వాషింగ్టన్: అమెరికా, రష్యాల మధ్య సానుకూల వాతావరణం నెలకొనే దిశగా అడుగులు పడుతున్నాయి. మొన్నటికి మొన్న ఫిన్‌లాండ్ రాజధాని హెల్సింకీలో జరిగిన వ్యక్తిగత భేటీలో పలు అంశాలపై ఇరుదేశాల అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్‌లు చర్చించుకున్న విషయం తెలిసిందే. హెల్సింకీలో సంతృప్తికర చర్చ జరగలేదంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో అగ్రదేశాల సంబంధాలను మరో అడుగు ముందుకు తీసుకెళ్లేందుకు ట్రంప్ నిర్ణయించారు. ఈ ఏడాది చివర్లో అమెరికాలో జరిగే రెండో విడత వ్యక్తిగత చర్చలకు రావాలంటూ పుతిన్‌కు ఆహ్వానం పంపించారు.
‘హెల్సింకీలో జరిగిన భేటీలో చర్చించిన అంశాలను అమలుచేసేందుకు మరోసారి పుతిన్‌తో సమావేశం అవుతాం. ఇందుకోసం పుతిన్‌ను అమెరికాకు ఆహ్వానిస్తున్నాం’ అని ట్రంప్ ట్వీట్ చేశారు. ఆ తర్వాత కాసేపటికే వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీ సారా శాండర్స్ మరో ట్వీట్ చేశారు. ‘హెల్సింకీలో జరిగిన భేటీలో.. ఇరుదేశాల ఉన్నత స్థాయి భద్రతాధికారుల సమావేశం జరగాలని ట్రంప్ సూచించారు. దీనికి పుతిన్ అంగీకరించారు. ఈ నేపథ్యంలో రష్యా జాతీయ భద్రతాసలహాదారుతో ఇప్పటికే జరుగుతున్న సమావేశాలను మరింత వేగవంతం చేయాలని అమెరికా ఎన్‌ఎస్‌ఏను ట్రంప్ ఆదేశించారు. వచ్చే శీతాకాలంలో అమెరికాలో చర్చల కోసం రావాలని పుతిన్‌ను ఆహ్వానించారు’ అని శాండర్స్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment