
మాట్లాడుతున్న న్యాయ నిపుణుడు భూమి సునీల్
తుక్కుగూడ: రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ధరణి యాప్‌తో రైతులకు భూ సమస్యలు ఎదురవుతున్నాయని భూ చట్టాల నిపుణుడు, నల్సార్ విశ్వవిద్యాలయ అనుబంధ ఆచార్యులు ‘భూమి’ సునీల్ అన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో ఏర్పాటు చేసిన భూ న్యాయ శిబిరంలో ఆయన మాట్లాడారు. భూ సమస్యలు ఎదుర్కొంటున్న రైతులకు న్యాయవాదులు, రెవెన్యూ నిపుణులు న్యాయ సలహాలు అందించారు.
భూ సమస్యలతో రైతులు ఆందోళన చెందుతున్నారని, వారికి అండగా ఉండాలన్న ఉద్దేశంతో అవగాహన శిబిరాలు నిర్వహిస్తున్నామని సునీల్ పేర్కొన్నారు. తెలంగాణలో రీసర్వే చేస్తేనే భూసమస్యలు పరిష్కారమవుతాయని, దీనికోసం ప్రభుత్వం గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని సూచించారు. సమగ్ర సర్వే చేస్తేనే భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని తెలంగాణ సోషల్ మీడియా ఫోరం అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి చెప్పారు.
రైతులకు ఉచిత న్యాయ సలహాలు అందించడం కోసమే ఈ శిబిరాలు నిర్వహిస్తున్నామని లీగల్ ఎంపవర్‌మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్స్ సొసైటీ (లీఫ్స్) ఉపాధ్యక్షుడు జీవన్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది పి.నిరూప్ రెడ్డి, తెలంగాణ తహసీల్దార్ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, రైతు నాయకులు కోదండరెడ్డి, భూదా న్ రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment