Sweden
-
స్వీడెన్ లో కాల్పుల కలకలం
-
స్వీడన్లో కాల్పులు.. 10 మంది మృతి
ఒరెబ్రో: ప్రశాంత వాతావరణానికి మారుపేరైన స్వీడన్లో కాల్పులు కలకలం రేపాయి. రాజధాని స్టాక్‌హోంకు 200 కిలోమీటర్ల దూరంలోని ఒరెబ్రోలో జరిగిన కాల్పుల ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. నగర శివార్లలోని రిస్‌బెర్గ్‌స్కా వయోజన విద్యా కేంద్రం క్యాంపస్‌లో మంగళవారం మధ్యాహ్నం ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ ప్రైమరీ, అప్పర్ సెకండరీ స్కూళ్లు ఉన్నాయి. ఇక్కడే వలసదారులకు స్వీడిష్ బోధిస్తారు. తరగతులు ముగియడంతో చాలా మంది విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోయారని, కాల్పుల సమయంలో అక్కడ కొద్ది మంది మాత్రమే ఉన్నట్లు సమాచారం.మృతుల్లో కాల్పులకు తెగబడిన వ్యక్తి కూడా ఉన్నాడు. అతడొక్కడే ఈ దారుణానికి పాల్పడినట్లుగా భావించడం లేదని పోలీసులు తెలిపారు. దుండగుడిని గుర్తించాల్సి ఉందన్నారు. గాయాలతో చికిత్స పొందుతున్న వారి సంఖ్యను పోలీసులు వెల్లడించలేదు. ఘటన ప్రాంతంలో భీతావహ పరిస్థితిని బట్టి చూస్తే మరణాల సంఖ్యను కచ్చితంగా చెప్పలేమని ఓ అధికారి చెప్పడం గమనార్హం. దారుణానికి దారి తీసిన కారణాలపై దర్యాప్తు జరుగుతోందని పోలీసులు చెప్పారు. ప్రస్తుతానికైతే ఉగ్ర లింకులున్నట్లు చెప్పలేమన్నారు. అధికారులు మృతులను గుర్తించే పనిలో ఉన్నారు. -
ఉద్యోగం మానేయడమే ట్రెండ్
లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడంలో స్వీడన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి ఉంది. కానీ ఇప్పుడది క్రమంగా మారుతోంది. అక్కడ మహిళా శ్రామికుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. యువతులు పని మానేయడాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ ధోరణి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇప్పుడు స్వీడన్లో ‘హేమాఫ్లిక్వాన్’లేదా ‘హేమాఫ్రూ’అంటే ‘సాఫ్ట్‌గాళ్’(ఇంట్లో ఉండే స్నేహితురాలు లేదా గృహిణి) హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. సాఫ్ట్‌గాళ్ అంటే ఉద్యోగాలను చేయడానికి బదులు గృహిణిగా ఇంటికి పరిమితమై కొత్త జీవితాన్ని స్వీకరించం. సోషల్ మీడియాలో ఈ మైక్రో ట్రెండ్ 2010వ దశకం చివరలో ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ప్రారంభమైంది. కానీ స్వీడన్లో ఐదు దశాబ్దాలుగా శ్రామిక శక్తిలో సమాన భాగాన్ని పంచుకుంటున్న మహిళలను నెమ్మదిగా తగ్గించడం మొదలుపెట్టింది. మహిళలు ఉద్యోగాలు వదిలేయడం ఇటీవల కాలంలో మరింత ట్రెండ్‌గా మారుతోంది. స్వీడన్ యువతపై అతిపెద్ద వార్షిక సర్వే ఈ విషయాలను వెల్లడించింది. 15 నుంచి 24 ఏళ్ల వయస్సున్న యువతులు ఉద్యోగం వదిలేసి ‘సాఫ్ట్‌గాళ్’ట్రెండ్‌ను స్వీకరించడానికే ఆసక్తి చూపుతున్నారని తెలిపింది. ఉద్యోగాలు చేస్తూ సాధికారతను, స్వావలంబనను కోరుకునే ‘గాళ్ బాస్’ఆదర్శాన్ని ఇకపై త్యాగంచేయాలని చాలా మంది మహిళలు భావిస్తున్నారని అధ్యయనం వెల్లడించింది. అయితే పెళ్లయిన తర్వాత ఉద్యోగాలు వదిలేస్తున్న మహిళల అధికారిక డేటా లేదు. అయితే ఇది తక్కువ నిష్పత్తిలో ఉండే అవకాశం ఉందని అధ్యయనం పేర్కొంది. పెదవి విరిచిన అభ్యదయ వాదులు స్వీడన్లో ప్రధాన చర్చనీయాంశంగా మారిన ఈ ట్రెండ్‌పై స్వీడన్ మమిళా హక్కుల కార్యకర్త మాట్లాడారు. మహిళలు తమ భాగస్వాముల సంపాదనపై ఆధారపడటం అంటే లింగసమానత్వంలో వెనుకడుగు వేయడమే. ఇంకా పురుషాధిక్య సమాజాన్ని వ్యతిరేకించే మహిళలకు ఈ ధోరణి తప్పుడు సందేశాన్ని ఇస్తుంది’’అని ఆమె అన్నారు. పని చేసే హక్కు, జీవన భృతి పొందే హక్కు, ఆర్థిక స్వాతంత్య్రం కోసం మహిళలు శతాబ్దాలుగా ఎంతటి పోరాటం చేశారో నేటి స్వీడన్ మహిళలకు తెలీదనుకుంటా అని ఆమె అసహనం వ్యక్తంచేశారు. అయితే స్వీడన్ డెమొక్రాట్ల పార్టీ నేతలు ఈ సాఫ్ట్‌గాళ్ ట్రెండ్ పట్ల సానుకూలంగా ఉండటం విశేషం. ఎవరి జీవితంపై నిర్ణయం వారు తీసుకోవాల్సిందేనని, ఉద్యోగం చేయకుండా ఉండగలిగే అరి్థక వెసులుబాటు ఉంటే జాబ్ మానేయడమే మేలు అని వాళ్లు చెబుతున్నారు. ‘‘కెరీర్ కోసం అనేక అవకాశాలున్న దేశంలో నివసిస్తున్నాం. మాకు ఇప్పటికీ అన్ని హక్కులు ఉన్నాయి. కానీ మరింత సాంప్రదాయకంగా జీవించడాన్ని ఎంచుకునే హక్కు కూడా మాకు ఉంది’’అని కొందరు మహిళలు తమ నిర్ణయాన్ని సమరి్థంచుకున్నారు. ఒత్తిడే కారణమంటున్న నిపుణులు: సైద్ధాంతిక చర్చలను పక్కన పెడితే యువతులు పనిని విడిచిపెట్టడానికి లేదా సాదాసీదా జీవనశైలిని కోరుకోవడానికి గల సామాజిక, సాంస్కృతిక కారణాలపై చర్చలు మొదలయ్యాయి. చాలా మంది ఉద్యోగులు సంవత్సరానికి ఆరు వారాల సెలవు పొందుతారు. 1% కంటే తక్కువ మంది వారానికి 50 గంటల కంటే ఎక్కువ పని చేస్తారు. దీంతో పనిచేసే మహిళల్లో ఒత్తిడిపాళ్లు చాలా ఎక్కువగాఉంటున్నాయనితేలింది. ఇదే ‘సాఫ్ట్‌గాళ్’ట్రెండ్ వైపు వెళ్లడానికి కారణమవుతోందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ముఖ్యంగా జెన్ జెడ్ ఏజ్ గ్రూప్ (1997 నుంచి 2012 మధ్య జని్మంచిన) యువతులు కెరీర్లో లక్ష్యాల కంటే విశ్రాంతి వైపు దృష్టి పెడుతున్నారన్న వాదనలు ఎక్కువయ్యాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Video: విమానంలో కుదుపులు.. ఎగిరిపడ్డ ప్రయాణికులు
సాఫీగా వెళుతున్న విమానం ఒక్కసారిగా కుదుపులకు లోనవడంతో ప్రయాణికులు సీట్లలో నుంచి ఎగిరిపడ్డారు. స్వీడన్ నుంచి అమెరికాలోని మియామి వెళుతున్న విమానంలో ఈ ఘటన జరిగింది. దీంతో విమానాన్ని యూటర్న్ చేసుకొని తిరిగి యూరప్‌లో ల్యాండ్ చేశారు. విమానం కుదుపులకు లోనైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.స్కాండినేవియన్ ఎయిర్ లైనస్‌కు చెందిన విమానం 254 మంది ప్రయాణికులు, సిబ్బందితో కలిసి గురువారం మధ్యాహ్నం స్వీడన్ లోని స్టాక్ హోం నుంచి మధ్యాహ్నం 12:55 గంటలకు ఫ్లోరిడాలోని మయామీకి బయలుదేరింది. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 5:45 గంటలకు ఈ విమానం మయామీలో దిగాల్సి ఉంది. ఇంతలో మార్గమధ్యంలో ఎయిర్ టర్బులెన్స్ కారణంగా భారీ కుదుపులకు లోనైంది. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గట్టిగా కేకలు వేశారు. సీట్లలో నుంచి కొందరు ఎగిరిపడగా.. మరికొందరైతే ఏకంగా ఫ్లైట్ పైకప్పుకు గుద్దుకున్నారు.చేతుల్లో ఉన్న వస్తువులు, పైన పెట్టిన బ్యాగులు, ఎయిర్ హోస్టెస్‌లు తీసుకొస్తున్న ఆహార పదార్థాలన్నీ చెల్లాచెదురుగా పడ్డాయి. ఉన్నట్టుండి విమానం కుదుపులకు లోనవడంతో ఏదో ప్రమాదం జరుగుతోందని భావించి, తాము చనిపోబోతున్నామని ప్రయాణికులు ఆందోళన చెందారు. గమనించిన పైలట్ అప్రమత్తమయ్యాడు. వెంటనే విమానాన్ని వెనక్కి తిప్పి తిరిగి స్టాక్ హోమ్‌లో ల్యాండ్ చేశాడు. అయితే అదృష్టవశాత్తు ప్రయాణికులు, సిబ్బందిలో ఎవరికి ఎలాంటి తీవ్రమైన గాయాలు కాలేదని సంబంధిత స్కాండినేవియన్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి తెలిపారు. కాగా ప్రయాణీకులకు రాత్రిపూట హోటల్లో వసతి కల్పించామని, శుక్రవారం ఉదయం ఇతర విమానాలలో వియామికి వెళ్లేందుకు షెడ్యూల్ చేసినట్లు పేర్కొన్నారు.🚨 #BreakingNow A video from #SK957 cabin as extreme turbulence hit a SAS A330 over Greenland,throwing unbuckled passengers into the ceiling.This incident highlights how turbulence can occur without warning,making seatbelts essential for passenger safety. https://t.co/iYVA4IIUER pic.twitter.com/S4kCaKwnn0— Antony Ochieng,KE✈️ (@Turbinetraveler) November 15, 2024 -
Nobel Prize 2024: జన్యు నియంత్రణ గుట్టువిప్పిన శాస్త్రవేత్తలకు వైద్య నోబెల్
స్టాక్‌హోం: అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ పురస్కారాల సందడి మొదలైంది. 2024కు వైద్యశాస్త్రంలో నోబెల్ అవార్డును స్వీడన్‌లోని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ మెడికల్ వర్సిటీ సోమవారం ప్రకటించింది. జన్యు నియంత్రణకు సంబంధించిన మౌలిక వ్యవస్థ అయిన మైక్రో ఆర్ఎన్ఏను కనిపెట్టిన అమెరికా శాస్త్రవేత్తలు విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రువ్‌కున్‌లను నోబెల్ వరించింది. జన్యువులను, జీవక్రమాన్ని మైక్రో ఆర్ఎన్ఏ ఎలా ప్రభావితం చేస్తుంది, మొత్తంగా మనుషులతో పాటు ఇతర జీవజాలాన్ని ఎలా నియంత్రిస్తుందన్న అంశాలను వారి సంచలనాత్మక పరిశోధన లోతుగా పరిశోధించింది. జన్యు నియంత్రణకు సంబంధించి ఏకంగా సరికొత్త సూత్రాన్నే ఇది వెలుగులోకి తెచి్చందంటూ నోబెల్ కమిటీ ప్రశంసించింది. జీవుల ఎదుగుదల, పనితీరుకు సంబంధించిన మౌలికాంశాలను మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు వీలు కలి్పస్తుందని పేర్కొంది. ఈ పరిశోధన ఫలితాలు క్యాన్సర్ చికిత్సలో కొత్త ద్వారాలను తెరిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు లండన్ ఇంపీరియల్ కాలేజీలో మాలిక్యులార్ అంకాలజీ లెక్చరర్ డాక్టర్ క్లెయిరీ ఫ్లెచర్ వెల్లడించారు. చర్మ క్యాన్సర్ చికిత్సలో వీటి పనితీరుపై ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నట్టు ఆమె తెలిపారు. ‘‘ఈ పరిశోధనల ద్వారా జన్యువుల ప్రవర్తనను నియంత్రించేందుకు కొత్త మార్గం తెరుచుకుంది. తద్వారా పలు రకాల వ్యాధుల తీరుతెన్నులను ఎప్పటికప్పుడు కనిపెట్టడంతో పాటు చికిత్సకు కూడా వీలు కలుగుతుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న థెరపీల్లో చాలావరకు కణజాలంలోని ప్రొటీన్లను లక్ష్యంగా చేసుకున్నవే. అలాగాక మైక్రో ఆర్ఎన్ఏ స్థాయిలో జోక్యం చేసుకోగలిగితే జన్యువులను నేరుగా నియంత్రించవచ్చు. తద్వారా ప్రభావవంతమైన ఔషధాల అభివృద్ధికి కొత్త ద్వారాలు తెరుచుకుంటాయి’’ అని వివరించారు. ఆంబ్రోస్ ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్ మెడికల్ స్కూల్లో నాచురల్ సైన్స్ ప్రొఫెసర్. రువ్కున్ హార్వర్డ్ మెడికల్ స్కూల్లో జెనెటిక్స్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. బహుమతితో పాటు వారికి 10 లక్షల డాలర్ల నగదు పురస్కారం అందనుంది. నోబెల్ పురస్కారాల ప్రకటన అక్టోబర్ 14 దాకా కొనసాగనుంది. మంగళవారం ఫిజిక్స్, బుధవారం కెమిస్ట్రీ, గురువారం సాహిత్య నోబెల్ అవార్డులను ప్రకటిస్తారు. అక్టోబర్ 14న ఆర్థిక శాస్త్రంలో నోబెల్ ప్రకటన ఉంటుంది. విజేతలకు డిసెంబర్ 10న పురస్కారాలను ప్రదానం చేస్తారు.ఏమిటీ మైక్రో ఆర్ఎన్ఏ? ఆంబ్రోస్, రువ్కున్ కనిపెట్టిన ఈ మైక్రో ఆర్ఎన్ఏను సూక్ష్మ జన్యుపదార్థ సమూహంగా చెప్పవచ్చు. కణజాల స్థాయిలో జన్యువుల పనితీరును నియంత్రించడంలో, మార్చడంలో దీనిది కీలక పాత్ర. ఒకవిధంగా ఇది కణజాల స్విచ్చుగా పని చేస్తుంది. కణాలన్నింట్లోనూ ఉండేది ఒకలాంటి క్రోమోజోములే. అయినప్పటికీ జీవుల్లో నరాలుగా, కండరాలుగా వేటికవే ప్రత్యేక లక్షణాలతో ఈ కణాలు అభివృద్ధి చెందుతాయి. జీవ వికాసానికి అత్యంత కీలకమైన ఈ తేడాలకు జన్యు నియంత్రణే కారకంగా నిలుస్తుంది. డీఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏకు వెళ్లే జన్యు సమాచారం రూపంలో ఈ నియంత్రణ జరుగుతుందని ఆంబ్రోస్, రువ్కువ్ కనిపెట్టారు. ఈ సూక్ష్మ ఆర్ఎన్ఏ తాలూకు సంతులనంలో తేడాలే క్యాన్సర్ తదితర వ్యాధులకు కారణమని తేలింది. ‘‘కొన్ని కణాల్లో నిర్దిష్ట జన్యువు, లేదా జన్యువులు మరీ ఎక్కువగా పని చేయడమో, ఉత్పరివర్తనం చెందడమో వ్యాధిగా పరిణమిస్తుంది. సదరు జన్యు కార్యకలాపాన్ని మార్చగలిగే మైక్రో ఆర్ఎన్ఏను ఎంపిక చేసు కోవడం ద్వారా వ్యాధిగ్రస్త కణాల్లో ఉత్పరివర్తనాలను అరికట్టవచ్చు. మరోలా చెప్పాలంటే వ్యాధిని రూపుమాపవచ్చు’’ అని డాక్టర్ ఫ్లెచర్ వివరించారు. ఈ కోణంలో సూక్ష్మ ఆర్ఎన్ఏ ఉనికిని కనిపెట్టిన ఆంబ్రోస్, రువ్కున్ ఆవిష్కరణకు ఎనలేని ప్రాధాన్యముందన్నారు. -
మెడిసిన్‌లో విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రువ్‌కున్‌కు నోబెల్
2024 సంవత్సరానికిగానూ మెడిసిన్ విభాగంలో ఇద్దరికి నోబెల్ బహుమతి ప్రకటించారు. అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రువ్‌కున్‌లకు నోబెల్ బహుమతి దక్కింది. మైక్రోఆర్ఎన్ఏను ఆ ఇద్దరు శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. జీన్ రెగ్యులేషన్‌లో మైక్రో ఆర్ఎన్ఏ పాత్రను విశ్లేషించినందుకు ఆ ఇద్దరికి అవార్డును ప్రకటిస్తున్నట్లు నోబెల్ కమిటీ సోమవారం వెల్లడించింది.స్వీడెన్లోని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ మెడికల్ యూనివర్సిటీ నోబెల్ అసెంబ్లీ మెడిసిన్ లో విజేతను ప్రకటించింది. అవార్డు కింద 11 మిలియన్ల స్వీడిష్ క్రానర్(మిలియన్ అమెరికా డాలర్లు) బహుమతిగా అందిస్తారు. గతేడాది ఫిజియాలజీ, మెడిసిన్ విభాగంలో.. కొవిడ్-19 వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినందుకుగాను హంగేరియన్ శాస్త్రవేత్త కాటలిన్ కరికో , అమెరికాకు చెందిన డ్రూ వెయిస్మన్తకు నోబెల్ పురస్కారం వచ్చింది. BREAKING NEWSThe 2024 #NobelPrize in Physiology or Medicine has been awarded to Victor Ambros and Gary Ruvkun for the discovery of microRNA and its role in post-transcriptional gene regulation. pic.twitter.com/rg3iuN6pgY— The Nobel Prize (@NobelPrize) October 7, 2024వైద్యశాస్త్రంలో మొత్తంగా ఇప్పటివరకు నోబెల్ బహుమతిని 114 సార్లు ప్రకటించగా.. 227 మంది అందుకున్నారు. ఇందులో కేవలం 13 మంది మహిళలు మాత్రమే ఉన్నారు. కాగా ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక నోబెల్స్ బహుమతి విజేతల్లో ప్రతి ఏడాది ముందుగా మెడిసిన విభాగంలోనే ప్రకటిస్తారు. మంగళవారం భౌతికశాస్త్రం, బుధవారం రసాయనశాస్త్రం, గురువారం సాహిత్య విభాగాల్లో విజేతలను ప్రకటిస్తారు. శుక్రవారం రోజున నోబెల్ శాంతి బహుమతి, అక్టోబర్ 14న అర్థశాస్త్రంలో నోబెల్ గ్రహీతల పేర్లను వెల్లడిస్తారు.స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్త, ఇంజినీర్, వ్యాపారవేత్తగా పేరుగాంచిన ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించినవారికి ఈ అవార్డును ప్రదానం చేస్తారు. 1896లో ఆల్ఫ్రెడ్ నోబెల్ మరణించగా.. 1901 నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను ఏటా ప్రదానం చేస్తున్నారు. వీటిని ఆల్ఫ్రెడ్ జయంతి సందర్భంగా జ డిసెంబర్ 10న విజేతలకు బహుమతులు అందజేస్తారు. -
మూడు రెట్ల జీతం వచ్చే ఉద్యోగం.. మకాం మార్చాలా?: టెకీ ప్రశ్న
ఉద్యోగం చేస్తున్న చాలామంది ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగం వస్తే.. దాన్ని ఎంచుకుని ముందుకు సాగిపోతారు. అయితే ఇటీవల ఒక ఉద్యోగికి లక్షల జీతం లభించే ఉద్యోగం లభించినప్పటికీ.. ఓ సందేహం వచ్చింది. తన సందేహానికి సమాధానం కోరుతూ.. రెడ్డిట్‌లో పోస్ట్ చేశారు.నేను బెంగుళూరులో మెకానికల్ ఇంజనీర్, వయసు 31, పెళ్లయింది, ఇంకా పిల్లలు లేరు. నెలకు రూ.1.30 లక్షలు సంపాదిస్తున్నాను. ఇంటి అద్దె, తల్లితండ్రులకు డబ్బు పంపించిన తరువాత కూడా నాకు రూ. 50వేలు నుంచి రూ. 60వేలు మిగులుతుంది. అయితే ఇది ఈఎంఐ చెల్లించడానికి సరిపోతుంది. ఈఎంఐ ఇంకా సంవత్సరం పాటు చెప్పించాల్సి ఉంది.ఉద్యోగ జీవితం బాగానే ఉంది, ఆరోగ్య భీమాకు సంబంధించినవన్నీ కంపెనీ చూసుకుంటుంది. అయితే ఇటీవల నాకు స్వీడన్‌లోని హెల్సింగ్బోర్గ్లో నెలకు రూ.3.90 లక్షల జీతం పొందే ఆఫర్ వచ్చింది. నా స్వగ్రామంలో నా మీదనే ఆధారపడిన తల్లిదండ్రులు ఉన్నారు. వారికి నేను ఒక్కడినే సంతానం. కాబట్టి నేను ఇప్పుడు స్వీడన్‌కు వెళ్లి అక్కడే స్థిరపడాలా? లేదా ఇక్కడే ఉండి.. ఉన్న ఉద్యోగం చేసుకోవాలా? ఆర్థిక పరంగా ఎదగటానికి 4-5 సంవత్సరాలు స్వీడన్‌కు వెళ్లడం నా పరిస్థితికి సహాయపడుతుందా?.. దయచేసి ఎవరైనా సలహా ఇవ్వగలరా? అని రెడ్డిట్‌లో సలహా కోరారు.స్వీడన్ వెళ్లాలనుకుంటే.. మీరు ఒక్కరే కాకుండా, మీ భార్యను కూడా పని చేయడానికి ప్రేరేపించండి. లేకుంటే అక్కడ ఆమె ఒంటరిగా ఉండాల్సి వస్తుంది. సొంతంగా ఏదైనా చేయడానికి ప్రయత్నించేలా చేయండి. అక్కడ కొన్ని భాషా తరగతులకు హాజరయ్యేలా చూడండి అని ఒకరి రాశారు.స్వీడన్ మీరు అధిక సంపాదన కోసం వెళ్లే దేశం కాదు. మీరు ఒంటరిగా ఉండి, పొదుపుగా జీవిస్తే మీరు ఎక్కువ ఆదా చేసుకోవచ్చని మరొకరు అన్నారు. మీరు సన్యాసిలా జీవిస్తే మీ జీతంలో సగం వరకు ఆదా చేయవచ్చు, కానీ ప్రయోజనం ఏమిటి, అని ఇంకొకరు వ్యాఖ్యానించారు. ఉద్యోగం మారితే మరింత ఎక్కువ సంపాదించవచ్చని మరికొందరు సలహా ఇచ్చారు. -
అవును... అది యాపిల్ కోతల పండుగ!
ఏటా శరదృతువు ప్రారంభంలో యాపిల్ కోతల కాలంలో అక్కడ పండుగ జరుపుకొంటారు. ఊరంతా భారీస్థాయిలో యాపిల్పండ్ల ప్రదర్శనలు కనిపిస్తాయి. కూడళ్లలో యాపిల్పండ్లతో తీర్చిదిద్దిన కళాఖండాలు కనువిందు చేస్తాయి. ఈ విలక్షణమైన పండుగ స్వీడన్లో సిమ్రిషామ్ మునిసిపాలిటీ పరిధిలోని కివిక్ ప్రాంతంలో జరుగుతుంది. ‘కివిక్ యాపిల్ మార్కెట్ ఫెస్టివల్’గా పేరుపొందిన ఈ పండుగకు స్వీడన్ నలుమూలల నుంచే కాకుండా, యూరోప్‌లోని పలు ఇతర దేశాల నుంచి కూడా జనాలు పెద్దసంఖ్యలో వస్తుంటారు.యాపిల్ కోతల పండుగ రోజుల్లో కివిక్ ప్రాంతంలోని పిల్లా పెద్దా అందరూ యాపిల్ తోటల్లోకి, శివార్లలోని చిట్టడవుల్లోకి వెళ్లి యాపిల్‌పండ్లను కోసుకొస్తారు. యాపిల్ బుట్టలు మోసుకుంటూ, సంప్రదాయ నృత్య సంగీతాల నడుమ ఊరేగింపులు జరుపుతారు. యాపిల్ విస్తారంగా పండే కివిక్ను ‘యాపిల్ కేపిటల్ ఆఫ్ స్వీడన్’ అని కూడా అంటారు. ఇక్కడి నుంచి రకరకాల యాపిల్‌పండ్లు పెద్ద ఎత్తున విదేశాలకు ఎగుమతి అవుతుంటాయి.కివిక్లో జరిగే యాపిల్ పండుగను చూడటానికే కాకుండా, ఇక్కడి పురాతన రాతియుగం నాటి ఆనవాళ్లను, కాంస్యయుగానికి చెందిన మూడువేల ఏళ్ల నాటి శ్మశాన వాటికను, అందులోని ఆనాటి రాజు సమాధిని చూడటానికి కూడా పర్యాటకులు వస్తుంటారు. పర్యాటకులను మరింత ఆకట్టుకునేందుకు సిమ్రిషాన్ స్థానిక పరిపాలనా సంస్థ 1988 నుంచి ఇక్కడ యాపిల్ పండుగను వార్షిక వేడుకగా నిర్వహించడం ప్రారంభించింది. యాపిల్ పండుగ సందర్భంగా ఊళ్లో ఏర్పాటు చేసిన బహిరంగ వేదికలపై పలు సాంస్కృతిక కార్యక్రమాలు, కళా ప్రదర్శనలు జరుగుతాయి. ఈ ఏడాది యాపిల్ పండుగ వేడుకలు సెప్టెంబర్ 28న మొదలయ్యాయి. ఈ వేడుకలు అక్టోబర్ 6 నాటితో ముగుస్తాయి. -
స్వీడన్ చేతిలో భారత్ ఆరో‘సారీ’
స్టాక్‌హోమ్: అగ్రశ్రేణి క్రీడాకారులు సుమిత్ నగాల్, యూకీ బాంబ్రీ లేకుండానే డేవిస్‌కప్ ప్రపంచ టీమ్ టెన్నిస్ వరల్డ్ గ్రూప్–1లో పోటీపడ్డ భారత జట్టుకు నిరాశాజనక ఫలితం ఎదురైంది. స్వీడన్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారతజట్టు 0–4తో ఓడిపోయింది. డేవిస్‌కప్ టోర్నీ చరిత్రలో స్వీడన్ జట్టు చేతిలో భారత జట్టుకిది వరుసగా ఆరో పరాజయం కావడం గమనార్హం. స్వీడన్‌తో పోటీపడ్డ ఆరుసార్లూ భారత జట్టు ఓడిపోయింది. ఈసారి మాత్రం భారత ఆటగాళ్లు నాలుగు మ్యాచ్‌లు ఆడినా కనీసం ఒక్క సెట్ కూడా గెలవలేకపోయారు. తొలి రోజు శనివారం రెండు సింగిల్స్ మ్యాచ్‌ల్లో భారత క్రీడాకారులు ఓడిపోయారు. ఫలితంగా తదుపరి దశకు అర్హత పొందాలంటే ఆదివారం మూడు మ్యాచ్‌ల్లోనూ (డబుల్స్, రెండు రివర్స్ సింగిల్స్) భారత ప్లేయర్లు తప్పనిసరిగా గెలవాలి. అయితే డబుల్స్ మ్యాచ్‌లో శ్రీరామ్ బాలాజీ–రామ్‌కుమార్ రామనాథన్ జోడీ 3–6, 4–6తో ఆండ్రీ గొరాన్సన్–ఫిలిప్ బెర్గెవి జంట చేతిలో ఓటమి పాలైంది. దాంతో స్వీడన్ జట్టు 3–0తో విజయాన్ని ఖరారు చేసుకొని వరల్డ్ గ్రూప్ క్వాలిఫయర్స్‌కు అర్హత పొందింది. ఫలితం తేలిపోవడంతో నాలుగో మ్యాచ్‌గా జరిగిన నామమాత్రమైన సింగిల్స్‌లో జాతీయ మాజీ చాంపియన్ సిద్ధార్థ్ విశ్వకర్మను బరిలోకి దించారు. డేవిస్‌కప్‌లో తొలిసారి భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్ధార్థ్ 2–6, 2–6తో ఇలియాస్ యామెర్ చేతిలో ఓడిపోయాడు. ఈ పరాజయంతో భారత జట్టు వచ్చే ఏడాది డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్–1లో చోటు సంపాదించేందుకు ప్లే ఆఫ్ దశ మ్యాచ్‌లు ఆడుతుంది. -
Health: మాయ ‘తెర’కు పరిమితులు..
‘చిన్నీ.... పడుకో...’‘ఫైవ్ మినిట్స్ మమ్మీ...’‘ఫైవ్ మినిట్స్ అంటావు....గంటలకొద్దీ ఫోన్లో గేమ్స్ ఆడుతుంటావు. త్వరగా లేవడానికి మాత్రం ఏడుస్తుంటావు’.....ఇలాంటి మాటలు ఎన్నో ఇండ్లలో వినిపిస్తుంటాయి.సాధారణంగా పెద్దవాళ్లు ‘నిద్రలేమి’ సమస్యను ఎదుర్కుంటారు. అయితే స్వీడన్లో మాత్రం పిల్లలు కూడా ‘నిద్రలేమి’కి గురవుతున్నారు. దీనికి కారణం వారు ఎక్కువ సమయం డిజిటల్ మీడియా, టీవీల ముందు గడపడమే. దీన్ని దృష్టిలో పెట్టుకొని స్వీడన్ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ పిల్లల స్క్రీన్ టైమ్‌కు సంబంధించి తల్లిదండ్రులు పరిమితులు విధించాలని సూచించింది. రెండు నుంచి అయిదు సంవత్సరాల మధ్య పిల్లలు రోజుకు ఒక గంట, ఆరు నుంచి పన్నెండేళ్ల వయసు మధ్య ఉన్న పిల్లలు గంట లేదా అంతకంటే కొంచెం ఎక్కువ ‘స్క్రీన్టైమ్’ ఉండేలా చూసుకోవాలన్నారు.ఎక్కువ సమయం స్క్రీన్ ముందు గడపం అనేది పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఈ నేపథ్యంలో వారి స్క్రీన్ టైమ్‌పై పరిమితులు విధించడం తప్పనిసరి అంటుంది స్వీడన్ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ. స్వీడన్ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ మార్గదర్శకాలు స్క్రీన్ టైమ్ తగ్గించడానికే కాదు పిల్లల అలవాట్లలో మార్పు తేవడానికి ఉద్దేశించినవి కూడా. ‘బెటర్ స్లీప్ హైజీన్’లో భాగంగా రాత్రి సమయంలో పిల్లల బెడ్రూమ్లో ఫోన్లు, ట్యాబ్లాంటివి దూరంగా పెట్టాలని ఏజెన్సీ తల్లిదండ్రులకు సూచించింది.స్వీడన్ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ గణాంకాల ప్రకారం పదమూడు నుంచి పదహారు సంవత్సరాల మధ్య వయసు వారు ఆరు లేదా అంతకంటే ఎక్కువ సమయం స్క్రీన్ల ముందు గడుపుతున్నారు. దీని వల్ల ఫ్యామిలీ ఇంటక్షరాక్షన్, ఫిజికల్ యాక్టివిటీలకు దూరం కావడమే కాదు ‘నిద్రలేమి’ ‘డిప్రెషన్’...మొదలైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కుంటున్నారు.పిల్లలు ఎక్కువ సమయం స్క్రీన్ ముందు గడపడం అనేది మన దేశంలోనూ పెద్ద సమస్యగా మారింది. ‘అధిక స్క్రీన్ టైమ్’ వల్ల కలిగే నష్టాలను పిల్లలకు అర్థమయ్యేలా చెబితే ఫలితం ఉంటుందని చెబుతున్నారు వైద్య నిపుణులు. -
భారత జట్టుకు ఎదురుదెబ్బ.. నంబర్ వన్ ప్లేయర్ దూరం
స్వీడన్‌తో ఈనెల 14, 15వ తేదీల్లో జరిగే డేవిస్ కప్ టీమ్ టెన్నిస్ మ్యాచ్‌కు భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్ దూరమయ్యాడు. వెన్నెముక గాయంతో సతమతమవుతున్న అతను ఈ ఏడాది వరుసగా రెండోసారి డేవిస్ కప్ టోర్నీకి గైర్హాజరు కానున్నాడు. పాకిస్తాన్లో ఫిబ్రవరిలో జరిగిన ఈవెంట్లోనూ అతను బరిలోకి దిగలేదు. దీంతో రిజర్వ్ ప్లేయర్‌గా ఉన్న ఆర్యన్ షాను ప్రధాన జట్టులోకి తీసుకున్నారు. అదే విధంగా.. మానస్ ధామ్నేను స్టాండ్‌బై ప్లేయర్‌గా ఎంపిక చేశారు. కాగా స్టాక్‌హోమ్‌లో జరిగే వరల్డ్ గ్రూప్–1 పోరులో ఆతిథ్య స్వీడన్‌తో భారత్ తలపడుతుంది. ఇదివరకే అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) భారత జట్టును ప్రకటించింది. జాతీయ మాజీ చాంపియన్ అశుతోష్ సింగ్‌ను కోచ్‌గా నియమించింది. అందుకే దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా‘స్వీడన్‌తో జరిగే పోరుకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలని భావించాను. కానీ దురదృష్టవశాత్తూ కొన్ని వారాలుగా వెన్నునొప్పి బాధిస్తోంది. దీంతో డాక్టర్లు కనీసం రెండు వారాల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఇలాంటి పరిస్థితుల్లో సన్నద్ధమయ్యేందుకు సరైన సమయంలేదు. కాబట్టే స్వీడన్ ఈవెంట్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. ఇటీవల యూఎస్ ఓపెన్ ఆడుతున్నప్పుడు కూడా వెన్ను సమస్య వేధించింది. ఏదేమైనా డేవిస్ కప్ టోర్నీకి దూరమవడం చాలా బాధగా ఉంది. ఆ టోర్నీలో ఆడబోయే జట్టు రాణించాలని ఆకాంక్షిస్తున్నా’ అని నగాల్ సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చాడు. -
స్వీడన్‌ను వీడి స్వదేశానికి
స్వీడన్.. ఐరోపాలో ఐదో పెద్ద దేశం. అందమైన ప్రకృతి దృశ్యాలు, ప్రత్యేకమైన సంస్కృతి. అయినప్పటికీ చాలామంది భారతీయులు స్వీడన్‌ను వీడి స్వదేశానికి వచ్చేస్తున్నారు. ఇలా వస్తున్న వారి సంఖ్య 2024లో జనవరి–జూన్ మధ్య ఏకంగా 171% పెరగడం విశేషం! 1998 తర్వాత ఇంత భారీగా భారతీయులు స్వీడన్ వీడి రావడం ఇదే తొలిసారి. ఇందుకు కారణాలను తెలుపుతూ స్వీడన్లో ఉంటున్న భారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్, స్వీడన్–ఇండియా బిజినెస్ కౌన్సిల్ సీఈఓ అంకుర్ త్యాగి చేసిన పోస్టు వైరల్‌గా మారింది. సామాజిక అనైక్యత... స్వీడన్లో సాంస్కృతిక, భాషా అవరోధాల వల్ల స్థానికులతో భారతీయులు సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకోలేకపోతున్నారు. స్వదే శంలో ఉండగా బాగా అలవాటైన బలమైన సామాజిక బంధాలను కోల్పోతున్నారు. స్వీడిష్ సమాజంలో పూర్తిగా కలిసిపోలేకపోతున్నారు. ఒంటరితనం, స్నేహితుల లేమివ వంటివి వారిని కుంగదీస్తున్నాయి. వృద్ధులైన తల్లిదండ్రులకు తోడుగా, కుటుంబానికి దగ్గరగా ఉండటానికి తిరిగి వచ్చేస్తున్నారు. కఠినమైన స్వీడిష్ వాతావరణం, అధిక జీవన వ్యయం కూడా ముఖ్యమైన సమస్యలే. సాంస్కృతిక సవాళ్లు... స్వీడన్లో భారతీయ నిపుణుల జీవిత భాగస్వాములూ అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. అర్హతలు, పని అనుభవం ఉన్నా స్వీడిష్ భాషా నైపుణ్యాలు లేకపోవడం వల్ల చాలామందికి ఉద్యోగాలు రావడం లేదు. సరీ్వస్ అపార్ట్మెంట్ల కొరతతో వసతి కూడా సమస్యగా మారుతోంది. వీటికి తోడు భారత్ అభివృద్ధి పథంలో దూసుకుపోతుండటంతో అక్కడ అవకాశాలు అపారంగా పెరుగుతుండటమూ మనవాళ్లు స్వదేశీ బాట పట్టేందుకు ప్రధాన కారణమని త్యాగి పేర్కొన్నారు. నిపుణులకు భారత్‌లో మెరుగైన అవకాశాలు, మంచి వేతనాలు, ఉత్తేజకరమైన కెరీర్ ఉంటున్నట్టు చెప్పుకొచ్చారు. కొవిడ్ తర్వాత... కొవిడ్ మహమ్మారి అనంతరం పలు రంగాల్లో ఎక్కడి నుంచైనా పని చేయడానికి వీలుండటం కూడా మనవాళ్లు స్వీడన్ వీడేందుకు కారణంగా మారుతోంది. భారత్‌కు తిరిగి వచ్చి ఇక్కడినుంచే పలు అంతర్జాతీయ సంస్థల్లో పనిచేస్తున్నారు. తమ దేశానికి వలసలను తగ్గించే ప్రయత్నంలో భాగంగా విదేశాల్లో జని్మంచిన స్వీడిష్ పౌరులు దేశం విడిచి వెళ్ళడానికి స్వీడిష్ ప్రభుత్వం డబ్బు చెల్లిస్తోంది. స్వచ్ఛంద నిష్క్రమణ పథకం కింద ప్రస్తుతం 10,000 స్వీడిష్ క్రౌన్లు (సుమారు 960 డాలర్లు), వారు దేశం విడిచి వెళ్ళడానికి ప్రయాణ ఖర్చులను అందిస్తోంది. ఇది కూడా ఓ కారణమై ఉంటుందని, అయితే దేనిని అంచనా వేయాలన్నా ఏడాదిపాటు వలసలను అధ్యయనం చేయాలని స్వీడన్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ సీఈఓ, సెక్రటరీ జనరల్ రాబిన్ సుఖియా చెబుతున్నారు.గత ఆర్నెల్లలో 2,461 మంది వెళ్లారు! నిజానికి స్వీడన్‌కు వెళ్లే భారతీయుల సంఖ్య తక్కువేమీ కాదు. 2024లో ఇప్పటిదాకా స్వీడన్‌కు వలస వెళ్లినవారిలో ఉక్రేనియన్ల తరువాత ఎక్కువమంది భారతీయులే. గత జనవరి నుంచి జూన్ దాకా 2,461 మంది మనవాళ్లు స్వీడన్ బాటపట్టారు. అయితే గత ఆరేళ్లతో పోలిస్తే ఇది చాలా తక్కువ. 2020, 2021 కోవిడ్ సంవత్సరాలను మినహాయిస్తే 2017–2024 మధ్య ఒక ఏడాదిలో ఇంత తక్కువ సంఖ్యలో భారతీయులు స్వీడన్ వెళ్లడం ఇదే తొలిసారి. – న్యూఢిల్లీ -
వన్స్‌మోర్... వరల్డ్ రికార్డు
సిలెసియా (పోలాండ్): క్రీడాకారులెవరైనా ఒకసారి ప్రపంచ రికార్డు సృష్టిస్తేనే ఎంతో గొప్ప ఘనతగా భావిస్తారు. రెండుసార్లు బద్దలు కొడితే అద్భుతం అనుకుంటారు... మూడుసార్లు వరల్డ్ రికార్డు నెలకొలి్పతే అసాధారణం అనుకుంటారు... మరి 10 సార్లు ప్రపంచ రికార్డులను సవరించిన వారిని ఏమనాలి...! ప్రస్తుతానికి మోండో డుప్లాంటిస్ అని అనాల్సిందే. వరల్డ్ రికార్డులు తన చిరునామాగా మలుచుకొని... ప్రపంచ రికార్డులు సృష్టించడం ఇంత సులువా అన్నట్లు స్వీడన్ పోల్‌వాల్టర్ మోండో డుప్లాంటిస్ చెలరేగిపోతున్నాడు. మూడు వారాల క్రితం పారిస్ ఒలింపిక్స్‌లో తొమ్మిదోసారి తన పేరిటే ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన డుప్లాంటిస్... తాజాగా పోలాండ్‌లో జరిగిన డైమండ్ లీగ్ మీట్లో 10వసారి వరల్డ్ రికార్డును నెలకొల్పాడు. తన రెండో ప్రయత్నంలో డుప్లాంటిస్ 6.26 మీటర్ల ఎత్తును దాటేసి కొత్త ప్రపంచ రికార్డును లిఖించాడు. ఈ క్రమంలో పారిస్ ఒలింపిక్స్‌లో 6.25 మీటర్లతో తానే సృష్టించిన వరల్డ్ రికార్డును డుప్లాంటిస్ సవరించాడు. ప్రపంచ రికార్డు సృష్టించినందుకు డుప్లాంటిస్కు 50 వేల డాలర్ల ప్రైజ్‌మనీ లభించింది. మరోవైపు ఇదే మీట్లో నార్వేకు చెందిన జాకబ్ ఇంగెబ్రింగ్స్టెన్ పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో కొత్త ప్రపంచ రికార్డును సృష్టించాడు. ఇంగెబ్రింగ్స్టెన్ 7 నిమిషాల 17.55 సెకన్లలో గమ్యానికి చేరాడు. ఈ క్రమంలో 1996లో కెన్యా అథ్లెట్ డేనియల్ కోమెన్ (7 నిమిషాల 20.67 సెకన్లు) నెలకొలి్పన వరల్డ్ రికార్డు తెరమరుగైంది. ప్రపంచ రికార్డు సృష్టించినందుకు జాకబ్‌కు కూడా 50 వేల డాలర్ల ప్రైజ్‌మనీ అందించారు. -
భారత డేవిస్ కప్ జట్టులో నగాల్
న్యూఢిల్లీ: భారత సింగిల్స్ టాప్‌స్టార్ సుమిత్ నగాల్ తిరిగి డేవిస్ కప్ జట్టులోకి వచ్చేశాడు. వరల్డ్ గ్రూప్–1 పోరులో భాగంగా భారత్ వచ్చే నెల స్వీడన్‌తో తలపడనుంది. సెపె్టంబర్ 14, 15 తేదీల్లో స్టాక్‌హోమ్‌లోని ఇండోర్ హార్డ్ కోర్ట్ వేదికపై జరిగే ఈ పోటీలకు డబుల్స్ స్టార్ యూకీ బాంబ్రీ దూరమయ్యాడు. ఈ ఏడాది ఆరంభంలో నగాల్... ఇస్లామాబాద్‌లో పాకిస్తాన్‌తో జరిగిన డేవిస్ కప్ పోరుకు దూరంగా ఉన్నాడు. అక్కడ గ్రాస్కోర్ట్పై అనాసక్తి కనబరిచిన సుమిత్ ఇప్పుడు హార్డ్‌కోర్ట్‌లో జరిగే పోటీలకు అందుబాటులోకి వచ్చాడు. భారత టాప్–3 ప్లేయర్, ప్రపంచ 476 ర్యాంకర్ శశికుమార్ ముకుంద్‌పై రెండు ‘టై’ల సస్పెన్షన్ ఉండటంతో అతన్ని ఎంపిక చేయలేదు. వరుసగా డేవిస్ కప్ టోరీ్నలకు గైర్హాజరు అవుతుండటంతో అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) ఈ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం సమావేశమైన ఐటా సెలక్షన్ కమిటీ సుమిత్ నగాల్, రామ్‌కుమార్ రామనాథన్, శ్రీరామ్ బాలాజీ, నికీ పునాచా, సిద్ధార్థ్ విశ్వకర్మలను ఎంపిక చేసింది. రోహిత్ రాజ్‌పాల్ కెప్టెన్‌గా వ్యవహరించే ఈ జట్టుకు ఆర్యన్ షా రిజర్వ్ ప్లేయర్‌గా ఉంటాడు. యూకీ అందుబాటులో లేకపోవడంతో రామ్‌కుమార్ సింగిల్స్‌తో పాటు డబుల్స్‌లోనూ బరిలోకి దిగుతాడు. యూకీ తన గైర్హాజరుకు గల కారణాలు బయటికి వెల్లడించనప్పటికీ... పారిస్ ఒలింపిక్స్‌కు రోహన్ బోపన్నకు జోడీగా తనను పంపకపోవడంపై కినుక వహించినట్లు తెలిసింది. అయితే ఇందులో ‘ఐటా’ చేసిందేమీ లేదని వెటరన్ స్టార్ బోపన్న తన భాగస్వామిగా శ్రీరామ్ బాలాజీని ఎంచుకోవడంతో అతన్నే పంపాల్సివచ్చిందని ఐటా వర్గాలు వెల్లడించాయి. జీషాన్ అలీ కోచ్ పదవి నుంచి తప్పుకోవడంతో మాజీ ఢిల్లీ ప్లేయర్ అశుతోశ్ సింగ్‌కు కోచింగ్ బాధ్యతలు అప్పగించే అవకాశముంది.బాలచంద్రన్ పేరు కూడా పరిశీలనలో ఉన్నప్పటికీ ఐటా సెలక్షన్ కమిటీ అశుతోశ్ వైపు మొగ్గుచూపుతోంది. ప్రస్తుతానికి భారత డేవిస్ కప్ జట్టును ఎంపిక చేశామని కోచ్‌పై తుది నిర్ణయం తీసుకోలేదని ఐటా కార్యదర్శి అనిల్ ధూపర్ తెలిపారు. -
ఆఫ్రికా దేశాల్లో ఆరోగ్య అత్యవసర పరిస్థితి
సిడ్నీ: ప్రాణాంతక మంకీపాక్స్ (ఎంపాక్స్) ఆఫ్రికా దేశాలను వణికిస్తోంది. కాంగోలో 450 మందిని పొట్టనబెట్టుకున్న ఈ వ్యాధి ఇతర దేశాలకు వేగంగా వ్యాప్తి చెందుతోంది. మధ్య, తూర్పు ఆఫ్రికా దేశాల్లో ఎంపాక్స్ విస్తరణ పెరుగుతున్నట్లు అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. ఆయా దేశాల్లో ఆరోగ్య అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు ప్రకటించింది. యూరప్ దేశమైన స్వీడన్‌లోనూ ఒక ఎంపాక్స్ కేసు వెలుగులోకి వచ్చింది! దీని వ్యాప్తిని అడ్డకోవడానికి ప్రపంచ దేశాలన్నీ కలిసి పనిచేయాలని డబ్ల్యూహెచ్ఓ పిలుపునిచ్చింది. ఎంపాక్స్‌లో క్లేడ్–2 కంటే క్లేడ్–1 ప్రమాదకరం. గత సెపె్టంబర్లో క్లేడ్–2బీ వేరియంట్ పుట్టుకొచి్చంది. ఎంపాక్స్ సోకితే ఫ్లూ తరహా లక్షణాలు కనిపిస్తాయి. కాళ్లు, చేతులపై కురుపులు, పుండ్లు ఏర్పడతాయి. బాధితులతో లైంగిక సంబంధాలు, దగ్గరగా వెళ్లడం, శ్వాస పీల్చడం వల్ల వైరస్ సోకుతుంది. ప్రతి 100 కేసుల్లో కనీసం నలుగురు మరణించే ప్రమాదముంది. ఎంపాక్స్ నియంత్రణకు వ్యాక్సిన్ వచి్చనా అది పరిమితంగానే లభిస్తోంది. కాంగో, బురుండి, కెన్యా, రువాండాలకు వ్యాపించింది. ఎంపాక్స్‌ను ఇంకా మహమ్మారిగా ప్రకటించలేదు. -
ఇంటి స్థలం చదరపు మీటర్‌కు 8 రూపాయలే..
భూములు, స్థలాల విలువలు అడ్డగోలుగా పెరిగిపోయాయి. కనీసం వంద గజాల ఇంటి స్థలం కొనాలన్నా.. లక్షలకు లక్షలు కావాల్సిందే. కానీ ఒక చోట మాత్రం ఇంటి స్థలాన్ని చదరపు మీటర్‌కు ఎనిమిది రూపాయల లోపు ధరకే అమ్ముతున్నారు. అంటే రూ.800 పెడితే చాలు.. ఇంటి స్థలం వచ్చేస్తుందన్న మాట. కాకపోతే అలా కొనుక్కోవడానికి మనం స్వీడన్ దాకా వెళ్లాల్సి వస్తుంది మరి. స్వీడన్‌లోని గోటెన్ నగర అధికారులు ఇలా ఇళ్ల స్థలాలను అమ్మకానికి పెట్టారు. స్వీడన్ రాజధాని స్టాక్ హోమ్‌కు 321 కిలోమీటర్ల దూరంలో ఈ సిటీ ఉంటుంది. పాపులేషన్ తగ్గడం, ఆర్థిక సమస్యలతో.. స్వీడన్‌లోని రూరల్ ప్రాంతమైన గోటెన్ సిటీలో సుమారు 13 వేల మంది నివసిస్తుంటారు. ఇటీవల అక్కడ పాపులేషన్ తగ్గడానికి తోడు సిటీకి కాస్త ఆర్థిక సమస్యలు మొదలయ్యాయి. దీనితో హౌజింగ్ మార్కెట్‌కు డిమాండ్ పెంచడం కోసం అతి తక్కువ ధరకే ఇళ్ల స్థలా లను అమ్మకానికి పెట్టినట్టు గోటెన్ సిటీ మేయర్ జోహన్ మాన్సన్ ప్రకటించారు. ఒక చదరపు మీటరుకు ఒక క్రోనా రేటుతో.. మన కరెన్సీలో రూ.7.86 రేటుతో 29 ప్లాట్లను విక్రయించనున్నట్టు తెలిపారు. -
Davis Cup 2024: భారత్ ప్రత్యర్థి స్వీడన్
న్యూఢిల్లీ: డేవిస్‌కప్ పురుషుల టీమ్ టెన్నిస్ చాంపియన్‌షిప్ వరల్డ్ గ్రూప్–1 పోటీల ‘డ్రా’ను గురువారం విడుదల చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ 13 నుంచి 15 మధ్య వివిధ దేశాల్లో ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. భారత జట్టుకు స్వీడన్ జట్టు రూపంలో క్లిష్టమైన ప్రత్యర్థి ఎదురైంది. స్వీడన్ వేదికగా ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇప్పటి వరకు స్వీడన్‌తో ఐదుసార్లు తలపడిన భారత్ ఒక్కసారి కూడా గెలవలేకపోయింది. పోరాడి ఓడిన సహజ సాక్షి, హైదరాబాద్: ముంబై ఓపెన్ డబ్ల్యూటీఏ– 125 టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్ క్రీడాకారిణి, భారత రెండో ర్యాంకర్ సహజ యామలపల్లి పోరాటం ముగిసింది. ముంబైలో గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 336వ ర్యాంకర్ సహజ 6–1, 3–6, 5–7తో ప్రపంచ 162వ ర్యాంకర్ పొలీనా కుదెర్మెతోవా (రష్యా) చేతిలో ఓడిపోయింది. గంటా 58 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సహజ ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత్‌కే చెందిన రుతుజా 6–7 (6/8), 6–2, 1–6తో కేటీ వోలినెట్స్ (అమెరికా) చేతిలో పరాజయం పాలైంది. -
నాటోలో స్వీడన్ చేరికకు తుర్కియే ఆమోదం
అంకారా: నాటోలో స్వీడన్ సభ్యత్వానికి తుర్కియే గురువారం అధికారికంగా ఆమోదం తెలిపింది. హంగేరీ కూడా ఓకే చెబితే నార్డిక్ దేశం స్వీడన్ నాటో దేశంగా మారిపోనుంది. ఏడాదిన్నరగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రతిపాదనకు తుర్కియే పార్లమెంట్ మంగళవారం ఆమోదం తెలిపింది. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర నేపథ్యంలో ఫిన్లాండ్, స్వీడన్ నాటో సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నాయి. నాటో సభ్యదేశమైన తుర్కియే ఫిన్లాండ్ సభ్యత్వానికి మాత్రమే సమ్మతం తెలిపింది. స్వీడన్ సభ్యత్వంపై అభ్యంతరం తెలుపుతూ వస్తోంది. వాటికి కూడా తగు పరిష్కారం దొరకడంతో తాజాగా ఆమోదం తెలిపింది. ఇక, నాటోలో స్వీడన్ చేరికపై హంగరీ పార్లమెంట్లో ఫిబ్రవరి ఆఖరులో చర్చించొచ్చని భావిస్తున్నారు. -
ఫిన్లాండ్, స్వీడన్లో రికార్డు స్థాయి చలి
స్టాక్‌హోమ్: నార్డిక్ దేశాలైన నార్వే, స్వీడన్, ఫిన్లాండ్లను చలి వణికిస్తోంది. 25 ఏళ్ల తర్వాత స్వీడన్, ఫిన్లాండ్ దేశాల్లో ఉష్ణోగ్రతలు ఏకంగా మైనస్ 40 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి. ఎముకలు కొరికే చలికి తోడు దట్టమైన మంచు కురుస్తుండటంతో మూడు దేశాల్లోనూ రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. స్వీడన్‌లోని ఉత్తరప్రాంతంలో ఉష్ణోగ్రతలు 1999 తర్వాత –43.6 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవడం ఇదే మొదటిసారని వాతావరణ శాఖ తెలిపింది. 1951లో, తిరిగి 1999లోనూ –49 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు గుర్తు చేసింది. పొరుగునే ఉన్న ఫిన్లాండ్లోని వైలివియెస్కాలో ఉష్ణోగ్రత మంగళవారం –37.8 డిగ్రీలుగా నమోదైంది. -
అతి పెద్ద కలప గాలిమర!
క్రిస్మస్ పర్వదినం రోజున వెలుగులు విరజిమ్మే క్రిస్మస్ చెట్టు గురించి మనందరికీ తెలుసు. కేవలం ఆ చెట్టు కలపను వాడి ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గాలి మర (విండ్ టర్బైన్ టవర్)ను తయారు చేశారంటే నమ్మగలరా?. కానీ ఇది నిజంగానే స్వీడన్లో ఉంది. గోథన్బర్గ్ నగర శివారులో పెనుగాలుల నడుమ కూడా ఠీవిగా నుంచుని విద్యుదుత్పత్తి చేస్తూ 400 ఇళ్లలో వెలుగులు నింపుతోంది! 492 అడుగుల ఎత్తయిన ఈ గాలిమరను పూర్తిగా కలపతోనే నిర్మించడం విశేషం. కలపతో తయారైన అత్యంత ఎత్తయిన విండ్ టర్బైన్ టవర్ ఇదే. క్రిస్మస్ ట్రీగా పరిచితమైన స్ప్రూస్ జాతి చెట్టు కలపను దీని నిర్మాణంలో వాడారు. దాని కలప అతి తేలికైనది, అత్యంత దృఢమైనది. ‘‘విండ్ టర్బైన్ టవర్ల నిర్మాణంలో ఉక్కును వాడతారు. కానీ అత్యంత ఎత్తైన టవర్ల తయారీ, తరలింపు, నిర్వహణ కష్టం. స్టీల్ ముక్కలను చిన్న భాగాలుగా చాలా నట్లతో బిగించాలి. తుప్పు పట్టకుండా చూడాలి. స్టీల్ భాగాల తయారీకి వేల గంటలపాటు ఫర్నేస్‌ను మండించాలి. భారీగా కర్బన ఉద్గారాలు వెలువడతాయి. కానీ చెక్క టవర్ తయారీ చాలా సులువు. తరలింపు సమస్యలుండవు. పర్యావరణహితం కూడా. క్రిస్మస్ ట్రీ తయారీకి చెట్టు పై భాగాన్ని నరకగా వచ్చే కలపనే వాడుతాం. కనుక అటవీ విధ్వంసమన్న మాటే లేదు. ఉక్కుతో పోలిస్తే చెక్కతో అతి తక్కువ శ్రమతో చాలా ఎక్కువ టవర్లను నిర్మించవచ్చు’’ అని దీన్ని తయారు చేసిన స్వీడన్ అంకుర సంస్థ మోడ్వియన్ తెలిపింది. ‘‘ఏటా 20,000 ఉక్కు టర్బైన్లను నిర్మిస్తున్నారు. వచ్చే పదేళ్లలో ఏటా 10 శాతమైనా చెక్క టవర్ల ఏర్పాటుకు కృషి చేస్తున్నాం’’ అంటోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సరికొత్త అధ్యాయానికి నాంది.. ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్రత్యేకం!
Sweden Electrified Road: ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం విపరీతంగా పెరుగుతోంది. కొన్ని దేశాల్లో ఇప్పటికీ ఎదురవుతున్న ఛార్జింగ్ సమస్యల దృష్ట్యా కొందరు ఫ్యూయల్ వాహనాలనే ఎంచుకుంటున్నారు. భారతదేశంలో ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వాలు రంగంలోకి దిగి, సంబంధిత సంస్థలకు ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి. అయితే స్వీడన్ ఈ సమస్యకు కొత్త టెక్నాలజీతో చెక్ పెద్దటానికి సిద్ధమైంది. సాధారణంగా ఎలక్ట్రిక్ వాహనాలకు ఎప్పటికప్పుడు ఛార్జింగ్ వేసుకుంటూ ఉండాలి, ఛార్జింగ్ తగ్గితే గమ్యాన్ని చేరుకోలేము. కాబట్టి ముందుగానే ఫుల్ ఛార్జింగ్ చేసుకుని, దాని రేంజ్ ఎంతో.. అంత దూరం ప్రయాణించడానికి ప్లాన్ వేసుకోవాలి. ఇంకా ముందుకు వెళ్లాలంటే మళ్ళీ ఛార్జింగ్ వేసుకోక తప్పదు. తద్వారా ప్రయాణికులు కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంది. ఇదీ చదవండి: రూ.1200 సంపాదనతో మొదలై.. రూ.9800 కోట్ల కంపెనీ నడిపిస్తోంది! ఎవరీ గజల్ అలఘ్.. ఇప్పుడు స్వీడన్, ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్రత్యేకంగా 'ఎలక్ట్రిఫైడ్ రోడ్స్' నిర్మిస్తోంది. వీటి ద్వారా కారు నడుస్తున్నప్పుడు లేదా ప్రయాణిస్తున్నప్పుడే ఛార్జ్ చేసుకోగలదు. ఛార్జింగ్ వేసుకోవడానికి ప్యత్యేకంగా సమయం కేటాయించాల్సిన అవసరం లేదు. దీని కోసం సరికొత్త టెక్నాలజీ కండక్టీవ్ రెయిల్స్, ఇండక్టివ్ కాయిల్స్‌తో 3,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ పొడవైన జాతీయ రహదారి స్వీడన్ ప్రధాన నగరాలైన స్టాక్‌హోమ్, గోథెన్బర్గ్, మాల్మో మధ్యలో నిర్మితమవుతోంది. ఇది 2025 నాటికి వినియోగంలో రానున్నట్లు సమాచారం. -
‘నోబెల్’ నగదు పురస్కారం భారీగా పెంపు
స్టాక్‌హోమ్: నోబెల్ బహుమతి గ్రహీతలకిచ్చే నగదు మొత్తాన్ని ప్రస్తుతమున్న 1 మిలియన్ క్రోనార్ల(రూ.74.80 లక్షల) నుంచి 11 మిలియన్ క్రోనార్ల (రూ.8.15 కోట్ల)కు పెంచుతున్నట్లు నోబెల్ ఫౌండేషన్ శుక్రవారం ప్రకటించింది. ఇటీవలి కాలంలో స్వీడన్ కరెన్సీ క్రోనార్ విలువ పడిపోవడమే ఇందుకు కారణమని ఒక సంక్షిప్త ప్రకటనలో వివరించింది. అమెరికా డాలర్, యూరోలతో పోలిస్తే క్రోనార్ విలువ ఇంత దిగువకు పడిపోవడం ఇదే మొదటిసారి. స్వీడన్లో ద్రవ్యోల్బణం ఆగస్ట్‌లో 7.2 శాతంగా ఉంది. నోబెల్ బహుమతులను 1901లో మొదటిసారి ప్రదానం చేసినప్పుడు ఒక్కో కేటగిరీకి 1.50 లక్షల క్రోనార్లు అందజేసింది. అప్పటి నుంచి నోబెల్ ఫౌండేషన్ క్రమంగా ఈ మొత్తాన్ని పెంచుకుంటూ వస్తోంది. ఈ ఏడాది నోబెల్ విజేతలను అక్టోబర్‌లో ప్రకటించనుంది. -
నాటోలో సభ్యత్వం: స్వీడన్‌కు సై.. ఉక్రెయిన్‌కు నై.. కారణమిదే!
విల్నియస్: స్వీడన్‌ను తమ కూటమిలో 32వ సభ్యదేశంగా చేర్చుకునేందుకు నాటో అంగీకరించింది. లిథువేనియా దేశంలోని విలి్నయస్ నగరంలో జరుగుతున్న నాటో శిఖరాగ్ర సదస్సు ఇందుకు వేదికగా నిలిచింది. అయితే ఉక్రెయిన్‌కు సభ్యత్వంపై 31 సభ్యదేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ఇప్పట్లో ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వం దక్కకపోవచ్చు. యుద్ధంలో నిమగ్నమైన దేశానికి సభ్యత్వం ఇవ్వకూడదన్న నిబంధన కారణంగా ఇప్పుడే కూటమిలో చేర్చుకోలేమని, యుద్ధం ముగిశాక వెంటనే సభ్యత్వం ఇచ్చేలా పాత రెండంచెల పద్ధతిని సరళతరం చేశామని నాటో ప్రధాన కార్యదర్శి జీన్స్ స్టోల్టెన్బెర్గ్ మీడియాతో చెప్పారు. కాగా, తమ పట్ల నాటో వైఖరిని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్రంగా తప్పుబట్టారు. -
ఒకసారి చార్జింగ్‌తో 530 కిలోమీటర్లు ప్రయాణం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న స్వీడన్ సంస్థ వోల్వో తాజాగా భారత మార్కెట్లో పూర్తి ఎలక్ట్రిక్ ఎస్యూవీ సీ40 రీచార్జ్ ఆవిష్కరించింది. ఒకసారి చార్జింగ్‌తో 530 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. ట్విన్ మోటార్స్, 408 హెచ్‌పీ పవర్‌తో 78 కిలోవాట్ అవర్ బ్యాటరీ పొందుపరిచారు. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 4.8 సెకన్లలో చేరుకుంటుంది. 27 నిమిషాల్లో 80 శాతం చార్జింగ్ పూర్తి అవుతుంది. కారుకు కావాల్సిన విడిభాగాలను భారత్‌కు దిగుమతి చేసుకుని బెంగళూరు ప్లాంటులో అసెంబుల్ చేస్తారు. సెప్టెంబర్ నుంచి డెలివరీలు ప్రారంభం అవుతాయి. ఎలక్ట్రిక్ విభాగంలో భారత్‌లో సంస్థకు ఇది రెండవ మోడల్. ఇప్పటికే ఇక్కడి విపణిలో పూర్తి ఎలక్ట్రిక్ ఎక్స్‌సీ40 రీచార్జ్ కారును గతేడాది ప్రవేశపెట్టింది. అంతర్జాతీయంగా 2030 నాటికి పూర్తి ఎలక్ట్రిక్ కార్ కంపెనీగా అవతరించాలన్నది వోల్వో లక్ష్యం. భారత్‌లో 2025 నాటికి ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని నిర్ణయించింది. (అపుడు పాల ప్యాకెట్ కొనలేక పాట్లు, ఇపుడు 800 కోట్ల ఆస్తులు!) ఈవీలదే కీలక పాత్ర.. వోల్వో 2022లో దేశవ్యాప్తంగా సుమారు 1,800 యూనిట్లను విక్రయించింది. ఇప్పటి వరకు కంపెనీ నుంచి గరిష్టంగా 2018లో 2,600 కార్లు రోడ్డెక్కాయి. ఏటా ఇక్కడి మార్కెట్లో ఒక ఎలక్ట్రిక్ కారును ప్రవేశపెట్టాలని సంస్థ నిర్ణయించింది. ఈ ఏడాది భారత్‌లో రికార్డు స్థాయిలో అమ్మకాలు సాధించే ప్రయత్నంలో ఎలక్ట్రిక్ కార్లు కీలక పాత్ర పోషిస్తాయని వోల్వో కార్ ఇండియా ఎండీ జ్యోతి మల్హోత్రా తెలిపారు. ‘2023 చాలా ఆశాజనకంగా ప్రారంభమైంది. (MRF బెలూన్లు అమ్మి, కటిక నేలపై నిద్రించి: వేల కోట్ల ఎంఆర్ఎఫ్ సక్సెస్ జర్నీ) గత కొన్ని సంవత్సరాలతో పోలిస్తే 2023లో మరింత మెరుగ్గా రాణిస్తామని నమ్ముతున్నాం. మహమ్మారి కారణంగా మార్కెట్ కొంచెం నెమ్మదిగా ఉంది. అలాగే సరఫరా సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఈ సమస్య ఇప్పటికీ ఉంది. గరిష్ట స్థాయి అమ్మకాలను సాధించిన 2018 స్థాయికి ఈ ఏడాది చేరుకుంటాం. మొత్తం విక్రయాల్లో ఈవీల వాటా 27 శాతం ఉంది’ అని వివరించారు. కంపెనీ భారత్‌లో ఎక్స్‌సీ90, ఎక్స్‌సీ60, ఎక్స్‌సీ40 ఎస్‌యూవీలు, ఎస్90 సెడాన్‌ను సైతం విక్రయిస్తోంది. Here’s a look at the born electric SUV, Volvo C40 Recharge. India Spec: ⚡️408hp & 660Nm ⚡️Range: upto 530 WLTP ⚡️Twin motors with AWD ⚡️0-100 kmph: 4.7 sec ⚡️150kW DC: 10-80% in 27 min ⚡️Rear boot: 413 litres ⚡️Frunk: 30 litres#volvo #volvoev #volvoindia #c40recharge #ev pic.twitter.com/PcyeVfvUlw — Express Drives (@ExpressDrives) June 14, 2023 -
ఖండాంతరాలు దాటిన ప్రేమ.. భార్య కోసం ఇండియా నుంచి యూరప్‌కు సైకిల్‌పై
ప్రేమకు అవధులు లేవు. ప్రేమకు రంగు, భాష, వేషంతో కూడా సంబంధం ఉండదు. అలా ఎంతో మంది ఎన్నో అవంతరాలను ఎదుర్కొని ప్రేమను దక్కించుకున్న వారు ఉన్నారు. ఎందరి ప్రేమలో దేశాలు దాటాయి. అలాంటి కోవకే చెందినదే పీకే మహానందియా, షార్లెట్ వాన్ షెడ్విన్ ప్రేమ.. వీరి ప్రేమ దేశాలు కాదు ఏకంగా ఖండాంతరాలే దాటింది. అయితే ఇది దాదాపు 50 ఏళ్ల నాటి కథ. ఇటీవల తన ప్రేమ కోసం చేసిన సాహసాలను మహానందియా ఓ మీడియాతో పంచుకున్నారు. ఈ విశేషాలు మీకోసం.. 22 రోజులు వ్యాన్‌లో ప్రయాణించి ఢిల్లీకి చెందిన ప్రద్యుమ్న కుమార్ మహానందియా పేదరిక కుటుంబంలో పుట్టిన గొప్ప కళాకారుడు. పెయింటింగ్ అంటే పిచ్చి. పెయింటింగ్‌లో తనకంటూ మంచి పేరు సంపాదించాలనే ఆశతో ఢిల్లీలోని కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్‌లో చేరాడు.. ఈ క్రమంలో ప్రద్యుమ్న పెయింటింగ్ గురించి యూరప్‌లోని స్వీడన్‌కు చెందిన 19 ఏళ్ల షార్లెట్ వాన్ షెడ్విన్ తెలిసింది. ఎలాగైనా అతనితో తన పెయింటింగ్ వేయించుకోవాలని నిర్ణయించుకొని ఢిల్లీకి పయనమైంది. 22 రోజులు వ్యాన్‌లో ప్రయాణించి చివరికి అతన్ని చేరుకుంది. అలా 1975లో ఇద్దరికి పరిచయం ఏర్పడింది. ప్రేమ, పెళ్లి.. అదృష్టం కొద్దీ మహానందియాను కలిసి తన పోర్ట్రెయిట్‌ను తయారు చేస్తున్న సమయంలో వారిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. అతను ఆమె అందానికి ప్రేమలో పడగా.. ఆమె అతని సింప్లిసిటీకి ఫిదా అయిపోయింది. ఈ క్రమంలో ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం మహానందియా తన కుటుంబానికి తెలియజేయగా.. ఆమె అతని తల్లిదండ్రులను కలిసే సమయంలో మొదటిసారీ చీర కట్టుకుంది. విదేశీయురాలైన ఆమె చీరను ఎలా మేనేజ్ చేసిందో తనకిప్పటికీ ఆశ్యర్చంగానే అనిపిస్తుందని మహానందియా చెప్పాడు. చివరికి కుటుంబ సభ్యుల ఆశీర్వాదాలతో గిరిజన సంప్రదాయం ప్రకారం ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. చదవండి: Palestina: 75 ఏళ్లయినా.. గుండెల్లో అవే గుర్తులు, ఇంటికి తిరిగి రాగలమా? భర్తపై నమ్మకంతో షెడ్విన్ స్వీడన్ వెళ్లే సమయం దగ్గరకు రాగా.. తనతో రావాలని ఆమె భర్తను కూడా కోరింది. అయితే మహానందియా మొదట తన చదువును పూర్తి చేయాల్సి ఉందని చెప్పాడు. తరువాత స్వీడిష్ టెక్స్టైల్ పట్టణం బోరాస్‌లోని తన ఇంటికి తప్పక వస్తానని భార్యకు మాట ఇచ్చాడు. అతనిపై నమ్మకంతో ఒక్కతే ఆమె తన స్వదేశానికి పయనమైంది. తరువాత ఇద్దరు ఉత్తరాల ద్వారా సన్నిహితంగా ఉండేవారు. రోజూ 70 కిమీ ప్రయాణం ఏడాది తర్వాత తన చదువు పూర్తి కావడంతో మహానందియా స్వీడన్ వెళ్లి తన భార్య షెడ్విన్‌ను కలవాలనుకున్నాడు. కానీ అప్పుడే అతనికి అసలు విషయం గుర్తొచ్చింది. విమాన టికెట్ కొనుగోలు చేయడానికి తన వద్ద తగిన డబ్బు లేదని గుర్తొచ్చింది. దీంతో తనకున్నదంతా అమ్మేసి సైకిల్ కొన్నాడు. 1977 జనవరి 22న తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. రోజు దాదాపు 70 కిమీ ప్రయాణించాడు. దాదాపు నాలుగు నెలలు కష్టపడి పాకిస్తాన్, అప్గనిస్తాన్, ఇరాన్, టర్కీలను దాటుకొని వెళ్లాడు. మార్గ మధ్యలో ఎన్నోసార్లు తన సైకిల్ పాడైపోయింది. వేల కిలోమీటర్లు ప్రయాణించి తన ఒళ్లు పూనకం అయిపోయింది. అయినా అవేవి అతని సంకల్పాన్ని చెదర్చలేదు. స్వీడన్ చేరుకొని తన కళే అతన్ని ఆమె వద్దకు చేర్చిందని చెబుతుంటాడు. దారిలో కలిసిన వ్యక్తుల చిత్రాలను పెయింటింగ్ వేస్తే కొందరు డబ్బులు ఇచ్చేవారని.. మరికొందరు ఆహారం, ఆశ్రయం కల్పించారని చెప్పాడు. ఎట్టకేలకు మే 28న యూరప్ చేరుకున్నాడు. అక్కడి నుంచి ఇస్తాంబుల్, వియన్నా మీదుగా, ఆపై రైలులో స్వీడన్‌లోని బోరస్ చేరుకొని ఆమెను కలుసుకున్నాడు. అక్కడ ఇద్దరూ అధికారికంగా స్వీడన్లో మళ్లీ పెళ్లిచేసుకున్నారు. చదవండి: Video: ఎయిర్‌పోర్టులో వీర లెవల్లో తన్నుకున్న ప్రయాణికులు.. నేటికి అదే ప్రేమలో యూరోపియన్ సంస్కృతి గురించి తనకేం తెలియదని.. కానీ తన భార్య అడుగడుగునా మద్దతు నిలచిందని తెలిపారు. ఆమె ఎంతో ప్రత్యేకమైన వ్యక్తి అని.. 1975లో తొలిసారి తనను చూసి ప్రేమలో పడిన రోజులానే.. నేటీకి అదే ప్రేమలో ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా ఈ జంట ఇద్దరు పిల్లలు. ప్రస్తుతం ఈ కుటుంబం స్వీడన్లో నివసిస్తున్నారు. మహానందియా అక్కడే ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్నాడు. చివరగా.. ప్రేమ గొప్పతనం అందరికీ తెలియదంటారు. కానీ మహానందియాకు దాని విలువ బాగా అర్థమైంది. అందుకే మనసిచ్చి మనువాడిన ఆమె కోసం ఏకంగా సైకిల్ మీద మూడు నెలల ప్రయాణం చేశాడు. నచ్చిన చెలితో జీవితం గడుపుతున్నాడు. నేటి తరం యువతకు ప్రేమ అంటే కొత్త నిర్వచనాన్ని అందించాడు. View this post on Instagram A post shared by @mignonettetakespictures -
తెలంగాణ అత్యుత్తమ గమ్యస్థానం
సాక్షి, హైదరాబాద్: భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే స్వీడన్ కంపెనీలకు తెలంగాణ అత్యుత్తమ గమ్యస్థానం అని పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. తెలంగాణలో పెట్టుబడి పెట్టే స్వీడన్ కంపెనీలకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. భారత్‌లోని స్వీడన్ రాయబారి జాన్ తెస్లెఫ్ ఆధ్వర్యంలో ఆ దేశ వ్యాపార, వాణిజ్య ప్రతినిధులు, పలు కంపెనీల అధిపతులతో బుధవారం సచివాలయంలో మంత్రి కేటీఆర్ సమావేశం అయ్యారు. రాష్ట్ర పారిశ్రామిక విధానాలు, ప్రభుత్వ ఆలోచన విధానాన్ని తెలియజేశారు. పెట్టుబడి అవకాశాల గురించి వివరించారు. టెక్నాలజీ, తయారీ రంగాల్లో స్వీడన్ కంపెనీలు పెట్టుబడులు పెట్టాలని కోరారు. దేశంలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తిగా ఉన్న కంపెనీలను తెలంగాణకు కేటీఆర్ ఆహ్వానించారు. స్వీడన్ రాయబారితో కలిసి వచ్చిన ఆ దేశానికి చెందిన కంపెనీల ప్రతినిధులు హైదరాబాద్‌లో తమ సంస్థల కార్యకలాపాల పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. ముఖ్యంగా పారిశ్రామిక అనుకూల ప్రభుత్వ విధానాలను ప్రశంసించారు. ఎనిమిదేళ్ల కాలంలో హైదరాబాద్ నగరం రూపురేఖలు సంపూర్ణంగా మార్చేలా తీసుకువచ్చిన మౌలిక వసతుల కల్పన విధానాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. హైదరాబాద్ నగరంలో ఉన్న వ్యాపార అనుకూల వాతావరణం ఆధారంగా తెలంగాణకు మరిన్ని పెట్టుబడులను రప్పించేందుకు ప్రయత్నం చేస్తానని స్వీడన్ రాయబారి జాన్ తెస్లెఫ్ హామీ ఇచ్చారు. భారత్‌లో పెట్టుబడులకు ముందుకొచ్చే కంపెనీల బృందంతో కలిసి పనిచేసేందుకు ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్ మెకానిజం పేరుతో తాము ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. ఇది స్వీడన్ వ్యాపార వాణిజ్య సంస్థలతో పాటు పలు కంపెనీలతోనూ కలిసి పని చేస్తుందన్నారు. తెలంగాణలో పెట్టుబడి అవకాశాలను తమ కార్యాలయం పరిశీలిస్తుందని తెలిపారు. -
చరిత్ర సృష్టించిన స్టార్ ఫుట్‌బాలర్.. 41 ఏళ్ల వయసులో..!
ప్రముఖ ఫుట్‌బాలర్, స్వీడిష్ స్టార్ స్ట్రయికర్ జ్లాటన్ ఇబ్రహీమోవిచ్ చరిత్ర సృష్టించాడు. అత్యంత పెద్ద వయసులో యూరోపియన్ ఛాంపియన్ క్వాలిఫయర్ ఆడిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. యూరో 2024 గ్రూప్ గేమ్‌లో భాగంగా బెల్జియంతో జరిగిన మ్యాచ్‌లో 73వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగిన ఇబ్రహీమోవిచ్.. 41 సంవత్సరాల 5 నెలల 21 రోజుల వయసులో యూరో క్వాలిఫయర్ మ్యాచ్ బరిలోకి దిగిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. గతంలో ఈ రికార్డు ఇటాలియన్ గోల్‌కీపర్ డినో జోఫ్ పేరిట ఉండేది. 1983, మే 29న స్వీడన్‌తో జరిగిన మ్యాచ్‌లో డినో 41 ఏళ్ల 3 నెలల ఒక్క రోజు వయసులో యూరో క్వాలిఫయర్ మ్యాచ్ ఆడాడు. క్లబ్ ఫుట్‌బాల్‌లో ఏసీ మిలాన్‌కు ప్రాతినిధ్యం వహించే ఇబ్రహీమోవిచ్ గత వారాంతంలో సీరీ ఏలో గోల్ సాధించి, అత్యంత పెద్ద వయసులో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా కూడా రికార్డుల్లోకెక్కాడు. వచ్చే ఏడాది జర్మనీలో జరిగే యూరో కప్ ఫైనల్లో ఆడాలని భావిస్తున్న ఇబ్రహీమోవిచ్.. ఇదే జరిగితే అత్యంత పెద్ద వయసులో (42) యూరో కప్ ఫైనల్స్ ఆడిన ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. ఇదిలా ఉంటే, గ్రూప్-ఎఫ్ యూరో క్వాలిఫయర్ 2024లో భాగంగా బెల్జియంతో జరిగిన మ్యాచ్‌లో ఇబ్రహీమోవిచ్ ప్రాతినిధ్యం వహించిన స్వీడన్ ఓటమిపాలైంది. స్టార్ స్ట్రయికర్ రొమేలు లుకాకు హ్యాట్రిక్ గోల్స్ సాధించడంతో బెల్జియం 3-0 తేడాతో స్వీడన్‌ను చిత్తు చేసింది. లుకాకు మెరుపులతో ఇబ్రహీమోవిచ్ రికార్డు కనుమరుగైంది. ప్రస్తుతం ఫుట్‌బాల్‌లో కొనసాగుతున్న స్టార్లలో గేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్ పోర్చుగల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్లో, మరో దిగ్గజం మెస్సీ కంటే ఇబ్రహీమోవిచ్ వయసులో చాలా పెద్దవాడు. ఫిట్నెస్ విషయంలో రొనాల్డోకు ఇబ్రహీమోవిచ్కు పోటీ ఎక్కువగా ఉంటుంది. రొనాల్డో 38 ఏళ్ల వయసులో ఫిట్నెస్ కారణంగా అవకాశాలు పొందగలుగుతుంటే, ఇబ్రహీమోవిచ్ రొనాల్డోకు మించి అవకాశాలు సాధిస్తూ, రాణిస్తున్నాడు. -
40 ఏళ్ల కిందట తండ్రి.. ఇప్పుడేమో కొడుకు!
ప్రముఖ జన్యుశాస్త్రవేత్త, ఫ్రొఫెసర్ స్వాంటే పాబో Svante Paabo.. 2022 ఏడాదికిగానూ వైద్య రంగంలో నోబెల్ బహుమతి విజేతగా నిలిచారు. 67 ఏళ్ల స్వాంటే పాబో.. పరిణామ జన్యుశాస్త్రంపై పరిశోధనలు చేస్తూ పేరుప్రఖ్యాతలు, ఎన్నో గౌరవాలు అందుకున్నారు. పాలియోజెనెటిక్స్ సహ వ్యవస్థాపకుల్లో ఒకరు పాబో. పురాతన జీవుల అవశేషాల నుంచి సంరక్షించబడిన జన్యు పదార్థాన్ని పరిశీలించడం ద్వారా గతాన్ని(ఒకప్పటి మనిషి జాతులు- ప్రాచీన ఆదిమతెగల గురించి) అధ్యయనం చేయడం పాలియోజెనెటిక్స్ ముఖ్యోద్దేశం. జర్మనీ లెయిప్జిగ్ నగరంలోని మ్యాక్స్ ఫ్లాంక్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఎవల్యూషనరీ ఆంథ్రోపాలజీలో జన్యుశాస్త్ర విభాగానికి డైరెక్టర్ట్‌గా పాబో గతంలో విధులు నిర్వహించారు. జపాన్ ఒకినావా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ & టెక్నాలజీలో ప్రొఫెసర్‌గా పని చేశారు. స్వాంటే పాబో(Svante Paabo) పుట్టింది స్టాక్‌హోమ్‌లో. ఈయన తల్లి ఎస్టోనియాకు చెందిన కెమిస్ట్ కరిన్ పాబో. తండ్రి స్వీడన్‌కు చెందిన ప్రముఖ బయోకెమిస్ట్ కార్ల్ సనె బెర్గ్స్ట్రోమ్. బెర్గ్స్ట్రోమ్ 1982లో వైద్య రంగంలోనే నోబెల్ బహుమతి అందుకోవడం గమనార్హం. స్వీడన్‌కే చెందిన బయోకెమిస్ట్ బెంగ్ట్ శ్యాముల్‌స్సన్, బ్రిటిష్ పార్మకాలజిస్ట్ జాన్ ఆర్ వేన్లతో కలిసి కార్ల్ సనె బెర్గ్స్ట్రోమ్ నోబెల్ బహుమతిని పంచుకున్నారు. ఇప్పుడు బెర్గ్స్ట్రోమ్ తనయుడు పాబో కూడా వైద్యరంగంలోనే నోబెల్ విజేతగా నిలిచారు. పాబో తండ్రి, నోబెల్ గ్రహీత ప్రొఫెసర్ కార్ల్ సనె బెర్గ్స్ట్రోమ్ 1997లో, పాబో తన సహచరులు కలిసి నియాండర్తల్ మైటోకాన్డ్రియల్ DNA (mtDNA) సీక్వెన్సింగ్‌ను విజయవంతంగా నివేదించారు. నియాండర్ లోయలోని ఫెల్‌హోఫర్ గ్రోటోలో కనుగొనబడిన ఒక నమూనా నుంచి ఉద్భవించింది. ఆగష్టు 2002లో.. పాబో డిపార్ట్మెంట్ ‘‘భాషా జన్యువు’’.. FOXP2 గురించి పరిశోధనలను ప్రచురించింది. భాషా వైకల్యం ఉన్న కొందరిలో ఈ జన్యువు లేకపోవడం లేదంటే దెబ్బతినడం గుర్తించారు. పాబో టీం 2006లో.. నియాండర్తల్‌ల మొత్తం జన్యువును పునర్నిర్మించే ప్రణాళికను ప్రకటించారు పాబో. ఈ పరిశోధనకుగానూ.. 2007లో టైమ్ మ్యాగజైన్ అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తులలో ఒకరిగా పాబో ఎంపికయ్యారు. నియాండర్తల్స్.. అంతరించిన మానవజాతి. యూరేషియాలో వేల సంవత్సరాల కిందట బతికిన అర్చాయిక్ ఉపజాతిగా కూడా భావిస్తుంటారు. దాదాపు 70 వేల సంవత్సరాలకు పూర్వం ఆఫ్రికా నుంచి వలస వచ్చిన తర్వాత ప్రస్తుతం అంతరించిపోయిన ఈ హోమినిన్ల నుంచి హోమో సేపియన్లకు జన్యు బదిలీ జరిగిందని పాబో గుర్తించారు. ఫలితంగా.. ఈ తరం మానవుల్లోనూ ఈ పురాతన జన్యువుల ప్రవాహం కొనసాగుతోందని, ఇది రోగ నిరోధక వ్యవస్థను ప్రభావితం చేస్తుందని, అంటువ్యాధులకు ప్రతిస్పందిస్తుందని ఆయన తన బృందంతో సాగించిన పరిశోధనల ఆధారంగా వెల్లడించారు. 2014లో నియాండర్తల్ మ్యాన్: ఇన్ సెర్చ్ ఆఫ్ లాస్ట్ జీనోమ్స్ అనే పుస్తకం పాబో కోణంలో మానవ పరిణామ క్రమాన్ని వివరించే యత్నం చేసింది. కరోనా టైంలోనూ ఆయన చేసిన పరిశోధనలు.. ఎంతో పేరు దక్కించుకున్నాయి. స్వీడన్‌తో పాటు జర్మనీ నుంచి కూడా ఎన్నో ఉన్నత గౌరవాలు, బిరుదులు అందుకున్నారాయన. బయోకెమిస్ట్రీ, మాలిక్యులర్ బయాలజీలో పరిశోధనలకుగానూ.. ఇంటర్నేషనల్ సైంటిఫిక్ సొసైటీ ‘ఎఫ్ఈబీఎస్’ థియోడోర్ బుచర్ మెడల్‌తో ఆయన్ని సత్కరించింది. డాన్ డేవిడ్ ప్రైజ్, మెస్రీ ప్రైజ్‌లు సైతం అందుకున్నారీయన. వీటితో పాటు ఐర్లాండ్, ఆస్ట్రియా, జపాన్, తదితర దేశాల నుంచి కూడా విశేష గౌరవాలను సొంతం చేసుకున్నారు. పాబోSvante Paabo తనను తాను బైసెక్సువల్ అని బహిరంగంగా ప్రకటించుకున్నారు. 2014 వరకు ‘గే’గా ఉన్న ఈయన.. ఆపై సైంటిస్ట్ లిండా విజిలెంట్‌ను వివాహం చేసుకుని.. ఇద్దరు పిల్లల్ని కన్నారు. మానవ పరిణామ క్రమం, అంతరించి పోయిన హొమినిన్ జన్యువులకు సంబంధించిన ఆవిష్కరణలకు గాను పాబోకీ నోబెల్ బహుమతి లభించింది. -
వైద్య రంగంలో నోబెల్ బహుమతి ప్రకటన
స్టాక్‌హోం: ప్రతిష్టాత్మకమైన నోబెల్ విజేతల ప్రకటన మొదలైంది. వైద్య రంగంలో.. జన్యు శాస్త్రవేత్త స్వాంటె పాబో(67)కు అవార్డును ప్రకటించింది నోబెల్ కమిటీ. నోబెల్ కమిటీ ఫర్ ఫిజియాలజీ(మెడిసిన్) సెక్రటరీ థామన్ పెర్ల్‌మాన్ సోమవారం స్వీడన్ రాజధాని స్టాక్‌హోంలోని కారోలిన్స్కా ఇనిస్టిట్యూట్‌లో జరిగిన సమావేశంలో విజేతను ప్రకటించారు. స్వీడన్‌కు చెందిన స్వాంటె పాబోకు మెడిసిన్‌లో నోబెల్ బహుమతి దక్కినట్లు తెలిపారు. అంతరించిపోయిన హోమినిన్ల జన్యువులు, మానవ పరిణామానికి సంబంధించిన ఆయన ఆవిష్కరణలకుగానూ నోబెల్ ఇస్తున్నట్లు కమిటీ పేర్కొంది. నోబెల్ విజేతను ప్రకటిస్తున్న థామన్ పెర్ల్‌మాన్ పాబో తన మార్గదర్శక పరిశోధన ద్వారా ‘‘అసాధ్యంగా అనిపించేదాన్ని’’ సాధించారు. ఇప్పటి మనుషులకు.. అంతరించిపోయిన బంధువైన నియాండర్తల్ జన్యువును క్రమం చేయడం, డెనిసోవా అనే ఇంతకుముందు తెలియని హోమినిన్‌కు సంబంధించి సంచలనాత్మక ఆవిష్కరణను చేసిన పాబో.. 70వేల సంవత్సరాల క్రితం ఆఫ్రికా నుండి వలస వచ్చిన తరువాత ఇప్పుడు అంతరించిపోయిన ఈ హోమినిన్ల నుంచి హోమో సేపియన్లకు జన్యు బదిలీ జరిగిందని కూడా కనుగొన్నారని నోబెల్ కమిటీ తెలిపింది. ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్ యుద్ధ పరిణామాల నేపథ్యంలో.. ఈసారి నోబెల్ విజేతల ప్రకటన ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది. BREAKING NEWS: The 2022 #NobelPrize in Physiology or Medicine has been awarded to Svante Pääbo “for his discoveries concerning the genomes of extinct hominins and human evolution.” pic.twitter.com/fGFYYnCO6J — The Nobel Prize (@NobelPrize) October 3, 2022 -
ఢిల్లీలో ఉండి స్వీడన్లో కారు నడిపిన మోదీ.. అది ఎలా?
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యూరప్‌లోని స్వీడన్లో కారు నడపటం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అయితే.. అది నిజమే. 5జీ టెక్నాలజీతో అది సాధ్యమైంది. ‘ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2022’ కార్యక్రమానికి హాజరైన ప్రధాని మోదీ.. దేశంలో 5జీ మొబైల్ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా.. 5జీ లింక్ సాయంతో ఇండియా మొబైల్ కాన్ఫరెన్స్‌లోని ఎరిక్సన్ బూత్ నుంచి యూరప్‌లో కారు టెస్ట్ డ్రైవ్ చేశారు. ఆ సమయంలో కారు స్వీడన్లో ఉంది. స్వీడన్లో ఉన్న కారును నియంత్రించే సాకేతికతను ఎరిక్సన్ బూత్‌లో అమర్చటం ద్వారా ఇది సాధ్యమైంది. రిమోట్ కంట్రోల్ కారు స్టీరింగ్ పట్టుకుని ఉన్న ప్రధాని మోదీ ఫోటోను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ట్విట్టర్లో షేర్ చేశారు. ‘భారత 5జీ టెక్నాలజీ సాయంతో ఢిల్లీ నుంచి యూరప్‌లోని కారును రిమోట్ కంట్రోల్స్ ఆధారంగా ప్రధాని మోదీజీ టెస్ట్ డ్రైవ్ చేశారు.’ అని రాసుకొచ్చారు గోయల్. ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2022 కార్యక్రమం ఆసియాలోనే అతిపెద్ద డిజిటల్ సాంకేతికత ప్లాట్‌ఫాం. ఢిల్లీలోని ప్రగతి మైదానంలో శనివారం ప్రారంభమైన ఆరవ ఎడిషన్ మొబైల్ కాంగ్రెస్ కార్యక్రమం అక్టోబర్ 4 వరకు జరగనుంది. రిమోట్ కంట్రోల్స్‌తో కారు నడపటంతో పాటు 5జీ సాంకేతికతతో అందుబాటులోకి వచ్చే వివిధ సౌకర్యాలను పరిశీలించారు మోదీ. India driving the world. PM @NarendraModi ji tests driving a car in Europe remotely from Delhi using India’s 5G technology. pic.twitter.com/5ixscozKtg — Piyush Goyal (@PiyushGoyal) October 1, 2022 WATCH | Prime Minister @narendramodi tries his hands on virtual wheels at the exhibition put up at Pragati Maidan before the launch of 5G services in the country. pic.twitter.com/zpbHW9OiOU — Prasar Bharati News Services & Digital Platform (@PBNS_India) October 1, 2022 ఇదీ చదవండి: PM launch 5G services: 5జీ సేవలను ప్రారంభించిన ప్రధాని -
300 మందితో వెళ్తున్న నౌకలో భారీ అగ్ని ప్రమాదం
స్టాక్‌హోమ్: స్వీడన్ తీరంలో సుమారు 300 మందితో వెళ్తున్న ఓ భారీ నౌకలో మంటలు చెలరేగాయి. అందులోని ప్రయాణికులను కాపాడేందుకు అతిపెద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని స్వీడన్ నౌకాదళ అధికారులు తెలిపారు. ‘కార్ డెక్‌లో మంటలు చెలరేగాయి. మూడు హెలికాప్టర్లు, ఏడు నౌకలను సంఘటనా స్థలానికి పంపించాం. ప్రయాణికుల తరలింపు జరుగుతోంది.’ అని స్వీడన్ మారిటైమ్ అడ్మినిస్ట్రేషన్ ప్రతినిధిని జోనస్ ఫ్రాంజెన్ తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా, మంటలు అంటుకునేందుకు గల కారణాలేంటనే విషయం ఇంకా తెలియరాలేదన్నారు జోనస్ ఫ్రాంజెన్. మరోవైపు.. మంటలు అదుపులోకి వచ్చినట్లు మరో అధికారి తెలిపారు. స్వీడన్ ఈశాన్య తీర ప్రాంతంలోని గోట్‌స్కా సాండన్ ద్వీపం సమీపంలో ప్రమాదానికి గురైన స్టేనా స్కాండికా నౌక ఉన్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: ప్రకృతి విలయం చేజేతులారా పాక్ చేసుకున్న పనే! మిత్రదేశం చైనా ప్రకటన తప్ప సాయానికి నో! -
ఫిన్లాండ్, స్వీడన్లకు రూట్ క్లియర్... కూటమిలోకి ఆహ్వానం
Agreement that paves the way for Finland and Sweden to join NATO: ఫిన్లాండ్, స్వీడన్ దేశాలు నాటోలో చేరేందుకు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై మాడ్రిడ్‌లో సుదీర్ఘ చర్చలు జరిగాయి. అదీగాక టర్కీ తన అభ్యంతరాలను ఉపసంహరించుకునేలా ఒప్పందం కుదుర్చోకోవడంతో ఆయా దేశాలు నాటోలో చేరే మార్గం సుగమం అయ్యిందని నాటో చీఫ్ స్టోలెన్‌బర్గ్ చెప్పారు. ఈ మేరకు టర్కీ, స్వీడన్, ఫిన్లాండ్ దేశాలు ఆయుధాల ఎగుమతులు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటంతో సహా టర్కీ ఆందోళనలను పరిష్కరించే దిశగా మెమోరాండంపై సంతంకం చేశాయని చెప్పారు. తదనంతరం నాటో నాయకులు ఫిన్లాండ్, స్వీడన్ దేశాలను అధికారికంగా కూటమిలోకి చేరాలని ఆహ్వానిస్తారని స్టోలెన్‌బర్గ్ తెలిపారు. దీంతో ఫిన్లాండ్, స్వీడన్ దేశాలకు నాటోలో చేరేందుకు మార్గం సుగమం అయ్యిందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాని కూడా అన్నారు. -
వాషింగ్ మెషీన్ త్రో..
జావెలిన్ త్రో, డిస్కస్ త్రో తెలుసు... ఈ వాషింగ్ మెషీన్ త్రో ఏంటనుకుంటున్నారా? నిజమే వాషింగ్ మెషీన్‌ను ఎత్తి విసిరేయడమే. అలా 14 అడుగుల 7 అంగుళాల దూరానికి విసిరి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించాడో స్వీడిష్ వ్యక్తి. ఇంట్లో ఓ పక్క ఉన్న వాషింగ్ మెషీన్‌ను ఇంకోపక్కకు జరపాలంటే కష్టం. అలాంటిది అలా ఎలా విసిరాడు? అందరికీ వచ్చే సందేహమే. ఆయనొక్కడే కాదు... అంతకుముందు 13 అడుగుల 6.6 అంగుళాలు, 14 అడుగుల 1 అంగుళం దూరాలు విసిరిన రికార్డులున్నాయి. తాజాగా మిలన్లో జరిగిన పోటీలో స్వీడన్‌కు చెందిన జోహన్ ఎస్పెన్రోనా.. వాషింగ్ మెషీన్‌ను 14 అడుగుల 7 అంగుళాల దూరం విసిరి వాళ్లిద్దరి రికార్డులను బ్రేక్ చేశాడు. అయితే దీనికి స్ఫూర్తి... పేపర్ ప్లేన్ గిన్నిస్ రికార్డ్. అదే చిన్నపిల్లలు పేపర్ఫ్లైట్ తయారు చేసి ఒకరిమీదకు ఒకరు విసురుకుంటారు కదా. అలా చిన్న పిల్లల్లా మారిపోయిన దక్షిణ కొరియాకు చెందిన ఓ ఇద్దరు, మలేసియాకు చెందిన ఒకరు, మొత్తం ముగ్గురు కలిసి... పేపర్ ప్లేన్ తయారు చేశారు. 252 అడుగుల 7 అంగుళాల దూరం ప్రయాణించేలా విసిరి గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో చోటు దక్కించుకున్నారు. -
ప్రపంచ పర్యావరణ దినం: ఒక్కటే భూమి..ఒక్కటై కాపాడుకుందాం
భూగోళం వేడెక్కిపోతోంది. వాతావరణంలో కనీవినీ ఎరుగని విపరిణామాలు సంభవిస్తున్నాయి. ఉష్ణోగ్రతల పెరుగుదలకు కళ్లెం వేయాలన్న ఆదర్శం కాగితాలకే పరిమితమైంది. పారిస్ ఒప్పందాన్ని అమలు చెయ్యాలన్న పర్యావరణ శాస్త్రవేత్తల పిలుపులు కంఠశోషగానే మిగులుతున్నాయి. ఏడాదికోసారి పర్యావరణ పరిరక్షణ సదస్సులతో సరిపెడుతున్నాయి. ఇదిలాగే కొనసాగితే కనీవినీ ఎరుగని నష్టాలను చవిచూడటం ఖాయమని, ఆ రోజు ఎంతో దూరంలో కూడా లేదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు... జూన్ 5. ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఈ ఏడాదితో దీనికి 50 ఏళ్లు పూర్తయ్యాయి. 1972లో ఐక్యరాజ్యసమితి నిర్వహించిన పర్యావరణ పరిరక్షణ సదస్సుకు స్వీడన్ ఆతిథ్యం ఇచ్చింది. వాతావరణ మార్పులను గమనించి, అవసరమైన చర్యలు చేపట్టాల్సిన అవసరముందని అప్పుడు తొలిసారిగా గుర్తించారు. 1973 నుంచి జూన్ 5ను ప్రపంచ పర్యావరణ దినంగా జరుపుకుంటూ వస్తున్నాం. ఈ సందర్భంగా ఐరాస ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం (యూఎన్ఈపీ) ఏటా ఏదో ఒక అంశంతో పర్యావరణంపై ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నాలు చేస్తోంది. ఈసారి ‘ఓన్లీ వన్ ఎర్త్’ థీమ్‌తో ముందుకొచ్చింది. పర్యావరణ పరిరక్షణకు ప్రపంచ దేశాలన్నీ కలసికట్టుగా ప్రయత్నించాలని పిలుపునిచ్చింది. గ్రీన్ లైఫ్ స్టైల్‌ను అలవర్చుకోవడంతో పాటు పచ్చదనం, పరిశుభ్రతల కోసం చర్యలు తీసుకోవాలని కోరింది. ప్రభుత్వాలేం చేయాలి? ► పర్యావరణ పరిరక్షణకు అతి ముఖ్యమైన అడవులు, నదులు, సముద్రాలు , తేమ ప్రాంతాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి. 1990వ దశకంలో ఏడాదికి 1.6 కోట్ల హెక్టార్ల చొప్పున అడవులను కోల్పోయాం! 2015–2020 మధ్య కూడా ఏటా కోటి హెక్టార్ల చొప్పున తగ్గింది. అడవుల్ని కాపాడుకోవడం ప్రభుత్వాల ప్రథమ కర్తవ్యం. ► ఐరాస ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ) ప్రకారం మాంసాహారం తయారీ, రవాణా వల్ల 18% దాకా కర్బన ఉద్గారాలు విడుదలవుతున్నాయి. పశు పెంపకానికి నీటి వాడకమూ పెరుగుతోంది. దీన్ని తగ్గించాలంటే వ్యవసాయ రంగంలో చిన్న కమతాల్ని ప్రోత్సహించాలి. ► ప్రపంచవ్యాప్తంగా శాకాహారుల సంఖ్య 2015–2019 మధ్య 21 నుంచి ఏకంగా 58 శాతానికి పెరిగింది. దీన్నింకా పెంచడానికి దేశాలన్నీ కృషి చేయాలి. ► ప్రపంచవ్యాప్తంగా చమురు ఉత్పత్తి వల్ల 35 శాతం ఉద్గారాలు విడుదలవుతున్నాయి. అందు కే గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించాలి. సోలార్, విండ్ పవర్, ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీలివ్వాలి. ► గ్లోబల్ వార్మింగ్‌కు 30 నుంచి 35 శాతం దాకా కారణమవుతున్న బ్లాక్ కార్బన్, మీథేన్, ఓజోన్, హైడ్రో ఫ్లోరో కార్బన్స్ నియంత్రణకు గట్టి విధానాలు రూపొందించాలి. పర్యావరణ పరిరక్షణకు పాటుపడకుంటే.. ► ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు 1.5 నుంచి 2 డిగ్రీల దాకా పెరుగుతాయి. అప్పుడు జనాభాలో 14% అత్యంత తీవ్రమైన ఎండ వేడిమికి గురవుతారు. అది క్రమంగా 37 శాతానికి చేరే ప్రమాదముంది. ► 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా మెగా నగరాల్లోని 35 కోట్ల మందిని ఎండ వేడి బాధిస్తుంది. నీటి కరువుతో, కాటకాలతో నగర ప్రాంతాలు అల్లాడిపోతాయి. దక్షిణాసియా దేశాలకే ఈ ముప్పు ఎక్కువ. ► ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, ఢాకా, కరాచీ నగర వాసులు ఎండతీవ్రతకి గురవుతారు. ► సముద్ర మట్టాలు 24 నుంచి 38 సెంటీమీటర్లు పెరిగి బ్యాంకాక్, జకార్తా, మనీలా నగరాలు మునిగిపోవచ్చు. ► 2050 నాటికి సగం జనాభాకు మలేరియా, డెంగ్యూ, జికా వైరస్ ముప్పుంటుంది. అస్తమా వంటి వ్యాధులు పెరిగిపోతాయి. ► కీటకాలు, మొక్కలు, జంతువుల ఆవాస ప్రాం తాలు సగానికి తగ్గి జీవ వైవిధ్యం నశిస్తుంది. మనం చేయాల్సిందేమిటి? ► ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల బదులు రీ యూజబుల్ బ్యాగులు వాడాలి. ► కాగితం వాడకాన్ని తగ్గించాలి. అత్యవసరమైతే తప్ప ప్రింట్లు తీయొద్దు. ► వారానికి ఒక్క రోజన్నా శాకాహారమే తినాలి. వీగన్ డైట్ ద్వారా కర్బన్ ఉద్గారాలను 73 శాతం తగ్గించవచ్చు. ► కారు బదులు బైక్ వాడితే కిలోమీటర్‌కు 250 గ్రాముల కర్బన్ ఉద్గారాలను కట్టడి చయగలం. ► ఇంట్లో నీళ్ల పైపుల లీకేజీని ఎప్పటికప్పుడు సరి చేస్తే కోట్లాది గాలన్ల నీరు ఆదా అవుతుంది. ► ఇళ్లల్లో ఫ్లోరోసెంట్ బల్బులు వాడితే 75% కరెంటు ఆదా అవుతుంది. ► రీ యూజబుల్ కరోనా మాస్కులు వాడాలి. యూజ్ అండ్ త్రో మాస్కులతో జంతుజాలానికి ఎనలేని హాని జరుగుతోంది. ► డిటర్జెంట్స్, వాషింగ్, లిక్విడ్ సోపుల్లో కనిపించని ప్లాస్టిక్ కణాలుంటాయి. నేచరల్ ప్రొడక్టులు వాడటం మేలు. ► ఇంటా బయటా అందరూ పెద్ద సంఖ్యలో మొక్కలు పెంచాలి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నాటోలో చేరిక.. ఫిన్లాండ్, స్వీడన్లకు షాక్..?
Turkey Blocking Sweden and Finland NATO Bids: ఉక్రెయిన్‌లో రష్యా ఆక్రమణ దాడులు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫిన్లాండ్, స్వీడన్.. నాటోలో చేరేందుకు దరఖాస్తు చేసుకున్నాయి. నాటో చేరువద్దంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వార్నింగ్ ఇచ్చినప్పటికీ ఈ రెండు దేశాలు దరఖాస్తు చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగా.. ఫిన్లాండ్, స్వీడన్ దేశాలు నాటో దరఖాస్తు పత్రంపై సంతకాలు చేశాయి. దీన్ని బ్రస్సెల్స్‌లోని నాటో ప్రధాన కార్యాలయంలో బుధవారం అందజేయనున్నాయి. ఇక, ఈ రెండు దేశాలకు నాటో సభ్యత్వం దక్కలంటే.. అందులోని 30 సభ్య దేశాల ఆమోదం తప్పనిసరిగా ఉండాల్సిందే. ఏ ఒక్క దేశం వ్యతిరేకంగా ఉన్నా కొత్త దేశం నాటోలో చేరలేదు. అయితే, ఫిన్లాండ్, స్వీడన్ దేశాలు నాటో చేరికపై అగ్రరాజ్యం అమెరికా సహా మరిన్ని దేశాలు దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. కానీ, టర్కీ మాత్రం అడ్డుపుల్ల వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల టర్కీ అధ్యక్షుడు రికెప్ తయ్యిప్ ఎర్డోగన్.. రష్యా దాడుల భయంతోనే ఫిన్లాండ్, స్వీడన్ నాటోలో చేరేందుకు ముందుకు వచ్చాయని సెటైరికల్‌గా ఆరోపించారు. మరో అడుగు ముందుకేసి ఈ రెండు దేశాలు కుర్దీస్థాన్ వర్కర్స్ పార్టీ (పీకేకే) మిలిటెంట్లకు ఆశ్రయం కల్పిస్తున్నాయని కామెంట్స్ చేశారు. ఆయన వ్యాఖ్యలతో ఒక్కసారిగా షాక్ తగిలింది. దీంతో టర్కీ అడ్డుపడుతుందా? అనే విషయం ఆసక్తికరంగా మారింది. మరోవైపు.. నాటోలో చేరేందుకు సిద్ధమైన స్వీడన్, ఫిన్లాండ్ దేశాధినేతలతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భేటీ కానున్నారు. వైట్‌హౌస్ వేదికగా గురువారం స్వీడన్ ప్రధాని మాగ్డెలినా అండర్సన్,ఫిన్లాండ్ అధ్యక్షుడు సౌలి నినిస్టోలతో బైడెన్ సమావేశం కానున్నట్లు వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి. దీంతో వీరి మధ్య భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇది కూడా చదవండి: అమెరికాలో కరోనా కల్లోలం.. బైడెన్ కీలక నిర్ణయం -
మీరొస్తానంటే.. నేనొద్దంటా!
స్టాక్‌హోమ్: నాటో కూటమిలో స్వీడన్, ఫిన్లాండ్ చేరికను టర్కీ మరోమారు తీవ్రంగా వ్యతిరేకించింది. అవి కుర్దిష్ మిలిటెంట్లకు సాయం చేస్తున్నాయని ఆరోపించింది. టర్కీ అభ్యంతరాలు నాటో కూటమిలో కలకలం సృష్టిస్తున్నాయి. టర్కీ వ్యాఖ్యల్లో ఇటీవలి కాలంలో మార్పు వచ్చిందని ఫిన్లాండ్ ప్రధాని నినిస్టో అన్నారు. చర్చలతో సమస్యను పరిష్కరించుకుంటామన్నారు. నాటోలో చేరాలన్న ప్రభుత్వ నిర్ణయానికి ఫిన్లాండ్ పార్లమెంట్ మంగళవారం 188–8 ఓట్లతో మద్దతు పలికింది. ఇరు దేశాల విదేశాంగ మంత్రులు సభ్యత్వ దరఖాస్తులను బ్రస్సెల్స్‌లోని నాటో కేంద్ర కార్యాలయంలో అందించారు. టర్కీ అభ్యంతరాల నేపథ్యంలో వీటి సభ్యత్వంపై నిర్ణయానికి సమయం పట్టవచ్చని అంచనా. టర్కీతో చర్చలకు బృందాన్ని పంపుతామన్న స్వీడన్ ప్రతిపాదనను కూడా ఎర్డోగన్ వ్యతిరేకించారు. టర్కీతో చర్చలకు ఎదురుచూస్తున్నామని, నాటో దేశాలతోనూ చర్చిస్తున్నామని స్వీడన్ ప్రధాని మగ్డలీనా చెప్పారు. టర్కీ అభ్యంతరాలు అమెరికాకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. వాటి సంబంధాలు ఇటీవల బాగా క్షీణించాయి. రష్యా నుంచి టర్కీ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థను కొనడం అమెరికాకు నచ్చలేదు. చర్చలే చర్చలు నాటోలో చేరాలని నిర్ణయించిన స్వీడన్, ఫిన్లాండ్ ప్రధానులతో త్వరలో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ చర్చిస్తారని వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి. వీటిపై తమ అభ్యంతరాలు తెలిపేందుకు టర్కీ విదేశాంగ మంత్రి కవుసోగ్లు అమెరికాకు పయనమ్యారు. ఈ రెండు దేశాలు ఏళ్లుగా తటస్థంగా ఉంటున్నాయి. నాటోలో చేరితే తీవ్ర పరిణామాలుంటాయని వాటిని రష్యా పలుమార్లు హెచ్చరించింది. మంగళవారం ఇద్దరు ఫిన్లాండ్ దౌత్యాధికారులను రష్యా బహిష్కరించింది. చదవండి: (ఉత్తరకొరియాలో ఒకే రోజు 2.7 లక్షల కరోనా కేసులు) నార్డిక్ దేశాలు నాటోలో చేరడంపై టర్కీ అభ్యంతరాలు త్వరలో సమసిపోతాయని నాటో అధికారులు అంచనా వేస్తున్నారు. వీటి చేరికను పలు యూరప్ దేశాలు స్వాగతించాయి. తమ దేశం కోరిన ఒక్క కుర్దిష్ నాయకుడిని కూడా నార్డిక్ తమకు దేశాలు అప్పగించలేదని టర్కీ ఆరోపించింది. నాటోలో కొత్తగా సభ్యత్వం పొందాలంటే ప్రస్తుతమున్న 30 సభ్యదేశాలు ఏకగ్రీవంగా అంగీకరించాల్సిఉంది. స్టీల్ ప్లాంట్ ఫైటర్ల తరలింపు మారియుపోల్‌లో చిక్కుకున్న తమ సైనికులను రక్షించేందుకు ఉక్రెయిన్ ప్రయత్నిస్తోంది. 264 మందిని తరలించామని తెలిపింది. మరోవైపు డోన్బాస్లో పలు నగరాలపై రష్యా బాంబింగ్ కొనసాగుతూనే ఉంది. సివియర్డొనెట్స్క్లో 10మంది మరణించారు. పశ్చిమాన లివివ్పైనా రష్యా దాడులు చేసింది. ఖార్కివ్‌లో మాత్రమే ఉక్రెయిన్ సేనలకు కొంత ఊరట లభించింది. నగరానికి సమీపంలోని రష్యా సరిహద్దు వద్దకు ఉక్రెయిన్ సేనలు చేరుకున్నాయి. ఇకపై డోన్బాస్ నగరాలపై రష్యా తీవ్రంగా విరుచుకుపడవచ్చని బ్రిటన్ ఇంగ్లండ్ హెచ్చరించింది. -
స్వీడన్ నాటో బాట
స్టాక్‌హోమ్: నాటో కూటమిలో చేరాలన్న ఫిన్లాండ్ బాటలోనే తాము కూడా పయనిస్తామని స్వీడన్ ప్రధాని మగ్డలీనా అండర్సన్ సోమవారం ప్రకటించారు. తద్వారా 200 ఏళ్లుగా అనుసరిస్త్ను తటస్థ వైఖరికి స్వీడన్ ముగింపు పలుకుతోంది. ఈ నిర్ణయాన్ని దేశ రక్షణ విధానంలో చరిత్రాత్మక మార్పుగా మగ్డలీనా అభివర్ణించారు. నాటో సభ్యత్వంతో లభించే భద్రతా గ్యారెంటీలు స్వీడన్‌కు అవసరమన్నారు. నాటోలో చేరికపై ఫిన్లాండ్తో కలిసి పనిచేస్తామన్నారు. ఈ నిర్ణయానికి స్వీడన్ పార్లమెంట్ రిక్స్డగెన్లో భారీ మద్దతు లభించింది. 8 పార్టీల్లో కేవలం రెండు మాత్రమే దీన్ని వ్యతిరేకించాయి. రెండు దేశాల్లో కూడా నాటో చేరికపై ప్రజాభిప్రాయం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. స్వీడన్ నిర్ణయాన్ని అమెరికా స్వాగతించింది. నాటోలో చేరినా తమ దేశంలో అణ్వాయుధాలను, నాటో శాశ్వత బేస్‌లను అంగీకరించబోమని మగ్డలీనా చెప్పారు. డొనెట్స్క్పై దాడులు ఉధృతం తూర్పు ఉక్రెయిన్‌లోని డొనెట్స్క్పై రష్యా దాడులు తీవ్రతరమయ్యాయి. మారియుపోల్‌లోని స్టీల్ ప్లాంట్ చుట్టూ వైమానిక దాడులు కొనసాగాయి. పలు పట్టణాలలోని పౌర మౌలిక సదుపాయాలపై బాంబుల వర్షం కురిపించాయి. ఖర్కివ్ చుట్టూ రష్యన్ దళాలు తమను నిరోధించే యత్నాల్లో ఉన్నాయని ఉక్రెయిన్ తెలిపింది. అయితే సరిహద్దులో బెలరాస్ బలగాలున్నందున ఉక్రెయిన్ సేనలు ఉన్నచోటే ఉండి పోరాడడం మేలని బ్రిటీష్ సైన్యం సూచించింది. తూర్పు ప్రాంతంలో రష్యా ఒక ఆస్పత్రిపై జరిపిన దాడిలో ఇద్దరు మరణించారని ఉక్రెయిన్ ఆరోపించింది. రష్యాలో వ్యాపారాల అమ్మకం పలు పాశ్చాత్య కంపెనీలు రష్యాలోని తమ వ్యాపారాలను తెగనమ్ముకుంటున్నాయి. రష్యాలో వ్యాపార విక్రయ ప్రక్రియను ఆరంభించామని మెక్‌డొనాల్డ్స్ తెలిపింది. సంస్థకు రష్యాలో 850 రెస్టారెంట్లున్నాయి. వాటిలో 62 వేల మంది పని చేస్తున్నారు. ఈ నిర్ణయంతో సంస్థ లాభాలపై ప్రభావం పడే అవకాశముందని తెలిపింది. ఇదే బాటలో కార్ల తయారీ సంస్థ రెనో సైతం రష్యాలో తమ వ్యాపారాన్ని విక్రయిస్తున్నట్లు ప్రకటించింది. సంస్థకు స్థానిక అవటోవాజ్ కంపెనీలో ఉన్న 67.69 శాతం వాటాను విక్రయించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. ఇదే కోవలో పలు పాశ్చాత్య కంపెనీలు పయనించే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడ్డారు. (చదవండి: పుతిన్ అనారోగ్యం.. నయం చేయలేనంత రోగమా?) -
Russia War: మరో రెండు దేశాలకు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్
కీవ్: ఉక్రెయిన్‌లో రష్యా బలగాల భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఓడరేవు నరగం మరియుపోల్‌పై రష్యా దాడుల కారణంగా వేల సంఖ్యలో ఉక్రెయిన్ పౌరులు మృత్యువాతపడ్డారు. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్ అభ్యర్థన మేరకు రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. మారియుపోల్ నుండి ఉక్రెయిన్ పౌరులను సురక్షిత ప్రాంతానికి తరలించడానికి రష్యా ఒప్పుకున్నట్టు ఉక్రెయిన్ ఉప ప్రధాన మంత్రి ఇరినా వెరెష్చుక్ టెలిగ్రామ్‌లో స్పష్టం చేశారు. మహిళలు, పిల్లలు, వృద్ధుల కోసం మానవతా కారిడార్‌పై రష్యాతో ప్రాథమిక ఒప్పందాన్ని పొందినట్టు ఆమె వెల్లడించారు. భారత కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం మరియుపోల్ నుంచి ఉక్రెయిన్ పౌరులను సురక్షిత ప్రాంతానికి తరలించనున్నట్టు ఇరినా తెలిపారు. కాగా, ఫిబ్రవరి 24న రష్యా దాడులు ప్రారంభమైనప్పటి నుండి మానవతా కారిడార్ల ద్వారా సుమారు 3,00,000 మంది ఉక్రెయిన్ నుండి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లినట్టు ఉక్రెయిన్ పేర్కొంది. #Ukrainian Deputy Prime Minister Iryna #Vereshchuk announced that a preliminary agreement on the organization of a humanitarian corridor for the residents of #Mariupol had been reached. pic.twitter.com/WTa57olA3O — NEXTA (@nexta_tv) April 20, 2022 మరోవైపు.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరికల పర్వం కొనసాగుతూనే ఉంది. నాటోలో చేరడం వల్ల భవిష్యత్తులో జరగబోయే పరిణామాల గురించి ఫిన్లాండ్, స్వీడన్లను తాజాగా రష్యా హెచ్చరించింది. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మారియా జఖరోవా ప్రకటించారు. ఇక, యుద్దం వేళ పుతిన్, జెలెన్ స్కీ మధ్య జెరూసలెంలో శాంతి చర్చల సమావేశాన్ని నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయిల్ ఓ ప్రకటనలో తెలిపింది. ‼️#Russia warned #Finland and #Sweden about the consequences of joining #NATO. This was declared by spokeswoman of the Ministry of Foreign Affairs Maria #Zakharova. pic.twitter.com/zt6RqQ7i3T — NEXTA (@nexta_tv) April 20, 2022 ఇదిలా ఉండగా.. బుధవారం రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్‌కు చెందిన 1053 సైనిక కేంద్రాలను తమ దళాలు అటాక్ చేసినట్టు పేర్కొన్నది. ఉక్రెయిన్‌కు చెందిన 73 మిలిటరీ సంస్థలపై తమ దళాలు ఫైరింగ్ చేసినట్లు రష్యా తెలిపింది. ఉక్రెయిన్‌కు చెందిన 106 ఆర్టిల్లరీ ఫైరింగ్ పొజిషన్స్‌తో పాటు ఆరు పైలెట్ రహిత విమానాలను కూల్చినట్లు వెల్లడించింది. హై ప్రిషిషన్ మిస్సైల్ దాడి వల్ల 40 మంది ఉక్రెయిన్ సైనికులు మృతిచెందినట్లు రష్యా తెలిపింది. ఇది చదవండి: బుధవారం రికార్డు స్థాయిలో ఎండలు.. ఆందోళనలో భారత సైంటిస్టులు -
Russia Warns: ఆ దేశాలకు రష్యా న్యూక్లియర్ వార్నింగ్
మాస్కో: నాటో కూటమిలో చేరాలని స్వీడన్, ఫిన్లాండ్ నిర్ణయించుకుంటే తమ అణ్వాయుధాలను స్కాండినేవియన్ దేశాలకు సమీపంగా మోహరించాల్సిఉంటుందని రష్యా మాజీ అధ్యక్షుడు డిమిట్రీ మెద్వదేవ్ హెచ్చరించారు. ఈ దేశాలు నాటోలో చేరితే రష్యాకు నాటో సభ్యదేశాలతో ఉన్న సరిహద్దు రెట్టింపవుతుందని, అలాంటప్పుడు తాము సరిహద్దు భద్రతను పెంచుకోవాల్సిఉంటుందని టెలిగ్రామ్‌లో పోస్టు చేశారు. ఈ దేశాలు నాటో కూటమిలో చేరితే బాల్టిక్ పరిధిలో నాన్ న్యూక్లియర్ స్థితి ఉండదనానరు. గల్ఫ్ ఆఫ్ ఫిన్లాండ్లోకి యుద్ధ నౌకలు కూడా పంపాల్సివస్తుందన్నారు. డిమిట్రీ వ్యాఖ్యలను ప్రభుత్వ ప్రతినిధి పెస్కోవ్ సమర్ధించారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి అనంతరం ఎలాంటి మిలటరీ కూటమిలో చేరకూడదన్న స్కాండినేవియన్ దేశాల ధృక్పథంలో మార్పు వస్తోంది. నాటో సభ్యత్వానికి దరఖాస్తు చేయడంపై చర్చిస్తామని ఫిన్లాండ్, స్వీడన్ తెలిపాయి. మరోవైపు జపాన్ సముద్రంలో రష్యా మిసైల్పరీక్షలు నిర్వహించడాన్ని గమనిస్తున్నామని జపాన్ తెలిపింది. సీ ఆఫ్ జపాన్‌లో అమెరికా, జపాన్ సంయుక్త విన్యాసాలు చేస్తామని ప్రకటించిన మరుసటి రోజు రష్యా జలాంతర్గాముల ద్వారా మిసైల్ పరీక్షలు నిర్వహించింది. చదవండి: (రష్యా యుద్ధనౌకకు భారీ నష్టం) అమెరికాపై ఒత్తిడి రష్యాకు సంబంధించిన ఇంటెలిజెన్స్ సమాచారాన్ని ఉక్రెయిన్‌కు మరింత అందజేయాలని అమెరికాపై ఒత్తిడి పెరుగుతోంది. రష్యాపై యూఎస్ సేకరించిన సమాచారం ఒక్కోమారు ఉక్రెయిన్‌కు అందజేస్తుండగా, కొన్నిమార్లు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. రష్యాతో అణుయుద్ధ ప్రమాదం పెరగకుండా ఉండేలా, ఇంటిలిజెన్స్ సోర్సులను రక్షించేలా సమాచారం అందించాల్సిఉంటుందని యూఎస్ వర్గాలు తెలిపాయి. గతంలో రష్యా ఆధీనంలో ఉన్న ప్రాంతాలకు సంబంధించిన సమాచారం అందించేటప్పుడు అమెరికాకు ఇబ్బందిగా ఉంటోందని తెలిపారు. గతంలో పోగొట్టుకున్న భూభాగాన్ని ఉక్రెయిన్ స్వాధీనం చేసుకునే యత్నం చేస్తుందన్న అనుమానం వచ్చినప్పుడు సమాచారాన్ని పరిమితం చేస్తున్నారు. -
వెరైటీ అంటే ఇదే.. గేదె, ఆవు పాలు కాదు.. ‘ఆలూ పాలు’
సాధారణంగా పొద్దున్నే ఎవరి ఇళ్లలోనైనా రోజు ఎలా మొదలవుతుంది? టీ, కాఫీ లేదా పాలు తాగడంతోనే కదా.. మరి ఇందుకోసం మీరు ఏ పాలు వాడతారని అడిగితే... గేదె పాలు, ప్యాకెట్ పాలు లేదా ఆవు పాలని టక్కున బదులిస్తారు. మరి ఆలూ పాల గురించి మీరెప్పుడైనా విన్నారా? ఆలుగడ్డతో చేసే వంటకాల గురించి తెలుసుగానీ ఆలూతో పాలు ఏమిటా అని ఆశ్చర్యపోతున్నారా? అదే మరి వెరైటీ అంటే... సోయా మిల్క్, ఆల్మండ్ మిల్క్, ఓట్ మిల్క్ తరహాలోనే తాజాగా ఆలూ మిల్క్ మార్కెట్లోకి వచ్చేసింది. ప్రపంచంలోనే వాణిజ్య పద్ధతిలో ఆలుగడ్డల నుంచి పాలను తయారు చేసే ఏకైక స్వీడన్ కంపెనీ అయిన ‘డగ్’ ఈ పాలను తాజాగా యూకేలో ప్రవేశపెట్టింది. జంతువుల నుంచి సేకరించే పాలలాగానే ఆలూ పాలు కూడా చిక్కగా, రుచికరంగా ఉంటాయని కంపెనీ చెబుతోంది. కాఫీ తరహాలో ఉండే లాట్టెస్, కాపిచీనో తయారు చేసుకొనేందుకు ఈ పాలు ఎంతో బాగుంటాయని తెలిపింది. త్వరలోనే ఇతర యూరోపియన్ దేశాలతోపాటు చైనాలో ఆలూ పాలను ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు వివరించింది. స్పందన భారీగానే... మాల్టోడెక్స్ట్రిన్, పీ ప్రొటీన్, చికోరీ ఫైబర్, ర్యాప్‌సీడ్ ఆయిల్, ఫ్రక్టోస్, సూక్రోస్ సహా వివిధ విటమిన్లతో కూడిన ఆలూ పాలను కొనేందుకు ప్రస్తుతం యూకేవాసులు పోటీపడుతున్నారట. ముఖ్యంగా ఇది వెగాన్ ఫ్రెండ్లీ (అంటే జంతురహిత ఉత్పత్తి) కావడంతో శాకాహారులంతా ఈ ఆలూ పాలు కొనేందుకు ఉత్సాహం చూపుతున్నారట. అలాగే జంతువుల నుంచి సేకరించే పాలలో ఉండే లాక్టోస్ (ఒక రకమైన చక్కెర) కొందరికి జీర్ణం కాదు. ‘డగ్’ తయారు చేసే ఆలూ పాలు లాక్టోస్రహితమైనవి కావడం వల్ల కూడా చాలా మంది ఈ పాలు తాగుతున్నారట. దీని ధర సైతం ఆల్మండ్ మిల్క్, సోయా మిల్క్‌తో పోలిస్తే చవకగానే (లీటరుకు సుమారు రూ. 170కి విక్రయిస్తోంది) ఉందని వినియోగదారులు చెబుతున్నారు. రుచి అంతంతే..! అయితే దీన్ని రుచి చూసిన వారిలో కొందరు మాత్రం ఆలూ పాలు అంత గొప్పగా లేవని చెబుతున్నారు. దాని రుచి ‘తటస్థం’గా ఉందని కొందరంటే ఇంకొందరేమో ఆలూ పాలు కాస్త ‘ఉప్ప’గా ఉన్నాయని పెదవి విరుస్తున్నారు. సోయా మిల్క్‌లో ఉండే 8 గ్రాముల ప్రొటీన్, ఓట్ మిల్క్‌లో ఉండే 3 గ్రాముల ప్రొటీన్లతో పోలిస్తే ఆలూ మిల్క్‌లో కేవలం ఒక గ్రాము ప్రొటీన్ (ఒక సర్వింగ్‌కు) మాత్రమే ఉందని ఇంకొందరు పేర్కొన్నారు. అయితే సోయా పాలలో లభించే ప్రొటీన్లకన్నా నాలుగురెట్లు ఎక్కువ ప్రొటీన్లు ఆలూ పాలలో ఉన్నాయని కంపెనీ తెలిపింది. ఆలూనే ఎందుకు? సోయా, ఓట్ మిల్క్‌తో పోలిస్తే ఆలుగడ్డను తక్కువ విస్తీర్ణంలోనే ఎక్కువగా సాగు చేసేందుకు అవకాశం ఉండటం, వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు వీలుండటంతో ఆలూ నుంచి పాల తయారీని లాభదాయక వ్యాపారంగా ఎంచుకున్నట్లు ‘డగ్’ చెబుతోంది. అలాగే తక్కువ నీటి వాడకంతోనే ఆలూ పంట చేతికొచ్చే అవకాశం ఉండటం కూడా ఇందుకు మరో కారణమని కంపెనీ తెలిపింది. అన్నింటికీ మించి ఇతర పాలతో పోలిస్తే కారుచౌకగా ‘ముడిసరుకు’ లభిస్తుందని పేర్కొంది. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
నన్ను కన్నవారు ఎవరంటూ.. స్వీడన్ నుంచి చిన్ననాటి ఫోటోతో..
హుబ్లీ: ధార్వాడలో పుట్టాడు, ఊహ తెలిసే వయసులో స్వీడన్ జంట దత్తత తీసుకుని వెళ్లిపోతే అక్కడే పెరిగి పెద్దయ్యాడు. కానీ తానెవరో, తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవాలనే తపన అతన్ని ఊరికే ఉండనివ్వలేదు. సోషల్ మీడియా ఆధారంగా అన్వేషణ సాగిస్తున్నాడు. 1980వ దశకంలో మూడేళ్ల చిన్నారిగా ఉండగా స్వీడన్ దంపతులు దత్తతకు తీసుకొని తీసుకెళ్లారు. పంతూ జోహన్ పామికిస్ అనే పేరుతో 40 ఏళ్ల వ్యక్తి అయ్యాడు. స్వీడన్లో చిత్రలేఖ కళాకారునిగా సేవలు అందిస్తున్నాడు. పుట్టుక మూలాన్ని తెలుసుకోవాలనే ఆరాటంతో తన చిన్ననాటి ఫోటోను ట్విట్టర్, ఫేస్బుక్ ఇతర సోషియల్‌మీడియాలో పోస్టు చేశాడు. తనకు మిగిలిన ఆధారం ఈ ఫోటోనేనని, తన కన్నవారు ఎవరో తెలియజేయాలని వేడుకొంటున్నాడు. తల్లి ముఖం అస్పష్టంగా గుర్తుందని తెలిపాడు. ప్రధాని మోదీ, పీఎం ఆఫీసు ట్విట్టర్ ఖాతాలకూ ట్యాగ్ చేశాడు. ఈ నేపథ్యంలో అతని వినతిని పరిశీలించాలని ధార్వాడ ఎస్పీ కృష్ణకాంత్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. -
ప్రభుత్వానికి ఖర్చులు తగ్గిస్తున్న కాకులు.. ఎలాగో తెలుసా?
నీళ్లు తాగడానికి ఓ కుండ దగ్గరకు వెళ్లిన కాకికి అందులోని నీళ్లు అందకపోతే రాళ్లు తీసుకొచ్చి కుండలో వేసి నీళ్లు పైకి రాగానే తాగేసిన కథను విని ఉంటారు. మరి అదే కాకికి ఆకలేస్తే..! ఏముంది రోడ్డుపై పడేసిన చెత్తను తీసుకొచ్చి ఓ డబ్బాలో వేస్తే చాలు. అలా చెత్త వేయగానే ఇలా తిండి బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు స్వీడన్లో కాకులు ఇదే పని మీదున్నాయి. చెత్తను డబ్బాల్లో వేస్తూ తిండి సంపాదిస్తున్నాయి. పక్క కాకులకు కూడా ఈ ట్రిక్‌ను నేర్పిస్తున్నాయి. అసలు కాకులు అలా ఎందుకు చేస్తున్నాయి, చెత్తను డబ్బాలో వేస్తే తిండి వస్తుందని వాటికెలా తెలిసింది, దాని వల్ల ప్రజలకు, సిటీకేంటి లాభం, తెలుసుకుందామా? చెత్త సమస్యకు చెక్ పెట్టేందుకు.. స్వీడన్ ప్రజలు వీధుల్లో ఎక్కడ పడితే అక్కడ చెత్తను పడేస్తున్నారు. సిగరెట్ తాగి పీకలను రోడ్డుపై విసిరేస్తున్నారు. ఆ దేశ వీధుల్లో పడే చెత్తలో దాదాపు 62 శాతం సిగరెట్ పీకలే ఉంటున్నాయని స్వీడన్ టైడీ ఫౌండేషన్ చెబుతోంది. అక్కడి వీధుల్లో ఏటా దాదాపు 100 కోట్ల వరకు సిగరెట్ పీకలను పడేస్తున్నారంటోంది. ఇవే సిగరెట్ పీకలు, చెత్త సమస్యతో స్వీడన్ లోని సోడెర్టాల్జె మున్సిపా లిటీ కూడా ఇబ్బంది పడుతోంది. రహదారులను పరిశుభ్రం చేసేందుకు ఏటా దాదాపు రూ. 16 కోట్లను ఆ మున్సిపాలిటీ ఖర్చు చేస్తోంది. దీంతో ఆ నగరంలోని స్టార్టప్ సంస్థ ‘కోర్విడ్ క్లీనింగ్’ తెలివిగా కాకులను రంగంలోకి దింపింది. చెత్తను, సిగరెట్ పీకలను తీసుకెళ్లి ఓ డబ్బాలో పడేసేలా శిక్షణ ఇచ్చింది. ఆ వెంటనే ఆ డబ్బా నుంచి తిండి వచ్చేలా ఏర్పాటు చేసింది. ఇందుకు ఆ సంస్థ ఓ డబ్బాను రూపొందించింది. కాకులనే ఎందుకు? కోర్విడ్ జాతికి చెందిన న్యూ కెలడోనియా కాకులు చాలా తెలివైనవని ఒక పరిశోధనలో వెల్లడైంది. ఏడేళ్లున్న మనిషి ఎలాగైతే ఆలోచిస్తాడో అచ్చం అలా ఆలోచించే సామర్థ్యం వీటి సొంతమని తేలింది. ఇవి ఏదైనా సరే చాలా త్వరగా నేర్చుకుంటాయి. పక్క వాటికి నేర్పిస్తాయి కూడా. ఈ పక్షులకే ఇప్పుడు చెత్త క్లీనింగ్‌పై శిక్షణనిచ్చారు. సిగరెట్ పీకలను, చెత్తను ఆహారం అనుకొని తినే అవకాశమే లేదని తేలింది. వీటి గురించి ఇన్ని విషయాలు తెలుసుకున్నాకే శిక్షణ ఇచ్చారు. ఏమైనా లాభముందా? మున్సిపాలిటీ సిబ్బందికి ఒక్కో సిగరెట్ పీకను తీయడానికి అయ్యే ఖర్చుల్లో నాలుగో వంతు ఖర్చు చేస్తే చాలు కాకులు ఆ పని చేసి పెడుతున్నాయి. అంటే మొత్తంగా పీకలను తీయడానికి అయ్యే ఖర్చులో దాదాపు 75% తగ్గించేస్తున్నాయి. ఇప్పటి వరకు కాకులకే శిక్షణ ఇచ్చామని, మున్ముందు మరిన్ని రకాల పక్షులకు శిక్షణ ఇస్తామని అధికారు లు చెబుతున్నారు. ఇది కేవలం నగరాన్ని పరిశు భ్రంగా ఉంచడానికి మాత్రమే కాదని.. ప్రజలు కూడా వారి పరిసరాలను శుభ్రంగా ఉంచుకునేలా చేయాలనేదే తమ ఉద్దేశమని చెప్పారు. మనుషులు నేర్చుకునేదెప్పుడో! ఏదేమైనా చెత్తను తొలగించడానికి పక్షులకు కూడా శిక్షణ ఇస్తున్నాం కానీ.. చెత్త వేయొద్దని మనుషులకు చెప్పలేకపోతున్నామని అక్కడి అధికారులు అంటున్నారు. కాకులు చెత్త తీసుకెళ్లడంపై కొందరు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ‘ఇప్పుటికైతే చెత్తను తీసుకెళ్లే పనే పక్షులకు అప్పగించారు. ఇకముందు చెత్త వేస్తే చాలు.. వచ్చి వెనక నుంచి తన్నేలా శిక్షణనిస్తారేమో’ అని ఫన్నీగా అంటున్నారు. సాక్షి, సెంట్రల్ డెస్క్ -
ప్రపంచంలోనే అతి చిన్న ఇయర్‌ఫోన్స్, సోలార్‌పవర్‌తో ఛార్జ్..!
ప్రముఖ స్వీడిష్ ఆడియో బ్రాండ్ అర్బనిస్టా(Ubanista) భారత మార్కెట్లలోకి అడుగుపెట్టింది. టీడబ్ల్యూఎస్ కేటగిరీలోనే కాకుండా, హెడ్‌ఫోన్, ఇయర్‌ఫోన్ ఉత్పత్తులను భారత్‌లో ప్రవేశ పెట్టనుంది. ప్రత్యేక ఆకర్షణగా సోలార్ హెడ్‌సెట్స్..! ప్రపంచవ్యాప్తంగా 90 దేశాలలో అర్బనిస్టా అందుబాటులో ఉంది. కంపెనీ పోర్ట్‌ఫోలియోలోని లాస్ ఏంజెల్స్ మోడల్, లిస్బాన్ మోడల్ ఇయర్‌ఫోన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. లాస్ ఏంజెల్స్ టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ సోలార్ పవర్‌తో ఛార్జ్ చేయవచ్చును. ఇకపోతే లిస్బాన్ మోడల్ ఇయర్‌బడ్స్ ప్రపంచంలోనే అతి చిన్న టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్‌గా నిలుస్తున్నాయి. ఈ సందర్భంగా అర్బనిస్టా సీఈఓ అండర్స్ ఆండ్రీన్ మాట్లాడుతూ...“భారత మార్కెట్‌కు మా ఉత్పత్తులను పరిచయం చేయడానికి మేము చాలా సంతోషిస్తున్నాము. ప్రపంచ మొబైల్ క్యాపిటల్‌గా భారత్ నిలుస్తున్నందున , మా బ్రాండ్ ఉత్పత్తులు భారతీయులను ఆకట్టుకుంటాయ’ని అన్నారు. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లోని ప్రీమియం ఆఫ్‌లైన్ రిటైలర్ స్టోర్లలో ,ఎంపిక చేసిన యాపిల్ ప్రీమియం ఐఫోన్ రీసెల్లర్ స్టోర్ అందుబాటులో ఉంటాయని అర్బనిస్టా ఇండియా హెడ్ విజయ్ కణ్ణన్ తెలిపారు. అంతేకాకుండా త్వరలోనే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ప్రధాన ఈ కామర్స్ సైట్లలో కూడా అందుబాటులో ఉంటాయని అన్నారు. భారత్‌లో బూమ్..! ఆడియో ఉత్పత్తుల విభాగంలో భారత్ 11 బిలియన్ డాలర్ల మార్కెట్‌ను కల్గి ఉంది. ప్రపంచంలోనే ఆడియో ఉత్పత్తుల్లో భారత్ అతి పెద్ద మార్కెట్‌గా నిలుస్తోంది. దీంతో ఆయా విదేశీ కంపెనీలు భారత్‌కు వచ్చేందుకు సిద్ధమైనాయి. యాక్టివ్ నాయిస్ క్యాన్సలింగ్, ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్, బ్లూటూత్ స్పీకర్స్‌కు భారీ ఆదరణ లభిస్తోంది. చదవండి: Amazon Saving Sales: త్వరపడండి..! మొబైల్, టీవీలపై భారీ తగ్గింపును ప్రకటించిన అమెజాన్..! -
7 గంటల్లో దిగిపోయినా మళ్లీ స్వీడన్ పీఠంపై ఆండర్సన్
కోపెన్‌హాగెన్(డెన్మార్క్): స్వీడన్ ప్రధాని పీఠంపై మహిళా నేత మాగ్డలీనా ఆండర్సన్ వారం రోజుల వ్యవధిలోనే మళ్లీ ఆసీనులయ్యారు. కూటమి ప్రభుత్వంలోని పార్టీ మద్దతు ఉపసంహరిం చడంతో గత వారం పదవికి రాజీనామా చేసిన ఆమె సోమవారం మళ్లీ ప్రధానిగా ఎన్నికయ్యారు. 349 సీట్లు ఉన్న స్వీడన్ పార్లమెంట్లో ప్రధాని పదవికి జరిగిన ఓటింగ్‌లో ఈమెకు మద్దతుగా 101 ఓట్లు పడ్డాయి. 75 మంది గైర్హాజరయ్యారు. స్వీడన్ రాజ్యాంగం ప్రకారం ప్రధానిగా ఎన్నుకోబడే వ్యక్తిని ఓటింగ్‌లో 175కు మించి సభ్యులు వ్యతిరేకించకూడదు. అంటే వ్యతిరేకంగా 175 ఓట్లు పడితే ఆ ప్రభుత్వం కొలువుతీరదు. అదృష్టవశాత్తు ఆండర్సన్‌కు వ్యతిరేకంగా 173 ఓట్లే పడ్డాయి. దీంతో మైనారిటీలో ఉన్నా సరే సోషల్ డెమొక్రటిక్ పార్టీ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటైంది. గత వారం గ్రీన్ పార్టీతో సోషల్ డెమొక్రటిక్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వాన్నిఏర్పాటుచేసింది. దేశ తొలి మహిళా ప్రధానిగా ఆండర్సన్ బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించారు. అంతకుముందే ఆర్థికమంత్రిగా ఉన్న ఆమె అదే హోదాలో బడ్జెట్‌ను వెంటనే ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్ ప్రతిపాదనలు విపక్ష స్వీడన్ డెమొక్రాట్స్ పార్టీ విధానాలకు అనుకూలంగా ఉన్నాయంటూ కూటమి ప్రభుత్వం నుంచి గ్రీన్ పార్టీ వైదొలగింది. దీంతో ఆరోజు కేవలం ప్రధాని అయిన ఏడు గంటలకే ఆండర్సన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. -
స్వీడన్‌కు తొలి మహిళా ప్రధాని.. గంటల వ్యవధిలోనే రాజీనామా
కోపెన్హగెన్: స్వీడన్ తొలి మహిళా ప్రధానమంత్రిగా ఎంపికై చరిత్ర సృష్టించిన 54 ఏళ్ల మాగ్డలినా అండర్సన్ గంటల వ్యవధిలోనే తన పదవికి రాజీనామా చేశారు. బుధవారం పార్లమెంట్లో ఆమె ప్రవేశపెట్టిన బడ్జెట్ విఫలం కావడంతోపాటు రెండు పార్టీల సంకీర్ణ ప్రభుత్వం నుంచి గ్రీన్స్ పార్టీ బయటకు వెళ్లిపోవడమే ఇందుకు కారణం. అంతకుముందు నూతన ప్రధానిగా మాగ్డలినా ఎంపికకు స్వీడన్ పార్లమెంట్ ‘రిక్స్‌డాగ్’ ఆమోదం తెలిపింది. దేశ ఆర్థిక శాఖ మంత్రిగా పని చేస్తున్న మాగ్డలినా ఇటీవలే సోషల్ డెమొక్రటిక్ పార్టీ నూతన అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. స్వీడన్ ప్రధానిగా, పార్టీ అధినేతగా వ్యవహరించిన స్టెఫాన్ లవ్ఫెన్ కొన్ని రోజుల క్రితం రెండు పదవుల నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలోకి మాగ్డలినా వచ్చేందుకు రంగం సిద్ధం కాగా, ఆర్థిక మంత్రిగా ఆమె ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు పార్లమెంట్ ఆమోదం లభించలేదు. అంతేకాకుండా ప్రభుత్వం నుంచి బయటకు వస్తున్నట్లు గ్రీన్స్ పార్టీ తేల్చిచెప్పింది. దీంతో ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు మాగ్డలినా ప్రకటించారు. రాజీనామా లేఖను పార్లమెంట్ స్పీకర్‌కు పంపించారు. స్వీడన్ పార్లమెంట్లో 349 మంది సభ్యులున్నారు. వీరిలో 117 మంది మాగ్డలినాకు అనుకూలంగా, 174 మంది వ్యతిరేకంగా ఓటేశారు. 57 మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఒకరు గైర్హాజరయ్యారు. స్వీడన్ రాజ్యాంగం ప్రకా రం పార్లమెంట్లో సగం మంది.. అంటే 175 మంది వ్యతిరేకించనంత కాలం ప్రధానమంత్రి తన పదవిలో కొనసాగవచ్చు. స్వీడన్లో తదుపరి సాధారణ ఎన్నికలు వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో జరగనున్నాయి. -
Gayatri, Nishit Reddy: స్వీడన్లో పెళ్లి.. నిర్మల్‌లో విందు
సాక్షి, నిర్మల్: ఇప్పుడంతా ఆన్లైన్ జమానా. జూమ్‌లో మీటింగ్‌లు, వాట్సప్‌లో వీడియో కాలింగ్లే కాదు.. ఏకంగా ఆన్లైన్లో పెళ్లిళ్లు చేసుకునే రోజులొచ్చాయి. ఈ మధ్య నిర్మల్ జిల్లా భైంసాలో ఓ పెళ్లి ఇలాగే జరుగగా, ఇప్పుడు జిల్లాకేంద్రంలోనే ఇలాంటి వివాహం మరొకటి నిర్వహించారు. ఎక్కడో.. స్వీడన్లో జరుగుతున్న పెళ్లిని ఇక్కడున్న కుటుంబమంతా ఆన్లైన్లో వీక్షించారు. చదవండి: (హన్మయ్య నీది ఎంతపెద్ద మనసయ్య.. వారి రుణం తీర్చుకోవడం కోసం..) వివరాల్లోకి వెళ్తే.. జిల్లాకేంద్రానికి చెందిన అబ్బడి మంజుల–శ్రీనివాస్‌రెడ్డిల కుమార్తె గాయత్రి, ఎర్ర ప్రసాద్‌రెడ్డి–పుష్పలతల కుమారుడు నిశిత్‌రెడ్డి ఇద్దరూ సాఫ్ట్వేర్లే. ఉద్యోగరీత్యా వీరిద్దరూ స్వీడన్లో ఉంటున్నారు. స్వదేశంలో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. పెళ్లి సమయానికి కరోనా నిబంధనలు అడ్డువచ్చాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ఆన్లైన్ పెళ్లికి సిద్ధమయ్యారు. స్వీడన్‌లోని స్టాక్‌హోంలో గల గణేశ్ ఆలయంలో ఆదివారం ఇక్కడి కాలమాన ప్రకారం 12గంటలకు వివాహం చేసుకున్నారు. చదవండి: (‘అమ్మా లే అమ్మ.. నాన్నా లే నాన్న.. మమ్మల్ని ఎవరు చూస్తారు') అక్కడి స్నేహితులు, వారి కుటుంబసభ్యుల సహకారంతో పూర్తిగా సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. నిర్మల్‌లోని బాలాజీ అపార్ట్మెంట్లో ఉండే వారి కుటుంబాలు పెద్ద టీవీ స్క్రీన్ ఏర్పాటు చేసుకుని తమ పిల్లల పెళ్లిని వీక్షించారు. ఆన్లైన్లో ఆశీర్వదించేశారు. బంధుమిత్రులు లైవ్‌లోనే కొత్తజంటకు పెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. అక్కడ పెళ్లయిన తర్వాత ఇక్కడ విందు ఆరగించారు. -
వేర్వేరు సంస్థల టీకాలు..
లండన్: కోవిడ్ టీకా రెండు డోసుల్లోనూ ఆస్ట్రాజెనెకా(కోవిషీల్డ్)ను తీసుకున్న వారితో పోలిస్తే ఒక డోసు ఆస్ట్రాజెనెకా, ఎంఆర్ఎన్ఏ ఆధారంగా తయారు చేసిన టీకా మరో డోసు తీసుకుంటే మహమ్మారి ముప్పు తక్కువగా ఉంటోందని స్వీడన్లో చేపట్టిన ఒక అధ్యయనంలో తేలింది. ఈ మేరకు చేపట్టిన ‘మిక్స్ అండ్ మ్యాచ్’అధ్యయనం ఫలితాలు సోమవారం లాన్సెట్ రీజినల్ హెల్త్–యూరప్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. వెక్టార్ ఆధారిత ఆస్ట్రాజెనెకా టీకా తీసుకున్న 65 ఏళ్లు పైబడిన వారిలో సైడ్ ఎఫెక్ట్స్ కనిపించడంతో స్వీడన్లో ఈ టీకా వినియోగాన్ని నిలిపివేశారు. దీంతో, అప్పటికే ఆస్ట్రాజెనెకా మొదటి డోసుగా తీసుకున్న వారికి, ఎంఆర్ఎన్ఏ ఆధారిత టీకాను రెండో డోసుగా తీసుకోవచ్చని నిపుణులు సిఫారసు చేశారు. దీంతో కొందరు రెండో డోసుగా ఫైజర్/ మోడెర్నా టీకాను తీసుకున్నారు. ఇలా, స్వీడన్లో వేర్వేరు డోసులు తీసుకున్న సుమారు 7 లక్షల మంది నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ఈ సర్వే జరిగింది. ‘వెక్టార్ బేస్డ్ టీకా ఆస్ట్రాజెనెకాను మొదటి డోసుగా, ఎంఆర్ఎన్ఏ బేస్డ్ వ్యాక్సిన్‌ను రెండో డోసుగా తీసుకున్న వారిలో కోవిడ్ ముప్పు తగ్గుతోందని గమనించాం’అని పరిశోధకులు చెప్పారు. ఈ అధ్యయనంలో ఆస్ట్రాజెనెకా, ఫైజర్ వ్యాక్సిన్లను కలిపి తీసుకున్న వారిలో కోవిడ్ ఇన్ఫెక్షన్ ముప్పు 67% తగ్గుముఖం పడుతున్నట్లు గుర్తించారు. అదే, ఆస్ట్రాజెనెకా, మోడెర్నా వ్యాక్సిన్లను వేర్వేరు డోసులుగా తీసుకున్న వారిలో, అసలు టీకా తీసుకోని వారితో పోలిస్తే కోవిడ్ ముప్పు 79% వరకు తగ్గుతున్నట్లు గుర్తించారు. రెండు డోసుల్లోనూ ఆస్ట్రాజెనెకా (కోవిషీల్డ్) టీకా తీసుకున్న వారికి కోవిడ్ ముప్పు 50%మాత్రమే తగ్గుతున్నట్లు కూడా గుర్తించామన్నారు. -
గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్-2021లో మెరుగైన భారత్ ర్యాంకు
గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2021లో భారత్ తన ర్యాంకులను మెరుగుపరుచుకుంది. తాజాగా ప్రపంచ మేధో సంపత్తి సంస్థ విడుదల చేసిన గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2021 ర్యాంకింగ్స్‌లో భారత్ 36.4 స్కోరుతో 46వ స్థానంలో ఉంది. గత ఏడాది 2020తో పోలిస్తే భారత్ రెండు స్థానాలు మెరుగుపరుచుకుంది. అగ్రస్థానంలో 65.5 స్కోరుతో స్విట్జర్లాండ్ ఉండగా, స్వీడన్ 63.1 రెండవ, అమెరికా (61.3) మూడవ, బ్రిటన్ (59.8) నాల్గవ, రిపబ్లిక్ ఆఫ్ కొరియా(59.3) ఐదవ స్థానంలో ఉన్నాయి. భారత్ గత కొన్ని సంవత్సరాలుగా గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్(జీఐఐ)లో తన స్థానాన్ని వేగంగా మెరుగుపరుచుకుంది. 2015లో 81 ర్యాంక్ నుంచి 2021లో 46కు చేరుకుంది. కరోనా మహమ్మారి సృష్టించిన సంక్షోభ సమయంలో కూడా సృజనాత్మకత విషయంలో భారత్ ముందంజలో ఉంది. భారత ప్రధాన మంత్రి పిలుపునిచ్చిన ఆత్మ నిర్భర్ భారత్ ప్రస్తుతం దేశంలో కీలకంగా మారింది. ప్రభుత్వ, ప్రైవేట్ పరిశోధన సంస్థలు చేస్తున్న పనులు, అణుశక్తి శాఖ వంటి శాస్త్రీయ విభాగాలు; డిపార్ట్ మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ; డిపార్ట్ మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ; డిపార్ట్ మెంట్ ఆఫ్ స్పేస్ సంస్థలు నేషనల్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌ను సుసంపన్నం చేయడంలో కీలక పాత్ర పోషించాయి. అలాగే, ఎలక్ట్రిక్ వాహనాలు, బయోటెక్నాలజీ, నానో టెక్నాలజీ, ప్రత్యామ్నాయ ఇంధన వనరులు మొదలైన విభిన్న రంగాలలోని విధానాలలో ఆవిష్కరణలను తీసుకొని రావడం కోసం నీతి ఆయోగ్ కృషి చేస్తోంది. ఈ ర్యాంకింగ్స్‌లో అంగోలా దేశం చివరి స్థానం(130)లో ఉంది.(చదవండి: వీటి కోసం గూగుల్‌లో వెతికితే ప్రమాదమే..!) -
స్వీడన్ లాజిస్టిక్స్ కంపెనీలో ఆల్కార్గోకు వాటాలు
ముంబై: స్వీడన్‌కు చెందిన లాజిస్టిక్స్ కంపెనీ నార్డికాన్ గ్రూపులో 65 శాతం వాటాలను కొనుగోలు చేసినట్టు ఆల్కార్గో లాజిస్టిక్స్ ప్రకటించింది. నార్డిక్స్ ప్రాంతంలో (డెన్మార్క్, నార్వే, స్వీడన్‌తో కూడిన ఉత్తర యూరోప్) రైల్ కన్సాలిడేషన్ విభాగం, ఎల్సీఎల్లో నార్డిక్స్ గ్రూపు మార్కెట్ లీడర్‌గా ఉంది. బెల్జియం అనుబంధ సంస్థ ఆల్కార్గో బెల్జియమ్ రూపంలో వాటాలను కొనుగోలు చేసినట్టు ఆల్కార్గో లాజిస్టిక్స్ తెలిపింది. 2003లో ఈసీయూ వరల్డ్వైడ్ను సొంతం చేసుకున్న తర్వాత ఆల్కార్గోకు ఇది మూడో కొనుగోలు కావడం గమనార్హం. 2019లో రూ.416 కోట్లతో గతి సంస్థలోనూ వాటాలను కొనుగోలు చేసిన విషయం విదితమే. మార్కెట్ ఆధిపత్యాన్ని కొనసాగించడంతోపాటు.. కొత్త ప్రాంతాలకు విస్తరించే వ్యూహంలో భాగమే ఈ కొనుగోలు అని ఆల్కార్గో లాజిస్టిక్స్ గ్రూపు చైర్మన్ శశికిరణ్ శెట్టి తెలిపారు. -
44 మ్యాచ్‌ల తర్వాత...
టోక్యో: నాలుగుసార్లు ఒలింపిక్ పసిడి పతక విజేత అమెరికా మహిళల ఫుట్‌బాల్ జట్టుకు టోక్యో ఒలింపిక్స్ తొలి మ్యాచ్‌లోనే చుక్కెదురైంది. ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ హోదాలో గోల్డ్ మెడల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన అమెరికాకు 2016 రియో ఒలింపిక్స్ రన్నరప్ స్వీడన్ జట్టు షాక్ ఇచ్చింది. గ్రూప్ ‘జి’లో భాగంగా బుధవారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో అమెరికా 0–3 గోల్స్ తేడాతో స్వీడన్ చేతిలో ఓడింది. గత 44 మ్యాచ్‌ల్లో ఓటమెరుగని అమెరికాకు స్వీడన్ రూపంలో పరాభవం తప్పలేదు. బ్లాక్స్టెనియస్ (25వ, 54వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... మరో గోల్‌ను లినా హర్టిగ్ (72వ నిమిషంలో) చేసింది. గ్రూప్ ‘జి’లోనే జరిగిన మరో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 2–1తో న్యూజిలాండ్‌పై గెలిచింది. ఆస్ట్రేలియా ప్లేయర్లు తమెక యలోప్ (20వ నిమిషంలో), స్యామ్ కెర్ (33వ నిమిషంలో) చెరో గోల్ సాధించారు. న్యూజిలాండ్ తరఫున నమోదైన ఏకైక గోల్‌ను గబీ రెనీ (90+1వ నిమిషంలో) చేసింది. గ్రూప్ ‘ఇ’లో జరిగిన పోరులో బ్రిటన్ 2–0 గోల్స్‌తో చిలీపై గెలుపొందింది. బ్రిటన్ తరఫున ఎలెన్ వైట్ (17వ, 72వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేసింది. గ్రూప్ ‘ఇ’లోనే జపాన్, కెనడా మధ్య జరిగిన మ్యాచ్ 1–1తో ‘డ్రా’గా ముగిసింది. కెనడా ప్లేయర్ క్రిస్టినే (12వ నిమిషంలో) గోల్ చేయగా... జపాన్ క్రీడాకారిణి మనా ఇవబుచి (84వ నిమిషంలో) గోల్ చేసింది. గ్రూప్ ‘ఎఫ్’లో జరిగిన పోరుల్లో నెదర్లాండ్స్ 10–3తో జాంబియాపై, బ్రెజిల్ 5–0తో చైనాపై గెలిచాయి. ఒలింపిక్స్ క్రీడలు అధికారికంగా శుక్రవారం ఆ ఆరంభమ వుతాయి. అయితే ఫుట్‌బాల్ మ్యాచ్‌లను మాత్రం రెండు రోజుల ముందుగానే ప్రారంభిస్తారు. మరోవైపు మహిళల సాఫ్ట్‌బాల్ పోటీలు కూడా బుధవారమే మొదలయ్యాయి. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ జపాన్ జట్టు 8–1తో ఆస్ట్రేలియాపై ఘనవిజయం సాధించింది. జాత్యహంకారానికి వ్యతిరేకంగా... ఒలింపిక్స్ పోటీల ఆరంభ రోజు మహిళా ఫుట్‌బాల్ ప్లేయర్లు జాత్యహంకారానికి వ్యతిరేకంగా తమ నిరసనను తెలియజేశారు. బ్రిటన్, చిలీ మధ్య మ్యాచ్ ఆరంభానికి ముందు రెండు జట్ల క్రీడాకారిణులు మోకాలిపై కూర్చొని జాతి వివక్ష అంతం కావాలని ఆకాంక్షించారు. అనంతరం అమెరికా, స్వీడన్ ప్లేయర్లు కూడా ఈ విధంగానే చేశారు. ఒలింపిక్స్ మొదలవ్వడానికి రెండు రోజుల ముందే మహిళల ఫుట్‌బాల్ మ్యాచ్‌లు ఆరంభమయ్యాయి. బుధవారం మొదటి రౌండ్ తొలి అంచె మ్యాచ్‌లు జరిగాయి. మొత్తం 12 జట్లు పోటీలో ఉండగా.... గ్రూప్‌కు నాలుగు జట్ల చొప్పున మూడు గ్రూప్‌లు (ఇ, ఎఫ్, జి)గా విభజించారు. ఫురుషుల విభాగంలో నేటి నుంచి మ్యాచ్‌లు ఆరంభమవుతాయి. ఇందులో 16 జట్లు పాల్గొంటుండగా... నాలుగు టీమ్‌లు చొప్పున నాలుగు గ్రూప్‌లుగా (ఎ, బి, సి, డి) విభజించారు. తొలి రౌండ్లో భాగంగా ప్రతి గ్రూప్‌లోని ఒక జట్టు మిగిలిన జట్లతో మూడేసి మ్యాచ్‌లను ఆడనుంది. -
కూలిన విమానం.. తొమ్మిది మంది దుర్మరణం
Sweden Plane Crash స్వీడన్లో చిన్నసైజు విమానం కూలిన దుర్ఘఘటనలో తొమ్మిది మంది మృతి చెందారు. మృతుల్లో పైలట్ సహా ఎనిమిది మంది స్కై డైవర్లు ఉన్నట్లు సమాచారం. గురువారం స్టాక్‌హోంకి వంద మైళ్ల దూరంలో ఉన్న ఒరెబ్రో ఎయిర్పోర్ట్ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే స్వీడన్ జాయింట్ రెస్క్యూ కో ఆర్టినేషన్ సెంటర్ ప్రతినిధులు సహాయక చర్యలకు రంగంలోకి దిగారు. విమానం దిగే టైంలోనే ఘటన జరిగిందని భావిస్తున్నారు. కాగా, ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన స్వీడన్ ప్రభుత్వం.. బాధితుల కుటుంబాలను ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించింది. 2019లో ఇలాగే ఓ చిన్న విమానం స్కై డైవర్లతో వెళ్తుండగా.. ఈశాన్య స్వీడన్‌లోని ఉమేయాలో ఘోర ప్రమాదానికి గురైంది. -
‘క్యూబూల్ హై’ అనగానే ముద్దుపెట్టేసిన వధువు
స్టాక్‌హోమ్: పెళ్లి అనేది నూరేళ్ల పంట. వివాహం అనేది ప్రతి జంట జీవితంలో ప్రత్యేకమైన రోజు. అయితే కొంతమంది కాబోయే దంపతులకు ప్రణాళిక ప్రకారమే అన్నీ జరుగుతాయా అనే ఆందోళన ఉంటే..మరికొందరు ఆనందంగా ఉంటారు. అయితే తాజాగా స్వీడన్‌కి చెందిన ఓ పెళ్లి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వివాహ వేడుకలో పెళ్లి కొడుకు ‘క్యూబూల్ హై’( నేను అంగీకరిస్తున్నాను) అని చెప్పిన వెంటనే వధువు ఎనలేని సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఆనందంతో ఎగిరి గంతేసింది. వరుడిని హత్తుకుని ముద్దు పెట్టుకుంది. కాగా ఈ వీడియోలో వివాహానికి వచ్చిన అతిథలు చుట్టూ వరుసలో కూర్చున్నారు. అయితే వధువు మొదట తన ఆనందాన్ని వ్యక్తం చేయడానికి సంశయించినా...బంధువుల ప్రోత్సాహంతో తన ఉత్సాహాన్ని వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ వీడియోను ‘‘నిత్యం సంతోషంగా ఉండే భార్య’’ అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా..15 వేల మంది నెటిజన్లు వీక్షించారు. వధువు ఉత్సాహాన్ని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. నూతన వధూవరులు సంతోషకరమైన వివాహ జీవితాన్ని గడపాలని ఆశీర్వదిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. "మీ ఇద్దరికీ అభినందనలు" అంటూ వ్యాఖ్యానించారు. అయితే మరో నెటిజన్ "ఇప్పుడు రక్తం పీల్చడానికి లైసెన్స్ పొందండి." అంటూ చమత్కరించారు. View this post on Instagram A post shared by |~|@m€€[) (@romantic_cute_prince) (చదవండి: ధనవంతులు ఎక్కువగా ఇష్టపడే దేశం తెలుసా?) -
మంచు హోటల్: ఎండాకాలంలో కూడా కరగదట
ఎంత పెద్ద ఐసు గడ్డ అయినా రెండు నిమిషాలు ఎండలో పెడితే కరగడం మొదలు పెడుతుంది. అటువంటిది ఐస్‌తో నిర్మించిన ఓ హోటల్ ఎండాకాలంలో కూడా కరగదట. ఏ సీజన్లోనైనా ఈ ఐస్ హోటల్ పర్యాటకులకు ఆతిథ్యం ఇస్తుందని హోటల్ యాజమాన్యం చెబుతోంది. ఎండలో కూడా కరగని చిత్రమైన హోటల్ ఉత్తర స్వీడన్‌లోని జకాస్జర్వీ అనే గ్రామంలో ఉంది. 2,100 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ హోటల్లో అనేక మంచు కళా ఖండాలతో ఆకర్షణీయమైన డిలక్స్ సూట్లు ఉన్నాయి. హోటల్ మొత్తాన్నీ స్టీల్, కాంక్రీట్‌తో నిర్మించారు. పై కప్పును 20 సెంటీమీటర్ల ఇన్సులేషన్‌తో నిర్మించడం వల్ల ఎండాకాలం లో కూడా హోటల్ కరగదు. ఇన్నీ హంగులున్న ఈ హోటల్ పేరు ‘ఐస్ హోటల్ 365’ పేరుకు తగ్గట్టుగానే ఇది సంవత్సరం మొత్తం పర్యాటకులకు ఆతిథ్యం ఇస్తోంది. ఈ హోటల్లో ఎంతో సౌకర్యవంతమైన బెడ్స్, టాయిలెట్స్ ఉన్నాయి. మొత్తం తొమ్మిది రకాల డిలక్స్ రూంలను మూడు పద్దతుల్లో అందుబాటులో ఉంచుతారు. స్వీడన్‌లోని కిరుణ ఎయిర్‌పోర్టు నుంచి ఈ హోటల్‌కు 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. ప్రతిఏటా ఈ హోటల్‌ను 50 నుంచి 60 వేలమంది వరకు సందర్శిస్తుంటారు. ఐస్ తో తయారు చేసిన ఈ హోటల్ 2016 నవంబర్ నుంచి పర్యాటకులకు అందుబాటులో ఉంది. -
గ్రెటా థన్‌బర్గ్‌పై కేసు నమోదు!
న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌తో పోరాటం కొనసాగిస్తున్న రైతులకు సంఘీభావం ప్రకటిస్తూ ట్వీట్లు చేసిన స్వీడన్ పర్యావరణ ఉద్యమకారిణి, 18 ఏళ్ల గ్రెటా థన్‌బర్గ్‌పై ఢిల్లీ పోలీసులు గురువారం కేసు నమోదు చేసినట్లు సమాచారం. మతం, జాతి, భాష, పుట్టిన ప్రాంతం ఆధారంగా వివిధ గ్రూప్‌ల మధ్య శత్రుత్వాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నారన్న కారణంతోపాటు విదేశాల నుంచి కుట్రలు సాగిస్తున్న ఆరోపణలతో ఆమెపై కేసు పెట్టినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ గ్రెట్గా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. తాను ఇప్పటికీ రైతులకు మద్దతు ప్రకటిస్తున్నానని స్పష్టం చేస్తూ మరో ట్వీట్ చేశారు. బెదిరింపులు, కేసులు తన వైఖరిని మార్చలేవని తేల్చిచెప్పారు. భారత్‌లో రైతన్నల ఆందోళనలు, నిరసనలపై రెండు రోజుల క్రితం థన్‌బర్గ్ చేసిన ట్వీట్లు అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించాయి. ఆమెను తప్పుపడుతూ భారత్‌లో పలువురు ప్రముఖులు ట్వీట్లు చేశారు. తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం తగదంటూ హితవు పలికారు. థన్‌బర్గ్ ట్వీట్లు వివాదాస్పదం కావడంతో ఢిల్లీ సైబర్ సెల్ పోలీసులు వీటిపై దర్యాప్తు ప్రారంభించారు. థన్‌బర్గ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు స్పష్టమవుతోంది. ‘థన్‌బర్గ్‌కు సాహస బాలిక అవార్డివ్వాలి’ గ్రెటా థన్‌బర్గ్‌కు భారత ప్రభుత్వం సాహస బాలిక పురస్కారం ప్రదానం చేయాలని బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖీ గురువారం పేర్కొన్నారు. దేశాన్ని అస్తిరపర్చేందుకు జరుగుతున్న కుట్రకు సంబంధించిన పత్రాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసినందుకు గ్రెటా థన్‌బర్గ్‌కు ఈ అవార్డు ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు. రైతులకు మద్దతు పేరిట భారతదేశాన్ని అస్తిరపర్చేందుకు కొన్ని శక్తులు కుట్ర పన్నుతున్నాయని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ఆరోపించారు. ఆయన గురువారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. భారత ప్రజాస్వామ్యానికి విదేశీ సర్టిఫికెట్ అక్కర్లేదని తేల్చిచెప్పారు. నిరసన తెలపడం ప్రజాస్వామ్య హక్కేనని అన్నారు. అయితే, దేశ అంతర్గత వ్యవహారాల్లో విదేశీయులు జోక్యం చేసుకోవడం సరైంది కాదని స్పష్టం చేశారు. దేశాన్ని బలహీనపర్చేందుకు ప్రయత్నిస్తే సహించబోమని హెచ్చరించారు. విదేశీ శక్తులకు వ్యతిరేకంగా దేశం ఐక్యంగా నిలుస్తోందని పేర్కొన్నారు. విదేశీ శక్తులకు పరాజయం తప్పదని వ్యాఖ్యానించారు. పార్లమెంట్లో ఆమోదించిన చట్టం విషయంలో విదేశీయుల జోక్యం ఏమిటని బీజేపీ నేత అమిత్ మాలవియా ప్రశ్నించారు. -
కసాయితల్లి.. 28 ఏళ్లుగా గదిలోనే బంధించింది
స్టాక్‌హోం: 24 గంటల పాటు కదలకుండా ఒకే ప్రదేశంలో ఉంటే ఎలా ఉంటుంది.. ఊహించుకోవడానికే భయంకరంగా ఉంది కదా. కానీ ఓ వ్యక్తిని దాదాపు 28 ఏళ్ల పాటు ఓ గదిలో బంధించి ఉంచారు. ప్రస్తుతం నలభయ్యేళ్ల వయసులో ఉన్న ఆ వ్యక్తి సరైన పోషణ లేక.. శరీరం కుంగిపోయి.. నోట్లో పళ్లు అన్ని ఊడి పోయి.. నడవలేక.. అత్యంత దీన స్థితిలో జీవచ్ఛవంలా మారాడు. అతడి పరిస్థితి చూసి పోలీసులే కంట తడి పెట్టారు అంటే ఎంతటి దయనీయ స్థితిలో ఉన్నాడో అర్ధం చేసుకోవచ్చు. మరో షాకింగ్ న్యూస్ ఎంటంటే కన్న తల్లే అతడని ఇన్నేళ్లపాటు గదిలో బంధించి ఉంది. అవును మీరు చదివింది నిజమే. తల్లే అతడి పాలిట ఇంత కర్కషంగా ప్రవర్తించింది. మహిళ దూరపు బంధువు సమాచారంతో ఈ దారుణం వెలుగు చూసింది. ఈ హృదయవిదారక ఘటన స్వీడన్లో చోటు చేసుకుంది. బాధితుడు 12వ ఏట విద్యార్థిగా ఉన్న సమయంలో తల్లి అతడిని స్కూల్ నుంచి బలవంతంగా ఇంటికి తీసుకువచ్చి గదిలో బంధించింది. తిండి, నిద్ర, మలమూత్ర విసర్జన అంతా అక్కడే. ఈ 28 ఏళ్ల కాలంలో ఆ మహాతల్లి గదిని ఒక్కసారి కూడా శుభ్రం చేసిన దాఖలాలు కనిపించలేదని తెలిపారు పోలీసులు. ప్రస్తుతం బాధితుడి వయసు 41 ఏళ్లు కాగా.. అతడి తల్లి వయసు 70 సంవత్సరాలు. ఈ ఆదివారం వృద్ధురాలు అనారోగ్యం పాలైంది. దీని గురించి దూరపు బంధువుకు సమాచారం అందించడంతో వృద్ధురాలిని ఆస్పత్రికి తీసుకెళ్లడానికి ఆమె అపార్టుమెంట్‌కి వచ్చింది. ఆ సమయంలోనే బాధితుడిని గుర్తించింది. దీని గురించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకుని బాధితుడిని గది నుంచి తీసుకువచ్చి ఆస్పత్రిలో చేర్చారు. అతడిని పరీక్షించిన వైద్యులు ప్రాణానికి ప్రమాదం లేదని తెలిపారు. బాధితుడిని ఎంతో కాలం నుంచి గదిలో బంధించడమే కాక సరైన ఆహారం కూడా ఇవ్వలేదని వైద్యులు తెలిపారు. బాధితుడి నోట్లో పళ్లే లేవన్నారు. ఇక అతడి శరీరంపై ఉన్న గాయాల వల్ల ప్రాణాలకు పెద్దగా ప్రమాదం లేదని.. కాకపోతే మానసికంగా ఎంతో వేదన అనుభవించాడు కనుక కోలుకోవడానికి సమయం పడుతుందని తెలిపారు డాక్టర్లు. (చదవండి: చిత్తుగా కొట్టి.. మలం తినిపించి..) ఇక బాధితుడి బంధువు మాట్లాడుతూ.. ‘నిందితురాలు అనారోగ్యానికి గురైందని తెలియడంతో వారి అపార్ట్‌మెంట్‌కు వెళ్లాను. అక్కడ పరిసరాలు చూసి నాకు కడుపులో దేవింది. ఏళ్లుగా ఇంటిని శుభ్రం చేయడం లేదనుకుంటాను చెత్త, చెదారం, మలమూత్రాలు అన్ని కలిసి పోయి భరించలేదని దుర్వాసన వస్తోంది. అంబులెన్ప్‌కి కాల్ చేసి వారి సాయంతో మహిళను ఆస్పత్రికి చేర్చాను. ఆ సమయంలోనే బాధితుడి గురించి తెలిసింది. అతడిని ఆ పరిస్థితుల్లో చూసి షాక్ అయ్యాను. నా గుండే పగిలిపోయింది. అతడి దీని స్థితి గురించి నాకు తెలియడానికి 28 ఏళ్లు పట్టింది. చివరకు ఆమె అనారోగ్యం కారణంగా బాధితుడికి సాయం చేసే అవకాశం దక్కింది’ అన్నారు. బాధితుడి గురించి ఎప్పుడు ప్రశ్నించినా.. బాగానే ఉన్నాడని చెప్పి టాపిక్ డైవర్డ్ చేసేదన్నారు. ఇంత దారుణం జరుగుతున్న ఇరుగుపొరుగు వారికి వ్యక్తి దీని స్థితి గురించి తెలియకపోవడం వింతగా ఉంది. దీని గురించి పోలీసులు వారిని ప్రశ్నించగా.. వృద్ధురాలు ఎవరిని ఇంటి చుట్టుపక్కలకి రానిచ్చేది కాదని.. కొడుకు గురించి అడిగితే బాగానే ఉన్నాడు.. మీకేందుకు అని గొడవపడేదని తెలిపారు. -
శ్మశానంలో 8,400 ఏళ్లనాటి శునక అవశేషాలు
స్టాక్‌హోమ్ : దక్షిణ స్వీడన్లో అతి పురాతన కాలంనాటి శునక అవశేషాలు బయటపడ్డాయి. గత గురువారం అక్కడి ఓ శ్మశాన వాటికలో మధ్య రాతి యుగానికి చెందిన శునక అవశేషాలను పురావస్తు శాస్త్రవేత్తలు కొనుగొన్నారు. ఆ శునకాన్ని పాతిపెట్టి దాదాపు 8,400 ఏళ్లయి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆకస్మికంగా సముద్ర మట్టం పెరగటం వల్ల శ్మశాన వాటికలోకి వచ్చి చేరిన బురద కారణంగా ఆ ప్రదేశం మొత్తం భద్రపరచబడిందని చెబుతున్నారు. దీంతో అక్కడి అవశేషాలకు ఎలాంటి ప్రమాదం జరగలేదంటున్నారు. ( వైరల్: అతడు ముక్కు కత్తిరించేసుకున్నాడు! ) ఆ శునకాన్ని ఓ వ్యక్తి పాతి పెట్టాడని, పెంచుకున్నవి చనిపోయినపుడు గుర్తుగా ఏదైనా వదలిపెట్టడం అప్పటి ఆచారం అని చెబుతున్నారు. కాగా, ఆ శునకానికి సంబంధించిన అవశేషాలను ఇంకా భూమిలోంచి బయటకు తీయలేదు. వాటిని వెలికి తీసిన వెంటనే బ్లెకింగ్ మ్యూజియానికి తరలించటానికి పురావస్తు శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. -
స్వీడన్ జట్టు కోచ్‌గా జాంటీ రోడ్స్
స్వీడన్ : క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడిప్పుడే అడుగు పెట్టిన స్వీడన్ తమ దేశంలో ఆట అభివృద్ధిపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్, ఫీల్డింగ్ దిగ్గజం జాంటీ రోడ్స్ హెడ్ కోచ్‌గా నియమించింది. ఐపీఎల్లో కింగ్స్ ఎలెవన్ జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌గా ప్రస్తుతం వ్యవహరిస్తున్న 51 ఏళ్ల రోడ్స్... టోర్నీ ముగిసిన వెంటనే కుటుంబంతో సహా స్వీడన్లో స్థిరపడనున్నాడు. సఫారీ జట్టు తరఫున జాంటీ 52 టెస్టులు, 245 వన్డేలు ఆడాడు. -
ప్రేమ కోసం సైకిల్‌పై వేల కిమీ ప్రయాణం.. చివరికి!
నిజమైన ప్రేమ ఎలాంటి అడ్డంకులనైనా అధిగమిస్తుందని నిరూపించారు డాక్టర్ ప్రద్యుమ్న కుమార్ మహానందియా. భార్య కోసం సైకిల్ మీద ప్రయాణం చేస్తూ ఖండాంతరాలు దాటి ఆమెను శాశ్వతంగా తన సొంతం చేసుకున్నారు. అన్నీ తానై ముందుకు నడిపే అర్ధాంగి, ముత్యాల్లాంటి ఇద్దరు పిల్లలతో హాయిగా కుటుంబ జీవితం గడుపుతున్నారు. చిత్రకారుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని స్వీడన్ ప్రభుత్వంలో సాంస్కృతిగా సలహాదారుగా ఉన్నారు. ‘ఎక్కడి ఒడిశా.. ఎక్కడి స్వీడన్’.. ‘బాల్యంలో ఎదుర్కొన్న అవమానాలు చాలు.. మళ్లీ విదేశాల్లో కూడానా!?’ అని ఏమాత్రం వెనకడుగు వేసినా ఆయన జీవన ప్రయాణంలో బహుశా ఇన్ని మధుర జ్ఞాపకాలు ఉండేవి కావేమో. ఒడిశా అబ్బాయి- స్వీడన్ అమ్మాయి ప్రేమ, పెళ్లి కథ. పాత స్టోరీయే. అయితే పాత విషయాన్నైనా ప్రస్తుత పరిస్థితులకు అన్వయిస్తూ స్పూర్తిని నింపే సోషల్ మీడియా వీరులు పీకే మహానందియా కథను మరోసారి తెరపైకి తెచ్చారు. ‘పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు.. అలుపెరుగక కృషి చేస్తే లక్ష్యాన్ని ఛేదించవచ్చు.. ఇదిగో ఇందుకు ఈయనే కథే ఉదాహరణ’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ‘పేదింటి కుర్రాడు- కోటలోని యువరాణి’ తరహా సినిమాను తలపించే ఈ కథను మనం కూడా ఓసారి గుర్తు చేసుకుందాం! ఎవరీ పీకే మహానందియా? ఒడిశాలోని ఓ నిరుపేద కుటుంబంలో 1949లో పీకే మహానందియా జన్మించారు. అస్పృశ్యత, అంటరానితనం వంటి సమాజపు విపరీత పోకడలు, కుల వ్యవస్థ కారణంగా చిన్నతనంలోనే ఎన్నో అవమానాలు పడ్డారు. ఉన్నత విద్యనభ్యసించే ఆర్థిక స్థోమత లేకపోయినా.. దేవుడు తనకు ప్రసాదించిన కళతో చిత్రకారుడిగా తనను తాను నిరూపించుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో 1971లో న్యూఢిల్లీలోని ఓ కాలేజీలో చేరి చిత్రకళలో ప్రావీణ్యం సంపాదించారు. రష్యన్ కాస్మోనాట్ వాలంటీనా తెరిష్కోవా, భారత తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ వంటి ప్రముఖుల చిత్రాలు గీసి పేరు సంపాదించారు. ఇలా మహానందియా జీవితం సాగుతున్న వేళ.. 1975లో ఓ పందొమిదేళ్ల స్వీడన్ అమ్మాయి.. చార్లెట్ వన్ స్లెవిన్ ఇండియాకు వచ్చింది. మహానందియా ఆర్ట్ గురించి తెలుసుకుని ఆయన చేత తన బొమ్మ గీయించుకోవాలని ఆశపడింది. (ఇర్ఫాన్, సుతాప అపూర్వ ప్రేమకథ) పెళ్లైన తర్వాత ప్రేమికులుగా.. ఈ క్రమంలో వారిద్దరి మధ్య ఏర్పడిన ప్రణయ బంధం పెళ్లికి దారి తీసింది. మహానందియాపై ఉన్న అవాజ్యమైన ప్రేమతో చారులతగా పేరు మార్చుకున్న చార్లెట్ భారత సంప్రదాయ ప్రకారం అతడిని వివాహమాడారు. ఆ తర్వాత తన చదువు పూర్తి చేసేందుకు స్వస్థలానికి పయనమయ్యారు. భర్తను కూడా తనతో రావాల్సిందిగా కోరారు. అయితే అప్పటికింకా మహానందియా కోర్సు పూర్తి కాకపోవడంతో ఆయన ఇక్కడే ఉండిపోయారు. అనంతరం చార్లెట్ తనను చేరుకునేందుకు ఫ్లైట్ టికెట్లు పంపినా.. మహానందియా వాటిని సున్నితంగా తిరస్కరించారు. తన సొంత డబ్బుతోనే అక్కడికి వస్తానంటూ భార్యకు నచ్చజెప్పారు. ఇలా కొన్నాళ్లపాటు వీరిద్దరు ప్రేమలేఖలు రాసుకుంటూ పెళ్లి తర్వాత కూడా ప్రేమికులుగా మధురానుభూతులు సొంతం చేసుకున్నారు. (కోవిడ్–19 లవ్‌స్టోరీ: ఇక్కడ అబ్బాయి.. అక్కడ అమ్మాయి) సరిహద్దులు చెరిపేస్తూ.. ప్రేమ కోసమై అంతా సవ్యంగా సాగుతున్నప్పటికీ తన కోసం ఖండాంతరాల ఆవల ఎంతగానో ఎదురుచూస్తున్న భార్యను బాధపెట్టడం మహానందియాకు కష్టంగా తోచింది. సరిపడా డబ్బు చేతికి రాకపోవడంతో తన వస్తువులన్నీ అమ్మేసి.. ఓ పాత సైకిల్ కొన్నారు. పెయింటింగ్ బ్రష్‌లు, తాను గీసిన పెయింటింగ్‌లు వెంటేసుకుని 1978లో యూరప్‌కు పయనమయ్యారు. న్యూఢిల్లీ నుంచి అమృత్సర్ మీదుగా అఫ్గనిస్తాన్, ఇరాన్, టర్కీ, బల్గేరియా, యుకోస్లేవియా, జర్మనీ, ఆస్ట్రియా, డెన్మార్క్ గుండా ఎట్టకేలకు స్వీడన్‌లోని గోతెన్‌బర్గ్‌కు చేరుకున్నారు. దాదాపు 4 నుంచి ఐదు నెలల పాటు సాగిన ఈ సైకిల్ ప్రయాణం (అప్పటికింకా చాలా దేశాల్లో వీసా నిబంధనలు అమల్లోకి రాలేదు) మహానందియా పడని కష్టం లేదు. భార్యకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు నిద్రాహారాలు కరువైనా ఆయన లెక్కచేయలేదు. నమ్మే ప్రసక్తే లేదు.. స్వీకరిస్తుందా? లేదా? యూరప్‌లోని రాచ కుటుంబ మూలాలు గల విద్యాధికురాలైన ఓ యువతి.. భారతదేశంలోని ఓ పేదవాడిని ప్రేమించి, పెళ్లి చేసుకుందంటే ఎవరికైనా అనుమానం కలగడం సహజమే. భారత్ నుంచి సైకిల్‌పై వచ్చిన ఓ యువకుడు ఈ మాటలు చెబుతుంటే స్వీడన్ ఇమ్మిగ్రేషన్ అధికారులు కూడా తొలుత ఇలాగే సందేహపడ్డారు. వాళ్లలా అడ్డగించిన తర్వాత మహానందియా ఒక్కసారి తత్తరపాటుకు లోనయ్యారు. అవును.. నిజంగానే నా భార్య నన్ను స్వీకరించకుండా ఉండదు కదా అని కాస్త మదనపడ్డారు. అయితే ఆ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ చార్లెట్ అలియాస్ చారులత మహానందియా ఉన్న చోటుకు వచ్చారు. ఆనంద భాష్పాలతో తన భర్తకు స్వాగతం పలికి తన తల్లిదండ్రులకు పరిచయం చేశారు. కూతురి ప్రేమ, అల్లుడి గొప్పతనం అర్థం చేసుకున్న ఆమె కుటుంబ సభ్యులు శ్వేతజాతీయేతర వ్యక్తిని కుటుంబంలోకి ఆహ్వానించకూడదనే నిబంధనను పక్కన పెట్టి మరీ మహానందియాను అక్కున చేర్చుకున్నారు. తమ సమక్షంలో వారిద్దరికి మరోసారి పెళ్లి చేశారు. అలా వారి ప్రేమకథ సుఖాంతమైంది. ఎక్కడ అవమానించారో.. అక్కడే సగర్వంగా.. ఒకప్పుడు అంటరానివాడుగా తనను వెలేసిన ఊరే.. ఆర్టిస్టుగా మహానందియా ఉన్నత శిఖరాలకు చేరుకున్న తర్వాత గౌరవ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికింది. ఒడియా సాంస్కృతిక రాయబారిగా, స్వీడన్ ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారుగా సేవలు అందించిన తమ ఊరి బిడ్డ విజయాన్ని ఆస్వాదిస్తూ హర్షధ్వానాలు చేసింది. ప్రపంచంలోని ప్రఖ్యాత నగరాలన్నింటిలో తన పెయింటింగ్‌లను ప్రదర్శిస్తూ, యూనిసెఫ్ ప్రశంసలు దక్కించుకున్న మహానందియా.. కళారంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో గల ఉత్కళ్ యూనివర్సిటీ ఆఫ్ కల్చర్ 2012లో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసి సత్కరించింది. -
100 గంటల్లో 10 లక్షలు
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహోగ్రరూపం దాలుస్తోంది. గుండెల్లో దడ పుట్టేలా కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి. గత 100 గంటల్లో 10 లక్షల కేసులు నమోదయ్యాయి. జూలై 13 నాటికి 1.3 కోట్లు ఉన్న సంఖ్య 4 రోజుల్లో 1.4 కోట్లకు పెరిగింది. ఇక కేసుల సంఖ్యలో అగ్రరాజ్యం అమెరికాయే మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఆ దేశంలో ఒకే రోజు 77 వేల కేసులు నమోదు కావడం ఆందోళన పుట్టిస్తోంది. స్వీడన్ మొత్తం కేసులతో ఇది సమానం కావడం గమనార్హం. ప్రపంచ వ్యాప్తంగా నమోదైన కేసులు, మృతుల్లో సగం ఉభయ అమెరికా ఖండాల్లోనే వెలుగులోకి వచ్చాయి. బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సనోరా సహా 20 లక్షల మందికి పైగా కరోనా పాజిటివ్ వస్తే, ఆ దేశంలో 76 వేలకి మంది పైగా మరణించారు. కనీస జాగ్రత్తలు తీసుకోని అమెరికన్లు యథా రాజా తథా ప్రజా అన్నట్టుగా ఉంది అమెరికా ధోరణి. దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన అనుచరగణం మాస్కులు పెట్టుకోవడం, భౌతిక దూరం పాటించడం వంటి వాటికి ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వడం లేదు. కరోనా కట్టడి నిబంధనలు కఠినంగా అమలు చేయడం లేదు. దీంతో ప్రజలందరూ మాస్కు ధరించడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారు. కనీస జాగ్రత్తలు తీసుకోకుండా రోడ్లపై తెగ తిరుగుతున్నారు. కేసులు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నప్పటికీ దేశాన్ని ఆర్థికంగా గాడిలో పెట్టాలన్న ఉద్దేశంతో మార్కెట్లను ప్రారంభిస్తున్న ట్రంప్ ఇప్పుడు పాఠశాలలు తెరవడానికి కూడా సిద్ధమయ్యారు. ఊపిరి పీల్చుకుంటున్న యూరప్ కరోనా వైరస్ బయటపడిన తొలినాళ్లలో ఇటలీ, స్పెయిన్ వంటి యూరప్ దేశాలు అల్లాడిపోయాయి. ఇప్పుడు ఐరోపా దేశాల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. బార్సిలోనా వంటి నగరాల్లో అక్కడక్కడ కేసులు కనిపిస్తూ ఉండడంతో ఆ ప్రాంతాల్లో మళ్లీ లాక్డౌన్ ఆంక్షలు విధిస్తున్నారు. ఇరాన్లో మూడు కోట్ల మందికి కరోనా? ఇరాన్లో 2.5 కోట్ల మందికి కరోనా ఇన్ఫెక్షన్ సోకి ఉంటుందని, ప్రజలంతా ఈ మహమ్మారిని తీవ్రంగా పరిగణించాలని ఇరాన్ అ«ధ్యక్షుడు హస్సన్ రొహానీ అన్నట్లు, ఇరాన్ అధికార ఐఆర్ఎన్ఏ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. రానున్న కొద్ది నెలల్లో మూడు నుంచి మూడున్నర కోట్ల మందికి ఈ వైరస్ సోకనుందన్నారు. దేని ఆధారంగా ఈ అంచనాకి వచ్చారో ఇరాన్ అధికారులు వివరించలేదు. మధ్య ప్రాచ్యంలో ఇప్పటి వరకు ఇరాన్ తీవ్రంగా ప్రభావితమైందని, 2,70,000 పాజిటివ్ కేసులున్నాయని, ఇప్పటి వరకు కనీసం 14,000 మంది చనిపోయారని ఆ రిపోర్టు వెల్లడించింది. కరోనా కట్టడి కోసం దేశ రాజధాని టెహ్రాన్‌లో శనివారం నుంచి కఠిన ఆంక్షలు విధించబోతున్నారు. మరణాల సంఖ్య అధికారికంగా ప్రకటించిన సంఖ్య కంటే రెట్టింపు వుండవచ్చునని, వైరస్ బారిన పడిన వారి సంఖ్య పదిరెట్లు ఎక్కువగా ఉండవచ్చునని ఏప్రిల్‌లో విడుదల చేసిన పార్లమెంటరీ రిపోర్టు తెలపడం గమనార్హం. మాస్క్ పెట్టుకోండని చెప్పను కరోనాని కట్టడి చేయడానికి ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని తాను ఆదేశాలు జారీ చేయనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. మాస్కుల అంశంలో అమెరికన్లకి స్వేచ్ఛ ఉండాలని స్పష్టం చేశారు. ప్రజలంతా మాస్కులు ధరిస్తే, వైరస్ అంతా మాయం అయిపోతుందన్న వాదనలతో తాను ఏకీభవించనని అన్నారు. మాస్కులు ధరించడం వల్ల ఎన్నో సమస్యలు వస్తున్నాయని చెప్పారు. సాధారణ జ్వరాల కంటే మూడు రెట్లు ఎక్కువ ప్రతీ ఏడాది వివిధ దేశాలను ఫ్లూ వంటి సీజనల్ ఫీవర్లు వణికిస్తూ ఉంటాయి. అలా సాధారణంగా ఏడాదికి నమోదైన కేసుల కంటే మూడు రెట్లు ఎక్కువగా కరోనా కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. ఈ మహమ్మారి ఏడు నెలల కాలంలోనే దాదాపుగా 6 లక్షల మందిని పొట్టన పెట్టుకుంది. ప్రతి ఏటా విష జ్వరాలతో మరణిస్తున్న వారి సంఖ్యతో ఇది సమానం. చైనాలో వూహాన్లో తొలిసారిగా జనవరి 10న కరోనా మరణం నమోదైంది. అక్కడ్నుంచి వైరస్ యూరప్ దేశాలకు పాకి, ఆ తర్వాత అమెరికాకి విస్తరించింది. -
కోవిడ్‌తో మెదడుకు నష్టం?
బెర్లిన్: కోవిడ్ కారణంగా మెదడు దెబ్బతింటుందా? అవునంటున్నారు స్వీడన్‌లోని గొథెన్‌బర్గ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. వ్యాధి చికిత్సకు ఆసుపత్రిలో చేరిన కొందరిలో తాము మెదడు దెబ్బతిన్న ఆనవాళ్లను గుర్తించామని శాస్త్రవేత్తలు తెలిపారు. తేలికపాటి, ఒక మోస్తరు, తీవ్ర లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన 47 మందిపై తాము పరిశోధనలు చేశామని వారి రక్త నమూనాలను పరిశీలించినప్పుడు మెదడు దెబ్బతినేందుకు సూచికలైన కొన్ని రసాయనాలను గుర్తించామని శాస్త్రవేత్తలు తెలిపారు. దీంతోపాటు మెదడు నాడుల కొనలలో ఉండే ఎన్ఎఫ్ఎల్ అనే మరో ప్రొటీన్ కూడా రక్తంలో కనిపించిందని చెప్పారు. కోవిడ్ –19 కారణంగా వెంటిలేటర్‌పై చికిత్స అందించాల్సిన రోగుల్లో ఈ ఎన్ఎఫ్ఎల్ చాలా ఎక్కువగా కనిపించిందని, దీనికి వ్యాధి తీవ్రతకు సంబంధం ఉందన్న విషయాన్ని ఇలా తెలుసుకోవచ్చునని చెప్పారు. -
ప్రధాని హత్య.. 34 ఏళ్ల తర్వాత కేసు క్లోజ్
స్టాక్‌హోమ్ : 34 ఏళ్ల తర్వాత స్వీడన్ మాజీ ప్రధాని ఓలోఫ్ పామ్ హత్య కేసు చిక్కుముడిగానే ముగిసింది. 1986, ఫిబ్రవరి 28న స్టాక్‌హోమ్‌లో తన సతీమణి లిస్బెట్తో కలిసి సినిమాకి వెళ్లి తిరిగి వస్తుండగా ఓలోఫ్ హత్యకు గురయ్యారు. ఓ దుండగుడు కాల్పులు జరపడంతో ఓలోఫ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. సోషల్ డెమోక్రటిక్ పార్టీ నేత అయిన ఓలోఫ్ హత్యపై ఎన్నో కుట్ర సిద్ధాంతాలు, ఊహాగానాలు మూడు దశాబ్ధాలుగా చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టంచిన నాటి దేశ ప్రధాని హత్యకేసును ఛేదించడం స్వీడన్ పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. (జార్జ్ ఫ్లాయిడ్ సోదరుడి ఆవేదన) ఈ కేసులో 90 వేల మందిని ప్రాథమికంగా విచారించగా, దాదాపు 10వేల మందిని పోలీసులు ఇంటర్యూలు చేశారు. 134 మందిని అనుమానితులుగా గుర్తించారు. దాదాపు 4000 వాహనాల వివరాలను దర్యాప్తులో భాగంగా సేకరించారు. ప్రధాని శరీరంలోని బుల్లెట్, గాయపడిన అయన భార్య శరీరంలోని బుల్లెట్లను స్వీడన్, జర్మనీ, అమెకాలోని ఎఫ్‌బీఐ ల్యాబొరెటరీల్లో పరీక్షించినా ఎలాంటి లీడ్ లభించలేదు. (పొరపాటున చేప మీద కూర్చున్నాడంతే!) ఈ కేసు విషయమై స్వీడన్ చీఫ్ ప్రాసిక్యూటర్ క్రిస్టర్ పీటర్సన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘స్టిగ్ ఎంగ్‌స్ట్రోమ్ అనే వ్యక్తి ఒంటరిగా ఈ హత్య చేశాడని నమ్ముతున్నాము. అయితే దానిని నిరూపించడానికి తగినన్ని ఆధారాలు లేవు. స్టిగ్ ఎంగ్‌స్ట్రోమ్ మరణించినందున, అతనిపై అభియోగాలు మోపలేము, అందుకే దర్యాప్తును నిలిపివేయాలని నిర్ణయించుకున్నాము. నా అభిప్రాయం ప్రకారం, స్టిగ్ ఎంగ్‌స్ట్రోమ్ ప్రధాన నిందితుడు. 34 ఏళ్ళ తర్వాత దర్యాప్తులో మాకు కొత్త విషయాలు తెలియడం కష్టం. అందుకే మేము ఊహించినంత వరకు ఓ అంచనాకు వచ్చాము. స్టిగ్ ఎంగ్‌స్ట్రోమ్ 2000 సంవత్సరంలో మరణించాడు. ఎంగ్‌స్ట్రోమ్ దోషి అనడానికి సూచించే అనేక అంశాలు ఉన్నాయి. ప్రస్తుత బృందం 34 ఏళ్ల కిందట దర్యాప్తు చేసినట్టయితే, నాడు అతని కదలికలపై సంతృప్తికరమైన వివరణ ఇవ్వలేకపోతే రిమాండ్‌కు తరలించే వాళ్లం. అతన్ని అరెస్ట్ చేయడానికి తగినన్ని ఆధారాలు సంపాధించేవాళ్లమని అనుకుంటున్నాము’ అని క్రిస్టర్ పీటర్సన్ పేర్కొన్నారు. ‘స్వీడన్ చరిత్రలోనే ఇది అతిపెద్ద నేరపరిశోధన కేసు. కొన్ని సార్లు ఈ కేసును అమెరికా మాజీ అధ్యక్షుడు జేఎఫ్ కెన్నెడీ హత్య కేసుతో పోల్చుతుంటారు. ఓలోఫ్ పామ్ హత్యానంతరం వచ్చిన ఎన్నో కుట్ర సిద్ధాంతాలపైన కూడా దర్యాప్తు చేశాము, కానీ వాటిని నిరూపించడానికి ఎలాంటి ఆధారాలు లభించలేదు. విచారణాధికారులుగా కొత్త టీమ్‌ను రిక్రూట్ చేసిన తర్వాత, కేసు పూర్వాపరాలను, అనుమానితుల జాబితాను తిరగదోడారు. మా విచారణలో ఎంగ్‌స్ట్రోమ్ పలుమార్లు ఇచ్చిన వాంగ్మూలాల్లో తేడాలను స్పష్టంగా గమనించాము. అనంతరం 2017లో ప్రధాని హత్య కేసులో అతడే ముఖ్య సూత్రధారిగా నిర్ధారణకు వచ్చాము’ అని విచారణాధికారి మెలాండర్ అన్నారు. హత్య జరిగిన సమయంలో దర్యాప్తుకు ఎంగ్‌స్ట్రోమ్ కేంద్ర బిందువు కాదని పీటర్సన్ చెప్పారు. ‘కానీ అతని నేపథ్యాన్ని నిశితంగా పరిశీలిస్తే అతను ఆయుధాలకు వాడిన చరిత్ర ఉంది. మిలిటరీలో కూడా పనిచేశాడు. అతడికి పలు షూటింగ్ క్లబ్బుల్లో కూడా సభ్యత్వం ఉన్నట్టు తెలిసింది’ అని పీటర్సన్ అన్నారు. అంతేకాకుండా సన్నిహితుల వద్ద తరుచూ ప్రధానమంత్రిని, అతని విధానాలను చాలా విమర్శించేవాడని పీటర్సన్ చెప్పారు. హత్య జరిగిన వీధిలోని, స్వెవాజెన్లోని తన కార్యాలయంలో ఆలస్యం అవ్వడంతో అక్కడే ఉన్నానని ఎంగ్‌స్ట్రోమ్ చెప్పారని, అయితే కొంతమంది ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన కిల్లర్ పోలీకలతో అతని పోలీకలు సరితూగుతున్నాయన్నారు. దీంతో దాదాపు 34 ఏళ్లుగా దర్యాప్తు చేస్తున్న స్వీడన్ పోలీసులు చివరకు సాక్ష్యాలతో కాకుండా అంచనాలతోనే ఈ కేసును క్లోజ్ చేశారు. (ఎంగ్‌స్ట్రోమ్ ఫైల్ ఫోటో) -
ఆ రెస్టారెంట్లో ఒక్కరికే అనుమతి
స్వీడన్: లాక్డౌన్ తర్వాత జనాలు రెస్టారెంట్‌కు ఎగబడే పరిస్థితి కనిపించడం లేదు. ఒకవేళ కరోనా తగ్గినప్పటికీ అంత ఈజీగా ముందు పరిస్థితులు మళ్లీ కనిపించకపోవచ్చు. దీంతో మారనున్న పరిస్థితులకు అనుగుణంగా ఓ వినూత్న రెస్టారెంట్‌ను తయారుచేశారో చోట. ఇక్కడ మనం ఆర్డర్ చేసే ఫుడ్‌ను ఎవరూ వచ్చి సర్వ్ చేయరు. కిచెన్ నుంచే వేడి వేడి ఆహారాన్ని తాడు సహాయంతో పంపిస్తారు. ఈ ఆలోచన ఒకత్తైతే, కేవలం రోజుకు ఒక్కరినే అనుమతించడం మరో ఎత్తు. ఇంతకీ ఈ రెస్టారెంట్ స్వీడన్లో సిద్ధమవుతోంది. అక్కడ సామాజిక దూరాన్ని కచ్చితంగా పాటిస్తూనే కస్టమర్లకు రుచికరమైన ఆహారంతోపాటు కొత్త అనుభూతిని పంచనుంది. (ఇళ్ల ముందు నుంచే కనిపిస్తున్న హిమాలయాలు) ఇక అక్కడకు వచ్చేవారికి ప్రత్యేకంగా గదులు అంటూ ఉండవు. బయట గార్డెన్లో ఒక డైనింగ్ టేబుల్, ఒక కుర్చీ పెట్టి ఉంచుతారు. ప్రకృతిని ఆస్వాదిస్తూ ఎంచక్కా కడుపు నిండేవరకు లాగించేయడమే. ఈ రెస్టారెంట్‌కు "బార్డ్ ఫర్ ఎన్" లేదా "టేబుల్ ఫర్ వన్" అన్న పేర్లను ఆలోచిస్తున్నారు. దీన్ని మే 10న ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రాస్మస్ పర్సన్, లిండా కార్ల్సన్ దంపతులకు వచ్చిందీ ఐడియా. ప్రపంచంలోనే ఏకైక కరోనా సురక్షిత రెస్టారెంట్‌గా దీన్ని మారుస్తామని లిండా పేర్కొంది. ఈ రెస్టారెంట్‌కు అందరూ ఆహ్వానితులేనంటోంది. కాగా యూరప్‌లో లాక్డౌన్ అమల్లో ఉన్నప్పటికీ పాఠశాలలు, రెస్టారెంట్లు, బార్లు తెరుచుకోవచ్చని సడలింపులు ఇచ్చింది. అయితే అన్ని చోట్లా సామాజిక ఎడబాటును పాటించాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. (నోట్లో బాటిల్ మెడలో పాము) -
స్వీడన్లో పాక్ జర్నలిస్ట్ మృతి
స్టాక్ హోం: స్వీడన్లో నివసిస్తున్న పాకిస్తాన్‌కు చెందిన జర్నలిస్ట్ సాజిద్ హుస్సేన్(39) మృతి చెందినట్లు శుక్రవారం పోలీసులు వెల్లడించారు. మార్చి 2న తప్పిపోయిన సాజిద్ ఏప్రీల్ 23న ఫైరిస్ నదిలో మృతదేహంగా తేలాడని పోలీసు అధికారి జోనాస్ ఎరోనెన్ తెలిపారు. మృతదేహనికి పోస్ట్‌మార్టం చేయగా సాజిద్ ఏదో నేరం చేసిన నిందితునిగా అనుమానం వస్తోందని ఆయన పేర్కొన్నారు. ఇక సాజిద్ మృతి హత్య లేదా ఆత్మహత్య అనేది తెలియాల్సి ఉందన్నారు. (ఇది నిజంగా ఆశాజనక పరిస్థితి: ట్రంప్) సాజిద్ పాకిస్తాన్‌లోని బెలుచిస్తాన్ ప్రాంతానికి చెందినవాడు. అతను బెలుచిస్తాన్ టైమ్స్ అనే వెబ్‌సైట్‌కి చీఫ్ ఎడిటర్ పని చేసేవారు. పాకిస్తాన్లో చోటు చేసుకొనే మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, నేరాలు, పాక్ ఆర్మీ తిరుగుబాటుపై పలు కథనాలు రాశారు. తనకు ప్రాణహాని ఉందని గ్రహించిన సాజిద్ 2012లో స్వీడన్‌కు వలస వెళ్లారు. 2017లో స్వీడన్‌లోని ఉప్ప్సలాలో పార్ట్‌టైమ్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. అతను చివరిసారిగా స్టాక్ హోంలోని ఉప్ప్సలాలో రైలు ఎక్కినట్లు పోలీలు తెలిపారు. -
సేవకురాలిగా మారిన యువరాణి సోఫియా
-
హెల్త్ వాలంటీర్‌గా స్వీడన్ యువరాణి
స్టాక్‌హోం: మహమ్మారి కరోనా(కోవిడ్-19)పై ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్న వైద్య సిబ్బందికి సాయం అందించేందుకు స్వీడన్ యువరాణి, ప్రిన్స్ కార్ల్ ఫిలిప్ భార్య సోఫియా(35) ముందుకు వచ్చారు. మూడు రోజుల ఇంటెన్సివ్ శిక్షణా కార్యక్రమాన్ని పూర్తి చేసి వాలంటీర్ అవతారమెత్తారు. తాను గౌరవ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న సోఫియామెట్ ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఆమె నేరుగా కోవిడ్-19 పేషెంట్లకు సేవలు అందించారు గానీ వైద్య సిబ్బందికి సహాయకురాలిగా ఉంటారని ది రాయల్ సెంట్రల్ వెల్లడించింది. ఈ మేరకు... ‘‘ఈ సంక్షోభంలో యువరాణి తన వంతు బాధ్యతగా వాలంటరీ వర్కర్‌గా సేవలు అందించాలని నిర్ణయించుకున్నారు. వైద్య సిబ్బందిని అధిక భారం నుంచి విముక్తి చేయాలని భావించారు’’అని రాయల్ కోర్టు ప్రతినిధి వెల్లడించినట్లు పేర్కొంది.(మరణాలు @ 33 వేలు) కాగా సోఫియామెట్ ఆస్పత్రి వైద్యేతర సిబ్బందికి ఆన్లైన్లో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వైద్య సిబ్బందిపై అధిక భారం పడకుండా క్లీనింగ్, వంట చేయడం తదితర పనుల్లో శిక్షణ ఇస్తారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు 80 మంది సోఫియామెట్ ఆస్పత్రిలో సేవలు అందిస్తున్నారు. తాజాగా యువరాణి సోఫియా కూడా ఆ జాబితాలో చేరిపోయారు. ఇక నీలం రంగు ఆప్రాన్ ధరించిన సోఫియా ఫొటోలు రాయల్స్ ఆఫ్ స్వీడన్ ఇన్‌స్టా పేజ్‌లో షేర్ చేయగా.. ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది. కాగా స్వీడన్లో ఇప్పటి వరకు 1300 కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. View this post on Instagram #New Last week Princess Sofia took a 3-day course at Sophiahemmet hospital. The people who completed the course are now able to relieve the hospital staff during the coronavirus pandemic. They will for example disinfect equipment and help in the kitchen. Princess Sofia is Sophiahemmet’s honorary president. 📷: TT #princesssofia #prinsessansofia #swedishroyalfamily #kungahuset A post shared by Royal family of Sweden (@royals_ofsweden) on Apr 16, 2020 at 10:28am PDT -
వేలాది మంది చస్తారంటూ హెచ్చరిక
న్యూఢిల్లీ : స్వీడన్లో కరోనా వైరస్ రోజు రోజుకు విస్తరిస్తున్నప్పటికీ అక్కడి ప్రజలు సామాజిక దూరాన్ని పాటించకుండా రెస్టారెంట్లకు, బీచ్‌లకు వెళుతుండడం పట్ల ఆదేశ ప్రధాని స్టీఫన్ లావ్‌వెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలామంది చావు కోసం ఎదురు చూడడంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇరుగు, పొరుగు దేశాలు లాక్‌డౌన్‌ను కొనసాగిస్తుండగా, స్వీడన్ రోడ్లతోపాటు, పబ్బులు, బార్లు, రెస్టారెంట్ల ప్రజలతో కళకళలాడుతున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగినట్లయితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోందని పలువురు డాక్టర్లు, అకడమిక్స్ హెచ్చరించడం, లాక్డౌన్ దిశగా చర్యలు తీసుకోవాల్సిందిగా నోబెల్ ఫౌండేషన్ లేఖ రాసిన నేపథ్యంలో దేశ ప్రధాని సోమవారం నాడు దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. పొరుగు దేశాలైన స్పెయిన్, ఇటలీ, జర్మనీ గత మార్చి 22వ తేదీ నుంచి లాక్‌డౌన్‌ను పాటిస్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అప్పటి నుంచి ఆ దేశాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. స్వీడన్లో లాక్‌డౌన్‌ను ప్రకటించకుండా తొలుత ఎక్కడా, ఎలాంటి కార్యక్రమాల్లో కూడా 500 మందికి మించి పాల్గొన రాదంటూ ఆంక్షలు విధించిన ప్రభుత్వం తర్వాత 50 మందికి మించి పాల్గొనరాదంటూ ఆంక్షలను సవరించింది. కరోనాను అరికట్టడం తమ బాధ్యతగా భావించి స్వచ్ఛందంగా సామాజిక దూరాన్ని పాటించాలంటూ పిలుపునిచ్చింది. దీన్ని ఎవరు లెక్క చేయడం లేదు. రెస్టారెంట్లు, బార్లు, ప్రాథమిక పాఠశాలలు తెరచే ఉంటున్నాయి. స్వీడన్లో ఇప్పటి వరకు 6,830 కరోనా కేసులు నమోదుకాగా, 401 మంది మరణించారు. -
కరోనా సోకలేదు.. కానీ.. : గ్రెటా థంబర్గ్
స్టాక్‌హోం: కరోనా వైరస్ (కోవిడ్-19) వ్యాప్తి నేపథ్యంలో తాను స్వీయ నిర్బంధంలో ఉన్నానని స్వీడిష్ యువకెరటం, పర్యావరణ వేత్త గ్రెటా థంబర్గ్ తెలిపారు. వాతావరణ మార్పుపై అవిశ్రాంతంగా ఉద్యమిస్తున్న గ్రెటా.. వివిధ దేశాల్లో పర్యటిస్తారన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె ఇటీవల మధ్య యూరప్‌లో పర్యటించారు. ఈ క్రమంలో తనకు కరోనా సోకినట్లు అనుమానం వ్యక్తం చేశారు. అంతేగాకుండా తనతో పాటు ప్రయాణించిన తన తండ్రిలో వైరస్ లక్షణాలు వృద్ధి చెందుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. యువతలో కరోనా లక్షణాలు అంత త్వరగా బయటపడవని.. కాబట్టి వారు మరింత బాధ్యతాయుతంగా ప్రవర్తించి మహమ్మారి వ్యాప్తిని అరికట్టాలని విజ్ఞప్తి చేశారు. ఎదుటివారిని ప్రమాదంలో పడేయవద్దని సూచించారు. (చదవండి: కరోనా వైరస్: ఎందుకంత ప్రమాదకారి?) ఆ వెసులుబాటు లేదు ‘‘గత రెండు వారాలుగా నేను ఇంట్లోనే ఉన్నాను. మధ్య యూరప్‌లో పర్యటించిన తర్వాత స్వీయ నిర్బంధంలోకి వెళ్లాను. నాతో పాటు నాన్న కూడా ప్రయాణించారు. మేమిద్దరం అమ్మా, సోదరికి దూరంగా వేరే అపార్టుమెంటు తీసుకుని బస చేస్తున్నాం. పది రోజుల క్రితం నాలో కరోనా లక్షణాలు బయటపడ్డాయి. గొంతు నొప్పి వస్తోంది. జలుబు చేసింది. అయితే నాన్న పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉంది. తీవ్రమైన జ్వరంతో ఆయన బాధపడుతున్నారు. అత్యవసర పరిస్థితి ఏర్పడేంత వరకు స్వయంగా కోవిడ్-19 పరీక్షలు నిర్వహించుకునే వెసులుబాటు స్వీడన్లో లేదు. చాలా మంది తమకు అనారోగ్యంగా ఉందని చెబుతున్నారు. ఇంట్లోనే ఉంటున్నారు. నేనింత వరకు కరోనా పరీక్ష చేయించుకోలేదు. కానీ నాలో లక్షణాలు కనిపిస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే నేను ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ప్రతీ ఒక్కరూ ఇంట్లోనే ఉండండి. మీ కారణంగా ఎవరికీ ఇబ్బంది రానీయకండి’’అని గ్రెటా తన ఇన్స్టాగ్రామ్ పోస్టులో రాసుకొచ్చింది. (ఆన్లైన్లో సరుకులు ఆర్డర్ చేశారా?) -
విదేశాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి కానీ..
చేతికి అందివచ్చిన కుమారుడు విదేశాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడన్న ఆనందం.. ఆ కుటుంబానికి ఎంతోకాలం నిలవలేదు. పట్టుమని ఆరు నెలలు గడవకముందే అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించాడన్న సమాచారం అతడి తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. కరోనా వైరస్ ఎఫెక్ట్‌తో అతడి మృతదేహాన్ని కడసారి చూడలేని దుర్భర పరిస్థితిలో వారు ఉన్నారు. వారిని ఓదార్చడం సన్నిహితులు, కుటుంబ సభ్యుల వల్ల కావడం లేదు. ఆ యువకుడి మృతి.. అతడిలో తీవ్ర విషాదాన్ని తెచ్చింది. సాక్షి, కాకినాడ: స్థానిక శ్రీరామ్‌నగర్‌కు చెందిన చంద్రశేఖర్, మంగతాయార్ల కుమారుడు పీసపాటి కృష్ణ చైతన్య (35) సుమారు ఆరు నెలల క్రితం స్వీడన్ వెళ్లారు. అక్కడ క్యాప్ జెమినీ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. ఇంకా వివాహం కూడా కాని కృష్ణచైతన్య ఇప్పుడిప్పుడే జీవితంలో స్థిరపడుతున్నాడు. నాలుగు రోజుల క్రితం ఆ కుటుంబానికి పిడుగు లాంటి వార్త చేరింది. స్వీడన్లో అతడు విధి నిర్వహణలో గుండెనొప్పితో కుప్పకూలిపోయాడని, తోటి ఉద్యోగులు ఆస్పత్రిలో చేర్చినా ప్రయోజనం లేకపోయింది. ఆస్పత్రికి వెళ్లిన కొద్దిసేపటికే అతడు మరణించినట్టు స్వీడన్లో వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహం కోసం.. కరోనా ప్రభావంతో కృష్ణచైతన్య మృతదేహం ఇక్కడికి చేర్చేందుకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కరోనా ప్రభావం వల్ల ఇరుదేశాల మధ్య అంతర్జాతీయ విమానాల రాకపోకలు ఈ నెల 29వ తేదీ వరకు రద్దు కావడంతో సమస్య జఠిలమైంది. అందరూ ఉండి ఎవరూ లేని అనాథలా కుమారుడి మృతదేహం స్వీడన్లో నిలిచిపోవడం ఆ కుటుంబానికి చెప్పలేనంత విషాదాన్ని నింపింది. అక్కడి కంపెనీ అధికారులు, ఇతర వర్గాలతో చర్చించినా ప్రయోజనం లేకపోయింది. స్పందించిన ఎంపీ, ఎమ్మెల్యేలు ఈ విషయం తెలుసుకున్న కాకినాడ ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి చొరవ తీసుకున్నారు. లోక్‌సభ పక్ష నేత వి.విజయసాయిరెడ్డి ద్వారా కేంద్ర విదేశాంగశాఖ మంత్రి, స్వీడన్‌లోని ఎంబసీ అధికారులతో చర్చించారు. మృతదేహాన్ని ఎలాగైనా స్వదేశానికి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. అవసరమైతే ప్రత్యేక విమానం ద్వారా మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్నందున వీరి కృషికి కూడా ప్రతిబంధకం ఏర్పడింది. ఈ నెల 29వ తేదీ వరకు విమానయానానికి అంక్షలు ఉన్నందున ఆ తరువాత కూడా కొనసాగితే పరిస్థితి ఏమిటని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా ఈ నెల 30వ తేదీ దాటితే ఆ మృతదేహాన్ని స్థానికంగా ఉండే ఓ మత సంస్థకు అప్పగిస్తారనే సమాచారంతో వారిని మరింత ఆవేదనకు గురిచేస్తోంది. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని తమ కుమారుడిని కడసారైనా చూసే అవకాశం కల్పించాలంటూ మృతుడి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఓదార్చిన ఎంపీ, ఎమ్మెల్యేలు ఆండాళ్లమ్మ కళాశాలలో లెక్చరర్‌గా పదవీ విరమణ చేసిన కృష్ణచైతన్య తల్లిదండ్రులు చంద్రశేఖర్, మంగతాయారులను కాకినాడ ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి శనివారం పరామర్శించారు. శ్రీరామ్‌నగర్‌లోని వారి ఇంటికి వెళ్లి కేంద్రం, ఎంబసీ అధికారులతో చర్చిస్తున్న విషయాన్ని వారికి చెప్పారు. మృతదేహాన్ని రప్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలను వివరించారు. ప్రభుత్వపరంగా అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నామని, ఆందోళన చెందవద్దని వారిని ఓదార్చారు. పెద్ద సంఖ్యలో బంధువులు, సన్నిహితులు మృతుని ఇంటికి చేరుకుంటున్న నేపథ్యంలో, వారి ఆవేదన వర్ణనాతీతంగా ఉంది. ప్రభుత్వం తీసుకునే చొరవ వల్ల మృతదేహం కొంత జాప్యమైనా స్వదేశానికి వస్తుందన్న విశ్వాసాన్ని మృతుడి మేనమామ బ్రహ్మయ్య శాస్త్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు దంపతులు ఆ కుటుంబాన్ని ఓదార్చారు. -
‘కృష్ణ చైతన్య మృతదేహాన్ని భారత్‌కు తీసుకొస్తాం’
సాక్షి, తూర్పుగోదావరి : కాకినాడకు చెందిన కృష్ణ చైతన్య స్వీడన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా విధులు నిర్వర్తిస్తూ.. నాలుగు రోజుల క్రితం గుండె పోటుతో చనిపోయాడు. కరోనా ప్రభావంతో అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు చేయడంతో కృష్ణ చైతన్య మృతదేహం స్వీడన్లోనే ఉండిపోయింది. ఈ నేపథ్యంలో విశాఖ ఎంపీ వంగా గీతా, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి.. శ్రీరామ్ నగర్లో నివాసం ఉంటున్న కృష్ణ చైతన్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎంపీ విజయసాయి రెడ్డి సహకారంలో విదేశాంగ మంత్రి, భారత ఎంబసీతో మాట్లాడి కృష్ణ చైతన్య మృతదేహాన్ని భారత్‌కు తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తామని వంగా గీతా భరోసానిచ్చారు. (జనతా కర్ఫ్యూకు యంగ్ టైగర్ సైతం.. ) -
పేగుబంధం 'అన్వేషణ'
పాత తరం చిత్రాల్లో అంటే 70, 80వ దశకంలో వచ్చిన చిత్రాలు ఎప్పుడైనా చూశారా?ఆ చిత్రాల్లో హీరోయిన్ లేదా హీరోలు చిన్నతనంలోనే తల్లిదండ్రుల నుంచి అనుకోని పరిస్థితుల్లో విడిపోవడం, కొన్నేళ్లఅనంతరం పెరిగి పెద్దవుతారు. అనంతరం అనుకోని ఘటనల ద్వారాఅసలైన తల్లితండ్రుల గురించి తెలిసి వారి కోసం అన్వేషిస్తూ ప్రయాణం మొదలుపెట్టడం. అచ్చం ఇటువంటి సంఘటనే మండ్యలో వెలుగు చూసింది. ఆ కథేంటో ఒకసారి తెలుసుకోవాలంటే మండ్యనుంచి స్వీడన్‌కు వెళ్లాల్సిందే. కర్ణాటక ,మండ్య: 1987వ సంవత్సరంలో మండ్య జిల్లా దేశహళ్లి గ్రామానికి చెందిన జయమ్మ, బోరేగౌడ దంపతులకు ఓ పాప జన్మించింది. ఏడేళ్ల అనంతరం అంటే 1994లో జయమ్మకు కేన్సర్ వ్యాధి రావడంతో చికిత్స కోసం బెంగళూరుకు తరలించారు. చికిత్స కోసం మొత్తం డబ్బులు ఖర్చు చేయాల్సి రావడంతో అసలే పేదరికంలో ఉన్న దంపతులకు కూతురును పెంచడం భారంగా మారింది. దీంతో ఇందిరానగర్‌లోనున్న ఓ అనాథశ్రమంలో కూతురును వదిలేసి వెళ్లిపోయారు .కొద్ది రోజులకు స్వీడన్ దేశానికి చెందిన ఓ జంట ఈ పాపను దత్తత తీసుకొని జూలిగా నామకరణం చేసి తమతో సాటు స్వీడన్‌కు తీసుకెళ్లి సొంత కూతురిలా పెంచి వివాహం సైతం చేశారు. కల పరమార్థం తెలిసి అయితే కొద్ది రోజులుగా ఎవరో తన కలలోకి వస్తుండడం, అందులో ఓ మహిళ కాలువలో దూకి ఆత్మహత్యకుచేసుకుంటున్నట్లు కనిపిస్తుండడంతో ఇదే విషయాన్ని పెంపుడు తల్లితండ్రులకు తెలిపింది. దీంతో జూలికి అసలు విషయం తెలపడంతో భర్త ఎరిక్‌తో కలసి కన్నవారి కోసం మండ్య జిల్లాలోని స్వగ్రామం దేశిహళ్లికి వచ్చి కన్నవారి కోసం వెతకడానికి నిర్ణయించుకుంది. కొద్దిరోజుల క్రితం దేశిహళ్లికి చేరుకొని తల్లిదండ్రుల కోసం గాలించింది. ఎన్నో ఆశలతో వచ్చిన జూలికి నిరాశే ఎదురైంది. జయమ్మ, బోరేగౌడల గురించి ఎవరూ వివరాలు చెప్పలేకపోయారు. అయినప్పటికీ తల్లితండ్రుల ఆచూకీ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తానని, తప్పకుండా కన్నవారిని కలుసుకుంటానని నమ్మకం వెలిబుచ్చింది. -
కేక్ దొరక్కపోవచ్చు కానీ, డిన్నర్ చేద్దాం..
సామాజిక స్పృహతో 17 ఏళ్ల స్వీడన్ అమ్మాయి అందరి మన్ననలు పొందుతోంది. వివరాల్లోకి వెళ్తే..స్వీడన్‌కు చెందిన పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్ తన పుట్టిన రోజు సందర్బంగా స్వీడన్ పార్లమెంట్ వెలుపల ఏడు గంటల పాటు నిరసన చేపట్టారు. ఆమె ప్రతి శుక్రవారం పర్యావరణ మార్పులకు వ్యతిరేకంగా నిరసన దీక్ష చేపడుతుంటారు. పర్యావరణ మార్పులకు వ్యతిరేకంగా వీక్లీ ఫ్రైడే నిరసన కార్యక్రమం చేపడుతున్నందుకు థన్‌బర్గ్‌కు ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది. థన్‌బర్గ్ స్పందిస్తూ..తాను ఎప్పటిలాగే ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు నిరసన దీక్ష చేపట్టానని తెలిపింది. తనకు పుట్టిన రోజున కేక్ దొరక్కపోవచ్చు కానీ, మనమందరం డిన్నర్ చేద్దామని భవిష్యత్తుకు భరోసా కల్పించేలా మాట్లాడింది. తాను గత ఏడాది కాలంగా చాలా బిజీగా ఉన్నానని.. జీవితంలో ఏ సాధించాలో సరియైన అవగాహన వచ్చిందని తెలిపింది. తాను చేస్తున్న కార్యక్రమాలు ప్రభావం చూపుతున్నాయని థన్‌బెర్గ్ హర్షం వ్యక్తం చేశారు. ధన్‌బర్గ్ పదిహేనేళ్ల వయస్సు నుంచే ప్రతి శుక్రవారం పాఠశాలకు డుమ్మా కొట్టి..స్వీడన్ పార్లమెంట్ వెలుపల కార్బన్ ఉద్గారాలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టేవారు. ఆమె చేస్తున్న కార్యక్రమాలు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది ప్రజలకు ప్రేరణ కలిగించారు. ఆమె చేస్తున్న కృషికి టైమ్స్ పర్స్‌న్ ఆఫ్ ది ఇయర్(2019) అవార్డు లభించింది. చదవండి: ట్రంప్– గ్రెటా ట్వీట్ వార్! -
ఈ గద్దకు చూపెక్కువ!
లండన్: ‘పెరెగ్రిన్ ఫాల్కన్’అనే గద్ద పక్షి జాతిలోనే అత్యంత వేగవంతమైన దూరదృష్టి కలిగి ఉంటుందని తాజా అధ్యయనంలో తేలింది. ఒక సెకనుకు దాదాపు 130 ఫ్రేమ్‌లను తన కళ్లతో బంధిస్తుందని తెలిసింది. దీంతో ఈ పక్షులు ఎక్కువ వేగంతో ఎగిరేటప్పుడు నేలపై ఉండే తన ఆహారాన్ని వేగంగా గుర్తించి, స్పందించే వీలు కలుగుతుందన్న మాట. స్వీడన్‌లోని లుండ్ యూనివర్సిటీ జరిపిన పరిశోధన ప్రకారం మానవుడి కళ్లు ఒక సెకనులో 50 నుంచి 60 ఫ్రేమ్‌లను మాత్రమే బంధించగలుగుతాయి. ఎక్స్పెరిమెంటల్ బయాలజీ జర్నల్‌లో ఈ అధ్యయనం వివరాలు ప్రచురితమయ్యాయి. ఈ అధ్యయనం ప్రకారం సరైన వెలుతురు ఉన్న వాతావరణంలో పెరెగ్రిన్ ఫాల్కన్ సెకనుకు 129 ఫ్రేమ్‌లను గుర్తుపెట్టుకోగలదని తెలిసింది. సేకర్ ఫాల్కన్ అనే గద్ద సెకనుకు 102, హారిస్ హాక్ డేగ 77 ఫ్రేమ్‌లను గుర్తుపెట్టుకోగలవని తెలిపింది. వేటాడే పక్షుల దృష్టిపై తొలిసారిగా అధ్యయనం చేసి, ఎదురుగా కనిపించే దానికి ఎలా స్పందిస్తుందనే విషయం తెలుసుకున్నట్లు లుండ్ వర్సిటీకి చెందిన అల్ముట్ కెల్బర్ తెలిపారు. సేకర్ ఫాల్కన్, హారిస్ హాక్ డేగలు నేలపై మెల్లగా కదిలే క్షీరదాలను మాత్రమే వేటాడుతుంటాయని, అందుకే వాటికి తక్కువ దూరదృష్టి ఉంటుందని వివరించారు. అదే పెరెగ్రిన్ ఫాల్కన్ మాత్రం తన ఆహారాన్ని చూసిన వెంటనే ఆకాశం నుంచి దాదాపు గంటకు 350 కిలోమీటర్ల వేగంతో కిందకు దిగి చటుక్కున నోట్లో వేసుకుంటుందని చెప్పారు. -
నోబెల్ వేడుక: ధోతి ధరించి.. భారతీయత ఉట్టిపడేలా!
స్టాక్‌హోమ్: ఇండో-అమెరికన్ ఆర్థికవేత్త అభిజిత్ వినాయక్ బెనర్జీ, ఆయన భార్య ఎస్తేర్ డఫ్లోతోపాటు సహోద్యోగి మైఖేల్ క్రెమెర్ 2019 ఏడాదికిగాను ఆర్థిక శాస్త్ర నోబెల్ బహుమతిని అందుకున్నారు. అట్టహాసంగా జరిగిన నోబెల్ పురస్కార ప్రదానోత్సవానికి అభిజిత్ దంపతులు భారతీయత ఉట్టిపడేలా సంప్రదాయ వస్త్రధారణలో హాజరయ్యారు. ప్రపంచ పేదరిక నిర్మూలనకు ప్రయోగాత్మక విధానంలో విస్తృతమైన పరిశోధన చేసినందుకుగాను వారికి నోబెల్ అవార్డు వరించింది. వారి పరిశోధన ఆర్థిక శాస్త్ర రంగాన్ని పునర్నిర్వచించేలా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. Watch Abhijit Banerjee, Esther Duflo and Michael Kremer receive their medals and diplomas at the #NobelPrize award ceremony today. Congratulations! They were awarded the 2019 Prize in Economic Sciences “for their experimental approach to alleviating global poverty.” pic.twitter.com/c3ltP7EXcF — The Nobel Prize (@NobelPrize) December 10, 2019 పేదరిక నిర్మూలనకు ఈ త్రయం చేసిన కృషికిగాను మంగళవారం స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్‌లో ఆ దేశ రాజు కార్ల్- 16 గుస్తాఫ్ నుంచి అవార్డు అందుకొన్నారు. ఈ వేడుకలో భారత సంతతికి చెందిన అభిజిత్ బెనర్జీ ధోతితోపాటు బ్లాక్ కలర్ బంద్‌గాల కోటు ధరించి భారతీయ సంప్రదాయ వేషాధారణలో అందరినీ ఆకర్షించారు. ఆయన భార్య ఎస్తేర్ డఫ్లో సైతం నీలి రంగు చీర ధరించి నోబెల్‌ను అందుకున్నారు. ఆర్థిక శాస్త్ర విభాగంలో నోబెల్ అందుకున్న ఈ ముగ్గురు ఆర్థికవేత్తలకు పతకాలతో పాటు రూ. 6.7 కోట్లను (9 మిలియన్ల స్వీడిష్ క్రోనాలు) బహుమతిగా పొందారు. ముంబైలో జన్మించిన బెనర్జీ.. అమర్త్యసేన్ తరువాత ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్న భారతీయ సంతతికి చెందిన రెండవ ఆర్థికవేత్తగా చరిత్రలోకి ఎక్కారు. నోబెల్ బహుమతి అందుకున్న అమర్త్య సేన్, అభిజిత్ బెనర్జీ .. కోల్‌కతా ప్రెసిడెన్సీ కళాశాలలో విద్యను అభ్యసించడం గమనార్హం. అభిజిత్ బెనర్జీ, భార్య ఎస్తేర్ డఫ్లోలు మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో (ఎంఐటీ) ఎకనామిక్స్ ప్రొఫెసర్లుగా విధులు నిర్వర్తిస్తుండగా.. క్రెమెర్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్ ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు. భారతదేశంలో గ్రామీణ సమస్యలను పరిష్కరించడానికి కనీస హామీ పథకంతో పాటు పలు సలహాలు సూచించారు. చదవండి: అభిజిత్ ‘నోబెల్’ వెలుగు నీడలు -
సిగ్గుపడాలి; ఆమె ఓ ఆకతాయి!
బ్రెసీలియా: స్వీడన్‌కు చెందిన పర్యావరణ కార్యకర్త, వాతావరణ మార్పుపై ఉద్యమిస్తున్న గ్రెటా థంబర్గ్‌పై బ్రెజిల్ అధ్యక్షుడు జేర్ బోల్సోనారో అనుచిత వ్యాఖ్యలు చేశారు. గ్రెటా ఓ ఆకతాయి పిల్ల అని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వంపై గ్రెటా చేసిన వ్యాఖ్యలను ఆయన కొట్టిపడేశారు. అమెజాన్ అడవుల్లో ముగ్గురు గిరిజనులు కాల్పుల్లో మృతి చెందడంపై గ్రెటా స్పందించిన తీరు ఆయన ఆగ్రహానికి కారణమైంది. ప్రపంచ ఊపిరితిత్తులుగా పేరందిన అమెజాన్ అడవుల్లో ఇటీవల తరచూ అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. అదే విధంగా అధిక సంఖ్యలో చెట్లు నరికివేతకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో మరాన్హా రాష్ట్రంలో అటవీ ప్రాంతంలో శనివారం ముగ్గురు గిరిజనులను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చివేశారు. ఈ ఘటనపై స్పందించిన గ్రెటా... అడవుల అక్రమ నరికివేతను అడ్డుకున్నందుకే వారిని కాల్చి చంపారని ఆరోపించారు. ఈ విషయంపై మాట్లాడకుండా ఉన్నందుకు ప్రతీ ఒక్కరు సిగ్గుపడాలి అని బ్రెజిల్ అధ్యక్షుడిపై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో గ్రెటా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన బోల్సోనారో.. ‘ప్రతీ చావుకు చింతించాల్సిందే. తనొక ఆకతాయి పిల్ల’ అని వ్యాఖ్యానించారు. దీంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక గిరిజనుల కాల్చివేత ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా అస్పెర్జర్ సిండ్రోమ్‌తో బాధ పడుతున్న గ్రెటా.. గతేడాది డిసెంబరులో పోలాండ్‌లో ఐక్యరాజ్యసమితి నిర్వహించిన కాప్24 సదస్సులో ప్రసంగించారు. ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ పేరిట వాతావరణ మార్పులపై అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ప్రపంచవ్యాప్తంగా తన ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తూ వాతావరణ మార్పులపై ప్రసంగాలు చేస్తూ ప్రజల్లో చైతన్యం నింపుతున్నారు. ఇక బోల్సోనారో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. అమెజాన్‌లో కార్చిచ్చు రగిలిన నేపథ్యంలో పర్యావరణ కార్యకర్తలే అడవిని తగులబెట్టారంటూ వ్యాఖ్యానించారు. -
ముంబై బీచ్‌లో చెత్త ఏరిన రాజదంపతులు
ముంబై : స్వీడన్ రాజదంపతులు కింగ్ కార్ల్-16 గుస్టాఫ్, క్వీన్ సిల్వియా ఐదు రోజుల భారత పర్యటనలో భాగంగా దేశంలోని పలు ప్రాంతాలను సందర్శిస్తున్న సంగతి తెలిసిందే. భారత పర్యటనలో రాజదంపతులు ప్రదర్శిస్తున్న నిరాడంబరత పలువురుని ఆకట్టుకుంటుంది. తాజాగా బుధవారం రాజదంపతులు ముంబై వెర్సోవా బీచ్‌లోని చెత్తను ఏరారు. ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడంలో అక్కడి వాలంటీర్లకు సహాయం అందించారు. పర్యావరణ ఉద్యమకారుడు ఆఫ్రోజ్ షాతో కలిసి వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, వెర్సోవా బీచ్‌లోని వ్యర్థాలను తొలగించడానికి ఆఫ్రోజ్ రెండేళ్ల క్రితం ఒంటరిగా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ప్రస్తుతం ఆయన వెంట 12,000 మది వాలంటీర్లు ఉన్నారు. ఆఫ్రోజ్ కృషికి ప్రధాని నరేంద్ర మోదీ కూడా అభినందనలు తెలిపారు. బీచ్‌లో చెత్త ఏరుతున్న సమయంలో రాజదంపతులు అక్కడి వాలంటీర్లతో ముచ్చటించారు. అలాగే బుధవారం సాయంత్రం వారు మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీతో సమావేశం కానున్నారు. అనంతరం డెహ్రాడూన్ బయలుదేరి వెళ్తారు. ఉత్తరఖాండ్‌లోని రామ్ జూలాను సందర్శిస్తారు. అలాగే గురువారం హరిద్వార్‌లో మురుగునీటిని శుద్ధి చేసే ప్లాంట్‌ను స్వీడన్ రాజదంపతులు ప్రారంభించనున్నారు. -
గ్రేటాకు మరో ప్రపంచ అవార్డు
న్యూఢిల్లీ : ప్రపంచ పర్యావరణ పరిరక్షణ కోసం గళమెత్తి ప్రపంచ దేశాలను కదిలించిన స్వీడన్‌కు చెందిన 16 ఏళ్ల గ్రేటా థన్‌బెర్గ్‌కు మరో గుర్తింపు లభించింది. ఆమె రాసిన తొలి పుస్తకం ‘నో వన్ ఈజ్ టూ స్మాల్ టు మేక్ ఏ డిఫరెన్స్’ కు ‘వాటర్‌స్టోన్స్ ఆథర్ ఆఫ్ ది వరల్డ్’ అవార్డు లభించింది. వాటర్‌స్టోన్స్ బ్రిటన్‌కు చెందిన ప్రముఖ పుస్తకాల సంస్థ. ప్రపంచ పర్యావరణ రక్షణ ఆవశ్యకత గురించి గ్రేటా వివిధ దేశాల్లో చేసిన ప్రసంగాల సంకలమే ‘నో వన్ ఈజ్ టూ స్మాల్ టు మేక్ ఏ డిఫరెన్స్’ పుస్తకం. ఇది గత మే నెలలో మార్కెట్లోకి వచ్చింది. ఈ పుస్తకంతోపాటు ‘ది బాయ్, ది మోల్, ది ఫాక్స్, ది హార్స్’ పుస్తకానికి కూడా చార్లీ మ్యాక్సేకు ‘ఆథర్ ఆఫ్ ది వరల్డ్’ అవార్డు లభించింది. పిల్లల్లో నీతిని పెంపొందించే ఈ పుస్తకం వెయ్యి ప్రతులను మాత్రమే ప్రచురించారు. డిమాండ్ మేరకు మళ్లీ మళ్లీ ప్రచురించడంతో 20 వేల ప్రతులు ఇప్పటికే అమ్ముడు పోయాయి. ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతికి గ్రేటా పేరు నామినేట్ అయిన విషయం తెల్సిందే. -
ఆమె టైమ్ ట్రావెలరా.. అంతా ట్రాష్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ పర్యావరణ పరిరక్షణ కోసం స్వీడన్లో గళమెత్తి ప్రపంచంలోని వంద నగరాల్లో కొన్ని లక్షల గొంతలు తనలాగే గళమెత్తేలా స్ఫూర్తినిచ్చిన ‘క్లైమేట్ ఛేంజ్’ కార్యకర్త, 16 ఏళ్ల బాలిక గ్రేటా థన్‌బెర్గ్ నిజంగా ‘టైమ్ ట్రావెలరా (కాలంతోపాటు ఓ కాలం నుంచి మరో కాలంకు ప్రయాణించే శక్తి కలిగిన)’? సరిగ్గా 121 సంవత్సరాల క్రితం 1898లో కెనడాలోని యుకాన్ టెరిటరీలో ఇద్దరు పిల్లలతో కలిసి ఓ బాలిక ఓ బావి నుంచి నీళ్లు తోడుతున్న దృశ్యం ఫొటోను చూసినట్లయితే ఎవరైనా ఇలా ప్రశ్నించాల్సిందే. వాషింగ్టన్ యూనివర్సిటీ పురావస్తు విభాగంలో లభించిన ఓ ఫొటోను యూనివర్సిటీ వెబ్సైట్లో పోస్ట్ చేయగా, అచ్చంగా ఆమె మన గ్రేటాలాగా ఉందంటూ మరో నెటిజన్ రెండు ఫొటోలను కలిపి పోస్ట్ చేయడంతో ఇప్పుడవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘నిజంగా ఆమె టైమ్ ట్రావెలర్. మన భవిష్యత్తు రక్షించేందుకు గతం నుంచి ఆమె భవిష్యత్తులోకి వచ్చారు. బ్యాక్ టు ది వ్యూచర్ సినిమా ఇది సాధ్యమని చెబుతోంది’ అని ఒకరు ట్వీట్ చేయగా, పలువురు ఆయనతో ఏకీభవిస్తూ ట్వీట్ చేస్తున్నారు. ‘ఇదంతా ట్రాష్. కాకమ్మ కథలు మేము నమ్మం’ అన్నంటున్న వాళ్లు ఉన్నారు. ఏదేమైనా మన భవిష్యత్తును రక్షించేందుకు పోరాడుతున్నందున గ్రేటా నిజంగా ‘టైమ్ ట్రావెలర్’ అని మరి కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఫొటో మార్ఫింగ్ చేశారేమోనంటూ మరి కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు. -
ఐ లవ్ జీబీవీ!
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన స్వీడన్ ఫ్యాషన్ దుస్తుల కంపెనీ ‘హెచ్ అండ్ ఎమ్’ ఊహించని చిక్కుల్లో పడింది. గత ఏడాది ఈ సంస్థ తయారు చేసిన దుస్తుల నిల్వలు పేరుకుపోయి వాటిని ఎలా అమ్ముకోవాలా అని దిక్కులు చూసింది. తర్వాత మార్కెట్లో ఆఫర్లు పెట్టి గండాన్ని గట్టెక్కింది. ఈ ఏడాది మరో కొత్త కష్టం వచ్చి పడింది. దానికి కష్టం అనే చిన్న పదం సరిపోదు. పేద్ద వివాదంలోనే చిక్కుకుంది హెచ్ అండ్ ఎమ్. మహిళలు షాపింగ్ చేసేటప్పుడు హెచ్ అండ్ ఎమ్ క్యారీ బ్యాగ్‌ను కూడా గర్వంగా పట్టుకునే వాళ్లు. అయితే ఆ కంపెనీ ఇటీవల విడుదల చేసిన దుస్తుల మీద ‘ఐ లవ్ జీబీవీ’ అని ముద్రించి ఉంది. సరిగ్గా ఈ మాటే ఇప్పుడు దుమారాన్ని రేపింది. ఆడవాళ్లు తమ చేతిలో ఉన్న క్యారీ బ్యాగ్‌ను అమాంతం విసిరి డస్ట్ బిన్లో వేసేట్టు చేసింది. జీవీబీ అనే అక్షరాలను జెండర్ బేస్డ్ వయొలెన్స్ అనే అర్థంలో వాడతారు. అంటే ‘ఐ లవ్ జెండర్ బేస్డ్ వయొలెన్స్’ అని అర్థం వస్తోంది. దీని మీద మహిళల హక్కుల కార్యకర్తలు విరుచుకు పడుతున్నారు. దీనికి హెచ్ అండ్ ఎమ్ ప్రతినిధి చెప్పిన సమాధానం కూడా వినండి. ‘‘ఆ దుస్తులను డిజైన్ చేసింది జీయెమ్బట్టిసావల్లి అనే ఇటలీ డిజైనర్. అతడి డిజైన్లను అతడి పేరులోని పొడి అక్షరాలతోనే ప్రమోట్ చేశాం. అంతే తప్ప వయొలెన్స్ అనేది మా ఆలోచనలోనే లేదు. మహిళల పట్ల వయొలెన్స్‌ని మాత్రమే కాదు, ఎటువంటి వయొలెన్స్నైనా మేము ఖండిస్తాం. సమానత్వపు సమాజం కోసం మా వంతు కృషి చేసేందుకు ఎప్పుడూ ముందుంటాం’’ అని సుదీర్ఘంగా సంజాయిషీ ఇచ్చుకున్నారు హేకెన్ ఆండర్సన్.‘ఐ లవ్ జీబీవీ’ అనే ఈ ట్యాగ్ లైన్‌ని ప్రస్తావిస్తూ ప్రపంచ హ్యూమన్ రైట్స్ సలహాదారుల సంస్థకు చెందిన మహిళల హక్కుల సమన్వయకర్త హెదర్ బార్.. ‘‘తెలియక చేసినా తప్పు తప్పే’’ అన్నారు. ‘‘ఇందులో నిగూఢమైన అర్థం ఏమీ లేదు. సామాన్యులకు అంత తెలియని పదమేమీ కాదు. జెండర్ బేస్డ్ వయొలెన్స్ అనాల్సిన ప్రతి చోటా అంత పెద్ద వాక్యాన్ని ఉపయోగించకుండా కుదించి జీబీవీ అనే వ్యవహరిస్తారు. ఇంత మామూలు పదం తెలియకపోవడం ఏమిటి’’ అని నిలదీస్తున్నారు. -
నాకు అవార్డులు అక్కర్లేదు... కేవలం..
వాషింగ్టన్ : పర్యావరణ పరిరక్షణకై విశేష కృషి చేస్తున్నందుకుగానూ స్వీడిష్ యువ కెరటం గ్రెటా థంబర్గ్‌ను ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. ఈ ఏడాది పర్యావరణ అవార్డు విజేతగా స్వీడన్, నార్వే ఆమె పేరును ప్రకటించాయి. ఈ క్రమంలో గ్రెటాకు అవార్డుతో పాటు 3 లక్షల యాభై వేల దానిష్ క్రోనర్లు(దాదాపు 35 లక్షల రూపాయలు) బహుమతిగా లభించాయి. అయితే గ్రెటా మాత్రం ఈ ప్రతిష్టాత్మక అవార్డును తిరస్కరించారు. తనకు అవార్డులు అక్కర్లేదని, వాతావరణ మార్పుపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకుంటే చాలు అని స్పష్టం చేశారు. ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న గ్రెటా ఈ మేరకు... ‘ వాతావరణ మార్పు ఉద్యమానికి ఇదే కాదు ఇలాంటి అవార్డులు ఏమీ అక్కర్లేదు’ అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ‘మన రాజకీయ నాయకులు, ప్రజల సహకారం మాత్రమే మనకు కావాలి. సైన్స్ చెబుతున్న వాస్తవాలు వారు గ్రహించాలి’ అని విఙ్ఞప్తి చేశారు. ఇక తనకు అవార్డు ప్రకటించిన సందర్భంగా అమెరికాలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ... పర్యావరణం విషయంలో నార్డిక్(స్వీడన్, నార్వే, ఫిన్లాండ్, ఐస్లాండ్, డెన్మార్క్) దేశాలు వ్యవహరిస్తున్న తీరును గ్రెటా విమర్శించారు. ‘ చాలా అందమైన మాటలు చెబుతారు. అయితే కర్భన ఉద్గారాల విషయానికి వచ్చేసరికి మాత్రం వెనకడుగు వేస్తారు. తలసరి ఆదాయం గురించి లెక్కిస్తారు గానీ ఒక్కక్కరు పర్యావరణానికి ఎలా హాని చేస్తున్నారో మాత్రం లెక్కలు వేయరు’ అని చురకలు అంటించారు. కాగా.. ‘‘నా కలల్ని, నా బాల్యాన్నీ మీరు దొంగిలించారు. వట్టి మాటలు మీవి. మీకేం పట్టదా? ప్రజలు జబ్బున పడుతున్నారు. చనిపోతున్నారు. మొత్తం పర్యావరణమే ధ్వంసమైపోయింది. కొద్దిమంది అదృష్టవంతులలో నేనొక దానిని. మేం బతికే ఉన్నాం. అంతరించిపోతున్న జీవజాతుల అంతిమ దినాలలో ఆఖరి శ్వాసను పీలుస్తూ కొన ఊపిరితో ఉన్నాం. మీకు డబ్బు కావాలి. అభివృద్ధి కావాలి. వాటి కోసం కట్టుకథలతో మమ్మల్ని మభ్యపెడుతున్నారు. హౌ డేర్ యూ!!’’ అంటూ అమెరికా కాంగ్రెస్ వేదికగా ప్రజాప్రతినిధులను, ప్రపంచ దేశాధినేతలను ప్రశ్నించి గ్రెటా పతాక శీర్షికల్లో నిలిచిన విషయం తెలిసిందే. కాగా అస్పెర్జర్ సిండ్రోమ్‌తో బాధ పడుతున్న 16 ఏళ్ల గ్రెటా.. గతేడాది డిసెంబరులో పోలాండ్‌లో ఐక్యరాజ్యసమితి నిర్వహించిన కాప్24 సదస్సులో ప్రసంగించారు. ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ పేరిట వాతావరణ మార్పులపై అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ప్రపంచవ్యాప్తంగా తన ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ఐక్యరాజ్యసమితిలో ప్రసంగిస్తూ ‘మా గురించి పట్టించుకోమని అడుక్కోవడానికి ఇక్కడకు రాలేదు. చాలా ఏళ్లుగా మమ్మల్ని మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు. అయినా ఎన్నోసార్లు క్షమించాం. కానీ ఇప్పుడు సమయం మించిపోయింది. పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. వాతావరణ మార్పుల వల్ల కలిగే నష్టాలు భవిష్యత్తును అంధకారం చేస్తాయి. ప్రజల చేతుల్లోనే నిజమైన అధికారం ఉంటుంది’ అంటూ వ్యాఖ్యానించి ప్రపంచ దేశాధినేతపై విరుచుకుపడ్డారు. ఇక కర్భన ఉద్గారాలను నియంత్రించాల్సిన అవసరం ఉందంటూ... భారత ప్రధాని మోదీకి సైతం ఓ పవర్ఫుల్ వీడియో మెసేజ్ పంపారు. -
ప్లాస్టిక్ భరతం పట్టే కొత్త టెక్!
వీధుల్లో, చెరువుల్లో, సముద్రాల్లో చేరిపోయి మనిషిని రకరకాలుగా ముప్పు తిప్పలు పెడుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలకు ఓ పరిష్కారం దొరికిందని అంటున్నారు స్వీడన్ లోని చామర్స్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు. భూమ్మీద ఉన్న ప్లాస్టిక్ చెత్తనంతా కరిగించేయడమే కాకుండా.. దాన్ని మళ్లీ తాజా ప్లాస్టిక్‌లా వాడుకునే అద్భుత టెక్నాలజీని వీరు అభివృద్ధి చేశా రు. ఆవిరితో కరగబెట్టడం ద్వారా ప్లాస్టిక్‌ను అణుస్థాయిలో విడగొట్టడం ద్వారా ఈ సాంకేతికత పని చేస్తుందని ఈ పద్ధతిని ఆవిష్కరించిన శాస్త్రవేత్త హెన్రిక్ థున్‌మన్ తెలిపారు. ప్లాస్టిక్‌ను సుమారు 850 డిగ్రీ సెల్సియస్ వరకు వేడి చేయడం ద్వారా వచ్చే వాయువును కొన్ని పద్ధతుల ద్వారా మళ్లీ తాజా ప్లాస్టిక్ మాదిరిగా వాడుకోవచ్చని వివరించారు. ఇప్పుడున్న ఫ్యాక్టరీల్లోనే ఈ సరికొత్త రీసైక్లింగ్ ప్రక్రియను చేసుకోవచ్చని చెప్పారు. ప్రయోగాల్లో తాము 200 కిలోల ప్లాస్టిక్ చెత్తను గంటలో మళ్లీ ప్లాస్టిక్‌ను ఉత్పత్తి చేయగల వాయురూపంలోకి మార్చేశామని తెలిపారు. ఏడాదికి 35 కోట్ల టన్నులు.. 2015 నాటి లెక్కల ప్రకారం ప్రపంచం మొత్తమ్మీద ఏడాదికి ఉత్పత్తి అవుతున్న ప్లాస్టిక్ దాదాపు 35 కోట్ల టన్నులు. ప్రస్తుతం చాలావరకు ప్లాస్టిక్ చెత్తను మండించి ఆ వేడితో విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు ఉపయోగిస్తున్నారు. లేదా వ్యర్థాలు ఎక్కువ స్థలం ఆక్రమించకుండా చూసేందుకు కాల్చేయడాన్ని ఒక మార్గంగా పరిగణిస్తున్నారు. దీనివల్ల కార్బన్ డయాక్సైడ్‌తోపాటు అనేక ఇతర విషవాయువులు గాల్లోకి చేరి పరిసరాలను కలుషితం చేస్తున్నాయి. మొత్తం ప్లాస్టిక్ వ్యర్థాల్లో సుమారు 60 శాతం చెత్త కుప్పల్లోకి చేరుతోంది. రీసైక్లింగ్ కోసం సేకరిస్తోంది 14 శాతం మాత్రమే. మొత్తం వ్యర్థాల్లో 8 శాతాన్ని చౌకరకం ప్లాస్టిక్‌గా రీసైకిల్ చేస్తుండగా 2 శాతం కొంచెం నాణ్యమైన పదార్థంగా అందుతోంది. ఒక శాతం వ్యర్థాలు మాత్రం వీధుల్లో, నదుల్లో, ఇతర ప్రాంతాల్లో పేరుకుపోయి సమస్యగా మారుతోంది. కర్బన పరమాణువులతో మ్యాజిక్.. ప్లాస్టిక్‌ను చెత్తగా పడేశాక దాన్ని రీసైకిల్ చేసినా నాణ్యత పెరగదు. ఈ కారణంగానే హెన్రిక్ బృందం ప్లాస్టిక్ పునర్వినియోగానికి ఓ వినూత్న మార్గాన్ని ఎంచుకుంది. పదార్థంలోని కర్బన పరమాణువులను సేకరించి వాడుకునేందుకు ప్రయత్నించింది. వాటిద్వారా మళ్లీ సరికొత్త, నాణ్యమైన ప్లాస్టిక్‌ను ఉత్పత్తి చేయడం ద్వారా ముడిచమురుతో ప్లాస్టిక్‌ను తయారు చేయాల్సిన అవసరాన్ని గణనీయంగా తగ్గించొచ్చు. ‘మా ఆలోచనలను పరీక్షించుకునేందుకు 200 కిలోల ప్లాస్టిక్‌ను రీసైకిల్ చేశాం. అది కాస్తా విజయవంతమవడంతో ప్రస్తుతం మొత్తం ప్రక్రియను అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. చమురు శుద్ధి కేంద్రాలనే రీసైక్లింగ్ ప్లాంట్లుగాను మార్చేందుకు ఏం కావాలో పరిశీలిస్తున్నాం’అని హెన్రిక్ తెలిపారు. -సాక్షి నాలెడ్జ్ సెంటర్