
సూర్యాపేట జిల్లా: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చివ్వెంల మండలం బీబీ గూడెం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. ఆర్టీసీ బస్సు, కారు ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ రోడ్డు ప్రమాదంలో మరణించి వారిలో ముగ్గురిని గడ్డం రవి, గడ్డం రేణుకు, గడ్డం రీతులుగా గుర్తించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. కారు నుజ్జు నుజ్జు కావడంతో వీరు స్పాట్ లో మరణించారు. గడ్డం రవి, ఇతర బంధువులు కలిసి మోతె మండలం కోటపహాడ్ లో శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అతి వేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. బస్సును కారు బలంగా ఢీకొట్టడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
మరో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
హనుమకొండ జిల్లా హసన్‌పర్లి మండలం చెరువు కట్ట వద్ద మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ లారీ ఢీ కొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడక్కడే దుర్మరణం చెందారు. మృతులు సీతం పేటకు చెందిన మహేష్, పవన్ లుగా గుర్తించారు పోలీసులు.
Comments
Please login to add a commentAdd a comment