![Increased use of AI among Indian internet users](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/ai.jpg.webp?itok=eL4NNOQL)
భారతీయ ఇంటర్నెట్ వినియోగదారుల్లో పెరిగిన ఏఐ వాడకం
అత్యధికంగా చాట్ జీపీటీ వాడుతున్నవారు 28 శాతం మంది
90 శాతం టెక్ట్స్ మోడ్‌లో.. 10 శాతం వాయిస్ కమాండ్‌లో..
లోకల్ సర్కిల్స్ సర్వేలో ఆసక్తికర అంశాలు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఇంటర్నెట్ వినియోగం పెరిగిన తర్వాత వినియోగదారుల అభిరుచులు వేగంగా మారుతున్నాయి. క్షణాల్లోనే అనేక రకాల పనులు చేసిపెట్టే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఫ్లాట్‌ఫామ్‌ల వాడకం కూడా వేగం పెరుగుతోంది. భారతీయ ఇంటర్నెట్ యూజర్లలో ప్రతి ఇద్దరిలో ఒకరు ఏదో ఒక ఏఐ ప్లాట్‌ఫామ్‌ను వాడుతున్నట్టు ‘లోకల్ సర్కిల్స్’సంస్థ ఇటీవల నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ప్రస్తుతం కొత్తకొత్త ఏఐ ఫ్లాట్‌ఫామ్స్ వినియోగదారులకు అందుబాటులోకి వస్తూనే ఉన్నాయి.
చాట్‌జీపీటీ, గూగుల్ ఏఐ ప్లాట్‌ఫామ్ జెమిని, మెటాకు చెందిన లామా 3.. ఇలా అనేక రకాల ఏఐ ఫ్లాట్‌ఫామ్‌ల వాడకంపై గత ఏడాది ఆగస్టు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 1 వరకు దేశవ్యాప్తంగా 309 జిల్లాల్లో 92 వేల మంది అభిప్రాయాలు సేకరించినట్టు లోకల్ సర్కిల్స్ సంస్థ వెల్లడించింది. డీప్‌సీక్ ఏఐ ప్లాట్‌ఫామ్‌కు త్వరలో మారాలనుకుంటున్నట్టు సర్వేలో పాల్గొన్న 31 శాతం మంది తెలిపారు.
అయితే ఏఐ ఫ్లాట్‌ఫామ్‌లు వాడి సేకరించిన సమాచారం తప్పుగా ఉందని 18 శాతం మంది చెప్పగా.. 28 శాతం మంది కచ్చితమైన సమాచారమని అంగీకరించారు. ఏఐ ప్లాట్‌ఫామ్‌లను వాడబోమని.. కానీ గూగుల్, ఇతర సెర్చ్ ఇంజిన్లను వాడతామని 40 శాతం మంది తెలిపారు. ఏమీ చెప్పలేమని 5 శాతం మంది అభిప్రాయపడ్డారు.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/image_441.png)
Comments
Please login to add a commentAdd a comment