rangareddy district
-
త్వరలోనే ‘ఆ పది’కి ఉప ఎన్నికలు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా/షాబాద్: బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో త్వరలోనే ఉప ఎన్నికలు రాబోతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్లుగా ఈ నెల 26 నుంచి రైతులందరికీ ఎకరానికి రూ.17,500, కౌలు రైతులకు రూ.15,000, భూమిలేని రైతు కూలీలకు రూ.12,000 ఇవ్వాలనే డిమాండ్‌తో శుక్రవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలో నిర్వహించిన ‘రైతు దీక్ష’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ‘చేవెళ్ల సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారిన ఆ పది నియోజకవర్గాల్లోనూ త్వరలోనే ఉప ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటికే సుప్రీంకోర్టు తీర్పు కూడా ఉంది.అప్పట్లో కాంగ్రెస్ తరఫున వాదించిన న్యాయవాది ఆర్య సుందరం ఈ ఉప ఎన్నికలపై కూడా వాదిస్తున్నారు. కచ్చితంగా ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయి. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు బుద్ధి చెప్పేందుకు ఆ స్థానాల్లో పోటీకి బీఆర్ఎస్లో అనేక మంది సిద్ధంగా ఉన్నారు’అని తెలిపారు. ప్రభుత్వం హామీలను అమలు చేయకుంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచారానికి వచ్చే కాంగ్రెస్ నాయకులను ప్రజలు గల్లాపట్టి నిలదీసేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్‌గాంధీ సహా సీఎం రేవంత్‌రెడ్డిపై 420 కేసు నమోదు చేయాలని అన్నారు. ఇక్కడ ఏ ఒక్క హామీ అమలు చేయకుండానే.. అన్నీ చేసినట్లు ఢిల్లీలో సీఎం గప్పాలు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ నాట్లప్పుడు ఇస్తే.. రేవంత్ ఓట్లప్పుడు ఇస్తామంటుండు కాంగ్రెస్ అభయహస్తం తెలంగాణ ప్రజల పాలిట భస్మాసుర హస్తంలా మారిందని కేటీఆర్ విమర్శించారు. ‘నాడు కేసీఆర్ రైతులకు నాట్లు వేసేటప్పుడు పైసలు ఇస్తే.. నేడు రేవంత్ ఓట్లప్పుడు మాత్రమే ఇస్తా అంటుండు. అధికారంలోకి రాకముందు మూడు పంటలకు రైతుబంధు ఇవ్వాలన్న రేవంత్ రెడ్డి..తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా ఇవ్వలేక పోయిండు. 1.60 కోట్ల మంది మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం నెలకు రూ.2 వేల చొప్పున ఇప్పటివరకు ఒక్కొక్కరికి రూ.30 వేలు బాకీ పడింది. ఓట్లు అడగడానికి వచ్చే కాంగ్రెస్ నేతలను ముందు తమ బాకీ తీర్చాలని అడగండి’అని పిలుపునిచ్చారు. 21న నల్లగొండలో రైతు ధర్నా నిర్వహిస్తామని, ఆ తర్వాత ఇతర జిల్లాల్లోనూ ఈ దీక్షలు కొనసాగుతాయని కేటీఆర్ ప్రకటించారు. ఈ రైతు దీక్షలో మాజీ మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్‌గౌడ్, పి.సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పట్నం నరేందర్‌రెడ్డి, అంజయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
రంగారెడ్డి జిల్లాలో చిరుత కలకలం
-
రంగారెడ్డి: రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీకి చిక్కిన అడిషనల్ కలెక్టర్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ భూపాల్‌రెడ్డి ఏసీబీకి చిక్కారు. రూ.8 లక్షల లంచం తీసుకుంటూ భూపాల్ రెడ్డితో పాటు సీనియర్ అసిస్టెంట్ దొరికిపోయారు. ఆయన ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. సీనియర్ అసిస్టెంట్ మదన్‌మోహన్‌లాల్ ఇంట్లోనూ ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. రంగారెడ్డి కలెక్టర్ ఆఫీసులో నిన్న సాయంత్రం నుంచి ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.వ్యక్తి ధరణి వెబ్ సైట్లో ప్రొహిబిటెడ్ లిస్ట్ నుంచి 14 గుంటల ల్యాండ్‌ను తొలగించాలని సీనియర్ అసిస్టెంట్‌ను బాధితుడు కోరాడు. ఈ పని చేసేందుకు సీనియర్ అసిస్టెంట్ మదన్‌మోహన్‌లాల్ రూ. 8 లక్షలు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఆ డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా అధికారులు పట్టుకున్నారు. -
అతనికి ఉరే సరి: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో రంగారెడ్డి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. అత్యంత పాశవికంగా చిన్నారిపై దారుణానికి ఒడిగట్టిన దినేశ్‌కు ఉరిశిక్షే సబబని చెప్పింది. రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో 2017లో నమోదైన ఈ కేసులో నిందితుడు దినేశ్‌కుమార్‌ను రంగారెడ్డి జిల్లా కోర్టు 2021లో దోషిగా తేల్చింది. ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. దీనిపై దినేశ్ హైకోర్టులో సవాల్ చేయగా, ట్రయల్ కోర్టు నిర్ణయం సబబేనంటూ.. ఉరిశిక్షను ఖరారు చేస్తూ బుధవారం హైకోర్టు తీర్పునిచ్చింది. అప్పీల్‌ను కొట్టివేస్తూ ట్రయల్ కోర్టు నిర్ణయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం కనిపించడం లేదంది. ఇలాంటి కేసుల్లో నిందితులకు సత్వరం శిక్షలు పడితేనే.. బాధితులకు కొంతైనా న్యాయం జరుగుతుందని చెప్పింది. దినేశ్ అప్పీల్‌పై జస్టిస్ శామ్ కోషి, జస్టిస్ సాంబశివరావు నాయుడు విచారణ చేపట్టారు. కేసు పూర్వాపరాలు...హైదరాబాద్‌లోని అల్కాపురి టౌన్షిప్లో ఒడిశాకు చెందిన భార్యభర్తలు పనిచేసేవారు. మధ్యప్రదేశ్‌కు చెందిన దినేశ్ అక్కడే సెంట్రింగ్ పనిచేసేవాడు. ఒడిశా దంపతులతో కలిసిమెలిసి ఉండేవాడు. 2017, డిసెంబర్ 12న ఇంటి ముందు ఒంటరిగా ఆడుకుంటున్న వారి ఐదేళ్ల కుమార్తెకు చాక్లెట్ల ఆశ చూపి నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లాడు. అత్యాచారానికి పాల్పడటమే కాకుండా బండరాయితో మోది హత్య చేశాడు.నేరం అంగీకరించిన నిందితుడుచిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు.. చిన్నారి చివరిసారిగా దినేశ్‌తో కనిపించిందనే ఆధారంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి దుస్తులకు అంటుకున్న గునుగు పూలను గమనించి అతడే నేరం చేశాడని నిర్ధారణకు వచ్చారు. దినేశ్‌ను అరెస్ట్ చేశారు. కిడ్నాప్, అత్యాచారం, హత్యతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. కేసులో వేగంగా విచారణ చేపట్టిన రంగారెడ్డి జిల్లా కోర్టు 2021, ఫిబ్రవ రిలో దినేశ్‌ను దోషిగా నిర్ధారిస్తూ మరణ శిక్ష విధించింది. తలారి లేడు.. ఉరి కంబమూ లేదు..రాష్ట్రంలోని జైళ్లలో ఎక్కడా నేరస్తులకు ఉరి శిక్ష అమలు చేసేందుకు తలారి లేడు.. కంబమూ లేదు. రాష్ట్ర పరిధిలో ఉరిశిక్ష అమలు జరిగి దాదాపు నాలుగు దశాబ్దాలకు పైనే అయ్యింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌లోని ముషీరాబాద్, రాజమండ్రి జైళ్లలో ఉరి తీసేందుకు వీలు ఉండేది. అయితే ముషీరాబాద్ జైలు తీసేసిన తర్వాత ఉరి అమలు చేసే వీలు లేకుండాపోయింది. చర్లపల్లిలో స్థలం ఉన్నా.. నిర్మాణం చేపట్టలేదు. అలాగే తలారి కావాల్సి వస్తే ఇతర ప్రాంతాల నుంచో లేదా ఇక్కడే ఎవరన్నా ముందుకొస్తే వారికి శిక్షణ ఇప్పించో అమలు చేయాల్సిన పరిస్థితి. దినేశ్‌కు హైకోర్టు ఉరి శిక్ష ఖరారు చేసిన నేపథ్యంలో ఇది చర్చనీయాంశంగా మారింది.‘అమానుషమైన దారుణాలకు పాల్పడితే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో.. ఇలాంటి మరణ శిక్షల ద్వారా తెలియజేయాలి. అయితే, మరణశిక్షపై భిన్నాభిప్రాయాలున్నాయి. మరణశిక్షకు బదులుగా మారేందుకు అవకాశం ఇచ్చేలా జీవితఖైదు విధిస్తే సరిపోతుందని కొందరు అభిప్రాయపడుతుంటారు. ఇలాంటి వారు బాధితురాలి తల్లిదండ్రుల పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాలి. తమ ఐదేళ్ల కుమార్తె తప్పిపోయిన తర్వాత బాధితురాలి తల్లిదండ్రులు మొదటిసారిగా ఆమె మృతదేహాన్ని చూసినప్పుడు, ఆమె ప్రైవేట్ భాగాలపై గాయాలతో నగ్నంగా పడి ఉండటాన్ని చూసినప్పుడు ఎంత విలవిలలాడిపోయారో ఎవరికీ తెలియదు. చిన్నారి తలపై బండరాళ్లతో కొట్టారు. నేరం జరిగిన ఏడేళ్ల తర్వాత కూడా ఆ దృశ్యం తల్లిదండ్రుల మదిలో మెదులుతూనే ఉంటుంది’ –హైకోర్టు ధర్మాసనం -
ప్రూట్ పూల్
సాక్షి, రంగారెడ్డిజిల్లా: నగరాన్ని ఆనుకొని ఉన్న రంగారెడ్డి జిల్లాలో పండ్ల తోటల సాగు క్రమేపీ పెరుగుతోంది. అన్ని రకాల పండ్లతోటలు సాగు చేసి రైతులు లాభాలు ఆర్జిస్తున్నారు. భౌగోళిక, వాతావరణ పరిస్థితు లు భిన్నంగా ఉన్నా..వివిధ రకాల పండ్ల తోటలు సాగు చేసి అధిక దిగుబడులు సాధిస్తూ యువరైతులు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. డ్రాగన్ ప్రూట్, కర్జూర, అవకాడో, యాపిల్ ఇలా వివిధ పండ్ల తోటలు జిల్లాలో సాగవుతున్నాయి. పులిమామిడిలో ‘యాపిల్’ ⇒ యాపిల్ అనగానే హిమాచల్‌ప్రదేశ్, కశీ్మర్ మాత్రమే గుర్తొస్తాయి. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలోనూ యాపిల్ తోటలు ఉన్నాయి. కందుకూరు మండలం పులిమామిడి పరిధిలోని శ్రీనిఖిల్ చేతనాకేంద్రం ఆశ్రమ నిర్వాహకులు 2021 డిసెంబర్లో హిమాచల్‌ప్రదేశ్ నుంచి హరిమన్–99 రకానికి చెందిన 170 మొక్కలు తెప్పించి, 30 గుంటల్లో నాటారు. మరో నాలుగు అన్నారకం మొక్క లు కూడా నాటారు. ప్రస్తుతం ఒక్కో మొక్క నుంచి వంద నుంచి రెండు వందల పండ్ల వరకు దిగుబడి వచ్చింది. సాధారణంగా మంచు, చలి ఎక్కువగా ఉండే ప్రదేశంలోనే ఈ యాపిల్ పంట పండుతుంది. కానీ జిల్లాలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతను కూడా తట్టుకొని దిగుబడి వస్తుండటం విశేషం. దెబ్బగూడలో ‘అవకాడో’ ⇒ సాధారణంగా 25 డిగ్రీల వాతావరణంలో మాత్రమే పెరిగే అవకాడో 40 డిగ్రీలకుపైగా నమోదైన ఉష్ణోగ్రతలను సైతం తట్టుకొని నిలబడింది. కందుకూరు మండలం దెబ్బ గూడకు చెందిన రమావత్ జైపాల్ జిల్లాలోనే తొలిసారిగా అవకాడో పండ్ల తోట సాగుచేశారు. ఆయన మూడేళ్ల క్రితం ప్రయోగాత్మకంగా ఎకరం పది గుంటల్లో 220 అవ కాడో మొక్కలు నాటారు. మొక్క నాటే సమయంలో గుంతలో యాప పిండి, గులికల మందు వాడాడు. ఆ తర్వాత డ్రిప్ సాయంతో మొక్కలకు నీరు అందించాడు. చీడపీడల సమస్యే కాదు పెట్టుబడికి పైసా ఖర్చు కూడా లేకపోవడం ఆ యువరైతుకు కలిసి వచి్చంది. ప్రస్తుతం ఆ మొక్కలు ఏపుగా పెరిగి కాపు కొచ్చాయి. ఒక్కో చెట్టు నుంచి 150 నుంచి 200 కాయలు దిగుబడి వచి్చంది.తుక్కుగూడలో ద్రాక్ష సాగు..⇒ నిజాం నవాబుల బ్యాక్‌యార్డ్(ఇంటి వెనుక గార్డెన్)ల్లో ద్రాక్షతోటలు సాగయ్యేవి. ధనవంతుల పెరట్లో మాత్రమే ఈ తోటలు కనిపిస్తుండటంతో వీటికి ‘రిచ్మెన్ క్రాప్’గా పేరొచి్చంది. ఆ తర్వాత టోలిచౌకిలో గద్దె రామకోటేశ్వరరావు తొలిసారి ద్రాక్షపంటను సాగు చేశారు. అప్పట్లో ఎకరానికి ఆరు నుంచి ఏడు టన్నుల దిగుబడి వచి్చంది. సాధారణంగా సమ శీతోష్ణ మండలంలో పండే పంటను హైదరాబాద్ పరిసరాల్లో పండించి చరిత్ర సృష్టించారు. 1991లో హైదరాబాద్ వేదికగా గ్రేప్స్ పంటపై అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. నగరం గ్రేప్స్ రాజధానిగా గుర్తింపు పొందింది. ఇక్కడి రైతులను ఆదర్శంగా తీసుకొని మహారాష్ట్రలో కూడా సాగు ప్రారంభించారు. పంట భూముల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలుస్తుండటంతో 2005 నుంచి ద్రాక్ష పంట క్రమంగా కనుమరుగవుతూ వస్తోంది. ప్రస్తుతం ఒక్క తుక్కుగూడ వేదికగా మాత్రమే ద్రాక్ష సాగవుతోంది.ఈ ప్రాంతాల్లో డ్రాగన్ ఫ్రూట్ సాగు.. జిల్లాలోని యాచారం, కందుకూరు, అబ్దుల్లాపూర్ మెట్, శంషాబాద్, మొయినాబాద్, శంకర్పల్లి తదితర ప్రాంతాల్లో ‘డ్రాగన్ ఫ్రూట్’ సాగవుతోంది.15 ఏళ్లుగా ద్రాక్ష సాగు చేస్తున్నా పదిహేను ఏళ్లుగా ద్రాక్ష పంటను సాగు చేస్తున్నా. ఒక్కసారి మొక్క నాటితే 20 ఏళ్లపాటు దిగుమతి వస్తుంది. మొదట్లో ’థాంసన్’ వెరైటీ సాగు చేశాను. తాజాగా ’మాణిక్ చమాన్’ వెరైటీ ఎంచుకున్నా. ఎకరాకు వెయ్యి మొక్కలు నాటాను. మొక్కల ఎంపిక సహా సస్యరక్షణలో చిన్నచిన్న మెళకువలు పాటించి నాటిన రెండేళ్లకే అనూహ్యంగా దిగుబడిని సాధించాను. ప్రస్తుతం ఒక్కో చెట్టు నుంచి 25 కేజీల వరకు దిగుమతి వస్తుంది. ఎకరా పంటకు కనీసం ఆరు లక్షల ఆదాయం వస్తుంది. ఖర్చుపోను రూ.3 లక్షలు మిగులుతుంది. – కొమ్మిరెడ్డి అంజిరెడ్డి, తుక్కుగూడవిదేశాల నుంచి తిరిగొచ్చి.. మేం ముగ్గురం అన్నదమ్ములం. మాకు 47 ఎకరాల భూమి ఉంది. మాది మొదటి నుంచి వ్యవసాయ ఆధారిత కుటుంబం. నేను బీటెక్ పూర్తి చేసి, ఎంబీఏ కోసం పదేళ్ల క్రితం లండన్ వెళ్లాను. అక్కడ సరైన ఉపాధి అవకాశాలు లేక మళ్లీ వెనక్కి తిరిగొచ్చా. అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న అవకాడో సాగు చేయాలనుకున్నా. ఉన్నత చదువులు చదివి విదేశాల్లో ఉద్యోగం చేసుకోకుండా..వ్యవసాయం చేస్తున్నాడేంటి? అని అంతా నవ్వుకున్నారు.ఏదో ఒక పండ్లతోట సాగు చేయాలని భావించి మొక్కల కొనుగోలుకు జడ్చర్ల నర్సరీకి వెళ్లాను. అక్కడ అవకాడో మొక్కలు చూశా. అప్పటికే ఆ పండు గురించి తెలుసు కాబట్టి..ఆ పంటను సాగుచేశా. మొక్క నాటిన తర్వాత పైసా ఖర్చు చేయలేదు. ఆశించిన దానికంటే ఎక్కువ దిగుబడి వచి్చంది. ఆన్లైన్లో చూసి, స్వయంగా తోట వద్దకే వచ్చి పండ్లు కొనుగోలు చేశారు. – రమావత్ జైపాల్, యువరైతు -
రైతుబంధు, రైతుబీమా నిధులు పక్కదారి!
కొందుర్గు: రైతుబంధు, రైతుబీమా నిధులను దారి మళ్లించిన కారణంగా రంగారెడ్డి జిల్లాలో ఒక ఏఈవోను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. 2020 నుంచి ఇప్పటివరకు దాదాపు 20 మందికిపైగా రైతుబీమా డబ్బులు, 130 మంది రైతుబంధు డబ్బులు పక్కదారి పట్టినట్లు తెలిసింది. రైతుబీమాకు సంబంధించి క్లెయిమ్ చేసే సమయంలో నామినీ వివరాలు, తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి సదరు ఏఈవో తన ఖాతా, కుటుంబసభ్యుల ఖాతా, బంధువులు, స్నేహితుల ఖాతా నంబర్లను ఎడిట్ చేసి బీమా కంపెనీకి పంపినట్లు సమాచారం. ఒకే ఖాతాకు వరుసగా డబ్బులు జమ అవుతున్నాయని అనుమానం వచ్చిన బీమా కంపెనీవారు వ్యవసాయ శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేయగా విషయం వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. సంబంధిత అధికారుల సూచన మేరకు హైదరాబాద్ పోలీసులు ఆదివారం తెల్లవారుజామున ఏఈవోను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. రైతుబంధు డబ్బులను కూడా ఇలాగే నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి కాజేసినట్లు ప్రచారం జరుగుతోంది. రైతుబంధు, రైతుబీమా కలిపి సుమారు రూ.2 కోట్ల వరకు కాజేసినట్లు సమాచారం. హైదరాబాద్ కర్మన్‌ఘాట్‌లోని మరో ఇంట్లో కూడా విచారణ జరిపినట్లు సమాచారం. సదరు ఏఈవో కొందుర్గు, జిల్లేడ్ చౌదరిగూడ మండలాల్లో వ్యవసాయ భూములు కొనుగోలు చేసినట్లు స్థానికంగా చర్చించుకుంటున్నారు. అయితే ఈ విషయమై వ్యవసాయ శాఖ అధికారులు, పోలీసులు ఎలాంటి సమాచారాన్ని వెల్లడించడంలేదు. -
రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలంలో భారీ పేలుడు
సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలంలో భారీ పేలుడు సంభవించింది. స్కాన్ ఎనర్జీ పరిశ్రమలో భారీ శద్ధంతో పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాల అయ్యాయి. పరిశ్రమ మొత్తం దట్టమైన పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. చదవండి: చందాలేసుకుని టికెట్లు కొంటారు.. కానీ, రైలెక్కరు..! -
ఆ చాక్లెట్లు తిని మత్తులోకి జారి!
కొత్తూరు: స్కూలు సమీపంలోని పాన్ డబ్బాల్లో విక్రయిస్తున్న చాక్లెట్లు తిని విద్యార్థులు మత్తులోకి జారుకోవడం, వింత వింతగా ప్రవర్తిస్తున్న దృష్టాంతాలు రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వెలుగుచూశాయి. ఉపాధ్యాయులు తెలిపిన వివరాల ప్రకారం.. స్కూలు సమీపంలోని పాన్ డబ్బాల్లో లభించే చాక్లెట్లను తరచూ కొని తింటున్న పలువురు విద్యార్థులు తరగతి గదుల్లో మత్తులోకి జారుకుంటున్నారు. కొద్ది రోజులుగా విద్యార్థులు వింతగా ప్రవర్తించడాన్ని గమనించిన ఉపాధ్యాయులు ఆరా తీయగా చాక్లెట్ల వల్లనే అని తేలింది. వీటిని మొదట పాన్ డబ్బాల వ్యాపారులు ఉచితంగా విద్యార్థులకు అందించారని, క్రమంగా వాటికి బానిసలైన విద్యార్థులకు ఒక్కో చాక్లెట్ 20 రూపాయలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఉపాధ్యాయుల సమాచారం మేరకు ఎస్వోటీ పోలీసులు మంగళవారం సదరు పాన్ డబ్బాలపై దాడిచేయగా స్వల్ప మొత్తంలో చాక్లెట్లు లభించాయి. అయితే ఈ చాక్లెట్లలో ఏముందనేది తెలియరాలేదని చెబుతున్నారు. హెచ్ఎం అంగోర్ నాయక్‌ను వివరణ కోరగా విద్యార్థులు వింతగా ప్రవర్తిస్తున్న విషయం వాస్తవమేనని, దీనిపై స్థానిక మున్సిపల్ అధికారులు, పోలీసులకు సమాచారం అందించామని చెప్పుకొచ్చారు. -
‘ధరణి’ పోర్టల్‌లో దొంగలు పడ్డారు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్‌లో దొంగలు పడ్డారు. జిల్లా కలెక్టర్ సహా తహసీల్దార్లంతా ఎన్నికల విధుల్లో బిజీగా ఉండగా.. సదరు వెబ్‌సైట్‌ను పర్యవేక్షిస్తున్న ఇద్దరు వ్యక్తులు అడ్డదారులు తొక్కారు. అక్టోబర్ 14 నుంచి నవంబర్ 11 మధ్య రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఈ తంతులో భారీగా భూములు చేతులు మారినట్లు తెలుస్తోంది. కలెక్టర్ పరిశీలన, అనుమతి లేకుండా దరఖాస్తులకు ఆమోదం (డిజిటల్ సంతకంతో) తెలిపినట్లు సమాచారం. ఇలా నిషేధిత జాబితాలో ఉన్న 98 దరఖాస్తులను ఈ తరహాలో జాబితా నుంచి తొలగిస్తూ అక్రమాలకు పాల్పడినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఈ అంశంపై పోలీసులు కూడా విచారణ ప్రారంభించినట్లు అధికారవర్గాలు ధ్రువీకరించాయి. సాంకేతికతను అడ్డుపెట్టుకుని నడిపిన ఈ వ్యవహారంలో కీలక భూమిక పోషించిన ఇద్దరు ఉద్యోగులకు ఇంటిదొంగలు ఎవరైనా సాయపడ్డారా? ఈ భూ బాగోతంలో ఇతరుల పాత్ర ఏమైనా ఉందా? అనే కోణాల్లో అధికారులు ఆరా తీస్తున్నారు. 28 రోజుల్లో 98 దరఖాస్తులకు ఆమోదం ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలపై అప్పటి జిల్లా కలెక్టర్ హరీశ్‌పై కేంద్ర ఎన్నికల కమిషన్ అక్టోబర్ 11న వేటు వేసింది. ఆ తర్వాత ఆయన స్థానంలో కొత్తగా భారతీ హోళికేరి కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్నారు. ఆ వెంటనే జిల్లా ఎన్నికల అధికారిగా ఆమె బిజీగా మారారు. ధరణి పోర్టల్‌కు వచ్చిన దరఖాస్తులను పక్కన పెట్టి.. పూర్తిగా ఎన్నికలపైనే దృష్టిని కేంద్రీకరించారు. ఇదే అదనుగా భావించిన ధరణి సిబ్బంది భారీ అక్రమాలకు పాల్పడినట్లు తేలింది. జిల్లాలో పలు చోట్ల ఉన్న భూదాన్ భూములను పట్టా భూములుగా మారుస్తూ ఆమోదముద్ర వేసినట్లు తేలింది. నిజానికి ఏదైనా ధరణి దరఖాస్తును ఆమోదించాలన్నా.. తిరస్కరించాలన్నా.. క్షేత్రస్థాయి రిపోర్టులే కీలకం. కానీ అక్టోబర్ 14 నుంచి నవంబర్ 11 మధ్యన ఎలాంటి రిపోర్టులు లేకుండానే సుమారు వంద అర్జీలకు ఆమోదం లభించడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులకు ఫిర్యాదు.. దర్యాప్తు ముమ్మరం కోర్టు కేసులు, అసైన్డ్, భూదాన్, మ్యూటేషన్లు, పాసు పుస్తకాల్లో మార్పులు, చేర్పులకు సంబంధించిన వివాదాస్పద భూ సమస్యల అప్లికేషన్లకు పోర్టల్‌లో ఆమోదం రావడంపై కొందరు ఆరా తీయగా.. అసలు విషయం బయటపడింది. ఇంటి దొంగలే ఈ ఉదంతానికి పాల్పడినట్లు తేలింది. దీంతో ఉన్నతాధికారులు ధరణి సమన్వయకర్త నరేశ్, ఆపరేటర్ మహేశ్‌లను సస్పెండ్ చేశారు. ఈ అంశంపై లోతైన దర్యాప్తు జరపాల్సిందిగా కోరుతూ ఆదిభట్ల పోలీసులకు ఫిర్యాదు అందడంతో దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే ఇందులో కేవలం సమన్వయకర్త, ఆపరేటర్ల పాత్ర మాత్రమే ఉందా? లేక జిల్లా ఉన్నతాధికారులు, ఇతర అధికారుల పాత్ర ఏమైనా ఉందా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
గ్రేటర్ ఓటు బీఆర్ఎస్కే..
సాక్షి, హైదరాబాద్, సాక్షి, మేడ్చల్ జిల్లా, సాక్షి, రంగారెడ్డి జిల్లా: గ్రేటర్ నగరంలో అధికార బీఆర్ఎస్ సత్తా చూపింది. కోర్‌సిటీ(పాత ఎంసీహెచ్) పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ ఏడింట సిట్టింగ్లుండగా, తిరిగి వాటిని కైవసం చేసుకుంది. ముషీరాబాద్ (ముఠాగోపాల్), అంబర్‌పేట(కాలేరు వెంకటేశ్), ఖైరతాబాద్(దానం నాగేందర్), జూబ్లీహిల్స్(మాగంటి గోపీనాథ్), సనత్‌నగర్(తలసాని శ్రీనివాస్‌యాదవ్), సికింద్రాబాద్(పద్మారావు)నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలే గెలుపొందారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే సాయన్న మరణంతో ఈసారి ఆయన కుమార్తె లాస్యనందితకు టికెట్టివ్వగా ఆమె గెలుపొందారు. గ్రేటర్ పరిధిలోనే ఉన్న రంగారెడ్డి జిల్లాలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలు డి.సు«దీర్‌రెడ్డి(ఎల్బీనగర్), ప్రకాశ్‌గౌడ్(రాజేంద్రనగర్), అరికపూడి గాం«దీ(శేరిలింగంపల్లి), సబితా ఇంద్రారెడ్డి(మహేశ్వరం) తిరిగి గెలుపొందారు. మేడ్చల్ జిల్లాలో 5 స్థానాల్లో బీఆర్ఎస్ విజయం.. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో ఐదు అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. మేడ్చల్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి చామకూర మల్లారెడ్డి రెండోసారి గెలుపొందగా, కుత్బుల్లాపూర్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద మూడోసారి ఘనవిజయం సాధించి హాట్రిక్ కొట్టారు. కూకట్‌పల్లిలో మాధవరం కృష్ణారావు కూడా మూడో సారి గెలుపొంది,హాట్రిక్ సాధించారు. ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొదటిసారి పోటీ చేసిన బండారి లక్ష్మారెడ్డి గెలుపొందారు. అలాగే, మల్కాజిగిరిలో కూడా చామకూర మల్లారెడ్డి స్వయాన అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి మొదటి సారి విజయం సాధించారు. రంగారెడ్డిలో కారు హవా.. రంగారెడ్డి జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాలకు గానూ ఐదు చోట్ల బీఆర్ఎస్, మూడు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. మహేశ్వరం నుంచి పోటీచేసిన మంత్రి సబితారెడ్డి మూడోసారి వరుస విజయాలతో హ్యాట్రిక్ కొట్టారు. చేవెళ్ల నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన కాలె యాదయ్య మూడోసారి గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. ఎల్బీనగర్లో బీఆర్ఎస్ అభ్యర్థి దేవిరెడ్డి సుదీర్‌రెడ్డి, రాజేంద్రనగర్ నుంచి ప్రకాశ్‌గౌడ్, శేరిలింగంపల్లిలో అరికెపూడి గాంధీ విజయం సాధించారు. కాంగ్రెస్ తరఫున షాద్‌నగర్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా పోటీచేసిన వీర్లపల్లి శంకర్, కల్వకుర్తి నుంచి కసిరెడ్డి నారాయణరెడ్డి గెలుపొందారు. ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి 40వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించారు. వికారాబాద్‌లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్! వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ప్రభంజనం కొనసాగింది. నాలుగు నియోజకవర్గాల్లోనూ హస్తం పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. జిల్లా మొత్తం క్లీన్‌స్వీప్ చేయడంతో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో సంబరాలు మిన్నంటాయి. ఎమ్మెల్యేలకు ఎర కేసులో కీలకంగా ఉన్న పైలెట్ రోహిత్‌రెడ్డి తాండూరులో బుయ్యని మనోహర్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. వికారాబాద్ నుంచి కాంగ్రెస్ తరఫున మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్ ఈసారి గెలుపు బావుటా ఎగరేశారు. పరిగి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీచేసిన డీసీసీ అధ్యక్షుడు టి.రామ్మోహన్‌రెడ్డి తన సమీప ప్రత్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల మహేశ్‌రెడ్డిపై గెలుపొందారు. -
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కారు జోరు
సాక్షి, ఉమ్మడి రంగారెడ్డి: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కారు జోరు సాగుతోంది. నగర శివారు ప్రాంతాల్లో కూడా బీఆర్ఎస్ హవా సాగుతోంది. కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, చేవెళ్ల, మహేశ్వరం, ఉప్పల్, మల్కాజిగిరి నియోజక వర్గాల్లో బీఆర్ఎస్ విజయతీరాలకు చేరువలో ఉంది. రాజేంద్రనగర్, తాండూరు, వికారాబాద్‌లో కాంగ్రెస్ స్వల్ప ఆధిక్యంలో ఉంది. ఎల్బీనగర్లో బీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. మరోవైపు, ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగిన కొందరు నేతలు భారీ వెనుకంజలో ఉన్నారు. కేసీఆర్ కేబినెట్ కీలకంగా పనిచేసిన నేతలు ఓటమికి చేరువలో ఉండటంతో బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగిలినట్టు అయ్యింది. బాల్కొండలో ప్రశాంత్ రెడ్డి, పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్ రావు, ఖమ్మంలో పువ్వాడ అజయ్‌కుమార్, నిర్మల్‌లో ఇంద్రకరణ్ రెడ్డి, ధర్మపురిలో కొప్పుల ఈశ్వర్, కరీంనగర్లో గంగుల కమలాకర్, మహబూబ్‌నగర్‌లో శ్రీనివాస్ గౌడ్ (స్వల్ప ఆధిక్యం, 60 ఓట్లు) వెనుకంజలో ఉన్నారు. -
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో తీవ్ర ఉద్రిక్తత
-
రసవత్తరం రంగారెడ్డి
రాష్ట్ర రాజకీయాల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. ఇతర జిల్లాలతో పోలిస్తే ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎంతో చైతన్యం ఉన్న జిల్లా ఇదే. పల్లె, పట్నం కలబోత జిల్లాగా శరవేగంగా విస్తరిస్తూ ఐటీ, పారిశ్రామిక, రియల్ ఎస్టేట్ రంగాల్లో దూసుకుపోతూ ప్రపంచ దేశాలను ఆకర్షిస్తోంది. మొదట్లో టీడీపీ, కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న ఈ జిల్లా రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్కు అండగా నిలిచింది. ఈ ఎన్నికల్లోనూ తమ సత్తా చాటేందుకు అధికార బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుండగా, మళ్లీ పట్టు బిగించేందుకు కాంగ్రెస్ యత్నిస్తోంది. ప్రచారంలో జెట్ స్పీడులో కారు ఇక్కడ మొత్తం 17 నియోజకవర్గాలు ఉండగా, 2014లో టీఆర్ఎస్ ఏడు స్థానాల్లో విజయం సాధించగా, ఆరు స్థానాల్లో టీడీపీ గెలుపొందింది. ఒక స్థానంలో బీజేపీ విజయం సాధించింది. 2018 నాటికి టీడీపీ పూర్తిగా కనుమరుగైంది. 14 స్థానాలను టీఆర్ఎస్ దక్కించుకోగా, కేవలం మూడు స్థానాలే హçస్తగతమయ్యాయి. ఆ తర్వాత మహేశ్వరం నుంచి గెలుపొందిన సబితా ఇంద్రారెడ్డి, ఎల్బీనగర్ నుంచి గెలుపొందిన దేవిరెడ్డి సు«దీర్‌రెడ్డి, తాండూరు నుంచి గెలుపొందిన పైలెట్ రోహిత్‌రెడ్డి కూడా చేయిచ్చి ..కారెక్కారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని అన్ని స్థానాల్లోనూ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులే కొనసాగారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో అధిష్టానం ముందుగానే అభ్యర్థులను ఖరారు చేయడంతో పార్టీ బీ ఫాం తీసుకుని ప్రచారంలో దూసుకుపోతున్నారు. కాగా జిల్లాలోని మెజారిటీ ఎమ్మెల్యేలు, కుటుంబ సభ్యులపై భూ ఆక్రమణలు, సెటిల్మెంట్లు, అవినీతి వంటి ఆరోపణలున్నాయి. ఇక ఉప్పల్ సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చడంతో ఆయన ఆ పార్టీపై గుర్రుగా ఉన్నారు. మల్కాజిగిరి హన్మంతరావు పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఈ అంతర్గత కుమ్ములాటలకు తోడు కాంగ్రెస్, బీజేపీల నుంచి గట్టి పోటీ ఎదరవుతుండటంతో అధికార పార్టీ అభ్యర్థులకు కంటిమీద కునుకు లేకుండాపోతోంది. చేరికలతో ‘చేతి’కి జీవం తెలంగాణ ఏర్పాటు తర్వాత వరుస పరాజయాలతో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్‌కు కీలక నేతల చేరికలు మళ్లీ జీవం పోశాయి. తుక్కుగూడ వేదికగా ఇటీవల నిర్వహించిన పార్టీ విజయోత్సవ సభ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. కల్వకుర్తిలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, మల్కాజిగిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే హన్మంతరావు, తాండూరులో డీసీసీ చైర్మన్ బి.మనోహర్‌రెడ్డి, షాద్‌నగర్‌లో చౌల ప్రతాప్‌రెడ్డి సహా పలువురు జెడ్పీటీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, మహేశ్వరంలో చిగిరింత పారిజాత నరసింహారెడ్డి, ఇబ్రహీంపట్నంలో సిద్ధంకి కృష్ణారెడ్డి, శేరిలింగంపల్లిలో జగదీశ్వర్‌గౌడ్ చేరికలు ఆ పార్టీకి జీవం పోశాయి. గత ఎన్నికల్లో పార్టీ నుంచి గెలుపొంది, ఆ తర్వాత పార్టీని వీడిన మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి టార్గెట్‌గా మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డిని బరిలోకి దించింది. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిపై మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌ను రంగంలోకి దింపింది. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, స్వల్ప మెజారిటీతో ఓటమి పాలైన మల్రెడ్డి రంగారెడ్డిని ఇబ్రహీంపట్నం నుంచి బరిలోకి దింపింది. కారు దిగి హస్తం గూటికి చేరిన కసిరెడ్డిని కల్వకుర్తి నుంచి, డీసీసీబీ చైర్మన్ మనోహర్‌రెడ్డిని తాండూరు నుంచి రంగంలోకి దింపి అధికార పార్టీ అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. బీజేపీ ఫోకస్ ఉమ్మడి జిల్లాపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. 2014లో ఉప్పల్ మినహా ఇతర నియోజకవర్గాల్లో గెలువలేక పోయింది. 2018 లోనూ కారు ధాటికి తట్టుకోలేక పోయింది. అర్బన్ ఓటర్లే లక్ష్యంగా ఈ సారి పావులు కదుపుతోంది. పార్టీ జాతీయ సమావేశాలు కూడా జిల్లా వేదికగా నిర్వహించింది. ప్రధాని నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్ షా, అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు నేతలు జిల్లాలో పర్యటించి పార్టీ పటిష్టత కోసం కృషి చేశారు. శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, మహేశ్వరం, కల్వకుర్తి, ఎల్బీనగర్, ఉప్పల్, మేడ్చల్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, వికారాబాద్, తాండూరు, పరిగి, నియోజకవర్గాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. పార్టీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి సొంత గడ్డగా భావించే మహేశ్వరం నియోజకవర్గంపై పట్టు సాధించేందుకు తీవ్రంగా యత్నిస్తోంది. రాజకీయాస్తాలుగా 111జీఓ, ధరణి సమస్యలు రైతుబంధు, దళితబంధు, బీసీ బంధు, గృహలక్మి, పథకం, డబుల్ బెడ్ రూం ఇళ్లు, ఖాళీ స్థలాల పంపిణీ, జీఓ నంబర్ 58 ,59, 118(ఆక్రమిత ప్రభుత్వ స్థలాల, సీలింగ్ భూముల క్రమబద్దీకరణ), కొత్త పరిశ్రమలు, ఐటీ, ఉపాధి అవకాశాలే ప్రధాన ఎజెండాగా అధికార బీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. అయితే ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు మాత్రం జంట జలాశయాల పరిరక్షణకు తీసుకొచ్చిన 111 జీఓ ఎత్తివేత అంశంతో పాటు ధరణి సమస్యలు, ఫార్మాసిటీ, పారిశ్రామిక వాడల్లోని భూ బాధితులకు నష్టపరిహారం చెల్లింపులు, అబ్దుల్లాపూర్‌మెట్ మైన్స్ తవ్వకాలు వంటి అంశాలను రాజకీయ ఎజెండాగా ఎంచుకుంటున్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లా నుంచి ధరణి ఫోర్టల్‌కు 1.95 లక్ష లకుపైగా దరఖాస్తులు అందగా, మెజారిటీ దరఖాస్తులు వివిధ కారణాలతో పరిష్కారానికి నోచుకోకుండా పోయాయి. కాంగ్రెస్, బీజేపీలు దీనిపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి.ఇక పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఇప్పటికీ పూర్తి కాకపోవడం కూడా ప్రతిపక్షాలకు ఆయుధంగా మారింది. - శ్రీశైలం నోముల -
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో శరవేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు
-
‘రంగారెడ్డి’లో నాన్‌లోకలే ఎక్కువ
సాక్షి, హైదరాబాద్: పదోన్నతులు.. ఉద్యోగ నియామకాల్లో కొన్నేళ్లుగా రంగారెడ్డి జిల్లాకు అన్యాయం జరుగుతోందని ఆ జిల్లా ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజధాని ప్రాంతంలో భాగం కావడం వల్ల ఇతర జిల్లాల వారూ రంగారెడ్డి జిల్లాకే ప్రాధాన్యమిస్తున్నారు. ఉద్యోగరీత్యా దీర్ఘకాలం ఇక్కడే స్థిరపడడంతో వారి పిల్లలూ స్థానికులుగా గుర్తింపు పొందుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ప్పుడు ఆంధ్ర, రాయలసీయ జిల్లాలకు చెందినవారు అప్పట్లో ఉద్యోగాలు పొంది ఇప్పటికీ ఇక్కడే కొనసాగుతున్నారు. తాతల కాలం నుంచి రంగారెడ్డి జిల్లాలో పుట్టి పెరిగిన స్థానికులకు నియామకాల్లో తీవ్ర అన్యాయం జరుగుతోందని నిరుద్యోగులు వాపోతున్నారు. తెలంగాణలో హెచ్ఆర్ఏ ఎక్కువ ఇచ్చే జిల్లాల్లో రంగారెడ్డి కూడా ఉంది. ఈ కారణంగా స్థానికేతరులు కూడా సీనియారిటీ ప్రాతిపదికన ఈ జిల్లానే ఎంచుకుంటున్నారు. గత ఏడాది అమలు చేసిన 317 జీఓ తర్వాత స్థానికులకు సరైన అవకాశాలే లేకుండాపోయామని ఆ జిల్లావాసులు చెబుతున్నారు. ఉదాహరణకు స్కూల్‌అసిస్టెంట్ బయోసైన్స్‌లో రంగారెడ్డికి, మహబూబ్‌నగర్‌లోని 64 మండలాల నుంచి కేడర్‌కు మించి కేటాయించారు. ఇతర సబ్జెక్టుల్లో కూడా కేడర్‌కు మించి టీచర్ల కేటాయింపులు జరిగాయి. ఇదిలా ఉంటే స్పౌజ్ కోటాతో సమస్య మరింత జటిలమైంది. భర్త, లేదా భార్య ఈ జిల్లాలో పనిచేస్తున్నట్టు చూపించి దాదాపు 400మంది ఇదే జిల్లాకు వచ్చారు. దీర్ఘకాలం వీరు కొనసాగడం వల్ల ఖాళీలు లేకుండా పోయాయి. దీంతో టెట్, జాతీయ ఉపాధ్యాయ అర్హత పరీక్షలు పాసైన స్థానికులకు ఉద్యోగాలు పొందే అవకాశమే లేకుండా పోయింది. ఈ అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా నిరుద్యోగులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. -
రంగారెడ్డి జిల్లా టీచర్ల పదోన్నతులపై... ఈ నెల 19 వరకు స్టే
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా టీచర్ల పదోన్నతులపై ఈ నెల 19 వరకు హైకోర్టు స్టే విధించింది. ప్రాథమిక సీనియారిటీ జాబితా ఆధారంగా పదోన్నతులు ఇవ్వడాన్ని తప్పుబడుతూ.. డీఈవో, డీఎస్ఈతో పాటు పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది. తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. అధికారులు ఇతర జిల్లాలకు చెందిన టీచర్లను కూడా రంగారెడ్డి జిల్లాకు కేటాయిస్తున్నారని, ఇది రాష్ట్రపతి ఉత్తర్వులకు, నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ టి.శ్రీనివాస్‌రెడ్డి సహా పలువురు స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. జీవో 317 ద్వారా ఇతర జిల్లాల టీచర్లను రంగారెడ్డి జిల్లాకు కేటాయించారని, కేడర్‌ను మించిపోతే ఈ జిల్లాకు చెందిన తాము నష్టపోతామని వారు పేర్కొన్నారు. ఈ పిటిషన్లపై జస్టిస్ పి.మాధవీదేవి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. అధికారులు తాత్కాలిక సీనియారిటీ జాబితాను సిద్ధం చేసి బదిలీలు చేపడుతున్నారు. దీనిపై పిటిషనర్ల అభ్యంతరాలకు కూడా అవకాశం ఇవ్వలేదని చెప్పారు. రాజ్యాంగం ప్రకారం ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమన్నారు. అయితే తుది సీనియారిటీ జాబితాను జారీ చేయకుండా ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడం లేదని, పిటిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా అధికారులు పదోన్నతులు ఇవ్వడం లేదని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. లంచ్‌మోషన్‌లో పిటిషన్ వచ్చినందున వివరాలు తెలుసుకోవడానికి ఈనెల 19 వరకు సమయం కావాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. తదుపరి విచారణను 19కి వాయిదా వేస్తూ, అప్పటివరకు బదిలీలు, పదోన్నతులు నిలిపివేస్తున్నట్లు ఉత్తర్వులు జారీచేసింది. -
కాంగ్రెస్‌కు హ్యాండిచ్చారా?.. కారు దిగాలనుకున్న ఆ నేతలు రూట్ మార్చారా?
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై కాంగ్రెస్ పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయా? కారు దిగాలనుకున్న నేతలు రూట్ మార్చారా? కాంగ్రెస్‌కు హ్యాండిచ్చినట్లేనా? అధికార పార్టీ వ్యూహాలకు హస్తం పార్టీ కంగు తినిందా ? అసలు కారు దిగాలనుకున్న నేతలేవరు ? ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ను వారు ఎందుకు కాదనుకుంటున్నారు ? హైదరాబాద్ మహానగరం చుట్టూ విస్తరించిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై పట్టు బిగించాలని కాంగ్రెస్ పార్టీ చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. కారు పార్టీ ఓవర్ లోడ్ కావడంతో కొందరైనా కిందికి దిగకపోతారా అని ఎదురు చూసింది. ఇప్పటివరకు అంటువంటి సంకేతాలే వచ్చాయి. దీంతో హస్తం పార్టీని పటిష్టం చేసుకోవచ్చని నాయకులు భావించారు. జిల్లాలో అసంతృప్తితో ఉన్న గులాబీ నేతలకు పార్టీ అధినాయకత్వం కారులోనే సర్ధుబాటు చేస్తోంది. గత కొంతకాలంగా మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డిలు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి... కాంగ్రెస్ గూటికి వెళ్తారని ప్రచారం జరిగింది. ఇందుకోసం తెరవెనక మంత్రాంగం భారీగా జరిగిందని కార్యకర్తల గుసగుసలు వినిపించాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై పట్టు జారకుండా.. సీఎం కేసీఆర్ చకచకా పావులు కదిపినట్లు సమాచారం అసంతృప్తితో రగిలిపోతున్న నేతలతో మంత్రి కేటీఆర్ చర్చించారు. అసమ్మతి నేతల రాజకీయ ఉనికికి ఇబ్బంది లేకుండా కేటీఆర్ పరిష్కార మార్గాలను చూపించడంతో వారంతా చల్లబడ్డట్లు ప్రచారం సాగుతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు నుంచి పోటీ చేసి ఓడిపోయిన పట్నం మహేందర్ రెడ్డికి.. బీఆర్ఎస్ నాయకత్వం ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది. తాండూరు నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన పైలెట్ రోహిత్ రెడ్డి.. గులాబీ కండువా కప్పుకోవడం.. పట్నం మహేందర్ రెడ్డికి ఇబ్బందికరంగా మారింది. వచ్చే ఎన్నికల్లో పైలెట్ రోహిత్ రెడ్డికే బీఆర్ఎస్ టికెట్ కన్ఫర్మ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామంతో పట్నం చేసేది లేక కాంగ్రెస్ గూటికి వెళ్తారనే వార్తలు తెరపైకి వచ్చాయి. అనూహ్యంగా గులబీ పార్టీ హైకమాండ్ రంగంలోకి దిగి పట్నం మహేందర్‌రెడ్డికి ప్రత్యామ్నాయ మార్గాలను చూపెట్టడంతో చల్లబడ్డట్లు తెలుస్తోంది. తీగల కృష్ణారెడ్డి 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున మహేశ్వరం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ వెంటనే ఆయన కోడలు తీగల అనితారెడ్డికి బీఆర్ఎస్ తరపున జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ గా అవకాశమిచ్చారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన సబితా ఇంద్రారెడ్డి మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో బీఆర్ఎస్ గూటికి చేరి మంత్రి వర్గంలో ఛాన్స్ దక్కించుకున్నారు. సబిత కారెక్కడం.. తీగలకు ఇబ్బందిగా మారింది. తీగల కృష్ణారెడ్డి అనేకమార్లు మంత్రి సబితారెడ్డిపై ఆరోపణలు గుప్పించారు. చదవండి: బీఆర్ఎస్ టికెట్ల లొల్లిలో రాసలీలల ట్విస్ట్! వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని ప్రకటించారు. అసంతృప్తితో ఉన్న తీగల కాంగ్రెస్ కు వెళ్లడం ఖాయమని అందరూ అనుకున్నారు. పార్టీ హైకమాండ్ సర్ది చెప్పడం, తీగలకు ఆల్టర్ నేట్ సొల్యూషన్ చూపెట్టడంతో కారులోనే ఉండాలని ఫిక్స్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే గులాబీ పార్టీ అభ్యర్థుల చిట్టా కూడా లీకైంది. కొద్ది రోజుల్లోనే కేసీఆర్ అధికారికంగా అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారని చెబుతున్నారు. సర్దుబాట్లన్నీ పూర్తయ్యాకే జాబితా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మరి జాబితా అధికారికంగా ప్రకటిస్తే గాని కారులో ఉండేదెవరో దిగేదెవరో తేలుతుంది. ప్రస్తుతానికి గులాబీ నేతల మధ్య సర్దుబాట్లు బాగానే ఉన్నా.. ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేస్తారా ? వెన్నుపోట్లు పొడుచుకుంటారా ? అన్నది చూడాలి. -
‘చెలిమి’కి అంకురం..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యా వ్యవస్థలో శాస్త్రీయతను జోడిస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. వివిధ రూపాల్లో విద్యార్థులకు ఎదురయ్యే ఒత్తిడులను తట్టుకునేలా ‘చెలిమి’ విద్యార్థుల్లో వ్యాపార దృక్పథాన్ని పెంచడంతో పాటు, వ్యవస్థాపక ఆలోచనలను పెంపొందించేందుకు ‘అంకురం’అనే కార్యక్రమాలను ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. బుధవారం రంగారెడ్డి జిల్లాలోని శివరాంపల్లి ఉన్నత పాఠశాలలో చెలిమి, అంకురం కార్యక్రమాలను ఆమె లాంఛనంగా ప్రారంభించారు. చెలిమి కార్యక్రమం ద్వారా సమస్యలను పరిష్కరించే వినూత్న ఆలోచన శక్తిని పెంపొందించేలా కృషి చేస్తామన్నారు. పిల్లలు తమ నిజ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేలా, వేగంగా పురోగమిస్తున్న ప్రపంచానికి అనుగుణంగా తమను తాము సమాయత్తం చేసుకొనేలా తరగతి గదిలో సురక్షితమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తున్నామని మంత్రి వివరించారు. విద్యార్థుల్లోని అభిరుచులను తెలుసుకునే ప్రయత్నం చేయడంతో పాటు ఏయే రంగాల్లో రాణిస్తారనే విషయాన్ని తెలుసుకునేందుకు శాస్త్రీయ మదింపు చేసే ప్రయత్నం చేస్తున్నామన్నారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రతి జిల్లాలో ఒక్కో ఉన్నత పాఠశాలను ఎంపిక చేసి చెలిమి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. అంకురం కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టులో భాగంగా 8 జిల్లాల్లో 35 కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో 11వ తరగతి విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేస్తున్నామని చెప్పారు. మంచి భవిష్యత్‌ను అందించేలా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నామని ప్రణాళికా సంఘం వైస్‌చైర్మన్ బి.వినోద్‌కుమార్ అన్నారు. కార్యక్రమంలో శాసన సభ్యుడు ప్రకాశ్ గౌడ్, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యా సంచాలకురాలు దేవసేన తదితరులు పాల్గొన్నారు. -
మరో రూ.3,318 కోట్లు
సాక్షి, హైదరాబాద్: తైవాన్‌కు చెందిన మాన్యుఫ్యాక్చరింగ్ దిగ్గజ సంస్థ ఫాక్స్‌కాన్ గ్రూప్ రాష్ట్రంలో మరో రూ.3,318 కోట్ల (400 మిలియన్ డాలర్లు) పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు భారత్‌లో ఫాక్స్‌కాన్ ప్రతినిధి వీ లీ సామాజిక మాధ్యమ వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్‌ను ధ్రువీకరిస్తూ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ట్వీట్ చేశారు. ‘ఫాక్స్‌కాన్‌తో తెలంగాణ బంధం వేగంగా పురోగమిస్తోంది. పరస్పర ఒప్పందంలో పేర్కొన్న అంశాలను ఇరువురం వేగంగా అమలు పరుస్తున్నాం. ఈ నేపథ్యంలో గతంలో చేసిన ప్రకటనకు అనుగుణంగా రూ.4,562 కోట్ల (550 మిలియన్ డాలర్లు) పెట్టుబడి హామీని ఫాక్స్‌కాన్ నెరవేర్చింది’ అని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో 550 మిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టాలనే ప్రతిపాదననను ‘ఫాక్స్‌కాన్ ఇంటర్‌కనెక్ట్ టెక్నాలజీ’ (ఎఫ్ఐటీ) ఆమోదించినట్లు బోర్డు చైర్మన్ లూ సంగ్ చింగ్ కూడా మరో ప్రకటనలో పేర్కొన్నారు. కాగా ఎయిర్పాడ్స్తోపాటు మొబైల్ ఫోన్ల ఇతర విడిభాగాల తయారీలో ఫాక్స్‌కాన్‌కు దిగ్గజ సంస్థగా పేరుంది. ఇది మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ ఆపిల్‌కు ప్రధాన విడిభాగాల సరఫరాదారుగా ఉంది. ఫాక్స్‌కాన్ తొలి విడతలో రూ.1,244 కోట్లు (150 మిలియన్ డాలర్లు) పెట్టుబడి పెట్టిన సంగతి తెలిసిందే. కొంగరకలాన్‌లో 196 ఎకరాల్లో ఏర్పాటు ఇప్పటికే కర్ణాటకలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఫాక్స్‌కాన్ తెలంగాణలోనూ కార్యకలాపాలు ప్రారంభించే ఉద్దేశంతో గత మార్చి 2న రాష్ట్ర ప్రభుత్వంతో పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో ఫాక్స్‌కాన్‌కు 196 ఎకరాలు కేటాయించింది. గత మే 15న ఫాక్స్‌కాన్ యూనిట్‌కు శంకుస్థాపన జరగ్గా ప్రస్తుతం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ యూనిట్ నిర్మాణంలో అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. గ్రీన్ ఎనర్జీ కోసం సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు, ఎల్ఈడీ విద్యుద్దీపాలు, వాననీటిని ఒడిసి పట్టి ఇతర అవసరాలకు వాడుకోవడం, సిబ్బందికి బస వంటి అనేక ప్రత్యేకతలు ఈ క్యాంపస్‌లో ఉంటాయి. వచ్చే ఏడాది ఆరంభంలో ఇక్కడ ఉత్పత్తి ప్రారంభం కానుండగా, ఫాక్స్‌కాన్ యూనిట్ ఏర్పాటు ద్వారా స్థానికంగా 25 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. -
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ
బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని వి. శ్రీనివాస్ గౌడ్ ,విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న ,స్థానిక గౌడ కులస్తులు నేతలతో కలిసి ఆవిష్కరించారు . రంగారెడ్ది జిల్లా కందుకూరు చౌరస్తాలో స్ధానిక గీత కార్మిక పారిశ్రామిక సహకార సంఘాల అధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం జరిగిన సభలో మాట్లాడారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ గారు అన్ని కులాలను మతాలను సమానంగా ఆదరిస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి ఆశయాలను కొనసాగిస్తున్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో గీత వృత్తిని ప్రోత్సహించడానికి ప్రభుత్వ స్థలాలలో చెట్ల పెంపకానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్రంలో ఒక్కో కులానికి ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తూ గౌడ కులస్తులకు కూడా కొకపేట ప్రాంతంలో ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తున్నారన్నారు.అదేవిధంగా రైతన్నల లాగే,గౌడన్నలకు 5 లక్షల రూపాయల ప్రమాద భీమా సౌకర్యం కల్పించారన్నారు. ఎక్కడికో వెళ్లి గియకుండా,గౌడన్నలకు దగ్గరగా ఉండాలనే చెరువు కట్ట మీద ఈత చెట్లు పెట్టినట్లు,వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత సొసైటీలకే ఉందన్నారు.ఆదాయం పెంచుకోవాలని మంత్రి సూచించారు.కుల వృత్తుల వారికి అండగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు.నాడు భయం భయంగా ప్రభుత్వాల ఆంక్షల మధ్య కల్లు అమ్ముకునేవారని,నేడు నగరం నడి బొడ్డున నీరా కేఫ్ లు పెట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అండగా ఉంటున్నారన్నారు..బీసీ ల్లోని కుల చేతి వృత్తుల వారికి ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల సహాయం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర మంత్రి డాక్టర్ వి .శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ... సుమారు 350 ఏళ్ల క్రితం ఆనాటి మొగల్ పాలకుల దౌర్జన్యాలకు , నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా మరాఠయోధుడు చత్రపతి శివాజీ సమకాలికులు తెలుగు గడ్డపైన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ లు తిరుగుబాటు చేసి 33 కోటలను జయించి స్వతంత్ర రాజ్యాలను ఏర్పాటు చేసి గోల్కొండ కోటను 6 నెలల పాటు పాలించిన గొప్ప బహుజన వీరులు అని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి ఆదేశాల మేరకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి వర్ధంతి లను అధికారికంగా నిర్వహించడంతోపాటు చారిత్రక ట్యాంక్ బండ్ పై వారి విగ్రహాన్ని ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేయడానికి అనుమతి ఇచ్చారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాలకు మతాలకు వృత్తుల ప్రోత్సాహానికి అనేక చర్యలు చేపట్టిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కల్లు దుకాణాలను రద్దుచేసి గౌడ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీశారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గీత కార్మికులకు ఉపాధి అవకాశాలు వృత్తిని ప్రోత్సహించడానికి ప్రభుత్వ స్థలాలలో తాటి చెట్లను నాటుతున్నమన్నారు కల్లుకు పూర్వవైభవాన్ని తీసుకొస్తున్నామన్నారు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా నీరా ప్రాజెక్టును ప్రారంభించి ప్రజలకు ఔషధ గుణాలున్న నీరాను అందిస్తున్నామన్నారు. గీత కార్మికులు సాహసపేతమైన వృత్తిని కొనసాగిస్తూ ప్రజల ఆరోగ్యానికి కల్లు, నీరాను అందించి ఎంతో భయంకరమైన క్యాన్సర్, కిడ్నీ, గుండె సంబంధమైన రోగాల బారి నుండి ప్రజలను కాపాడుతున్నారన్నారు . తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌడ్ల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందన్నారు వీటితోపాటు వైన్ షాప్ లలో 15శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామన్నారు. -
పోలీసుల బ్రెయిన్.. అదిరిన ప్లాన్.. కాపాడిన ట్రాఫిక్ క్రేన్..
హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్తున్న అంబులెన్స్ ట్రాఫిక్‌లో మొరాయించింది. విషయం తెలుసుకున్న పోలీసులు ట్రాఫిక్ క్రేన్ సాయంతో అంబులెన్స్‌ను అక్కడి నుంచి తరలించి యువకుడి ప్రాణాలు కాపాడిన ఘటన నల్లకుంట పరిధిలో చోటుచేసుకుంది. ట్రాఫిక్ పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన విజయేంద్ర ప్రసాద్ (19) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో శుక్రవారం సాయంత్రం ఓ అంబులెన్స్‌లో సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలిస్తుండగా.. రాత్రి 9 గంటల సమయంలో హబ్సిగూడ చౌరస్తా వద్దకు అంబులెన్స్ మొరాయించింది. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న నల్లకుంట ట్రాఫిక్ సీఐ రామకృష్ణ అక్కడే విధుల్లో ఉన్న ఎస్సై నిరంజన్, ఏఎస్ఐ వెంకటేశ్వర రావును అప్రమత్తం చేశారు. ట్రాఫిక్ సిబ్బంది అంబులెన్స్‌ను తోసుకుంటూ సిగ్నల్స్ వద్ద నుంచి ముందుకు తీసుకు వచ్చారు. ఆ తర్వాత అంబులెన్స్‌లో చూడగా 19 ఏళ్ల యువకుడు ప్రాణాపాయ స్థితిలో వెంటిలేటర్‌పై ఉన్నాడు. చలించిపోయిన ట్రాఫిక్ పోలీసులు ఎలాగైనా యువకుడిని ఆస్పత్రికి తరలించాలనే తపనతో వెంటనే ట్రాఫిక్ క్రేన్‌కు అంబులెన్స్ కట్టి అక్కడి నుంచి తీసుకు వెళ్లారు. అది సికింద్రాబాద్ సంగీత్ చౌరస్తా వరకు చేరుకోగానే మరో అంబులెన్స్ అక్కడికి వచ్చింది. గాయపడిన యువకుడిని అందులోకి మార్చి ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు. ఈ వీడియా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ట్రాఫిక్ పోలీసులు స్పందించిన తీరుకు నెటిజనులు అభినందనలు వ్యక్తం చేస్తున్నారు. -
575 కోట్ల పెట్టుబడి 1,600 మందికి ఉపాధి
షాబాద్: రంగారెడ్డి జిల్లా చందనవెళ్లిలో రూ.575 కోట్ల పెట్టుబడితో జపాన్‌కు చెందిన డైఫుకు ఇంట్రాలాజిస్టిక్స్ యూనిట్‌కు, నికోమాక్ తైకిషా క్లీన్ రూమ్స్ కంపెనీ ఏర్పాటుకు శుక్రవారం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు కంపెనీల ద్వారా ప్రత్యక్షంగా 1,600 మందికి, పరోక్షంగా మరికొంత మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని చెప్పారు వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన నిరుద్యో గ యువతకు కంపెనీల్లో ప్రాధాన్యత లభిస్తుందని తెలిపారు. ఇప్పటికే కంపెనీల యాజమాన్యం స్థానికంగా ఉన్న ఐటీఐని దత్తత తీసుకోవడం జరిగిందని, వారి అవసరాలకు తగ్గట్లు విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. రంగారెడ్డి జిల్లాలోపెట్టుబడులు అభినందనీయం ‘తయారీ రంగంలో జపాన్ ప్రపంచానికే ఆదర్శం. ఆ దేశానికి వెళ్లిన ప్రతిసారీ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటాను. నిజానికి అక్కడ సహజ వనరులు తక్కువ. అణుబాంబు దాడిని ఎదుర్కొని కూడా తిరిగి లేచి నిలబడింది. ఉన్న కొద్దిపాటి వనరులను ఉపయోగించుకుని ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వస్తు ఉత్పత్తి, నాణ్యత అంశంలో అందరికంటే ముందుంది. పారిశ్రామిక ఉత్పత్తిలో తమ సత్తా చాటుకుంటోంది. ప్రస్తుతం భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదో ఒక జపాన్ వస్తువు ఉంటుంది. అలాంటి దేశానికి చెందిన రెండు ప్రముఖ కంపెనీలు రంగారెడ్డి జిల్లాలో పెట్టుబడులు పెట్టడం అభినందనీయం..’ అని కేటీఆర్ చెప్పారు. మరిన్ని పెట్టుబడులకు సహకరించండి ‘స్థానిక నాయకులు, ప్రజల చొరవతో ఇక్కడికి పెద్ద ఎత్తున కంపెనీలు వస్తున్నాయి. టెక్స్టైల్స్ మొదలుకొని ఎలక్ట్రిక్ వాహనాల దాకా విభిన్నమైన కంపెనీలు ఈ ప్రాంతాన్ని తమ కేంద్రంగా ఎంచుకుంటున్నాయి. రాష్ట్రంలోనే అత్యంత కీలకమైన పారిశ్రామిక వాడగా చందనవెళ్లి ఎదుగుతుంది..’ అని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. జపాన్ నుంచి మరిన్ని పెట్టుబడులు వచ్చేలా సహకరించాల్సిందిగా జపాన్ కాన్సులేట్‌ను కోరుతున్నానని కేటీఆర్ చెప్పారు. జపాన్ కంపెనీల కోసం అవసరమైతే ఒక క్లస్టర్‌ను ఏర్పాటు చేసేందుకు కూడా తాము సిద్ధమని అన్నారు. చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నవ వధువు ఆత్మహత్య.. పెళ్లయిన కొన్ని రోజులకే..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: మైలార్ దేవ్పల్లిలో నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. భర్త, అత్త వేధింపులు తాళలేక ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గత ఏడు నెలల క్రితం కాటేదాన్ నేతాజీ నగర్‌కు చెందిన చంద్రశేఖర్‌తో కవితకు వివాహం జరిగింది. పెళ్లయిన కొన్ని రోజులకే భర్త తన అసలు రూపం బయట పెట్టాడు. అదనపు కట్నం తేవాలని మానసికంగా, శారీరకంగా చిత్ర హింసలకు గురిచేశాడు. భర్తకు తోడు అత్తా, మామలతో పాటు ఆడపడుచు సూటి పోటి మాటలు భరించలేక కవిత తనువు చాలించింది. మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: అశ్లీల చిత్రాలకు బానిసై నా భర్త.. -
చిన్నారుల ముఖాల్లో చిరునవ్వు కోసం రోటరీ క్లబ్.. మోటార్ ఫెస్ట్..
మంచి పని కోసం క్రీడలను నిర్వహించడం.. ఇదీ రోటరీ క్లబ్ ఆఫ్ లేక్ డిస్ట్రిక్ట్ మొయినాబాద్ తలపెట్టిన కార్యక్రమం. హృదయ సంబంధ వ్యాధులతో బాధపడుతున్న చిన్నారుల ముఖాల్లో చిరునవ్వులు పూయించే దిశగా ఫండ్ రైజింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రోటరీ క్లబ్ ఆఫ్ లేక్ డిస్ట్రిక్ట్ మొయినాబాద్ తొలిసారిగా ఇండియన్ నేషనల్ ఆటోక్రాస్ ఛాంపియన్షిప్ 2023 ను నిర్వహించింది. దీని ద్వారా పుట్టుకతో వచ్చే గుండె జబ్బులతో బాధపడుతున్న పిల్లలకు సిద్దిపేట పట్టణంలోని శ్రీ సత్యసాయి ఆసుపత్రిలో గుండె శస్త్రచికిత్సల కోసం ఆపరేషన్ థియేటర్ కోసం ఫండ్ రైజింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నగరంలోని బౌల్డర్ హిల్స్ గోల్ఫ్ కోర్స్‌లోని కస్టమ్-బిల్ట్ రేస్ ట్రాక్‌లో ఈ మోటార్ ఫెస్ట్ నిర్వహించింది. ఈ రేసులో ఎంతో మంది టాప్ రేసర్లు పాల్గొని వారి నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఈ ఈవెంట్ ద్వారా వచ్చిన నిధులను రోటరీ క్లబ్ ఆఫ్ లేక్ డిస్ట్రిక్ట్ మొయినాబాద్ గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే చిన్నారుల ఆపరేషన్ నిమిత్తం థియేటర్ నిర్మాణానికి ఉపయోగించనుంది. సిద్ధిపేట పట్టణంలోని శ్రీ సత్య సాయి ఆస్పత్రిలో ఈనిర్మాణం చేపడతారు. దీనికి దాదాపు 7.5 కోట్ల భారీ మొత్తం ఖర్చవుతుందని అంచనా. గుండె వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల జీవితాల్లో వెలుగు నింపే క్రమంలో నిర్వహిస్తున్న ఈ కార్ రేసింగ్ ఈవెంట్ విజయవంతం చేసింది రోటరీ క్లబ్. -
కాసుల యావ.. కోతల హవా: ఎడాపెడా ‘ప్రైవేటు’ సిజేరియన్లు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: వైద్యుల కాసుల కక్కుర్తి తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. సాధారణ ప్రసవానికి అవకాశం ఉన్నా అధిక ఫీజుపై ఆశతో ఎడాపెడా ‘కోత’లు పెడుతున్నారు. దీనికితోడు మంచి ముహూర్తంలో బిడ్డకు జన్మనివ్వాలనే కొందరు భార్యాభర్తల ఆలోచన.. తమ బిడ్డ పురిటి నొప్పులు భరించ లేదనే కొందరు తల్లిదండ్రుల ఆందోళన.. సిజేరియన్లు పెరిగిపోయేందుకు దోహదపడుతోంది. సాధారణ ప్రసవాల్లో తక్కువ రక్తస్రావంతో పాటు ఆస్పత్రిలో ఉండాల్సిన అవసరం పెద్దగా ఉండదు. కేవలం వారం రోజుల్లోనే సాధారణ స్థితికి చేరుకుంటారు. అదే సిజేరియన్లతో అధిక రక్తస్రావం సమస్యతో పాటు వారం నుంచి పది రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండాల్సి వస్తుంది. ఇలాంటి వాటిపై అవగాహన కల్పించి సిజేరియన్లు నివారించేందుకు ప్రయత్నించాల్సిన వైద్యులు, ఆ పని చేయకుండా వారి బలహీనతలను క్యాష్ చేసుకుంటున్నారు. వీధి చివర్లో ఉన్న నర్సింగ్ హోమ్‌లో సాధారణ ప్రసవానికి రూ.35 వేల నుంచి 40 వేలలోపే ఖర్చు అవుతుంది. అదే సిజేరియన్ అయితే రూ.80 వేల నుంచి రూ.లక్షకు పైగా ఖర్చు అవుతోంది. ఇక కార్పొరేట్ ఆస్పత్రి అయితే ఆ స్థాయిలోనే సాధారణ, సిజేరియన్ డెలివరీ ఫీజులు ఉంటున్నాయి. ఎప్పటికప్పుడు ప్రసూతి కేంద్రాలను తనిఖీ చేసి...కడుపు కోతలకు పాల్పడుతున్న వైద్యులపై చర్యలు తీసుకోవాల్సిన వైద్య,ఆరోగ్యశాఖ అధికారులు ఆ వైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో చిన్నాచితకా నర్సింగ్‌హోమ్‌లు మొదలు కార్పొరేట్ ఆస్పత్రుల దాకా ఇష్టారాజ్యంగా మారిపోయిందనే ఆరోపణలున్నాయి. హైదరాబాద్ శివారు రంగారెడ్డి జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో సిజేరియన్లు ఎక్కువ జరుగుతున్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ సిజేరియన్లు ఒకింత ఎక్కువగానే ఉండటం గమనార్హం. గణాంకాలే నిదర్శనం జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిల్లో 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్–నవంబర్ మధ్య మొత్తం (ఇళ్లలో, అంబులెన్సుల్లో జరిగినవి మినహాయించి) 16,321 ప్రసవాలు జరగ్గా ఇందులో సిజేరియన్లు 6,287 ఉన్నాయి. అదే ప్రైవేటు ఆస్పత్రుల విషయానికొస్తే.. మొత్తం 10,990 ప్రసవాలు జరిగితే అందులో 8 వేలకు పైగా సిజేరియన్లే కావడం గమనార్హం. అంతకుముందు 2021–22లో 19,183 ప్రసవాలు జరిగితే అందులో సిజేరియన్లు 13,895 ఉండటం ప్రైవేటు ఆస్పత్రుల తీరుకు అద్దంపడుతోంది. తల్లుల ఆరోగ్యంతో ఆటలాడుతున్న ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులపై చర్యలు తీసుకోనున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు పలుమార్లు హెచ్చరికలు జారీ చేశారు. సిజేరియన్లు ఎక్కువగా చేస్తున్న ఆస్పత్రులను సీజ్ చేయడంతో పాటు వైద్యుల ధ్రువీకరణ పత్రాలను కూడా రద్దు చేస్తామని ప్రకటించారు. అయినా క్షేత్రస్థాయిలో సిజేరియన్ల సంఖ్య తగ్గక పోగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రత్యేక పరిస్థితుల్లోనే సిజేరియన్ చేయాలి కడుపులో బిడ్డ అడ్డం తిరిగినప్పుడు, తల్లి ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు, ఉమ్మనీరు తాగి బిడ్డ ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే సిజేరియన్ చేయాలి. కానీ చాలామంది వైద్యులు ఇవేవీ పట్టించుకోవడం లేదు. కొందరు తల్లిదండ్రులు కూడా వివిధ కారణాలతో సిజేరియన్ కోరుకుంటున్నారు. ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. సహజ ప్రసవాల ద్వారా జన్మించిన శిశువుకు వెంటనే ముర్రుపాలు అందుతాయి. అదే సిజేరియన్ ద్వారా జన్మించిన బిడ్డ మూడు నాలుగు రోజుల పాటు పోతపాల పైనే ఆధారపడాల్సి వస్తుంది. తద్వారా రోగనిరోధకశక్తిని కోల్పోతుంది. కొన్నిసార్లు వారాల తరబడి ఇంక్యుబేటర్, ఫొటోథెరపీ యూనిట్లలో ఉంచాల్సి వస్తుంది. – డాక్టర్ బాలాంబ, సీనియర్ గైనకాలజిస్టు