
విశాఖపట్టణం: ట్రయంఫ్ మోటార్ సైకిల్ ఎక్సీపీరియన్స్ సెంటర్ విశాఖపట్టణంలో ప్రారంభమైంది. ప్రోబైకింగ్ ప్రెసిడెంట్ సుమీత్ నారంగ్, వరుణ్‌గ్రూప్ చైర్మన్ ప్రభుకిషోర్, మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్‌దేవ్‌లు ఈ షోరూంను శుక్రవారం ప్రారంభించారు. ఈసందర్భంగా ప్రోబైకింగ్ ప్రెసిడెంట్ సుమీత్ నారంగ్ మాట్లాడుతూ విశాఖ మార్కెట్‌లోకి 400 సీసీ ట్రయంఫ్ బైక్‌లను ప్రవేశపెట్టామన్నారు.
కొత్త కస్టమర్లకు 16వేల కిలోమీటర్ల సరీ్వసు విరామంతోపాటు, రెండేళ్ల అపరిమిత మైలేజ్ వారంటీతో, మూడేళ్ల వారంటీని అందిస్తున్నామన్నారు. 400 సీసీ బైక్, షోరూం ధర రూ.2.33 లక్షలు నుంచి అందుబాటులో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రోబైకింగ్ సరీ్వసు వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ పింగ్లే, ప్రోబైకింగ్ సర్కిల్ హెడ్ గౌతమ్, రీజినల్ మేనేజర్ రాహుల్‌లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment