సాక్షి, చింతపల్లి (నల్గొండ) : సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం శూన్యపాడుతండాకు చెందిన జహేందర్(30) హత్యోదంతం కేసు మిస్టరీ వీడడం లేదు. చింతపల్లి మండలం విరాట్‌నగర్ కాలనీ మహంకాళి అమ్మవారి పాదాల వద్ద ఈ నెల 10న మొండెం నుంచి వేరుచేయబడిన జహేందర్ తల లభ్యమైంది. మూడు రోజుల తర్వాత అతడి మొండెం రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్‌లోని ఓ నిర్మాణంలో ఉన్న భవనంలో లభించిన విషయం తెలిసిందే. అయితే, జయేందర్‌ది హత్యా.. నరబలినా అనేది ఇప్పటికీ పోలీసులకు అంతుచిక్కడం లేదు. జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి ఈ కేసును సవాలుగా తీసుకున్నా ముందుకు సాగడం లేదని తెలుస్తోంది.
చదవండి: (ఘోర రోడ్డు ప్రమాదం.. క్షతగాత్రులను చూసి.. చలించిన యువ డాక్టర్)
దుండగులు ఈ హత్యోదంతంలో అత్యంత చాకచక్యంగా వ్యవహరించినట్లు పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. కేసు ఛేదనకు పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. తుర్కయంజాల్‌లో జహేందర్ మొండెం లభ్యం కావడంతో రంగారెడ్డి జిల్లా పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న భవన యజమానిని అదుపులోకి తీసుకుని జయేందర్ మొండెం ఇక్కడికి ఎలా వచ్చిందనే కోణంలో విచారిస్తున్నట్లు తెలిసింది.
చదవండి: (ఆరు నెలల క్రితమే వివాహం.. రోడ్డు ప్రమాదంలో ఏఆర్ కానిస్టేబుల్ మృతి)
Comments
Please login to add a commentAdd a comment