
సాక్షి, సిటీబ్యూరో: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అలనాటి సామెతల్ని కొత్తగా నిర్వచిస్తోంది. గోడలకూ చెవులుంటాయని పెద్దలు చెబితే.. గోడల నుంచి సుస్వరాలు వినిపిస్తాయని సరికొత్త మ్యూజిక్ ఫ్రేమ్స్ నిరూపిస్తున్నాయి. గోడకు ఫొటో ఫ్రేమ్స్‌లానే తమ మ్యూజిక్ ఫ్రేమ్‌ను కూడా వేలాడదీస్తే ఇష్టమైన సంగీతాన్ని ఆస్వాదించవచ్చని అంటోంది ప్రసిద్ధ గృహోపకరణాల బ్రాండ్ శామ్‌సంగ్..
తాజాగా ఈ బ్రాండ్ రూపొందించి సిటీ మార్కెట్‌లోకి విడుదల చేసిన ఈ వైర్‌లెస్ మ్యూజిక్ ఫ్రేమ్ ద్వారా వీనులవిందైన సంగీతాన్ని వినడం మాత్రమే కాదు వ్యక్తిగత ఫొటోలు, కళాత్మక చిత్రాలు సైతం పొందుపర్చుకోవచ్చు. డాల్బీ అట్మోస్ వంటి ఫీచర్లతో అందుబాటులోకి వచి్చన ఈ ఫ్రేమ్.. అందాన్ని పెంచే ఇంటీరియర్‌లా అమరిపోతుందంటున్నారు.
ఇవి చదవండి: ఆన్‌లైన్ గేమర్స్‌ను వరించనున్న.. రూ. 2 కోట్ల ప్రైజ్ మనీ..
Comments
Please login to add a commentAdd a comment