dieseases
-
అయ్యో..! కారు ప్రమాదంలో గాయపడిన పులి.. కుంటుకుంటూ..
నాగ్‌పూర్: మహారాష్ట్రలోని అభయారణ్యంలో వేగంగా వెళుతున్న కారు ఓ పులిని ఢీకొట్టింది. ఈ ఘటనలో పులి తీవ్రంగా గాయపడిన పులి ప్రాణాలను కోల్పోయింది. గోండియా జిల్లాలోని నావగావ్- నజ్రియా కారిడార్‌లో ఈ ప్రమాదం జరిగింది. రెండేళ్ల పులి రోడ్డు దాటుతుండగా.. ముర్డోలీ అటవీ ప్రాంతంలోని కోహ్‌మారా-గోండియా రోడ్డులో ఈ ప్రమాదం జరిగిందని డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారి ప్రమోద్ పంచభాయ్ తెలిపారు. ఈ ఘటనలో ప్రమాదం జరిగిన చోటే రోడ్డుపైనే గాయంతో పులి కాసేపు కూర్చుండిపోయింది. కారు అక్కడే ఆగడంతో మళ్లీ ఏం ప్రమాదం పొంచి ఉందో? అనే భయంతో నొప్పి ఉన్న కాలుతోనే పొదల్లోకి కింద పడుతూ వెళ్లింది. ఈ ఘటనకు సంబంధించిన దశ్యాలను వెనుక ఉన్న వాహనదారులు వీడియో తీశారు. అటవీ అధికారి ప్రవీణ్ కాశ్వాన్ ట్విట్టర్ వేదికగా ఆ వీడియోను పంచుకున్నారు. Dear friends Wildlife has first right of way in #wildlife habitats. So always travel safely & slowly. This tiger hit by vehicle at Nagzira. Via @vijaypTOI pic.twitter.com/fpx6zlKQDI — Parveen Kaswan, IFS (@ParveenKaswan) August 11, 2023 అటవీ ప్రాంతంలో వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని ప్రవీణ్ కాశ్వాన్ కోరారు. జంతువులకు హాని కలగకుండా వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదానికి కారణమైన కారులో ఉన్న వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు జంతు ప్రేమికులు. గాయపడిన పులి కోసం అధికారులు ఉదయం వెతికి జంతు సంరక్షణ శిబిరానికి తీసుకువచ్చే క్రమంలో బాధిత పులి మరణించినట్లు చెప్పారు. ఇదీ చదవండి: పంజాబ్‌లో దారుణం.. ఇంట్లో చెప్పకుండా వెళ్లిందన్న కోపంలో ఓ తండ్రి ఘాతుకం -
నగరంలో తీవ్రమవుతున్న ‘షైనెస్’ సమస్య
సాక్షి, సిటీబ్యూరో: ‘‘పద్దెనిమిదేళ్ల వయసు. బీటెక్ చదువుతోంది. కానీ నోరు తెరిచి తండ్రితో నాలుగు మాటలు మాట్లాడలేదు. ఇంటికి చుట్టాలొచ్చినా పలకరించదు. తన లోకం తనది, అలాగని చదువులో ఏ మాత్రం వెనుకబడకుండా బాగానే చదువుతోంది. తనకు కావలసినవన్నీ తండ్రికి వాట్సాప్‌లో మెసేజ్ చేస్తుంది. ఈ ధోరణి చూస్తోంటే ఆందోళనగా ఉంది..’ నగరానికి చెందిన ఒక ప్రముఖ మానసిక వైద్య నిపుణుడి వద్ద వారం రోజుల క్రితం హిమాయత్‌నగర్‌కు చెందిన ఒక తల్లి తన కూతురు ప్రవర్తన పట్ల వ్యక్తం చేసిన ఆవేదన ఇది. ‘ఇంటికి వచ్చిన అతిథులను బాగున్నారా అని కూడా పలకరించకపోతే ఎలా..’ అని ఆ తల్లి ఆవేదన. ఇది ఆ ఒక్క తల్లి ఆందోళనే కాదు. చాలామంది తమ పిల్లల తీరు పట్ల ఇదే తరహా ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు రోజు రోజుకు ఇలాంటి మానసిక సమస్యలు పెరుగుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మానసిక వైద్యుల పరిభాషలో చెప్పే ‘షైనెస్’ (బిడియం) సమస్యల ఇటీవల కాలంలోపెరుగుతోంది. చాలా మంది పిల్లలు చదువుల్లో ర్యాంకులకు ర్యాంకులు సాధించినప్పటికీ భావప్రకటన నైపుణ్యాన్ని కోల్పోతున్నారు. మర్యాదపూర్వకమైన సంభాషణలు, పలకరింపులు కూడా ఈ తరం పిల్లలకు తెలియకుండా పోతోందని మానసిక వైద్యనిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇరవై నాలుగ్గంటలు మొబైల్ ఫోన్‌కు అతుక్కుపోవడమేనని స్పష్టం చేస్తున్నారు. చాటింగ్ తారకమంత్రం... సాధారణంగా పిల్లలు గలగలా మాట్లాడుతూ ఇల్లంతా సందడి చేస్తుంటే ఇంటిల్లిపాది ఎంతో సంతోషంగా ఉన్నట్లు లెక్క. స్కూల్, కాలేజీల్లోనూ పిల్లల సందడి ఎంతో సృజనాత్మకంగా ఉంటుంది. పిల్లల అల్లరి కూడా ముచ్చటగా ఉంటుంది. కానీ ఇటీవల కాలంలో మొబైల్‌ఫోన్‌కు అడిక్ట్ కావడం వల్ల చాలా మంది పిల్లలు షైనస్కు గురవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఎదుటి వ్యక్తి ముఖంలోకి చూసి స్పష్టంగా మాట్లాడలేకపోవడమే ఈ షైనస్ లక్షణం. తమకు ఏం కావాలన్నా, తాము ఎదుటి వారిని ఏదైనా అడగాలనుకున్నా వాట్సప్‌లో మెసేజ్ పోస్టు చేయడం అలవాటుగా మారింది. ‘ ఫేస్బుక్, వాట్సప్, ఇతరత్రా సోషల్ మీడియాలో బంధువులకు, స్నేహితులకు ఎంతో ఘనంగా పుట్టిన రోజు వేడుకలను పోస్టు చేస్తారు. కానీ సదరు వ్యక్తులు తారసపడినప్పుడు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెప్పలేకపోతున్నారు’ అని విస్మయం వ్యక్తం చేశారు ప్రముఖ మానసిక వైద్యనిపుణులు డాక్టర్ సంహిత. ఇలాంటి పిల్లలు ఆఖరికి తల్లిదండ్రులతోనూ స్పష్టంగా మాట్లాడలేకపోతున్నట్లు పేర్కొన్నారు. టీనేజ్ యూత్‌లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. అన్నింటికీ ఇంటర్నెట్, మెబైల్ ఫోన్ తాకరమంత్రంగా భావించడమే ఇందుకు కారణం. భావప్రకటనా నైపుణ్యాన్ని అలవర్చుకోకపోవడం వల్ల, ఎదుటి వారి కళ్లల్లోకి సూటిగా చూస్తూ స్పష్టంగా మాట్లాడలేకపోతున్నారు. దీంతో ఇలాంటి పిల్లలు బంధుమిత్రులు, ఇరుగుపొరుగు వారి మధ్య సరైన వ్యక్తిత్వం లేని వారుగా చులకనకు గురవుతున్నారు. ఎవరితో ఏం మాట్లాడాలో తెలియకపోవడమే వారు ఎదుర్కొంటున్న అసలు సమస్య. 12 ఏళ్ల నుంచి 25 ఏళ్లలోపు వారిలో ఈ సమస్య తీవ్రంగా ఉంది. ‘సున్నితం’గా పెంచేస్తున్నారు.... పేరెంటింగ్‌లోని లోపాలు కూడా ఈ సమస్యకు కారణంగా మారుతున్నాయి. అమ్మాయిలు సున్నితంగా, ఒద్దికగా ఉండాలనే భావన, గలగలా మాట్లాడకుండా బిడియపడుతూ మాట్లాడాలని తల్లితండ్రులు పదే పదే చెప్పడం వల్ల కూడా చాలామంది భావప్రకటన నైపుణ్యాన్ని కోల్పోతున్నారు. మర్యాదపూర్వకంగా మాట్లాడలేకపోవడమే కాదు, జీవితంలో ఏ చిన్న సమస్య వచ్చినా ఎదుర్కోలేక విలవిలలాడిపోతున్నట్లు సైకాలజిస్టులు అభిప్రాయపడుతున్నారు. ప్రతి విషయానికి పిల్లలు తమపైనే ఆధారపడేలా పెంచడం కూడా మరో ప్రధాన లోపం. అమ్మాయిల్లోనే కాదు. అబ్బాయిల్లోనూ ఇది ప్రబలంగానే ఉంది. ఇలాంటి వారు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వెల్లడించలేకపోతున్నారు. లోపాన్ని గుర్తించడమే పరిష్కారం మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్, సోషల్ మీడియాకు బాగా అలవాటుపడడం వల్లనే అభిప్రాయాలను, ఆలోచనలను, తమ భావాలను ప్రకటించలేకపోతున్నారనే లోపాన్ని మొదటి గుర్తిస్తే పరిష్కారం తేలిగ్గా లభిస్తుంది. సమస్య తెలిసిన తరువాత ఆ అలవాటు నుంచి దూరంగా ఉండాలి. వాటి పైనుంచి దృష్టి మళ్లించేందుకు, భావప్రకటన నైపుణ్యాన్ని పెంచుకొనేందుకు మంచి లిటరేచర్ చదవాలి. మంచి సినిమాలు, సాహిత్యం, స్నేహితులతో మాట్లాడం ఇందుకు దోహదం చేస్తాయి. – డాక్టర్ సంహిత, మానసిక వైద్య నిపుణులు -
పశువుల్లో గర్భకోశ వ్యాధులు.. నివారణ
జంగారెడ్డిగూడెం: పశువులు ఆరోగ్యవంతంగా ఉండి సరైన సమయంలో ఎదకు వస్తే పశు సంపద పెరిగేందుకు అవకాశం ఉంటుంది. పశువులు తక్కువ వయసులో తొలి ఎదకు వచ్చి ఈనితే రైతుకు లాభం. దేశవాళీ పశువులు ఆలస్యంగా, విదేశీ పశువులు చాలాతక్కువ వయసులో తొలి ఎదకు వస్తాయి. పశువులు ఎదకు వచ్చే సమయం, పశువుల గర్భకోశ, జననేంద్రియ వ్యాధులు, నివారణ తదితర విషయాలను జంగారెడ్డిగూడెం పశువైద్యాధికారి బీఆర్ శ్రీనివాసన్ మాటల్లోనే.. పశువులు తొలి ఎదకు వచ్చినప్పుడు అవి యుక్త వయసుకు వచ్చినట్టు అర్థం. పశువు ఆరోగ్యంగా, బలంగా ఉంటే సహజ సంపర్కం అంటే గిత్తను దాటించడం లేదా ఇన్సిమినేషన్ చేయవచ్చు. పశువుల్లో రుతుచక్రం ఇలా.. ఆరోగ్యమైన పశువులు తొలి ఎదకు వచ్చినప్పటి నుంచి ప్రతి 3 వారాలకు సుమారు 21 రోజులకు ఒకసారి ఎదకు వస్తుంది. కొన్ని పశువులు 21 రోజుల కంటే 4, 5 రోజులు అటూ ఇటుగా వస్తాయి. అంటే ఎదకు సుమారు 18 నుంచి 24 రోజులు ఉంటుంది. ఒకవేళ ఆ ఎదలో గర్భం ధరించకపోతే తిరిగి 21 రోజులకు ఎదకు వస్తుంది. గర్భం ధరిస్తే ఎదకు రాదు. సాధారణంగా దేశీయ ఆవుదూడలు 4 సంవత్సరాల వయసులో యుక్తవయసుకు వస్తాయి. ఒంగోలు జాతి దూడలు మూడు సంవత్సరాలకు, సంకర జాతి పశువులు సంవత్సరానికి యుక్త వయసుకు వస్తాయి. నాటు గేదెలు వంటివి 4 సంవత్సరాలకు, ముర్రా జాతిగేదెలు 3 సంవత్సరాల వయసులో మొదట ఎదకు వస్తాయి. ఈ మొదటి ఎదకు రావటాన్ని జాతి లక్షణాలు, దాని బరువు, పెరుగుదలపై ఆధారపడి ఉంటుంది. సరైన పోషణ లేని పశువులు సాధారణంగా ఎదకు రావాల్సిన సమయంలో ఎదకు రావు. లేదా ఈనిన తరువాత తిరిగి ఎదకు తొందరగా రావు. ఒకవేళ పశువు సరైన ఎదుగుదల ఉండి వయసుకు వచ్చినా కూడా ఎదకు రాకపోతే వైద్యం చేయించడం అవసరం. గర్భకోశం ఎదగకపోవడం వల్ల కూడా.. కొన్ని పశువుల్లో మొదటి ఎద వయసు వచ్చినా సరే ఎదకు రాకుండా ఉంటాయి. దీనికి గర్భకోసం ఎదగకపోవడం కూడా ఒక కారణం కావచ్చు. పశువులు ఎదకు రాకపోతే వైద్యులకు చూపించి గర్భకోశం ఎదుగుదల పరీక్షించి తగిన చికిత్సలు చేయించాలి. గర్భస్రావాలు .. కొన్ని పశువులు నెల, 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు చూడు గర్భస్రావాలు జరుగుతాయి. దీనికి గర్భకోశ వ్యాధులు కారణం కావచ్చు. 3 నెలల గర్భం ప్రతిసారి పోతుంటే వైద్యునికి చూపించాలి. ట్రైకోమనియోసిస్ అనే వ్యాధి వల్ల ఇలా గర్భం నిలవకపోవడం జరుగుతుంది. 6 నెలలు గర్భం స్రావం బ్రూసిల్లోసిస్ అనే వ్యాధి వల్ల జరిగే అవకాశం ఉంది. ఇవి రెండూ అంటువ్యాధులే. పశువులు ఈనిన తరువాత 3 నుంచి 24 గంటల్లోపు మాయ వేయకపోతే తప్పనిసరిగా చికిత్స చేయించాలి. గర్భకోశం, యోని దిగజారుట .. కొన్ని పశువులు ఈనిన తరువాత యోని, గర్భకోశం బయటకు వస్తాయి. లిగమెంట్లు వదులు కావడం వల్ల అవి గర్భకోశాన్ని, యోనిని గట్టిగా తన స్థానంలో ఉండేట్టుగా బంధించి ఉంచలేవు. కొన్ని పశువులు ఈనక ముందే యోని బయటకు వస్తుంది. దీనికి ముందు జాగ్రత్తగా పశువుకు కడుపునిండా నీరు ఒక సారే పెట్టకూడదు. కొంచెం, కొంచెం చొప్పున ఎన్నిసార్లు అయినా పెట్టవచ్చు. అలానే పశువు పడుకోకుండా చూడాలి. ఈనిన పశువుకు గర్భకోశం బయటకు వచ్చినటై్టతే దానిని శుభ్రంగా చల్లటి నీళ్లతో సబ్బుతో కడిగి లోపలకు నెట్టాలి. అవసరమైతే మానం పెదవులు రెండూ కుట్టివేయాలి. సాధ్యమైనంత వరకు పడుకోనివ్వరాదు. ఈనక ముందు బయటకు వచ్చినా ఇదేవిధంగా చేయాలి. ఎండోమైట్రైసిస్ ..గర్భకోశ వ్యాధులలో ఇది ముఖ్యమైనది. ఈ వ్యాధి ఉన్న పశువులు త్వరగా ఎదకు రావు. తొందరగా కట్టకుండా తిరిగి తిరిగి ఎదుకు వస్తాయి. గర్భకోశం నుంచి చీములాగా స్రావం వస్తుంది. గర్భాశయద్వారపు వాపులు(సర్వీసైటిస్) .. సాధారణంగా పశువు చూడికట్టగానే గర్భాశయ ద్వారం మూసుకుపోతుంది. తిరిగి గేదె ఈనె సమయంలో తెరుచుకుంటుంది. ఈ వ్యాధిలో గర్భాశయ ద్వారం ఎప్పుడూ తెరుచుకునే ఉంటుంది. దీనివల్ల పశువు చూడికట్టుట, చూడి నిలబడటం కష్టం. ఈ వ్యాధిలో ఎలాంటి లక్షణాలు బయటకు కనబడవు. పరీక్ష చేస్తే తెలుస్తుంది. ఎప్పుడూ తిరుగ కట్టే పశువుల్లో ఈ వ్యాధి ఒక కారణం