హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్‌ఫోన్స్ బ్రాండ్ శామ్‌సంగ్ ప్రీమియం ఎక్స్‌పీరియెన్స్ స్టోర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. ఇనార్బిట్ మాల్‌లో 3,500 చదరపు అడుగులకుపైగా విస్తీర్ణంలో ఇది నెలకొంది. ఇప్పటికే కంపెనీకి ఢిల్లీ, బెంగళూరులో ఇటువంటివి ఒక్కో కేంద్రం ఉంది. దేశవ్యాప్తంగా 2023 డిసెంబర్‌కల్లా మొత్తం 15 ప్రీమియం ఎక్స్‌పీరియెన్స్ స్టోర్లను నెలకొల్పాలన్నది కంపెనీ లక్ష్యం. ఈ ఔట్‌లెట్లలో స్మార్ట్‌థింగ్స్, స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్‌టాప్స్, ఆడియో, గేమింగ్, లైఫ్‌స్టైల్ టెలివిజన్స్ ప్రదర్శిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment