నందిగామ: రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం మామిడిపల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం కరోనా కలకలం రేపింది. విద్యార్థులకు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా నలుగురికి పాజిటివ్ వచ్చింది. దీంతో గ్రామస్తులు, తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. పాఠశాలలో 6నుంచి 10 తరగతులకు చెందిన 128 మంది విద్యార్థులు ఉండగా సోమవారం 29 మందికి కరోనా పరీక్షలు చేశారు.
ఇందులో నలుగురు వైరస్ బారిన పడినట్లు తేలిందని నందిగామ పీహెచ్‌సీ డాక్టర్ పాల్గుణ తెలిపారు. దీంతో వీరి స్వగ్రామాలైన మోత్కులగూడ, మొదళ్లగూడ, వీర్లపల్లి, మామిడిపల్లిలో ఆందోళన నెలకొంది. మిగతా వారికి మంగళవారం టెస్టులు చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment