విల్నియస్: స్వీడన్‌ను తమ కూటమిలో 32వ సభ్యదేశంగా చేర్చుకునేందుకు నాటో అంగీకరించింది. లిథువేనియా దేశంలోని విలి్నయస్ నగరంలో జరుగుతున్న నాటో శిఖరాగ్ర సదస్సు ఇందుకు వేదికగా నిలిచింది. అయితే ఉక్రెయిన్‌కు సభ్యత్వంపై 31 సభ్యదేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ఇప్పట్లో ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వం దక్కకపోవచ్చు.
యుద్ధంలో నిమగ్నమైన దేశానికి సభ్యత్వం ఇవ్వకూడదన్న నిబంధన కారణంగా ఇప్పుడే కూటమిలో చేర్చుకోలేమని, యుద్ధం ముగిశాక వెంటనే సభ్యత్వం ఇచ్చేలా పాత రెండంచెల పద్ధతిని సరళతరం చేశామని నాటో ప్రధాన కార్యదర్శి జీన్స్ స్టోల్టెన్‌బెర్గ్ మీడియాతో చెప్పారు. కాగా, తమ పట్ల నాటో వైఖరిని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తీవ్రంగా తప్పుబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment