శత్రువులకు కూడా న్యూఇయర్‌ గ్రీటింగ్స్‌! | Trump Wishes Happy New Year To All Including Many Enemies | Sakshi
Sakshi News home page

శత్రువులకు కూడా న్యూఇయర్‌ గ్రీటింగ్స్‌!

Published Sun, Jan 1 2017 9:42 AM | Last Updated on Thu, Apr 4 2019 5:04 PM

శత్రువులకు కూడా న్యూఇయర్‌ గ్రీటింగ్స్‌! - Sakshi

శత్రువులకు కూడా న్యూఇయర్‌ గ్రీటింగ్స్‌!

వాషింగ్టన్‌: అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కొత్త సంవత్సరం సందర్భంగా తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపారు. తన రాజకీయ ప్రత్యర్థులపై వ్యంగ్యంగా విసుర్లు సంధిస్తూ గ్రీటింగ్స్‌ చెప్పారు.

'నా చాలామంది శత్రువులు, నాతో ఎన్నికల్లో పోరాడి దారుణంగా ఓడిపోయి.. ఇప్పుడేం చేయాలో పాలుపోక ఉన్నవారు.. ఇలా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు' అని ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. రిపబ్లికన్‌ అభ్యర్థి నామినేషన్ కోసం హోరాహోరీగా పోరాడి.. ఆ తర్వాత డెమొక్రటిక్‌ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌తో చివరివరకు తలపడి.. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ నెల 20న అమెరికా 45వ అధ్యక్షుడిగా ఆయన ప్రమాణం చేయబోతున్నారు. నిజానికి న్యూయార్క్‌ బిలియనీర్‌ అయిన ట్రంప్‌కు మొదటినుంచి సోషల్‌ మీడియా వేదికగా ప్రత్యర్థులపై వ్యంగ్యాస్త్రాలు సంధించే అలవాటు ఉంది. రాజకీయాల్లోకి రాకముందు కూడా ఆయన ఇదే పంథాను అనుసరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement