
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లా చింతపల్లి మండల పరిధిలో మెట్టు మహంకాళిమాత పాదాల వద్ద 2 రోజుల క్రితం లభ్యమైన వ్యక్తి తల మిస్టరీ వీడింది. రంగారెడ్డి జిల్లా తుర్కంజయాల్ వద్ద శిరస్సు లేని మొండెం లభించింది. ఇళ్ల మధ్యలో నిర్మాణంలో ఉన్న ఇంటిపై హత్య జరిగిన నాలుగు రోజులు తర్వాత శిరస్సు లేని మొండెం లభ్యమైంది. ఇది నాలుగురోజుల క్రితం హత్యకు గురైన సూర్యాపేట జిల్లా పాలకీడు మంండలం శూన్యపహాడ్ తండాకు చెందిన జహేందర్ నాయక్‌దిగా గుర్తించారు. అయితే పోస్టుమార్టం తర్వాత పోలీసులు అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ కేసును జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి ఛాలెంజింగ్‌గా తీసుకోని దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: (అమీర్‌పేట: భర్తకు బెయిల్ ఇప్పిస్తానని.. ఓయో లాడ్జికి రప్పించి)
Comments
Please login to add a commentAdd a comment