Tiger Dies After Being Hit By Car In Gondia District Maharashtra - Sakshi
Sakshi News home page

అయ్యో..! కారు ప్రమాదంలో గాయపడిన పులి.. కుంటుకుంటూ.. వీడియో వైరల్..

Published Fri, Aug 11 2023 6:12 PM | Last Updated on Fri, Aug 11 2023 6:26 PM

Tiger Dies After Being Hit By Car In Gondia District Maharashtra - Sakshi

నాగ్‌పూర్‌: మహారాష్ట్రలోని అభయారణ్యంలో వేగంగా వెళుతున్న కారు ఓ పులిని ఢీకొట్టింది. ఈ ఘటనలో పులి తీవ్రంగా గాయపడిన పులి ప్రాణాలను కోల్పోయింది. గోండియా జిల్లాలోని నావగావ్‌- నజ్రియా కారిడార్‌లో ఈ ప్రమాదం జరిగింది. రెండేళ్ల పులి రోడ్డు దాటుతుండగా.. ముర్డోలీ అటవీ ప్రాంతంలోని కోహ్‌మారా-గోండియా రోడ్డులో ఈ ప్రమాదం జరిగిందని డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారి ప్రమోద్ పంచభాయ్ తెలిపారు. 
 
ఈ ఘటనలో ప్రమాదం జరిగిన చోటే రోడ్డుపైనే గాయంతో పులి కాసేపు కూర్చుండిపోయింది. కారు అక్కడే ఆగడంతో మళ్లీ ఏం ప్రమాదం పొంచి ఉందో? అనే భయంతో నొప్పి ఉన్న కాలుతోనే పొదల్లోకి కింద పడుతూ వెళ్లింది. ఈ ఘటనకు సంబంధించిన దశ్యాలను వెనుక ఉన్న వాహనదారులు వీడియో తీశారు. అటవీ అధికారి ప్రవీణ్ కాశ్వాన్ ట్విట్టర్ వేదికగా ఆ వీడియోను పంచుకున్నారు. 

అటవీ ప్రాంతంలో వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని ప్రవీణ్ కాశ్వాన్ కోరారు. జంతువులకు హాని కలగకుండా వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదానికి కారణమైన కారులో ఉన్న వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు జంతు ప్రేమికులు. గాయపడిన పులి కోసం అధికారులు ఉదయం వెతికి జంతు సంరక్షణ శిబిరానికి తీసుకువచ్చే క్రమంలో బాధిత పులి మరణించినట్లు చెప్పారు.     

ఇదీ చదవండి: పంజాబ్‌లో దారుణం.. ఇంట్లో చెప్పకుండా వెళ్లిందన్న కోపంలో ఓ తండ్రి ఘాతుకం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement