Torso Without head
-
హత్యా.. నరబలా ?.. అంతుచిక్కని జహేందర్ హత్యోదంతం
సాక్షి, చింతపల్లి (నల్గొండ) : సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం శూన్యపాడుతండాకు చెందిన జహేందర్(30) హత్యోదంతం కేసు మిస్టరీ వీడడం లేదు. చింతపల్లి మండలం విరాట్‌నగర్ కాలనీ మహంకాళి అమ్మవారి పాదాల వద్ద ఈ నెల 10న మొండెం నుంచి వేరుచేయబడిన జహేందర్ తల లభ్యమైంది. మూడు రోజుల తర్వాత అతడి మొండెం రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్‌లోని ఓ నిర్మాణంలో ఉన్న భవనంలో లభించిన విషయం తెలిసిందే. అయితే, జయేందర్ది హత్యా.. నరబలినా అనేది ఇప్పటికీ పోలీసులకు అంతుచిక్కడం లేదు. జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి ఈ కేసును సవాలుగా తీసుకున్నా ముందుకు సాగడం లేదని తెలుస్తోంది. చదవండి: (ఘోర రోడ్డు ప్రమాదం.. క్షతగాత్రులను చూసి.. చలించిన యువ డాక్టర్) దుండగులు ఈ హత్యోదంతంలో అత్యంత చాకచక్యంగా వ్యవహరించినట్లు పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. కేసు ఛేదనకు పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. తుర్కయంజాల్‌లో జహేందర్ మొండెం లభ్యం కావడంతో రంగారెడ్డి జిల్లా పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న భవన యజమానిని అదుపులోకి తీసుకుని జయేందర్ మొండెం ఇక్కడికి ఎలా వచ్చిందనే కోణంలో విచారిస్తున్నట్లు తెలిసింది. చదవండి: (ఆరు నెలల క్రితమే వివాహం.. రోడ్డు ప్రమాదంలో ఏఆర్ కానిస్టేబుల్ మృతి) -
మొండెం దొరికింది.. తల మిస్టరీ వీడింది
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లా చింతపల్లి మండల పరిధిలో మెట్టు మహంకాళిమాత పాదాల వద్ద 2 రోజుల క్రితం లభ్యమైన వ్యక్తి తల మిస్టరీ వీడింది. రంగారెడ్డి జిల్లా తుర్కంజయాల్ వద్ద శిరస్సు లేని మొండెం లభించింది. ఇళ్ల మధ్యలో నిర్మాణంలో ఉన్న ఇంటిపై హత్య జరిగిన నాలుగు రోజులు తర్వాత శిరస్సు లేని మొండెం లభ్యమైంది. ఇది నాలుగురోజుల క్రితం హత్యకు గురైన సూర్యాపేట జిల్లా పాలకీడు మంండలం శూన్యపహాడ్ తండాకు చెందిన జహేందర్ నాయక్‌దిగా గుర్తించారు. అయితే పోస్టుమార్టం తర్వాత పోలీసులు అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ కేసును జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి ఛాలెంజింగ్‌గా తీసుకోని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (అమీర్‌పేట: భర్తకు బెయిల్ ఇప్పిస్తానని.. ఓయో లాడ్జికి రప్పించి) -
మొండెం మధ్యప్రదేశ్‌లో.. తల బెంగళూరులో..
భోపాల్ : మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రైలు పట్టాలపై లభించిన మొండెం తాలూకూ తల బెంగళూరులో దర్శనమిచ్చింది. రైలు ఇంజన్లో ఇరుక్కున్న తల దాదాపు 1300 కిలోమీటర్లు ప్రయాణించి బెంగళూరు రైల్వే స్టేషన్లో చిక్కింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అక్టోబర్ 3వ తేదీన మధ్యప్రదేశ్, బెతుల్ రైల్వే స్టేషన్‌లోని పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి మొండెం లభించింది. అయితే తల, మరి కొన్ని ఇతర భాగాలు కనిపించకపోవటంతో అతడి ఆచూకీ తెలుసుకోవటం పోలీసులకు ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 4న రైలు ఇంజన్‌కు చిక్కుకుని ఉన్న తలను బెంగళూరు రైల్వే స్టేషన్ సిబ్బంది గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ( ‘అవి రక్తపు మరకలు కాదు పెయింట్’ ) తలను ఫొటో తీసి విచారణ చేయగా.. తల లేని మొండెం ఒకటి మధ్యప్రదేశ్, బతుల్ రైల్వే స్టేషన్లో దొరికినట్లు బెంగళూరు పోలీసులకు తెలియవచ్చింది. ఆ తర్వాత మధ్యప్రదేశ్‌కు చేరుకున్న బెంగళూరు పోలీసులు దర్యాప్తు చేయగా సదరు విడి భాగాలు బతుల్‌కు చెందిన 28 ఏళ్ల రవి మర్కామ్‌కు చెందినవిగా తేలింది. రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు అతడి తల మీదనుంచి వెళ్లటం కారణంగా అతడు మరణించినట్లు పోలీసులు ధ్రువీకరించారు. ఇది హత్యా? లేక ఆత్మహత్యా? అన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను శుక్రవారం మీడియాకు వెల్లడించారు. -
కలకలం రేపిన మొండెం లేని తల
అప్జల్‌గంజ్: మొండెం లేని తల కలకలం రేపింది... ఆదివారం గౌలిగూడలో గుర్తుతెలియని వ్యక్తిని ఎవరో హత్య చేసి తలను, మొండెంను వేరు చేశారనే వదంతులు వ్యాపించాయి. తీరా అది ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి తల అని తేలడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. వివరాలు... కాచిగూడ రైల్వే పోలీసుస్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అతడి తల, మొండెం వేరయ్యాయి. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి మృతదేహాన్ని రైల్వే పోలీసులు ఉస్మానియా మార్చురీకి రిక్షాలో తరలించారు. అయితే రిక్షాలో మృతదేహాన్ని తరలిస్తుండగా గౌలిగూడ శివాజీ బ్రిడ్జి సమీపంలో రిక్షాలోంచి తల కిందపడింది. ఇది గమనించని రిక్షావాలా మొండెంతో ఉస్మానియా మార్చురీకి వెళ్లిపోయాడు. తల రోడ్డుపై పడటంతో అది చూసిన పాదచారులు, వాహనదారులు ఎవరో వ్యక్తిని హత్య చేసి, తలను రోడ్డుపై పడేశారంటూ పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే ఆ వ్యక్తిని హత్య చేశారనే పుకార్లు షికార్లు చేశాయి. ఘటనాస్థలానికి చేరుకున్న అప్జల్‌గంజ్ ఎస్ఐ రాఘవేందర్ దర్యాప్తు చేపట్టగా...అది కాచిగూడ రైల్వేస్టేషన్లో ఆత్మహత్య చేసుకున్న గుర్తు తెలియని వ్యక్తి తల అని తేలింది. అయితే రిక్షాలో తరలిస్తుండగా పడిపోయినట్లు గుర్తించిన పోలీసులు రిక్షావాలను రప్పించి తలను ఉస్మానియా మార్చురీకి తరలించడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.