
హైదరాబాద్: టాటా గ్రూప్‌నకు చెందిన ప్రముఖ ఏసీ కంపెనీ, వోల్టాస్ విస్తరణ ప్రణాళికలో భాగంగా విశాఖపట్నంలో మూడవ స్టోర్‌ను ప్రారంభించింది. దీనితో రాష్ట్రంలో సంస్థ ఎక్స్‌క్లూజివ్ బ్రాండ్ స్టోర్ సంఖ్య 11కు చేరింది. విశాఖ స్టోర్‌ను సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ ప్రదీప్ బక్షి ప్రారంభించారు.
వినియోగదారులకు వినూత్న ఉత్పత్తి శ్రేణిని అందించాలన్నది తమ లక్ష్యమని ఈ సందర్భంగా బక్షి పేర్కొన్నారు. కొత్త తరం వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా అధునాతన ఫీచర్‌లతో కూడిన ఉత్పత్తులను సంస్థ అందిస్తోందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment