Voltas
-
మరిన్ని సంస్థలకు పీఎల్ఐ ప్రోత్సాహకాలు
న్యూఢిల్లీ: వైట్‌గూడ్స్(White Goods) విభాగంలో (ఎలక్ట్రికల్ గృహోపకరణాలు) ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం కింద వోల్టాస్, యూనో మిండా తదితర 18 కంపెనీలు ఎంపికయ్యాయి. ఇవన్నీ కలసి రూ.2,299 కోట్ల పెట్టుబడులతో ముందుకు వచ్చాయి. వైట్‌గూడ్స్ పీఎల్ఐ పథకం కింద గతేడాది అక్టోబర్‌లో మొత్తం 38 సంస్థలు దరఖాస్తు పెట్టుకోవడం గమనార్హం. 11 దరఖాస్తులను నిపుణుల కమిటీ పరిశీలనకు ప్రభుత్వం పంపింది.‘పీఎల్ఐ(PLI) పథకం కింద మూడో విడత ఆన్లైన్ అప్లికేషన్ విండోలో భాగంగా మొత్తం 38 దరఖాస్తులు అందాయి. వీటిని సమీక్షించిన అనంతరం ప్రభుత్వం 18 కంపెనీలను ఎంపిక చేసింది. వీటిల్లో ఏసీ విడిభాగాలు తయారు చేసే 10 కంపెనీలు, ఎల్ఈడీ లైట్లను తయారు చేసే 8 సంస్థలు ఉన్నాయి. ఇవి ఉమ్మడిగా రూ.2,299 కోట్ల పెట్టుబడులకు అంగీకరించాయి’ అని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ప్రకటించింది. ఇప్పటికే పీఎల్ఐ పథకం కింద ప్రయోజనాలు పొందుతున్న మరో ఆరు సంస్థలను సైతం అధిక పెట్టుబడుల విభాగంలో ఎంపిక చేసినట్టు తెలిపింది. ఈ సంస్థలు రూ.1,217 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్టు పేర్కొంది. మొత్తం మీద వైట్‌గూడ్స్ రంగానికి సంబంధించిన పీఎల్ఐ పథకం కింద 84 కంపెనీలు రూ.10,478 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు, వీటి ద్వారా రూ.1,72,663 కోట్ల తయారీ ఏర్పాటు కానున్నట్టు వివరించింది. ఇదీ చదవండి: ‘చాలా చెడ్డ దేశం’.. రాగానే ట్రంప్ చర్యలు షురూకంపెనీల వివరాలు..వోల్టాస్ కాంపోనెంట్స్ సంస్థ రూ.257 కోట్ల పెట్టుబడితో కంప్రెషర్లను తయారు చేయనుంది. మిర్క్ ఎల్రక్టానిక్స్ సంస్థ రూ.51.5 కోట్ల పెట్టుబడితో ఏసీ మోటార్లు, హీట్ ఎక్సే్ఛంజర్లను తయారు చేయనుంది.ఏసీ విడిభాగాల తయారీకి సంబంధించి జూపిటర్ అల్యూమినియం ఇండస్ట్రీస్ రూ.618 కోట్లు, రామ్రత్న వైర్స్ రూ.253 కోట్లు, ఎస్ఎంఈఎల్ స్టీల్ స్ట్రక్చరల్ రూ.541 కోట్లు, నెక్ట్స్ జనరేషన్ మాన్యుఫాక్చరర్స్ రూ.121 కోట్ల చొప్పున ఇన్వెస్ట్ చేయనున్నాయి. ఎల్ఈడీ విభాగంలో లుమ్యాక్స్ ఇండస్ట్రీస్ రూ.60 కోట్లు, యూనో మిండియా రూ.20 కోట్ల చొప్పున పెట్టుబడి పెట్టునున్నాయి.ఇప్పటికే పీఎల్ఐ పథకం కింద లబ్దిదారులుగా ఉంటూ, మరిన్ని పెట్టుబడులకు ముందుకు వచ్చిన వాటిల్లో హిందాల్కో ఇండస్ట్రీస్ (రూ.360 కోట్లు), ఎల్జీ ఎల్రక్టానిక్స్ ఇండియా (రూ.433 కోట్లు), బ్లూస్టార్ క్లైమాటెక్ (రూ.180 కోట్లు, వోల్టాస్ (రూ.200 కోట్లు) ఉన్నాయి. -
విశాఖలో వోల్టాస్ 3వ స్టోర్
హైదరాబాద్: టాటా గ్రూప్‌నకు చెందిన ప్రముఖ ఏసీ కంపెనీ, వోల్టాస్ విస్తరణ ప్రణాళికలో భాగంగా విశాఖపట్నంలో మూడవ స్టోర్‌ను ప్రారంభించింది. దీనితో రాష్ట్రంలో సంస్థ ఎక్స్‌క్లూజివ్ బ్రాండ్ స్టోర్ సంఖ్య 11కు చేరింది. విశాఖ స్టోర్‌ను సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ ప్రదీప్ బక్షి ప్రారంభించారు. వినియోగదారులకు వినూత్న ఉత్పత్తి శ్రేణిని అందించాలన్నది తమ లక్ష్యమని ఈ సందర్భంగా బక్షి పేర్కొన్నారు. కొత్త తరం వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా అధునాతన ఫీచర్లతో కూడిన ఉత్పత్తులను సంస్థ అందిస్తోందని తెలిపారు. -
వోల్టాస్ లాభం రూ.36 కోట్లు
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ కంపెనీ వోల్టాస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెపె్టంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికానికి రూ.36 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో సంస్థ రూ.6 కోట్ల నష్టాన్ని నమోదు చేయడం గమనార్హం. దీంతో పోలిస్తే పనితీరు మెరుగుపడినట్టు తెలుస్తోంది. మొత్తం ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.1,833 కోట్ల నుంచి రూ.2,364 కోట్లకు వృద్ధి చెందింది. రెడీమబుల్ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ (ఎన్సీడీలు) జారీ చేయడం ద్వారా రూ.500 కోట్లు సమీకరించాలని వోల్టాస్ బోర్డు నిర్ణయించింది. చైన్నై, గుజరాత్‌లోని వాఘోడియాలో నూతన ప్లాంట్లపై ఈ నిధులను వ్యయం చేయనున్నట్టు తెలిపింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో వోల్టాస్ షేరు ఒక శాతం లోపు పెరిగి రూ.839 వద్ద ముగిసింది. -
రూ.500 కోట్లతో వోల్టాస్ ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రిఫ్రిజిరేటర్లు, ఏసీల తయారీలో ఉన్న వోల్టాస్ మరో ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. రూమ్ ఏసీల తయారీ కోసం తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో 150 ఎకరాల విస్తీర్ణంలో రూ.500 కోట్లతో కేంద్రాన్ని స్థాపించనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. టాటా గ్రూప్ కంపెనీ అయిన వోల్టాస్‌కు ఇప్పటికే ఉత్తరాఖండ్‌లో ఒకటి, గుజరాత్లో రెండు ప్లాంట్లు ఉన్నాయి. తమిళనాడులో ఏర్పాటు చేస్తున్న ఈ ప్లాంటులో సుమారు 1500 మందికి ఉపాధి లభించనున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: పార్లమెంట్ నూతన భవనం: ఖర్చెంత.. కట్టిందెవరు? ఆసక్తికర విషయాలు.. -
వోల్టాస్‌లో అదనపు వాటా కొనుగోలు చేసిన ఎల్ఐసీ
న్యూఢిల్లీ: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) తాజాగా వోల్టాస్‌లో 2 శాతం వాటా పెంచుకుంది. బహిరంగ మార్కెట్ ద్వారా రూ.634.5 కోట్ల విలువైన వాటాలను కొనుగోలు చేసింది. ఈ డీల్ తదనంతరం వోల్టాస్‌లో ఎల్ఐసీ వాటా 8.884 శాతానికి ఎగసింది. ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లు, ఎలక్ట్రో-మెకానికల్ ప్రాజెక్టుల రంగంలో వోల్టాస్ నిమగ్నమైంది. సోమవారం నాటి రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం, ప్రభుత్వ యాజమాన్యంలోని జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ, వోల్టాస్‌లో తన వాటాను 2,27,04,306 షేర్ల (6.862 శాతానికి సమానం)నుండి 2,93,95,224 (8.884 శాతం)కిపెంచుకుంది. దీంతో ఎల్ఐసీ 0.84 శాతం లాభంతో రూ.633 వద్ద, వోల్టాస్ 1.24 శాతం క్షీణించి రూ.834 వద్ద ముగిసింది. -
షాక్ ఇచ్చిన వోల్టాస్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23) రెండో త్రైమాసికంలో ఆతిథ్య రంగ కంపెనీ మహీంద్రా హాలిడేస్ అండ్ రిసార్ట్స్ నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 30 శాతం క్షీణించి రూ. 41.4 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021-22) ఇదే కాలంలో దాదాపు రూ. 60 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 546 కోట్ల నుంచి రూ. 598 కోట్లకు బలపడింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 515 కోట్ల నుంచి రూ. 575 కోట్లకు పెరిగాయి. కాగా.. ఈ కాలంలో స్టాండెలోన్ ప్రాతిపదికన కొత్తగా 4,397 మంది సభ్యులను జత చేసుకుంది. సభ్యత్వ అమ్మకాల విలువ 93 శాతం వృద్ధితో రూ. 194 కోట్లను తాకింది. -
వోల్టాస్.. తగ్గింది!
న్యూఢిల్లీ: ఏసీలు, ఇంజినీరింగ్ సర్వీసుల దిగ్గజం వోల్టాస్ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 10 శాతంపైగా నీరసించి రూ. 110 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 122 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 55 శాతం జంప్‌చేసి రూ. 2,768 కోట్లను తాకింది. అయితే మొత్తం వ్యయాలు సైతం 57 శాతం పెరిగి రూ. 2,603 కోట్లను దాటాయి. యూనిటరీ కూలింగ్ ప్రొడక్టుల నుంచి ఆదాయంలో రూ. 2,162 కోట్లు సమకూరింది. ఇది రెట్టింపునకుపైగా వృద్ధికాగా.. ఎలక్ట్రో మెకానికల్ ప్రాజెక్టులు, సర్వీసుల నుంచి 34 శాతం తక్కువగా రూ. 455 కోట్లు లభించింది. ఇక ఇంజినీరింగ్ సరీ్వసుల నుంచి 8 శాతం అధికంగా రూ. 124 కోట్ల టర్నోవర్ నమోదైంది. ఫలితాల నేపథ్యంలో వోల్టాస్ షేరు బీఎస్ఈలో యథాతథంగా రూ. 1,000 వద్ద ముగిసింది. చదవండి: Adani: అదానీ దూకుడికి బ్రేక్.. గ్రీన్ డీలా! -
ఎగబడి కొంటున్న జనం.. మూడు సార్లు ధరలు పెంచినా, రికార్డు స్థాయి అమ్మకాలు!
ఈ ప్రపంచంలో ప్రతీది ఇంటర్ లింక్, ఒకదాని ప్రభావం మరోకదానిపై చూపిస్తుంది. ఈ మాట ఓ సినిమాలోని డైలాగ్. సరిగ్గా అలాంటిదే ఏసీ విక్రయాల విషయంలో జరిగింది. ఈ ఏడాది పెరిగిన ఎండల తీవ్రత ఏసీల విక్రయాలపై ప్రభావం చూపింది. ఎంతలా అంటే గత ఆరు నెలల్లో మూడు సార్లు ధరలు పెంచినా.. అవేవి ప్రజలు పట్టించుకోకుండా ఏసీలను కొనుగోలు చేశారు. దీంతో ఈ ఏడాది ప్రథమార్థంలో సూమారు 60 లక్షలు ఏసీలు దేశవ్యాప్తంగా అమ్ముడయ్యాయి. చదవండి: Netflix Subscription: మైక్రోసాఫ్ట్‌తో చేతులు కలిపిన నెట్‌ఫ్లిక్స్.. తక్కువ ధరలకే కొత్త ప్లాన్! వోల్టాస్ కంపెనీ(Voltas) దాదాపు 1.2 మిలియన్ యూనిట్ల రెసిడెన్షియల్ ఏసీలను విక్రయించగా, ఎల్జీ(LG) ఎలక్ట్రానిక్ ఇండియా ఒక మిలియన్ యూనిట్లకు పైగా రెసిడెన్షియల్ ఇన్వర్టర్ ఎయిర్ కండీషనర్లను విక్రయించినట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. కాగా జనవరి-జూన్ కాలంలో ఎల్జీ సంస్థ ఏసీ విభాగం నుంచి ₹4,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. హిటాచీ, డైకిన్, పానాసోనిక్, హైయర్ వంటి ఇతర ఎయిర్ కండీషనర్ తయారీదారులు కూడా తమ యూనిట్ అమ్మకాలలో ఇదే జోరు కొనసాగినట్లు చెప్పారు. ద్వితీయార్ధంలో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని వారు భావిస్తున్నారు. కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయెన్సెస్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (CEAMA) ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగాంజా మాట్లాడుతూ.. ఈ ఏడాది అమ్మకాల పరంగా మొదటి భాగం అద్భుతంగా ఉందన్నారు. జనవరి నుంచి జూన్ వరకు ఏసీ(AC) మార్కెట్ (దేశీయ) 6 మిలియన్ యూనిట్లకు అమ్ముడయ్యాయని తెలిపారు. గతంలో ఈ స్థాయిలో అమ్మకాలు లేవని, రెండవ సగం దాదాపు 2.5 మిలియన్ యూనిట్ల విక్రయాలు జరుగుతాయని భావిస్తున్నట్లు చెప్పారు. చదవండి: Google Play Store: 8 యాప్‌లను డిలీట్ చేసిన గూగుల్.. మీరు చేయకపోతే డేంజరే! -
ఫ్లిప్‌కార్ట్ ధమాకా సేల్: ఇన్వర్టర్ ఏసీలపై భారీ తగ్గింపు
సాక్షి, ముంబై: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్ల సేల్కు తెర తీసింది. ‘ మాన్సూన్ ధమకా సేల్’ పేరుతో 4 రోజుల అమ్మకాలను ప్రారంభించింది. జూన్ 30 వరకు జరగనున్న ఈ అమ్మకాల్లో స్పెషల్ డిస్కౌంట్లను అందిస్తుంది. అలాగే హెచ్డీఎఫ్సీ, ఎస్బిఐ క్రెడిట్ కార్డుల కొనుగోళ్లకు ప్రత్యేక క్యాష్ బ్యాక్ డిస్కౌంట్ కూడా అందిస్తోంది. ముఖ్యంగా శాంసంగ్, ఎల్జీ, ప్యానసోనిక్, బ్లూస్టార్, వర్ల్‌పూల్, కేరియర్, వోల్టాస్, ఒనిడా కంపెనీల ఏసీలపై 41 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. శాంసంగ్: 1.5 టన్నుల 5 స్టార్ స్ప్లిట్ ఇన్వర్టర్ ఏసీ: రూ .34,990 (అసలు రూ. 56,990) 38 శాతం తగ్గింపు 5 స్టార్ బీఇ రేటింగ్, టర్బో కూలింగ్ ఫీచర్‌తో పాటు డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీ దీని సొంతం. క్యారియర్ 4-ఇన్ -1 కన్వర్టిబుల్ కూలింగ్ 1.5 టన్నుల స్ప్లిట్ ఇన్వర్టర్ ఎసి: రూ .39,990 (అసలు రూ .61,990) 35శాతం తగ్గింపు వోల్టాస్ 2 ఇన్ 1 కన్వర్టిబుల్ కూలింగ్ 1.2 టన్ను 3 స్టార్ స్ప్లిట్ ఇన్వర్టర్ ఎసి: రూ .28,990 (అసలు రూ. 54,990) వద్ద లభిస్తుంది 47శాతం తగ్గింపు వర్ల్‌పూల్ 1.5 టన్ను 3 స్టార్ స్ప్లిట్ ఇన్వర్టర్ ఏసీ రూ .31,490 (అసలు ధర రూ .53,420) 41 శాతం తగ్గింపు బ్లూ స్టార్ 1.2 టన్ను 3 స్టార్ స్ప్లిట్ ఇన్వర్టర్ ఏసీ: రూ .30,490 (అసలు ధర రూ .50,000). 39 శాతం తగ్గింపు చదవండి : ఫ్రాంక్లిన్ టెంపుల్టన్కు ఊరట -
ఏసీ, రిఫ్రిజిరేటర్లకు ఫుల్ డీమాండ్
భారతదేశంలోని చాలా ప్రాంతాలలో ఈ సంవత్సరం సాధారణ స్థాయి కంటే ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ(ఐఎమ్‌డీ) పేర్కొనడంతో శీతలీకరణ పరికర తయారీదారులు ఏసీ, రిఫ్రిజిరేటర్లకు ఫుల్ డీమాండ్ ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే వాతావరణంతో పాటు పెరుగుతున్న కరోనా కేసులు, వర్క్ హోమ్ చేసే వారి సంఖ్య పెరుగుతుండటంతో దేశంలో ఏసీ, రిఫ్రిజిరేటర్ల డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. "గత 3-4 నెలలుగా ఎయిర్ కండీషనర్ల విభాగంలో 25 శాతం వృద్ధిని సాధించాము, ఇక ముందు కూడా ఇదే ధోరణి కొనసాగుతుందని ఆశిస్తున్నాము. ఈ ఏడాది క్యూ4 వరకు 100 శాతం కంటే ఎక్కువ వృద్ధిని నమోదు చేయాలనీ లక్ష్యంగా పెట్టుకున్నాము" అని పానాసోనిక్ ఇండియా ప్రెసిడెంట్ & సీఈఓ మనీష్ శర్మ పేర్కొన్నారు. ఈ డిమాండ్ ఎయిర్ కండిషనర్లు మాత్రమే పరిమితం కాకుండా పానాసోనిక్ రిఫ్రిజిరేటర్లలో 30 శాతం రికార్డు వృద్ధిని సాదించనున్నట్లు పేర్కొన్నారు. మునుపటి సంవత్సరాలకు భిన్నంగా ఈ ఏడాది దక్షిణ, పశ్చిమ రాష్ట్రాలలో అధిక డిమాండ్ ఉన్నట్లు వారు పేర్కొన్నారు. "ఈ వేసవి కాలంలో పట్టణ మినీ-మెట్రో నగరాలలో బ్రాండెడ్ గృహోపకరణాల వాడకం పెరిగే అవకాశం ఉన్నట్లు వారు పేర్కొన్నారు. మరి ముఖ్యంగా గ్రామీణ, టైర్ 2 & 3 నగరాల నుంచి డిమాండ్ పెరుగుతుంది" అని వోల్టాస్ ప్రతినిధి పేర్కొన్నారు. పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని పరికరాలను తయారు చేస్తున్నట్లు వోల్టాస్ పేర్కొంది. చదవండి: చౌక వడ్డీకే హోమ్ లోన్ ఇస్తున్న బ్యాంకులు ఇవే! -
కొత్త ఏసీ కొనాలనుకునే వారికి షాక్!
2021 ఏడాదిలో అన్ని వస్తువుల ధరలు పెరుగుతూ పోతున్నాయి. మొన్నటి దాక చమురు పెరిగితే, నిన్న గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. ఇప్పుడు మళ్లీ ఎయిర్ కండీషనర్ ధరలు పెరగనున్నాయి. అసలే ఇప్పటికే ఎండలు బాగా మండుతున్నాయి. చాలా మంది వర్క్ ఫ్రమ్ చేస్తున్న కారణంగా ఏసీలు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే ఇప్పుడు వారికి షాక్ తగిలింది. కంపెనీలూ 5 నుంచి 8 శాతం మేర ఏసీ ధరలు పెంచాలని చూస్తున్నాయి. ముడి పదార్థాల ధరలు పెరిగిపోవడం వల్ల కంపెనీలు వీటి ధరలు పెంచేందుకు సిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది. ఏసీ తయారీకి వినియోగించే లోహాలు, కంప్రెసర్ ధరలు పెరిగిన నేపథ్యంలో ఈ నెల నుంచి ఏసీల ధరలు 3 నుంచి 5 శాతం పెంచనున్నట్లు డైకిన్ తెలిపింది. అమ్మకాల మీద ధరల పెంపు ప్రభావం కొంతమేర మాత్రమే ఉంటుందని, వేసవి కాలంలో ఎక్కువ వేడి కారణంగా డిమాండ్ ఏమాత్రం తగ్గదని డైకిన్ ఇండియా ఎండీ, సీఈవో కన్వాల్ జీత్ జావా అంచనా వేశారు. ఉత్పత్తి వ్యయం పెరిగిన నేపథ్యంలో 6 నుంచి 8 శాతం ధరలు పెంచనున్నట్లు పానాసోనిక్ వెల్లడించింది. ప్రముఖ టాటా గ్రూప్ సంస్థ వోల్టాస్ ఇప్పటికే ఏసీ ధరలను పెంచింది. చదవండి: మస్క్, బెజోస్‌లను అధిగమించిన అదానీ! -
స్వల్పకాలంలో రెట్టింపు లాభాల్ని ఇచ్చే 3 షేర్లు ఇవే..!
రిస్క్ రివార్డును ఎదుర్కోనగలిగే ఇన్వెస్టర్లకు అటో, ఫార్మా, ప్రైవేట్ బ్యాంకుల షేర్లను సిఫార్సు చేస్తామని రిలయన్స్ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ విశ్లేషకుడు విజయ్ జైన్ తెలిపారు. ఈ రంగాలకు చెందిన షేర్లు మాత్రమే స్టాక్ మార్కెట్లో అత్యుత్తమ ప్రదర్శన చేస్తాయని ఆయన అంచనా వేస్తున్నారు. నిఫ్టీ ఇండెక్స్‌లో మెటల్ షేర్లు వాటి కాంజెస్టింగ్ జోన్ నుండి మీడియం-టర్మ్ సగటులను బ్రేక్ అవుట్ చేస్తున్నాయని ఆయన్నారు. ఈ నేపథ్యంలో ఆయన స్వల్పకాలానికి రెట్టింపు లాభాల్ని ఇచ్చే 3స్టాకులను సిఫార్సు చేస్తున్నారు. 1. షేరు పేరు: ఎన్ఎండీసీ రేటింగ్: బై టార్గెట్ ధర: రూ.86 స్టాప్ లాస్: రూ.68 అప్ సైడ్: 15.60శాతం విశ్లేషణ: డైలీ, వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో సుధీర్ఘ కన్సాలిడేషన్ తరువాత బలమైన వ్యాల్యూమ్స్‌తో షేరు బ్రేక్అవుట్ చూసింది. ఈ మెటల్ సెక్టార్లో ఇటీవల పాజిటివ్ మూమెంటమ్ నెలకొంది. రిలిటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ (ఆర్ఎస్ఐ) దాని యావరేజ్ లైన్ నుంచి అప్‌వర్డ్ క్రాస్ చేస్తోంది. ఈ సంకేతాలు రానున్న రోజుల్లో షేరు భారీ ర్యాలీని సూచిసున్నాయి. 2. షేరు షేరు: సన్ ఫార్మా రేటింగ్: బై టార్గెట్ ధర: రూ.535 స్టాప్ లాస్: రూ.425 అప్ సైడ్: 14.6శాతం విశ్లేషణ: గత నెలలో రూ.505 గరిష్టాల నుండి దిద్దుబాటు తర్వాత ధర, సమయం వారీగా షేరు కరెక్షన్ను పూర్తి చేసిందని మేము(రిలయన్స్ సెక్యూరిటీస్) నమ్ముతున్నాము. రాబోయే కొద్ది వారాల్లో ప్రస్తుత స్థాయిల నుండి మెరుగ్గా రాణించేందుకు అవకాశం ఉంది. 3. షేరు పేరు: వోల్టాస్ రేటింగ్: బై టార్గెట్ ధర: రూ.520 స్టాప్ లాస్: రూ.425 అప్ సైడ్: 13శాతం విశ్లేషణ: ఈ స్టాక్ బలమైన వాల్యూమ్‌లతో సబ్ రూ .430 వద్ద డబుల్ బాటమ్‌ను ఏర్పాటు చేసింది. ఆర్ఎస్ఐ ఇండెక్స్ యావరేజ్ బాండ్... సగటు బాండ్‌ను దాటి పైకి వెళ్లింది. ప్రస్తుత స్థాయిల నుంచి షేరు రాణిస్తుందని నమ్ముతున్నాము. రోజువారీ చార్టులలో డబుల్-బాటమ్ సపోర్ట్ ఓవర్‌సోల్డ్ స్టేటస్ రానున్న రోజుల్లో పదునైన అప్ మూమెంటమ్‌ను సూచిస్తున్నాయి. -
ఓల్టాస్ లాభం 54 శాతం అప్
న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌నకు చెందిన ఓల్టాస్ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలానికి కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.158 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో సాధించిన నికర లాభం రూ.103 కోట్లతో పోలిస్తే 54 శాతం వృద్ధి సాధించినట్లు ఓల్టాస్ తెలియజేసింది. అమ్మకాలు అధికంగా ఉండడం, ప్రాజెక్ట్ బిజినెస్ సెగ్మెంట్ మంచి పనితీరు కనబరచడంతో ఈ స్థాయి నికర లాభం ఆర్జించినట్లు తెలియజేసింది. గత క్యూ1లో రూ.1,561 కోట్లుగా ఉన్న నికర అమ్మకాలు ఈ క్యూ1లో 18 శాతం వృద్ధితో రూ.1,845 కోట్లకు పెరిగాయి. ఎలక్ట్రో మెకానికల్ ప్రాజెక్ట్స్ అండ్ సర్వీసెస్ వ్యాపారం రూ.580 కోట్ల నుంచి 3 శాతం వృద్ధితో రూ.564 కోట్లకు పెరిగింది. ‘యూనిటరీ ప్రొడక్ట్స్ ఫర్ కంఫర్ట్ అండ్ కమర్షియల్ యూజ్’ వ్యాపార విభాగం ఆదాయం రూ.928 కోట్ల నుంచి 29 శాతం వృద్ధితో రూ.1,196 కోట్లకు పెరిగిందని కంపెనీ పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఓల్టాస్ షేర్ ధర 1.4 శాతం క్షీణించి రూ.365 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేర్ ఏడాది గరిష్ట స్థాయి, రూ.376ను తాకింది. -
నిఫ్టీ 7,600 పాయింట్లకు!
ముంబై: భారత్‌పై అంతర్జాతీయ అనిశ్చితి ప్రతికూల ప్రభావాలు తగ్గుముఖం పట్టాయని.. స్థూల ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగవుతున్న సంకేతాలు కనబడుతున్నాయని అమెరికన్ బ్రోకరేజి దిగ్గజం గోల్డ్‌మన్ శాక్స్ పేర్కొంది. దీంతో భారత్‌ను ‘ఓవర్‌వెయిట్’(మరింత వృద్ధికి అవకాశం) స్థాయికి అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. అంతేకాదు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్ఎస్ఈ) ప్రధాన సూచీ నిఫ్టీ ఈ ఏడాది 7,600 పాయిట్లను తాకొచ్చని కూడా అంచనా వేసింది. నిఫ్టీ తాజాగా ఆల్‌టైమ్ గరిష్టానికి ఎగబాకిన సంగతి తెలిసిందే. ‘ఆర్థిక వ్యవస్థ గాడిలోపడుతుండటంతో క్యూ2(ఏప్రిల్-జూన్), ఆ తర్వాత నుంచి వృద్ధి రేటు రికవరీ మెరుగుపడనుంది. కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) దిగిరావడం(క్యూ3లో 0.9 శాతమే), ఫారెక్స్ నిల్వల పెరుగుదల, డాలరుతో రూపాయి విలువ కొంత స్థిరపడటం వంటి సానుకూలాంశాలు ఆర్థిక వ్యవస్థకు చేదోడుగా నిలవనున్నాయి’ అని గోల్డ్‌మన్ శాక్స్ తన రీసెర్చ్ నోట్లో వెల్లడించింది. సాధారణ ఎన్నికలు దేశీ స్టాక్ మార్కెట్‌కు కీలకమైనవని, ఎన్నికల ప్రభావంతో లాభపడేందుకు అవకాశం ఉన్న స్టాక్స్‌పై దృష్టిపెట్టాలని తన క్లయింట్లకు సూచించింది. ‘ఏప్రిల్-మే నెలల్లో జరిగే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు సంస్కరణల పురోగతిపై అత్యంత ప్రభావం చూపనున్నాయి. గత ఎన్నికల సమయంలో మార్కెట్ కదలికలు, వాల్యుయేషన్(విలువ), పెట్టుబడి ప్రవాహాలను విశ్లేషిస్తే... ప్రస్తుత ఎన్నికల ముందస్తు(ప్రి ఎలక్షన్) ర్యాలీ మరింత జోరందుకోవడానికి ఆస్కారం ఉంది’ అని అభిప్రాయపడింది. ఎన్నికలతో లాభపడే స్టాక్స్‌లో ఓఎన్జీసీ, కోల్ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్అండ్టీ వంటివి ఉన్నాయని కూడా తెలిపింది. అయితే, ఎన్నికల ఫలితాలు అనిశ్చితికి దారితీస్తే స్టాక్‌మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు వెనక్కి తరలిపోయే రిస్క్‌లు పొంచిఉన్నాయని పేర్కొంది. రంగాలవారీగా చూస్తే.. ఐటీ, ఇంధన రంగాలపై ఓవర్‌వెయిట్ స్థాయిని కొనసాగిస్తున్నామని, ఆటోమొబైల్ రంగాన్ని కూడా ఇప్పుడు దీనిలోకి తీసుకొచ్చినట్లు బ్రోకరేజి దిగ్గజం వెల్లడించింది. బ్యాంకులు, యుటిలిటీ రంగాలను మార్కెట్ వెయిట్; హెల్త్‌కేర్, టెలికం, రియల్టీ రంగాలను అండర్‌వెయిట్ స్థాయిలో ఉంచినట్లు వివరించింది. -
వోల్టాస్‌కు ‘మంత్రి పినాకిల్ ’ ఆర్డర్
హైదరాబాద్: బెంగళూరులోని మంత్రి డెవలపర్స్ నిర్మిస్తున్న పినాకిల్ అపార్ట్మెంట్లలో వీఆర్ఎఫ్ల ఏర్పాటుకు సంబంధించిన కాంట్రాక్ట్ వోల్టాస్ కంపెనీకి దక్కింది. దక్షిణ భారత్‌లోనే అత్యంత పొడవైన (152 మీటర్లు) రెసిడెన్షియల్ టవర్-మంత్రి పినాకిల్‌లో మొత్తం 133 అపార్ట్మెంట్లలో వేరియబుల్ రిఫ్రిజిరెంట్ ఫ్లో సిస్టమ్స్(వీఆర్ఎఫ్) ఏర్పాటు చేస్తామని టాటా గ్రూప్‌కు చెందిన వోల్టాస్ ప్రకటన తెలిపింది. మొత్తం 4,13,850 చదరపుటడుగుల విస్తీర్ణంలో వోల్టాస్ వెర్వ్ సిరీస్ ఇన్వర్టర్ స్క్రోల్ వీఆర్ఎఫ్ సిస్టమ్స్‌ను ఏర్పాటు చేస్తామని సీవోవో ఎం. గోపీకృష్ణ పేర్కొన్నారు. వీఆర్ఎఫ్ సిస్టమ్‌ల వల్ల 35% వరకూ ఇంధన వ్యయాలు ఆదా అవుతాయని తెలిపారు.