వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను త్వరలోనే భేటీ కానున్నారు. వచ్చే నెలలో యూరప్‌లో ట్రంప్, పుతిన్‌ల భేటీ జరిగే అవకాశం ఉంది. జూలైలో బ్రస్సెల్స్‌లో జరగనన్ను నాటో సదస్సుకు ట్రంప్ హాజరుకానున్నారు.
అక్కడే పుతిన్‌తో భేటీ అవుతారని వైట్‌హౌజ్ అధికారులు వెల్లడించారు. అలాగే యూకే వెళ్లి బ్రిటన్ ప్రధాన మంత్రి థెరిసా మే, బ్రిటన్ రాణితో ట్రంప్ సమావేశం కానున్నారు. కాగా ఉ.కొరియా అధ్యక్షుడు కిమ్‌ను కలిసిన కొద్ది రోజులకే పుతిన్‌తో ట్రంప్ సమావేశం కానుండడం గమనార్హం.
ఈ విషయంపై ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ..‘నేను మొదటి రోజు నుంచి చెప్తూనే ఉన్నాను. రష్యా, చైనా, ఇంకా అన్ని దేశాలతో కలిసి ఉండడం చాలా మంచి విషయం. ఇది అందరికి మంచింది. పుతిన్‌తో భేటీలో మేము సిరియా, ఉక్రెయిన్‌ల గురించి, మరికొన్ని అంశాల గురించి మాట్లాడతాం’ అని ట్రంప్ విలేకరులకు వెల్లడించారు. ట్రంప్, పుతిన్‌లు గత ఏడాది రెండు సార్లు భేటీ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment