New technology
-
సైబర్ సవాలు
అమృతంతో పాటు హాలాహలం పుట్టిందట. సౌకర్యాలెన్నో తెచ్చిన డిజిటల్ సాంకేతికత విసురు తున్న తాజా సవాళ్ళను చూస్తే అదే గుర్తొస్తుంది. రెచ్చిపోతున్న సైబర్ మోసగాళ్ళు, పెచ్చుమీరు తున్న డిజిటల్ స్కామ్‌ల సంఖ్యే అందుకు తార్కాణం. ‘డిజిటల్ అరెస్ట్ మోసాల’ బారినపడి ఓ రిటైర్డ్ ప్రొఫెసర్ రూ. 75 లక్షలు, ఓ పారిశ్రామికవేత్త రూ. 7 కోట్లు నష్టపోయిన కథనాలు అమాయ కుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. చదువు లేని సామాన్యుల దగ్గర నుంచి ఉన్నత స్థాయి ఉద్యోగుల వరకు చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ తమ కష్టార్జితాన్ని పోగొట్టుకుంటున్న వైనం అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. కొత్త సాంకేతికత వచ్చినప్పుడల్లా కొత్త రకం మోసాలూ అంతే వేగంగా ప్రభవించడం ఆది నుంచీ ఉంది. అయితే, అడ్డుకట్ట వేసినప్పుడల్లా మోస గాళ్ళు సైతం తెలివి మీరి కొత్త రీతుల్లో, మరింత సృజనాత్మకంగా మోసాలు చేయడమే పెను సవాలు. అనేక అంశాలతో ముడిపడ్డ దీన్ని గట్టిగా తిప్పికొట్టాలంటే ఏకకాలంలో అనేక స్థాయుల్లో చర్యలు చేపట్టాలి. అందుకు ప్రజా చైతన్యంతో పాటు ప్రభుత్వ క్రియాశీలత ముఖ్యం. సాక్షాత్తూ భారత ప్రధాని సైతం తన నెల వారీ ‘మన్ కీ బాత్’ రేడియో ప్రసంగంలో తాజాగా ఈ ‘డిజిటల్ అరెస్ట్ మోసాల’ గురించి ప్రస్తావించారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. బాధితులను ముందుగా ఫోన్లో సంప్రతించడం, మీ ఆధార్ నంబర్ – ఫోన్ నంబర్‌పై వెళుతున్న డ్రగ్స్ పార్సిల్‌ను పట్టుకున్నామనడం, ఆపై వాట్సప్, స్కైప్‌లలో వీడియో కాల్‌కు మారడం, తాము నిజమైన పోలీసులమని నమ్మించడం, నకిలీ పత్రాలు చూపి ‘డిజిటల్ అరెస్ట్’ చేసినట్టు బాధితులను భయపెట్టడం, ఆఖరికి వారి కష్టార్జితాన్ని కొల్లగొట్టడం ‘డిజిటల్ అరెస్ట్ మోసాల’ వ్యవహారశైలి. మోసగాళ్ళు తమను తాము పోలీసులుగా, సీబీఐ అధికారులుగా, మాదకద్రవ్యాల నిరోధక శాఖకు చెందినవారిగా, రిజర్వ్ బ్యాంక్ అధికారులుగా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులుగా, చివరకు జడ్జీలమని కూడా చెప్పుకుంటూ... అమాయకులపై మానసికంగా ఒత్తిడి తెచ్చి, భయభ్రాంతులకు గురి చేసి ఆఖరికి వారి నుంచి లక్షల రూపాయల కష్టార్జితాన్ని అప్పనంగా కొట్టేస్తున్నారు. డిజిటల్ అరెస్ట్ స్కామ్, ట్రేడింగ్ స్కామ్, పెట్టుబడుల స్కామ్, డేటింగ్ యాప్‌ల స్కామ్... ఇలా రకరకాల మార్గాల్లో సైబర్ ముఠాలు రెచ్చిపోతున్నాయి. ఏటేటా ఈ మోసాలు పెరుగు తున్నాయి. ఒక్క ఈ ఏడాదే కొన్ని వేల డిజిటల్ అరెస్ట్ మోసాలు వెలుగులోకి వచ్చాయి. రోజూ లెక్కకు మిక్కిలిగా నమోదవుతున్న ఈ సైబర్ నేరాల గణాంకాలు చూస్తే కళ్ళు తిరుగుతాయి. 2021లో 4.52 లక్షల ఫిర్యాదులు వస్తే, 2022లో 9.66 లక్షలు, గత ఏడాది 15.56 లక్షల ఫిర్యాదులు నమోదయ్యాయి. ఇక, ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లోనే ఏకంగా 7.4 లక్షల ఫిర్యాదులు అందా యని నేషనల్ సైబర్‌క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్సీఆర్పీ) కథనం.ఆర్థిక నష్టానికొస్తే జనవరి – ఏప్రిల్ మధ్య డిజిటల్ మోసాల వల్ల భారతీయులు రూ. 120 కోట్ల పైగా పోగొట్టుకున్నారు. అలాగే, ట్రేడింగ్ స్కామ్‌లలో రూ. 1420.48 కోట్లు, పెట్టుబడుల స్కామ్‌లలో రూ. 222.58 కోట్లు, డేటింగ్ స్కామ్‌లలో రూ. 13.23 కోట్లు నష్టపోవడం గమనార్హం. చిత్రమేమిటంటే, ఈ డిజిటల్ మోసాల్లో దాదాపు సగం కేసుల్లో మోసగాళ్ళు మయన్మార్, లావోస్, కాంబోడియాల నుంచి కథ నడిపినవారే!గమనిస్తే, గత పదేళ్ళలో భారతీయ మధ్యతరగతి వర్గం వార్షికాదాయం లక్షన్నర – 5 లక్షల స్థాయి నుంచి రూ. 2.5 – 10 లక్షల స్థాయికి మారిందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా నివేదిక. సహజంగానే ఆర్థిక స్థాయితో పాటు మధ్యతరగతి అవసరాలు, ఆకాంక్షలూ పెరిగాయి. కాలంతో పాటు జీవితంలోకి చొచ్చుకువచ్చిన డిజిటల్ సాంకేతికతను అందరితో పాటు అందుకోవాల్సిన పరిస్థితి. డిజిటల్ అక్షరాస్యత లేకపోయినా డిజిటల్ చెల్లింపు వేదికలు సహా అన్నీ అనివార్య మయ్యాయి. అయితే, సౌకర్యంతో పాటు సవాలక్ష కొత్త సవాళ్ళనూ ఆధునిక సాంకేతికత విసిరింది. అవగాహన లేమితో సామాన్యుల మొదలు సంపన్నుల దాకా ప్రతి ఒక్కరూ మోసపోతున్న ఘటనలు ఇటీవల పెరిగిపోతున్నది అందుకే. జీవితమంతా కష్టపడి కూడబెట్టుకున్న సొమ్ము ఇలా మోసాల పాలవుతుండడంతో మధ్యతరగతి సహా అందరిలోనూ ఇప్పుడు భయాందోళనలు హెచ్చాయి. దీన్ని ఎంత సత్వరంగా, సమర్థంగా పరిష్కరిస్తామన్నది కీలకం. ప్రధాని చెప్పినట్టు ‘డిజిటల్‌గా అరెస్ట్’ చేయడమనేదే మన చట్టంలో లేదు. అసలు ఏ దర్యాప్తు సంస్థా విచారణకు ఫోన్ కాల్, వీడియో కాల్ ద్వారా సంప్రతించదు. కానీ, అలా అబద్ధపు అరెస్ట్‌తో భయపెట్టి డబ్బు గుంజడం మోసగాళ్ళ పని. అది జనం మనసుల్లో నాటుకొనేలా చేయాలి. డిజిటల్ నిరక్షరాస్యతను పోగొట్టి, సాంకేతికతపై భయాలను తొలగించాలి. సరిగ్గా వాడితే సాంకేతికతలో ఉన్న లాభాలెన్నో గ్రహించేలా చూడాలి. క్షణకాలం సావధానంగా ఆలోచించి, అప్రమత్తమైతే మోస పోమని గుర్తించేలా చేయాలి. ఒకవేళ మోసపోతే, ఎక్కడ, ఎలా తక్షణమే ఫిర్యాదు చేసి, సాంత్వన పొందాలన్నది విస్తృత ప్రచారం చేయాలి. మోసాలను అరికట్టి, అక్రమార్కుల భరతం పట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలను చేపట్టాలి. మన సైబర్ భద్రతా వ్యవస్థను ఎప్పటికప్పుడు తాజా అవస రాలకు అనుగుణంగా నవీకరించాలి. అన్ని రకాల సైబర్ నేరాలపై చర్యల్లో సమన్వయానికి కేంద్రం ఇప్పటికే ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐసీ4)ను నెలకొల్పింది. తీరా దాని పేరు మీదే అబద్ధాలు, మోసాలు జరుగుతున్నందున అప్రమత్తత పెంచాలి. అవసరంతో పని లేకుండా వ్యక్తిగత సమాచారాన్ని అన్నిచోట్లా అడగడాన్నీ, అందించాల్సి రావడాన్నీ నివారించాలి. ఎంతైనా, నిరంతర నిఘా, నిర్దిష్టమైన అవగాహన మాత్రమే సైబర్ మోసాలకు సరైన విరుగుడు. -
టీవీలు కంప్యూటర్లుగా మారిపోతే.. జియో కొత్త టెక్నాలజీ
రిలయన్స్ జియో మరో కొత్త టెక్నాలజీకి నాంది పలుకుతోంది. ఇంట్లోని స్మార్ట్ టీవీలను తక్కువ ఖర్చుతో సులభంగా కంప్యూటర్లుగా మార్చే సాంకేతికతను ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2024లో ప్రదర్శించింది. జియో క్లౌడ్ పీసీ (Jio Cloud PC) అని పిలిచే ఈ టెక్నాలజీ కేవలం కొన్ని వందల రూపాయలకే టీవీని కంప్యూటర్‌గా మారుస్తుంది.ఇందుకోసం ఇంటర్నెట్ కనెక్షన్, స్మార్ట్ టీవీ, టైపింగ్ కీబోర్డ్, మౌస్, జియో క్లౌడ్ పీసీ యాప్ మాత్రం ఉంటే చాలు. స్మార్ట్ టీవీలే కాకుండా సాధారణ టీవీలను సైతం జియోఫైబర్ లేదా జియోఎయిర్‌ఫైబర్‌తో వచ్చే సెట్-టాప్ బాక్స్ ద్వారా కంప్యూటర్లుగా మార్చుకోవచ్చు. జియో క్లౌడ్ పీసీ అనేది ఇంటర్నెట్ ద్వారా ఏదైనా టీవీని క్లౌడ్ కంప్యూటింగ్‌కు కనెక్ట్ చేసే సాంకేతికత.జియో క్లౌడ్ పీసీ టెక్నాలజీని ఉపయోగించడం చాలా సులభం. యూజర్ యాప్‌లోకి లాగిన్ అయితే చాలు. క్లౌడ్‌లో స్టోర్ అయిన డేటా మొత్తం టీవీ స్క్రీన్‌పై కనిపిస్తుంది. సాధారణంగా కంప్యూటర్లో చేసే ఈమెయిల్, మెసేజింగ్, సోషల్ నెట్వర్కింగ్, ఇంటర్నెట్ సర్ఫింగ్, స్కూల్ ప్రాజెక్ట్‌లు, ఆఫీసు ప్రెజెంటేషన్ల వంటి పనులన్నింటినీ ఇప్పుడు టీవీలో చేయవచ్చు.ఖరీదైన కంప్యూటర్లను కొనుక్కోలేని దేశంలోని మధ్యతరగతి కుటుంబాలకు ఈ సాంకేతికత ఒక వరం లాంటిది. క్లౌడ్ కంప్యూటింగ్ సామర్థ్యాన్ని అవసరానికి అనుగుణంగా సర్దుబాటు చేసుకోవచ్చు కాబట్టి, సాధారణ కంప్యూటర్‌తో పోలిస్తే ఇది సురక్షితంగా ఉండటమే కాకుండా డేటా రికవరీని చాలా సులభతరం చేస్తుంది. ఇది టీవీలతో పాటు మొబైల్ పరికరాలకు కూడా ఉపయోగపడుతుంది. ఈ యాప్‌కు సంబంధించిన లాంచ్ తేదీని కంపెనీ ఇంకా ప్రకటించనప్పటికీ, రాబోయే నెలల్లో దీనిని మార్కెట్లో విడుదల చేయవచ్చు. -
అంతరిక్ష ప్రయోగాల్లో మరో ఇంజనీరింగ్ అద్భుతం
బోకా చినా(అమెరికా): అగ్రరాజ్యం అమెరికాలో అంతరిక్ష ప్రయోగాల్లో మరో ఇంజనీరింగ్ అద్భుతం చోటుచేసుకుంది. రాకెట్‌ను నింగిలోకి పంపించాక బూస్టర్‌ను మళ్లీ వినియోగించుకునేందుకు సాయపడే కొత్తరకం సాంకేతికతను అంతరిక్షరంగ సంస్థ స్పేస్ఎక్స్ విజయవంతంగా పరీక్షించింది. ప్రయోగవేదిక నుంచి రాకెట్తోపాటు నింగిలోకి దూసుకెళ్లిన బూస్టర్ తిరిగి యథాస్థానానికి ఎగిరొచ్చిన ఘటనకు దక్షిణ టెక్సాస్‌లోని స్టార్‌బేస్ ప్రయోగవేదిక సాక్షిగా నిలిచింది. అమెరికా స్థానికకాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 8.25 గంటలకు ఈ స్టార్‌షిప్ రాకెట్‌ను ప్రయోగించారు. రాకెట్‌లోని 232 అడుగుల(71 మీటర్ల) ఎత్తయిన బూస్టర్.. లాంఛ్‌ప్యాడ్ నుంచి స్పేస్‌క్రాఫ్ట్‌ను నింగిలోకి పంపించిన ఏడు నిమిషాల తర్వాత మళ్లీ లాంఛ్ప్యాడ్కు వచ్చి చేరింది. నిప్పులు కక్కుతూ తిరిగొచి్చన బూస్టర్‌ను లాంఛ్ప్యాడ్లోని మెకానికల్ ‘చాప్‌స్టిక్’ చేతులు ఒడిసిపట్టిన వీడియోను స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ ఎలాన్‌మస్క్ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్‌చేశారు. ‘‘రాకెట్‌ను లాంచ్‌టవర్ ఒడుపుగా పట్టేసుకుంది. ఇదొక సైన్స్ ఫిక్షన్. అయితే ఇందులో ఎలాంటి ఫిక్షన్ లేదు’’ అని మస్క్ టీŠవ్ట్చేశారు. ప్రయోగం విజయవంతమవడంతో ప్రయోగకేంద్రంలోని స్పేస్ఎక్స్ శాస్తవేత్తలు, సంస్థ ఉద్యోగులు ఆనందంతో కేరింతలు కొట్టారు. నాసా అడ్మినిస్టేటర్ సైతం వీళ్లకు ప్రత్యేకంగా అభినందించారు. ఏకంగా 400 అడుగుల(111 మీటర్ల)ఎత్తయిన అత్యంత భారీ రాకెట్‌కు సంబంధించిన బూస్టర్ ఇలా లాంఛ్‌ప్యాడ్ మీదకే తిరిగిచేరడం ఇదే తొలిసారి. బూస్టర్ వల్ల నింగిలోకి వెళ్లిన స్పేస్‌క్రాఫ్ట్‌ను శాస్త్రవేత్తలు హిందూమహాసముద్రంలో నిర్దేశిత సముద్రప్రాంతంలో దించారు. ఇంజనీరింగ్ చరిత్ర పుస్తకాల్లో లిఖించదగ్గ రోజు ఇది అని స్పేస్ఎక్స్ ప్రధానకార్యాలయంలో ఇంజనీరింగ్ మేనేజర్ కేట్ టైస్ ఆనందం వ్యక్తంచేశారు.లాంచ్ప్యాడ్పై తొలిసారిగా.. చిన్నపాటి ‘ఫాల్కన్–9’ రాకెట్లకు వినియోగించిన ఫస్ట్–స్టేజీ బూస్టర్లను గత తొమ్మిదేళ్లుగా స్పేస్ఎక్స్ వినియోగిస్తోంది. అయితే అందులో ఏవీ కూడా మళ్లీ లాంచ్‌ప్యాడ్‌కు చేరుకోలేదు. క్యాప్సూల్, స్పేస్‌క్రాఫ్ట్‌ను నింగిలోకి తీసుకెళ్లాక ఫస్ట్–స్టేజీ బూస్టర్లు సముద్రంలోని నిర్దేశిత తేలియాటే తలాలపై క్షేమంగా ల్యాండ్ అయ్యేవి. లేదంటే లాంచ్‌ప్యాడ్‌కు ఏడు మైళ్ల దూరంలోని కాంక్రీట్ శ్లాబులపై ల్యాండ్ అయ్యేవి. కానీ ఇలా భారీ ఫస్ట్–స్టేజీ బూస్టర్ తిరిగి లాంచ్‌ప్యాడ్‌కు తిరిగిరావడం ఇదే తొలిసారి. జూన్‌లో మినహా గతంలో భారీ ఫస్ట్–స్టేజీ బూస్టర్ల పునరాగమనంపై ప్రయోగాలు విఫలమయ్యాయి. ఫాల్కన్ విషయంలో సక్సెస్ అయిన ఫార్ములాను భారీ స్టార్‌షిప్‌కు వాడాలని మస్క్ నిర్దేశించుకుని ఎట్టకేలకు విజయం సాధించారు. ఒక్కోటి 33 మిథేన్ ఇంధన ఇంజన్ల సామర్థ్యముండే బూస్టర్లతో తయారైన స్టార్‌షిప్ ప్రపంచంలోనే అతి ఎత్తయిన పెద్ద రాకెట్‌గా పేరొందింది. ఇలాంటి రెండు స్టార్‌షిప్‌లను సరఫరాచేయాలని స్పేస్ఎక్స్కు నాసా ఆర్డర్ ఇచి్చంది. ఈ దశాబ్ది చివరికల్లా చంద్రుడి మీదకు వ్యోమగాములను తరలించేందుకు వీటిని వాడనున్నారు. -
ప్రపంచంలోనే తొలిసారి.. కొత్త టెక్నాలజీతో కరెంటు ఉత్పత్తి
కోతల్లేని కరెంటు అది కూడా కారు చౌకగా దొరికితే ఎలా ఉంటుంది? అద్భుతం అంటున్నారా? నిజమే కానీ.. ఇప్పటివరకూ ఇలా కాలుష్యం లేకుండా, అతి చౌకగా కరెంటు ఉత్పత్తి చేసే టెక్నాలజీ ఏదీ లేదు మరి! ఇకపై కాదంటోంది హైలెనర్!ప్రపంచంలోనే తొలిసారి తాము కోల్డ్ ఫ్యూజన్ టెక్నాలజీ సాయంతో అందించే వేడి కంటే ఎక్కువ వేడిని పొందగలిగామని.. దీనివల్ల భవిష్యత్తులో అనేక ప్రయోజనాలు ఉంటాయని అంటున్నారు సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిద్ధార్థ దొరై రాజన్! ఏమిటీ టెక్నాలజీ? చౌక కరెంటు ఎలా సాధ్యం అని అనుకుంటున్నారా? చదివేయండి మరి..మనందరికీ వెలుగునిచ్చే సూర్యుడు కోట్ల సంవత్సరాలుగా భగభగ మండుతూనే ఉన్నాడు. విపరీతమైన వేడి, పీడనాల మధ్య హీలియం అణువులు ఒకదాంట్లో ఒకటి లయమై పోతూండటం వల్ల ఈ వెలుగులు సాధ్యమవుతున్నాయి. ఈ ప్రక్రియను కేంద్రక సంలీన ప్రక్రియ లేదా న్యూక్లియర్ ఫ్యూజన్ అంటారన్నది కూడా మనం చిన్నప్పుడు చదువుకునే ఉంటాం. ఇదే ప్రక్రియను భూమ్మీద నకలు చేసి చౌక, కాలుష్య రహిత విద్యుత్తు ఉత్పత్తికి బోలెడన్ని ప్రయోగాలూ జరుగుతున్నాయి.అయితే.. ఇవి ఎంతవరకూ విజయవంతమవుతాయన్నది ఇప్పటికీ ప్రశ్నార్థకమే. ఈ నేపథ్యంలోనే హైలెనర్ ప్రతిపాదిస్తున్న ‘లో ఎనర్జీ న్యూక్లియర్ రియాక్షన్’ టెక్నాలజీ ఆసక్తికరంగా మారింది. న్యూక్లియర్ ఫ్యూజన్ పనిచేసేందుకు విపరీతమైన వేడి, పీడనాలు అవసరమని చెప్పుకున్నాం కదా.. పేరులో ఉన్నట్లే లో ఎనర్జీ న్యూక్లియర్ రియాక్షన్స్లో వీటి అవసరం ఉండదు. ఎంచక్కా గది ఉష్ణోగ్రతలోనే అణుస్థాయిలో రియాక్షన్స్ జరిగేలా చూడవచ్చు. ఫలితంగా మనం అందించే వేడి కంటే ఎక్కువ వేడి అందుబాటులోకి వస్తుంది.హైలెనర్ బుధవారం హైదరాబాద్‌లోని టీ-హబ్‌లో ఈ టెక్నాలజీని ప్రదర్శించిన సందర్భంగా.. వంద వాట్ల విద్యుత్తును ఉపయోగించగా... 150 వాట్లకు సమానమైన శక్తి లభించింది. ఈ ప్రక్రియలో మిల్లీగ్రాముల హైడ్రోజన్ ఉపయోగించడం వల్ల అదనపు వేడి పుట్టిందని అంటున్నారు సిద్ధార్థ దొరై రాజన్! టి-హబ్ సీఈవో మహంకాళి శ్రీనివాస రావు ఈ లో ఎనర్జీ న్యూక్లియర్ రియాక్షన్ పరికరాన్ని ఆవిష్కరించారు.1989 నాటి ఆలోచన..హైలెనర్ చెబుతున్న టెక్నాలజీ నిజానికి కొత్తదేమీ కాదు. 1989లో మార్టిన్ ఫైష్‌మాన్, స్టాన్లీ పాన్స్ అనే ఇద్దరు ఎలక్ట్రో కెమిస్ట్‌లు తొలిసారి ఈ రకమైన టెక్నాలజీ సాధ్యతను గుర్తించారు. భారజలంతో పల్లాడియం ఎలక్ట్రోడ్‌ను వాడుతూ ఎలక్ట్రోలసిస్ జరుపుతున్నప్పుడు కొంత వేడి అదనంగా వస్తున్నట్లు వీరు తెలుసుకున్నారు. అణుస్థాయిలో జరిగే ప్రక్రియలతో మాత్రమే ఇలా అదనపు వేడి పుట్టే అవకాశముందని వీరు సూత్రీకరించారు. దీన్ని నిరూపించేందుకు ఇప్పటివరకూ చాలా విఫల ప్రయత్నాలు జరిగాయి. తాము విజయం సాధించామని హైలెనర్ అంటోంది. దేశ రక్షణకు అత్యంత కీలకమైన క్షిపణులను అభివృద్ధి చేయడంలో కీలకపాత్ర పోషించిన పద్మ శ్రీ ప్రహ్లాద రామారావు ఈ కంపెనీ చీఫ్ ఇన్నొవేటింగ్ ఆఫీసర్‌గా ఉండటం, ఈ టెక్నాలజీకి భారత పేటెంట్ ఇప్పటికే దక్కడం హైలెనర్‌పై ఆశలు పెంచుతున్నాయి.ఎలాంటి లాభాలు సాధ్యం?విద్యుత్తు, వేడి అవసరమైన ఎన్నో రంగాల్లో ఈ టెక్నాలజీ ద్వారా లాభం కలగనుంది. అంతరిక్షంలో తక్కువ విద్యుత్తును వాడుకుంటూ ఎక్కువ వేడిని పుట్టించవచ్చు. చల్లటి ప్రాంతాల్లో గదిని వెచ్చగా ఉంచేందుకు వాడుకోవచ్చు. ఇందుకోసం ఇప్పుడు కాలుష్య కారక డీజిల్ ఇంధనాలను వాడుతున్న విషయం తెలిసిందే. ఇండక్షన్ స్టౌలను మరింత సమర్థంగా పనిచేయించవచ్చ. తద్వారా విద్యుత్తు ఆదా చేయవచ్చు. విద్యుత్తు ఉత్పత్తికీ వాడుకోవచ్చు. హైలెనర్ టెక్నాలజీకి మరిన్ని మెరుగులు దిద్దడం ద్వారా అదనపు వేడి స్థాయిని రెండున్నర రెట్లకు పెంచవచ్చునని తద్వారా విద్యుదుత్పత్తి మరింత సమర్థంగా మారతుందని సిద్ధార్థ దొరైరాజన్ తెలిపారు. ఈ పరికరాలు ఎలాంటి రేడియోధార్మిక పదార్థాలను వాడదని స్పష్టం చేశారు!! -
ఇండియన్ రైల్వే టార్గెట్.. ఐదేళ్లలో 44000 కిమీ కవచ్ సిస్టం
టెక్నాలజీ ఎంత పెరిగిన రైలు ప్రమాదాలను పూర్తిగా నిలువరించలేకపోతున్నారు. పశ్చిమ బెంగాల్ రైలు ప్రమాదం జరిగిన కొద్ది రోజుల తర్వాత, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సంబంధిత అధికారులతో కవచ్ వ్యవస్థను మరింత వేగవంతం చేయాలని అన్నారు. వచ్చే ఐదేళ్లలో నేషనల్ ట్రాన్స్పోర్టర్ 44,000 కి.మీలను కవచ్ కిందకు తీసుకువస్తుందని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇంతకీ ఈ కవచ్ సిస్టం అంటే ఏంటి? ఇదెలా పనిచేస్తుంది? దీనివల్ల ఉపయోగాలేంటి అనే వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.కవచ్ అనేది ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటక్షన్ సిస్టం. ఒక ట్రైన్ పట్టాల మీద వెళ్తున్న సమయంలో.. అదే ట్రాక్ మీద ఒకవేలా ట్రైన్ వస్తే అలాంటి సమయంలో రెండూ ఢీ కొట్టుకోకుండా నిరోధిస్తుంది. ఇది రైలు వేగాన్ని పర్యవేక్షిస్తూ ఉంటుంది. ప్రమాద సంకేతాలకు గుర్తిస్తే వెంటనే ట్రైన్ ఆపరేటర్లను హెచ్చరిస్తుంది. తద్వారా ప్రమాదాలను నివారించవచ్చు. ప్రమాద సంకేతాలు గురించినప్పటికీ ట్రైన్ ఆపరేటర్ చర్యలు తీసుకొని సమయంలో ఇదే ఆటోమేటిక్‌గా బ్రేక్‌లు వేస్తుంది.ప్రస్తుతం కవచ్ సిస్టమ్‌కు ముగ్గురు మాత్రమే తయారీదారులు ఉన్నట్లు సమాచారం. కాబట్టి ఈ తయారీదారులు కూడా పెంచాలని అశ్విని వైష్ణవ్ అన్నారు. ప్రస్తుతం రైల్వే మంత్రిత్వ శాఖ ఢిల్లీ - ముంబై & ఢిల్లీ - హౌరా మార్గాల్లో కవచ్ ఇన్‌స్టాలేషన్‌పై కసరత్తు చేస్తోంది. ఈ సంవత్సరం చివరినాటికి మరో 6000 కిమీ కవచ్ ఇన్స్టాలేషన్ కోసం టెండర్లను జారీ చేసే అవకాశం ఉందని సమాచారం.ప్రపంచంలోని చాలా ప్రధాన రైల్వే వ్యవస్థలు 1980లలో కవాచ్ మాదిరిగా ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ (ATP)కి మారాయి. అయితే మనదేశంలో భారతీయ రైల్వే 2016లో ట్రైన్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్ (TACS) మొదటి వెర్షన్ ఆమోదంతో ఈ ప్రయాణాన్ని ప్రారంభించింది. రాబోయే రోజుల్లో ఈ కవచ్ సిస్టం దేశం మొత్తం మీద అందుబాటులోకి వస్తుంది. దీంతో ప్రమాదాల సంఖ్య తగ్గిపోతుందని భావిస్తున్నారు. -
ఇద్దరు దొంగల ఫైటింగ్ కథ..
దొంగతనం చేయాలంటే పకడ్బందీగా స్కెచ్ వేయాలి. ఈ ఇద్దరు దొంగలకు మాత్రం ఎలాంటి స్కెచ్, పెన్సిల్ అవసరం లేకుండానే బ్రహ్మాండమైన అవకాశం వచ్చింది. ఒక ఇంటి ముందు వారికి కొరియర్ ప్యాకేజీ కనిపించింది. దాన్ని చూడగానే ‘యురేక’ అంటూ పరుగెత్తుకు వెళ్లారు.ఆ తరువాతే అసలు సీన్ స్టార్ట్ అయింది. ‘ఇది నాది’ అంటూ ఆ ఇద్దరు దొంగలు వాదులాడుకోవడమే కాదు ఒకరి ముఖంపై ఒకరు పంచ్‌లు ఇచ్చుకున్నారు. ఫైటింగ్ సీన్లు ఎన్నో ప్రదర్శించారు. డోర్ బెల్ కెమెరా ఫుటేజీలో రికార్డ్ అయిన ఈ దృశ్యాలను ఇంటి యజమాని షేర్ చేయగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.‘దొంగలు ప్యాకేజీని యాదృచ్ఛికంగా చూశారా? లేదా సాంకేతిక మాయాజాలంతో ఫలానా చోటుకి కొరియర్లో ప్యాకేజీ రానుందని తెలుసుకున్నారా? రెండోది నిజమైతే చాలా ప్రమాదమే’ అంటూ ఆందోళన వ్యక్తం చేశారు నెటిజనులు.ఇవి చదవండి: ఏ దారెటు పోతుందో..? ఎవరినీ అడగక.. -
CABI: 'కాబి' ఉచిత డిజిటల్ టూల్స్..
అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ ‘సెంటర్ ఫర్ అగ్రికల్చర్ అండ్ బయోసైన్స్ ఇంటర్నేషనల్’ (సిఎబిఐ – కాబి) రైతులకు అవసరమైన ప్రామాణికమైన శాస్త్రీయ సమాచారాన్ని తన వెబ్సైట్, యాప్‌ల ద్వారా తెలుగులో కూడా అందుబాటులోకి తెచ్చింది. గత 110 సంవత్సరాల నుంచి పురుగులు, తెగుళ్ల యాజమాన్యంపై పరిశోధనలు చేస్తున్న ‘కాబి’తో 48 దేశాలకు చెందిన వ్యవసాయ సంస్థలు కలసి పనిచేస్తున్నాయి. మన ఐసిఎఆర్ కూడా ఇందులో మెంబరే.ఈ నేపథ్యంలో సుస్థిర వ్యవసాయ కేంద్రం తోడ్పాటుతో ప్లాంట్వైస్ ప్లస్ టూల్ కిట్’ పేరుతో డిజిటల్ టూల్స్‌ని ‘కాబి’ ఇటీవల తెలుగు, హిందీల్లోనూ అందుబాటులోకి తెచ్చింది. రైతులకు, విస్తరణ అధికారులకు, డీలర్లకు, విద్యార్థులకు, పరిశోధకులకు ఇవి ఉపయోగకరం.వెబ్సైట్, అనేక యాప్‌ల ద్వారా రైతులకు శాస్త్రీయంగా సరైన సలహాలు పొందొచ్చు. ఇందులో నాలెడ్జ్ బ్యాంక్ పోస్టర్లు, కరపత్రాలు, రైతుల కోసం ఫ్యాక్ట్షీట్లు, వీడియో ఫ్యాక్ట్షీట్లు అందుబాటులో ఉన్నాయి. పంట ఆరోగ్యంపై సమాచారం తెలుసుకోవటం, పురుగుమందుల మోతాదులను లెక్కించటం, ఎరువుల అవసరాలను నిర్ణయించటం, పంట సమస్యను గుర్తించటం, చీడపీడల నియంత్రణకు పురుగుమందులను కనుగొనటం, పురుగులను– తెగుళ్లను గుర్తించే నైపుణ్యాలను మెరుగుపరచుకోవటం, చీడపీడల నియంత్రణ పద్ధతులను సిఫారసు చేయటం, తెగుళ్ల నిర్వహణపై శిక్షణ.. తదితర సమాచారం / నైపుణ్యాలను కాబి వెబ్సైట్, డిజిటల్ టూల్స్ అందిస్తాయి.కాబి బయోప్రొటెక్షన్ పోర్టల్ యాప్ కోసం ఈ క్యుఆర్ కోడ్‌ను స్కాన్ చేయండిఇవన్నీ తెలుగులో ఉచితంగా అందుబాటులో ఉండటం వల్ల మహిళా రైతులు కూడా సులువుగా వాడుకునేందుకు వీలవుతుంది. ఈ వనరులను ఉపయోగించుకోవడానికి మనకు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ లేదా టాబ్లెట్ లేదా కంప్యూటర్ /ల్యాప్‌టాప్‌తో ఇంటర్నెట్ సదుపాయం ఉంటే చాలు.మొక్కల ఆరోగ్య సమాచారం విభాగంలో.. మన దేశానికి సంబంధించిన పంటల ఆరోగ్యం, తెగుళ్ల నిర్వహణపై సమాచారం ఉచితంగా అందుబాటులో ఉంటుంది. ప్లాంట్వైజ్ ఫ్యాక్ట్‌షీట్ లైబ్రరీ’ అనే ఉచిత యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని తెగుళ్ల నిర్థారణ, సురక్షిత నిర్వహణకు ఉపయోగపడే తాజా సమాచారం తెలుసుకోవచ్చు. మొక్కల రక్షణ మద్దతు విభాగంలో.. ‘క్రాప్ స్ప్రేయర్ యాప్’ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.కాబి క్రాప్ స్ప్రేయర్ యాప్ కోసం ఈ క్యుఆర్ కోడ్‌ను స్కాన్ చేయండిసురక్షితమైన పురుగుమందులు, వాటి మోతాదును లెక్కించడానికి సహాయపడుతుంది. ‘కాబి బయోప్రొటెక్షన్ పోర్టల్’ అనే ఉచిత వెబ్సైట్ పంట తెగుళ్లను నయం చేయటానికి స్థానికంగా నమోదైన బయో పెస్టిసైడ్స్‌ను కనుగొనటంలో, ఉపయోగించటంలో సహాయపడుతుంది. రైతులకు లోతైన అవగాహన కలిగించడం కోసం డిజిటల్ లెర్నింగ్ కోర్సులు కూడా ఉన్నాయి. పంట తెగులు నిర్థారణ కోర్సు, పంటల చీడపీడల యాజమాన్య కోర్సు, బయోప్రొటెక్షన్ ్రపోడక్ట్స్ కోర్సు అందుబాటులో ఉంది.26న ‘బయోచార్ కార్బన్ క్రెడిట్స్’పై సదస్సు..బయోచార్ (కట్టె బొగ్గు)ను పంట వ్యర్థాలు, తదితర బయోమాస్‌తో భారీ ఎత్తున యంత్రాలతో ఉత్పత్తి చేస్తూ ‘కార్బన్ క్రెడిట్స్’ పొందుతున్న వాణిజ్య సంస్థల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇటువంటి సంస్థలకు మార్గదర్శకత్వం నెరిపేందుకు హైదరాబాద్ కేంద్రంగా ప్రొగ్రెసివ్ బయోచార్ సొసైటీ’ ఇటీవల ఏర్పడింది. దీని ఆధ్వర్యంలో ‘బయోచార్ ఉత్పత్తి పరికరాలు–కార్బన్ క్రెడిట్స్’ అనే అంశంపై జూన్ 26న ఉ. 9.30 గం. నుంచి హైదరాబాద్ యూసఫ్‌గూడలోని నిమ్స్‌మే ఆడిటోరియంలో జాతీయ సదస్సు జరగనుంది. ‘మేనేజ్’ డైరెక్టర్ జనరల్ డా. పి. చంద్రశేఖర ముఖ్య అతిథి. రిజిస్ట్రేషన్ వివరాలకు.. 63051 71362.– నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
సముద్ర సాహసాలు చేయాలనుందా? అయితే ఈ గేమ్ ఆడాల్సిందే!
‘బారెంట్స్ అండ్ ఫిషింగ్.. నార్త్ అట్లాంటిక్ ఫ్రాంఛైజీలకు సీక్వెల్‌గా వచ్చిన గేమ్ షిప్స్ ఎట్ సీ. ఈ బ్రాండ్–న్యూ గేమ్‌ప్లేలో రకరకాల కొత్త ఫీచర్లు ఉన్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. చాలాకాలంగా ఎదురు చూస్తున్న మల్టీప్లేయర్ మోడ్‌లో వచ్చిన ఈ గేమ్ ద్వారా మహా సముద్రాలకు సంబంధించి రియలిస్టిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను సొంతం చేసుకోవచ్చు.నెక్ట్స్ జనరేషన్ షిప్ స్టిమ్యులేషన్గా వచ్చిన ఈ గేమ్‌లో మొదటిసారిగా సర్వీస్, కార్గో నౌకలను పరిచయం చేశారు. వీటిలో సరికొత్త గేమ్‌ప్లే ఫీచర్లో ఉంటాయి. ‘స్నేహితులతో కలిసి నార్వేజియన్ సముద్రంలోకి వెళ్లండి. సినిమాటిక్–క్వాలిటీ ఓషన్ స్టిమ్యులేషన్ దీని సొంతం. సముద్ర సాహసాలు చేయాలనే ఉత్సాహం మీలో ఉందా? అయితే షిప్స్ ఎట్ సీలోకి వచ్చేయండి’ అంటుంది గేమ్ డెవలపర్ మిస్క్ గేమ్స్.జానర్స్: ఎర్లీ యాక్సెస్, స్ట్రాటజీ వీడియో గేమ్,ల్యాట్ఫామ్: మైక్రోసాఫ్ట్ విండోస్,ఇంజిన్: అన్రియల్ ఇంజిన్ 5.ఇవి చదవండి: ఈ టేస్టీ స్నాక్స్‌తో.. స్కూల్ లంచ్ బాక్సుకి రెడీ అయిపోండి..! -
World Human Trafficking Day: ట్రాఫికింగ్ నెట్‌తో జాగ్రత్త!
ఇటీవల మానవ అక్రమ రవాణాలో ఆధునికత చోటు చేసుకుంది. సాంకేతిక యుగంలో మనం ఉపయోగించే రకరకాల మాధ్యమాలు ఇందుకు ప్రధాన కారణం అవుతున్నాయి. ఈ నవీన కాలంలో హ్యూమన్ ట్రాఫికింగ్ ఏ విధంగా జరుగుతుందో అవగాహన పెంచుకుంటే, జాగ్రత్త పడటం సులువు అవుతుంది. ఎనిమిదవ తరగతి చదువుతున్న శ్రీజ (పేరుమార్చడమైంది) తన తల్లి ఫోన్‌ని ఉపయోగిస్తుండేది. శ్రీజకు తోడబుట్టిన అక్కచెల్లెళ్లు ముగ్గురు ఉన్నారు. తండ్రి మరణించడంతో తల్లి నాలుగిళ్లలో పాచి పని చేస్తూ పిల్లలను పోషిస్తుంది. ఒక రోజు మొత్తం శ్రీజ కనిపించకపోవడంతో కంగారుపడి పోలీసులను సంప్రదించారు. రెండు రోజులు వెతకగా శ్రీజ కలకత్తాలో ఉన్నట్టు తెలిసింది. అపరిచిత వ్యక్తి ప్రేమ పేరుతో ఫోన్ ద్వారా నమ్మబలికి, శ్రీజ ను రప్పించినట్టుగా, అటు నుంచి ఆమెను మరో చోటుకి తరలించే ప్రయత్నం చేసినట్టు గుర్తించి, తిరిగి తీసుకొచ్చి, తల్లికి అప్పజెప్పారు. ఆడపిల్లలు/మహిళలను తప్పుదోవ పట్టించే నేర ప్రక్రియలో ఇంటర్నెట్ ఒక మాధ్యమంగా మారింది. సామాజిక మాధ్యమాలలో కనిపించిన ‘కిడ్నీ కావలెను’ అనే ప్రకటన చూసిన రమేష్ (పేరు మార్చడమైనది) అందులో ఇచ్చిన ఫోన్ నెంబర్‌ను సంప్రదించాడు. అవతలి వ్యక్తులు చెప్పిన విషయాలు విని, ఒక కిడ్నీ ఇస్తే తనకు ఆర్థిక బాధలు తొలగిపోతాయని భావించాడు. చెప్పిన చోటికి వెళ్లిన అతను తిరిగి ఇంటికి చేరుకోలేదు. లైంగిక అత్యాచారం, శ్రమ దోపిడి, శిశువుల అమ్మకాలు, అవయవాలు, వధువుల అక్రమ రవాణాలో ఇప్పటి వరకు ఒక దశలో ఉన్నాయి. ఇప్పుడు ఇంటర్నెట్ ద్వారా ట్రాఫికర్లు సైబర్ స్పేస్‌ను కూడా ఉపయోగించుకుంటున్నారు. దీంతో ఈ సమస్య ప్రభుత్వం, పోలీసులు, న్యాయవ్యవస్థకు పెద్ద సవాల్‌గా నిలిచింది. ► సైబర్ ట్రాఫికింగ్‌లో లైంగిక దోపిడీ ప్రాబల్యం రకరకాల రూపాలను చూపుతుంది. యుఎన్ డాట్ జిఎఫ్టి గ్లోబల్ రిపోర్ట్ ప్రకారం సైబర్ ట్రాఫికింగ్‌లో లైంగిక దోపిడీకి, మానవ అక్రమ రవాణా 79 శాతం ఉన్నట్టు గుర్తించింది. బాలికలు 13 శాతం, పురుషులు 12 శాతం, బాలురు 9 శాతం అక్రమ రవాణాకు గురైనట్టు పేర్కొంది. సైబర్ ఫేక్... ► ట్రాఫికర్లు మహిళలపై హింసకు సోషల్ మీడియా ద్వారా కొత్త మార్గాలను తెరిచారు. నేరస్తులు సోషల్ మీడియా ద్వారా బాధితులను ఆకర్షించడం, మోసగించడం, ట్రాప్ చేయడం ఈ విధానంలో ప్రధానంగా చెప్పుకోవచ్చు. సామాజిక మాధ్యమాల ద్వారా ముఖ్యంగా అమ్మాయిలను /మహిళలను ట్రాప్ చేయడానికి నేరస్తులు రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నారు. ఫేక్ ఐడీలను సృష్టించి స్కూల్, కాలేజీ యువతుల భావోద్వేగాలపైన తమ ప్రభావం చూపుతుంటారు. ప్రేమ పేరుతో చాటింగ్ చేస్తూ, కానుకల ద్వారా ఆకర్షిస్తూ, మార్ఫింగ్ ఫొటోలు, వీడియోల ద్వారా బెదిరిస్తూ ఇల్లు దాటేలా చేస్తుంటారు. ► సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో బాధితులను తమకు అనుకూలంగా మార్చడం, నియంత్రించడం వంటివి జరుగుతున్నాయి. ► ఉద్యోగాల పేరుతో యువకులను ఆకర్షించి, వారు సైబర్ నేరాలకు పాల్పడేలా వేధింపులకు లోను చేయడం. ► అద్దె గర్భం (సరోగసీ విధానం) కూడా ఇప్పుడు ఆన్లైన్ వేదికగా కొత్త పుంతలు తొక్కుతోంది. నమ్మి వెళ్లిన వాళ్లు కొత్త సమస్యలలో చిక్కుకునే పరిస్థితి ఎదురైంది. ► పోర్నోగ్రఫీ అక్రమ రవాణాకు ప్రతి క్షణం ఆజ్యం పోస్తూనే ఉంది. ఈ విష చట్రంలోకి ప్రపంచ వ్యాప్తంగా 12 నుంచి 14 ఏళ్ల లోపు బాలికలు చేరుతున్నట్టు, ఈ అక్రమ రవాణాకు గురవుతున్నట్టు నివేదికలు తెలుపుతున్నాయి. డిజిటల్ వేగం వాడుకలో సౌలభ్యంతో పాటు వేగం ఉండటం వల్ల కూడా నేరస్థులు తమ సామర్థ్యాలను మెరుగుపరచుకుని ఇంటర్నెట్ మాధ్యమాల్లో వాటిని చూపుతున్నారు. దీని వల్ల డిజిటల్ జాడలు కనిపెట్టి, మనవారిని రక్షించడం అనేది పెద్ద ప్రయాసగా మారింది. అప్రమత్తతే అడ్డుకట్ట ఇంటర్నెట్ వాడకం వల్ల అపారమైన ప్రయోజనాలు ఉన్నట్టే, సరిహద్దులు దాటి సుదూర దేశాల నుండి మనల్ని మరో మార్గంలో ప్రయాణించేలా చేయడానికి సైబర్ ట్రాఫికర్స్ పొంచి ఉన్నారు. అందుకే, సోషల్ మీడియా వాడకంలో తల్లిదండ్రులు ఎప్పుడూ తమ పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి. స్కూళ్లు, కాలేజీలు ఇంటర్నెట్ వాడకం ద్వారా జరిగే నష్టాలు, మానవ అక్రమ రవాణాకు జరుగుతున్న ప్రయత్నాల గురించి అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది. డార్క్ టీమ్స్ ఉంటాయి జాగ్రత్త సైబర్ ఎనేబుల్డ్ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది ఈ మధ్య కొత్త పదం వచ్చింది. మన దేశం నుంచి విదేశాలకు మంచి ఉద్యోగం ఇప్పిస్తామని తీసుకెళ్లి, సైబర్ క్రైమ్ చేయిస్తుంటారు. విదేశాలకు వెళ్లాలనే కోరిక అధికంగా ఉన్నవారిని గుర్తించి ఈ విధానానికి ఎంచుకుంటారు. తాము చెప్పినట్టుగా ఒప్పుకోనివారిని వేధిస్తారు. లేదంటే, వారి ఆర్థిక స్థితిని బట్టి డబ్బు వసూలు చేసి, వదిలేస్తారు. ఆ తర్వాత సైబర్ ట్రాఫికింగ్‌లో ఆర్గాన్ ట్రేడింగ్, సరోగసి కూడా ప్రధానంగా ఉన్నాయి. నేరస్థులు సైబర్ డార్క్ టీమ్స్‌ను ఏర్పాటు చేస్తారు. వీరి ద్వారా అమాయకులను ట్రాప్ చేసి, అక్రమ రవాణాకు పాల్పడుతుంటారు. అందుకని అపరిచితులతో పరిచయాలను పెంచుకోవద్దు. ఒంటరి మహిళలను ట్రాప్ చేయడానికి సైబర్ నేరగాళ్లు ఎప్పుడూ శోధిస్తూనే ఉంటారు. మన వివరాలను ఆన్లైన్లో బహిరంగ పరచకూడదు. ఆన్లైన్ అగ్రిమెంట్లాంటివి చేయకూడదు. సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా వచ్చే ప్రకటనలు చూసి మోసపోకూడదు. – అనీల్ రాచమల్ల, సైబర్ నిపుణులు, ఎండ్ నౌ ఫౌండేషన్ -
నిలదొక్కుకోవాలంటే నైపుణ్యాలు పెంచుకోవాల్సిందే
న్యూఢిల్లీ: ఎప్పటికప్పుడు ఆవిర్భవిస్తున్న కొత్త టెక్నాలజీల ఫలితంగా ఉద్యోగ భద్రత పట్ల మెజారిటీ నిపుణుల్లో (82 శాతం మంది) ఆందోళన వ్యక్తమవుతోంది. వేగంగా మార్పు చెందుతున్న పని వాతావరణాన్ని అధిగమించేందుకు నైపుణ్యాల పెంపు సాయపడుతుందని వారు భావిస్తున్నారు. విద్యార్థులు, నిపుణులు, విద్యావేత్తలు ఇలా రెండు లక్షల మంది అభిప్రాయాలను హీరో వేద్ (హీరో గ్రూప్ కంపెనీ) పరిగణనలోకి తీసుకుని ఒక నివేదికను విడుదల చేసింది. పని ప్రదేశాల్లో వస్తున్న నూతన మార్పులను, సవాళ్లను అధిగమించడానికి నైపుణ్యాల పెంపు పరిష్కారమని 78 శాతం మంది చెప్పారు. నేటి ఉద్యోగ మార్కెట్లో నిలిచి రాణించేందుకు వీలుగా ఎప్పటికప్పుడు అధ్యయనం, నైపుణ్యాల పెంపుపై అవగాహన పెరుగుతుందడానికి ఇది నిదర్శనమని హీరో వేద్ సీఈవో అక్షయ్ ముంజాల్ తెలిపారు. ‘‘సుస్థిరత, సామర్థ్యం, మానసిక ఆరోగ్యంపై నిపుణులు, కంపెనీలు ఒకే విధమైన దీర్ఘకాల దృష్టితో ఉన్నాయి. దీంతో ఈ రంగాల్లో ఉద్యోగాలకు డిమాండ్ ఉంటుంది’’అని చెప్పారు. కృత్రిమ మేథ (ఏఐ) విజ్ఞానం కలిగి ఉండడం, తమ కెరీర్లో మెరుగైన అవకాశాలు అందుకోవడానికి కీలకమని 39 శాతం మంది అంగీకరించారు. తమ సంస్థలు ఏఐపై సరైన శిక్షణ అందించడం లేదని 43 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. అంటే ఏఐ విభాగంలో కావాల్సిన నైపుణ్యాలకు, అందిస్తున్న శిక్షణకు మధ్య అంతరాన్ని ఇది తెలియజేస్తున్నట్టు నివేదిక గుర్తు చేసింది. 18–55 ఏళ్ల మధ్య వయసున్న నిపుణుల్లో 43.5 శాతం మంది ప్రతి ఆరు నెలలకు ఒకసారి అదనపు నైపుణ్యాలను నేర్చుకోవాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. అదనపు నైపుణ్యాలు, ముఖ్యంగా ఏఐ నైపుణ్యాలను నేర్చుకుంటే ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని 83 శాతం మంది అభిప్రాయపడుతున్నారు. -
దేశంలోనే తొలి '3డీ ప్రింటెడ్ ఆలయం'.. ఎక్కడో తెలుసా!
సాక్షి, సిద్దిపేట: ఏదైనా నిర్మాణం చేపట్టాలంటే ఎంతో వ్యయ ప్రయాసాలు తప్పవు.. సామగ్రి, కూలీలు అన్నీ ఇన్నీ కావు.. ఒకవేళ అందుబాటులో ఉన్నా నిర్మాణం పూర్తి కావాలంటే నెలలు గడవాల్సిందే. ఈ కష్టాలన్నింటికీ చెక్ పెడుతూ .. స్వల్ప వ్యవధిలోనే నిర్మాణాలు పూర్తి చేసే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. దేశంలోనే మొట్టమొదటి త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ (రోబో)తో ఆధ్యాత్మిక శ్రీపాద కార్యసిద్దేశ్వరస్వామి దేవాలయాన్ని సిద్దిపేటలోని బూరుగుపల్లి సమీపంలో నిర్మించారు. నెలరోజులపాటు 3డీ ప్రిటింగ్తో 30 గంటల్లో దేవాలయ నిర్మాణం పూర్తి చేసి ఔరా అనిపించారు. ఈ త్రీడీ దేవాలయాన్ని 3,800 చదరపు అడుగుల విస్తీర్ణంలో 30 అడుగుల ఎత్తులో నిర్మించారు. దేశంలోనే తొలి దేవాలయం! త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ(రోబో) మిషన్‌ను ఏబీబీ అనే యూరోపియన్ నుంచి తీసుకొచ్చారు. దీనిలో ఉండే ఇంటర్నల్ సిస్టమ్, దీని కోసం వినియోగించే సాఫ్ట్‌వేర్‌ను భారతదేశంలోనే తయారు చేశారు. ప్రపంచంలోనే తొలిసారిగా 2022లో 3డీ ప్రిటింగ్ విధానంలో కాలిఫోర్నియాలోని టెహమా కౌంటీలో చర్చి నిర్మించారు. సింప్లిఫోర్జ్ క్రియేషన్స్ ఈ ఏడాది మార్చిలో ఐఐటీ హైదరాబాద్‌తో కలిసి దేశంలోనే తొలి త్రీడీ ప్రింటెడ్ నమూనా వంతెనను నిర్మించింది. దేశంలోనే తొలిసారిగా మిషనరీతో సిద్దిపేటలో దేవాలయం నిర్మించారు. కంప్యూటర్లో రూపొందించి.. కంప్యూటర్లో ముందుగా దేవాలయం డిజైన్ పొందుపర్చి కాంక్రీట్ త్రీడీ మిషన్ ద్వారా నిర్మించారు. అప్సూజ కంపెనీ నిర్మాణ బాధ్యతలను తీసుకొని సింప్లీ పోర్జ్ అనే త్రీడీ టెక్నాలజీ కంపెనీకి అప్పగించింది. మోదక్, దీర్ఘచతురస్రాకారం, కమలం మొగ్గ ఆకారాల్లోని గర్భ గుడీలతోపాటు ఆలయ గోపురాలను కంప్యూటర్లో తొలుత 3డీలో డిజైన్ చేసి ఆపై యంత్రాల ద్వారా నిర్మించారు. దీంతో ఆలయం భక్తులకు కనువిందు చేస్తోంది. ఇటీవల ప్రారంభం.. సిద్దిపేటలో త్రీడీ టెక్నాలజీతో నిర్మించిన శ్రీపాద కార్యసిద్దేశ్వరస్వామి దేవాలయం ఇటీవల ప్రారంభించారు. వారం రోజులపాటు విగ్రహప్రతిష్ట మహోత్సవాలను నిర్వహించారు. నిత్యం విశేష పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులు దేవాలయం నిర్మించిన తీరును అడిగి తెలు సుకుంటున్నారు. త్వరగా నిర్మాణం పూర్తికావడంతో ఇతర ప్రాంతాల నుంచి సైతం ఇంజినీర్లు, పలు నిర్మాణ సంస్థలు వచ్చి నిర్మాణంను పరిశీలిస్తున్నారు. ఒక్కో గర్భగుడికి ఒక్కో ప్రత్యేకత! దేవాయలంలో గర్భగుడీలు ఒక్కొక్కటి ఒక్కో ఆకారంలో నిర్మించారు. హేరంబ గణపతి కోసం మోదకం ఆకారంలో గర్భగుడిని నిర్మించారు. ఇది 11 ఫీట్ల ఎత్తు, 8 ఫీట్ల వెడల్పు ఉంది. వీటి నిర్మాణం వారం రోజులపాటు 7 గంటలు ప్రింటింగ్‌తో నిర్మాణం పూర్తి చేశారు. అలాగే భువనేశ్వరి అమ్మవారి కోసం కమలం మొగ్గ ఆకారంలో గర్భగుడిని నిర్మించారు. ఎత్తు 11 ఫీట్లు , వెడల్పు 8.5 ఫీట్లు ఉంది. ఈ ఆకారం నిర్మాణం కోసం వారం రోజులపాటు ప్రింటింగ్ 8 గంటలు పట్టింది. దత్తాత్రేయ స్వామితోపాటు స్పటికలింగానికి గర్భగుడి దీర్ఘచతురస్రాకారంలో నిర్మించారు. 10 రోజులపాటు 15 నుంచి 16 గంటల సమయం పట్టింది. కూలీల పని తప్పింది 3డీ ప్రింటింగ్ టెక్నాలజీ(రోబో) మిషన్‌ను ఏబీబీ అనే యూరోపియన్ నుంచి తీసుకొచ్చాం. దీనికి సంబంధించి మొత్తం సాఫ్ట్‌వేర్‌ను మన దేశంలోనే తయారు చేసి నిర్మాణం చేపట్టాం. కూలీల వ్యయప్రయాసలు తప్పాయి. – హరికృష్ణ, సీఈఓ ఇవి చదవండి: కోవిడ్.. అలర్ట్! 'జేఎన్–1 వేరియంట్' రూపంలో ముప్పు! -
15 నిమిషాల ఛార్జ్‌తో 500 కిమీ ప్రయాణం.. ఈవీ సెక్టార్లో సంచలన ఆవిష్కరణ
గ్లోబల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్న తరుణంలో ఛార్జింగ్ సమస్య ఓ పెనుభారంగా మారుతోంది. దీనిని పరిష్కరించడానికి చైనీస్ ఆటోమేకర్ గీలీ ప్రీమియం ఎలక్ట్రిక్ వెహికల్ బ్రాండ్ 'జీకర్' (Zeekr) సరికొత్త ఛార్జింగ్ సొల్యూషన్ పరిచయం చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఓ పెను మార్పును తీసుకువచ్చే క్రమంలో కంపెనీ జెజియాంగ్ ప్రావిన్స్‌లోని గీలీ హోల్డింగ్ గ్రూప్‌కు చెందిన బ్యాటరీ ప్లాంట్‌లో వినూత్న టెక్నాలజీ ఆవిష్కరించింది. దీని ద్వారా కేవలం 15 నిమిషాల్లో ఛార్జ్ చేసుకుంటే ఏకంగా 500 కిమీ (300 మైల్స్) ప్రయాణం చేయవచ్చని తెలుస్తోంది. జీకర్ ఆవిష్కరించిన ఈ టెక్నాలజీ లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (LFP) బ్యాటరీలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ వేసుకునే సమయం కూడా చాలా ఆదా అవుతుంది. ప్రస్తుతం ఈ టెక్నాలజీ చైనాలో మాత్రమే అందుబాటులో ఉన్నట్లు సమాచారం. చైనాలో జీకర్ ప్రత్యర్థి నియో( Nio) కూడా ఖర్చులను సమర్థవంతంగా నిర్వహించడానికి ఇలాంటి టెక్నాలజీ వైపు అడుగులు వేస్తున్నట్లు సమాచారం. మరోవైపు CATL కూడా ఎలక్ట్రిక్ వాహనాల ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యాలలో పురోగతి సాధించింది. కంపెనీ Li Auto మొట్టమొదటి ప్యూర్ ఎలక్ట్రిక్ మల్టీపర్పస్ వెహికిల్ MEGA కోసం ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీలను పరిచయం చేసింది. ఇది కేవలం 12 నిమిషాల ఛార్జింగ్‌తో 500 కిలోమీటర్ల (300 మైళ్ళు) డ్రైవింగ్ పరిధిని అందిస్తుంది. ఇదీ చదవండి: ఇలాంటి టెక్నాలజీ తెలంగాణలో ఫస్ట్.. వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా ఇండియాలో ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఇంత ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ భారతదేశంలో లేదు, కానీ కొన్ని కంపెనీల ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్‌లో మాత్రం సుమారు 20 నుంచి 30 నిమిషాల్లో 0 నుంచి 50 శాతం లేదా 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. ఎప్పుడూ ఫాస్ట్ ఛార్జింగ్ ఉపయోగించి ఛార్జ్ చేసుకోవడం వల్ల బ్యాటరీలో ఏదైనా సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. -
రంగంలోకి గూగూల్ ఏఐ ‘జెమినీ’!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో టెక్ దిగ్గజం గూగుల్ కొత్త శకానికి నాంది పలికింది. 'గూగుల్ జెమిని' (Google Gemini) పేరుతో అడ్వాన్స్డ్ ఏఐ మోడల్ పరిచయం చేసింది. ఈ కొత్త ఏఐ ఎన్ని వేరియంట్లలో ఉంటుంది, దీని వల్ల ఉపయోగాలేంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గూగుల్ జెమిని అనేది టెక్ట్స్, ఫోటో, ఆడియో, వీడియో, కోడింగ్ వంటి వివిధ రకాల సమాచారాన్ని 90 శాతం కచ్చితత్వంతో యూజర్లకు అందిస్తుందని తెలుస్తోంది. ఇది డేటా సెంటర్లలో, కార్పొరేట్ అవసరాలకు మాత్రమే కాకుండా మొబైల్ డివైజ్‌లలో కూడా పనిచేస్తుందని గూగుల్ సీఈఓ 'సుందర్ పిచాయ్' (Sundar Pichai) వెల్లడించారు. గూగుల్ జెమిని ప్రస్తుతం ఇంగ్లీష్ భాషలో మాత్రమే అందుబాటులో ఉంది, భవిష్యత్తులో ఇది ప్రపంచంలోని దాదాపు అన్ని భాషల్లో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. గూగుల్ సెర్చ్ ఇంజిన్, క్రోమ్ బ్రౌసర్ వంటి అన్ని గూగుల్ సర్వీసుల్లో ఈ ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. వేరియంట్స్ గూగుల్ జెమిని మూడు వేరియంట్లలో లభిస్తుంది. అవి జెమిని నానో, జెమిని ప్రో, జెమిని అల్ట్రా వేరియంట్లు. జెమిని నానో జెమిని నానో అనేది మొబైల్ డివైజ్‌ల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఏఐ టెక్నాలజీ. ఇది గూగుల్ పిక్సెల్ 8 ఫోన్‌కు మాత్రమే కాకుండా ఆండ్రాయిడ్ 4 వెర్షన్లో కూడా పనిచేస్తుంది. జెమిని నానో డిసెంబర్ 13 నుంచి యూజర్లకు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఈ కొత్త టెక్నాలజీ ద్వారా చాట్, మెసేజింగ్ యూప్‌లు ఆఫ్‌లైన్‌లో కూడా పనిచేసే అవకాశం ఉందని తెలుస్తోంది. జెమిని ప్రో గూగుల్ బార్డ్ ఏఐకు జెమిని ప్రో అనేది అడ్వాన్స్డ్ వె ర్షన్. ఇది వేగవంతమైన ఫలితాలను ఖచ్చితంగా అందిస్తుందని గూగుల్ వెల్లడించింది. ఇది కూడా డిసెంబర్ 13 నుంచి యూజర్లకు అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. ఇదీ చదవండి: యూకే వెళ్లాలనుకునే విద్యార్థులకు కొత్త రూల్స్ - రిషి సునాక్ సంచలన ట్వీట్.. జెమినీ అల్ట్రా గూగుల్ కొత్త ఏఐ టెక్నాలజీలో జెమిని అల్ట్రా అనేది శక్తివంతమైన వెర్షన్. ఇది కార్పొరేట్ సంస్థల అవసరాలకు కూడా ఖచ్చితంగా సరిపోయే విధంగా ఉంటుంది. పైథాన్, జావా వంటి అనేక ప్రోగ్రామింగ్ భాషలను అర్థం చేసుకుని కావలసిన రిజల్ట్ అందిస్తుంది. ఇది 2024 నాటికి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. Everything you need to know about Gemini — Google’s largest and most capable AI model — in just 90 seconds. #GeminiAI pic.twitter.com/b7j08bV0YN — Google (@Google) December 7, 2023 గూగుల్ జెమిని స్పెషాలిటీ గూగుల్ జెమిని కేవలం కమర్షియల వినియోగాలకు మాత్రమే కాకుండా.. విద్యార్థులు హోంవర్క్ విషయంలో కూడా సహాయపడుతుంది. ఉదాహరణకు మ్యాథ్స్ హోంవర్క్‌ను ఫోటో తీసి జెమిని ఏఐలో అప్లోడ్ చేస్తే ఖచ్చితమైన సమాధానం లభిస్తుంది. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు కూడా గూగుల్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. -
సరికొత్త అధ్యాయానికి నాంది.. ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్రత్యేకం!
Sweden Electrified Road: ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం విపరీతంగా పెరుగుతోంది. కొన్ని దేశాల్లో ఇప్పటికీ ఎదురవుతున్న ఛార్జింగ్ సమస్యల దృష్ట్యా కొందరు ఫ్యూయల్ వాహనాలనే ఎంచుకుంటున్నారు. భారతదేశంలో ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వాలు రంగంలోకి దిగి, సంబంధిత సంస్థలకు ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి. అయితే స్వీడన్ ఈ సమస్యకు కొత్త టెక్నాలజీతో చెక్ పెద్దటానికి సిద్ధమైంది. సాధారణంగా ఎలక్ట్రిక్ వాహనాలకు ఎప్పటికప్పుడు ఛార్జింగ్ వేసుకుంటూ ఉండాలి, ఛార్జింగ్ తగ్గితే గమ్యాన్ని చేరుకోలేము. కాబట్టి ముందుగానే ఫుల్ ఛార్జింగ్ చేసుకుని, దాని రేంజ్ ఎంతో.. అంత దూరం ప్రయాణించడానికి ప్లాన్ వేసుకోవాలి. ఇంకా ముందుకు వెళ్లాలంటే మళ్ళీ ఛార్జింగ్ వేసుకోక తప్పదు. తద్వారా ప్రయాణికులు కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంది. ఇదీ చదవండి: రూ.1200 సంపాదనతో మొదలై.. రూ.9800 కోట్ల కంపెనీ నడిపిస్తోంది! ఎవరీ గజల్ అలఘ్.. ఇప్పుడు స్వీడన్, ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్రత్యేకంగా 'ఎలక్ట్రిఫైడ్ రోడ్స్' నిర్మిస్తోంది. వీటి ద్వారా కారు నడుస్తున్నప్పుడు లేదా ప్రయాణిస్తున్నప్పుడే ఛార్జ్ చేసుకోగలదు. ఛార్జింగ్ వేసుకోవడానికి ప్యత్యేకంగా సమయం కేటాయించాల్సిన అవసరం లేదు. దీని కోసం సరికొత్త టెక్నాలజీ కండక్టీవ్ రెయిల్స్, ఇండక్టివ్ కాయిల్స్‌తో 3,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ పొడవైన జాతీయ రహదారి స్వీడన్ ప్రధాన నగరాలైన స్టాక్‌హోమ్, గోథెన్బర్గ్, మాల్మో మధ్యలో నిర్మితమవుతోంది. ఇది 2025 నాటికి వినియోగంలో రానున్నట్లు సమాచారం. -
స్కిల్ పెంచండి బాబులూ..!
స్కిల్స్ పలు రకాలు.. ఏ ‘స్కిల్’ ప్రమాదకరమో మొన్నీమధ్యే చూశాం కదా, అలాంటివి కాదు. మనకూ జనానికీ ఉపయోగపడేవి. ఆ స్కిల్స్ చూడండి సరదాగా... సేల్స్.. స్కిల్ ఓ పెద్దమనిషి, అరవై ఏళ్లకు పైబడి ఉంటాడు. జోరు వర్షంలో గొడుగేసుకుని ఒక ట్రాఫిక్ సిగ్నల్ వద్ద పుస్తకాలు అమ్ముతున్నాడు. అప్ప టికే బాగా చీకటి పడింది. ఇది ఆసక్తిగా అనిపించి ఓ యువకుడు కారులోనుంచే.. ‘పుస్తకం ఎంత’ అని అడిగాడు. ‘మూడువేల రూపాయలు. కానీ, నీకు అమ్మబోను. నీకు ఈ పుస్తకం చదివే ధైర్యం ఉన్నట్టు లేదు,’ అన్నాడు ‘‘నాకు చాలా ధైర్యం ఉంది. గంటలో లాగించేస్తాను.’ – అన్నాడా యువకుడు కాస్త రోషంతో. ‘‘..అయితే ఒక షరతు మీద ఈ పుస్తకం నీకు అమ్ముతా, అది ఓకే అయితే నీకు ఓ వంద డిస్కౌంట్ కూడా ఇస్తా..’’ అన్నాడా పెద్దమనిషి ‘‘ఏమిటా షరతు?’’ ‘‘నువ్వు జన్మలో చివరి పేజీ చదవనని ఒట్టు వెయ్యాలి. ఎందుకంటే అది చదివి నువ్వు తట్టుకోలేవు. చాలా బాధపడతావు.’’ ‘‘ఓకే ప్రామిస్!.. నేను ధైర్యవంతుడినే అయినా, చివరి పేజీ చదవను, ఇదిగో డిస్కౌంట్ పోను 2,900 రూపాయలు. పుస్తకం ఇవ్వు..’’ అంటూ మనీ పెద్దమనిషి చేతిలో పెట్టాడు. పెద్దమనిషి డబ్బులు తీసుకుని పుస్తకం ఇస్తూ షరతు గురించి మళ్లీ గుర్తు చేశాడు. పుస్తకం తీసుకున్న యువకుడు ఇంటికి వెళ్లి భయం, భయంగా పుస్తకం చదివేశాడు. క్రైమ్ థ్రిల్లర్ బుక్ అది.. కొంచెం క్రైమ్, కొంచెం సస్పెన్స్ ఉన్నా... మరీ అంత భయంకరంగా లేదు. చివరి పేజీ ఎందుకు చదవ వద్దన్నాడా పెద్దమనిషి? దానిలో అంత తట్టుకోలేని బాధ ఏముంటది? అని మనవాడికి డౌట్ వచ్చింది. చదువుదామని మనసు పీకింది. కాస్త భయం వేసింది. ప్రామిస్‌ను పక్కన పెట్టి... గుండె దిటవు చేసుకుని భయం భయంగా చివరి పేజీ చూస్తే నిజంగానే గుండె ఆగినంత పనైంది.. ఆ చివరి పేజీలో ఇలా ఉంది ‘పుస్తకం ఖరీదు 50 రూపాయలు...’ ఇదీ సేల్స్ స్కిల్... అంతే కదా? ... ఇక ఈ తరహా తెలివితేటలు చూడండి. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. మేడిన్ ఇండియా! ఒకసారి అమెరికా కంపెనీలో సబ్బుల ఫ్యాక్టరీలో ఒక పొరపాటు జరిగింది. కొన్ని కవర్లు ప్యాక్ అయ్యాయి కానీ, అందులో సబ్బుల్లేవు. డీలర్లు, కస్టమర్ల గొడవ.. పెద్దగోలయ్యింది. దానితో యాజమాన్యం కంపెనీలో ఇలాంటి సమస్యలు ఇంకెప్పుడూ రాకూడదనీ, పరువు పోకూడదనీ జాగ్రత్త కోసం ఆరు కోట్లు పెట్టి ఎక్స్‌రే మెషీన్ కొన్నదట. ప్యాకైన సబ్బులు వెళుతుంటే అందులో సబ్బు ఉన్నదీ లేనిదీ ఆ మెషీన్ ద్వారా కనుక్కుని తీసేయడానికి వీలయ్యింది. ఈ విషయం హైదరాబాద్ సబ్బుల కంపెనీలో మీటింగ్‌లో ప్రస్తావనకు వచ్చింది. ఆ అమెరికా కంపెనీలో పనిచేసి ఇక్కడికి వచ్చిన ఎగ్జిక్యూటివ్ ఒకరు ఆ దేశ టెక్నాలజీని, వాళ్ల స్కిల్‌ను. శ్రద్ధను చిలవలు పలవలుగా వివరిస్తున్నాడు. ఆ మీటింగ్‌లో చాయ్ బిస్కట్ ఎంజాయ్ చేస్తున్న మనోడు లేచి,‘‘ఎందుకు సర్ 6 కోట్లు తగలేశారు. ఓ 3వేలు పెట్టి ‘పెడెస్టెల్ ఫ్యాన్’ కొని స్పీడ్‌గా తిప్పితే ఖాళీ ప్యాకెట్లు ఎగిరిపోతాయిగా. పొరపాటున ఖాళీగా వచ్చేవి ఒకటీ రెండేగా’’... అనేసి మళ్లీ చాయ్ బిస్కట్ మీద పడ్డాడు. దీనితో అమెరికా ఎగ్జిక్యూటివ్ అవాక్కయ్యాడు. చిన్న పామైనా పెద్ద కర్రతో కొట్టాలి.. అన్న సామెత అన్నిచోట్లా వర్తించదు. ఎంత పాముకు అంత కర్ర.. అదీ సరైన సమయంలో. – ఇదీ ఓ రకమైన జాబ్ స్కిల్లే కదా! నో స్కిల్... 81 పర్సెంట్... ఇంతకీ స్కిల్లు గురించి ఎందుకీ సొల్లు అంటారా? అత్యుత్తమ ఔట్పుట్ ఇవ్వగల నైపుణ్యాలు ఉద్యోగుల్లో ఉండటం లేదట. ఒకటో, రెండో కాదు.. ఐటీ రంగంలో ఏకంగా 81 శాతం సంస్థలు నైపుణ్యమున్న ఉద్యోగుల కొరతను ఎదుర్కొంటున్నాయని ఈవై, ఐమోచా సంస్థల అధ్యయనంలో వెల్లడైంది. మంచి నైపుణ్యాలు ఉన్న ఉద్యోగుల కోసం డిమాండ్ పెరుగుతోందని తేలింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల ఉద్యోగుల్లో పని నైపుణ్యాలు, కొత్త టెక్నాలజీలపై అవగాహన అంశాలపై ఈవై, ఐమోచా సంస్థలు అధ్యయనం నిర్వహించాయి. ‘టెక్ స్కిల్స్‌లో మార్పులు – ఆ తర్వాత పని పరిస్థితులు’ పేరిట ఇటీవల నివేదికను విడుదల చేశాయి. – ప్రస్తుత డిజిటల్ యుగంలో పోటీలో నిలిచేందుకు వీలుగా కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకుంటున్నాయనీ.. కానీ వాటికి తగినట్టుగా నైపుణ్యాలు ఉన్న ఉద్యోగులు దొరకడం కష్టమవుతోందనీ నివేదిక వెల్లడించింది. ఒక్క ఐటీ రంగం మాత్రమే కాకుండా... బ్యాంకింగ్, ఫైనాన్స్, టెలికాం, డేటా అనాలసిస్ వంటి ఇతర రంగాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని స్పష్టం చేసింది. – అప్లికేషన్ డెవలపర్లు, పవర్ యూజర్ స్కిల్స్ ఉన్నవారికి డిమాండ్ పెరగడం కూడా కొరత నెలకొనడానికి కారణమని నివేదిక పేర్కొంది. స్కిల్ ఉంటేనే జాబులు... – సర్వేలో పాల్గొన్న చాలా సంస్థలు డెవలపర్, పవర్ యూజర్ నైపుణ్యాల కొరతను ఎదుర్కొంటున్నట్టు తెలిపాయి. కొత్త టెక్నాలజీలు, అవసరాలకు అనుగుణంగా ఏ ఉద్యోగానికి ఏ నైపుణ్యాలు తప్పనిసరి అనే విభజనను అనుసరిస్తున్నామని 19 శాతం కంపెనీలు తెలిపాయి. 43 శాతం కంపెనీలు ఉద్యోగుల స్థాయిలో నైపుణ్యాల పరిశీలన చేపట్టామన్నాయి. ఈ విభజన/పరిశీలన క్రమంలో చాలా మంది ఉద్యోగుల్లో అవసరమైన నైపుణ్యాలు లేనట్టుగా గుర్తించామని వెల్లడించాయి. ఈ క్రమంలో ఓవైపు ఉద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం, మరోవైపు మంచి స్కిల్స్ ఉన్నవారిని చేర్చుకోవడంపై దృష్టి పెడుతున్నట్టు వివరించాయి. స్కిల్స్ పెంచేద్దాం... ప్రస్తుతం ఉద్యోగులు నిర్వర్తించాల్సిన విధులు, అందుకు అవసరమైన నైపుణ్యాల్లో ఎన్నడూ లేనంత వేగంగా మార్పులు వస్తున్నాయని ఈ అధ్యయనం చెబుతోంది. 2025 నాటికి తమ సంస్థల్లోని మూడో వంతు ఉద్యోగుల్లో సాంకేతిక నైపుణ్యాలను గణనీయంగా పెంపొందించాల్సిన అవసరం ఉందని 28 శాతం సంస్థలు భావిస్తున్నాయనీ వివరిస్తోంది. మరో 62శాతం కంపెనీలు కనీసం 15 శాతం మంది ఉద్యోగుల్లో నైపుణ్యాల పెంపు తప్పనిసరి అని భావిస్తున్నట్టు తెలిపారు. ఇండియాలోనూ అంతే.. భారతదేశంలోని 60 శాతానికి పైగా కంపెనీలు నైపుణ్యమున్న ఉద్యోగుల కొరతను ఎదుర్కొంటున్నట్టు ఇటీవలి ‘ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్’ నివేదికలో ప్రపంచ ఆర్థిక సంస్థ (డబ్ల్యూఈఎఫ్) కూడా పేర్కొంది. ముఖ్యంగా చదువు పూర్తిచేసుకుని కొత్తగా ఉద్యోగాల్లోకి వస్తున్నవారికి తగిన నైపుణ్యాలు ఏమాత్రం ఉండటం లేదని వెల్లడించింది. ఉద్యోగుల్లో నైపుణ్యాల కల్పనకు తోడ్పడే అప్రెంటిస్‌షిప్, ఇంటర్న్‌షిప్, ఆన్ జాబ్ ట్రైనింగ్ వంటి వాటిని భారత్‌లో ఉపేక్షిస్తున్నారని పేర్కొంది. ముఖ్యంగా కంపెనీలు, పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన స్కిల్స్ కల్పించేలా విద్యా రంగంలో సంస్కరణలు రావాల్సి ఉందని అభిప్రాయపడింది. సరికొండ చలపతి -
B20 Summit 2023: నైతిక ‘కృత్రిమ మేధ’ అత్యావశ్యం
న్యూఢిల్లీ: అధునాతన సాంకేతిక ప్రపంచంలో కృత్రిమ మేథ(ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్–ఏఐ)ను నైతికంగా వినియోగించాలని, లేదంటే విపరిణామాలు తప్పవని ప్రధాని మోదీ హెచ్చరించారు. నూతన సాంకేతికతలో నైతికత లోపిస్తే సమాజంపై ఏఐ ప్రతికూల ప్రభావాలు ఎక్కువ అవుతాయని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. ఆదివారం ఢిల్లీలో కొనసాగుతున్న బీ–20(బిజినెస్ ఫోరమ్–20) సదస్సులో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. ‘ఏఐ వినియోగానికి సంబంధించి అంతర్జాతీయ స్థాయి ఏకరూప మార్గనిర్దేశకాలు అవసరం. నిబంధనల చట్రం లేకుంటే క్రిప్టో కరెన్సీ వంటి అంశాల్లో సమస్యలు మరింత ఎక్కువ అయ్యే ప్రమాదముంది. పర్యావరణానికి హాని తలపెట్టని రీతిలో జీవన, వ్యాపార విధానాలకు పారిశ్రామిక వర్గాలు ప్రాధాన్యతనివ్వాలి. ఇందుకు వ్యాపారవర్గాలు, ఆయా దేశాల ప్రభుత్వాలు కలసి కట్టుగా ముందుకు సాగాలి’ ఆయన మోదీ కోరారు. ‘పర్యావరణ మార్పు, ఇంథన రంగంలో సంక్షోభం, ఆహార గొలుసులో లోపించిన సమతుల్యత, నీటి భద్రత వంటివి అంతర్జాతీయంగా వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ సమస్యలకు దేశాలన్నీ ఉమ్మడిగా పరిష్కరించుకోవాలి’ అని ఆయన అభిలíÙంచారు. వ్యాపారవర్గాలు తమ వ్యాపార సంబంధ అంశాలను చర్చించేందుకు జీ20కి అనుబంధంగా ఏర్పాటుచేసుకున్న వేదికే బిజినెస్ 20(బీ20) ఫోరమ్. విధాన నిర్ణేతలు, వ్యాపారదిగ్గజాలు, నిపుణులుసహా జీ20 దేశాల ప్రభుత్వాలు ఉమ్మడిగా బీ20 ఇండియా తీర్మానంపై చర్చలు జరుపుతాయి. ఈ తీర్మానంలో 54 సిఫార్సులు, 172 విధానపర చర్యలు ఉన్నాయి. వీటిని సెపె్టంబర్ 9–10 తేదీల్లో జరిగే జీ20 శిఖరాగ్ర సదస్సులో సమరి్పస్తారు. వారే ఆర్థికాభివృద్ధి చోదక శక్తులు ‘ప్రస్తుతం భారత్‌లో చాలా మంది పేదరికం నుంచి బయటపడి కొత్తగా ‘మధ్యతరగతి’ వర్గంలో చేరుతున్నారని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ‘పేదరికాన్ని నిర్మూలిస్తూ కేంద్రం అవలంభిస్తున్న విప్లవాత్మక విధానాల కారణంగా మరో 5–7 ఏళ్లలో కోట్ల భారీ సంఖ్యలో మధ్యతరగతి జనాభా అవతరించనుంది. వీరే భారత ఆర్థికాభివృద్ధి చోదక శక్తులు. వీరే దేశంలో అతిపెద్ద వినియోగదారులు. కొంగొత్త ఆకాంక్షలతో శ్రమిస్తూ దేశార్థికాన్ని ముందుకు నడిపిస్తారు. ప్రభుత్వం పేదలను పై స్థాయికి తీసుకెళ్లేందుకు కృషిచేస్తోంది. దీంతో ఆ తర్వాత లబ్ధిపొందేది మధ్యతరగతి, సూక్ష్మ,చిన్న,మధ్యతరహా పరిశ్రమల వర్గాలే. మధ్య తరగతి ప్రజల కొనుగోలు శక్తి పెరిగితే వ్యాపారాలు వరి్ధల్లుతాయి. వ్యాపారాలు, వినియోగదారుల మధ్య సమతూకం సాధిస్తే లాభదాయ మార్కెట్ సుస్థిరంగా కొనసాగుతుంది. ప్రపంచ దేశాలకూ ఇదే సూత్రం వర్తిస్తుంది. వినియోగ దేశాలు బాగుండాలంటే వస్తూత్పత్తి దేశాలను పట్టించుకోవాలి. లేదంటే వస్తూత్పత్తి దేశాలు కష్టాల కడలిలో పడతాయి. అందుకే ఏటా అంతర్జాతీయ వినియోగ సంరక్షణ దినం జరుపుకుందాం’ అని వ్యాపార వర్గాలకు మోదీ పిలుపునిచ్చారు. -
ఆధునిక సాంకేతికతను ప్రవేశపెట్టినా నేరమేనా?
సాక్షి, అమరావతి: ‘కుక్క పిల్ల, అగ్గిపుల్ల, సబ్బు బిళ్ల కాదేదీ కవితకు అనర్హం’ అన్నట్టు తనకు గిట్టని ప్రభుత్వంపై తప్పుడు రాతలు రాయడంలో, విష ప్రచారం చేయడంలో ఈనాడు రామోజీరావుది కూడా ఇదే తీరు. ఇందులో భాగంగానే బుధవారం తన విష పుత్రిక ‘ఈనాడు’లో ‘ఉచిత సాఫ్ట్వేర్ మాకొద్దు.. రూ.34 కోట్లిచ్చి కొంటాం’ అనే శీర్షికతో ఒక తప్పుడు కథనం వండివార్చారు. మారుతున్న ఆధునిక అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల శాఖలో ఆధునిక టెక్నాలజీని ప్రవేశపెడుతున్నా రామోజీ ఓర్వలేకపోతున్నారు. ప్రజలకు సరికొత్తగా అత్యాధునిక సేవలు అందించడం కోసం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ పాత టెక్నాలజీకి స్వస్తి పలకడం ‘ఈనాడు’కు కంటగింపుగా మారింది. కొత్త టెక్నాలజీ ముందుకు వస్తుంటే పాత టెక్నాలజీని వదిలించుకోవడం ఎక్కడైనా జరిగే సర్వ సాధారణమైన విషయం. అయితే ఇది ఘోర తప్పిదంలాగా కళ్ల నిండా పచ్చవిషం నింపుకున్న రామోజీరావుకు కనిపించింది. అందుకే ఆధునిక అవసరాలకు అనుగుణంగా మారకుండా... కేంద్రం ఉచితంగా సాఫ్ట్వేర్ ఇస్తోంది కాబట్టి దాన్నే వాడాలంటూ ఈనాడు తన కథనంలో వితండ వాదానికి దిగింది. అప్‌గ్రేడ్ చేసే స్థాయి వనరులు తనకు లేవన్న ఎన్ఐసీ 1999 నుంచి రిజిస్ట్రేషన్ల శాఖ ఐటీ ఆధారిత సేవలు అందిస్తోంది. అప్పటి అవసరాలకనుగుణంగా నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ).. సీఏఆర్డీ (కార్డ్) అప్లికేషన్‌ను రూపొందించినా ఆ తర్వాత ఎప్పటికప్పుడు మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకోలేకపోయింది. అప్పట్లో సంవత్సరానికి కేవలం 2 లక్షల రిజిస్ట్రేషన్లు చేసేందుకు మాత్రమే ఈ అప్లికేషన్‌ను రూపొందించారు. ప్రస్తుతం ఏటా 25 లక్షల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఈ స్థాయిలో డాక్యుమెంట్లు రిజిస్టర్ చేసే సామర్థ్యం లేక రెండు దశాబ్దాల నాటి కార్డ్ సాఫ్ట్వేర్ చతికిలపడింది. సర్వర్లు మొరాయించడం, రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడడాన్ని ఈనాడు పలుసార్లు ప్రచురించింది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులను తప్పించడానికి కార్డ్ అప్లికేషన్‌ను అప్‌గ్రేడ్ చేయడం అనివార్యంగా మారింది. ఈ క్రమంలోనే రిజిస్ట్రేషన్ల శాఖ ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా కార్డ్‌ను కార్డ్ ++ గా అప్‌గ్రేడ్ చేయాలని కోరింది. ఇందుకు అంగీకరించిన ఎన్ఐసీ 2017లో అందుకు ప్రతిపాదనలు ఇవ్వడంతో ప్రభుత్వం దాని అమలుకు రూ.13.14 కోట్లను మంజూరు చేసింది. ఆ అప్లికేషన్ కోసం రూ.11.82 కోట్లను ఎన్ఐసీ ఢిల్లీకి చెల్లించింది. డబ్బు తీసుకున్నా టెక్నాలజీ అప్‌గ్రేడ్ చేయడంలో ఎన్ఐసీ విఫలమైంది. అనేకసార్లు రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు ఎన్ఐసీతో చర్చలు జరిపినా తమకు ఆ స్థాయి వనరులు లేవని చెబుతూ వచ్చింది. దీంతో రిజిస్ట్రేషన్ల సేవల్లో తరచూ అంతరాయాలు, ఇబ్బందులు తలెత్తేవి. మరోవైపు వైఎస్ జగన్ ప్రభుత్వం 15,004 గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ రిజిస్ట్రేషన్లు సేవలు ప్రారంభించాలని నిర్ణయించింది. ఇప్పటికే 2 వేల సచివాలయాల్లో ఆ సేవలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో కార్డ్ అప్లికేషన్‌ను అవసరాలకు తగ్గట్టు అత్యవసరంగా ఆధునికీకరించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో కార్డ్ ++ అప్లికేషన్‌ను అప్‌గ్రేడ్ చేయలేకపోయిన ఎన్ఐసీకి తాము ఇచ్చిన సొమ్మును తిరిగి వెనక్కి ఇచ్చేయాలని, కొత్త టెక్నాలజీ పార్టనర్‌ను చూసుకుంటామని రిజిస్ట్రేషన్ల శాఖ ఆ సంస్థకు స్పష్టం చేసింది. దీంతో ఎన్ఐసీ రూ.6.20 కోట్లు వెనక్కి ఇచ్చేసింది. పారదర్శకంగా టెండర్ల ప్రక్రియ.. ఎన్ఐసీ చేతులెత్తేయడంతో గతేడాది రిజిస్ట్రేషన్ల కోసం ఆర్టీజీఎస్ ద్వారా కొత్త టెక్నాలజీ పార్ట్నర్ కోసం ప్రభుత్వం టెండర్లు పిలిచింది. అత్యంత పారదర్శకంగా నిర్వహించిన ఈ ప్రక్రియలో ఐదు కంపెనీలు పాల్గొన్నాయి. రూ.33.99 కోట్లతో ఎల్–1గా నిలిచిన క్రిటికల్ రివర్ టెక్నాలజీస్ కొత్త పార్ట్నర్గా ఎంపికైంది. అత్యాధునిక టెక్నాలజీతో ప్రైమ్ కార్డ్ అప్లికేషన్‌ను ఆ కంపెనీ రూపొందించింది. ప్రజలకు ఇబ్బందులు తప్పించడానికి ప్రభుత్వం చేస్తున్న ఈ పనిని అభినందించాల్సింది పోయి తనకలవాటైన రీతిలోనే ‘ఈనాడు’ విషం చిమ్మింది. కేంద్రం ఉచితంగా సాఫ్ట్వేర్ ఇస్తానంటే వద్దని ప్రభుత్వం రూ.34 కోట్లతో తమకు కావాల్సిన వారికి ఆ కాంట్రాక్టు ఇచ్చిందని అడ్డగోలు అబద్ధాలను తన కథనంలో వండివార్చింది. అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే రిజిస్ట్రేషన్ల విధానం ఉండాలనే ఉద్దేశంతో ఎన్జీడీఆర్ఎస్ సాఫ్ట్‌వేర్‌ను కేంద్రం 2012లో తెచ్చింది. అప్పటికి 14 ఏళ్లకు ముందే మన రాష్ట్రంలో కార్డ్ అప్లికేషన్ ద్వారా అంతకుమించిన ఐటీ ఆధారిత రిజిస్ట్రేషన్ సేవలు అమలవుతున్నాయి. కేంద్రం ఇచ్చిన సాఫ్ట్‌వేర్‌ను ఉచితంగా తీసుకుంటే మళ్లీ మనం పాత టెక్నాలజీనే వాడాల్సి ఉంటుంది. ఆ టెక్నాలజీ అప్పటికి ఐటీ సేవలు ప్రారంభించని రాష్ట్రాలకు ఉపయోగం తప్ప అప్పటికే టెక్నాలజీ సేవల్లో ముందున్న మన రాష్ట్రానికి కాదు. ఈ విషయాన్ని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కేంద్రానికి చెప్పి తాము ఇంకా ఆధునిక టెక్నాలజీలోకి వెళుతున్నట్లు చెప్పగా అంగీకరించింది. కానీ ‘ఈనాడు’ మాత్రం పాత టెక్నాలజీనే వాడాలంటూ వింత వాదనలు చేస్తోంది. కొత్త టెక్నాలజీ ద్వారా అత్యాధునిక సేవలు.. రిజిస్ట్రేషన్ల శాఖ కొత్తగా తెచ్చిన ప్రైమ్ కార్డ్ అప్లికేషన్ అత్యాధునిక టెక్నాలజీతో అన్ని అవసరాలను తీర్చేలా పనిచేస్తుంది. దీనిద్వారా త్వరలో ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్ సేవలు అందించబోతున్నారు. వినియోగదారులు తమ డాక్యుమెంట్లను ఆన్లైన్లో తామే తయారు చేసుకునే సౌలభ్యం కూడా ఉంటుంది. రెవెన్యూ, మున్సిపల్ శాఖల డేటాబేస్లకు అనుసంధానమై అత్యంత కీలకమైన ఆటోమ్యుటేషన్ విధానాన్ని ఈ కొత్త టెక్నాలజీ ద్వారానే అందుబాటులోకి తేనున్నారు. ఈ–సైన్, ప్రైమ్ మొబైల్ యాప్‌ల ద్వారా సరికొత్త రిజిస్ట్రేషన్ సేవలు ప్రజల ముంగిటకు రానున్నాయి. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆన్లైన్ చెల్లింపులు జరిపే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, గ్రామ, వార్డు సచివాలయాలన్నింట్లోనూ ఈ కొత్త టెక్నాలజీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ సేవలన్నింటినీ ఎన్జీడీఆర్ఎస్ సాఫ్ట్వేర్ ద్వారా, ఎన్ఐసీ పాత సాఫ్ట్‌వేర్‌తో చేసే పరిస్థితి ఏమాత్రం లేదు. ఆధునిక అవసరాలకు తగ్గట్టు ఈ సేవలన్నీ అందించేలా ప్రైమ్ కార్డ్ టెక్నాలజీని నడిపే సామర్థ్యం ఉండడం వల్లే క్రిటికల్ రివర్ టెక్నాలజీస్ కంపెనీని టెక్నాలజీ పార్ట్నర్గా ఎంపిక చేశారు. ఇది ఈనాడుకు మింగుడుపడకే తన కథనంలో దుష్ప్రచారానికి దిగింది. -
పాఠశాల విద్యలో ఏఐ టెక్నాలజీతో పక్కాగా వివరాలు
-
రోబోటిక్స్‌పై ప్రత్యేక దృష్టి
రాయదుర్గం: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం నూతన సాంకేతికత, రోబోటిక్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టిందని ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్‌రంజన్ పేర్కొన్నారు. నానక్‌రాంగూడలోని షరటాన్ హోటల్లో శనివారం రోబోటిక్ గైనకలాజికల్ సర్జరీపై రెండు రోజుల జాతీయ సదస్సును ఆయన అపోలో ఆస్పత్రుల గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతారెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్రంలో అన్ని రంగాల్లో అత్యాధునిక సాంకేతికత, పరిజ్ఞాన్ని వినియోగిస్తున్నామన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రోబోటిక్స్ పాలసీని ప్రారంభించామన్నారు. దేశంలోనే నిర్దిష్ట రోబోటిక్ పాలసీని కలిగి ఉన్న మొదటి రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఈ పాలసీలో భాగంగా హెల్త్‌కేర్, అగ్రికల్చర్, ఇండ్రస్టియల్ ఆటోమేషన్, కన్సూ్మర్ రోబోటిక్స్ అనే నాలుగు వర్టికల్స్‌పై దృష్టి పెట్టాలని నిర్ణయించామన్నారు. రోబోలను తయారు చేసే కొన్ని ప్రీమియర్ కంపెనీలతో ముందస్తుగా చర్చలు జరుపుతున్నామన్నారు. నిమ్స్‌లో డావిన్సీ ఎక్స్ఐ 4వ వెర్షన్ సిస్టమ్‌ను పూర్తి స్థాయిలో అమర్చిన రోబోటిక్ సర్జరీ ల్యాబ్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు. డాక్టర్ సంగీతారెడ్డి మాట్లాడుతూ అపోలో ఆస్పత్రులలో ఇప్పటి వరకు 12 వేల రోబోటిక్ సర్జరీలు చేశామన్నారు. అందులో డాక్టర్ రుమా సిన్వా స్వయంగా 700 రోబోటిక్ సర్జరీలు చేశారన్నారు. అనంతరం సమావేశం బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏజీఆర్‌ఎస్ అధ్యక్షురాలు ప్రొఫెసర్ రమాజోíÙ, ఆర్నాల్డ్ పి.అడ్విన్కులా, డాక్టర్ టోనిచల్ హౌబ్, డాక్టర్ జోసెఫ్ పాల్గొన్నారు. -
భయపడుతున్న ఫోన్‌పే & గూగుల్ పే! యూజర్లకు ఇది శుభవార్తే..
UPI Plugin: యూపీఐ చెల్లింపులు అమలులోకి వచ్చిన తరువాత జేబులో డబ్బు పెట్టుకునే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. దీంతో ఫోన్‌పే, గూగుల్ పే వంటి ఆన్లైన్ ట్రాన్సక్షన్ యాప్స్ వినియోగం బాగా పెరిగిపోయింది. ఈ రోజు మొబైల్ నెంబర్ టైప్ చేసి కూడా అమౌంట్ పంపించేస్తున్నాము. కాగా ఈ రెండు యాప్‌లకి ఓ కొత్త టెక్నాలజీ సవాళ్ళను విసురుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. ఫోన్‌పే, గూగుల్ పే వంటి వాటికి సరైన ప్రత్యర్థిగా నిలువడానికి 'యూపీఐ ప్లగిన్' (UPI Plugin) అందుబాటులోకి రానుంది. దీనిని మర్చెంట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్ (SDK) అని కూడా పిలుస్తారు. దీని ద్వారా పేమెంట్స్ యాప్ అవసరం లేకుండానే సులభంగా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అంటే అమౌంట్ చెల్లించడానికి థర్డ్ పార్టీ అవసరం లేదని స్పష్టమవుతోంది. ఉదాహరణకు మనం ఎప్పుడైనా జొమాటో లేదా స్విగ్గీ వంటి వాటిలో ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలంటే అమౌంట్ చెల్లించడానికి యూపీఐ ఆప్సన్ ఎంచుకుంటాము. ఇలా చేసినప్పుడు కొన్ని సార్లు ఎర్రర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే యూపీఐ ప్లగిన్ దీనికి చెక్ పెట్టనున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: అక్కడ అద్దె తెలిస్తే అవాక్కవుతారు.. ఆఫీస్ రెంట్ నెలకు ఎన్ని కోట్లంటే? పేటీఎమ్, రేజర్‌పే, జస్పే వంటివి ఎస్డీకేను ఎనేబుల్ చేసుకొనేందుకు మర్చంట్స్‌కు అవకాశం కల్పిస్తున్నాయి. దీంతో సక్సెస్ రేటు 15 శాతం పెరుగుతుందని అంచనా. ఇది అమలులోకి వచ్చిన తరువాత తప్పకుండా వినియోగదారుల సంఖ్య పెరుగుతుంది. దీంతో ఫోన్‌పే, గూగుల్ పే ఆదరణ తగ్గే అవకాశం ఉంటుంది. ఇదీ చదవండి: పొట్టి మొక్కతో పుట్టెడు లాభాలు.. నెలకు రూ. 4 లక్షలు పక్కా! ప్రస్తుతం ఫోన్‌పే మార్కెట్ వాటా 47 శాతం, గూగుల్ పే వాటా 33 శాతం వరకు ఉంది. అయితే స్విగ్గి, జొమాటో, ఫ్లిప్‌కార్ట్, మింత్రా వంటి సంస్థలు ఈ కొత్త వ్యవస్థకు మారితే మిగిలిన యాప్స్ సంగతి అధోగతి అయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ కొత్త టెక్నాలజీ వినియోగదారులకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు. -
యంగ్ కమల్.. ఓ టెక్నిక్
పాతికేళ్ల క్రితం కమల్‌హాసన్ వయసుకు మించి కనిపించిన పాత్రల్లో ‘ఇండియన్’లో సేనాపతి, ‘భామనే సత్యభామనే’లో వృద్ధురాలి పాత్రల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. నాలుగు పదుల వయసులో ఆరు పదుల వయసుకి మించి కమల్ కనిపించిన పాత్రలివి. ఇప్పుడు ఇంకో ఏడాదికి కమల్ ఏడు పదుల వయసుని టచ్ చేస్తున్న నేపథ్యంలో యువకుడిలా కనిపించాల్సి వస్తోంది. ‘ఇండియన్’లో కమల్ని యంగ్ అండ్ ఓల్డ్ పాత్రల్లో చూపించిన దర్శకుడు శంకర్ ఈ చిత్రం సీక్వెల్ ‘ఇండియన్ 2’లో కూడా వృద్ధుడిగా, యువకుడిగా చూపించనున్నారు. యువకుడి పాత్ర కోసం సాంకేతిక సహాయం తీసుకుంటున్నారట. ప్రస్తుతం శంకర్ లాస్ ఏంజిల్స్‌లో ఉన్నారు. ‘‘లాస్ ఏంజిల్స్‌లోని లోలా వీఎఫ్ఎక్స్లో అధునాతన సాంకేతికతను పర్యవేక్షిస్తున్నాను’’ అని శంకర్ పేర్కొన్నారు. కమల్ని యువకుడిగా చూపించడానికే లోలా సంస్థని శంకర్ సంప్రదించి ఉంటారనే ఊహాగానాలు నెలకొన్నాయి. ఎందుకంటే ‘డీ–ఏజింగ్’ (యంగ్‌గా చూపించడం) టెక్నాలజీకి లోలా పాపులర్. -
మీకు తెలుసా.. ఈ గిటార్ మడతపెట్టుకోవచ్చు
గిటార్ సంగీతాన్ని ఇష్టపడనివారు ఉండరు. గిటార్ వాద్యంలో విద్వత్తును సాధించిన వారు కొద్ది మంది ఉంటే, కాలక్షేపంగా గిటార్ వాద్యాన్ని సాధన చేసేవారు ఎందరో ఉంటారు. ప్రయాణాలు చేసేటప్పుడు గిటార్‌ను తీసుకెళ్లడం కష్టంతో కూడుకున్న పనే! పొడవాటి గిటార్‌ను జాగ్రత్తగా బాక్స్‌లో భద్రపరచి తీసుకుపోవాల్సి ఉంటుంది. లగేజీలో ఇది చాలా చోటును ఆక్రమిస్తుంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా, గిటార్ ధ్వంసమయ్యే ప్రమాదాలూ లేకపోలేదు. ఈ సమస్యకు పరిష్కారంగానే అమెరికన్ సంగీత పరికరాల తయారీ కంపెనీ ‘కియరీ గిటార్స్’ సులువుగా మడిచేసుకునే గిటార్‌ను ‘ఎసెండర్ పీ90 సోలో’ పేరుతో అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణాలకు వెళ్లేటప్పుడు దీన్ని తేలికగా మడిచి, ప్యాక్ చేసుకోవచ్చు. దీని ధర 1599 డాలర్లు (రూ.1.32 లక్షలు) మాత్రమే! -
వారెవ్వా టెక్నాలజీ.. ఫ్యూచర్ స్మార్ట్ఫోన్లు ఇలా ఉంటాయా?
సాక్షి, ముంబై: టెక్నాలజీ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. ముఖ్యంగా గాడ్జెట్స్‌కు సంబంధించి అత్యాధునిక ఫీచర్లు, సౌకర్యాలతో యూజర్లను మెస్మరైజ్ చేస్తున్నాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి ట్విటర్లో తెగ వైరల్ అవుతోంది. ల్యాండ్ ఫోన్లనుంచి ఫీచర్ ఫోన్ దాకా మొబైల్ వినియోగం ఒక ఎత్తు అయితే. ఫీచర్ ఫోన్ల నుంచి స్మార్ట్ ఫోన్ల దాకా మరో ఎత్తు అని చెప్పవచ్చు. భారీ డిస్ప్లే, భారీ బ్యాటరీలు, రియర్ కెమెరాలు, సెల్ఫీ కెమెరా, 5జీ దాకా ఈ ప్రస్థానం చాలా గొప్పది. ఈ క్రమంలో భవిష్యత్తు ఫోన్లు ఎలా ఉంటాయో తెలిపే ఒక వీడియో సోషల్ మీడియాలో విశేషంగా నిలిచింది. ఇవీ చదవండి: ఐపీఎల్ 2023: గుజరాత్ టైటన్స్ ఓనర్ నెట్‌వర్త్ ఏకంగా రూ. 11 లక్షల కోట్లు ఐపీఎల్ఫైనల్ విన్నర్ ఎవరంటే! ఆనంద్ మహీంద్ర కామెంట్,వైరల్ ట్వీట్ స్లిమ్ అండ్ స్లీక్ మాత్రమే కాదు. అత్యంత ట్రాన్సపరెంట్గా స్మార్ట్‌ఫోన్ లవర్స్‌ను ఇట్టే ఆకట్టుకుంటోంది. The Future of Smartphones!#Smartphone #mobile #gadgets pic.twitter.com/IDIgxyRwnx — The Pakistan Affairs (@ThePKAffairs) May 28, 2023 డోంట్ మిస్ టు క్లిక్ హియర్ సాక్షి బిజినెస్ -
రూ. 1.50 లక్షల గూగుల్ ఫస్ట్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ - ప్రత్యేకతలివే!
ఆధునిక కాలంలో స్మార్ట్ఫోన్లు కొత్త కొత్త అవతారాలలో పుట్టుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పుడు ఫోల్డబుల్ మొబైల్స్ మార్కెట్లో విడుదలవుతున్నాయి. కానీ గూగుల్ సంస్థ మొదటి సారి తన ఫిక్సెల్ ఫోల్డబుల్ ఫోన్ దేశీయ విఫణిలోకి లాంచ్ చేసింది. ఈ లేటెస్ట్ మొబైల్ ప్రైస్, ఫీచర్స్ వంటి వాటితో పాటు ఇతర వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి. ప్రముఖ టెక్ సంస్థ గూగుల్ భారతదేశంలో తన కొత్త ఫోల్డబుల్ మొబైల్ లాంచ్ చేసింది. 'గూగుల్ ఫిక్సెల్ ఫోల్డ్' అని పిలువబడే ఈ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో విడుదలైంది. అవి 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్, 12జీబీ ర్యామ్ + 512జీబీ స్టోరేజ్. వీటి ధరలు వరుసగా రూ. 1,47,500 & రూ. 1,57,300. ఈ మొబైల్స్ అమ్మకాలు ఫ్లిప్‌కార్ట్‌లో మొదలయ్యాయి. ఒబ్సిడియన్, పోర్సెలాయిన్ అనే రెండు కలర్ ఆప్షన్లలో విడుదలైంది. గూగుల్ ఫోల్డబుల్ మొబైల్ 7.6 ఇంచెస్ ఫుల్ హెచ్డీ+ OLED ఇన్నర్ డిస్ప్లేతో పాటు 5.8 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ఔటర్ డిస్ప్లే కూడా పొందుతుంది. ఈ డిస్ప్లేలు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్‌తో ఔటర్ డిస్ప్లే పొందుతాయి. (ఇదీ చదవండి: నిండా 18 ఏళ్ళు లేవు..! రూ. కోటి కంటే ఎక్కువ ఖరీదైన కారు కొనేసాడు - వీడియో) ఈ లేటెస్ట్ మొబైల్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో మూడు రియర్ కెమెరాలను పొందుతుంది. అవి 48 మెగాఫిక్సల్ ప్రైమరీ కెమెరా, 10.8 మెగాఫిక్సల్ అల్ట్రావైడ్, 10.8 మెగాఫిక్సల్ డ్యూయెల్ పీడీ టెలిఫోటో లెన్స్ కెమెరా. అయితే సెల్ఫీలు, వీడియోల కోసం ఔటర్ డిస్ప్లేకి 9.5 మెగాఫిక్సల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. అంతే కాకుండా ఈ మొబైల్ ఫోల్డ్ చేసినప్పుడు 8 మెగాఫిక్సల్ కెమెరా అందుబాటులో ఉంటుంది. (ఇదీ చదవండి: సినిమా హీరోలా ఉంటాడనుకున్నా, తీరా చూస్తే.. భర్తపై సుధా మూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు) ఇక బ్యాటరీ, ఛార్జింగ్ వంటి విషయాలకు వస్తే.. ఇందులో 4821mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 30 వాట్స్ వైర్డ్ ఛార్జింగ్, వైర్లెస్ ఛార్జింగ్ వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ ఫోన్ మొత్తం బరువు 283 గ్రాములు మాత్రమే. ఇందులో 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6ఈ, బ్లూటూత్, ఎన్ఎఫ్సీ కనెక్టివిటీ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. -
యాపిల్ దిమ్మతిరిగే టెక్నాలజీ.. మడత ఐఫోన్లు కింద పడినా ఏమీ కావు!
ప్రీమియం ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ దిగ్గజం యాపిల్ దిమ్మతిరిగే సరికొత్త టెక్నాలజీని తీసుకొస్తోంది. ఈ టెక్నాలజీ ఐఫోన్లు, ఐపాడ్లు కింద పడినా ఏమీ కాకుండా రక్షిస్తుంది. ఫోన్లు కింద పడే సందర్భంలో వీటికున్న సెన్సర్లు వెంటనే గ్రహించి వాటి ఫ్లెక్సిబుల్ స్క్రీన్లు మడతపడేలా చేస్తాయి. దీంతో ఫోన్ కింద పడినా స్క్రీన్లకు ఎటువంటి దెబ్బా తగలదు. ఇదీ చదవండి: పెళ్లి ఖర్చులకు డబ్బు కావాలా? ఈపీఎఫ్ నుంచి ఇలా తీసుకోండి.. ‘సెల్ఫ్-రిట్రాక్టింగ్ డిస్ప్లే డివైస్ అండ్ టెక్నిక్స్ ఫర్ ప్రొటెక్టింగ్ స్క్రీన్ యూజింగ్ డ్రాప్ డిటెక్షన్’ పేరుతో అభివృద్ధి చేస్తున్న ఈ కొత్త టెక్నాలజీపై యాపిల్ సంస్థ పేటెంట్ కోసం దరఖాస్తు చేసినట్లు తెలిసింది. ఈ టెక్నాలజీ ఎలా పనిచేసేదీ కంపెనీ పేటెంట్ దరఖాస్తులో పేర్కొంది. ఇదీ చదవండి: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలీనానికి ఎన్సీఎల్టీ ఆమోదం.. ఇక ఇదే మూడో అతిపెద్ద బ్యాంక్! ఈ టెక్నాలజీలో ఫోల్డబుల్, రోలబుల్ డిస్ప్లేలు కలిగిన మొబైల్ ఫోన్లు కింద పడిపోతున్నప్పుడు గుర్తించేందుకు సెన్సార్ ఉంటుందని తెలుస్తోంది. ఫోన్ కింద పడుతున్నట్లు సెన్సార్ గుర్తించిన వెంటనే అది నేలను తాకే లోపు సున్నితమైన డిస్ప్లే నేలకు తగలకుండా ముడుచుకునిపోతుందని కంపెనీ పేర్కొంది. ఇలా ముడుచుకునే క్రమంలో ఫోన్లోని రెండు స్క్రీన్లకు మధ్య కోణం తగ్గిపోతుంది. దీని వల్ల ఆ స్క్రీన్లకు దాదాపుగా దెబ్బ తాకే అవకాశం ఉండదు. ఇదీ చదవండి: సుందర్ పిచాయ్.. మాకు న్యాయం చేయండి.. తొలగించిన ఉద్యోగుల బహిరంగ లేఖ