suryapet district
-
సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ లో రెండు వర్గాల మధ్య ఘర్షణ
-
‘మీ సర్వే బోగస్ అని మీ పార్టీ నేతలే అంటున్నారు’
సూర్యాపేట జిల్లా: తెలంగాణ రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి(Revanth Reddy) సర్కార్ చేపట్టన సర్వే అంతా బోగస్ అని కాంగ్రెస్ పార్టీ నేతలే అంటున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి(Jagadish Reddy ఆరోపించారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సర్వేనే కరెక్ట్ ఉందని, ఇప్పుడు చేపట్టిన సర్వే బోగస్ అని తాను అనడం కాదని కాంగ్రెస్ పార్టీ నేతలే విమర్శిస్తున్న విషయాన్ని రేవంత్ తెలుసుకోవాలన్నారు. సూర్యాపేటలో ప్రెస్‌మీట్ నిర్వహించిన జగదీష్‌రెడ్డి.. రాష్ట్రంలో పాలన కుక్కల చించిన విస్తరిలా ఉందన్నారు. జనాభాను తగ్గించి చూపితే మన రాష్ట్రానికి నష్టమనే సోయిలేదా? అని విమర్శించారు.‘కాంగ్రెస్ పార్టీ(Congress Party)కి ప్రభుత్వాన్ని నడపడం చేతకావడం లేదు. కొంతమంది అనామకులు మేమున్నామని చెప్పుకోవడానికే అప్పుడప్పుడు మొరుగుతున్నారు. సీఐడీ కాదు అంతకంటే పెద్దది సీఐఏ తో ఎంక్వైరీ చేయించండి. ఎంక్వైరీ అంటూ జరిగితే ముందుగా జైలుకు పోయేది రేవంతే. గుమ్మడికాయ దొంగలేవరంటే కాంగ్రెస్ నేతలు భుజాలు తడుముకుంటున్నారు. లక్ష డప్పులు.. వేల గొంతుల కార్యక్రమాన్ని కూడా అడ్డుకోవడానికే అసెంబ్లీ పెట్టారు.ప్రజలకు ఇచ్చిన మ్యానిఫెస్టో హామీలను పూర్తిగా అమలుచేయాలి’ అని ఆయన డిమాండ్ చేశారు. -
అమ్మతనం ఆటకు అడ్డుకాలేదు
సంకల్పమే సగం విజయమన్నారు పెద్దలు.. కృషితో ఉన్నత శిఖరాలను చేరుకొన్న కొంత మంది మహిళలను ఆదర్శంగా తీసుకున్న ఆమె లేటు వయస్సులో టెన్నిస్ క్రీడపై మక్కువ పెంచుకొంది. ఇద్దరు పిల్లల తల్లి అన్న విషయాన్ని పక్కన పెట్టి భర్త ప్రోత్సాహంతో కఠోర శ్రమతో అంతర్జాతీయ క్రీడాకారిణిగా రాణించింది. దాంతో సంతృప్తి చెందకుండా నేను సైతం అంటూ ఫౌండేషన్ ఏర్పాటు చేసి సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అడివెంలకు చెందిన బోయలపల్లి రేఖ. అర్వపల్లి: హైదరాబాద్‌లో రేఖ ఎంబీఏ చదువుతుండగా కళాశాలలో ఏర్పాటు చేసిన ఫ్యాషన్ షోలో పాల్గొంది. అదే సమయంలో ఆల్బమ్ చిత్రీకరణ పనిలో ఉన్న సినీ దర్శకుడు అగస్త్య హీరోయిన్ కోసం వెతుకుతున్నాడు. ఆయన రేఖను ఎంపిక చేశాడు. కానీ, రేఖను ఆల్బమ్‌లో నటింపజేసేందుకు కాకుండా తన జీవిత భాగస్వామిగా ఉండేందుకు ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. వారు పెళ్లి చేసుకుని ల్యాంకోహిల్స్‌లో కాపురం పెట్టారు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఫిట్నెస్ను మెరుగుపరుచుకోవడానికి ఇరుగుపొరుగు మహిళలతో కలిసి జిమ్ చేయడంతో పాటు టెన్నిస్ ఆడేవారు. అప్పుడే ఆమె ప్రొఫెషనల్ ప్లేయర్ కావాలని నిర్ణయించుకున్నారు.ముంబైలో కోచింగ్..తన భర్త అగస్త్య.. హిందీ సినిమాల్లో పనిచేసేందుకు ముంబైకి వెళ్లాల్సి వచ్చింది. భర్తతోపాటు రేఖ కూడా తన ఇద్దరు పిల్లలను వెళ్లారు. అప్పుడు రేఖ ముంబైలోని ‘ప్రాక్ టెన్నిస్’ అనే అకాడమీలో చేరి కఠోర సాధన చేశారు. ఉదయం 5 గంటలకే గ్రౌండ్లో ఉండేవారు. 6.30 గంటల వరకు ప్రాక్టీస్ చేసి 7.30 గంటలకు ఇంటికి వెళ్లి పిల్లలను రెడీచేసి స్కూల్‌కు పంపించేవారు. తిరిగి సాయంత్రం 4.30 గంటలకు అకాడవీుకి వెళ్లి ముందుగా జిమ్ చేసి ఒక గంటపాటు టెన్నిస్ ప్రాక్టీస్ చేసేవారు.సింగిల్స్‌గానే..రేఖ మొదట ఏఐటి(ఆలిండియా టెన్నిస్ అసోసియేషన్)లో రేఖకు మొదట సింగిల్స్ ఆడే అవకాశం వచ్చింది.. తన వ్యక్తిగత కారణాల వల్ల డబుల్స్ ఆడలేదు. ఐటీఎఫ్ (ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్)లో ఆడారు. ఆ తర్వాత థాయిలాండ్‌తో పాటు వివిధ దేశాల్లో ఆడారు. స్పెయిన్‌కు పయనంజాతీయ స్థాయి పోటీలలో పాల్గొనాలంటే.. ముంబైలో ప్రాక్టీస్ సరిపోదని, విదేశాలకు వెళ్లాలని రేఖకు తన భర్త అగస్త్యతో పాటు పలువువరు సలహా ఇచ్చారు. దాంతో ఆమె యూరప్‌లోని స్పెయిన్‌కు వెళ్లి అక్కడ ‘మున్డో’ స్పోర్ట్స్ అకాడమీలో చేరారు. భర్త, పిల్లలు ముంబైలోనే ఉంచి ఆమె ఒక్కరే స్పెయిన్ వెళ్లి రెండు నెలలపాటు స్పెయిన్‌లో కోచింగ్ తీసుకున్నారు. ఆమెకు ఎవరూ స్పాన్సర్షిప్ లేకపోవడంతో సొంత ఖర్చులతోనే స్పెయిన్ వెళ్లారు.ఆటకు ‘లాక్డౌన్’రేఖ వివిధ దేశాల్లో ఆడుతూ బిజీ అవుతున్న సమయంలో వచ్చిన లాక్‌డౌన్‌తో ఆటకు ఫుల్ స్టాప్ పెట్టాల్సి వచ్చింది. లాక్డౌన్ సమయంలో ఆమె హైదరాబాద్‌లోని ల్యాంకోహిల్స్‌లో ఉన్నారు. తాను ఉంటున్న అపార్ట్మెంట్ల పక్కన వివిధ రాష్ట్రాలకు చెందిన వేల మంది తిండికి ఇబ్బంది పడడం రేఖ చూసి చలించిపోయారు. ఆ కూలీలకు ఆమె స్వయంగా అన్నం వండిపెట్టారు. అప్పుడే తనకు సేవ చేయాలనే ఆలోచన వచ్చి ‘రేఖా చారిటబుల్ ఫౌండేషన్’ ఏర్పాటు చేశారు. తన ఫౌండేషన్ నుంచి కరోనా సమయంలో రోజుకు 2వేల మందికి భోజనం వండిపెట్టారు. వివిధ రాష్ట్రాల వారికి ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసి వారిని స్వస్థలాలకు పంపారు. ఆ సమయంలో రేఖకు సేవా రంగంలో మంచి గుర్తింపు వచ్చింది. ఆయా రాష్ట్రాల సీఎంల నుంచి అభినందనలు అందుకున్నారు. అంతేకాకుండా ‘రేఖ స్పోర్ట్స్ ఫౌండేషన్’ను కూడా స్థాపించి క్రీడాకారులను ఆమె ప్రోత్సహిస్తున్నారు.సొంత నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలురేఖ తన సొంత నియోజకవర్గమైన తుంగతుర్తి నియోజకవర్గంలో సేవా కార్యక్రమంలో ముమ్మరం చేశారు. జాజిరెడ్డిగూడెం మండలంలో ఈ విద్యా సంవత్సరం 30 ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు నోటు పుస్తకాల పంపిణీ చేశారు. క్రీడా దుస్తులు ఇచ్చారు. ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. క్రీడా సామగ్రి అందజేశారు. తాను చదువుకున్న అడివెంల గ్రామ ప్రాథమిక పాఠశాలకు రూ.3లక్షలతో మరమ్మతులు చేయించి క్రీడా సామగ్రి, ఆరో ప్లాంట్ పెట్టించారు. తాను చేసే సేవ రాజకీయాల కోసం కాదని, కేవలం సేవా దృక్పథంతోనేనని రేఖ చెబుతున్నారు. -
తుంగతుర్తి కాంగ్రెస్‌లో ముసలం.. రహస్య ప్రాంతంలో అసమ్మతి నేతలు
సాక్షి, సూర్యాపేట జిల్లా: తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీలో లొల్లి కొనసాగుతోంది. ఎమ్మెల్యే మందుల సామేల్‌కు వ్యతిరేకంగా ఉదయం 11 గంటలకు జాజిరెడ్డిగూడెంలో అసమ్మతి వర్గం సమావేశం సమావేశం కానుంది. దగా పడ్డా కాంగ్రెస్ సీనియర్ ల్లారా కదలిరండి పేరుతో కార్యక్రమం చేపట్టారు. డీసీసీ ఉపాధ్యక్షుడు యోగానంద చారి అధ్యక్షతన సమావేశం జరగనుంది. గత కొంతకాలంగా సామేల్, యోగానంద చారి మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. గతంలో జాజిరెడ్డిగూడెం మండలంలో పర్యటించిన ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా యోగానంద నిరసన కార్యక్రమం చేయించారు. అసమ్మతి వర్గం వెనుక ఓ మాజీ మంత్రి ఉన్నట్లు ఎమ్మెల్యే అనుచరులు ఆరోపిస్తున్నారు.కాగా, జాజిరెడ్డిగూడెంలో కాంగ్రెస్ అసమ్మతి నేతలను ముందస్తు అరెస్ట్ చేసినట్లు సమాచారం. జాజిరెడ్డిగూడెం మండల పార్టీ అధ్యక్షుడు మోరపాక సత్యం, తుంగతుర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డితో పాటు పలువురు నేతలను అరెస్టు చేసి రహస్య ప్రాంతానికి తరలించినట్లు సమాచారం.అసమ్మతి నేతలను ముందస్తు అరెస్ట్ చేశారని.. కాంగ్రెస్ నేతలు సమావేశం అయ్యే అవకాశం కూడా పార్టీలో లేదా అంటూ వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు పెడుతున్నారు. సామేల్ కాంగ్రెస్‌లో ఉన్నారా? బీఆర్ఎస్లో ఉన్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అరెస్ట్ చేసిన నేతలను విడిచిపెట్టకపోతే జాజిరెడ్డిగూడెం బంద్ చేస్తామని హెచ్చరిస్తున్నారు.ఇదీ చదవండి: సర్కార్‌పై సమరానికి సై! -
అమెరికాలో సూర్యాపేట జిల్లావాసి మృతి
ఆత్మకూర్ (ఎస్): అమెరికాలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలం పాతర్లపహాడ్ గ్రామానికి చెందిన తప్సి ప్రవీణ్‌కుమార్ (39) ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్‌లో పడి మృతిచెందాడు. భారత కాలమాన ప్రకారం శనివారం ఉదయం సుమారు 8 గంటల సమయంలో ప్రవీణ్‌కుమార్ వారి ఇంటి సమీపంలోని స్విమ్మింగ్ పూల్ వద్ద కాలక్షేపం కోసం వెళ్లి అందులో పడి మృతి చెందినట్లు అతడి భార్య శాంతి ఆదివారం ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు తెలిపారు. పాతర్లపహాడ్ గ్రామానికి చెందిన నాగయ్యకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం. మృతుడు ప్రవీణ్ చిన్న కుమారుడు. ఎమ్మెస్సీ చేసిన ప్రవీణ్ హైదరాబాద్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఉపాధ్యాయ వృత్తిలో మంచి నైపుణ్యం ఉన్న ప్రవీణ్ ఆ్రస్టేలియా ఇతర దేశాల్లో ఉపాధ్యాయుడిగా పనిచేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఐదేళ్ల క్రితం మిత్రులతో కలిసి అమెరికాకు వెళ్లిన ప్రవీణ్‌కుమార్ అట్లాంటా ప్రాంతంలో పనిచేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రవీణ్‌కుమార్ మృతితో పాతర్లపహాడ్ గ్రామంలో విషాదం నెలకొంది. -
అవ్వ గొలుసు కక్కిన దొంగ
-
సూర్యాపేటలో దొంగల ముఠా హల్చల్
-
శ్రీశైలం ప్రాజెక్టుకు కృష్ణమ్మ పరవళ్లు
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టులోకి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు 96, 369 క్యూసెక్కుల నీరు రావడంతో నీటినిల్వ 822.5 అడు గుల్లో 42.73 టీఎంసీలకు చేరుకుంది. నాగార్జునసాగర్ లోకి ఎలాంటి వరద చేరకపోగా.. పులిచింతల ప్రాజెక్టు లోకి కేవలం 640 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. కాగా పులిచింతలకు దిగువన నదిపరీవాహక ప్రాంతం(బేసిన్)లో విస్తారంగా కురిసిన వర్షాలకు కట్టలేరు, మున్నేరు పరవళ్లు తొక్కగా, ఏపీలోని ప్రకాశం బ్యారేజీలోకి 13,634 క్యూసెక్కుల నీరు చేరింది.ఇందులో కృష్ణా డెల్టా కు 1,309 క్యూసెక్కుల నీటి విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 12,325 క్యూసెక్కులను 17 గేట్లు ఒక అడుగు మేర ఎత్తి సముద్రంలోకి అధికారులు వదిలేస్తున్నారు. పశ్చిమ కనుమల్లో కురుస్తున్న వర్షాల ప్రభావం వల్ల కృష్ణా ప్రధానపాయలో ఎగువన వరద ప్రవాహం కొంత పెరిగింది. ఆల్మట్టిలోకి 1.24 లక్షల క్యూసెక్కుల నీరు చేరగా, గేట్లు ఎత్తి 1.50 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలారు.దాని దిగువన నారాయణపూర్ డ్యామ్‌లోకి 1.25 లక్షల క్యూసెక్కుల నీరు చేరగా, గేట్లు ఎత్తి 1,45,750 క్యూసెక్కుల నీటికి వదలడంతో జూరాల ప్రాజెక్టులోకి చేరుతున్న వరద క్రమేపి పెరుగుతోంది. జూరాల ప్రాజెక్టులోకి 1,29,000 లక్షల క్యూసెక్కుల నీరు చేరగా.. విద్యుదుత్పత్తి చేస్తూ, గేట్లు ఎత్తి 1,34,161 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. మూడు రోజుల్లో తుంగభద్ర గేట్లు ఎత్తేసే అవకాశంఇక కృష్ణా ప్రధాన ఉపనది తుంగభద్రలో వరద ఉధృతి మరింత పెరిగింది. తుంగభద్ర డ్యామ్‌లోకి 1,17,647 క్యూసెక్కుల నీటిరాకతో నీటినిల్వ 78.67 టీఎంసీలకు చే రుకుంది. నిండుకుండను తలపిస్తున్న తుంగభద్ర డ్యామ్ లో ఆదివారం విద్యుదుత్పత్తిని ప్రారంభించిన అధికారు లు.. 4,754 క్యూసెక్కులను దిగువకు వదిలారు. తుంగభద్రలో మరో మూడు రోజులు ఇదే రీతిలో వరద వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరో 27 టీఎంసీలు చేరితే తుంగభద్ర డ్యామ్ నిండుతుంది. మూడు రోజుల్లో తుంగభద్ర డ్యామ్ నిండే అవకాశముంది. సాగర్ నీటిమట్టం 504.30 అడుగులునాగార్జునసాగర్/మునగాల: నాగార్జునసాగర్ నీటిమట్టం ప్రస్తుతం 504.30 అడుగులుగా ఉంది. తాగునీటికి అవసరాల కోసం కుడి కాల్వ ద్వారా 5,700 క్యూసెక్కులు, ఎడమ కాల్వ ద్వారా 3,146 క్యూసెక్కులు, ఏఎమ్మార్పీ ద్వారా 800 క్యూసెక్కులు ఇలా మొత్తం 9,646 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. సాగర్‌కు ఇన్‌ఫ్లో ఏమాత్రం లేదు.ఎడమకాల్వ లాకుల వద్ద పహారా: సూర్యాపేట జిల్లా మునగాలలోని సాగర్ ఎడమకాల్వ ప్రధాన లాకుల వద్ద రెవెన్యూ, పోలీస్ సిబ్బంది పహారా కాస్తున్నారు. తాగునీటి అవసరాల కోసం సాగర్ ఎడమకాల్వకు నీటిని విడుదల చేస్తుండగా, రైతులు ఈ నీటిని పంటల సాగుకు మళ్లించకుండా ఉండేందుకు పహారా ఏర్పాటు చేశారు. -
ఉపాధి కూలీ అవతారమెత్తిన IRS అధికారి
-
వర్షంలో చిల్ అవుతున్న మందుబాబులు
-
సూర్యాపేట జిల్లా అమీనాబాద్ లో క్షుద్రపూజల కలకలం
-
సూర్యాపేటలో యాక్సిడెంట్.. ఆరుగురి దుర్మరణం
సూర్యాపేట, సాక్షి: తెల్లవారుఝామున ఘోర రోడ్డు ప్రమాదంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి నెత్తురోడింది. కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగాపురం సమీపంలో జరిగిన ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఆగి ఉన్న లారీని వెనక నుంచి కారు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కారు హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో కారులో ఎనిమిది మంది ప్రయాణిస్తున్నారు. ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వాళ్ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతదేహాలను పోస్టుమార్టం కోసం కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. లారీ బ్రేక్ డౌన్ కావడంతో డ్రైవర్ దానిని రోడ్డు పక్కగా నిలిపాడు. అయితే కారును వేగంగా నడుపుతున్న వ్యక్తి ఓ వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో గమనించకుండా లారీని ఢీ కొట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రమాదం ధాటికి కారు లారీ కిందకు వెళ్లిపోయింది. ఇరుక్కుపోయిన వాహనాన్ని స్థానికుల సాయంతో పోలీసులు బయటకు తీశారు. ఆ తర్వాతే మృతదేహాలను, క్షతగాత్రులను తరలించారు. మృతుల వివరాలుకారులో ప్రయాణిస్తున్నవాళ్లంతా ఒకే కుటుంబానికి చెందిన వాళ్లుగా తెలుస్తోంది. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం ఎల్ గోవిందాపురం గ్రామానికి చెందినవాళ్లని పోలీసులు గుర్తించారు. విజయవాడ గుణదలకు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. మాణిక్యంస్వర్ణచందర్ రావుకృష్టంరాజులాస్యశ్రీకాంత్ఇదిలా ఉంటే..రెండ్రోజుల కిందట ఇదే తరహాలో మునగాల మండలం ముకుందాపురం వద్ద ఘోరం జరిగింది. ఆగి ఉన్న కారును వేగంగా ఢీ కొట్టింది ఓ కారు. ఈ ప్రమాదంలో అందులో ఉన్న యువ దంపతులు అక్కడికక్కడే మరణించారు. -
అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం
జనగామ/ తుంగతుర్తి/ సూర్యాపేట రూరల్: ‘‘పంట ఎండిపోయిందని అధైర్యపడొద్దు.. ధైర్యంగా ఉండండి.. అధికారులు వచ్చినప్పుడు నష్టం వివరాల ను రాయించుకోండి. మేం అండగా ఉంటాం’’అని రైతులకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భరోసా ఇచ్చారు. ఎండిన పంట పొలాల పరిశీలనలో భాగంగా.. ఆదివారం జనగా మ జిల్లా దేవరుప్పుల మండలం ధరావత్ తండాలో, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం సింగారంతండా, మొండికుంట తండా, సూర్యా పేట మండలం ఎర్కారం గ్రామాల్లో పర్యటించారు. అక్కడి రైతులతో మాట్లాడారు. ‘‘యాసంగిలో ఎన్ని ఎకరాల్లో వరి సాగు చేశారు. ఎంత పెట్టుబడి పెట్టారు. కరెంటు ఎన్ని గంటలు వస్తోంది. కాలువల ద్వారా నీళ్లొస్తున్నాయా. బోర్లలో నీళ్లు ఉన్నాయా.. రైతుబంధు వచ్చిందా..’’ అని అడిగి తెలుసుకున్నారు. నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయంటూ.. కేసీఆర్‌కు రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. పొట్టదశకు వచ్చిన పంట నీళ్లు లేక ఎండిపోయిందంటూ కన్నీళ్లుపెట్టుకున్నారు. జనగామ జిల్లా ధరావత్ తండాలో మహిళా రైతు అముగోతు సత్తెమ్మ మాట్లాడుతూ.. ‘‘సారూ.. ఎనిమిది ఎకరా ల్లో వరి వేసినం. రూ.3 లక్షలకుపైగా పెట్టుబడులు అయినయి. కాలువ నీళ్లు రాక.. రూ.1.80 లక్షలు ఖర్చుచేసి నాలుగు బోర్లు వేయించినం. వాటిలోనూ నీళ్లు సరిగా పడలేదు. పంటంతా ఎండిపోతోంది. ఇక మాకు దిక్కెవరు..’’ అంటూ కన్నీరు పెట్టుకుంది. కుమారుడి పెళ్లి పెట్టుకున్నామని, అప్పులు కూడా పుట్టట్లేదని వాపోయింది. దీంతో ‘‘బిడ్డా బాధపడకు.. మళ్లీ వచ్చేది మనమే. బాధలన్నీ తీరుతయి. అందాక రూ.5లక్షల చెక్కు పంపిస్తా.. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెచ్చిస్తరు’’ అని భరోసా ఇచ్చారు. సాగు నీళ్లు రావడం లేదంటూ.. తర్వాత కేసీఆర్ సూర్యాపేట జిల్లాలోని సింగారం, మొండికుంట తండాల్లో ఎండిపోయిన పొలాలను పరిశీలించారు. రైతులు దయ్యాల వెంకటనారాయ ణ, ధరావత్ సురేశ్, భూక్యా శ్రీను, ఆంగోతు హర్జా, గుగులోతు సుశీలతో మాట్లాడారు. ఈ రెండు తండాల్లో 250 ఎకరాల వరకు వరి వేయగా.. పూర్తిగా ఎండిపోయిందని రైతులు తెలిపారు. గత ఐదారేళ్లు ఎస్సారెస్పీ కాలువ ద్వారా గోదావరి జలా లు రావడంతో.. పంటలు బాగా పండాయన్నారు. ఈ యాసంగి సీజన్ మొదట్లో కాల్వల ద్వారా నీళ్లు వదలడంతో.. వరి వేశామని, కానీ ఇప్పుడు నీళ్లు రాక పంటలన్నీ ఎండిపోయాయని వాపోయారు. రోజులో 16 గంటలే కరెంట్ వస్తోందని.. అదికూడా 16 సార్లు ట్రిప్ అవుతోందని పేర్కొన్నారు. ప్రభు త్వం నుంచి నష్టపరిహారం వచ్చేలా చూడాలని వేడుకున్నారు. అనంతరం కేసీఆర్ సూర్యాపేట మండలం ఎర్కారం చేరుకున్నారు. మళ్లీ అప్పుల పాలవుతున్నాం.. ఎర్కారం గ్రామంలో రైతు కొదమగుండ్ల వెంకటయ్య, సరోజనమ్మ పొలాన్ని కేసీఆర్ పరిశీలించారు. ఈ సమయంలో సరోజనమ్మ కేసీఆర్ వద్దకు వచ్చి విలపించింది. ‘‘మీరు సీఎంగా ఉన్నప్పుడు సాగునీళ్లు వచ్చేవి. సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు కష్టాలు మొదలయ్యాయి. కాలువ నీళ్లు రావట్లేదు. ఐదెకరాల్లో వరి ఎండింది. మళ్లీ అప్పుల పాలు అవుతున్నాం’’ అని ఆవేదన వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడుతా రైతుల గోడు ఆలకించిన కేసీఆర్.. వారికి ధైర్యం చెప్పారు. ఏ రైతును పలకరించినా కన్నీరే వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టకాలంలో అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తానని.. ఎండిన వరి పొలాలకు ఎకరానికి రూ.25 వేలు నష్ట పరిహారం వచ్చేలా చేస్తానని చెప్పారు. ఎన్ని కష్టాలెదురైనా మళ్లీ 24 గంటల కరెంట్‌ను సాధించుకుందామన్నారు. -
రోడ్డు ప్రమాదాల్లో 8 మంది మృతి
మునగాల, మోతె (కోదాడ)/నంగునూరు (సిద్దిపేట): సూ ర్యాపేట, సిద్దిపేట జిల్లాల్లో బుధవారం జరిగిన రెండు ఘోర రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయా రు. వివరాలిలా ఉన్నాయి.. సూర్యాపేట జిల్లా మోతె మండ ల కేంద్రం శివారులో ఖమ్మం–సూర్యాపేట జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు ఆ స్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. మునగాల మండలం విజయరాఘవపురం గ్రామానికి చెందిన పది మంది, రేపాల గ్రామానికి చెందిన ఇద్దరు మహిళా వ్యవసాయ కూ లీలు మోతె మండలం హుస్సేనాబాద్‌లోని మిర్చి తోటలో కాయలు ఏరేందుకు ఆటోలో బయలుదేరారు. మార్గమధ్య లో ఖమ్మం జిల్లా మధిర నుంచి హైదరాబాద్ వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు మోతె శివారులో యూటర్న్ తీసుకునే క్రమంలో ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విజయరాఘవపురం గ్రామానికి చెందిన కందుల నాగమ్మ(55), చెవుల నారాయణమ్మ(56), రేపాల గ్రామానికి చెందిన పోకల అనసూర్య (65) తీవ్ర గా యాలతో ఘటనా స్థలంలోనే మృతిచెందారు. విజయరాఘవపురానికి చెందిన రెమిడాల సౌభాగ్యమ్మ(75) సూర్యాపేట ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. విజయరాఘవపురం గ్రామానికి చెందిన కందుల గురువయ్య (65) ను హైదరాబాద్‌కు తరలించగా అక్కడ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందాడు. రేపాల గ్రామానికి చెందిన సొంపంగు లక్ష్మి తీవ్రంగా గాయపడగా కుటుంబ సభ్యు లు హైదరాబాద్‌కు తరలించారు. విజయరాఘవపురం గ్రా మానికి చెందిన కత్తి విజయమ్మ, పాలపాటి మంగమ్మ సూ ర్యాపేట ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ టో డ్రైవర్ పవన్‌తో పాటు మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. కోదాడ డీఎస్పీ ఎం.శ్రీధర్‌రెడ్డి, మునగాల సీఐ డి.రామకృష్ణారెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సిద్దిపేట జిల్లాలో ముగ్గురు మృతి కారు బైకును ఢీకొన్న ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెంద గా మరో ఏడుగురికి గాయాలయ్యా యి. ఈ ఘటన సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాంపూర్ వద్ద జరి గింది. కొండపాక మండలం దుద్దెడ గ్రామానికి చెందిన జక్కుల అనిల్, భార్య మమత, అతని బావమరిది బాబురాజు, భార్య కీర్తన, పిల్లలు చర ణ్, భానుప్రసాద్, వైష్ణవి, హన్విక, నాన్సి, ప్రణయ్‌తో కలసి హుస్నాబాద్‌లో జరిగిన బంధువుల పెళ్లికి కారు లో వెళ్లారు. తిరిగి వస్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న బైక్‌ను కారు ఢీకొ ట్టి రోడ్డు కిందకు ఈడ్చుకెళ్లింది. దీంతో పక్కనే ఉన్న కాల్వలో బైక్, కారు పడిపోయాయి. ఈ ప్రమాదంలో బద్దిపడగకు చెందిన కట్ట రవి (55), నాగరాజుపల్లికి చెందిన ముక్కెర అయిలయ్య (58), జక్కుల మమత (28) అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా వారిలో బాబురాజు పరిస్థితి విషమంగా ఉండగా గాయాలపాలైన చిన్నారులను సిద్దిపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానికులు వచ్చి కారులో ఇరుక్కున్న వారిని బయటకు తీశారు. సిద్దిపేట రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సూర్యాపేట: ఉద్రిక్తత.. మాజీ ఎంపీపీ కవితపై స్థానికుల దాడి
సాక్షి, సూర్యాపేట జిల్లా: కోదాడ మండలం గుడిబండ గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ఎంపీపీ కవితపై స్థానికులు దాడికి యత్నించారు. తమ భూమిని అక్రమంగా కబ్జా చేసి ఇళ్లు నిర్మించుకుందంటూ ఆరోపిస్తూ.. కవిత ఇంటి లోపల టెంటు వేసి నిరసన తెలిపేందుకు స్థానికులు యత్నించారు. దీంతో కవిత అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఆగ్రహంతో కవిత జుట్టు పట్టుకుని స్థానికులు దాడికి దిగారు. తమ స్థలాల్ని కబ్జా చేసిన కవితపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. భూమి తిరిగిచ్చేంత వరకు నిరసన తెలుపుతామని స్థానికులు అంటున్నారు. -
కొట్టుకుపోయిన సాగర్ ఎడమకాలువ ఎస్కేప్ షట్టర్
చిలుకూరు: సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం పోలేనిగూడెం పరిధిలో నాగార్జునసాగర్ ఎడమ కాలువకు ఏర్పాటు చేసిన ఎస్కేప్ షట్టర్ నీటి ప్రవాహానికి ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో కొట్టుకుపోయింది. దీంతో సుమారు 1,500 క్యూసెక్కుల వరద కాలువ నుంచి బయటికెళ్లి సమీప గ్రామాల పంటపొలాలను ముంచెత్తింది. నాగార్జున్ సాగర్ ప్రధాన కాలువ 113.14వ కిలోమీటర్ వద్ద కాలువకు అనుబంధంగా 18 ఏళ్ల క్రితం ఎస్కేప్‌ను నిర్మించి రెండు షట్టర్లు ఏర్పాటు చేశారు. ఇవి పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. ఈ షట్టర్లను తొలగించి, కొత్తగా ఎస్కేప్ ఏర్పాటు చేయా లని నిర్ణయించిన ఎన్ఎస్పీ అధికారులు రూ.62 లక్షల నిధులు కూడా మంజూరు చేశారు. ఈ పనులకు సంబంధించి టెండర్లు కూడా పూర్తి కాగా మరో వారం రోజుల్లో పనులు ప్రారంభించాల్సి ఉంది. అయితే, సాగర్ ఆయకట్టు పరిధి రెండో జోన్‌లోని పంటలను కాపాడటంలో భాగంగా అధికారులు పాలేరు రిజర్వాయర్‌ను నింపేందుకు ఈనెల 16న నాగార్జునసాగర్‌లో 6,200 క్యూ సెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ జలా లు నేరుగా పాలేరుకు వెళ్తున్నాయి. 19.5 అడుగుల ఎత్తు నుంచి నీటి ప్రవాహం ఉధృతంగా వెళ్తుండటంతో శిథిలావస్థకు చేరిన ఎస్కేప్ షట్టర్ కొట్టుకుపోయిందని రైతులు చెబుతున్నారు. దీనికితోడు షట్టర్‌కు బిగించిన బేరింగ్లను ఇటీవల దుండగులు ఎత్తుకుపోయారు. దీంతోపాటు చిలుకూరు మండలం బేతవోలు చెరువును నింపేందుకు రై తులు జేసీబీతో షట్టర్‌ను కొద్దిగా పైకి లేపిన ట్లు తెలిసింది. ఈక్రమంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో గేటు తట్టుకోలేక కొట్టుకుపోయి ఉంటుందని భావిస్తున్నారు. కాలువ కింద, పక్కన ఏమైనా సంఘటన జరిగినప్పుడు నీళ్ల తాకిడిని తగ్గించి మళ్లించేందుకు వీలుగా ఏర్పాటుచేసిన దానిని ఎస్కేప్ షట్టర్‌ను అంటారు. ఆయకట్టు పరిధిలోని మునగాల, బరాఖత్‌గూడెం, ముకుందాపురం, చిలుకూరు మండలంలోని పోలేనిగూడెం, బేతవోలు తదితర గ్రామాల్లో సుమారు 600 ఎకరాల చేతికొచ్చిన వరి పంట నీట మునిగిందని రైతులు వాపోతున్నారు. విషయం తెలుసుకున్న ఎన్ఎస్పీ సీఈ రమేష్, ఈఈ సత్యనారాయ ణ, డీఈ రఘు తదితరులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో సాగర్, అడవిదేవులపల్లి రిజర్వాయర్ వద్ద నీటిని నిలిపివేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే షట్టర్ కొట్టుకుపోయి నష్టం వాటిల్లిందని రైతులు ఆరోపిస్తున్నారు. కాగా, కొట్టుకుపోయిన గేటు స్థానంలో సోమవారం రాత్రి కొత్త గేటును అమర్చినట్లు ఎన్ఎస్పీ అధికారులు చెప్పారు. -
యూరియా కొరత.. రోడ్డెక్కిన రైతులు
పెన్‌పహాడ్, హాలియా: ప్రభుత్వం యూరియా సరఫరా చేయకపోవడాన్ని నిరసిస్తూ సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండల కేంద్రంలోని సూర్యాపేట–గరిడేపల్లి ప్రధాన రహదారిపై శుక్రవారం రైతులు రాస్తారోకో చేశారు. పంటలకు సరైన సమయంలో యూరియా వేయకపోవడంతో వాటి ఎదుగుదల లేక.. దిగుబడిపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి.. సరిపడా యూరియాను త్వరితగతిన సరఫరా చేయడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. అనుముల మండలం కొత్తపల్లి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం కార్యాలయం ఎదుట శుక్రవారం యూరియా కోసం రైతులు ఉదయం నుంచే బారులు తీరారు. అందరికీ అందక నిరాశతో వెనుదిరిగారు. -
తుంగతుర్తి: పటిష్టంగా కాంగ్రెస్.. బీఆర్ఎస్కు గట్టి పోటీ తప్పదా?
తుంగతుర్తి నియోజవర్గం 1957లో ఏర్పాటు అయింది. ఇప్పటి వరకు 13 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇక్కడి నుంచి సాయుధ పోరాటం చేసి చరిత్రలో నిలిచిన మల్లు స్వరాజ్యం రెండు సార్లు విజయం సాధించారు. ఇక మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి నాలుగుసార్లు విజయం సాధించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న మల్లు స్వరాజ్యం నియోజకవర్గంపై తన మార్కు చూపించారు. టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వస్థలం కూడా తిరుమలగిరి మండలమే. మరోవైపు మంత్రి జగదీష్ రెడ్డి స్వస్థలం కూడా నాగారమే. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఇక్కడి నుంచి అత్యధికంగా నాలుగు సార్లు విజయం సాధించారు. 1985, 1989, 1994లో దామోదర్ రెడ్డి ఇక్కడి నుంచి హ్యాట్రిక్ విజయం సాధించారు. అయితే 1999లో మాత్రం సంకినేని వెంకటేశ్వరరావు చేతిలో ఓడిపోయారు. ఆతర్వాత మరోసారి 2004లో గెలిచారు. 2009లో ఇది ఎస్సీ రిజర్వుడు అయింది. రిజర్వుడుగా మారిన తర్వాత తొలి ఎన్నికల్లో 2009 మోత్కుపల్లి నర్సింహులు గెలిచారు. 2014, 18లో బీఆర్ఎస్ అభ్యర్థి గాదరి కిషోర్ వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. ఈసారి కూడా బీఆర్ఎస్ తరపున ఆయనకే టికెట్ దక్కింది. అభివృద్ది చేసినా.. ప్రతిపక్షాలకు చిక్కేలా బీఆర్ఎస్? తెలంగాణ ఏర్పడిన తర్వాత నియోజకవర్గం అభివృద్ధి పథాన నడిచిందనే వాదన ఉంది. అయితే ఇక్కడ నుంచి వెళ్లే మూసీ, బిక్కేరు వాగు నుంచి నిత్యం వందలాది లారీల ఇసుక తరలివెళ్తోంది. ఇసుక కూడా ఎన్నికల ప్రధాన విమర్శనాస్త్రంగా ప్రతిపక్షాలకు మారే అవకాశం ఉంది. దీనికి తోడు ఇసుక లారీల కారణంగా రోడ్లు దెబ్బతింటున్నాయన్న విమర్శలు ఉన్నాయి. కొన్ని మారుమూల ప్రాంతాలకు రోడ్ల నిర్మాణం చేయాల్సి ఉందని ప్రజలు అంటున్నారు. ప్రధాన పార్టీల టికెట్ల కోసం పోటీ పడుతున్నవారు : ఇక్కడ ప్రధాన పోటీ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే ఉంటుంది. గత రెండు ఎన్నికల్లో గెలిచిన కిషోర్ ఆధిక్యం మూడు వేలు దాటలేదు అంటేనే పోటీ ఎంత రసవత్తరంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. బీఆర్ఎస్ నుంచి కిషోరే మరోసారి పోటీ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారనే అంశంపై నేతలతో పాటు ఆ పార్టీ అధిష్టానానికి కూడా క్లారిటీ లేకుండా పోయిందనే విమర్శలు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అత్యంత పటిష్టంగా ఉంది. ఆ పార్టీ నుంచి వడ్డేపల్లి రవితో పాటు గతంలో పోటీ చేసి ఓడిన అద్దంకి దయాకర్ కూడా మరోసారి టికెట్ ఆశిస్తున్నారు. బీజేపీ నుంచి కడియం రామచంద్రయ్య మరోసారి పోటీ చేయనున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పాల్వాయి రజిని కూడా బరిలో నిలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. వృత్తిపరంగా ఓటర్లు : నియోజకవర్గంలో ఒకప్పుడు సాగునీటి కొరత ఉండేది. కానీ వైఎస్సార్ హయాంలో నిర్మించిన ఎస్సారెస్పీ కాలువ ద్వారా సాగునీటి కొరత తీరడంతో పాటు ప్రస్తుతం కాళేశ్వరం జలాలు కూడా వస్తుండటంతో రెండు పంటలు పండుతున్నాయి. ఇక్కడ ప్రధానంగా రైతులతో పాటు వ్యవసాయ కూలీలు కూడా అధికంగా ఉంటారు. మరోవైపు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు ఉపాధి కోసం వెళ్తుంటారు. ఇక తిరుమలగిరి వ్యాపార కేంద్రంగా ఉంది. మతం/కులాల వారిగా ఓటర్లు : ఇక్కడ ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లే అధికంగా ఉంటారు. దాదాపు 45 నుంచి 50 వేల వరకు వారే ఉంటారని లెక్కలు చెప్తున్నాయి. ఈ తర్వాత యాదవ, గౌడ, ముప్పై వేల చొప్పున ఎస్టీ లంబాడకు 18 వేలు ఓటర్లు ఉంటారు. రెడ్డి సామాజిక వర్గానికి ఇక్కడ 18 నుంచి 20 వేల వరకు ఓట్లు ఉంటాయి. నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు.. నల్లగొండ ఉమ్మడి జిల్లాలో విశాలమైన రహదారులు ఉన్న నియోజకవర్గం ఇదే. ఇక్కడి నుంచి పలు జాతీయ రహదారులు వెళ్తుంటాయి. మూసీ, బిక్కేరు వాగులు ప్రవహిస్తుంటాయి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన బౌద్ధ క్షేత్రం పణిగిరి ఈ నియోజకవర్గంలోనే ఉంటుంది. సూర్యదేవాలయంతో పాటు ప్రసిద్ధి గాంచిన రామ, శివాలయాలకు పెట్టిన పేరు. పణిగిరి క్షేత్రానికి ప్రపంచ నలుమూలల నుంచి బౌద్దులు వస్తుంటారు. కానీ దాన్ని మరింత కాపాడాల్సిన అవసరం ఉంది. -
రాయితీపై టిష్యూ కల్చర్ మొక్కల సేకరణ
-
సిబ్బంది నియామకానికి ప్రత్యేక నోటిఫికేషన్
చివ్వెంల (సూర్యాపేట): సూర్యాపేట జిల్లా కోర్టులో సిబ్బంది నియామకానికి ప్రత్యేక నోటిఫికేషన్ వేసేలా చూస్తానని హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పోర్టు ఫోలియో జడ్జి జస్టిస్ జి.రాధారాణి అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కోర్టును ఆమె సందర్శించారు. కోర్టు ప్రాంగణాన్ని పరిశీలించి మొక్క నాటారు. అనంతరం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. కోర్టులో అదనంగా రెండు ఫ్లోర్లు నిర్మించాలని, సిబ్బందిని నియమించాలని, కోర్టులో పెండింగ్‌లో ఉన్న 7 వేల కేసుల పరిష్కారానికి అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, ఫ్యామిలీ కోర్టు, లేబర్ కోర్టును మంజూరు చేయాలని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గొండ్రాల అశోక్ పోర్టుఫోలియో కోరారు. న్యాయమూర్తి స్పందిస్తూ, సూర్యాపేట జిల్లా కోర్టుకు సంబంధించిన అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఏ సమస్య ఉన్నా జిల్లా ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకువెళ్లాలని, ప్రధాన న్యాయమూర్తి తన దృష్టికి తీసుకువస్తారని చెప్పారు. సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్, సీనియర్ సివిల్ జడ్జి పి.శ్రీవాణి, హుజూర్నగర్ సీనియర్ సివిల్ జడ్జి కె.శ్యాంకుమార్, జూనియర్ సివిల్ జడ్జిలు కామిశెట్టి సురేశ్, జె.ప్రశాంతి, శ్యాంసుందర్, మారుతి ప్రసాద్, జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పోలేబోయిన నర్సయ్య యాదవ్ పాల్గొన్నారు. -
మంత్రి జగదీష్‌రెడ్డి ఆదేశాలు.. స్వాతి కలను నెరవేర్చిన పోలీసులు
సాక్షి, సూర్యాపేట జిల్లా: క్యాన్సర్ వ్యాధి బాధితురాలు ధరావత్ స్వాతి కలను తెలంగాణ పోలీసులు నెరవేర్చారు. ఒక్కరోజు ఎస్సైగా ఉండాలన్న స్వాతి కోరికను తీర్చారు. ఇటీవల మంత్రి జగదీష్‌రెడ్డిని కలిసిన ఆమె.. తన కల ఎస్సై కావాలని స్పష్టం చేసింది. దానికి స్పందించిన మంత్రి.. అందుకు ఏర్పాట్లు చేయాలని పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ మేరకు స్వాతి కలను నేడు పోలీసులు నెరవేర్చారు. కాగా, నియోజకవర్గానికి చెందిన క్యాన్సర్ బాధితురాలు అయిన స్వాతి అనే యువతిని ఆయన ఇటీవలే మంత్రి జగదీష్‌రెడ్డి పరామర్శించారు. ఎప్పటినుంచో మంత్రి జగదీష్ రెడ్డిని కలుసుకోవాలని అనుకుంటున్న యువతి కోరికను కుటుంబ సభ్యులు, వైద్యాధికారులు మంత్రి జగదీష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన మంత్రి సూర్యాపేటలోని తన క్యాంపు కార్యాలయానికి స్వాతితో పాటు కుటుంబ సభ్యుల్ని ఆహ్వానించారు. అనంతరం వారితో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశారు. స్వాతి తో ముచ్చటించిన మంత్రి మనో ధైర్యంతో ఉండాలని.. ధైర్యంగా ఉంటే ఏ రోగాలు మనల్ని ఏం చేయలేవని స్వాతికి సూచించారు. కుటుంబం నేపథ్యాన్ని స్వాతి పరిస్థితిని చూసిన మంత్రి ఒక్కసారిగా తల్లడిల్లిపోయారు. పక్షపాతానికి గురైనటువంటి స్వాతి తండ్రి ధరావత్ చింప్లా వైద్య ఖర్చులను కూడా తానే భరించి చికిత్స చేయించేలాగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు పోలీసు అధికారి కావాలని తన జీవిత లక్ష్మామని స్వాతి మంత్రి దృష్టికికి తీసుకెళ్లింది. వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడి ఆ కోరికను కూడా త్వరలోనే నెరవేరుస్తానని మంత్రి హామీ ఇచ్చారు. దాదాపు గంటపాటు స్వాతి తో పాటు ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడిన మంత్రి ఏ సాయం కావాలన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. మంత్రి స్పందన చూసిన గిరిజన యువతి కుటుంబ సభ్యులు పట్టరాని సంతోషంతో ధన్యవాదాలు తెలిపారు. తాజాగా స్వాతి ఒక్క రోజు ఎస్సైగా ఉండాలన్న కోరిక తీరడంతో ఆమె సంతోషం వ్యక్తం చేసింది. -
మంత్రి జగదీష్‌రెడ్డి ఆదేశాలు.. స్వాతి కలను నెరవేర్చిన పోలీసులు
-
అరుదైన శిలా ఫలకం.. అంతులేని నిర్లక్ష్యం!
.. సూర్యాపేట జిల్లా ఫణిగిరి గుట్టపై 2003లో జరిపిన తవ్వకాల్లో క్రీస్తుశకం 1– 3 శతాబ్దాల మధ్య కాలానికి చెందిన 3 అడుగుల సున్నపు రాయి ఫలకం వెలుగు చూసింది. సిద్ధార్థుడు బుద్ధుడిగా మారే క్రమంలో జరిగిన పరిణామాల చిత్రాలను మూడు వరుసల్లో దానిపై చెక్కారు. అరుదైన ఇలాంటి ఫలకాలకు అంతర్జాతీయ విపణిలో విపరీతమైన డిమాండ్ ఉంది. తవ్వకాలు జరిపిన కొత్తలో ఈ శిలా ఫలకాన్ని ప్రభుత్వ ఆదీనంలోని ఓ గదిలో భద్రపర్చగా.. 2003 సెపె్టంబర్లో దొంగలు దాన్ని ఎత్తుకుపోయారు. పోలీసు బృందాలు జల్లెడ పట్టి సమీపంలోని ఓ ఊరిలో దానిని స్వాదీనం చేసుకున్నారు. కానీ శిలా ఫలకం అప్పటికే రెండు ముక్కలు కావడంతో.. తాత్కాలికంగా అతికించారు. అయితే ఈ ఫలకాన్ని సురక్షిత ప్రాంతంలో ఉంచాలంటూ కోర్టు ఆదేశించడంతో.. హైదరాబాద్ స్టేట్ మ్యూజియంలో సిమెంట్ బేస్ సాయంతో కదలకుండా ఏర్పాటు చేశారు. అయితే నాలుగేళ్ల క్రితం ఈ శిల్పాన్ని విమానంలో ముంబై మ్యూజియానికి తీసుకెళ్లి, తీసుకొచ్చారు. ఆ సమయంలో పగులు విచ్చుకోవటంతో ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించి అతికించారు. ఈసారి అమెరికాకు తరలించి.. అమెరికాలో న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియంలో బుద్ధుడి జీవిత పరిణామ క్రమానికి సంబంధించిన భారతీయ శిల్పాలతో అంతర్జాతీయ ప్రదర్శన ఏర్పాటు చేశారు. దానికి మన దేశం నుంచి 94 శిల్పాలను ఎంపిక చేయగా.. అందులో తెలంగాణ నుంచి 9 ఉన్నాయి. వీటిలో కరీంనగర్ మ్యూజియంలో ఉన్న నాగ ముచిలింద శిల్పం పగుళ్లతో ఉండటంతో.. దాన్ని వదిలేసి మిగతా 8 శిల్పాలను ఇటీవల విమానంలో తరలించారు. ఇలా తరలించిన వాటిలో ఫణిగిరి సున్నపురాయి ఫలకం కూడా ఉంది. అరుదైన ఈ శిలా ఫలకాన్ని అంత దూరం ఎలా తరలిస్తారని ఇటీవల కొందరు కేంద్ర పురావస్తు శాఖకు ఫిర్యాదు చేశారు. ఇంతకుముందు రెండు శిల్పాలు ధ్వంసం దాదాపు 20 ఏళ్ల క్రితం స్టేట్ మ్యూజియం నుంచి బాదామి చాళుక్యుల కాలం నాటి ఎర్ర ఇసుకరాతితో చేసిన దుర్గాదేవి ప్రతిమను విదేశాలకు పంపగా.. రవాణాలో విగ్రహం ముక్కు భాగం దెబ్బతిన్నది. బెర్లిన్‌లో జరిగిన తేజస్ ఎగ్జిబిషన్‌కు తీసుకెళ్లిన ఓ నాగ శిల్పం వెనక భాగంలో దెబ్బతిన్నది. ఇలా అరుదైన శిల్పాలు దెబ్బతిన్న ఘటనలున్నా.. ఇప్పటికే దెబ్బతిని, తిరిగి అతికించిన శిలా ఫలకాన్ని విదేశాలకు తరలించడం అడ్డగోలు చర్య అని ఓ విశ్రాంత ఉన్నతాధికారి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అత్తగారింటి ఎదుట అల్లుడి నిరసన.. అసలు ఏం జరిగిందంటే?
సాక్షి, సూర్యాపేట జిల్లా: అత్తగారింటి ఎదుట అల్లుడు నిరసనకు దిగిన ఘటన కోదాడలో జరిగింది. తన కొడుకుని చూపించకుండా అత్తమామలు వేధిస్తున్నారంటూ ఆ అల్లుడు ఆరోపిస్తున్నాడు. భార్యాభర్తలైన ప్రవీణ్ కుమార్, పృథ్వీ రమణీల మధ్య విభేదాలు రావడంతో గత కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. బాబుని తల్లిదండ్రుల చెంతనే ఉంచి పృథ్వీ రమణీ కెనడా వెళ్లింది. వారం వారం కుమారుడిని చూసేందుకు కోర్టు అనుమతి ఇచ్చిందంటున్న ప్రవీణ్.. తన కొడుకును చూడకుండా అత్తామామలు అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నాడు. తన నుంచి కొడుకును దూరం చేసే కుట్ర జరుగుతోందంటూ ప్రవీణ్.. తన తల్లిదండ్రులతో కలిసి అత్తగారింటి ఎదుట ఆందోళనకు దిగాడు. చదవండి: హైదరాబాద్‌లో 59 రూపాయలకే చికెన్ బిర్యానీ..ఎక్కడో తెలుసా -
సూర్యాపేట వద్ద ఘోర రోడ్డుప్రమాదం
-
సూర్యాపేటజిల్లా తుంగతుర్తిలో ఇసుక మాఫియాపై స్థానికుల ఆగ్రహం
-
కమ్మేసిన పొగమంచు
కోదాడ, మునగాల: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం పరిసర ప్రాంతాలు, మునగాల మండల కేంద్రాన్ని గురువారం పొగమంచు కమ్మేసింది. ఉదయం 9 గంటలైనా మంచు తెరలు వీడకపోవడంతో వాహనచోదకులు ఇబ్బందిపడ్డారు. 65వ నంబర్ (హైదరాబాద్ –విజయవాడ) జాతీయ రహదారిపై దీపాలు వెలిగించి వాహనాలను నడపాల్సి వచ్చింది. -
కాంట్రాక్టు వైద్య ఉద్యోగికి గుండెపోటు
సూర్యాపేట: గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురైన ఓ కాంట్రాక్టు వైద్య ఉద్యోగికి వైద్యశాఖ మంత్రి హరీశ్‌రావు అండగా నిలిచారు. సూర్యాపేట జిల్లా పెంచికలదిన్నె పీహెచ్సీ లో హరికృష్ణ అనే వ్యక్తి హెల్త్ అసిస్టెంట్‌గా 20 ఏళ్లుగా పనిచేస్తున్నారు. కంటి వెలుగు–2 విధి నిర్వహణలో ఉండగా శుక్రవారం హరికృష్ణ గుండెపోటుకు గురయ్యారు. తోటి సిబ్బంది హుటాహుటిన మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు రిఫర్ చేశారు. వైద్యశాఖలో పనిచేస్తున్న హరికృష్ణకు ఆరోగ్యశ్రీ వంటి పథకాలు వర్తించకపోవడం, చాలీచాలని జీతం, పేదరికం కారణంగా వైద్య ఖర్చులకు సరిపడా డబ్బులు కూడా లేకపోవడంతో ఈ విషయాన్ని ఉద్యోగుల యూనియన్ (హెచ్1) మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లింది. వెంటనే స్పందించిన మంత్రి హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో హరికృష్ణకు నగదురహిత వైద్యం అందించాలని ఆదేశాలిచ్చారు. -
మునుగోడులో నైతిక గెలుపు బీజేపీదే: ఈటల
కోదాడ అర్బన్: మునుగోడులో నైతిక గెలుపు బీజేపీదే అని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ముదిరాజ్‌ల కార్తీక వనభోజన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజల ఆత్మగౌరవం, ఓటుకు విలువ కట్టిన నీచమైన సంస్కృతితో కేసీఆర్ ప్రభుత్వం పాలన చేస్తోందని మండిపడ్డారు. వందల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ఉపఎన్నికలో పోలీసులను అడ్డుపెట్టుకుని చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు గెలిచారని ఈటల ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందని, ఆయనకు ప్రత్యామ్నాయం బీజేపీయేనని గుర్తించి పార్టీ కేడర్‌ను పోగొట్టుకోకుండా ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. పోలీసు యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని ఎంపీ అర్వింద్‌తో పాటు మునుగోడు అభ్యర్థి, బీజేపీ కార్యకర్తలపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. 4 కోట్ల ప్రజలను పాలించలేక విఫలమైన సీఎం.. బీఆర్ఎస్ పేరుతో 130 కోట్ల ప్రజలను ఏవిధంగా పరిపాలిస్తారని నిలదీశారు. -
పరుగులోనే ఆగిన ప్రాణం
సూర్యాపేట: ఎస్ఐ కొలువుకు సన్నద్ధమవుతున్న ఓ యువకుడి కల నెరవేరకుండానే ఊపిరి ఆగిపోయింది. సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన ఈ విషాద సంఘటన వివరాలివి. పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన సమర్తపు లక్ష్మయ్య కుమారుడు శ్రీకాంత్ (24) ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సబ్ ఇన్స్పెక్టర్ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించాడు. తదుపరి నిర్వహించే శారీరక, దేహ దారుఢ్య పరీక్షల కోసం జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల మైదానంలో రోజూ ఉదయం పరుగు సాధన చేస్తున్నాడు. ఎప్పట్లాగే మంగళవారం ఉదయం పరుగు తీస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. హుటాహుటిన మిత్రులు సూర్యాపేట జిల్లా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. శ్రీకాంత్ చదువులో రాణిస్తూనే జనగాం క్రాస్ రోడ్డులో తల్లిదండ్రులు నిర్వహిస్తున్న వెల్కం దాబా హోటల్లో రాత్రి సమయంలో పనిచేస్తూ వారికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. చేతికి అందివచ్చిన కుమారుని అకాల మరణంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. -
లైంగిక దాడికి యత్నం.. వేదనతో బాలిక మృతి
తిరుమలగిరి (తుంగతుర్తి): ఓ కామాంధుడి లైంగికదాడి ప్రయత్నంతో మానసికంగా కుంగిపోయి అనారోగ్యానికి గురైన బాధిత బాలిక చికిత్స పొందుతూ మృతిచెందిన సంఘటన సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో చోటుచేసుకుంది. బాలల దినోత్సవం నాడే బాలిక మరణించడం స్థానికంగా మరింత విషాదం నింపింది. జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతల గ్రామానికి చెందిన ఓ వితంతువు తన 14 ఏళ్ల కూతురితో కలిసి తిరుమలగిరిలోని పుట్టింట్లో నివసిస్తోంది. ఆ మహిళ ఫణిగిరిలోని ఓ పాఠశాలలో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తూ కూతురిని స్థానికంగా మరో పాఠశాలలో 9వ తరగతి చదివిస్తోంది. దసరా రోజున ఎదురింట్లో ఉండే చాకలి యాదమ్మకు భోజనం పెట్టిరమ్మంటూ ఆ మహిళ తన కూతురిని పంపించింది. అయితే ఆ సమయంలో ఇంట్లో మద్యం సేవించి ఒంటరిగా ఉన్న ఆమనగంటి రాజు... బాలికపై లైంగికదాడికి యత్నించాడు. ఎంతసేపటికీ కూతురు తిరిగి రాకపోవడంతో ఆ మహిళ.. యాదమ్మ ఇంటికి వెళ్లగా రాజు బాలికను వదిలిపెట్టి పరారయ్యాడు. కోమాలోకి వెళ్లి.. లైంగికదాడి ప్రయత్నంతో షాక్‌కు గురైన బాలిక అనారోగ్యం పాలైంది. కొన్ని రోజులపాటు జ్వరంతో బాధపడిన బాలికను కుటుంబ సభ్యులు స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. అప్పట్నుంచి చిన్నారి ముభావంగా ఉండేది. రాత్రి సమయాల్లో ఆందోళనకు గురయ్యేది. మరికొన్ని రోజుల తర్వాత ఆమె ఎడమ చేయి, ఎడమకాలు వంకర్లు తిరగడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే 10 రోజుల క్రితం బాలిక కోమాలోకి వెళ్లి సోమవారం తెల్లవారుజామున మృతిచెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు. కామాంధుడిని ఉరి తీయాలి.. ఇంటి ఎదురుగా ఉన్న రాజును మా బిడ్డఎప్పుడూ బాబాయ్ అంటూ పిలిచేది. దసరా రోజున అన్నం పెట్టడానికి వాళ్లింటికి వెళ్లింది. ఇంత ఘోరం చేస్తాడని అనుకోలేదు. అతనికి ఉరి శిక్ష విధించాలి. – కుటుంబ సభ్యులు -
మునగాలలో రోడ్డు ప్రమాదం
-
సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులో గ్యాంగ్ వార్
-
మద్యానికి డబ్బులు ఇవ్వలేదని..
హుజూర్నగర్ రూరల్: మద్యానికి డబ్బులు ఇవ్వలేదని ఓ వ్యక్తి ఘాతుకానికి తెగబడ్డాడు. గాఢ నిద్రలో ఉన్న భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. సూర్యాపేట జిల్లాలో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. హుజూర్నగర్ మండలం మర్రిగూడెం గ్రామానికి చెందిన గొట్టెముక్కల గోపయ్యకు 35ఏళ్ల క్రితం గరిడేపల్లి మండలం కట్టవారిగూడెం గ్రామానికి చెందిన వెంకటమ్మ(50)తో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు. గతంలో ఓ కుమారుడు మృతిచెందగా మరో కుమారుడు జానకిరామయ్య లారీడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కాగా, గోపయ్య ఏడాదిలో కొంతకాలం పాటు చెన్నై వెళ్లి భిక్షాటన చేసేవాడు. భార్య వెంకటమ్మ గ్రామంలో కూలి పనులు చేస్తూండేది. పది రోజుల క్రితమే గ్రామానికి వచ్చిన గోపయ్య భిక్షాటన చేయ గా వచ్చిన డబ్బులతో మద్యం తాగుతూ.. భార్య ను వేధిస్తూ కొడుతుండేవాడు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం మద్యం తాగడానికి డబ్బులు కావాలని వెంకట మ్మను అడగ్గా..ఆమె డబ్బుల్లేవని చెప్పడంతో గొడవపడ్డాడు. అదేరోజు రాత్రి ఇంటికి చేరుకున్న గోపయ్య మంచంపై నిద్రిస్తున్న భార్యపై వెంట తెచ్చుకున్న పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. దీంతో ఆమె పూర్తిగా కాలిపోయి అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం మేరకు పోలీసులు ఘట నా స్థలికి చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. -
‘గులాబీ’ పార్టీలో కలవరం అందుకేనా?.. అసలు అక్కడ ఏం జరుగుతోంది?
సాక్షి, నల్గొండ/సూర్యాపేట: మంత్రి జగదీష్ రెడ్డి ప్రాతినిధ్యం వహించే సూర్యాపేట సెగ్మెంట్లో వచ్చేసారి తీర్పు ఎలా ఉండబోతోంది? ప్రతిపక్షమే లేని జిల్లాలో గులాబీ పార్టీ మళ్లి ఏకఛత్రాధిపత్యం వహిస్తుందా? కాంగ్రెస్, బీజేపీల పరిస్థితి ఎలా ఉంది? యాదాద్రి, భువనగిరి జిల్లాలో మూడు పార్టీలు ఏమంటున్నాయి? చదవండి: కాంగ్రెస్‌లో సీనియర్లు, పెద్దలు అంతా అక్కడే.. భీకర పోరు తప్పదా? ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్లో వర్గపోరు లేని ఏకైక నియోజకవర్గం సూర్యాపేట. రాష్ట్ర మంత్రి జగదీష్‌రెడ్డి నియోజకవర్గం కావడంతో ముఠాలు కట్టి వర్గాలుగా విడిపోయే ధైర్యం ఎవరూ చేయడం లేదు. అయితే గత రెండు ఎన్నికల్లో తక్కువ మెజార్టీతో గెలవడం టీఆర్ఎస్ను కలవరపెడుతోంది. దీనికి తోడు కొంతమంది అనుచరులు మంత్రికి తలనొప్పులు తీసుకొస్తున్నారనే టాక్ కూడా ఉంది. ఈసారి అక్కడ జరిగిన అభివృద్ధి పనులను చూపిస్తూ ప్రజల్లోకి వెళ్లాలని ఆ పార్టీ ఆలోచిస్తోంది. స్థానికంగా మెడికల్ కాలేజీ నిర్మాణం, రోడ్ల వెడల్పు, కొత్త కలెక్టరేట్ నిర్మాణం గులాబీ పార్టీకి పాజిటీవ్‌గా మారే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్‌లో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, రేవంత్ అనుచరుడు పటేల్ రమేష్‌రెడ్డి మధ్య నువ్వానేనా అన్నట్లు పరిస్థితి తయారైంది. ఇక్కడ పార్టీ పిలుపునిచ్చే ఏ కార్యక్రమాన్ని జాయింట్‌గా నిర్వహించడం లేదు. గత ఎన్నికల్లో ఈ వర్గపోరే పార్టీని దెబ్బతీసింది. మరోసారి అలాంటి పరిస్థితులు రాకుండా చూడాల్సిన రేవంతే తన శిష్యుడిని దామోదర్‌రెడ్డికి వ్యతిరేకంగా ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఎవరికి టికెట్ రాకున్నా ఇండిపెండెంట్‌గా పోటీ చేయడం పక్కా అని తెలుస్తోంది. బీజేపీలో మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావుకు వర్గపోరు లేకున్నా నోటి దురుసుతనమే ఆయనకు మైనస్‌గా మారుతోంది. కోదాడలో కాంగ్రెస్ పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఎదురు చూస్తున్నారు. మరోసారి తన భార్యను నిలబెట్టి గెలిపించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం కుటుంబంలో ఒకరికే టికెట్ అని ప్రకటించిన నేపథ్యంలో టికెట్ రాకపోతే పరిస్థితి ఏంటనేది స్పష్టత లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ వర్గంగా ముద్రపడిన పందిరి నాగిరెడ్డి తనకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. టీఆర్ఎస్ సిటింగ్ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌కి వర్గపోరు పెద్ద తలనొప్పిగా తయారైంది. పైగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు కేటీఆర్, హరీష్‌రావుకు దగ్గర అని చెప్పుకునే జలగం సుధీర్, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు కుటుంబం నుంచి ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ నియోజకవర్గంలో బీజేపీ గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది అన్న చందంలా తయారు అయింది పరిస్థితి. హుజూర్ నగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య రాజకీయ యుద్ధం మధ్య తారాస్థాయికి చేరింది. గతంలో జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి భారీ మెజార్టీతో గెలిచారు. వచ్చే ఎన్నికల్లో హుజూర్నగర్ నుంచే పోటీ చేస్తానని ఉత్తమ్ ప్రకటించడంతో రాజకీయ వేడి పెరిగిపోయింది. టీఆర్ఎస్లో టికెట్ అడిగే స్థాయిలో వర్గపోరు లేకున్నా కొందరు ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. దీనికి తోడు అనుచరులపై వస్తున్న అవినీతి ఆరోపణలు కూడా ఎమ్మెల్యేకు కొంత ఇబ్బందిగా మారిందంట. అయితే ఇవేవి తనను అడ్డుకోలేవన్న ధీమాతో ప్రస్తుత ఎమ్మెల్యే సైదిరెడ్డి ఉన్నారు. బీజేపీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయి పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో ఒకప్పుడు కాంగ్రెస్‌కి పోటీగా నిలబడాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ నుంచి ఎవరు నిలబడతారో తెలియని పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తీవ్రంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అద్దంకి దయాకర్‌తో పాటు మరో ఇద్దరు తెరపైకి వచ్చారు. వడ్డేపల్లి రవిని పార్టీలో చేర్చుకోవడాన్ని రాంరెడ్డి దామోదర్‌రెడ్డితో పాటు అద్దంకి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు రెండుసార్లు ఓడిపోయిన అద్దంకికి కాకుండా మరో నేతకు టికెట్ ఇవ్వాలని దామోదర్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి వరుసగా రెండు సార్లు గెలిచిన గ్యాదరి కిషోర్ హ్యాట్రిక్ సాధించాలని ఆశిస్తున్నారు. అయితే మందుల శ్యామ్యూల్ ఈసారి తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారంట. రెండు సార్లు టికెట్ త్యాగం చేశానని ఈసారి తనను దృష్టిలో పెట్టుకోవాలని అధిష్టానాన్ని కోరినట్లు తెలుస్తోంది. ఇక ఇక్కడ బీజేపీకి సరైన అభ్యర్థి లేరు. ఇతర పార్టీల నుంచి ఎవరైనా గట్టి నేత వస్తే పోటీకి నిలపాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. భువనగిరి నుంచి గత రెండు ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పైళ్ల శేఖర్ రెడ్డి విజయం సాధిస్తున్నారు. ముచ్చటగా మూడోసారి జెండా ఎగరేయాలని ఆయన ఉవ్విళ్లూరుతున్నారు. కానీ ఆయన ఆశలకు చింతల వెంకటేశ్వర రెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి అడ్డుతగిలే ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి భువనగిరి నుంచి పోటీ చేసేది తామే అని బహిరంగంగా ప్రకటించుకుంటున్నారని తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి లాంటి సంపన్న నేత ఉన్నప్పటికీ కోలుకోలేకపోతోంది. పార్టీలో ముఠా తగాదాలే దీనికి కారణం. క్యాడర్ పటిష్టంగా ఉన్నా నేతల కొట్లాటలతో పార్టీని దెబ్బ తీసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. బీజేపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో భువనగిరి ఒకటి. ఇక్కడి నుంచి పోటీకి చాలామంది నేతలు సిద్ధంగా ఉన్నారు. జిట్టా బాలకృష్ణరెడ్డి, పీవీ శ్యాంసుందర్, గూడూరు నారాయణ రెడ్డి, పడమటి జగన్మోహన్రెడ్డి లిస్టులో ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు సెగ్మెంట్ రాజకీయం అస్తవ్యస్తంగా మారిందా అంటే అవునన్న సమాధానమే వస్తోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండు సార్లు టీఆర్ఎస్ విజయం సాధించింది. సిట్టింగ్ ఎమ్మెల్యే గొంగడి సునీత ఈ సారి తన భర్తకు అవకాశం ఇవ్వాలని పార్టీ నాయకత్వాన్ని కోరినట్లు ప్రచారం సాగుతోంది. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహ్ములు కూడా టీఆర్ఎస్లో చేరడంతో సునీతకు తలనొప్పిగా మారింది. అసంతృప్తులు అంతా నర్సింహ్ములు వర్గంలో చేరిపోయారు. దీంతో పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. అయితే ఇక్కడి నుంచి కేసీఆర్ పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారం ఇద్దరు నేతల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇక కాంగ్రెస్‌లో క్యాడర్ కంటే లీడర్ల సంఖ్యే ఎక్కువగా ఉందని జోకులు వేసుకుని నవ్వుకునే పరిస్థితి వచ్చింది. బీజేపీలో వర్గపోరు లేనప్పటికీ కొద్ది రోజుల క్రితం పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య అసలైన బీజేపీ కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. చదవండి: మునుగోడు బరిలోకి వైఎస్సార్టీపీ! -
ఎమ్మెల్యే రాలేదని జెండా ఆవిష్కరణలో గందరగోళం
కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీలో అధికార పార్టీలో నెలకొన్న విభేదాలు బట్టబయలయ్యాయి. కోదాడ మున్సిపాలిటీలో ఉదయం 8:30కు జెండా ఆవిష్కరణ ఉంటుందని మున్సిపాలిటీ అధికారులు, చైర్పర్సన్ పట్టణంలో ప్రముఖులకు ఆహ్వానాలు పంపారు. ఆ సమయానికే పలువురు మున్సిపాలిటీ కార్యాలయానికి చేరుకోగా ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మాత్రం 9గంటలై నా రాలేదు. దీంతో 9:10 నిమిషాలకు మున్సిపల్ చైర్పర్సన్ వనపర్తి శిరీష కార్యక్రమాన్ని ప్రారంభించగా..ఎమ్మెల్యే వచ్చే వరకు జెండా ఎగుర వేయవద్దని మున్సిపల్ కమిషనర్ అడ్డుతగిలారు. వాగ్వాదాల మధ్యే జెండాను ఆవి ష్కరించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మున్సిపాలిటీకి రాకుండానే పక్కనే ఉన్న గాంధీ పార్కుకు వెళ్లి జాతీయ జెండాను ఆవిష్క రించారు. ఇదే ఆవరణలో ఉన్న కోదాడ గ్రంథాలయం వద్ద జెండా ఆవిష్కరణకు ఎమ్మెల్యే వెళ్లగా అక్కడికి మున్సిపల్ చైర్ పర్సన్ శీరిష కూడా వెళ్లారు. అక్కడ ఆమెను కోదాడ ఎంపీపీ చింతా కవిత, మార్కెట్ చైర్పర్సన్ సుధారాణి నెట్టి వేశారు. దీంతో తనను వేధిస్తు న్నారంటూ మున్సిపల్ చైర్పర్సన్ గాంధీ విగ్రహం ముందు మౌన దీక్షకు దిగారు. -
బేతవోలు గ్రామాన్ని మండల కేంద్రం చెయ్యాలి
బేతవోలు గ్రామం నేటి సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలంలో గల మేజర్ గ్రామ పంచాయతీ. 2014లో సమగ్ర కుటుంబ సర్వేనాటికి 10,500 మంది జనాభా ఈ ఊళ్లో ఉందని తేలింది. ఏడాదికి రెండు సార్లు వరి సాగుచేస్తూ వివిధ ప్రాంతాలకు ధాన్యాన్ని ఎగుమతి చేయడంలో ప్రసిద్ధి చెందిన గ్రామం ఇది. ఈ గ్రామంలో వేల సంవత్సరాల క్రితం ఆదిమానవులు నివసించినట్లు ఆధారాలు ఉన్నాయి. మొదటి ప్రతాపరుద్రుడి (12వ శతాబ్దం) సామంత రాజు బేతిరెడ్డి పేరుమీదుగా అప్పట్లో బేతిప్రోలు అనే గ్రామం ఏర్పడింది. అదే నేటి బేతవోలుగా మారిందని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. తెలంగాణ వచ్చాక ఈ గ్రామంలో ఉన్న ‘వీర్లదేవి చెర్వు’ (పెద్ద చెర్వు) ఏడవ తరగతి సాంఘిక శాస్త్రంలో పాఠ్యాంశంగా నిలిచింది. బొమ్మగాని ధర్మభిక్షం, మల్లు స్వరాజ్యం, పుచ్చలపల్లి సుందరయ్య, రావి నారాయణ రెడ్డి వంటివారు ఈ గ్రామం సందర్శించి కల్లు వ్యతిరేక ఉద్యమం, నిజాం వ్యతిరేక సాయుధ పోరాటం చేశారు. అదేవిధంగా మలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ బేతవోలు చురుకుగా పాల్గొంది. ఇంతటి ఘన చరిత్ర, భౌగోళిక అనుకూలతలు ఉన్న బేతవోలు గ్రామం నేటికీ మండల కేంద్రం కాలేకపోయింది. బేతవోలు కంటే భౌగోళికంగా, జనాభా పరంగా అతి చిన్న గ్రామాలు మండలాలుగా మారినప్పటికీ... ఈ గ్రామం మాత్రం ఇప్పటికీ మేజర్ గ్రామ పంచాయతీగానే మిగిలివుంది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడూ బేతవోలు మండల కేంద్రం అవుతుందనే ప్రచారం జరిగింది కానీ కార్యరూపం దాల్చలేదు. ఇందుకు కారణం గ్రామానికి అనుసంధానంగా పట్టణ రహదారులు లేవని చెబుతున్నారు. కానీ బేతవోలు... మిర్యాలగూడెం నుండి కోదాడ నియోజకవర్గానికి మారిన తర్వాత బరాఖత్ గూడెం జాతీయ రహదారి నుండి రాయినగూడెం వరకు... మిర్యాలగూడ రహదారిని కలుపుతూ బీడీ రోడ్డు వేశారు. (క్లిక్: ఇది రైతుల పాలిట వరమా... శాపమా?) బేతవోలు గ్రామానికి చుట్టుపక్కల కేవలం ఐదుకిలోమీటర్ల దూరంలోనే పది నుండి పదిహేను గ్రామాలు ఉన్నాయి. ఈ అనుకూలతలను చూపిస్తూ 2016–17లో గ్రామ ప్రజలు మండల కేంద్రంగా చేయాలని ధర్నాలు చేశారు. అధికార్లు, ఎమ్మేల్యేలకు మెమొరాండాలిచ్చారు. అయినా ప్రయోజనం లేకపోయింది. ప్రభుత్వం ఇప్పటికైనా బేతవోలును మండల కేంద్రం చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. – వరకుమార్ గుండెపంగు (‘మావూరు బేతవోలు’ నవలా రచయిత) -
ఎలుగుబంటి.. అధికారులు కనిపించరేంటి?
తిరుమలగిరి (తుంగతుర్తి): సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని తిరుమలహిల్స్ సమీపంలోని మామిడి తోటలో మంగళవారం ఉదయం ఎలుగుబంటి హడలెత్తించింది. తోటలో ఎలుగుబంటిని గమనించిన స్థానికులు ఆందోళనతో పోలీసులు, అటవీ శాఖాధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖ సెక్షన్ ఆఫీసర్ ఖదీర్, బీట్ ఆఫీసర్ అచ్చయ్యలు తోట వద్దకు వచ్చి ఎలుగుబంటి సమాచారాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. దాన్ని తరలించేందుకు జూపార్కు నుంచి సిబ్బంది వస్తున్నట్లు తెలిపినా.. సాయంత్రం వరకు ఎవరూ రాలేదు. మరోవైపు ఎలుగుబంటి తోటలో దూరంగా వెళ్లిపోయింది. జూపార్కు నుంచి ఎవరూ రాకపోవడంతో.. అటవీ శాఖ అధికారులు కూడా వెనుదిరిగారు. దీంతో ఎలుగుబంటి ఎప్పుడు వచ్చి ఎవరిపై దాడి చేస్తుందోనని స్థానికులు భయాందోళనలతో బిక్కుబిక్కుమంటున్నారు. -
సూర్యాపేట: కోదాడ బైపాస్‌లో రోడ్డు ప్రమాదం
-
భూమి అమ్మకుండా అడ్డుపడుతున్నాడని..
ఆత్మకూర్ (ఎస్) (సూర్యాపేట): ఆర్థిక ఇబ్బం దుల కారణంగా భూమిని కొంత అమ్ముదా మంటే తండ్రి వద్దన్నాడు. దీంతో ఆగ్రహించిన ఇద్దరు కొడుకులు తండ్రిని దారుణంగా నరికి చంపారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండల పరిధిలోని తుమ్మల పెన్‌పహాడ్ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుమ్మల పెన్‌పహాడ్‌కు చెందిన యరగాని శ్రీను (50) అంజమ్మ దంపతులకు ఇద్దరు కుమారు లు రాజశేఖర్, సంతోష్, కుమార్తె రాజ్యలక్ష్మి ఉ న్నారు. ముగ్గురికీ పెళ్లిళ్లు చేశారు. వీరికి గ్రా మంలో 9 ఎకరాల వ్యవసాయ భూమి ఉండ గా ఇద్దరు కుమారులకు మూడున్నర ఎకరాల చొప్పున రాసిచ్చారు. మిగతా రెండు ఎకరాల ను శ్రీను తన వద్దే పెట్టుకున్నాడు. పెద్ద కుమారుడు రాజశేఖర్ డీసీఎం డ్రైవర్ కాగా, చిన్న కుమారుడు సంతోష్ ట్రాక్టర్ డ్రైవర్. కుమార్తెకు అమ్మిచ్చి!: ఆర్థిక ఇబ్బందులతో భూమిని విక్రయించేందుకు రాజశేఖర్, సంతో శ్ సిద్ధపడగా.. తండ్రి శ్రీను అడ్డుపడ్డాడు. దీని పై తండ్రితో పలుమార్లు ఘర్షణపడ్డారు. పెద్ద లు సైతం అప్పులు తీర్చేందుకు భూమిని విక్రయించవచ్చని చెప్పినా తండ్రి వినలేదు. అదీగాకుండా తమ వద్ద ఉన్న రెండు ఎకరాల్లో కూతురు రాజ్య లక్ష్మికి పెళ్లి సమయంలో ఒప్పుకున్న ప్రకారం అర ఎకరం భూమిని కుమారులకు తెలియకుండా ఆమె పేరుపై రిజిస్ట్రేషన్ చేశారు. ఈ భూమిని ఇటీవల విక్రయించారు. దీంతో తమ భూమి అమ్మకానికి అడ్డుపడటం, సోదరికి భూమి రిజిస్ట్రేషన్ చేయించడంతోపాటు విక్రయించి ఇవ్వడంతో కుమారులు తండ్రిపై ఆగ్రహంగా ఉన్నారు. ఈ క్రమంలో గురువారం తల్లి అంజమ్మ కూలికి వెళ్లగా.. అన్నదమ్ములు కత్తి, గొడ్డలితో వచ్చి తండ్రిపై విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో శ్రీను అక్కడికక్కడే మృతిచెందాడు. అంజమ్మ ఫిర్యాదుతో రాజశేఖర్, సంతోష్‌పై కేసు నమోదు చేశామని, నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. -
కేసీఆర్ తప్పులకు రైతులకు శిక్షా?: షర్మిల
సూర్యాపేట: ‘‘యాసంగి సాగు విషయంలో సీఎం కేసీఆర్ చేసి న తప్పులకు రైతులు శిక్ష అనుభవించాలా? రైతులపై దయలేని కేసీఆర్ మనకు అవసరమా?’’అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రశ్నించారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ను ఆమె సందర్శించి రైతులతో మాట్లాడారు. మార్కెట్‌కు వచ్చి ఎన్ని రోజులైంది? ధర ఎంత ఇస్తున్నారని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు వైఎస్సార్ పాలనే బాగుందని, తాము పండిస్తున్న పంటకు నీళ్లొచ్చేది ఆయన నిర్మించిన కాలువతోనేనని పేర్కొన్నారు. తర్వాత షర్మిల మార్కెట్ కార్యాలయంలో అధికారులను కలిసి రైతులకు అందిస్తున్న ధరపై ఆరా తీశారు. అధికారుల సమాధానం సరిగా లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. రైతులతో కలిసి కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. మార్కెట్‌కు 682 మంది ధాన్యం తీసుకొస్తే ఇద్దరికే మద్దతు ధర రూ.1,920 చెల్లించారని.. మిగతా రైతులకు రూ.1,500 వరకే ఇవ్వడమేమిటని మండిపడ్డారు. దీనికితోడు తరుగు, తాలు పేరిట కోత పెట్టడం దారుణమన్నారు. బీజేపీతో సత్సంబంధాల కోసం కేసీఆర్ చేసిన ఒక్క సంతకంతో రైతులు శిక్ష అనుభవిస్తున్నారని విమర్శించారు. పైగా యాసంగిలో వరి వేయొద్దంటూ రైతులను బెదిరించారని.. రైతులు బీళ్లుగా వదిలేసిన భూములకు కేసీఆర్ సొంత డబ్బులతో పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు పిట్టా రాంరెడ్డి, ఏపూరి సోమన్న, జిల్లా అధ్యక్షుడు జిల్లేపల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
Suryapet: స్విమ్మింగ్ పూల్ బాత్రూమ్లో రహస్య కెమెరాలు.. 41 నిమిషాల..
సాక్షి, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా చివ్వెంల పరిధిలో దారుణం జరిగింది. కుడకుడ రోడ్లో ఉన్న ఓ స్విమ్మింగ్ పూల్ బాత్రూమ్లో ఓ రహస్య కెమెరా అమర్చినట్లు వెలుగులోకి వచ్చింది. స్విమ్మింగ్ పూల్‌కి వచ్చే యువతులు, మహిళల వీడియోస్‌ను సిబ్బంది రహస్యంగా రికార్డు చేస్తున్నారు. బాత్రూమ్లో బట్టలు మార్చుకుంటూ ఉండగా ఓ యువతి వీడియో రికార్డు గమనించింది. మిగతా స్నేహితులతో కలిసి కెమెరాను తీసి చూడగా అప్పటికే 41 నిమిషాల వీడియో రికార్డయింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. స్విమ్మింగ్ ఫూల్లో పనిచేసే మహేశ్‌ను నిందితుడిగా గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చదవండి: ('లోన్ కట్టకపోతే.. న్యూడ్ ఫొటోలు ఇంట్లో వాళ్లకు పంపిస్తాం') -
కరప్షన్.. కలెక్షన్.. కేసీఆర్..! : ఆర్ఎస్పీ
కోదాడ: తెలంగాణ అంటే కరప్షన్.. కలెక్షన్.. కేసీఆర్.. అన్నట్లు తయ్యారైందని బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. విద్యార్థుల బలిదానం, మేధావుల శ్రమదానం, తెలంగాణ వాదుల పోరాటంతో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వ అధినేతలు అవినీతిలో కూరుకొని పోయారన్నారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేయదనే సామెతను నిజం చేస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పడి దోచుకుంటున్నారని మండిపడ్డారు. రాజ్యాధికార యాత్రలో భాగంగా ఆదివారం రాత్రి సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని బాలుర పాఠశాలలో నిర్వహించిన సభ లో ప్రవీణ్‌కుమార్ మాట్లాడారు. రైతులు ధాన్యం కొనేవారు లేక ఇబ్బంది పడుతుంటే రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు విమానాల్లో ఢిల్లీ వెళ్లి గంట సేపు ధర్నా చేసివచ్చారని, దానివల్ల రైతులకు ఒరిగింది ఏమిటని ఆయన ప్రశ్నించారు. రాజ్యాధికారం చేతికి వచ్చినపుడే బహుజనులు అభివృద్ధి చెందుతారని, పల్లకీ బోయిలుగా కాకుండా పల్లకిలో కూర్చోవడానికి కృషి చేయాలని కోరారు.వచ్చే ఎన్నికల్లో బడుగు, బలహీన వర్గాలకు తమ పార్టీ 70 శాతం సీట్లను కేటాయిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మేధావులు మౌనంగా ఉండవద్దని బయటికి వచ్చి మేలు చేసే వ్యక్తులను అధికారంలో కూర్చోబెట్టాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పిల్లుట్ల శ్రీనివాస్, గుండెపంగు రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
యాచన.. డిజిటల్ యోచన
అర్వపల్లి: అంతా డిజిటల్‌మయం కావడంతో యాచకులు కూడా స్కానర్లు, ఫోన్‌పే, గూగుల్‌పేలను వినియోగిస్తున్నారు. సూర్యాపేట జిల్లా అర్వపల్లిలో శనివారం ఓ టీస్టాల్లో యాచకుడు యాచించగా యజమాని గోవర్ధన్ నగదు లేదన్నాడు. వెంటనే యాచకుడు తన వద్ద ఉన్న డిజిటల్ పేమెంట్ స్కానర్‌ను చూపించాడు. దీంతో గోవర్దన్ తన సెల్‌తో స్కాన్ చేసి డిజిటల్ పేమెంట్ విధానంలో చెల్లించాడు. ఈ సందర్భంగా యాచకుడు చిన్నమారన్న మాట్లాడుతూ.. అంతా డిజిటల్ కాలం కావడంతో యాచకులం కూడా మారాల్సి వచ్చిందని చెప్పాడు. తనది ఏపీలోని నంద్యాల జిల్లా గుండాల (ఎస్) గ్రామమని తెలిపాడు. హనుమాన్ వేషధారణలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు తిరుగుతూ యాచిస్తున్నట్లు చెప్పాడు. -
కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి.. మూడ్రోజులపాటు
కోదాడ రూరల్: ఓ యువతికి కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఇచ్చి ఇద్దరు యువకులు లైంగికదాడి చేశారు. ఇంట్లో బంధించి మూడ్రోజులు చిత్రహింసలు పెట్టారు. సూర్యాపేట జిల్లా కోదాడలో సోమవారం ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కోదాడ పట్టణంలోని మాతానగర్‌కు చెందిన బాధితురాలు ఈ నెల 15న రాత్రి 9.30 గంటల సమయంలో బయటకు వెళ్లింది. అదే ప్రాంతానికి చెందిన గౌస్, సాయిరాంరెడ్డి.. ముత్యాలమ్మవీధిలో ఆ యువతిని ఆటోలో ఎక్కించుకుని పట్టణ శివారులోని ఓ ఇంట్లోకి తీసుకెళ్లారు. కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి బలవంతంగా తాగించారు. మూడ్రోజులు చిత్రహింసలకు గురి చేస్తూ లైంగిక దాడి చేశారు. ఆమె తలను గోడ కు బాదారు. బాధితురాలి కేకలు విని సోమ వారం చుట్టుపక్కల వాళ్లు అక్కడికి వెళ్లి చూశా రు. ఆ యువతి కుటుంబీకులు తెలిసినవాళ్లే కావడంతో వెంటనే సమాచారం ఇచ్చారు. అప్పటికే యువతి గురించి వెతుకుతున్న కు టుంబీకులు అక్కడికి వచ్చే సరికి నిందితులు పరారయ్యారు. బాధిత కుటుంబం వెంటనే పోలీసులను ఆశ్రయించింది. గాయాలతో ఉ న్న యువతిని వైద్య పరీక్షల నిమిత్తం సూర్యా పేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. సాయిరాంరెడ్డి, గౌస్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు నిందితుల్లో ఒకరు మున్సిపాలిటీ పరిధిలోని ఓ వార్డు కౌన్సిలర్ కుమారుడని తెలిసింది. -
విజయ కీర్తి
విజయసోపానాలు అధిరోహించడానికి ఏం చేయాలా?! అని సుదీర్ఘ ఆలోచనలు చేయనక్కర్లేదు అనిపిస్తుంది కీర్తి ప్రియను కలిశాక. తెలంగాణలోని సూర్యాపేట వాసి అయిన కీర్తిప్రియ కోల్‌కతాలోని ఐఐఎమ్ నుంచి ఎంబీయే పూర్తి చేసింది. తల్లి తన కోసం పంపే ఎండు కూరగాయల ముక్కలు రోజువారి వంటను ఎంత సులువు చేస్తాయో చూసింది. తన కళ్లముందు వ్యవసాయ పంట వృథా అవడం చూసి తట్టుకోలేకపోయింది. ఫలితంగా తల్లి తన కోసం చేసిన పని నుంచి తీసుకున్న ఆలోచనతో ఓ ఆహార పరిశ్రమనే నెలకొల్పింది. స్థానిక మహిళలకు ఉపాధి అవకాశాలనూ కల్పిస్తోంది. తన వ్యాపారంలో తల్లి విజయలక్ష్మిని కూడా భాగస్వామిని చేసిన కీర్తి విజయం గురించి ఆమె మాటల్లోనే.. ‘‘ఈ రెడీ టు ఈట్, రెడీ టు కుక్ కాన్సెప్ట్‌కు ముందు చదువు, ఉద్యోగరీత్యా బెంగళూరులో ఉన్నప్పుడు మా అమ్మ నాకు వంట ఈజీగా అవడం కోసం ఎండబెట్టిన కూరగాయల ముక్కలను ప్యాక్ చేసి, నాకు పంపేది. వాటిలో టొమాటోలు, బెండ, క్యాబేజీ, గోంగూర, బచ్చలికూర, మామిడికాయ... ఇలా రకరకాల ఎండు కూరగాయల ముక్కలు ఉండేవి. వీటితో వంట చేసుకోవడం నాకు చాలా ఈజీ అయ్యేది. ఈ సాధారణ ఆలోచన నాకు తెలియకుండానే నా మనసులో అలాగే ఉండిపోయింది. వృథాను అరికట్టవచ్చు సూర్యాపేటలోని తొండా గ్రామం మాది. ఒకసారి రైతు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర రాక, ఆ పంటను పొలంలోనే వదిలేశారు. ఇది చూసి చాలా బాధేసింది. చదువు తర్వాత సొంతంగా వ్యాపారం మొదలుపెట్టాలన్న ఆలోచనకు నా బాధ నుంచే ఓ పరిష్కారం కనుక్కోవచ్చు అనిపించింది. అమ్మ తయారు చేసే ఎండు కూరగాయల కాన్సెప్ట్నే నా బిజినెస్‌కు సరైన ఆలోచన అనుకున్నాను. ఆ విధంగా వ్యవసాయదారుల పంట వృథా కాకుండా కాపాడవచ్చు అనిపించింది. ఈ ఆలోచనను ఇంట్లోవాళ్లతో పంచుకున్నాను. అంతే, రెడీ టు ఈట్, రెడీ టు కుక్ కాన్సెప్ట్ సిద్ధమైపోయింది. కుటుంబ మద్దతు మా నాన్న పోలీస్ విభాగంలో వర్క్ చేస్తారు. అమ్మ గృహిణి. ముగ్గురు అమ్మాయిల్లో నేను రెండవదాన్ని. నా ఆలోచనకు ఇంట్లో అందరూ పూర్తి మద్దతు ఇచ్చారు. దీనికి ముందు చేసిన స్టార్టప్స్, టీమ్ వర్క్ .. గురించి అమ్మానాన్నలకు తెలుసు కాబట్టి ప్రోత్సహిస్తూనే ఉంటారు. కాకపోతే అమ్మాయిని కాబట్టి ఊళ్లో కొంచెం వింతగా చూస్తుంటారు. వృద్ధిలోకి తీసుకు వస్తూ.. సాధారణంగా తెలంగాణలో ఎక్కువగా పత్తి పంట వేస్తుంటారు. మా చుట్టుపక్కల రైతులతో మాట్లాడి, క్రాప్ పంటలపై దృష్టి పెట్టేలా చేశాను. రసాయనాలు వాడకుండా కూరగాయల సాగు గురించి చర్చించాను. అలా సేకరించిన కూరగాయలను మెషిన్స్ ద్వారా శుభ్రం చేసి, డీ హైడ్రేట్ చేస్తాం. వీటిలో ఆకుకూరలు, కాకర, బెండ, క్యాబేజీ.. వంటివి ఉన్నాయి. వీటితోపాటు పండ్లను కూడా ఎండబెడతాం. రకరకాల పొడులు తయారు చేస్తాం. మూడేళ్ల క్రితం ఈ తరహా బిజినెస్ ప్లానింగ్ మొదలైంది. మొదట్లో నాలుగు లక్షల ప్రారంభ పెట్టుబడితో ప్రారంభించిన ఈ పరిశ్రమ ఇప్పుడు రెండున్నర కోట్లకు చేరింది. వ్యాపారానికి అనువుగా మెల్లమెల్లగా మెషినరీని పెంచుకుంటూ, వెళుతున్నాం. మార్కెట్‌ను బట్టి యూనిట్ విస్తరణ కూడా ఉంటోంది. రెడీ టు ఈట్, రెడీ టు కుక్ కాన్సెప్ట్‌తో ఈ ఐడియాను అభివృద్ధి చేస్తున్నాం. వీటితో పాటు సూప్ మిక్స్‌లు, జ్యూస్ మిక్స్‌లు, కూరల్లో వేసే పొడులు మా తయారీలో ఉన్నాయి. ఏ పని చేయాలన్నా ముందు దాని మీద పూర్తి అవగాహన ఉండాలి. దీంతోపాటు తమ మీద తమకు కాన్ఫిడెన్స్ ఉండాలి. మనకు ఓ ఆలోచన వచ్చినప్పుడు, దానిని అమలులో పెట్టేటప్పుడు చాలామంది కిందకు లాగాలని చూస్తుంటారు. కానీ, మనకు దూరదృష్టి ఉండి, క్లారిటీగా పనులు చేసుకుంటూ వెళితే తిరుగుండదు. మన ఆలోచనని అమలులో పెట్టేటప్పుడు కూడా మార్కెట్‌కు తగినట్టు మనల్ని మనం మార్చుకుంటూ ఉండాలి’’ అని వివరిస్తుంది కీర్తిప్రియ. – నిర్మలారెడ్డి -
అప్పుల తెలంగాణ కేసీఆర్ ఘనత
నూతనకల్: రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ కాకుండా అప్పుల తెలంగాణగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. 44వ రోజు పాదయాత్రను ఆదివారం సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రం నుంచి మిర్యాల క్రాస్‌రోడ్డు, లింగంపల్లి, మాచనపల్లి క్రాస్ రోడ్డు వరకు నిర్వహించారు. లింగంపల్లి సభలో ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను అన్నివిధాలుగా మోసం చేసి నట్టేట ముం చారని ఆరోపించారు. ప్రజావ్యతిరేక విధానాలపై ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు టీఆర్ఎస్కు బీటీ మ్గా మారాయని ఎద్దేవా చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అన్నివర్గాల ప్రజలకు న్యాయం చేసేలా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేశారని గుర్తు చేశారు. సీలింగ్ భూమికి పట్టాలు ఇచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని మండల కేంద్రం లోని పలువురు రైతులు వినతిపత్రం అందజేశారు. దారిపొడవునా కూలీలు, గీత కార్మి కులను కలసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. లింగంపల్లిలో న్యూరోఫైబ్రోమాతోసిస్ వ్యాధిగ్రస్తుడు అంతయ్య తన సమస్యను షర్మిలకు వివరించారు. -
మోసగించడంలో కేసీఆర్ దిట్ట: షర్మిల
నూతనకల్: ప్రజలను నమ్మించి మోసం చేయడంలో సీఎం కేసీఆర్ ముందున్నారని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల అన్నారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులకు రక్షణ లేకుండా పోయిందని, రక్షణ కల్పించడంలో విఫలమైన కేసీఆర్ ఉరేసుకొని చనిపోవాలని అన్నారు. ప్రజాప్రస్థా నం పాదయాత్ర శుక్రవారం సూర్యాపేట జిల్లా నూ తనకల్ మండలంలోని వెంకేపల్లి, చిల్పకుంట్ల, నూతనకల్‌లో కొనసాగింది. ఈ సందర్భంగా షర్మిల నూతనకల్‌లో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. పోడు భూములకు పట్టాలు, దళితులకు మూడెకరాల భూమి వంటి హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, లేనిపక్షంలో నిరుద్యోగభృతి అందజేస్తామని మాట్లాడిన ముఖ్యమంత్రి వాటిని విస్మరించారని విమర్శించారు. ధాన్యాన్ని చివరిగింజ వరకు కొనుగోలు చేస్తానని మాట్లాడిన ప్రభుత్వపెద్దలు ఇప్పుడు వరి పండిచవద్దని మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. -
కేసీఆర్ పాలనలో రూ.4 లక్షల కోట్ల అప్పులు
అర్వపల్లి: సీఎం కేసీఆర్ ఎనిమిదేళ్ల పాలనలో రూ.4లక్షల కోట్ల అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అప్పులమయంగా మార్చారని వైఎస్సార్టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ప్రజాప్రస్థానంలో భాగంగా సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలానికి గురువారం పాదయాత్ర చేరింది. ఈ సందర్భంగా కొమ్మాలలో జరిగిన మాటాముచ్చట కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. బంగారు తెలంగాణ తెస్తానని చెప్పిన కేసీఆర్ రాష్ట్రాన్ని బీరు, బార్ల తెలంగాణగా మార్చారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం తెచ్చిన అప్పులతో ప్రతి కుటుంబంపై రూ.4 లక్షల భారం పడుతుందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రం అప్పులు, ఆత్మహత్యల తెలంగాణగా మారిందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో రాష్ట్రం లో 46 లక్షల పక్కా ఇళ్లు నిర్మిస్తే, కేసీఆర్ ఒక్క ఇంటిని కూడా నిర్మించి ఇవ్వలేదన్నారు. ఉద్యమకారుడని కేసీఆర్‌కు అవకాశమిస్తే దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో తుంగతుర్తి శాసనసభ నియోజకవర్గం నుంచి స్థానికుడైన వైఎస్సార్టీపీ అభ్యర్థి ఏపూరి సోమన్నను ఆదరించి గెలిపించాలని కోరారు. -
నిరుద్యోగుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే
తిరుమలగిరి(తుంగతుర్తి): రాష్ట్రంలో 1.90 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ఏడేళ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్లు రాక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. ప్రజా ప్రస్థానం యాత్రలో భాగంగా 37వ రోజైన శనివారం సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం అనంతారం గ్రామంలోకి పాదయాత్ర ప్రవేశించింది. ఈ సందర్భంగా నిర్వహించిన ‘మాట– ముచ్చట’ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఉన్నత చదువులు చదివిన యు వత కేసీఆర్ పాలనలో ఉద్యోగాలు రాక కూలి పనులు, కుల వృత్తులకే పరిమితమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్టీపీ కో ఆర్డినేటర్ల నియామకం సాక్షి, హైదరాబాద్: పార్టీ బలోపేతంలో భా గంగా షర్మిల రాష్ట్ర అధికార ప్రతినిధుల తో పాటు రాష్ట్ర యువత విభాగం, విద్యార్థి విభాగాలకు కో ఆర్డినేటర్లను నియమించా రు. ఈ మేరకు పార్టీ కార్యాలయం శనివారం ఓ ప్ర కటన విడుదల చేసింది. రాష్ట్ర అధికార ప్రతినిధులుగా తూడి దేవేందర్ రెడ్డి, గట్టు రామచందర్‌రావు, ఏపూరి సోమన్న, పిట్ట రాం రెడ్డి, సయ్యద్ ముజ్తబా అహ్మద్, సత్యవతి, భూమిరెడ్డి, బోర్గి సంజీవ్, కేటీ నరసింహా రెడ్డి, డాక్టర్ కె.నగేశ్ నియమితులయ్యా రు. స్టేట్ యూత్ కోఆర్డినేటర్లుగా సయ్యద్ అజీ మ్, సుమన్ గౌడ్, గడ్డం హిందుజారెడ్డి, అద్నాన్ ఖాన్, నంబూరి కార్తీక్‌తో పాటు మ రో 8 మందిని నియమించారు. స్టేట్ స్టూడెం ట్ కో ఆర్డినేటర్లుగా విజయ్ కుమార్, ఎస్, నాగరాజ్ చక్రవర్తి, డి. శివారెడ్డి, గడ్డం అశోక్, ఎల్. విజయ్ కుమార్, గడ్డం ఆదాము నియమితులయ్యారు. ఖమ్మం జిల్లా పార్టీ అధ్యక్షునిగా లక్కినేని సుధీర్ బాబు, హుజూర్నగర్ నియోజకవర్గం కో ఆర్డినేటర్‌గా ఆదెర్ల శ్రీనివాస్‌రెడ్డి నియమితులయ్యారు. -
దొరల కబంధ హస్తాల్లో తెలంగాణ
తుంగతుర్తి, మద్దిరాల: అమరుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ నేడు దొరల కబంధ హస్తాల్లో నలిగిపోతోందని బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్టినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంతో పాటు వెలుగుపల్లి, అన్నారం, వెంపటి, రావులపల్లి, గొట్టిపర్తి, మద్దిరాల మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని కుక్కడం, కుంటపల్లి, గోరెంట్ల, పోలుమల్ల గ్రామాల్లో చేపట్టిన రాజ్యాధికార యాత్రలో పాల్గొని ఆయన మాట్లాడారు. మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో బాగుపడింది కేసీఆర్ కుటుంబం మాత్రమేనన్నారు. కేసీఆర్ సీఎం కాకముందు 50 ఎకరాలుంటే ఇప్పుడు 300 ఎకరాల భూమిని కూడ బెట్టుకొని అందులో రూ.40 కోట్ల బంగ్లా కట్టుకున్నారని ఆరోపించారు. ఇటీవల సీఎం కేసీఆర్ చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లకుండా యశోద ఆస్పత్రికి వెళ్లారని, అదే మనం ఆ కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లాలంటే భార్య మెడలో పుస్తెలతాడును తాకట్టు పెట్టాలి లేదా ఎకరం వ్యవసాయ భూమినైనా అమ్ముకోవాలని ఆవేదన వ్యక్తంచేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి పేదవాడికి కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందేలా పూర్తి డబ్బులు కేటాయిస్తామన్నారు. రాష్ట్రంలో 33 లక్షలకు పైగా నిరుద్యోగులుంటే 8 ఏళ్ల నుంచి ఎలాంటి నోటిఫికేషన్ వేయకుండా రాత్రికిరాత్రే కేవలం 81 వేల ఉద్యోగాలను ప్రకటించారని ప్రవీణ్ విమర్శించారు. కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు. -
సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం
-
ఆపదలో అముద.. కేన్సర్ బారినపడిన దీనురాలు.. సాయం చేయండి ప్లీజ్!
కోదాడ: అముద ఆపదలో ఉంది.. ఒకప్పుడు చెత్తకుప్పల మధ్య తిరిగిన ఆమె.. అటెండర్ ఉద్యోగం వరకు ఎదిగింది. అయితే ఇప్పుడు కేన్సర్ బారినపడి మృత్యువు ముంగిట మరో జీవన్మరణ పోరాటం చేస్తోంది. నాడు ఆమెను ఆదరించి అండగా నిలిచిన నిరుపేద వెంకటేశ్వర్లుకు అముదకు చికిత్స చేయించే స్థోమత లేక సాయం చేసే చేతుల కోసం ఎదురు చూస్తున్నారు. ఎవరీ అముద.. పది సంవత్సరాల క్రితం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని హుజూర్నగర్ రోడ్డులో మతిస్థిమితం కోల్పోయి.. చెత్త కుప్పల మధ్య తిరుగుతున్న ఉన్న ఓ యువతిని.. సమీపంలో చెప్పులు కుట్టుకొని జీవిస్తున్న నిరుపేద వెంకటేశ్వర్లు చూసి ఆదరించి మంచి మనిషిగా మార్చారు. సొంత బిడ్డలా చూసుకుంటూ అండగా నిలిచారు. ఆమె మంత్రి హరీశ్‌రావు చొరవతో కోదాడ వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో అటెండర్ ఉద్యోగం చేస్తూ జీవిస్తోంది. అముద గురించి ‘సాక్షి’దినపత్రికలో వచ్చిన కథనాలను చూసిన ఒకరు ఇటీవలే ఈమె జీవితాన్ని సినిమాగా తీస్తున్నారు. కాగా, అనారోగ్యంతో ఉద్యోగానికి వెళ్లలేకపోవడంతో మార్కెట్ కమిటీ అముద జీతం నిలిపి వేసింది. దీంతో ఆమె కష్టాలు తీవ్రమయ్యాయి. జ్వరం వచ్చిందని వెళితే.. నెల రోజుల క్రితం వరకు బాగానే ఉన్న అముదకు ఇటీవల జ్వరం రావడంతో వెంకటేశ్వర్లు ఆమెను కోదాడ ఆస్పత్రిలో చూపించారు. అక్కడ మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు వెళ్లాలని చెప్పడంతో.. ఓ డాక్టర్‌కు చూపించారు. ఆయన కేన్సర్ సోకిందనే అనుమానంతో బసవతారకం ఆస్పత్రికి సిఫార్సు చేశారు. ఆమెను పరీక్షించిన వైద్యులు కేన్సర్ సోకిందని నిర్ధారించడంతోపాటు వెంటనే చికిత్స చేయించాలని, లేకపోతే ప్రాణాలకు ప్రమాదం అని చెప్పడంతో వెంకటేశ్వర్లు అముదను అదే ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం చికిత్స అందిస్తున్నా.. కొద్ది రోజుల్లోనే ఆమెకు ఆపరేషన్ చేయాలని వైద్యులు చెబుతున్నారు. నిరుపేద అయిన వెంకటేశ్వర్లు అముద చికిత్సకు చేయూతనందించాలని దాతలను కోరుతున్నారు. దాతలు అముద అకౌంట్‌కు తమకు తోచినంత డబ్బు పంపితే ఆమె బతుకుతుందని అంటున్నారు. పల్లె అముద నారాయణ నాడర్ అకౌంట్ నంబర్: 6247 8971579 ఐఎఫ్ఎస్సీ కోడ్ : ఎస్బీఐఎన్ 0020181 ఫోన్: 93915 42070 -
అంచనాలు తారుమారు.. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుల ఎంపికలో ఊహించని మలుపు
సాక్షి, నల్లగొండ: టీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షునిగా దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ నియమితులయ్యారు. సూర్యాపేట జిల్లా అధ్యక్షునిగా రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షునిగా ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు అధిష్టానం బుధవారం ప్రకటించింది. ఈ నియామకాలతో జిల్లా నేతల అంచనాలు తారుమారయ్యాయి. మొదటి నుంచి జిల్లా అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు చేసిన వారెవరికీ పదవి దక్కలేదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఉమ్మడి జిల్లాలో ఓసీలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి భావించారు. తద్వారా జిల్లాలో అన్ని వర్గాలను దగ్గర చేసుకోవ్చనే ఆలోచన చేశారు. ఇదే విషయాన్ని గతంలో పార్టీ అధినేత కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో బుధవారం ప్రకటించిన జిల్లా అధ్యక్షుల నియామకాలను చూస్తే మంత్రి మాట నెగ్గినట్టు అవగతమవుతోంది. సీఎం కేసీఆర్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న ఎమ్మెల్యే రవీంద్రకుమార్, పక్కన మంత్రి, ఎమ్మెల్యేలు తనకు ఇస్తారని కిషన్‌రెడ్డి భావించినా.. నల్లగొండలో రాజకీయంగా రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ కోటాలో తనకు కచ్చితంగా జిల్లా అధ్యక్ష పదవి దక్కుతుందన్న ఆశలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడా కిషన్‌రెడ్డి భావించారు. గతంలో ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని కూడా కేసీఆర్ హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోవడంతో జిల్లా అధ్యక్ష పదవి కచ్చితంగా ఇస్తారని ఎదురుచూసినా దక్కలే. ఆయనతో పాటు గుత్తా జితేందర్‌రెడ్డి, సత్తయ్యగౌడ్ కూడా జిల్లా అధ్యక్ష పదవిని ఆశించారు. కానీ, అనూహ్యంగా ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన రవీంద్రకుమార్‌కు అధ్యక్ష పదవిని కట్టబెట్టారు. చదవండి: అనూహ్యంగా తెరపైకి పేరు.. గులాబీ బాస్‌గా ‘కల్వకుంట్ల’ సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లోనూ అంతే.. సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల అధ్యక్షుల నియామకాల విషయంలోనూ ఊహించని విధంగా నియామకాలు జరిగాయి. సూర్యాపేట జిల్లా నుంచి వై.వెంకటేశ్వర్లు, ఎస్ఏ రజాక్, నిమ్మల శ్రీనివాస్‌గౌడ్ పేర్లు చివరి వరకు పరిశీలనలో ఉన్నట్లుగానే పార్టీ వర్గాలు చెప్పుకొచ్చాయి. చివరకు రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌కు జిల్లా అధ్యక్ష పదవి వచ్చింది. దీంతో అక్కడ బీసీ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇచ్చినట్లైంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోనూ బూడిద భిక్షమయ్యగౌడ్, ఆకుల ప్రభాకర్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వారిద్దరిలో ఎవరో ఒకరికి కచ్చితంగా అధ్యక్ష పదవి దక్కుతుందనే ఊహాగానాలు వచ్చాయి. వాటిని తారుమారు చేస్తూ ఆయిల్ ఫెడ్ ఛైర్మన్ రామకృష్ణారెడ్డికి పదవిని కట్టబెట్టారు. ఒకటి ఎస్టీ, మరొకటి బీసీ, ఇంకొకటి ఓసీ సామాజికవర్గానికి కేటాయించారు. పవర్ సెంటర్‌గా మారకూడదనే.. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో జిల్లాలో పార్టీ నేతలను అందరిని కలుపుకుపోయే వారినే పార్టీ అధ్యక్షులుగా నియమిస్తారని పార్టీలో మొదటి నుంచి ప్రచారం జరుగుతోంది. అంతేకాదు నియోజకవర్గాల్లో కీలకమైన ఎమ్మెల్యేల మాట కాదనకుండా ముందుకు వెళ్లే వారికే పార్టీ బాధ్యతల అప్పగించాలన్న ఆలోచనలు చేసింది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో చాలా చోట్ల పార్టీ బాధ్యతలను కూడా ఎమ్మెల్యేలకే అధిష్టానం అప్పగించింది. ఇక్కడా అదే అమలు చేసింది. దేవరకొండ ఎమ్మెల్యేకు పార్టీ బాధ్యతలు అప్పగించింది. ఆయనతో పార్టీ నేతలు ఎవరికి ఎలాంటి ఇబ్బందీ లేదు. కలిసిపోయే తత్వం కావడం.. మంత్రికి అనుగుణంగానే ఉండే నాయకుడు అయినందున ఆయన్ని నియమించింది. చదవండి: వీరే గులాబీ రథసారథులు.. 33 జిల్లాల అధ్యక్షుల జాబితా ఇదే సూర్యాపేటలో ఎంపీ లింగయ్య యాదవ్ కూడా మంత్రి జగదీష్‌రెడ్డికి అనుకూలంగా ఉంటారు. యాదాద్రిలోనూ అంతే. కాగా, మూడు జిల్లాల్లోనూ అధ్యక్ష పదవిని ఆశించిన వారికి ఇస్తే ఎమ్మెల్యేలకు వారికి మధ్య కొంత గ్యాప్ వస్తుందనే భావన నెలకొంది. పైగా పార్టీ అధ్యక్షులు అయినందున వారు మరో పవర్ సెంటర్‌గా మారుతారనే వాదన ఉంది. అవేమీ లేకుండా మంత్రికి, ఎమ్మెల్యేలకు, ఇతర ప్రజాప్రతినిధులకు అనుగుణంగా ఉండేవారికి అధ్యక్ష పదవులను కట్టబెట్టినట్లు తెలిసింది. కాంగ్రెస్‌కు దీటుగా.. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌కు దీటుగా టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులను నియమించింది. నల్లగొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా శంకర్‌నాయక్ ఉండగా, సూర్యాపేట జిల్లా అధ్యక్షునిగా వెంకన్నయాదవ్ ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో అనిల్‌కుమార్‌రెడ్డి ఉండగా, ఈ మూడు జిల్లాల్లోనూ టీఆర్ఎస్ కూడా అదే సామాజిక వర్గాల వారిని అధ్యక్షులుగా నియమించింది. విధేయత, సమన్వయమే లక్ష్యంగా.. నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్ గతంలో కమ్యూనిస్టు నాయకునిగా ప్రజల్లో తిరిగిన అనుభవంతోపాటు పార్టీకి విధేయుడిగా ఉంటారని పార్టీ అంచనా. బడుగుల లింగయ్య యాదవ్ కూడా టీడీపీ అధ్యక్షునిగా సుధీర్ఘ కాలం పని చేశారు. రామకృష్ణారెడ్డి కూడా పార్టీకి విధేయునిగా ఉండటంతో పాటు పార్టీ నేతలు, ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటారన్న అంచనాలతోనే నియామకాలు చేపట్టినట్లు తెలుస్తోంది. పార్టీ పటిష్టతకు నిరంతరం కృషి దేవరకొండ : జిల్లాలో టీఆర్ఎస్ పార్టీని మరింత పటిష్ట పర్చేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తాని ఆ పార్టీ నూతన జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ పేర్కొన్నారు. జిల్లా అధ్యక్షుడిగా నియామకమైన సందర్భంగా బుధవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. గిరిజన ఎమ్మెల్యేను అయిన నాపై పూర్తి విశ్వాసం ఉంచి పార్టీ జిల్లా బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రికి రుణపడి ఉంటానన్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో పార్టీ కార్యకర్తలకు మరింత చేరువయ్యే అవకాశం లభించిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు బాధ్యతలు నిర్వర్తిస్తానని చెప్పారు. బయోడేటా పేరు : రమావత్ రవీంద్రకుమార్ స్వస్థలం : దేవరకొండ మండలం రత్యాతండా రాజకీయ ప్రస్థానం: రవీందక్రుమార్ డిగ్రీ ఫైనలియర్ చదువుతుండగానే 1995లో దేవరకొండ మండలం శేరిపల్లి గ్రామ సర్పంచ్‌గా పోటీ చేసే అవకాశం వచ్చింది. సీపీఐ మద్దతుతో ఆయన సర్పంచ్‌గా గెలుపొందారు. 2001లో రెండోసారి కూడా సర్పంచ్‌గా గెలిచారు. సర్పంచ్‌గా మూడేళ్ల మూడేళ్ల పదవీకాలం పూర్తయ్యాక 2004లో సీపీఐ తరఫున దేవరకొండ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వచ్చింది. ఎమ్మెల్యేగా విజయం సాధించాక సర్పంచ్ పదవికి రాజీనామా చేశారు. 2009లో ఎమ్మెల్యే పోటీచేసి ఓడిపోయారు. 2014లో సీపీఐ నుంచి పోటీచేసి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 2016లో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018లో టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీచేసి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. -
హత్యా.. నరబలా ?.. అంతుచిక్కని జహేందర్ హత్యోదంతం
సాక్షి, చింతపల్లి (నల్గొండ) : సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం శూన్యపాడుతండాకు చెందిన జహేందర్(30) హత్యోదంతం కేసు మిస్టరీ వీడడం లేదు. చింతపల్లి మండలం విరాట్‌నగర్ కాలనీ మహంకాళి అమ్మవారి పాదాల వద్ద ఈ నెల 10న మొండెం నుంచి వేరుచేయబడిన జహేందర్ తల లభ్యమైంది. మూడు రోజుల తర్వాత అతడి మొండెం రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్‌లోని ఓ నిర్మాణంలో ఉన్న భవనంలో లభించిన విషయం తెలిసిందే. అయితే, జయేందర్ది హత్యా.. నరబలినా అనేది ఇప్పటికీ పోలీసులకు అంతుచిక్కడం లేదు. జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి ఈ కేసును సవాలుగా తీసుకున్నా ముందుకు సాగడం లేదని తెలుస్తోంది. చదవండి: (ఘోర రోడ్డు ప్రమాదం.. క్షతగాత్రులను చూసి.. చలించిన యువ డాక్టర్) దుండగులు ఈ హత్యోదంతంలో అత్యంత చాకచక్యంగా వ్యవహరించినట్లు పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. కేసు ఛేదనకు పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. తుర్కయంజాల్‌లో జహేందర్ మొండెం లభ్యం కావడంతో రంగారెడ్డి జిల్లా పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న భవన యజమానిని అదుపులోకి తీసుకుని జయేందర్ మొండెం ఇక్కడికి ఎలా వచ్చిందనే కోణంలో విచారిస్తున్నట్లు తెలిసింది. చదవండి: (ఆరు నెలల క్రితమే వివాహం.. రోడ్డు ప్రమాదంలో ఏఆర్ కానిస్టేబుల్ మృతి) -
మరణించిన శిశువు బతికుందని..
సూర్యాపేట క్రైం: శిశువుకు హార్ట్ బీట్ లేకున్నా బతికుందని స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు రిపోర్టు ఇచ్చారు. డాక్టర్లు ఆపరేషన్ చేసి ప్రాణం లేని శిశువును బయటకు తీశారు. దీంతో డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే శిశువు చనిపోయిందని హాస్పిటల్‌పై బంధువులు దాడి చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆదివారం ఈ సంఘటన జరిగింది. తిమ్మాపురం గ్రామానికి చెందిన మరిపెద్ది లావణ్యకు పురిటినొప్పులు రావడంతో జిల్లా కేంద్రంలోని మాధవి ఆస్పత్రికి ఆదివారం ఉదయం తీసుకొచ్చారు. డాక్టర్ సలహా మేరకు లావణ్యకు దగ్గర్లోని స్కానింగ్ సెంటర్లో స్కానింగ్ తీయించగా శిశువుకు హార్ట్ బీట్ లేదని రిపోర్ట్ ఇచ్చారు. భర్త శ్రీకాంత్‌గౌడ్ మరోసారి ఆపిల్ స్కానింగ్ సెంటర్లో స్కానింగ్ తీయించగా శిశువుకు హార్ట్ బీట్ ఉందని రిపోర్ట్ ఇచ్చారు. ఆ తర్వాత ఆపరేషన్ చేసిన డాక్టర్లు మృత శిశువును బయటికి తీశారు. దీంతో డాక్టర్ నిర్లక్ష్యం వల్లే శిశువు మృతి చెందిందని బంధువులు ఆగ్రహంతో హాస్పిటల్‌పై దాడి చేశారు. జన్యు సంబంధిత వ్యాధితో శిశువు మృతి చెందినట్లు డాక్టర్ మాధవి వివరణ ఇచ్చారు. -
అట్టడుగు నుంచి ఐఐటీ... దాతలు కరుణిస్తే మేటి
ఆత్మకూర్ (ఎస్): తల్లిదండ్రులు పడుతున్న కష్టాలను ప్రత్యక్షంగా చూసిన ఓ విద్యార్థి.. వారిని కష్టాల నుంచి గట్టెక్కించాలనుకున్నాడు. అందుకు ఉత్తమ మార్గం చదువుకోవడమే అని భావించి ఉన్నతంగా చదివాడు. ఫలితంగా ఐఐటీ ఖరగ్‌పూర్‌లో సీటు సాధించాడు. అయితే చదువుకోవడానికి డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నాడు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండల పరిధిలోని తుమ్మలపెన్‌పహాడ్ గ్రామానికి చెందిన పిడమర్తి ప్రసాద్ గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఆయన కుమారుడు అనిల్‌కుమార్‌కు ఖరగ్‌పూర్ ఐఐటీ కాలేజీలో ఉచిత సీటు లభించింది. అయితే, అందులో చదువుకోడానికి ప్రతి సెమిస్టర్‌కు రూ.35 వేల చొప్పున ఏడాదికి రూ.70 వేల వరకు ఖర్చు అవుతుంది. మొత్తం నాలుగేళ్ల కోర్సులో అంతమొత్తం ఖర్చులు భరించలేమని కాలేజీలో జాయిన్ కావడానికి ఇబ్బంది పడుతున్నాడు. కోవిడ్ కారణంగా ప్రస్తుతం ఆన్లైన్ క్లాస్‌లు జరుగుతున్నందున.. కనీసం ల్యాప్‌టాప్ కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నాడు. తండ్రి పారిశుద్ధ్య కార్మికుడిగా చాలీచాలని జీతంతో పనిచేస్తుండడంతో చదువు కొనసాగడానికి అనిల్ దాతల సహాయాన్ని కోరుతున్నాడు. దాతలు సహకరిస్తే తన కుమారుడిని ఉన్నత చదువులు చదివిస్తానని ప్రసాద్ అంటున్నాడు. 9014154250 నంబర్‌కు గూగుల్‌పే ద్వారా గానీ, 40537593456 అకౌంట్‌కు (ఎస్బీఐఎన్ 0008810) గానీ ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నారు. -
దళితబంధుపై సంపూర్ణ అధికారం ఉండాలి
తిరుమలగిరి (తుంగతుర్తి): దళితబంధు పథకం కింద రాష్ట్రప్రభుత్వం ఇచ్చే రూ.10 లక్షలపై దళితులకు సంపూర్ణ అధికారం ఉండాలని మాజీమంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కోరారు. శనివారం హైదరాబాద్ నుంచి ఇల్లందుకు వెళ్తూ సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆ రూ.10 లక్షలతో దళితులు ఏ బిజినెస్ చేసుకోవాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉండాలని, దీనిపై రాష్ట్రప్రభుత్వ పెత్తనం ఉండొద్దని అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు పథకం పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని విమర్శించారు. దళితబంధు పథకంలో భాగంగా గేదెల స్కీం పెట్టి ఇక్కడి వారిని హరియాణాకు పంపిస్తే అక్కడ రూ.2 లక్షల విలువైన గేదెకు రూ.4.50 లక్షలు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. గతంలో గొర్రెల పథకంలో భాగంగా ఇక్కడి రైతులు కర్నూలు, నెల్లూరు, చిత్తూరు ప్రాంతాలకు వెళ్లి గొర్రెలు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డ విషయా న్ని ఈటల గుర్తుచేశారు. తిరుమలగిరి మండ లంలో ప్రతీఒక్క దళిత కుటుంబానికి వెంటనే రూ.10 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాం డ్ చేశారు. సమావేశంలో బీజేపీ తుంగతుర్తి నియోజకవర్గ ఇన్చార్జి రామచంద్రయ్య, జిల్లా అధికార ప్రతినిధి దీన్‌దయాళ్ పాల్గొన్నార -
సూర్యాపేట డీఎంహెచ్ఓకు పాజిటివ్
సూర్యాపేట, తిరుమలగిరి: సూర్యాపేట జిల్లా వైద్యాధికారికి, ఆయన కుటుంబ సభ్యులు ఐదుగురికి కరోనా నిర్ధారణ అయింది. డీఎంహెచ్ఓ డాక్టర్ కోటాచలం, ఆయన కుటుంబ సభ్యులు జలుబు, దగ్గు లక్షణాలు ఉండడంతో ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకున్నారు. గురువారం రిపోర్టు రాగా.. కోటాచలం, ఆయన భార్య, ఇద్దరు కుమారులు, కోడలు, మనుమరాలుకు వైరస్ సోకినట్లు తేలింది. జర్మనీలో ఉంటున్న డీఎంహెచ్ఓ పెద్ద కుమారుడు అజయ్, కోడలు, మనుమరాలు నవంబర్ 20న ఇంటికి వచ్చారు. మహారాష్ట్రలో ఎంబీబీఎస్ చదువుతున్న చిన్న కుమారుడు కూడా గత శుక్రవారం వచ్చాడు. అందరూ కలిసి శనివారం తిరుపతి దైవ దర్శనానికి వెళ్లారు. తిరిగి సోమవారం వారి స్వగ్రామమైన తిరుమలగిరికి చేరుకున్నారు. తిరుపతి నుంచి తెచ్చుకున్న ప్రసాదాన్ని ఇంటి చుట్టుపక్కల వారికి, బంధువులకు పంచారు. కోటాచలం మంగళవారం విధుల్లో చేరారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. అదేరోజు నిర్వహించిన ఎయిడ్స్ డే కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని డీఎంహెచ్ఓ కోరారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలగిరిలోని నివాసంలోనే హోం క్వారంటైన్లో ఉన్నట్లు తెలిపారు. కాగా డీఎంహెచ్ఓ సహా ఆరుగురు శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపినట్లు ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు సాక్షికి తెలిపారు. -
రసాయనాలతో టీ పొడి
సూర్యాపేట క్రైం: అంతర్రాష్ట్ర కల్తీ టీ పొడి తయారీ ముఠా గుట్టును సూర్యాపేట పోలీసులు రట్టుచేశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన నలుగురు సూత్రధారులతోపాటు మరో 12మంది చిరువ్యాపారులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 22.5లక్షల విలువ గల 45.5 క్వింటాళ్ల నకిలీ టీ పొడితోపాటు రెండు కార్లు, తూకం యంత్రాలు, 50 కేజీల ప్రాణాంతక రసాయన రంగుపొడి (టాట్రాజైన్), గ్యాస్ సిలిండర్, 15 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రాజేంద్రప్రసాద్ కేసు వివరాలను వెల్లడించారు. సూర్యాపేటలో రసాయనాలతో తయారుచేసిన కల్తీ టీ పొడి విక్రయాలు జరుగుతున్నట్లు కొద్ది రోజుల క్రితం పోలీసులకు సమాచారం అందింది. దీంతో నిఘా పెట్టి తొలుత పట్టణంలో టీపొడి అమ్ము తున్న రాచకొండ అనిల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడి ద్వారా చిరువ్యాపారులు పోకల రమేష్, బూర్ల వినయ్‌ను కస్టడీలోకి తీసుకుని విచారించారు. తర్వాత తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంకు చెందిన సర్వేమా శ్రీనివాస్‌ను అరెస్ట్ చేశారు. రాజమండ్రికి చెందిన కృష్ణ చైతన్య, జగన్నాథం వెంకట్‌రెడ్డి, రావులపాలెం గ్రామానికి చెందిన సర్వేమా శ్రీనివాస్, విజయవా డకు చెందిన కామేశ్వర్రావులు సూత్రధారు లని విచారణలో వెల్లడైంది. వీరు పదేళ్లుగా ఈ వ్యవహారం నడుపుతున్నట్లు తెలిసింది. మూడు బృందాలుగా ఏర్పడి.. పోలీసులు 3 బృందాలుగా ఏర్పడి ఏపీలో నకిలీ టీపొడి సూత్రధారుల ఇళ్లపై దాడులు జరిపి నలుగురిని అదుపులోకి తీసుకున్నా రు. మరో 8 మంది పరారీలో ఉన్నారని, త్వ రలో పట్టుకుంటామని పోలీసులు చెప్పారు. అయితే, సూర్యాపేట జిల్లాకు చెందిన వారు కొన్నేళ్లుగా ముఠాలోని సూత్రధారులతో సంబంధాలు పెట్టుకుని వ్యాపారాలు నిర్వహిస్తున్నారని తెలిసింది. ఆ కీలక వ్యక్తులు ఎవరనేది పోలీసులు గోప్యంగా ఉంచడంపై అనుమానాలు కలుగుతున్నాయి. -
మహిళను బలిగొన్న కామాంధులు!
తుంగతుర్తి: భర్తను పోగొట్టుకుని భారంగా బతుకీడుతున్న ఓ అభాగ్యురాలిని కామాంధులు పొట్టనబెట్టుకున్నారు. నాలుగు రోజుల క్రితం లైంగికదాడి చేయడంతో తీవ్ర అస్వస్థతకు గురైన బాధితురాలు చికిత్స పొందుతూ కన్నుమూసింది. సూర్యాపేట జిల్లాలో ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. తుంగతుర్తి మండలం రామన్నగూడెం తండాకు చెందిన గుగులోతు కాంతమ్మ (35)కు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కాంతమ్మ భర్త వీరన్న పదేళ్లక్రితం మృతిచెందాడు. అప్పటి నుంచి కాంతమ్మ కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తోంది. పని ఉందని తీసుకెళ్లి.. రామన్నగూడెం తండాకే చెందిన గుగులోతు సోమ్లా ఈ నెల 17న రాత్రి 9 గంటల సమయంలో కాంతమ్మను పని ఉందని చెప్పి ఇంటి నుంచి తీసుకెళ్లాడు. అదే సమయంలో మాలిపురం గ్రామానికి చెందిన శివ, లక్ష్మణ్‌లు సోమ్లా ఇంటికి వచ్చారు. అనంతరం శివ, లక్ష్మణ్‌లు కాంతమ్మను తండా పక్కన ఉన్న తోటలోకి తీసుకెళ్లి లైంగికదాడి చేశారు. తిరిగి ఆమెను రాత్రి 12 గంటల సమయంలో ఇంటికి పంపించారు. తీవ్ర అస్వస్థతకు గురై.. కాగా, కాంతమ్మ ఈనెల 20న తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను తుంగతుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యుల సలహా మేరకు సూర్యాపేటలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శనివారం రాత్రి అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం తొర్రూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. దీంతో బంధువులు కాంతమ్మ మృతికి కారణమైన సోమ్లా ఇంటి ముందు మృతదేహాన్ని ఉంచి, ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సోమ్లాను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రవి తెలిపారు. -
అభయమిచ్చి..పెళ్లి పెద్దగా నిలిచి
సూర్యాపేట: నిత్యం ప్రభుత్వ పరిపాలనలో బిజీ గా ఉండే రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి.. ఓ పేద యువతికి అన్నీ తానై వివాహం జరిపించారు. ఇంటికి పెద్ద దిక్కు ను కోల్పోయిన ఆ కుటుంబానికి అండగా నిలిచి దాతృత్వాన్ని చాటుకున్నారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలం నంద్యాలగూడెం గ్రామానికి చెందిన నంద్యాల వెంకట్‌రెడ్డి, శోభ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వెంకట్‌రెడ్డి హైదరాబాద్‌లో చిరుద్యోగం చేసుకుంటూ తండ్రి, భార్యాబిడ్డలను పోషించుకుంటున్నారు. ఈ క్రమంలో మూ డు నెలల కిందట వెంకట్‌రెడ్డి తన పెద్ద కుమార్తె శ్రావ్యకు వివాహం చేయాలని నిర్ణయించుకున్నా రు. తెల్లవారితే నిశ్చితార్థం ఉండడంతో కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉన్నారు. ఇంతలోనే ఆ కుటుంబాన్ని విధి వెక్కిరించింది. ఉన్నట్టుండి తీవ్ర అనారోగ్యంతో వెంకట్‌రెడ్డి తండ్రి సత్తిరెడ్డి కన్నుమూశారు. తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక వెంకట్‌రెడ్డి గుండె కూడా ఆగిపోయింది. అప్పటివరకు సంతోషంగా ఉన్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా కారుచీకట్లు కమ్ముకున్నాయి. ఆపద్బాంధవుడిగా.. సత్తిరెడ్డి, వెంకట్‌రెడ్డి మరణంతో దిక్కుతోచని పరిస్థితిలో పడ్డ ఆ కుటుంబం గురించి తెలుసుకున్న మంత్రి జగదీశ్‌రెడ్డి నంద్యాలగూడెం చేరుకుని ఆ కుటుంబ సభ్యులకు అండగా నిలిచారు. వారిని పరామర్శించి.. ఆగిపోయిన వెంకట్‌రెడ్డి పెద్ద కూతురు శ్రావ్య వివాహం తానే జరిపిస్తానని హామీ ఇచ్చారు. అన్నీ తానై.. ఇచ్చిన మాట ప్రకారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో శనివారం ఉదయం 9:30 గంటలకు వెంకట్‌రెడ్డి కుమార్తె శ్రావ్య వివాహాన్ని మంత్రి దంపతులు దగ్గరుండి వైభవంగా జరిపించారు. ఆపదలో ఉన్న కుటుంబానికి మంత్రి జగదీశ్‌రెడ్డి దంపతులు అండగా నిలవడంతో నంద్యాల గూడెం గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. పెద్ద దిక్కుగా ఉండి పెళ్లి చేశారు ఇటీవల మా తాత చనిపోగా మా నాన్న దానిని తట్టుకోలేక గుండె పోటుతో మృతిచెందారు. ఆ సమయంలో మమ్మల్ని పరామర్శించడానికి వచ్చిన మంత్రి.. నా పెళ్లి బాధ్యత తీసుకుంటామన్నారు. అన్నట్టుగానే ఇంటికి పెద్ద దిక్కుగా మారి దగ్గరుండి మా పెళ్లి జరిపించారు. చాలా సంతోషంగా ఉంది. – శ్రావ్య, పెళ్లి కుమార్తె -
రైతులపై పాశవికంగా దాడి చేశారు: జగదీశ్‌రెడ్డి
సూర్యాపేట: బండి సంజయ్ రెండోరోజు పర్యటనలో ఆయన వెంట వచ్చిన గూండాలు రైతుల మీద పాశవికంగా దాడి చేశారని, ఆ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని విద్యుత్‌మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. యాసంగి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేస్తుందా.. లేదా.. అని నిలదీసినందుకే గూండాయిజానికి పాల్పడ్డారని ఆరోపించారు. దాడులను తిప్పికొట్టిన ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతాంగానికి జగదీశ్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. -
రైతుల పక్షాన పోరాడుతా..: బండి సంజయ్
సూర్యాపేట/ఆత్మకూర్.ఎస్(సూర్యాపేట)/తిరుమలగిరి: వానాకాలం సీజన్లో పండించిన చివరి గింజనూ కొనుగోలు చేసే వరకు రైతుల పక్షాన పోరాటం కొనసాగిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. మంగళవారం సూర్యా పేట జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడారు. కోడిగుడ్ల దాడి, రాళ్లు, చెప్పుల దెబ్బలు ఎన్నైనా భరిస్తామని, రైతుల పక్షాన దేనికైనా తెగించి కొట్లాడుతామని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు అనేది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమస్య కాదని, ఇది రైతుల సమస్య అని పేర్కొన్నారు. వానాకాలం పంటకు సంబంధించి 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తీసుకుంటామని కేంద్రం అగ్రిమెంట్ చేసిన విషయం నిజం కాదా అని ప్రశ్నించారు. రైతుల సమస్యలను తెలుసుకోవడానికి, కొనుగోళ్లు జరుగుతున్నాయా లేదా అని తెలుసుకోవడానికి బీజేపీ పర్యటన చేస్తుంటే.. అన్ని కేంద్రాల్లో రైతులను బెదిరించి, ఎవ్వరు కూడా అక్కడ లేకుండా టీఆర్ఎస్ ప్రయత్నాలు చేసిందన్నారు. అయినా రైతులు బయట కలిసి తమ సమస్యలు చెప్పుకుంటున్నారని తెలిపారు. సోమవారం జరిగిన దాడు లకు ప్రధాన సూత్రధారి సీఎం కేసీఆరేనన్నారు. కేసీఆర్‌కు జ్ఞానోదయం కలగాలి.. తెలంగాణలో పండించిన పంటను అమ్ముకోవడా నికి రైతులు అష్టకష్టాలు పడుతున్నారని, రైతుల దుస్థితి చూసైనా కేసీఆర్‌కు జ్ఞానోదయం కలగాలని బండి సంజయ్ అన్నారు. మంగళవారం ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలోని ఐకేపీ కేంద్రాలకు వెళ్లి ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. అనంతరం తిరుమలగిరిలో మీడియాతో మాట్లాడుతూ.. రైతుల ముసుగులో టీఆర్ఎస్ నాయకులు ఒక్కొక్కరికి రూ.200, రూ.500, రూ.1000 ఇచ్చి, మద్యం తాపించి కిరాయి గూండాలతో తమపై దాడులు చేయించారని సంజయ్ ఆరోపించారు. టీఆర్ఎస్ నేతలS దౌర్జన్యాలపై రాష్ట్ర డీజీపీకి ఫోన్ చేస్తే కనీసం ఎత్తడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్సై లింగయ్య యాదవ్‌పై వేటు
-
జొన్నలకు పులి కాపలా!
తుంగతుర్తి: కోతుల బెడద తీవ్రమవుతుండటంతో రైతులు విసిగిపోతున్నారు. తమ పంటను కాపాడుకోవడానికి వినూత్నంగా ఆలోచిస్తున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని రావులపల్లి ఎక్స్‌రోడ్ తండా వద్ద ఓ రైతు తాను పండించిన జొన్నలను ఆరుబయట ఆరబోసి కోతుల బెడద నుంచి ధాన్యాన్ని రక్షించుకోవడానికి పులి బొమ్మను ఏర్పాటు చేశాడు. కోతులు ఈ పులి బొమ్మను చూసి దరిదాపుల్లోకి రాకుండా పోతున్నాయని రైతు తెలిపాడు. -
నీటిలో వణుకుతూ రాత్రంతా జాగారం
సూర్యాపేటరూరల్: ఓ మహిళ మూసీ వాగులో చిక్కుకుని రాత్రంగా నీటిలోనే జాగారం చేయాల్సి వచ్చింది. స్థానికులు గమనించి ఆమెను క్షేమంగా బయటికి తీసుకొచ్చారు. సూర్యాపేట జిల్లా సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామ శివారులో శనివారం చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా కొల్లూరు గ్రామానికి చెందిన కట్ట రాములమ్మ (65)కాలినడకన గ్రామాలు తిరుగుతూ భిక్షాటన చేసుకుంటూ జీవనం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో గురువారం ఉప్పల పహాడ్ గ్రామానికి వచ్చింది. శుక్రవారం భిక్షాటన చేసి టేకుమట్ల శివారులోని మూసీవాగులో కల్వర్టు ప్రాంతానికి వెళ్లింది. ఆ సమయంలో అక్కడ నీళ్లులేకపోవడంతో భోజనం చేసి నిద్రపోయింది. అయితే రత్నపురం మూసీ ప్రాజెక్టు అధికారులు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా గేట్లు ఎత్తడంతో ఒక్కసారిగా మూసీ వాగుకు నీటి తాకిడి పెరిగింది. దీంతో నిద్రలో ఉన్న ఆమె నీటిలో కొంతదూరం కొట్టుకుపోయింది. ఈ క్రమంలో ఆమెకు ఓ రాయి దొరకడంతో దాన్నిపట్టుకుని రాత్రంతా నీళ్లల్లో వణుకుతూ గడిపింది. కాపాడమని కేకలు వేస్తోన్న ఆమెను రాయినిగూడెం వాసులు గమనించి వెంటనే సూర్యాపేట రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని స్థానికుల సహాయంతో పడవలు వేసుకుని వెళ్లి ఆమెను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం ఆమెను చికిత్స కోసం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
లా అండ్ ఆర్డర్ కుప్పకూలింది: ఉత్తమ్
మఠంపల్లి: రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కుప్పకూలిపోయిందని, పోలీసులను, అధికారులను అడ్డం పెట్టుకుని టీఆర్ఎస్ నాయకులు విచ్చలవిడిగా భూకబ్జాలకు పాల్పడుతున్నారని పీసీసీ మాజీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రంబోడు తండాలో ఈనెల 13న స్థానిక సేవాలాల్ జాతరలో టీఆర్ఎస్ కార్యకర్తలు జరిపిన దాడిలో ఇళ్లు ధ్వంసమై, తీవ్రంగా గాయపడిన బాధిత కుటుంబాలను గురువారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, ఎంపీ సంతోష్ ద్వారా డీజీపీకి ఆదేశాలిప్పిస్తూ, పోలీసు అధికారులను అనుకూలమైన చోటుకు బదిలీ చేయించుకుంటున్నారని విమర్శించారు. ఈ ప్రాంతంలో జరుగుతున్న అరాచకాలు, అక్రమాలపై డీజీపీకి లేఖ రాస్తానని తెలిపారు. -
సూర్యాపేట జిల్లా రాజునాయక్ తండాలో అమానుషం
-
సూర్యాపేటలో సమాజం తలదించుకునే ఘటన
సాక్షి, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా రాజునాయక్ తండాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. హత్య కేసులో నిందితురాలిగా ఉన్న ఓ మహిళను వివస్త్రను చేసి దాడి చేశారు. కంట్లో కారం చల్లి నడిరోడ్డుపై కర్రలతో దాడి చేస్తూ నగ్నంగా వీధుల్లో ఊరేగించారు. ఇది గమనించిన ఎంపీటీసీ సభ్యురాలు బాధితురాలికి వస్త్రాలు ఇచ్చి రక్షించారు. ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలపాలైన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు 10 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. (చదవండి: తొందరపడుతున్న నవ జంటలు అలా పెళ్లి.. ఇలా విడాకులు) జూన్ 11వ తేదీన జరిగిన ఓ హత్య కేసులో బాధితురాలు నిందితురాలిగా ఉంది. హత్యకు గురయిన వారి కుటుంబసభ్యులే మహిళపై ఈ అమానుష ఘటనకు పాల్పడ్డారని సమాచారం. ఈ ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా కలకలం రేగింది. పోలీసులు గ్రామంలో బందోబస్తు ఏర్పాటుచేశారు. చదవండి: దేశంలో అత్యధిక జీతాలు ఇస్తోంది తెలంగాణనే -
సర్ది చెప్పడానికి వెళ్లాడు.. శవమై వచ్చాడు!
కోదాడ: మద్యం దుకాణం వద్ద జరుగుతున్న గొడవను ఆపి సర్దిచెప్పడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తిని వైన్స్ సిబ్బంది కర్రలతో కొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ఏపీ సరిహద్దులోని రామాపురం క్రాస్‌రోడ్‌లో హనుమాన్ వైన్స్ వద్ద ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. మృతి చెందిన వ్యక్తి ఏపీలోని కృష్ణాజిల్లా షేర్ మహ్మద్‌పేటవాసి కావడంతో గ్రామానికి చెందిన పలువురు అక్కడి చేరుకొని మృతదేహంతో ధర్నాకు దిగారు. దీంతో వైన్స్ ముందు ఉద్రిక్తత ఏర్పడింది. షేర్‌మహ్మద్‌పేటకు చెందిన రైతు నాగయ్య మద్యం కోసం రామాపురం వద్ద వైన్స్‌కు వచ్చాడు. అప్పటికే షేర్‌మహ్మద్‌పేటకు చెందిన ఇద్దరు వ్యక్తులతో వైన్స్ సిబ్బంది గొడవ పడుతున్నారు వారిని వారించడానికి నాగయ్య అక్కడికి వెళ్లాడు. అదే సమయంలో వైన్స్ సిబ్బంది కర్రలతో దాడికి దిగారు. ఈ దాడిలో నాగయ్య తలపైబలమైన గాయం కావడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. వైన్స్‌ముందు గ్రామస్తుల ధర్నా వైన్స్ సిబ్బంది దాడిలో తమ గ్రామానికి చెందిన వ్యక్తి మృతి చెందిన విషయం తెలుసుకున్న షేర్‌మహ్మద్‌పేట వాసులు, బంధువులు పెద్ద ఎత్తున రామాపురం క్రాస్‌రోడ్డు వద్దకు చేరుకొని వైన్స్ ముందు మృతదేహాన్ని ఉంచి ధర్నాకు దిగారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని, దాడి చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న కోదాడ టౌన్ సీఐ నరసింహారావు, రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపు చేశారు. ఇదిలా ఉండగా నాగయ్య మృతి చెందగానే వైన్స్‌ను మూసివేసి సిబ్బంది అక్కడి నుంచి జారుకున్నారు. ఈ సంఘటనపై విచారణ చేస్తున్నామని బంధువుల ఫిర్యాదు అందిన తరువాత పరిశీలించి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. -
Kishan Reddy: కుర్చీ కోసం.. కొడుకు కోసమే
కోదాడ, సూర్యాపేట అర్బన్: ప్రభుత్వ పథకాలకు నిధులు వెచ్చిస్తూ మోదీ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తోందని కేంద్ర పర్యాటక శాఖా మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. సీఎం కేసీఆర్ కేవలం తన కుటుంబ సంక్షేమం కోసం పనిచేస్తున్నారని విమర్శించారు. అమరుల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్రంలో పాలన సాగించేందుకు ఆరాట పడాల్సిన కేసీఆర్.. తన కుర్చీని కాపాడుకోవడం కోసం, తన కొడుకుని సీఎంను చేయడానికి మాత్రమే ఆరాట పడుతున్నారని ఆరోపిం చారు. సూర్యాపేట జిల్లా కోదాడలోని నల్లబండ గూడెం నుంచి కేంద్రమంత్రి ప్రజా ఆశీర్వాదయాత్ర గురువారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా కోదాడ, సూర్యాపేట పట్టణాల్లో నిర్వహించిన సభల్లో ఆయన ప్రసంగించారు. (చదవండి: ఎన్నాళ్లీ లాఠీ దెబ్బలు.. తెగించి కొట్లాడదాం) కుటుంబం కోసం ఎంతకైనా దిగజారతారు ప్రజా సమస్యలపై స్పందించడానికి ప్రగతి భవన్ దాటి బయటకు రాని సీఎం.. ప్రధానిని విమర్శించడానికే ముందుంటున్నారని కిషన్‌రెడ్డి విమర్శించారు. కేసీఆర్ తన కుటుంబం కోసం ఎంతకైనా దిగజారతారని, తెలంగాణను తాకట్టు పెట్టడానికి కూడా వెనకాడరంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బంగారు తెలంగాణాలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా సమయానికి ఇవ్వడం లేదని ఎద్దేవా చేశారు. కేంద్ర కేబినెట్లో 12 మంది ఎస్సీలు, 8 మంది ఎస్టీలు, 12 మంది బీసీలు మంత్రులుగా ఉన్నారని తెలి పారు. తెలంగాణ ప్రభుత్వంలో ఎవరికి పదవులు ఇచ్చారో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం సాయం అందిస్తున్న పథకాలకు పేరు మార్చి అవి తమ ఘనతే అని చెప్పుకోవడం రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వానికే చెల్లిందని విమర్శించారు. 2023 ఎన్నికల్లో షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి తెలంగాణలో నిజాంను మించిన నిరంకుశ పాలన సాగిస్తున్న కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలు 2023లో జరిగే ఎన్నికల్లో షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి ఫామ్‌హస్‌కు పరిమితం చేయాలనిక కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర మంత్రులను బానిసల మాదిరి చూస్తున్నారని, ఆత్మగౌరవం ఉన్న వారు ఆయన వద్ద ఉండలేరని విమర్శించారు. అందుకే ఈటల రాజేందర్ బయటకు వచ్చారని చెప్పారు. హుజూరాబాద్ ఎన్నికల్లో కేసీఆర్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా రాజేందర్ విజయాన్ని ఆపలేరన్నారు. కరోనాను కట్టడి చేయడానికి ప్రధాని మోదీ తీసుకున్న చర్యల వల్లే 130 కోట్ల జనాభా సురక్షితంగా ఉన్నారని చెప్పారు. ఇప్పటికే దాదాపు 56 కోట్ల మందికి వ్యాక్సిన్ వేయించగలిగామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రజలకు వివరించి వారీ ఆశీర్వాదం తీసుకోవాలని ప్రధాని చేసిన సూచన మేరకే ఈ యాత్రను చేపట్టినట్లు కిషన్‌రెడ్డి వివరించారు. బీజేపీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బొబ్బా భాగ్యారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభల్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే రాజాసింగ్, మాజీ ఎంపీ వివేక్ తదితరులు పాల్గొన్నారు. -
రైతు బిడ్డకు నాలుగు గోల్డ్ మెడల్స్
చిన్న, సన్నకారు రైతులకు ఉపయోగపడే చక్కని వ్యవసాయ పరికరాలను రూపొందించి శభాష్ అనిపించుకున్న యువకుడు గొర్రె అశోక్‌కు ‘ఇ–న్నోవేట్’ ఇంటర్నేషనల్ ఆన్లైన్ ఇన్నొవేషన్ షో లో ఇటీవల నాలుగు బంగారు పతకాలు దక్కాయి. పోలెండ్‌లోని జకపొనె నగరంలో ప్రతి ఏటా ఈ పోటీ జరుగుతుంది. ఈ ఏడాది పోటీకి ప్రపంచ దేశాల నుంచి 2 వేలకు పైగా ఎంట్రీలు వచ్చాయి. ఈ పోటీలో రెండుకు మించి బంగారు పతకాలు గెల్చుకున్న ఇన్నోవేటర్ అశోక్ ఒక్కరే కావటం విశేషం. వ్యవసాయం, ఆక్వాకల్చర్ విభాగంలో 12 ఆవిష్కరణలకు బంగారు పతకాలు దక్కగా.. అందులో తొలి 4 అశోక్‌వి కావటం మరో విశేషం. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం అంజలీపురంలో చిన్న రైతు కుటుంబంలో పుట్టిన అశోక్.. దేవరకొండలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో వ్యవసాయ వృత్తి విద్యా కోర్సు పూర్తి చేశారు. చిన్న, సన్నకారు రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేయటం ఆయనకు ఇష్టం. కేవలం రూ. 250 ఖర్చుతో వరి పొలంలో కలుపు తీతకు ఉపయోగపడే చేతి పరికరాన్ని రూపొందించి ‘ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్–2019’లో ప్రథమ బహుమతి పొందారు. ఈ నేపథ్యంలో వరి పొలంలో కలుపు తీత పరికరంతో పాటు తాను రూపొందించిన మరో మూడు పరికరాలను అశోక్ ఈ ఏడాది ‘ఈ–న్నోవేట్’ పోటీకి పంపారు. ఏకంగా నాలుగు బంగారు పతకాలు గెల్చుకున్నారు. విత్తనం వేసుకునే చేతి పరికరం: పత్తి, కంది, పెసర వంటి పంటల విత్తనాలను నడుము వంచే పని లేకుండా నిలబడే వేసుకునే ఒక చిన్న పరికరాన్ని అశోక్ రూపొందించారు. 3 అడుగుల ఎత్తున ఉండే ఈ పరికరంతో వేగంగా, సులువుగా, పురుషులు /మహిళలు /పెద్దలు / పిన్నలు ఎవరైనా సమాన దూరంలో విత్తనాలు వేసుకోవచ్చు. 4 రకాలుగా ఉపయోగపడే పరికరం అశోక్ తయారు చేసిన మరో పరికరం చిన్న రైతులకు నాలుగు రకాలుగా ఉపయోగపడుతుంది. పత్తి, మిరప పొలాల్లో సాళ్ల మధ్య దున్నుతూ కలుపు తొలగించడానికి, విత్తనాలు వేసుకునే సమయంలో అచ్చు తీయడానికి, ఆరబోసిన ధాన్యాలను కుప్ప చేయడానికి, కళ్లాల్లో గడ్డిని పోగు చేయడానికి చిన్న మార్పులతో ఈ పరికరాన్ని ఉపయోగించుకోవచ్చు. బహుళ ప్రయోజనకర యంత్రం అశోక్ మొట్టమొదటిసారిగా పెట్రోలుతో నడిచే పెద్ద వ్యవసాయ యంత్రాన్ని రూపొందించారు. ఏ పంటలోనైనా ఎకరంలో 15 నిమిషాల్లో పిచికారీని పూర్తి చేయడం, ఎరువు వంటి బరువులను ఇంటి నుంచి పొలానికి రవాణా చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అందుకే మల్టీపర్సస్ యుటిలిటీ వెహికల్ అని దీనికి పేరు పెట్టారు. ‘ఈ–న్నోవేట్’ పోటీలో దీనికి కూడా బంగారు పతకం వచ్చింది. ప్రభుత్వం లేదా దాతలు ఆర్థిక సాయం చేస్తే పేటెంట్ పొంది, ఆ తర్వాత ఈ యంత్రాన్ని రైతులకు అందిస్తానని కొండంత ఆశతో చెబుతున్న అశోక్‌కు ఆల్ ద బెస్ట్ చెబుదామా! ashokgorre17@gmail.com -
రూ. 6 లక్షలు: ఆధునిక హంగులతో రెడీమేడ్ ఇల్లు!
కోదాడ రూరల్: ఆధునిక హంగులతో రెడీమేడ్ ఇంటిని సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ గ్రామానికి ఆదివారం తీసుకొచ్చారు. గ్రామానికి చెందిన చింత అనంతరాంరెడ్డి హైదరాబాద్‌లోని కొంపెల్లిలో ఉన్న ఓ ప్రైవేట్ కంపెనీకి ఆర్డర్ ఇస్తే కాంక్రీట్ సిమెంట్ అవసరం లేకుండా ఫ్యాబ్రిక్ మెటీరియల్‌తో ఆధునిక హంగులతో ఇంటిని నిర్మించి ఇచ్చారు. ఇందులో నలుగురు సభ్యులున్న కుటుంబానికి సరిపోయే అన్ని వసతులు ఉన్నాయి. ఒక హాలు, బెడ్రూం, కిచెన్, టాయ్‌లెట్ ఉన్నాయి. దీనికి రూ.6 లక్షలు ఖర్చు అయినట్లు అనంతరాంరెడ్డి తెలిపారు. ఆదివారం ట్రాలీ లారీ సాయంతో దీన్ని గ్రామానికి తీసుకొచ్చి తన వ్యవసాయ క్షేత్రంలో ఏడెనిమిది అడుగుల ఎత్తులో నిర్మించి ఉన్న పిల్లర్లపై రెండు క్రేన్ల సాయంతో ఏర్పాటు చేసుకున్నాడు. -
మైనర్ బాలికపై 60 ఏళ్ల వృద్ధుడి దారుణం..
సాక్షి, చివ్వెంల(సూర్యాపేట): బాలికపై 60ఏళ్ల వృద్ధుడు అత్యాచార యత్నం చేసిన సంఘటన మండల పరిధిలోని మొగ్గయ్యగూడెంలో గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ 60ఏళ్ల వృద్ధుడు అదే గ్రామానికి చెందిన ఓ బాలిక(11) బుధవారం రాత్రి ఓ ఇంట్లో టీవీ చూస్తుండగా అత్యాచార యత్నం చేయబోయాడు. దీంతో బాలిక కేకలు వేయడంతో ఇరుగుపోరుగు వారు వచ్చే సరికి బాలికను వదిలి పరారయ్యాడు. దీంతో బాలిక కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. -
గుడ్‌న్యూస్.. గుర్రంబోడు భూములకు మోక్షం!
సాక్షి ప్రతినిధి, సూర్యాపేట: రాజకీయ రణరంగానికి వేదికైన సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం పెదవీడు రెవెన్యూ పరిధిలోని గుర్రంబోడు భూములకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. ఏళ్లుగా రావణకాష్టంలా మారిన ఈ భూముల వివాదానికి కలెక్టర్ టి.వినయ్‌కృష్ణారెడ్డి క్షేత్రస్థాయిలో చేయించిన సర్వేతో తెర పడినట్లు విశ్వసనీయ సమాచారం. గిరిజనులు సాగు చేసుకుంటున్న సర్వేనంబర్ 540లో 120.16 ఎకరాల భూమి తమదని గ్లేడ్ ఆగ్రో బయోటెక్ సంస్థ వాదిస్తూ వస్తోంది. అయితే క్షేత్రస్థాయి సర్వేలో ఇవి గిరిజనులు ఏళ్లుగా సాగు చేసుకుంటున్నట్లు తేలడంతో సదరు సంస్థకు అప్ప ట్లో మఠంపల్లి తహసీల్దార్ చేసిన మ్యుటేషన్ రద్దు చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. అలాగే ఈ భూమి సాగు చేసుకుంటున్న 129 మంది గిరిజన రైతులకు అసైన్ చేసేలా ప్రతిపాదనలు పంపాలని సదరు తహసీల్దార్‌ను కలెక్టర్ ఆదేశించినట్లు సమాచారం. రెండేళ్లుగా గుర్రంబోడు గిరిజన రైతుల ఆర్తనాదాలను ‘సాక్షి’ వరుస కథనాలతో అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. సీఎం అసెంబ్లీలో ప్రస్తావించడంతో.. మఠంపల్లి మండలం పెదవీడు రెవెన్యూ పరిధిలో సర్వేనంబర్ 540లో 6,239.07 ఎకరాల భూమి కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఉంది. ప్రభుత్వ, అటవీశాఖ పరిధిలో కొంత ఉండగా, పలు కంపెనీలు లీజు తీసుకోవడంతోపాటు కొన్ని కంపెనీలు కొనుగోలు చేశాయి. మరికొంత భూమిని గిరిజన రైతులు సాగు చేసుకుంటున్నారు. ఈ సర్వే నంబర్‌లోనే నాగార్జునసాగర్ నిర్వాసితులు 328 మంది రైతులకు 1,876.01 ఎకరాలు డీఫాం పట్టాలు ఇచ్చారు. ఈ భూములను సదరు రైతులు అమ్ముకోవచ్చు. కొంతమంది ఈ భూములను అమ్మడంతో కాలక్రమేణా చేతులు మారాయి. 6 వేలకు పైగా ఎకరాల భూమి ఈ సర్వే నంబర్లో ఉంటే సుమారు 12 వేల ఎకరాలకు పైగా పట్టాలు ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. సీఎం కేసీఆర్ ఈ భూముల విషయమై అసెంబ్లీలో ప్రస్తావించారు. ఆ తర్వాత ఓ కంపెనీ, గిరిజనుల మధ్య ఇటీవల భూ వివాదం తారస్థాయికి చేరింది. ఈ భూముల విషయమై జిల్లా యంత్రాంగం సీరియస్‌గా తీసుకుంది. సర్వేతో తేలిన వాస్తవాలు గ్లేడ్ ఆగ్రో బయోటెక్ సంస్థ కొనుగోలు చేసినట్టు చూపుతున్న 400 ఎకరాలకు పై చిలుకు భూమిలో గిరిజనులు 120.16 ఎకరాలు కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్నారు. సర్వే ప్రారంభంలోనే ఈ భూముల విషయంలో కలెక్టర్ అప్పట్లో అక్కడ విధులు నిర్వహించిన ఇద్దరు తహసీల్దార్లను సస్పెండ్ చేశారు. సదరు సంస్థకు అక్రమంగా మ్యుటేషన్ చేసినందుకు గాను కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాది ఆగస్టు 10 నుంచి ప్రారంభమైన సర్వే ఇటీవల ముగిసింది. 540 సర్వేనంబర్‌లోని భూమి ఎవరి అధీనంలో ఎంత ఉందో తేల్చారు. గ్లేడ్ సంస్థ తమదని చెబుతున్న 120.16 ఎకరాలను ఏళ్లుగా గిరిజనులు సాగు చేసుకుంటున్నట్లు సర్వేలో గుర్తించారు. 9.18 ఎకరాలు స్వాధీనం చేసుకోవాలి గ్లేడ్ ఆగ్రో బయోటెక్ సంస్థ గుండెబోయినగూడెం రెవెన్యూ పరిధి సర్వేనంబర్ 11లో 5.20 ఎకరాలు, మఠంపల్లి రెవెన్యూ పరిధిలో సర్వేనంబర్ 68లో 3.38 ఎకరాలు.. మొత్తం 9.18 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమించుకున్నట్లు సర్వేలో తేలింది. ఈ భూమిని కూడా స్వాధీనం చేసుకోవాలని మఠంపల్లి తహసీల్దార్‌ను కలెక్టర్ ఆదేశించినట్లు తెలిసింది. ఎన్వీఆర్ బయోటెక్ సంస్థ నుంచి 233.10 ఎకరాలు గ్లేడ్ సంస్థకు మార్పు చేసింది. ఇందులో 92.15 ఎకరాలకు సంబంధించి భూమి అమ్మిన ఎన్వీఆర్ బయోటెక్ సంస్థ పేరు కాకుండా ఇతరుల పేరున ఉన్నట్లు రెవెన్యూ రికార్డుల పరిశీలనలో తేలింది. దీంతో 92.15 ఎకరాలపై మళ్లీ తాజా విచారణ చేసి సమగ్ర నివేదికను పంపాలని తహసీల్దార్‌ను కలెక్టర్ ఆదేశించినట్లు సమాచారం. -
కాంగ్రెస్ ఎంపీలను అవమానిస్తున్నారు
మఠంపల్లి (హుజూర్నగర్): రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులకు సంబంధించి ప్రొటోకాల్ నిబంధనల అమలులో టీఆర్ఎస్ ప్రభుత్వం, అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై లోక్‌సభ స్పీకర్‌కు, సభాహక్కుల కమిటీకి ఫిర్యాదు చేస్తానని నల్లగొండ ఎంపీ, టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి వద్ద కృష్ణానదిపై ఇటీవల ప్రారంభమైన వంతెనను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ 2013లో రూ.50 కోట్లతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వంతెన నిర్మాణ పనులు పూర్తి చేయించానని తెలిపారు. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం అప్రోచ్‌రోడ్డు పనులు మాత్రమే చేసి కనీస ఆహ్వానం కూడా లేకుండా తనను అవమానపరచిందన్నారు. అదే విధంగా పార్లమెంట్ సభ్యులకు కొన్ని హక్కులు, ప్రొటోకాల్ మర్యాదలు ఉంటాయని, కానీ ఉన్నతాధికారులు వాటిని పాటించకుండా కేవలం ఏఈ, డీఈ స్థాయి అధికారులతో నామమాత్రపు సమాచారమిచ్చి శిలాఫలకం కిందిభాగంలో పేరు పెట్టారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బ్రిడ్జికి సంబంధించి పూర్తిస్థాయి నిధులను తానే మంజూరు చేయించి, పనులను కూడా పూర్తిచేయించానని వెల్లడించారు. అంతేగాకుండా ప్రధాన మంత్రి సడక్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు పార్లమెంట్ సభ్యుల ప్రతిపాదనలతోనే రాష్ట్రాలకు మంజూరవుతాయన్నారు. ఈ నిధులతో చేపట్టిన పథకాల ప్రారంభ కార్యక్రమాలకు ఎంపీలను పిలవకుండానే రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ తమను అవమానపరుస్తున్నారన్నారు. ఈ ఉల్లంఘనలు క్రోడీకరించి రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావిస్తానని, అలాగే హక్కుల కమిటీకి కూడా ఫిర్యాదు చేస్తానని ఆయన తెలిపారు. (చదవండి: ఖమ్మంలో బండి సంజయ్ వ్యాక్సిన్లు పనిచేయవు) -
పెళ్లికి ఒప్పుకోలేదని.. ప్రేమికుల ఆత్మహత్య
సాక్షి, సూర్యాపేట: ప్రేమ పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో ఓ జంట చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు చేసుకున్నారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మనగాల మండలం మొద్దుల చెరువు గ్రామంలో చోటుచేకుంది. చివ్వెంల మండలం చందుపట్ల గ్రామానికి చెందిన ఓర్సు నవీన్(21), కేశబోయిన మహేశ్వరి(18) గతకొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరివురు పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయాన్ని పెద్దలకు చెప్పడంతో వారు అంగీకరించలేదు. దీంతో మనస్థాపానికి గురైన వారు గురువారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వచ్చి మొద్దుల చెరువు గ్రామ శివార్లలో వేప చెట్టుకు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఉదయాన్నే స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నారు. చదవండి: (భర్త మోసం చేశాడని... సవతి పిల్లలను చంపి..) -
కాంగ్రెస్‌లో తుంగతుర్తి లొల్లి ముగిసేనా?
సాక్షి, సూర్యాపేట: కాంగ్రెస్ పార్టీలో ఇటీవల తుంగతుర్తి నియోజకవర్గంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల పరిష్కారానికి టీపీసీసీ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత మల్లు భట్టివిక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే ఎస్. సంపత్‌కుమార్, ఏఐసీసీ కిసాన్‌సెల్ వైస్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే కోదండ రెడ్డిలను సభ్యులుగా నియమిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీ నియోజకవర్గంలో పార్టీ పరంగా చోటుచేసుకున్న పరిణామాలపై ఇరువర్గాలతో చర్చించి సమస్య పరిష్కారానికి సూచనలు చేస్తూ టీపీసీసీకి నివేదిక అందించనుంది. తుంగతుర్తిలో రెండుగా చీలిన కాంగ్రెస్ ఇటీవల తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రెండు వర్గాలుగా చీలి ఒకవర్గంపై మరొకవర్గం ఆరోపణలు చేసుకోవడం తారస్థాయికి వెళ్లింది. గత ఎన్నికల్లో నియోజకర్గం నుంచి పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి చెందిన అద్దంకి దయాకర్ ఇటీవల మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి(ఆర్డీఆర్)పై ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీకి ఫిర్యాదు చేశారు. తనను, తన వర్గాన్ని నియోజకవర్గంలో ఆర్డీఆర్ తిరగనివ్వడంలేదని, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. తమను దామోదర్‌రెడ్డి దూషించాడని హైదరాబాద్‌లో పోలీస్‌స్టేషన్‌లో కూడా అద్దంకితో పాటు ఆయన వర్గం ఫిర్యాదు చేసింది. దీనిపై ఆర్డీఆర్ వర్గం కూడా అగ్గివీుద గుగ్గిలమైంది. అద్దంకి దయాకర్‌పై నియోజకవర్గ వ్యాప్తంగా బాహాటంగా విమర్శలు గుప్పించింది. అలాగే అద్దంకిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ టీపీసీసీ అధ్యక్షుడికి ఫిర్యాదు చేసింది. ఈనేపథ్యంలో రెండు వర్గాల మధ్య నియోజకవర్గంలో సయోధ్య కుదుర్చేందుకు టీపీసీపీ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీతోనైనా రెండు వర్గాల మధ్య రాజీకుదురుతుందోలేదో వేచి చూడాల్సిందే. -
సూర్యాపేట జిల్లా నాగారం ఎస్ఐ దాష్టీకం...
సాక్షి, సూర్యాపేట: రాష్ట్ర ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని తీసుకు వచ్చామని పదేపదే చెబుతున్నా అదంతా మాటలకే పరిమతమన్నట్టు కొందరు పోలీసు అధికారులు వ్యవహరిస్తున్నారు. తమకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసినవారిపైనే దాడులు చేస్తూ పోలీసు వ్యవస్థను అభాసుపాలు చేస్తున్నారు. రాజకీయ పలుకుబడి, ఆర్థిక, అంగబలం ఉన్న వారి మాటే పోలీస్ స్టేషన్లో చెల్లుబాటవుతుందని సూర్యాపేట జిల్లాలోని నాగారాం ఎస్ఐ నిరూపించారు. సివిల్ కేసులో తలదూర్చడమే కాకుండా, న్యాయం చేయాలంటూ ఆశ్రయించిన రైతులపైనే ఎస్ఐ లింగం దౌర్జన్యం చేశారు. వారిని లాఠీతో చితకబాదడమే కాకుండా చెప్పినట్టు వినకుంటే ప్రాణాలు తీస్తానని బెదిరించాడు. ప్రాణభయంతో సదరు రైతులు జిల్లా ఎస్పీ భాస్కర్ ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది. రైతులపై దాష్టీకానికి దిగిన ఎస్ఐ లింగంపై గతంలో కూడా అనేక ఆరోపణలు వచ్చినట్టు తెలుస్తోంది. ఉన్నతాధికారులు ఆయన తీరు మార్చుకోక పోవడంతో శాఖాపరమైన చర్యలు తీసుకున్నా కూడా ఆయన తీరు మాత్రం ఏ మాత్రం మారలేదు. (ప్రేమ పెళ్లి: టెకీ అనునామానాస్పద మృతి) -
ఒక్కగానొక్క కుమార్తె.. తండ్రి చనిపోతే
చివ్వెంల(సూర్యాపేట) : మానవత్వం మంటగలిసింది. ఒక్కగానొక్క కుమార్తె ఆస్తినంతా కాజేసి తండ్రి చనిపోగా అంత్యక్రియలు నిర్వహించేందుకు నిరాకరించింది. ఈ హృదయవిదారక సంఘటన గురువారం చోటు చేసుకుంది. సూర్యాపేట పట్టణానికి చెందిన తోట మల్లయ్య (75), జయమ్మ దంపతులకు ఒక్కతే కుమార్తె. ఆమె పెళ్లి వైభవంగా చేశారు. కాగా కూతురు ఆమె భర్త ఆ వృద్ధ దంపతులను తామే చూసుకుంటామని చెప్పి గత సంవత్సరం డిసెంబర్ 29న వారి వద్ద ఉన్న రూ.4 లక్షలు బ్యాంకులో డ్రా చేయించి తీసుకెళ్లారు. కాగా మల్లయ్య కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం సూర్యాపేట పట్టణంలోని తన ఇంట్లో మృతి చెందాడు. ఈ విషయాన్ని కూతురుకు తెలియజేయగా తనకు ఎలాంటి సంబంధంలేదని సమాధానం ఇచ్చింది. దీంతో ఏం చేయాలో తెలియక భర్త మృతదేహాన్ని కూతురు నివాసం ఉండే చివ్వెంల మండలం బీబీగూడెం తీసుకెళ్లింది. కూతురు ఇంటి ఎదుట భర్త మృతదేహాన్ని ఉంచి బుధవారం రాత్రంతా రోదిస్తూ వేడుకుంది. అయినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో స్థానికంగా కొందరు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో స్పందించిన పోలీసులు గ్రామానికి వెళ్లి కూతురు, అల్లుడికి కౌన్సెలింగ్ నిర్వహించి అంత్యక్రియలు జరిగేలా చూశారు. -
ప్రకృతి ఆరాధనే.. సీత్లా పండుగ
ఆత్మకూర్(సూర్యాపేట): ప్రకృతి దేవతలను ఆరాధిస్తూ పశుసంపద వర్ధిల్లాలని, చెరువులు, కుంటలు నిండి సమృద్ధిగా పంటలు పండాలని గిరిజనులు జరుపుకునే పురాతన సంప్రదాయ పండుగ సీత్లాభవాని (దాటుడు) పండుగ. అతిపురాతన ఈ పండుగను తమ తొలి పండుగగా నేటికీ మారుమూల తండాల్లో గిరిజనులు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఏటా పెద్దపుష్యమి కార్తెలో వచ్చే మంగళవారాల్లో ఈ పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది ఆషాఢ మాసం పెద్దపుష్యమి కార్తెలోని తొలి మంగళవారం ఇప్పటికే చాలాప్రాంతాల్లోని తండాల్లో సీత్లాపండుగను నిర్వహించుకోగా.. మిగిలిన ప్రాంతాల్లో గిరిజనులు పండుగకు సన్నద్ధమై ఉన్నారు. ప్రతి తండాలో ఇక్కడే.. సీత్లాపండుగను ప్రతి తండాలో తూర్పు దిక్కున ఉండే చెరువు ఒడ్డున నిర్వహిస్తారు. ఏడుగురు అక్కాచెల్లెళ్లలో సీత్లాభవాని అందరి కంటే చిన్నది. సీత్లామాత ప్రతిమ మధ్యభాగంలో ఉంచి మిగతా భవానీలను ఇరువైపులా ముగ్గురు అక్కల చొప్పున ఉండేలా తూర్పున చూసే విధంగా ప్రతిష్టిస్తారు. భవాని ప్రతిమల ఎదురుగా కొద్దిదూరంలో లుంకడ్యా పేరు మీద రాయితో చేసిన ప్రతిమను భవానీల వైపు చూసే విధంగా ఉంచుతారు. లుంకడ్యా ప్రతిమ మీదపడ్డ నీరు గుంతలో పడేలా గుంతను తీసి ఉంచుతారు. పండుగ విధానం.. పునర్వసు కార్తెలో ఏదైనా ఒక మంగళవారం ఉదయాన్నే తండా ప్రజలంతా స్నానాలు ఆచరించి తమ ఇళ్లలో తమ ఇష్టదేవతలకు పూజలు నిర్వహిస్తారు. సీత్లాపూజను ఇతర పండుగల మాదిరిగా కాకుండా చెరువు ఒడ్డున నిర్వహిస్తారు. పూజారి సీత్లాపూజ అయ్యే వరకు ఉపవాసంతో ఉంటారు. భవానీల ప్రతిమలకు గేరు (జాజు) పూసి పూలు, మామిడాకులతో అలంకరిస్తారు. రైతులు తమ పశువులను సింగారించుకుని దాటుడు కోసం తయారు చేసుకుంటారు. ఒకరోజు ముందు జొన్నలు, పప్పు ధాన్యాలు కలిపి నానబెట్టిన తర్వాత తయారైన ఘుగ్రిని (గుగ్గిళ్లను) నైవేద్యంగా తీసుకెళ్తారు. దీన్నే ‘వాంసిడో ’ అంటారు. మంగళవారం ఉదయం ఇంటి వద్ద పూజలు పూర్తయిన తర్వాత లాప్సి (పాయసం), గుగ్గిళ్లు (వాంసిడో), ఎండుమిర్చి, ఉల్లిగడ్డ, చింతపండు రూపాయి బిళ్లలను కాకోటి (ఒక వెడల్పాటి చెక్క పాత్ర)లో ఉంచి తండా యువతులు తలపై మోసుకుని సీత్లా పూజ ప్రదేశానికి తీసుకెళ్తారు. సంప్రదాయం ప్రకారం భవానీల చుట్టూ ప్రదక్షిణలు చేసి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆనాదిగా వస్తున్న జంతుబలి (గొర్రెపోతు) ఇచ్చి ఓ పేగును భవానీల ప్రతిమల నుంచి లుంకడ్యా ప్రతిమ వ రకు పరుస్తారు. తండా పశువులన్నింటి పరిచిన పేగు పైనుంచి దాటిస్తుండగా.. పూజారి వాంసిడో మిశ్రమాన్ని అన్ని పశువులపై చల్లుతారు. అందుకే ఈ పండుగను‘గొడ్లు దాటుడు పండుగగా’ పిలుస్తారు. ఈ క్రమంలో గిరిజన మహిళలు ఆటపాటలతో నృత్యాలు చేస్తారు. బలిచ్చిన మాంసంతో సలోయి వండి తండావా సులంతా అమ్మవార్లకు సమర్పించుకుంటారు. సీత్లాపండుగ నేపథ్యం.. పూర్వం నాటి నుంచి గిరిజనులు పశుసంపదను అధికంగా కలిగి ఉండి వ్యవసాయమే జీవన ఆధారంగా వ్యవసాయ క్షేత్రాల్లోనే గుడిసెలు వేసుకుని జీవించేవారు. వర్షాకాలంలో వచ్చే వాతావరణ మార్పులు, పచ్చని గడ్డితో గొర్రెలు, మేకలు, ఆవులకు వివిధ రోగాలు వస్తుండేవి. రోగాల బారిన పడి తమ పశుసంపద మొత్తం రోజురోజుకూ తగ్గిపోయి తండావాసులు తల్లాడిల్లుతున్న క్రమంలో.. ఓ రోజు రాత్రి తండాపెద్దకు గిరిజన దేవతలు మేరామ, తోళ్జా, మాత్రాల్, కంకాళి, హీంగ్లా, ద్వాళాంగర్, సీత్లా దేవతలు కలలో కనిపిస్తారు. సీత్లాదేవత తండాపెద్దతో మాట్లాడి తండావాసులంతా కలిసి తనకు జంతుబలి ఇవ్వాలని చెబుతుంది. కలలో వచ్చిన దేవతల విషయాన్ని తండావాసులకు చెప్పి జంతుబలి ఇస్తారు. నాటినుంచి నేటి వరకు తమ పశుసంపదను కాపాడుకునేందుకు, వర్షాలు కురవాలని ఏటా పండుగను అత్యంత వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నారు. దీనికితోడుగా మరో రెండు కథలు ప్రచారంలో ఉన్నాయి. లుంకడ్యా నేపథ్యం.. ఓరోజు సీత్లాభవాని తన ఆరుగురి అక్కలతో కలిసి నదిలో స్నానం చేస్తుండగా లుంకడ్యా అనే వ్యక్తి వారి వస్త్రాలు తీసుకుని చెట్టు ఎక్కాడని.. విషయం తెలుసుకున్న సీత్లాభవాని మంత్రశక్తితో అతన్ని చెట్టు నుంచి దింపి ఇకపై ఏడుగురు అక్కాచెల్లెళ్లకు కాపలా కాసేలా శపించినట్లు చెప్పుకుంటారు. -
నేడు సూర్యాపేటకు సీఎం కేసీఆర్
సాక్షి, సూర్యాపేట: చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో అమరుడైన కల్నల్ సంతోష్‌బాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూర్యాపేటకు రానున్న నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. సీఎం కేసీఆర్ సోమవారం హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి మధ్యాహ్నం 2 గంటల వరకు జిల్లా కేంద్రానికి చేరుకోనున్నారు. సీఎం కేసీఆర్ విద్యానగర్‌లో ఉన్న సంతోష్‌బాబు నివాసానికి వెళ్లి ఆయన తల్లిదండ్రులు మంజుల, ఉపేందర్, భార్య సంతోషిని పరామర్శిస్తారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.5 కోట్ల నగదు, సంతోషికి గ్రూప్–1 స్థాయి ఉద్యోగానికి సంబం ధించిన ఉత్తర్వులను సీఎం వారికి అందజేయనున్నారు. అలాగే హైదరాబాద్‌లోని షేక్‌పేటలో ఇంటిస్థలం పత్రాలను కూడా సీఎం, సంతోష్‌బాబు కుటుంబ సభ్యులకు ఇవ్వనున్నట్లు సమాచారం. సీఎం వెంట విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, సీఎస్ సోమేశ్‌కుమార్ సంతోష్‌బాబు నివాసానికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శిస్తారు. -
వీరుడా.. వందనం
సాక్షి ప్రతినిధి, సూర్యాపేట/తాళ్లగడ్డ: భారత్–చైనా సరిహద్దులో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమళ్ల సంతోష్‌బాబుకు జనం జోహార్లు అర్పించారు. జాతీయ జెండాలు, సంతోష్ చిత్రపటాలతో ర్యాలీలు నిర్వహించారు. సూర్యాపేట పట్టణంతో పాటు జిల్లా కేంద్రంలోని పలు మండలాల్లో జై జవాన్.. జోహార్ సంతోష్ అనే నినాదాలు వెల్లువెత్తాయి. కొన్నిచోట్ల కొవ్వొత్తులు వెలిగించి ర్యాలీలు నిర్వహించారు. సంతోష్‌బాబు మరణవార్త తెలుసుకున్న నేతలు, అభిమానులు, బంధువులు బుధవారం పెద్ద ఎత్తున సూర్యాపేట విద్యానగర్‌లోని ఆయన నివాసానికి చేరుకున్నారు. సంతోష్ తల్లిదండ్రులు బిక్కుమళ్ల ఉపేందర్–మంజులను పరామర్శించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే కల్నల్ స్థాయి అధికారి సూర్యాపేటలో ఉండటం.. భారత్–చైనా సరిహద్దు ఘర్షణలో ఆయన వీరమరణం పొందడంతో ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. చివరిసారిగా సంతోష్‌ను చూసేందుకు భారీగా ఆయన నివాసానికి తరలివచ్చారు. రాత్రి ఆయన పార్ధివదేహం వచ్చేవరకు అక్కడే ఉన్నారు. బుధవారం హకీంపేట ఎయిర్‌బేస్‌లో సంతోష్‌బాబు పార్థివదేహం వద్ద నివాళులర్పిస్తున్న ఆయన సతీమణి సంతోషి కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు: సంతోష్‌బాబు భౌతికకాయం బుధవారం రాత్రి 11.40 గంటలకు సూర్యాపేటలోని ఆయన నివాసానికి చేరుకుంది. పార్థివదేహం వెంట మంత్రి జగదీశ్‌రెడ్డి కాన్వాయ్‌లో సంతోష్‌బాబు భార్య సంతోషి, కుమార్తె అభిజ్ఞ, కుమారుడు అనిరుథ్ వచ్చారు. ఈ సందర్భంగా సూర్యాపేట పట్టణంలోని కొత్త బస్టాండ్‌నుంచి సంతోష్ నివాసం వరకు ప్రజలు కొవ్వొత్తులు, జాతీయ జెండాలతో రోడ్డుకు ఇరువైపులా ఉండి అమరవీరుడికి జైజైలు పలికారు. సంతోష్‌బాబు అమర్‌రహే, భారత్‌మాతాకీ జై అనే నినాదాలతో సూర్యాపేట మార్మోగింది. కాగా, కల్నల్ సంతోష్‌బాబు పార్థి«వదేహాన్ని చూడగానే తల్లిదండ్రులు ఉపేందర్, మంజుల, సంతోష్‌బాబు సతీమణి సంతోషి చిన్నారులను చూసుకుంటూ రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. ఆయనతో గడిపిన క్షణాలను గుర్తుచేసుకుంటూ విలపించడంతో ఆ ప్రాంతం మొత్తం విషాదంలో మునిగిపోయింది. కల్నల్ పార్థివదేహం వద్ద శ్రద్ధాంజలి ఘటిస్తున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నేడు కేసారంలో అంత్యక్రియలు సూర్యాపేట పట్టణానికి సమీపంలోని కేసారంలో కల్నల్ సంతోష్‌బాబుకు చెందిన వ్యవసాయ క్షేత్రంలో గురువారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి, ఎస్పీ ఆర్.భాస్కరన్, ఆర్మీ మేజర్ ఫరీది, ఆర్డీఓ మోహన్‌రావు, డీఎస్పీ మోహన్‌కుమార్, కమిషనర్ పి.రామానుజులరెడ్డి, ఆర్మీ అధికారి దినేష్‌కుమార్ పరిశీలించారు. అంత్యక్రియలు నిర్వహించే ప్రాంతాన్ని జేసీబీలతో చదును చేయించారు. ప్రోటోకాల్ ప్రకారం కల్నల్ సంతోష్‌బాబు అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో జరగనున్నాయి. బుధవారం ఆర్మీకి చెందిన 50 మంది అధికారులు, సిబ్బంది జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. గురువారం ఉదయం 8 గంటలకు సంతోష్‌బాబు నివాసం వద్ద ఆయన పార్థివదేహానికి సైనిక సంప్రదాయం ప్రకారం రీత్లింగ్ డ్రిల్ నిర్వహిస్తారు. ఆ తర్వాత అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. సంతోష్ నివాసం నుంచి కేసారం గ్రామ సమీపం వరకు 5.5 కిలోమీటర్లు మిలటరీ వాహనంలో ఆయన పార్థివదేహాన్ని ఉంచి సైనిక సిబ్బంది ముందు వరుసలో కవాతు చేస్తూ అంతిమయాత్ర నిర్వహిస్తారని సంబంధిత అధికారులు తెలిపారు. సంతోష్‌ను కడసారి చూసేందుకు వచ్చేవారు కరోనా నిబంధనలను అనుసరించే విధంగా ఏర్పాట్లు చేశారు. అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు, ఆర్మీ మేజర్లు, కల్నల్స్తోపాటు కొద్ది మందిని మాత్రమే అనుమతించనున్నట్లు తెలిసింది. సంతోష్ అంత్యక్రియలకు మంత్రి జగదీశ్‌రెడ్డితో పాటు రాష్ట్ర ఉన్నతస్థాయి అధికారులు కూడా హాజరుకానున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. సంతోష్‌బాబు పార్థివదేహం వద్ద పుష్పగుచ్ఛం ఉంచుతూ నివాళి అర్పిస్తున్న కేటీఆర్ సందర్శకులు 8 గంటల్లోగా రావాలి... కల్నల్ సంతోష్ పార్థివదేహాన్ని సందర్శించాలనుకునేవారు ఉదయం 8 గంటల్లోగా రావాలని జిల్లా కలెక్టర్ టి.వినయ్‌కృష్ణారెడ్డి పేర్కొన్నారు. అనంతరం కల్నల్ సంతోష్ ఇంటి వద్ద నుంచి సైనిక లాంఛనాలతో అంతిమయాత్ర ప్రారంభమవుతుందన్నారు. కరోనా నిబంధనల మేరకు 50 మందిని మాత్రమే దహన సంస్కారాలకు అనుమతించనున్నట్లు తెలిపారు. హకీంపేట ఎయిర్‌బేస్‌లో కల్నల్ సంతోష్‌బాబు పార్థివదేహం వద్ద పుష్పగుచ్ఛం ఉంచుతూ నివాళి అర్పిస్తున్న లెఫ్టినెంట్ జనరల్ టీఎస్ నారాయణన్ పరామర్శల వెల్లువ.. కల్నల్ సంతోష్‌బాబు మరణవార్త తెలుసుకున్న నేతలు ఆయన తల్లిదండ్రులు బిక్కుమళ్ల ఉపేందర్, మంజులను పరామర్శించారు. వారికి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. పరామర్శించిన వారిలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్, మాజీ ఎమ్మెల్యేలు పద్మావతి, సంకినేని వెంకటేశ్వర్రావు, జూలకంటి రంగారెడ్డి, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేష్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, జెడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణగౌడ్, ప్రముఖ మోటివేటర్ బ్రదర్ షఫీ తదితరులు ఉన్నారు. బుధవారం రాత్రి సూర్యాపేటలో సంతోష్ పార్థివదేహం వద్ద రోదిస్తున్న కుటుంబసభ్యులు (ఇన్సెట్లో) సంతోష్ భౌతికకాయం ఇలా అవుతుందని కలలో కూడా అనుకోలేదు ఈ నెల 14వ తేదీ నా పెళ్లిరోజున అన్నయ్య ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపాడు. ఎలా ఉన్నావ్ అన్నయ్యా అంటే ఏం చెప్పలేను, నన్ను అడుగొద్దు అన్నాడు. చాలా బాధగా అనిపించింది. అన్నయ్య మాతో చాలా ప్రేమగా ఉండేవాడు.. ఫ్రెండ్స్‌లా ఉండేవాళ్లం. సెలవుల్లో వచ్చినప్పుడు పండుగలా గడిపేవాళ్లం. చిన్నప్పటి నుంచి చదువుల్లో యాక్టివ్‌గా ఉండేవాడు. అన్నయ్య చదువు కోసమే మేమంతా అదిలాబాద్ నుంచి విజయనగరం వెళ్లాం. సైనిక్ స్కూల్ ఎంట్రెన్స్‌లో మూడోర్యాంక్ వచ్చింది. పాకిస్తాన్ వంటి ఎంతో ఉద్రికత్త ఉన్న ప్రాంతాల్లోనే అన్న డ్యూటీ నిర్వహించాడు. కొంతమంది చొరబాటుదారులను అంతమొందించాడు. అప్పుడు చాలా గర్వంగా ఫీల్ అయ్యాం. చైనా సరిహద్దులో తుపాకులు వాడకపోవడంతో ఇలాంటి దారుణం జరిగింది. అన్నయకు ఇలా అవుతుందని కలలో కూడా అనుకోలేదు. – శృతి, కల్నల్ సంతోష్‌బాబు చెల్లెలు కల్నల్ సంతోష్‌బాబుకు గవర్నర్ సహా పలువురి నివాళి సాక్షి, హైదరాబాద్: కల్నల్ సంతోష్‌బాబు పార్థివదేహానికి గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఘనంగా నివాళులు అర్పించారు. బుధవారం రాత్రి సంతోష్ భౌతికకాయం హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంది. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై.. ఆయన పార్థివదేహం ఉన్న పేటికపై పుష్పగుచ్ఛం ఉంచి వందనం చేశారు. సంతోష్ ధీరత్వాన్ని దేశం ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకుంటుందని పేర్కొన్నారు. సంతోష్‌బాబు జన్మస్థలం అయిన తెలంగాణకు తాను గవర్నర్ కావడం గర్వంగా ఉందన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంతకుముందే తెలంగాణ, ఆంధ్ర సబ్ ఏరియాకు చెందిన సైనిక ఉన్నతాధికారులతో కలసి కల్నల్ సంతోష్ భార్యాపిల్లలు హకీంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. సంతోషపార్థివదేహానికి మేజర్ జనరల్ ఆర్కే సింగ్, లెఫ్టినెంట్ జనరల్ టీఎస్ఏ నారాయణన్లతోపాటు మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి, జగదీశ్‌రెడ్డి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్, ఇతర సైనికాధికారులు పుష్పాంజలి ఘటించారు. అనంతరం సంతోష్ భౌతికకాయాన్ని సూర్యాపేట తరలించారు. మీతో మేమున్నాం.. ధైర్యంగా ఉండండి కల్నల్ సంతోష్ సతీమణికి ఏఐసీసీ చీఫ్ సోనియా, రాహుల్‌గాంధీ లేఖలు సాక్షి, హైదరాబాద్: గాల్వాన్ లోయలో చైనా సైనికుల ఘాతుకానికి బలైన కల్నల్ సంతోష్‌కుమార్ కుటుంబానికి భగవంతుడు ధైర్యం ప్రసాదించాలని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఏఐసీసీ చీఫ్ సోనియాగాంధీ ఆకాంక్షించారు. ఈ మేరకు బుధవారం ఆమె సంతోష్ సతీమణి సంతోషికి లేఖ రాశారు. ‘మాతృభూమి రక్షణ కోసం మీ భర్త ప్రాణాలు కోల్పోయారు. ఆయన చేసిన త్యాగాన్ని, గుండె ధైర్యాన్ని ఎప్పటికీ మరువలేం. ఆయనను గౌరవంగా స్మరించుకుంటూనే ఉంటాం. కల్నల్ మరణం పట్ల నా హృదయాంతరాల నుంచి సంతాపం తెలియజేస్తున్నాను. ఆయన భరతమాత కన్న వీరుడు. మీ కుటుంబానికి ధైర్యం ప్రసాదించాలి. కల్నల్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా’అని ఆ లేఖలో సోనియాగాంధీ తన సందేశాన్ని పంపారు. వీరుడికి సెల్యూట్: రాహుల్ దేశంలోని ప్రతి పౌరుడు శాంతితో స్వతంత్రంగా జీవించేందుకు కల్నల్ సంతోష్‌బాబు చేసిన త్యాగం ఈ దేశం ఎన్నటికీ మరచిపోదని ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్‌గాంధీ కొనియాడారు. భరతజాతి ఒక దేశ భక్తుడిని కోల్పోయిందని, ఇలాంటి కష్టకాలంలో జాతి యావత్తు కల్నల్ కుటుంబానికి అండగా ఉంటుందని బుధవారం సంతోష్‌బాబు సతీమణికి రాసిన వేరొక లేఖలో రాహుల్ వెల్లడించారు. -
సలామ్ కల్నల్ సంతోష్..
సాక్షి, సూర్యాపేట: తండ్రి కలను నెరవేరుస్తూ సైన్యంలో చేరాడు... 15 ఏళ్ల సర్వీసులో నాలుగు పదోన్నతులతో కల్నల్ స్థాయికి ఎదిగాడు... ఇటీవలే హైదరాబాద్‌కు బదిలీ అయినా కరోనా లాక్డౌన్ వల్ల రాలేక సరిహద్దులో విధులు కొనసాగించాడు... ఆదివారం రాత్రే తల్లికి ఫోన్ చేసి ‘అమ్మా.. బాగున్నావా’అంటూ పలకరించాడు. కానీ అనూహ్యంగా 24 గంటలు అయినా గడవకముందే చైనా సైన్యం దాష్టీకంలో వీరమరణం పొందాడు. ఇదీ విధి నిర్వహణలో అసువులుబాసిన తెలుగుతేజం, సూర్యాపేట జిల్లా కేంద్రానికి కల్నల్ బిక్కుమళ్ల సంతోష్ (37) ప్రస్థానం. భారత్–చైనా సరిహద్దులో సోమవారం రాత్రి చైనా సైన్యంతో ఘర్షణలో వీరోచితంగా పోరాడి కన్నుమూసిన 20 మంది భారత జవాన్లలో సంతోష్ కూడా ఒకరు. ఆయనకు భార్య సంతు, కూతురు అభిజ్ఞ, కుమారుడు అనిరుధ్ ఉన్నారు. వారంతా ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఆయన బంధువులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం సంతోష్ నేపథ్యమిదీ... భార్యాపిల్లలతో కల్నల్ సంతోష్ (ఫైల్) తండ్రి కల కోసం... సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌కు చెందిన బిక్కుమళ్ల ఉపేందర్, మంజుల దంపతులకు కుమారుడు సంతోష్, కుమార్తె శృతి ఉన్నారు. ఎస్బీఐ బ్యాంకులో వివిధ హోదాల్లో పనిచేస్తూ చీఫ్ మేనేజర్‌గా రిటైరైన ఉపేందర్‌కు బాల్యంలోనే సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలన్న కోరిక ఉండేది. కానీ అది నెరవేరకపోవడంతో ఆ కోరికను ఎలాగైనా తన కుమారుడి రూపంలో చూడాలనుకున్నారు. సంతోష్ సైతం తండ్రి కలను నెరవేర్చేందుకు చిన్ననాటి నుంచే కష్టపడ్డారు. 1983 ఫిబ్రవరిలో జన్మించిన సంతోష్.. 1 నుంచి 5వ తరగతి వరకు స్థానిక సంధ్య హైస్కూల్లో, 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఏపీలోని విజయనగరంలో ఉన్న కోరుకొండ సైనిక్ స్కూల్ విద్యనభ్యసించారు. అనంతరం పుణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత డెహ్రాడూన్‌లో సైనిక శిక్షణ చేపట్టి 2004 డిసెంబర్లో లెఫ్ట్‌నెంట్‌గా బిహార్ రెజిమెంట్ 16వ బెటాలియన్‌లో విధుల్లో చేరాడు. కుమారుడి ఫొటోను చూస్తూ కన్నీరుమున్నీరవుతున్న సంతోష్ తల్లిదండ్రులు చొరబాటుదారులను హతమార్చి దేశాన్ని కాపాడి... సంతోష్ తన 15 ఏళ్ల సర్వీసులో నాలుగు పదోన్నతులు పొందారు. ఎన్నో గోల్డ్ మెడల్స్‌ను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లోని లడక్‌లో (కల్నల్) కమాండర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. సరిహద్దులో 2007లో ముగ్గురు చొరబాటుదారులను అంతమొందించి దేశాన్ని కాపాడారు. తన సర్వీసులో ఢిల్లీ, కశ్మీర్, అరుణాచల్‌ప్రదేశ్, మేఘాలయా, లడక్, పాకిస్తాన్తోగల సరిహద్దులో పనిచేశారు. కొంతకాలం ఆఫ్రికా దేశం కాంగోలోనూ విధులు నిర్వహించారు. బదిలీ అయినా రాలేక... కల్నల్ సంతోష్‌ను ఇప్పటికే హైదరాబాద్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. మూడేళ్లపాటు హైదరాబాద్‌లో పనిచేయాల్సి ఉంది. కానీ కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో లడక్‌లోనే విధులు నిర్వహించాల్సి వచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు. సంతోష్ మరణవార్త తల్లిదండ్రులకు మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు సైనికాధికారులు ఫోన్ ద్వారా తెలిపారు. ప్రత్యేక విమానంలో హైదాబాద్‌కు పార్థివదేహం... అమరుడైన కల్నల్ సంతోష్ పార్థివదేహాన్ని మంగళవారం రాత్రి ప్రత్యేక విమానంలో సైన్యం హకీంపేట్ ఎయిర్‌పోర్టుకు తరలించింది. అయితే కరోనా నేపథ్యంలో హైదరాబాద్‌లోనే అంత్యక్రియలు నిర్వహించాలని ఆయన కుటుంబ సభ్యులను సైనికాధికారులు కోరారని, కానీ సంతోష్ తల్లిదండ్రులు మాత్రం సూర్యాపేటలోనే అంత్యక్రియలు జరపాలనుకుంటున్నట్లు చెప్పారని మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. దీనిపై బుధవారం ఉదయానికి స్పష్టత వస్తుందన్నారు. తల్లిగా బాధ ఉంది.. దేశ పౌరురాలిగా గర్విస్తున్నా కుమారుడి వీరమరణంపట్ల తల్లిగా నాకు చాలా బాధగా ఉంది. కానీ దేశ పౌరురాలిగా మాత్రం గర్వంగా ఉంది. సంతోష్ చిన్నతనం నుంచి చదువులో ముందుండేవాడు. ముఖ్యంగా లెక్కలు క్యాలిక్యులేటర్ కంటే స్పీడ్‌గా చేసేవాడు. దూరప్రాంతాల్లో ఉన్నా నాతో ఫోన్లో మాట్లాడి కుటుంబ సభ్యులు, బంధువుల యోగక్షేమాలు తెలుసుకొనేవాడు. సరిహద్దు వివాదాలపై టీవీల్లో వచ్చే అంశాల గురించి అడిగితే ‘అమ్మా.. టీవీల్లో వేరు, అక్కడ (సరిహద్దులో) పరిస్థితి వేరు. మీరెవరూ భయపడొద్దు’అంటూ ధైర్యం చెప్పేవాడు. చివరిసారిగా ఆదివారం ఫోన్లో మాట్లాడాడు. ఎలా ఉన్నావని అడిగాడు. – మంజుల (సంతోషతల్లి) దేశం కోసమే పంపా.. దేశానికి సేవ చేయాలనన నా కోరిక కుమారుడి రూపంలో నెరవేరింది. సంతోష్‌కు చిన్నతనం నుంచే దేశంపై బాగా మమకారం ఉండేది. నేను కలలుకన్న విధంగా సంతోష్ సైన్యంలో చేరడంతో ఆనందించా. సరిహద్దులో చైనా సైన్యంతో ఘర్షణలో సంతోష్ వీరమరణం పొందడం ఓవైపు సంతోషంగా ఉన్నా మరోవైపు తండ్రిగా చాలా బాధ కలిగిస్తోంది. ఆదివారం రాత్రి ఒక్క నిమిషమే నాతో మాట్లాడాడు. అమ్మతో మాట్లాడతాను.. ఫోన్ ఇవ్వు అంటే ఇచ్చాను. అదే సంతోష్ చివరి మాట. – ఉపేందర్ (సంతోష్ తండ్రి) కల్నల్ సంతోష్ కుటుంబానికి అండగా ఉంటాం సీఎం కేసీఆర్ హామీ.. కుటుంబ సభ్యులకు సానుభూతి సరిహద్దులో చైనా సైన్యంతో జరిగిన ఘర్షణలో సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్‌బాబు వీరమరణం పొందడంపట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం కోసం తెలంగాణ బిడ్డ ప్రాణత్యాగం చేశారని, ఆ త్యాగం వెలకట్టలేనిదన్నారు. సంతోష్ తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, ఇతర కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ప్రకటించారు. సంతోష్ పార్థివదేహాన్ని అందుకోవడంపాటు అంత్యక్రియల వరకు ప్రతి కార్యక్రమంలోనూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా పాల్గొనాలని మంత్రి జగదీశ్‌రెడ్డిని ముఖ్యమంత్రి ఆదేశించారు. కల్నల్ తండ్రికి హిమాచల్ గవర్నర్ దత్తాత్రేయ ఫోన్ చైనా సైనికులతో హింసాత్మక ఘర్షణలో కల్నల్ సంతోష్ వీరమరణంపట్ల హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సంతోష్ తండ్రి ఉపేందర్‌తో ఫోన్లో మాట్లాడి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా ఉపేందర్‌ను దత్తాత్రేయ ఓదార్చారు. మరోవైపు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి, మంత్రి జగదీశ్‌రెడ్డి సైతం కల్నల్ సంతోష్ తల్లిదండ్రులను ఫోన్లో పరామర్శించారు. సంతోష్ కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. కల్నల్ సంతోష్ మరణం విచారకరం జవాన్ల ప్రాణత్యాగం ఎప్పటికీ గుర్తుంటుంది ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం సాక్షి, అమరావతి: తూర్పు లఢాక్ (ఎల్ఓసీ) వద్ద చైనా దాడిలో కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ సంతోష్‌బాబు, మరో 19 మంది వీర జవాన్లు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కోరుకొండ సైనిక పాఠశాల పూర్వ విద్యార్థి అయిన సంతోష్‌బాబు ప్రాణ త్యాగం ఎప్పటికీ గుర్తుంటుందని, సరిహద్దుల్లో దేశ రక్షణ కోసం పోరాడుతున్న మన సైనికుల దీక్ష మరింత దృఢతరం అవుతుందని సీఎం పేర్కొన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. -
పెద్దల కోపం.. పిల్లలకు మరణశాసనం
దంపతుల మధ్య కొరవడిన సఖ్యత చిన్నారులకు శాపంగా మారింది. భర్తపై ఉన్న కోపంతో ఆ ఇల్లాలు చివరకు పేగుబంధాన్ని కూడా విస్మరించింది. అభం.. శుభం తెలియని ఆ చిన్నారులను చివరకు చెరువులోకి తోసేసి ఉసురు తీసింది. ఆపై తానూ తనువు చాలించాలనుకుని విరమించుకుంది. ఈ విషాదకర ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేటక్రైం : పెన్‌పహాడ్ మండల సింగిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన నాగమణి, హైదరాబాద్‌కు చెందిన ప్రశాంత్‌కుమార్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మాధవి (9), కుమారుడు హర్షవర్ధన్ (6) పిల్లలు ఉన్నారు. సూర్యాపేటలోని విద్యానగర్‌లో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. కొద్ది రోజులుగా భార్య, భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో పిల్లలతో కలిసి నాగమణి ఆత్మహత్య చేసుకోవాలని సూర్యాపేటలోని సద్దల చెరువు కట్టపైకి చేరుకుంది. మొదట పిల్లలిద్దరినీ చెరువులోకి తోసేసింది. ఆ తర్వాత తానూ చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడాలనుకుంది. ధైర్యం సరిపోక అక్కడే కూర్చొని ఏడుస్తుంది. తెల్లవారేంత వరకు కూర్చోవడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని హర్షవర్ధన్, మాధవి మృతదేహాలను వెలికి తీశారు. మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడని.. ప్రశాంత్ కుమార్ మరో మహిళతో సహజీవనం చేస్తుండ డాన్ని నాగమణి తెలుసుకుంది. దీంతో అప్పటినుంచి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇదే విషయంపై నాగ మణి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా వారిద్దరి మధ్య పెద్దగా సఖ్యత లేదు. పిల్లలను సాకేందుకు భారమవడంతో నాగమణి చేసేదేమి లేక తనువు చాలించాలని నిర్ణయించుకుంది. సద్దల చెరువు సమీపంలోకి వచ్చిన నాగమణి ముందుగా చిన్నారులను నీటిలోకి నెట్టేసి తరువాత ఈమె దూకాలనుకుంది. కానీ అప్పటికే చిన్నారులను చెరువులోకి నెట్టినప్పటికి ఈమెకు ధైర్యం చాలలేదు. చెరువులో ఉన్న చిన్నారులను కాపాడేందుకు రాత్రంతా తీవ్ర ప్రయత్నం చేసింది. తీరా తెల్లారేసరికల్లా చిన్నారులు విగత జీవులుగా మారారు. అమ్మతనంపై మమకారం చెరువులో పడ్డాక చిన్నారులపై చూపించాలనుకుంది. భార్యపై భర్త దాడి.. జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చిన్నారుల మృతదేహాలను చూసి రోదిస్తున్న తల్లిపై భర్త దాడి చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని భార్యభర్తలిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తన్నట్లు సూర్యాపేట సీఐ ఆంజనేయులు తెలిపారు. -
కఠినంగా వ్యవహరించడం వల్లే..
సాక్షి, హైదరాబాద్ : కరోనా దెబ్బకు రాష్ట్రంలోని కొన్ని జిల్లాలు కుదేలవుతున్నాయి. కానీ సగానికిపైగా జిల్లాల్లో పరిస్థితి అదుపులో ఉంది. మూడు జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం. ఇప్పటి వరకు 30 జిల్లాల్లో కరోనా కేసులు నమోదు కాగా, వనపర్తి, వరంగల్ రూరల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఎక్కువగా గ్రేటర్ హైదరాబాద్, సూర్యాపేట, నిజామాబాద్, వికారాబాద్, గద్వాల జిల్లాలను కరోనా వణికిస్తోంది. దీంతో అక్కడి ప్రజలు వణికిపోతున్నారు. అయితే మొదట్లో కేసులు నమోదైన కరీంనగర్, వరంగల్ అర్బన్ వంటి జిల్లాల్లో పరిస్థితి అదుపు లోకి వచ్చింది. జిల్లాల్లో సగానికిపైగా పరిస్థితి నియంత్రణలోకి వస్తున్నట్లు వైద్య వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అక్కడి యంత్రాంగం లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నందు వల్ల పరిస్థితి నియంత్రణలోకి వస్తుందని పేర్కొంటున్నాయి. కఠినంగా వ్యవహరించడం వల్లే.. కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్ల సూర్యాపేట, గద్వాల, వికారాబాద్ జిల్లాల్లో కేసులు పెరుగు తున్నాయని యంత్రాంగం భావిస్తోంది. కేసులు తక్కువగా, కొన్ని రోజులుగా నమోదు కాని జిల్లాల్లో లాక్డౌన్ అమలు, వేగంగా తీసుకుంటున్న నిర్ణయాలతో పరిస్థితి పూర్తి అదుపులోకి వచ్చింది. జగిత్యాల జిల్లాలో మర్కజ్ నుంచి 72 మంది వస్తే కేసుల సంఖ్య 3 మాత్రమే. కానీ సూర్యాపేట జిల్లాలో 12 మంది మర్కజ్‌కు వెళ్లి రాగా, వారిలో ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. వారిలో ఒకరి ద్వారానే ఏకంగా 81 మందికి పాజిటివ్ వచ్చిందని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు విశ్లేషించాయి. చదవండి: కరోనా: తమిళ నటుడు భూదానం అంటే జగిత్యాలలో తీసుకున్న జాగ్రత్తలు, సూర్యాపేటలో తీసుకో లేదని అర్థమవుతోంది. ఇలా కొన్ని జిల్లాల యంత్రాం గాలు వేగంగా స్పందించక పోవడం, లాక్‌డౌన్‌పై నిర్లిప్తత వల్ల విఫలమయ్యాయి. కానీ చాలా జిల్లాలు సీఎం ఆదేశాలను తు.చ. తప్పకుండా అమలు చేశాయి. ఉన్న జిల్లాలు కరీంనగర్, సిరిసిల్ల, మహబూబాబాద్, పెద్దపల్లి, ములుగు, సంగారెడ్డి, ఖమ్మం, కామారెడ్డి తదితర జిల్లాలు నియంత్రణలో ఉన్నాయి. ఇంకొన్ని జిల్లాలో అడపాదడపా కేసులు నమోదవుతున్నా పరిస్థితి అదుపులో ఉందని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇదీ జిల్లాల వారీగా పరిస్థితి.. ► వనపర్తి జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఆ జిల్లా నుంచి 13 మంది ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లి రాగా.. వారిని క్వారంటైన్‌కు తరలించారు. కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా అందరికీ నెగెటివ్ వచ్చింది. ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని హోం క్వారంటైన్ చేశారు. పకడ్బందీగా లాక్డౌన్ అమలు చేశారు. ► యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇప్పటివరకు ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. కలెక్టర్ అనితారామచంద్రన్ ఇతర శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు సాగుతున్నారు. మర్కజ్ అనుమానితులను గుర్తించడం, వారిని ఐసోలేషన్ చేయడం, వారి కుటుంబసభ్యులను హోం క్వారంటైన్ చేయడంతో పూర్తి నియంత్రణలో ఉంది. అన్ని గ్రామాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. చదవండి: వర్సిటీల ఆన్లైన్ బోధన ►వరంగల్ రూరల్ జిల్లాలో కూడా ఇప్పటివరకు ఒక్క కేసు నమోదు కాలేదు. చెక్‌పోస్ట్‌ల వద్ద కట్టుదిట్టంగా భద్రత ఏర్పాటు చేశారు. లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. వరంగల్ అర్బన్ జిల్లాలో అధికంగా కేసులు నమోదైనా ఈ జిల్లాలో ఒక్కటీ లేకపోవడానికి యంత్రాంగం తీసుకున్న చర్యలే కారణం. ►మెదక్ జిల్లాలో గత 15 రోజులుగా పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. చివరగా ఈ నెల 8న ఒకరికి పాజిటివ్ వచ్చింది. దీంతో జిల్లాలో మొత్తం 5 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ముగ్గురికి నెగెటివ్ రావడంతో గాంధీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. వీరిని హోం క్వారంటైన్లో ఉంచారు. పాజిటివ్ బాధితులతో కాంటాక్ట్ అయిన వ్యక్తులు అందరినీ క్వారంటైన్లో ఉంచారు. ప్రజలు భౌతిక దూరం పాటించేలా చూడడంతో పాటు లాక్‌డౌన్‌ను అమలు చేస్తుండటంతో వైరస్ వ్యాప్తి జరగలేదు. ► జగిత్యాల జిల్లాలో 9 రోజుల కిందట పాజిటివ్ కేసు నమోదైంది. దాంతో జిల్లాలో నమోదైన కరోనా పాజిటివ్ కేసులు మూడుకు చేరుకున్నాయి. విదేశాల నుంచి వచ్చిన 1,040 మందిని హోం క్వారంటైన్లో ఉంచారు. మర్కజ్ నుంచి వచ్చిన 72 మందిని ఐసోలేషన్‌కు తరలించడంతో పాటు కుటుంబసభ్యులను హోం క్వారంటైన్ చేశారు. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను కంటైన్మెంట్ క్లస్టర్లుగా ఏర్పాటు చేశారు. ఈ నెల 15న పాజిటివ్‌గా తేలిన కేసు కూడా గుంటూరు నుంచి వచ్చిన ఐదేళ్ల బాలుడిది. బాలుడి వెంట వచ్చిన తాతకు నెగెటివ్ వచ్చింది. ముందుజాగ్రత్త చర్యగా బాలుడి కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారిని ఐసోలేషన్‌కు తరలించి, పరీక్షలు నిర్వహించారు. వీరందరికి నెగిటివ్ వచ్చింది. ►నాగర్‌కర్నూల్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు 2 మాత్రమే నమోదు అయ్యాయి. గత 20 రోజులుగా ఎలాంటి కేసులు నమోదు కాలేదు. ఇతర దేశాలు, రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చిన వారిని మొదట్లోనే గుర్తించి హోం క్వారంటైన్లో ఉంచారు. మర్కజ్ వెళ్లి వచ్చిన 11 మందిని గుర్తించి వారిని పరీక్షించగా, వారిలో ఇద్దరికి మాత్రమే పాజిటివ్ వచ్చింది. వారి కుటుంబసభ్యులు, కాంటాక్ట్ వాళ్లను గుర్తించి ప్రభుత్వ క్వారంటైన్లో ఉంచారు. లాక్డౌన్ పూర్తి స్థాయిలో అమలు చేయడం వల్లే కరోనా కట్టడి చేయగలిగారు. ► మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ నెల 8న చివరి కేసు నమోదైంది. ఆ తర్వాత ఇప్పటి వరకు ఎలాంటి కేసులు నమోదు కాలేదు. మొత్తం 11 కేసులు నమోదయ్యాయి. ఇందులో 8 కేసులు మర్కజ్ లింకు ఉన్నవి కాగా.. మిగిలినవి వైద్య, ఆరోగ్య శాఖలో పని చేసే ఇద్దరికి, వారిలో ఒకరి తల్లికి పాజిటివ్ వచ్చింది. ఇప్పటి వరకు ఐదుగురు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మర్కజ్ వెళ్లి వచ్చిన వారితో పాటు, వారితో సన్నిహితంగా ఉన్న వారందరినీ క్వారంటైన్‌కు పంపారు. లాక్‌డౌన్‌ను సమర్థంగా అమలు చేయడమే కేసులు పెరగకపోవడానికి కారణం. ►నారాయణపేట జిల్లాలో 2 నెలల బాబుకు ఈ నెల 15న పాజిటివ్ వచ్చి 17న చనిపోయాడు. తర్వాత ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అప్రమత్తమైన అధికారులు బాబు తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు 14 మంది నమూనాలు సేకరించి పరీక్షల కోసం పంపగా అందరికీ నెగెటివ్ వచ్చింది. ►భద్రాద్రి కొత్తగూడెంలో 30 రోజులుగా ఒక్క కేసు కూడా నమోదుకాలేదు. అప్పటివరకు 4 కేసులు నమోదయ్యాయి. వారికి తర్వాత నెగెటివ్ వచ్చింది. వాళ్లు డిశ్చార్జ్ అయ్యారు. ఛత్తీస్‌గఢ్, ఏపీ సరిహద్దులు మూసేసి గట్టి నిఘా పెట్టడంతో పాటు విదేశాల నుంచి వచ్చిన 243 మందిని, మర్కజ్ నుంచి వచ్చిన 10 మందిని, వారితో కలిసిన వారిని క్వారంటైన్లో పెట్టడంతో పాటు.. లాక్ డౌన్ పక్కాగా అమలు చేశారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో మావోయిస్టు కార్యకలాపాల నేపథ్యంలో పోలీసులు మరింత పకడ్బందీగా వ్యవహరించారు. ►సిద్దిపేట జిల్లాలో గత 22 రోజులుగా ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. పాజిటివ్ వచ్చిన వ్యక్తి కూడా కోలుకున్నాడు. డిశ్చార్జ్ చేశారు. వైరస్ వ్యాపి చెందకుండా మంత్రి హరీశ్‌రావు అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు. ఆయన స్వయంగా వెళ్లి లాక్‌డౌన్‌ను పర్యవేక్షిస్తున్నారు. నాలుగు గ్రామాల్లో ప్రజలను ఇంటి నుంచి బయటకు రాకుండా కట్టుదిట్టం చేశారు. చదవండి: రైతుల్ని ఆదుకొనేదెవరు? ► భూపాలపల్లి జిల్లాలో 10 రోజుల నుంచి కొత్త కేసులు నమోదు కాలేదు. చివరి కేసు ఈ నెల 12న నమోదైంది. ఇప్పటివరకు జిల్లాలో 3 కేసులే నమోదయ్యాయి. ఇవి మర్కజ్ వెళ్లి వచ్చిన వ్యక్తి ద్వారా ఆయన భార్య, కూతురుకు సోకింది. మర్కజ్ వెళ్లి వచ్చిన వ్యక్తిని వెంటనే క్వారంటైన్ చేశారు. ఆయనతో సన్నిహితంగా మెలిగిన 39 మందిని గుర్తించారు. జిల్లా నుంచి ఒకే వ్యక్తి మర్కజ్‌కు వెళ్లి రావడం కూడా కేసులు పెరగకపోవడానికి ప్రధాన కారణం. అలాగే చుట్టు పక్కల జిల్లాలైన ములుగు, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో కేసుల సంఖ్య తక్కువగా ఉంది. జిల్లా సరిహద్దులో ఉన్న మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ఈ జిల్లాల నుంచి వచ్చే సరిహద్దులను పూర్తిగా మూసేయడం కూడా కేసుల సంఖ్య తక్కువగా ఉండటానికి దోహదపడింది. ►మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం ముత్తరావుపల్లికి చెందిన ఓ మహిళ (46) ఈ నెల 14న హైదరాబాద్‌లో కింగ్ కోఠి ఆస్పత్రిలో మరణించింది. పరీక్షించగా పాజిటివ్ వచ్చింది. ఆమెకు వైరస్ ఎలా సోకిందో ఇప్పటికీ మూలం దొరకలేదు. అప్పటివరకు మంచిర్యాలలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. జిల్లా యంత్రాంగం మహారాష్ట్ర నుంచి వచ్చే సరిహద్దుల్లో నిత్యం నిఘా ఏర్పాటు చేసింది. లాక్డౌన్ పక్కాగా అమలు చేస్తున్నారు. -
విద్యార్థినిని ప్రేమ పేరుతో..
సూర్యాపేట, తిరుమలగిరి(తుంగతుర్తి): సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన అధ్యాపకుడే నయవంచకుడిగా మారాడు. తాను బోధిస్తున్న కళాశాల విద్యార్థినిని ప్రేమపేరుతో వంచించాడు. వివాహం చేసుకుంటానని నమ్మబలికి కాటేశాడు. ఈ ఘటన తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలో సోమవారం వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ బి.డానియల్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపాలిటీ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థిని(19) మండల కేంద్రంలోని ప్రైవేట్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఇదే కాలేజీకి చెందిన గణిత అధ్యాపకుడు లింగయ్య ప్రేమిస్తున్నానని కళాశాలప్రారంభంనుంచే విద్యార్థినిని వేధించసాగాడు. ఈ విషయాన్ని ఆమె తన తల్లిదండ్రులకు చెబితే ఎక్కడ చదువు మాన్పిస్తారేమోనని భయపడి ఊరుకుంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి లోబర్చుకున్నాడు. ఈ అధ్యాపకుడికి గతంలోనే వివాహం జరిగింది. ఈ నెల 21వ తేదీన విద్యార్థినిని తన సొంత వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లి మళ్లీ లైంగిక దాడి చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
తెలంగాణ సరిహద్దులో నిలిచిపోయిన వాహనాలు
సాక్షి, సూర్యాపేట: ప్రాణాంతక కోవిడ్-19(కరోనా వైరస్) వ్యాప్తి నేపథ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాలు లాక్డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనజీవనం ఎక్కడిక్కడ స్తంభించిపోయింది. ఇక తెలంగాణ రాష్ట్ర సరిహద్దైన సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం క్రాస్‌రోడ్డులో చెక్‌పోస్టు వద్ద పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి వాహనాలను రాష్ట్రంలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. సరిహద్దులోకి వచ్చిన లారీలు, డీసీఎం వంటి వాహనాలను పక్కనే ఉన్న వెంచర్లో పార్కింగ్ ఏర్పాటు చేసి నిలిపారు. కార్లను సైతం నిలిపివేశారు. ఈనెల 31 వరకు లాకౌడౌన్ కొనసాగుతుండటంతో రాష్ట్రంలోకి వాహనాలను అనుమతించబోమని స్పష్టం చేశారు. ఎవరికీ ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో డ్రైవర్లకు, క్లీనర్లకు రవాణా శాఖ అధికారులు భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. (తెలంగాణ@31 దాకా లాక్ డౌన్) -
మా భూములు మాకు ఇప్పించాలి
చివ్వెంల (సూర్యాపేట) : ఆక్రమించుకున్న మా భూములను ఇప్పించాలని కోరుతూ బాధితులు సూర్యాపేట పట్టణ పరిధిలోని దురాజ్‌పల్లి గ్రామ స్టేజీవద్ద హైదరాబాద్–విజయవాడ రహదారిపై రాస్తారోకో చేశారు. పాలకీడు మండలం బెట్టెతండాకు చెందిన ధీరావత్ నాగ, ధీరావత్ గమ్లీ, ధీరావత్ శోభన్‌బాబు, ధీరావత్ కిషన్, ధీరావత్ బాబులు.. గ్రామ శివారులోని సర్వేనంబర్ 59/అలొ 1.01 ఎకరాలు, 59/11/3/1లో 2.00 ఎకరాలు, 59/16లో 2.00 ఎకరాలలో ఉన్న భూములను 17 సంవత్సరాలుగా సేద్యం చేసుకుంటున్నారు. ఈక్రమంలో గత ప్రభుత్వం తమకు పట్టాలు ఇచ్చిందని.. ప్రస్తుతం రైతుబంధు పథకం ద్వారా పెట్టుబడి సహాయ కూడా వస్తుందని బాధితులు పేర్కొన్నారు. కాగా గత నెల రోజులుగా గ్రామ మాజీ సర్పంచ్ ధీరావత్ రవినాయక్ తమను భయబ్రాంతులను గురిచేస్తూ మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారని, దీనిపై పాలకీడు తహసీల్దార్, ఎస్ఐలకు ఫిర్యాదు చేశామని.. అయినా ఫలితం లేకపోయిందని వాపోయారు. దీంతో సూర్యాపేట జాయింట్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామని అయినప్పటికీ న్యాయం జరుగలేదని ఆరోపించారు. దీంతో తమ కుటుంబ సభ్యులతో కలిసిన రాస్తారోకో దిగామని వారు పేర్కొన్నారు. వీరి రాస్తారోకోతో రహదారిపై వాహనాల రాకపోకులు స్తంభించి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకోవడంతో బాధితులు తమ గోడు వినిపించుకున్నారు. తమకు న్యాయం చేయాలని పోలీసులు కాళ్లు పట్టుకుని వేడుకున్నారు. పోలీసుల హామీతో చివరకు ఆందోళన విరమించారు. తొమ్మిదిమందిపై కేసు మా భూములు మాకే ఇవ్వాలని దురాజ్‌పల్లి గ్రామ స్టేజీ వద్ద హైదరాబాద్–విజయవాడ రహదారిపై ధర్నా చేసిన పాలకవీడు మండల వాసులు తొమ్మిదిమందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఎస్డీ.ఇబ్రహీం తెలిపారు. వివరాల ప్రకారం పాలకవీడు మండల బెట్టెతండాకు చెందిన ధీరావత్ నాగు, ధీరావత్ బాబు, కిషన్, శోభన్‌బాబు, బంగారి, గమ్లీ, శారద, సుజాత, రంగమ్మలు తమ భూ సమస్యలు పరిష్కరించాలంటూ రహదారిపై రాస్తారోకో నిర్వహించడంతో అరగంట సేపు ట్రాఫిక్ స్తంభించిపోయింది. దీంతో పోలీసులు తొమ్మిదిమందిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. -
ఆస్తి కోసం తల్లి, చెల్లిని హత్య చేసిన కొడుకు
-
సూర్యాపేటలో దారుణం.. తల్లి, చెల్లిని హత్య
సాక్షి, సూర్యాపేట: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువకుడు ఆస్తి కోసం సవతి తల్లి, ఆమె కూతుర్ని రోకలి బండతో కొట్టి దారుణంగా హత్య చేశాడు. వివరావల్లోకి వెళితే.. సూర్యాపేట మండలం తాళ్ల కంపాడ్ గ్రామానికి చెందిన రేషన్ డీలర్ కప్పల నాగయ్యకు ఇద్దరు భార్యలు. అచ్చమ్మ, అంజమ్మ ఇద్దరు సొంత అక్క చెల్లెల్లు. పెద్ద భార్య అచ్చమ్మకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆమె చెల్లెలు అంజమ్మను నాగయ్య వివాహం చేసుకున్నాడు. పెద్ద భార్య అచ్చమ్మ కు ఒక కొడుకు, ఒక కూతురు కాగా చిన్న భార్య అంజమ్మకు ఒక కూతురు. అయితే పదేళ్ల క్రితం అనారోగ్యంతో నాగయ్య మృతి చెందగా, నాగయ్య రేషన్ డీలర్షిప్ చిన్న భార్యకు వచ్చింది. అప్పటి నుంచి ఇరు కుటుంబాల మధ్య ఆస్తి తగాదాలు జరుగుతున్నాయి. నెల రోజుల క్రితం పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ కూడా జరిగింది. ఇరువురికి సమానంగా ఆస్తి పంచాలని పెద్ద మనుషులు తీర్మానం చేశారు. కాగా, నాగయ్య పెద్ద భార్య కొడుకు హరీష్ గురువారం అంజమ్మ ఇంటికి వచ్చి రోకలి బండతో ఆమె కూతురిని, ఆమెను దారుణంగా కొట్టి చంపాడు. అనంతరం నేరుగా పోలీసులు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. -
సూర్యాపేట జిల్లా కలెక్టర్ బదిలీ
సాక్షి, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కలెక్టర్ అమేయ కుమార్‌పై బదిలీ వేటు పడింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా ఆయనను ప్రభుత్వం సోమవారం బదిలీ చేసింది. యాదాద్రి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్‌కి సూర్యాపేట జిల్లా ఇన్చార్జి కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ఓటు వివాదం నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఓటు వేసేందుకు అవకాశం కల్పించి, తర్వాత నిరాకరించడంతో వివాదం మొదలైంది. దీనిపై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళన కూడా చేసింది. అంతేకాకుండా ఈరోజు కాంగ్రెస్ నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసి తమ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన ఎన్నికల సంఘం సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేసి, కేవీపీకి ఓటు వేసే అవకాశం కల్పించింది. అమేయ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. అలాగే ప్రభుత్వం నేరేడుచర్ల మున్సిపాలిటీ ఇన్చార్జ్ కమిషనర్ మహేందర్‌రెడ్డిని సస్పెండ్ చేసింది. కాగా అమయ్‌కుమార్ సూర్యాపేట జిల్లా కలెక్టర్‌గా 2018 డిసెంబర్ 29న బాధ్యతలు స్వీకరించారు. ఆయన స్థానిక సంస్థలు, ఎంపీ, హుజూర్నగర్ ఉప ఎన్నిక, మున్సిపల్ ఎన్నికలను నిర్వహించారు. కేవీపీ ఓటు వివాదం నేపథ్యంలో నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక మంగళవారానికి వాయిదా పడింది. (చదవండి: నేరేడుచర్లలో ఉత్కంఠ) -
భూమి కంపించింది
సాక్షి నెట్వర్క్: అంతా గాఢ నిద్రలో ఉండగా ఒక్కసారిగా పెద్ద పెద్ద శబ్ధాలు వినిపించాయి. పడుకున్న తమను ఎవరో కదిపినట్లుగా అనిపించింది. దీంతో ఏం జరుగుతుందోనని తెలియక జనం ఇళ్ల నుంచి పరుగు పరుగున బయటకు వచ్చారు. అనంతరం ఇది భూకంపం అని తెలుసుకుని ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆదివారం తెల్లవారుజామున తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన భూప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ప్రకంపనలకు సంబంధించి సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం పాతవెల్లటూరును భూకంప కేంద్రంగా ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు గుర్తించారు. తెల్లవారుజామున సరిగ్గా 2.37 గంటల నుంచి 6 సెకన్లపాటు భూమి కంపించినట్లు ఇక్కడ ఏర్పాటు చేసిన సిస్మోగ్రాఫ్‌లో నమోదైందని తెలిపారు. భూమి పొరల్లో జరిగిన సర్దుబాట్ల ఫలితంగా ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు పేర్కొన్నారు. 7 కిలోమీటర్ల లోతులో కంపన కేంద్రం.. వెల్లటూరు వద్ద (పులిచింతల ప్రాజెక్టు ముంపు గ్రామం) ఏర్పాటు చేసిన సిస్మోగ్రాఫ్‌లో తెల్లవారుజామున 2.37 గంటల తర్వాత 6 సెకన్లపాటు భూమి కంపించినట్లు రికార్డయ్యింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 4.6గా నమోదైంది. భూమి పొరల్లో 7 కిలోమీటర్ల లోతులో ఉన్న భూకంప నాభి కేంద్రం నుంచి తరంగాలు వచ్చాయి. ఈ గ్రామానికి సమీపంలో ఉన్న గుడిమల్కాపురం, దొండపాడు, అడ్లూరు, శోభనాద్రిగూడెం, మల్లారెడ్డిగూడెం గ్రామంలో కంపన తరంగాలు భీకర శబ్ధంతో వచ్చాయి. తరంగాల ప్రభావం సుమారు 150 కిలోమీటర్లకు పైగా వెళ్లింది. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా, ఖమ్మం, ఏపీలోని గుంటూరు, కృష్ణా జిల్లాల్లో భూమి కంపించింది. అయితే కంపన కేంద్రం వద్ద తరంగాల తీవ్రత ఎక్కువ ఉండటంతో వెల్లటూరు, నార్లబోడులోని ఇళ్లకు బీటలు పడ్డాయి. అంతటా కలకలం.. ఉమ్మడి నల్లగొండ జిల్లా అంతటా భూకంపం కలకలం రేపింది. ఏదో జరుగుతుందని ఇళ్ల నుంచి బయటకు వచ్చిన ప్రజలు తెల్లవారే వరకు ఇళ్లలోకి వెళ్లలేదు. గతంలో కన్నా భీకర శబ్ధాలు ఎక్కువగా రావడంతో చింతలపాలెం, మేళ్లచెరువు, మఠంపల్లి మండలాల్లోని ప్రజలకు కునుకు పట్టలేదు. సమాచారం తెలుసుకున్న ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్త నగేశ్ తన బృందంతో చింతలపాలెం మండలం మల్లారెడ్డిగూడెంలో సమావేశం ఏర్పాటు చేసి భూకంపాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. భూ కంపాలు వచ్చినప్పుడు ఇళ్ల నుంచి బయటకు రావాలని చెప్పారు. ఆయన వెంట ఎన్జీఆర్ఐ సాంకేతిక బృందంతోపాటు కోదాడ ఆర్డీవో కిశోర్‌కుమార్ ఉన్నారు. నెల రోజుల్లో 300 సార్లు.. కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఉన్న సూర్యాపేట జిల్లాలోని చింతలపాలెం, మేళ్లచెరువు మండలాల్లో గత నెలరోజులుగా భూమి కంపిస్తోంది. భూకంపనాలతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఇది భూకంప మా..? లేక ఇక్కడ ఉన్న మైనింగ్ తవ్వకాల వల్ల ఇలా జరుగుతుందా..? అనే విషయం చర్చించుకుంటున్నారు. అయితే ఒక్కోరోజు పదుల సంఖ్యలో కంపనాలు వస్తుండటం, ప్రజల భయాందోళనతో ఈ నెల 12న ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు చింతలపాలెం మండలంలోని దొండపాడుతోపాటు కృష్ణానదికి అవతల ఉన్న గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం కొత్తపల్లి వద్ద సిస్మోగ్రాఫ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలు ఏర్పాటు చేసిన ఈ నెల 12 నాటి నుంచి ఇప్పటివరకు 300 సార్లు ఈ ప్రాంతంలో భూమి కంపించింది. ఈ కంపనాల తీవ్రత 2.5 దాటలేదు. రాష్ట్రంలో 1969 జూలై 13న భద్రాచలం సమీపంలో వచ్చిన భూకంప తీవ్రత వెల్లటూరు కన్నా తక్కువగా ఉందన్నారు. ఖమ్మం జిల్లాను తాకిన కంపనాలు భూ ప్రకంపనలు ఖమ్మం జిల్లాలోని 3 మండలాలను తాకాయి. జిల్లాలోని చింతకాని, ముదిగొండ, కూసుమంచి మండలాల్లో ఈ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఆదివారం తెల్లవారుజామున 2.37 గంటలకు సమయంలో ఒక్కసారిగా భూమి 3 సెకన్ల పాటు కంపించింది. భూ ప్రకంపనల సమయంలో శబ్ధంతో ఇళ్లలో ఉన్న వస్తువులు కదులుతూ ఉండటంతో నిద్ర మత్తులో ఉన్న ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సరిగ్గా ఐదేళ్ల కిందట జనవరి 26న రాత్రి చింతకాని మండలంలో ఇలాగే స్వల్పం గా భూ ప్రకంపనలు సంభవించినట్లు స్థానికులు చెబుతున్నారు. చింతకాని మండలంలోని నాగులవంచ, మత్కేపల్లి, చినమండవ, పాతర్లపాడు, తిమ్మినేనిపాలెం, తిరుమలాపురం, చింతకాని, జగన్నాథపురం, గాంధీనగర్‌కాలనీ, రామకృష్ణాపురం, కొదుమూరు, లచ్చగూడెం గ్రామాల్లో భూ ప్రకంపనలు సంభవించినట్లు స్థానికులు తెలిపారు. ముదిగొండ మండలంలోని గంధశిరి, బాణాపురం, వల్లబి, మాధాపురం గ్రామాల్లో భూమి కంపించినట్లు చెప్పారు. అలాగే కూసుమంచి మండలంలోని కేశ్వాపురం, అగ్రమారం, నేలపట్ల, జీళ్లచెరువు, కూసుమంచి, గట్టుసింగారం, గోరీలపాడుతండా తదితర గ్రామాల్లో భూమి కంపిచినట్లు ఆయా గ్రామాల ప్రజలు తెలిపారు. ఓరుగల్లులో కంపించిన భూమి.. ఉమ్మడి వరంగల్ పరిధి ధర్మసాగర్ మండల కేంద్రం, దుగ్గొండి మండలం ముద్దునూరు గ్రామంతోపాటు పలు ప్రాంతాల్లో ఆదివారం తెల్లవారుజామున రెండు నుంచి మూడు సెకన్ల పాటు భూమి స్వల్పంగా కంపించింది. గ్రామంలోని పలు ఇళ్లలో కొన్ని వస్తువులు కదిలినట్లు గ్రామస్తులు తెలిపారు. అలాగే పరకాల పట్టణంలోని గండ్రవాడ, హరితనగర్ ప్రాంతాల్లో భూమి కంపించిందని కాలనీవాసులు తెలిపారు. ఏపీలోను ప్రకంపనలు ఈ భూప్రకంపనలు కృష్ణా జిల్లా నందిగామ, జగ్గయ్యపేట, కంచికచర్ల, వీరులపాడు, చందర్లపాడు, పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాలతోపాటు విజయవాడ నగరంలోని భవానీపురం, విద్యాధరపురం, గుంటూరు జిల్లా మాచవరం, బెల్లంకొండ, పిడుగురాళ్ల, అచ్చంపేట, తాడికొండ, క్రోసూరు, నాదెండ్ల, సత్తెనపల్లి తదితర మండలాల్లో అలజడి రేపాయి. నగరంలోనూ భూప్రకంపనలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో సంభవించిన భూప్రకంపనల తీవ్రత హైదరాబాద్ నగరాన్నీ తాకింది. అయితే దీని తీవ్రత నగరంలో తక్కువగానే నమోదైంది. బోయిన్పల్లి, ఉప్పల్, తార్నాక, సికింద్రాబాద్, కూకట్పల్లి, నిజాంపేట్, ప్రగతినగర్ తదితర ప్రాంతాల్లో కొందరి ఇళ్లల్లో వస్తువులు కిందపడిపోయాయి ప్రజలు ఆందోళన చెందొద్దు రాతిపొరల్లో ఒత్తిడి వల్ల భూకంపాలు వస్తున్నాయి. ఇలా నిత్యం రావచ్చు.. రాకపోవచ్చు. ప్రకంపనలు వచ్చినప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇళ్ల నుంచి బయటకు రావాలి. వెల్లటూరు వద్ద భూకంపన కేంద్రంగా గుర్తించాం. ఇక్కడ దీని తీవ్రత 4.6గా ఉంది. ఈ తరంగాలు తెలంగాణలోని ఉమ్మడి నల్లగొండ, ఖమ్మంతోపాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, కృష్ణా జిల్లాల వరకు వెళ్లాయి. ఎక్కడా ఎలాంటి నష్టం జరగలేదు. ప్రజలు ఆందోళన చెందొద్దు. – నగేశ్, ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్త హైదరాబాద్‌కు ప్రమాదం లేదు హైదరాబాద్‌కు 150 నుంచి 200 కి.మీల దూరంలో చోటుచేసుకున్న భూప్రకంపనలు వల్ల నగరానికి ఎలాంటి ప్రమాదం లేదని ట్రిపుల్ ఐటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ప్రదీప్ రామన్‌చర్ల తెలిపారు. అయితే ఆయా ప్రాంతాలతోపాటు అన్ని చోట్లా ఇళ్ల నిర్మాణానికి ఫౌండేషన్ వేసేప్పుడు విధిగా ర్యాఫ్ట్ ఫౌండేషన్ వేసుకొని నిర్మాణం చేస్తే ఎంతో మేలు చేకూరుతుందని సూచించారు. అదేవిధంగా ఇంటి నిర్మాణం చేసిన తర్వాత గ్రౌండ్‌ఫ్లోర్‌లో పార్కింగ్ ఇచ్చేప్పుడు విధిగా షేర్వాల్ నిర్మాణం చేసుకోవడం తప్పనిసరని ఇళ్ల నిర్మాణదారులు గుర్తించాలన్నారు. ఇలాంటి సూచనలన్నీ నేషనల్ బిల్డింగ్ కోడ్‌లో స్పష్టంగా పేర్కొన్నారని, వాటిని విధిగా పాటించి ఇళ్ల నిర్మాణం చేయాలన్నారు. ఇక్కడ కూడా చాలావరకు బహుళ అంతస్తుల నిర్మాణాలు చేస్తున్నారని, వాటిల్లో కూడా నేషనల్ బిల్డింగ్ కోడ్‌కు అనుగుణంగా నిర్మాణం చేసుకోవాలన్నారు. – ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ రిజిస్ట్రార్, ప్రదీప్ రామన్‌చర్ల -
ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం
సాక్షి, హైదరాబాద్ : ఏక కాలంలో లక్ష మంది ధ్యానం చేసేలా ‘హార్ట్ఫుల్నెస్’అనే సంస్థ అత్యాధునిక వసతులతో హైదరాబాద్ శివార్లలో నిర్మించిన ప్రపంచంలోనే అతి పెద్ద ధ్యాన కేంద్రం 28న ప్రారంభం కానున్నది. సంస్థ అంతర్జాతీయ మార్గదర్శకులు దాజీ ఈ కేంద్రాన్ని సంస్థ మొదటి మార్గదర్శి లాలాజీ పేరిట అంకితం చేస్తారు. 30 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ధ్యాన కేంద్రంలో సెంట్రల్ హాల్, మరో 8 అనుబంధ హాళ్లు ఉన్నాయి. ఈ నిర్మాణం రాత్రి వేళల్లో విద్యుద్దీపాల వెలుగులో సిడ్నీ హార్బర్‌తో పాటు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కట్టడాలతో పోటీ పడుతుందని నిర్వాహకులు చెప్తున్నారు. ‘హార్ట్ఫుల్నెస్’75వ వార్షికోత్సవం సందర్భంగా జనవరి 28 నుంచి 30, ఫిబ్రవరి 2 నుంచి 4, ఫిబ్రవరి 7నుంచి 9వ తేదీ నడుమ జరిగే సమావేశాల్లో 1.2లక్షల మంది ధ్యానంలో పాల్గొంటారు. ఫిబ్రవరి 2న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, 7న అన్నా హజారే ధ్యాన సాధకులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. జనవరి 29న జరిగే కార్యక్రమంలో బాబా రాందేవ్ పాల్గొంటారు. 1400 ఎకరాల్లో విస్తరించిన ఈ ధ్యాన కేంద్రం 40వేలకు మందికి పైగా వసతి కల్పించడంతో పాటు, రోజుకు లక్ష మందికి వండి వార్చేలా వంట గది నిర్మించినట్లు సంస్థ మార్గదర్శి దాజీ వెల్లడించారు. 6 లక్షల మొక్కలతో నర్సరీ ఏర్పాటు చేశారు. త్వరలో 350 పడకల ఆయుష్ ఆస్పత్రి అందుబాటులోకి రానుంది. -
కూతుళ్లపై తండ్రి లైంగిక దాడి
కోదాడ: భర్త వేధింపులు తట్టుకోలేక పుట్టింటికి చేరిన కుమార్తెని అక్కున చేర్చుకోవాల్సిన కన్నతండ్రే 6 నెలలుగా లైంగికంగా వేధించసాగాడు. ఆ బాధను తట్టుకోలేక విషయాన్ని తల్లికి చెప్పింది. దీంతో ఆమె అతడిని నిలదీయగా.. మంచిగా ఉంటానని ప్రాధేయపడటంతో వదిలేశారు. ఈ క్రమంలో మైనర్ అయిన చిన్న కూతురిని సైతం వేధించసాగాడు. దీంతో శనివారం పోలీసులకు ఫిర్యాదు చేయగా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కోదాడ పట్టణంలోని కట్టకొమ్ముగూడెం రోడ్డులో పెరిక హాస్టల్ సమీపంలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తెకు 2016లో వివాహం చేశారు. ఆమెకు రెండేళ్ల కూతురు ఉంది. భార్యభర్తల మధ్య గొడవలు రావడంతో ఆమె తల్లిగారింట్లో ఉంటోంది. తల్లి పనులకు వెళ్లిన సమయంలో తండ్రి ఆమెను లైంగికంగా వేధించసాగాడు. 6 నెలలుగా ఈ ఘాతుకానికి పాల్పడుతున్నాడు. ఈ విషయాన్ని తల్లికి చెప్పడంతో అతడిని వీరిద్దరూ నిలదీశారు. బయటకు చెప్పవద్దని అతడు ప్రాధేయపడటంతో మిన్నకుండిపోయారు. ఇక మైనర్ అయిన చిన్న కుమార్తెను కూడా వేధించసాగాడు. దీంతో కుమార్తెలిద్దరు స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేశారు. -
పూర్తి కావొస్తున్న సూర్యక్షేత్రం..!
అర్వపల్లి (తుంగతుర్తి) : తెలంగాణ రాష్ట్రంలో ప్రప్రథమంగా నిర్మిస్తున్న అఖండజ్యోతి స్వరూప శ్రీసూర్యనారాయణస్వామి మహాక్షేత్రం పనులు పూర్తి కావొస్తున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో అక్కడక్కడ చిన్నచిన్న సూర్యదేవాలయాలు ఉన్నాయే తప్ప సూర్యభగవానుడి క్షేత్రం ఎక్కడా లేదు. తొలిసారిగా సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం శివారులోని శ్రీపురంగిరులలో సూర్యాపేట ప్రాంతానికి చెందిన కాకులారపు జనార్దన్‌రెడ్డి–రజిత దంపతులు ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. సుమారు రూ.2కోట్ల వ్యయంతో మూడు గిరులు (గుట్టల మధ్య) ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో పచ్చని వనాల నడుమ ఈ ఆలయ నిర్మాణం జరుగుతోంది. అయితే ఈ ఆలయంతో పాటు దేవస్థాన కార్యాలయ భవనం, గోశాల నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. వీటితో పాటు రాబోయే రోజుల్లో ఇక్కడ నక్షత్రవనం, ధ్యానమండపం తదితర వాటిని నిర్మించ తలపెట్టారు. అయితే పర్వత శ్రేణుల మధ్య నిర్మించే ఈ క్షేత్రంలో ఆలయ గర్భగుడిలో అఖండజ్యోతి మూలాధారం. ఈ జ్యోతిని ఏకాగ్రతతో చూస్తూ సూర్యభగవానుడు చుట్టూ ఉండే సప్త ఆలయాల్లో సప్తవర్ణాలలో దర్శనమిస్తారు. అంతే కాకుండా ఇక్కడ కాస్మిక్ ఎనర్జీ అత్యధికంగా ఉన్నట్లు గుర్తించడం జరిగింది. కాస్మిక్ ఎనర్జీ అంటే సూర్యుడు కాలగమనంలో ఒక్కొక్క మాసం ఒక్కో రాశిలో ప్ర వేశిస్తారు. ఆ రాశి సంయమనం ప్రకారం కాంతి తీవ్రత ఉం టుంది. ఈ ఎనర్జీ మనిషి యొక్క ఆలోచనలను ఎంతో ప్రభా వితం చేస్తాయి. మేధాశక్తిని పెంపొందిస్తుంది. దీంతో ఈ క్షే త్రం రాబోయే రోజుల్లో గొప్ప విశిష్టత సంతరించుకునే అవకా శం ఉందని చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు సూర్యనా రాయణస్వామి దర్శనం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకా కుళం జిల్లా అరసవెల్లికి వెళుతున్నారు. త్వరలో తెలంగాణ ప్ర జలకు సూర్యభగవానుడి దర్శన బాగ్యం ఇక్కడే కలగనుంది. రూ.2కోట్లతో క్షేత్రం నిర్మాణం.. సుమారు రూ.2కోట్ల వ్యయంతో ఈ క్షేత్ర నిర్మాణం జరుగుతోంది. సూర్యనారాయణస్వామి గర్భగుడి, చు ట్టూ ఏడు సప్తవర్ణ ఆలయాలు, ఈ క్షే త్రంపై రాజ గోపురం నిర్మాణం పూర్తయ్యాయి. దేవాలయ కార్యాలయం రెండు అంతస్తుల్లో నిర్మించా రు. పశువుల కోసం గోశాల నిర్మాణం జరుగుతోంది. ఆల యం ఎదుట ధ్యానమందిరం నిర్మా ణం పూర్తయింది. మిగి లిన పనులు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 24నుంచి ప్రతిష్ఠ, మహాసౌరయాగ మహోత్సవాలు ఈ అఖండజ్యోతి స్వరూప పంచాయతన దేవాలయ ప్రతిష్ఠ, మహా సౌరయాగ మహోత్సవాలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 24నుంచి మార్చి 5వరకు జరపాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి సూర్యనారాయణస్వామి దేవాలయ ప్రధానార్చకుడు ఇప్పిలి శంకరశర్మ పర్యవేక్షణలో ప్రతిష్ఠ, మహాసౌరయాగ మహోత్సవాలు జరగనున్నాయి. ఇప్పటికే అరసవెల్లి దేవస్థాన అర్చక బృందం మహా సౌరయాగ మహోత్సవాలకు ఏర్పాట్లను పరిశీలించి వెళ్లింది. ఈ యాగానికి ఐదుగురు పీఠాధిపతులను ఆహ్వానిస్తున్నారు. అలాగే 36మంది రుత్వికులు 420మంది జంటలచే మహాసౌరయాగాన్ని 13రోజుల పాటు నిర్వహించనున్నారు. సీఎం కేసీఆ ర్, గవర్నర్ తమిళసై సౌందరరాజన్‌తో పాటు చినజీయర్, స్వరూపనంద స్వాములతో పాటు రెండు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ స్వాములను పిలవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మహోత్సవాలను రూ.కోటి వ్యయంతో నిర్వహిస్తున్నారు. ఇక్క డి క్షేత్రం తూర్పు దిశలో మూడు పర్వతాల మధ్య ఉన్నందున ఏపీలోని అరసవెల్లి దేవాలయం మాదిరిగా అభివృద్ధి చెందుతుందని దేవాలయ వ్యవస్థాపకుడు జనార్దన్‌రెడ్డి తెలిపారు. ప్రతిష్టా, మహాసౌరయాగ మహోత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలిరావాలని కోరుతున్నారు. -
గొడ్డలితో కసిగా.. వ్యక్తి దారుణహత్య
అర్వపల్లి (తుంగతుర్తి) : ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద నైట్ వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న ఓ రైతు దారుణహత్యకు గురయ్యాడు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... సూ ర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన రైతు జడ బుచ్చయ్య(65) గ్రామ శివారులోని బోడుపై ఏర్పాటు చేసిన పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో నెలరోజుల నుంచి నైట్ వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. రాత్రివేళలో కాపలా ఉండి పగలు వ్యవసాయం చేస్తున్నాడు. అయితే ఆది వారం సూర్యాపేటలో ఫంక్షన్‌కు వెళ్లి సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చి భోజనం చేసి రాత్రి కేంద్రం వద్ద నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డలితో విచక్షణా రహితంగా నరికి చంపారు. విషయం బయటికి వచ్చిందిలా.... సోమవారం ఉదయం కొమ్మాల గ్రామానికి చెందిన రైతులు ధాన్యాన్ని కేంద్రానికి తీసుకొని వెళ్లిన సమయంలో బుచ్చయ్య మంచం వద్ద రక్తపు మడుగును చూసి వెంటనే గ్రామస్తులకు తెలియజేయడంతో హత్య విషయం బయటపడింది. మృతుడు బుచ్చయ్యకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పిల్లలందరి పెళ్లి కాగా వారికి కూడా పిల్లలున్నారు. అయితే సంఘటన విషయం తెలిసిన వెంటనే సూర్యాపేట డీఎస్పీ ఎం.నాగేశ్వర్రావు, నాగారం సీఐ తులా శ్రీనివాస్, ఎస్ఐ కె. మహేష్ సంఘటన స్థలికి చేరుకొని హత్యకు గల కారణాలను ఆరాతీశారు. జెడ్పీటీసీ సభ్యుడు దావుల వీరప్రసాద్‌యాదవ్, టీఆర్ఎస్ నాయకుడు మన్నె లక్ష్మీనర్సయ్యయాదవ్, కాంగ్రెస్ నాయకులు మోరపాక సత్యం, అనిరెడ్డి రా>జేందర్‌రెడ్డి సంఘటన స్థలికి వచ్చి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. క్లూస్‌టీం, డాగ్స్క్వాడ్లతో ఆధారాల సేకరణ సూర్యాపేట జిల్లా కేంద్రం నుంచి డాగ్‌స్క్వాడ్, నల్లగొండ జిల్లా కేంద్రం నుంచి క్లూస్‌టీంను రప్పించి ఆధారాలను సేకరిస్తున్నారు. జాగిలం కాసర్లపహాడ్ గ్రామ శివారు వరకు వెళ్లి వెనక్కి వచ్చింది. ఎవరిపైనా అనుమానంలేదన్న కుటుంబ సభ్యులు బుచ్చయ్య హత్యపై తమకు ఎవరిపైనా అనుమానం లేదని మృతుడి భార్య, ఇద్దరు కుమారులు పోలీసులకు తెలియజేశారు. గుర్తు తెలియని వ్యక్తులు హత్యచేసి ఉంటారని ఫిర్యాదు చేశారు. ఎందుకు చేశారో తమకు తెలియదని చెబుతున్నారు. వివిధ కోణాల్లో పోలీసుల దర్యాప్తు బుచ్చయ్య హత్యపై పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల బుచ్చయ్య తన భూమిని కుమారులకు పంచారు. అలాగే గ్రామంలోని గంగదేవమ్మ ఆలయానికి కులపెద్ద (చైర్మన్) పదవికి లక్ష రూపాయలు పాటపాడి పదవి దక్కించుకున్నారు. గతంలో వివాహేతర సంబంధం విషయంలో ఒకసారి ఘర్షణ జరిగింది. దాంతో పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఎంతో కసితో హత్య బుచ్చయ్యపై ఎంతో కసితో హత్య జరిగినట్లు మృతదేహాన్ని బట్టి చూస్తే అర్ధమవుతుంది. బుచ్చయ్య ముఖంపై గొడ్డలితో ఎక్కడికక్కడ నరికారు. దీంతో ముఖం చిద్రమైంది. అలాగే ఆయన ముఖం, ఒంటిపై 7 గొడ్డలి గాట్లు ఉన్నాయి. ఇంత కసితో ఎందుకు చంపారనేది చర్చనీయాంశమైంది. ప్రత్యేక బృందం ఏర్పాటు బుచ్చయ్య హత్యకేసును చేధించడానికి డీఎస్పీ నాగేశ్వర్రావు, సీఐ శ్రీనివాస్ ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేయిస్తున్నారు. శవానికి తుంగతుర్తి ఆసుపత్రిలో పోస్టుమార్టం జరిపించి గ్రామంలో దహన సంస్కారాలు నిర్వహించారు. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థుల మృతి
మునగాల(కోదాడ): అతివేగం ముగ్గురు విద్యార్థుల ప్రాణాలను బలిగొంది. విహారయాత్ర.. విషాదాంతమైంది. మొత్తం 16 మంది విద్యార్థులు.. 2 కార్లలో ఏపీలోని గుంటూరు జిల్లా బాపట్ల బీచ్‌కు విహారయాత్రకు వెళ్లారు. రాత్రి కావడంతో తిరుగుపయనమయ్యారు. అంతలో వీరు ప్రయాణిస్తున్న ఓ కారు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు అక్కడే మృతిచెందగా, మరొకరు సూర్యాపేట ఏరియా ఆస్పత్రి లో చనిపోయారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యా యి. సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఇందిరానగర్ శివారులోని జాతీయ రహదారిపై సోమవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ ఇబ్రహీంపట్నంలో ఉన్న గురునానక్ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న 16 మంది విద్యార్థులు ఆదివారం గుంటూరు జిల్లా బాపట్లకు 2 కార్లలో వెళ్లారు. తిరిగి సోమవారం హైదరాబాద్‌కు బయలుదేరారు. ఒక కారులో ఏడుగురు, మరో కారులో 9మంది ఉన్నారు. ఏడు గురు ఉన్న మరో కారు మునగాల మండలం ఇందిరానగర్ శివారులోకి రాగానే ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో హర్ష (24) అనే విద్యార్థి కారు నుంచి ఎగిరి రోడ్డుపై పడి చనిపోయాడు. డ్రైవింగ్ చేస్తున్న రేవంత్ (24) కారులోనే ఇరుక్కుపోయి మృతిచెందాడు. మరో విద్యార్థి శశాంక్ (26)ను సూర్యా పేట ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమించి మృతిచెందాడు. కారులో ప్రయా ణిస్తున్న ప్రణీత్, ఆసిఫ్, అజయ్, నిఖిల్ అనే విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యా యి. వీరికి సూర్యాపేట ఏరియా ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యంకోసం హైదరాబాద్ తరలించారు. మృతుల్లో రేవంత్‌ది హైదరాబాద్‌లోని చంపాపేట్ కాగా, హర్ష బాలాపూర్, శశాంక్ సికింద్రాబాద్ వాసిగా పోలీసులు గుర్తించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. -
డ్రైవర్ గురునాథానికి కన్నీటి వీడ్కోలు
గరిడేపల్లి: తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం ఘటనలో తీవ్ర గాయాలపాలై మరణించిన ఆమె డ్రైవర్ కామళ్ల గురునాథానికి గ్రామస్తులు కన్నీటి వీడ్కోలు పలికారు. మంటల్లో చిక్కుకున్న తహసీల్దార్‌ను కాపాడబోయి తీవ్రగాయాలతో చికిత్స పొందుతూ గురునాథం మంగళవారం మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన భౌతికకాయాన్ని స్వగ్రామమైన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం వెలిదండకు అదేరోజు రాత్రి తీసుకువచ్చారు. బుధవారం బంధుమిత్రులు కడసారి గురునాథం భౌతికకాయాన్ని చూసి కన్నీళ్లు పెట్టారు. నల్లగొండ, సూర్యాపేట తహసీల్దార్ల సంఘం అధ్యక్షులు షేక్ మౌలానా, షేక్ జమీరుద్దీన్, గరిడేపల్లి తహసీల్దార్ హెచ్.ప్రమీల గురునాథం భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. రూ.20 వేల సాయాన్ని అతని కుటుంబ సభ్యులకు సంఘం తరఫున అందించారు. అక్క అన్న అభిమానంతో కాపాడే సాహసం చేశాడు పేద కుటుంబానికి చెందిన గురునాథం తహశీల్దార్ విజయారెడ్డి వద్ద నమ్మకంగా పనిచేసేవాడని, ఆమెను అక్కా అని ఆప్యాయంగా పిలుస్తుండేవాడని బంధువులు తెలిపారు. అందుకే మంటల్లో చిక్కుకున్న విజయారెడ్డి ప్రాణాలను కాపాడేందుకు తన ప్రాణాలను సైతం లెక్క చేయలేదని చెప్పారు. -
హుజూర్‌నగర్‌లో రేపు సీఎం కేసీఆర్ ప్రచారం
సాక్షి, సూర్యాపేట : ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం జరిగే బహిరంగ సభకు తొలిసారిగా ముఖ్యమంత్రి కేసీఆర్ రానుండడంతో అందరి దృష్టి హుజూర్నగర్ వైపే ఉంది. ఆర్టీసీ సమ్మె ఉధృతమవుతున్న నేపథ్యంలో.. ఉద్యోగ సంఘాలు కూడా వారికి మద్దతు తెలపడంతో రేపు జరగబోయే సభలో ఆర్టీసీ సమ్మెకు సంబంధించిన ప్రకటన ఏమైనా ఉంటుందా? అనే అంశం ఆసక్తిగా మారింది. బహిరంగ సభలో కేసీఆర్ ఏమి మాట్లాడబోతున్నారని.. ప్రతిపక్ష పార్టీలు ఎదురు చూస్తున్నాయి. హుజూర్‌నగర్‌కు వరాల జల్లు కురిపించే అవకాశం ఉన్న తరుణంలో.. సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు. అలాగే ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. కార్మికులను ముందస్తు అరెస్టులు చేస్తే ప్రజల్లో వ్యతిరేకత రావచ్చని టీఆర్ఎస్ నేతలు సందిగ్ధంలో ఉన్నారు. మరో వైపు సీపీఐ మద్దతు ఉపసంహరణ నేపథ్యం, టీఆర్ఎస్పై బీజేపీ చేస్తున్న ఆరోపణలు అన్నింటికి రేపు సీఎం కేసీఆర్ సమాధానం చెప్పే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఇక ఉపఎన్నిక ప్రచార గడువు సమీపిస్తుండడంతో పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తుతున్నాయి. ఉప ఎన్నికల ఇంచార్జీ పల్లా రాజేశ్వర్ రెడ్డి నేతృత్వంలో.. 70 మంది నేతలతో టీఆర్ఎస్ ప్రచారంలో పాల్గొంటూ ఓటర్లను ఆకట్టుకునే దిశగా ప్రచారం చేస్తుంది. ఇప్పటికే కేటీఆర్ రోడ్ షో ముగిసింది. ఎంత మంది బలమైన నేతలు ప్రచారం చేసినా.. కేసీఆర్ ప్రచారంపైనే టీఆర్ఎస్ నేతలు ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. -
హుజూర్‌నగర్‌పై బులెటిన్ విడుదల చేసిన ఈసీ
సాక్షి, సూర్యాపేట : హుజూర్ నగర్ ఉపఎన్నికల ప్రచారంలో అభ్యర్థుల ఖర్చుల వివరాలు, కేసులు, నగదు, పట్టుబడిన మద్యం వంటి వివరాలతో కూడిన బులిటెన్ ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి చంద్రయ్య ఆదివారం విడుదల చేశారు. మొత్తం ప్రచార వాహనాల సంఖ్య - 104 ఇప్పటి వరకు పట్టుకున్న నగదు : రూ.72,29,500 సీజ్ చేసిన మద్యం : 7000లీటర్ల కోడ్ ఉల్లంఘన కేసులు: 10 సి విజిల్ యాప్ ద్వారా నమోదైన కేసులు సంఖ్య: 15 కాగా, కేవలం మఠంపల్లి మండలంలోనే రూ. 1,25,200 మద్యం పట్టుబడడం గమనార్హం. అభ్యర్థులు ప్రచారం కోసం చేసిన ఖర్చు: టిఆర్ఎస్ - శానంపూడి సైదిరెడ్డి - రూ.8,65,112 కాంగ్రెస్ - పద్మావతి రెడ్డి - రూ.5,27,621 బీజేపీ - కోట రామారావు - రూ.4,22,258 స్వతంత్ర అభ్యర్థి - తీన్మార్ మల్లన్న - రూ.3,73,945. టిడిపి - చావా కిరన్మయి - రూ.3,46,968 స్వతంత్ర అభ్యర్థి దేశగాని సాంబశివ గౌడ్ - రూ. 10360 -
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఐ సస్పెన్షన్
సాక్షి, సూర్యాపేట : ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఎన్నికల్లో అభ్యర్థుల తరపున వకల్తా పుచ్చుకుని ప్రచారం చేసిన ఉద్యోగిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం కల్మెట్ తండాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నందుకు సీఐ సైదానాయక్ పై సస్పెన్షన్ వేటుపడింది. అతను గద్వాల్ జోగులాంబ జిల్లా డీసీఆర్బీలో సీఐగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 6 నుంచి 10 వరకు అతను విధులకు హాజరుకాకుండా హుజూర్నగర్ ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొన్నారన్న ఆరోపణలపై నిజామాబాద్ రేంజ్ డీఐజీ ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. -
హుజూర్‌నగర్‌లో ప్రచార జోరు పెంచిన ప్రధాన పార్టీలు
సాక్షి, సూర్యాపేట: హుజూర్నగర్ ఉప ఎన్నికల సమరంలో ప్రచారం హోరెత్తుతోంది. దసరా రోజు కూడా ప్రధాన రాజకీయ పార్టీలు మండలాల్లో జోరుగా ప్రచారం చేశాయి. పోలింగ్‌కు ఇక పది రోజుల సమయమే ఉండడంతో ఆయా పార్టీ అగ్రనేతలను ప్రచారానికి దింపే షెడ్యూల్ ఖరారు చేసుకున్నాయి. ఈ నెల 11 నుంచి 13 వరకు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో మంత్రి కేటీఆర్ రోడ్ షోలు నిర్వహించనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. అలాగే 18న సీఎం కేసీఆర్ హుజూర్‌నగర్‌లో నిర్వహించే బహిరంగ సభకు హాజరుకానున్నట్లు సమాచారం. కాంగ్రెస్ నుంచి ఏఐసీసీ నేతలు, బీజేపీ నుంచి ఆపార్టీ జాతీయ నేతలు ప్రచారానికి రానున్నట్లు తెలిసింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తెలంగాణ జనసమితి, టీఆర్ఎస్కు సీపీఐ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు మద్దతిచ్చాయి. అలాగే సీపీఎం అభ్యర్థి నామినేషన్‌ను తిరస్కరించడంతో తెలంగాణ ప్రజా పార్టీ అభ్యర్థి దేశగాని సాంబశివగౌడ్‌కు ఆపార్టీ మద్దతు తెలిపింది. ఇక బీజేపీ, టీడీపీ ఒంటరిగా బరిలోకి దిగాయి. మొత్తం 28 మంది పోటీలో ఉంటే 13 మంది పార్టీల అభ్యర్థులు కాగా 15 మంది ఇండిపెండెంట్లు. అన్ని ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు కొంత మంది ఇండిపెండెంట్లు కూడా ఈ ఎన్నికల్లో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ నెల 21న పోలింగ్ కావడంతో ప్రచారం ఈ నెల 19న సాయంత్రంతో ముగియనుంది. ‘మేము అదిచేస్తాం.. ఇది చేస్తాం’ అంటూ అభ్యర్థుల ప్రచా రం, కళా బృందాల సందడితో ఉదయం నుంచి రాత్రి వరకు నియోజకవర్గంలోని పల్లెలు, పట్టణాలు మార్మోగుతున్నాయి. మళ్లీ వస్తున్న గులాబీ బాస్‌లు.. పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈనెల 4న హుజుర్నగర్లో రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమం భారీగా విజయవంతం అయిందని, గెలుపు తమదేనని టీఆర్ఎస్ కేడర్ ధీమాగా ఉంది. ఈనెల 11 నుంచి 13 వరకు మూ డు రోజులు నియోజకవర్గంలోని అన్ని మం డాల్లో కేటీఆర్ రోడ్ షో నిర్వహిం చనున్నారు. 11న సాయంత్రం 4 గంటలకు పాలకవీడు మం డలం జాన్‌పహాడ్, 5 గంటలకు నేరేడుచర్ల మం డలం, పట్టణం, 12న సాయంత్రం 5 గంటలకు చింతలపాలెం, 6 గంటలకు మేళ్లచెరువు, 13న సాయంత్రం 4 గంటలకు మఠంపల్లి, 6 గంటలకు గరిడేపల్లి మండలాల్లో రోడ్ షో నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో చివరిగా సీఎం కేసీఆర్ బహిరంగ సభ హుజూర్‌నగర్‌లో పెట్టేం దుకు పార్టీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. కేటీఆర్ రోడ్ షోలు, కేసీఆర్ సభలతో పార్టీ కేడర్ జోష్‌తో ఎన్నికలకు సమాయత్తం కానుందని... నేతలు అభిప్రాయం వ్యక్తంచేశారు. జోరుగా కాంగ్రెస్ నేతల ప్రచారం.. తమ అభ్యర్థి విజయాన్ని కాంక్షిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని దూకుడుగా చేస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పార్టీ అభ్యర్థి పద్మావతి రోజుకు రెండు మండలాల్లో ప్రచారం చేస్తున్నారు. ఉదయం నుంచే ఇరువురు నేతలు ప్రజా క్షేత్రంలోకి వెళ్లి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. దసరా పండుగకు ముందు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నేరేడుచర్ల మండలం, బుధవారం గరిడేపల్లి మండలంలో మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి ప్రచారం చేశారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, పలు జిల్లాల డీసీసీ అధ్యక్షులు ఇప్పటి వరకు ప్రచారంలో పొల్గొన్నారు. వీరితో పాటు ఏఐసీసీ నుంచి ముఖ్య నేతలు ఈ వారం రోజులు హుజూర్‌నగర్‌లోనే ఉండి ప్రచారం చేయనున్నట్లు తెలిసింది. పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, రాష్ట్ర ముఖ్య నేతలతో పాటు ఏఐసీసీ నేతలను ఆహ్వానించి భారీ బహిరంగ సభ పెట్టనన్నట్లు సమాచారం. గత నెల 30న నామినేషన్ వేసిన సందర్భంగా హుజూర్‌నగర్‌లో పెట్టిన సభ సక్సెస్ అయిందని, మరో సభతో తమ సత్తా ఏంటో చూపిస్తామని కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. బీజేపీ..టీడీపీ.. ఇండిపెండెంట్లు సై.. ఈ ఎన్నికల్లో బీజేపీ,టీడీపీ, ఇండిపెండెంట్ అభ్యర్థులు ప్రచారాన్ని కదంతొక్కిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులు ఇప్పటి వరకు ప్రచారంలో పొల్గొన్నారు. ప్రచారం ముగిసే లోపు బహిరంగ సభ పెడతామని, ఈ సభకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి రానునున్నారని ఆ పార్టీ నాయకులు తెలిపారు. అలాగే టీడీపీ అభ్యర్థి తరఫున పార్టీ తెలంగాణ ప్రెసిడెంట్ ఎల్.రమణ ప్రచారం చేశారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు తీన్మార్ మల్లన్న, దేశగాని సాంబశివగౌడ్లు రోజుకో మండలంలో ప్రచారం చేస్తూ ముందుకెళ్తున్నారు. ప్రచార రథాలు ఏర్పాటు చేసుకొని జోరుగా ప్రచారం చేసుకుంటూ ప్రధాన పార్టీల అభ్యర్థులను హడెలెత్తిస్తున్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్తో పా టు.. బీజేపీ,టీడీపీ, ఇండిపెండెంట్లు నువ్వా.. నేనా అన్నట్లుగా ప్రచారంలో మరింత దూకుడు పెంచారు. -
పాప వైద్యానికి కేటీఆర్ భరోసా
సాక్షి, సూర్యాపేట: బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న సూర్యాపేటకు చెందిన చిన్నారికి వైద్య ఖర్చులకోసం మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం భరోసా ఇచ్చారు. సూర్యాపేట ఇందిరమ్మ కాలనీకి చెందిన వల్ధాసు ఉపేందర్ ఎనిమిది సంవత్సరాల కూతురు భూమిక కొద్ది రోజుల క్రితం అనారోగ్యం బారిన పడింది. దాంతో సూర్యాపేటలోని హాస్పిటల్లో చికిత్స నిర్వహించినా ప్రయోజనం లేకుండా పోయింది. దాంతో హైదరాబాద్ తీసుకెళ్లడంతో బ్రెయిన్ ట్యూమర్ అని తేలింది. వైద్య ఖర్చులకు రూ.ఎనిమిది లక్షల ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు. ట్రైలర్ వృత్తే జీవనాధారంగా కాలం వెళ్లదీస్తున్న పాప తల్లిదండ్రులు విషయం తెలిసి రోదిస్తున్నారు. ఆర్థికసాయం అందించాలని దాతలను వేడుకోవడంతో సూర్యాపేటకు చెందిన వారి మిత్రుడు శైలేంద్రాచారి పాప పరిస్థితిని ట్విట్టర్లో కేటీఆర్‌కు తెలిపారు. దాంతో ఆయన వెంటనే స్పందించారు. పాపకు సంబంధించినవారిని వెంటనే తన ఆఫీస్‌కు రమ్మని ఆహ్వానించారు. దీంతో పాప తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. -
కేటీఆర్ రోడ్ షో పేలవంగా ఉంది: పొన్నం
సాక్షి, సూర్యాపేట: హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం.. కేటీఆర్ నిర్వహించిన రోడ్‌షో పేలవంగా ఉందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం పొన్నం మీడియాతో మాట్లాడుతూ.. హుజూర్నగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిస్తే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నిలబడుతుందని, టీఆర్ఎస్ వస్తే.. అప్పులు రెట్టింపు అవుతాయని వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండానే.. కేటీఆర్ ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ హంగు, ఆర్భాటాలే తప్ప.. ఎక్కడా అభివృద్ధి జరుగలేదని పేర్కొన్నారు. కాగా, హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి తరుఫున జరిగిన రోడ్ షోలో పొన్నం పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వ పోకడ వల్లనే ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు దిగారని పొన్నం విమర్శించారు. కేసీఆర్ కావాలనే టీఎస్ఆర్టీసీని నిర్వీర్యం చేసి, భారీ నష్టాల్లో కూరుకుపోయిందని లెక్కలు చూపి సంస్థను ప్రైవేట్ పరం చేయాలనీ చూస్తున్నారని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో ప్రశ్నించే గొంతుక లేకుండా చేయాలనీ కేసీఆర్ చూస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో మాదిరిగానే.. తెలంగాణలో కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. -
హుజుర్నగర్ ఉప ఎన్నిక; ఈసీ కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని హుజుర్నగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. సూర్యాపేట జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లుపై బదిలీ వేటు వేసింది. హెడ్‌క్వార్టర్‌లో రిపోర్ట్ చేయాలని, ఎన్నికల సంబంధించిన విధులు ఆయనకు కేటాయించవద్దని ఉన్నతాధికారులకు ఈసీ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఆయన స్థానంలో 2012 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఆర్. భాస్కరన్‌ను సూర్యాపేట జిల్లా ఎస్పీగా నియమించింది. భాస్కరన్ ప్రస్తుతం భూపాలపల్లి ఎస్పీగా పనిచేస్తున్నారు. హుజుర్నగర్లో గెలుపు కోసం టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని బీజేపీ ఫిర్యాదు చేసిన మరుసటి రోజే కేంద్ర ఎన్నికల సంఘం స్పందించడం విశేషం. మంత్రులు జిల్లా ఎస్పీ, కలెక్టర్‌ను అడ్డుపెట్టుకుని హుజుర్నగర్లో డబ్బు పంపిణీ చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ గురువారం ఢిల్లీలో ఈసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు భూమన్నపై పోలీసుల అక్రమ కేసులు పెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. (చదవండి: ‘హుజుర్నగర్’పై ఈసీకి బీజేపీ ఫిర్యాదు) -
కాంగ్రెస్‌కు టీజేఎస్, టీఆర్ఎస్కు సీపీఐ మద్దతు
సాక్షి, సూర్యాపేట: హుజూర్నగర్ ఉపఎన్నిక అంకం నామినేషన్ల ఉపసంహరణకు చేరుకుంది. ఈ ప్రక్రియతో ఈ ఎన్నికల బరిలో ఎంతమంది ఉన్నారో నేడు (గురువారం) తేలనుంది. బలమైన కొందరు ఇండిపెండెంట్లను ప్రధాన పార్టీ లు బుజ్జగించాయి. నామినేషన్ ఉపసంహరించుకొని తమతో ప్రచారం నిర్వహించా లని చర్చలు జరిపాయి. ఇక ఉప ఎన్నికతో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ సమీకరణలు అనూహ్యంగా మారాయి. టీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నట్లు సీపీఐ ఇప్పటికే ప్రకటించగా, కాంగ్రెస్‌కు తమ మద్దతని తెలం గాణ జన సమితి తేల్చి చెప్పింది. తమ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణతో సీపీఎం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ప్రధాన పార్టీల అభ్యర్థులు నువ్వా..నేనా అన్నట్లు ప్రచారం చేస్తున్నారు. హస్తం వైపు టీజేఎస్.. ఉప ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ సీపీఐ, టీజేఎస్ నేతలతో మంతనాలు చేసింది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఈ రెండు పార్టీలు ఆందోళన చేస్తున్నాయని, తమకు మద్దతు తప్పకుండా లభిస్తుందని కాంగ్రెస్ ఆశించింది. సీపీఐతో టీఆర్ఎస్ కూడా చర్చలు చేయడంతో ఆ పార్టీ.. టీఆర్ఎస్కే మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇక మిగిలిన టీజేఎస్ పలుమార్లు రాష్ట్ర ముఖ్య నేతలతో సమావేశమై చివరకు కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నట్లు నిర్ణయం వెలువరించింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఈ నెల 4న హుజూర్నగర్ రానున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు కుంట్ల ధర్మార్జున్ తెలిపారు. నియోజకవర్గ ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమావేశమై కాంగ్రెస్‌కు మద్దతుగా చేయాల్సిన ప్రచార ప్రణాళికపై చర్చించనున్నట్లు తెలిసింది. టీజేఎస్ మద్దతు ఇవ్వడంతో తమ బలం మరింత పెరిగిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు భావిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండేందుకు ఆ పార్టీ తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్‌కు లాభిస్తుందని చర్చించుకుంటున్నారు. కారెక్కిన.. కంకికొడవలి.. టీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్‌రెడ్డి ప్రకటించారు. తమ పార్టీకి ఉప ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని టీఆర్ఎస్ నేతలు.. సీపీఐ నేతలతో చేసిన చర్చలు సఫలమయ్యాయి. గత ఎన్నికలతో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలమయ్యాని అప్పటికి, ఇప్పటికి క్షేత్రస్థాయిలో తమ బలం పెరిగిందని విజయం తమదేనని టీఆర్ఎస్ ధీమాగా ఉంది. సీపీఐతో పాటు మాలమహానాడు కూడా పార్టీకి మద్దతు తెలపడంతో మెజార్టీ పెరుగుతుందని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో నియోజకవర్గంలో ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. ఈ నెల 4న పురపాలక, ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు హుజూర్‌నగర్‌లో రోడ్డు షోకు హాజరవుతున్నారని, నియోజవర్గ వ్యాప్తంగా శ్రేణులు తరలిరావాలని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ రోడ్డు షోలో సీపీఐ, మాల మహానాడు నేతలు కూడా పాల్గొనున్నారు. టీడీపీకి రాజీనామా చేసిన కొంతమంది నియోజకవర్గ నేతలు కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరనున్నట్లు తెలిసింది. బీజేపీ..టీడీపీ ఒంటరి పోరు.. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో ఒంటరి పోరుకు దిగాయి. ఈ రెండు పార్టీల నేతలు ఏ గ్రామం, మండల కేంద్రాల్లో తమ వాస్తవ బలం ఎంత ఉందో అంచనావేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రచారం అస్త్రంగా బీజేపీ చేసుకుంది. బరిలో ఉన్న అభ్యర్థి సామాజిక వర్గం ఓట్లు నియోజకవర్గంలో భారీగా ఉన్నాయని, ఈ ఓట్లతో పాటు ఇతర కులాల ఓట్లు తమ గెలుపునకు నాంది అని ఆపార్టీ నేతలు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. టీడీపీకి ఎన్ని ఓట్లు పడతాయన్నది రాజకీయంగా చర్చ సాగుతోంది. సీపీఎం అభ్యర్థి పారేపల్లి శేఖర్‌రావు నామినేషన్ తిరస్కరణ కావడంతో పార్టీ నిర్ణయమేంటో తేల్చలేదు. జిల్లా నేతల అభిప్రాయం తీసుకొని రాష్ట్ర కమిటీ నిర్ణయం ప్రకటించనున్నట్లు తెలిసింది. బలమైన ఇండిపెండెంట్లకు బుజ్జగింపులు.. గత ఎన్నికల్లో పోటీ చేసి తమ విజయావకాశాలు దెబ్బ కొట్టడం, గెలిచినా మెజార్టీకి గండికొట్టిన బలమైన ఇండిపెండెంట్లు కొందరిని ప్రధాన రాజకీయ పార్టీలు బుజ్జగించినట్లు సమాచారం. ఈ ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుండడంతో విజయంతో పాటు మెజార్టీని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 31మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం పొందితే ఇందులో 18మంది ఇండిపెండెంట్లు కాగా, 13మంది రాజకీయ పార్టీల అభ్యర్థులు. ఇండిపెండెంట్లలో గత ఎన్నికల్లో పోటీ చేసి ఎక్కవ ఓట్లు పడిన వారిని తమ వైపునకు రావాలని బుజ్జగించి నామినేషన్ ఉపసంహరించుకునేందుకు వారితో రాజకీయ పార్టీల నేతలు చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే నామినేషన్ల ఉపసంహరణతో ఎంతమంది బరిలో ఉండనున్నారో గురువారం తేలనుంది. -
45..నామినేషన్ల తిరస్కరణ
సాక్షి, సూర్యాపేట: హుజూర్నగర్ ఉపఎన్నిక నామినేషన్ల పరిశీలన తంతు పూర్తయింది. హోరాహోరీగా జరిగిన నామినేషన్ల పర్వంలో పలు కారణాలతో 45మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించారు. 31మంది అభ్యర్థుల నామినేషన్లను అంగీకరించారు. ప్రధాన రాజకీయ పార్టీల్లో సీపీఎం అభ్యర్థికి ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీ అభ్యర్థి పారేపల్లి శేఖర్‌రావు నామినేషన్‌ను తిరస్కరణకు గురైంది. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, బీఎల్ఎఫ్ అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం పొందాయి. గురువారం నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఎంత మంది అభ్యర్థులు ఉపపోరు బరిలో ఉండనున్నారో తేలనుంది. మిగిలింది.. 31మంది అభ్యర్థులు.. ఉప ఎన్నికలో బరికి 76మంది అభ్యర్థులు మొత్తం 119నామినేషన్ సెట్లు వేశారు. ఇందులో ఒక్కొక్కరు నాలుగు సెట్ల చొప్పున ఏడుగురు, ఐదుగురు మూడు సెట్లు, 12మంది రెండు సెట్ల చొప్పున, మిగతా అభ్యర్థులు ఒక్కో సెట్ నామినేషన్ వేశారు. అఫిడవిట్ సరిగా నింపలేదని, సంతకాలు చేయలేదని, కావాల్సిన పత్రాలు జత చేయలేదని, ఇలా పలు కారణాలతో 45మంది అభ్యర్థుల నామినేష్లు తిరస్కరించారు. అన్ని సరిగా ఉండడంతో 31మంది అభ్యర్థుల నామినేషన్లకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి చంద్రయ్య ఆమోదం తెలిపారు. ప్రధాన రా జకీయ పార్టీల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నలమాద పద్మావతిరెడ్డి, బీజేపీ నుంచి డాక్టర్ కోట రామారావు, టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సై దిరెడ్డి, బీఎల్ఎఫ్ అభ్యర్థి మేడి రమణ, తెలం గాణ ఇంటిపార్టీ మద్దతుతో బరిలోకి దిగిన స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న, టీడీపీ అభ్యర్థి చావా కిరణ్మయి, తెలంగాణ ప్రజా పార్టీ అభ్యర్థి సాం బశివరావుగౌడ్ నామినేషన్లు అంగీకరించారు. ఇండిపెండెంట్లు.. ఇతర పార్టీలు.. ఇండిపెండెంట్లు ఇతర పార్టీల వారీగా చిలువేరు శ్రీకాంత్, మేఖల రఘుమారెడ్డి, మారం వెంకట్‌రెడ్డి, వంగపల్లి కిరణ్, నందిపాటి జానయ్య, మేకల వెంకన్న, అజ్మీరా మహేష్, శాంతిదసరాం నాయక్, భూక్యా కృష్ణానాయక్, సపావత్ సుమన్, అలదాసు సుధాకర్, కొప్పుల ప్రతాప్‌రెడ్డి, రేఖల సైదులు, గుగులోతు శంకర్, ఆరెపు వివేకానంద, తంగిళ్ల జనార్దన్, బండారు నాగరాజు, జాజుల భాస్కర్, వీసం రాములు, పి.క్రాంతికుమార్, పాండుగౌడ్, రాయల సుమన్, ఎం. సుదర్శన్, నందిపాటి వినోద్‌కుమార్‌ల నామినేషన్లు ఆమోదం పొందిన ట్లు సమాచారం. అలాగే సర్పంచ్ల ఫోరం నుంచి నామినేషన్ వేసిన వారిలో నాగర్‌కర్నూల్ జిల్లా తండ్రికల్ సర్పంచ్ తాళ్ల పాండుగౌడ్ నామినేషన్ ఒక్కటే ఆమోదం పొందింది. నామినేషన్లు తిరస్కరించిన వారిలో.. రాజకీయ పార్టీల వారీగా చూస్తే సీపీఎం అభ్యర్థి పారేపల్లి శేఖర్‌రావు నామినేషన్ తిరస్కరించారు. దీంతో శేఖర్‌రావుతో పాటు ఆ పార్టీ నాయకులు నామినేషన్ కేంద్రం వద్ద ధర్నా చేశారు. ఆ తర్వాత కొద్ది సేపటికి ఎన్నికల పరిశీలకులు సచింద్రప్రతాప్‌సింగ్ రావడంతో.. తిరస్కరణకు గురై అభ్యంతరం చెప్పిన అభ్యర్థులకు సంబంధించిన నామినేషన్లు మరో సారి పరిశీలించాలని ఎన్నికల అధికారులకు చెప్పారు. పలు కారణాలతో చివరకు శేఖర్‌రావు నామినేషన్ తిరస్కరించారు. బలమైన ఇండిపెండెంట్లపై నజర్.. నామినేషన్లు ఆమోదం పొందిన వారిలో బలమైన అభ్యర్థులు ఎవరని ప్రధాన పార్టీలు ఆరా తీస్తున్నాయి. వారిని తమ వైపునకు తిప్పుకుంటే కొన్నైనా ఓట్లు రాలుతాయని ప్రధాన పార్టీల అభ్యర్థులు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే వారికి వచ్చిన ఓట్లు ఎన్ని, ఇప్పుడు ఎన్ని ఓట్లు పడే అవకాశం ఉందని.. లెక్కలు వేస్తున్నారు. వారి మద్దతు తమకుంటే గెలుపునకు కొంతైనా దోహదం అవుతుందని అభ్యర్థులు వారిపై నజర్ పెట్టించారు. ఉప బరి ప్రధాన పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా సాగుతుండడంతో ఎవరు గెలిచినా మెజార్టీ అంత ఎక్కువ ఉండదని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇండిపెండెంట్లు ఈ ఎన్నికల్లో కీలకమయ్యారు. -
హోరెత్తిన హుజూర్నగర్
సాక్షి, సూర్యాపేట: చివరి రోజు నామినేషన్లతో హుజూర్నగర్ హోరెత్తింది. రాజకీయ పార్టీలతో పాటు, సతంత్ర అభ్యర్థులు, నిరుద్యోగ జేఏసీ నుంచి నామినేషన్లు దాఖలయ్యాయి. ఉదయం 11 గంటల నుంచి హుజూర్నగర్ అభ్యర్థులు, ఆయా పార్టీల ముఖ్య నేతలు, కేడర్‌తో జనసంద్రమైంది. పోలీసులు ఎక్కడికక్కడ భారీ బందోస్తు చేపట్టారు. నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. నోటిఫికేషన్ విడుదలైన గత నెల 23 నుంచి చివరి రోజు వరకు మొత్తం 76 మంది అభ్యర్థులు 119 నామినేషన్లు వేశారు. ఇందులో కొంతమంది అభ్యర్థులవి రెండు, మూడు నామినేషన్ సెట్లు ఉన్నాయి. తరలివచ్చిన ముఖ్యనేతలు.. తమ పార్టీల అభ్యర్థుల నామినేషన్లకు ముఖ్య నేతలు తరలివచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థిగా నలమాద పద్మావతిరెడ్డి నామినేషన్ వేశారు. ఆపార్టీ సాయంత్రం బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే భట్టివిక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి సలీంఅహ్మద్, మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ, ఎమ్మెల్యే సీతక్క పాల్గొన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి వెంట విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్య, చిరుమర్తి లింగయ్య, భాస్కర్‌రావులు వెళ్లి నామినేషన్ వేయించారు. అలాగే బీజేపీ అభ్యర్థి డాక్టర్ కోటరామారావు నామినేషన్ వేయడానికి ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, స్థానిక నేతలు హాజరయ్యారు. సీపీఎం అభ్యర్థిగా పారేపల్లి శేఖర్‌రావు, బీఎల్ఎఫ్ అభ్యర్థిగా మేడి రమణ, టీడీపీ అభ్యర్థిగా చావా కిరణ్మయి, స్వతంత్ర అభ్యర్థిగా తీన్మాన్ మల్లన్న నామినేషన్లు వేశారు. నామినేషన్ల తీరును ఎన్నికల పరిశీలకులు సచింద్ర ప్రతాప్‌సింగ్, జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ అమయ్కుమార్లు దగ్గరుండి పరిశీలించారు. బరిలో ఉండేది ఎంతమందో.. 76 మంది అభ్యర్థులు నామినేషన్ వేయడంతో బరిలో ఉండేది ఎంత మందో ఈనెల 3న నామినేషన్ల ఉపసంహరణతో తేలనుంది. ప్రధాన పార్టీలతో పాటు.. చిన్నాచితక పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులుగా చాలా మంది నామినేషన్లు వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎన్నికపై జోరుగా చర్చ జరుగుతండడంతో ఎంతమంది నామినేషన్లు వేస్తారన్న చర్చ జోరుగా సాగింది. చివరకు 76 మంది నామినేషన్లు వేయడంతో ఎన్నికల అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే తమను నామినేషన్లు వేయనివ్వలేదని సర్పంచ్ల ఫోరం సభ్యులు నిరసన వ్యక్తంచేశారు. 30 మందికి టోకెన్లు ఇస్తే కేవలం ఆరుగురిని మాత్రమే నామినేషన్ వేయించారని, అందులో నలుగురివి ఆ పత్రాలు.. ఈ పత్రాలు లేవని తిరస్కరించారని ఆ సంఘం సభ్యులు మీడియా ఎదుట ఆవేదనవ్యక్తంచేశారు. న్యాయవాదులు నామినేషన్లు వేస్తారని ప్రచారం సాగినా.. వారు నామినేషన్లు వేయలేదు. నామినేషన్లే వేసిన 76 మంది అభ్యర్థుల్లో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు, ఆమ్ ఆద్మీపార్టీ అభ్యర్థిగా లింగిడి వెంకటేశ్వర్లు, తెలంగాణ సోషల్ పొలిటికల్ ఫ్రంట్ అభ్యర్థిగా శంకర్చౌహాన్, బహుజన ముక్తి పార్టీ నుంచి శాంతిరాందాస్నాయక్, తెలంగాణ ప్రజా పార్టీ అభ్యర్థిగా డాక్టర్ సాంబశివగౌడ్తో పాటు పలువురు నామినేషన్లు వేశారు.గత ఎన్నికల్లో ట్రక్కు గుర్తు వచ్చిన మేకల రఘుమారెడ్డి ఈ సారి కూడా తెలంగాణ రిపబ్లికన్ పార్టీ నుంచి నామినేషన్ వేశారు. కేడర్‌లో జోష్.. నామినేషన్‌కు ఆయా పార్టీల కేడర్ భారీగా తరలివచ్చింది. అభ్యర్థులు నామినేషన్‌కు వెళ్తుండగా కాంగ్రెస్, టీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేశారు. బీజేపీ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించింది. సీపీఎం ఏర్పాటు చేసిన సభకు ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హాజరయ్యారు. అన్ని పార్టీల నుంచి నామినేషన్లు వేయడం, కేడర్ తరలిరావడంతో హుజూర్నగర్ గతంలో ఎన్నికల సమయంలో ఎప్పుడూ లేనట్లు పార్టీ జెండాలతో కళకళలాడింది. కొయంబత్తూర్ నుంచి వస్తే నామినేషన్ పోయింది... హుజూర్‌నగర్‌కు చెందిన గున్రెడ్డి మాధవరెడ్డిది కొంతకాలంగా మేడ్చెల్‌లో నివాసం ఉంటున్నారు. ఉద్యోగరీత్యా తమిళనాడు రాష్ట్రం లోని కొయంబత్తూర్‌కు వెళ్లారు.తన స్వస్థలంలో ఉప ఎన్నిక జరుగుతుండడంతో నామినేషన్ వేయాలనుకున్నాడు. ఆదివారం విమానంలో హైదరాబాద్ చేరుకున్నాడు. అక్కడి నుంచి సాయంత్రం హుజూర్‌నగర్‌కు చేరాడు. ఓ న్యాయవాది ఇంటికి వెళ్లి నామినేషన్ తయారు చేసుకున్నాడు. ఇవన్నీ తీసుకొని ఆదివారం రాత్రి తన స్నేహితుడి ఇంటికి వెళ్తుండగా నామినేషన్ ఎవరో కొట్టేశారు. అందులో అతని ఒర్జినల్ సర్టిఫికెట్లు, పాస్‌పోర్టు ఉన్నాయి. అయితే తన నామినేషన్ పత్రం, ఒర్జినల్ సర్టిఫికెట్లు ఎవరో కొట్టేయడంతో నామినేషన్ వేయలేకపోయానని, దీనిపై కేసు పెట్టానని సోమవారం నామినేషన్ కేంద్రం సమీపంలో మీడియా పాయింట్ వద్ద ఆవేదనవ్యక్తంచేశారు. -
ఎన్నికల ఖర్చులు అభ్యర్థుల ఖాతాలో జమ చేస్తాం
హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఖర్చుల వివరాలు నేటి నుంచి వారి ఖాతాల్లో జమ చేస్తామని కలెక్టర్ అమయ్‌కుమార్ తెలిపారు. సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎవరైనా ప్రలోభాలకు గురిచేస్తే టోల్‌ఫ్రీ నంబర్ 18004252838, 1950కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. సీ–విజిల్ యాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. సాక్షి, హుజూర్నగర్: హుజూర్నగర్ ఉప ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థుల ఖర్చుల వివరాలు నేటి నుంచి వారి ఖాతాలలో జమ చేస్తామని కలెక్టర్ అమయ్‌కుమార్ అన్నారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు ప్రతి రోజూ జరిగిన ర్యాలీలను వీడియో తీయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో మొత్తం 14 ఫ్లయింగ్‌స్క్వాడ్ టీమ్స్, 14 స్టాటిక్ సర్వే చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామని తెలిపారు. హుజూర్నగర్ నియోజకవర్గంలో 2 వీడియో సర్వేలైన్ టీమ్‌లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు రూ.46 లక్షల 75 వేలను సీజ్ చేసినట్లు తెలిపారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లో భాగంగా ఎన్నికల సందర్భంగా టోల్ ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. ఎవరైనా ప్రలోభాలకు గురిచేస్తే టోల్‌ఫ్రీ నంబర్ 18004252838, 1950కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. సి–విజిల్ యాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. 24 గంటల పాటు జిల్లా కలెక్టరేట్, హుజూర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన టీంలు ఫిర్యాదు సెంటర్లలో పనిచేస్తున్నారని తెలిపారు. -
సూర్యాపేటలో 30 పోలీస్ యాక్ట్
సాక్షి, సూర్యాపేట : హుజుర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లు ఎస్పీ ఆర్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశామని, అక్టోబర్ 24వతేదీ వరకు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సందర్బంగా అధికారుల అనుమతి లేకుండా ఎటువంటి ధర్నాలు, రాస్తారొకో, సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించడానికి వీలులేదన్నారు. ఒకవేళ ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ఎస్పీ హెచ్చరించారు. ప్రజలకు రక్షణ, శాంతి భద్రతలకు ఎలాంటి భంగం కలగకూడదనే ఈ యాక్ట్‌ను అమలు చేస్తున్నట్లు ఎస్పీ ఉత్తర్వుల్లో వెల్లడించారు. -
ఉప ఎన్నిక ప్రచారంలో దూకుడు
సాక్షి, సూర్యాపేట : హుజూర్నగర్ ఉప ఎన్నిక ప్రచారంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ దూకుడుగా వెళ్తున్నాయి. షెడ్యూల్ విడుదలైన తర్వా త తొలిసారి టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ప్రచారంతో ఒక సారి నియోజకవర్గాన్ని చుట్టారు. కాంగ్రెస్ అభ్యర్థిగా తన సతీమణి పద్మావతిని ప్రకటించిన ఎంపీ, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విపక్షాల మద్దతు కోసం యత్నిస్తున్నారు. ఏఐసీసీ నుంచి అధికారింగా పద్మావతిని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఆమె ప్రచారంలో దిగనున్నారు. నోటిఫికేషన్ విడుదలై, నామినేషన్ల ఘట్టం ప్రారంభం కావడంతో హుజూర్నగర్ ఉప ఎన్నిక రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మోగిన టీఆర్ఎస్ ప్రచార శంఖారావం.. టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ప్రచార శంఖారావం మోగించారు. పార్టీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన మరుసటి రోజే నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఆయన ప్రసంగాల్లో కాంగ్రెస్ పార్టీ, ఉత్తమ్‌ను టార్గెట్‌గా చేసుకొని ఘాటుగా విమర్శలు చేశారు. షెడ్యూల్ వి డుదల, సైదిరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించక ముం దే గత నెల రోజుల్లో ప్రభుత్వ పరంగా పలు కార్యక్రమాలు నియోజకవర్గంలో నిర్వహించా రు. పనిలో పనిగా పార్టీలో భారీగా చేరికలతో జోష్ పెంచారు. ఈ కార్యక్రమాలకు మంత్రి జగదీశ్‌రెడ్డి హాజరై కేడర్‌లో ఉత్సాహం పెంచారు. మళ్లీ సైదిరెడ్డినే అభ్యర్థిగా ప్రకటించడంతో శ్రేణులంతా రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్తున్నాయి. ఈ పరిస్థితితో గతంలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైన టీఆర్ఎస్ ఈ సారి తమదే విజయమని ధీమాగా ఉంది. గతంలో ఓటమి చెందారన్న సానుభూతి ఈ సారి తమ పార్టీ అభ్యర్థికి ఉపకరించి విజయం దక్కుతుందని ఆపార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. మద్దతు కూడగట్టుకోవాలని.. కాంగ్రెస్ అభ్యర్థిగా పద్మావతిని ప్రకటించినా ఈ విషయంలో వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు ఆపార్టీలో దుమారం లేపాయి. రెండు, మూడు రోజుల్లో ఏఐసీసీ నుంచి అధికారికంగా మళ్లీ పద్మావతిని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ప్రచార జోరు పెంచాలని ఆపార్టీ భావిస్తోంది. ఉత్తమ్ గత పదిహేను రోజులుగా నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. సోమవారం కూడా నేరేడుచర్ల, గరిడేపల్లి, హుజూర్నగర్ మండలాల్లో ప్రచారం చేశారు. ఈ ఎన్నికల్లో విపక్షాల మద్దతు కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. సీపీఐ, సీపీఎం నేతలతో ఇప్పటికే ఉత్తమ్ మాట్లాడినట్లు సమాచారం. తెలంగాణ జన సమితి అధినేత కోదండరాంను ఉత్తమ్ కలిసి హుజూర్నగర్ ఎన్నికపై చర్చించారు. కలిసి వచ్చే పార్టీలతో వెళితే ఎంతోకొంత బలం పెరుగుతుందని ఆపార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్‌తో ఎవరు కలిసి వస్తారు.. ప్రతి పక్షాలు పార్టీలు ఎవరెవరిని బరిలో దింపనున్నాయో మూడు, నాలుగు రోజుల్లో తేలనుంది. ఎలా ముందుకెళ్లాలని.. హుజూర్నగర్ ఉప ఎన్నికలో గెలుపు, ఓటములు ఏపార్టీవని రాష్ట్ర స్థాయిలో జోరుగా చర్చసాగుతోంది. ఈ ఎన్నికల్లో ప్రచారంలో ఎలా ముందుకెళ్లాలని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, టీఆర్ఎస్ ఆలోచిస్తున్నాయి. ఉత్తమ్ ప్రాతినిధ్యం వహించిన స్థానం కావడం, ఆయన టీపీసీసీ చీఫ్‌గా ఉండడంతో ఈ స్థానం ఈ సారి తమ ఖాతాలో వేసుకోవాలని టీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. మండలానికి ఒక మంత్రి, నలుగురు ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలను ఇన్చార్జిగా పెట్టాలని ఇప్పటికే టీఆర్ఎస్ నిర్ణయించింది. నియోజకవర్గ ప్రచార బాధ్యతలు మొత్తంగా జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి భుజానకెత్తుకున్నారు. మంత్రి కేటీఆర్‌కు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారని ఇక విజయం తమదేనని ఆపార్టీ నేతలు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. హుజూర్నగ్ ఉప ఎన్నికతో ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్ నేతలు ఐక్యతారాగం అందుకున్నారు. ‘ఉత్తమ్, జానా.. నేను కలిసిపోయామని, మా మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు’ అని ఇటీవల జిల్లా పర్యటనలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించారు. అంతేకాకుండా రేవంత్ వ్యాఖ్యలపై.. ఉత్తమ్‌కు ఉమ్మడి జిల్లా నేతలు బాసటగా నిలిచారు. ఈ పరిణామాలతో ఉమ్మడి జిల్లా నేతల ఐక్యత, గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లను చూస్తే గెలుపు సునాయాసం అవుతుందని ఆపార్టీ›నేతలు పేర్కొంటున్నారు. ఉమ్మడి జిల్లా నేతలతో పాటు రాష్ట్ర స్థాయిలో ముఖ్య నేతలను ఈ ఎన్నికల్లో ప్రచారంలోకి దింపాలని ఏఐసీసీ సూచనలతో ఉత్తమ్ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఇక టీడీపీ, బీజేపీలు పోటీలో ఉంటాయా..? ఎటు వైపు వెళ్తాయన్నది తేలాల్సి ఉంది. పోలింగ్‌కు ఇంకా 28 రోజుల సమయం ఉంది. వచ్చే నెల 19న ప్రచారం ముగుస్తుంది. ఈ తక్కువ సమయంలోనే ప్రజల నాడి పట్టుకొని గెలుపు తీరం చేరాలని ప్రధాన పార్టీల నాయకులు ఎత్తుకు పై ఎత్తుల్లో మునిగారు. ముహూర్తం చూసుకొని రెండు మూడు రోజుల్లో నామినేషన్ ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా సోమవారం టీఆర్ఎస్ హుజూర్నగర్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి బీఫాం అందుకున్నారు. ఈ సందర్భంగా సీఎం ఆయనకు నియోజకవర్గంలో చేపట్టదలచిన ప్రచారంపై పలు సూచనలు చేశారు. భారీ మెజార్టీతో గెలిచిరావాలని చెప్పారు. ప్రత్యర్థి పార్టీలకు డిపాజిట్ కూడా దక్కవద్దన్నారు. రెండు మూడు రోజుల్లో మంచి ముహూర్తం చూసుకొని నామినేషన్ వేయనున్నట్లు సైదిరెడ్డి సాక్షికి తెలిపారు. -
హుజూర్‌నగర్‌లో ఆమరణ నిరాహార దీక్ష చేపడతాం
సాక్షి, సూర్యాపేట: కాంగ్రెస్ కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించి, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న పోలీసు అధికారుల తీరుకు నిరసనగా రెండు రోజుల్లో హుజూర్నగర్ సెంటర్లో సామూహిక ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని టీపీసీసీ చీఫ్, నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రకటించారు. సోమవారం సూర్యపేటలో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో గెలవడానికి మంత్రి హింసను ప్రేరేపిస్తున్నారని అన్నారు. అయితే హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్ పార్టీ సునాయసంగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏపీలో పడవ ప్రమాదంలో మృతి చెందిన వారికి కాంగ్రెస్ పార్టీ తరుపున ఆయన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా ఎస్పీ ఎస్పీకి అసలు పని చేసే అర్హత లేదని, అధికార పార్టీకి తొత్తుగా మారారని ఉత్తమ్ మండిపడ్డారు. అంతేకాక సదరు పోలీసు అధికారి తీరుపై కోర్టును ఆశ్రయిస్తామని ఆయన హెచ్చరించారు. హుజూర్‌నగర్‌లో మంత్రి జగదీశ్ రెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తూ నేరస్తులు, పోలీసుల వెంట తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఆంధ్ర అధికారులతో తెలంగాణ ప్రజలను మంత్రి వేధిస్తున్నారని ఉత్తమ్ విమర్శించారు. కాంగ్రెస్ కార్యకర్తలను భయపెట్టి, అక్రమకేసులు బనాయించి టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంటున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ పార్టీలో త్వరలోనే విస్ఫోటనం జరగనుందనీ, కేసీఆర్ తీరుఫై ఆ పార్టీ నాయకులే అసంతృప్తిగా ఉన్నారని తెలిపారు. మాదిగలకు మంత్రివర్గంలో చోటు కల్పించకుండా వారిని కేసీఆర్ అవమానించారని దుయ్యబట్టారు. -
ఉద్యోగులేరీ?
సాక్షి, సూర్యాపేట: జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల కొరత వేధిస్తోంది. కలెక్టరేట్‌తో పాటు జిల్లా కేంద్రంలో ఉన్న 64 ప్రధాన శాఖల్లో సుమారు 2వేల మంది ఉద్యోగులు ఉండాల్సి ఉండగా కేవలం 625 మందితో కాలం వెల్లదీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో సకాలంలో ఏ పనీ జరగడం లేదు. ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలుకు నోచుకోకపోగా, విధులు నిర్వహిస్తున్న సిబ్బందిపై పని భారం తప్పడంలేదు. జిల్లా ఆహార తనిఖీ కార్యాలయంలో కనీసం ఆరుగురు ఉద్యోగులు ఉండాలి. కానీ కేవలం ఒక అధికారి, అటెండర్ మాత్రమే ఉన్నా వీరిని యాదాద్రి భువ నగిరి జిల్లాకు ఇన్చార్జ్గా ని యమించారు. దీంతో ఏడాది కాలంగా కార్యాలయ తాళం తీ యడం లేదు. జిల్లాస్థాయి ప్ర భుత్వ కార్యాలయాల్లో సిబ్బం ది కొరతకు ఇది నిదర్శనం. సర్కారు పథకాలు సకాలంలో ప్రజలకు అందించాలంటే ప్రభుత్వ కార్యాలయాల్లో సరిపడా ఉద్యోగులు ఉండాలి. చిన్న జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు ప్రభుత్వ పథకాలను చేరువ చేయవచ్చని భావించిన రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల విభజన చేసింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ఉన్న ఉద్యోగులను మూడు జిల్లాలకు పంచడమే కాకుండా ఇతర జిల్లాల నుంచి కొంత మంది ఎంప్లాయీస్‌ను సూర్యాపేట జిల్లాకు ఆర్డర్టు సర్వ్ పేరుతో పంపింది. అయితే తగినంతమందిని కేటాయించకపోవడంతో జిల్లా స్థాయిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఉద్యోగుల కొరత పట్టిపీడిస్తోంది. ఒకటి రెండు శాఖల్లో ఉద్యోగుల కొరత ఉంటేనే పరిస్థితి దారుణంగా ఉంటుంది. అలాంటిది అన్ని శాఖల్లో అలాంటి పరిస్థితే ఉండడంతో సకాలంలో పనులు జరగడంలేదు. జిల్లా ఏర్పడి మూడేళ్లు కావొస్తున్నా ఉద్యోగుల సమస్య మాత్రం తీరడం లేదు. శాఖల్లో పరిస్థితి.. జిల్లా సమీకృత కలెక్టరేట్‌తో పాటు జిల్లా కేంద్రలో ఉన్న 64 ప్రధాన శాఖల్లో సుమారు 2 వేల మంది ఉద్యోగులు ఉండాలి. కానీ కేవలం 625 మందితో నెట్టుకురావాల్సిన దుస్థితి నెలకొంది. సమీకృత కలెక్టరేట్లో ఉన్న జిల్లా కార్యాలయాల్లో ఉద్యోగుల కొరత స్పష్టంగా కనబడుతోంది. అన్ని శాఖల్లో ప్రధాన్యత కలిగిన జిల్లా రెవెన్యూ కార్యాలయంలో వివిధ సెక్షన్లలో కలిపి 54 మంది ఉద్యోగులు అవసరం ఉండగా 30 మంది మాత్రమే ఉన్నారు. జిల్లా పరిశ్రమల శాఖ కార్యాలయలంలో 15 మంది ఉద్యోగులు ఉండాల్సి ఉండగా 8 మంది ఉద్యోగుల మాత్రమే ఉన్నారు. జిల్లా ఆహార తనిఖీ కార్యాలయంలో కనీసం ఆరుగురు ఉద్యోగులు ఉండాల్సి ఉండగా కేవలం ఒక అధికారి, అటెండర్ మాత్రమే ఉన్నా వీరు కూడా ఇతర మరో జిల్లాలకు ఇన్చార్జ్గా నియమించడంతో గత సంవత్సరం నుంచి కార్యాలయ తాళం తీయడం లేదు. ఇక జిల్లా కార్మిక శాఖలో 12 మంది ఉద్యోగులు ఉండాల్సి ఉండగా కేవలం ఒక జిల్లా అధికారి, ఒక డివిజన్ అధికారి, ఒక జూనియర్ అసిస్టెంట్, ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి కలిపి మొత్తం నలుగురు మాత్రమే ఉన్నారు. అదే విదం గా గ్రామ పంచాయతీ కార్యాలయం, ముఖ్య ప్రణాళిక అధికారి కార్యాలయం, సివిల్ సప్లయ్, పౌరసంబంధాలశాఖ, వ్యవసాయశాఖ, ఉద్యానవనశాఖ, సహకారశాఖ, భూ కొలతలు, పంచాయతీరాజ్ ఇలా అన్ని శాఖల్లో ఉద్యోగుల కొరత వేధిస్తోంది. సక్రమంగా అమలు కాని ప్రభుత్వ పథకాలు ఉద్యోగుల కొరత వల్ల ప్రభుత్వ పథకాలు స క్రమంగా అమలు కావడం లేదు. చిన్న జిల్లాలు ఏర్పడినా ప్రజలు తమ పనుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగక తప్పడం లేదు. ఇదిలా ఉంటే ఉద్యోగులకు పని ఒత్తిడి పెరిగింది. ముఖ్యంగా అధికారులతో పాటు సీనియర్ అసిస్టెంట్లపై అధికభారం పడుతోందని ఆయా ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు నేరుగా బయటకు చెప్పకున్నా తమలో తమే బాధపడుతున్న సందర్భాలూ ఉన్నాయి. -
బెదిరించి టీఆర్ఎస్లో చేర్చుకుంటున్నారు
సాక్షి, హుజూర్నగర్: కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమకేసులు బనాయించి, కొట్టించి, బెదిరించి టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంటున్నారని టీపీసీసీ చీఫ్, నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి తీవ్ర స్ధాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం చింతలపాలెంలో కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయాన్ని ప్రారభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఉత్తమ్ మాట్లాడారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, పోలీస్ స్టేషన్లను అడ్డంపెట్టుకుని అధికార పార్టీ వారు గలీజు రాజకీయాలు పాల్పడుతున్నారన్నారు. ఏ ఒక్క కార్యకర్తకు అన్యాయం జరిగినా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రతిస్పందిస్తామని ఉత్తమ్ పేర్కొన్నారు. పులిచింతల ప్రాజెక్ట్ ముంపు బాధితులకు మెరుగైన జీవితం అందించాలనే ఉద్దేశంతో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చలువతో ఆర్అండ్ఆర్ సెంటర్లను కట్టిచినం. దే«శంలో ఏరాష్ట్రంలో ఎక్కడా కూడా ఇలాంటి పునరావాస కేంద్రాలు కట్టలేదని స్పష్టం చేశారు. గత ఆరేళ్లుగా పులిచింతల బాదితులకు మంత్రి జగదీశ్‌రెడ్డి ఒక్క రూపాయి మంజూరు చేశాడా అని ప్రశ్నించారు. అటువంటి వారు ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు దుయ్యబట్టారు. ఉప ఎన్నికలు.. మన ఆత్మగౌరవానికి జరిగే ఎన్నికలన్నారు. హైకమాండ్ ఆదేశాల మేరకు హుజూర్నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పద్మావతి పోటీ చేస్తుందని. ఆమెను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. తొలుత ఉత్తమ్‌ను పూలమాలతో సన్మానించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నరాల కొండారెడ్డి, నాయకులు చిలకల శ్రీనివాసరెడ్డి, మోర్తాల సీతారెడ్డి, కొట్టే సైదేశ్వరరావు, శాగంరెడ్డి గోవిందరెడ్డి, అరుణ్‌కుమార్ దేశ్‌ముఖ్, అల్లం ప్రభాకర్‌రెడ్డి, నర్సింహమూర్తి, తోట శేషు, ఇంద్రారెడ్డి, మంజూ నాయక్ నవీన్ నాయక్, మోతీలాల్, రామిరెడ్డి, పుల్లారెడ్డి, వీరారెడ్డి, కాశయ్య వివిద గ్రామాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
30 రోజుల ప్రణాళికను విజయవంతం చేయాలి
సాక్షి, సూర్యాపేట: పల్లెల అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ 30రోజుల ప్రణాళికను రూపొందించారని, ఇది విజయవంతం కావాలంటే ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు ఇలా అందరూ భాగస్వాములుకావాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. 30 రోజుల గ్రామ పంచాయతీ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలుపై గురువారం జిల్లా కేంద్రంలోని సుమంగళి ఫంక్షన్ హాల్లో సూర్యాపేట, తుంగతుర్తి, జీవీవీ గార్డెన్లో కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు, అధికారులకు నిర్వహించిన అవగాహన సదస్సుల్లో ఆయన హాజరై మాట్లాడారు. మంచి ఆలోచనతో సీఎం కేసీఆర్ 30రోజుల ప్రణాళికను రూపొందించారని, ఇది విజయవంతం కావాలంటే ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు ఇలా అందరూ భాగస్వాములుకావాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. 30రోజుల గ్రామ పంచాయతీ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలుపై గురువారం జిల్లా కేంద్రంలోని సుమంగళి ఫంక్షన్ హాల్లో సూర్యాపేట, తుంగతుర్తి, జీవీవీ గార్డెన్లో కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు, అధికారులకు నిర్వహించిన అవగాహన సదస్సుల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఏ ఒక గడువు పెట్టకుండా ఏ పనులు కూడా కావడం లేదని తెలిసి ఈ కార్యక్రమానికి 30రోజుల ప్రణాళికగా డెడ్‌లైన్ పెట్టారని చెప్పారు. ప్రతి గ్రామంలో అందరూ కలిసి అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో పచ్చదనం, పరిశుభ్రత, డ్రెయినేజీల శుభ్రతపై దృష్టి సారించాలన్నారు. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని బాధ్యతగా తీసుకొని పనిచేయాలన్నారు. 14ఏళ్లు ఉద్యమంలో ఎన్నో అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొన్ని తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నంబవర్‌వన్‌గా నిలపాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. ప్రపంచంలోనే ఏ నాయకుడు చేయని విధంగా తనకు తానే పరీక్ష పెట్టుకుని అభివృద్ధి చేస్తున్న ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని ఆయన పేర్కొన్నారు. గ్రామ స్వరాజ్యం సీఎం ఆకాంక్ష.. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం రావాలనే ఆలోచనతో సీఎం ఈ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. గ్రామాభివృద్ధి చేయడంలో ప్రజలను మమేకం చేయాలని పేర్కొన్నారు. జెడ్పీ చైర్ పర్సన్ గుజ్జా దీపిక మాట్లాడుతూ ప్రతి పౌరుడు ఈ 30రోజుల ప్రణాళికలో భాగస్వాముడు కావాలన్నారు. గ్రామాల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకూడదన్నారు. వీలున్న చోట్ల మొక్కలు నాటి పచ్చధనం ఉండేలా చూడాలన్నారు. గ్రామాలకు గతం కంటే మెరుగ్గా నిధులు.. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ రాష్ట్రమంత ఒకేసారి చేస్తే విజయవంతమవుతుందనే ఉద్దేశంతో ఏర్పాటు చేశారన్నారు. నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చారని, గ్రామాలకు గతం కంటే నిధులు మెరుగ్గా ఉంటాయన్నారు. ప్రజల భాగస్వామ్యం ఉంటేనే అభివృద్ది సాధ్యమవుతుందన్నారు. పల్లెలు పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో.. కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ పల్లెలు పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చిందన్నారు. ప్రతి ఒక్కరూ నడుం బిగించి 30రోజుల ప్రణాళికను విజయవంతం చేయాలని చెప్పారు. గ్రామాల్లో పచ్చదనం పెంచేందుకు మొక్కలు నాటాలన్నారు. కలెక్టర్ దుగ్యాల అమయ్‌కుమార్ అధ్యక్షత జరిగిన ఈ సదస్సుల్లో జెడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణగౌడ్, జాయింట్ కలెక్టర్ సంజీవరెడ్డి, జెడ్పీ సీఈఓ విజయలక్ష్మి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, డీఆర్ఓ చంద్రయ్య, ఆర్డీఓ మోహన్‌రావు, అర్వపల్లి జెడ్పీటీసీ దావుల వీరప్రసాద్‌యాదవ్ , ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
కార్మిక శాఖలో వసూల్ రాజా
సాక్షి, దురాజ్‌పల్లి (సూర్యాపేట): లంచం అడిగితే అధికారిని నిలదీయండి అని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పదే పదే చెప్తున్నా అధికారుల తీరు మారడం లేదు. లంచం మహమ్మారి ఏదో ఒకే శాఖకు పరిమితం కాకుండా అన్నీ శాఖలకు అంటుకుంది. జిల్లా కార్మిక శాఖలో పైసలిస్తేనే ఫైలు కదులుతుందని గతంలో వెల్లువెత్తిన ఆరోపణలు నేడు నిజమని తేలింది. కార్మికశాఖ డివిజన్ అధికారి ఓ మహిళ నుంచి రూ.500 లంచంగా తీసుకుని ఇవేం సరిపోతాయని అడుగుతున్న వీడియో సామాజిక మాద్యమాల్లో ప్రస్తుతం హల్చల్ చేస్తోంది. కార్మిక శాఖలో సభ్యత్వం తీసుకుంటే.. 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండి భవన నిర్మాణ రంగం లేదా ఇతర రంగాల్లో కార్మికులుగా పనిచేస్తూ రూ.110 బ్యాంకుల్లో చెల్లించి కార్మిక శాఖలో సభ్యత్వ నమోదు చేసుకున్న కార్మికుడికి ప్రమాదం, డెలివరీ, వివాహ కానుకలకు ప్రభుత్వం ఆర్థికసాయం అందించే పథకం అమలులో ఉంది. కార్మిక శాఖలో నమోదైన కార్మికుడు ప్రమాదంలో మరణిస్తే రూ.6లక్షలు, శాశ్వత అంగవైకల్యానికి రూ.5లక్షలు, పాక్షిక అంగవైకల్యానికి రూ.4లక్షలు ఆర్థిక సహాయం అందనుంది. అదే విధంగా మహిళా కార్మికురాలు లేదా కార్మికుడికి కుమార్తెల వివాహాలకు వివాహ కానుకగా రూ.60వేలు ప్రసూతి సహాయంగా రూ.30వేల చొప్పున రెండు కాన్పులకు అందనున్నాయి. డబ్బులివ్వకుంటే కదలని ఫైలు ! జిల్లా కార్మికశాఖలో పైసలేనిదే ఫైలు కదలడం లేదని బహిరంగంగానే చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా పెన్‌పహాడ్ మండల మహ్మదాపురం గ్రామానికి చెందిన ఒక మహిళ నుంచి కార్మిక శాఖ డివిజన్ అధికారి లంచం తీసుకున్నట్లు వీడియో ద్వారా తెలుస్తోంది. కార్మిక శాఖలో సభ్యత్వం కలిగి ఉన్న తన భర్త ఇటీవల మరణించాడని ప్రభుత్వం నుంచి అందే ఆర్థికసాయాన్ని ఇప్పించాలని దరఖాస్తు చేసుకోగా విచారణకు వెళ్లిన అధికారి కార్యాలయంలో తనను సంప్రదించాలని తెలిపినట్లు సమాచారం. కార్యాలయానికి వచ్చిన ఆమె నుంచి ఆన్లైన్ పేరుతో డబ్బులు ఇవ్వాలని అధికారి స్వయంగా అడిగినట్లు వీడియోలో తెలుస్తోంది. ఆమె రూ.500 ఇచ్చి నేను పేదరాలినని ఇంతకంటే ఎక్కువ ఇవ్వలేనని అధికారి వద్ద మొరపెట్టుకుంది. ఇవేం సరిపోతాయని అధికారి స్వయంగా అన్నట్లు వీడియోలో తెలుస్తోంది. ఈ విషయంపై సదరు గ్రామానికి చెందిన ఎంపీటీసీ అధికారి లంచం తీసుకుంటున్న వీడియోను జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్‌కు సైతం పంపినట్లు సమాచారం. కార్మికశాఖ అధికారి లంచాలకు కక్కుర్తి పడి గ్రామాల్లోకి వెళ్లి పరిశీలన పేరుతో లబ్ధిదారులను వేధిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఎవరి నుంచి లంచం తీసుకోలేదు లేబర్ కార్డు ఉన్న లబ్ధిదారుల్లో ఎవరి నుంచి నేను లంచం తీసుకోలేదు. ప్రభుత్వం మార్చిన నిబంధనల మేరకు లబ్ధిదారుల వివరాలను ఆన్లైన్లో పొందుపరచవలసి ఉన్నందున ఆన్లైన్ ఖర్చుల నిమిత్తం మాత్రమే డబ్బులు తీసుకున్నాను. కావాలనే కొందరు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. – వాల్యానాయక్, కార్మికశాఖ డివిజన్ అధికారి ఉన్నతాధికారులకు నివేదించాం కార్మిక శాఖ డివిజన్ అధికారిపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్ ఆదేశాల మేరకు డిప్యూటీ కమిషనర్ నల్లగొండ, జాయింట్ కమిషనర్ హైదరాబాద్ వారికి చర్యల నిమిత్తం నివేదికలు అందించాం. విచారించి ఆరోపణలు రుజువైతే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. – శివశంకర్, సహాయ కమిషనర్, సూర్యాపేట -
నిండుకుండలా పులిచింతల ప్రాజెక్ట్
సాక్షి, హుజూర్నగర్: నాగర్జునసాగర్ ప్రాజెక్ట్ నుంచి భారీగా వస్తున్న వరదనీటితో పులిచిం తల ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి సామర్థ్యం 45.77 టీఎంసీలకు గాను రాత్రి 9 గంటలకు 38.75 టీఎంసీల నీరు చేరింది. ఎగువ నుంచి ఇన్‌ఫ్లోగా 7.21 లక్షల నీరు వస్తుండగా ప్రాజెక్ట్‌లోని 22గేట్లనుఎత్తి 7.10 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్ట్‌కు సందర్శకుల తాకిడి.. నిండుకుండా మారిన పులిచింతల ప్రాజెక్ట్ అందా లను తిలకించేందుకు సందర్శకులు పోటెత్తున్నారు. సూర్యాపేట, ఖమ్మం, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. నది అందాలను తమ సెల్ ఫోన్లో బంధిస్తున్నారు. ప్రాజెక్ట్ వద్ద సందర్శకుల తాకిడి ఎక్కువ కావడంతో ట్రాఫిక్ సమస్య జఠిలంగా మారింది. ముంపు గురవుతున్న పంట పొలాలు... భారీగా వరద నీరు రావండతో పులిచింతల బ్యాక్ వాటర్ అంతకంతకూ పెరుగతోంది. దీంతో ముంపు గ్రామాల పరిధిలో ఉన్న పొలాల్లోని పత్తి, మిర్చి, వరి పొలాలు నీట మునుగుతున్నాయి. రోడ్డుపైకి వచ్చిన వరద... పులిచింతల ప్రాజెక్ట్‌లో బ్యాక్ వాటర్ అంతకంతకూ పెరుగుతుండడంతో వాగులు వంకలు, కయ్యలను ముంచెత్తుతోంది. ఆ నీరు రోడ్లపైకి చేరుతోంది. వెల్లటూరు గ్రామ శివారులోని తాళ్లవాగులోకి వరద నీరు చేరింది. అంతే కాకుండా శోభనాద్రిగూడెం చెరువుకట్టపైకి వచ్చింది. దీంతో మిగతా గ్రామాలకు ఈ రహదారిలో రాకపోకలు బందయ్యాయి. ఆర్టీసీ బస్సులను దారి మళ్లించి నడుపుతున్నారు. పునరావాస కేంద్రాలకు తరలింపు... పులచింతల ముంపు గ్రామాల్లో ఇంకా నివాసం ఉంటున్న వారిని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. రేబల్లె, తమ్మారం ఎస్సీ కాలనీ, శోభనాద్రిగూడెం గ్రామంలోని ప్రజలను ప్రభుత్వ పాఠశాలలో ఆశ్రయం కల్పిస్తున్నారు. జేసీ, డీఆర్ఓ సందర్శన... ముంపు గ్రామాలను జేసీ సంజీవరెడ్డి, డీఆర్ఓ చం ద్రయ్య సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. కార్యక్రమంలో సీఐ శివరాంరెడ్డి, తహసీల్దార్లు కమలాకర్, జవహర్లాల్, ఎస్ఐలు వెంకటరెడ్డి, ప్రవీణ్ కుమార్, దశరధ్, ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. -
ముంపుబారిన మట్టపల్లి క్షేత్రం
సాక్షి, మఠంపల్లి: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయం ముంపుబారినపడింది. పులిచింతల ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌తో ముంపునకు గురికాకుండా కోట్లాది రూపాయలతో నిర్మించిన కరకట్టనుంచి వరదనీరు లీకేజీ అయి ఆలయంలోకి చేరింది. ఆంజనేయస్వామి ఆలయంతో పాటు ధ్వజస్తంభాన్ని చుట్టుముట్టింది. దీంతో భక్తులు ఆందోళన చెందారు. ఆలయంలోకి చేరిన నీటిని ధర్మకర్తలు,ఈఓ తెల్లవారేలోగా విద్యుత్ మోటార్లతో ఎత్తిపోసే పని చేపట్టారు. ఆలయంలోకి చేరిన వరదనీరు జిల్లాలో ప్రసిద్ధిగాంచిన మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం పులిచింతల ప్రాజెక్ట్ ముంపునకు గురైంది. ఆలయం ముంపు బారిన పడకుండా కోట్లాది రూపాయలతో నిర్మించిన కరకట్ట నుంచి బుధవారం వరదనీరు లీకేజీ కావడంతో ఆలయంలోకి చేరింది. దీంతో తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాలకు చెందిన శ్రీస్వామివారి భక్తులు ఆలయానికి చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు. స్వయంభూ స్వామివారిని ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా కదిలించకుండా ఉండాలనే ప్రభుత్వం ఆలయంతో పాటు శివాలయం, అన్నదాన సత్రాల రక్షణకోసం ఆలయం చుట్టూ రూ.2కోట్లు, శివాలయం నుంచి ప్రహ్లాదఘాట్ వరకు రూ.4కోట్లు, అన్నదాన సత్రాలు, అతిథి గృహాల రక్షణ కోసం మరో రూ.6కోట్లు వెచ్చించి కరకట్టలు నిర్మించింది. మూడు భాగాలుగా నిర్మించిన కరకట్టలో ప్రధానమైన ఆలయం చుట్టూ ఉన్న కరకట్ట (రక్షణగోడ)లీకేజీలు ఏర్పడి ఆలయంలోపలికి తెల్లవారుజాము నుంచి నీరు ప్రవేశించడంతో భక్తుల్లో ఆందోళన మొదలైంది. విషయం తెలుసుకున్న ఆలయ ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ ఉదయభాస్కర్‌లు తెల్లవారేలోపు ఆలయానికి చేరుకుని విద్యుత్‌మోటార్ సహాయంతో ఆలయంలోని నీరును బయటికి ఎత్తిపోసేపనిని ప్రారంభించారు. ఆ తరువాత కోదాడ ఆర్డీఓ కిశోర్‌కుమార్, ఎంపీపీ ముడావత్ కొండానాయక్, జెడ్పీటీసీ జగన్నాయక్, తహసీల్దార్ చంద్రశేఖర్, ఎంపీడీఓ జానకిరాములు, సర్పంచ్ విజయలక్ష్మీవెంకటరమణ, ఈఓ ఉదయభాస్కర్‌లు ఆలయం వద్దకు చేరుకుని లీకేజీలను పరిశీలించారు. అప్పటికే వరదనీరు ఆంజనేయస్వామి ఆలయం, ధ్వజస్తంభం చుట్టుముట్టింది. ఇక్కడ కృష్ణమ్మ ప్రవాహాన్ని చూసి.. స్వామివారిని దర్శించుకునేందుకు మాత్రం భక్తులు భారీగా తరలివచ్చారు. పులిచింతల ఎస్ఈతో ఆర్డీఓ సంప్రదింపులు.. మట్టపల్లి దేవాలయం కరకట్ట లీకేజీతో వరదనీరు చేరి ముంపుకు గురికావడంతో భక్తుల ఆందోళన గమనించిన కోదాడ ఆర్డీఓ కిశోర్‌కుమార్ ఆలయానికి చేరుకుని పరిశీలించారు. అక్కడి నుంచే పులిచింతల ప్రాజెక్ట్ ఎస్ఈతో ఫోన్లో సంప్రదించి కరకట్ట లీకేజీల విషయాన్ని వివరించారు. అయితే వెంటనే ఇంజనీర్లను పంపించి తక్షణ చర్యలు చేపడతామని ఎస్ఈ తెలిపినట్లు ఆర్డీఓ పేర్కొన్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతేగాక మట్టపల్లిలో ముంపుకు గురవుతున్న మత్స్యకారుల నివాస ప్రాంతాలను చేపల రేవులను పరిశీలించారు. వరదముంపు పట్ల అప్రమత్తంగా ఉండాలని మండల అధికారులను ఆర్డీఓ ఆదేశించారు. ఆలయాన్ని పరిశీలిస్తున్న ఆర్డీఓ కిశోర్‌కుమార్ -
ఇంతవరకు ఊసేలేని రెండో విడత గొర్రెల పంపిణీ
సాక్షి, అర్వపల్లి: రెండో విడత గొర్రెల పంపిణీపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇంకా మొదటి విడత ప్రక్రియే కొనసాగుతోంది. రెండో విడత లబ్ధిదారులను ఎంపిక చేసినప్పటికీ పంపిణీపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. దీంతో ఈ ప్రక్రియ మొదలు కాలేదు. గొర్రెల కోసం లబ్ధిదారులకు ఎదురు చూపులు తప్పడంలేదు. జిల్లాలో రెండో విడత గొర్రెల పంపిణీ ఊసేలేదు. తమకు గొర్రెలు వస్తాయో రావో అనే ఆందోళనలో గొర్రెల కాపరులు ఉన్నారు. గొర్రెల కాపరుల సంక్షేమం, ఆర్థి కాభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఒక్కో యూనిట్ విలువ రూ. 1.11 లక్షలు కాగా లబ్ధిదారుల వాటా రూ.27,750, మిగిలిన రూ.83,250 ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇందులో భాగంగా జిల్లాలో 2017 మే, జూన్ నెలల్లో ఒకే సారి మొదటి, రెండో విడత లబ్ధిదారులను ఎంపిక చేశారు. మొదటి విడత లక్ష్యం 17,732 యూనిట్లు కాగా, ఇప్పటి వరకు గొర్రెల కాపరులు 17,257 యూనిట్లకు డీడీలు చెల్లించారు. కాగా 16,759 యూనిట్లు పంపిణీ చేశారు. మరో 498 యూనిట్లు గ్రౌండింగ్ చేశారు. మొదటి విడతలో కాపరులు తమ వాటాధనం కింద 16,759 యూనిట్లకు రూ.46,50, 62,250 చెల్లించగా ప్రభుత్వం రూ.1,39,51,86,750 విలువ చేసే గొర్రెల యూనిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేసింది. ఈ విడతలో మొత్తం గొర్రెల పంపిణీకి సుమారు రూ.186 కోట్లు ఖర్చు అయ్యాయి. ఈ ప్రక్రియ 201మే వరకుపూర్తికావాల్సి ఉంది. ఇంకా కొనసాగుతూనే ఉంది. సబ్సిడీ గొర్రెలను అమ్ముకుంటున్న లబ్ధిదారులు ప్రభుత్వం 75శాతం రాయితీపై గొర్రెలను పంపిణీ చేస్తుండగా అనేక చోట్ల గొర్రెలను అమ్మేసుకుంటున్నారు. అలాగే రీసైక్లింగ్ కూడా చేస్తున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఇచ్చిన గొర్రెలకు కలిగిన సంతానాన్ని మాత్రమే విక్రయించాలనేది నిబంధన. గొర్రెల మేతకోసం కూడా గడ్డి విత్తనాలను అందిస్తున్నారు. అయితే అక్రమార్కులు మాత్రం గొర్రెలు అవసరం లేని కాపరులను గుర్తించి వల వేస్తున్నారు. లబ్ధిదారులకు తప్పని నిరీక్షణ రెండో విడత లబ్ధిదారులను 2017 మే, జూన్ నెలల్లో గుర్తించారు. ఈ విడతలో జిల్లాలో 17,325 గొర్రెల యూనిట్ల పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2018 జూన్‌లో రెండో విడత పంపిణీ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఏడాది దాటినా ఇంతవరకు రెండో విడతపై ప్రభుత్వంనుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. దీంతో లబ్ధిదారులకు నిరీక్షణ తప్పడంలేదు. తమకు రెండో విడత గొర్రెలు వస్తాయో, రావోనని ఆందోళన చెందుతున్నారు. మొదటి విడతలో.. ఇదీ పరిస్థితి.. మొత్తం యూనిట్లు 17,732 డీడీలు చెల్లించినవారు 17,257 ఇప్పటి వరకు పంపిణీ చేసిన యూనిట్లు 16,759 గ్రౌండింగ్ అయినవి 498 మొత్తం ఖర్చు రూ.186కోట్లు రెండో విడత లక్ష్యం 17,325లక్ష్యం రెండో విడతపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదు రెండో విడత రాయితీ గొర్రెల పంపిణీపై ప్రభుత్వం నుంచి ఇంకా ఆదేశాలు రాలేదు. రెండో విడతలో జిల్లాలో 17,325 యూనిట్లను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మొదటి విడతకు సంబంధించి 17,732 యూనిట్లకు గాను 16,759 యూనిట్ల గొర్రెలను పంపిణీ చేశాం. ఇందుకోసం రూ.186కోట్లు ఖర్చు చేయడం జరిగింది. – వేణుమనోహరరావు, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి గొర్రెలు ఇస్తే ఉపాధి కలుగుతుంది రెండోవిడత లబ్ధిదారుల జాబితాలో నాపేరు ఉంది. ఇంతవరకు గొర్రెలు రాలేదు. నాభర్త అకాల మరణం పొందారు. నాకు ఎలాంటి ఆస్తులు లేవు. కూలి పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషిస్తున్నాను. గొర్రెలు ఇస్తే వాటిని పెంచుకొని ఉపాధి పొందుతా. ఇప్పటికైనా గొర్రెలను పంపిణీ చేయాలి. – వజ్జె వల్లమ్మ, రెండో విడత లబ్ధిదారురాలు, రామన్నగూడెం, జాజిరెడ్డిగూడెం మండలం -
కాపాడబోయి.. కాళ్లు విరగ్గొట్టుకున్నాడు..!
సాక్షి, కోదాడ: ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్న మహిళను కాపాడబోయిన ఓ యువకుడు తన రెండు కాళ్లు విరగ్గొట్టుకున్న ఘటన బుధవారం ఉదయం పట్టణంలోని శ్రీనివాసనగర్‌లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం శ్రీనవాసనగర్లోని తిపిరిశెట్టి రాజు ఇంట్లో కింది పోర్షన్లో తాటిపల్లి రమాదేవి (55) కొంత కాలంగా అద్దెకు నివాసం ఉంటుంది. భర్తతో దూరంగా ఉంటున్న ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. బుధవారం ఉదయం తన ఇంట్లో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ విషయాన్ని గమనించి పై అంతస్తులో ఉన్న రాజు కుమారుడు ఆమెను కాపాడేందుకు పై అంతస్తు నుంచి కిందకు దూకి మంటలను ఆర్పే ప్రయత్నం చేశాడు. ఒకేసారి దూకడంతో ఆయన రెండు కాళ్లు విరిగాయి. రమాదేవి అప్పటికే 90 శాతం కాలిపోవడంతో చికిత్స నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆమె పరిస్ధితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పవన్‌ను కోదాడలో ఓ పైవేట్ వైద్యశాలకు తరలించి విరిగిన రెండు కాళ్లకు కట్లు వేశారు. బంధువుల ఫిర్యాదు మేరకు కోదాడ పట్టణ పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఓటరుగా నమోదు చేసుకోండి
సాక్షి, సూర్యాపేట: ఓటరు గుర్తింపు కార్డు.. ఓటు వేసేందుకు కాదు... పింఛన్ మంజూరుకు.. బ్యాంకు ఖాతా తెరిచేందుకు.. వ్యక్తిగత గుర్తింపునకు ఓటరు కార్డే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. అంతటి ప్రాధాన్యం కలిగిన ఓటరు కార్డును పొందేందుకు.. అందులో అవసరమైన మారులు, చేర్పులు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది.భారత ఎన్నికల సంఘం ఇందుకోసం ప్రత్యేక షెడ్యూల్ జారీ చేసింది. ఐదు నెలలపాటు కొనసాగనున్న ఈ పక్రియకు యం త్రాంగం సిద్ధమవుతోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో 18 ఏళ్లు నిండిన ప్రతీ వ్యక్తి కీలకమైన ఓటుహక్కును కలిగి ఉండాలని ఎన్నికల సంఘం చెబుతోంది. అందుకు ఏటా అర్హుల నుంచి ఓటుహక్కు కోసం దరఖాస్తులను స్వీకరిస్తోంది. ప్రతీసారి అక్టోబర్‌లో ఈ ప్రక్రియ ప్రారంభించే ఎన్నికల సంఘం ఈసారి నెల ముందుగానే ఓటరు నమోదు, జాబితాలో మార్పున?కు, చేర్పులకు, సవరణలకు ముందుకు వచ్చింది. ఓటరు జాబితను పారద్శకంగా పక్కా సమాచారంతో తయారు చేయాలనే సంకల్పంతో ముందస్తుగా షెడ్యూల్ జారీ చేసింది. ఇందులో భాగంగా ఈ నెల 31వరకు, 2020, జనవరి 1తేదీతో 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు, ఆపై వయస్సుగలవారు ఓటు నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఓటరు జాబితాలో ఏమైనా సవరణలు ఉన్నా.. చిరునామాలో మార్పులు, చేర్పులు ఉన్నా.. ఫొటో తప్పు ఉన్నా.. మరే పొరపాటు ఉన్నా సరిదిద్దుకునే వెసులుబాటు కల్పిస్తోంది. ఇందుకు ఎన్నికల సంఘం నెల రోజులు గడువు ఇచ్చింది. అందుబాటులో ఉన్న మాధ్యమాల ద్వారా ఓటరు జాబితాను పరిశీలించుకోవాలని సూచనలు చేసింది. ఏం చేయాలంటే ఓటరు నమోదుకు సమీపంలో బీఎల్ఓను సంప్రదించాలి. వీలుకాని పక్షంలో దగ్గర లోని ఈసేవ కేంద్రంలోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. స్వయంగా సందర్శించి ఓటు నమోదు, సవరణ చేసుకోవచ్చును. దరఖాస్తుకు రెండు ఫొటోలు, వయసు ధ్రువీకరణ పత్రం, చదువుకోనివారు ఆధార్‌కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ పత్రం రేషన్ కార్డు జిరాక్సు జత చేయాలి. లేదా ఆన్లైన్ ద్వారా కాని , బీఎల్ఓల ద్వారా ఓటు నమోదు, సవరణలు చేసుకోవచ్చు. సెప్టెంబర్‌లో ఇంటింటి సర్వే సెప్టెంబర్ 1 నుంచి బీఎల్ఓలు ఇంటింటి సర్వే చేపట్టనున్నారు. నెల రోజులపాటు నిర్వహించే ఈ సర్వేలో ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాల ను తెలుసుకోవడం, ఆ దరఖాస్తు ఆమోదానికి అప్లోడ్ చేయడం, జాబితాలో ఎవరైనా చనిపోయినవారు గానీ, వలస వెళ్లినవారు ఉంటే గుర్తించి వివరాలు సేకరిస్తారు. 18 ఏళ్లు నిండిన వారున్నా వారి వివరాలను నమోదు చేసుకుంటారు. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి 30వ తేదీ వరకు తమ పరిధిలోని ఇంటింటీ సర్వే చేయనున్నారు. 1950కి ఫోన్ చేస్తే చాలు.. ఓటరు జాబితాలో పేరు ఉందా? లేదా ఉంటే ఎక్కడ ఉంది? తెలుసుకోవడానికి సబంధించిన బూత్‌స్థాయి అధికారిని సంప్రదించాలి. లేదంటే 1950 ఓటరు హెల్ప్‌లైన్‌కి పోన్ చేసి తెలుసుకోవచ్చు. కార్యాలయ పనిదినాల్లో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వివరాలు అడిగి తెలుసుకోవచ్చు. షెడ్యూల్ ఇదీ... ఓటరు నమోదు, సవరణలు ఆగస్టు 1 నుంచి 31 వరకు బీఎల్ఓల ఇంటింటి సర్వే సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు ముసాయిదా జాబితా విడుదల అక్టోబర్ 10, 2019 అభ్యంతరాల స్వీకరణ అక్టోబర్15 నుంచి నవంబర్30 వరకు తుది జాబితా ప్రకటన జనవరి 01, 2020 -
ఫణిగిరికి వెలుగులెప్పుడు?
సాక్షి, సూర్యాపేట: బౌద్ధం పరిఢవిల్లిన ప్రపంచ స్థాయి క్షేత్రం ఫణిగిరి. జిల్లాలోని నాగారం మండలం ఫణిగిరి గ్రామానికి సమీపంలో ఏకశిల కొండపై ఉన్న ఈక్షేత్రం బౌద్ధ ఆరామాల్లో ప్రత్యేకమైనది. ఇటీవల జరిపిన తవ్వకాల్లో బౌద్ధ ఆనవాళ్లు మరిన్ని బయటపడ్డాయి. కొండ పైన నలుమూలల తవ్వకాలకు పురావస్తు శాఖ ప్రణాళిక సిద్ధం చేసి కొంత మేర తవ్వకాలు జరిపింది. అయితే కొండపైకి రోడ్లు, మెట్లు లేకపోవడం, పరిసర ప్రాంతం అభివృద్ధి చేయకపోవడంతో ఈ క్షేత్రానికి రావడానికి పర్యాటకులకు అవస్థలు తప్పడం లేదు. క్రీ.శ 1,2 శతాబ్దాల్లో ఇక్కడ బౌద్ధ ఆరామం నిర్మించారు. గౌతమ బుద్ధుడి ప్రధాన శిష్యులు ఇక్కడ ఆరామాలు నిర్మించి బౌద్ధం వ్యాప్తం చేసినట్లు పలుమార్లు జరిపిన తవ్వకాల్లో బయటపడింది. 360 డిగ్రీల కోణంలో ఇక్కడ నిర్మించిన మహాస్థూపం ప్రధానమైంది. ఈ స్థూపం మధ్యలో కూర్చొని చూస్తే చుట్టూ పచ్చని పొలాలు కన్పి స్తాయి. బుద్ధుడి ప్రధాన శిష్యులు ఈ స్థూపం పై కూర్చొని ధ్యానం చేశారని, ఆతర్వాత ఈ కొండ ధ్యానం, బౌద్ధం వ్యాప్తికి అనువుగా ఉండడంతో ఇక్కడ బౌద్ధ పఠనం కూడా జరిగినట్లు తవ్వకాల్లో బయటపడిన ఆనవాళ్లను చూస్తే స్పష్టమవుతుంది. కొండపైన 16 ఎకరాల విస్తీర్ణంలో ఈ బౌద్ధ క్షేత్రానికి చెందిన ఆరామాలు, మహాస్థూపం, శాసనాలు, ఆనాటి నాగరికతను చాటిచెప్పే కట్టడాలు, గుట్ట కింది భాగంలో ప్రాచీనశిలా యుగం నాటి సమాధులు, మానవ జీవనం కొనసాగిన చరిత్ర ఉంది. ఫణి అంటే పడగ ..గిరి అంటే కొండ. ఈ గ్రామానికి సమీపంలో ఉన్న కొండ పాము ఆకారంలోని ఏకశిల. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అమరావతి, నాగార్జునకొండ బౌద్ధ క్షేత్రాల లాగేనే బౌద్ధ చరిత్ర ఆనవాల్లు ఇక్కడ ఉన్నాయి. బౌద్ధ దేశాల్లో ఫణిగిరి చరిత్ర.. బౌద్ధం ఆచరిస్తున్న దేశాల్లో.. ఇప్పటికీ మన దేశంలోని ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రాల చరిత్ర ఉంది. వీటిలో ఫణిగిరి కూడా ఒకటి కావడంతో ఇక్కడికి చైనా, భూటాన్, శ్రీలంక, బ్రిటన్ దేశాల నుంచి బౌద్ధ భిక్షువులు, రీసెర్చ్ స్కాలర్స్, పర్యాటకులు వస్తుంటారు. రాష్ట్ర పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో మహాస్థూపం, చైత్య గుహలు, ఉద్దేశిక స్థూపాలు, విహారాలు, శిలామండపాలు, బుద్ధుడి ప్రతిమలు, బౌద్ధ చిహ్నాలు, బుద్ధుడి జీవిత ఘట్టాలు, నాణేలు, సున్నపు బొమ్మలు, కుండలు తవ్వకాల్లో బయటపడ్డాయి. శ్రీపర్వత విజయపురి (నాగర్జునకొండ) నుంచి పరిపాలించిన ఇక్ష్వాకుల రాజుల పాలనాకాలానికి సంబంధించిన శాసనం దొరకడం ఇక్కడి ప్రత్యేకత. బౌద్ధ ఆరామాల్లో బంగారానికి సంబంధించిన వస్తువులు లభించవు. కానీ ఇక్కడ ఏడో రోమన్ చక్రవర్తి నెర్వి (క్రీ.శ. 96–98) విడుదలచేసిన 7.3 గ్రాముల బరువు గల బంగారునాణేం బయటపడింది. ఇక్కడ విశ్వ విద్యాలయం కూడా కొనసాగినట్లు గుర్తించారు. ఫణిగిరి బౌద్ధ ఆరామం చరిత్ర అంతా విదేశాల్లోని బౌద్ధ చరిత్రలో నిక్షిప్తం కావడం వల్లే అక్కడి నుంచి ఎక్కువగా పర్యాటకులు ఏటా ఇక్కడికి వస్తారు. రక్షణలేని సంపద .. కొండ పై జరిగిన తవ్వకాల్లో బయట పడిన బౌద్ధ శిల్పాలు, సీపపు నాణేలు లాంటి ఎన్నో విలువైన వస్తుసంపదకు ప్రత్యేక మైన మ్యూజియం లేకపోవడంతో వీటికి రక్షణ లేకుండా పోయింది. ఇక్కడ దొరికిన విగ్రహాలను కొన్నింటిని పానగల్లు మ్యూజియంలో మరికొన్నింటిని హైదరబాద్‌లోని మ్యూజియంకు తీసుకెళ్లారు. మిగిలిన వాటిని గ్రామంలోని శిథిలావస్థ భవనంలో పెట్టారు. కొండపై బౌద్ధ ఆరామం చుట్టూ రూ. 72 లక్షలతో ప్రహరీ, సోలార్ ఫెన్సింగ్ నిర్మాణం చేశారు. అయితే బౌద్ధారామం పై ఎలాంటి ప్రత్యేక రక్షణ లేకపోవడంతో దుండగలు కొండపైకి వెళ్లి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసినా బ్యాటరీలు పనిచేయకపోవడంతో ఈ క్షేత్రానికి రక్షణ లేకుండా పోయింది. ఫణిగిరి గ్రామంలో మ్యూజియం నిర్మాణం చేసేందుకు 30 గుంటల స్థలాన్ని కేటాయించారు. రూ.25 లక్షలతో మ్యూజియం నిర్మాణం చేపట్టాల్సి ఉండగా ఇప్పటి వరకు అడుగు ముందుకు పడలేదు. మ్యూజియం నిర్మించి కళాఖండాలను భద్రపరిస్తే ఇవి పర్యాటకులను ఆకట్టుకోనున్నాయి. పర్యాటకులను ఆకర్షించేందుకైనా.. పూనే దక్కన్కాలేజీ సహకారంతో రూ. 57 లక్షలతో ఇటీవల పురావస్తు శాఖ ఇక్కడ తవ్వకాలను ప్రారంభించింది. ఈ తవ్వకాల్లో మరిన్ని బౌద్ధ ఆనవాళ్లు బయటపడ్డాయి. కొండ పై భాగంలో మహా స్థూపం ముందు భాగం అంతా బౌద్ధ పఠనం జరిగిన ఆరామాలున్నాయి. గతంలో ఇక్కడ తొలిసారి నిజాంల కాలంలో 1941 నుంచి1944 వరకు, రెండో సారి 2000 నుంచి 2005వరకు, మూడోసారి 2006 నుంచి 2009 , 5వ సారి 2010 నుంచి 2014 వరకు మొత్తం ఐదు పర్యాయాలు తవ్వకాలు జరిగాయి. ఇక్కడ బౌద్ధ క్షేత్రం అమరావతి, నాగార్జునకొండతో సమానమైన బౌద్ధ సంపదను కలిగి ఉన్నట్లు పురావస్తు శాఖ గుర్తించింది. వచ్చే ఏడాది న్యూయార్క్‌లో జరిగే ప్రపంచస్థాయి సాంస్కృతిక శిల్పప్రదర్శకు ఫణిగిరిలోని బౌద్ధ శిల్పాన్ని ప్రదర్శనకు పంపే ఏర్పాట్లో పురావస్తు శాఖ నిమగ్నమైంది. ఫణిగిరి క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తే పర్యాటకుల సంఖ్య పెరగనుంది. కొండపైకి రోడ్డు, మెట్లు నిర్మిస్తే పర్యాటకులను ఈ క్షేత్రం మరింతగా ఆకర్షించనుంది. -
మెడికల్ కాలేజ్ ఏర్పాటు అనుకోని కల!
సాక్షి, సుర్యాపేట: సూర్యాపేట జిల్లా చరిత్రలో నవశకానికి అడుగులు పడబోతున్నాయి. మెడికల్ కళాశాల ఏర్పాటు ఊహకందని కల అని, కళ్ల ఎదుటే సాక్షాత్కరించబోతుందని స్థానిక శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. మెడికల్ కాలేజ్ ఏర్పాటుతో సూర్యాపేట చరిత్రలోనే నవశకానికి నాంది పడింది అన్నారు. అభివృద్ధిలో జిల్లా ముందు ఉందనీ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో మెడికల్ కాలేజ్ రావడంతో ఆయనకు ఎంతో రుణపడి ఉంటామని తెలిపారు. అంతేకాక కలెక్టర్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మురళి చేసిన సేవలు మరువలేమన్నారు. కళాశాల అభివృద్ధి కి ఉన్న అడ్డంకులను అన్ని అధిగమించి కళాశాల ఏర్పాటు చేసుకొవడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులకు ఏ సమస్య వచ్చిన తీర్చడానికి నేను ఉన్నానంటూ విద్యాశాఖ మంత్రి హామీ ఇచ్చారు. సూర్యపేట మెడికల్ కళాశాలో చదువుకున్న విధార్ధులు దేశ వ్యాప్తంగా పేరు తీసుకురావాలని కోరారు. సూర్యాపేట జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలను మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రజలకు అంకితం చేస్తుడటంతో పండుగ వాతావరణం నెలకొంది. మంత్రి ఆశయం వెరసి ఏర్పడిన మెడికల్ కళాశాలలో శ్రావణ శుక్రవారం తొలిఘడియాలలో మొదటి బ్యాచ్ ప్రారంభం కాబోతోంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాల పునర్విభజన లో భాగంగా మంత్రి జగదీష్ రెడ్డిని గెలిపిస్తే సూర్యాపేటను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తామంటూ 2014 ఎన్నికలలో ఇచ్చిన హామీని అమలు పరచడమే కాకుండా అదనంగా కొత్త జిల్లాకు మెడికల్ కళాశాల ఇస్తానని పేట సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ అమలులో సాక్షాత్కరించబోతుంది. సుమారు 500 కోట్ల అంచనా వ్యయంతో పేటలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టినా శాశ్వత భవనాల నిర్మాణంలో జాప్యం జరుగుతోందన్నఅంశాన్ని గుర్తించిన మంత్రి జగదీష్ రెడ్డి మినరల్ ఫండ్‌తో స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో మెడికల్ కళాశాలను యుద్దప్రాతిపదికన ఏర్పాటు చేసిన విషయం విదితమే.ఇచ్చిన హామీని అతి తక్కువ కాలంలో ఆచరణలోకి తేవడమే కాకుండా కళాశాలను ప్రారంభిస్తున్న శుభవేళ సూర్యాపేటలో పండుగ వాతావరణం నెలకొంది. -
చర్చనీయాంశమైన డాక్టర్ వ్యవహారం..
నల్లగొండ, కోదాడ : ఆయన కోదాడలో ఓ ప్రముఖ వైద్యుడు. తన వద్ద నర్సుగా పనిచేస్తున్న ఓ యువతిని లైంగికంగా లోబర్చుకున్నాడు. ఆమె గర్భవతి అయ్యింది. విషయం తెలుసుకున్న ఆయన భార్య సదరు నర్సును వైద్యశాలనుంచి పంపించింది. అయినా సదరు వైద్యుడు ఆ నర్సుతో స్థానికంగానే వేరే చోట రహస్య కాపురం పెట్టించాడు. ఆమెను అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి పెంచాడు. అం దుకు ఆమె ఒప్పుకోకపోవడంతో రోగులకు మందులు రాసే చిట్టీ మీద తన ఇష్టపూర్తిగా రాసి ఇస్తున్నట్లు పలు హమీలు ఇచ్చాడు. యువతి పేరు మీద రూ.2 లక్షలు డిపాజిట్ చేస్తానని, 100 గజాల స్థలంలో ఇల్లు కట్టించి ఇస్తానని, రూ.3 లక్షల విలువ చేసే బంగారం ఇస్తానని సంతకం చేసి ఇచ్చాడు. దీంతో ఆమె అబార్షన్‌న్‌చేయించుకోవడానికి ఒప్పుకుని కోదాడలోని ఓ ప్రైవేట్ వైద్యశాల వైద్యుడిని సంప్రదించినట్లు సమాచారం. అయితే ఆయన అబార్షన్ చేయడానికి నిరాకరించి విషయం ఆరా తీసినట్లు తెలిసింది. దీంతో సదరు యువతి తనకు వైద్యుడు రాసి ఇచ్చిన హమీల చిట్టీని ఆయనకు చూపడంతో బయటకు పొక్కింది. ఎవరు పెట్టారో ఏమోగాని ఈ చిట్టీ ఇప్పుడు స్థానిక సామాజిక మాద్యమాల్లో చక్కర్లు కొడుతోంది. కోదాడలో ఎక్కడ చూసినా ఇదే విషయంపై చర్చ జరుగుతోంది. -
1,036 ‘వైద్య’ పోస్టుల భర్తీకి ఓకే
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ, సూర్యాపేట జిల్లా కేంద్రాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన వైద్య కళాశాలల్లో 1,036 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. 132 అసిస్టెంట్ ప్రొఫెసర్, 904 పారా మెడికల్ పోస్టుల భర్తీకి అనుమతిస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో 656 స్టాఫ్ నర్సు పోస్టులున్నాయి. డిపార్ట్మెంటల్ సెలక్షన్ కమిటీ ద్వారా ఈ నియామకాలు జరపాలని రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు.. వైద్య, ఆరోగ్య సంక్షేమ శాఖకు సూచించారు. ఈ పోస్టుల భర్తీ కోసం డిపార్ట్మెంటల్ సెలక్షన్ కమిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. నల్లగొండ, సూర్యాపేట వైద్య కళాశాలలు ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కానున్నాయి. -
సూర్యాపేట జిల్లాలో వ్యక్తి దారుణహత్య
-
కలకలంరరేపిన కానిస్టేబుల్ సెల్ఫీ వీడియో
-
షార్ట్‌సర్క్యూట్‌తో కారు దగ్దం
సూర్యాపేట జిల్లా: కోదాడ మండలం తోగర్రాయి వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణంలో ఉన్న ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ప్రయాణికులు అప్రమత్తమై కారులో నుంచి వెంటనే దిగడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం సమయంలో టాటా ఇండికా కారులో నలుగురు వ్యక్తులు ఉన్నారు. షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉంటాయని భావిస్తున్నారు. సకాలంలో ఫైరింజన్ రాకపోవడం వల్ల కారు పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : కోదాడ వద్ద కారులో అకస్మాత్తుగా మంటలు -
కోదాడ వద్ద కారులో అకస్మాత్తుగా మంటలు
-
చేపల చెరువును కొల్లగొట్టిన స్థానికులు
-
చెరువుపై వేలమంది విరుచుకుపడ్డారు!!
సాక్షి, సూర్యాపేట : జిల్లాలో చేపల చెరువు లూటీకి గురయింది. సుమారు 10 లక్షల రూపాయలు విలువ చేసే చేపలను స్థానికులు దోచేశారు. ఏకంగా వేలమంది చెరువుపై దాడికి పాల్పడ్డారు. చేపల కోసం ఎగబడి.. దోచుకున్నారు. పోలీసుల కళ్ళ ముందే ఈ దోపిడీ జరిగింది. ఇక్కడ ఈ ఫొటోలో చెరువులో దిగిన వారంతా పుణ్య స్నానాల కోసం వచ్చిన భక్తులు కాదు. పుణ్యానికి (ఉచితంగా) వచ్చిన చేపలను కాజేయడానికి వచ్చిన చోర్ బ్యాచ్ ఇదంతా. మునగాల మండలం గణపవరం చెరువు 200 ఎకరాల్లో విస్తరించి ఉంది. రెండేళ్లుగా మత్స్యకారుల కుటుంబాలు ఈ చెరువులో చేపలను పెంచుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ చెరువులో భారీగా చేపలు ఉన్నాయని, అవి స్థానికంగా దొంగతనానికి గురవుతున్నాయని ఆ నోటా ఈ నోటా తెలుసున్న సుమారు 10 గ్రామాల ప్రజలు ఒక్కసారిగా చెరువుపై విరుచుకుపడ్డారు. అప్పనంగా విలువైన చేపలు దొరుకుతుండటంతో.. ఏమాత్రం జంకు-బొంకు లేకుండా చెరువును లూటీ చేసేశారు. పోలీసులు జోక్యం చేసుకున్నా పరిస్థితి అదుపులోకి రాలేదు. మత్స్యకారుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
సునీల్ మృతికి మంత్రి జగదీశ్‌రెడ్డి సంతాపం
సాక్షి, సూర్యాపేటరూరల్ : ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వీ6 రిపోర్టర్ సునీల్ భౌతికకాయాన్ని శుక్రవారం మండలంలోని యర్కారం గ్రామంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా మృతదేహంపై పూలమాల వేసి నివాళులర్పించి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. నివాళులర్పించిన వారిలో ఎంపీ బడుగుల లింగయ్యయా దవ్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామేలు, సూర్యాపేట ఎంపీపీ వట్టె జానయ్యయాదవ్‌తో పాటు పలువురు టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. సునీల్ మృతి చెందడం బాధాకరం.. రోడ్డు ప్రమాదంలో కోదాడ వీ6 రిపోర్టర్ సునీల్ మృతి చెందడం బాధకరమని తెంజు రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ ఇస్మాయిల్ అన్నారు. శుక్రవారం సూర్యాపేట మండలం యర్కారం గ్రామంలో నిర్వహించిన సునీల్ అంతిమయాత్రలో సంఘం జిల్లా అధ్యక్షుడు వజ్జె వీరయ్యతో కలిసి ఆయన పాల్గొన్నారు. సునీల్ భౌతికకాయంపై పుష్ఫగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సహకారంతో సునీల్ కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే నేతలు ఎండీ.రియాజుద్దీన్, కారింగుల్ అంజన్‌గౌడ్, గోలి విజయ్, గుండేలి శ్రీధర్, శ్రీను, రఘు పాల్గొని సంతాపం తెలిపారు. -
పెద్దగట్టు జాతర ప్రారంభం
సూర్యాపేట: లింగా ఓ లింగా నామస్మరణతో సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్‌పల్లిలోని శ్రీ లింగమంతులస్వామి ఆలయం మార్మోగింది. రెండేళ్లకోసారి జరిగే శ్రీ లింగమంతులస్వామి (గొల్లగట్టు) జాతర ఘనంగా ప్రారంభమైంది. ఆదివారం అర్ధరాత్రి గంపల ప్రదక్షిణలతో వేడుకలు మొదలయ్యాయి. సూర్యాపేట మండలం కేసారం గ్రామంలో దేవరపెట్టెకు విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేసి తరలించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. యాదవులు ఈ పెట్టెను కాలినడక పెద్దగట్టుకు చేర్చారు. వివిధ గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. యాదవులు సంప్రదాయ దుస్తుల్లో డోలు వాయిద్యాలు, భేరీ చప్పుళ్లు, కటారు విన్యాసాలు చేస్తూ గట్టుపైకి చేరుకున్నారు. మొదటి రోజు 30 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. సోమవారం భక్తులు లక్షల్లో తరలిరానున్నారు. చౌడమ్మతల్లికి బోనాలు సమర్పించనున్నారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, కలెక్టర్ అమయ్‌కుమార్ పాల్గొన్నారు. -
నిబద్ధతకు నిరుపమాన నిదర్శనం
ప్రజావైద్యశాల స్థాపించేం దుకు 1971 ఆరంభంలో సూర్యాపేటకు వెళ్లాను. కీ.శే. వి. బుచ్చిరాములు నాడు సూర్యాపేట డివిజన్ సీపీఎం కార్యదర్శిగా ఉండేవారు. ఆ హాస్పిటల్ స్థాపనలో నాకు స్థానికంగా ఉండి సహకరించిన ఇద్దరిలో ఆయన ఒకరు. ఆ పరి చయం నేను సీపీఎంని వీడి వచ్చేవరకు (1991) కొనసాగింది. ఆ పిదప సీపీఎం(బీఎన్) పార్టీ ఏర్పడి నప్పటినుంచి తిరిగి సన్నిహితంగా కొనసాగింది. తర్వాత ఆయన కన్నుమూసేవరకు అరుదుగానైనా కలిసేవారు. ఈ సందర్బంగా సీపీఎం (బీఎన్) పార్టీ గురించి కొంత చెప్పాలి. ఆనాటివరకు సూర్యాపేట డివిజన్లో తుంగతుర్తి అసెంబ్లీ స్థానానికి సీపీఎం తరపున బీఎన్, స్వరాజ్యం, వీఎన్లే పోటీచేసేవారు. వీరందరిదీ ఒకే కుటుంబం. కానీ 1993 ఎన్నికల కమిటీ ఇన్చార్జిగా డివిజన్ కార్యదర్శి బుచ్చిరాములు పేరు ప్రకటించింది పార్టీ. కానీ ఫైనల్‌గా పోటీచేసే అభ్యర్థిగా మల్లుస్వరాజ్యం పేరు ముందుకొచ్చింది. అప్పటికే సీపీఎం పార్టీలో అక్కడక్కడా ‘‘ఎప్పుడూ ఆ కుటుంబమేనా, ఈ రెడ్లోళ్లేనా’’ అనే గుసగుసలు వినిపించేవి. సాధారణ కార్యకర్తల్లో బుచ్చిరాములు నెమ్మదితరహా, నిజాయితీ పట్ల అభిమానం ఉండేది. జిల్లాపార్టీలో వివిధస్థాయిల్లో యువకులు అందులోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు చెందిన వారు బుచ్చిరాములే ఈ సారి పార్టీ అభ్యర్థిగా నిలబడాలని పట్టుపట్టారు. దాంతో రాష్ట్ర కమిటీ కూడా దిగివచ్చి తమ నిర్ణయాన్ని మార్చుకుని బుచ్చిరాములు అభ్యర్థిత్వాన్నే బలపర్చక తప్పలేదు. పార్టీ తరఫున మోటూరు హనుమంతరావు పార్టీ జనరల్ బాడీలో ‘‘ఇన్నేళ్ల చరి త్రలో స్థానిక నాయకత్వం ‘మొండి’ వైఖరి కారణంగా ఈ ప్రకటన చేయక తప్పలేదు. ఇక గెలిపించుకునే బాధ్యత వారిదే’’ అన్నారు. తీరా ఎన్నికల్లో ఆయన వెయ్యి ఓట్ల తేడాతో ఓడిపోయారు. సహజం గానే ఆ ఓటమికి కారణం పార్టీలో ఒక వర్గం, ఆధిపత్య కులాల కుట్ర వల్లేనని ప్రచారమైంది. తన ఓటమి పట్ల బుచ్చిరాములు కిమ్మనలేదు కానీ సమర్థించినవారితో పాటు ఆయన్ని కూడా పార్టీ నుంచి బహిష్కరించారు. దీంతో వీరంతా తమ రాజకీయ అస్తిత్వం కోసం వేరే పార్టీ పెట్టారు. సీనియర్ అయిన బీఎన్ కూడా ఈ యువకుల తరఫున నిలబడటంతో సీపీఎం(బీఎన్) పార్టీ ఏర్పడింది. అణగారిన కులాల తరఫున పోరాడకుండా సీపీఎం తన లక్ష్యాన్ని సాధించలేదు అనే మౌలిక అవగాహన ఈ కొత్త పార్టీకి ఉండేది. ఈ అవగాహతోటే నేనూ ఈ కొత్త పార్టీ తరఫున ప్రచారానికి సిద్ధమయ్యాను. సీపీఎం(బీఎన్) నేతృత్వంలో కీ.శే దాసరి నారాయణరావు ముఖ్య అతిథిగా సూర్యాపేటలో సామాజిక న్యాయం కోసం పెద్ద బహిరంగ సభ జరిగింది. బుచ్చిరాములుతోసహా అందరూ ఆ సభ జయప్రదం కావడానికి విశేషంగా కృషి చేశారు. ఆ తర్వాత వివిధ కారణాలతో సీపీఎం(బీఎన్)ని రద్దుచేశారు. బీఎన్తోపాటు కొందరు ఎంసీపీఐలో చేరగా కొందరు టీడీపీలో, బుచ్చిరాములుతోపాటు మరి కొందరు తిరిగి సీపీఎంలో చేరారు. ఆనాటికే సామాజికన్యాయం కోసం పోరాడాలనే లక్ష్యం సీపీఎంలో కొందరిలో ఉండేది. ఈ మధ్య బుచ్చిరాములుతో మాట్లాడిన సందర్భంగా, సీపీఎం ప్రస్తుతం సామాజిక న్యాయానికి ప్రాధాన్యతనిస్తోం దనీ, తెలంగాణలో సీపీఎం ఆ మార్గంలో మరింత శాస్త్రీయ అవగాహనతో సాగుతోందని అనుకున్నాం. బుచ్చిరాములు ‘రాళ్లెత్తిన కూలీ లెవ్వరు’ అనే పుస్తకం రాశారు. ఆ ప్రాంతంలో కమ్యూనిస్టు ఉద్య మం కోసం తొలినాళ్లలో కృషి చేసిన వారి గురించి సంక్షిప్తంగా వివరించారు. గ్రామస్థాయిలో ఎంతమంది మహిళలు, పురుషులు ఎంత అంకిత భావంతో పనిచేశారో ఆ పుస్తకంలో పొందుపర్చారు. ఎన్నో కష్టాలు, నష్టాలు ఆర్థిక ఇబ్బందులు, అవమానాలు భరించి నిలబడిన నాటి పునాదిరాళ్లను గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం. ఆ పుస్తకాన్ని ఈ తరానికి తెలియని ‘తమకు తెలియని చరిత్ర’గా భావిస్తాను.అలాంటి చరిత్ర రచనకు అనుభవం, అర్హత ఉన్న వాళ్లు తప్పక ప్రయత్నించాలి. ఆ క్రమంలో నల్లగొండ జిల్లా నాటి సూర్యాపేట డివిజన్లో ఎర్రజెండా ఔన్నత్యానికి కృషి చేసిన తాను కూడా ఒక ప్రధానమైన పునాది రాయి అని బుచ్చిరాములు నిరూపించుకున్నారు. ఆయన ధన్యజీవి. (నేడు సీనియర్ కమ్యూనిస్టు నాయకులు వర్ధెల్లి బుచ్చిరాములు శ్రద్ధాంజలి కార్యక్రమం సూర్యాపేటలో నిర్వహిస్తున్న సందర్భంగా) వ్యాసకర్త : డాక్టర్ ఏపీ విఠల్, మార్క్సిస్టు విశ్లేషకులు మొబైల్ : 98480 69720 -
మోడల్ స్కూల్లో విద్యార్థిని అనుమానాస్పద మృతి
సాక్షి, మఠంపల్లి (హుజూర్‌నగరర్) : అనుమానాస్పద స్థితిలో ఓ విద్యార్థిని మృతిచెందింది. ఈ ఘటన మంఠంపల్లి మోడల్ స్కూల్లో శుక్రవారం వెలుగుచూసింది. పోలీసులు, తోటి విద్యార్థినులు తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని రఘునాథపాలేనికి చెందిన చలిగంటి కొండయ్య కుమా ర్తె నీరజ (17) మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో ఇంటర్మీడియట్ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతోంది. నీరజ శనివారం రాత్రి తోటి విద్యార్థులతో కలిసి భోజనం చేసింది. అనంతరం తండ్రి ఫోన్ చేయగా మాట్లాడి పడుకుంది. తెల్లవారిన తర్వాత తోటి విద్యార్థినులు స్నానం చేసేందుకు బాత్రూంకు వెళ్లగా గడియ పెట్టి ఉంది. చాలా సేపు వేచి చూసిన అందులో ఉన్న వారు గడియ తీయకపోవడంతో అనుమానంతో విద్యార్థినులు బాత్రూం తలుపును బలంగా నెట్టారు. అందులోని దృశ్యాన్ని చూసి హతాశులయ్యారు. అప్పటికే నీరజ బాత్రూం వెంటిలేటర్‌కు చున్నీతో ఉరి పెట్టుకుని కనిపించడంతో కేకలు వేశారు. విషయాన్ని స్కూల్ సిబ్బందికి తెలపడంతో వారు వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ రంజిత్‌కుమార్ ఘటన స్థలా న్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని హుజూర్నగర్ ఆస్పత్రికి తరలించారు. నీరజ మృతిపై అనుమానాలు నీరజ మృతిపై తండ్రితో పాటు బంధువులు అనుమానం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. రాత్రి వరకు బాగానే ఉన్న తన కుమార్తె తెల్లారేసరికే విగతజీవిగా మారిపోవడానికి బలమైన కారణాలు ఏమీ లేవని వాపోయారు. దీంతో పోలీసులు కలుగజేసుకుని పోస్టుమార్టం నివేదికలో నిజాలు వెలుగుచూస్తాయని, అప్పటి వరకు శాంతియుతంగా ఉండాలని నచ్చజెప్పారు. మృతురాలి తండ్రి కొండయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రంజిత్ తెలిపారు. రఘునాథపాలెంలో విషాదఛాయలు .. ఇంటర్ విద్యార్థిని నీరజన అనుమానాస్పదస్థితిలో మృతి చెందడంతో రఘునాథపాలెంలో విషాదఛా యలు అలుముకున్నాయి. ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైన ఇద్దరు చిన్నారులు దారుణంగా మృతిచెందిన ఘటన మరువక ముందే మరో వి ద్యార్థిని మృతిచెందటంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.ఆరుమాసాల క్రితం మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకులంలో చదువుతున్న పెదవీడుకు చెందిన విద్యార్థిని హాస్ట ల్ గదిలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకుంది. -
ఘుమ ఘుమల వెనుక.. ఘాటైన నిజాలు..!
నోరూరించే రుచులు.. ఘుమ ఘుమలాడే సువానలు.. పెద్దపెద్ద హోటళ్లు.. ఫుట్‌పాత్‌లపై ఉండే హోటళ్లు.. భోజనశాలల్లో వంటకాలను చూస్తే ఆగలేని పరిస్థితి. ఈ జిహ్వాచాపల్యాన్ని కాస్త అదుపుచేసుకోకపోతే ఆరోగ్యానికి ముప్పు తప్పదంటున్నారు వైద్యులు. తింటున్న మాంసం మంచిదేనా.. అంటే..? ఏమో అని దిక్కులు చూడాల్సిన పరిస్థితి జిల్లాలో పలుచోట్ల ఎదురవుతోంది. కనీస ప్రమాణాలు పాటించకుండా మాంసాహారాన్ని నిల్వ ఉంచుతుండడం ఆందోళన కలిగిస్తోంది. నిల్వ మాంసానికే రంగులద్ది మళ్లీమళ్లీ నూనెలో వేయించి.. వేడివేడిగా పొగలు కక్కిస్తూ వడ్డిస్తున్నారు. వాటిని ఎక్కువగా తినేవారిపై ఆరోగ్య సమస్యలు వచ్చిపడుతున్నాయి. సాక్షి, సూర్యాపేట : మారుతున్న ఆహారపు అలవాట్లకు అనుగుణంగా జిల్లాలో అధిక శాతం బయటి తిళ్లకు మక్కువ చూపుతున్నారు. అన్ని రోజుల్లోనూ మాంసాహారానికి గిరాకీ ఉంటుంది. ఇదే అదునుగా రోగాలభారిన పడిన జంతువుల మాంసాన్ని సైతం వంటకాల్లో కలిపేస్తున్నారు. జిల్లాలోని సూర్యాపేట, కోదాడ పట్టణాలతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న 65వ నంబర్ జాతీయ రహదారిపై ఉన్న హోటళ్లపై పర్యవేక్షణ అంతంత మాత్రంగానే ఉంది. దీంతో అడ్డగోలు వ్యాపారానికి అడ్డూఅదుపు లేకుండాపోతోంది. నిల్వ మాంసంతో పాటు నాసిరకం నూనెలు, అనుమతిలేని రంగులు మితిమీరి వాడకం ఎక్కువైపోయింది. నాణ్యత ప్రశ్నార్థకం.. నిబంధనల ప్రకారం.. మున్సిపాలిటీ, నగర పంచాయతీలు, పంచాయతీల్లో జంతువధ శాలల నిర్వహణ సమర్థంగా సాగాలి. మూగజీవాలను వధించే ముందురోజు వాటి ఆరోగ్య పరిస్థితి పరీక్షించి, అంతా సవ్యంగా ఉంటేనే వధించాలి. జిల్లాలో చూస్తే జంతువధ శాలల్లో ఒకటిరెండు ముద్రలు వేయించుకుని, తెరవెనుక మిగిలినవి అమ్మకాలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో అనారోగ్యంతో ఉన్నవీ విక్రయించేస్తున్నారు. కోడి మాంసం విక్రయించే దుకాణాల్లో కనీస శుభ్రత ఉండడం లేదు. అదే నీటిలో పదేపదే కోళ్లను కడగడం.. చర్మం తీసి అందులోనే ఎ క్కువ సేపు ఉంచడంతో బ్యాక్టీరియా సోకే ఆస్కా రం ఉంటోంది. దుకాణాల్లో కనీస రక్షణగా అద్దాలు.. జాలీలు ఏర్పాటు చేయడం లేదు. దీంతో వేలాడదీసిన మాంసంపై ఈగలు వాలుతున్నాయి. ధుమ్ము దూళి తాకి అనారోగ్యానికి కారణమవుతున్నాయి. వండిన వంటకాలదీ అదే పరిస్థితి జాడలేని అధికారుల తనిఖీలు జిల్లాలో పలు హోటళ్లలో మాంసం నిల్వలో ప్రమాణాలు ఎలా పాటిస్తున్నారు.. కొన్ని చోట్ల మాంసం బూజుపట్టడం.. నిషేధిక రంగుల వాడకాన్ని వినియోగిస్తున్న హోటళ్లపై నిఘా ఉంచాల్సిన సంబంధిత శాఖ అధికారులే జాడ లేకుండా పోయింది. కేవలం నెలకోమారు వారికి అవసరమున్నప్పుడే మాత్రమే పెద్దపెద్ద హోటళ్లతో కుమ్మకై వసూళ్లు చేసుకొని వెళ్తున్నట్లు ఆరోపణలు వెల్లివెత్తుతున్నాయి. కొన్ని హోటళ్ల నుంచి ఏకంగా మామూళ్లు వసూళ్లు చేసుకొని వెళ్తున్నట్లు సమాచారం. జిల్లాలోని హోటళ్లతో పాటు జాతీయ రహదారిపై ఉన్న దాబా హోటళ్లను తనిఖీ చేయాలని ఆహారప్రియులు వేడుకుంటున్నారు. -
రఘునాథపాలెం: దాడులకు దిగిన టీఆర్ఎస్,కాంగ్రెస్ వర్గీయులు
-
సూర్యాపేట జిల్లాలో భారీ నగదు పట్టివేత
-
అట్టహాసంగా ప్రారంభంకానున్న స్వేరో ఒలింపిక్స్
కోదాడ : చదువులో తిరుగులేని ప్రతిభను కనబరుస్తున్న సాంఘిక సంక్షేమ పాఠశాల, కళాశాల విద్యార్థులు క్రీడల్లో తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రీడా సమరానికి సూర్యపేట జిల్లా, కోదాడ మండలంలోని నడిగూడెం బాలికల గురుకుల పాఠశాల ఆతిథ్యం ఇస్తోంది. గురుకుల విద్యాలయాల కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ చేతుల మీదుగా బుధవారం ఈ క్రీడాసమరానికి తెరలేవనుంది. నాలుగురోజుల పాటు జరిగే ఈ ఐదో జోనల్ మేట్-2018లో అండర్-17 విభాగంలో 28 పాఠశాలల బాలికలు, అండర్-19 విభాగంలో 33 కళాశాలల 1840 మంది విద్యార్థినులు తమ సత్తా చాటనున్నారు. నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు చెందిన విద్యార్థులు ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. -
పెళ్లి ఇష్టం లేదని బ్లేడ్‌తో కోసి..!
సాక్షి, సూర్యాపేట : పట్టణంలో దారుణం వెలుగుచూసింది. పెళ్లి ఇష్టం లేదంటూ భార్యపై బ్లేడ్‌తో దాడి చేసి వేధించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన అల్లీ అనూషను, రాజీవ్‌నగర్‌కు చెందిన సాయి శివకు ఇచ్చి గత ఏడాది ఏప్రిల్ 29న వివాహం చేశారు. అయితే పెళ్లైన కొంత కాలానికే సాయి సైకోలో ప్రవర్తిస్తూ అనూషను వేధింపులకు గురిచేస్తున్నాడు. బ్లేడ్‌తో కోయడం, కొడుతూ శారీరకంగా వేధిస్తున్నాడు. అత్తమామలు, ఆడపడుచులు సైతం అనూషను తీవ్రంగా వేధింపులకు గురిచేస్తున్నారు. అయితే శుక్రవారం రాత్రి అనూషను హత్య చేయాడానికి మంచినీటిలో నిద్రమాత్రలు కలిపి తాగించే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న ఆమె తప్పించుకొని తల్లిదండ్రులకు వద్దకు చేరింది. శనివారం ఉదయమే పోలీస్‌స్టేషన్‌కు జరిగిందంతా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనూషకు సాయి శివ సొంత మేనబావే కావడం గమనార్హం. -
జిల్లా ఓటర్లు 8,14,271
దురాజ్‌పల్లి(సూర్యాపేట) : జిల్లా ఓటర్ల లెక్కలు తేలాయి. గతంలో కంటే ఈ సారి ఓటర్ల సంఖ్య పెరిగింది. శనివారం రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన జాబితా ప్రకారం జిల్లాలో మొత్తం 8,14,271 మంది ఓటర్లు ఉండగా ఇందులో 4,06, 233 మంది పురుషులు, 4,08,000 మంది స్త్రీలు, 38 మంది థర్డ్ జెండర్ ఉన్నారు. అత్యధికంగా తుంగతుర్తి నియోజకవర్గంలో 2,16,617 మంది, అత్యల్పంగా సూర్యాపేట నియోజకవర్గంలో 1,87,657 మంది ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గాల వారీగా ఓటర్లు ఇలా... జిల్లాలోని నాలుగు నియోజక వర్గాల పరిధిలో 997 పోలింగ్ కేంద్రాలు ఉండగా వీటి పరిధిలో 8,14,271మంది ఓటర్లు ఉన్నారు. సూర్యాపేట నియోజకవర్గంలో 232 పోలింగ్ కేంద్రాల పరిధిలో 1,87,657 మంది ఓటర్లు ఉండగా 94,495 మంది స్త్రీలు, 93,153 మంది పురుషులు, తొమ్మిది మంది ఇతర ఓటర్లు ఉన్నారు. అదే విధంగా కోదాడ నియోజకవర్గంలో 243 పోలింగ్ కేంద్రాల పరిధిలో 2,04,392 మంది ఓటర్లు ఉండగా 1,31,064 మంది స్త్రీలు, 1,12,021 మంది పురుషులు, ఏడుగురు ఇతరులు ఉన్నారు. తుంగతుర్తి నియోజకర్గంలో 279 పోలింగ్ కేంద్రాల పరిధిలో 2,16,617మంది ఓటర్లు ఉండగా వీరిలో 1,06,870 మంది స్త్రీలు, 1,09,733 మంది పురుషులు, 14మంది ఇతరులు ఉన్నారు. హుజూర్నగర్ నియోజకవర్గంలో 243 పోలింగ్ కేంద్రాల పరిధిలో 2,05,605 మంది ఓటర్లు ఉండగా వీరిలో 1,03,471 మంది స్త్రీలు,1,02,126 మంది పురుషులు, 8మంది ఇతర ఓటర్లు ఉన్నారు. పెరిగిన ఓటర్లు... జిల్లాలో గత నెల ప్రచురించిన ఓటర్ల సంఖ్య కంటే తుది ఓటర్ల జాబితాలో ఓటర్లు భారీగా పెరిగారు. జిల్లా అధికారులు ఓటరు నమోదు పై ప్రజల్లో అవగాహన కల్పించడంతో ప్రజలు భారీగా దరఖాస్తు చేసుకున్నారు. గత ఓటరు జాబితాతో పోల్చితే హుజూర్నగర్ నియోజకవర్గంలో 6, 287 మంది ఓటర్లు, కోదాడలో 5, 603 మంది, సూర్యాపేటలో 7,984 మంది ఓటర్లు, తుంగతుర్తి నియోజకవర్గంలో 7,298 మంది ఓటర్లు పెరిగారు. నియోజక వర్గాల వారీగా ఓటర్ల సంఖ్య నియోజకవర్గం పేరు పురుషులు మహిళలు ఇతరులు హుజూర్నగర్ 1,02,126 1,03,471 8 కోదాడ 1,02,221 1,03,164 7 సూర్యాపేట 93,153 94,4959 తుంగతుర్తి 1,09,733 1,06,870 14 -
వ్యవసాయ బావిలో పడి అన్నదమ్ములు మృతి
-
‘50 దేశాల్లో కేటీఆర్‌కు అభిమానులు’
సాక్షి, కోదాడ: కేటీఆర్ ప్రభంజనం చూసి ప్రతిపక్ష నాయకులకు జ్వరాలు వస్తున్నాయని మంత్రి జి. జగదీష్‌రెడ్డి అన్నారు. మంగళవారం జరిగిన సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకర్గ ప్రగతి సభలో మంత్రి కేటీఆర్, జగదీష్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ.. కేటీఆర్‌ను ఆకాశానికెత్తారు. ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ ఖ్యాతిని ఇనుమడింపజేసిన యువకెరటం కేటీఆర్ అని ప్రశంసించారు. ప్రపంచంలో 50 దేశాల్లో కేటీఆర్ ప్రాధ్యాన్యత వున్నదని, అభిమానులూ వున్నారని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ నాయకుల గురించి మంత్రి కేటీఆర్ వున్నది ఉన్నట్టుగా చెబుతూ అలీబాబా గుంపు అన్నారని గుర్తుచేశారు. దేశంలో ఎన్నికల మ్యానిఫెస్టో నూటికి నూరు శాతం అమలు చేసిన పార్టీ టీఆర్ఎస్ ఒక్కటేనని అన్నారు. 2019 ఎన్నికల్లో అన్ని నియోజకర్గాల్లో గులాబీ జెండా ఎగురుతుందని దీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 అసెంబ్లీ, 2 స్థానాలను తమ పార్టీ గెలుస్తుందని జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు. -
శివకాశి టు సూర్యాపేట
సూర్యాపేట : తమిళనాడు రాష్ట్రంలోని శివకాశి నుంచి సూర్యాపేట జిల్లా కేంద్రానికి టపాసులు అక్రమ రవాణా అవుతున్నాయి. జిల్లాలోని ఇతర పట్టణాలు, మండల కేంద్రం, గ్రామాలకు ఎలాంటి బిల్లులు లేకుండా భారీ ఎత్తున దిగుమతి చేస్తున్నారు. లక్షలాది రూపాయలు పెట్టుబడిగా పెట్టి సరుకును భారీగా సూర్యాపేటకు తెచ్చి అక్రమంగా నిల్వ ఉంచి.. గుట్టుచప్పుడు కాకుండా అమ్మకాలు చేస్తున్నారు. సూర్యాపేటలో టపాసుల విక్రయాల దందా జోరుగా సాగుతోంది. దీని కోసం జిల్లాలోని టపాసులు విక్రయించే వ్యాపారులు ముందస్తుగానే సిండికేట్‌గా మారి టపాసుల ధరలను విపరీతంగా పెంచేశారు. పండుగకు ముందే వ్యాపారస్తులు భారీగా పటాసులను తెచ్చి ఇంట్లో నిల్వ ఉంచుకున్నారు. ఈ క్రమంలో ఇటీవల విజిలెన్స్ అధికారులు పట్టణంలోని పలు షాపులపై దాడులు నిర్వహించారు. ఇందులో నాలుగు షాపుల్లో అక్రమ నిల్వలను గుర్తించారు. దానికి సంబంధించిన ఆధారాలను చూపించకపోవడంతో సరుకును సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. కాగా మంగళవారం సూర్యాపేటమండల పరిధిలోని పిల్లలమర్రి స్టేజీ వద్ద అక్రమంగా నిల్వ ఉంచిన రూ.4లక్షల విలువ చేసే బాణాసంచాను రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారుల సిండికేట్.. ఉమ్మడి జిల్లాలో దాదాపు 263 మంది పటాసుల విక్రయ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. సూర్యాపేటలో 28, కోదాడలో 11, హుజూర్‌నగర్‌లో 14షాపులు ఏర్పాటుకు దరఖాస్తులు వచ్చాయి. రూ.500 ఆన్లైన్ ద్వారా చెల్లించి లైసెన్స్ పొందిన వ్యాపారులు సిండికేట్‌గా మారి పటాసులను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. కొందరు లైసెన్స్‌దారులు సబ్లీజులకిచ్చి షాపులను పెట్టిస్తున్నారు. అన్నీ షాపుల్లోనూ ఒకే ధర ఉండే విధంగా ప్రణాళిక రూపొందించారు. కాగా జిల్లాలో హోల్‌సేల్ డీలర్లు ఒక్కరూ కూడా లేరని అగ్నిమాపక అధికారులు చెప్తుండగా.. కొంతమంది తాము హోల్‌సేల్ డీలర్లమంటూ చిరు వ్యాపారులకు అధిక ధరలకు సరుకు విక్రయిస్తున్నారు. ధరలు ఇలా.. వ్యాపారులు సిండికేట్‌గా మారి టపాసుల ధరలను మూడింతలు పెంచేశారు. కాకర్ ప్యాకెట్ హోల్‌సేల్ ధర రూ.30 ఉండగా దీన్ని రూ.120కు, చిచ్చుబుడ్డి ఫ్లవర్పాస్ ప్యాకెట్ ధర రూ.40 ఉండగా రూ.130లకు విక్రయిస్తున్నారు. థౌజండ్‌వాలా, మిరపకాయ బాంబులు, వెన్నెల మడుగు, తారా జువ్వలు, లక్ష్మిబాంబు లాంటి వాటి ధరలను భారీగా పెంచి ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఇవికాక చైనా నిషేధిక సరుకును కూడా విక్రయిస్తున్నట్లు సమాచారం. వాటిని తక్కువ ధరకు తీసుకొచ్చి అధిక ధరకు విక్రయిస్తున్నారు. వ్యాపారస్తులు వీటిని చాటుగా ఉంచి అమ్మకాలు సాగిస్తున్నట్లు తెలిసింది. ఇందులో పొటాషియం క్లోరైడ్ వినియోగించడంతో వాటి పొగ వల్ల ఊపిరితిత్తులు చెడిపోయే ప్రమాదం ఉంది. దీంతో ఆ దేశ దీపావళి మందులను ప్రభుత్వం నిషేధించింది. కొంతమంది అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ.. పటాసుల విక్రయాలను చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు నెలకొన్నాయి. నిషేధిత టపాసులు విక్రయిస్తే చర్యలు నిషేధిత టపాసులు విక్రయిస్తే చర్యలు తప్పవు. ఉమ్మడి జిల్లాలో షాపుల ఏర్పాటు కోసం ఆన్లైన్ ద్వారా 263 దరఖాస్తులు వచ్చాయి. లైసెన్స్ పొందిన వారు నాణ్యమైన, లేబుల్స్ ఉన్న టపాసులు అమ్మాలి. లైసెన్స్‌దారులు ఇతరులకు సబ్ లీజ్ ఇస్తే చర్యలు తీసుకుంటాం. వారి లైసెన్సు రద్దు చేస్తాం. అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవు. – యజ్ఞనారాయణ, డిస్ట్రిక్ ఫైర్ ఆఫీసర్ -
ఆస్తి తగాదా ఒకరు మృతి
-
సీఎం పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు
సూర్యాపేట : ఈ నెల 12న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జిల్లా పర్యటనకు రానున్నందుకు పటిష్టమైన ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ సురేంద్రమోహన్ తెలి పారు. ముఖ్యమంత్రి పర్యటించనున్న ప్రదేశాలను సోమవారం డీఐజీ ఎన్.శివశంకర్‌రెడ్డి, జిల్లా ఎస్పీ ప్రకాశ్జాధవ్, సంయుక్త కలెక్టర్ సంజీవరెడ్డిలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ముఖ్యమంత్రి హైదరాబాద్ నుంచి హెలి కాప్టర్ ద్వారా బయలుదేరి సూర్యాపేటలోని ఎస్వీ డిగ్రీ కళాశాల ఆవరణలో లాండ్ అవుతారన్నారు. అనంతరం ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల సమీపంలోని ఎస్పీ కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని చెప్పారు. గొల్లబజార్‌లో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్ల సమూదాయాయానికి ప్రారంభోత్సవం చేయనున్నట్టు తెలిపారు. అనంతరం కుడకుడ రోడ్డులో కలెక్టరేట్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన, వీకే.పహాడ్‌లో నిర్మించిన 400 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రారంభం, బి.చందుపట్లలో నిర్మించిన మిషన్ భగీరథ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభిస్తారన్నారు. అలాగే బి.చందుపట్ల మోడల్ అంగన్వాడీ కేంద్రం, ఎస్సీ హాస్టల్ సందర్శించనున్నట్టు కలెక్టర్ పేర్కొన్నారు. ఆయా ప్రదేశాలను సందర్శించిన వారిలో ఆర్అండ్బీ, పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్, అటవీశాఖ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. భవనాల పరిశీలన.. చివ్వెంల (సూర్యాపేట) : మండలంలో ఈ నెల 12న రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పర్యటించి పరిశీలించనున్న ప్రభుత్వ భవనాలను సోమవారం అధికారులు సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, బి.చందుపట్ల గ్రామంలో మోడల్ ఎస్సీ హాస్టల్, అంగన్వాడీ కేంద్రం, అదేవిధంగా మిషన్ భగీరథ పనులతో పాటు వట్టిఖమ్మంపహాడ్ గ్రామ శివారులో రూ.302 కోట్ల వ్యయంతో నిర్మించిన 420 కేవీ సబ్‌స్టేషన్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఐజీ శివశంకర్‌రెడ్డి, కలెక్టర్ కె.సురేంద్రమోహన్, ఎస్పీ ప్రకాశ్‌జాదవ్, డీఎంహెచ్ఓ తండు మురళీమోహన్. డీఎస్పీ నాగేశ్వర్రావు, డిప్యూటీ డీఎంహెచ్ఓ కె.శ్రీనివాస్‌రాజ్ తదితరులు ఉన్నారు. -
వరుసలుపెట్టి పిలుస్తూ..
నల్లగొండ, సూర్యాపేట క్రైం : అమ్మా.. అక్కా.. అన్నా ఉన్నావా అంటూ వరుసలు పెట్టి పిలుస్తూ.. దప్పిక వేస్తోంది.. నీళ్లు ఇవ్వమని అడుగుతూ.. మాటల్లోకి దించి చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని సూర్యాపేట పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ ఎం.నాగేశ్వరరావు వివరాలు వెల్లడించారు. పట్టణంలోని జేజేనగర్‌కు చెందిన నరందాసు మణికంఠ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో దొంగతనాలకు అలవాటుపడ్డాడు. సెప్టెంబర్ 15న స్థానిక 60 ఫీట్ల రోడ్డులో గల ఓ ఇంటికి వెళ్లి దప్పిక వేస్తుందని.. ఇంట్లో ఉన్న వృద్ధురాలిని మాటల్లోకి దింపి బంగారు గొలుసు, ముత్యపు ఉంగరం, రూ.600 గల పర్సును దొంగిలించాడు. ఉంగరాన్ని ముత్తూట్ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టి రూ.6700 తీసుకుని వాడుకున్నాడు. సెప్టెంబర్ 26న తేదీన సూర్యాపేటలోని కబేళా బజారులో గల ఓ ఇంటికి వెళ్లి ఇంట్లోని బీరువా సీక్రెట్ లాకర్‌ను పగులగొట్టి బీరువాలో గల పుస్తెలతాడు, ఉంగరం, దిద్దులు, లక్ష్మీదేవి బిల్ల, వెండి కుంకుడుకాయ, పర్సు దొంగలించాడు. నకిరేకల్‌కు వెళ్లి గుర్తు తెలియని వ్యక్తికి ఒక ఉంగరం, దిద్దు బుట్టలు తాకట్టు పెట్టి రూ.3 వేలు తీసుకున్నాడు. 28న పట్టణంలోని ముత్తూట్ ఫైనాన్స్‌లో పుస్తెల తాడును తాకట్టుపెట్టి రూ.39000 తీసుకున్నాడు. మంగళవారం స్థానిక కొత్త బస్టాండ్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా మణికంఠపై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్‌కు తీసుకొచ్చి సోదాచేశారు. అతని వద్ద బంగారు గొలుసు, లక్ష్మీదేవి బొమ్మ గల బంగారు బిల్ల, బంగారు చెవి దిద్దుబుట్టా, వెండి కుంకుడుకాయ లభ్యమయ్యాయి. వీటిపై విచారించగా.. నేరం ఒప్పుకున్నాడు. నిందితుడి నుంచి సుమారు రూ. 1.50 లక్షల విలువ చేసే ఐదు తులాల ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మణికంఠ గతంలో పట్టణంలోనే చాలా దొంగతనాలు చేశాడు. 2016, డిసెంబర్లో సూర్యాపేటలో మూడు చోరీలకు పాల్పడి.. పోలీసులకు పట్టబడ్డాడు. ఈ కేసుల్లో 8 నెలల శిక్ష అనుభవించాడు. ఆగస్టులో జైలు నుంచి విడుదలైన తర్వాత తిరిగి చోరీలకు పాల్పడుతున్నాడు. సమావేశంలో సీఐ వై.మొగలయ్య, ఎస్ఐ జానికిరాములు, ఐడీ పార్టీ హెడ్ కానిస్టేబుల్ చనగాని వెంకన్నగౌడ్, ఐడీ పార్టీ కానిస్టేబుళ్లు చామకూరి శ్రీనివాస్‌గౌడ్, రామచంద్రయ్య, దైద రాజు, జనార్దన్‌రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
మానవత్వానికి బహిష్కరణ!
సూర్యాపేట జిల్లా చిలుకూరులో స్వాతంత్య్ర సమరయోధుడి కుటుంబం వెలి చిలుకూరు (కోదాడ): ఆమె ఓ స్వాతంత్య్ర సమరయోధుడి భార్య.. స్వాతంత్య్ర ఉద్యమంలో తెల్లవాళ్లపై పోరాడిన భర్తకు తోడునీడగా నిలిచింది.. కానీ తన జీవిత చరమాంకంలో కుల చిచ్చులో చిక్కుకుపోయింది.. కుల బహిష్కరణకు గురికావడంతో సన్నిహితులకు, తెలిసినవాళ్లకు దూరమైంది.. ఆమె మరణించాక దహన సంస్కారాలకు కూడా కులం వాళ్లెవరూ రాకపోవడంతో ఆలస్యంగా గురువారం ఈ విషయం వెలుగుచూసింది. సూర్యాపేట జిల్లా చిలుకూరులో ఈ ఘటన జరిగింది. ఆగ్రహం పెంచుకుని..: చిలుకూరు గ్రామానికి చెందిన చిలువేరు గురవయ్య స్వాతంత్య్ర సమరయోధుడు. ఆయన భార్య నర్సమ్మ. చాలాకాలంగా గ్రామంలో తమ కుల పెద్దగా వ్యవహరించిన గురవయ్య కొన్నేళ్ల కింద చనిపోయారు. తర్వాత ఆయన కుమారుడు రామలింగయ్య కులపెద్దగా వ్యవహరించారు. గ్రామంలో ఆ కులానికి చెందిన కుటుంబాలు 60 వరకు ఉన్నాయి. అయితే ఆరు నెలల కింద అదే కులానికి చెందిన ఆంజనేయులు అనే వ్యక్తి.. కొంతమంది కులస్తులతో కలసి తానే కులపెద్దగా ప్రకటిం చుకున్నాడు. ఆయన సాక్షర భారత్ కో–ఆర్డినేటర్‌గా పనిచేస్తుండడం, ప్రభుత్వ పథకాల విషయంలో కార్యాలయాల చుట్టూ తిరుగుతుం డడంతో ఆ కులం వాళ్లు అతడివైపే మొగ్గుచూపారు. కానీ గ్రామంలో మిగతా కులాల పెద్దలు దీనిని వ్యతిరేకించారు. దీంతో ఆంజనేయులు ఆగ్రహం పెంచు కుని.. చిలువేరు రామలింగయ్యను, నర్సమ్మను కులం నుంచి బహిష్కరించాడు. కులానికి చెందిన ఎవరైనా వారి ఇంటికి వెళ్లినా, ఎలాంటి కార్యక్రమాలకు హాజరైనా జరిమానా కట్టాల్సి ఉంటుందని హెచ్చరించాడు. ఇటీవల ఆ కులానికి చెందిన ఓ వ్యక్తి తన ఇంట్లో శుభాకార్యానికి చిలువేరు రామలింగయ్య కుటుంబాన్ని ఆహ్వానించాడు. దీనిపై ఆగ్రహించిన ఆంజనేయులు కుల పంచాయితీ పెట్టి.. ఆ వ్యక్తిని హెచ్చరించి, రూ.వెయ్యి జరిమానా విధించాడు. దీంతో కులం వాళ్లంతా భయపడి చిలువేరు రామలింగయ్య కుటుంబానికి దూరంగా ఉన్నారు. నర్సమ్మ మృతితో..: రామలింగయ్య తల్లి నర్సమ్మ (102) గురువారం మృతి చెందింది. ఆమె అంత్యక్రియలకు కూడా కులం వాళ్లు ఎవరూ వెళ్లవద్దంటూ ఆంజనేయులు ఆదేశించడంతో.. 60 కుటుంబాలలో ఒక్కరు కూడా రాలేదు. దీనిపై గ్రామపెద్దలు ఆంజనేయులుతో మాట్లాడినా.. ‘ఆ కుటుంబాన్ని బహిష్కరించాం.. అక్కడికి వచ్చేది లేద’ని స్పష్టం చేశాడు. కుటుంబ సభ్యులు చివరికి బంధువులు, గ్రామస్తుల సహకారంతో అంత్యక్రియలు పూర్తిచేశారు. చర్యలు తీసుకోవాలి ఆంజనేయులు మా కుటుంబాన్ని బహిష్కరించాడు. అతను సాక్షర భారత్ కో–ఆర్డినేటర్‌గా, ప్రభుత్వ పథకాల పనుల్లో కార్యాలయాల చుట్టూ తిరుగుతుండడంతో కులంలో అందరూ అతడి మాట వింటున్నారు. సాక్షర భారత్ కో–ఆర్డినేటర్‌గా కుల బహిష్క రణను అరికట్టాల్సిన వ్యక్తి ఇలాంటి చర్యలకు పాల్పడుతు న్నాడు. అతడిపై అధికారులు చర్యలు తీసుకోవాలి. – చిలువేరు వెంకటేశ్వర్లు, రామలింగయ్య కుమారుడు