Sweden Electrified Road: ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం విపరీతంగా పెరుగుతోంది. కొన్ని దేశాల్లో ఇప్పటికీ ఎదురవుతున్న ఛార్జింగ్ సమస్యల దృష్ట్యా కొందరు ఫ్యూయల్ వాహనాలనే ఎంచుకుంటున్నారు. భారతదేశంలో ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వాలు రంగంలోకి దిగి, సంబంధిత సంస్థలకు ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి. అయితే స్వీడన్ ఈ సమస్యకు కొత్త టెక్నాలజీతో చెక్ పెద్దటానికి సిద్ధమైంది.
సాధారణంగా ఎలక్ట్రిక్ వాహనాలకు ఎప్పటికప్పుడు ఛార్జింగ్ వేసుకుంటూ ఉండాలి, ఛార్జింగ్ తగ్గితే గమ్యాన్ని చేరుకోలేము. కాబట్టి ముందుగానే ఫుల్ ఛార్జింగ్ చేసుకుని, దాని రేంజ్ ఎంతో.. అంత దూరం ప్రయాణించడానికి ప్లాన్ వేసుకోవాలి. ఇంకా ముందుకు వెళ్లాలంటే మళ్ళీ ఛార్జింగ్ వేసుకోక తప్పదు. తద్వారా ప్రయాణికులు కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: రూ.1200 సంపాదనతో మొదలై.. రూ.9800 కోట్ల కంపెనీ నడిపిస్తోంది! ఎవరీ గజల్ అలఘ్..
ఇప్పుడు స్వీడన్, ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్రత్యేకంగా 'ఎలక్ట్రిఫైడ్ రోడ్స్' నిర్మిస్తోంది. వీటి ద్వారా కారు నడుస్తున్నప్పుడు లేదా ప్రయాణిస్తున్నప్పుడే ఛార్జ్ చేసుకోగలదు. ఛార్జింగ్ వేసుకోవడానికి ప్యత్యేకంగా సమయం కేటాయించాల్సిన అవసరం లేదు. దీని కోసం సరికొత్త టెక్నాలజీ కండక్టీవ్ రెయిల్స్, ఇండక్టివ్ కాయిల్స్‌తో 3,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ పొడవైన జాతీయ రహదారి స్వీడన్ ప్రధాన నగరాలైన స్టాక్‌హోమ్, గోథెన్‌బర్గ్, మాల్మో మధ్యలో నిర్మితమవుతోంది. ఇది 2025 నాటికి వినియోగంలో రానున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment