
సాక్షి,హైదరాబాద్: 15 రోజుల పసికందు. తల్లి బాత్రూమ్ కు స్నానానికి వెళ్లి తిరిగి వచ్చేసరికి శవమై కనిపించింది. పాకడం కూడా రాని ఆ పసికందును ఒక చోట పడుకోబెడితే.. బకెట్ లో విగతజీవిగా కనిపించింది. ఈ విషాద ఘటన నగరంలో మైలార్ దేవ్ పల్లి పీఎస్ పరిధిలో అలీనగర్ లో చోటు చేసుకుంది. ఈ కేసును అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకున్నారు పోలీసులు.
బాధితురాలు తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చిన్నారిని పడుకోబెట్టి స్నానానికి వెళ్లిన తల్లి తిరిగి వచ్చే సరికి ఇలా బకెట్ లో కనిపించిందని తల్లి చెబుతోంది.
Comments
Please login to add a commentAdd a comment