2021 ఏడాదిలో అన్ని వస్తువుల ధరలు పెరుగుతూ పోతున్నాయి. మొన్నటి దాక చమురు పెరిగితే, నిన్న గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. ఇప్పుడు మళ్లీ ఎయిర్ కండీషనర్ ధరలు పెరగనున్నాయి. అసలే ఇప్పటికే ఎండలు బాగా మండుతున్నాయి. చాలా మంది వర్క్ ఫ్రమ్ చేస్తున్న కారణంగా ఏసీలు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే ఇప్పుడు వారికి షాక్ తగిలింది. కంపెనీలూ 5 నుంచి 8 శాతం మేర ఏసీ ధరలు పెంచాలని చూస్తున్నాయి. ముడి పదార్థాల ధరలు పెరిగిపోవడం వల్ల కంపెనీలు వీటి ధరలు పెంచేందుకు సిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది.
ఏసీ తయారీకి వినియోగించే లోహాలు, కంప్రెసర్ ధరలు పెరిగిన నేపథ్యంలో ఈ నెల నుంచి ఏసీల ధరలు 3 నుంచి 5 శాతం పెంచనున్నట్లు డైకిన్ తెలిపింది. అమ్మకాల మీద ధరల పెంపు ప్రభావం కొంతమేర మాత్రమే ఉంటుందని, వేసవి కాలంలో ఎక్కువ వేడి కారణంగా డిమాండ్ ఏమాత్రం తగ్గదని డైకిన్ ఇండియా ఎండీ, సీఈవో కన్వాల్ జీత్ జావా అంచనా వేశారు. ఉత్పత్తి వ్యయం పెరిగిన నేపథ్యంలో 6 నుంచి 8 శాతం ధరలు పెంచనున్నట్లు పానాసోనిక్ వెల్లడించింది. ప్రముఖ టాటా గ్రూప్ సంస్థ వోల్టాస్ ఇప్పటికే ఏసీ ధరలను పెంచింది.
చదవండి:
మస్క్, బెజోస్‌లను అధిగమించిన అదానీ!
Comments
Please login to add a commentAdd a comment