air conditioner
-
రోజుకు 12వేల కొత్త కార్లు
న్యూఢిల్లీ: వచ్చే దశాబ్దకాలంలో భారత్‌లో విద్యుత్, ఇంధనాల వినియోగానికి, కార్లకు డిమాండ్ గణనీయంగా పెరగనుంది. రోజుకు కొత్తగా 12,000 కార్లు రోడ్డెక్కనున్నాయి. 2035 నాటికి ఎయిర్ కండీషనర్ల (ఏసీ) విద్యుత్ వినియోగం మొత్తం మెక్సికోలో విద్యుత్ వినియోగాన్ని మించిపోనుంది. వరల్డ్ ఎనర్జీ అవుట్‌లుక్ 2024 నివేదికలో ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) ఈ విషయాలు వెల్లడించింది. భారత్‌లో చమురు, గ్యాస్, బొగ్గు, విద్యు త్, పునరుత్పాదక విద్యుత్ మొదలైన అన్ని రూపాల్లోనూ శక్తికి డిమాండ్ పెరుగుతుందని పేర్కొంది. ప్రస్తుతం చమురు వినియోగం, దిగుమతికి సంబంధించి ప్రపంచంలో 3వ స్థానంలో ఉన్న భారత్‌లో చమురుకు డిమాండ్ రోజుకు దాదాపు 20 లక్షల బ్యారెళ్ల మేర పెరుగుతుందని ఐఈఏ అంచనా వేసింది. దీంతో అంతర్జాతీయంగా చమురు డిమా ండ్ పెరిగేందుకు భారత్ ప్రధాన కారణంగా ఉంటుందని తెలిపింది. 2023లో అయిదో భారీ ఎకానమీగా ఉన్న భారత్ 2028 నాటికి మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని వివరించింది.నివేదికలో మరిన్ని వివరాలు.. → భారత్‌లో జనాభా పరిమాణం పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే దశాబ్దకాలంలో మిగతా దేశాలతో పోలిస్తే ఇంధనాలకు డిమాండ్ మరింత పెరగనుంది. → 2035 నాటికి ఐరన్, స్టీల్ ఉత్పత్తి 70 శాతం, సిమెంటు ఉత్పత్తి సుమారు 55 శాతం పెరుగుతుంది. ఎయిర్ కండీషనర్ల నిల్వలు 4.5 రెట్లు పెరుగుతాయి. దీంతో ఏసీల కోసం విద్యుత్ డిమాండ్ అనేది వార్షికంగా యావత్ మెక్సికో వినియోగించే విద్యుత్ పరిమాణాన్ని మించిపోతుంది. → ఆయిల్ డిమాండ్ రోజుకు 5.2 మిలియన్ బ్యారెళ్ల (బీపీడీ) నుండి 7.1 మిలియన్ బీపీడీకి చేరుతుంది. రిఫైనరీల సామర్థ్యం 58 లక్షల బీపీడీ నుండి 71 లక్షల బీపీడీకి పెరుగుతుంది. సహజవాయువుకు డిమాండ్ 64 బిలియన్ ఘనపు మీటర్ల (బీసీఎం) నుంచి 2050 నాటికి 172 బీసీఎంకి చేరుతుంది. బొగ్గు ఉత్పత్తి సైతం అప్పటికి 645 మిలియన్ టన్నుల నుంచి 721 మిలియన్ టన్నులకు పెరుగుతుంది. → భారత్‌లో మొత్తం శక్తి వినియోగం 2035 నాటికి సుమారు 35 శాతం మేర పెరగనుండగా, విద్యుదుత్పత్తి దాదాపు మూడు రెట్లు పెరిగి 1,400 గిగావాట్లకు చేరనుంది. → సౌర విద్యుదుత్పత్తి పెరుగుతున్నప్పటికీ బొగ్గు నుంచి విద్యుదుత్పత్తి దానికన్నా 30 శాతం అధికంగా ఉండనుంది. సోలార్ ఇన్స్టాలేషన్ల సామర్థ్యం తక్కువగా ఉండటమే ఇందుకు కారణం. పరిశ్రమ విద్యుత్ అవసరాలను తీర్చడంలో బొగ్గు కీలకపాత్ర పోషిస్తోంది. 40 శాతం అవసరాలను తీరుస్తోంది. → రాబోయే రోజుల్లో విద్యుదుత్పత్తి, ఇంధనాలకు సంబంధించి భారత్ పలు సవాళ్లు ఎదుర్కొనాల్సి రావచ్చు. శిలాజ ఇంధనాల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలి. వంటకోసం పర్యావరణహితమైన ఇంధనాన్ని సమకూర్చాలి. విద్యుత్ రంగం విశ్వసనీయతను పెంచాలి. వాయు కాలుష్య స్థాయిని నియంత్రించాలి. వాతావరణంలో పెనుమార్పుల కారణంగా వడగాలులు, వరదల్లాంటి ప్రభావాలను కట్టడి చేయడంపై దృష్టి పెట్టాలి. → భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది. 2030 నాటికి ఆయిల్ డిమాండ్ తారస్థాయికి చేరుతుంది. (ఆ తర్వాత నుంచి తగ్గుముఖం పట్టొచ్చు). పరిశ్రమల్లో విద్యుత్, హైడ్రోజన్ వినియోగం క్రమంగా పెరగనున్న నేపథ్యంలో బొగ్గుకు కూడా డిమాండ్ 2030 నాటికి గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. → 2, 3 వీలర్లకు సంబంధించి భారత్ ప్రపంచంలోనే అతి పెద్ద మార్కెట్లలో ఒకటి కాగా, ప్యాసింజర్ కార్ల మార్కెట్ విభాగంలో నాలుగో స్థానంలో ఉంది. → వచ్చే దశాబ్ద కాలంలో భారత్‌లో కొత్తగా 3.7 కోట్ల పైచిలుకు కార్లు, 7.5 కోట్ల పైగా 2,3 వీలర్లు రోడ్లపైకి రానున్నాయి. వీటిలో ఎలక్ట్రిక్ వాహనాల వాటా పెరుగుతున్నప్పటికీ, ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ వాహనాలూ వృద్ధి చెందుతాయి కనుక రహదారి రవాణా విభాగం విషయంలో చమురుకు డిమాండ్ 40 శాతం పెరుగుతుంది. దేశీయంగా ప్రతి రోజూ 12,000 కార్లు రోడ్లపైకి రానుండటంతో రహదార్లపరంగా మౌలిక సదుపాయాలను మరింతగా మెరుగుపర్చుకోవాల్సి ఉంటుంది. వాహనాల వల్ల వాయు కాలుష్యం మరింత తీవ్రమవుతుంది. 2035 నాటికి రోడ్ మార్గంలో ప్రయాణికుల రవాణా రద్దీ వల్ల కర్బన ఉద్గారాలు 30 శాతం పెరుగుతాయి. -
కెన్‌స్టార్ నుంచి నూతన ఉత్పత్తులు
హైదరాబాద్: ప్రముఖ గృహోపకరణాల సంస్థ కెన్‌స్టార్.. పెద్ద సైజు హోమ్ అప్లయన్సెస్‌ను విడుదల చేసింది. వీటిల్లో డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్లు, స్లి్పట్ ఎయిర్ కండీషనర్లు, ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్లు ఉన్నాయి. వీటి ఆవిష్కరణతో అన్ని రకాల గృహోపకరణాలు అందిస్తున్న కంపెనీగా మారింది. ప్రధాన విభాగాలైన ఎయిర్ కూలర్లు, చిన్నపాటి గృహోపకరణాలు, వాటర్ హీటర్లపైనా తమ దృష్టి కొనసాగుతుందని కంపెనీ ప్రకటించింది. కూలర్ల విభాగంలో నంబర్ 1 కంపెనీగా అవతరిస్తామని పేర్కొంది. 2023–24 సంవత్సరంలో కంపెనీకి మైలురాయి అని, 55 శాతం వృద్ధిని సాధించినట్టు కెన్‌స్టార్ సీఈవో సునీల్ జైన్ ప్రకటించారు. -
ఎర్రటి ఎండలో చల్లని హృదయం
భయానకమైన ఎండలో పెద్ద ఏసీ మెషిన్‌తో ఫ్లైఓవర్ దాటడానికి ఆపసో΄ాలు పడుతున్న రిక్షా కార్మికుడిని చూసిన ఒక మహిళ బాధపడింది. అయితే ఆమె బాధ పడి ఊరుకోలేదు. అతడి దగ్గరకు పరుగెత్తుకు వెళ్లింది. రిక్షాను నెట్టుతూ అతడు ఫ్లై ఓవర్ దాటేలా సహాయపడింది. ఆ తరువాత లంచ్‌బాక్స్, వాటర్ బాటిల్ అతడికి ఇచ్చింది. తలపై కప్పుకోవడానికి టవల్ కూడా ఇచ్చింది. దారిన ΄ోయేవాళ్లెవరో ఈ దృశ్యాన్ని వీడియో తీసి ‘ఎక్స్’లో ΄ోస్ట్ చేశారు. ఈ వీడియోకు అనూహ్యమైన స్పందన వచ్చింది.‘ఎక్కడో ఒకచోట కష్టపడుతున్న వ్యక్తుల్ని చూస్తుంటాం. బాధ అనిపిస్తుందిగానీ, నేను మాత్రం ఏం చేయగలను అని సర్దిచెప్పుకుంటాం. అయితే మన వంతుగా వారికి కొద్దో గొ΄్పో సహాయపడగలిగితే అది గొప్ప సంతృప్తిని ఇస్తుంది’ అంటూ ఒక యూజర్ కామెంట్ పెట్టాడు. -
ఎండాకాలం..మండే కాలం : ఏసీ మెయింటెనెన్స్ టిప్స్
వేసవి ఉష్ణోగ్రతలు అంతకంతకూపెరుగుతున్నాయి. ముందుంది చెడుకాలం అని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనం అన్ని జాగ్రత్తలతో సిద్ధం కావాల్సిందే. ముఖ్యంగా పసిపిల్లలు, వృద్ధులు ఉన్న ఇళ్ళల్లో అయితే మరింత అప్రమత్తత అవసరం. నంబర్ వన్ ఎయిర్ కండిషనింగ్ చిట్కా ఏమిటంటే ప్రతి సంవత్సరం ఏసీని సర్వీసింగ్ చేయించడం. ఎండలు మండించే దాకా వేచి ఉండకుండా ఏసీలు ఉన్న ఇళ్లలో ఏసీ కండిషన్లో ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. అవసరమైతే గ్యాస్ పట్టించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. నెలవారీ ఎయిర్ ఫిల్టర్లను చెక్ చేసుకోవాలి. ఎయిర్ కండీషనర్ సామర్థ్యాన్ని మెరుగుపడుతుంది. కరెంట్ బిల్లు కూడా ఆదా అవుతుంది. కండెన్సర్ యూనిట్ చుట్టూ సరైన గాలి తగిలేలా చూసుకోవాలి. కండెన్సర్ యూనిట్ చుట్టూ ఖాళీ 4-అడుగుల ప్లేస్ వదలాలి. గదిలో ఏసీ ఆన్‌లో ఉన్నపుడు కిటికీలు, తలుపులు మూసి ఉంచేలా జాగ్రత్త పడాలి. అంతేకాదు ఏసీ బిల్లు తడిచి మోపెడు కాకుండా ఉండాలంటే అవసరం లేనపుడు ఆఫ్ చేయడం మర్చిపోవద్దు. విండో ఫిల్మ్‌ను ఇన్స్టాల్ చేసుకోవడం బెటర్. వేసవిలో ఇది మన ఇంటిని చల్లగా శీతాకాలంలో వెచ్చగా ఉంచుతుంది. వేసవి ఇతర జాగ్రత్తలు వేసవి రాగానే ఫ్రిజ్‌లో పెట్టే వాటర్ బాటిళ్లు మరో సెట్ కొని సిద్ధం చేయడం ఆనవాయితీ. ఫ్రిజ్ బాటిళ్లతోపాటు మట్టి కుండ నీళ్లను వాడటం ఉత్తమం. మట్టి కుండలోని నీటి రుచి ఈ తరం బాల్యానికి పరిచయం చేయండి. ఇంటి కిటికీలకు వట్టివేరు తడికలను కర్టెన్లుగా వేయడానికి ప్రయత్నించండి. పర్యావరణహితంగా ఇంటిని చల్లబరుచుకుందాం. -
చంద్రబాబు గదిలో ఏసీ ఏర్పాటుకు అనుమతి
సాక్షి, విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోసం ఏసీ ఏర్పాటు చేయించాలని ఏసీబీ న్యాయస్థానం ఆదేశించింది. చంద్రబాబుకి ఉన్న చర్మ సమస్యల కారణంగా.. ప్రభుత్వ వైద్యుల సూచనల్ని జైలు అధికారులు పాటించేలా ఆదేశించాలంటూ శనివారం రాత్రి హౌజ్ మోషన్ పిటిషన్ వేశారు బాబు తరపు లాయర్లు. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించిన కోర్టు.. రాజమండ్రి సెంట్రల్ జైల్ స్నేహా బ్లాక్‌లో ఆయన ఉంటున్న ప్రత్యేక గదిలో ఏసీ ఏర్పాటు చేయించాలని జైళ్ల శాఖను ఆదేశించింది. పిటిషన్‌పై విచారణ సందర్భంగా.. వైద్యులుతోనూ, జైళ్ల శాఖాధికారులతోనూ మాట్లాడారు ఏసీబీ న్యాయమూర్తి. చంద్రబాబుకి స్కిన్ ఎలర్జీ మాత్రమే ఉందని వైద్యులు తెలపగా.. స్కిన్ ఎలర్జీ కాకుండా మరే ఇతర ఆరోగ్య సమస్యలున్నాయా? అని జడ్జి అడిగారు. స్కిన్ ఎలర్జీ కాకుండా మరే రకమైన ఆరోగ్య సమస్యలు చంద్రబాబుకి లేవని వైద్యులు, న్యాయమూర్తికి తెలిపారు. దీంతో.. చంద్రబాబు గదిలో ఏసీ ఏర్పాటు చేయాలని న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు. చంద్రబాబు ఉంటున్న బ్యారక్‌లో ఏసీ ఏర్పాటు చేయించాలని, వైద్యుల సూచనల్ని తప్పకుండా అమలు చేయాలని అధికారుల్ని ఈ సందర్భంగా కోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలకు సీఐడీ తరపున న్యాయవాది వివేకానంద ‘‘కోర్టు ఆదేశాల్ని తూ.చా. తప్పకుండా పాటిస్తామ’ని తెలిపారు. దీంతో ఈ రాత్రికే చంద్రబాబు కోసం ఏసీ(టవర్ ఏసీ) ఏర్పాటు చేయనున్నారు అధికారులు. చంద్రబాబు ఆరోగ్యంపై అపోహలు, అసత్యాలు ప్రచారంలోకి రావడంతో.. జైళ్ల శాఖ స్పందించింది. ఆయన్ని పరీక్షించిన వైద్య బృందంతో ప్రెస్ మీట్ పెట్టి మరీ అనుమానాల్ని నివృత్తి చేయించింది. చంద్రబాబు ఆరోగ్యం విషయంలో ఎలాంటి ఆందోళన అక్కర్లేదని.. ఆయన యాక్టివ్గానే ఉన్నారని.. ఆస్పత్రి అవసరం లేదని తెలిపింది. రోజూ మూడుసార్లు వైద్య పరీక్షలు జరుగుతున్నాయని తెలిపారు. అయితే స్కిన్ ఎలర్జీ కారణంగా కూల్ ఎన్విరాన్మెంట్ సిఫార్సు చేశామని వైద్యులు తెలిపారు. ఆ వెంటనే చంద్రబాబు తరపు లాయర్లు ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. అనారోగ్య లక్షణాలతో చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారని.. జైలులో ఏసీ ఏర్పాటు చేయించేలా జైలు అధికారుల్ని ఆదేశించాలని పిటిషన్లో కోరింది. ఏసీ ఏర్పాటు చేయకపోతే ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారిపోతుందని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా.. స్కిన్ ఎలర్జీ కారణంగా చల్లని ప్రదేశంలో చంద్రబాబు ఉంటే సరిపోతుందన్న ప్రభుత్వ డాక్టర్ల సూచనల్ని పిటిషన్లో ప్రస్తావించారు బాబు లాయర్లు. -
శునకాల కోసం హైటెక్ ఏసీ
కుక్కలను పెంచుకోవడం చాలామందికి సరదా అయినా, కాలాలకు అనుగుణంగా వాటి సంరక్షణను చూసుకోవడం మాత్రం సమస్యగానే ఉంటుంది. వేసవి తాకిడికి మనుషులే అల్లాడిపోతారు. ఇక వేసవిలో శునకాల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వేసవిలో మనుషులకైతే ఏసీలు ఉన్నాయి గాని, పాపం పెంపుడు జంతువుల పరిస్థితి ఏమిటి? వాటికి మాత్రం ఏసీ సౌకర్యం ఉండొద్దా అనే ఆలోచనతో కొరియన్ డిజైనర్ స్యూంగ్మెన్ లీ ‘ఇగ్లూ’ తరహాలో పెంపుడు కుక్కల కోసం హైటెక్ ఏసీ ఇంటికి రూపకల్పన చేసింది. ఇది పూర్తిగా శునకాలకు సౌకర్యవంతంగా ఉంటుంది. విశ్రాంతి సమయంలో ఇందులోకి వెళ్లేలా పెంపుడు శునకాలకు అలవాటు చేస్తే చాలు. ఇది పూర్తిగా ఆటోమేటిక్‌గా పనిచేస్తుంది. దీని ప్రవేశమార్గంలోని సెన్సర్లు శునకం లోపలకు ప్రవేశిస్తుండటాన్ని గుర్తించి, వెంటనే ఇందులోని ఏసీ పనిచేసేలా చేస్తాయి. శునకం శరీర ఉష్ణోగ్రతకు అనుగుణంగా చల్లదనం కలిగిస్తాయి. బయట వేసవి తాపం ఎంతలా ఉన్నా, ఇందులో శునకాలు చల్లగా సేదదీరవచ్చు. దీని ధర 160 డాలర్లు (రూ.13,221) మాత్రమే! -
లారీ డ్రైవర్లకు ఇక ఏసీ క్యాబిన్లు.. నితిన్ గడ్కరీ కీలక ఆదేశాలు!
ఆటోమొబైల్ సంస్థలకు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక ఆదేశాలు జారీ చేశారు. రానున్న రోజుల్లో ట్రక్ క్యాబిన్లలో డ్రైవర్ పక్కన ఎయిర్ కండీషనర్లను తప్పని సరిగా అమర్చాలని సూచించారు. మహీంద్రా లాజిస్టిక్స్ సంస్థ భారతీయ డ్రైవర్లను గౌరవిస్తూ ‘దేశ్ ఛాలక్’ పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గడ్కరీ మాట్లాడుతూ..43.. 47 సెల్సియస్ డిగ్రీల వేడిలో విధులు నిర్వహించే ట్రక్ డ్రైవర్ల జీవితం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. అందుకే ట్రక్‌లలో ఏసీలు ఉండాలన్న నిబంధనల్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. కానీ కొంతమంది ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. లారీల్లో ఏసీ తప్పని సరి అయితే వాహన ధరలు అమాంతం పెరుగుతాయని అంటున్నారు. ఈ కార్యక్రమానికి వచ్చే ముందే ట్రక్‌లలో ఏసీలను అమర్చాలన్న నిబంధనల అమలు ఫైల్‌పై సంతకం చేసి వస్తున్నా’ అని అన్నారు. ఏసీ క్యాబిన్లతో కూడిన ఆ ట్రక్కులు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో మంత్రి ప్రస్తావించలేదు. పలు నివేదికలు మాత్రం 2025 నుండి విడుదల కానున్నట్లు చెబుతున్నాయి. నిద్రలోకి జారుకుంటే లారీల్లో ఏసీ క్యాబిన్లు ఉండాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నా పరిశ్రమ వర్గాలు మాత్రం వ్యతిరేకిస్తున్నాయి. ఖర్చు పెరగడంతో పాటు, ఏసీ క్యాబిన్లు ఉండడం వల్ల డ్రైవర్లు నిద్రలోకి జారుకునే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి. అందుకే ట్రక్కుల్లో ఏసీ క్యాబిన్ల నిబంధనను వ్యతిరేకిస్తున్నాయి. ఇలా ఉంటే వోల్వో, స్కానియా వంటి కంపెనీలు తాము తయారుచేసే వాహనాల్లో ఏసీ క్యాబిన్లు అందిస్తుండడం గమనార్హం. చదవండి👉 టోల్‌ప్లాజా, ఫాస్టాగ్ కథ కంచికి..ఇక కొత్త పద్ధతిలో టోల్ వసూళ్లు! -
అకాల వర్షాలు.. తయారీ కంపెనీల అమ్మకాలకు స్పీడ్ బ్రేకర్!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉత్తరాది సహా పలు ప్రాంతాల్లో అకాల వర్షాలతో కూలింగ్ ఉత్పత్తులైన ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కూలర్ల అమ్మకాలు తగ్గినట్టు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. సాధారణంగా ఏప్రిల్, మే నెలలో వీటి అమ్మకాలు గణనీయంగా నమోదవుతుంటాయి. ఏప్రిల్, మే నెలలో ఇప్పటి వరకు వినియోగదారులు వర్షాల వల్ల తమ కొనుగోళ్లను వాయిదా వేసుకున్నట్టు పేర్కొన్నాయి. ఏప్రిల్‌లో అమ్మకాలు క్రితం ఏడాది ఇదే నెల విక్రయాలతో పోలిస్తే 15 శాతం తక్కువగా నమోదైనట్టు కొన్ని సంస్థలు వెల్లడించాయి. అయితే ఎండల తీవ్రత మళ్లీ పెరిగిన తర్వాత విక్రయాలు గాడిన పడతాయని ప్యానాసోనిక్, గోద్రేజ్, డైకిన్ తదితర సంస్థలు అంచనాతో ఉన్నాయి. ‘‘ఈ ఏడా ది ఏప్రిల్‌లో వాతావరణం చల్లగానే ఉంది. దీంతో గతేడాది ఏప్రిల్‌తో పోలిస్తే వృద్ధి తక్కువగానే ఉంది. ఇప్పటివరకు కస్టమర్లు ఎక్కువ మంది తమ కొనుగోళ్లను వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఇక్కడి నుంచి వేసవి కాలం ఇంకా ఎక్కువే మిగిలి ఉంది. కనుక అమ్మకాలు పుంజుకుంటాయని ఆశావహంగా ఉన్నాం’’అని ప్యానాసోనిక్ లైఫ్ సొల్యూషన్స్ ఇండియా బిజినెస్ హెడ్ (ఎయిర్ కండీషనర్లు) గౌరవ్ షా తెలిపారు. ఉత్తరాదిన అకాల వర్షాలతో ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, కూలర్ల అమ్మకాలపై ప్రభావం పడినట్టు కన్జ్యూమర్ ఎలక్ట్రా నిక్స్ అండ్ అప్లయన్సెస్ తయారీదారుల సంఘం (సీఈఏఎంఏ) సైతం తెలిపింది. తూర్పు, దక్షిణాది ప్రాంతాల్లో మాత్రం ఏప్రిల్ అమ్మకాల్లో మంచి వృద్ధి కనిపించినట్టు, పశ్చిమాదిన ఫ్లాట్‌గా ఉన్నట్టు సీ ఈఏఎంఏ ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగంజ వెల్లడించారు. మే నెల కీలకం.. ‘‘వేసవి సీజన్లో అమ్మకాల వృద్ధికి మే నెల కీలకం. అనుకున్న విధంగా ఉష్ణోగ్రతల్లో పెరుగుదల ఉంటే డిమాండ్ పుంజుకుంటుంది. అప్పుడు మార్కెట్లో నిల్వలు గణనీయంగా తగ్గుతాయి’’అని బ్రగంజ వివరించారు. ‘‘ఉష్ణోగ్రతల పెరుగుదలకు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కూలర్ల అమ్మకాలకు మధ్య సంబంధం ఉంది. వేసవిలో దేశంలోచి చాలా ప్రాంతాల్లో వేడిగాలులు ఉంటాయనే అంచనాలు నెలకొన్నాయి. అలాగే, వేసవి సీజన్ కూడా ఎక్కువ రోజుల పాటు ఉండొచ్చని, జూన్‌లోనూ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చన్న అంచనాలున్నాయి’’అని గోద్రేజ్ అప్లయన్సెస్ బిజినెస్ హెడ్ కమల్ నంది తెలిపారు. ఎయిర్ కండీషనర్లు నేడు లగ్జరీ ఉత్పత్తి కంటే తప్పనిసరి అవసరంగా మారిపోయినట్టు చెప్పారు. అమ్మకాల్లో అత్యధిక వృద్ధి నమోదవుతున్న విభాగంగా ఉన్నట్టు తెలిపారు. తమ ఏసీ ఉత్పత్తుల అమ్మకాల్లోనూ గణనీయమైన వృద్ధి ఉన్నట్టు వెల్లడించారు. 1 నుంచి 2 టన్నుల పరిధిలో 5 స్టార్ ఏసీల అమ్మకాలు ఎక్కువగా ఉన్నట్టు చెప్పారు. రిఫ్రిజిరేటర్లలో ఫాస్ట్ఫ్రీ మోడళ్లు ఎక్కువగా అమ్ముడుపోతున్నట్టు పేర్కొన్నారు. అధిక వేడి వాతావరణం తిరిగి ఏర్పడగానే ఏసీల అమ్మకాలు పెరుగుతాయని, దీనిపై పెద్ద ఆందోళన లేదని డైకిన్ ఎయిర్ కండీషనింగ్ ఇండియా చైర్మన్, ఎండీ కన్వల్జీత్ జావా తెలిపారు. -
అక్కడ 54.1 శాతం కుటుంబాలకు ఏసీ.. ఏపీ, తెలంగాణాలో ఎంత శాతం అంటే?
దేశవ్యాప్తంగా కేంద్ర పాలిత ప్రాంతాల్లోనే ఎయిర్ కండీషనర్ల వినియోగం అధికంగా ఉంది. అత్యధికంగా చండీఘడ్‌లో 54.1 శాతం కుటుంబాలు ఏసీ నీడన సేదతీరుతున్నాయి. దేశంలో 4.9 శాతం కుటుంబాలకు ఏసీ సదుపాయం ఉన్నట్లు నేషనల్ శాంపిల్ సర్వే నివేదిక వెల్లడించింది. దక్షిణాది రాష్ట్రాల్లో అగ్రస్థానంలో ఉన్న కేరళలో 10.4 శాతం, ఏపీలో 8.1 శాతం కుటుంబాలు ఏసీలను వాడుతున్నాయి. తెలంగాణలో 6.6 శాతం, తమిళనాడులో 6.1 శాతం కుటుంబాలకు ఏసీలున్నాయి. అత్యల్పంగా బిహార్‌లో 0.4 శాతం, ఒడిశాలో 1.5 శాతం, కర్ణాటకలో 1.8 శాతం కుటుంబాలు ఏసీలను వినియోగిస్తున్నాయి. శ్రీసిటీలో పలు యూనిట్లు దేశవ్యాప్తంగా ఏటా సగటున 75 లక్షల ఏసీల విక్రయాలు జరుగుతున్నట్లు అంచనా. ఎండలు చుర్రుమనే దక్షిణాదిలో ఏసీల వినియోగం పెంచడంపై తయారీ సంస్థలు దృష్టి సారించాయి. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో పలు ఏసీల తయారీ యూనిట్లు ఏర్పాటు కావడంతోపాటు ఉత్పత్తి కూడా ప్రారంభించాయి. డైకిన్, బ్లూస్టార్, హావెల్స్, పానాసోనిక్, యాంబర్, ఈపాక్ లాంటి సంస్థలు తమ యూనిట్లను ఏపీలో నెలకొల్పుతున్నాయి. బ్లూస్టార్ విస్తరణ కార్యక్రమాలను సైతం చేపట్టింది. ఏటా వీటి మొత్తం ఉత్పత్తి సామర్థ్యం 60 లక్షలకు పైగా ఉంది. వ్యత్యాసం ఎందుకంటే..? కేంద్ర పాలిత ప్రాంతాల్లో జనాభా తక్కువగా ఉండటం, అత్యధికంగా ఉపాధి అవకాశాలు, పన్నులు తక్కువ ఉండటం లాంటి కారణాలు కొనుగోలు శక్తిని పెంచుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధికంగా వ్యవసాయం, కూలీలు ఎక్కువగా ఉండటం ఏసీ వినియోగం తక్కువగా ఉండటానికి కారణం. పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు, కొనుగోలు శక్తి తక్కువగా ఉంటాయి. – ఎం.ప్రసాదరావు, ఏయూ ఎకనామిక్స్ విభాగం విశ్రాంత అధిపతి సగటు ఏసీ నియోగం భారత్ 4.9% పట్టణాల్లో12.6% గ్రామాల్లో 1.2% -
ఎగిరే ఏసీ! ఇల్లంతా తిరిగేస్తుంది.. సూపర్ గ్యాడ్జెట్
ఏసీ ఉంటే ఆ హాయి వేరే అయినా, ఏసీని అమర్చుకోవడం అంత తేలిక కాదు. నానా తంటాలు పడితే గాని, ఇంట్లోని కోరుకున్న గదిలో ఏసీ అమర్చుకోలేం. ఏసీ అమర్చుకున్న గదిలో తప్ప మిగిలిన గదుల్లో పరిస్థితి మామూలే! ఇల్లంతటికీ ఏసీ కావాలనుకుంటే, గదికో ఏసీ చొప్పున పెట్టించుకోవాలి. దీనంతటికీ ఖర్చు తడిసి మోపెడవుతుంది. ఇంత ప్రయాస లేకుండానే ఇల్లంతటికీ ఏసీ వాతావరణాన్ని పంచేందుకు ఇటలీకి చెందిన ‘మిరే ఓజ్లెమ్–ఈఆర్’ డ్రోన్ ఏసీని రూపొందించింది. దీనిని ఆన్ చేయగానే, ఇది గాల్లో చక్కర్లు కొడుతూ ఇల్లంతా తిరుగుతుంది. ఇంట్లోని మనుషుల శరీర ఉష్ణోగ్రతను పసిగట్టి, అందుకు అనుగుణంగా గదిలోని ఉష్ణోగ్రతను వెచ్చబరచడం లేదా చల్లబరచడం చేస్తుంది. ఇంట్లోని ప్రతి గదిలోనూ ఇది తిరుగుతూ ఉష్ణోగ్రతలను అవసరానికి అనుగుణంగా మారుస్తూ ఉంటుంది. అలాగే, ఇందులోని ‘అరోమా డిఫ్యూజర్’లో మనకు నచ్చిన సెంటును నింపి పెట్టుకుంటే, ఇంట్లోని వాతావరణాన్ని ఆహ్లాదభరితంగా మార్చడమే కాకుండా, మనసును సేదదీర్చే పరిమళాలను కూడా వెదజల్లుతుంది. మార్కెట్లోకి త్వరలోనే విడుదల కానున్న ఈ డ్రోన్ ఏసీ ధరను ఇంకా ప్రకటించలేదు. (ఇదీ చదవండి: Vivo Y56 5G: వివో వై సిరీస్‌లో మరొకటి.. ధర రూ.20వేల లోపే!) -
అదిరిపోయే గాడ్జెట్.. ఎక్కడైనా చల్లదనం మీ వెంటే
ఎయిర్ కండిషనర్ల చల్లదనం కావాలనుకుంటే, వాటిని అమర్చిన గదుల్లోనే కాలక్షేపం చేయక తప్పని పరిస్థితి. విండో ఏసీ అయినా, స్పి›్లట్ ఏసీ అయినా కావలసిన గదిలో అమర్చుకోగలమే తప్ప వాటిని ఎక్కడికంటే అక్కడకు తీసుకుపోయే వీలులేదు. ఇకపై అలాంటి పరిస్థితి ఉండదు. ఎక్కడికంటే అక్కడకు తేలికగా తీసుకపోయే పోర్టబుల్ ఏసీలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. రాజస్థాన్‌కు చెందిన ‘ఇవాపోలార్’ సంస్థ ఇటీవల ‘ఇవాచిల్’ పేరుతో పోర్టబుల్ ఏసీని అందుబాటులోకి తెచ్చింది. చిన్నసైజు సూట్‌కేసు మాదిరిగానే దీనిని కోరుకున్న చోటుకు తేలికగా తీసుకుపోవచ్చు. ఆరుబయట కూడా దీనిని నిక్షేపంగా ఉపయోగించుకోవచ్చు. ఎయిర్ కూలర్ మాదిరిగానే దీనికి వాటర్ ట్యాంకు ఉంటుంది. దీనిని నింపుకోవలసి ఉంటుంది. గాలిలో తేమను వ్యాపింపజేసి, ఇది పరిసరాలను నిమిషాల్లోనే చల్లబరుస్తుంది. దీని ధర సైజును బట్టి రూ.15,669 నుంచి రూ.44,669 వరకు ఉంటుంది. చదవండి: ChatGPT: యూజర్లకు భారీ షాక్.. చాట్ జీపీటీకి కొత్త చిక్కులు! -
తొలి ఆడబిడ్డ వచ్చిందన్న ఆనందం.. అంతలోనే ఊహించని విషాదం!
సాక్షి, చెన్నై: తమ కుటుంబంలోకి తొలి ఆడబిడ్డ వచ్చిందన్న ఆనందంలో ఉన్న ఓ కుటుంబాన్ని ఏసీ రూపంలో మృత్యువు కబళించడంతో ఆ కుటుంబంలో విషాదం నింపింది. మనవరాలు పుట్టిన ఆనందంలో అతిగా మద్యం తాగి నిద్రకు ఉపక్రమించిన బిల్డర్ ఏసీలో షార్ట్‌సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్నిప్రమాదంలో సజీవ దహనం అయ్యాడు. వివరాల్లోకి వెళితే.. చెన్నై చూలైమేడు ఇలంగో అడిగల్ వీధికి చెందిన సురేష్ కుమార్(52) భవన నిర్మాణ సంస్థ నడుపుతున్నాడు. ఆయనతో పాటు ఇంట్లో కుమారుడు స్టీఫెన్ రాజ్, కోడలు సుజిత ఉన్నారు. కోడలు సుజిత బుధవారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. వడపళణిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఉన్న తల్లీబిడ్డను కుటుంబసభ్యులందరూ వెళ్లి పరామర్శించారు. ఇక సురేష్‌కుమార్ ఆనందానికి అవధులు లేవు. మనవరాలు పుట్టిన ఆనందంతో మిత్రులు, సహచరులకు ఫోన్లు చేసి మరీ చెప్పేశాడు. కుటుంబ సభ్యులందరూ ఆస్పత్రిలో ఉండడంతో బుధవారం రాత్రి ఒంటరిగా సురేష్‌కుమార్ ఇంటికి వెళ్లాడు. మిత్రులకు ఫోన్లు చేస్తూ, మనవరాలు పుట్టిన ఆనందంలో అతిగా మద్యం సేవించాడు. తన గదిలో ఏసీ సైతం వేసుకుని నిద్రకు ఉపక్రమించినట్టుంది. గురువారం వేకువజామున సురేష్‌కుమార్ ఇంటి పై అంతస్తు నుంచి పొగ రావడాన్ని ఇరుగు పొరుగు వారు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు తలుపులు పగలగొట్టిలోనికి వెళ్లారు. అప్పటికే అక్కడ సురేష్‌కుమార్ సజీవదహనమై పడి ఉండడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఆ గదిలో మద్యం బాటిళ్లు, సిగరేట్ ముక్కలు ఉండటాన్ని గుర్తించారు. ఏసీలో షార్ట్ సర్క్యూట్ జరిగి ఉండడంతో ఈ ప్రమాదం జరిగినట్టు నిర్ధారించారు. మనవరాలు పుట్టిన ఆనందంలో అతిగా మద్యం సేవించడంతో విద్యుదాఘాతం నుంచి తప్పించుకోలేక ఆయన ఆహుతై ఉంటాడని పోలీసులు పేర్కొంటున్నారు. చదవండి: ధరలు పైపైకి.. ఆ ఇళ్లకు ఫుల్ డిమాండ్, అవే కావాలంటున్న ప్రజలు! -
కరెంటు అక్కర్లేని ఏసీ.. నిమిషాల్లో కూల్ అయ్యే బెడ్ షీట్లు
సాక్షి, అమరావతి: మానవ విజ్ఞానం క్షణానికో సరికొత్త ఆవిష్కరణతో ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తూనే ఉంటోంది. ప్రస్తుతం విద్యుత్ యుగం నడుస్తోంది. మోటార్లు, స్కూటర్లు, ఏసీలు, మొబైళ్లు.. ఇలా ఒక్కటేమిటి ఎన్నో రకాల విద్యుత్‌తో పనిచేసే పరికరాలు మనుషులకు అందుబాటులో ఉన్నాయి. బొగ్గుతోనే ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. అయితే ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ కాలుష్యంపై ఆందోళన మొదలై కర్బన ఉద్గారాలను తగ్గించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఫలితంగా పునరుత్పాదక ఇంధన వనరులపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. అయితే సౌర, పవన, జల విద్యుత్ ఉత్పత్తి కూడా ఖర్చుతో కూడుకున్నదే కావడంతో అసలు విద్యుత్ అవసరమే లేకుండా పనులు జరిగిపోతే ఎలా ఉంటుందనే ఆలోచన కొన్ని దేశాల్లో శాస్త్రవేత్తలను కొత్త ప్రయోగాలకు పురిగొల్పింది. దేశ, విదేశాల్లో వెలుగుచూస్తున్న అలాంటి సరికొత్త ఆవిష్కరణల్లో కొన్ని ఇవి. కూలింగ్ దుప్పట్లు మంచంపై వేసే దుప్పటి సరైనది కాకపోతే ఉక్కపోతకు గురికావాల్సి వస్తుంది. వెంటనే ఏసీ వేసుకోవాలనిపిస్తుంది. కానీ కరెంట్ లేకుండానే, ఏసీ వేయకుండానే మనల్ని అచ్చం ఏసీలా కూల్ చేసే బెడ్ షీట్లు ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ బెడ్‌షీట్‌ను చాలా తక్కువ ధరకు ఆన్లైన్, ఆఫ్లైన్లలో కొనుగోలు చేయవచ్చు. దీని ధర దాదాపు రూ.1,500. కొన్ని ఆన్లైన్ ఈ కామర్స్ వెబ్‌సైట్స్‌లో రూ. 699కే లభిస్తోంది. ఇది జెల్ టెక్నాలజీ ద్వారా పని చేస్తుంది. దీనిని ఉపయోగించిన నిమిషాల్లోనే మనకు చల్లదనాన్ని అందిస్తుంది. మురికిగా అయితే, దానిని పొడి గుడ్డతో సులువుగా శుభ్రం చేయవచ్చు. ఏసీ లేకుండానే ఇల్లు కూల్ విద్యుత్ బిల్లులకు భయపడి ఏసీలకు దూరంగా ఉండే సామాన్యుల కోసం గువహటి ఐఐటీ శాస్త్రవేత్తలు ఒక మార్గాన్ని కనిపెట్టారు. రేడియేటివ్ కూలర్ పూతను అభివృద్ధి చేశారు. దీనిని ఇంటి పైకప్పులకు వేస్తే కరెంటు అవసరం లేకుండా ఇంటి మొత్తానికీ చల్లదనం అందిస్తుందని వారు చెబుతున్నారు. ఇలాంటి విధానాలను ‘పాసివ్ రేడియేటివ్ కూలింగ్’ అని పిలుస్తున్నారు. పరిసరాల్లోని వేడిని గ్రహించి దానిని పరారుణ రేడియోధార్మికత రూపంలో వాతావరణంలోకి విడుదల చేసే సాంకేతికత ఇందులో ఉంటుంది. ఈ రేడియేటివ్ కూలర్ పూత కారణంగా ఇంట్లో ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గుతాయట. కరెంటు అక్కర్లేని ఏసీ ఎయిర్ కండిషనర్ (ఏసీ)ని ప్రస్తుతం నాలుగు గోడల మధ్య వినియోగిస్తున్నాం. బహిరంగ ప్రదేశాల్లో వినియోగించేందుకు టవర్ కూలర్లు ఉన్నప్పటికీ వాటికి చాలా విద్యుత్ అవసరం. ఆరుబయట విద్యుత్ అవసరం లేకుండా ఏసీ పెట్టుకుని పరిసరాలను చల్లగా మార్చవచ్చంటోంది ఇజ్రాయెల్‌కు చెందిన కెన్షో కంపెనీ. ఈ కంపెనీ లిక్విడ్ నైట్రోజన్ ఆధారంగా పనిచేసే ఏసీని అభివృద్ధి చేసింది. ఏసీలోని ప్రామాణిక ట్యాంకుల్లో ద్రవ నత్రజని –196 డిగ్రీల వద్ద ఫ్రీజ్ అయ్యి ఉంటుంది. ఇది గ్యాస్‌గా మారే క్రమంలో బలమైన ఒత్తిడిని కలగచేస్తుంది. ఆ ఒత్తిడితో ఈ ఏసీ పనిచేస్తుంది. దీంతో ఆ పరిసర ప్రాంతం పూర్తిగా చల్లబడుతుంది. ఈ ఏసీలకు ఇప్పటికే 40 దేశాల నుంచి ఆర్డర్లు వచ్చాయట. -
మండిపోతున్న ఎండలు.. అమ్మకాల్లో దుమ్మురేపుతున్న ఏసీలు
దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. భానుడి ప్రతాపానికి తాళలేక పోతున్నారు జనం. ఎన్నడూ లేనిది ఏప్రిల్‌లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో సూర్యుడి వేడి నుంచి తప్పించుకునేందుకు అవకాశం ఉన్న వారు ఎయిర్ కండీషనర్లు విరివిగా కొనుగోలు చేస్తున్నారు. దీంతో 2022 ఏప్రిల్‌లో ఏసీలు రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి. 2022 ఏప్రిల్‌లో ఎన్నడూ లేనంతగా 17.50 లక్షల ఏసీలు అమ్ముడైనట్టు కన్సుమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయన్సెస్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (సీమా) తెలిపింది. 2021 ఏడాదితో పోల్చితే అమ్మకాలు రెట్టింపు అయినట్టు వెల్లడించింది. జనాలందరూ ఇళ్లకే పరిమితమైన 2020తో పోల్చినా ఈ అమ్మకాలు ఎక్కువే నంటూ ప్రకటించింది. ఈ ఏడాది మొదటి నాలుగు నెలలకు సంబంధించి సీమా ముందుగా వేసుకున్న అంచనాల ప్రకారం దేశ వ్యాప్తంగా 85 లక్షల నుంచి 90 లక్షల ఏసీ యూనిట్లు అమ్ముడయ్యే అవకాశం ఉంది. కానీ మార్చి చివరి నుంచే ఎండలు మండిపోతుండటంతో ఏప్రిల్‌లో ఒక్కసారిగా అమ్మకాలు జోరుగా సాగాయి. దీంతో ఈ సీజన్ ముగిసే సరికి కోటికి పైగా ఏసీ యూనిట్లు అమ్ముడైపోయినా ఆశ్చర్యం లేదంటున్నారు. ఇప్పుడున్న డిమాండ్ కనుక మే, జూన్లలో కూడా కొనసాగితే మార్కెట్లో ఉన్న అన్ని ఏసీ యూనిట్లు అమ్ముడై అవుటాఫ్ స్టాక్ బోర్డు పెట్టుకోవాల్సి వస్తుంటున్నారు. మిగిలిన అన్ని విభాగాల మాదిరిగానే ఏసీలకు కూడా చిప్ సెట్ల కొరత, ఇతర ముడి పదార్థాల సరఫరా సమస్య ఎదురవులోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న డిమాండ్ తగ్గక పోతే ఏసీ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలు కూడా చేతులెత్తేసే పరిస్థితి ఉందని సీమా అంటోంది. గడిచిన రెండేళ్లలో ఏసీల ధరలు 15 శాతం మేర పెరిగినా డిమాండ్ ఏమాత్రం తగ్గకపోవడం ఎండల తీవ్రతకు అద్దం పడుతోంది. చదవండి: Summer Care: ఏసీ గదిలో ఎక్కువసేపు గడుపుతున్నారా.. జాగ్రత్త! -
ఏసీ గదిలో ఎక్కువసేపు గడుపుతున్నారా.. అయితే!
Summer Care- Health Tips In Telugu: ఇది ఎండాకాలం కాబట్టి మనం పని చేసే లేదా పడుకునే గదులలో ఏసీ లేదా కూలర్ వేసుకోవడం సర్వ సాధారణం. అయితే ఎక్కువసేపు ఏసీ గదిలో గడపడం వల్ల రకరకాల సమస్యలు తలెత్తుతుంటాయి. ఎందుకంటే ఏసీ మన గదిలో ఉన్న గాలిని చల్లబరచడం వల్ల వొంటికి చెమటలు పట్టక దాహం వేయదు. అందువల్ల నీళ్లు సరిగా తాగం. దీనివల్ల శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. అదేవిధంగా కొందరికి ఒక్క వేసవిలోనే కాదు, ఇతర కాలాల్లో కూడా ఏసీలోనే గడపడం అలవాటు. ఇలాంటివారు బయటికి వస్తే శరీరం కందిపోతుందేమో అన్నంత సుకుమారంగా ఉండి, ఎండలోకి రాలేరు. దీనిమూలంగా శరీరానికి ఎండ తగలక, డీ విటమిన్ అందదు. ఫలితంగా ఎముకలు దృఢంగా ఉండక ఫెళుసు బారిపోతుంటాయి. చదవండి: పిత్తాశయంలో రాళ్లెందుకు వస్తాయి? పరిష్కారాలేమిటి? -
అమ్మో! ఎండ వేడి...రికార్డు స్థాయిలో విద్యుత్ వాడకం.. ఇదే అత్యధికం
సాక్షి, హైదరాబాద్: ఎండలు మండుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువయ్యాయి. గ్రేటర్ జిల్లాల వాసులు ఉపశమనం కోసం ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఫలితంగా ఇంట్లోని కరెంట్ మీటరు గిరగిరా తిరుగుతోంది. కేవలం వ్యక్తిగత వినియోగం మాత్రమే కాదు గ్రేటర్ సగటు విద్యుత్ వినియోగం కూడా రికార్డు స్థాయిలో నమోదవుతోంది. తాజాగా శనివారం 64.5 మిలియన్ యూనిట్లకు చేరుకుంది. ఈ సీజన్లో ఇదే అత్యధికం. ఇప్పటికే డిస్కం గృహ విద్యుత్ వినియోగంపై యూనిట్‌కు 50 పైసలు, వాణిజ్య విద్యుత్ వినియోగంపై యూనిట్‌కు రూపాయి చొప్పున పెంచింది. ఏప్రిల్ నెల నుంచి పెంచిన బిల్లులను అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించింది. ఫీడర్లు, డీటీఆర్లపై ఒత్తిడి.. ►గ్రేటర్‌లోని మూడు జిల్లాల పరిధిలో తొమ్మిది సర్కిళ్లు ఉన్నాయి. వీటి పరిధిలో 55 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండగా, వీటిలో 45.50 లక్షలు గృహ, 7.30 లక్షల వాణిజ్య, 44 వేల పారిశ్రామిక, 1.40 లక్షల వ్యవసాయ, 45 వేల వీధి దీపాల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. 2019 మే 30న అత్యధికంగా 73.9 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం నమోదైంది. 2021 మే నెలలో అత్యధికంగా 68 ఎయూలు నమోదైంది. ►ఐటీ అనుబంధ రంగాలతో పాటు వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక సంస్థలన్నీ పూర్తి స్థాయిలో పని చేస్తున్నాయి. కేవలం గృహ విద్యుత్ విని యోగం మాత్రమే కాకుండా వాణిజ్య, పారిశ్రామిక వినియోగం కూడా రెట్టింపైంది. ఫలితంగా ప్రస్తుతం రోజు సగటు విద్యుత్ వినియోగం 60 యూనిట్లు దాటింది. ఏప్రిల్ చివరి నాటికి 75– 80 ఎంయూలకు చేరే అవకాశం లేకపోలేదు. చదవండి: హైదరాబాద్: మోస్ట్ వాంటెడ్ దొంగ.. ఆఖరికి ఓ చిన్న తప్పుతో.. -
మండిపోతున్న ఎండలు 50 శాతం డిస్కౌంట్‌తో వస్తున్న ఏసీలు ఇవే
మార్చి చివర్లోకి వచ్చామో లేదా భానుడి ప్రతాపం మొదలైంది. చూస్తుండగానే సుర్రుమనే ఎండలు పెరిగిపోయాయి. గదిలో తిరిగే ఫ్యాను ఉక్కపోత నుంచి ఉపశమనం ఇవ్వలేపోతుంది. ఎయిర్ కండీషన్‌కి వెళ్ధామంటే సీజన్ ప్రారంభం కావడంతో ధరలు భగ్గుమంటున్నాయి. అయితే అమెజాన్‌లో యాభై శాతం ఆఫర్‌తో అందుబాటులో ఉన్న స్మార్ట్ ఏసీల వివరాలు మీ కోసం.. Lloyd 1.5 Ton 3 Star, Wi-Fi, Inverter Split AC - లాయిడ్ 1.5 టన్ 3 స్టార్ ఏసీ 2021 సీజన్లో మార్కెట్లో వచ్చినప్పడు ధర రూ.65,999లు కానీ ప్రస్తుతం అమెజాన్‌లో 50 శాతం ఆఫర్‌తో రూ.32,.999కే లభిస్తోంది. అంతేకాదు పలు బ్యాంకుల క్రెడిట్ కార్డులపై క్యాష్‌బ్యాక్ ఆఫర్లు కూడా అందిస్తోంది. ఈ ఏసీకి సంబంధించిన ఫీచర్లు పరిశీలిస్తే కాపర్ కంప్రెసర్, వైఫై ఏనేబుల్, ఆటోమేటిక్ హ్యుమిడిటీ కంట్రోల్, యాంటీ వైరల్, హెపా ఫిల్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఎనర్జీ ఎఫిషియెన్సీలో 3 స్టార్ రేటింగ్ ఉంది. ప్రొడక్టు మీద ఏడాది, కంప్రెసర్ మీద పదేళ్ల వ్యారంటీ ఉంది. TCL 1.5 Ton 5 Star - టీసీఎల్ 1.5 టన్ ఏసీ 2021 మోడల్ ఏసీ ప్రారంభ ధర రూ.50,999లు ఉండగా ప్రస్తుతం 37 శాతం డిస్కౌంట్‌తో రూ. 31,999 దగ్గర అమెజాన్‌లో లభిస్తోంది. పలు క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ ద్వారా మరికొంత తగ్గింపు లభిస్తుంది. టీసీఎల్ 1.5 టన్ ఏసీలో కాపర్ కంప్రెషర్, విటమిన్ సీ, సిల్వర్ ఐయాన్ ఫిల్టర్, వైఫై, ఆల్ట్రా ఇన్వెర్టర్, గూగుల్ అసిస్టెంట్, స్మార్ట్ ఏసీ తదితర ఫీచర్లు ఉన్నాయి. ఎనర్జీ ఎఫిషియేన్సిలో 5 స్టార్ రేటింగ్ కలదు. కేవలం 30 సెకన్లలో గది ఉష్ణోగ్రతను 27 సెల్సియస్ డిగ్రీల నుంచి 18 సెల్సియస్ డిగ్రీలకు తెస్తుందని టీసీఎస్ చెబుతోంది Whirlpool 1 Ton 3 Star - వర్ల్‌పూల్ 1 టన్ ఏసీ మార్కెట్లోకి వచ్చినప్పుడు ధర రూ. 58,300లు ఉండగా ప్రస్తుతం 44 శాతం డిస్కౌంట్‌తో 25,810లకే వస్తోంది. ఈ ఏసీకి ఫీచర్లు పరిశీలిస్తే.. కాపర్ కంప్రెషర్, ఆల్ట్రా ఎన్ఎక్స్టీ వైఫై, కాపర్ ఇన్వెర్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఎనర్జీకిలో 3 స్టార్ రేటింగ్ ఉంది. LG 1.5 Ton 5 Star AI DUAL Inverter - ఎల్జీ 1.5 టన్ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ డ్యూయల్ ఇన్వర్టర్ ఏసీ మార్కెట్లోకి వచ్చినప్పుడు ధర రూ.58,490 ఉండగా ఇప్పుడు 20 శాతం డిస్కౌంట్‌తో రూ.46,590కే లభిస్తోంది. ఇందులో అధునాతమైన ఫీచర్లను ఎల్జీ పొందు పరిచింది. వాటిని పరిశీలిస్తే టచ్ ఫ్రీ ఆపరేషన్, ఆరు కూలింగ్ ఫీచర్లు, 6 స్టెప్ ఎనర్జీ కంట్రోల్, కంట్రోల్ ఏసీ ఎనీటైం, ఎనీవేర్, యాంటీ వైరస్ ప్రొటెక్షన్ తదితర ఫీచర్లు ఉన్నాయి. పవర్ సేవింగ్‌లో 5 స్టార్ రేటింగ్ ఉంది. LG 1.0 Ton 5 Star DUAL Inverter Wi-Fi Window AC - ఇక స్మార్ట్ విండో ఏసీలకు సంబంధించి ఎల్జీ వన్ టన్ ఆర్టిఫిషియల్ డ్యూయల్ ఇన్వర్టర్ ఏసీపై ఏకంగా 49 శాతం తగ్గింపు ఉంది. ఈ ఏసీ ఎంఆర్పీ రూ.56,999 ఉండగా అమెజాన్‌లో రూ.27,810కే లభిస్తోంది. తక్కువ శబ్ధంతో పని చేసే ఈ ఏసీ 5 స్టార్ రేటింగ్‌తో అందుబాటులో ఉంది. విండో ఏసీల్లో స్మార్ట్ ఫీచర్లు దీని ప్రత్యేకత. -
కూల్ కావాలంటే పర్స్ ఖాళీనే
న్యూఢిల్లీ: నూతన సంవత్సరం తొలి రోజుల్లోనే ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లు మొదలైన వినియోగ ఉత్పత్తుల రేట్లు.. కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్నాయి. ముడి వస్తువుల వ్యయాలు, రవాణా చార్జీలు పెరిగిపోవడంతో కంపెనీలు ఆ భారాన్ని కొనుగోలుదారులకు బదలాయిస్తున్నాయి. ఈ నెలాఖరులో లేదా మార్చి ఆఖరు నాటికి ఫ్రిజ్‌లు, ఏసీలు, వాషింగ్ మెషీన్లు వంటి ఉత్పత్తుల రేట్లు 5–10 శాతం మేర పెంచబోతున్నాయి. పానసోనిక్, ఎల్జీ, హయర్ వంటి సంస్థలు ఇప్పటికే పెంచగా.. సోనీ, హిటాచీ, గోద్రెజ్ అప్లయెన్సెస్ మొదలైనవి ఈ త్రైమాసికం ఆఖరు నాటికి నిర్ణయం తీసుకోనున్నాయి. కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయెన్సెస్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (సీఈఏఎంఏ) నివేదిక ప్రకారం జనవరి–మార్చి వ్యవధిలో ధరలు 5–7 శాతం మేర పెరగనున్నాయి. ‘కమోడిటీల ధరలు, అంతర్జాతీయంగా రవాణా, ముడి వస్తువుల రేట్లు అసాధారణంగా పెరిగిపోవడంతో ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు వంటి ఉత్పత్తుల రేట్లను 3–5 శాతం పెంచేందుకు మేము చర్యలు తీసుకున్నాం‘ అని హయర్ అప్లయెన్సెస్ ఇండియా ప్రెసిడెంట్ సతీష్ ఎన్ఎస్ తెలిపారు. ఏసీల రేట్లు ఇప్పటికే 8 శాతం వరకూ పెంచిన పానసోనిక్ .. ధరలను మరింత పెంచే యోచనలో ఉంది. ఇతర గృహోపకరణాల రేట్లను పెంచే అంశం పరిశీలిస్తోంది. ‘ఏసీల రేట్లు 8 శాతం వరకూ పెరిగాయి. కమోడిటీల వ్యయాలు, సరఫరా వ్యవస్థ పరిస్థితులు బట్టి ఇవి మరింత పెరగవచ్చు. సమీప భవిష్యత్తులో గృహోపకరణాల రేట్ల పైనా ప్రభావం పడే అవకాశం ఉంది‘ అని పానసోనిక్ ఇండియా డివిజనల్ డైరెక్టర్ ఫుమియాసు ఫ్యుజిమోరి తెలిపారు. దేశీ గృహోపకరణాలు, కన్జూమర్ డ్యూరబుల్ పరిశ్రమ పరిమాణం రూ. 75,000 కోట్ల స్థాయిలో ఉంటుందని అంచనా. పండుగ సీజన్లో వాయిదా.. పండుగల సీజన్ కావడంతో రేట్ల పెంపును కంపెనీలు వాయిదా వేస్తూ వచ్చాయని సీఈఏఎంఏ ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగాంజా తెలిపారు. ‘అయితే, ప్రస్తుతం భారాన్ని కస్టమర్లకు బదలాయించడం తప్ప తయారీ సంస్థలకు వేరే మార్గం లేకుండా పోయింది. జనవరి నుంచి మార్చి మధ్యకాలంలో ధరల పెంపు 5–7 శాతం మేర ఉండొచ్చని అంచనా వేస్తున్నాం‘ అని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే కొన్ని సంస్థలు రేట్లు పెంచేయగా మరికొన్ని దానికి సంబంధించిన ప్రక్రియలో ఉన్నందున పెంపు పరిమాణం వివిధ రకాలుగా ఉండొచ్చని బ్రగాంజా చెప్పారు. అయితే, డిమాండ్ మందగించినా, ముడి వస్తువుల ధరలు తగ్గినా .. ఏప్రిల్ లేదా మే లో రేట్లు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్నారు. సోనీ ఇండియా, గోద్రెజ్ అప్లయెన్సెస్ వంటి సంస్థలు రేట్ల పెంపుపై తాము ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నాయి. వివిధ రకాల ఉత్పత్తుల ధరలు ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు త్రైమాసికంలో పెరిగే అవకాశాలు ఉన్నాయని థామ్సన్, కోడక్ వంటి బ్రాండ్ల తయారీ సంస్థ సూపర్ ప్లాస్ట్రోనిక్స్ (ఎస్పీపీఎల్) సీఈవో అవ్నీత్ సింగ్ మార్వా తెలిపారు. మార్కెట్ పరిస్థితులను పరిశీలిస్తున్నామని, తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై వచ్చే నెలలో నిర్ణయం తీసుకుంటామని వీడియోటెక్స్ ఇంటర్నేషనల్ (దైవా, షింకో తదితర బ్రాండ్స్ తయారీ సంస్థ) తెలిపింది. తప్పని పరిస్థితి.. ధరల భారాన్ని వీలైనంత వరకూ తామే భరించేందుకు అన్ని ప్రయత్నాలూ చేశామని, కానీ వ్యాపారం నిలదొక్కుకునేందుకు పెంపు తప్పటం లేదని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ దీపక్ పన్నసల్ తెలిపారు. రేట్ల పెంపు తప్పదని జాన్సన్ కంట్రోల్స్–హిటాచీ ఎయిర్ కండీషనింగ్ ఇండియా సీఎండీ గుర్మీత్ సింగ్ తెలిపారు. ముడివస్తువులు, పన్నులు, రవాణా వ్యయాలు మొదలైనవి పెరిగిపోవడం వల్ల ఏప్రిల్ నాటికి బ్రాండ్లు దాదాపు 10% వరకూ ధరలు పెంచవచ్చని ఆయన పేర్కొన్నారు. ‘ఏప్రిల్ వరకూ దశలవారీగా ధరల పెంపు కనీసం 8–10% మేర ఉండవచ్చు. గతేడాది కూడా ఇదే విధంగా 6–7% వరకూ పెరిగాయి. ముడి వస్తువుల ధరలు పెరిగిపోవడం, అల్యూమినియం .. రిఫ్రిజిరెంట్స్ వంటివాటిపై యాంటీ డంపింగ్ సుంకాల విధింపుతో రేట్లు మరో 2–3 శాతం పెరగవచ్చు‘ అని సింగ్ వివరించారు. -
కొత్త ఏడాదిలో ఏసీ, ఫ్రిజ్, టీవీ కొనేవారికి భారీ షాక్..!
కొత్త ఏడాదిలో మీరు కొత్తగా ఏసీ, ఫ్రిజ్, టీవీ వంటి గృహోపకరణ వస్తువులు కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు షాకింగ్ న్యూస్. ఈ కొత్త ఏడాదిలో ఎయిర్ కండీషనర్స్, టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్లు వంటి గృహోపకరణాల ధరలు సుమారు 5 శాతం నుంచి 10 శాతం వరకు పెరగనున్నాయి. ముడిసరకుతో పాటు రవాణా ఛార్జీలు భారీగా పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని మార్కెట్ వర్గాలు తెలిపాయి. పెంచిన ధరలు ఈ నెల చివర నాటికి లేదా మార్చి నాటికి అమలులోకి రానున్నాయి. పానాసోనిక్, ఎల్జీ, హయర్ లాంటి కంపెనీలు ఇప్పటికే ధరలు పెంచే ఆలోచనలో ఉండగా.. సోనీ, హిటాచీ, గోడ్రెజ్ అప్లయన్సెస్ వంటి సంస్థలు కూడా ఈ త్రైమాసికం చివరకు నిర్ణయం తీసుకోనున్నాయి. కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయన్సెస్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్(సీఈఎఎమ్ఎ) ప్రకారం.. గృహోపకరణ తయారీ కంపెనీలు జనవరి లేదా మార్చి నెలలో 5-7 శాతం ధరలను పెంచే ఆలోచన చేస్తున్నాయి. "కమాడిటీలు, గ్లోబల్ ఫ్రైట్, ముడి పదార్థాల వ్యయం మునుపెన్నడూ లేని విధంగా పెరగడంతో రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషిన్లు, ఎయిర్ కండిషనర్ కేటగిరీల్లో ఉత్పత్తుల ధరలను పెంచడానికి మేము చర్యలు తీసుకున్నామని" హయర్ అప్లయన్సెస్ ఇండియా ప్రెసిడెంట్ సతీష్ ఎన్ఎస్ తెలిపారు. ఇప్పటికే ఎసీల ధరలను 8 శాతం వరకు పెంచిన పానాసోనిక్ మరోసారి పెంచాలని చూస్తుంది. మిగిలిన వాటి ధరలను మరింత పెంచాలని యోచిస్తున్నట్లు ఆ సంస్థ ఇండియా డివిజనల్ డైరెక్టర్ ఫుమియాసు ఫుజిమోరి అన్నారు. ముడిసరకుల, లాజిస్టిక్స్ ఖర్చులు ఎగబాకిన దృష్ట్యా గృహోపకరణాల ధరలను పెంచినట్లు దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు తయారీ సంస్థ ఎల్జీ తెలిపింది. (చదవండి: బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఇదే సువర్ణావకాశం..!) -
టీడీపీ నేతపై కేసు: ఏసీలు కొన్నాడు.. రుణం తీర్చనన్నాడు!
సాక్షి, చిత్తూరు: ఓ ఫైనాన్స్ సంస్థ రుణంతో ఏసీలు కొని, బకాయిలు కట్టనందుకు టీడీపీ మండల అధికార ప్రతినిధి హేమాద్రినాయుడుపై కేసు నమోదు చేసినట్లు గుడిపాల ఎస్ఐ రాజశేఖర్ ఆదివారం తెలిపారు. ఎస్ఐ కథనం మేరకు.. రామభద్రాపురం గ్రామానికి చెందిన హేమాద్రినాయుడు అతని భార్య హరిణి పేరున బజాజ్‌ఫైనాన్స్‌లో 2020 జనవరి 8వ తేదీన రెండు ఏసీలు కొన్నారు. రెండు ఏసీలకు గాను రూ.1,04 లక్షలు కట్టాల్సి ఉంది. ఇందులో రూ.34,660 డౌన్ పేమెంట్ కింద బజాజ్‌ఫైనాన్స్‌కు కట్టారు. మిగిలిన మొత్తం బజాజ్ ఫైనాన్స్ సంస్థ రుణంతో, చిత్తూరులోని రిలైన్స్ మార్ట్‌లో రెండు ఏసీలను కొనుగోలు చేశారు. ఇందుకు గాను ప్రతినెలా రూ.8,700 ఈఎంఐ కట్టాల్సి ఉంది. సెప్టెంబర్ నెలకు ఈఎంఐ కట్టలేదు. ఇందుకుగాను చిత్తూరులోని కొంగారెడ్డిపల్లెలో ఉన్న బజాజ్ ఫైనాన్స్ మేనేజర్ సురేష్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయకపోవడంతో ఆదివారం రామభద్రాపురంలోని హేమాద్రినాయుడు ఇంటికి కలెక్షన్ ఏజెంట్ పద్మనాభన్‌తో పాటు వచ్చారు. దీంతో ఆగ్రహించిన హేమాద్రినాయుడు తన ఇంటికి రావడానికి నీకు ఎంత ధైర్యం..రా అంటూ అతన్ని దుర్భాషలాడుతూ అతనిపై చేయి చేసుకొన్నారు. ‘గుడిపాల మండలం తెలుగుదేశం నాయకుడ్ని నేను, ఫోన్ చేస్తే 200 మంది ఇప్పుడే వస్తారు, నీ కథ తెలుస్తా.’ అంటూ భయబ్రాంతులకు గురిచేశాడు. దీంతో సురేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. గుడిపాల మండలం రామభద్రాపురం పంచాయతీ సర్పంచ్‌గా హేమాద్రినాయుడు భార్య హరిణి ప్రస్తుతం పనిచేస్తున్నారు. -
ఏసీల హబ్‌గా భారత్.. కీలకంగా మారనున్న ఏపీలోని శ్రీసిటీ
న్యూఢిల్లీ: ఏసీల తయారీకి సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు (పీఎల్ఐ పథకం) దేశీయ కంపెనీలకు తగినన్ని అవకాశాలు కల్పిస్తాయని.. అంతర్జాతీయంగా పోటీపడే సత్తా సమకూరుతుందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తులను తయారు చేసే అవకాశం దేశీయ కంపెనీలకు లభిస్తుందని డైకిన్, వోల్టాస్, బ్లూస్టార్, ప్యానాసోనిక్ కంపెనీలు పేర్కొన్నాయి. ప్రభుత్వ ఆమోదం గత బుధవారం కేంద్ర ప్రభుత్వం వైట్‌గూడ్స్(ఏసీలు, ఏసీల విడిభాగాలు)కు సంబంధించి 42 దరఖాస్తులను పీఎల్ఐ పథకం కింద ఆమోదించడం గమనార్హం. ఇందులో 26 దరఖాస్తులు ఏసీల తయారీకి సంబధించినవి ఉన్నాయి. ఈ కంపెనీలు రూ.3,898 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. ఇందులో భాగంగా పలు కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీ ప్రత్యేక ఆర్థిక మండలిలో పెట్టుబడులు పెట్టనున్నాయి. ఏపీలో డైకిన్, బ్లూస్టార్ ప్రాజెక్టులు తాజాగా ప్రభుత్వ ఆమోదం పొందిన దరఖాస్తుల్లో డైకిన్ ఇండస్ట్రీస్ ఇండియా (జపాన్ కంపెనీ) ఒక్కటే రూ.539 కోట్లను ఇన్వెస్ట్ చేయనుంది. ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీ సెజ్‌లో 75 ఎకరాల గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తోంది. కంప్రెషర్లు, హీట్ ఎక్సే్ఛంజర్లు, షీట్‌మెటల్ కాంపోనెంట్స్, ప్లాస్టిక్ మౌల్డింగ్ కాంపోనెంట్స్‌ను డైకిన్ తయారు చేయనుంది. ‘మేము ఈ స్థాయిలో పెట్టుబడులు పెడుతున్నది కేవలం భారత మార్కెట్ కోసమే కాదు. పెద్ద ఎత్తున ఎగుమతులు చేయాలని అనుకుంటున్నాం. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం ఎంతో సానుకూలంగా ఉంది’ అని డైకిన్ ఇండియా చైర్మన్, ఎండీ కేజే జావా పేర్కొన్నారు. ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాలకు తయారీ కేంద్రంగా భారత్‌ను చేసుకోవాలనుకుంటున్నట్టు చెప్పారు. ‘‘చైనా వన్‌ప్లస్ నమూనాపై దృష్టి పెట్టాం. కరోనా తర్వాత చైనా పట్ల వ్యతిరేకతను అవకాశంగా మలుచుకోవాలనుకుంటున్నాం. శ్రీసిటీలో ఏర్పాటు చేస్తున్న మా మూడో ప్లాంట్ కోసం 75 ఎకరాల భూమిని తీసుకున్నాం’’ అని జావా చెప్పారు. శ్రీ సిటీలోనే బ్లూస్టార్ ప్రాజెక్టు కూడా త్వరలో రానుంది. పీఎల్ఐ కింద హీట్ ఎక్సేంజర్లు, షీట్ మెటల్ కాంపోనెంట్లను శ్రీసీటీలో ఏర్పాటు చేస్తున్న కేంద్రంలో తయారు చేయనున్నట్టు బ్లూస్టార్ ఎండీ బి.త్యాగరాజన్ తెలిపారు. దేశంలో ఏసీల విడిభాగాల తయారీ వ్యవస్థ వచ్చే మూడేళ్లలో మంచి స్థితికి చేరుకుంటుందని అభిప్రాయపడ్డారు. వోల్టాస్ ఆత్మనిర్భర భారత్ డొమెస్టిక్ ఏసీల్లో మార్కెట్ లీడర్‌గా ఉన్న వోల్టాస్ సైతం క్రాస్ ఫ్లో ఫ్యాన్, హీట్ ఎక్సే్ఛంజర్లు, ప్లాస్టిక్ మౌల్డింగ్ కాంపోనెంట్స్ తయారీకి సంబంధించి పీఎల్ఐ కింద అర్హత సాధించింది. తమ తయారీ సదుపాయల ద్వారా దేశీయ తయారీ రంగానికి మరింత చేదోడుగా నిలవనున్నట్టు వోల్టాస్ ప్రకటించింది. ప్రభుత్వం ఆమోదించిన దరఖాస్తుల్లో డైకిన్ ఇండియా, అంబర్ ఎంటర్ప్రైజెస్, పీజీ టెక్నోప్లాస్ట్, హిందాల్కో ఇండస్ట్రీస్, మెట్యూబ్ ఇండియా, బ్లూస్టార్ క్లిమాటెక్, హావెల్స్, జాన్సస్ కంట్రోల్ హిటాచీ ఎయిర్ కండీషనింగ్, వోల్టాస్, ఐఎఫ్బీ ఇండస్ట్రీస్, డిక్సన్ డివైజెస్, ప్యానాసోనిక్ ఇండియా, సిస్కా ఎల్ఈడీ లైట్స్, హేయర్ అప్లియన్సెస్ ఉన్నాయి. చదవండి :అయ్యగారికి దండం పెట్టు.. క్యూఆర్ కోడ్‌కి డబ్బులు కొట్టు... -
ఏపీలో డైకిన్ భారీ యూనిట్
సాక్షి, అమరావతి/చిత్తూరు: ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్పత్తి ఆథారిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐఎస్–ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్) కింద ఆంధ్రప్రదేశ్‌లో భారీ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేయడానికి జపాన్ ముందుకొచ్చింది. ఆ దేశానికి చెందిన డైకిన్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ డైకిన్ ఎయిర్ కండిషనింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రాష్ట్రంలో ఎయిర్ కండిషనింగ్, విడిభాగాల తయారీ యూనిట్ ఏర్పాటుకు నిర్ణయించింది. చిత్తూరు జిల్లా తిరుపతికి సమీపంలోని పారిశ్రామికవాడ శ్రీసిటీలో 75.5 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.1,000 కోట్ల పెట్టుబడితో ఈ యూనిట్ ఏర్పాటుకానుంది. ఈ మేరకు అక్కడ భూమి కొనుగోలుకు సంబంధించి రెండింటి మధ్య ఒప్పందం కుదిరినట్లు శుక్రవారం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. శ్రీసిటీలో జరిగిన కార్యక్రమంలో డైకిన్ ఇండియా ఎండీ, సీఈఓ కన్వల్జీత్ జావాతోపాటు శ్రీసిటీ వ్యవస్థాపక మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ఒప్పంద పత్రాలపై శుక్రవారం సంతకాలు చేశారు. చదవండి: చక్కగా సంరక్షిస్తే ‘దత్తత’కు ఓకే శ్రీసిటీలో డైకిన్ పరిశ్రమ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంటున్న పరిశ్రమ ప్రతినిధులు మూడువేల మందికి ఉపాధి ఈ యూనిట్ ద్వారా సుమారు 3,000 మందికి ఉపాధి లభిస్తుందని, 2023 నాటికి ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు డైకిన్ తెలిపింది. దిగుమతులను తగ్గించి స్వయం సంవృద్ధి సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం 13 రంగాలకు పీఎల్ఐ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద రాష్ట్రానికి వచ్చిన తొలి కంపెనీగా డైకిన్ రికార్డు సృష్టించింది. మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర అధికారులు పలు కంపెనీలతో చర్చలు జరుపుతున్నారు. ఇక్కడ నుంచి విదేశాలకు ఎగుమతి అపారమైన అవకాశాలున్న దేశీయ మార్కెట్‌పై ప్రత్యేక దృష్టిసారిస్తున్నట్లు కన్వల్జీత్ జావా తెలిపారు. ఇప్పటికీ 5–6 శాతం మంది మాత్రమే ఏసీ వినియోగిస్తుండడంవల్ల ఈ రంగం వేగంగా వృద్ధి చెందడానికి అవకాశాలున్నాయన్నారు. తక్కువ వ్యయంతో అత్యుత్తమ ఉత్పత్తుల కోసం దేశ ప్రజలు చూస్తున్నారని, ఆ దిశగా తాము కృషిచేస్తున్నామని.. ఇందుకోసం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్పై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నట్లు ఆయన తెలిపారు. అమెరికా, మధ్య ఆసియా దేశాల ఎగుమతులకు ఏపీ కీలకంగా ఉండటంతో దీన్ని ఆఫ్‌షోర్ డెలివరీ హబ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. రాష్ట్రంలో వ్యాపారానికి అనువైన వాతావరణంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో మౌలిక వసతులు, నైపుణ్య కలిగిన మానవ వనరులు ఉండటం కూడా తమకు కలిసొచ్చే అంశాలుగా కన్వల్జీత్ జావా పేర్కొన్నారు. శ్రీసిటీలో యూనిట్ ఏర్పాటులో పూర్తిగా సహకరించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దక్షిణాదిలో తొలి యూనిట్ ఇక దేశంలో ఇప్పటికే రెండు యూనిట్లు కలిగి ఉన్న డైకిన్.. దక్షిణాలో తొలి యూనిట్ ఏర్పాటుకు శ్రీ సిటీని ఎంచుకోవడం గర్వంగా ఉందని ఆ సంస్థ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి పేర్కొన్నారు. ఎయిర్ కండీషనింగ్, రిఫ్రిజిరేషన్ రంగంలో ప్రపంచ ఖ్యాతి పొందిన జపాన్ దిగ్గజ సంస్థ డైకిన్ గ్రూప్ శ్రీసిటీకి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ ఏడాది శ్రీ సిటీకి వచ్చిన అతిపెద్ద పెట్టుబడి ఇదని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో పెట్టుబడులు, వ్యాపారానికి కల్పిస్తున్న ప్రోత్సాహకాలు, అనువైన వాతావరణంతో అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయన్నారు. -
అదే జరిగితే ఏసీలు కనుమరుగు అయినట్లే!
గ్లోబల్ వార్మింగ్, పర్యావరణపు ప్రతికూల మార్పుల వల్ల.. వాతావరణంలో విపరీతమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీజన్‌తో సంబంధం లేకుండా అధిక వేడిమి సమస్య భూమిని పట్టి పీడిస్తోంది. ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం సమ్మర్‌తో సంబంధం లేకుండా ఎయిర్ కండిషనర్ల వాడకం మన దేశంలోనూ పెరిగిపోతోంది. ఈ క్రమంలో ఊరట ఇచ్చే వార్తను చెప్పారు సైంటిస్టులు. ఇండియానా(యూఎస్ స్టేట్స్)లోని పుర్డ్యూ యూనివర్సిటీ సైంటిస్టులు.. ప్రపంచంలోనే అత్యంత తెల్ల పెయింట్‌ను తయారు చేశారు. ఇది గనుక గోడలకు వేస్తే.. ఇంట్లో చల్లదనం కోసం కరెంట్‌ను కాల్చుకోవాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. అంతేకాదు ఫ్రియాన్ విడుదల తప్పి.. గ్లోబల్ వార్మింగ్ సమస్య కూడా నివారించొచ్చని అంటున్నారు. ప్రపంచంలోనే అత్యంత తెల్ల పెయింట్‌ను పుర్డ్యూ యూనివర్సిటీ సైంటిస్టులు రూపొందించారు. ఇది తాజాగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కింది కూడా. ఇది సూర్యకాంతికి రిఫ్లెక్షన్‌ను దూరం చేస్తుందని ప్రొఫెసర్ గ్జియూలిన్ రువాన్ చెప్తున్నారు. గ్లోబల్ వార్మింగ్‌పై ఫైట్.. గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించేదిశగా ఈ వైట్ పెయింట్ పరిశోధన కృషి చేయనుందని రువాన్ అంటున్నారు. అత్యంత తెల్లదనం కారణంగానే ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కిందని చెప్తున్నారాయన. ఈ పెయింట్‌ను గనుక వెయ్యి స్క్వేర్ ఫీట్ల మేర గోడకుగానీ, రూఫ్కుగానీ వేస్తే.. పది కిలోవాట్ల కరెంట్ అందించే చల్లదనాన్ని అందిస్తుందట. ఇది ఇళ్లలోని ఏసీలు అందించే చల్లదనం కంటే చాలా రెట్లు ఎక్కువని రువాన్ స్పష్టం చేశారు. తద్వారా ఎయిర్ కండిషనర్ల వాడకం తగ్గడంతో పాటు గ్లోబల్ వార్మింగ్ చాలావరకు తగ్గించినట్లే అవుతుందని అంటున్నారు. ఎలాగంటే.. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పెయింట్స్ చల్లదనానికి బదులు.. వేడిని కలగజేస్తాయి. తెల్ల పెయింట్స్ 80 నుంచి 90 శాతం సూర్యకాంతిని రిఫ్లెక్ట్స్ చేస్తాయి. ఎలాంటి చల్లదనాన్ని అందించవు. కానీ, పుర్డ్యూ సైంటిస్టులు రూపొందించిన వైట్ పెయింట్ మాత్రం రివర్స్‌లో అతిచల్లదనాన్ని అందిస్తాయి. కాస్మోటిక్స్‌లో ఉపయోగించే కెమికల్ కాంపౌండ్, అధిక గాఢత బేరియం సల్ఫేట్ కలిపి ఈ పెయింట్‌ను డెవలప్ చేశారట. ధర కూడా తక్కువగా ఉండి.. ఎక్కువకాలం చెక్కుచెదరకుండా ఉంటుంది. ఇది మార్కెట్లోకి రావడానికి కొంచెం టైం పట్టొచ్చు. ఒకవేళ ఈ పెయింట్ గనుక మార్కెట్లోకి వస్తే మాత్రం ఎయిర్ కండిషనర్స్ అమ్మకాలపై తీవ్ర ప్రభావం పడొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. చదవండి: సెల్‌ఫోన్ టవర్లు, కేబుళ్లు కనుమరుగు కానున్నాయా..! -
ఈ 'కూలింగ్ పేపర్' ఉంటే చాలు ఇంట్లో ఏసీ అక్కర్లేదు!
భూమి మీద రోజు రోజుకి భారీగా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోతున్నాయి. వేసవి కాలంలో ఈ ఉష్ణోగ్రతల నుంచి తప్పించుకోవడానికి ప్రతి ఒక్కరూ ఏసీ, కూలర్లు వారి ఇంట్లో వాడుతున్నారు. వీటి వల్ల విద్యుత్ వినియోగం భారీగా పెరగడంతో దీని ప్రభావం వాతావరణం మీద పడుతుంది. ఇలా ఏసీలు, కూలర్ల వల్ల డబ్బు వృదా కావడంతో పాటు వాతావరణం మీద తీవ్ర ప్రభావం పడుతుంది. అయితే, ఈ సమస్యకు చైనాకు చెందిన ఈస్ట్రన్ విశ్వవిద్యాలయంలో మెకానికల్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న యీ జెంగ్(Yi Zheng) పరిష్కారం కనుగొన్నారు. సంప్రదాయ కూలింగ్ వ్యవస్థలపై ఆధారపడకుండా భవనాలు, ఇతర వస్తువులను చల్లగా ఉంచడానికి ఉపయోగించే ఒక స్థిరమైన మెటీరియల్ ను రూపొందించారు. దీనిని యి జెంగ్ తన మెటీరియల్ ను "కూలింగ్ పేపర్" అని పిలుస్తారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో ఏదో ఒక రోజు ఈ కూలింగ్ పేపర్ అమార్చుకోవాలని తను ఆశిస్తున్నారు. ఈ "కూలింగ్ పేపర్" సూర్యుని నుంచి వచ్చే వేడిని గ్రహించుకొని తిరిగి పరావర్తనం చేస్తుంది. దీని వల్ల గది ఉష్ణోగ్రతలను 10 డిగ్రీల ఫారెన్ హీట్ వరకు తగ్గించవచ్చు అని ఆయన పేర్కొన్నారు. "కూలింగ్ పేపర్"కు ఎలాంటి విద్యుత్ అవసరం లేదు, దీనిని 100శాతం రీసైకిల్ చేయవచ్చు. ఈ కూలింగ్ పేపర్ రీసైకిల్ పేపర్ నుంచి తయారుచేశారు. ఇది మీ ఇంటిపై ఉన్నంతసేపు ఇంట్లోని ఉష్ణోగ్రతలు లాగేసుకుని ఎప్పుడూ చల్లగా ఉంచుతుంది. "కూలింగ్ పేపర్" ఎలా తయారు చేయాలి? ముందుగా న్యూస్‌ప్రింట్‌ను నానబెట్టాలి, బ్లెండర్లో ముక్కలు ముక్కలు చేసి తర్వాత నీటిని తీసేయాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో టెఫ్లాన్ తయారు చేసే పదార్థంను కలపాలి. కూలింగ్ పేపర్ లోపల ఉండే "సహజ ఫైబర్ల రంధ్రాల సూక్ష్మ నిర్మాణం" వేడిని శోషించుకొని ఇంటి నుంచి దూరంగా బదిలీ చేస్తుంది. ఆ తర్వాత అవసరం లేనప్పుడు కూలింగ్ పేపర్ తీసెసీ తర్వాత జెంగ్ కూలింగ్ పేపర్‌ను రీసైక్లింగ్ చేయడానికి కొత్త షీట్ ను రీమేక్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే, ఈ ప్రక్రియలో అది ఎటువంటి శీతలీకరణ శక్తిని కోల్పోలేదని కనుగొన్నాడు. "తను వచ్చిన ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోయినట్లు" జెంగ్ చెప్పాడు. బహుశా రీసైక్లింగ్ తర్వాత 10 శాతం, 20 శాతం నష్టం జరుగుతుందని అనుకున్నాడు, కానీ అలా ఏమి జరగలేదు. -
అమెజాన్‌లో రూ.96 వేల తోషిబా ఎయిర్ కండిషనర్ రూ.6 వేలకే!
అప్పుడప్పుడు ఈ-కామర్స్ కంపెనీలు ప్రత్యేక సేల్ పేరుతో చాలా తక్కువ ధరకే ప్రొడక్టులను సేల్ చేస్తుంటాయి. కానీ, ఈ సారి ఎటువంటి ఆఫర్ లేకున్నా అమెజాన్, ఈ కామర్స్ వెబ్ సైట్ సోమవారం రూ.96,700 తోషిబా ఎయిర్ కండిషనర్(ఎసీ)ను 94 శాతం డిస్కౌంట్ తో రూ.5900కు తీసుకొచ్చింది. అయితే, అమెజాన్‌లో తలెత్తిన చిన్న సాంకేతిక సమస్య కారణంగా రూ.5,900కు తోషిబా 2021 రేంజ్ స్ప్లిట్ సీస్టమ్ ఎసీని లిస్టింగ్ అయినట్లు తెలుస్తోంది. దీని అసలు ధర రూ.96,700, కొంత మంది కస్టమర్లు ఈ ఆఫర్ కింద దీన్ని కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. జూలై 5న అమెజాన్ లో ఈ ఎయిర్ కండిషనర్ అసలు ధర రూ.96,700పై రూ.90,800 డిస్కౌంట్ ఇస్తున్నట్లు కనిపించింది. ప్రస్తుతం అమెజాన్ అదే తోషిబా 1.8 టన్నుల 5-స్టార్ ఇన్వర్టర్ ఏసీని రూ.59,000కి లభిస్తుంది. దీని అసలు ధర కంటే 30 శాతం డిస్కౌంట్ తో ఇప్పుడు లభిస్తుంది. ఇన్వర్టర్ ఎసీ కొన్ని ప్రత్యేక ఫీచర్లలో యాంటీ బాక్టీరియల్ కోటింగ్, డస్ట్ ఫిల్టర్, డీహ్యూమిడిఫైయర్ ఉన్నాయి. తోషిబా ఎసీ కంప్రెసర్, పీసీబీలు, సెన్సార్లు, మోటార్స్, ఎలక్ట్రికల్ పార్టులపై 9 సంవత్సరాల అదనపు వారెంటీతో పాటు 1 సంవత్సరం అదనపు వారెంటీని కూడా లభిస్తుంది. ఎసీ 3.3 సీజనల్ ఎనర్జీ ఎఫిషియెన్సీ రేషియో(ఎస్ఈఆర్)ని కలిగి ఉంది. అమెజాన్ ఇలా తక్కువ ధరకే విలువైన ఉత్పత్తులను తీసుకొని రావడం ఇది మొదటిసారి కాదు. 2019 ప్రైమ్ డే సందర్భంగా ఈ కామర్స్ దిగ్గజం రూ.9 లక్షల విలువైన కెమెరా గేర్ ను రూ.6,500కు విక్రయించింది. ఒక్కసారిగా ఈ ఆఫర్ గురుంచి తెలుసుకోవడంతో దానిని కొనుగోలు చేయడానికి ప్రజలు ఎగబడ్డారు. ఈ లోపాన్ని గుర్తించిన అమెజాన్ ఆ ఆఫరా నిలిపివేసింది. జూలై 5న కూడా అమెజాన్‌లో తలెత్తిన చిన్న లోపం వల్ల రూ.59,000 లభించే ఏసీ రూ.5,900కి లభించింది. -
ఏసీ, రిఫ్రిజిరేటర్లకు ఫుల్ డీమాండ్
భారతదేశంలోని చాలా ప్రాంతాలలో ఈ సంవత్సరం సాధారణ స్థాయి కంటే ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ(ఐఎమ్‌డీ) పేర్కొనడంతో శీతలీకరణ పరికర తయారీదారులు ఏసీ, రిఫ్రిజిరేటర్లకు ఫుల్ డీమాండ్ ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే వాతావరణంతో పాటు పెరుగుతున్న కరోనా కేసులు, వర్క్ హోమ్ చేసే వారి సంఖ్య పెరుగుతుండటంతో దేశంలో ఏసీ, రిఫ్రిజిరేటర్ల డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. "గత 3-4 నెలలుగా ఎయిర్ కండీషనర్ల విభాగంలో 25 శాతం వృద్ధిని సాధించాము, ఇక ముందు కూడా ఇదే ధోరణి కొనసాగుతుందని ఆశిస్తున్నాము. ఈ ఏడాది క్యూ4 వరకు 100 శాతం కంటే ఎక్కువ వృద్ధిని నమోదు చేయాలనీ లక్ష్యంగా పెట్టుకున్నాము" అని పానాసోనిక్ ఇండియా ప్రెసిడెంట్ & సీఈఓ మనీష్ శర్మ పేర్కొన్నారు. ఈ డిమాండ్ ఎయిర్ కండిషనర్లు మాత్రమే పరిమితం కాకుండా పానాసోనిక్ రిఫ్రిజిరేటర్లలో 30 శాతం రికార్డు వృద్ధిని సాదించనున్నట్లు పేర్కొన్నారు. మునుపటి సంవత్సరాలకు భిన్నంగా ఈ ఏడాది దక్షిణ, పశ్చిమ రాష్ట్రాలలో అధిక డిమాండ్ ఉన్నట్లు వారు పేర్కొన్నారు. "ఈ వేసవి కాలంలో పట్టణ మినీ-మెట్రో నగరాలలో బ్రాండెడ్ గృహోపకరణాల వాడకం పెరిగే అవకాశం ఉన్నట్లు వారు పేర్కొన్నారు. మరి ముఖ్యంగా గ్రామీణ, టైర్ 2 & 3 నగరాల నుంచి డిమాండ్ పెరుగుతుంది" అని వోల్టాస్ ప్రతినిధి పేర్కొన్నారు. పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని పరికరాలను తయారు చేస్తున్నట్లు వోల్టాస్ పేర్కొంది. చదవండి: చౌక వడ్డీకే హోమ్ లోన్ ఇస్తున్న బ్యాంకులు ఇవే! -
ఏప్రిల్ 1 నుంచి వీటి ధరలు పైపైకి!
కొత్త ఆర్థిక సంవత్సరం రానే వచ్చేసింది. నేటి నుంచి పలు కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇవే కాకుండా పలు వస్తువుల ధరలు కూడా పెరగనున్నాయి. దీని వల్ల చాలా మందిపై ప్రతికూల ప్రభావం పడనుంది. నేటి నుంచి ధరలు పెరిగేవాటిలో టీవీ, ఏసీ, ఫ్రిజ్, కారు, బైక్ వంటివి ఉన్నాయి. అలాగే విమాన ప్రయాణ ఖర్చు కూడా పెరగనుంది. ఎలక్ట్రానిక్ ప్రొడక్టులు తయారు చేసే కంపెనీలు, వాహన కంపెనీలు ముడి పదార్థాల ధరల పెరగడం చేత ధరలను పెంచుతున్నట్లు పేర్కొన్నాయి. వాహనాలు వ్యాపారాలు వాహన ధరలను పెంచడంతో కార్లు, బైక్‌లు 2021 ఏప్రిల్ 1 నుంచి ఖరీదైనవిగా మారనున్నాయి. ధరలను పెంచుతున్నట్లు ఇప్పటికే మారుతి, నిస్సాన్ సంస్థలు ప్రకటించాయి. మొట్టమొదటి సారిగా భారతదేశంలో తన కార్లన్నింటినీ ధరలు పెంచుతున్నట్లు మారుతి సుజుకి ప్రకటించింది. అలాగే, ద్విచక్ర వాహనాల తయారీ సంస్థలు కూడా తమ ద్విచక్ర వాహనాల ధరలను పెంచుతున్నట్లు పేర్కొన్నారు. ప్రధానంగా హీరో స్కూటర్లు, బైక్‌ల ధరలు రూ.2,500 వరకు పెరిగే అవకాశం ఉంది. టీవీ 2021 ఏప్రిల్ 1 నుంచి టెలివిజన్ ధరలు పెరగనున్నాయి. గత ఎనిమిది నెలలుగా టీవీ రేట్లు క్రమంగా పెరుగుతున్నాయి. టీవీ తయారుదారులు టెలివిజన్ పరిశ్రమను పిఎల్ఐ ప్రణాళికల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ ఆకస్మిక పెరుగుదలకు ప్రధాన కారణం టీవీ ఉత్పత్తిలో వాడే ఓపెన్-సెల్ ప్యానెల్స్ ధర పెరగడమే. నేటి నుంచి టీవీ ధరలు యూనిట్‌కు కనీసం 2000-3000 రూపాయలు పెరిగే అవకాశం ఉంది. ఏసీ & రిఫ్రిజిరేటర్ ఎయిర్ కండీషనర్, రిఫ్రిజిరేటర్ కూడా ధర పెరిగే జాబితాలో ఉంది. తయారీ ఖర్చులు పెరగడం వల్ల ఎయిర్ కండీషనర్, రిఫ్రిజిరేటర్ ధర పెరుగుతుంది. ప్రతి ఎయిర్ కండీషనర్ ధర రూ.1500 నుంచి 2000 రూపాయలకు పెరగవచ్చు. కేవలం ఒక నెలలోనే ఓపెన్-సెల్ ప్యానెల్లు ప్రపంచ మార్కెట్లో ధర 35 శాతం పెరిగాయి. తత్పలితంగా ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు, కూలర్ల ధరలు పెరగనున్నాయి. విమాన ప్రయాణం దేశీయ విమానాల కనీస ఛార్జీలు 5 శాతం పెరుగుతాయి కాబట్టి విమానంలో ఇక ప్రయాణించడం కూడా ఖరీదైనదిగా మారనుంది. ఏప్రిల్ 1 నుంచి దేశీయ విమానయాన రక్షణ రుసుమును రూ.160 నుంచి రూ.200కు పెంచనున్నారు. అలాగే, అంతర్జాతీయ విమానాల రుసుము 5.2 డాలర్ల నుంచి 12 డాలర్లకు పెరగనుంది. దీనికి సంబంధించి డీజీసీఎ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. చదవండి: 17 రూపాయిలతో 116 కిలోమీటర్ల ప్రయాణం భారీగా పెరిగిన బంగారం ధరలు -
ఏసీ విషయంలో ఈ జాగ్రత్తలు పాటించండి
ఎయిర్ కండిషనర్స్‌తో ఆరోగ్యపరంగా కొన్ని ప్రయోజనాలతో పాటు కొన్ని నష్టాలు కూడా ఉంటాయి. వృత్తిరీత్యా ఏసీలో గడపాల్సి వచ్చి వాటి కారణంగా ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుంటే ఆ నష్టాలను తెలుసుకుని వాటి గురించి జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే వాటి నుంచి ఆశించే ప్రయోజనం ఉంటుంది. ఎయిర్ కండిషనర్‌తో ప్రయోజనాలివి... ► ఎయిర్ కండిషనర్ కారణంగా గది ఎప్పుడూ ఒకేలాంటి వాతావరణం లో ఉంటుంది. ఇలా ఉంచడం ద్వారా వాతావరణ మార్పుల వల్ల వచ్చే అనర్థాలూ, అనారోగ్యాల బారిన మనం పడకుండా చూస్తాయవి. ► కొన్ని అధునాతన ఎయిర్ కండిషనర్స్‌తో ఉండే కొన్ని ఫిల్టర్స్ చాలా సూక్ష్మస్థాయిలో ఉండే కాలుష్యాల (మైక్రోస్కోపిక్ పొల్యుటెంట్స్) నుంచి మనల్ని కాపాడతాయి. ► బయటి చప్పుళ్లు లోపలికి వినిపించనివ్వకుండా శబ్ద కాలుష్యం నుంచి ఎయిర్ కండిషనర్స్ మనల్ని కాపాడుతాయి. నష్టాలివి... ► పైన పేర్కొన్న ప్రయోజనాలిచ్చే ఇవే ఎయిర్‌కండిషనర్లతో కొన్ని నష్టాలూ ఉంటాయి. అవి... ► బయటి ఫ్రెష్ గాలులు చాలాకాలం పాటు సోకకుండా ఉన్నందున కొందరిలో ఏసీ కారణంగా కార్డియోవాస్కు్కలార్ సమస్యలు, శ్వాసకోశ సమస్యలైన ఆస్థమా, పిల్లికూతలు రావచ్చు. ► కొందరిలో ఏసీ వల్ల ఒకరకం నిమోనియా అయిన లెజియోన్నేరిస్ వంటి వ్యాధులూ రావచ్చు. ► కొందరిలో అదేపనిగా ఏసీలో ఉన్నవారు నీళ్లు తక్కువగా తాగుతూ ఉండటంతో కిడ్నీలో స్టోన్స్ ఏర్పడవచ్చు. ► కొందరిలో చర్మంపై దురదలు, తలనొప్పులు, అలసట వంటివి రావచ్చు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ► ఎప్పుడూ ఏసీలో ఉండేవారు అప్పుడప్పుడూ చల్లగాలికి వచ్చి ఫ్రెష్ ఎయిర్ తీసుకుంటూ ఉండాలి. దానికోసం వాతావరణంలో కాలుష్యం తక్కువగా ఉండే వేళల్లో (సాధారణంగా ఉదయం వేళల్లో) ఆరుబయటికి రావడం మంచిది. ► ఏసీలోని ఫిల్టర్స్ తరచూ శుభ్రపరుస్తూ ఉండాలి. ► ఏసీలోని ఫిల్టర్స్‌ను సబ్బుతో కడగాల్సి వచ్చినప్పుడు అవి పూర్తిగా ఆరిన తర్వాతే వాటిని బిగించాలి. ► ఏసీ కారణంగా ఆరోగ్యంపై దుష్ప్రభావాలు కనిపిస్తుంటే (అంటే ఏసీ సరిపడనివాళ్లు) వాటిని వీలైనంతగా అవాయిడ్ చేయాలి. లేదా తక్కువగా వాడాలి. చదవండి: అల్లు అర్జున్ మల్టీప్లెక్స్.. ఓపెనింగ్ ఎప్పుడంటే! డ్రగ్స్ కేసులో అరెస్టైన సంజన రహస్య పెళ్లి..ఫోటో వైరల్ -
కొత్త ఏసీ కొనాలనుకునే వారికి షాక్!
2021 ఏడాదిలో అన్ని వస్తువుల ధరలు పెరుగుతూ పోతున్నాయి. మొన్నటి దాక చమురు పెరిగితే, నిన్న గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. ఇప్పుడు మళ్లీ ఎయిర్ కండీషనర్ ధరలు పెరగనున్నాయి. అసలే ఇప్పటికే ఎండలు బాగా మండుతున్నాయి. చాలా మంది వర్క్ ఫ్రమ్ చేస్తున్న కారణంగా ఏసీలు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే ఇప్పుడు వారికి షాక్ తగిలింది. కంపెనీలూ 5 నుంచి 8 శాతం మేర ఏసీ ధరలు పెంచాలని చూస్తున్నాయి. ముడి పదార్థాల ధరలు పెరిగిపోవడం వల్ల కంపెనీలు వీటి ధరలు పెంచేందుకు సిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది. ఏసీ తయారీకి వినియోగించే లోహాలు, కంప్రెసర్ ధరలు పెరిగిన నేపథ్యంలో ఈ నెల నుంచి ఏసీల ధరలు 3 నుంచి 5 శాతం పెంచనున్నట్లు డైకిన్ తెలిపింది. అమ్మకాల మీద ధరల పెంపు ప్రభావం కొంతమేర మాత్రమే ఉంటుందని, వేసవి కాలంలో ఎక్కువ వేడి కారణంగా డిమాండ్ ఏమాత్రం తగ్గదని డైకిన్ ఇండియా ఎండీ, సీఈవో కన్వాల్ జీత్ జావా అంచనా వేశారు. ఉత్పత్తి వ్యయం పెరిగిన నేపథ్యంలో 6 నుంచి 8 శాతం ధరలు పెంచనున్నట్లు పానాసోనిక్ వెల్లడించింది. ప్రముఖ టాటా గ్రూప్ సంస్థ వోల్టాస్ ఇప్పటికే ఏసీ ధరలను పెంచింది. చదవండి: మస్క్, బెజోస్‌లను అధిగమించిన అదానీ! -
ఫ్లిప్‌కార్ట్ లో ఏసీ, ఫ్రిజ్ లపై సరికొత్త ఆఫర్స్
ఫ్లిప్‌కార్ట్ రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఫ్లిప్‌కార్ట్ కూలింగ్ డేస్ పేరుతో సరికొత్త సేల్ ను తీసుకొచ్చింది. ఈ సేల్ మార్చి 10 నుంచి 14 వరకు కొనసాగుతుంది. ఫ్లిప్‌కార్ట్ కూలింగ్ డేస్ సేల్ లో ఎయిర్ కండీషనర్, రిఫ్రిజిరేటర్లు, ఫ్యాన్స్, ఎయిర్ కూలర్లు, వాటర్ ప్యూరిఫైయర్లపై ప్రత్యేక ఆఫర్స్ ప్రకటించింది. శాంసంగ్, బ్లూస్టార్, హిటాచీ, ఎల్జీ, వోల్టాస్ లాంటి బ్రాండ్స్‌కు చెందిన ప్రొడక్ట్స్‌పై ఆఫర్స్ లభిస్తాయి. ఏసీ కొనాలనుకునేవారికి వాల్పూల్, మార్క్యూ, ఒనిడా లాంటి బ్రాండ్స్ నుంచి ప్రత్యేక డీల్స్ ఉన్నాయి. ఏసీ, ఇన్వర్టర్ ఏసీ, త్రీ స్టార్ ఏసీ, విండో ఏసీ లాంటి వేర్వేరు ప్రొడక్ట్స్‌పై ఆఫర్స్ ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డులతో కొంటే 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. 6 నెలల నుంచి 24 నెలల నోకాస్ట్ ఈఎంఐ ఆఫర్‌తో ఈ ప్రొడక్ట్స్ కొనొచ్చు. ఏసీ కొనాలనుకునేవారికి 0.8 నుంచి 1.5 టన్స్ వరకు అనేక ఆప్షన్స్ ఉన్నాయి. ఫ్యాన్స్ సెక్షన్లో వీటితో పాటు సీలింగ్ ఫ్యాన్స్, వాల్ ఫ్యాన్స్, టేబుల్ ఫ్యాన్స్‌పైనా ఆఫర్స్ ఉన్నాయి. చదవండి: ఇండియాలో పబ్జీ మళ్లీ రానుందా? బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్! -
సరికొత్త టెక్నాలజీతో హైయర్ అత్యాధునిక ఏసీ
సాక్షి, న్యూఢిల్లీ: చైనాకు చెందిన ఎలక్ట్రానిక్స్ కంపెనీ హైయర్ సెల్ఫ్ క్లీన్‌కూల్ టెక్నాలజీతో కూడిన ఏసీని భారత మార్కెట్లో విడుదల చేసింది. అన్ని కాలాల్లోనూ అనుకూలమైన ఏసీ ఉత్పత్తిగా కంపెనీ పేర్కొంది. 1.5 టన్ కెపాసీటీతో కూడిన ఈ హాట్ అండ్ కోల్డ్ 3 స్టార్ ఏసీ.. ట్రిపుల్ ఇన్వర్టర్ ప్లస్ టెక్నాలజీతో ఉంటుందని సంస్థ ప్రకటించింది. ఏసీ తనంతట తానే శుభ్రం చేసుకోవడంతోపాటు, గదిలో ఉష్ణోగ్రతను తగినట్టు కూలింగ్‌ను మార్చుకోవడం చేస్తుందని, 65 శాతం ఇంధనాన్ని ఆదా చేస్తుందని తెలిపింది. 60 డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ ఏసీ పనిచేస్తుందని ప్రకటించింది. మైక్రో డస్ట్ ఫిల్టర్‌తో కూడిన ఈ కొత్త క్లీన్‌కూల్ ఏసీ గాలి నుండి దుమ్ము, బ్యాక్టీరియా వైరస్‌ను తొలగిస్తుంది. తద్వారా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం నుండి వినియోగదారులను రక్షిస్తుందని కంపెనీ వెల్లడించింది. అంతేకాకుండా, బెస్ట్-ఇన్-క్లాస్ మోటారు, ఆప్టిమైజ్డ్ ఫ్యాన్ ఎయిర్ డక్ట్‌తో అమర్చబడి ఉంటుందనీ, ఇది 15 మీటర్ల వరకు గాలిని వీచేలా చేస్తుందని పేర్కొంది. ఈ ప్రత్యేక ఫీచర్ గదిలోని అన్ని మూలలను చాలా వేగంగా చల్లబరుస్తుందని చెప్పింది. -
ఏసీలు, ఫ్రిజ్‌లు కొనేవారికి షాక్!
న్యూఢిల్లీ: 2021-22 కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివిధ ఉత్పత్తుల్లో దిగుమతి చేసుకొనే వాడే విడి భాగాలపై కస్టమ్స్ డ్యూటీ పెంచేశారు. దిగుమతి చేసుకున్న విడి భాగాలపై కస్టమ్స్ సుంకం పెరగడం వల్ల రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, ఎల్ఈడీ లైట్లు, మొబైల్ ఫోన్లతో సహా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు పెరగనున్నాయి. రిఫ్రిజిరేటర్లు, ఏసీల్లో కీలకంగా వాడే కంప్రెషర్‌పై 2.5 శాతం, ఎలక్ట్రిక్ మోటార్లపై 10-15 శాతం కస్టమ్స్ డ్యూటీ పెంచారు. దేశీయ ఎలక్ట్రానిక్ తయారీ రంగం వేగంగా వృద్ధి చెందడానికి విదేశీ వస్తువుల దిగుమతిపై ప్రభుత్వం కస్టమ్ డ్యూటీని విధించిందని సీతారామన్ పేర్కొన్నారు. ప్రస్తుతం దేశీయ అవసరాలకు అనుగుణంగా 40 శాతం రిఫ్రిజిరేటర్లు, 20 శాతం ఎయిర్ కండీషనర్ల స్థానికంగా ఉత్పత్తి మాత్రమే జరుగుతున్నది.(చదవండి: గృహ కొనుగోలుదారులకు శుభవార్త!) తాజాగా కస్టమ్స్ సుంకం పెంచడంతో స్వల్పంగా ఒక శాతం అంటే రూ.100 నుంచి రూ.500 మధ్య ధరలు పెరుగనున్నాయి. ఈ పెంపు అనేది ఇండస్ట్రీపై ప్రతికూల ప్రభావం చూపనున్నట్లు కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లియెన్సెస్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (సీఈఏఎంఏ) అధ్యక్షుడు కమల్‌నంది పేర్కొన్నారు. రిఫ్రిజిరేటర్లపై 12.5 శాతం, ఏసీలపై 15 శాతం పన్ను విధించనున్నందున మొత్తం కంప్రెషర్ ధర 25-30 శాతం ఎక్కువవుతుందన్నారు. పానాసోనిక్ ఇండియా సీఈవో మనీశ్ శర్మ మాట్లాడుతూ.. కస్టమ్స్ సుంకం పెంపు ప్రభావం 0.6 శాతం ఉంటుందని చెప్పారు. రెండు పెద్ద కంపెనీలు కంప్రెషర్ తయారీకి ఉత్పాదక యూనిట్లు ప్రారంభించాయని, కానీ కరోనాతో అంతరాయం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ప్రస్తుతం ఈ ప్రాజెక్టుల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. -
ఏసీలు పేలి 17 మంది మృతి
ఢాకా: బంగ్లా రాజధాని శివార్లలోని మసీదులో ఆరు ఎయిర్‌కండీషనర్లు పేలడంతో 17మంది మరణించారు. అండర్‌గ్రౌండ్ గ్యాస్‌పైప్‌లో లీకేజ్ కారణంగా ఈ పేలుడు సంభవించి ఉండొచ్చని భావిస్తున్నారు. పేలుళ్లలో దాదాపు 20 మంది గాయపడ్డారని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. నారాయణ్‌గంజ్ పోర్టుటవున్‌లోని బైతుల్‌సలాత్ మసీద్‌లో శుక్రవారం ప్రార్ధనలకు భక్తులు సమవేశమయ్యారు. ఈ సమయంలో జరిగిన పేలుడులో చిన్నారితో సహా 11 మంది మృతి చెందారు. గాయపడినవారి పరిస్థితి విషమంగానే ఉందని, ఎక్కువమంది శరీరాలు దాదాపు 90 శాతం వరకు కాలిపోయాయని, సగంమందికి ఊపిరితిత్తుల మార్గంలో గాయాలయ్యాయని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రమాదం పట్ల ప్రధాని షేక్ హసీనా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు సరైన వైద్యసాయం అందించాలని ఆదేశించారు. మసీదు దిగువన టైటస్ కంపెనీకి చెందిన గ్యాస్ పైప్‌లైన్ ఉందని, దీనిలోంచి గ్యాస్ లీకై మసీదులో నిండి ఉండొచ్చని, ఇదే సమయంలో ఏసీ లేదా ఫ్యాన్ ఆన్ చేయడంతో ఒక్కసారిగా అంటుకొని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. గతంలోనే ఈ పైప్‌లైన్ లీకేజ్‌లపై మసీదు కమిటీ ఫిర్యాదు చేసింది. -
కరోనా: షాకింగ్ విషయాలు బయటపెట్టిన స్టడీ!
బీజింగ్: లాక్డౌన్ పటిష్ట అమలు, కోవిడ్ భయాలతో ఇళ్లకే పరిమితమైన ప్రజలకు చైనాకు చెందిన ఓ అధ్యయనం షాకింగ్ విషయాలు వెల్లడించింది. రెస్టారెంట్లలోని ఎయిర్ కండీషర్లతో కూడా కరోనా వ్యాప్తికి అవకాశాలు ఉన్నాయని ఆ అధ్యయనం తెలిపింది. అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్‌కు చెందిన ఎమర్జింగ్ ఇన్ఫెక్చువస్ డీసీజెస్ జర్నల్‌లో ఈ అధ్యయన వివరాలు ప్రచురితమయ్యాయి. ఒకే రెస్టారెంట్లో.. మూడు కుటుంబాలకు చెందిన 10 మంది కోవిడ్ పేషంట్లపై ఈ అధ్యయనం జరిగింది. వుహాన్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి చైనాలోని గ్వాంజౌ పట్టణంలో ఉన్న రెస్టారెంట్లో జనవరి 24న భోజనం చేశాడు. ఐదు అంతస్థులు ఉన్న ఆ రెస్టారెంట్లో ఎయిర్ కండీషనింగ్ వ్యవస్థ ఉంది. అయితే, వెంటిలేషన్ వ్యవస్థ పూర్తిస్థాయిలో లేదు. అతని పక్క టేబుళ్లపై మరో రెండు కుటుంబాలు కూడా లంచ్ చేశాయి. ఫిబ్రవరి 5న సదరు వ్యక్తికి జ్వరం, జలుబు వచ్చింది. అతనికి కోవిడ్ పరీక్షలు చేయగా పాజిటివ్ అని తేలింది. అతని పక్క టేబుళ్లపై భోజనం చేసిన ఇరు కుటుంబాల వారికి అదే రోజు కోవిడ్ లక్షణాలు బయటపడ్డాయి. అందరికీ పాజిటివ్ నిర్ధారణ అయింది. (చదవండి: వారి వేతనం ముందు ప్రధాని పే ప్యాకేజ్ దిగదుడుపే..) తుంపర్ల ద్వారానే.. కానీ కోవిడ్-19 వ్యాప్తికి ప్రధాన కారణం వైరస్ సోకిన వ్యక్తి నుంచి వెలువడిన తుంపర్లే. కోట్లాది వైరస్ క్రిములు ఉండే ఆ తుంపర్ల ద్వారానే కోవిడ్ ఇతరులకు సోకుతుంది. అయితే, బాధితుడు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు బయటికొచ్చే తుంపర్లు గాల్లో కొద్ది క్షణాలే ఉంటాయని, అవి ఎక్కువ దూరం ప్రయాణించలేవని స్టడీ స్పష్టం చేసింది. కానీ, ఏసీ ద్వారా గాలి వేగంగా పయనించినప్పుడు తుంపర్లు కొద్ది దూరం ముందుకు సాగి ఇతరులకు వైరస్ అంటించే అవకాశాలుంటాయని తెలిపింది. రెస్టారెంట్లలోనే ఇలా జరిగే అవకాశం ఎక్కువగా ఉందని, దానికోసం.. టేబుళ్ల మధ్య దూరం ఎక్కువగా ఉండేలా చూసుకోవడం.. తగిన విధంగా వెంటిలేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. ఏసీ గాలి ద్వారానే పైన తెలిపిన ఇరు కుంటుంబాల సభ్యులకు వైరస్ సోకినట్టు అంచనాకొచ్చినట్టు పేర్కొంది. (చదవండి: అమెజాన్‌లో కరోనా అలజడి) కాగా, గతేడాది డిసెంబర్లో చైనాలోని వుహాన్ నగరంలో పుట్టుకొచ్చిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. వైరస్ విజృంభణ ఫిబ్రవరి నెల నుంచి మరింత వృద్ధి చెంది దాదాపు అన్ని దేశాలకు పాకింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 20 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. లక్షా 28 వేలకు పైగా ప్రజలు మరణించారు. 4 లక్షల 92 వేల మంది కోలుకున్నారు. ఇక కోవిడ్ కట్టడికి కఠిన నిర్ణయాలు తీసుకోవడంతో చైనాలో కేసులు తగ్గుముఖం పట్టాయి. అక్కడ మొత్తం పాజిటివ్ కేసులు 82, 295 కాగా.. 3,342 మంది ప్రాణాలు విడిచారు. 77,816 మంది కోలుకున్నారు. -
సూపర్ ఎఫీషియంట్ ఏసీ : ఇంధనం ఆదా, తక్కువ ధర
సాక్షి, న్యూఢిల్లీ : తక్కువ విద్యుత్, అందుబాటులో ధరల్లో ఎల్ఈడీ ఉత్పత్తులను (ట్యూబ్ లైట్స్, బల్బులు, ఫాన్స్) పరిచయం చేసి విజయవంతమైన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) మరో కీలక ఆవిష్కరణకు నాంది పలికింది. పవర్ సేవ్, సూపర్ ఎఫిషియంట్ ఎయిర్ కండిషనర్(ఏసీ) లను ఢిల్లీలో నేడు (సోమవారం,జూలై 8) లాంచ్ చేసింది. మార్కెట్లో ప్రస్తుతం లభిస్తున్న ఏసీల ధరలతో పోలిస్తే…ఈ ఏసీలు 30 శాతం తక్కువ ధరకు లభ్యం. నాలుగు ప్రభుత్వ రంగ సంస్థల జాయింట్ వెంచర్ (రాజధాని పవర్ లిమిటెడ్, యమునా పవర్ లిమిటెడ్, టాటా పవర్ డీడీఎల్ ) అయితే ఈఈఎస్ఎల్ వీటిని ఆవిష్కరించింది. మొదటి దశలో 50వేల ఏసీలను ఢిల్లీలోని వినియోగదారులకు అందుబాటులో ఉంచింది. వీటి ధరను రూ. 41,300 గా నిర్ణయించింది. తాము లాంచ్ చేసిన కొత్త ఏసీల ద్వారా 50 శాతం విద్యుత్తు ఆదా అవుతుందని కంపెనీ చెబుతోంది.1.5 టన్నుల ఇన్వర్టర్ స్ప్లిట్ ఎసిలు 5.4 శక్తి సామర్థ్య రేటింగ్ కలిగి ఉన్నాయని, ప్రస్తుతమున్న బీఇ 5 స్టార్ రేటెడ్ ఎసిల కంటే 20 శాతం ఎక్కువ సామర్థ్యం వీటి సొంతమని ప్రకటించింది. 4.5 సామర్థ్యం కలిగిన ఫైవ్ స్టార్ రేటెడ్ ఏసీ 1155 వాట్ల వద్ద పనిచేస్తుంది. కానీ తమ ఏసీలు కేవలం 960 వాట్ల వద్ద అదే పనితీరును కనబరుస్తాయని తెలిపింది. తద్వారా సగటున ఏడాదికి 300 యూనిట్లు లేదా 2400 రూపాయలు ఆదా అవుతుందని పేర్కొంది. అలాగే మార్కెట్లో ప్రస్తుతం లభిస్తున్న త్రీ స్టార్ ఏసీలతో పోలిస్తే ఏడాదికి 4వేల రూపాయలు పొదుపు చేయవచ్చని తెలిపింది. ముఖ్యంగా గ్లోబల్ వార్మింగ్ ముప్పును ఎదుర్కొనే చర్యల్లో భాగంగా ఈ సూపర్ ఎఫెక్టివ్ ఏసీలను తీసుకొచ్చామని ఈఈఎస్ఎల్ ఎండీ సౌరభ్ కుమార్ తెలిపారు. భారతదేశానికి ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఎంపికల కంటే చాలా స్థిరమైన, సరసమైన శీతలీకరణ అవసరం. ఈ లక్ష్యాన్ని సూపర్ ఎఫిషియంట్ ఎయిర్ కండిషనర్లు తీర్చనున్నాయన్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి మొత్తం స్టాక్ హాట్ సేల్ పూర్తి కానుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. తరువాతి సీజన్ నాటికి దేశ వ్యాప్తంగా 2లక్షల యూనిట్లను అందుబాటులో ఉంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కుమార్ చెప్పారు. త్వరలోనే ఇ-కామర్స్ మార్కెట్లో లభ్యం కానున్న ఈ ఏసీలు ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన ఈఈఎస్ఎల్మార్ట్.ఇన్ ద్వారా మాత్రమే లభ్యం కానున్నాయి. ఎంపిక చేసిన బ్యాంకుల ద్వారా ఆకర్షణీయమైన ఈఎంఐ ఆఫర్, ఉచిత రిపేర్ సర్వీసు, ఫిర్యాదుల పరిష్కార మద్దతుతదితర సేవలను ఆఫర్ చేస్తోంది. అంతేకాదు అప్‌గ్రేడ్ కావాలనుకున్న కస్టమర్లకు బై బ్యాక్ఆఫర్ను కూడా అందిచనుంది. In the first phase, 50,000 of these #SuperEfficient ACs will be available for consumers of BRPL, BSES, BYPL & Tata Power-DDL in Delhi. Consumers can buy these ACs on our dedicated online portal - https://t.co/oqRGg4Z1sy, at just a click of the button. — EESL India (@EESL_India) July 8, 2019 -
ఏసీ పేలి ముగ్గురు దుర్మరణం
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఏసీ పేలడంతో మంటలంటుకుని ముగ్గురు అగ్నికి ఆహుతయ్యారు. ఈ దుర్ఘటన తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో మంగళవారం జరిగింది. ప్రమాదంలో ముగ్గురు మరణించారు. దిండివనంకు చెందిన రాజు (60), అతని భార్య కలైసెల్వి, రెండో కొడుకు గౌతమ్ పడకగదిలో నిద్రిస్తుండగా మూడు గంటల సమయంలో బెడ్రూమ్లోని ఏసీ పేలింది. దీంతో ఒక్కసారిగా మంటలు, దట్టంగా పొగ గది అంతా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని గది తలుపులు పగులగొట్టారు. కానీ, అప్పటికే తీవ్రంగా కాలిన గాయాలతో రాజు, అతని భార్య, కొడుకు ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు. అగ్నికి ఆహుతైన గౌతమ్‌కు మరో 20 రోజుల్లో వివాహం జరగాల్సి ఉండగా ఈ దారుణానికి బలైపోయారు. -
ఎస్బీఐ కస్టమర్లకు ‘కూల్’ న్యూస్
సాక్షి, ముంబై : దేశీయ అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా కస్టమర్లకు గుడ్ న్యూస్. మండుతున్న ఎండలతో ఇబ్బందులు పడుతున్న వారికి బ్యాంకుచల్లటి కబురు చెప్పింది. ఎస్బీఐ కార్డు ద్వారా ఏసీ( ఎయిర్ కండిషనర్స్) కొనుగోలు చేసినకస్టమర్లకు రూ.1500 క్యాష్‌బ్యాక్ ఆఫర్ చేస్తోంది. పరిమిత కాల ఆఫర్‌గా అందిస్తున్న ఈ అవకాశం మే 30వ తేదీవరకు మాత్రమే అందుబాటులో ఉంది. అయితే 1,500 రూపాయల చొప్పున క్యాష్‌బ్యాక్ పొందాలంటే 3 నెలల, 6 నెలల, లేదా 9 నెలలు ఈఎమ్ఐలు పై వర్తిస్తుంది. అలాగే కనిష్ట ఆర్డర్ విలువ రూ.20వేలు ఉండాలి. అలాగే పెద్ద పెద్ద లేదా ఎంపిక చేసిన ఎలక్ట్రానిక్ షాపుల్లో మాత్రమే లభ్యం. ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ లార్జ్ ఫార్మాట్ ఎలక్ట్రానిక్ చైన్, జనరల్ ట్రేడ్ మర్చంట్ ఔట్లెట్లలో లభిస్తుంది. అందుకే ముందే క్యాష్‌బ్యాక్ వర్తిస్తుందా లేదా అనేది తమ వినియోగదారులు ముందే నిర్ధారించుకోవాల్సి ఉంటుందని బ్యాంకుకోరింది. ఈ క్యాష్ బ్యాక్ ఆగష్టు 30, 2019 నాటికి వినియోగదారును ఖాతాలో జమ చేయబడుతుంది. బ్రాండ్ ఈఎంఐ ఆప్షన్ కింద పిన్‌ల్యాబ్స్ స్విప్ మిషన్ ట్రాన్సాక్షన్ ద్వారా మాత్రమే ఈ ఆఫర్ చెల్లుబాటు అవుతుంది. చార్జ్ స్లిప్‌లో రూ.1,500 క్యాష్ బ్యాక్ అని కచ్చింగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఎస్బీఐ కార్డు 3, 6, 9, 12 నెలల కాలపరిమితికి 14 శాతం వడ్డీని, 18 నెలలు, 24 నెలల కాలపరిమితికి 15 శాతం వడ్డీని విధిస్తోంది. -
మీరు ఏసీ కింద గంటలతరబడి ఉంటున్నారా?
వేసవి వచ్చిందంటే ప్రతి ఇంట్లోనూఎయిర్ కండిషనర్ల రొద మొదలువుతుంది.ఉక్కపోత నుంచి తేరుకుని కంటి మీద కాస్త కునుకు పడాలంటే మాత్రం ఏసీ ఉండాల్సిందే. ఇంతవరకు బాగానే ఉన్నా శరీరానికి చల్లదనాన్ని పంచే ఎయిర్ కండిషనర్లు రకరకాల ఆరోగ్య సమస్యలను కూడా మోసుకొస్తాయన్న విషయం చాలామందికి తెలియదు. మొబైల్, డిజిటల్ తెరల కారణంగా ఇటీవల కంటి సమస్యలు నగరంలో పెరుగుతున్న నేపధ్యంలో పులి మీద పుట్రలా ఇప్పుడు ఎయిర్ కండిషనర్లు కూడా కంటి ఆరోగ్యానికి ముప్పుతెస్తున్నాయంటున్నారు నగరానికి చెందిన అగర్వాల్ కంటి ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ బద్రీ ప్రసాద్ డాగ్నె. ఆయన చెబుతున్న మరిన్ని విషయాలు తెలుసుకోవాల్సిందే. సాక్షి, సిటీబ్యూరో :సమ్మర్ వస్తే చాలు సిటీలో ఎయిర్ కండిషన్లు మోత మోగిస్తుంటాయి. ఇల్లు, ఆఫీసులు, ప్రయాణం చేసే కార్లు, బస్సులు, మెట్రోరైళ్లు.. ఇలా ఏది చూసినా చల్లదనమే. ఎండలు పెరగడంతో పాటు వేడిని తట్టుకునే శక్తి కూడా మనలో లోపిస్తుండడంతో ఎయిర్ కండిషనర్లను ఆశ్రయించక తప్పడం లేదు. ఒక అంచనా ప్రకారం వేసవి కాలంలో ఓ కార్పొరేట్ ఉద్యోగి సగటున 14 నుంచి 16 గంటల పాటు ఎయిర్ కండిషన్డ్ వాతావరణంలోనే ఉంటున్నట్టు తేలింది. ఎయిర్ కండిషనర్లు శరీరానికి అవసరమైన చల్లదనంతో పాటు కొన్ని రకాల అనారోగ్య సమస్యల్ని కూడా మోసుకొస్తున్నాయి. కృత్రిమ పద్ధతుల్లో గాలిని, వాతావరణాన్ని మార్చే ప్రక్రియ వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా చాలా మందికి వచ్చే ‘డ్రై ఐ సిండ్రోమ్’ వేసవి కాలంలోనే బాగా కనిపిస్తున్నట్టు ఓ సర్వేలో తేలింది. పొరలు పొడిబారి.. కన్ను తన విధిని తాను సక్రమంగా, సరైన విధంగా నిర్వర్తించేందుకు నిర్ణీత పరిమాణంలో కళ్లలో నీటి బిందువులు ఉండాల్సిన అవసరం ఉంది. ఈ నీటి బిందువులు బాహ్యంగా ఆయిలీ లేయర్, మధ్యలో వాటర్ లేయర్, లోపల ప్రొటీన్ లేయర్‌తో సంరక్షించబడుతుంటాయి. ఎయిర్ కండిషన్డ్ రూమ్‌లో అత్యంత తక్కువ టెంపరేచర్ ఉండే పరిస్థితుల్లో పరిసరాల్లో తేమ శాతం బాగా తగ్గిపోతుంది. తద్వారా నీటి బిందువులకు రక్షణ కవచాలుగా ఉండాల్సిన పొరలు బలహీనపడిపోతాయి. శరీరానికి తగిలే గాలి పూర్తిగా పొడి బారినది అవడం వల్ల అది కంటి పనితీరుపై తీవ్ర ప్రభావం చూపించి ‘్రౖడై ఐ సిండ్రోమ్’గా మారుతుంది. డ్రై ఐ సిండ్రోమ్ లక్షణాలివే.. కళ్లు పొడిబారడం, కళ్లలో మంట, దురద, కంటి నుంచి నీరు కారడం, ఎర్రబడడం, చూపు మసకబారడం వంటి లక్షణాలతో ఈ డ్రై ఐ సిండ్రోమ్ వస్తుంది. ఇలా ఎక్కువ సేపు ఇదే రకమైన ఎయిర్ కండిషన్డ్ వాతావరణంలో ఉండడం వల్ల ఈ సమస్య మరింత పెరుగుతుంది. మరోవైపు ఏసీ మిషిన్ల నిర్వహణ సరిగా లేకపోతే వ్యాప్తి చెందే వైరస్, బాక్టీరియా, ఫంగస్ కూడా కంటి ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. ఓ వైపు పొడి వాతావరణం కూడా దీనికి జత కలవడం మరింత ప్రమాదకరంగా మారి ఇన్ఫెక్షన్కు కారణమవుతుంది. నగరంలో ఉండే కాలుష్య వాతావరణం సమస్యను మరింత జటిలం చేస్తుంది. జాగ్రత్తలు తప్పనిసరి.. ఏసీ వినియోగించేటప్పుడు టెంపరేచర్ 23 నుంచి 25 డిగ్రీల సెల్సియస్ వరకూ మాత్రమే ఉండాలి. దీనితో పాటు అవసరమైతే ఫ్యాన్ కూడా వినియోగించవచ్చు. ఎయిర్ కండిషనర్లకు మరీ దగ్గరగా లేదా నేరుగా కంటి మీద చల్లని గాలి పడేలా కూర్చోవడం ఎక్కువ సేపు గడపడం చేయవద్దు. ఏసీలో పనిచేస్తున్నప్పటికీ దాహం వేసే వరకూ ఆగకుండా తరచుగా మంచి నీరు తాగుతుండాలి. ఏసీ గదుల్లో కంప్యూటర్ల ముందు పనిచేసేవారు తరచుగా కళ్లు మూసి, తెరవడం చేస్తుండాలి. మంచి నిద్ర కంటి ఆరోగ్యానికి చాలా అవసరం. వైద్యుల సూచనలను అనుసరించి లూబ్రికేటింగ్ ఐ డ్రాప్స్ వినియోగించాలి. కంటి ఆరోగ్య సమస్యలపై నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు కంటి పరీక్షలు చేయిస్తుండాలి.– డాక్టర్ బద్రీ ప్రసాద్ డాగ్నె,అగర్వాల్ కంటి ఆస్పత్రి (సంతోష్‌నగర్) -
ఏసీ నుంచి విషవాయువులు.. ముగ్గురు మృతి!
సాక్షి, చెన్నై : పాడైపోయిన ఏసీ ముగ్గురు ప్రాణాలను తీసింది. ఏసీ నుంచి వెలువడిన విషవాయువులను పీల్చడం వల్ల ఒకే కుటుంబానికి చెందిన శరవణన్(38), అతడి భార్య కలైరాశి(30), కుమారుడు కార్తీక్(8)లు మృతిచెందినట్టు అధికారులు ప్రాథమిక విచారణలో తేలింది. తమిళనాడులోని కోయంబేడు సమీపంలోని మెట్టుకులమ్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం శరవణన్ కుటుంబసభ్యులు ఇంటి తలుపులు తీయకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తలుపులు బద్దలుకొట్టి ఇంట్లోకి వెళ్లి చూడడంతో వారంతా విగతజీవులుగా కనిపించారు. సోమవారం రాత్రి విద్యుత్ పోవడంతో దంపతులు ఇన్వర్టర్ ఆన్ చేశారని ఓ సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. అర్ధరాత్రి వేళ మళ్లీ పవర్ వచ్చిందనీ, అయితే పాడైపోయిన ఏసీ నుంచి విషవాయువులు వెలువడడంతో ప్రమాదం జరిగిందని ఆయన పేర్కొన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ కిల్పాక్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కోయంబేడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
ఏసీల్లో కనిష్ట ఉష్ణోగ్రత ఇకపై 24 డిగ్రీలే
ఎయిర్ కండీషనర్.. ప్రస్తుతం నగరజీవుల ఇళ్లలో తప్పనిసరిగా మారిన ఉపకరణం. బహుళ జాతి సంస్థల నుంచి ప్రభుత్వ ఆఫీసులు, సంస్థల్లో ఏసీలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో విద్యుత్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. అలాగే ఓజోన్ పొరను దెబ్బతీసే గ్రీన్హౌస్ వాయువులు భారీగా వాతావరణంలోకి వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏసీల్లో కనిష్ట ఉష్ణోగ్రతను 24 డిగ్రీల సెల్సియస్ చేయాలని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ(బీఈఈ) ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. విద్యుత్ ఆదాకు ఈ నిబంధనను తప్పనిసరి చేయాలని సూచించింది. ఈ సిఫార్సుల్ని అమలుచేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కేంద్ర విద్యుత్ మంత్రి ఆర్కే సింగ్ తెలిపారు. లాభమేంటి..? ఎయిర్ కండీషనర్ల(ఏసీ)లో ఉష్ణోగ్రతను ఒక్క డిగ్రీ మేర పెంచితే దాదాపు 6 శాతం విద్యుత్‌ను ఆదా చేయొచ్చు. తద్వారా అనవసరమైన ఖర్చు తగ్గుతుంది. అలాగే మానవశరీరం సగటు ఉష్ణోగ్రత 36 నుంచి 37 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. కానీ బహుళజాతి సంస్థలు, కంపెనీల్లో ఉష్ణోగ్రత 18–21 డిగ్రీల మధ్య ఉంటుంది. ఇంత చల్లటి వాతావరణంలో దీర్ఘకాలం పనిచేస్తే ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదముంది. ఈ నేపథ్యంలో ఆరోగ్యంతో పాటు దుబారా వ్యయాన్ని తగ్గించేందుకు ఏసీల్లో ఉష్ణోగ్రత 24 నుంచి 26 డిగ్రీల మధ్య ఉండేలా సెట్టింగ్స్‌ను తప్పనిసరి చేయాలని బీఈఈ కేంద్రానికి సూచించింది. దీనివల్ల ఏటా 2,000 కోట్ల యూనిట్ల విద్యుత్‌ను ఆదా చేయవచ్చని అంచనా వేసింది. ప్రస్తుతం జపాన్ సహా పలుదేశాల్లో ఏసీల కనిష్ట ఉష్ణోగ్రతను 28 డిగ్రీలకు పరిమితం చేయడాన్ని బీఈఈ నివేదికలో పేర్కొంది. అమలు చేసేదెలా.. ఏసీల్లోఉష్ణోగ్రతను డీఫాల్ట్‌గా 24 డిగ్రీలు చేయాలని తొలుత విమానాశ్రయాలు, హోటళ్లు, షాపింగ్ మాల్స్, ప్రభుత్వ కార్యాలయాలు సహా పలు సంస్థలకు ప్రభుత్వం సూచించనుంది. ఆ తర్వాత 4 నుంచి 6 నెలల పాటు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం ప్రజల నుంచి అభిప్రాయా లను సేకరించి, చివరికి ఏసీల్లో 24 డిగ్రీల ఉష్ణో గ్రతను తప్పనిసరి చేస్తారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఓ సమావేశంలో విద్యుత్ మంత్రి ఆర్కే సింగ్ స్పందిస్తూ.. ‘ఏసీల్లో ఉష్ణోగ్రతను 24 డిగ్రీలకు పరిమితం చేయడం వినియోగదారులకు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా మేలు చేస్తుంది’ అనే సూచనను కంపెనీలు ఏసీలపై ముద్రించాలని కోరారు. -
బ్లూ స్టార్.. 100 కొత్త ఏసీలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎయిర్ కండీషనర్ల తయారీ దిగ్గజం బ్లూ స్టార్ ఈ వేసవి సీజన్ కోసం 100 కొత్త మోడళ్లను ప్రవేశపెట్టింది. వీటిలో విద్యుత్‌ను గణనీయంగా ఆదా చేసే 40 ఇన్వర్టర్ ఏసీ మోడళ్లున్నాయి. జపాన్ యూనివర్సిటీలు, నిపుణులతో కలసి కొన్ని మోడళ్లకు రూపకల్పన చేసినట్లు కంపెనీ జాయింట్ ఎండీ బి.త్యాగరాజన్ మంగళవారమిక్కడ మీడియాకు తెలిపారు. ‘ఇవి 30 శాతం అదనంగా చల్లదనాన్నివ్వటంతో పాటు కంప్రెషర్ నుంచి శబ్దాన్ని నియంత్రిస్తాయి. 80 శాతం గాలిని శుభ్రపరుస్తాయి. 150 మంది ఆర్ అండ్ డీ సిబ్బంది ఈ మోడళ్ల డిజైన్‌లో నిమగ్నమయ్యారు. ఏటా పరిశోధనకు రూ.40 కోట్లు వెచ్చిస్తున్నాం’ అని తెలిపారు. నాలుగు రకాల స్మార్ట్ ఏసీలను సైతం కంపెనీ ప్రవేశపెట్టింది. సంస్థకు దేశవ్యాప్తంగా 150 ఎక్స్‌క్లూజివ్ స్టోర్లున్నాయి. మరో 50 కేంద్రాలను ఏడాదిలో ఏర్పాటు చేయనుంది. పరిశ్రమను మించి.. భారత ఏసీల విపణిలో ఏటా 55 లక్షల యూనిట్ల రూమ్ ఏసీలు అమ్ముడవుతున్నాయి. 2020 నాటికి ఇది కోటి యూనిట్లకు ఎగబాకనుంది. పరిశ్రమ 2018లో 15–20 శాతం వృద్ధి నమోదు చేయనుంది. బ్లూ స్టార్ మాత్రం 30 శాతం వృద్ధిని అంచనా వేస్తోంది. 2016–17లో కంపెనీ రూ.4,400 కోట్ల టర్నోవర్ సాధించింది. సంస్థకు 11.5 శాతం మార్కెట్ వాటా ఉంది. ఈ ఏడాది ఇది 12.5 శాతానికి చేరుతుందని త్యాగరాజన్ ధీమా వ్యక్తంచేశారు. ప్రోత్సాహకాలపై జమ్మూకశ్మీర్ స్పష్టత ఇవ్వనందున ఆ రాష్ట్రంలో ప్లాంటు ఏర్పాటు యోచన విరమించుకుంటున్నట్టు ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో నెలకొల్పుతున్న ప్లాంటులో 2019లో ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. దశలవారీగా ఈ ప్లాంటుకు రూ.200 కోట్లు వెచ్చిస్తామని, వార్షిక తయారీ సామర్థ్యం 5 లక్షల యూనిట్లు ఉంటుందని ఆయన వెల్లడించారు. -
ఏసీ 24 డిగ్రీల్లో ఉంటే విద్యుత్ ఆదా!
న్యూఢిల్లీ: ఇంధనాన్ని ఆదా చేసేందుకు ఎయిర్ కండిషనర్ (ఏసీ)లను నిర్ణీత ఉష్ణోగ్రతల స్థాయిలోనే ఉపయోగించేందుకు కేంద్రం ముసాయిదా బిల్లును రూపొందించింది. ‘భవనాలు, వాణిజ్య సముదాయాలు, విమానాశ్రయాల్లో ముందుగా నిర్ణయించిన ఉష్ణోగ్రత వద్దనే ఏసీలు పనిచేసేలా నిబంధనలు తెచ్చే ప్రతిపాదనలు ఉన్నాయా?’అని ఓ సభ్యుడు ప్రశ్న అడిగారు. దీనికి పర్యావరణ మంత్రి అనిల్ మాధవ్ దవే రాజ్యసభలో సమాధానమిచ్చారు. ఏసీలను వేసవిలో 28 డిగ్రీ సెల్సియస్ వద్ద ఉంచుకోవాలని జపాన్ ప్రభుత్వం 2005లోనే ఆ దేశ ప్రజలను, వ్యాపారస్తులను కోరిందనీ, దీనివల్ల విద్యుత్తు వినియోగం తగ్గుతుందని తెలిపారు. ప్రస్తుతం మన దేశంలో ఏసీలను 20 డిగ్రీ సెల్సియస్ లేదా అంతకన్నా తక్కువకు వినియోగిస్తున్నారనీ, దీనిని 24 డిగ్రీలకు పెంచితే విద్యుత్తును ఆదా చేయవచ్చన్నారు. -
బ్లూస్టార్ కొత్త శ్రేణి ఏసీలు
⇒ హైదరాబాద్ మార్కెట్లోకి విడుదల ⇒ 12.5% వాటా లక్ష్యం: కంపెనీ జేఎండీ త్యాగరాజన్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎయిర్ కండీషనర్ల తయారీ సంస్థ బ్లూ స్టార్ హైదరాబాద్ మార్కెట్లో నూతన శ్రేణి మోడళ్లను మంగళవారం ప్రవేశపెట్టింది. ప్రారంభ ధర రూ.35,000 ఉంది. చల్లదనాన్ని డెసిమల్స్‌లో (0.1) సర్దుబాటు చేసుకునే ఫీచర్‌తోనూ ఇన్వర్టర్ స్లి్పట్ ఏసీని కంపెనీ రూపొం దించింది. దేశంలో తొలిసారిగా ఈ ఫీచర్‌తో ఏసీలను తయారు చేశామని బ్లూ స్టార్ జాయింట్ ఎండీ బి.త్యాగరాజన్ చెప్పారు. కావాల్సిన స్థాయిలో చల్లదనం అందించడంతోపాటు విద్యుత్ కూడా ఆదా అవుతుందన్నారు. ఎయిర్ ప్యూరిఫయర్లతో కూడిన ఏసీలను ఈ ఏడాది సెప్టెంబరు నాటికి ప్రవేశపెడతామన్నారు. ప్రస్తుతం కంపెనీ 135 మోడళ్లను విక్రయిస్తోంది. 2020 నాటికి రెండు రెట్లు.. దేశవ్యాప్తంగా రూమ్ ఏసీ విభాగంలో అన్ని కంపెనీలు కలిపి 50 లక్షల ఏసీలు అమ్ముతున్నాయి. 2020 ఏడాది నాటికి మార్కెట్ రెండింతలు అవుతుందని బ్లూ స్టార్ అంచనా వేస్తోంది. రూమ్ ఏసీల రంగంలో కంపెనీకి 11.5 శాతం మార్కెట్ వాటా ఉంది. 2017–18లో 12.5 శాతం వాటా లక్ష్యంగా చేసుకున్నట్టు త్యాగరాజన్ వెల్లడించారు. కాగా, పన్ను ప్రయోజనాల కోసమే జమ్ములో ప్లాంటు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ‘జూలైకల్లా స్పష్టత వస్తుంది. పన్ను ప్రయోజనాలు రాకపోతే జమ్మూలో ప్లాంటు ఏర్పాటు చేయబోం. ఇదే సమయంలో ముందుగా ప్రతిపాదిత శ్రీసిటీ ప్లాంటు నిర్మాణం పూర్తి చేస్తాం. అవసరమైతే ఇతర రాష్ట్రాల్లో పన్ను ప్రయోజనాలు పొందుతున్న కంపెనీ ప్లాంట్లలో దేనినైనా విస్తరిస్తాం’ అని వివరించారు. -
వీడియోకాన్ నుంచి సౌర ఏసీలు
వీడియోకాన్ కంపెనీ సౌర శక్తితో పనిచేసే హైబ్రిడ్ సోలార్ ఎయిర్కండీషనర్లను మార్కెట్లోకి తెచ్చింది. సౌరశక్తితో పనిచేసే ఈ హైబ్రిడ్ సోలార్ ఏసీలను రెండు మోడళ్లలలో అందిస్తున్నామని, వీటి వల్ల వంద శాతం విద్యుత్ ఆదా అవడమే కాకుండా పర్యావరణానికి మేలు కలుగుతుందని వీడియోకాన్ ఒక ప్రకటనలో తెలిపింది. అవసరమైనప్పుడు విద్యుత్‌ను కూడా వినియోగించుకుంటుందని వీడియోకాన్ హెడ్( టెక్నాలజీ, ఇన్నోవేషన్ విభాగం) అక్షయ్ ధూత్ పేర్కొన్నారు. 1 టన్ను ఏసీలధర రూ.99,000, 1.5 టన్నుల ఏసీ ధర రూ.1,39,000 రేంజ్లో ఉన్నాయని తెలిపారు. -
ప్రియురాలి భర్తకు చిక్కకూడదని ఇలా...
-
మండు వేసవిలో చల్లని గాలి!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎయిర్ కండీషనర్ (ఏసీ) అనేది ఇప్పుడు అవసరాల జాబితాలో చేరిపోయింది. మెట్రో నగరాల్లోనే కాదు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఈ వైఖరి పెరిగిపోయింది. నెలసరి వాయిదా చెల్లింపులు (ఈఎంఐ), సులువైన ఫైనాన్స్ విధానం, ఇంధన సామర్థ్య ఏసీలతో మెట్రో నగరాలతో పాటుగా గ్రామీణ ప్రాంతాల్లోనూ మార్కెట్ వృద్ధి చెందుతుందని పరిశ్రమ భావిస్తోంది. ఆన్లైన్ అమ్మకాల్లోనూ జోరందుకుంటుందని భావిస్తోంది. మొత్తంగా గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఏసీ అమ్మకాలు 30 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని పరిశ్రమ అంచనా వేస్తోంది. ఈ ఏడాది గ్రామీణ ప్రాంతాల మార్కెట్ వైపు ఏసీ కంపెనీలు ప్రత్యేక దృష్టిసారించాయని ప్యానసోనిక్ ఇండియా అండ్ సౌత్ ఏసియా ప్రెసిడెంట్ అండ్ సీఈఓ మనీష్ కుమార్ చెప్పారు. మెట్రో నగరాల విషయానికొస్తే.. హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు వంటి ప్రాంతాల్లో హైఎండ్, యాప్ కంట్రోల్ ఏసీలు, ఇన్వెస్టర్ ఏసీల అమ్మకాలు ఎక్కువగా ఉంటాయని.. ఈ విభాగం అమ్మకాల వాటా 15 శాతం మేర ఉంటుందని అంచనా. ఫిబ్రవరి నుంచే ఎండలు మండేస్తున్నాయ్..: గత నెలలో ఉత్తరాది రాష్ట్రాల్లో కురిసిన అకాల వర్షాలు ప్రభావం ఏసీ కంపెనీలపై ఏమాత్రం పడలేదని ఎల్జీ ఇండియా బిజినెస్ హెడ్ విజయబాబు చెప్పారు. గతేడాది మార్చి నెలల్లో ప్రారంభ రోజుల్లో ఉత్తరాది ప్రాంతాల్లో అస్థిర వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి కూడా. కానీ, ఈ ఏడాది దేశంలో వేసవికాలం కాస్త ముందుగానే వచ్చింది. ఫిబ్రవరి నుంచే ఎండలు మండేస్తున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా ఏసీ అమ్మకాలు పెరుగుతాయని శామ్సంగ్ ఇండియా ఎలక్ట్రానిక్స్ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ బుటానీ చెప్పారు. ఈ ఏడాది వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చాలా వరకు వాతావారణ నివేదికలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయని ప్యానసొనిక్ ఇండియా అండ్ సౌత్ ఏసియా ప్రెసిడెంట్ అండ్ సీఈఓ మనీష్ కుమార్ చెప్పారు. ఈ సానుకూల వాతావరణ పరిస్థితులు ఏసీ పరిశ్రమకు కలిసిరానున్నట్లు పేర్కొన్నారు. గ్రామీణ, ఆన్లైన్ వ్యాపారంపై దృష్టి.. గ్రామీణ, నాన్ మెట్రో ప్రాంతాల్లో సులువైన ఫైనాన్స్ స్కీమ్స్ ద్వారా కస్టమర్లకు చేరువయ్యేందుకు, వారిని అప్‌గ్రేడ్ అయ్యేందుకు అవకాశాల్ని కల్పిస్తున్నాయని రాజీవ్ బుటానీ చెప్పుకొచ్చారు. ఈ ఏడాది పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఏసీ అమ్మకాలు 60:40 శాతం మేర ఉంటాయని అంచనా వేశారాయన. అదేవిధంగా ఆన్లైన్లో ఏసీ అమ్మకాల్లోనూ వృద్ధి కనబరుస్తుందని ఏసీ తయారీ కంపెనీలు చెబుతున్నాయి. ‘‘ఈ ఏడాది ఆన్లైన్ అమ్మకాల్లో 30 శాతం వృద్ధిని నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అందుకే స్నాప్‌డీల్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నామని’’ హైయర్ ఇండియా ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగాంజా చెప్పారు. స్ప్లిట్, ఇన్వర్టర్ ఏసీలదే హవా.. ఇదిలా ఉంటే ఏసీల మార్కెట్లో ఇప్పుడు స్ప్లిట్, ఇన్వర్టర్ ఏసీలకు మంచి డిమాండ్ ఉంది. కొనుగోలుదారులు స్ప్లిట్ ఏసీలు ఎక్కువగా ప్రాధాన్యమిస్తున్నారు. ఎందుకంటే అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో మార్కెట్లోకి వచ్చిన ఈ స్ప్లిట్ ఏసీలు ఖరీదు సంబంధం లేకుండా శీతలీకరణ విషయంలో అత్యంత ఆదరణ పొందుతున్నాయి. అందుకే చాలా మంది విండో ఏసీ కొనుగోలుదారులు ఇప్పుడు స్ప్లిట్ ఏసీలవైపు మొగ్గు చూపుతున్నారని ఎరిక్ బ్రగాంజా పేర్కొన్నారు. చెప్పారు. గతంలో విండో, స్ప్లిట్ ఏసీల అమ్మకాల శాతం 50:50 గా ఉంటే ఇప్పుడది 70:30 శాతానికి మారిందని వివరించారాయన. గతేడాది ఇన్వెస్టర్ ఏసీలు 27 శాతం వృద్ధిని నమోదు చేశాయని.. ఈ ఏడాది కూడా అదే వృద్ధిని ఆశిస్తున్నామని ప్యానాసొనిక్ అంచనా వేస్తుంది. పెపైచ్చు కొనుగోలుదారులు ఏసీలు కేవలం చల్లదనంతోనే సరిపెట్టుకోవట్లేదని.. తమ ఏసీ చూడ్డానికి అందంగా ఉండాలని.. కనిష్ట శబ్ధం వద్ద పనిచేయాలని కోరుకుంటున్నారని చెప్పారు.స్ప్లిట్ ఏసీల్లోనూ ఫ్లోరల్ ప్యాట్రన్ ఏసీలకు మంచి డిమాండ్ ఉందని.. వీటినే కొనుగోలుదారులు మొదటి చాయిస్ ఇస్తున్నారన్నారు. యాప్ నియంత్రణ ఏసీలు ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి వస్తున్నాయని.. అవి కూడా మెట్రో నగరాలకే పరిమితమయ్యాయని తెలియజేశారు. -
ఇంటి పైకప్పే ఏసీ
సిడ్నీ: మనకు వేసవి కాలం ముగిసి వర్షాకాలం రాబోతోంది. త్వరలో వేసవి నుంచి ఉపశమనం పొందనున్నాం. కానీ ఆస్ట్రేలియాలో ఇప్పుడే వేసవి మొదలవుతోంది. అక్కడివారు కూడా మనలాగే ఈ ఎండల్ని ఎదుర్కోవడమెలాగా అని భయపడిపోతున్నారు. అయితే ఎండ ప్రభావం నుంచి ఉపశమనం పొందేందుకు అక్కడి పరిశోధకులు ఓ కొత్త సాంకేతికతను కనుగొన్నారు. సిడ్నీకి చెందిన యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు ఇంటిపైకప్పునే ఏసీగా మార్చే సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించారు. దీని ద్వారా ఇళ్ల పైకప్పుల్తోనే ఇల్లంతా చల్లదనం పరుచుకుంటుంది. ఎలాగంటే: ఇంటి పైకప్పులకు చల్లదనాన్నిచ్చే కొత్త రకం పదార్థాన్ని పరిశోధకులు తయారు చేశారు. ప్రత్యేకంగా తయారు చేసిన ప్లాస్టిక్‌తో రూపొందించిన పదార్థంతో ఒక పొర తయారు చేసి, దాన్ని వెండి పొర మీద పేర్చారు. ఈ రెండింటి కలయికతో ఏర్పడిన పదార్థం వేడిని నిలవనివ్వదు. దీంతో ఈ పదార్థంతో తయారు చేసిన పై కప్పులు ఎండ ఎంత ఎక్కువగా ఉన్నా కూడా వేడెక్కవు. ఫలితంగా ఇంటిలోపల చల్లదనం పరుచుకుంటుంది. దాదాపు 50 డిగ్రీల ఫారెన్ హీట్ వరకు వేడిని తగ్గించే సామర్థ్యం ఈ కప్పులకు ఉంటుంది. ఈ కప్పులను వాడడం వల్ల ఇంటిలోపలికి వేడి రాకుండా నిరోధించవచ్చు. సాధారణంగా ఇంటి పైకప్పులు వేడెక్కడం వల్ల ఇళ్లల్లోకి వేడిగాలి వస్తుంటుంది. ఈ సమస్యలన్నింటినీ ఈ కొత్త రకం కప్పులతో ఎదుర్కోవచ్చు. పైగా దీనికి ఏసీల కంటే తక్కువ విద్యుత్ అవసరం. ప్రస్తుతం మార్కెట్లో లేకపోయినా త్వరలోనే వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది. -
ఏసీ కొనలేదని విద్యార్థిని ఆత్మహత్య
రాజమండ్రి: తన ఇష్టం ప్రకారం ఏసీ కొనలేదని డిగ్రీ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన రాజమండ్రి పట్టణంలో శుక్రవారం రాత్రి జరిగింది. వివరాలు.. జాంపేట మఠం వీధికి చెందిన నందారపు శివజ్యోతి ఓ కళాశాలలో ఇటీవలే బీకాం ప్రథమ సంవత్సరం పరీక్షలు రాసింది. ఆమె స్నేహితురాలి ఇంట్లో నూతనంగా ఏసీ కొనుగోలు చేశారు. దాంతో తన ఇంట్లో ఏసీ పెట్టించాలంటూ శివజ్యోతి తల్లిదండ్రులను కోరింది. తల్లిదండ్రులు కొనలేమని చెప్పినా ఆ అమ్మాయి వినలేదు. ఏసీ విషయమై తల్లితో గొడవపడింది. మనస్తాపంతో శుక్రవారం రాత్రి తన గదిలో ఫ్యాన్ హుక్కు ఉరేసుకుని ప్రాణం తీసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఏసీల అమ్మకాలు కూల్..!
2015లో 43 లక్షల ఏసీల విక్రయం అంచనా - 15% వృద్ధి ఖాయం: పరిశ్రమ - కంపెనీలకు సానకూల వాతావరణం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమ్మకాల జోష్‌తో ఎయిర్ కండీషనర్ల(ఏసీ) మార్కెట్ వేడెక్కింది. భానుడి ప్రతాపానికితోడు దేశవ్యాప్తంగా సెంటిమెంటు బలంగా ఉండడంతో ఏసీల విపణి జోరందుకుంది.గతేడాదితో పోలిస్తే 2015లో 15 శాతంపైగా వృద్ధి ఖాయమని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. భారత్‌లో 2014లో రూమ్ ఏసీలు 37.5 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. ప్రస్తుత సంవత్సరంలో 43 లక్షలకుపైగా యూనిట్లు నమోదవుతాయని పరిశ్రమ అంచనా వేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో గతేడాది 2.50 లక్షల ఏసీలు విక్రయమయ్యాయి. ఈ ఏడాది 15% వృద్ధి ఉంటుందని పరిశ్రమ విశ్వసిస్తోంది. జనవరి, ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా 5.5 లక్షల ఏసీలు అమ్ముడయ్యాయి. సహజంగా జనవరి-మార్చి కాలంలో 25 శాతం అమ్మకాలు నమోదవుతాయి. భారత్‌లో వోల్టాస్, ఎల్జీ, శాంసంగ్‌ల తర్వాతి స్థానం కోసం బ్లూ స్టార్, హిటాచీ, ప్యానాసోనిక్ పోటీపడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎల్జీ, బ్లూ స్టార్, శాంసంగ్‌లు తొలి 3 స్థానాలు కైవసం చేసుకున్నాయి. ఇన్వర్టర్ ఏసీల హవా.. భారత్‌లో ఇన్వర్టర్ ఏసీల అమ్మకాలు ఊపందుకున్నాయి. విద్యుత్‌ను గణనీయంగా ఆదా చేసే ఈ మోడళ్ల వాటా ప్రస్తుతం 8%గా ఉంది. 2015లో ఈ విభాగం 15%కి, 2018 నాటికి 30 శాతానికి ఎగబాకుతుందని బ్లూస్టార్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సీపీ ముకుందన్ మీనన్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘5 స్టార్‌తో పోలిస్తే ధర 25% అధికం. అయితే విద్యుత్‌ను ఆదా చేసుకోవాలంటే ఇన్వర్టర్ ఏసీ వాడకమొక్కటే మార్గం. ఈ ఏడాది బ్లూస్టార్ నుంచి ఈ విభాగంలో 20-25 కొత్త మోడళ్లు రానున్నాయి’ అని చెప్పారు. ఇన్వర్టర్ ఏసీలు చైనాలో 80%, జపాన్‌లో 50% ఆక్రమించేశాయి. అల్యూమినియంకు బదులు కాపర్ కాయిల్‌తో తయారైన ఏసీలపట్ల కస్టమర్లు ఆసక్తి కనబరుస్తున్నారని ఆయన వివరించారు. ఏసీల జీవిత కాలం ఎక్కువగా ఉండడమే ఇందుకు కారణమని తెలిపారు. తెలుగు వెలుగులు.. ఏసీల ఎంపిక విషయంలో తెలుగు కస్టమర్లు ముందుంటున్నారు. విండో ఏసీలను దాదాపుగా మర్చిపోయారు. 2014లో కేవలం 12,500 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. స్ప్లిట్ ఏసీల వాటా అత్యధికంగా 95 శాతం ఉంది. దేశవ్యాప్తంగా మొత్తం పరిశ్రమలో 5 స్టార్ ఏసీల వాటా 20 శాతమైతే, తెలుగు రాష్ట్రాల్లో ఇది 23%. విక్రయాల్లో తెలుపు రంగు మోడ ళ్లు 1.75 లక్షల యూనిట్లు నమోదయ్యాయి. తెలుపు తర్వాత ఎరుపు, బంగారు వర్ణానికి డిమాండ్ ఎక్కువ. మొత్తంగా 50% ఏసీ అమ్మకాలు చిన్న పట్టణాల నుంచి నమోదవుతున్నాయి. 2020 నాటికి వార్షిక అమ్మకాలు 1 కోటి యూనిట్లకు చేరుకోవచ్చని బ్లూస్టార్ అంటోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల ఏసీలు అమ్ముడవుతున్నాయి. -
‘అస్తమా’నం ఏసీ వద్దు
- అతి చల్లదనం ప్రమాదకరం - రోగాల బారినపడే ప్రమాదం - కాస్త చల్లగా ఉంటే చాలు - జాగ్రత్తలు అవసరమంటున్న వైద్యులు శాతవాహన యూనివర్సిటీ, న్యూస్‌లైన్: ఒకప్పుడు ఎయిర్ కండీషనర్ అంటే విలాసం. సంపన్నులకు మాత్రమే సాధ్యమైన ఆహ్లాదం. ఇప్పుడు అది ఓ అవసరం. ఇల్లు.. ఆఫీసులు, షాపింగ్‌మాల్స్, ప్రయాణించే బస్సులు, ఏటీఎం సెంటర్లు.. ఇలా అడుగుపెట్టిన ప్రతి చోటా అదే. సంపన్నులతో పాటు ఇప్పుడు సగటు మధ్య తరగతి జీవి, దిగువ తరగతి వారిని ఏసీ ‘చల్లగా’ చేరుకుంటోంది. అయితే ఎక్కువ సేపు ఏసీలో ఉండటం ప్రమాదకరమంటున్నారు వైద్యులు ఎండబారిన పడకుండా జాగ్రత్త పడడం ఎంత అవసరమో... ఏసీతో కలిగే నష్టాలపై అవగాహన పెంచుకోవడం అంతే అవసరమని పేర్కొంటున్నారు. ఆధునిక పరిస్థితులు మనిషిని రోజు రోజుకు సుకుమారంగా మారుస్తున్న నేపథ్యంలో వాతావరణ మార్పులకు తట్టుకోవడం కష్టంగా మారుతోంది. వాతావరణ మార్పుల నుంచి తనను తాను రక్షించుకోవడానికి మనిషి విభిన్న రకాల ఉత్పత్తులను సృష్టించుకుంటూ.. ప్రకృతిని ఢీకొడుతున్నాడు. అదే కోవలోనే ఆవిర్భవించిన ఎయిర్ కండీషనర్ ఇప్పుడు నిత్యావసరంగా మారిపోయింది. విపరీతమైన శారీరక, మానసిక శ్రమ మనల్ని నిస్సత్తువకు గురిచేయకుండా ఎయిర్ కండీషనింగ్ సౌకర్యం నివారిస్తుంది. చెమట పోయడం వంటి చికాకులకు చెక్ పెడుతుంది. అదే సమయంలో దీని వల్ల న ష్టాలు లేకపోలేదు. ఇవీ సమస్యలు... - ఏసీపై పేరుకుపోయే దుమ్ము ధూళి కారణంగా ఫంగస్ వ్యాపించి ఎలర్జీలు రావచ్చు. - కాంటాక్ట్‌లెన్స్ వినియోగిస్తున్నవారికి, కంటి వ్యాధులున్న వారికి, ఆస్తమా రోగులకు ఏసీ కారణంగా సమస్య పెరిగే అవకాశం ఉంది. - అధిక సమయం ఏసీలో ఉండడం వల్ల ఆకస్మిక జలుబు, ముక్కు నుంచి నీరు కారడం, శ్యాసకోశ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ. - చర్మంపై దుష్ర్పభావం చూపించవచ్చు. ఇవీ జాగ్రత్తలు - ఏసీ అమరిక నిర్వహణ సరైన విధంగా ఉండాలి - ఇంట్లోని ఏసీని మరే సీజన్లోనూ వాడకుండా వేసవిలో మాత్రమే వినియోగించ డం చాలా మందికి అలవాటు. ఇలాంటి వారు వినియోగానికి ముందు ఒకసారి టెక్నీషియన్‌కు చూపించడం మంచిది. - గది ఉష్ణోగ్రత మరీ చల్లగా కాకుండా 22 నుంచి 28 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంచాలి. గాలిలో సగటు తేమ శాతం 60 నుంచి 70 శాతానికి మధ్య ఉండాలి - వాతావరణంలో అకస్మాత్తుగా ఏర్పడే హెచ్చుతగ్గులు దేహంపై దుష్ర్పబావాన్ని చూపిస్తాయి. కాబట్టి ఒక అన్‌క్రషబుల్ జాకెట్‌ను దగ్గర ఉంచుకోవాలి. తీవ్రమైన ఎండ నుంచి అత్యంత చల్లని ఎయిర్ కండీషన్డ్ రూంలోకి వెళ్లే ముందు ఇది ధరిస్తే.. అకస్మాత్తుగా వచ్చే వాతావరణ మార్పులను తట్టుకోవచ్చు. - టెంపరేచర్ 20 నుంచి 40 డిగ్రీలకు మారిన సమయంలో వడదెబ్బ తగిలే అవకాశాలు ఉంటాయి. ఈ పరిస్థితిని అధిగమించేందుకు సన్‌స్క్రీన్ లోషన్ వినియోగించడం మంచిది. - ఎక్కువగా ఏసీలో ఉండే వారు దాహం వేయడం లేదని అనుకోకుండా కొబ్బరి నీళ్లు, మంచి నీరు తీసుకుంటూ ఉండాలి. అతిగా వాడితే అనర్థమే... వేసవి కాలంలో ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కోసం ఏసీ వాడటం చల్లదనమే కానీ..దానిని అతిగా ఉపోయగించడం అనర్థాలకు దారితీస్తుంది. ఏసీని ఉపయోగించడమే కాదు..దానిని రెగ్యూలర్‌గా సర్వీసింగ్ చేరుంచాలి. లేదంటే దానిలో ఫంగస్ పేరుకుపోరు శ్వాసకోశ వ్యాధులు, చర్మవ్యాధలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నారు. బ్రాండెడ్ కాకుండా వాడితే అనేక దుష్పరిణామాలు. కొన్ని ఏసీలు వాతావరణంలోని మలినాలను వేరుచేసి స్వచ్ఛమైన గాలి అందించే విధంగా మార్కెట్లోకి వచ్చారు. అలాంటివే మేలు. శ్వాసకోస వాధులు ఉన్నవారైతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. పెద్దవారైనా...చిన్న పిల్లలైనా జాగ్రత్తలు తప్పనిసరి. ఏసీ ఆటో ఆఫ్‌లో ఉండి గది ఉష్ణోగ్రతను సమాన స్థారులో ఉంచేదిగా ఉండాలి. ఈ విధానం చాలా మంచిది. -డాక్టర్ విజయేందర్‌రెడ్డి, కరీంనగర్ -
ఏసీ అమ్మకాలు... కూల్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎయిర్ కండీషనర్ల(ఏసీ) తయారీ కంపెనీలకు ఈ వేసవి కలిసిరానుంది. ఎండలు 20 రోజులు ఆలస్యంగా మొదలైనా అమ్మకాలు జోరందుకోవడంతో కంపెనీలు మార్కెట్లోకి సరఫరాలు పెంచుతున్నాయి. గతేడాది కంటే ఈ సీజన్లో 10 శాతం అధికంగా విక్రయాలు నమోదవుతాయన్న అంచనాలు మార్కెట్‌కు జోష్‌నిస్తోంది. అయితే కస్టమర్లకు ఊరటనిచ్చే అంశమేమంటే ఏసీల ధరలు ఈ వేసవిలో పెంచబోమని కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి. 2014 బెటర్.. దేశవ్యాప్తంగా 2012లో రూ.7,500 కోట్ల విలువైన 32 లక్షల ఏసీలు అమ్ముడయ్యాయి. ముడిసరుకులు ఖరీదవడం, డాలరు గణనీయంగా బలపడడం తదితర కారణాలతో ఏసీల ధరలు 10 శాతం దాకా పెరగడంతో 2013లో మార్కెట్ పరిమాణం 31 లక్షలకే పరిమితమైంది. ప్రస్తుత సీజన్లో కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ముంబైతోపాటు పశ్చిమ ప్రాంతాల్లో మార్కెట్ గణనీయంగా పుంజుకుందని బ్లూస్టార్ రూమ్ ఏసీ విభాగం ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సి.పి.ముకుందన్ మీనన్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో కోస్తాలో అమ్మకాలు జోరుగా ఉన్నాయని చెప్పారు. 2013తో పోలిస్తే ఏసీల ధరలు 10% వరకు పెరిగాయి. ప్రస్తుతానికి ధరలు ఇలాగే ఉంటాయని, మరింత పెరిగే అవకాశమే లేదన్నారు. 50 శాతం వాటా 3 స్టార్‌దే.. ఏసీల విపణిలో సగం వాటా 3 స్టార్ ఏసీలదే. 1-1.5 టన్నుల ఏసీలు రూ.20 వేల నుంచి లభిస్తున్నాయి. 5 స్టార్ ఏసీలు 15 శాతం మార్కెట్‌ను కైవసం చేసుకున్నాయి. వీటి ధరలు రూ.28 వేల నుంచి ప్రారంభం. ఈ ఏడాది మొత్తం మార్కెట్లో విండో ఏసీలు 7 లక్షల యూనిట్లు, స్ప్లిట్ ఏసీలు 27 లక్షల యూనిట్లకు చేరుకుంటుందని అంచనా. 5 స్టార్ ఏసీల కంటే తక్కువ విద్యుత్‌ను ఖర్చు చేసే ఇన్వర్టర్ ఏసీలు 3 శాతం మార్కెట్‌ను కైవసం చేసుకున్నాయి. 2015లో ఈ విభాగం రెండింతలవుతుందని బ్లూస్టార్ అంటోంది. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియెన్సీ(బీఈఈ) ప్రమాణాలకుతోడు సాంకేతికంగా ఇవి ఆధునికమైనవి. సాధారణంగానే వీటి ధరలు 5 స్టార్ కంటే 30% ఎక్కువ. కస్టమర్లకు ప్రభు త్వమే నేరుగా సబ్సిడీ ఇస్తే ఇన్వర్టర్ ఏసీల అమ్మకాలు మరింత పెరుగుతాయని ముకుందన్ అభిప్రాయపడ్డారు. ఉపకరణం వినియోగించే విద్యుత్ ఆధారంగా బీఈఈ స్టార్ రేటింగ్ ఇస్తోంది. 5 స్టార్ కంటే 3 స్టార్ ఏసీతో కరంటు బిల్లు ఎక్కువగా వస్తుంది. కాకపోతే ధర తక్కువగా వుండటం వల్ల 3 స్టార్ ఏసీలకు డిమాండ్ ఎక్కువ. రంగుల ఏసీలు కావాలి.. రంగు రంగుల ఏసీలను యువతరం కోరుకుంటోందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఎరుపు, పసిడి, వెండి వర్ణం రంగులకు డిమాండ్ జోరుగా ఉంటోంది. మొత్తం అమ్మకాల్లో వీటి వాటా 25%. కంపెనీలు సైతం తమ ఉత్పాదనల్లో ఈ రంగులను తప్పనిసరిగా ప్రవేశపెడుతున్నాయి. తెలుపు రంగు ఏసీలు 75%గా ఉన్నాయి. మొత ్తంగా ఈ ఏడాది 34 లక్షల ఏసీలు అమ్ముడవుతాయని షార్ప్ ఇండియా మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ కిషాలయ్ రే వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో 2.7 లక్షల యూనిట్లు నమోదు కావొచ్చు. వారం రోజుల్లో 1,500 ఏసీలను విక్రయించామని, మార్కెట్ పుంజుకుంటుందని టీఎంసీ బేగంపేట షోరూం మేనేజర్ కె.శ్రీనివాస్ తెలిపారు. భారత ఏసీల రంగంలో వోల్టాస్, ఎల్జీ, ప్యానాసోనిక్లు తొలి 3 స్థానాల్లో ఉన్నాయి. బ్లూస్టార్, హిటాచీ 4వ స్థానం, దైకిన్, శాంసంగ్ ఆ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాయి. 20 ప్రముఖ బ్రాండ్ల వాటా 96%గా ఉంది.