Experience Center
-
విశాఖలో ట్రయంఫ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
విశాఖపట్టణం: ట్రయంఫ్ మోటార్ సైకిల్ ఎక్సీపీరియన్స్ సెంటర్ విశాఖపట్టణంలో ప్రారంభమైంది. ప్రోబైకింగ్ ప్రెసిడెంట్ సుమీత్ నారంగ్, వరుణ్‌గ్రూప్ చైర్మన్ ప్రభుకిషోర్, మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్దేవ్లు ఈ షోరూంను శుక్రవారం ప్రారంభించారు. ఈసందర్భంగా ప్రోబైకింగ్ ప్రెసిడెంట్ సుమీత్ నారంగ్ మాట్లాడుతూ విశాఖ మార్కెట్లోకి 400 సీసీ ట్రయంఫ్ బైక్‌లను ప్రవేశపెట్టామన్నారు. కొత్త కస్టమర్లకు 16వేల కిలోమీటర్ల సరీ్వసు విరామంతోపాటు, రెండేళ్ల అపరిమిత మైలేజ్ వారంటీతో, మూడేళ్ల వారంటీని అందిస్తున్నామన్నారు. 400 సీసీ బైక్, షోరూం ధర రూ.2.33 లక్షలు నుంచి అందుబాటులో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రోబైకింగ్ సరీ్వసు వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ పింగ్లే, ప్రోబైకింగ్ సర్కిల్ హెడ్ గౌతమ్, రీజినల్ మేనేజర్ రాహుల్‌లు పాల్గొన్నారు. -
ఇప్పటికే ఢిల్లీ, బెంగళూరు.. తాజాగా హైదరాబాద్‌లో
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్‌ఫోన్స్ బ్రాండ్ శామ్సంగ్ ప్రీమియం ఎక్స్‌పీరియెన్స్ స్టోర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. ఇనార్బిట్ మాల్లో 3,500 చదరపు అడుగులకుపైగా విస్తీర్ణంలో ఇది నెలకొంది. ఇప్పటికే కంపెనీకి ఢిల్లీ, బెంగళూరులో ఇటువంటివి ఒక్కో కేంద్రం ఉంది. దేశవ్యాప్తంగా 2023 డిసెంబర్‌కల్లా మొత్తం 15 ప్రీమియం ఎక్స్‌పీరియెన్స్ స్టోర్లను నెలకొల్పాలన్నది కంపెనీ లక్ష్యం. ఈ ఔట్లెట్లలో స్మార్ట్‌థింగ్స్, స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్టాప్స్, ఆడియో, గేమింగ్, లైఫ్‌స్టైల్ టెలివిజన్స్ ప్రదర్శిస్తారు. -
రాజమండ్రిలో ఎక్స్‌పీరియెన్స్ జోన్ ప్రారంభించిన నికాన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇమేజింగ్ టెక్నాలజీ దిగ్గజం నికాన్ ఇండియా తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో ఎక్స్‌పీరియెన్స్ జోన్‌ను ఏర్పాటు చేసింది. మిర్రర్‌లెస్ సిరీస్, డీఎస్ఎల్ఆర్, హై జూమ్ కూల్‌పిక్స్ కెమెరాలు, లెన్సులు, యాక్సెసరీస్, స్పోర్ట్ ఆప్టిక్స్ శ్రేణి ఇక్కడ కొలువుదీరాయి. ఇదీ చదవండి: రూ. 2000 నోట్ల రద్దు: షాపింగ్ చేసుకోవచ్చా? వినియోగదార్లలో సృజనాత్మకతను వెలికితీసేందుకు, ఆవిష్కరణలు, కల్పనతో ఫోటోగ్రఫీ అభిరుచిని కొనసాగించడానికి వారిని శక్తివంతం చేయడం లక్ష్యంగా ఇటువంటి జోన్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు కంపెనీ తెలిపింది. మరిన్ని ఇంట్రస్టింగ్ వార్తలు, విశేషాలు కోసం చదవండి సాక్షి, బిజినెస్ అన్నీ సాహసాలే: ఆరు నెలలకే వేల కోట్ల బిజినెస్! -
500వ షోరూమ్ ప్రారంభించిన ఓలా ఎలక్ట్రిక్ - ఎక్కడంటే?
దేశీయ మార్కెట్లో ప్రారంభం నుంచి మంచి ఆదరణ పొందుతూ ఉత్తమ అమ్మకాలు పొందిన 'ఓలా ఎలక్ట్రిక్' (Ola Electric) ఎట్టకేలకు తన 500వ షోరూమ్ ప్రారంభించింది. ప్రారంభంలో ఒక్క షోరూమ్ కూడా లేకుండా మొదలైన ఓలా ఇప్పుడు భారీ స్థాయిలో ఎక్స్పీరియన్స్ సెంటర్స్ & షోరూమ్‌లను ప్రారంభించడంలో బిజీ అయిపోయింది. ఇందులో భాగంగానే కంపెనీ ఇప్పుడు ఈ షోరూమ్ ప్రారంభించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు తన 500వ షోరూమ్‌ను జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ప్రారంభించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 300 నగరాల్లో ఓలా షోరూమ్ ఉన్నట్లు సమాచారం. అయితే 2023 ఆగష్టు నాటికి దేశంలో ఈ షోరూమ్‌ల సంఖ్య 1000కి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం కంపెనీ తగిన ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం ఓలా ఎలక్ట్రిక్ ఎక్స్పీరియన్స్ సెంటర్లను, షోరూమ్‌లను పెద్ద ఎత్తున ప్రారంభిస్తున్నప్పటికీ కొనుగోలుదారులు మాత్రం ఎక్కువ భాగం కంపెనీ అధికారిక వెబ్సైట్ లేదా యాప్‌ల ద్వారా వాహనాలను బుక్ చేసుకుంటున్నారు. అయితే కంపెనీకి చెందిన షోరూమ్‌లు వాహనాలను గురించి పూర్తిగా తెలుసుకోవడానికి మాత్రమే కాకుండా టెస్ట్ రైడ్ వంటి సదుపాయాలను అందించడానికి ఉపయోగపడుతున్నాయి. (ఇదీ చదవండి: బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. జీరో బ్యాలెన్స్ ఉన్నా నో వర్రీస్!) ఓలా 500వ స్టోర్ ప్రారంభోత్సవం సందర్భంగా కంపెనీ సిఎమ్ఓ 'అన్షుల్ ఖండేల్వాల్' మాట్లాడుతూ.. ప్రస్తుతం 500వ షోరూమ్ ప్రారంభమైంది, అయితే రానున్న రోజుల్లో మరిన్ని సవాళ్ళను ఎదుర్కోవడానికి సంస్థ సిద్ధంగా ఉంటుందన్నారు. భారత్‌కు సుస్థిర భవిష్యత్తు అందించడానికి తమ కృషి ఇలాగే కొనసాగుతూ ఉంటుందని ఆయన అన్నారు. (ఇదీ చదవండి: ట్రక్కు డ్రైవర్‌గా మారిన ఇంజినీర్.. సంపాదన రూ. 50 లక్షల కంటే ఎక్కువే!) ప్రస్తుతం భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ విభాగంలో ఓలా ఎలక్ట్రిక్ వాటా సుమారు 40 శాతం వరకు ఉంది. కంపెనీ గత నెలలో ఏకంగా 30,000 యూనిట్లకుపైగా విక్రయించి, ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాల్లో గత కొన్ని నెలలుగా అగ్రస్థానంలో నిలబడింది. రానున్న రోజుల్లో కూడా కంపెనీ మరింత గొప్ప అమ్మకాలను పొందుతుందని ఆశిస్తున్నాము. -
ఓలా ఎక్స్పీరియన్స్ సెంటర్ల విస్తరణలో పెరిగిన వేగం! ఒకే రోజు..
ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ని దృష్టిలో ఉంచుకుని ఓలా ఎలక్ట్రిక్ దేశ వ్యాప్తంగా ఒకే రోజున 50 ఎక్స్పీరియన్స్ సెంటర్లను ప్రారంభించింది. ఇందులో మూడు సెంటర్లు హైదరాబాద్ నగరంలో ప్రారంభం కావడం విశేషం. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. తమ కస్టమర్లకు మరింత మెరుగైన సేవలను అందించడంలో భాగంగానే సంస్థ ఎక్స్పీరియన్స్ సెంటర్లను వేగంగా ప్రారంభిస్తోంది. ఈ కొత్త ఓలా ఎక్స్పీరియన్స్ సెంటర్లు హైదరాబాద్ మాదాపూర్ శ్రీరామకాలనీలో (హైటెక్ సిటీ రోడ్), నాగోల్‌లోని ఆదర్శ్ నగర్, మెహదీపట్నంలో రేతిబౌలిలో మొత్తం మూడు కొత్తగా ప్రారంభమయ్యాయి. ఎక్స్పీరియన్స్ సెంటర్లను ప్రారంభించిన సందర్భంగా ఓలా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అన్షుల్ ఖండేల్వాల్ మాట్లాడుతూ.. ఓలా కస్టమర్లకు మరింత చెరువులో ఉండటానికి లేదా కొత్త కస్టమర్ల సందేహాలను తీర్చడానికి గత కొన్ని రోజులుగా దేశం మొత్తం మీద అనుభవ కేంద్రాలను ప్రారంభిస్తున్నాము, రానున్న రోజుల్లో మరిన్ని భారతీయ ప్రధాన నగరాల్లో ఈ కేంద్రాలను ప్రారభినానున్నట్లు తెలిపారు. (ఇదీ చదవండి: ఓలా ఎస్1 ప్రో కొనుగోలుపై అదిరిపోయే ఆఫర్: ఈ నెల 16 వరకే..!) నిజానికి ఓలా ఎక్స్పీరియన్స్ సెంటర్లు వినియోగదారులకు ఒకే ప్రదేశంలో సమగ్రమైన సేవలను అందించేలా డిజైన్ చేశారు. ఎస్1, ఎస్1 ప్రో స్కూటర్లను ఈ సెంటర్ల ద్వారా టెస్ట్ రైడ్ చేయడానికి కూడా తీసుకెళ్లే సదుపాయం కల్పిస్తారు. అంతే కాకుండా కొనుగోలుదారులకు మరింత సులభమైన పద్దతిలో ఫైనాన్సింగ్ ఎంపికల గురించి కూడా సమచారం అందించడంలో సహాయపడతాయి. -
ఆఫ్‌లైన్‌లోనే ప్రీమియం ఎలక్ట్రానిక్స్: పెరుగుతున్న ఎక్స్‌పీరియెన్స్ సెంటర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా 2022లో 15 -16 కోట్ల స్మార్ట్‌ఫోన్స్ అమ్ముడయ్యాయి. ఇందులో ఆన్లైన్ వాటా ఏకంగా 53 శాతం కైవసం చేసుకుంది. ఆఫ్‌లైన్‌ను మించి ఆన్లైన్ విభాగం దూసుకెళ్తున్నప్పటికీ ఎలక్ట్రానిక్స్ కంపెనీలు 2023లో ఎక్స్‌పీరియెన్స్ జోన్స్, స్టోర్ల ఏర్పాటుపై ఫోకస్ చేశాయి. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులకు డిమాండ్ మందగించడంతో తయారీ సంస్థలు ప్రీమియం ఉపకరణాలపై దృష్టిసారించాయి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అధిక సామర్థ్యం, వినూత్న సాంకేతికతతో తయారైన ప్రొడక్ట్స్‌కు డిమాండ్ పెరిగిందని ఎల్జీ చెబుతోంది. కొనుగోలు నిర్ణయాలు తీసుకునే ముందు వినియోగదారులు ఇలాంటి ప్రీమియం ఉత్పత్తులను స్వయంగా పరీక్షించి, అనుభూతి చెందాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎక్స్‌పీరియెన్స్ జోన్స్, ఔట్లెట్స్ ఏర్పాటు తప్పనిసరి అని కంపెనీలు నిర్ణయానికి వచ్చాయి. స్మార్ట్‌ఫోన్స్, స్మార్ట్ ఉపకరణాల తయారీతోపాటు కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్న సంస్థలు ఆఫ్‌లైన్‌లో విస్తరణకు వరుస కట్టాయి. ఒకదాని వెంట ఒకటి.. దక్షిణ కొరియాకు చెందిన శామ్సంగ్ ప్రీమియం ఉపకరణాలను ప్రదర్శించేందుకు అతిపెద్ద ఎక్స్‌పీరియెన్స్ కేంద్రాన్ని గత నెలలో న్యూఢిల్లీలో ప్రారంభించింది. అలాగే బెంగళూరులోని శామ్సంగ్ ఓపెరా హౌజ్ స్టోర్‌లో కొత్త గేమింగ్, స్మార్ట్ హోమ్ ఎక్స్‌పీరియెన్స్ జోన్‌ను ఏర్పాటు చేసింది. పర్సనల్ కంప్యూటర్ల తయారీ దిగ్గజం హెచ్‌పీ ఈ నెలలోనే ఏడు ప్రధాన నగరాల్లో గేమింగ్ స్టోర్స్‌ను తెరిచింది. పీసీలు, యాక్సెసరీస్ అందుబాటులో ఉంచడమేగాక కస్టమర్లు గేమ్స్ ఆడుకోవడానికి ఇక్కడ ఏర్పాట్లు ఉన్నాయి. 2023లో ఇటువంటివి 40 కేంద్రాలు తెరవాలన్నది హెచ్‌పీ ఆలోచన. వన్‌ప్లస్, ఆసస్, రియల్మీ సైతం ఔట్లెట్లను స్థాపించాలని భావిస్తున్నాయి. మూడవ ఎక్స్‌పీరియెన్స్ కేంద్రాన్ని గత నెల ఢిల్లీలో ఆసస్ ప్రారంభించింది. ఈ ఏడాది తొలి అర్ధ భాగంలో యాపిల్ స్టోర్లు ప్రారంభం అయ్యే చాన్స్ ఉంది. ప్రీమియం వైపునకు మార్కెట్.. దేశంలో ప్రీమియం స్మార్ట్‌ఫోన్స్, టీవీలు, రిఫ్రిజిరేటర్స్, వాటర్ ప్యూరిఫయర్స్ అమ్మకాలు 2022లో విలువ పరంగా తొమ్మిది రెట్లు మెరుగ్గా నమోదయ్యాయి. ధరలు దూసుకెళ్తున్నప్పటికీ ఉన్నత మధ్య తరగతి, సంపన్న వర్గాలు ఖరీదైన ఉత్పత్తుల కొనుగోళ్లు కొనసాగిస్తున్నారు. విలువ పరంగా గతేడాది స్మార్ట్ఫోన్ల అమ్మకాల్లో 35 శాతం వృద్ధి నమోదైంది. రూ.30 వేలు ఆపైన ఖరీదు చేసే స్మార్ట్ఫోన్ల మొత్తం విక్రయాలు ఏకంగా 94 శాతం వృద్ధి సాధించాయి. టీవీ పరిశ్రమ 11 శాతం వృద్ధి చెందితే.. 55 అంగుళాలు, ఆపైన సైజులో ఉండే ప్రీమియం టీవీ మోడళ్లు 95 శాతం ఎగశాయి. రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండీషనర్ల అమ్మకాలు 29 శాతం పెరిగాయి. ప్రీమియం విభాగంలో ఇవి 45 శాతం అధికం అవడం విశేషం. ప్రీమియం విభాగం పరిశ్రమ వృద్ధిని నడిపిస్తోందని ఎల్జీ ఇండియా వైస్ ప్రెసిడెంట్ దీపక్ బన్సాల్ తెలిపారు. -
One Moto India: హైదరాబాద్‌లో వన్ మోటో ఎక్స్పీరియన్స్ సెంటర్
బ్రిటన్‌కి చెందిన ప్రీమియం ఎలక్ట్రిక్ వాహనాల సంస్థ వన్ మోటో, ఇండియాలో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ సెంటర్‌ని హైదరాబాద్‌లో ప్రారంభించింది. నగరంలోని షేక్‌పేటలో ఏర్పాటు చేసిన వన్ మోటో ఎక్స్పీరియన్స్ సెంటర్‌ను రాష్ట్ర వాణిజ్య పరిశమ్రలు శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ గురువారం లాంఛనంగా ప్రారంభించారు. వన్ మోటో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభించిన అనంతరం జయేశ్ రంజన్ మాట్లాడుతూ.. ఈ మొబిలిటీ పెంచేందుకు దేశమంతటా అన్ని స్థాయిల్లో విస్త్రృత ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. వన్ మోటో వంటి ఎక్స్పీరియన్స్ సెంటర్లు రావడం వల్ల ఎలక్ట్రిక్ వాహనాలు ప్రజల్లోకి మరింత సులువుగా చొచ్చుకుపోతాయని ఆయన తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాలపై చాలా మందికి ఆసక్తి ఉంది, ఇదే సమయంలో అనేక సందేహాలు కూడా ఉన్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల పనితీరు, బ్యాటరీ సామర్థ్యం, పని చేసే తీరు, చార్జింగ్ పెట్టే పద్దతులు ఇలా ఈవీలకు సంబంధించి ప్రత్యక్ష అనుభవాన్ని కస్టమర్లకు అందించేందుకు ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్‌ని అందుబాటులోకి తెచ్చిన్నట్టు వన్‌మోటో ఇండియా ఫౌండర్ మహ్మద్ ముజామిల్ రియాజ్ తెలిపారు. వన్‌మోటో బ్రాండ్ కింద కమ్యూటా, బైకా, ఎలక్ట్రా స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. అన్ని మోడల్‌లు 9 రంగుల్లో లభిస్తున్నాయి. కమ్యూటా ఫీచర్లు టాప్ స్పీడ్ 75 కేఎంపీహెచ్ సింగిల్ ఛార్జ్‌పై 100 కి.మీ ప్రయాణం ధర రూ.1.30 లక్షలు బైకా ఫీచర్లు టాప్ స్పీడ్ 105 కేఎంపీహెచ్ సింగిల్ ఛార్జ్‌పై 180 కి.మీ ప్రయాణం ధర రూ. 1.91 లక్షలు ఎలక్ట్రా ఫీచర్లు టాప్ స్పీడ్ 100 కెఎంపీహెచ్ సింగిల్ ఛార్జ్‌పై 150 కి.మీలు ధర రూ.1.99 లక్షలు -
హైదరాబాద్‌లో ఎన్‌సీఎల్‌డోర్ ఎక్స్పీరియన్స్ సెంటర్
హెదరాబాద్, బిజినెస్ బ్యూరో: పారిశ్రామిక దిగ్గజం ఎన్సీఎల్ గ్రూప్‌లో భాగమైన ఎన్‌సీఎల్‌డోర్ తాజాగా హైదరాబాద్‌లో తమ ఎక్స్పీరియన్స్ సెంటర్‌ను ఆవిష్కరించింది. ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ చైర్మన్ కమలేష్ గాంధీ శుక్రవారం దీన్ని ప్రారంభించారు. ఆర్కిటెక్ట్‌లు, బిల్డర్లు, ఇతరత్రా కొనుగోలుదారులు ఫ్యాక్టరీ దాకా వెళ్లాల్సిన అవసరం లేకుండా తమ ఉత్పత్తులను ప్రత్యక్షంగా చూసి, తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడగలదని ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ ఎండీ కె. రవి ఈ సందర్భంగా తెలిపారు. సుమారు గంట సేపు అగ్నిని నిరోధించగలిగే ఫైర్–రెసిస్టెంట్ డోర్ సహా నేచురా తదితర నాలుగు సిరీస్‌లకు చెందిన తలుపులు ఇందులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. స్టాండర్డ్ సైజులతో పాటు కస్టమరు కోరిన విధంగాను తలుపులను రూపొందించి, అందిస్తున్నామని రవి తెలిపారు. వీటి తయారీ కోసం రోజుకు 1,000 డోర్స్ ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంటును ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. ఈ తలుపుల ధర రూ. 10,000 నుంచి రూ. 25,000 దాకా ఉంటుందని, అయిదేళ్ల పాటు వ్యారంటీ ఉంటుందని రవి వివరించారు. మరింత తక్కువ ధరల శ్రేణిలో కూడా రెడీమేడ్ డోర్లను అందుబాటులోకి తేవడంపై దృష్టి పెడుతున్నామన్నారు. క్యూ4లో రూ. 29 కోట్ల లాభం ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ. 29 కోట్ల లాభం (కన్సాలిడేటెడ్) ప్రకటించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం క్యూ4లో ఇది రూ. 76 కోట్లు. మరోవైపు, సమీక్షాకాలంలో ఆదాయం రూ. 249 కోట్ల నుంచి రూ. 410 కోట్లకు పెరిగింది. షేర్హోల్డర్లకు ఇప్పటికే చెల్లించిన 30 శాతం మధ్యంతర డివిడెండ్‌కు అదనంగా మరో 10 శాతం (షేరు ఒక్కింటికి రూ. 1) డివిడెండ్ ఇవ్వాలని సంస్థ నిర్ణయించింది. ఫలితాల నేపథ్యంలో శుక్రవారం ఎన్సీఎల్ షేరు 3% పెరిగి దాదాపు రూ. 235 వద్ద ముగిసింది. చదవండి : Zomato: జొమాటో కీలక నిర్ణయం -
హైదరాబాద్‌లో గోద్రెజ్ ‘సోషల్ ఆఫీస్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫర్నీచర్ రంగ సంస్థ గోద్రెజ్ ఇంటీరియో దక్షిణాదిన తొలి ‘సోషల్ ఆఫీస్ ఎక్స్‌పీరియెన్స్ సెంటర్’ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. కొండాపూర్‌లో 4,100 చదరపు అడుగుల విస్తీర్ణంలో నెలకొన్న ఈ కేంద్రంలో కార్యాలయాలకు అవసరమయ్యే అత్యాధునిక ఫర్నీచర్ అందుబాటులో ఉంటుందని గోద్రెజ్ ఇంటీరియో సీవోవో అనిల్ మాథుర్ గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. ‘ఇప్పటికే ముంబై, కోల్‌కతలో ఇటువంటి సెంటర్లను విజయవంతంగా నిర్వహిస్తున్నాం. బెంగళూరు, పుణే, చెన్నై, చండీగఢ్‌లోనూ తెరవనున్నాం. రెండు మూడేళ్లలో ఈ విభాగం నుంచి రూ.200 కోట్ల ఆదాయం ఆశిస్తున్నాం. గోద్రెజ్ ఇంటీరియో 2018–19లో రూ.2,000 కోట్ల టర్నోవర్ సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2,400 కోట్లు, 2020–21లో రూ.3,000 కోట్లు లక్ష్యంగా చేసుకున్నాం’ అని వివరించారు. -
హైదరాబాద్‌లో ఎండ్రెస్ హోసర్ ఎక్స్‌పీరియెన్స్ సెంటర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రాసెస్ ఆటోమేషన్ రంగంలో ఉన్న ఎండ్రెస్ హోసర్ హైదరాబాద్‌లో టెక్నాలజీ ఆధారిత ఎక్స్‌పీరియెన్స్ సెంటర్‌ను ప్రారంభించింది. ఇప్పటికే కంపెనీకి ఇతర నగరాల్లో ఇటువంటివి రెండు కేంద్రాలున్నాయి. దేశవ్యాప్తంగా 3,000కు పైగా క్లయింట్లకు తాము సేవలు అందిస్తున్నట్టు ఎండ్రెస్ హోసర్ ఇండియా ఎండీ కైలాష్ దేశాయ్ శుక్రవారమిక్కడ మీడియాకు తెలియజేశారు. 70 దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న సంస్థ ఖాతాలో 7,000 పేటెంట్లు ఉన్నాయని గుర్తు చేశారు. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.750 కోట్ల ఎగుమతులతో కలిపి రూ.1,400 కోట్ల టర్నోవర్ సాధించింది. -
కియా తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్
గురుగ్రామ్: దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా మోటార్స్.. తాజాగా తన తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించింది. ‘బీట్ 360’ పేరుతో 5,280 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ సెంటర్‌ను ఇక్కడ ఏర్పాటుచేసింది. ఈ సందర్భంగా సంస్థ ఎండీ, సీఈఓ కూక్ హున్ షిమ్ మాట్లాడుతూ.. ‘కియా భవిష్యత్ వ్యూహాలను ఈ సెంటర్ వివరిస్తుంది. భారత్‌లో నూతన ప్రామాణాలను ఏర్పాటుచేయడంలో కీలక పాత్ర పోషించనుంది. భారత్‌లో సంస్థ కార్యకలాపాలు ప్రారంభించిన దగ్గర నుంచి వినియోగదారులు మా సంస్థపైనే దృష్టి సారిస్తున్నారు. నిజమైన కియా అనుభవాన్ని అందించడానికి వీరితో అనుసంధానం కావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇక ఈ సెంటర్ పేరులోని మొదటి పదం బీటింగ్ ఆఫ్ హార్డ్‌కు సంక్షిప్తం. సంస్థ వ్యాపార ప్రాంతాలు (జోన్స్)కు సంకేతంగా 3, ఇంద్రియాలను సూచిస్తూ 6, హద్దులు లేవని చెప్పేందుకు 0 ఎంపిక చేసి 360 అని నిర్ణయించాం. త్వరలోనే దేశంలోని మెట్రో నగరాల్లో కూడా ఇటువంటి సెంటర్లను ఏర్పాటుచేయాలని యోచిస్తున్నాం. అని వ్యాఖ్యానించారు. 50,000 బుకింగ్స్: సెప్టెంబర్ నెలలో కియా దేశీ అమ్మకాలు 7,554 యూనిట్లు కాగా, కారు విడుదలైన ఆగస్టు 22 నుంచి గతనెల చివరివరకు మొత్తం విక్రయాలు 13,990 యూనిట్లుగా నమోదయ్యాయి. బుకింగ్స్ 50,000 యూనిట్ల మార్కును అధిగమించాయి. -
ప్రపంచంలోనే అతిపెద్ద శాంసంగ్ మొబైల్ ఎక్స్పీరియన్స్ సెంటర్
బెంగళూరు: దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజమైన శాంసంగ్ ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఎక్స్‌పీరియెన్స్ సెంటర్‌ను మంగళవారం బెంగళూరులో ప్రారంభించింది. బ్రిటిష్ కాలం నాటి ఓపెరా హౌస్‌లో ఈ సెంటర్ ప్రారంభం కాగా, కస్టమర్లు కంపెనీకి చెందిన అన్ని రకాల ఉత్పత్తులను ఇక్కడ పరిశీలించవచ్చని కంపెనీ సౌత్ వెస్ట్ ఆసియా ప్రెసిడెంట్ సీఈఓ హెచ్ సీ హాంగ్ అన్నారు. టీవీలు, స్మార్ట్ఫోన్లు, ఫ్రిజ్‌లు, మొబైల్ యాక్సెసరీలను ఇక్కడ అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. -
హైదరాబాద్‌లో..మరో పెప్పర్ఫ్రై స్టోర్!
• 6 నెలల్లో దేశంలో మరో 10 స్టోర్ల ఏర్పాటు • ఐదేళ్లలో రూ.1,000 కోట్ల నిధుల సమీకరణ • పెప్పర్ఫ్రై సీఎంఓ కశ్యప్ వాడపల్లి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ముంబై కేంద్రంగా ఆన్లైన్ హోం ఫర్నిషింగ్ సేవలందిస్తున్న పెప్పర్ ఫ్రై వచ్చే ఆరు నెలల్లో దేశంలో మరో 10 ఎక్స్పీరియన్స్ సెంటర్లను ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం బంజారాహిల్స్‌లో ఉన్న స్టోర్‌తో పాటు కొత్తగా గచ్చిబౌలిలో మరో స్టోర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ కశ్యప్ వాడపల్లి చెప్పారు. మిగిలినవి బెంగళూరు, ముంబై, చండీగఢ్‌లలో రానున్నట్లు తెలిపారు. ‘పెప్పర్ ఫ్రై హోం ఫర్నీషింగ్ షాపింగ్ ట్రెండ్స్-2016’ను విడుదల చేసిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ ఏడాది జూలైలో రూ.210 కోట్ల నిధులను సమీకరించామని, వీటితో కలిపి ఐదేళ్లలో రూ.1,000 కోట్ల నిధులను సమీకరించామని తెలియజేశారు. మరో 12-18 నెలల్లో బ్రేక్ ఈవెన్‌కు చేరుకుంటామన్నారు. ప్రస్తుతం దేశంలో హోం ఫర్నిషింగ్ మార్కెట్ 25 బిలియన్ డాలర్లుగా ఉందని.. ఇందులో సంఘటిత రంగ వాటా 10 శాతం కంటే తక్కువేనని తెలియజేశారు. ‘‘30 లక్షల మంది కస్టమర్లు మా సేవలను వినియోగించుకున్నారు. మరో 10 లక్షల మందికి ఆర్డర్లను డెలివరీ చేయాల్సి ఉంది. ముంబై, జోధ్‌పూర్, ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో గిడ్డంగులున్నాయి. అన్నీ ఆటోమేటెడ్వే. ప్రస్తుతం మా సంస్థలో 10 వేల మంది వ్యాపారులు నమోదై ఉన్నారు. వీరిలో 3 వేల మందే క్రీయాశీలంగా ఉన్నారు’’ అని వివరించారు. షాపింగ్ ట్రెండ్స్ సర్వే గురించి మాట్లాడుతూ.. తమ కస్టమర్లలో 35 ఆపైన వయసున్న వారే ఎక్కువగా ఉన్నారని.. అన్ని ఆర్డర్లూ రాత్రి 9 గంటల తర్వాతే వస్తున్నట్లు తేలిందని చెప్పారు. హైదరాబాద్ నుంచి ఎక్కువగా కింగ్ సైజ్ బెడ్స్, చెన్నై నుంచి స్టైలిష్ ఫర్నిచర్, బెంగళూరు నుంచి స్టడీ ల్యాంప్స్, ఢిల్లీ నుంచి బ్రాండెడ్ ఫర్నిచర్, ముంబై నుంచి బార్ యూనిట్స్, కోల్కత్తా నుంచి బుక్ షెల్ఫ్స్, చండీగఢ్ నుంచి వాల్ షెల్ఫ్స్, గోవా నుంచి డైనింగ్ సెట్స్, మధురై నుంచి కాంటెంపరరీ ఫర్నిచర్, జైపూర్ నుంచి షాండ్లియర్స్ ఎక్కువగా కొనుగోలు చేసినట్లు సర్వేలో తేలిందన్నారు.