ట్రంప్‌, రష్యా కుమ్మక్కై.. హిల్లరీని ఓడించారు! | Strong evidence to support claims that Donald Trump’s team colluded with Russia, says US official | Sakshi
Sakshi News home page

ట్రంప్‌, రష్యా కుమ్మక్కై.. హిల్లరీని ఓడించారు!

Published Thu, Mar 23 2017 10:53 AM | Last Updated on Thu, Apr 4 2019 3:41 PM

ట్రంప్‌, రష్యా కుమ్మక్కై.. హిల్లరీని ఓడించారు! - Sakshi

ట్రంప్‌, రష్యా కుమ్మక్కై.. హిల్లరీని ఓడించారు!

అమెరికా ఎన్నికల్లో గెలిచేందుకు అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ రష్యా అధికారులతో కుమ్మక్కయ్యారనడానికి కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ మేరకు ఓ అంతర్జాతీయ వార్త సంస్ధ ఓ కథనాన్ని ప్రచురించింది. ఎన్నికల్లో రష్యా కలుగజేసుకుందా? అనే విషయంపై దర్యాప్తు చేపట్టిన అధికారుల్లో కొందరు ఈ విషయాన్ని ధ్రువీకరించినట్లు చెప్పింది. ప్రచారంలో హిల్లరీని వెనక్కునెట్టేందుకు రష్యా ఆపరేటివ్స్‌ ట్రంప్‌కు సహకరించినట్లు పేర్కొంది.
 
ప్రస్తుతం ఎఫ్‌బీఐ ఈ విషయాన్ని సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టేందుకు అన్ని రకాలుగా సిద్ధమౌతున్నట్లు తెలిపింది. ట్రంప్‌కు రష్యాతో ఉన్న వ్యాపార సంబంధాలు, ఫోన్‌ రికార్డులను ఎఫ్‌బీఐ నిశితంగా పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. కాగా, ఈ వార్తలను ట్రంప్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అధికారులు కొట్టిపారేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement