Nato Summit
-
నాటో భేటీ వేళ రష్యా యాత్రా?
వాషింగ్టన్: నాటో శిఖరాగ్ర సమావేశం జరుగుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ రష్యాలో పర్యటించడంపై అమెరికా అసంతృప్తితో ఉన్నట్టు బ్లూంబర్గ్ నివేదిక పేర్కొంది. ఇది భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపగలదని ఆ దేశ ఉన్నతాధికారులు భావిస్తున్నట్టు చెప్పుకొచి్చంది. ‘‘పుతిన్‌ను మోదీ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న తీరు అమెరికా ప్రభుత్వం లోపల, వెలుపల విమర్శలకు దారి తీసింది. వాషింగ్టన్లో నాటో సదస్సు జరుగుతుండగా మోదీ రష్యాలో పర్యటించడం బైడెన్ యంత్రాంగానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని సృష్టించింది. పుతిన్‌ను అంతర్జాతీయ సమాజంలో ఒంటరిని చేయాలన్న నాటో ప్రయత్నాలకు ఇది గండి కొట్టింది. అందుకే అమెరికా విదేశాంగ శాఖ ఉప మంత్రి కర్ట్ కాంప్‌బెల్ జూలై మొదట్లోనే భారత విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాట్రాతో మాట్లాడారు. మోదీ రష్యా పర్యటన షెడ్యూల్ మార్చుకోవాల్సిందిగా కోరారు’’ అని నివేదిక వివరించింది. ఈ ఉదంతంపై విదేశాంగ శాఖ స్పందించాల్సి ఉంది. అమెరికాతో స్నేహాన్ని తేలిగ్గా తీసుకోవద్దని భారత్‌లో ఆ దేశ రాయబారి ఎరిక్ గార్సెట్టీ గురువారం మీడియాతో సమావేశంలో నర్మగర్భ వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. అవి రష్యా పర్యటనను ఉద్దేశించేనని చెబుతున్నారు. రష్యాను విశ్వసనీయమైన దీర్ఘకాలిక మిత్ర దేశంగా భారత్ పరిగణించడం పొరపాటని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివాన్ అభిప్రాయపడ్డారు. -
NATO Summit: బైడెన్.. మళ్లీ తడబడెన్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పట్టువీడటం లేదు. అధ్యక్ష బరి నుంచి తప్పుకోవాలంటూ ఇంటా బయటా డిమాండ్లు నానాటికీ పెరిగిపోతున్నా ఆ ప్రసక్తే లేదని మరోసారి కుండబద్ధ్దలు కొట్టారు. 81 ఏళ్ల వయసులోనూ రిపబ్లికన్ ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ను ఓడించి మరోసారి అధ్యక్షునిగా పని చేసే సామర్థ్యం తనలో పుష్కలంగా ఉందని చెప్పుకొచ్చారు. నాటో శిఖరాగ్రం ముగింపు సందర్భంగా గురువారం బైడెన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. తన వయసు, ఫిట్‌నెస్‌పై పెరిగిపోతున్న సందేహాల్లో పస లేదని నిరూపించేందుకు శాయశక్తులా ప్రయతి్నంచారు. అయితే గంటకు పైగా జరిగిన ఈ భేటీలోనూ ఆయన తడబాట్ల పర్వం కొనసాగడం డెమొక్రాట్ల శిబిరంలో ఆందోళనలను మరింత పెంచింది. ప్రశ్నోత్తరాల సందర్భంగా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అనబోయి ట్రంప్ అంటూ బైడెన్ తికమకపడ్డారు! అధ్యక్ష రేసు నుంచి మీరు తప్పుకుంటే ట్రంప్‌ను ఓడించే సత్తా హారిస్‌కు ఉందా అని విలేకరులు ప్రశ్నించగా, ‘‘అధ్యక్షునిగా పని చేయగల అర్హత, సత్తా ట్రంప్‌కు ఉన్నాయి. కనుకనే ఉపాధ్యక్షునిగా ఎన్నుకున్నా’’ అన్నారు. దాంతో అంతా అవాక్కయ్యారు. అయినా బైడెన్ తన వ్యాఖ్యలను సరిచేసుకోలేదు. అంతకుముందు నాటో వేదికపై కూడా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని సభ్య దేశాల ప్రతినిధులకు ‘అధ్యక్షుడు పుతిన్’ అంటూ పరిచయం చేశారు!! జెలెన్స్కీ దీన్ని తేలిగ్గా తీసుకుంటూ నవ్వేసినా ప్రతినిధులంతా తెల్లబోయారు. ఈ నేపథ్యంలో బైడెన్ మానసిక ఆరోగ్యంపై నెలకొన్న సందేహాలు మరింత పెరిగాయి. అయితే వైద్యులు సూచిస్తే మానసిక పరీక్షలకు సిద్ధమని ఆయన ప్రకటించారు. ‘‘అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక ఇప్పటిదాకా మూడుసార్లు న్యూరో పరీక్షలు చేయించుకున్నా. తాజా పరీక్ష గత ఫ్రిబ్రవరిలో జరిగింది. నేను మానసికంగా ఫిట్‌గా ఉన్నాననేందుకు అధ్యక్షునిగా నేను తీసుకుంటున్న రోజువారీ నిర్ణయాలే రుజువు. కానీ నేనెంత చేసినా ఎవరూ సంతృప్తి చెందడం లేదు’’ అంటూ వాపోయారు! అయితే తన అభ్యర్థిత్వంపై సొంత పార్టీ నేతల్లో భయాలను దూరం చేయాల్సిన అవసరముందని అంగీకరించారు. బ్రహా్మండంగా పని చేశా అధ్యక్ష ఎన్నికల్లో తలపడేందుకు అత్యంత అర్హున్ని తానేనని బైడెన్ చెప్పుకున్నారు. ‘‘ట్రంప్‌ను ఓసారి ఓడించా. మళ్లీ ఓడించి తీరతా. అప్పుడే ఏమీ అయిపోలేదు. ప్రచారంలో ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది’’ అన్నారు. నాలుగేళ్లలో అమెరికాను అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి చేశానంటూ గణాంకాలు ఏకరువు పెట్టారు. ఆర్థిక రంగంలో తన పనితీరు చాలా బాగుందని ఏకంగా 16 మంది నోబెల్ గ్రహీతలైన ఆర్థికవేత్తలు కితాబిచ్చారని చెప్పుకున్నారు. రాత్రి 8 గంటల తర్వాత ప్రచారంతో పాటు ఎలాంటి కార్యక్రమాలూ పెట్టుకునేది లేదని తానన్నట్టు వచి్చన వార్తలను బైడెన్ ఖండించారు. విదేశీ వ్యవహారాలు తదితరాలపై సుదీర్ఘంగా మాట్లాడారు. గాజా ఆక్రమణ కూడదంటూ ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహూను, ఉక్రెయిన్‌పై యుద్ధంలో మద్దతివ్వొద్దంటూ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను హెచ్చరించానని చెప్పుకొచ్చారు. రష్యాతో సాన్నిహిత్యానికి చైనా మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. లాడెన్‌ను చంపగానే అఫ్గాన్ నుంచి అమెరికా పూర్తిగా వైదొలగాల్సిందన్నారు.ట్రంప్ విసుర్లు బైడెన్ తనను ఉపాధ్యక్షునిగా పేర్కొనడంపై ట్రంప్ వ్యంగ్యా్రస్తాలు విసిరారు. ‘బిగ్ బోయ్ జో మీడియా భేటీ మొదట్లోనే నన్ను తన ఉపాధ్యక్షునిగా చెప్పుకు న్నారు’’ అని ఎద్దేవా చేస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.పెరుగుతున్న వ్యతిరేకత తనకు వ్యతిరేకంగా గళమెత్తుతున్న సొంత పార్టీ నేతలు, ఎంపీల విశ్వాసాన్ని చూరగొనడమే లక్ష్యంగా తాజా మీడియా సమావేశంలో బైడెన్ సర్వశక్తులూ ఒడ్డారు. కానీ ఆ ప్రయత్నంలో ఆయన విఫలమయ్యారని పరిశీలకులు అంటున్నారు. బైడెన్ తప్పుకోవాలని సమావేశం ముగియగానే ముగ్గురు ప్రముఖ డెమొక్రాట్ ఎంపీలు జిమ్ హైమ్స్, స్కాట్ పీటర్స్, ఎరిక్ సొరెన్సన్ పిలుపునిచ్చారు! దాంతో ఆయన వైదొలగాలని డిమాండ్ చేస్తున్న సొంత పార్టీ ఎంపీల సంఖ్య 17కు పెరిగింది. నిజానికి గత నెల సీఎన్ఎన్ చానల్లో జరిగిన తొలి అధ్యక్ష డిబేట్లో ట్రంప్ ముందు బైడెన్ పూర్తిగా తేలిపోవడం తెలిసిందే. దానితో పోలిస్తే తాజా మీడియా భేటీలో ఆయన మెరుగ్గానే మాట్లాడారు. తాను తీరిక లేని షెడ్యూల్‌తో బిజీగా గడుపుతుంటే ట్రంప్ మాత్రం గోల్ఫ్ ఆడుతూ సేదదీరుతున్నారంటూ దుయ్యబట్టారు. ‘‘ట్రంప్ నాలుగేళ్ల పాలనలో అస్తవ్యస్తం చేసిననాటో కూటమిని ఎంతగానో శ్రమించి ఒక్కతాటిపైకి తెచ్చా. నాటో శిఖరాగ్రంలో పాల్గొన్న దేశాధినేతలెవరూ నా ఫిట్నెస్ను, మానసిక ఆరోగ్యాన్ని సందేహించలేదు. పైపెచ్చు ట్రంప్ మళ్లీ రావొద్దని, నేనే గెలవాలని కోరుకుంటున్నట్టు చెప్పారు’’ అని అన్నారు.ఒబామా, పెలోసీ కూడా... బైడెన్ తప్పుకోవాలంటున్న డెమొక్రాటిక్ పార్టీ నేతల జాబితాలో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ప్రతినిధుల సభ మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీ కూడా చేరుతున్న సూచనలు కని్పస్తున్నాయి. ట్రంప్‌ను ఓడించడం బైడెన్‌కు తలకు మించిన పనేనని వారిద్దరూ తాజాగా ప్రైవేటు సంభాషణలో అభిప్రాయపడ్డట్టు తెలుస్తోంది. నాటో శిఖరాగ్రం అనంతరం బైడెన్ మీడియా సమావేశం చూసి వారు మరింతగా పెదవి విరిచినట్టు డెమొక్రటిక్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ‘‘బైడెన్ అధ్యక్ష అభ్యరి్థత్వం దాదాపుగా ముగిసిన కథే. ఆయనకు మనస్తాపం కలగకుండా, పార్టీ అవకాశాలు దెబ్బ తినకుండా దీన్ని ప్రకటించడం ఎలాగన్నది మాత్రమే తేలాల్సిలి ఉంది. బహుశా బైడెన్ తనంత తానుగా తప్పుకుంటారని ఒబామా, పెలోసీ భావిస్తున్నారు. లేదంటే ఆయనకు నచ్చజెప్పి తప్పించే బాధ్యత తీసుకోగలిగింది వారిద్దరే’’ అని పేర్కొంటున్నాయి. ఈ విషయమై ఉన్నత స్థాయి డెమొక్రాట్ నేతలు గురువారం ఉదయం పెలోసీతో సమావేశమైనట్టు అమెరికా మీడియా పేర్కొంది. ‘‘ఇక ట్రంప్‌ను ఓడించడం బైడెన్‌కు శక్తికి మించిన పనేనన్న అభిప్రాయంతో పెలోసీ కూడా ఏకీభవించారు. అయితే నాటో శిఖరాగ్రం జరుగుతున్న నేపథ్యంలో దేశాధినేతల ముందు బైడెన్‌ను ఇబ్బంది పెట్టడం సరికాదని, కనీసం ఒక రోజన్నా ఆగాలని సూచించారు. దాంతో బైడెన్‌ను తప్పించేందుకు ఆమె కూడా సుముఖంగానే ఉన్నట్టు తేలిపోయింది. అందుకే భేటీ తర్వాత పలువురు డెమొక్రాట్ ఎంపీలు బైడెన్ తప్పుకోవాలని బాహాటంగా డిమాండ్ చేశారు’’ అంటూ యూఎస్ మీడియాలో జోరుగా కథనాలు వెలువడుతున్నాయి. -
Watch: మెలోనీకి విసుగు తెప్పించిన బైడెన్!
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గురించి వీడియోలు వైరల్ అవుతుండడం చూస్తున్నాం. అయితే.. ఇటలీ పీఎం మెలోనీకి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విసుగు తెప్పించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీకి సంబంధించిన మూమెంట్స్ కొన్ని సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుండడం చూస్తున్నాం. ముఖ్యంగా భారత ప్రధాని మోదీకి, ఆమెకు మధ్య ప్రత్యేకంగా ‘మెలోడీ’(మోదీ+మెలోనీ) మూమెంట్స్ పేరిట ప్రత్యేకంగా వైరల్ అవుతుంటాయి కూడా. అయితే..వాషింగ్టన్లో జరిగే నాటో సదస్సు కోసం వెళ్లిన ఇటలీ ప్రధాని మెలోనీకి, అమెరికా అధ్యక్షుడు బైడెన్ విసుగు తెప్పించారు. మూడో రోజు సదస్సు ప్రారంభం కోసం సభ్యదేశాల ప్రపంచ దేశాల అధినేతలంతా ఎదురు చూస్తున్నారు. ఆ నిరీక్షణ మెలోనీకి చిరాకు తెప్పించినట్లుంది. ఎదురుగా ఉన్న ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్‌తో సంభాషిస్తూనే.. అంత ఇంకా ఎంత టైం? అంటూ అన్నారామె. దానికి అధ్యక్షుడు స్టబ్ తన ఫోన్ బయటకు తీసి టైం చూసి ఏదో చెప్పారు. దీంతో ఆమె మరోసారి కళ్లతో సైగ చేసి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. Giorgia #Meloni in top eye-rolling form as leaders at the #NATO summit wait for Stoltenberg and Biden to arrive for the first session today. pic.twitter.com/KVSobO8QNU— Life On Earth (@e_jagat_) July 12, 2024సుమారు 40 నిమిషాలు ఆలస్యంగా బైడెన్, నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్‌తో కలిసి వచ్చారు. మొత్తంగా ఉదయం 10గం.లకు ప్రారంభం కావాల్సిన ఆ సదస్సు.. లేట్‌గా ప్రారంభమైంది. అన్నట్లు మెలోనీ-బైడెన్ మధ్య ఈ తరహా వైరల్ ఇన్సిడెంట్లు ఇంతకు ముందు కూడా వచ్చాయి.WHAT IS BIDEN DOING? pic.twitter.com/iY33K2srII— RNC Research (@RNCResearch) June 13, 2024 -
ఎయిర్–డిఫెన్స్ వ్యవస్థలు అందజేస్తాం
వాషింగ్టన్: ఉక్రెయిన్–రష్యా యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధంలో రష్యాకు పరాభవం తప్పదని తేలి్చచెప్పారు. ఉక్రెయిన్‌కు అండగా నిలుస్తామని, గగనతలంలో శత్రువును మట్టికరిపించే ఎయిర్–డిఫెన్స్ వ్యవస్థలు అందజేస్తామని ప్రకటించారు. తాజాగా ‘నాటో’ 75వ సదస్సులో బైడెన్ ప్రసంగించారు. అమెరికాతోపాటు జర్మనీ, నెదర్లాండ్స్, రొమేనియా, ఇటలీ దేశాలు ఉక్రెయిన్‌కు అదనంగా ఐదు వ్యూహాత్మక ఎయిర్–డిఫెన్స్ వ్యవస్థలను అందజేయబోతున్నాయని తెలిపారు. రాబోయే రోజుల్లో పదుల సంఖ్యలో టాక్టికల్ ఎయిర్–డిఫెన్స్ వ్యవస్థలను ఉక్రెయిన్‌కు ఇవ్వబోతున్నామని వెల్లడించారు. తాము అందజేసే క్రిటికల్ ఎయిర్–డిఫెన్స్ ఇంటర్సెప్టర్లతో రష్యాపై యుద్ధంలో ఉక్రెయిన్ పైచేయి సాధిస్తుందని స్పష్టం చేశారు. రష్యా క్షిపణుల దాడులు, వైమానిక దాడుల నుంచి ఉక్రెయిన్ నగరాలతోపాటు ఉక్రెయిన్ సైన్యాన్ని కాపాడే ఇంటర్సెప్టర్లను వందల సంఖ్యలో అందిస్తామని పేర్కొన్నారు. యుద్ధంలో 3.50 లక్షల మందికిపైగా రష్యా సైనికులు మరణించడమో, గాయపడడమో జరిగిందని చెప్పారు. ఉక్రెయిన్ స్వేచ్ఛాయుతమైన, స్వతంత్రదేశంగా కొనసాగుతుందని ఉద్ఘాటించారు. ఎన్నికల దాకా ఎదురు చూడాలా?: జెలెన్స్కీ ఈ ఏడాది నవంబర్‌లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల కంటే ముందే రష్యా అధినేత పుతిన్‌కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. నాటో సదస్సులో ఆయన మాట్లాడారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల దాకా ప్రపంచం ఎదురు చూడొద్దని చెప్పారు. ఉక్రెయిన్‌కు ఎఫ్–16 ఫైటర్ జెట్లు ఇస్తాం: నార్వే ఉక్రెయిన్‌కు ఆరు ఎఫ్16 ఫైటర్ జెట్లు అందజేస్తామని నాటో సభ్యదేశమైన నార్వే ప్రధాని జోనాస్ ప్రకటించారు. అయితే, ఎప్పటి నుంచి ఈ యుద్ధ విమానాలు ఉక్రెయిన్‌కు అందజేస్తారన్నది ఆయన వెల్లడించలేదు. -
నాటోలో స్వీడన్ చేరికకు తుర్కియే ఆమోదం
అంకారా: నాటోలో స్వీడన్ సభ్యత్వానికి తుర్కియే గురువారం అధికారికంగా ఆమోదం తెలిపింది. హంగేరీ కూడా ఓకే చెబితే నార్డిక్ దేశం స్వీడన్ నాటో దేశంగా మారిపోనుంది. ఏడాదిన్నరగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రతిపాదనకు తుర్కియే పార్లమెంట్ మంగళవారం ఆమోదం తెలిపింది. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర నేపథ్యంలో ఫిన్లాండ్, స్వీడన్ నాటో సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నాయి. నాటో సభ్యదేశమైన తుర్కియే ఫిన్లాండ్ సభ్యత్వానికి మాత్రమే సమ్మతం తెలిపింది. స్వీడన్ సభ్యత్వంపై అభ్యంతరం తెలుపుతూ వస్తోంది. వాటికి కూడా తగు పరిష్కారం దొరకడంతో తాజాగా ఆమోదం తెలిపింది. ఇక, నాటోలో స్వీడన్ చేరికపై హంగరీ పార్లమెంట్లో ఫిబ్రవరి ఆఖరులో చర్చించొచ్చని భావిస్తున్నారు. -
ఉక్రెయిన్‌లో దక్షిణ కొరియా అధ్యక్షుడు
కీవ్: రష్యా దురాక్రమణకు లోనైన తమ భూభాగాలను తిరిగి దక్కించుకునేందుకు సర్వం ఒడ్డుతున్న ఉక్రెయిన్‌కు మద్దతు పలుకుతున్న దేశాల సంఖ్య పెరుగుతుంది. శనివారం దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ ఇయోల్ ఉక్రెయిన్‌లో పర్యటించారు. నాటో భేటీ కోసం లిథువేనియాకు వచి్చన యూన్ సతీసమేతంగా ఉక్రెయిన్ వెళ్లారు. ఉక్రెయిన్ సేనల తీవ్ర ప్రతిఘటనలతో వెనుతిరుగుతూ రష్యా మూకలు సృష్టించిన నరమేథానికి సాక్షిగా నిలిచిన బుచా, ఇరి్పన్ నగరాల్లోని ఘటనాస్థలాలను యూన్ సందర్శించి మృతులకు నివాళులరి్పంచారు. యుద్ధంలో తలమునకలైన ఉక్రెయిన్‌కు మానవీయ, ఆర్థికసాయం అందిస్తూ ద.కొరియా తనవంతు చేయూతనందిస్తోంది. కానీ ఆయుధసాయం మాత్రం చేయట్లేదు. యుద్ధంలో మునిగిన దేశాలకు ఆయుధాలు అందించకూడదనే తన దీర్ఘకాలిక విధానాన్ని ద.కొరియా ఇంకా కొనసాగిస్తోంది. అయితే మందుపాతరలను గుర్తించి నిరీ్వర్యంచేసే ఉపకరణాలు, అంబులెన్సులు, సైనికయేతర వస్తువులను మాత్రం అందించేందుకు తమ సమ్మతి తెలిపింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతోనూ యూన్ భేటీ అయ్యారు. పలు అంశాలపై చర్చించారు. యుద్ధ తీవ్రంకాకుండా ఆపగలిగే పరిష్కార మార్గాలను అన్వేíÙంచాలని నిర్ణయించారు. -
నాటో సమావేశాలు: ఒంటరిగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ
విల్నియస్ : లిథువానా రాజధాని విల్నియస్ వేదికగా జరుగుతున్న నాటో దేశాల సమావేశాల నేపథ్యంలో ఉక్రెయిన్ కు నాటో సభ్యత్వంపైనా ఆ దేశానికి ఆయా సభ్య దేశాల మద్దతు ఎలా ఉంటుందనే దానిపైనే అందరి దృష్టి ఉంది. ఇదిలా ఉండగా సమావేశం అనంతరం భోజనానికి ముందు అతిధులందరూ ఒకరినొకరు పలకరించుకుంటూ ఉంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ మాత్రం ఒంటరిగా కనిపించారు. అదే సమయంలో తీసిన ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ఒంటరిగా ఉన్న ఈ ఫోటోపై కామెంట్లు కూడా అంతే సెటైరికల్ గా ఉన్నాయి. నాటో కూటమి ఒక అస్థిరమైన కూటమి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలకు నాటో దేశాలు ఆగ్రహంతో ఉన్నాయి అందుకే ఆయనను ఒంటరిగా వదిలేశారని ఒకరు రాయగా.. నాటో సమావేశాల్లో ఇదీ ఉక్రెయిన్ అధ్యక్షుడి పరిస్థితి.. అని మరొకరు వ్యంగ్యంగా కామెంట్లు చేశారు. అసలు విషయమేమిటంటే అప్పటివరకు పక్కనే ఉన్న వ్లాదిమిర్ జెలెన్స్కీ భార్య ఓలెనా జెలెన్స్కీ మరో అతిధిని పలకరించేందుకు ఒక అడుగు పక్కకు జరిగింది. దీంతో ఒక్కరే ఉన్న ఫోటో బయటకు రావడంతో రకరకాల కథనాలను పుట్టించారు నెటిజన్లు. ఇదిలా ఉండగా నాటో సమావేశాల్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు సందేశమిస్తున్న సమయంలో అతని భార్య ఓలెనా జెలెన్స్కీ ఆయన పక్కనే ఉన్నారు. సమావేశంలో ఆయా దేశాలు రష్యాపై యుద్ధంలో ఉక్రెయిన్ కు తమ సహకారం ఉంటుందని ప్రకటించాయి. ఎటొచ్చి నాటో సభ్యత్వంపైనే స్పష్టత లేని హామీలనిచ్చాయి. ఇది కూడా చదవండి: అమెరికా అధ్యక్షుడి చేతిలో న్యూక్లియర్ బ్రీఫ్ కేస్..? -
నాటోలో సభ్యత్వం: స్వీడన్‌కు సై.. ఉక్రెయిన్‌కు నై.. కారణమిదే!
విల్నియస్: స్వీడన్‌ను తమ కూటమిలో 32వ సభ్యదేశంగా చేర్చుకునేందుకు నాటో అంగీకరించింది. లిథువేనియా దేశంలోని విలి్నయస్ నగరంలో జరుగుతున్న నాటో శిఖరాగ్ర సదస్సు ఇందుకు వేదికగా నిలిచింది. అయితే ఉక్రెయిన్‌కు సభ్యత్వంపై 31 సభ్యదేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ఇప్పట్లో ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వం దక్కకపోవచ్చు. యుద్ధంలో నిమగ్నమైన దేశానికి సభ్యత్వం ఇవ్వకూడదన్న నిబంధన కారణంగా ఇప్పుడే కూటమిలో చేర్చుకోలేమని, యుద్ధం ముగిశాక వెంటనే సభ్యత్వం ఇచ్చేలా పాత రెండంచెల పద్ధతిని సరళతరం చేశామని నాటో ప్రధాన కార్యదర్శి జీన్స్ స్టోల్టెన్బెర్గ్ మీడియాతో చెప్పారు. కాగా, తమ పట్ల నాటో వైఖరిని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్రంగా తప్పుబట్టారు. -
నాటోతో భేటీ వల్ల ఒరిగేదేమిటి?
సంక్షోభాలు చిక్కబడుతున్నప్పుడు రాగల అవసరాలను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా అడుగులేయడం ఏ దేశానికైనా తప్పనిసరి. దౌత్యపరంగా పైకి ఏం మాట్లాడుతున్నా, పాత విధానాలనే కొనసాగిస్తున్నట్టు కనిపించినా మారుతున్న ప్రపంచపోకడలకు అనుగుణంగా కొత్త ఎత్తుగడలకు దిగడం దేశాలకు అతి ముఖ్యం. నాటో కూటమితో రెండేళ్లక్రితం మన దేశం తొలిసారి రాజకీయ చర్చలు జరిపిందని, ఈ చర్చలు అత్యంత గోప్యంగా ఉంచారని వచ్చిన కథనాలను ఈ నేపథ్యంలో చూడటం తప్పనిసరి. నాటో కూటమి ప్రధాన కార్యక్షేత్రం యూరోప్. ఆ ఖండంలోని 28 దేశాలతోపాటు ఉత్తర అమెరికాలోని అమెరికా, కెనడాలకు సైతం అందులో సభ్యత్వం ఉంది. ఇది ప్రధానంగా సైనిక కూటమే అయినా, ఈ దేశాల మధ్య రాజకీయ చెలిమి కూడా కొనసాగుతుంటుంది. అయితే నాటో దీనికి మాత్రమే పరిమితమై ఉండదు. అది రష్యా, చైనా, పాకిస్తాన్ తదితర దేశాలతో కూడా రాజకీయ, సైనిక చర్చలు కొనసాగిస్తుంటుంది. రెండో ప్రపంచ యుద్ధానంతరం యూరోప్ దేశాలు ఆర్థికంగా, సైనికంగా బలహీనపడటం... ఈ సంక్షోభ పర్యవసానంగా కమ్యూనిస్టు, సోషలిస్టు భావనల ప్రాబల్యం పెరగడం గమనించిన అమెరికా ‘మార్షల్ ప్లాన్’ కింద పశ్చిమ, దక్షిణ యూరోప్ దేశాలకు భారీయెత్తున ఆర్థిక సాయాన్ని అందించి అవి కోలుకోవడానికి దోహదపడింది. ఆ దేశాల మధ్య రక్షణ, భద్రతా రంగాల్లో సహకార భావనల్ని పెంపొందించింది. ఈ క్రమంలోనే ఆ దేశాలు నాటో కూటమిగా ఆవిర్భవించాయి. పైకి ఎన్ని చెప్పినా ఆనాటి సోవియెట్ యూనియన్ ప్రాబల్యానికి అడ్డుకట్ట వేయడం నాటో ఏకైక లక్ష్యం. అటు తర్వాత అమెరికా ప్రయోజనాలు ప్రపంచంలో ఏమూల దెబ్బతిన్నా నాటో సైనికంగా రంగంలోకి దిగడమే ప్రధాన కార్యక్రమం అయింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఏలుబడి సాగినంతకాలం నాటోకు గడ్డురోజులే. మీ భద్రత కోసం అమెరికా ప్రజల సొమ్ము ఎందుకు వృథా చేయాలన్నది ట్రంప్ తర్కం. ఇకపై ఏ రకమైన సైనిక శిక్షణ, సైనిక స్థావరాల నిర్వహణైనా యూరోప్ దేశాలు తగిన మొత్తం చెల్లిస్తేనే సాధ్యమని ఆయన ప్రకటించి, ఆ దిశగా చర్యలు కూడా ప్రారంభించారు. పరిస్థితులు ఎల్లకాలమూ ఒకేలా ఉండబోవన్న జ్ఞానోదయం నాటోకు కలిగింది అప్పుడే. తన దోవ తాను చూసుకోవడం తప్పనిసరన్న గ్రహింపు కలిగింది కూడా ఆ సమయంలోనే. ఆ తర్వాత నాటో తీరు మారింది. ట్రంప్ పోయి బైడెన్ వచ్చినా, మునుపటి విధానాలే కొనసాగిస్తామని హామీ ఇచ్చినా ఆ కూటమి భరోసాతో లేదు. ఆ తర్వాతే చైనాతో సంప్రదింపులు చేస్తుండటం, పాకిస్తాన్‌కు సైనిక శిక్షణ ఇవ్వడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. నాటో కూటమిలోని వేరే దేశాలు అభ్యంతర పెట్టినా ప్రధాన దేశమైన జర్మనీ రష్యాతో నార్డ్ స్ట్రీమ్–2 గ్యాస్ పైప్‌లైన్ ఒప్పందం కుదుర్చుకోవడం ఆ కూటమిలోని పొరపొచ్చాలకు అద్దం పడుతుంది. ఉక్రెయిన్‌పై దురాక్రమణ తర్వాత రష్యా విషయంలో జర్మనీ వైఖరి మారింది గానీ లేనట్టయితే ఆ బంధం మరింత బలపడేది. వర్తమాన ప్రపంచంలో మన దేశం ప్రాముఖ్యతేమిటో నాటో సరిగానే గ్రహించింది. అయితే కీలకమైన అంశాల్లో దాని వైఖరికీ, మన వైఖరికీ ఎంతమాత్రం పొసగదు. నాటో రష్యాను బూచిగా చూస్తున్నది. దాని దూకుడు యూరో–అట్లాంటిక్ భద్రతకు ముప్పు తెస్తుందని నమ్ముతోంది. మనకు అది మిత్ర దేశం. చైనాతో అమెరికాకు సమస్యలున్న మాట వాస్తవమే అయినా, నాటో మాత్రం ఆ దేశంతో ఉదారంగా ఉంటున్నది. చైనా కారణంగా సవాళ్లు ఎదురవుతున్నది నిజమే అయినా, ఆర్థికరంగంలో ఎదగడానికి ఆ దేశం ఉపకరిస్తుందని నాటో దేశాలు భావిస్తున్నాయి. ఆ ధోరణి మనకు మింగుడుపడనిది. ఇక తాలిబాన్ల విషయంలో నాటోది సైతం అమెరికా తోవ. దాన్నొక రాజకీయ శక్తిగా నాటో పరిగణిస్తోంది. ప్రస్తుతం అఫ్ఘాన్‌లో తాలిబాన్ల ఏలుబడి వచ్చింది కనుక మన దేశం తప్పనిసరై దానితో ఏదోమేరకు సంబంధాలు నెరపవలసి వస్తోంది. నాటోకూ, మనకూ ఇలా భిన్న ఆలోచనలున్నప్పుడు ఆ కూటమికి దగ్గరకావడం వల్ల ఒరిగేదేమిటన్నది కీలకమైన ప్రశ్న. అయితే సంప్రదింపుల వల్ల మన ఆలోచనల వెనకున్న కారణాలు గ్రహించడం నాటోకు సులభమవుతుంది. 2019 డిసెంబర్లో మన దేశానికీ, నాటోకూ జరిగిన చర్చలను ఈ కోణంలో చూడటం అవసరం. కోవిడ్ ఉత్పాతంవల్ల తదుపరి సంప్రదింపులు జరగలేదు. నాటోలో సభ్యత్వం తీసుకోవడం, కనీసం సాగరప్రాంత భద్రత వంటి అంశాల్లో భాగస్వామిగా ఉండటం వంటివి మన దేశంపై ప్రభావం చూపకమానవు. ప్రస్తుతం మన దేశం ఏదోమేరకు తటస్థత పాటిస్తున్న భావన కలిగిస్తోంది. నాటో సభ్యత్వం తీసుకున్న మరుక్షణం అది పోయి పాశ్చాత్యదేశాల మిత్రదేశమన్న ముద్రపడుతుంది. అంతర్జాతీయంగా భారత్ సమతూకం పాటిస్తున్నదన్న అభిప్రాయం అంతరిస్తుంది. సహజంగానే మన దేశం ఈ పరిస్థితిని కోరుకోదు. రష్యాతో తెగదెంపులు చేసుకోవడానికి సిద్ధపడదు. పైగా పాకిస్తాన్ భాగస్వామ్య దేశం హోదాలో నాటోతో సంబంధాలు నెరపుతోంది. అది మన దేశానికి నచ్చదు. సభ్యదేశాలైన టర్కీ, గ్రీస్ వంటి వాటితో ఆ కూటమి ఇప్పటికే ఇబ్బందులు పడుతోంది. భారత్, పాకిస్తాన్లతో అలాంటి తలనొప్పులు భరించడానికి నాటో సిద్ధపడకపోవచ్చు. ఏదేమైనా నాటోతో సంబంధాలు నెరపే అంశంలో మన దేశం ఆచితూచి అడుగేయాలి. ప్రపంచంలో ఘర్షణ వాతావరణం రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో మన నిర్ణయాలు ఎలాంటి పర్యవసానాలు కలిగిస్తాయన్నది బేరీజు వేసుకోవాలి. -
ప్రపంచానికి ప్రమాద ఘంటికలు.. ‘నాటో’ విస్తరణకై తీవ్ర ప్రమాదకర నిర్ణయాలు!
స్పెయిన్ రాజధాని మ్యాడ్రిడ్‌లో జూన్ 28 నుండి 30 వరకూ ‘నాటో’ సదస్సు జరిగింది. ఇందులో నాటో మిలిటరీ కూటమి విస్తరణౖకై తీవ్ర ప్రమాదకర నిర్ణయాలు వెలువడ్డాయి. ఐరోపాలో నాటో సైనికుల సంఖ్యను పెంచడంతోపాటు, ఆ కూట మిని మొదటిసారిగా ఆసియా పసిఫిక్ ప్రాంత దేశా లలో విస్తరించే ప్రణాళికలు తయారైనాయి. ప్రస్తుతం యూరప్ లోనున్న 40 వేల సంసిద్ధతా దళాలను ఒకే సారి 3 లక్షల వరకూ పెంచుతామనీ, లెక్కలేనన్ని యుద్ధ ట్యాంకులను, విమానాలను రష్యా సరిహద్దుకు పంపిస్తామనీ; రష్యా, చైనాలతో నూతన వ్యూహాత్మక పోటీకి దిగుతామనీ నాటో ప్రధాన కార్యదర్శి స్టోల్టెన్ బర్గ్ అన్నాడు. లాత్వియా, లిథువేనియా, ఎస్తోనియా దేశాల్లో ఉన్న సైనిక శిబిరాలకు బ్రిగేడ్ హోదా కల్పిస్తా మనీ నాటో అంటోంది. నార్డిక్ తటస్థ దేశాలైన నార్వే, స్వీడన్లను తన పరిధిలోకి నాటో ఆహ్వానించటంతో దశాబ్దాల యూరప్ భద్రత ప్రశ్నార్థకమయింది. ‘‘ఈ దేశాల్లో మిలిటరీ మౌలిక సదుపాయాలతో నాటో స్థావరాలను మోహరిస్తే అందుకు దీటుగా మా ప్రతిస్పందన ఉంటుం’’దని పుతిన్ అన్నాడు. ఉక్రె యిన్‌ను అడ్డం పెట్టుకొని రష్యాతో పరోక్ష యుద్ధం చేస్తూ, శాంతి చర్చలు కాదని యూరప్ కల్లోలానికి కారణమైన నాటో కూటమి యూరప్‌లో భారీగా మిలి టరీ మోహరింపునకు సన్నద్ధం అవుతూనే, ‘‘మా భద్రతకు, మా ఆసక్తులకు, విలువలకు చైనా విసిరే సవాళ్ళను స్వీకరించటానికి ఆసియా పసిఫిక్ దేశాలకు కూడా నాటోను వ్యాప్తి చేస్తాం’’ అని నాటో ప్రధాన కార్యదర్శి అన్నాడు. చదవండి👉లుహాన్స్క్లో జెండా పాతేశాం: పుతిన్ చైనా సరిహద్దుల వరకు వెళ్ళటం తమ విధానాలలో వచ్చిన మార్పు అని చెప్పుకొచ్చాడు. రష్యాపై దాడి చేయటానికి అమెరికా, ఫ్రాన్స్, యూకే వంటి పాశ్చాత్య నాటో దేశాల కాల్బలంతో పాటు... ఆయా దేశాల నౌకలు, యుద్ధ విమానాలతో మూకుమ్మడి దాడిని గంటల వ్యవధిలో చేస్తాయని స్టోల్టెన్‌బర్గ్ యుద్ధోన్మాదాన్ని బయటపెట్టాడు. నాటో కూటమి రష్యాతో యుద్ధంలో పాల్గొనదని అధ్యక్షుడు బైడెన్ చాలాసార్లు చెప్పినా... ఆచరణలో ఉక్రెయిన్ మిలిటరీ ముసుగున అనేకమంది నాటో సైని కులు, సలహాదారులు, శిక్షణలు ఇచ్చే జనరల్స్‌ను ఉక్రెయిన్‌కు నాటో పంపింది. రష్యాకు చెందిన వందల కోట్ల డాలర్లను విదేశీ బ్యాంకుల్లో స్తంభింపచేసి, ఆర్థిక వ్యవస్థను నాశనం చేయటానికి కంకణం కట్టుకొన్న పశ్చిమ దేశాలు, 1918 తర్వాత మొదటిసారిగా రష్యా చెల్లించవల్సిన వాయిదాను తీర్చలేని స్థితికి తీసుకు రాగలిగాయి. అయితే ఉక్రెయిన్ యుద్ధంలో పరోక్షంగా పాల్గొంటున్న నాటో ఇప్పటివరకూ విజయాలను సాధించలేకపోయింది. తూర్పు డోనబాస్ ప్రాంత మంతా రష్యా ఆధీనంలోకి రావటంతోపాటు, నల్ల సముద్ర తీర ప్రాంతాలు 90 శాతం రష్యా సేనలు ఆక్ర మించడం గమనార్హం. రష్యా–ఉక్రెయిన్ వివాదం ద్వారా నాటో యుద్ధ కూటమి ఐక్యంగా బయటకు కనబడటానికి ప్రయత్ని స్తోంది. కానీ అంతరంగాన నాటో సభ్యదేశాల మధ్య లుకలుకలున్నాయి, చర్చల ద్వారా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలని ఒత్తిడి వస్తోంది. ప్రపంచం మొత్తంలో రెండంకెలు దాటిన ద్రవ్యోల్బణంతో పాటు రికార్డు స్థాయిలో నిరుద్యోగం, ధరలు పెరుగు తున్నాయి. అమెరికా, చైనా కూటములకు తటస్థంగా భారత్ ఉండి అలీనోద్యమ పూర్వ వైభవానికి కృషి చేస్తే... ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికాలోని అభివృద్ధి చెందుతున్న దేశాలు అగ్రరాజ్యాల ఆధిపత్య ధోరణుల నుండి కాపాడుకొనే అవకాశాలుంటాయి. ఆంక్షల ఫలితంగా యూరప్ ఇంధన సమస్య తీవ్ర స్థాయికి చేరుకొంది. తొందరలోనే ప్రపంచ ఆర్థిక మాంద్యం సంభవించ వచ్చునని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో నాటో విస్తరణ ఏ పరిస్థితులకు దారి తీస్తుంది? చదవండి👉ట్రంప్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. అదే జరిగితే అధ్యక్ష పోటీ ఆశలు గల్లంతు వ్యాసకర్త: బుడ్డిగ జమిందార్, కె.ఎల్. యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ ‘ మొబైల్: 98494 91969 -
ఉక్రెయిన్ రష్యా యుద్ధం.. నాటోలో కీలక పరిణామం
నాటో(నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) సెక్రటరీ జనరల్‌గా జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ పదవీకాలాన్ని ఒక సంవత్సరంపాటు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోలెన్బర్గ్ను 2023 సెప్టెంబర్ 30 వరకు పదవీలో కొనసాగించనున్నట్లు ఓ ప్రకటన విడుదల చేసింది. బ్రస్సెల్స్‌లో జరిగిన నాటో సదస్సు అనంతరం సభ్య దేశాల నేతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. నార్వే మాజీ ప్రధాని అయిన స్టోలెన్‌బర్గ్.. నాటో సెక్రటరీ జనరల్‌గా 2014 అక్టోబర్‌లో నియమితులయ్యారు. కాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తోపాటు నాటో సభ్యత్వ దేశాల అధికారులు బ్రెజిల్ రాజధాని బ్రస్సెల్స్‌లో సమావేశమయ్యారు. ఉక్రెయిన్- రష్యా యుద్ధం ప్రారంభమై నెల రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో కీలక చర్చ జరిగింది. ఈ భేటీలోనే స్టోలెన్‌బర్గ్ పదవీ కాలాన్ని పెంచేందుకు నాటో దేశాల నేతలు అంగీకారం తెలపడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. తన పదవీ కాలాన్ని పెంచడం గౌరవంగా భావిస్తున్నట్లు ఈ సందర్భంగా స్టోలెన్‌బర్గ్ హర్షం వ్యక్తం చేశారు. చదవండి: Russia-Ukraine war: కలకలానికి నెల! ‘నాటో సెక్రటరీ జనరల్‌గా నా పదవీకాలాన్ని 30 సెప్టెంబర్ 2023 వరకు పొడిగించాలని నాటో దేశాధినేతలు నిర్ణయం తీసుకోవడం గౌరవంగా భావిస్తున్నా. ప్రస్తుతం మేము అతిపెద్ద భద్రతా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నందున, మా కూటమిని బలంగా, ప్రజలను సురక్షితంగా ఉంచడానికి మేమంతా కలిసి ఐక్యంగా పోరాడతాం’ అని స్టోల్టెన్‌బర్గ్ ట్వీట్ చేశారు. కాగా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా, బెల్జియం, కెనడా, బ్రిటన్, ఇటలీ, ఫ్రాన్స్ వంటి 12 దేశాలతో ఏర్పాటైన సైనిక కూటమి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఇప్పుడు నాటో సభ్య దేశాల సంఖ్య 30కి పెరిగింది. సభ్య దేశాల్లో ఏ ఒక్క దేశంపైన అయినా సాయుధ దాడి జరిగితే.. ఆ దేశానికి మిగతా దేశాలన్నీ సహాయంగా రావాలన్నది ఈ కూటమి ఒప్పందం. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దాడిని నాటో పలుమార్లు ఖండించిన సంగతి తెలిసిందే. Honoured by the decision of #NATO Heads of State and Government to extend my term as Secretary General until 30 September 2023. As we face the biggest security crisis in a generation, we stand united to keep our Alliance strong and our people safe. https://t.co/06YkRkmX8J — Jens Stoltenberg (@jensstoltenberg) March 24, 2022 -
ఉద్రిక్తతలకు కారణం నాటో పీటముడి?!
ఒకప్పుడు కలిసిఉన్న దేశానికి వ్యతిరేకంగా ఏర్పడిన కూటమిలో చేరాలని ఉక్రెయిన్ ఉబలాటపడుతోంది. ఎలాగైనా ఈ చేరికను అడ్డుకోవాలని రష్యా యత్నిస్తోంది. రష్యాను తిరస్కరించి ఉక్రెయిన్ను నాటోలో చేర్చుకోవాలని యూఎస్, మిత్రపక్షాలు ఆశపడుతున్నాయి. అసలేంటీ నాటో? ఎందుకు ఇందులో చేరడానికి ఉక్రెయిన్‌కు తొందర? దీనివల్ల రష్యాకు నష్టమేంటి? అమెరికాకు లాభమేంటి? నాటో కూటమే ఉక్రెయిన్ ఉద్రిక్తతలకు కారణమా? ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా లక్షకు పైగా బలగాలను మోహరించింది. పరిస్థితి చూస్తే ఏ క్షణమైనా యుద్ధం కమ్మే సూచనలు కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్ను ఆక్రమించే ఉద్దేశం లేదని రష్యా చెబుతున్నా, అటు పాశ్చాత్య దేశాలు, ఇటు ఉక్రెయిన్ నమ్మడం లేదు. రష్యా, యూఎస్ కూటమికి మధ్య ఈ ఉద్రిక్తతలకు అసలు కారణం నాటో కూటమేనంటున్నారు నిపుణులు. ఉక్రెయిన్ సంక్షోభం సమసిపోవాలంటే నాటోలో ఉక్రెయిన్‌కు సభ్యత్వం ఇవ్వకూడదని రష్యా షరతు పెడుతోంది. అయితే యూఎస్ మాత్రం ఇందుకు అంగీకరించడం లేదు. నాటోలో ఉక్రెయిన్ చేరిక అన్ని పక్షాలకు ఎందుకు ఇంత ప్రాధాన్యాంశంగా మారిందంటే నాటో చరిత్రను, ఉక్రెయిన్ ప్రాముఖ్యతను తెలుసుకోవాల్సిందే! ఏంటీ నాటో? రెండో ప్రపంచ యుద్ధానంతరం రష్యాకు వ్యతిరేకంగా అమెరికా, యూకే, ఫ్రాన్స్‌తో పాటు మరో ఎనిమిది యూరోపియన్ యూనియన్ దేశాలు 1949లో నాటో ( ద నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్)ను ఏర్పాటు చేశాయి. అనంతరం అనేక దేశాలు ఈ కూటమిలో చేరుతూ వచ్చాయి. తాజాగా 2020లో ఉత్తరమాసిడోనియా నాటోలో చేరింది. ఈ కూటమి ప్రధాన కార్యాలయం బ్రస్సెల్స్‌లో ఉంది. కేవలం యుద్ధ పరిస్థితులు ఎదురైతే కలిసికట్టుగా ఎదుర్కొనేందుకు ఈ కూటమి ఏర్పడింది. ఐరాస లాగా ఇతర అభివృద్ధి తదితర కార్యక్రమాల్లో నాటో పాల్గొనదు. నాటోలో చేరిన దేశాలకు మాత్రమే కూటమి రక్షణ ఉంటుంది. కనుక ఒకవేళ రష్యా ఉక్రెయిన్ను ఆక్రమిస్తే, ఉక్రెయిన్ కూటమిలో సభ్యురాలు కాదు కనుక నాటో నేరుగా స్పందించలేదు. అందుకే ఎలాగైనా ఉక్రెయిన్ను కూటమిలో చేర్చుకునేందుకు యూఎస్, మిత్రదేశాలు తొందరపడుతున్నాయి. ఉక్రెయిన్ అవసరాలు 1992 నుంచి నాటోతో ఉక్రెయిన్ సంబంధం కొనసాగుతోంది. 1997లో ఉక్రెయిన్– నాటో కమిషన్ ఏర్పాటైంది. అయితే అధికారికంగా నాటోలో ఇంతవరకు ఉక్రెయిన్ చేరలేదు. రష్యా తమను ప్రత్యేకంగా మిగల్చదని ఉక్రెయిన్ రాజకీయనాయకుల భావన. నాటోలో చేరడం ద్వారా నేరుగా నాటో కూటమి రక్షణ పొందవచ్చని వీరి ఆలోచన. సభ్యదేశాలు కానివాటి రక్షణపై నాటోకు పరిమితులున్నాయి. అందువల్ల రష్యా ఇప్పటికిప్పుడు ఉక్రెయిన్‌పై దండెత్తితే నాటో స్పందన భిన్నంగా ఉంటుంది. అందుకే వీలైనంత త్వరగా కూటమిలో చేరాలని ఉక్రెయిన్ భావిస్తోంది. అలాగే నాటోలో చేరడం ద్వారా యూరోపియన్ యూనియన్‌లో కూడా సభ్యత్వం పొందవచ్చని ఉక్రెయిన్ నేతల ఆలోచన. దీనివల్ల యూఎస్ తదితర దేశాలతో మరింత బలమైన సంబంధాలు ఏర్పడడంతో పాటు పాశ్చాత్య దేశాల ఆర్థిక అండదండలు లభిస్తాయి. అయితే నాటోలో సభ్యత్వం పొందడం అంత సులువు కాదు. కూటమిలో అన్ని దేశాలు విస్తరణకు ఆమోదం తెలపాలి. నాటోలో కొత్తగా చేరబోయే దేశం మెంబర్షిప్ యాక్షన్ ప్లాన్‌ను అమలు చేయాలి. 2008లో ఉక్రెయిన్ ఈ ప్లాన్‌కు దరఖాస్తు చేసుకుంది. అయితే 2010లో రష్యా అనుకూల నేత ఉక్రెయిన్ అధిపతి కావడంతో ప్రక్రియ అటకెక్కింది. 2014 క్రిమియా ఆక్రమణ అనంతరం ఉక్రెయిన్‌కు నాటోలో చేరాలన్న కోరిక పెరిగింది. 2017లో నాటో సభ్యత్వం కోసం ఆ దేశం రాజ్యాంగ సవరణ కూడా చేసింది. రష్యా బాధలు నాటో విస్తరణపై రష్యా తీవ్ర అభ్యంతరాలు వెలిబుచ్చుతోంది. ఈ కూటమి విస్తరణ తమకు హాని కలిగిస్తుందని రష్యా వాదన. అలాంటి కూటమిలో తమ సరిహద్దులోని, తమతో ఒకప్పుడు భాగమైన దేశం సభ్యత్వం తీసుకుంటే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని రష్యా నాయకత్వం భావిస్తోంది. అందుకే నాటోలో ఉక్రెయిన్‌కు సభ్యత్వం ఇవ్వవద్దని డిమాండ్ చేస్తోంది. యూఎస్, మిత్రదేశాలు ఈ డిమాండ్‌ను తోసిపుచ్చడంతో వాటిపై ఒత్తిడి తెచ్చేందుకు యుద్ధసన్నాహాలు చేస్తోంది. నాటో వద్ద తమ దరఖాస్తు చాలా కాలంగా పెండింగ్‌లో ఉందని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి గతేడాది వ్యాఖ్యానించారు. దీంతో అప్రమత్తమైన రష్యా ఈ బంధం బలపడకుండా చూసేందుకు యత్నిస్తోంది. అలాగే నాటోలో చేరబోయే దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలి, సరిహద్దు సమస్యలుండకూడదు. అప్పుడే సభ్యదేశాలు నూతన సభ్యత్వాన్ని పరిశీలిస్తాయి. ప్రస్తుతం ఉక్రెయిన్ సరిహద్దుల్లో బలగాలను మోహరించడం ద్వారా ఉక్రెయిన్ సభ్యత్వ పరిశీలనకు రష్యా అడ్డంపడుతోంది. కోల్డ్‌వార్ టైమ్‌లో కీలకపాత్ర ‘సంయుక్త సంరక్షణ’(కలెక్టివ్ డిఫెన్స్) అనేది నాటో ప్రధాన ఉద్దేశం. అంటే కూటమిలో సభ్యులెవరిపై దాడి జరిగినా కూటమిపై దాడి జరిగినట్లు భావించి ఎదురుదాడి చేస్తారు. నాటో చరిత్రలో ఒక్కసారి మాత్రమే సంయుక్త సంరక్షణ సూత్రాన్ని వాడారు. 2001 అమెరికాపై దాడుల అనంతరం నాటో దేశాల మిలటరీ విమానాలన్నీ యూఎస్ ఆకాశవీధుల్లో కాపలా తిరిగాయి. యూగోస్లోవియా, ఇరాక్, అఫ్గాన్ యుద్ధాల్లో నాటో రాజకీయ కారణాలతో పాల్గొన్నది. రష్యాతో ప్రచ్ఛన్నయుద్ధ సమయంలో అమెరికా, మిత్రపక్షాలకు నాటో చాలా ఉపయోగపడింది. అయితే రష్యా ప్రభ కోల్పోయి, అమెరికా ఏకైక సూపర్ పవర్‌గా మిగిలిన తర్వాత నాటోకు ప్రాధాన్యం తగ్గింది. ప్రస్తుతం మరలా ఉక్రెయిన్ విషయంలో నాటో గురించి చర్చ ఆరంభమైంది. – నేషనల్ డెస్క్, సాక్షి -
అస్తిత్వ సంక్షోభంలో ‘నాటో’
దౌత్య మర్యాదలను పెద్దగా లక్ష్యపెట్టని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నాటో శిఖరాగ్ర సదస్సులో తన ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసి అందులోని 28 సభ్య దేశాలనూ మరోసారి అయోమయంలో పడేశారు. ఈ కూటమి నిర్వహణకయ్యే వ్యయంలో అత్యధిక భాగం తాము భరిస్తుండగా, ఇందులోని యూరప్ దేశాలు స్వల్పంగా ఖర్చుపెడుతున్నాయని ఆయన వాదన. దాన్ని మార్చి తీరాలంటూ రెండేళ్లక్రితం తాను అధ్యక్షుడైనప్పటినుంచి ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ కూటమి కింద వివిధ యూరప్ దేశాల్లో ఉండే సైనిక స్థావరాల్లో లక్షలమంది అమెరికా సైనికులు పని చేస్తున్నారు. పశ్చిమాసియాలోనూ, అఫ్ఘానిస్తాన్, ఇరాక్ వగైరాచోట్ల నాటో సేనలుంటున్నాయి. ఈ కూటమికయ్యే వార్షిక వ్యయంలో దాదాపు 22 శాతం(సుమారు 200 కోట్ల డాలర్లు) అమెరికా ఖర్చు చేస్తోంది. ఏ దేశానికాదేశం సొంతంగా సైన్యాలను నిర్వహించుకుంటే అమెరికాకు ఈ ఖర్చంతా తగ్గుతుందని ట్రంప్ భావిస్తున్నారు. ఇలాంటి ‘అనవసర ఖర్చుల’ వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ కుంగి పోతున్నదని, యూరప్ దేశాలు మాత్రం రక్షణ రంగ వ్యయం లేకపోవడంతో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అభివృద్ధి సాధిస్తున్నాయని ట్రంప్ ఆరోపిస్తున్నారు. అయితే ఇది అర్ధసత్యం మాత్రమే. వివిధ యూరప్ దేశాల్లో ఉండే నాటో సైన్యంలో అమెరికా సైనికుల సంఖ్య దాదాపు 15 లక్షలు. అమెరికాతో పోలిస్తే యూరప్ దేశాల సైన్యం తక్కువే. టర్కీ సైనికులు దాదాపు 4 లక్షలుంటే ఫ్రాన్స్ సైనికులు అందులో సగం ఉంటారు. జర్మనీ సైన్యం లక్షా 83వేలు. బ్రిటన్ సైన్యం లక్షా 45 వేలు. మిగిలిన దేశాల్లో సైన్యం ఇంతకన్నా తక్కువ. జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ మినహా ఇతర నాటో దేశాలు తమ జీడీపీల్లో 2 శాతం వ్యయం చేయలేకపోతున్నాయి. కానీ ఈ దేశాలన్నీ అమెరికా సైన్యానికి, దాని స్థావరాలకూ భారీయెత్తునే ఖర్చు పెడుతున్నాయి. అదిగాక పశ్చిమాసియా దేశాల్లో, అఫ్ఘానిస్తాన్, ఇరాక్ వగైరాల్లో అమెరికా సాగిస్తున్న యుద్ధాల్లో పాలుపంచుకుంటూ తమ తమ సేనల్ని పంపుతున్నాయి. ఆ ఖర్చంతా భరిస్తున్నాయి. అమెరికా తన రక్షణ రంగ వ్యయాన్ని కేవలం నాటో కోసం మాత్రమే కాదు... పశ్చిమాసియాలో, ఆసియాలో ఉండే తన సైనిక స్థావరాల కోసం, అక్కడి అమెరికా సైనికుల కోసం కూడా వ్యయం చేస్తోంది. నిజానికి నాటో రద్దయి యూరప్ దేశా లన్నీ సొంతంగా ఎవరికివారు రక్షణ ఏర్పాట్లు చూసుకుంటే బాగా నష్టపోయేదీ...సంక్షోభంలో పడేదీ అమెరికాయే. ఆ దేశాల్లో ఉన్న తన లక్షలాదిమంది సైనికులు ఇంటిదారి పడితే వారి భారమంతా ట్రంప్ సర్కారే మోయాల్సి ఉంటుంది. రెండో ప్రపంచ యుద్ధం ముగిశాక సోవియెట్ యూనియన్ నుంచి పెను ముప్పు తప్పదని యూరప్ దేశాలను బెదరగొట్టి ఈ కూటమికి ప్రాణప్రతిష్ట చేసింది అమెరికాయే. నాటో దేశాల్లో ఏ ఒక్కదానిపై దాడి జరిగినా అందరూ కలిసికట్టుగా దాన్ని తిప్పికొట్టాలని నాటో ఒప్పందంలోని అయిదో ఆర్టికల్ చెబుతోంది. అయితే ఆ ఆర్టికల్ అవసరమే రాలేదు. అగ్రరాజ్యాల మధ్య ఏర్పడ్డ వైషమ్యాలు అనేకసార్లు మూడో ప్రపంచ యుద్ధ భీతిని సృష్టించాయి. అయితే 1989లో బెర్లిన్ గోడ బద్దలయ్యాక... 1991లో సోవియెట్ యూనియన్ పతనమై వార్సా కూటమి అంతరించాక ఈ భయాలన్నీ పటాపంచలయ్యాయి. అయినా ప్రపంచంపై తన రాజకీయ, సైనిక ఆధిపత్యం కొన సాగాలన్న ఏకైక కాంక్షతో నాటోను రద్దు చేయకుండా కొనసాగించింది అమెరికాయే! చిత్రమే మంటే... సోవియెట్ ఉండగా ఈ కూటమి ఒక్క యుద్ధం చేయాల్సిన అవసరం రాలేదు. అది కుప్ప కూలాకే పలు దేశాల్లో సైనిక జోక్యాలకు, దురాక్రమణలకు నాటో పూనుకుంది. అమెరికా ఆధిపత్యం కోసం ఉపయోగపడుతున్న నాటోకు మేమెందుకు వ్యయం చేయాలని యూరప్ దేశాలు అను కుంటే... దానికయ్యే ఖర్చు ‘గిట్టుబాటు’ కావడం లేదని అమెరికా భావిస్తోంది. ఇలా పరస్పరం అప నమ్మకంతో అమెరికా–యూరప్ దేశాలు ఎన్నాళ్లు కలిసి కాపురం సాగిస్తాయో తెలియదు. వాస్తవా నికి నాటో కూటమి వల్ల అధికంగా లాభపడింది అమెరికాయే. ఆ కూటమి ఉనికిలో లేకపోతే యూర ప్లో సోవియెట్‌ను రాజకీయంగా బెదిరించడానికి, తన ఆధిపత్యాన్ని ప్రదర్శించుకోవడానికి దానికి అవకాశం ఉండేది కాదు. అమెరికా ఇన్ని దశాబ్దాలుగా ప్రశాంతంగా మనుగడ సాగించగలిగిందంటే, ఇతరేతర అంశాలపై దృష్టి పెట్టి సంపన్నవంతం కాగలిగిందంటే అది నాటో కూటమి చలవే. అయితే ట్రంప్ కడుపు మంటకు వేరే కారణాలున్నాయి. జర్మనీ తన ఇంధన అవసరాల్లో 70 శాతాన్ని రష్యా నుంచే స్వీకరిస్తోంది. అందుకే అది రష్యా మిత్ర దేశమైన లిబియాపై అమెరికా దాడికి దిగినప్పుడు అందులో పాలుపంచుకోవడానికి నిరాకరించింది. అఫ్ఘాన్‌కు సైన్యాన్ని పంపినా జర్మనీ మాత్రం అక్కడ కేవలం పునర్నిర్మాణ పనులకు పరిమితమైంది. ఇరాక్, అఫ్ఘానిస్తాన్ తదితర దేశాల్లో అమెరికా సేనల వైఫల్యాలు చూశాక నాటో దేశాల్లో దాని నాయకత్వ పటిమపై సందేహాలు పుట్టు కొచ్చాయి. అందుకే అమెరికాను ఆ దేశాలు పెద్దగా లెక్కచేయడం మానేశాయి. జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ రాజకీయంగా గడ్డు స్థితిని ఎదుర్కొంటున్న ఈ తరుణంలో ఒత్తిడి తీసుకురావడమే ట్రంప్ ఆంతర్యం. అందుకే రష్యా చెప్పుచేతల్లో ఉన్నారంటూ జర్మనీపై ట్రంప్ కటువుగా వ్యాఖ్యా నించారు. యూరప్ దేశాలు వెల్లువలా వచ్చిపడుతున్న శరణార్థులతో దిక్కుతోచకుండా ఉన్నాయి. ఇదే అదునుగా ఆ దేశాల ఉత్పత్తులపై ట్రంప్ భారీగా సుంకాలు విధించారు. మరోపక్క ఆ దేశాలు కూడా భాగస్వాములుగా ఉన్న ఇరాన్ అణు ఒప్పందం నుంచి కేవలం ఇజ్రాయెల్‌ను సంతోషపెట్ట డానికి అమెరికా ఏకపక్షంగా బయటికొచ్చింది. ఫలితంగా ఇరాన్‌తో ఆ దేశాల వ్యాపార వాణిజ్య లావాదేవీలు ఇబ్బందుల్లో పడ్డాయి. పారిస్ వాతావరణ ఒప్పందానికి కూడా ట్రంప్ తూట్లు పొడి చారు. ఇన్నివిధాల నష్టపరుస్తున్న అమెరికాతో కలిసి అడుగేయటం కష్టమని యూరప్ దేశాలు అను కుంటున్న తరుణంలో నాటో సాకు చూపి వాటిని దారికి తేవాలని ట్రంప్ చూస్తున్నారు. కానీ తెగే దాకా లాగితే ఏమవుతుందో ఆయన అనుభవపూర్వకంగా తెలుసుకునే రోజు ఎంతో దూరంలో లేదు. -
జూలైలో ట్రంప్, పుతిన్‌ల భేటీ..!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను త్వరలోనే భేటీ కానున్నారు. వచ్చే నెలలో యూరప్‌లో ట్రంప్, పుతిన్‌ల భేటీ జరిగే అవకాశం ఉంది. జూలైలో బ్రస్సెల్స్‌లో జరగనన్ను నాటో సదస్సుకు ట్రంప్ హాజరుకానున్నారు. అక్కడే పుతిన్‌తో భేటీ అవుతారని వైట్‌హౌజ్ అధికారులు వెల్లడించారు. అలాగే యూకే వెళ్లి బ్రిటన్ ప్రధాన మంత్రి థెరిసా మే, బ్రిటన్ రాణితో ట్రంప్ సమావేశం కానున్నారు. కాగా ఉ.కొరియా అధ్యక్షుడు కిమ్‌ను కలిసిన కొద్ది రోజులకే పుతిన్‌తో ట్రంప్ సమావేశం కానుండడం గమనార్హం. ఈ విషయంపై ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ..‘నేను మొదటి రోజు నుంచి చెప్తూనే ఉన్నాను. రష్యా, చైనా, ఇంకా అన్ని దేశాలతో కలిసి ఉండడం చాలా మంచి విషయం. ఇది అందరికి మంచింది. పుతిన్‌తో భేటీలో మేము సిరియా, ఉక్రెయిన్ల గురించి, మరికొన్ని అంశాల గురించి మాట్లాడతాం’ అని ట్రంప్ విలేకరులకు వెల్లడించారు. ట్రంప్, పుతిన్‌లు గత ఏడాది రెండు సార్లు భేటీ అయ్యారు. -
అమెరికాలో పోలీసులపై కాల్పులు
-
అమెరికాలో పోలీసులపై కాల్పులు
- ఐదుగురు పోలీసుల మృతి.. ఏడుగురికి గాయాలు - ప్రధాన నిందితుడి హతం - హింసాత్మకంగా నల్లజాతీయుల నిరసన హ్యూస్టన్ : అమెరికాలోని డాలస్ నగరంలో ఇద్దరు నల్లజాతీయులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు పోలీసులతో పాటు ఓ పౌరుడు తీవ్రంగా గాయపడ్డారు. డాలస్‌లోని అత్యంత రద్దీగా ఉండే డౌన్‌టౌన్ ప్రాంతంలో నల్లజాతీయులు నిరసన ప్రదర్శన సందర్భంగా దుండగులు ఈ కాల్పులకు తెగబడ్డారు. ఈ వారంలో లూసియానా, మిన్నోసోటా పోలీసు కాల్పుల్లో నల్లజాతీయుల మృతికి నిరసనగా మొదలైన నిరసనలు చివరకు రక్తపాతానికి దారితీశాయి. 9/11 దాడుల అనంతరం పోలీసులపై జరిగిన అతి పెద్ద దాడుల్లో ఒకటిగా దీన్ని పరిగణిస్తున్నారు. ఈ కాల్పుల ప్రధాన సూత్రధారి మిఖా జాన్సన్(25) రోబో సాయంతో జరిపిన పేలుళ్లలో మరణించాడు. తుపాకులతో దుండగులు కాల్పులు జరపడం వల్లే ఇది జరిగిందని డాలస్ పోలీస్ చీఫ్ డేవిడ్ బ్రౌన్ చెప్పారు. అయితే ఎంత మంది కాల్పులు జరపారన్నది మాత్రం స్పష్టంగా తెలియలేదు. చనిపోయే మందు అనుమానితుడు పోలీసులతో మాట్లాడుతూ... ఇటీవల నల్ల జాతీయులపై కాల్పుల వల్ల తాను తీవ్రంగా కలత చెందానని, అందుకే తెల్లజాతి అధికారుల్ని చంపాలనుకున్నానని, తాను ఏ గ్రూపు చెందినవాడిని కానని, సొంతంగానే ఈ కాల్పులకు పాల్పడినట్లు తెలిపాడు. ‘నిరసనల సందర్భంగా గురువారం రాత్రి డాలస్‌లోని డౌన్‌టౌన్ ప్రాంతంలో ఇద్దరు నల్లజాతీయులు ఆకస్మాత్తుగా పోలీసులపై కాల్పులు జరిపారు. పోలీసులు దాన్ని ఉగ్రవాద చర్యగా మొదట పొరపడ్డారు. కాల్పులతో వందలాది మంది ప్రజలు భయంతో రోడ్లపై పరుగులు పెట్టారు. ఇంతలో పోలీసులు ఒక అనుమానితుడ్ని చుట్టుముట్టి చాలా సేపు అతనితో చర్చలు జరిపారు. చర్చలు ఫలించపోవడంతో దుండగుడికి, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. చివరకు పోలీసులు రోబోకు పేలుడు పదార్థం అమర్చి దుండగుడి వద్దకు చేర్చి పేల్చి వేశారు.’ అని పోలీసు చీఫ్ బ్రౌన్ తెలిపారు. ఇంకా అనుమానితులు చాలా మంది ఉండే అవకాశం ఉందని, అనుమానితులంతా కలసి పనిచేస్తున్నారని, దీంతో దర్యాప్తు అధికారులు జాగ్రత్తగా ముందుకు వెళుతున్నారని ఆయన చెప్పారు. ఒబామా తీవ్ర ఆందోళన.. మరోవైపు అమెరికాలో వరుస కాల్పుల ఘటనలపై అధ్యక్షుడు ఒబామా ఆందోళన వ్యక్తం చేశారు. నాటో సదస్సు కోసం పోలండ్‌లో ఉన్న ఒబామా పోలీసులపై జరిగిన దాడి అత్యంత హేయమైనదిగా పేర్కొన్నారు. ఈ సంఘటనలతో మనం తీవ్రంగా భీతిచెందామని, ప్రజలు, పోలీసులతో మనం కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.