సాక్షి, న్యూఢిల్లీ: చైనాకు చెందిన ఎలక్ట్రానిక్స్ కంపెనీ హైయర్ సెల్ఫ్ క్లీన్‌కూల్ టెక్నాలజీతో కూడిన ఏసీని భారత మార్కెట్లో విడుదల చేసింది. అన్ని కాలాల్లోనూ అనుకూలమైన ఏసీ ఉత్పత్తిగా కంపెనీ పేర్కొంది. 1.5 టన్ కెపాసీటీతో కూడిన ఈ హాట్ అండ్ కోల్డ్ 3 స్టార్ ఏసీ.. ట్రిపుల్ ఇన్వర్టర్ ప్లస్ టెక్నాలజీతో ఉంటుందని సంస్థ ప్రకటించింది.
ఏసీ తనంతట తానే శుభ్రం చేసుకోవడంతోపాటు, గదిలో ఉష్ణోగ్రతను తగినట్టు కూలింగ్‌ను మార్చుకోవడం చేస్తుందని, 65 శాతం ఇంధనాన్ని ఆదా చేస్తుందని తెలిపింది. 60 డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ ఏసీ పనిచేస్తుందని ప్రకటించింది. మైక్రో డస్ట్ ఫిల్టర్‌తో కూడిన ఈ కొత్త క్లీన్‌కూల్ ఏసీ గాలి నుండి దుమ్ము, బ్యాక్టీరియా వైరస్‌ను తొలగిస్తుంది. తద్వారా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం నుండి వినియోగదారులను రక్షిస్తుందని కంపెనీ వెల్లడించింది. అంతేకాకుండా, బెస్ట్-ఇన్-క్లాస్ మోటారు, ఆప్టిమైజ్డ్ ఫ్యాన్ ఎయిర్ డక్ట్‌తో అమర్చబడి ఉంటుందనీ, ఇది 15 మీటర్ల వరకు గాలిని వీచేలా చేస్తుందని పేర్కొంది. ఈ ప్రత్యేక ఫీచర్ గదిలోని అన్ని మూలలను చాలా వేగంగా చల్లబరుస్తుందని చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment