగే వ్యాపార, సామాజిక రంగాలకు చెందిన లాబీయింగ్ బృందాలు కూడా పీఏసీలను నిర్వహిస్తాయి. వీటి నిధుల సేకరణ, వ్యయం వివరాలను ఎఫ్ఈసీ ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంటుంది. తాజా ఎన్నికల కోసం డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ఈ నెల 12వ తేదీ వరకూ 42 కోట్ల డాలర్లకు పైగా వ్యయం చేశారు. అందులో న్యాయవాదుల సంస్థలు, న్యాయవాదుల నుంచి సేకరించిన విరాళాలదే సింహభాగం. కమర్షియల్ బ్యాంకుల నుంచీ గణనీయంగా విరాళాలు లభించాయి. ఇక డొనాల్డ్ ట్రంప్ ఇదే సమయానికి దాదాపు 15 కోట్ల డాలర్లు ఖర్చు పెట్టారు. అందులో సేకరించిన నిధులే కాకుండా సొంత డబ్బులూ ఉన్నాయి. అధ్యక్ష ఎన్నికల టైమ్‌లైన్... నవంబర్ 8 - సార్వత్రిక ఎన్నికలు: ఓటర్లు అధ్యక్ష అభ్యర్థికి ఓటు వేయడం ద్వారా తమ తమ రాష్ట్రాల నుంచి ఎలక్టోరల్ కాలేజీకి ఎలక్టర్లను ఎన్నుకుంటారు. డిసెంబర్ 16 - ఎలక్టోరల్ కాలేజీ ఎలక్టర్లు తమ తమ రాష్ట్రాల నుంచి ఓట్లు వేయడం ద్వారా అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకుంటారు. జనవరి 6 - అమెరికా కాంగ్రెస్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను లెక్కించి, ఫలితం ప్రకటిస్తారు. జనవరి 20 - ఎన్నికైన అభ్యర్థి అధ్యక్ష పదవీ బాధ్యతలు చేపడతారు. -
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు రష్యా పరిశీలకులు?
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయని రిపబ్లికన్ పార్టీ తరఫున ఆ పదవికి పోటీ పడుతున్న డోనాల్డ్ ట్రంప్ పదే పదే ఆరోపిస్తున్న నేపథ్యంలో నవంబర్ 8వ తేదీన జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రత్యక్ష పర్యవేక్షణకు పరిశీలకులను పంపించాలని రష్యా నిర్ణయించినట్లు రష్యా మీడియా వెల్లడించింది. అయితే అలాంటి ఆస్కారమే లేదని అమెరికా విదేశాంగ శాఖ ఖండించింది. రష్యా పరిశీలకులు తమ పోలింగ్ కేంద్రాల్లో కనిపిస్తే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కూడా అమెరికాలోని ఓ రాష్ట్ర ఎన్నికల అధికారి హెచ్చరించారు. ఇది కేవలం పీఆర్ స్టంట్ మాత్రమేనని అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ అధికార ప్రతినిధి మార్క్ టోనర్ వ్యాఖ్యానించారు. ఎన్నికల పరిశీలనకు తమ అధికారులను అనుమతించాలని లూసియానా రాష్ట్ర ప్రభుత్వానికి రష్యా నుంచి ఓ విజ్ఞప్తి వచ్చిన మాట నిజమేనని, ఇదంతా ప్రచారం స్టంట్ మాత్రమేనని ఆ రాష్ట్ర విదేశాంగ విభాగం అధికార ప్రతినిధి టామ్ షెడ్లర్ విమర్శించారు. గతంలో పలు దేశాల నుంచి ఎన్నికల పరిశీలకులను తాము అనుమతించామని, అయితే ఎప్పుడూ కూడా రష్యా నుంచి అనుమతించలేదని ఆమె తెలిపారు. రష్యా నుంచి అనుమతించవద్దంటూ ఎఫ్‌బీఐ నుంచి తమకు సూచనలు, సలహాలు కూడా వచ్చాయని ఆమె తెలిపారు. ప్రత్యర్థి అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌పై పలు డిబేట్లలో వెనకబడిపోయిన డోనాల్డ్ ట్రంప్ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయని మొదటినుంచి ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలను అంగీకరిస్తారా.. అని ఆయనను అమెరికా మీడియా ప్రశ్నించగా, తాను గెలిస్తేనే అంగీకరిస్తానని, లేకపోతే లేదని సమాధానం ఇచ్చారు. హిల్లరీ క్లింటన్‌తో పాటు డెమోక్రట్ల సెంట్రల్ కమిటీ ఈ మెయిళ్లను హ్యాక్ చేయడం వెనక రష్యా ప్రభుత్వం హస్తం ఉన్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. -
జర్నలిస్టులపై చెయ్యి చేసుకున్న ట్రంప్ అనుచరులు!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షరేసు బరిలో ఉన్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ ఆగడాలు మితిమీరుతున్నాయి. ఇన్నాళ్లు తమ ప్రత్యర్థి, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీపై తీవ్ర విమర్శలు చేసిన ట్రంప్.. తాజాగా జర్నలిస్టులపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. పెనిస్విలేనియాలో ట్రంప్ నిర్వహించిన ఓ ఈవెంట్లో దాదాపు ఐదు వేల మంది పాల్గొన్నారు. ట్రంప్ ప్రసంగించిన అనంతరం.. మీడియా ఆయనను కలిసేందుకు ప్రయత్నించగా మీడియా ప్రతినిధులకు చేదు అనుభవం ఎదురైంది. జాతీయ మీడియా ఎన్డీటీవీ ప్రతినిధి కూడా ఈ ఈవెంట్ కు హాజరయ్యారు. జర్నలిస్టులతో మాట్లాడటం తనకు ఇష్టం లేదని, మీరు అబద్ధాలకోరులని ట్రంప్ నోరు పారేసుకున్నారు. ఆయన అనుచరులు ఏకంగా కొందరు జర్నలిస్టులను నెట్టివేస్తూ వారిపై చెయ్యి చేసుకున్నారు. మీ చేతిలో ఉన్న మైక్స్ కింద పడేస్తాను అంటూ ట్రంప్ మీడియా ప్రతినిధులను హెచ్చరించారు. అసలు మీరు ఎవరో తెలియదు, ఇక్కడి ఎందుకు వచ్చారంటూ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. గతంలోనూ న్యూయార్క్ టైమ్స్, బజ్ ఫీడ్, పోలిటికో, వాషింగ్టన్ మీడియా సంస్థలపై నోరు పారేసుకున్నారు. గత ఆగస్టులో ఓ ర్యాలిలో ట్రంప్ మాట్లాడుతూ.. తాను వంకర బుద్ధిగల హిల్లరీపై పోరాటం చేయలేదని, వంకర బుద్ధిగల మీడియాపై పోరాటం కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. మీడియా కేవలం హిల్లరీకి మద్ధతుగా ప్రచారం నిర్వహిస్తోందని, అధ్యక్ష ఎన్నికలలో రిగ్గింగ్ జరుగుతుందని ట్రంప్ ఎన్నో ఆరోపణలు చేశారు. మొత్తం మూడు ఢిబేట్లలోనూ హిల్లరీనే ఆదిపత్యం ప్రదర్శించారు. దాంతో ట్రంప్ తన ఆవేశాన్ని మీడియాపై ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. -
మామూలుగా పిలిస్తే ఆవిడ రాదు కదా!
న్యూయార్క్: 'ఫ్రెండ్స్.. ఇక్కడ 1000 మంది ప్రముఖులున్నారు. బహుశా హిల్లరీ క్లింటన్ పాల్గొన్న అన్ని సభల్లోకి ఎక్కువ జనం మంది వచ్చింది ఇక్కడికేకావచ్చు! ఇంతకీ ఆమెను ఈ డిన్నర్ కు ఎలా ఆహ్వానించారు? ఈ-మెయిల్ కబురు పెడితేనే తప్ప, మామూలుగా పిలిస్తే ఆవిడ రారు కదా! చివరికి ఆ మెయిల్ కూడా ఏ వికీలీక్స్ లోనో కనబడితే తప్ప ఆమె స్పందించరు కదా!' అని 'హిల్లరీ ఈ మెయిల్స్' ఉదంతాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు హిల్లరీ సైతం నవ్వులు చిందించారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్నకొద్దీ రాజకీయ వేడిని రగల్చడంలో ముందున్న రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్.. మూడో డిబేట్ లో డెమోక్రాట్ ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ ను అబద్దాల కోరుగా విమర్శించిన సంగతి తెలిసింది. డిబేట్ తర్వాతి రోజు గురువారం రాత్రి న్యూయార్క్ లో జరిగిన ప్రతిష్టాత్మక విందు కార్యక్రమంలో ఆ ఇద్దరూ మళ్లీ ఎదురుపడ్డారు. అక్కడ కూడా ఒకరినొకరు విమర్శించుకునే ప్రయత్నం చేశారు.. చివరికి మాత్రం కరచాలనం చేసుకున్నారు. అమెరికాలోని క్యాథలిక్ ప్రముఖులు ప్రతి ఏడాది అక్టోబర్ మూడో గురువారం న్యూయార్క్ లో నిర్వహించే ఆల్ఫ్రెడ్ స్మిత్ మెమోరియల్ ఫౌండేషన్ డిన్నర్ కార్యక్రమానికి రాజకీయ ప్రముఖులు హాజరుకావడం ఆనవాయితి. ఈ ఏడాది అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నందున రిపబ్లికన్, డెమోక్రాటిక్ పార్టీల అభ్యర్థులు ట్రంప్, హిల్లరీలు ఆ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. 'హిల్లరీ నన్ను ఇరాక్ లేదా అఫ్ఘానిస్థాన్ అంబాసిడర్(రాబయారి)గా నియమించాలనుకుంటున్నారు' అని చెప్పిన ట్రంప్.. ఆ పదవి స్వీకరించాలా వద్దా అనేది తన ఇష్టమని పేర్కొన్నారు. వికీలీక్స్ వ్యవహారం వల్ల దేశానికి మంచి జరిగిందని, పౌరులకు ఒకనీతి, ప్రముఖులకు ఒకనీతి ఉండకూడదన్న విషయం తెలిసి వచ్చిందని ట్రంప్ అన్నారు. వివాదాస్పద గర్భస్త్రావాల చట్టం గురించి కూడా ట్రంప్ తన ప్రసంగంలో ఉటంకించారు. -
'ఢీ ' బేట్ హిల్లరీదే
అమెరికాలో వాడివేడిగా అధ్యక్ష అభ్యర్థుల చివరి డిబేట్ ► పుతిన్ కీలుబొమ్మ ట్రంప్.. ఆయుధ చట్టంలో మార్పులు చేయాల్సిందే: హిల్లరీ ► ఆమె చెడ్డ మహిళ: డొనాల్డ్ ట్రంప్ లాస్ వెగాస్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా చివరిదైన మూడో డిబేట్ బుధవారం రాత్రి వాడివేడిగా సాగింది. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రాట్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్లు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. ట్రంప్ పూర్తిగా ఆరోపణలకే పరిమితం కావడంతో ఈ డిబేట్లోనూ హిల్లరీ ఆధిపత్యమే కొనసాగింది. లాస్‌వెగాస్‌లోని నెవడా యూనివర్సిటీలో జరిగిన చివరి డిబేట్లో హిల్లరీదే పై చేయిగా మీడియా సర్వేలు సైతం పేర్కొన్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాన్ని అంగీకరించాలా? లేదా? అన్నదానిపై నవంబర్ 8న దృష్టిపెడతానని, అప్పటి వరకూ ఉత్కంఠ కొనసాగుతుందని రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓడిపోతే ఫలితాన్ని అంగీకరించబోనంటూ పరోక్ష సంకేతాలిచ్చారు. హిల్లరీ, ట్రంప్‌లు ప్రారంభంలో కానీ, కనీసం చివరలో కానీ కరచాలనం చేసుకోపోవడం చూస్తే డిబేట్ ఎంత వాడివేడిగా సాగిందో అర్థమవుతుంది. మీడియా ఓటర్ల మనసుల్ని విషపూరితం చేసింది: ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో ఫలితాన్ని అంగీకరిస్తారా? అన్న సమన్వయకర్త క్రిస్ వాలెస్ ప్రశ్నకు స్పందిస్తూ...‘ఫలితాన్ని అంగీకరించడంపై నవంబర్ ఎనిమిది వరకూ ఉత్కంఠ కొనసాగిస్తాను. దానిపై అప్పుడు దృష్టిపెడతాను.. ప్రస్తుతం దేనిపైనా దృష్టిపెట్టడం లేదు’ అంటూ ట్రంప్ సమాధానమిచ్చారు. ‘మీడియా నిజాయితీగా వ్యవహరించడం లేదు. అవినీతిమయంగా తయారైంది. వారు ఓటర్ల మనసుల్ని విషపూరితం చేశారు’ అంటూ ట్రంప్ ఒకస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే హిల్లరీ జోక్యం చేసుకుని.. ‘ఫలితాన్ని అంగీకరించేందుకు ట్రంప్ ఒప్పుకోపోవడం చాలా భయంకరం. ప్రతీది తాను అనుకున్నట్టుగా లేకపోతే రిగ్గింగ్ జరిగిందని చెప్పడం ట్రంప్‌కు అలవాటుగా మారింది. ఇది ప్రజాస్వామ్య విధానం కాదు. అమెరికన్లు చాలా తెలివైన వారు. ప్రతి విషయాన్ని గ్రహించగలరు’ అని హిల్లరీ సమాధానమిచ్చారు. అబార్షన్‌పై నిర్ణయం మహిళల హక్కు.. హిల్లరీ: క్లింటన్ వర్గం మహిళలతో వరుసగా తనపై ఆరోపణలు చేయించారని ట్రంప్ విమర్శించారు. ‘అమెరికా అధ్యక్షురాలు అయ్యేందుకు హిల్లరీని అనుమతించకూడదు. ఈమెయిల్స్ వ్యవహారంలో ఆమె ఏం చేసిందో, ఇతర విషయాల్లో ఏం చేసిందో అందరికీ తెలుసు... వాటి ప్రకారం ఆమె అధ్యక్ష పదవికి అనర్హురాలు. పది నిమిషాల పేరు కోసం నాపై 10 మంది మహిళలు ఆరోపణలు చేశారు. వారు చెప్పిందంతా అబద్ధం. నేను ఏ తప్పూ చేయలేదు అందుకే నా భార్యకు కూడా క్షమాపణ చెప్పలేదు’ అంటూ ట్రంప్ ఆవేశంగా మాట్లాడారు. చాలా ఏళ్లుగా ఆదాయపు పన్ను చెల్లించకుండా ట్రంప్ మోసగించారంటూ హిల్లరీ ఆరోపించగా.... ట్రంప్ తీవ్రంగా స్పందించారు. హిల్లరీ చెడ్డ మహిళ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అక్రమ వలసలు, అబార్షన్ హక్కులు, ఆయుధ చట్టంపై చర్చ సందర్భంగా అసహనానికి లోనైన ట్రంప్ సంప్రదాయ ఓటర్లను ఆకట్టుకునేలా తన వాదన వినిపించారు. అబార్షన్ మహిళల చెత్త నిర్ణయమని, వలసదారులు నేర కార్యక్రమాల్లో మునిగి తేలుతున్నారని, ప్రజలు ఆయుధాలు కలిగిఉండే అంశం రెండో సవరణను నిలుపుదల చేయాలని ట్రంప్ డిమాండ్‌చేశారు. భారత్, చైనా అధిక వృద్ధి రేటులతో అమెరికాను పోల్చిన ట్రంప్... అమెరికా వృద్ధి రేటు పడిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తమ ఆరోగ్య విషయంలో నిర్ణయం తీసుకోవడం మహిళల హక్కని, ఆయుధ చట్టంలో సంస్కరణలు చేయాల్సిందేనని హిల్లరీ చెప్పారు. దేశ అధ్యక్ష పీఠం అధిరోహించేందుకు సమర్థులు కారంటూ ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్నారు. వికీలీక్స్ రష్యా పనే: హిల్లరీ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైతే రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఆటబొమ్మగా మారతారంటూ హిల్లరీ ఆందోళన వ్యక్తం చేశారు. ‘వికీలీక్స్ వ్యవహారం అమెరికన్లకు వ్యతిరేకంగా రష్యా ప్రభుత్వం చేయిస్తున్న పని. అమెరికన్ వెబ్సైట్లు, వ్యక్తుల, సంస్థల ప్రైవేట్ ఖాతాల్ని రష్యా ప్రభుత్వం హ్యాక్ చేస్తోంది. ఆ సమచారాన్ని వికీలీక్స్‌కు అందచేస్తోంది’ అంటూ హిల్లరీ క్లింటన్ చెప్పారు. మహిళల్ని ఎక్కువ గౌరవించేది నేనే: ట్రంప్ చివరి డిబేట్లో తన వ్యాఖ్యలతో ట్రంప్ ఒక్కసారిగా నవ్వులు పూయించారు. తనక ంటే ఎక్కువగా ఎవరూ మహిళల్ని గౌరవించరంటూ వ్యాఖ్యానించగా ప్రేక్షకులు ఒక్కసారి ముసిముసి నవ్వులు కురిపించారు. మహిళల్ని అవమానించడం గొప్ప చేస్తుందని ట్రంప్ భావించారంటూ హిల్లరీ విమర్శించగా జోక్యం చేసుకుంటూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. హిల్లరీనే విజేత: సీఎన్ఎన్ చివరి డిబేట్లోనూ హిల్లరీనే విజేత. సీఎన్ఎన్ సర్వే ప్రకారం హిల్లరీ 52% మద్దతు సాధించగా, ట్రంప్‌కు 39 శాతమే అనుకూలంగా ఉన్నారు. సీఎన్ఎన్ సర్వే ప్రకారం మూడు డిబేట్లలోను హిల్లరీదే గెలుపు. అలాగే బ్రెయిట్‌బార్ట్ ఆన్లైన్ పోల్ ప్రకారం హిల్లరీకి 59.3 శాతం, ట్రంప్‌కు 40.65 శాతం అనుకూలంగా ఉన్నారు. ఎన్నికల రోజు హింస: నిపుణులు న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ రోజు హింస జరిగేందుకు ఆస్కారం ఎక్కువగా ఉందని నిపుణులు హెచ్చరించారు. నవంబర్ 8న జరిగే ఈ ఎన్నికల్లో మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ పిలుపునిస్తున్న నేపథ్యంలో అతని అనుచరుల నుంచి ఇబ్బందులు ఎదురుకావొచ్చని భావిస్తున్నారు. దీని వల్ల ఓటింగ్‌లో పాల్గొనే ప్రజల సంఖ్య తగ్గే ముప్పు ఉందని అంచనా వేస్తున్నారు. -
భార్యకు సారీ చెప్పలేదు.. ఎందుకంటే!
లాస్ వెగాస్: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి అత్యంత కీలకమైన ఘట్టం ఫైనల్ రౌండ్, థర్డ్ డిబేట్ హోరాహోరీగా సాగింది. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌లు ఈ బిగ్ డిబేట్లో ఒకరినొకరు తీవ్రంగా విమర్శించుకున్నారు. మహిళలతో అసభ్య ప్రవర్తనపై, రష్యాకు అనుకూల వైఖరిపై హిల్లరీ క్లింటన్ ప్రశ్నించి ట్రంప్ ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. అయితే తనపై వచ్చిన తొమ్మిది లైంగిక వేధింపుల ఆరోపణలను ట్రంప్ ఈ సందర్భంగా ఖండించారు. తాను ఎలాంటి తప్పుడు చర్యలకు పాల్పడలేదని చెబుతూనే, అసలు ఇందుకు సంబంధించి తన భార్య మిలానియా ట్రంప్ కు ఎప్పుడూ క్షమాపణలు కూడా చెప్పలేదని వెల్లడించారు. అధ్యక్ష ఎన్నికల కోసం హిల్లరీతో కలిసి క్యాంపెన్ ఈవెంట్లో పాల్గొంటున్న మహిళలు ఆమె కోసం పనిచేయడం లేదని, కేవలం పది నిమిషాల పాటు తమ పేరు హైలెట్ కావాలనుకుంటున్నారని ట్రంప్ ఆరోపించారు. తనకంటే మహిళలను మరెవరూ అంతగా గౌరవించరని చెప్పారు. 2005లో జరిగిన కొన్ని ఘటనలలో మహిళలపై ట్రంప్ చేసిన అసభ్యవ్యాఖ్యల వీడియో పెనుదుమారాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో పాటుగా సొంత కూతురు ఇవాంక కొన్నేళ్ల తర్వాత పుట్టి ఉంటే ఆమెతో డేటింగ్ చేసేవాడినని గతంలో ఓ షోలో పాల్గొన్న సందర్భంగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై అమెరికాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కాగా, తన భర్త ప్రవర్తనలో ఎంతో మార్పు వచ్చిందని, ఈ విషయంపై ట్రంప్ తనను క్షమాపణ అడిగారని కొన్ని రోజుల కిందట మెలానియా ట్రంప్ మీడియాకు వెల్లడించడం గమనార్హం. వచ్చే నవంబర్ 8న అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించనున్నారు. -
హిల్లరీపై ట్రంప్ ఘాటైన వ్యాఖ్యలు
లాస్ వెగాస్ : రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన నోటికి పని చెప్పారు. తన ప్రత్యర్థి అభ్యర్థి హల్లరీ క్లింటన్‌పై ఆయన నోరు పారేసుకున్నారు. నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించినట్లుగా...తనకన్నా ఎక్కువగా మహిళలను గౌరవించరన్న ఆయన ...మరోవైపు హిల్లరీ న్యాస్టీ ఉమెన్ అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అవకాశం దొరికినప్పుడల్లా నోటి దురుసుతనంతో అక్కసు తీర్చుకునే ఆయన... చివరి డిబేట్లో హిల్లరీపై ఈ వ్యాఖ్యలు చేశారు. హిల్లరీ అబద్ధాలు ఆడుతున్నారని, ఆమె అనేక నేరాలకు పాల్పడ్డారని, ప్రభుత్వంలో ఉంటూ ప్రైవేటు ఈ-మెయిళ్లను వాడారని ట్రంప్ ఆరోపించారు. ప్రస్తుత అధ్యక్షుడు ఒబామా, హిల్లరీ విదేశాంగ విధానాలు చెత్తగా ఉన్నాయన్నారు. విదేశీ ఉద్యోగుల పట్ల హిల్లరీ కనికరం చూపాలనుకోవడం వినాశకరమని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే హెల్త్ కేర్ విషయంలో హిల్లరీతో విభేదించారు ట్రంప్. ముఖ్యంగా తొమ్మిదో నెలలో గర్భస్థ శిశువును అబార్షన్ చేసేందుకు హిల్లరీ సుముఖం వ్యక్తం చేయగా, తాను అందుకు అంగీకరించనంటూ ట్రంప్ స్పష్టం చేశారు. అక్రమంగా దేశంలోకి వచ్చే వారిని తప్పనిసరిగా వెనక్కి పంపుతామని ఆయన మరోసారి స్పష్టం చేశారు. -
సంతృప్తి వ్యక్తం చేసిన ట్రంప్..
లాస్ వెగాస్ : అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చివరి డిబేట్ లో తన ప్రసంగంపై సంతృప్తి వ్యక్తం చేశారు. తన ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్‌తో చర్చలో హోరా హోరీగా తలపడటంపై ఆయన సంతృప్తి చెందారు. చర్చ ముగిసిన అనంతరం వివిధ అంశాలపై తాను వెల్లడించిన అన్ని విషయాలు ఉత్తేజకరంగా ఉన్నాయన్నారు. ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ అంటూ ఆయన ట్విట్ చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా అమెరికా లాస్‌వెగాస్‌లోని యూనివర్శిటీ ఆఫ్ నెవాడాలో బుధవారం రాత్రి(భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం) చివరి డిబేట్ 90 నిమిషాలు పాటు జరిగింది. ఈ సందర్భంగా ప్రత్యర్థులు మాటల తూటాలు పేల్చుకున్నారు. సూటిగా సమాధానాలు ఇస్తూనే, ఒకరిపై మరొకరు చెణుకులు విసురుకున్నారు. ఒపీనియన్ పోల్స్‌లో చాలా వెనుకబడ్డ ట్రంప్ కీలకమైన మూడవ చర్చలో పుంజుకునేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. చాలా సందర్భాల్లో ఆయన కొద్దిపాటి అసహనంతో పాటు చికాకు పడ్డారు. అంతేకాకుండా డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీకి కౌంటర్ చేసేందుకు చమత్కారంగా సమాధానం ఇచ్చేందుకు ట్రంప్ ప్రయత్నించారు. గన్ కల్చర్, అక్రమ వలసదారులు, అబార్షన్ హక్కులపై ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరో 20 రోజులు మాత్రమే ఉంది. ఒపీనియన్ పోల్స్ ప్రకారం హిల్లరీ ముందంజలో ఉన్నారు. That was really exciting. Made all of my points. MAKE AMERICA GREAT AGAIN! — Donald J. Trump (@realDonaldTrump) 20 October 2016 -
దూసుకుపోయిన హిల్లరీ...
లాస్ వెగాస్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలనే సందిగ్ధంలో ఉన్న ఓటర్లను ఎక్కువగా ప్రభావితం చేసే బిగ్ డిబేట్లలో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ దూసుకుపోయింది. గంటన్నర పాటు ఆవేశకావేశాలు, వాదప్రతివాదాలు, వ్యక్తిగత విమర్శలు, ఎత్తిపొడుపులు, వ్యంగ్య వ్యాఖ్యలు, భావోద్వేగాలు, భిన్న హావభావాలతో రసవత్తరంగా సాగిన మూడు బిగ్ డిబేట్లలో హిల్లరీ, రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ పై స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించారు. సీఎన్ఎన్/ఓఆర్సీ సర్వే వెల్లడించిన ఫలితాల ప్రకారం ► తొలి చర్చలో హిల్లరీ విజయం సాధించారని 62% ఓటర్లు పేర్కొనగా, 27% మాత్రం ట్రంప్‌దే విజయమని తెలిపారు. ► రెండో బిగ్ డిబేట్లో హిల్లరీకి 57 శాతం, ట్రంప్‌కు 34 శాతం మద్దతు పలికారు. ► మూడో బిగ్ డిబేట్లో హిల్లరీకి 52 శాతం, ట్రంప్‌కు 39శాతంమద్దతు పలికారు. నవంబర్ 8న ఓటర్లు ఎలక్టర్స్‌ను ఎన్నుకుంటే, డిసెంబర్లో ఎలక్టర్స్.. అధ్యక్ష అభ్యర్థులకు ఓటు వేస్తారు. 2017 జనవరి ప్రథమార్ధంలో కాంగ్రెస్.. ఎలక్టర్స్ ఓట్లను లెక్కించి, అధికారికంగా గెలిచిన అభ్యర్థుల (అధ్యక్ష, ఉపాధ్యక్ష) పేర్లను ప్రకటిస్తుంది. కానీ, వాస్తవానికి నవంబర్ 8న అభ్యర్థుల జయాపజయాలు తెలిసిపోతాయి. 2017, జనవరి 20న అమెరికా 45వ అధ్యక్ష, 48వ ఉపాధ్యక్షులు ప్రమాణ స్వీకారం చేస్తారు. -
సమాధానం దాటవేసిన డొనాల్డ్ ట్రంప్
లాస్ వెగాస్ :ఎన్నికల ఫలితాలపై మాట్లాడేందుకు అమెరికా అధ్యక్ష పీఠం కోసం పోటీపడుతున్న రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ నిరాకరించారు. ఒకవేళ ఫలితాలు ప్రతికూలంగా వస్తే అప్పుడు స్పందిస్తానని ఆయన అన్నారు. లాస్ వెగాస్‌లో జరిగిన చివరి డిబేట్లో ఆయన పాల్గొన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తాను అప్పుడే అంగీకరించబోనని, తనకు వ్యతిరేకంగా రిగ్గింగ్ జరిగిందని ట్రంప్ ఆరోపించారు. కాగా గతంలో ట్రంప్ ఎన్నికల ప్రక్రియపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ప్రత్యర్థి పార్టీ, మీడియా కలిసికట్టుగా ఎన్నికల్లో రిగ్గింగ్‌కు పాల్పడ్డాయని, నవంబర్ 8న సాధారణ ఓటింగ్ కోసం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో కొన్నింటిలోనూ రిగ్గింగ్ జరిగే అవకాశం ఉందని ఆయన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై డిబేట్ మోడరేటర్ (సంధానకర్త) క్రిస్ వాలెస్ వేసిన ప్రశ్నకు ట్రంప్ సమాధానం దాటవేశారు. ఎన్నికల ఫలితాలను గౌరవించాలా? లేదా? అనే దానిపై నవంబర్ ఎనిమిదిన నిర్ణయించుకుంటానని ట్రంప్ చెప్పారు. ఎన్నికల ఫలితాలపై సస్పెన్స్ కొనసాగితేనే బాగుంటుందన్నారు. మా నాన్నదే విజయం: ఇవాంకా మరోవైపు ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ మాత్రం... ఎన్నికల ఫలితాలను తన తండ్రి అంగీకరిస్తారని అన్నారు. ఓ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇవాంకా ఈ వ్యాఖ్యలు చేశారు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటర్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే ఎలా స్పందిస్తారని అడిగిన ప్రశ్నకు ఎన్నికల్లో తన తండ్రే గెలుపొందుతారని ధీమా వ్యక్తం చేశారు. ఇంతకన్నా ఎన్నికల ఫలితాలపై మాట్లాడేందుకు తాను ఇష్టపడనున్నారు. ఒకవేళ ఎన్నికల్లో విజయం సాధించినా, ఓడిపోయినా తన తండ్రి ఫలితాలను అంగీకరిస్తారని తెలిపారు. తన తండ్రి ఎప్పుడూ సరైన నిర్ణయాలే తీసుకుంటారని ఆమె అభిప్రాయపడింది. తన తండ్రి గురించి మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని అన్నారు. -
ప్రత్యర్థుల మాటల యుద్ధం
లాస్‌వెగాస్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అత్యంత కీలకమైన ఘట్టం ఫైనల్ రౌండ్ డిబేట్ హోరాహోరీగా సాగింది. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌లు ఈ బిగ్ డిబేట్లో మాటలు తూటాలు పేల్చుకున్నారు. అమెరికాలోని మిలియన్ ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రత్యర్థులకు ఇదే చివరి అవకాశం. దీంతో ప్రత్యర్థులిద్దరూ తమదైన శైలిలో దూసుకెళ్లారు. ఈ ఫైనల్ డిబేట్ కార్యక్రమంలో ట్రంప్, హిల్లరీలు కొన్ని కొన్ని సందర్భాల్లో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ప్రధానంగా మహిళలపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, రష్యాను సమర్థించిన విషయం, తన కంపెనీల్లో చైనా ఉద్యోగులను అధిక సంఖ్యలో నియమించుకోవడం, విదేశాంగ విధానం తదితరాలపై ప్రశ్నలు సంధించినప్పుడు ట్రంప్ కాస్త ఇబ్బంది పడగా, హిల్లరీ క్లింటన్ ఈ మెయిల్స్ వ్యవహారం, క్లింటన్ ఫౌండేషన్ నిధులు, రహస్య వ్యవహారాలు వంటి వాటిపై సమాధానం చెప్పినప్పుడు ఇద్దరూ కాస్త అసహనంగా కదిలారు. ఫైనల్ డిబేట్లో ప్రత్యర్థుల హామీలు, ఆరోపణలు కొన్ని... జీడీపీపైన : ట్రంప్ హామీలివీ.. అమెరికాలోనూ నేను ఉద్యోగవకాశాలను విపరీతంగా సృష్టిస్తాను. ప్రస్తుతమున్న జీడీపీని 1శాతం నుంచి 4శాతానికి తీసుకెళ్తా. ఆ శాతాన్ని 5 శాతం నుంచి 6 శాతానికి మేము పెంచగలమని నేను భావిస్తున్నా. మన ఉద్యోగాలను మళ్లీ వెనక్కి తీసుకురావడమే నా లక్ష్యం. క్లింటన్ హామీలివీ.... కార్పొరేషన్లు న్యాయంగా వేతనాలు చెల్లించాలని మేము ఆదేశిస్తాం. ఆర్థికవేత్తలు నిరంతరం చర్చించే మిడిల్ అవుట్గ్రోత్ను మేము సాధిస్తాం. మధ్య తరగతి ప్రజలు వృద్ధిలోకి వస్తే దేశాభివృద్ధి సాధ్యమవుతుంది. అలెప్పోపై... ట్రంప్ ఆరోపణలు.. అలెప్పో ఓ భయంకరమైన విపత్తు. ఏదైతే జరిగిందో అది చాలా విచారించదగినది. హిల్లరీ క్లింటన్ వల్లే అదంతా జరిగింది. ఆమె దానిలో తలదూర్చకుండా ఉంటే, అంతా మంచి జరిగి ఉండేది. క్లింటన్ హామీలు... మేము లక్షల కొలది ప్రజలను సిరియాలనోనూ వదిలిపెట్టాం.మేము ఓ ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని చూస్తున్నాం. ఆ ఒప్పందం సిరియాకు సాయం చేయడానికి ఓ మంచి డీల్‌గా ఉండాలని భావిస్తున్నాం. అది రష్యా, సిరియా ఇరు దేశాల ప్రజలకు స్పష్టంగా అర్థమవ్వాలి. ఐఎస్ఐఎస్పై... ట్రంప్.. ఎప్పుడైతే క్లింటన్ వెళ్లిపోతారో, అప్పుడు ఆమెతోనే అన్నీ ఐఎస్ఐఎస్ కార్యచరణలు వైదొలుగుతాయి. మోసుల్‌ను ఐఎస్ఐఎస్ నుంచి మళ్లీ ఆధీనంలోకి తెచ్చుకోలుగుతాం.. మోసుల్ మళ్లీ ఇరాన్ స్వాధీనంలోకి తెచ్చుకోవడానికి అమెరికా ప్రమేయం చాలా ప్రయోజనకరం. క్లింటన్ ...ఇరాక్ ముట్టడిని ఆయన సమర్థించడం లేదని మరోసారి స్పష్టమైంది. కానీ మూలాల్లో పరిశీలిస్తే ట్రంప్ దాడులకు అనుకూలమంటూ తేలుతుందని ఆరోపించారు. లైంగిక దుష్ఫచరణ ఆరోపణలపై... ట్రంప్ : నేను మహిళలను గౌరవించినంతగా ఎవరూ గౌరవించలేరు.(ఈ మాటలతో డిబేట్లో పాల్గొన్న ప్రేక్షకులు ఓసారిగా గట్టిగా నవ్వారు). నాపై వచ్చిన లైంగిక ఆరోపణల కథనాలన్నీ అవాస్తవం. కనీసం నా భార్యకు కూడా క్షమాపణ చెప్పలేదు. ఎందుకంటే నేను తప్పేమీ చేయలేదు. క్లింటన్ : మహిళలను అవమానించడం డోనాల్డ్ ట్రంప్ ఓ పెద్ద విజయంగా భావిస్తున్నారు. ట్రంప్ మహిళల కోసం ఏం చేశారో వింటూనే ఉన్నాం. పలువురు మహిళలు ఇప్పటికే ముందుకు వచ్చి ట్రంప్ చర్యలు గురించి వాపోతున్నారు. కనీసం వారికి ఆయన క్షమాపణ కూడా చెప్పలేదు. ఉద్యోగాలపై : ట్రంప్.. ఒకవేళ హిల్లరీ క్లింటన్ అధ్యక్షురాలు అయితే, దేశం గజిబిజి గందరగోళంలో పడిపోతుంది. క్లింటన్.. ప్రస్తుత అధ్యక్షులు ఒబామా ఆర్థికవ్యవస్థను కాపాడినట్టు విశ్వసిస్తున్నట్టు పేర్కొన్నారు. ట్రంప్ : క్లింటన్ పన్నుల ప్రణాళిక ఓ విపత్తు. హిల్లరీ ప్రణాళిక కింద భారీగా పన్నులు పెరిగాయి. పన్నులు తగ్గించడానికి నేను కొత్త ఒప్పందాలను తీసుకొస్తా. క్లింటన్ : ట్రంప్ ప్రణాళికేమిటో తెలుసా.. మరోసారి అమెరికాను ఆర్థిక సంక్షోభంలో సృష్టించడమే. చివరి ప్రకటనలు: క్లింటన్ .. మన దేశాన్ని అద్భుతంగా తీర్చిదిద్దడంలో ప్రతిఒక్కరి సహాయం మాకు అవసరం. చిన్నారులు, కుటుంబాల కోసం నా జీవితాంతం కృషిచేస్తా. ట్రంప్...ఆఫ్రికన్ అమెరికన్లకు, లాటిన్లకు నా శాయాశక్తుల కృషి చేస్తా. అమెరికాను మళ్లీ గ్రేట్‌గా నిరూపిస్తా. -
కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇచ్చుకోలేదు
లాస్ వెగాస్ : అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న హిల్లరీ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్ బిగ్ డిబేట్ లో పాల్గొన్నప్పటికీ ఎడమొహం పెడమొహంగానే ఉన్నారు. ఈసారి కూడా వీరిద్దరూ మర్యాదపూర్వకంగా కూడా కరచలనం చేసుకోలేదు. బుధవారం రాత్రి(భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం) హిల్లరీ, ట్రంప్‌ల మూడో, చివరి డిబేట్ లాస్ వెగాస్‌లోని నెవాడా విశ్వవిద్యాలయంలో జరిగింది. ఆఖరి డిబెట్లో భాగంగా డెమక్రటిక్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులుగా రేసులో ఉన్న హిల్లరీ, ట్రంప్ షేక్ హ్యాండ్ ఇచ్చుకోకుండానే తమ ప్రసంగాలు ప్రారంభించటం విశేషం. కనీసం ప్రత్యర్థులు ఇద్దరూ చిరునవ్వు కూడా నవ్వలేదు. బిగ్ డిబెట్ ముగిసినా తర్వాత కూడా వాళ్లిద్దరూ కరచలనం చేసుకోలేదు సరికదా, ఒకరి వైపు మరొకరు చూడను కూడా చూడలేదు. కాగ గత రెండు డిబేట్లలో ట్రంప్ పై హిల్లరీనే పై చేయి సాధించిన విషయం తెలిసిందే. 90 నిమిషాల ఈ డిబేట్‌ని ఆరు విభాగాలుగా విభజించారు. జాతీయ రుణాలు, ఆర్థిక వ్యవస్థ, సుప్రీం కోర్టు, ఫిలాసఫీలు, ప్రెసిడెంట్‌గా ఫిట్నెస్ తదితర అంశాలపై మోడరేటర్ (సంధానకర్త) క్రిస్ వాలెస్ ప్రశ్నలు సంధించారు. చివరి డిబేట్ లోనూ ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఇరువురు అభ్యర్థులు ఒకరిపై ఒకరు ఆధిక్యం సాధించేందుకు పోటీపడ్డారు. తాము అధికారంలోకి వస్తే పురుషులతోపపాటు మహిళలకు సమానంగా హక్కులు కల్పిస్తామని హిల్లరీ హామీ ఇచ్చారు. కాగా నవంబర్ 8న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. హిల్లరీ క్లింటన్ వైట్ ప్యాంట్, వైట్ కోటు ధరించి రాగా, ట్రంప్ బ్లాక్ కోటు, వైట్ షర్ట్, రెడ్ టై ధరించి వచ్చారు. ట్రంప్ టీమ్ బోయింగ్ 757 విమానంలో రాగా, హిల్లరీ టీమ్ బోయింగ్ 737 విమానంలో వచ్చింది. -
అమెరికా పీఠం హిల్లరీదే!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ భారీ విజయం ఖాయమంటూ మీడియా, రాజకీయ నిపుణులు, విశ్లేషకులు చెబుతున్నారు. బుధవారం రాత్రి(భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం) హిల్లరీ, ట్రంప్‌ల మూడో, చివరి డిబేట్ నేపథ్యంలోమీడియా సంస్థలు పోల్ నిర్వహించి హిల్లరీ గెలుపును దాదాపు ఖాయం చేసేశాయి. హిల్లరీ ప్రత్యర్థి వర్గమైన రిపబ్లికన్ల వ్యూహకర్త స్టీవ్ స్కిమిట్ అయితే ఏకంగా ఆమెకు400 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు వస్తాయని చెప్పారు! సెనెట్, ప్రతినిధుల సభలోను డెమోక్రాట్లే ఆధిక్యంలో ఉంటారని స్టీవ్ అన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం 538 ఓట్లు ఉండగా... గెలవాలంటే 270 ఓట్లు వస్తే చాలు. రియల్ క్లియర్ పిక్చర్స్ సంస్థ అంచనా ప్రకారం రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ కంటే హిల్లరీ 7.2 % పాయింట్ల ఆధిక్యంలో ఉన్నారు. హిల్లరీకి 256, ట్రంప్‌కు 176 ఓట్లు ఖాయమని, మిగిలిన 112 సీట్లలో హిల్లరీకి 14 ఓట్లు వస్తే చాలని తెలిపింది. హిల్లరీకి 92 శాతం గెలుపు అవకాశాలున్నాయని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. ఇక బ్లూమ్‌బెర్గ్ పోల్ ప్రకారం ట్రంప్ కంటే క్లింటన్ 9 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నారు. హిల్లరీ వైపే భారతీయ అమెరికన్ల మొగ్గు! హిల్లరీ వైపే భారతీయ అమెరికన్లలో అత్యధికులు మొగ్గు చూపుతున్నట్లు ‘ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పోరా స్టడీస్’ సర్వేలో వెల్లడైంది. ఇమిగ్రేషన్వంటి విషయాల్లోట్రంప్ కంటే హిల్లరీవైపే వీరు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని తేలింది. ఇమిగ్రేషన్ విషయంలో హిల్లరీకి 59 శాతం మంది మద్దతుగా నిలవగా.. ట్రంప్‌కు ఓటేస్తామని 29% మంది చెప్పారు. -
ఇండియన్ అమెరికన్ల ఓటు ఎవరికో తెలుసా?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హోరాహోరీగా తలపడుతున్న డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌లలో భారత సంతతి అమెరికన్లు ఎవరికి ఓటేయనున్నారు? అమెరికాలో ప్రభావవంతమైన కమ్యూనిటీల్లో ఒక్కటైన ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ ఎవరికి మద్దతుగా నిలువనుంది?.. అనేదానిపై తాజా సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ఇమ్మిగ్రేషన్, మతస్వేచ్ఛ, ఔట్ సోర్సింగ్ వంటి విషయాల్లో ఇండియన్ అమెరికన్స్ ట్రంప్ కన్నా హిల్లరీ క్లింటన్ వైపు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారని తేలింది. ఇమ్రిగ్రేషన్ విషయంలో హిల్లరీకి 59శాతం మంది ఇండియన్ అమెరికన్లు మద్దతుగా నిలువగా.. ట్రంప్‌కు 29శాతం మంది ఓటువేస్తామని చెప్పారు. ఇక మత స్వేచ్ఛ విషయంలో హిల్లరీకి 67శాతం మంది, ట్రంప్‌కు 27శాతం మంది, ఔట్సోర్సింగ్ విషయంలో హిల్లరీకి 52శాతం మంది, ట్రంప్‌కు 22శాతం మంది మద్దతు పలికారని తమ సర్వేలో తేలిందని ద ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ డయాస్పొర స్టడీస్ తెలిపింది. అయితే, ఉగ్రవాదం విషయంలో హిల్లరీ కన్నా ట్రంప్‌కే ఇండియన్ అమెరికన్లు కొంచెం ఎక్కువ మద్దతు పలికారు. ఈ విషయంలో హిల్లరీకి 43శాతం మంది, ట్రంప్‌కు 48శాతం మంది అండగా నిలిచారు. భారత్‌తో సంబంధాల విషయంలోనూ హిల్లరీ (40శాతం మంది) కన్నా ట్రంప్‌కే (47శాతంమంది) ఎక్కువమొగ్గు ఉండటం గమనార్హం. మొత్తంగా ఈ సర్వే ప్రకారం చూసుకుంటే ట్రంప్ కన్నా హిల్లరీకే ఇండియన్ అమెరికన్ల మద్దతు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. -
హిల్లరీ వ్యతిరేకంగా భారత్‌లో ఆందోళనలు
-
ట్రంప్ సంచలన ఆరోపణలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పీఠం కోసం పోటీపడుతున్న రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రక్రియపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యర్థిపార్టీ, మీడియా కలిసికట్టుగా ఎన్నికల్లో రిగ్గింగ్ కు పాల్పడ్డాయని, నవంబర్ 8న సాధారణ ఓటింగ్ కోసం ఏర్పాటుచేసిన కేంద్రాల్లో కొన్నింటిలోనూ రిగ్గింగ్ జరిగే అవకాశం ఉందని ఆరోపించారు. ఈ మేరకు సోమవారం వరుస ట్వీట్లు చేశాసిన ట్రంప్.. ఓటమి భయంతోనే డెమోక్రటిక్ పార్టీ ఇలాంటి కుత్సిత చర్యలకు దిగుతున్నదని మండిపడ్డారు. రిగ్గింగ్ వ్యవహారంపై సొంతపార్టీ (రిపబ్లికన్) నేతలు మౌనంగా ఉండటాన్ని ఆక్షేపించారు. 'ఈ ఎన్నికల్లో కచ్చితంగా రిగ్గింగ్ జరుగుతోంది. వికృతరూపాన్ని సంతరిచుకున్న మీడియా, ఆ మీడియా వెనకేసుకొస్తున్న హిల్లరీ క్లింటన్, ఆమె పార్టీనే ఇందుకు బాధ్యులు. వైట్ హౌస్ కు కూడా ఈ కుట్రలో భాగం ఉంది. ఎన్నికలు జరగబోయే నవంబర్ 8న పలు పోలింగ్ స్టేషన్లలోనూ రిగ్గింగ్ జరగబోతున్నట్లు తెలిసింది. ఇంతకు ముందు కూడా ఇది జరిగింది' అని ట్రంప్ అన్నారు. మహిళలపై ట్రంప్ కంపు వ్యాఖ్యలంటూ.. కీలక ఘట్టానికి కొద్ది రోజుల ముందు వరుసగా వీడియోలు వెలుగులోకి రావడం, తద్వారా మీడియా తనకు దక్కాల్సిన మహిళా ఓట్లను దక్కకుండా చేశాయని ట్రంప్ వాపోయారు. ట్రంప్ సహచరుడు, ఉపాధ్యక్ష రేసులో ఉన్న మైక్ పెన్స్(ఇల్లినాయిస్ గవర్నర్) మాత్రం భిన్నంగా స్పందించారు. ఆదివారం ఓ కార్యక్రమంలో మాట్లాడిన మైక్.. ఫలితాలు ప్రతికూలంగా వచ్చినప్పటికీ తమ పార్టీ అభ్యర్థి ట్రంప్ వాటిని అంగీకరిస్తారని అన్నారు. రిగ్గింగ్ వ్యవహారంపై డెమోక్రాట్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ గత వారం చేసిన వ్యాఖ్యలను కూడా ట్రంప్ తప్పుపడుతున్నారు. ఎన్నికలు పారదర్శకంగా జరుగుతాయని నమ్ముతున్నట్లు హిల్లరీ చెప్పడం, ట్రంప్ కు వ్యతిరేకంగా ఓటు వేసేందుకు పెద్ద ఎత్తున జనం కదులుతారని, తద్వారా ఓటింగ్ శాతం కూడా గణనీయంగా పెరుగుందని ఆమె వ్యాఖ్యానించారు. రిగ్గింగ్ అవకాశాలను బట్టే హిల్లరీ అలా మాట్లాడి ఉండొచ్చని ట్రంప్ ఆరోపిస్తున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని ఒక్కసారి పరిశీలిస్తే.. చివరిసారి అంటే 2012లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో 57.5 శాతం ఓటింగ్ నమోదయింది. అదే 2008లో ఓటింగ్ శాతం 62.3గా ఉంది. మొదటిసారి ఒక నల్లజాతీయుడైన ఒబామా అధ్యక్ష రేసులో ఉన్నందున ఓటింగ్ శాతం అమాంతం పెరిగింది. బుష్ రెండోసారి అధ్యక్షుడిగా గెలిచిన ఎన్నికల్లో(2004లో) 60.4 శాతం, 2000 సంవత్సరంలో 54.2 శాతం ఓటింగ్ నమోదయింది. మునుపెన్నడూలేని విధంగా విత పోకడలున్న 2016 ఎన్నికల్లో ప్రజలు ఏమేరకు ఓటింగ్ లో పాల్గొంటారో మరో 20 రోజుల్లో తేలిపోనుంది. -
ట్రంప్ పార్టీ కార్యాలయంపై బాంబు దాడి
వాషింగ్టన్: మరో 22 రోజుల్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న తరుణంలో 'రాజకీయ ఉగ్రవాదం'గా పరిగణిస్తోన్న దుశ్చర్య అమెరికాలో కలకలం రేపింది. అధ్యక్ష స్థానం కోసం పోటీపడుతోన్న డోనాల్డ్ ట్రంప్ ప్రాతినిథ్యం వహిస్తోన్న రిపబ్లికన్ పార్టీ కార్యాలయంపై శనివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు బాంబు దాడి చేశారు. ఉత్తర కరోలినాలోని రిపబ్లికన్ పార్టీ ఆఫీసుపై గుర్తు తెలియని దుండగులు బాంబు దాడి జరిపారని, కిటికీ గుండా ఆఫీసులోపలికి బాంబులు విరిసారని, పేలుడు ధాటికి ఆఫీసులోని ఫర్నీచర్ తోపాటు ప్రచార సామాగ్రి కూడా కాలిపోయిందని ప్రకటించిన పోలీసులు.. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్పష్టం చేశారు. ఘటనా స్థలానికి అతి సమీపంలోని ఓ మూసి ఉన్న షెట్టర్ పై 'నాజీ రిపబ్లికన్లారా.. ఇక్కడి నుంచి వెళ్లిపొండి. లేకుంటే..' అని రాసిఉన్నట్లు పోలీసులు చెప్పారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చోటుచేసుకున్న ఈ ఘటనను రిపబ్లికన్ పార్టీ 'రాజకీయ ఉగ్రవాదం'గా అభివర్ణించింది. ఆ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ మరో అడుగు ముందుకేసి 'హిల్లరీని సమర్థిస్తున్న జంతువులే ఈ ఘాతుకానికి ఒడిగట్టాయి'అని అన్నారు. ఈ చర్యను అమెరికా ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా పేర్కొన్న నార్త్ కరొలినా గవర్నర్ పాట్ మెక్ క్రోరీ.. ఎన్నికల్లో హింసకు తావులేదని, ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించానని తెలిపారు. మరోవైపు డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ సైతం రిపబ్లికన్ పార్టీ ఆఫీసుపై బాంబు దాడిని ఖండించారు. ఈ భయానక దాడిలో ప్రాణనష్టం జరగనందుకు సంతోషిస్తున్నానంటూ హిల్లరీ ఆదివారం ట్విట్టర్ లో పేర్కొన్నారు. రిపబ్లికన్ ఆఫీసుపై దాడిని మరింత రాజకీయం చేస్తూ ఆ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ ఆదివారం వరుసగా ట్వీట్లు చేశారు. ఎన్నికల్లో కీలకమైన ఉత్తర కరొలినాలో హిల్లరీకి గట్టి పోటీ ఇస్తున్నందుకే తమపై ఇలాంటి దాడి జరిగిందని, కొన్ని జంతువులు ఆమె తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నాయని ట్రంప్ అన్నారు. రిపబ్లికన్ పార్టీ గెలవబోతోందన్న అక్కసుతోనే ఇలాంటి చర్యలకు దిగుతున్నారని, బాంబు దాడి ఘటనను ఎన్నటికీ మర్చిపోమని, అక్కడ తమ గెలుపు ఖాయమైందని ట్రంప్ పేర్కొన్నారు. -
హిల్లరీ ‘పెయిడ్ స్పీచ్’ టేపులు విడుదల చేసిన వికీలీక్స్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల రాజకీయాలు కీలక దశకు చేరుకున్న సమయంలో డెమోక్రటిక్ పార్టీ అశ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. గోల్డ్‌మన్ శాక్స్ కంపెనీకి సంబంధించి హిల్లరీ మాట్లాడిన మూడు పెయిడ్ స్పీచెస్ (డబ్బు తీసుకుని ఇచ్చే ఉపన్యాసాలు)కు సంబంధించిన టేపులను వికీలీక్స్ విడుదల చేసింది. దీంతో వాల్‌స్ట్రీట్‌తో డెమోక్రటిక్ నేతలకున్న సంబంధాలు తేటతెల్లమయ్యాయి. హిల్లరీ ప్రచార సారథి జాన్ పొడెస్టా మెయిల్ ఎకౌంట్‌ను హ్యాక్ చేయ డం ద్వారా వికీలీక్స్ సేకరించిన భారీ సమాచారంలో ఈ వివరాలు ఉన్నాయి. ఈ లీకేజీకి రష్యానే కారణమని హిల్లరీ వర్గం ఆరోపిస్తోంది. తమ ప్రత్యర్థి ట్రంప్‌నకు సహకరించేందుకే వికీలీక్స్ ఇటువంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపించింది. -
హిల్లరీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్: వివాదాస్పద వ్యాఖ్యలు చేయడాన్ని అలవాటుగా మార్చుకున్న అమెరికా అధ్యక్ష పదవి రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ మరోసారి తన ప్రత్యర్థి, డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత వారం జరిగిన రెండో ముఖాముఖి చర్చకు ముందు హిల్లరీ డ్రగ్స్ తీసుకున్నారని ట్రంప్ ఆరోపించారు. చివరి, మూడో ముఖాముఖి చర్చకు ముందు హిల్లరీకి, తనకు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. 'అథ్లెట్లకు డ్రగ్స్ పరీక్షలు నిర్వహిస్తారు. మాకు (హిల్లరీ, ట్రంప్) కూడా ముఖాముఖి చర్చకు ముందు ఈ పరీక్షలు నిర్వహించాలి. ఆమె ప్రవర్తన నాకు అర్థం కావడం లేదు. గత చర్చలో ఆమె మొదట్లో రెచ్చగొట్టేలా మాట్లాడారు. చివర్లో కారు దగ్గరకు ఉడాయించారు' అని న్యూ హాంప్‌షైర్‌లో శనివారం జరిగిన ర్యాలీలో ట్రంప్ చెప్పారు. తాను డ్రగ్ పరీక్ష చేయించుకునేందుకు సిద్ధంగా ఉన్నానని, హిల్లరీ కూడా సిద్ధం కావాలని సవాల్ విసిరారు. హిల్లరీ ఆరోగ్యంపై ట్రంప్ పలుమార్లు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. హిల్లరీకి మతిమరుపు ఉందని, ఏ విషయం కూడా గుర్తు ఉండదని ఆమే స్వయంగా చెప్పారని ట్రంప్ అన్నారు. కాగా ట్రంప్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు సహా పలు విమర్శలు వచ్చాయి. -
మా క్షిపణులతో చైనాను రౌండప్ చేసేస్తాం!
బీజింగ్: నానాటికి దూసుకుపోతున్న చైనాకు చెక్ పెట్టేవిషయంలో డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ వైఖరి వెల్లడించే రహస్య సంభాషణ ఒకటి వెలుగుచూసింది. ఉత్తర కొరియా అణ్వాయుధ పరీక్షలను చైనా నిలువరించకపోతే.. ఆ దేశాన్ని తమ క్షిపణి రక్షణ వ్యవస్థతో చుట్టుముట్టేస్తామని హిల్లరీ క్లింటన్ ఓ ప్రైవేటు సంభాషణలో పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో ఆమె అమెరికా అధ్యక్షురాలైతే.. చైనాపై ఏ విధమైన వైఖరి అవలంబించనున్నారో ఈ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడుతున్న హిల్లరీ ప్రచార చైర్మన్ వ్యక్తిగత ఈమెయిల్‌ను హ్యాక్ చేసి.. ఆ వివరాలను వీకీలీక్స్ తాజాగా వెల్లడించింది. ఈ ఈమెయిల్స్‌లో హిల్లరీ ప్రైవేటు సంభాషణలకు సంబంధించిన వివరాలతో కూడిన పత్రాలతోపాటు పలు ఇతర పత్రాలు ఉన్నాయి. వీటిని వెల్లడించడానికి హిల్లరీ ఇన్నాళ్లు నిరాకరిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. హిల్లరీ అమెరికా విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు చైనీస్ అధికారులను ఎలా ఎదుర్కొన్న అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. ఉత్తర కొరియా ఈ ఏడాది ఐదోసారి అణ్వాయుధ పరీక్షలు నిర్వహించిన నేపథ్యంలో ఆ దేశానికి వ్యతిరేకంగా క్షిపణి రక్షణ వ్యవస్థను మోహరించాలని అమెరికా, దక్షిణ కోరియా భావిస్తుండగా.. ఈ చర్యను చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అయితే, ఉత్తర కొరియా క్షిపణి ముప్పును నివారించడానికి అమెరికా పసిఫిక్ సముద్ర ప్రాంతంలో మరిన్ని మిలిటరీ నౌకలను మోహరిస్తుందని చైనా అధికారులకు తాను స్పష్టం చేసినట్టు హిల్లరీ 2013లో ప్రైవేటుగా ఇచ్చిన ఓ ఉపన్యాసంలో వెల్లడించారు. 'ఉత్తర కొరియా విజయవంతంగా బాలిస్టిక్ క్షిపణులను పొందితే.. అది పసిఫిక్ ప్రాంతంలో అమెరికా మిత్రదేశాలకు ముప్పుగా మారుతుంది. అంతేకాకుండా అమెరికా పశ్చిమ తీరమైన హావాయ్ను ఆ క్షిపణులు ఢీకొట్టగలవు' అని క్లింటన్ పేర్కొన్నారు. "మేం చైనాను క్షిపణి రక్షణ వ్యవస్థను చుట్టుముట్టబోతున్నాం. ఆ ప్రాంతంలో మరింత నౌకాదళాన్ని మోహరించబోతున్నాం. చైనా.. నువ్వు వారిని (ఉత్తరకొరియా)ను నియంత్రించు.. లేదా మేం వారికి వ్యతిరేకంగా రక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది' అని ఆమె పేర్కొన్నారు. వరుసగా అణ్వాయుధ పరీక్షలు చేపడుతూ.. అంతర్జాతీయ ఆంక్షలు ఎదుర్కొంటున్న ఉత్తరకొరియాకు ఏకైక జీవనాధారంగా చైనా అండగా నిలబడుతోంది. ఆ దేశానికి సన్నిహిత దౌత్య, మిత్ర దేశంగా చైనా అన్ని రకాల సహకారం అందిస్తోంది. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియాను చైనా నిలువరించడం లేదంటూ ఆ దేశంపై అమెరికా సహా పలు పాశ్చాత్య దేశాలు మండిపడుతున్న సంగతి తెలిసిందే. -
ట్రంప్‌కు ఏలినాటి శని.. విజేత హిల్లరీయే!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌కు ప్రస్తుతం ఏలిననాటి శని నడుస్తోందట. మిగిలిన గ్రహగతులు కూడా రాజకీయ విజయాన్ని సూచించడం లేదని.. అందువల్ల ఈసారి ఎన్నికల్లో విజేత హిల్లరీ క్లింటనే అవుతారని శ్రీకాళహస్తి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ జోస్యం చెప్పారు. ట్రంప్, హిల్లరీల పుట్టిన రోజుల ఆధారంగా వాళ్ల జాతకచక్రాలను రూపొందించిన ఆయన.. పలు విషయాలు వెల్లడించారు. ట్రంప్ జ్యేష్టా నక్షత్రం 4వ పాదం, వృశ్చిక రాశిలో జన్మించారని, ఆయన జన్మలగ్నం సింహమని తెలిపారు. ఇక హిల్లరీ క్లింటన్ది పూర్వాభాద్ర నక్షత్రం 3వ పాదమని, ఆమె కుంభరాశిలో జన్మించారని వివరించారు. ఆమె జన్మలగ్నం తులా లగ్నమని, ప్రస్తుతం రవి మహర్దశలో రాహువు అంతర్దశ నడుస్తోందని తెలిపారు. రవి నీచభంగ రాజయోగంలో ఉన్నాడని, రాహువు ఉచ్చస్థితిలో ఉన్నాడని.. దశమ స్థానంలో శని, కుజులున్నారని చెప్పారు. ఇది చాలా మంచిదని, జాతకాన్ని పూర్తిగా పరిశీలిస్తే హిల్లరీ క్లింటన్ అమెరికా అధ్యక్షురాలిగా ఎన్నిక కావడం ఖాయమని అన్నారు. తొలిసారిగా ఒక మహిళ అమెరికా అధ్యక్ష స్థానానికి ఎన్నికయ్యే పరిస్థితి కూడా ఉందని ఆయన తెలిపారు. -
'కుక్కలు పట్టడానికి కూడా హిల్లరీ పనికిరాదు'
ఆంబ్రిడ్జ్: 'మీడియానే.. అంతా మీడియానే చేస్తోంది. ఒక్కసారి మీడియా పక్కకు తప్పుకుంటే అప్పుడు బయటపడుతుంది.. హిల్లరీ క్లింటన్ అసలు స్వరూపం. మీడియా సపోర్ట్ లేకపోతే కనీసం కుక్కలు పట్టే ఉద్యోగం కూడా దొరక్కపోయేది. అలాంటావిడా నన్ను విమర్శించేది?' అంటూ డెమోక్రటిక్ అభ్యర్థిపై రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ నిప్పులు చెరిగారు. పెన్సిల్వేనియా లోని ఆంబ్రిడ్జ్ లో మంగళవారం నిర్వహించిన ప్రచార సభలో డోనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. ఎప్పుడో ప్రైవేట్ సంభాషణలో మాట్లాడిన మాటల్ని వీడియోలు చేసి ప్రదర్శిస్తూన్నారని, మీడియా కూడా రెండు మూడు రోజులపాటు వాటినే హెడ్ లైన్స్ గా వేశాయని, ఇలాంటి వ్యర్థప్రయత్నాలు మానుకుంటే మంచిదని అన్నారు. ఇంత చెప్పినా వీడియోలు రిలీజ్ చేయడం మానుకోకపోతే.. హిల్లరీ కుటుంబానికి చెందిన రహస్యాలు బయటపెడతానని హెచ్చరించారు. 'హిల్లరీ భర్త బిల్ క్లింటన్.. ఓ సెక్స్ ప్రిడేటర్ (ఇతర జంతువులను చంపితినే జంతువు) అమెరికా అధ్యక్ష చరిత్రలోనే.. ఆయనంతగా మహిళల్ని ఎవ్వరూ వేధించలేదు. బిల్ క్లింటన్ బారినపడ్డ మహిళల్ని ఓదార్చకపోగా హిల్లరీ వాళ్లను మళ్లీ బెదిరించేది. నాపై విమర్శలు మానుకోకుంటే వాళ్ల బండారం బయటపెడతా' అని ట్రంప్ వ్యాఖ్యానించారు. -
నువ్వా... నేనా!
అమెరికాలో పరస్పర ఆరోపణలతో వేడి పుట్టించిన రెండో డిబేట్ హిల్లరీ క్లింటన్‌ను జైల్లో పెట్టిస్తా • నావి కేవలం మాటలే.. బిల్వి అసభ్య చేతలు: ట్రంప్ • ముస్లింలపై ట్రంప్ ఆలోచనలు ప్రమాదకరం • మహిళలపై అసభ్య పదజాలం ట్రంప్ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తోంది: హిల్లరీ సెయింట్ లూయిస్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తలపడుతున్న హిల్లరీ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్‌ల మధ్య ఆదివారం రాత్రి జరి గిన రెండో డిబేట్ పరస్పర ఆరోపణలతో వాడీవేడిగా సాగింది. మొదటి డిబేట్లో పూర్తిగా వెనుకబడ్డ రిపబ్లికన్ పార్టీ నామినీ ట్రంప్ ఈ సారి మాత్రం హిల్లరీపై తీవ్రమైన ఆరోపణలతో విరుచుకుపడ్డారు. హిల్లరీ భర్త, అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, తాను అధికారంలోకి వస్తే ఈమెయిల్ వివాదంలో హిల్లరీని జైల్లో పెట్టిస్తానంటూ హెచ్చరించారు. అంతకుముందు 2005లో మహిళలపై ట్రంప్ చేసిన అసభ్య వాఖ్యల్ని డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ తీవ్రంగా తప్పుపట్టారు. సెయింట్ లూయిస్‌లో వాషింగ్టన్ యూనివర్సిటీలో 90 నిమిషాల పాటు సాగిన చర్చలో ఇద్దరూ ఏమాత్రం తీసిపోకుండా ఒకరినొకరు తిట్టుకున్నారు. ఇస్లామాఫోబియా(ముస్లింలంటే అయిష్టం)పై వాగ్యుద్ధం అమెరికాలోకి ముస్లింలు ప్రవేశించకుండా నిషేధం విధిస్తానన్న ట్రంప్ ఆలోచనలు సంకుచితం, ప్రమాదకరమని హిల్లరీ పేర్కొన్నారు. దానికి ట్రంప్ సమాధానమిస్తూ... ‘అమెరికాలో ముస్లింల ప్రవేశంపై నిషేధం ఎంత మాత్రం తన విధానం కాదు. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల నుంచి వచ్చేవారి పూర్వాపరాలు క్షుణ్నంగా తనిఖీ చేయడంగా ఆ నిషేధాన్ని అర్థం చేసుకోవచ్చు. బరాక్ ఒబామా వల్ల సిరియా వంటి దేశాల నుంచి పదులు, వేల సంఖ్యలో ప్రజలు వస్తున్నారు. ఒబామా కంటే హిల్లరీ 550 శాతం వారిని అనుమతించారు. మనదేశానికి వచ్చేవారెవరో మనకు తెలియడం లేదు. సిరియా నుంచి వందల, వేల మంది ఎవరో తెలుసుకోకుండా అనుమతించడాన్ని నేను అంగీకరించడం లేదు’ అని ట్రంప్ పేర్కొన్నారు. వెంటనే స్పందించిన క్లింటన్... ‘మనం ఇస్లాంతో యుద్ధం చేయడం లేదు. అమెరికాకు ముప్పు అనుకునేవారిని అధ్యక్షురాలిగా దేశంలోకి ఎట్టి పరిస్థితుల్లోను అమనుమతించను.వేల మంది శరణార్ధులు... ముఖ్యంగా మహిళలు, చిన్నారుల్ని ముస్లింలుగా పేర్కొంటూ అనుమతి నిషేధించ లేం. పూర్వాపరాల విచారణను కఠినంతరం చేయాలి’ అని సమాధానమిచ్చారు. ఈమెయిల్స్ వివాదంపై విచారణ జరిపిస్తా: ట్రంప్ విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు హిల్లరీ ప్రైవేట్ ఈమెయిల్ సర్వర్ వాడటంపై ప్రత్యేక దర్యాప్తు జరిపిస్తామని ట్రంప్ చెప్పా రు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే హిల్లరీ జైలుకెళ్లడం ఖాయమన్నారు. ‘ప్రత్యేక విచారణాధికారిని నియమించి ఈమెయిల్ వివాదంపై విచారణ జరిపిస్తాం’ అని ట్రంప్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఒకరినొకరు తీవ్రంగా విమర్శించుకున్నారు. ‘హిల్లరీ చేసిన పనికి ప్రజల జీవితాలు నాశనమయ్యాయి. చేసిన పనికి ఆమె సిగ్గుపడాలి’ అంటూ డొనాల్డ్ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. క్లింటన్ జోక్యం చేసుకుంటూ... ‘ట్రంప్ అబద్ధాలాడుతున్నారని, ఆయన చెప్పేదంతా పూర్తిగా అవాస్తవాలు’ అని చెప్పారు. ఈ మెయిల్స్ అంశంలో తాను తప్పు చేశానని క్లింటన్ మరోసారి పేర్కొన్నారు. అసభ్య పదజాలంపై సిగ్గుపడుతున్నా.. ట్రంప్: 2005లో ట్రంప్ మహిళలపై చేసిన అసభ్య వాఖ్యలపై డిబేట్లో తీవ్ర వాదోపవాదాలు సాగాయి. ట్రంప్ పదజాలాన్ని హిల్లరీ తీవ్రంగా తప్పుపట్టగా... ప్రతిగా ఆమె భర్త బిల్ క్లింటన్‌పై ట్రంప్ విరుచుకుపడ్డారు. గతంలో కొన్ని దశాబ్దాల పాటు బిల్ క్లింటన్ మహిళలపై లైంగిక దాడులు చేశారంటూ విమర్శించారు. ‘మహిళల గురించి ట్రంప్ ఏం మాట్లాడారో మనమంతా విన్నాం, చూశాం. మహిళల గురించి ఏం ఆలోచిస్తున్నారో... మహిళల పట్ల ఎలా ప్రవర్తించారో అన్నీ చూశాం. ఆయన వ్యక్తిత్వాన్ని అవి ప్రతిబింబిస్తున్నాయి’ అంటూ హిల్లరీ పేర్కొన్నారు. 2005లో తాను చేసిన వ్యాఖ్యలకు ట్రంప్ క్షమాపణలు చెప్పారు. అవి లాకర్ రూం సంభాషణలు మాత్రమేనని, వాటి విషయంలో కుటుంబ సభ్యులకు క్షమాపణ చెప్పానని, అసభ్య పదజాలంపై చాలా సిగ్గుపడుతున్నానని ట్రంప్ తెలిపారు. చర్చలో మరింత వేడి పుట్టిస్తూ బిల్ క్లింటన్‌పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ‘నావి మాటలు మాత్రమే. బిల్ క్లింటన్ ఏకంగా మహిళల విషయంలో అసభ్యకర పనులు చేశారు. మహిళలతో ఇంత అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి అమెరికా రాజకీయాల్లో ఎవరూ లేరు’ అంటూ విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా తమపై బిల్ క్లింటన్ లైంగిక దాడి చేశారంటూ ఆరోపించిన నలుగురు మహిళల్ని డిబేట్‌కు ట్రంప్ తీసుకొచ్చారు. చర్చకు ముందు వారితో కలిసి ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. ట్వీటర్లో అత్యధికమంది స్పందించిన అధ్యక్ష ఎన్నికల డిబేట్‌గా ఈ చర్చ నిలిచింది. 1.7కోట్ల ట్వీట్లు చేశారంటూ ట్వీటర్ ప్రతినిధి వెల్లడించారు. ట్రంప్ పిల్లల్ని గౌరవిస్తా.. హిల్లరీ: ట్రంప్, హిల్లరీలు చివర్లో ఒకరినొకరు పొగుడుకున్నారు. మీ ప్రత్యర్థిలో ఇష్టపడే మంచి లక్షణం చెప్పండన్న ప్రేక్షకుడి ప్రశ్నకు హిల్లరీ జోక్యం చేసుకుని ‘నేను ట్రంప్ పిల్లల్ని గౌరవిస్తాను. వారు పూర్తి సామర్థ్యం, అంకితభావం కలిగినవారు’ అంటూ కొనియాడారు. ఇక హిల్లరీని ట్రంప్ పొగుడుతూ... ‘ఆమె పోరాట యోధురాలు, చేపట్టిన దాన్ని ఎప్పుడూ వదిలిపెట్టదు. హిల్లరీలో ఆ అంశాన్ని తాను గౌరవిస్తా’ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. హిల్లరీ గెలుపు ఖాయం: సర్వేలు రెండో డిబేట్ అనంతరం హిల్లరీ అమెరికా తదుపరి అధ్యక్షురాలవడం ఖాయమంటూ కొన్ని పోల్స్ తేల్చిచెప్పాయి. సీఎన్ఎన్/ఓఆర్సీ సర్వేలో హిల్లరీకి 57 శాతం, ట్రంప్‌కు 34 శాతం మద్దతు పలికారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ చరిత్ర ముగుస్తోందని ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక పేర్కొంది. వాషింగ్టన్ పోస్టు కూడా హిల్లరీకే విజయం కట్టబెట్టింది. ఎన్బీసీ-వాల్‌స్ట్రీట్ జర్నల్ సర్వే ప్రకారం... హిల్లరీ 14 పాయింట్లు ఎగబాకి 52 శాతంతో ముందజంలో నిలిచారు. ట్రంప్ 38 శాతం మద్దతే సాధించారు. -
సిరియా శరణార్థులు ఉగ్రవాదులు కాదు
-
తిరుగులేని హిల్లరీ.. ఆధిక్యమెంతో తెలుసా?
సెయింట్ లూయిస్: అమెరికా అధ్యక్ష అభ్యర్థుల రెండో డిబేట్ లోనూ డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకున్నారు. ఆదివారం సెయింట్ లూయిస్ లో హోరాహోరీగా జరిగిన ఈ డిబేట్ లో అత్యధికమంది అమెరికా జనాలు హిల్లరీకే అండగా నిలిచారు. ఈ డిబేట్ లో హిల్లరీకి 57శాతం మంది మద్దతు పలుకగా.. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కు 34శాతం మంది అండగా నిలిచారు. మొదటి డిబేట్ లోనూ ట్రంప్ పై హిల్లరీ స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించిన సంగతి తెలిసిందే. తొలి డిబేట్ లో హిల్లరీకి 62 శాతం మంది మద్దతు పలుకగా.. ట్రంప్ కు కేవలం 27శాతం మందే మద్దతిచ్చారు. తొలి డిబేట్ తో పోలిస్తే రెండో డిబేట్ లో హిల్లరీ ఆధిక్యం కొంత తగ్గినప్పటికీ.. ట్రంప్ పై స్పష్టమైన ఆధిక్యంతో ఆమె దూసుకుపోతున్నారు. సెయింట్ లూయిస్ లో జరిగిన రెండో డిబేట్ లో మహిళలపై ట్రంప్ చేసిన లైంగిక దుర్భాషలపై ప్రధానంగా చర్చ జరిగిన సంగతి తెలిసిందే. మహిళల గురించి దారుణంగా లైంగిక వ్యాఖ్యలు చేసిన ట్రంప్ వీడియో వెలుగులోకి రావడంతో ఈ విషయంలో ఆయను తీరును హిల్లరీ తూర్పారబట్టారు. ఆయనకు మహిళలంటే ఏమాత్రం గౌరవం లేదని, ట్రంప్ కు అధ్యక్షుడయ్యే అర్హత లేదని విరుచుకుపడ్డారు. మరోవైపు ట్రంప్ కూడా హిల్లరీపై ఎదురుదాడి చేశారు. హిల్లరీ భర్త, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ మహిళలపై లైంగిక దాడులు జరిపారని ఆరోపించారు. ఆద్యంతం హోరాహోరీగా సాగిన రెండో డిబేట్ పై ప్రజాభిప్రాయ సేకరణలో హిల్లరీకే అధిక మద్దతు లభించింది. -
టీచర్ ప్రశ్నకు హుందాగా సమాధానం ఇచ్చిన హిల్లరీ
-
'ట్రంప్ మరో హిట్లర్.. నేను అతడికి ఓటెయ్యను'
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు రిపబ్లికన్ల నుంచి కూడా అనూహ్య మద్దతు పెరుగుతోంది. మరో రిపబ్లికన్ పార్టీ నేత, న్యూజెర్సీ మాజీ గవర్నర్ క్రిస్టీన్ టాడ్ వైట్మేన్ తన ఓటును హిల్లరీ క్లింటన్కే వేస్తానని చెప్పింది. హిల్లరీ ఖాతాలో కూడా చాలా తప్పిదాలు ఉన్నాయని, అయితే, వాటిని అదిగమించి పరిపాలనకు ఆమె సిద్ధమైందని అన్నారు. డోనాల్డ్ ట్రంప్ ఒక హిట్లర్ లాంటివాడని ఆమె ఆరోపించారు. 2005లో ఓ సందర్భంలో రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ మహిళలకు సంబంధించి అసభ్యకరంగా మాట్లాడిన వీడియో ఒకటి బయటకొచ్చిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి స్పందిస్తూ క్లింటన్ మాత్రమే అమెరికన్లకు ఉన్న ఏకైక ఛాయిస్ అన్నారు. ట్రంప్ ఓ హిట్లర్ లాంటివాడని, తాను మాత్రమే హిల్లరీకే ఓటు వేస్తానని బాహాటంగా చెప్పారు. ట్రంప్ గురించి ఆలోచిస్తే ఓ నియంతే గుర్తుకొస్తారని, ఆయనను ఎలాంటి నియంతలతోనైనా పోల్చేందుకు వెనుకాడబోమని విమర్శించారు. -
అమెరికాపై రష్యా సైబర్ దాడులు?
తమ దేశంలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో డెమొక్రాటిక్ పార్టీకి చెందిన ప్రచార వెబ్సైట్లపై రష్యా సైబర్ దాడులు చేస్తోందని అమెరికా ఆరోపించింది. రష్యా అండతో కొంతమంది హ్యాకర్లు కొన్ని నెలలుగా సైబర్ దాడులు చేస్తున్నారని అమెరికన్ అధికారులు అంటున్నారు. హిల్లరీ క్లింటన్ విజయావకాశాలను దెబ్బతీయడానికే ఇలా జరుగుతోందని చెప్పారు. అయితే, రష్యా మాత్రం అసలు ఈ సైబర్ దాడుల విషయంలో తమ హస్తం ఏమీ లేదని స్పష్టం చేసింది. సైబర్ దాడుల తీవ్రతను, విస్తృతిని బట్టి చూస్తే మాత్రం కేవలం రష్యాకు చెందిన అత్యంత సీనియర్ అధికారులు మాత్రమే ఇలాంటి కార్యకలాపాలు చేయించగలరని అనిపిస్తోందిన అమెరికా ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ అధికారి ఒకరు ఈ ప్రకటన చేశారు. నేరుగా రష్యా ప్రభుత్వంపై ఆరోపణలు చేయకపోయినా.. ఈ సైబర్ దాడుల మూలాలు గాలిస్తే మాత్రం ఒక రష్యన్ కంపెనీకి సంబంధించిన సెర్వర్ల నుంచి జరిగినట్లుగా తేలిందన్నారు. అమెరికా ఎన్నికల విధానంలో జోక్యం చేసుకోడానికే ఇలా జరుగుతోందని, అయితే ఈ కార్యకలాపాలను రష్యన్ ప్రభుత్వానికి ఆపాదించే పరిస్థితిలో మాత్రం తామిప్పుడు లేమని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అమెరికా రాజకీయ సంస్థలపై తాము సైబర్ దాడులకు పాల్పడ్డామంటూ వచ్చిన ఆరోపణలను రష్యా ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెబ్‌సైట్‌పై ప్రతిరోజూ సైబర్ దాడులు వేలాదిగా జరుగుతాయని, వీటి మూలాలు తమకు అమెరికాలోనే కనిపించాయని, అయినా తాము ఏనాడూ వైట్‌హౌస్ మీద ఆరోపణలు చేయలేదని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి డిమిట్రీ పెస్కొవ్ అన్నారు. -
హిల్లరీకి ఊహించని వ్యక్తి మద్దతు
న్యూయార్క్: డెమోక్రటిక్ పార్టీలో పుట్టి, పెరిగి, భర్తను అధ్యక్షుడిగా గెలిపించుకుని, తర్వాతి కాలంలో కీలక పదవులు చేపట్టి.. ప్రస్తుతం అదే పార్టీ అభ్యర్థిగా అమెరికా అధ్యక్ష స్థానం కోసం పోటీపడుతోన్న హిల్లరీ క్లింటన్‌కు.. ఎంతో ఘనమైన రాజకీయ చరిత్ర గల కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి మద్దతు పలకడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆ వ్యక్తి మరెవరోకాదు.. ఫొటోలో మాజీ అధ్యక్షుడు జార్జి బుష్ పక్కన కూర్చుందే.. ఆయన కూతురు బార్బరా పియర్స్ బుష్! ముత్తాతల కాలం నుంచి గ్రాండ్ ఓల్డ్ పార్టీ(జీఓపీ లేదా రిపబ్లికన్)లో కొనసాగుతూ, అదే పార్టీ నుంచి రెండు సార్లు దేశాధ్యక్ష పదవిని సైతం నిర్వహించిన కుటుబానికి చెందిన బార్బరా.. ఎవ్వరూ ఊహించని విధంగా డెమోక్రటిక్ అభ్యర్థిని హిల్లరీ క్లింటన్ కోసం నిధులు సేకరించే కార్యక్రమానికి హాజరై అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. హిల్లరీ కీలక సహాయకురాలు హుమా అబెదిన్ శనివారం న్యూయార్క్ రాష్ట్రంలోని పారిస్ లో నిర్వహించిన ఫండ్ రైజింగ్ కార్యక్రమంలో బార్బరా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆ కార్యక్రమానికి బార్బరా వచ్చిన నిమిషాల వ్యవధిలోనే సంబంధిత ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, అవికాస్త వైరల్ అయిపోవడం విశేషం. బార్బరా మద్దతుతో ఆమె కుటుంబమంతా సొంత పార్టీ(రిపబ్లికన్) అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకులని బాహాటంగా తేలిపోయింది.. ఒక్క జార్జి బుష్(జూనియర్) తప్ప! అయితే జార్జి బుష్ నేరుగా హిల్లరీకి మద్దతు ప్రకటించలేదుకానీ మొదటి నుంచి ఆయన ట్రంప్ వ్యతిరేకి. అందుకే ఇప్పటివరకూ రిపబ్లికన్ అభ్యర్థి కోసం ప్రచారంలోనూ పాల్గొనలేదు. ఆయన సోదరుడు జెబ్ బుష్ రిపబ్లికన్ అభ్యర్థిత్వం కోసం ట్రంప్ తో పోటీపడి, నెగ్గలేక ఎన్నికల ప్రక్రియ నుంచి తప్పుకుని.. ప్రస్తుతం ప్రత్యర్థిని(ట్రంప్ ను) ఓడించేలా వ్యూహాలు రచిస్తున్నారు. జార్జి డబ్ల్యూ బుష్ తండ్రి, సీనియర్ బుష్ అయితే గతనెలలో 'హిల్లరీకి ఓటు వేయాల'ని బాహాటంగా పిలుపునిచ్చారు. జూనియర్ బుష్ భార్య లారా కూడా హిల్లరీని పరోక్షంగా సమర్థించారు. బుష్ కుటుంబానికి చెందిన పలువురు(ప్రస్తుతం వివిధ పదవుల్లో ఉన్నవారు)కూడా సొంతపార్టీ అభ్యర్థిని కాదని, హిల్లరీకి జై కొడుతున్నారు. కాగా, ట్రంప్ మాత్రం బుష్ లాంటి కొన్ని కీలక రాజకీయ కుటుంబాల మద్దతు లేకపోయిన గెలుపునాదేనని ప్రకటిస్తున్నారు. చూద్దాం.. వచ్చే నెలలో జరగబోయే ఎన్నికల్లో గెలుపు ఎవరిదో? -
పెరుగుతున్న హిల్లరీ ఆధిక్యం
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ తరఫున పోటీలో ఉన్న హిల్లరీ క్లింటన్.. తన ఆధిక్యాన్ని మళ్లీ పెంచుకుంటున్నారు. మొట్టమొదటగా నిర్వహించిన అధ్యక్ష ఎన్నికల డిబేట్ అనంతరం ఆమె పట్ల ఆదరణ పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా నిర్వహించిన ఒక పోల్ సర్వేలో రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ కంటే ఆమె నాలుగు శాతం ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్లు తేలింది. సీబీఎస్ న్యూస్ / ద న్యూయార్క్ టైమ్స్ నిర్వహించిన పోల్‌లో హిల్లరీ క్లింటన్‌కు 45 శాతం మంది అనుకూలంగా ఓట్లు వేయగా, ట్రంప్‌కు కేవలం 41 శాతం మందే అనుకూలంగా ఉన్నారు. గత నెలలో ఇదే సంస్థలు నిర్వహించిన పోల్‌లో ఇద్దరికీ సమానంగా 42 శాతం చొప్పున ఓట్లు వచ్చాయి. రియల్ క్లియర్ పాలిటిక్స్ అనే మరో సంస్థ నిర్వహించిన పోల్స్‌లో కూడా హిల్లరీ క్లింటన్‌కు 3.1 శాతం పాయింట్ల ఆధిక్యం కనిపించింది. ప్రెసిడెన్షియల్ డిబేట్లో ట్రంప్ మీద ఆధిక్యం కనబర్చడం హిల్లరీకి బ ఆగా కలిసొచ్చిన అంశమని సీబీఎస్ న్యూస్/ న్యూయార్క్ టైమ్స్ పోల్ తెలిపింది. లైక్లీ ఓటర్లలో అయితే హిల్లరీ ఆధిక్యం మరింత ఎక్కువగా ఉంది. తాము క్లింటన్ వైపు మొగ్గుతామని చెప్పినవారు 32 శాతం ఉంటే, ఆమె నచ్చలేదని చెప్పినవాళ్లు 16 శాతమే ఉన్నారు. ఫ్లోరిడా, ఉత్తర కరొలినా, పెన్సల్వేనియా రాష్ట్రాల్లో హిల్లరీ ఆధిక్యంలో ఉండగా, ఓహియోలో మాత్రం ట్రంప్ ముందున్నారని క్వినిపియాక్ యూనివర్సిటీ విడుదల చేసిన ఫలితాల్లో పేర్కొన్నారు. -
సెక్స్ టేప్ ఆరోపణలు: ఆ వీడియోలో ట్రంప్!
వాషింగ్టన్: మాజీ విశ్వసుందరి ఎలీషియా మచాడో ఓ సెక్స్ టేప్‌లో నటించిందంటూ ఆరోపణలు చేసిన డొనాల్డ్ ట్రంప్ ఊహించనిరీతిలో చిక్కుల్లో పడ్డారు. ఆయన ఈ ఆరోపణలు చేసిన కాసేపటికే.. ఆయన ఉన్న సాఫ్ట్‌కోర్ పోర్న్ వీడియో ఒకటి ఆన్లైన్లో వెలుగుచూసింది. ‘డైలీమెయిల్’ కథనం ప్రకారం 2000 సంవత్సరం నాటి ప్లేబోయ్ వీడియో ఒకటి ఆన్లైన్ అడల్ట్ వీడియో స్టోర్‌లో లభించింది. చుట్టు ఉన్న మహిళలను ఉత్సాహ పరుస్తూ షాంపెన్ బాటిల్ పొంగిస్తూ ఈ వీడియోలో ట్రంప్ కనిపించారు. ఈ వీడియోలో నగ్నంగా ఉన్న మహిళలు లైంగిక చేష్టలకు పాల్పడుతూ కనిపించారు. ‘అందం అందమే. న్యూయార్క్‌లో ఏం జరగబోతున్నదో చూద్దాం’ అంటూ ఈ వీడియోలో ట్రంప్ పేర్కొన్నారు. మాజీ మిస్ యూనివర్స్‌ను తాను తిట్టానని అంతా అంటున్నారని, కానీ ఆమె ఒక సెక్స్ టేప్‌లో ఉన్న విషయాన్ని విమర్శకులు చూసుకోవాలని రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్లు దుమారం రేపిన సంగతి తెలిసిందే. తెల్లవారుజామున 3.20 గంటల సమయంలో హిల్లరీ క్లింటన్‌ను విమర్శిస్తూ ఆయన వరుసపెట్టి ట్వీట్లు చేశారు. 1996 నాటి మిస్ యూనివర్స్ విజేత ఎలీషియా మచాడోను గతంలో ట్రంప్ విమర్శించిన విషయాన్ని హిల్లరీ క్లింటన్ ప్రెసిడెన్షియల్ డిబేట్లో ప్రస్తావించారు. 1996లో మిస్ యూనివర్స్‑గా గెలుపొందిన వెనిజులా సుందరి ఎలీషియా మచాడోను పంది (మిస్ పిగ్గీ), తిండిబోతు యంత్రం (ఈటింగ్ మిషన్) అంటూ ట్రంప్నానా దుర్భాషలు ఆడారు. ఈ విషయాన్ని ప్రస్తావించిన హిల్లరీ క్లింటన్.. మహిళలంటే ట్రంప్‌కు ఏమాత్రం గౌరవం లేదన్నారు. దాన్ని ఇప్పుడు ఆయన ప్రస్తావిస్తూ... 'క్రూకెడ్ హిల్లరీ' ఎలీషియాను తన డిబేట్లో ఉపయోగించుకున్నారని, కానీ ఆమె దారుణమైన గతాన్ని (సెక్స్ టేపులు) గుర్తుచేసుకోవాలని తన ట్వీట్లలో పేర్కొన్నారు. ఫాక్స్ టీవీలో ఇంటర్వ్యూ సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యలను ట్రంప్ సమర్థించుకున్నారు. మచాడో బరువు పెరగడం నిజంగా సమస్యే అవుతుందని ఆయన అన్నారు. -
తాజా సర్వేలో ట్రంప్ మరింత వెనక్కి
వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్‌కు ఆదరణ రోజురోజుకూ తగ్గిపోతోంది. పాక్స్ న్యూస్ నిర్వహించిన తాజా సర్వే ఫలితాల్లో ఈ విషయం వెల్లడైంది. ట్రంప్ ప్రత్యర్థి, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు ఓటర్ల ఆదరణ పెరిగిందని జాతీయస్థాయిలో నిర్వహించిన సర్వేలో తేలింది. సెప్టెంబర్ 11 నుంచి 14 తేదీల మధ్య ఫాక్స్ న్యూస్ నిర్వహించిన సర్వేలో ట్రంప్ కంటే హిల్లరీ.. కేవలం ఒక పాయింట్ శాతం ఓటర్ల మెజారిటీ కలిగి ఉన్నారని వెల్లడికాగా.. తాజా సర్వే ఫలితాల్లో మాత్రం హిల్లరీ ఆధిక్యం మూడు పాయింట్ల శాతానికి పెరిగింది. ట్రంప్‌కు 40 శాతం ఓటర్లు మద్దతు ఇవ్వగా.. హిల్లరీకి 43 శాతం ఓటర్ల మద్దతు ఉందని తాజా సర్వేలో వెల్లడైంది. మొదటి డిబేట్లో మహిళలపై ట్రంప్ దృక్పథం సరిగా లేదంటూ హిల్లరీ ఎండగట్టిన విషయం తెలిసిందే. ఈ డిబేట్ అనంతరం ట్రంప్‌కు జనాదరణ తగ్గినట్లు తెలుస్తోంది. రాండమ్ శాంపిల్ విధానంలో దేశ వ్యాప్తంగా 10,000 మందికి పైగా రిజిష్టర్డ్ ఓటర్ల అభిప్రాయాలతో ఈ సర్వేను నిర్వహించినట్లు ఫాక్స్ న్యూస్ వెల్లడించింది. -
ఆమె సెక్స్ టేపుల గురించి తెలీదా: ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం మరీ ఘోరంగా తయారవుతోంది. మాజీ మిస్ యూనివర్స్‌ను తాను తిట్టానని అంతా అంటున్నారని, కానీ ఆమె ఒక సెక్స్ టేప్‌లో ఉన్న విషయాన్ని విమర్శకులు చూసుకోవాలని రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ చెప్పారు. తెల్లవారుజామున 3.20 గంటల సమయంలో హిల్లరీ క్లింటన్‌ను విమర్శిస్తూ ఆయన వరుసపెట్టి ట్వీట్లు చేశారు. 1996 నాటి మిస్ యూనివర్స్ విజేత ఎలీషియా మచాడోను గతంలో ట్రంప్ విమర్శించిన విషయాన్ని హిల్లరీ క్లింటన్ ప్రెసిడెన్షియల్ డిబేట్లో ప్రస్తావించారు. 1996లో వెనిజులా సుందరి ఎలీషియా మచాడో మిస్ యూనివర్స్‌గా గెలుపొందింది. ఆ ఆనందంలో ఉన్న ఆమె కొంతకాలానికి బరువు పెరిగింది. దీంతో ఆమెను వెంటాడి మరీ ట్రంప్ కంపు వ్యాఖ్యలు చేశారు. ఆమె ముఖం మీదే పంది (మిస్ పిగ్గీ), తిండిబోతు యంత్రం (ఈటింగ్ మిషన్) అంటూ నానా దుర్భాషలు ఆడారు. వ్యక్తిగతంగా తిట్టడంతో పాటు బహిరంగంగా కూడా దూషించిన విషయాన్ని హిల్లరీ క్లింటన్ ప్రశ్నించారు. మహిళలంటే ట్రంప్‌కు ఏమాత్రం గౌరవం లేదన్నారు. దాన్ని ఇప్పుడు ఆయన ప్రస్తావిస్తూ... 'క్రూకెడ్ హిల్లరీ' ఎలీషియాను తన డిబేట్లో ఉపయోగించుకున్నారని, కానీ ఆమె దారుణమైన గతాన్ని (సెక్స్ టేపులు) గుర్తుచేసుకోవాలని తన ట్వీట్లలో పేర్కొన్నారు. ఎలీషియా గతాన్ని ఏమాత్రం తెలుసుకోకుండా అనవసరంగా ఒక దేవతలా చూపించే ప్రయత్నం చేశారని మరో ట్వీట్లో చెప్పారు. అయితే ఆ టేపులకు సంబంధించి గానీ, ఎలీషియా గురించి అంతకుముందు ప్రచురించిన అంశాల గురించి గానీ ట్రంప్ ఎక్కడా ఎలాంటి లింకులు ఇవ్వలేదు. ఫాక్స్ టీవీలో ఇంటర్వ్యూ సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యలను ట్రంప్ సమర్థించుకున్నారు. మచాడో బరువు పెరగడం నిజంగా సమస్యే అవుతుందని ఆయన అన్నారు. ట్రంప్ తనను ఎప్పుడూ ఒక చెత్తకుప్పలాగే చూసేవాడని మచాడో మండిపడ్డారు. ప్రస్తుతం రాజకీయాలలోకి వచ్చిన ఆమె.. బిగ్ డిబేట్ అయిన వెంటనే మర్నాడే మీడియా ముందుకు వచ్చారు. 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఒక పీడకలలా తన గురించి ఆయన చెప్పారని ఆవేదన చెందారు. మొదటి డిబేట్ తర్వాత ట్రంప్ విజయావకాశాలు మరింత తగ్గాయి. సర్వేలలో ఆయనకు .. హిల్లరీకి మధ్య తేడీ మరింత పెరిగిపోయింది. దాంతో కొత్త సలహాదారులను నియమించుకున్న ఆయన.. బహిరంగ సభల్లో కేవలం వాళ్లు చెప్పిన మాటలు మాత్రమే మాట్లాడుతున్నారు. Wow, Crooked Hillary was duped and used by my worst Miss U. Hillary floated her as an "angel" without checking her past, which is terrible! — Donald J. Trump (@realDonaldTrump) 30 September 2016 Using Alicia M in the debate as a paragon of virtue just shows that Crooked Hillary suffers from BAD JUDGEMENT! Hillary was set up by a con. — Donald J. Trump (@realDonaldTrump) 30 September 2016 Did Crooked Hillary help disgusting (check out sex tape and past) Alicia M become a U.S. citizen so she could use her in the debate? — Donald J. Trump (@realDonaldTrump) 30 September 2016 Remember, don't believe "sources said" by the VERY dishonest media. If they don't name the sources, the sources don't exist. — Donald J. Trump (@realDonaldTrump) 30 September 2016 The people are really smart in cancelling subscriptions to the Dallas & Arizona papers & now USA Today will lose readers! The people get it! — Donald J. Trump (@realDonaldTrump) 30 September 2016 -
పాక్ నుంచి అణు ఆత్మాహుతి బాంబులు
హిల్లరీ ఆందోళన వాషింగ్టన్: పాకిస్తాన్లో అణ్వాయుధాలు జీహాదీల చేతుల్లోకి వెళితే పెను ప్రమాదం తప్పదని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ భయాందోళనలు వ్యక్తం చేశారు. తద్వారా అణుఆత్మాహుతి దాడులు జరిగే అవకాశం ఉందన్నారు. ‘జీహాదీలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తారన్న భయంతో జీవిస్తున్నాం. వారు అణ్వాయుధాలు హస్తగతం చేసుకుంటారు. ఫలితంగా అణు ఆత్మాహుతి దాడులకు అవకాశం ఏర్పడుతుంది’ అని ఆందోళన వ్యక్తం చేసినట్టు ‘న్యూయార్క్ టైమ్స్’ పేర్కొంది. డెమోక్రటిక్ పార్టీ కంప్యూటర్ల హ్యాకింగ్ ద్వారా హిల్లరీ మాట్లాడిన ఆడియో సారాంశాన్ని పత్రిక వెల్లడించింది.గత ఫిబ్రవరిలో వర్జీనియాలో నిధుల సేకరణ సందర్భంగా ఆమె సన్నిహితులతో ఈ వ్యాఖ్యలు చేశారంది. భారత్‌తో ఉన్న శత్రుత్వంతో పాక్ అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తోందని హిల్ల రీ పేర్కొన్నారు. రష్యా, చైనాతో పాటు పాక్, భార త్ అణ్వాయుధాల్లో పోటీపడుతున్నాయని... ఇది అత్యంత ప్రమాదకర పరిణామమని అన్నారు. -
పాక్ అణ్వాయుధాలపై హిల్లరీ ఆందోళన
-
పాక్ అణ్వాయుధాలపై హిల్లరీ ఆందోళన
పాకిస్థాన్‌లోని అణ్వాయుధాలు ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదముందని అమెరికా అధ్యక్ష పదవికి డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే కనుక జరిగితే పరిస్థితులు భయానకంగా ఉంటాయని చెప్పారు. హిల్లరీ ఈ విషయాలను సన్నిహితుడి వద్ద ప్రస్తావించినట్టు ద న్యూయార్క్ టైమ్స్ ప్రచురించింది. 50 నిమిషాల నిడివిగల హిల్లరీ సంభాషణల ఆడియోను డెమొక్రటిక్ పార్టీ కార్యాలయం నుంచి సేకరించింది. పాకిస్థాన్ భారత్ పట్ల శత్రుత్వ వైఖరిని కొనసాగిస్తూ, కవ్వింపు చర్యలను తీవ్రం చేస్తోందని హిల్లరీ పేర్కొన్నారు. పాకిస్థాన్‌లో జిహాదీలు ప్రభుత్వంపై పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. అలాగే అణ్వాయుధాలను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇదే జరిగితే జిహాదీలు సూసైడ్ న్యూక్లియర్ బాంబర్లుగా మారుతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉడీ ఉగ్రదాడి అనంతరం భారత్ సర్జికల్ దాడులు చేయడం, ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో హిల్లరీ అభిప్రాయాలను ద న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. తమ భద్రతకు ముప్పు వాటిల్లితే, అణ్వాయుధాలను ఉపయోగించి భారత్‌ను నాశనం చేస్తామని పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా మహ్మద్ ఆసిఫ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించింది. కశ్మీర్లో మరిన్ని దాడులకు పాల్పడితే భారత్ ఇక సహనంతో ఉండబోదని, ఉగ్రవాదం విషయంలో పాక్ ఇదే వైఖరిని కొనసాగిస్తే ప్రపంచంలో ఏకాకి అయ్యే ప్రమాదముందని ద వాల్ స్ట్రీట్ జర్నల్ హెచ్చరించింది. ఉగ్రవాదులకు పాక్ మద్దతు ఇవ్వడం మానుకోవాలని, జైషే మహ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలకు పాక్ మిలటరీ సాయం చేస్తోందని పేర్కొంది. పాకిస్థాన్‌తో ఆర్థిక, దౌత్య సంబంధాలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని, పాక్ తమ ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని కొత్త విజన్ ఎంచుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. -
కొనసాగుతున్న హిల్లరీ హవా
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష బరిలో హిల్లరీ క్లింటన్ ముందంజలో ఉన్నారని తాజాగా తెలిపిన మరో పోల్ సర్వే తెలిపింది. రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ కంటే హిల్లరీ నాలుగు పాయింట్లు ముందున్నారని పబ్లిక్ పాలసీ పోలింగ్ ఇన్ స్టిట్యూట్ (పీపీపీ) పేర్కొంది. టెలిఫోన్, ఆన్ లైన్ ఇంటర్వ్యూలు ద్వారా పోల్ సర్వే నిర్వహించగా హిల్లరీకి 44శాతం మంది మద్దతు తెలపగా.. డోనాల్డ్ ట్రంప్ కు 40శాతం మంది మద్దతు తెలిపారు. అమెరికాలో ప్రతి రోజూ ఏదో ఒక సర్వే వెల్లడవుతూనే ఉంటుంది. మారిపోతున్న పరిణామాలకనుగుణంగా సర్వే ఫలితాలు కూడా మారిపోతుంటాయి. తొలిసారి జరిగిన ప్రెసిడెన్షియల్ బిగ్ డిబేట్ అనంతరం ట్రంప్ కంటే ముందుపడిన హిల్లరీ ప్రస్తుతం అదే హవాను కొనసాగిస్తున్నారు. -
ట్రంప్ కంపు వ్యాఖ్యలపై వైరల్ వీడియో!
ఎవరి చేసిన తప్పులు వారిని వెంటాడుతాయంటారు. అదేవిధంగా గతంలో డొనాల్డ్ ట్రంప్ చేసిన కంపు వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనను దారుణంగా వెంటాడుతున్నాయి. 1996లో వెనిజులా సుందరి ఎలిషియా మచాడో 'విశ్వసుందరి' (మిస్ యూనివర్స్)గా గెలుపొందింది. ఈ కిరీటాన్ని సొంతం చేసుకున్న ఆనందంలో ఉన్న ఆమె కొంతకాలానికి బరువు పెరిగింది. దీంతో ఆమెను వెంటాడి మరీ ట్రంప్ కంపు వ్యాఖ్యలు చేశాడు. ఆమె ముఖం మీదే పంది (మిస్ పిగ్గీ), తిండిబోతు యంత్రం (ఈటింగ్ మిషిన్) అంటూ నానా దుర్భాషలు ఆడాడు. ఆమెను వ్యక్తిగతంగా ఇలా తిట్టడమే కాదు బహిరంగంగానూ ట్రంప్ దూషించాడు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడుతున్న రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ తాజాగా 'బిగ్ డిబేట్'లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ట్రంప్ గతంలో చేసిన ఈ దుర్మార్గ వ్యాఖ్యలను వీడియోను ప్రత్యర్థి హిల్లరీ విడుదల చేశారు. లైవ్ ప్రసారంలో ఈ వీడియోను లక్షలమంది చూశారు. ఈ డిబేట్ సందర్భంగా ట్రంప్ తీరును హిల్లరీ ఆసాంతం కడిగిపారేశారు. 'ఈ మనిషి మహిళలను పందులు, బద్ధకస్తులు, కుక్కలు అడ్డంగా తిట్టిపోశాడు. వారు గర్భవతులు కావడం ఉద్యోగులకు ఇచ్చేవాళ్లకు తలనొప్పి అని పేర్కొన్నాడు. పురుషులకు సమానంగా పనిచేస్తే తప్ప వారికి సమాన జీతం పొందే అర్హత లేదని వాగాడు. అందాల పోటీలో పాల్గొన్న ఓ మహిళపై దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. అతను అందాల పోటీలను ఇష్టపడతాడు. వాటికి అండగా ఉంటాడు. వాటి చుట్టూ తిరుగుతాడు. కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తాడు' అంటూ ట్రంప్ తీరును హిల్లరీ తూర్పారబట్టారు. తాజాగా అమెరికా పౌరురాలిగా మారి ఓటు హక్కు పొందిన వెనిజుల సుందరి ఎలిషియా మచాడో కూడా స్పందించింది. తాను అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీకే ఓటు వేస్తానని సోషల్ మీడియాలో తెలిపింది. తనను ట్రంప్ దారుణంగా అవమానించాడని ఆ రోజుల్ని గుర్తుచేసుకుంది. -
‘బిగ్ డిబేట్’లో హిల్లరీ ఆధిక్యం!
♦ అధ్యక్ష అభ్యర్థుల మధ్య పోటాపోటీగా సాగిన తొలి ముఖాముఖి చర్చ ♦ వాదనలో హిల్లరీ ఆధిపత్యం.. అసహనంతో ట్రంప్ ♦ డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థికి అధ్యక్షురాలయ్యే సామర్థ్యం లేదన్న ట్రంప్ ♦ ట్రంప్‌ది అవగాహనలేమి అంటూ హిల్లరీ ధ్వజం హంప్స్టెడ్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ప్రత్యక్ష, ముఖాముఖి పోరుకు తెరలేచింది. డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్(68), ఆమె రిపబ్లికన్ ప్రత్యర్థి డోనాల్డ్ ట్రంప్(70)ల మధ్య తొలి ముఖాముఖి చర్చ మంగళవారం పోటాపోటీగా సాగింది. గంటన్నర పాటు ఆవేశకావేశాలు, వాదప్రతివాదాలు, వ్యక్తిగత విమర్శలు, ఎత్తిపొడుపులు, వ్యంగ్య వ్యాఖ్యలు, భావోద్వేగాలు, భిన్న హావభావాలతో రసవత్తరంగా సాగిన ఈ బిగ్ డిబేట్లో హిల్లరీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించారు. ఎక్కువగా ఆవేశానికి లోనుకాకుండా.. జాతివివక్ష, ఐసిస్ ముప్పు, అమెరికా ఆర్థికరంగం, యువతకు ఉద్యోగిత తదితర విభిన్న అంశాలపై స్పష్టమైన వైఖరి వెల్లడిస్తూ.. ట్రంప్‌ను ఆత్మరక్షణలోకి నెట్టేశారు. వివిధ అంశాలపై ట్రంప్ వైఖరిని ఎండగడుతూ వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తూ మరింత రెచ్చగొట్టారు. డిబేట్లో పలుమార్లు ట్రంప్ అసహనానికి లోనవడం, మంచినీళ్లు తాగడం కనిపించింది. హంప్స్టెడ్లోని హాఫ్స్ట్రావర్సిటీలో జరిగిన ఈ చర్చను టీవీల్లో 10 కోట్ల మంది చూశారు. ఎవరికి ఓటేయాలో ఇంకా నిర్ణయించుకోని మెజారిటీ ఓటర్లు ఈ ముఖాముఖిలతో నిర్ణయానికి వచ్చే అవకాశముంది. నవంబర్ 8న జరిగే అధ్యక్ష ఎన్నికల కన్నా ముందు ఇటువంటివి మొత్తం మూడు ముఖాముఖి వాదనలు జరుగుతాయి. తొలి చర్చలో హిల్లరీ విజయం సాధించారని 62% ఓటర్లు పేర్కొనగా, 27% మాత్రం ట్రంప్‌దే విజయమని నిర్ధారించారనిసీఎన్ఎన్/ఓఆర్సీ సర్వే తేల్చింది. పలు అంశాలపై పూర్తి అవగాహనతో హిల్లరీ చర్చకు వచ్చినట్లు కనిపించిందని విశ్లేషకులన్నారు. అక్టోబర్ 9న రెండో, 19న మూడో డిబేట్ జరగనున్నాయి. ఎవరి సామర్థ్యం ఎంత?..: 68 ఏళ్ల హిల్లరీ ఇటీవల న్యుమోనియా బారిన పడిన నేపథ్యంలో.. కమాండర్ ఇన్ చీఫ్‌గా అమెరికా అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తించగల శక్తిసామర్థ్యాలు ఆమెకు లేవని ట్రంప్ అన్నారు. ‘ఈ దేశ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడానికి గొప్ప శక్తి సామర్థ్యాలు కావాలి. హిల్లరీ అలా కనిపించడం లేదు’ అన్నారు. దీనికి హిల్లరీ చిరునవ్వుతో స్పందిస్తూ.. ‘112 దేశాలు పర్యటించి, పలు శాంతి ఒప్పందాలు, కాల్పుల విరమణ ఒప్పందాలు చేసుకుని, 11 గంటల పాటు కాంగ్రెస్ కమిటీ ముందు వివరణ ఇచ్చిన తరువాత నాసామర్థ్యం గురించి ఆయన మాట్లాడవచ్చు’ అంటూ ఒబామా తొలి ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా తను సాధించిన ఘనతను చెప్పుకున్నారు. ఒబామాపై జాతి వివక్ష వ్యాఖ్యలు.. అధ్యక్షుడు బరాక్ ఒబామాపై జాతివివక్ష వ్యాఖ్యలు చేశారని హిల్లరీ ట్రంప్‌ను విమర్శించారు. ట్రంప్ జాతివివక్ష ఆరోపణలు చేయడం కొత్తేం కాదు కానీ, అమెరికాలో జన్మించిన వాడు కాదంటూ ఒబామాపై చేసిన వ్యాఖ్యలు అత్యంత దారుణం’ అన్నారు. మహిళలను,ముస్లింలను అవమానిస్తూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను హిల్లరీ గుర్తు చేశారు. ఐసిస్ అంతం ఎలా?: అమెరికాకు ప్రమాదకరంగా పరిణమించిన ఉగ్రవాద సంస్థ ఐసిస్‌ను అంతం చేసేందుకు ట్రంప్ వద్ద సరైన ప్రణాళిక లేదని హిల్లరీ విమర్శించారు. అంతర్జాతీయంగా ఐసిస్‌ను ఏకాకిని చేసే చర్యలు తన ప్రణాళికలో ఉన్నాయన్నారు ట్రంప్ స్పందిస్తూ.. ఇరాక్‌పై ఒబామా విధానాల వల్లే ఐసిస్ ఆవిర్భవించిందని విమర్శించారు. ఇరాక్‌పై దాడి తొలి తప్పైతే.. మధ్యంతరంగా అక్కడినుంచి తప్పుకోవడం మరో తప్పని, దాంతోనే ఇసిస్ ఆవిర్భావానికి వేదిక ఏర్పడిందని ఆరోపించారు. అమెరికా ఉద్యోగాలను చైనా తదితర దేశాలు దొంగలిస్తున్నాయని, ఆ పద్దతి మారాన్నారు. అమెరికాను కుదిపేసిన గృహ నిర్మాణ సంక్షోభంతో లాభపడిన కొద్దిమంది సంపన్నుల్లో ట్రంప్ ఒకరని హిల్లరీ విమర్శించారు. వాతావరణ మార్పు అనేది ఒక భ్రమ అన్న ట్రంప్ కామెంట్‌ను హిల్లరీ ఎద్దేవా చేశారు. ఎన్బీసీ నైట్లీ న్యూస్ యాంకర్ లెస్టర్ హోల్ట్ ఈ ముఖాముఖికి సమన్వయకర్తగా వ్యవహరించారు. ‘నా ఆవేశమే నా బలం’ అని ట్రంప్ అనగా ‘ఓహో.. అవునా?’ అంటూ హిల్లరీ స్పందించిన సందర్భంతో పాటు పలు సందర్భాల్లో నవ్వులు కూడా చిందాయి. ఈమెయిల్స్ గుట్టు.. పన్ను రిటర్న్స్ రట్టు ప్రముఖ వ్యాపార వేత్త అయిన ట్రంప్ కొన్నేళ్లపాటు టాక్స్ రిటర్న్‌లను దాఖలు చేయలేదని హిల్లరీ విమర్శించారు. ‘రిటర్న్‌లను ట్రంప్ విడుదల చేయకపోవడం వెనుక కొన్ని కారణాలుండొచ్చు. ఆయన తను చెప్పుకుంటున్నంత సంపన్నుడు కాకపోవచ్చు.. లేదా చెప్పుకుంటున్నంత స్థాయిలో దానాలు చేసి ఉండకపోవచ్చు.. లేదా తన అప్పుల గురించి మనకు తెలియకూడదని అనుకుంటూ ఉండొచ్చు. ఎందుకంటే మనకు తెలిసిన సమాచారం మేరకు ట్రంప్ వాల్‌స్ట్రీట్‌కు, విదేశీ బ్యాంకులకు 650 మిలియన్ డాలర్లు అప్పు ఉన్నారు’ అని ధ్వజమెత్తారు. దానిపై ట్రంప్ స్పందిస్తూ.. ‘టాక్స్ రిటర్న్స్‌ను బహిరంగపర్చేందుకు నేను సిద్ధమే. అయితే, ముందు విదేశాంగ మంత్రిగా ఉండగా హిల్లరీ ప్రైవేటు ఈమెయిల్ సర్వర్‌ను ఉపయోగించి చేసిన 33 వేల మెయిల్స్‌ను బహిరంగ పర్చాలి. డిలీట్ చేసిన ఆ ఈమెయిల్స్‌ను ఆమె బహిరంగపరిస్తే.. ఆ మరుక్షణమే నేను నా ట్యాక్స్ రిటర్న్స్‌ను విడుదల చేస్తాను’ అన్నారు. దీనికి ప్రతిగా.. విదేశాంగ మంత్రిగా అధికార పదవిలో ఉన్న తాను ప్రైవేట్ ఈ మెయిల్ సర్వర్‌ను ఉపయోగించడం తప్పేనని, ఈ విషయంపై గతంలోనే వివరణ ఇచ్చానని హిల్లరీ వివరించారు. హిల్లరీకి పాలనలో అనుభవం ఉంది కానీ.. అది మంచి అనుభవం కాదని, మరో నాలుగేళ్లు ఆమెను భరించలేమని ట్రంప్ అన్నారు. విధానపరమైన అవగాహన లేమితో ట్రంప్ ఉన్నారని హిల్లరీ బదులిచ్చారు. డిబేట్ ముగిసిన తరువాత మద్దతుదారులకు హిల్లరీ అభివాదం. కార్యక్రమానికి హాజరైన హిల్లరీ భర్త, అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, కూతురు చెల్సియా